వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 9
← పాత చర్చ 8 | పాత చర్చ 9 | పాత చర్చ 10 →
సూచిక పేజీ నిర్వహణ
[మార్చు]సూచిక పేజీ రూపంలో సమస్యని సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని రోజులు సూచికపేజీలో లోపాలు వుండవచ్చు. సహకారం కోరడమైనది.--అర్జున (చర్చ) 06:21, 27 ఫిబ్రవరి 2018 (UTC)
- అర్జునరావు గారు, ధన్యవాదాలు. ఇలాంటి సమస్యలను మీరు మాత్రమే సరిచేయగలరు.--Rajasekhar1961 (చర్చ) 06:29, 27 ఫిబ్రవరి 2018 (UTC)
- Rajasekhar1961 గారికి మరియు సహసభ్యులకు, సూచిక పేజీ రూపం సమస్య పరిష్కరించాను వికీసోర్స్ నిరంతరాయంగా కొనసాగటానికి, తోటి సాంకేతిక నైపుణ్య సభ్యులు కూడా ఇటువంటి సమస్యలను పరిష్కరించటానికి ముందుకు రావాలని కోరిక. ఇటీవలి సమస్య మీడియా వికీ ఉపకరణ తాజా కరణలవలన వచ్చింది. కొంత విశ్లేషించినతరువాత, ఆంగ్ల వికీలో en::Mediawiki:Proofreadpage index template రూపుదిద్దే కోడ్ ని తెలుగు వికీలో {{Proofreadpage index}} లో స్వల్ప మార్పులతో ప్రవేశపెట్టాను. దీనిని పరిశీలించడానికి ఒక మాదిరి పుస్తకం సూచిక పేజీ వాడాను. దీని అంతర్వర్తి (UI)కి సంబందించిన కొన్ని పదాలు అనువాదం చేయకపోవడంతో ఆంగ్లంలో కనబడుతున్నాయి. వాటిని ట్రాన్స్లేటే వికీలో అనువాదం చేశాను.కొద్ది రోజులలో తెలుగు పదాలు కనబడతాయి. ఇంకేదైనా సమస్యలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 06:57, 1 మార్చి 2018 (UTC)
- అర్జునరావు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు బాగున్నది. --Rajasekhar1961 (చర్చ) 11:38, 1 మార్చి 2018 (UTC)
సూచిక విషయసూచిక పేజీ రూపంలో ఫైర్ఫాక్స్ లో సమస్య
[మార్చు]ఫైర్ఫాక్స్ 58.0.2 (64bit) ఉబుంటు 16.04 (64bit) లో సూచిక విషయసూచిక పేజీలో అధ్యాయం మొదటి వరుస దాటి పొడిగివున్నప్పుడు. మొదటి కొన్ని పదాలకు వత్తులు కనబడడంలేదు. హైపర్ లింక్ ని సూచించే గీత కూడా విరిగి కనబడతున్నది. క్రోమ్ (Version 64.0.3282.167 (Official Build) (64-bit)) లో ఈ సమస్య కనబడలేదు.--అర్జున (చర్చ) 04:13, 14 మార్చి 2018 (UTC)
- ఈ దోషాన్ని మనం సరిచేయగలమా?--Rajasekhar1961 (చర్చ) 05:05, 14 మార్చి 2018 (UTC)
- మరింత విశ్లేషించిన తరువాత, అప్రమేయ ఫాంట్ 13 లో వుంటే సరిగానే చూపిస్తున్నది. ప్రస్తుతానికి పెద్ద సమస్య కాదు కావున వదిలివేయడమైనది.--అర్జున (చర్చ) 05:25, 14 మార్చి 2018 (UTC)
అధిక వీక్షణల వివరము, విశ్లేషణ
[మార్చు]వికీసోర్స్:అధిక వీక్షణల పుస్తకాలు/201803raw మరియు వికీసోర్స్:అధిక వీక్షణల పుస్తకాలు/201803 గమనించి, వికీసోర్స్ లో అధిక వీక్షణలు గల పేజీల/పుస్తకాల నాణ్యతను పెంచడానికి, లేక విస్తరించడానికి కృషి చేయవచ్చు. --అర్జున (చర్చ) 10:46, 4 ఏప్రిల్ 2018 (UTC)
- A grammar of the Telugu language, సమాచార హక్కు చట్టం, 2005 పుస్తకాలు వీక్షణలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో వున్నాయి.--అర్జున (చర్చ) 10:55, 4 ఏప్రిల్ 2018 (UTC)
మొబైల్ తీరులో బొమ్మ సరిగా లేనిది | డెస్క్టాప్ తీరు లో సరిగా వున్నది |
---|---|
90 శాతం పై చిలుకు వీక్షణలు చాలావరకు మొబైల్ వాడుకదారులనుండి వస్తున్నాయి. (సమాచార హక్కు చట్టం, 2005 గణాంకాలు ఆధారంగా). సవరణ పెట్టెలో బొమ్మలు చేర్చు పరికరము వాడటం బదులు స్క్రీన్ షాట్ రూపంలో లేక వేరుగా స్కాన్ చేసి ఎక్కించటం కాని చేస్తే మంచిది.--అర్జున (చర్చ) 00:15, 5 ఏప్రిల్ 2018 (UTC)
- పై సమస్య పై చేర్చిన బగ్ https://phabricator.wikimedia.org/T191674 పరిష్కరింపబడింది.--అర్జున (చర్చ) 00:16, 14 ఏప్రిల్ 2018 (UTC)
- చాలా ఉపయోగకరమైన జాబితాలు చేసినందుకు అర్జున గారికి ధన్యవాదాలు.
