View-refresh.svg
Transclusion_Status_Detection_Tool

సూచిక:Chali Jvaramu.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Chali Jvaramu.pdf

విషయసూచిక

జ్వరభేదములు

జ్వరము సామాన్యవ్యాధి - జ్వరము ప్లేగుకంటె 15 రెట్లు ప్రజలను జంపును - జ్వరము వలన కలుగు ధననష్టము - శరీరారోగ్య నష్టము - ప్రజల మూఢవిశ్వాసము - కలరా అమ్మవారు - కాలికురుపు మంత్రము - చలికుదుపు దయ్యము - వైద్యుల లోపము - సర్కారువారి ఉపదేశము ప్రజలకు హితవుగానుండదు - వైద్యులదే భారము - జననమరణముల లెక్కలు తప్పులు - జ్వరభేదములు - జ్వరపు పుల్ల - జ్వరపు పుల్లను ఉపయోగించు విధము - సామాన్యరేఖ - జ్వర పరిమాణమును కొలుచుట - సామాన్య విపరీత జ్వరములు - దినదినజ్వరము - దినము విడిచి దినము వచ్చు జ్వరము - క్వయినా యొక్క గుణము - మూడు దినముల కొకసారి వచ్చు జ్వరము - ఎల్లప్పుడు విడువకుండు జ్వరము.


చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర

నామాంతరములు - మన్యపు జ్వరము - వరుసజ్వరము - మలేరియా జ్వరము - దోమ జ్వరము - శీతకట్టు జ్వరము - చలిజ్వరము యొక్క ముఖ్య చిహ్నములు - చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర - విషమ జ్వర భేదములు - సంతతజ్వరము - సతతకజ్వరము - అన్యేద్యుష్క జ్వరము - తృతీయక జ్వరము - చతుర్థక జ్వరము - రసగత జ్వరము - రక్తగత జ్వరము - మాంసగత జ్వరము - మేదోగత జ్వరము - అస్థిగత జ్వరము - మజ్జగత జ్వరము - శుక్రగత జ్వరము - అసాధ్యజ్వరము - విషమ జ్వరములలో చలిజ్వరములు జేరియున్నవి - ఐరోపా ఖండమునందలి చలిజ్వరము - పూర్వులు చలిజ్వరములకు చెడుగాలి కారణమనిరి - క్వయినా పట్టును ' చిం ను ' అను ఆమె కనిపెట్టెను - రక్తములో మలేరియా పురుగులు ' లేవ రన్ ' కనిపట్టెను - దోమలకు మలేరియాకు సంబంధమున్నదని ' మేన్ సన్ ' కనిపట్టెను - దోమకడుపులో మలేరియా పురుగులు పెరుగుట ' రాస్ ' కనిపట్టెను - పక్షులలోని చలిజ్వరమువంటి జ్వరము - దోమ మూలముననే చలిజ్వరపు పురుగు వ్యాపించుచున్నది. 19 - 38

మలేరియా పురుగు

మలేరియా పురుగు మూలపదార్థపు సముదాయము - మలేరియా పురుగు, ఇది మన నెత్తురులో బ్రతుకును - మన నెత్తురులోని కణములు - నెత్తురులోని తెల్లకణములు - నెత్తురులోని ఎర్రకణములు - నెత్తురులోని మలేరియా పురుగులు - ద్విఖండ సంతానవృద్ధి విధానము - ఒక దినము కనేకలక్షలు పిల్లలు పుట్టును - సంయోగ సంహిత సంతానవృద్ధి - మలేరియా పురుగు - ఆడు మలేరియా పురుగు - ఒక్క దోమకాటునకు వందలకొలది మలేరియా పురుగులు నెత్తురులో కలియును - మానవులును దోమలే మలేరియా పురుగుకు పోషకులు - మలేరియా పురుగుల జాతి భేదములు. 39 - 46


దోమ

వివిధజాతుల దోమలు - అనాఫలీసు క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించు విధము - ఆడు అనాఫలీసు దోమను గుర్తించు విధము - దోమయొక్క రూపభేదములు నాలుగు 1. గ్రుడ్డు. 2. నీటిపురుగు. 3. కామాపురుగు. 4. రెక్కలుగల పురుగు - దోమలగ్రుడ్లు - దోమలు నీటిపురుగులు - దోమగూడు - రెక్కలుగల దోమలు - దోమపిల్లలను పరీక్షించు విధము - దోమపిల్లలను పట్టుసాధనము - అనాఫలీసు దోమల యుపజాతులు, వాని నివాసస్థానములు - అనాఫలీసు దోమల నడవడికల సంగ్రహము - క్యూలెక్సు దోమపిల్లల నివాసస్థానములు - స్టిగోమియా దోమపిల్లల నివాసస్థానములు - దోమలయొక్క నైసర్గిక విరోధులు - దోమలను నశింపుజేయు ఇతర సాధనములు. 47-6-

