Jump to content

వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 8

వికీసోర్స్ నుండి

పాత చర్చ 7 | పాత చర్చ 8 | పాత చర్చ 9

Review of initial updates on Wikimedia movement strategy process

[మార్చు]

Note: Apologies for cross-posting and sending in English. Message is available for translation on Meta-Wiki.

The Wikimedia movement is beginning a movement-wide strategy discussion, a process which will run throughout 2017. For 15 years, Wikimedians have worked together to build the largest free knowledge resource in human history. During this time, we've grown from a small group of editors to a diverse network of editors, developers, affiliates, readers, donors, and partners. Today, we are more than a group of websites. We are a movement rooted in values and a powerful vision: all knowledge for all people. As a movement, we have an opportunity to decide where we go from here.

This movement strategy discussion will focus on the future of our movement: where we want to go together, and what we want to achieve. We hope to design an inclusive process that makes space for everyone: editors, community leaders, affiliates, developers, readers, donors, technology platforms, institutional partners, and people we have yet to reach. There will be multiple ways to participate including on-wiki, in private spaces, and in-person meetings. You are warmly invited to join and make your voice heard.

The immediate goal is to have a strategic direction by Wikimania 2017 to help frame a discussion on how we work together toward that strategic direction.

Regular updates are being sent to the Wikimedia-l mailing list, and posted on Meta-Wiki. Beginning with this message, monthly reviews of these updates will be sent to this page as well. Sign up to receive future announcements and monthly highlights of strategy updates on your user talk page.

Here is a review of the updates that have been sent so far:

More information about the movement strategy is available on the Meta-Wiki 2017 Wikimedia movement strategy portal.

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation, 20:31, 15 ఫిబ్రవరి 2017 (UTC) • Please help translate to your languageGet help

శివరాత్రి శుభాకాంక్షలు

[మార్చు]

ఒక పది నెలలుగా మా తల్లిగారి అస్వస్థత కారణంగా వికీ కార్యక్రమాలలో మనసుపెట్టలేకపోయాను. ఆమె ఈ నెల 11వ తేదీన శివునిలో కలసిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. బంధాలను త్రెంచడమే ఆ హరుని పని; దానిని ఆమోదించడమే తప్ప మానవులుగా మనం ఏమీ చేయలేదు.

ఇక నుండి మెల్లమెల్లగా వికీ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకొంటున్నాను. అది మీ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమని నాకు తెలుసు. ఇంతవరకు నిర్వహకునిగా ఏమంత ఉపయోగపడలేనందులకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 13:55, 24 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Overview #2 of updates on Wikimedia movement strategy process

[మార్చు]

Note: Apologies for cross-posting and sending in English. This message is available for translation on Meta-Wiki.

As we mentioned last month, the Wikimedia movement is beginning a movement-wide strategy discussion, a process which will run throughout 2017. This movement strategy discussion will focus on the future of our movement: where we want to go together, and what we want to achieve.

Regular updates are being sent to the Wikimedia-l mailing list, and posted on Meta-Wiki. Each month, we are sending overviews of these updates to this page as well. Sign up to receive future announcements and monthly highlights of strategy updates on your user talk page.

Here is a overview of the updates that have been sent since our message last month:

More information about the movement strategy is available on the Meta-Wiki 2017 Wikimedia movement strategy portal.

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation, 19:43, 9 మార్చి 2017 (UTC) • Please help translate to your languageGet help

We invite you to join the movement strategy conversation (now through April 15)

[మార్చు]

05:09, 18 మార్చి 2017 (UTC)

