వికీసోర్స్:రచ్చబండ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
రచ్చబండ
వికీసోర్స్‌కు మీ అవసరం ఉంది. రండి చేతులు కలపండి. అందరికీ అందుబాటులో ఉండే ఒక తెలుగు మహా గ్రంథాలయము తయారీలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు ఇక్కడ కొత్త గ్రంథాలు చేర్చవచ్చు, లేదా వివిధ గ్రంథాలను చేర్చుటకు జరుగుతున్న కృషిలో పాల్గొనవచ్చు. ఈ విషయమైనా ఏదైనా సహాయము కూడా తీసుకొనవచ్చును. మరిన్ని వివరములకు మీరు తెలుగు వికీ సభ్యుల సమూహముని చూడండి మరియు అదే జట్టులో చేరండి.విషయ సూచిక

సూచిక పేజీ నిర్వహణ[మార్చు]

సూచిక పేజీ రూపంలో సమస్యని సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని రోజులు సూచికపేజీలో లోపాలు వుండవచ్చు. సహకారం కోరడమైనది.--అర్జున (చర్చ) 06:21, 27 ఫిబ్రవరి 2018 (UTC)

అర్జునరావు గారు, ధన్యవాదాలు. ఇలాంటి సమస్యలను మీరు మాత్రమే సరిచేయగలరు.--Rajasekhar1961 (చర్చ) 06:29, 27 ఫిబ్రవరి 2018 (UTC)
Rajasekhar1961 గారికి మరియు సహసభ్యులకు, సూచిక పేజీ రూపం సమస్య పరిష్కరించాను వికీసోర్స్ నిరంతరాయంగా కొనసాగటానికి, తోటి సాంకేతిక నైపుణ్య సభ్యులు కూడా ఇటువంటి సమస్యలను పరిష్కరించటానికి ముందుకు రావాలని కోరిక. ఇటీవలి సమస్య మీడియా వికీ ఉపకరణ తాజా కరణలవలన వచ్చింది. కొంత విశ్లేషించినతరువాత, ఆంగ్ల వికీలో en::Mediawiki:Proofreadpage index template రూపుదిద్దే కోడ్ ని తెలుగు వికీలో {{Proofreadpage index}} లో స్వల్ప మార్పులతో ప్రవేశపెట్టాను. దీనిని పరిశీలించడానికి ఒక మాదిరి పుస్తకం సూచిక పేజీ వాడాను. దీని అంతర్వర్తి (UI)కి సంబందించిన కొన్ని పదాలు అనువాదం చేయకపోవడంతో ఆంగ్లంలో కనబడుతున్నాయి. వాటిని ట్రాన్స్లేటే వికీలో అనువాదం చేశాను.కొద్ది రోజులలో తెలుగు పదాలు కనబడతాయి. ఇంకేదైనా సమస్యలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 06:57, 1 మార్చి 2018 (UTC)
అర్జునరావు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు బాగున్నది. --Rajasekhar1961 (చర్చ) 11:38, 1 మార్చి 2018 (UTC)

సూచిక విషయసూచిక పేజీ రూపంలో ఫైర్ఫాక్స్ లో సమస్య[మార్చు]

ఫైర్ఫాక్స్ 58.0.2 (64bit) ఉబుంటు 16.04 (64bit) లో సూచిక విషయసూచిక పేజీలో అధ్యాయం మొదటి వరుస దాటి పొడిగివున్నప్పుడు. మొదటి కొన్ని పదాలకు వత్తులు కనబడడంలేదు. హైపర్ లింక్ ని సూచించే గీత కూడా విరిగి కనబడతున్నది. క్రోమ్ (Version 64.0.3282.167 (Official Build) (64-bit)) లో ఈ సమస్య కనబడలేదు.--అర్జున (చర్చ) 04:13, 14 మార్చి 2018 (UTC)

ఈ దోషాన్ని మనం సరిచేయగలమా?--Rajasekhar1961 (చర్చ) 05:05, 14 మార్చి 2018 (UTC)
మరింత విశ్లేషించిన తరువాత, అప్రమేయ ఫాంట్ 13 లో వుంటే సరిగానే చూపిస్తున్నది. ప్రస్తుతానికి పెద్ద సమస్య కాదు కావున వదిలివేయడమైనది.--అర్జున (చర్చ) 05:25, 14 మార్చి 2018 (UTC)

అధిక వీక్షణల వివరము, విశ్లేషణ[మార్చు]