- ఎక్కువ వీక్షణలున్నవాటి నాణ్యత పెంపు: అధిక వీక్షణలోని పుస్తకాలను నాణ్యతాపరంగా మెరుగుచేయడం, కాపీహక్కుల సమస్యలు తీర్చడం ఒక అంశం. దీన్ని ఇప్పటికే అర్జున గారు సూచించివున్నారు. ఆ మేరకు ప్రాధాన్యతగా స్వీకరించి ఈ నెల, వచ్చే నెల నా పనుల జాబితాలో చేర్చాను. ఆ క్రమంలో కృషిచేయనున్నాను.
- ఆసక్తిదాయకమైన పుస్తకాల ప్రచారం: ఆసక్తిదాయకమైన పుస్తకాలు, ప్రయోజనకరమైన పుస్తకాలు తెలుగు వికీసోర్సులో ఉన్నాయి, వాటిలో అనేకం పాఠకాదరణకు నోచుకోకపోవడానికి "ఇదిగో ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఒకసారి వికీసోర్సులో చదివి చూడండి" అన్న ధోరణిలో ప్రచారం ఇప్పటివరకూ చేయకపోవడమే కారణం అని భావిస్తున్నాను. కథలు గాథలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నా కలం నా గళం, చిన్ననాటి ముచ్చట్లు వంటి ఆసక్తికరమైన పుస్తకాలు ఉన్నాయి మనకు. ఇటువంటి పుస్తకాలను మొదటిపేజీ ప్రదర్శన మొదలుకొని పుస్తకం.నెట్, సంచిక, భూమిక వంటి అంతర్జాల పత్రికల వరకూ పలుతావుల్లో ప్రాచుర్యం చెందేలా ప్రచారం చేయడం చేయడం పాఠకాదరణకు ప్రయోజనకరమని భావిస్తున్నాను.
- దీనిపై అర్జున గారూ, ఇతర సహసభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:40, 5 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జునరావు గారికి, ఈ జాబితాలు చాలా ప్రయోజనకరమైనవి. వీటి ఆధారంగా మన ప్రణాలికను రూపుదిద్దుకోవచ్చును. అయితే కొన్నింటికి కాపీహక్కుల సమస్యలు ఉన్నాయి. పవన్ లాంటివారు సహాయం చేస్తే; ప్రసార మాధ్యమాల ద్వారా వీటిని ముందుకు తీసుకొని పోవచ్చును. నేను ప్రస్తుతం క్రొత్త పుస్తకాలను చేర్చకుండా ఇప్పటికే ఉన్న పుస్తకాలను పూర్తిచేయడంపై దృష్టిసారిస్తాను. మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:42, 5 ఏప్రిల్ 2018 (UTC)
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు సూచించిన రెండవ అంశం కంటె వికీపీడియాలో వికీసోర్స్ పుస్తకాలను వనరులగా వాడి అభివృద్ధి చేయడం ద్వారా, వికీసోర్స్ అభివృద్ధికి మరింత తోడ్పాటుగా వుంటుంది. అలాగే సాంకేతికంగా బొమ్మ ఎక్కింపు ఉపకరణాన్ని అభివృద్ధి చేయటం కూడా చాలా ఉపయోగకరం.--అర్జున (చర్చ) 05:15, 5 ఏప్రిల్ 2018 (UTC)
- Rajasekhar1961 గారికి, మీ ఆలోచన మెచ్చుకోదగినది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్న సూత్రం మన వికీసోర్స్ కి కూడా అనుసరణీయమే.--అర్జున (చర్చ) 05:15, 5 ఏప్రిల్ 2018 (UTC)
