పుట:Chali Jvaramu.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


     జ్వరముతో వైద్యమునకు వచ్చురోగికి వైద్యము చేయుటయందు రెండు పద్దతులు గలవు. ఒకటి సరియైనపద్దతి. రెందఫదితప్పుపద్దతి. ఈ దేశమునందలి వైద్యులనేకులు సాధారణముగానీతప్పుపద్ధతినే అవలంబింతురు. రోగివైద్య్హమునకురాగానే వైధ్యుడ్ రోగిని "నీకు ఏమి జ్వరము" అని అడుగును. రోగివెంటనే  "చలిజ్వరము" అనిచెప్పును. వైధ్యుడు తనపని తొందరలో తన అలవాటుప్రకారము రోగి చెప్పిన రోగ నిదానమును బట్టి చలిజ్వరమునకు క్వయినా మందనిచెప్పి 3 లేక 6 మోతాదుల మందిచ్చి పంపును. అదృష్ట వశమున రోగియొక్క రోగము నిజముగా చలిజ్వరమైన పక్షమున వానికి కుదురును. లేదా రోగి యూమందును పుచ్చుకొని కుదురక  వైద్యునివిసగించు నట్లు బాధించిన తరువాతనో, లేక రోగికి వ్యాధి యధికమై ప్రాణాపాయకరముగ ముదిరినతరువాతనో, వైద్యడు మేలుకొని రోగిని సరిగా పరీక్షించును.. ఒక్కొకవ్వాధి అప్పటికి అసాద్ద్యస్థితికి వచ్చియుండవచ్చును.
   కావున బుద్ధిమంతుడగు వైధుడు జ్వరపురోగి వచ్చిన తోడనే యేదోయొక మంచిచ్చివేయక ఆజ్వర మేజాతిలోనిదో సరిగా తెలిసికొని వైద్యము