వికీసోర్స్:అధిక వీక్షణల పుస్తకాలు/201803raw మరియు వికీసోర్స్:అధిక వీక్షణల పుస్తకాలు/201803 గమనించి, వికీసోర్స్ లో అధిక వీక్షణలు గల పేజీల/పుస్తకాల నాణ్యతను పెంచడానికి, లేక విస్తరించడానికి కృషి చేయవచ్చు. --అర్జున (చర్చ) 10:46, 4 ఏప్రిల్ 2018 (UTC)

A grammar of the Telugu language, సమాచార హక్కు చట్టం, 2005 పుస్తకాలు వీక్షణలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో వున్నాయి.--అర్జున (చర్చ) 10:55, 4 ఏప్రిల్ 2018 (UTC)
మొబైల్ తీరులో బొమ్మ సరిగా లేనిది డెస్క్టాప్ తీరు లో సరిగా వున్నది
బొమ్మఎక్కింపు ఉపకరణము వాడిన బొమ్మలు సరిగా చూపించని మొబైల్ వికీసోర్స్ తెరపట్టు.png
బొమ్మఎక్కింపు ఉపకరణము వాడిన బొమ్మలు సరిగా చూపించే డెస్క్టాపు వికీసోర్స్ తెరపట్టు.png

90 శాతం పై చిలుకు వీక్షణలు చాలావరకు మొబైల్ వాడుకదారులనుండి వస్తున్నాయి. (సమాచార హక్కు చట్టం, 2005 గణాంకాలు ఆధారంగా). సవరణ పెట్టెలో బొమ్మలు చేర్చు పరికరము వాడటం బదులు స్క్రీన్ షాట్ రూపంలో లేక వేరుగా స్కాన్ చేసి ఎక్కించటం కాని చేస్తే మంచిది.--అర్జున (చర్చ) 00:15, 5 ఏప్రిల్ 2018 (UTC)

