రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కందుకూరి వీరేశలింగం పంతులు
(1848–1919)
చూడండి: వికీపీడియా వ్యాసం.
కందుకూరి వీరేశలింగం పంతులు

కందుకూరి రచనల జాబితా[మార్చు]

పద్య కావ్యాలు[మార్చు]

నాటకాలు[మార్చు]

  • చమత్కార రత్నావళి - "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్స్‌పియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్ధులచే ప్రదర్శింపజేశాడు.
  • కాళిదాసు శాకుంతలం - తెలుగులో
  • రత్నావళి - సంస్కృత రూపకానువాదం
  • దక్షిణ గోగ్రహణం
  • సత్య హరిశ్చంద్ర
  • మాళవికాగ్ని మిత్రం వంటి 12 నాటకాలు

నవలలు[మార్చు]

  • రాజశేఖర చరిత్రము - తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.
  • సత్యరాజా పూర్వదేశ యాత్రలు - ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.
  • సత్యవతీ చరిత్రము (1883) - స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.
  • చంద్రమతీ చరిత్రము (1884) - మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

ప్రహసనాలు[మార్చు]

సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. "ప్రహసనము ఆయన కరములకు ఉచితపరికరమయ్యెను. శైలి సొంపులతోను, హాస్యంపుదళులతోను శోభిల్లెడి ఈ ప్రహసనావళియందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్ర చికిత్సకునివలె ఈ రచయిత సాంఘిక అనర్ధములను దునుమాడెను" అని "రాయసం వెంకట శివుడు" ప్రశంసించాడు. సుమారు 50 కి పైగా వ్రాసిన ప్రహసనాలలో 10 వరకు ఆంగ్లమూలాలపై ఆధారపడినాయి. తక్కినవి స్వతంత్ర రచనలు. ప్రహసనాలు "హాస్య సంజీవని" పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి. కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు

  • పెళ్లి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్ళి, లోకోత్తర వివాహము - వేశ్యాభిమానం, చాదస్తపుటాచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం వంటి అంశాలు కలగలిపినవి.
  • జమా బందీ, యోగాభ్యాసము - కులాచారాన్ని నిరసిస్తూ
  • వేశ్యా విషయ సంవాదము
  • చంద్ర గ్రహణం
  • తేలు మందు
  • హిందూ మతసభ
  • బహుభార్యాత్వం
  • బాల భార్యా వృద్ధ భర్తృ సంవాదం
  • మ్యునిసిపల్ నాటకము
  • కామరూప ప్రహసనము
  • కలిపురుష శనైశ్చర విలాసము - కలి, శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా, మూఢులుగా, మధ్యపాన ప్రియులుగా చేస్తున్నారని
  • వేశ్యాప్రియ ప్రహసనం - 5 అంకాల ప్రహసనం, ఎంతో హాస్యం మిళితమైనది. ఆనాటి భోగం ఆచారాలను గురించి
  • అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం
  • విచిత్ర వివాహ ప్రహసనం

కథలు[మార్చు]

అధికంగా కందుకూరి కథలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించాడు. "నీతి కథా మంజరి" అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

వ్యాసాలు[మార్చు]

వివిధ అంశాలపై వీరేశలింగం 190 దాకా వ్యాసాలు / ఉపన్యాసాలు వ్రాశాడు. సత్య వాదిని, వివేక వర్ధిని, సతీహితబోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా నంటి పత్రికలలో ఇవి ప్రచురితమైనాయి. ఉదాహరణకు కొన్ని వ్యాసాల శీర్షికలు

  • దేశీయ మహాసభ - దాని యుద్దేశ్యములు
  • రాజ్యాంగ సంస్కరణము - కులాచార సంస్కరణము
  • ఇంగ్లీషు ప్రభుత్వము వలన లాభములు
  • నీతి, విద్య కంటె నీతి ముఖ్యము, మానుష ధర్మము, ఈశ్వరోపాసనము
  • చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు
  • అత్తగారి కోడంటికము, భార్యా భర్తల ఐకమత్యము, స్త్రీపునర్వివాహ శాస్త్ర సంగ్రహము, స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసము

చరిత్రలు[మార్చు]

  • ఆంధ్ర కవుల చరిత్రము - ఈ గ్రంథ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంథాలను పరిశీలించి వెలువరించిన గ్రంథము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది.
  • దేశ చరిత్ర
  • నాయకుల చరిత్ర
  • ఉత్తమ స్త్రీల జీవిత చరిత్రలు

ఇతర రచనలు[మార్చు]