వివేకానందుని సంపూర్ణ సాహిత్యం ఆంగ్ల వికీసోర్సులో ఇక్కడ అందుబాటులో ఉంది. The Complete Works of Swami Vivekananda . అంటే వివేకానందుని సాహిత్యమంతా కాపీరైట్ గడువులు తీరి జనస్వామ్యంలో స్వేచ్ఛానకలు హక్కులతో ఉన్నయి. వీటిని ఎవ్వరైనా పంచుకోవచ్చు, లేదా ముద్రించచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. వీటి తెలుగు అనువాదము రామకృష్ణ మఠము 'లేవండి మేల్కొనండి' పేరిట నాల్గు వేల పుటలతో పది సంపుటాలను వెలువరించింది. వారి తక్కిన అన్ని ప్రచురణలలోనూ కాపీరైట్ గమనికలు ఉన్నను, , 'లేవండి , మేల్కొనండి' గ్రంధమునకు ఎటువంటి కాపీరైట్ గమనికలు వాడలేదు. అదీ కాక అసలు మూలం జనస్వామ్యంలో స్వేచ్ఛాహక్కులతో వుంది. కనుక ఒక చారిత్రక వ్యక్తి యొక్క బోధనలు మనం వాడవచ్చు. నేను ఆ గ్రంథాన్ని యూనికోడ్ లోకి దాదాపుగ మార్చడం పూర్తైనది. మూలాలను యూనికోడ్ లో కింది గిట్ హబ్ ప్రాజెక్ట్ లో చేర్చాను. [[1] పుస్తకాలు_pdfs ఫోల్డర్ నందు కలవు. అన్ని పుటల html మూలాలు కలవు. ప్రతి పుటనందు తర్వాత, ముందు పుటలకు లంకెలు కూడా ఇవ్వబడ్డాయి. వరుస విరుపులు (line breaks) కూడా ఎందుకైనా భద్రపరచబడ్డవి. వాటిని తీసివెయ్యాలంటే -&nbsp;<BR> ను తొలగించి, ఆ తర్వాత &nbsp;<BR> ను స్పేస్ తోటి పునఃస్థాపించండి. ఇక <FONT> తోకలు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపయోగించి విభాగాలను నిర్ణయించవచ్చు.

ఈ పేజీలనుండి వివిధ సంపుటాలను, ఆ సంపుటాలలో వివిధ గ్రంధాలను(భక్తి యోగం, జ్ఞానయోగం, మొదలగు) , వాటిలో వ్యాసాలను విభాగీకరించవలసి ఉన్నది. ఆ పని బహుశా వికీసోర్స్ లో గుంపు అందరం కలసి చేయవచ్చు. దామోదర (చర్చ) 07:10, 28 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Please accept our apologies for cross-posting this message. This message is available for translation on Meta-Wiki.

On behalf of the Wikimedia Foundation Elections Committee, I am pleased to announce that self-nominations are being accepted for the 2017 Wikimedia Foundation Board of Trustees Elections.

The Board of Trustees (Board) is the decision-making body that is ultimately responsible for the long-term sustainability of the Wikimedia Foundation, so we value wide input into its selection. More information about this role can be found on Meta-Wiki. Please read the letter from the Board of Trustees calling for candidates.

The candidacy submission phase will last from April 7 (00:00 UTC) to April 20 (23:59 UTC).

We will also be accepting questions to ask the candidates from April 7 to April 20. You can submit your questions on Meta-Wiki.

Once the questions submission period has ended on April 20, the Elections Committee will then collate the questions for the candidates to respond to beginning on April 21.

The goal of this process is to fill the three community-selected seats on the Wikimedia Foundation Board of Trustees. The election results will be used by the Board itself to select its new members.

The full schedule for the Board elections is as follows. All dates are inclusive, that is, from the beginning of the first day (UTC) to the end of the last.

  • April 7 (00:00 UTC) – April 20 (23:59 UTC) – Board nominations
  • April 7 – April 20 – Board candidates questions submission period
  • April 21 – April 30 – Board candidates answer questions
  • May 1 – May 14 – Board voting period
  • May 15–19 – Board vote checking
  • May 20 – Board result announcement goal

In addition to the Board elections, we will also soon be holding elections for the following roles:

  • Funds Dissemination Committee (FDC)
    • There are five positions being filled. More information about this election will be available on Meta-Wiki.
  • Funds Dissemination Committee Ombudsperson (Ombuds)
    • One position is being filled. More information about this election will be available on Meta-Wiki.

Please note that this year the Board of Trustees elections will be held before the FDC and Ombuds elections. Candidates who are not elected to the Board are explicitly permitted and encouraged to submit themselves as candidates to the FDC or Ombuds positions after the results of the Board elections are announced.

More information on this year's elections can be found on Meta-Wiki. Any questions related to the election can be posted on the election talk page on Meta-Wiki, or sent to the election committee's mailing list, board-elections(at)wikimedia.org.