- :: ఎక్కువ వీక్షణలున్నవాటి నాణ్యత పెంపు విషయంలో ప్రాతిపదిక ఏర్పాటుచేసి, తగిన మార్గనిర్దేశం చేస్తున్నందుకు అర్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యత, కాపీహక్కుల పరమైన అంశాల్లో కొన్నిటిని పరిష్కరించేందుకు ఈ నెల నా పనిలో చేర్చాను. అర్జున గారు సూచించినట్టు వికీపీడియాలో వ్యాసాలను వికీసోర్సు పుస్తకాలు వాడి అభివృద్ధి చేస్తూ, వాటిని రిఫరెన్సు లింకులుగా ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎడిటథాన్ చేసే ప్రతిపాదన చేయవచ్చును, తద్వారా వికీసోర్సుకు సెర్చి ఫలితాల్లో మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. ఐతే కార్యకలాపాల్లో మార్పులు ఉన్నా ఆసక్తిదాయకమైన పుస్తకాల ప్రచారం అవసరమన్న లక్ష్యం పట్ల మనిద్దరికీ ఏకాభిప్రాయం ఉన్నట్టు గ్రహించాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:58, 5 ఏప్రిల్ 2018 (UTC)
- పుస్తకాలుగా కూర్చని (ఉపపేజీలు చేయని వాటిని) పరిశీలించితే కేవలం అన్నమయ్య పాటలు విషయసూచిక పేజీలు 2496 వీక్షణలతో మొదటి స్థానంలో వున్నాయి. దీనికి మూల కృతి దొరికితే పుస్తకంగా మలచటం మంచిది.--అర్జున (చర్చ) 10:03, 7 ఏప్రిల్ 2018 (UTC)
పద్యాల శైలికి మూసలు
[మార్చు]పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/55 లో చూపినట్లు, {{Left margin}} మరియు {{overfloat left}} ను తో వాడడం ద్వారా తెలుగు కంద, సీస, చంపకమాల లాంటి పద్యాలను చక్కగా కూర్చవచ్చు.--అర్జున (చర్చ) 23:32, 5 ఏప్రిల్ 2018 (UTC)
సమకాలీన ప్రజాదరణ పొందిన రచనలు వికీసోర్స్ లో
[మార్చు]సత్యకమ్ వెబ్సైటులో లో చూపినట్లు సమకాలీన రచయితలు, వారి పుస్తకాలు నెట్లో చదువుకొనేందుకు అనుమతిస్తున్నారు. వికీసోర్స్ తరపున ప్రయత్నం చేస్తే వికీసోర్స్ లో విడుదలం చేసేందుకు. డిజిటల్ ఫాంటు రూపంలో వున్న వి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది. పవన్ సంతోష్ (CIS-A2K)ప్రయత్నించితే బాగుంటుంది. అన్నట్లు, ఈ సైట్లో మన వికీసోర్స్ డిజిటల్ రచనలను పిడిఎఫ్ లను చదువుకోడానికి వాడే పిడిఎఫ్ ఉపకరణంతో ప్రదర్శిస్తున్నారు (సుప్రసిద్ధుల జీవిత విశేషాలు)--అర్జున (చర్చ) 05:18, 10 ఏప్రిల్ 2018 (UTC)
చేర్చవలసిన పుస్తకాలు
[మార్చు]వికీసోర్స్:చేర్చవలసిన పుస్తకాలు లో మీకు ఆసక్తివున్న పుస్తకాలు ఆర్కీవ్.ఆర్గ్ లింకు తో చేర్చండి.--అర్జున (చర్చ) 05:22, 13 ఏప్రిల్ 2018 (UTC)
టైపించడంలో మన విధానం - మూలంలోని తప్పులను సవరించాలా లేక అలాగే ఉంచెయ్యాలా?
