రాజశేఖర చరిత్రము

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శ్రీ

వివేకచంద్రిక

అను

రాజశేఖరచరిత్రము


మొదటి ప్రకరణము.

ధవళగిరి - దేవాలయవర్ణనము - గోదావరి యొడ్డున నున్న ధర్మశాల

మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట -

అప్పు డచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు -

అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.

శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికాకంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వరపురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆపిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళనువిడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి నిదర్భాదిదేశములగుండబ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చి పుచ్చుకొననివారికేబ్రాకారము స్నానపానంబులకు వలయునంత నిర్మలజలం బో స్తంభమొకటి యున్నది.మందిఱి నానం ద మొందింఱుగంటలు గాలికి గదులుచు సదా శ్రావ్యలకును ఫలవృక్షములకుదనుపు చుండును.ఆస్తంభమునకును మొదట 2 రాజశేఖర చరిత్రము

చుచు తన చల్లదనము వ్యాపించినంతవఱకు నిరుపార్శ్వములందు భూమినం తను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూరమునుండి బయలుదేఱి యడవిపండ్లును నెమలికన్నులు వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దనగంభీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్దనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపములయిన రెండుచేతులనుజాచి సరసతమీఱ నాథునింగలియు భాగ్యము గాంచెనో యాధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవరపుర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి యుండెను.


ఆపర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లనిపిండిరాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్రముండును; ఆరాళ్ళనుబట్టియే దానికి ధవళగిరియను నామము కలిగియుండును.దక్షినవైపున ఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆసోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవస్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయుచుండును. ఆసోపానముల వెంబడి బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టబడిన సుందరమైన చిన్నదేవాలయమొక్కటి కానఁబడును. దానిచుట్టును.............. .............................వెత్తెడు ప్రాకారము మూఁడుప్రక్కలను బలిసి.................. ................................................బదులుగా పర్వతశృం............... ...............................................శయింప వానిని మించి

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్నగుహ కలదు. అందులోఁ గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపునస్కారములులేక బూజుపట్టియున్న యాదేవర నుత్సవదినములలొ నర్చకుండొకడు పైకిఁ పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం తలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణ దినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథము యొక్కపగ్గములు నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్నదేవరయెడంగల విశ్వాసముచేత పూజారులు మఱుచటిసంవత్సర మాత్రాళ్ళపని మఱలవచ్చువఱకును ఆగుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈ ప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయు దేవతాసందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులుమాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెదట నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహతంత్రమునంతయు మహావైభవముతో నడిపింతురు.

ప్రతి మాసమును, రెండు పక్షములయందును ముఖమంటపము మీద ఏకాదశి నాడు రాత్రి హరిభజనము జరుగుచుండును. హరిభక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వపుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని కరతాళములును మృదంగములును మ్రోగుచుండగా దంబురలు మీటులు, బిగ్గఱగా దమ యావచ్ఛక్తిని "నవనీతచోరా", "గోపికాజారా", "రాధికాలోలా", "గోపాలబాలా" మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగుపోయినప్పుడు మిరియములను బెల్లపుముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు జూపి చేతికొలదిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలిపోవుటయు సంభవించుచుండును. దేవతావేశము చేత తఱచుగా భక్తులలో నొకరిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషముల వఱకు వెనుకకు స్తంభము మీది కొఱగుచుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చిచేష్టల వలె గనపడును గాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండ మీదికెక్కి నలుగడల జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు చెంగుచెంగున దమ ముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్లు మీదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలును, పూర్వదక్షిణముల గుప్ప వోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తుగానొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపై నుండి పొలముకాపులు కోయని కూతలిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదరింప జేరువ తోపులలో నుండి వెలువడి మధురరుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలువిధములయిన పక్షులు చెట్ల కొమ్మల మీద బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల పచ్చని పయిరులును, ఆ పయిని వృక్షముల మీదను గూర్చుండి కర్ణరసాయనముగా బిల్లనగ్రోవిని మోవిని బూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు చాలించి క్రేపులతోడ గూడి జెవులు నిక్కించి యర్రులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ల యందు నిలుచున్న పశుగణములును, పడమటను నీలము వలెనున్న తేటనీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపుతళుకులను బుట్టింప బలుతెరంగుల జలవిహంగంబులు పుట్టచెండ్ల వలె మీల బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచు బ్రవాహంబుతోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సాహము చేయుచుండును.
ఆ పర్వత పాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్లరాతి బండ మీద జక్కగా మలచిన రామపాదములు వెలసియున్నవి. శ్రీరాముల వారు పూర్వకాలమున సీతాలక్ష్మణులతోడగూడ బర్నశాలకు బోవుచు త్రోవలో ఈ పర్వతసమీపమున నడచిననాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్ముదురు. కాబట్టి యా రామపాదములను సందర్శింపవలె ననునభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీదికెక్కి శ్రీ జనార్ధన స్వామి వారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుట చేత జాతిమతభేదము లేక యెల్లవారును పులిమాగిరము, దధ్యోదనము మొదలుగా గల స్వామిప్రసాదమును స్వీకరించి కన్నులకద్దుకొని ముచ్చటనారగించి చేతులనంటుకొన్నదానిని కడుగుకొన్న నపచారమగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును, గోడలకును వర్ణము వేయుటయే గాక తచ్ఛేషముతో దమ మీజేతులకును బట్టలకును మెఱుగు బెట్టుకొనుచుందురు.

