పుట:Chali Jvaramu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


82

చ లి జ్వ ర ము

ఒక్కొక్క అవయమును వరుసగ పరీక్ష చేసిన యెడల పైని చెప్పబడిన వ్యాధులలో నెద్దియైనను ఉన్నదో లేదో సాధారణముగా తెలియవచ్చును.

జ్వరపుగెడ్డపెరిగిఉన్నదా? లేదా?

   రోగికి ఇతరవ్యాధులు ఏమియు లేక ఒక్క జ్వరమే యున్నయెడల వానికడుపులో జ్వరపుగడ్డ పెరిగియున్నదో లేదో చూడవలెను. జ్వరపుగడ్డ స్పష్టముగా తెలియుచున్న యెడల సామాన్యముగా రోగియొక్క జ్వరము చలిజ్వరమే అయి యుండును. చెన్నపట్టణములో ప్రస్తుతము వ్యాపించియున్న కాలజ్వరమను వ్యాధియుందును ఇంక మరికొన్ని వ్యాధుల యందును కూడ జ్వరపుగడ్డ పెరుగును. అయిన ఆవ్యధులు సామాన్యముగా నన్నిచొట్ల నుండవు.

లేనియెడల చలిజ్వరము గుర్తించుటెట్లు.

   ఒకవేళ రోగి చలిజ్వరము వచ్చిన మొదటి వారములోనే వైద్యమునకు వచ్చినయెడల వానికి సామాన్యముగా జ్వరపుగడ్డ పెరిగియుండదు. అట్టి చో జ్వరపుగడ్డ పెరిగియుండని వ్యాధులలో నీచలిజ్వరము గుర్తింప వలెను. రోగి తన జ్వరము తప్పక చలితొగూడి వచ్చుననియు రెండుదినముల కొకసారిగాని మూడుదినములకొకసారిగాని నియమిత కాలమునకువచ్చి కొంతకాలముంది చలిజ్వర లక్షణముల నన్నిటిని చూపిన దనియు చెప్పినప్పుడును, రోగి ఆలక్షణములను తెలివిగ గ్రహించి