On behalf of the Election Committee,
Katie Chan, Chair, Wikimedia Foundation Elections Committee
Joe Sutherland, Community Advocate, Wikimedia Foundation

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation Elections Committee, 03:36, 7 ఏప్రిల్ 2017 (UTC) • Please help translate to your languageGet help

Read-only mode for 20 to 30 minutes on 19 April and 3 May

[మార్చు]

MediaWiki message delivery (చర్చ) 17:33, 11 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

19:14, 3 మే 2017 (UTC)

Beta Feature Two Column Edit Conflict View

[మార్చు]

Birgit Müller (WMDE) 14:41, 8 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

RevisionSlider

[మార్చు]

Birgit Müller (WMDE) 14:44, 16 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

21:09, 16 మే 2017 (UTC)

21:05, 23 మే 2017 (UTC)

Accessible editing buttons

[మార్చు]

--Whatamidoing (WMF) (talk) 16:56, 27 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఫేస్ బుక్ లోని వికీపీడియా పేజీ ద్వారా ఆంధ్ర కవుల చరిత్రపై చేస్తున్న కృషి వివరించే ప్రయత్నం

[మార్చు]

అందరికీ నమస్కారం,
వికీపీడియా పేజీ ఫేస్ బుక్ లో వేలాదిగా అభిమానులతో (లైక్ చేసినవారు) నడుస్తూంది. ఈ పేజీకి అడ్మిన్లుగా మన తెలుగు వికీపీడియన్లే దీన్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానంగా తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ పేజీలో పోస్టులు ఉపకరిస్తున్నాయని చెప్పవచ్చు. ఐతే తెలుగు వికీసోర్సులో చేస్తున్న కృషి, దానిలో పాలుపంచుకోగలిగిన అవకాశాన్ని అనుసరిస్తున్న వారికి తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉండవచ్చని భావిస్తున్నాను. ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు మనం ఓ పోస్టు పనిచేస్తున్న పుస్తకం, దానిపై జరగదగ్గ కృషి వివరిస్తూ పెడితే వారాంతం వల్ల ప్రాచుర్యం చెందేందుకు వీలుంటుంది. ఈ వారాంతం ప్రచురించేందుకు ఈ కింది పోస్టు ఎలా ఉంటుందో పరిశీలించండి. అలానే ఇది ప్రతిపాదితమేనని, ఈ పోస్టులో వాస్తవాంశాలలో లోటుపాట్లు ఉన్నా, మరింత మెరుగుపరచే వీలున్నా చేయవచ్చునని తెలియజేసుకుంటున్నాను. దయచేసి సభ్యులు తమ అభిప్రాయం తెలియజేయగలరు, అలానే ప్రూఫ్-రీడింగులో కానీ, ఓసీఆర్ దిద్దుబాట్లలో కానీ ఈ ప్రాజెక్టుపై కృషిచేసిన ఇతర సభ్యుల పేర్లు కూడా కింది పాఠ్యంలో సరిదిద్ది చేర్చమని కోరుతున్నాను.:

తెలుగు వికీసోర్సులో ఆంధ్ర కవుల చరిత్ర డిజిటైజేషన్ కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన ఆంధ్ర కవుల చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చారిత్రక విలువ ఉన్న పుస్తకం. వీరేశలింగం గారు నేనప్పటికి దొరికిన సాధనకలాపముతో కవులకాలనిర్ణయాదులను జేయుచు నేదో యొక రీతిని గ్రంథము సాంతముచేసితిని అని చెప్పుకున్నా, ఆ దిశగా చేసిన తొలినాళ్ళ బృహత్‌ ప్రయత్నంగా దాని విలువ ఎన్నటికీ ఉండేదే. ఆంధ్ర కవుల చరిత్ర గ్రంథం తొలి సంపుటాన్ని ప్రస్తుతం తెలుగు వికీసోర్సులో తెలుగు భాషపై ప్రేమతో స్వచ్ఛందంగా వికీపీడియన్లు డిజిటైజ్ చేసి, ప్రూఫ్‌-రీడింగ్ చేస్తున్నారు. Ramesam54 గారు, Nrgullapalli, Ajaybanbi గార్లు, మరికొందరు వికీపీడియన్లు తమ ఖాళీ సమయాన్ని తెలుగు భాషాభివృద్ధికి ఈ విధంగా వెచ్చిస్తూ ప్రూఫ్‌ రీడింగ్ చేస్తున్నారు.

