పుట:2015.393685.Umar-Kayyam.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభ మూయబడెను. వీరు గతించినప్పుడు వీరికి అయిదుగురు కుమార్లు యిరువురు కుమార్తెలు పెక్కురు పౌత్రపౌత్రికలుండిరి.

శ్రీ కవిగారి జీవిత చరిత్ర ప్రత్యేక పుస్తకముగా వ్రాయబడుచున్నది. వీరు రచించిన సూఫీ వేదాంతగ్రంథమందు వీరి జీవితము సంగ్రహముగా నిట్లు వ్రాసిరి.

స్వీయము

క. ఆ మొహయద్దీన్ బాద్షా
    నామ మహాయోగి కగ్రనందనుఁడను నా
    నా మహితాగమ హితవి
    ద్యామత "ఉమ్రాలిషా" మహాకవి నేనున్.

సీ. రచియించినాఁడ విభ్రాజితదివ్యప్ర
            బంధముల్ పది కావ్య బంధములుగ
    వ్రాసిననాఁడను కల్పనాసక్త మతిపది
            నాటకంబులను కర్నాటపఫక్కి
    కూర్చినాఁడను కళాకోవిదుల్ కొనియాడ
          నవలలుపది నవ నవల లనఁగ
    తెలిగించినాఁడ నుద్దీపితాఖండ పా
           రసి కావ్యములు పది రసికులలర

తే. రసము పెంపార నవధానక్రమములందు
    ఆశులవులయందు పాటలయందు కవిత
    చెప్పినాఁడ నుపన్యాస సీమలెక్కి
    యవని "ఉమ్రాలిషాకవి" యనఁగ నెను.

ఉ. రాజుఁల జూచితిన్ సుకవిరాజుల నోర్చితిఁ బేరుమ్రోయ రా
    రాజులఁ నోలగంబుల విరాజితపంటిత సత్కవీంద్ర వి
    భ్రాజిత మౌలవిబిరుద పట్టములందితి యూనివర్సిటిన్
    దేజముమీఱ నభ్యుడయితిన్ మతబోధకుఁడైతిఁ గ్రమ్మఱన్.