పై సమస్య పై చేర్చిన బగ్ https://phabricator.wikimedia.org/T191674 పరిష్కరింపబడింది.--అర్జున (చర్చ) 00:16, 14 ఏప్రిల్ 2018 (UTC)
చాలా ఉపయోగకరమైన జాబితాలు చేసినందుకు అర్జున గారికి ధన్యవాదాలు.
  • ఎక్కువ వీక్షణలున్నవాటి నాణ్యత పెంపు: అధిక వీక్షణలోని పుస్తకాలను నాణ్యతాపరంగా మెరుగుచేయడం, కాపీహక్కుల సమస్యలు తీర్చడం ఒక అంశం. దీన్ని ఇప్పటికే అర్జున గారు సూచించివున్నారు. ఆ మేరకు ప్రాధాన్యతగా స్వీకరించి ఈ నెల, వచ్చే నెల నా పనుల జాబితాలో చేర్చాను. ఆ క్రమంలో కృషిచేయనున్నాను.
  • ఆసక్తిదాయకమైన పుస్తకాల ప్రచారం: ఆసక్తిదాయకమైన పుస్తకాలు, ప్రయోజనకరమైన పుస్తకాలు తెలుగు వికీసోర్సులో ఉన్నాయి, వాటిలో అనేకం పాఠకాదరణకు నోచుకోకపోవడానికి "ఇదిగో ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఒకసారి వికీసోర్సులో చదివి చూడండి" అన్న ధోరణిలో ప్రచారం ఇప్పటివరకూ చేయకపోవడమే కారణం అని భావిస్తున్నాను. కథలు గాథలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నా కలం నా గళం, చిన్ననాటి ముచ్చట్లు వంటి ఆసక్తికరమైన పుస్తకాలు ఉన్నాయి మనకు. ఇటువంటి పుస్తకాలను మొదటిపేజీ ప్రదర్శన మొదలుకొని పుస్తకం.నెట్, సంచిక, భూమిక వంటి అంతర్జాల పత్రికల వరకూ పలుతావుల్లో ప్రాచుర్యం చెందేలా ప్రచారం చేయడం చేయడం పాఠకాదరణకు ప్రయోజనకరమని భావిస్తున్నాను.
దీనిపై అర్జున గారూ, ఇతర సహసభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 03:40, 5 ఏప్రిల్ 2018 (UTC)
అర్జునరావు గారికి, ఈ జాబితాలు చాలా ప్రయోజనకరమైనవి. వీటి ఆధారంగా మన ప్రణాలికను రూపుదిద్దుకోవచ్చును. అయితే కొన్నింటికి కాపీహక్కుల సమస్యలు ఉన్నాయి. పవన్ లాంటివారు సహాయం చేస్తే; ప్రసార మాధ్యమాల ద్వారా వీటిని ముందుకు తీసుకొని పోవచ్చును. నేను ప్రస్తుతం క్రొత్త పుస్తకాలను చేర్చకుండా ఇప్పటికే ఉన్న పుస్తకాలను పూర్తిచేయడంపై దృష్టిసారిస్తాను. మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:42, 5 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు సూచించిన రెండవ అంశం కంటె వికీపీడియాలో వికీసోర్స్ పుస్తకాలను వనరులగా వాడి అభివృద్ధి చేయడం ద్వారా, వికీసోర్స్ అభివృద్ధికి మరింత తోడ్పాటుగా వుంటుంది. అలాగే సాంకేతికంగా బొమ్మ ఎక్కింపు ఉపకరణాన్ని అభివృద్ధి చేయటం కూడా చాలా ఉపయోగకరం.--అర్జున (చర్చ) 05:15, 5 ఏప్రిల్ 2018 (UTC)
Rajasekhar1961 గారికి, మీ ఆలోచన మెచ్చుకోదగినది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్న సూత్రం మన వికీసోర్స్ కి కూడా అనుసరణీయమే.--అర్జున (చర్చ) 05:15, 5 ఏప్రిల్ 2018 (UTC)
 :: ఎక్కువ వీక్షణలున్నవాటి నాణ్యత పెంపు విషయంలో ప్రాతిపదిక ఏర్పాటుచేసి, తగిన మార్గనిర్దేశం చేస్తున్నందుకు అర్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యత, కాపీహక్కుల పరమైన అంశాల్లో కొన్నిటిని పరిష్కరించేందుకు ఈ నెల నా పనిలో చేర్చాను. అర్జున గారు సూచించినట్టు వికీపీడియాలో వ్యాసాలను వికీసోర్సు పుస్తకాలు వాడి అభివృద్ధి చేస్తూ, వాటిని రిఫరెన్సు లింకులుగా ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎడిటథాన్ చేసే ప్రతిపాదన చేయవచ్చును, తద్వారా వికీసోర్సుకు సెర్చి ఫలితాల్లో మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. ఐతే కార్యకలాపాల్లో మార్పులు ఉన్నా ఆసక్తిదాయకమైన పుస్తకాల ప్రచారం అవసరమన్న లక్ష్యం పట్ల మనిద్దరికీ ఏకాభిప్రాయం ఉన్నట్టు గ్రహించాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:58, 5 ఏప్రిల్ 2018 (UTC)
పుస్తకాలుగా కూర్చని (ఉపపేజీలు చేయని వాటిని) పరిశీలించితే కేవలం అన్నమయ్య పాటలు విషయసూచిక పేజీలు 2496 వీక్షణలతో మొదటి స్థానంలో వున్నాయి. దీనికి మూల కృతి దొరికితే పుస్తకంగా మలచటం మంచిది.--అర్జున (చర్చ) 10:03, 7 ఏప్రిల్ 2018 (UTC)

పద్యాల శైలికి మూసలు[మార్చు]

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/55 లో చూపినట్లు, {{Left margin}} మరియు {{overfloat left}} ను తో వాడడం ద్వారా తెలుగు కంద, సీస, చంపకమాల లాంటి పద్యాలను చక్కగా కూర్చవచ్చు.--అర్జున (చర్చ) 23:32, 5 ఏప్రిల్ 2018 (UTC)

సమకాలీన ప్రజాదరణ పొందిన రచనలు వికీసోర్స్ లో[మార్చు]

సత్యకమ్ వెబ్సైటులో లో చూపినట్లు సమకాలీన రచయితలు, వారి పుస్తకాలు నెట్లో చదువుకొనేందుకు అనుమతిస్తున్నారు. వికీసోర్స్ తరపున ప్రయత్నం చేస్తే వికీసోర్స్ లో విడుదలం చేసేందుకు. డిజిటల్ ఫాంటు రూపంలో వున్న వి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది. పవన్ సంతోష్ (CIS-A2K)ప్రయత్నించితే బాగుంటుంది. అన్నట్లు, ఈ సైట్లో మన వికీసోర్స్ డిజిటల్ రచనలను పిడిఎఫ్ లను చదువుకోడానికి వాడే పిడిఎఫ్ ఉపకరణంతో ప్రదర్శిస్తున్నారు (సుప్రసిద్ధుల జీవిత విశేషాలు)--అర్జున (చర్చ) 05:18, 10 ఏప్రిల్ 2018 (UTC)