ఈ కృషిలో ఎవరైనా పాలుపంచుకోవచ్చు, ఒక్క పేజీ మొదలుకొని ఎన్ని పేజీల వరకైనా, 2 నిమిషాలు మొదలుకొని ఎంత సమయమైనా మీకు వీలైనప్పుడు వెచ్చించి తెలుగు వికీసోర్సుకూ, తద్వారా తెలుగు భాషాభివృద్ధికి చేయూతను ఇవ్వవచ్చు. అంతర్జాలం వేదికగా తెలుగు రచనలను శాశ్వతీకరించే ఈ కృషిలో మీరూ పాలుపంచుకోండి.

ధన్యవాదాలతో,
--పవన్ సంతోష్ (చర్చ) 07:15, 23 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రతిపాదన బాగుంది. ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము ఇప్పటికే పూర్తిచేశాము. ప్రథమ మరియు మూడవ భాగాలు చేయాల్సి ఉన్నది. మూడింటికి కలిపి జరుగుతున్న కృషి మరియు చేయవలసిన పనుల్ని రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్నట్లు వ్రాద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:40, 23 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, మీ ప్రతిపాదన మంచిదే. తెలుగు వికిపీడియనుల సంఖ్య పెరగవలసి యున్నది.

- గుంటుపల్లి రామేశ్వరం ramesam54

రాజశేఖర్ గారూ, మీరన్నది బావున్నది. దయచేసి మూడు భాగాలకు సంబంధించి పనిచేసిన ముఖ్యుల పేర్లు చేర్చగలరు. నేను శ్రీరామమూర్తి, Rajasekhar1961, Bhaskaranaidu, Nrgullapalli కూడా ఇందులో పనిచేసినట్టు నేను గమనించాను. మరెవరి పేర్లైనా ఉంటే తెలియజేయాల్సిందిగా విన్నపం. ఈ విషయంలో ఇతర సముదాయ సభ్యులు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:29, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ వీరుగాక Arjunaraoc గారు కూడా కొంత పనిచేశారు మరియు విలువైన సహాయ సహకారలను అందించారు.Rajasekhar1961 (చర్చ) 11:38, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారికీ, ఇతర సభ్యులకు,
నమస్తే. ఈ కింది పాఠ్యాన్ని పరిశీలించండి. దీన్ని సాయంత్రం ప్రచురించవచ్చని ఆశిస్తున్నాను.

తెలుగు వికీసోర్సులో ఆంధ్ర కవుల చరిత్ర డిజిటైజేషన్ : కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన ఆంధ్ర కవుల చరిత్రము తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చారిత్రక విలువ ఉన్న పుస్తకం. వీరేశలింగం గారు "నేనప్పటికి దొరికిన సాధనకలాపముతో కవులకాలనిర్ణయాదులను జేయుచు నేదో యొక రీతిని గ్రంథము సాంతముచేసితిని" అని చెప్పుకున్నా, ఆ దిశగా చేసిన తొలినాళ్ళ బృహత్‌ ప్రయత్నంగా దాని విలువ ఎన్నటికీ ఉండేదే. ఆంధ్ర కవుల చరిత్ర గ్రంథం తొలి సంపుటాన్ని ప్రస్తుతం తెలుగు వికీసోర్సులో తెలుగు భాషపై ప్రేమతో స్వచ్ఛందంగా వికీపీడియన్లు డిజిటైజ్ చేసి, ప్రూఫ్‌-రీడింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర కవుల చరిత్ర రెండవ సంపుటం డిజిటైజేషన్, ప్రూఫ్ రీడింగ్, పుస్తక రూపానికి తీసుకువచ్చే పనులు దాదాపు పూర్తయ్యాయి. మొదటి మరియు మూడవ భాగాలపై కృషి సాగవలసి ఉంది. Ramesam54, Nrgullapalli, Ajaybanbi, శ్రీరామమూర్తి, Rajasekhar1961, Bhaskaranaidu, Arjunaraoc, వంటి కొందరు వికీపీడియన్లు తమ సమయాన్ని తెలుగు భాషాభివృద్ధికి ఈ విధంగా వెచ్చిస్తూ ప్రూఫ్‌ రీడింగ్ చేస్తున్నారు.