[మార్చు]గతం లో జరిగిన చర్చకి సలహా {{SIC}} పుట పేజీలలో {{SIC|<మూలంలోని తప్పు పదజాలం>|<సరిచేసిన పదజాలం>}} వాడితే మూలం ఎలా వుందో అలా మరియు కర్సర్ ఆ పదం పై వుంచినపుడు సరిచేసిన పదజాలం కనబడుతుంది. ఉదాహరణ పుటపేజీ రెండవ పేరాలో వీధులు అనే పదం--అర్జున (చర్చ) 00:02, 14 ఏప్రిల్ 2018 (UTC)
పుస్తకాలు దింపుకొనడంలో సమస్య, పరిష్కారం
[మార్చు]పుస్తకాలు దింపుకొనడంలో epub రూపం పనిచేస్తుండగా, pdf రూపం ప్రయత్నించితే "502 Bad gateway" అనే దోషం వస్తున్నది. https://github.com/wsexport/tool/issues/145 బగ్ నివేదించబడింది. లింకు కెళ్లి దానిలో వివరాలు నింపి pdf రూపం దించుకొనుటకు ప్రయత్నించవచ్చు ప్రస్తుతానికి epub రూపం మాత్రమే చేతనం చేయబడినది.--అర్జున (చర్చ) 03:03, 14 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జునరావు గారు, ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 03:18, 14 ఏప్రిల్ 2018 (UTC)
కొత్త మీడియావికీ రూపాంతరము
[మార్చు]మీడియా వికీ 1.31.0.wmf.29 12 ఏప్రిల్ 2018న అమలులోకి వచ్చింది (https://phabricator.wikimedia.org/T164753). ఎడిటర్ లో ఆదేశ బొమ్మలు కొత్త విజువల్ ఎడిటర్ వి సాధారణ వికీఎడిట్ కు కూడా వాడారు. సభ్యులు గమనించాలి. కొత్త పుటపేజీలు సృష్టించేటప్పుడు, కొన్ని సార్లు స్కాన్ బొమ్మ ప్రదర్శించబడుటలేదు లేక చాలా చిన్నదిగా కనబడుతున్నది. తాత్కాలిక పరిష్కారంగా పేజీని తాజా చేస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 05:02, 14 ఏప్రిల్ 2018 (UTC)
ప్రత్యేక అక్షరాలు
[మార్చు]సాధారణంగా కాలన్, సింగిల్ పైప్, డబల్ పైప్ అక్షరాలను వాడుతున్న మనం సరియైన తెలుగు ః । ॥ అక్షరాలను ఎడిట్ పెట్టె క్రింద వరసనుండి ఎంచుకొని పాఠ్యంలో ప్రవేశపెట్టవచ్చు.--అర్జున (చర్చ) 05:18, 14 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జునరావు గారికి తెలియజేసినందులకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:31, 17 ఏప్రిల్ 2018 (UTC)
నాణ్యత విషయంలో..
[మార్చు]నాణ్యత విషయంలో గతంలో చర్చలు చాలానే జరిగాయి. కానీ ఫలితం పెద్దగా ఉన్నట్టు లేదు. అక్కడా ఇక్కడా ఒకటో అరో తప్పులు ఉండడం వేరు, ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా ఉండడం వేరు. కింది పేజీలు చూడండి..
ఇవి "అచ్చుదిద్దబడిన" పేజీలు. కనీస మాత్రపు పరిశీలనక్కూడా ఇవి నోచుకోలేదని కనబడుతోంది. నిర్వాహకులు ఈ విషయంపై దృష్టి సారించాలని వినతి.__Chaduvari (చర్చ) 05:22, 16 ఏప్రిల్ 2018 (UTC)
- వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Rajasekhar1961 - సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.__Chaduvari (చర్చ) 01:54, 17 ఏప్రిల్ 2018 (UTC)
- ఈ విషయం గురించి మీరు తెలియజేసినట్లుగా ఇదివరకే చర్చించాము. మీరు తెలియజేసినట్లుగా అచ్చుదిద్దిన లేదా ఆమోదించిన వ్యక్తులకు వారి తప్పులను తెలియజేశాము. కానీ వారిలో మార్పులేదు. తరువాత చర్యలను సూచించండి. --Rajasekhar1961 (చర్చ) 04:30, 17 ఏప్రిల్ 2018 (UTC)
- User:Nrgullapalliగారు తమ స్పందన తెలియచేస్తే బాగుంటుంది. దోషాలు వెదికి సరిదిద్దటానికి, కొంత జాగ్రత్తగా చూసే చూపు కావాలి.చదివేటప్పుడే తప్పుని కనుగొనగలగాలి. అది అలవాటు చేసుకొంటే మంచిది. లేకపోతే వికీలో ఇతర పనులు చాలా వున్నాయి. ఉదాహరణకు పుస్తకాలకు అధ్యాయాలు కూర్పడం లాంటివి. వాటిని చేపట్టవచ్చు.--అర్జున (చర్చ) 07:12, 18 ఏప్రిల్ 2018 (UTC)