చేర్చవలసిన పుస్తకాలు[మార్చు]

వికీసోర్స్:చేర్చవలసిన పుస్తకాలు లో మీకు ఆసక్తివున్న పుస్తకాలు ఆర్కీవ్.ఆర్గ్ లింకు తో చేర్చండి.--అర్జున (చర్చ) 05:22, 13 ఏప్రిల్ 2018 (UTC)

టైపించడంలో మన విధానం - మూలంలోని తప్పులను సవరించాలా లేక అలాగే ఉంచెయ్యాలా?[మార్చు]

గతం లో జరిగిన చర్చకి సలహా {{SIC}} పుట పేజీలలో {{SIC|<మూలంలోని తప్పు పదజాలం>|<సరిచేసిన పదజాలం>}} వాడితే మూలం ఎలా వుందో అలా మరియు కర్సర్ ఆ పదం పై వుంచినపుడు సరిచేసిన పదజాలం కనబడుతుంది. ఉదాహరణ పుటపేజీ రెండవ పేరాలో వీధులు అనే పదం--అర్జున (చర్చ) 00:02, 14 ఏప్రిల్ 2018 (UTC)

పుస్తకాలు దింపుకొనడంలో సమస్య, పరిష్కారం[మార్చు]

పుస్తకాలు దింపుకొనడంలో epub రూపం పనిచేస్తుండగా, pdf రూపం ప్రయత్నించితే "502 Bad gateway" అనే దోషం వస్తున్నది. https://github.com/wsexport/tool/issues/145 బగ్ నివేదించబడింది. లింకు కెళ్లి దానిలో వివరాలు నింపి pdf రూపం దించుకొనుటకు ప్రయత్నించవచ్చు ప్రస్తుతానికి epub రూపం మాత్రమే చేతనం చేయబడినది.--అర్జున (చర్చ) 03:03, 14 ఏప్రిల్ 2018 (UTC)

అర్జునరావు గారు, ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 03:18, 14 ఏప్రిల్ 2018 (UTC)

కొత్త మీడియావికీ రూపాంతరము[మార్చు]

మీడియా వికీ 1.31.0.wmf.29 12 ఏప్రిల్ 2018న అమలులోకి వచ్చింది (https://phabricator.wikimedia.org/T164753). ఎడిటర్ లో ఆదేశ బొమ్మలు కొత్త విజువల్ ఎడిటర్ వి సాధారణ వికీఎడిట్ కు కూడా వాడారు. సభ్యులు గమనించాలి. కొత్త పుటపేజీలు సృష్టించేటప్పుడు, కొన్ని సార్లు స్కాన్ బొమ్మ ప్రదర్శించబడుటలేదు లేక చాలా చిన్నదిగా కనబడుతున్నది. తాత్కాలిక పరిష్కారంగా పేజీని తాజా చేస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 05:02, 14 ఏప్రిల్ 2018 (UTC)

ప్రత్యేక అక్షరాలు[మార్చు]

సాధారణంగా కాలన్, సింగిల్ పైప్, డబల్ పైప్ అక్షరాలను వాడుతున్న మనం సరియైన తెలుగు ః । ॥ అక్షరాలను ఎడిట్ పెట్టె క్రింద వరసనుండి ఎంచుకొని పాఠ్యంలో ప్రవేశపెట్టవచ్చు.--అర్జున (చర్చ) 05:18, 14 ఏప్రిల్ 2018 (UTC)

అర్జునరావు గారికి తెలియజేసినందులకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:31, 17 ఏప్రిల్ 2018 (UTC)

నాణ్యత విషయంలో..[మార్చు]

నాణ్యత విషయంలో గతంలో చర్చలు చాలానే జరిగాయి. కానీ ఫలితం పెద్దగా ఉన్నట్టు లేదు. అక్కడా ఇక్కడా ఒకటో అరో తప్పులు ఉండడం వేరు, ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా ఉండడం వేరు. కింది పేజీలు చూడండి..