ఈ కృషిలో ఎవరైనా పాలుపంచుకోవచ్చు, ఒక్క పేజీ మొదలుకొని ఎన్ని పేజీల వరకైనా, 2 నిమిషాలు మొదలుకొని ఎంత సమయమైనా మీకు వీలైనప్పుడు వెచ్చించి తెలుగు వికీసోర్సుకూ, తద్వారా తెలుగు భాషాభివృద్ధికి చేయూతను ఇవ్వవచ్చు. అంతర్జాలం వేదికగా తెలుగు రచనలను శాశ్వతీకరించే ఈ కృషిలో మీరూ పాలుపంచుకోండి.

దయచేసి వీలైనంత త్వరగా స్పందించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:12, 25 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో సెప్టెంబరు 6, 7 తేదీల్లో వికీడేటా కార్యశాల

[మార్చు]

అందరికీ నమస్కారం,
వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్, వికీమీడియన్ అసఫ్ బార్టోవ్ భారతదేశంలో పలుచోట్ల వికీడేటా కార్యశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్టు వేదికగా ఆయన రీసోర్సు పర్సన్ వికీమీడియన్లకు సెప్టెంబరు 6, 7 తేదీల్లో వికీడేటా కార్యశాల జరుగనుంది. కార్యక్రమంలో వికీడేటా గురించి అవగాహన, దానిపై ప్రాథమిక శిక్షణ, హ్యాండ్స్-ఆన్-సెషన్ వంటివి భాగంగా ఉంటాయి. వికీడేటా మనుష్యులు కానీ, మెషీన్లు కానీ దిద్దగల, చదవగల స్వేచ్ఛా విజ్ఞాన భాండాగారం. ఈ కార్యక్రమం గురించి మీ సూచనలు, కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు ఆసక్తి వంటివి తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:23, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాధమిక శిక్షణ అవుసరం చాలా వుంది. ఈకార్యశాల వికీపీడియన్లందరికీ భాగం పంచుకొనే అవకాశం కల్పించాలి. శిక్షణకు కాదేదీ అనర్హం----Nrgullapalli (చర్చ) 06:03, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రచయితల సమాచారం కోసం

[మార్చు]

రచయితల కాపీహక్కుల సమాచారం తెలుసుకోవాలంటే వారి మరణ తేదీ తెలుసుకోవడం ఒక ముఖ్యమైన అంశం కదా. ఇప్పటివరకూ మనం తెలుగు, ఆంగ్ల వికీపడియా వంటి విజ్ఞాన భాండాగారాలను ప్రధానంగా వారి మరణ తేదీలను తెలుసుకుని కాపీహక్కుల సమాచారం తేల్చుకునేందుకు ఉపయోగిస్తున్నాం. ఐతే Worldcat.org (విశ్వనాథ సత్యనారాయణ వివరాలు చూడండి ఉదాహరణకు) ద్వారా రచయితల జనన-మరణాలు, పుస్తక ప్రచురణలు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. సముదాయ సభ్యులకు ఈ మూలం బాగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:18, 25 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రాశి కోసం వాసి కోల్పోదామా?

[మార్చు]