unable to type in Telugu in Source. unable to locate lipyamtareekarana.Can any member will help.Nrgullapalli (చర్చ) 13:24, 30 ఏప్రిల్ 2018 (UTC)
- Surely, tell me when you are free.--Rajasekhar1961 (చర్చ) 18:05, 30 ఏప్రిల్ 2018 (UTC)
పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి
[మార్చు]పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు ప్రదర్శిత గ్రంథం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి ప్రచురితమైంది. తెలుగువారి వెయ్యేళ్ళ జీవనచిత్రం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర (వికీసోర్సు ప్రదర్శిత గ్రంథాలు) అన్న శీర్షికతో ఈ వ్యాసం ప్రచురించారు. పైన జరిగిన చర్చల్లో భాగంగా పలు వేదికల ద్వారా వికీపీసోర్సును ప్రాచుర్యంలోకి తీసుకురావడం బావుంటుందని ఆశించాం, అందులో భాగమే ఈ ప్రయత్నం. ఐతే ఈ ప్రయత్నం ఇటువంటి మరిన్ని ప్రయత్నాలకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో చేసింది. అంటే మరికొందరు వికీసోర్సు వాడుకరులు ఇలా రాస్తే నేను వీలున్నంతవరకూ సహకరింస్తాను.
పుస్తకం.నెట్ 2009లో ప్రారంభమై నేటికీ అంతర్జాలంలో పుస్తకప్రియులకు, పాఠకులకు ప్రియమైన వేదికగా కొనసాగుతున్న ఇ-మ్యాగజైన్. పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో చోటు చేసుకుంటాయి. వికీసోర్సును పుస్తకప్రియులకు చేరువచేయడానికి మంచి వేదిక.
ఈ వ్యాసాన్ని ఒక నమూనాగా పనికివచ్చేలా మలచడం జరిగింది. మొదట కొంత భాగం ఆ పుస్తకంలో పాఠకులకు ఆసక్తి కలిగే వాక్యాలను ఏర్చికూర్చాను (ఇది పుస్తకాన్ని బట్టి చేయాలి), తర్వాత భాగం నేరుగా వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పరిచయం పాఠ్యాన్ని అతికొద్ది మార్పులు చేసి ప్రచురించాను. పుస్తకానికి వికీసోర్సు లంకె ఇచ్చాను. పుస్తకం గురించి మరో వ్యాసం విడిగా వ్రాయగలిగినా ఇలా ఒక నమూనా తయారుచేస్తే ఆసక్తి ఉన్న వికీపీడియన్లు ఎవరైనా అనుసరించడానికి వీలుగా ఉంటుందని చేశాను. ప్రదర్శిత గ్రంథాల గురించే కాదు మరి ఏ వికీసోర్సు పుస్తకం గురించైనా ఇలా రాయవచ్చు. పుస్తకంలో ఆసక్తికరమైన ఒక భాగాన్ని నేరుగా ప్రచురించనూ వచ్చు, తద్వారా పాఠకుల ఆసక్తిని మనవైపుకు లాగవచ్చు. ఉదాహరణకు సహస్ర దళ పద్మం - హైదరాబాద్ అంటూ సలాం హైదరాబాద్ నవలలోని కొంతభాగాన్ని చాన్నాళ్ళ క్రితం పుస్తకంలోనే రచయిత అనుమతితో నేను ప్రచురించడాన్ని గమనించండి. వికీసోర్సులోని పుస్తకాలకు ఆ విధమైన ముందస్తు అనుమతి కూడా అక్కరలేదు కాబట్టి ఇంకా తేలికవుతుంది.
వికీసోర్సులోని పుస్తకాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా రాస్తానంటే వీలైనంత సాయం చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. పుస్తకం.నెట్‌కు రాయడానికి ఇక్కడ చూడొచ్చు. నేను మీ ప్రయత్నంలో సహకరించాలనుకుంటే చర్చ పేజీలో కానీ, pavansanthosh.s@gmail.comకి మెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:03, 17 ఏప్రిల్ 2018 (UTC)
- చాలా బాగున్నది. నేను ప్రయత్నిస్తాను. ఈ విధమైన ప్రచారం తెలుగు వికీసోర్సుకు చాలా అవసరం. మంచి పుస్తకాలు మనవద్ద ఉన్నాయి అని చాలా మందికి తెలుస్తుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:32, 17 ఏప్రిల్ 2018 (UTC)