ఇవి "అచ్చుదిద్దబడిన" పేజీలు. కనీస మాత్రపు పరిశీలనక్కూడా ఇవి నోచుకోలేదని కనబడుతోంది. నిర్వాహకులు ఈ విషయంపై దృష్టి సారించాలని వినతి.__Chaduvari (చర్చ) 05:22, 16 ఏప్రిల్ 2018 (UTC)

వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Rajasekhar1961 - సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.__Chaduvari (చర్చ) 01:54, 17 ఏప్రిల్ 2018 (UTC)
ఈ విషయం గురించి మీరు తెలియజేసినట్లుగా ఇదివరకే చర్చించాము. మీరు తెలియజేసినట్లుగా అచ్చుదిద్దిన లేదా ఆమోదించిన వ్యక్తులకు వారి తప్పులను తెలియజేశాము. కానీ వారిలో మార్పులేదు. తరువాత చర్యలను సూచించండి. --Rajasekhar1961 (చర్చ) 04:30, 17 ఏప్రిల్ 2018 (UTC)
User:Nrgullapalliగారు తమ స్పందన తెలియచేస్తే బాగుంటుంది. దోషాలు వెదికి సరిదిద్దటానికి, కొంత జాగ్రత్తగా చూసే చూపు కావాలి.చదివేటప్పుడే తప్పుని కనుగొనగలగాలి. అది అలవాటు చేసుకొంటే మంచిది. లేకపోతే వికీలో ఇతర పనులు చాలా వున్నాయి. ఉదాహరణకు పుస్తకాలకు అధ్యాయాలు కూర్పడం లాంటివి. వాటిని చేపట్టవచ్చు.--అర్జున (చర్చ) 07:12, 18 ఏప్రిల్ 2018 (UTC)

unable to type in Telugu in Source. unable to locate lipyamtareekarana.Can any member will help.Nrgullapalli (చర్చ) 13:24, 30 ఏప్రిల్ 2018 (UTC)

Surely, tell me when you are free.--Rajasekhar1961 (చర్చ) 18:05, 30 ఏప్రిల్ 2018 (UTC)

పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి[మార్చు]

పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు ప్రదర్శిత గ్రంథం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి ప్రచురితమైంది. తెలుగువారి వెయ్యేళ్ళ జీవనచిత్రం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర (వికీసోర్సు ప్రదర్శిత గ్రంథాలు) అన్న శీర్షికతో ఈ వ్యాసం ప్రచురించారు. పైన జరిగిన చర్చల్లో భాగంగా పలు వేదికల ద్వారా వికీపీసోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావడం బావుంటుందని ఆశించాం, అందులో భాగమే ఈ ప్రయత్నం. ఐతే ఈ ప్రయత్నం ఇటువంటి మరిన్ని ప్రయత్నాలకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో చేసింది. అంటే మరికొందరు వికీసోర్సు వాడుకరులు ఇలా రాస్తే నేను వీలున్నంతవరకూ సహకరింస్తాను.
పుస్తకం.నెట్ 2009లో ప్రారంభమై నేటికీ అంతర్జాలంలో పుస్తకప్రియులకు, పాఠకులకు ప్రియమైన వేదికగా కొనసాగుతున్న ఇ-మ్యాగజైన్. పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో చోటు చేసుకుంటాయి. వికీసోర్సును పుస్తకప్రియులకు చేరువచేయడానికి మంచి వేదిక.
ఈ వ్యాసాన్ని ఒక నమూనాగా పనికివచ్చేలా మలచడం జరిగింది. మొదట కొంత భాగం ఆ పుస్తకంలో పాఠకులకు ఆసక్తి కలిగే వాక్యాలను ఏర్చికూర్చాను (ఇది పుస్తకాన్ని బట్టి చేయాలి), తర్వాత భాగం నేరుగా వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పరిచయం పాఠ్యాన్ని అతికొద్ది మార్పులు చేసి ప్రచురించాను. పుస్తకానికి వికీసోర్సు లంకె ఇచ్చాను. పుస్తకం గురించి మరో వ్యాసం విడిగా వ్రాయగలిగినా ఇలా ఒక నమూనా తయారుచేస్తే ఆసక్తి ఉన్న వికీపీడియన్లు ఎవరైనా అనుసరించడానికి వీలుగా ఉంటుందని చేశాను. ప్రదర్శిత గ్రంథాల గురించే కాదు మరి ఏ వికీసోర్సు పుస్తకం గురించైనా ఇలా రాయవచ్చు. పుస్తకంలో ఆసక్తికరమైన ఒక భాగాన్ని నేరుగా ప్రచురించనూ వచ్చు, తద్వారా పాఠకుల ఆసక్తిని మనవైపుకు లాగవచ్చు. ఉదాహరణకు సహస్ర దళ పద్మం - హైదరాబాద్ అంటూ సలాం హైదరాబాద్ నవలలోని కొంతభాగాన్ని చాన్నాళ్ళ క్రితం పుస్తకంలోనే రచయిత అనుమతితో నేను ప్రచురించడాన్ని గమనించండి. వికీసోర్సులోని పుస్తకాలకు ఆ విధమైన ముందస్తు అనుమతి కూడా అక్కరలేదు కాబట్టి ఇంకా తేలికవుతుంది.
వికీసోర్సులోని పుస్తకాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా రాస్తానంటే వీలైనంత సాయం చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. పుస్తకం.నెట్‌కు రాయడానికి ఇక్కడ చూడొచ్చు. నేను మీ ప్రయత్నంలో సహకరించాలనుకుంటే చర్చ పేజీలో కానీ, pavansanthosh.s@gmail.comకి మెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:03, 17 ఏప్రిల్ 2018 (UTC)