అచ్చు దిద్దడమంటే ఎంతో బాధ్యతాయుతమైన పని. ప్రతీ పదాన్ని చదువుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ పోవాలి. అంతా అయ్యాక మరోసారి చూసుకుని పుటస్థితిని "అచ్చుదిద్దబడినది" గా మార్చాలి. ఇదంతా చేసాక కూడా పుటస్థితిని మార్చాలంటే వెనకాడాలి - ఏమో, ఇంకా తప్పులేమైనా వదిలేసానేమోనని. అయితే కొందరు ఆ పనిని అంత బాధ్యతతో చేస్తున్నట్లు కనిపించడం లేదు. అనేకానేక తప్పులను అలాగే వదిలేసి, పుటస్థితిని "అచ్చుదిద్దబడినది" గా మార్చేసి పడేస్తున్నారు. గతంలో కూడా దీన్ని గమనించాను. ఇవ్వాళ నేను చాలా పేజీలు అలాంటివి చూసాను. ఓ ఐదారు పేజీలలో తప్పులను సవరించాను కూడా. (కూర్పుల తేడాలను పరిశీలించి చూస్తే ఎన్నేసి తప్పులను వదిలేసారో తెలుస్తుంది.) తప్పులన్నింటినీ సరిదిద్దలేకపోవచ్చు, కానీ ఒక్ఖ తప్పు కూడా సవరించకుండా అన్నిటినీ సవరించేసినట్లు పేజీ స్థితిని మార్చడమెందుకు? దాదాపు ఈ పేజీలన్నిటినీ అచ్చు దిద్దినది Nrgullapalli గారే. నిముషానికి రెండు మూడు పేజీలను సరిదిద్దుతూ వాయువేగంతో చేసేస్తున్నా రాయ నీ పనిని. ఈ దిద్దుబాట్ల హడావుడిలో నాణ్యతను కోల్పోతున్నామని మనందరం గుర్తుంచుకోవాలి. __Chaduvari (చర్చ) 12:21, 5 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నిసార్లు చెప్పినా, తెవికీ పాలసీలు వివరించినా, పేజీలు సరిదిద్దకుండానే ఆమోదించడం జరుగుతున్నది. కొందరు సభ్యులు వ్యక్తిగతంగా వారి పొరపాటును తెలియజేసినా సరిదిద్దుకోకపోవడం శోచనీయం.Rajasekhar1961 (చర్చ) 06:26, 6 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా వేల పేజీలతో తెలుగు వికీసోర్స్‌ను భారతీయ భాషల్లో ముందుంచి నడిపిస్తున్నందుకు వాడుకరులకు అభినందనలు.. ఇటీవలి రోజుల్లో జరుగుతున్నమార్పుల వలన వికీలో నాణ్యతపై అనేకానేక మందికి జవాబు చెప్పుకోవలసి రావచ్చు అనిపిస్తున్నది. వికీసోర్స్ పాఠ్యాంశం తప్పుల తడక అని ఎక్కడైనా ఎవరైనా ఉదహరిస్తే దానంత దరిద్రం మరోటుండదు. ఒక చిన్న వాఖ్య విశేషంగా వికీని దెబ్బ తీస్తుంది.....ఇక్కడ ఉన్న వాడుకరులకు చిన్న మనవి. మనం మార్పుల సంఖ్యను పెంచుకోడానికి కాదు ఇంత సేవ చేస్తున్నది. భవిష్యత్ తరాలకు సాహిత్య సంపదను అందించాలనే గొప్ప సంకల్పంతో....కనుక ....దయచేసి తొందరపడకుండా అందంగా మన పని చేద్దాం..వికీసోర్స్‌ని నాణ్యతా పరంగా, సంఖ్యా పరంగానూ పైనుంచుదాం...--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 07:14, 5 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఎరుపు పసుపు (ఆకుపచ్చ) రేడియో బటనులు

[మార్చు]

ఈ రోజు పనిచేసిన తర్వాత నేను 'అచ్సుదిద్దబడని' సముదాయమునుండి 'అచ్చు దిద్దబడినది' సముదాయమునకు మార్చుటకు చూడగా పైన పేర్కొన్న రేడియో బటనులు కనబడలేదు. కారణము తెలియజేయవలసినదిగా విజ్ఞప్తి.--Ramesam54 08:52, 8 సెప్టెంబరు 2017 (UTC)

ఈ సమస్య పరిష్కరించబడినది--Ramesam54 11:04, 9 సెప్టెంబరు 2017 (UTC)

కొత్త బీటా సౌలభ్యం వల్ల సమస్య

[మార్చు]

"Two column edit conflict" అన్న కొత్త బీటా సౌలభ్యం వచ్చింది. దీనిని తెలిసో తెలియకో (కొందరు "అన్నీ బీటా సౌలభ్యాలు వాటంతట అవే చేతనం కావాలి" అన్న ఆప్షన్ సచేతనం చేసుకున్నారు) సచేతనం చేసుకోవడం వల్ల పేజీ తెరిచి పాఠ్యం ఇటు కుడిపక్కన పీడీఎఫ్ లో చూసి టైప్ చేయబోతే కుడిపక్క పాఠ్యం భాగం కనిపించట్లేదు. ఇప్పటికీ వికీసోర్సులో నలుగురు వాడుకరులు దీన్ని సచేతనం చేసుకున్నారని చెప్తోంది బీటా సౌలభ్యాలు. కాబట్టి ఎవరైనా ఈ సమస్య ఎదుర్కొంటూంటే అభిరుచులు > బీటా సౌలభ్యాలు వెళ్ళి అక్కడ "Two column edit conflict" అన్న ఆప్షన్ అచేతనం చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి గమనించగలరు. అలానే మీకు అవసరం లేకుండా, ఆసక్తి లేకుండా తెలియక "అన్నీ బీటా సౌలభ్యాలు వాటంతట అవే చేతనం కావాలి" అన్న ఆప్షన్ సచేతనం చేసుకుని వుంటే అభిరుచులు > బీటా సౌలభ్యాలు అన్నదగ్గరకు వెళ్ళి చూడగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:44, 21 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