ఈ కొండకు దక్షిణమునను తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించియున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుం గూడ గలిగియుండెను. కాని యిప్పుడిప్పుడు గ్రామమును ధవళేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ మీది నుండి సోపానములు దిగివచ్చిన తోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయమొక్కటి లోచనగోచరంబగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణచి దక్షిణాభిముఖుడయి చనుచు అగస్త్యు డాస్వామిని అచట ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్లతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీపమున వీధికి దూర్పు ప్రక్కను "ధర్మచావిడి" అని యొకటి యుండెను. అది పరదేశ బ్రాహ్మణులును, మార్గస్థులును రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమందది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్దమనుష్యులు ప్రతిదినమును ఉదయాస్తమయము లందు ప్రోగై యిష్టకథాగోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగపడుచుండెను.

ఒకానొకదినమున సూర్యుడుదయించి ప్రాచీముఖంబున గుంకుమబొట్టు నందంబు వహించి వృక్షాగ్రములను బంగారునీరు పూసినట్టు ప్రకాశింప జేయుచుండెను; చెట్ల మీది గూళ్ల నుండి కలకల ధ్వనులతో వెలువడి పక్షులు నానాముఖముల ఎర కయి వెడలుచుండెను; పసులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక "వెల్లావు కడి నాది" "దోర గేదె కడి నాది" యని గంపలు చేతబట్టుకొని, పడుచు లొండొరుల మీరి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలలు బుజముల మీద బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలములకుం బోవుచుండిరి; అప్పుడు కాయశరీరము గల యొక పెద్దమనుష్యుడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో గాళ్లును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొని వచ్చి, ధర్మశాల మీద వొడ్డున గూర్చుండి, వచ్చునప్పుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంతధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరములుండును; మొగము మీద స్ఫోటకపు మచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱయుండదు; అట్టని, యా ముఖమాయనకు నిత్య మును దర్శింపవచ్చు. ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్ఱనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టిగాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుడని నోపజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరుకావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడియున్నది; చెవులనున్న రవలయంటు జోడును, కర్మిష్టుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక నందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్జనియందలి వెండి బటువులు రెండును తప్ప శరీరమున నాభరణములేవియు లేవు; ఆయన పేరు రాజశేఖరుడు; ఆయన ముఖప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి, ఆయన వారివారి తారతమ్యముల కర్హముగా దగిన మర్యాదలు చేసి కూర్చుండుడని చేయి చూప, 'చిత్తము' 'చిత్తము' 'మీరు దయ చేయండి' అనుచు జావడి నిండ గిటగిటలాడుచు గూరుచుండిరి.

అప్పుడు రాజశేఖరుడు గారు "సిద్ధాంతి గారూ! మీరు నాలుగు దినముల నుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట బిన్నపెద్ద లందఱును మరేమియు లేకుండా సుఖముగా నున్నారు గదా?"

సిద్ధాంతి - "చిత్తము, చిత్తము. తమ అనుగ్రహము వల్ల మేమందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్నవస్త్రాదులిచ్చి కాపాడగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మావంటి వారికేమి కొదువ? మా గ్రామము చేసికొన్న భాగ్యము చేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమ వంటి దాన కర్ణులు మాగ్రామమునకు విజయం చేసినారుగాని మరియొకటి కాదు." అని రామశాస్త్రి గారి వంక దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతి చేయవలసినది కాదు గాని రాజశేఖరుడు గారు కేవలము నీశ్వరాంశ సంభూతులు సుండీ.".

ఆ మాటల కాదరము సూచించెడి మందహాసము చేసి రామశాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతో జెప్పవలెనా? వారీ గ్రామమున నుండబట్టి మనమందఱము వారి యండను నిలువగలిగినాము గాని, లేని యెడల నిండ్లును వాకిళ్లును విడిచిపెట్టి మనమీపాటికి దేశముల పాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగారిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగా గనబడుచున్నది గాని యింతకు బూర్వము దీనికి నామరూపములున్నవా?"

అని, మంచి సమయము తటస్థించినప్పుడు తన పాండిత్యమును దాచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్తోత్రపాఠములకు సాయముగా దనవి కూడా నాలుగు కలిపెను.

అప్పుడు రాజశేఖరుడు గారు మనసులో మిక్కిలి సంతోషించినను పయికా సంతోషము కానరాకుండా నడచికొని "సిద్ధాంతి గారూ! మొన్న మీ రెండవ చిన్నదానికేమో గ్రహబాధ కనబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగానున్నదా?"