చాలా బాగున్నది. నేను ప్రయత్నిస్తాను. ఈ విధమైన ప్రచారం తెలుగు వికీసోర్సుకు చాలా అవసరం. మంచి పుస్తకాలు మనవద్ద ఉన్నాయి అని చాలా మందికి తెలుస్తుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:32, 17 ఏప్రిల్ 2018 (UTC)

నకలు హక్కులు తీరిపోని పుస్తకాలపై నిర్ణయం[మార్చు]

నకలు హక్కులు తీరిపోని పలు పుస్తకాలు తెవికీసోర్స్ లో ఉన్నాయి, వీటిని ఉంచటానికి డిఎల్ఐ ప్రాతిపదికగా అర్జునరావు ఉంచారు. అలా పొరపాటున నకలుహక్కులు తీరిపోని పుస్తకాలను వికీసోర్స్ ప్రధాన పేరుబరి నుండి తొలగించాలి అని ప్రతిపాదిస్తున్నాను. పేజీలు తీసివేసినా, అవి నిర్వాహకులకు అందుబాటులో ఉంటాయి కనుక భవిష్యత్తులో వాటిని తిరిగి రప్పించవచ్చు (ఆయా పుస్తకాల నకలు హక్కులు తీరిపోయాక). తీసివేయుటకు నోటీసు చేర్చి వారంలో ఆయా పుస్తకాలను తీసివేయాల్సి ఉంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:16, 3 మే 2018 (UTC)

AdvancedSearch[మార్చు]

Birgit Müller (WMDE) 14:53, 7 మే 2018 (UTC)

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు ఆంగ్లలిపినుండి తెలుగులోకి మార్చుటకు సహాయం.[మార్చు]

user:Pavan santhosh.s నాయకత్వం వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఫలితాలనుండి తెలుగు 5844 పుస్తకాల వివరాలను ఆర్కీవ్.అర్గ్ లో చేర్చాను.(మార్చిన తరువాత కనబడే పుస్తకం ఉదాహరణ). ఇంకా 17062 పుస్తకాల వివరాలను తెలుగులోకి మార్చితే విలువైన తెలుగు పుస్తకాలు తెలుగవారికి అందుబాటులోకి వస్తాయి. దానికొరకు ప్రయోగాత్మకంగా తెలుగులోకే మార్చే సాఫ్ట్వేర్ తో యాంత్రిక లిప్యంతరీకరణ సలహాలను చేర్చిన గూగుల్ షీట్ మీతో పంచుకుంటున్నాను. ఆంగ్లఅక్షరాలతో రాసిన మూలంలో కోడ్ సరిగా వాడకపోవడంతో యాంత్రిక లిప్యంతరీకరణ నేరుగా వాడలేకపోతున్నాము. దానిలో ఆకుపచ్చ రంగులో వున్న ntitle, nauthor అనే నిలువ వరుసలో ptitle, pauthor లో ప్రశ్నార్ధకంతో మొదలయ్యే వరుసలోని ఆర్కీవ్.ఆర్గ్ లింకు నొక్కి పుస్తకం తొలి పేజీలు చూసి, పుస్తకం శీర్షిక,రచయిత,ఆనువాదం, సంపాదకుల వివరాలు చేర్చాలి. ఇంకా పుస్తక ప్రచురణ సంవత్సరం సరిగా లేకపోతే pdateలో , అది తెలుగు భాషకు కాని పుస్తకం అయితే ఆ భాష కోడ్(tam tel లేక Unknown) అనేది nslang వరుసలో చేర్చాలి. ఒక అంశం దిద్దినపుడు ptitle, pauthor వరుసలో ఆ అంశం తాలూకు మొదటి అక్షరం ప్రశ్నార్ధక చిహ్నాన్ని తొలగించండి. దానితో ఇంకా చేయవలసిన అంశాల సంఖ్యలు మొదటి వరుసలోవి తాజా అవుతాయి. మీకేదైనా సందేహాలుంటే తెలపండి. తెలుగులో మంచి విలువైన పుస్తకాల వివరాలు తెలుసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. వికీసోర్స్ లో పని చేసిన రోజున 15 నిముషాలు కేటాయించగలిగితే 10 పుస్తకాల వరకు వివరాలు చేర్చగలుగుతారు. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమం పూర్తిచేయటానికి సహకరించవలసింది. వికీసోర్స్ లో కాకుండా గూగుల్ షేర్ లో ఈ పని చేయడానికి మెరుగైన సౌలభ్యం కాబట్టి అలా చేయడమైనది. మీకు గూగుల్ లో తెలుగు టైపు చేయడానికి సమస్య ఏమైనా వుంటే సంప్రదించండి. మీ ఆసక్తి మరియు స్పందనలు తెలియచేయవలసినది.--అర్జున (చర్చ) 07:12, 12 మే 2018 (UTC)

