పుట:Chali Jvaramu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


చేసిన మిక్కిలి మెలగును. సరియైన వైద్య పద్ధతి. రోగిజ్వరముతో వైద్య పద్దతి.

అనేకవిధము - లగు జ్వరములు

రోగిజ్వరముతో వైద్యమునకు రాగానే జ్వరముకలిగించు వ్యాధులనన్నిటిని వైద్యుడు జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అట్టిజ్వరములలో ననేక జాతులు గలవు. కొన్ని జ్వరములు ఊపిరితిత్తులలోని వ్యాధి చేగలిగిన కఫజ్వరములు, కొన్ని జ్వరములు మూత్ర సంబంధమైన అవయవములలో సుఖవాధిచేగాని, మరి యితర వ్యాధులచే గాని పుట్టిన తాపముచే గలుగు జ్వరములు. కొన్ని జీర్ణకోశములలోని మాంద్యము చేతగాని, ఏలుగుపాము, నులిపురుగు మొదలగు జంతువుల మూలమునగాని మలబద్ధకము వలన గాని గలుగు జ్వరములు; కొన్ని జలుబుచేతగాని, యెండ ఉడుకుచేతఘాని గలుగు జ్వరములు; కొన్ని మశూచికము, ఆటలమ్మ పొంగు మొదలగు వానిచే గలుగు జ్వరములు; కొన్ని సన్నిపాత జ్వరములు; మరికొన్ని సూతికా జ్వరములు. లేక గాయములు మొదలగు వానియందలి చీమువలన పుట్టిన వ్రణజ్వరములు. ఇట్లు లెక్కకు రాని అనేక జ్వరంకులు గలవు. ఇంకను మనకు కారణము సరిగా తెలియని కాల జ్వరము మొదలగు జ్వరము లెన్నియో గలవు. ఈజ్వరముల ననిటిని మనస్సు నం దుంచుకొనక రోగి "చలిజ్వరము" అనిచెప్పినతోడనే క్వయినా పంచిపెట్టుట తగదు. రోగి తనవద్దకు వచ్చినతోడనే