పుట:2015.393685.Umar-Kayyam.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఉమర్ అలీషా కవిగారి

జీవిత సంగ్రహము

ఉమర్ అలీషా మహాకవిగారు పీఠికాపురమున క్రీ. శ.1885 వ సం||లో జన్మించిరి. వీరితండ్రిగారు మహర్షి మొహియద్ధీన్ బాషా గురువర్యులు. వీరి జనని చాన్బియాంబ.

వీరి తండ్రిగారు అరబ్బీ, పారశీక, సంస్కృతాంధ్ర పండితులు. ఆధ్యాత్మిక విద్యాపీఠాచార్యులు, ఆత్మవిద్యాపారంగదులు. వీరి కుటుంబము పూర్వమునుండియు భాషాపాండిత్యమునకు, అధ్యాత్మిక విద్యా సంపత్తికిని ప్రఖ్యాతిగాంచినది. శ్రీకవిగారు చిన్ననాడే సంస్కృతాంధ్రములు విశేషముగా నభ్యసించిరి. తదుపరి అరబ్బీ పారశీకాంగ్ల భాషలు నేర్చిరి. వీరు ఆంగ్ల మున వ్రాయుట, మాట్లాడుట యెఱుఁగుదురు; కాని ఆంగ్ల పద్య కావ్యములందు ఎంతమాత్రము వీరికి ప్రవేశము లేదు. వీరు సహజకవులు. వీరి 14వ వర్షమున తెనుగున ధారళముగా కవిత్వముఁ జెప్పిరి వీరి 18వ యేట "మణిమాల" యను నాటకము వ్రాసి అచ్చొత్తించిరి. అది షేక్సిపియర్ మహాకవి నాటకమువలె నున్నదని అప్పటి పత్రికలు కొనియాడినవి. వీరి కనేకచోట్ల ఉద్యోగములిచ్చెదమని ఆహ్వానించినను వాని కంగీకరింపక భాషాసేవ దేశసేవఁజేయుచు తమ జీవితమును గడిపిరి. వీరు 1934వ సంవత్సరము డిశంబరు నెలలో అఖిల బారత శాసనసభకు సభ్యులైరి. ఆ పదవి వీరి మరణము వరకు నుండెను.

వీరికి International Academi of America వారు 1936 సం||న Doctor of Literature బిరుదు మొఁసగిరి శ్రీకవిగారు వంశపారంపర్యముగా వచ్చుచున్న అధ్యాత్మిక విద్యాపీఠమునకు ఆచార్యులై పదహారు వేల జనమును శిష్యులుగా నొనర్చిరి.

వీరి యౌగికజ్ఞానమును కొనియాడుచు జ్ఞానసభాసభ్యులు వీరికి బ్రహ్మర్షి బిరుదు మొసంగిరి. వీరిసతీమణి అగ్బరు బీబీగారు వీరితో డిల్లీ నగరమువెళ్ళి తే. 5-4-35 న దివి నలంకరించిరి. ఆ దినమున ఢిల్లీ శాసన