ఈ ప్రాజెక్టు చాలా విలువైనది అనంతమైనది. ఇది తొందరగా అర్ధంచేసుకుని పనిచేయుఇటకు తగిన పరిజ్ఞానంకోసం సీనియర్ సబ్యులు మాలాంటివారికి తరగతులు నిర్వహీంచుటవల్ల కొంత సహాయము చేసినవారగుదురు. ఇది అత్వవసరం.--Nrgullapalli (చర్చ) 13:06, 12 మే 2018 (UTC)
Nrgullapalli గారి స్పందనకు ధన్యవాదాలు. కంప్యూటర్ విహరిణిలో తెలుగు టైపు చేయడం తెలుసుకుంటే ఈ ప్రాజెక్టుకి సహకరించడం చాలా సులభం. మీరు ఒకసారి గూగుల్ షీట్ చూసి మీ సందేహాలు, దానిలో వ్యాఖ్యలగానో లేక ఇక్కడో తెలియచేయండి. త్వరలో చిన్న వీడియో పాఠం చేసి తెలియచేస్తాము.--అర్జున (చర్చ) 10:17, 14 మే 2018 (UTC)

నాణ్యత గురించి..[మార్చు]

నాణ్యత గురించి గతంలో చర్చలు జరిగాయి. అచ్చుదిద్దేవారు వీటిని పట్టించుకుంటున్నట్టు లేదు. ఈ దిద్దుబాటు చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. మిగతా తప్పుల సంగతి ఎలా ఉన్నా.., కనీసం సామెతల సంఖ్య తప్పు పడినా దాన్ని పట్టించుకోలేదు. ఊరికినే "అచ్చుదిద్దబడింది" అని మార్పు చేసినట్టుగా అగపడుతోంది. నిర్వాహకులు దీన్ని ఇంకాస్త తీవ్రంగా తీసుకోవాలని మనవి. __Chaduvari (చర్చ) 05:10, 4 జూలై 2018 (UTC)