దారిద్ర్యము - రాయుటలో అసౌకర్యము

[మార్చు]

'దారిద్ర్యము' అని వ్రాయుటకు సరిగా ఒత్తులు వచ్చుటలేదు. గూగుల్ తెలుగులో 'ద' కు 'ర' ఒత్తు తరువాత 'య'ఒత్తు సక్రమముగా చూపినప్పటికీ, కనబడే పదము మొదట నేను చూపినట్లుగానే వచ్చుచున్నది. దీనికి సరియైన వైద్యము చేయవలసినదిగా విజ్ఞప్తి.--Ramesam54 13:50, 4 అక్టోబరు 2017 (UTC)

user:Ramesam54గారికి, మీరు సరిగానే రాసినట్లు కనబడుతున్నది. దగ్గరలోని తెలుగు గణక నిపుడుడిని సంప్రదించండి. లేక ఇతర టైపు విధానాలు అవలంబించండి.అన్నట్లు ఇటువంటి సందేహాలు, మీ సభ్య చర్చాపేజీలోనే చేర్చి {{సహాయం కావాలి}} మూస చేర్చటం మంచిది--అర్జున (చర్చ) 16:19, 5 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
user:Arjunaraoc దారిద్ర్యము అని వ్రాయుటలో ద హలంతమై ద్ మధ్యలో తమిళభాషా మర్యాద పాటిస్తున్నట్టుగా వచ్చినది. ఇదే నేను వేరే నోట్ పాడ్ లో టైపు చేస్తున్నపుడు 'ద' కు 'ర' ఒత్తు తరువాత 'య'ఒత్తు సక్రమముగా వస్తున్నవి. ఈ మార్పు వికీ లోనే చేయవలసిన అవసరమున్నది. --Ramesam54 09:41, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
user:Ramesam54గారికి,దారిద్ర్యము అనేది నేను ఇన్స్క్రిప్టు తో రాసిచూశాను. బాగానే వున్నది. --అర్జున (చర్చ) 05:29, 15 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Changes to the global ban policy

[మార్చు]
Hello. Some changes to the community global ban policy have been proposed. Your comments are welcome at m:Requests for comment/Improvement of global ban policy. Please translate this message to your language, if needed. Cordially. Matiia (Matiia) 00:34, 12 నవంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

New print to pdf feature for mobile web readers

[మార్చు]

CKoerner (WMF) (talk) 22:07, 20 నవంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ట్రైన్ ద ట్రైనర్ (టీటీటీ) 2018

[మార్చు]

అందరికీ నమస్కారం, సీఐఎస్‌-ఎ2కె నిర్వహణలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ (టీటీటీ) 2018 కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో 2018 జనవరి 26-28 తేదీల్లో జరగనుంది.

టీటీటీ అంటే ఏమిటి?

ట్రైన్‌-ద-ట్రైనర్‌ లేక టీటీటీ అన్నది రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం. ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయం సభ్యుల్లో (ఆంగ్ల వికీపీడియా సహా) నాయకత్వ నైపుణ్య అభివృద్ధి చేయడాన్ని లక్ష్యం చేసుకుని రూపకల్పన చేసినది. గతంలో టీటీటీ 2013, 2015, 2016, 2017ల్లో నిర్వహించాము.

ఎవరు చేరవచ్చు?