చలిజ్వర భేదములు

చలిజ్వరభేదములు నాలుగు - ద్వితీయక జ్వరములు - సామాన్య తృతీయక జ్వరములు - విష తృతీయక జ్వరములు - చతుర్థక జ్వరములు - మలేరియా పురుగుల జాతులు నాలుగు - ఒక దినముననే రెండుసార్లు జ్వరము వచ్చుట - తృతీయక జ్వరపు పురుగుల వలన దినదినము జ్వరము వచ్చుట - రెండు మూడు జాతుల జ్వరము ఏకకాలములో వచ్చుట - సామాన్య జ్వరపు పురుగుల యొక్కయు విషజ్వరపు పురుగుల యొక్కయు ఆకార భేదములు. 63-68


చలిజ్వర లక్షణములు

చలిజ్వర లక్షణము లనేకము లన్నిజాతుల జ్వరములకు సామాన్యములు - జ్వరమునకు సూచకములు - నిజమైన జ్వరలక్షణములు - శీతలదశ - ఉష్ణదశ - స్వేదదశ - విరామ కాలము - విషజ్వర లక్షణములు - చలి ప్రారంభించునప్పుడు మలేరియా పురుగు పిల్లలు ఉత్పత్తి యగుచుండును - జ్వరము తీవ్రముగా నున్నప్పు డివి క్రొత్తయెర్రకణములలో ప్రవేశించును - విరామకాలములలో నివి యెర్రకణములను తినుచుండును. 69-77

చలిజ్వర నిదానము

కొన్ని వైద్యశాలలో చేయబడు వైద్యము - అనేక విధములగు జ్వరములు - జ్వరపుగడ్డ పెరిగి ఉన్నదా ? లేదా ? - లేనియెడల చలిజ్వరము గుర్తించుటెట్లు ? - నెత్తురును పరీక్షింపవలెను - సందేహముగా నున్నప్పుడు చేయవలసిన చికిత్స - సన్నిపాత జ్వరము క్షయజ్వరము మొదలగునవి. 78-85

చికిత్స

మొదట విరేచనములకు మందు ఇయ్యవలెను - చలిజ్వరములకు క్వయినా సిద్ధౌషధము - క్వయినాను ఎప్పుడు ఎట్లు ఇయ్యవలెను - ఒకప్పుడు రెండు మూడు సంవత్సరముల వరకు క్వయినా ఇయ్యవలెను - పది సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 మొదలు 10 సంవత్సరముల పిల్లలకు మోతాదు - 5 సంవత్సరముల లోపలి పిల్లలకు మోతాదు - జ్వరము తగ్గిన తరువాత చేయవలసిన చికిత్స - క్వయినా యందు మనప్రజలకు గల ద్వేషమునకు కారణములు - కొందరు స్వదేశవైద్యులు చేయు పద్ధతి - ఏ మందు త్వరలో వ్యాధిని కుదుర్చునో అదియే మంచి మందు - ప్రజలు క్వయినా యందలి ద్వేషమును విడువవలెను - మాత్రలు, ద్రావకము, పొడుము; వీనిలో నేది మంచిది - విషజాతుల చలిజ్వరములలో క్వయినాను నెత్తురులోనికి పిచ్చికారి చేయుట యుక్తము - చలిజ్వరముతో కూడ ఇతర వ్యాధు లున్నయెడల వానికి ప్రత్యేకముగ చికిత్స చేయవలెను. 86-98

చలిజ్వరమును నివారించు పద్ధతులు

క్వయినాయొక్క సాయముతో చలిజ్వరమును నివారించు పద్ధతులు - చలిజ్వరపు రోగులనందరను లెక్కించి వారల కందరకు క్వయినా యియ్యవలెను. తాముమాత్రము వారమున కొకసారి క్వయినా పుచ్చుకొనవలెను - క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరము నివారించు పద్ధతులు - అనాఫలీసు దోమలను నశింపు చేయవలెను - మనయిండ్లలో నుండు దోమల నివాసస్థానములు - ప్రతిమానవుని దోమకాటునుండి కాపాడవలెను - దోమలు ప్రవేశింపరాని ఇండ్లు ; దోమతెరలు - ఇతరులను చలిజ్వరపు రోగులను విడదీసి ప్రత్యేకముగ నివసింపచేయవలెను - గ్రామమున కర మైలుకంటె దూరమున నుండు నిండ్లలో నివసింపవలెను. - ఉపసంహారము - దొరతనమువారును ప్రజలును ఒండొరుల సాయము నపేక్షించుచు దేశక్షేమమునకు తోడ్పడవలెను. 99-112

పవిశిష్టము : - 113-116