గత రెండు రోజుల్లో వాడుకరి:Nrgullapalli గారు "A Collection of Telugu Proverbs.pdf" కు చెందిన 33 పేజీల్లో చేసిన "అచ్చుదిద్దుబాట్లను" పరిశీలించాను. వీటన్నిటినీ కూడా అచ్చుదిద్దినట్లుగా స్థితిని మార్చారు. అనగా నాణ్యత పరంగా పేజీ స్థాయిని ఒక మెట్టు పైకెక్కించారు. కానీ మెట్టు ఎక్కించారంతే.. నాణ్యత పరంగా ఒక్ఖ మిల్లీమీటరు కూడా మెరుగుపడలేదు. అచ్చుదిద్దినట్లు గుర్తించారంతే.. ఒక్కదానిలో కూడా ఒక్క మార్పు కూడా చెయ్యలేదు. 15 నిముషాల్లో 33 పేజీలను "అచ్చుదిద్దిపారేసారు". ఒక్క నిముషంలో రెండు పేజీలను తెరిచి, పరిశీలించి, తప్పులను సవరించి, సేవు చేసెయ్యడం! ఎంతో నిర్లక్ష్యంగా, నాణ్యత పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. గతంలో నేను మూణ్ణాలుగు సార్లు ఈ విషయాన్ని సముదాయం దృష్టికి, నిర్వాహకుల దృష్టికీ తీసుకొచ్చాను. అయినా ఏమీ ఫలితం లేదు. పై 32 పేజీల్లోనూ 16 పేజీల్లో తిరిగి తప్పులను సరిదిద్దాన్నేను.
ఈ రకం "అచ్చుదిద్దడం" వలన వికీసోర్సుకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు సరికదా.. నష్టం. ఎంతో సమయం వెచ్చించి, ఎంతో కష్టపడి, శ్రద్ధతో టైపిస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. తాము టైపు చేసిన పేజీలను, అచ్చుదిద్దేవారు కూడా అంతే శ్రద్ధతో అచ్చుదిద్దాలని వారు కోరుకుంటారు. కానీ అచ్చుదిద్దేవారు మాత్రం నాణ్యత పట్ల చిన్నమెత్తు గౌరవం లేకుండా, ఎడాపెడా అచ్చుదిద్ది"పారేస్తూ" ఉన్నారు. వికీసోర్సులో "అచ్చుదిద్దడం" అనే దశ ఎగతాళి పాలైనట్టుగా తోస్తోంది.
వాడుకరి:Arjunaraoc గారూ, వాడుకరి:Rajasekhar1961‎ గారూ, ఈ నిర్లక్ష్యపు అచ్చుదిద్దడాలను మేమూ గమనించామని గతంలో మీరిద్దరూ రాసారు. అయినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యతా హననం జరుగుతూంటే చూస్తూ ఉండాల్సిందేనా? __Chaduvari (చర్చ) 01:37, 6 జూలై 2018 (UTC)

Bot rights for User:Wikisource-bot[మార్చు]

Hi. With the requirement to fix the page categorisation as notified at phab:T198470, I would like to propose to the community to have our bot run through and address the problem with the solution identified. The bot has been used to resolve issue previously on the Wikisources.

Thanks. Billinghurst (చర్చ) 12:28, 7 జూలై 2018 (UTC)

Addition of teWS to global bots[మార్చు]

Above I have added a bot request, as this wiki is not within the global bot project, per list m:Special:WikiSets/2. Would the community consider opting in to the global bots, so that when we have Wikisource-wide fixes for mw:Extension:ProofreadPage that is possible to organise the bots to do the jobs within Phabricator, and simply get the fix in place. Billinghurst (చర్చ) 12:28, 7 జూలై 2018 (UTC)

Global preferences are available[మార్చు]

19:20, 10 జూలై 2018 (UTC)

కేతు విశ్వనాథ రెడ్డి గారి కడప ఊర్ల పేర్లు పుస్తకం రీలైసెన్సు[మార్చు]

అందరికీ నమస్కారం,
ప్రముఖ కథారచయిత, పరిశోధకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి రాసిన "కడప ఊర్ల పేర్లు" గ్రంథాన్ని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులోకి పునర్విడుదల చేశారు. కడప ఊర్ల పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక స్థలనామ విజ్ఞాన పరిశోధనలకు దారిచూపిన గ్రంథం. ఇదే దాదాపు తెలుగులో టోపోనమీ విషయంలో తొలి రచన కావడంతో రచయిత పుస్తకంలో స్థలనామ విజ్ఞానానికి సంబంధించిన ప్రాతిపదికలు, మౌలికాంశాలు కూడా సుబోధకంగా రాశారు. తెలుగు వికీపీడియాలో కడప జిల్లా గ్రామ వ్యాసాల్లో ఈ పుస్తకాన్ని ఉపయోగించాలని ప్రయత్నించి, పని ప్రారంభిస్తున్న తరుణంలో ఈ పుస్తకాన్ని వికీసోర్సులో పాఠ్యీకరణకు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించగలగడం చక్కని అవకాశం. కోరగానే ప్రతిస్పందించి, విశ్వనాథరెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడి ఈ పని పూర్తికావడానికి కీలకపాత్ర పోషించిన సాహిత్యవేత్త, తెలుగు వికీపీడియన్ వాడుకరి:స్వరలాసికకు ధన్యవాదాలు. పుస్తకం ఇప్పటికే వికీమీడియా కామన్స్‌లో అప్‌లోడ్ చేసి, సూచిక పేజీ సృష్టించాం. దయచేసి పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:05, 12 జూలై 2018 (UTC)

ఇదొక ముందడుగు. కృషిచేసిన పవన్ మరియు స్వరలాసికలకు మా ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:26, 12 జూలై 2018 (UTC)