కార్యశాలలు, GLAM, ఎడిటథాన్‌లు, ఫోటోవాక్‌లు తదితర ఆఫ్‌-వికీ మరియు ఆన్‌లైన్‌ వికీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆసక్తి కల వాడుకరులు.
ఏ భారతీయ భాషా (ఇండిక్ లాంగ్వేజ్‌) వికీమీడియా ప్రాజెక్టులోనైనా కృషిచేస్తున్న చురుకైన వికీపీడియన్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
దరఖాస్తు చేసుకునే వాడుకరికి 2017 నవంబరు 1 నాటికి 500కు పైగా గ్లోబల్ ఎడిట్లు ఉండాలి.
గతంలో ట్రైన్‌-ద-ట్రైనర్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

సముదాయం నుంచి అర్హత కలిగిన వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించమని, అర్హులైన వికీపీడియన్లు పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నాం. ఇతర వివరాల కొరకు దయచేసి మెటా-వికీలో ఈ పేజీని చూడగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:28, 1 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కందుకూరి వీరేశలింగం పంతులు పుస్తకాల గురించి.

[మార్చు]

ఇవాళనే నేను వేటపాలెం సారస్వత నికేతనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ పాత పుస్తకాల కాపీ హక్కులు ముగిసి జాతీయమైన పుస్తకాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం కృత గ్రంథముల ప్రాజెక్టు లో పుస్తకాలు నెలకొకటో అరో చేస్తున్నాను. అది పూర్తి చేసే అవకాశం దొరికింది ఈ గ్రంథాలయం వలన. దాదాపుగా అన్ని వీరేశలింగం కృత గ్రంథాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. గత నెలలోనే మనసు ఫౌండేషన్ వారి సహకారం వలన అరిపరాల నారాయణరావు గారి సొంత పుస్తకాల నుండి ఒక యాభై పుస్తకాలు అందాయి. ఇక ఈ ప్రాజెక్టు వేగం పుంజుకునే అవకాశం కలిగినందున నాకు చాలా సంతోషంగా ఉంది. ఓసీఆర్ చేసేసి పెట్టి, సమయం దొరికినప్పుడల్లా పని చేస్తాను. ఇతరులూ సహకరించ ప్రార్థన. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:50, 2 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అందబాటుననుసరించి పుస్తకాలను జాబితాపరిచాను. https://docs.google.com/spreadsheets/d/1BGy2YdzpJL_x3UPALDrOTYcTAoM2M33Tu_lgCIAg8Fc/edit#gid=2039791921 వద్ద చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:39, 4 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ.సి.ఆర్. చేసి పెడితే పని సులభంగా చేయవచ్చును. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:40, 6 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కందుకూరి వీరేశలింగం రచనల్లో కొన్నిటి అందజేత

[మార్చు]

అందరికీ నమస్కారం,
సముదాయ సభ్యులు రహ్మానుద్దీన్ కందుకూరి వీరేశలింగం కృతుల్లో దేశీయ మహాసభ దాని యుద్దేశములు, కొక్కొండ వేంకటరత్నము కృత గ్రంథ విమర్శనము సహా కొన్ని వ్యాసాల, చిరుపొత్తాల సంకలనాలు రెండు (7, 8వ సంపుటాలు) హితకారిణీ సమాజం, రాజమండ్రి వారు నిడుదవోలు వేంకటరావు గారి పీఠికతో 1951 ప్రాంతాల్లో ముద్రించిన పుస్తకాలు జేపీజీల రూపంలో అందజేశారు. వీటిలో చిరపొత్తాలను విడివిడిగా పీడీఎఫ్ లుగా రూపొందించి వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించవచ్చని కూడా సూచించారు. ఈ పనిని నేను ప్రస్తుతం చేస్తున్నాను, అతి త్వరలోనే ఇవి సముదాయానికి వికీమీడియా కామన్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. సముదాయ సభ్యులు వాటిని పరిశీలించి, పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు రహ్మానుద్దీన్ చేసిన కృషికి వారికి అభినందనలు, ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:30, 31 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పురోగతి

[మార్చు]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) మరియు వాడుకరి:రహ్మానుద్దీన్ ల కృషికి ధన్యవాదాలు. అతి బాల్యవివాహం పరిశీలించితే స్కాన్ నాణ్యత Google OCR చేయడానికి తగిన స్థాయిలో లేదనిపిస్తుంది. ఇంతకు ముందు మెరుగైన స్కాన్ గల వాటికి కూడా OCR దోషాలు ఎక్కువగానున్నందున, మానవీయంగా పాఠ్యం చేర్చడం మంచిదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 00:21, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]