యని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గానిపింప గొంచెమాలోచించి తలయూచి "జోశ్యుల కామావధానులగారి చేత విభూతి పెట్టించుచున్నాను. కానీ దాని వల్ల నిప్పటికేమియు గుణమే కనబడదు. జాతకరీతిచే దానికిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్ముని చేత నవగ్రహ జపము చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులు గారినే "పంచముఖి వీరహనుమంతము" పునశ్చరణ చేయవలసినదనియు, జవశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుడు గారినైన కాళ్లో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగు రూపాయల సొమ్మిచ్చుకొనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందుచేతనే యీ నాలుగు దినముల నుండి దర్శనము చేయలేదు గాని లేకపోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"

రాజశేఖరుడు "శాస్త్రి గారూ! మీరు రూపాయల నిమిత్తము సంశయపడనక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగు రూపాయలను నేనిచ్చెదను. మరి నాలుగు రూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములో కామావధానులు గారి కన్న ..." అని మిన్ను వరకు జూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతిగారు చేసిన స్తుతి యమోఘముగా బట్టుకొని కొంచెముగానో గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీ వఱకెన్నడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.

ధవళేశ్వరమునందును చుట్టుపట్టుల గ్రామములందును వేఱు సిద్ధాంతి లేడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్యమెప్పుడని గాని, ప్రయాణమునకు ముహూర్తము పెట్టుమని గాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుటకే దినము మంచిదని గాని, ఇల్లు కట్టుకొన నారంభించుటకే మాసమనుకూలమైనదని గాని, క్షౌరము చేయించుకొనుటకే వారము మంచిదని గాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కానీ, రజస్వల యయినప్పుడు నక్షత్రము చెప్పుమని గాని, సదా యెవ్వరో యొకరాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయి నప్పుడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలెనన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొందినప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుగొనవలెనన్నను, రోహిణ్యాది నక్షత్రములయందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుగవలెనన్నను, సిద్ధాంతి యొద్దకు రాక సరిపడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట నేవస్తువు పోయినను వచ్చి సిద్ధాంతిగారి నడుగకపోరు. ఇటువంటి సమయములందెల్లను, అతడు వీధినడవలో నేల మీద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములును అంకెలును వ్రాసి మీది వంక చూచి యాలోచించి వచ్చిన కార్యమిదియనియు కార్యమీ ప్రకారముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతడు బల్లిపాటు మొదలైనవాని ఫలములును, శకునములు చూచి సంతానము కలుగు కాలమును కూడా చెప్పుచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యా చేరువ గ్రామములో ఏ శుభకార్యము కానీ, యశుభకార్యము కానీ జరుగదు. ఆతడు చెప్పెడి జ్యౌతిషము తఱుచుగా అబద్ధమే యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజమగుటయు గలదు గనుక జనులాతని మాట యమోఘమని నమ్ముచునే యుండిరి.

అప్పుడా చావడిలో నున్నవారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా"రని మెల్లగాననిరి. అంతలో రాజశేఖరుడు గారు సిద్ధాంతిగారి వంక జూపు త్రిప్పి "ఔను. బైరాగులన్న తోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వడో యొక బైరాగి వచ్చినాడట! అతనికి జూపింపరాదా? గోసాయీలకు బరమహంస క్రియలును వనమూలికలును విశేషముగా దెలసియుండును. వాండ్రెట్టి యసాధ్యమైన పీడలనైనను జిటికెలో బోగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు 'చిత్తము' 'వాస్తవము' 'ఆలాగున నవశ్యము చేయవలసినదే' యను ధ్వనులతో నిండిపోయెను. మాటలాడువారు ధనవంతులైనచో, వ్యర్థవచనము సహితము స్తుతియోగ్యము కాకపోదు సుండీ. ఆ మాటల వలన నుత్సాహము కలిగి, రాజశేఖరుడుగారా బైరాగిని తాము జూడకపోయినను బ్రహ్మవర్చస్సు కలవాడని శ్లాఘించిరి.

అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమున దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయము తోడ చేతులు జోడించి రాజశేఖరుడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినది. దాని యదృష్టము బాగుండబట్టియే దేవరివారి ముఖము నుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్లెదను." అని మనవి చేసి, ప్రయాణోన్ముఖుడయి లేచి నిలువబడెను. రాజశేఖరుడు గారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుడనువారును మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్నిమధ్యమున దపస్సు చేయుననువారును అయి సభ యంతయు అతని విషయమైన స్తుతిపాఠములలో మునిగిపోయెను. ఒక్క గొప్పవాడొకనిని మంచివాడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతివాక్యముల కొరకు తడవుకొనును?

అప్పుడు రాజశేఖరుడు గారు వీధి వంక జూచి: "ఎవ్వరో స్త్రీలు నీళ్లకు వచ్చి మనలజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంక జూచుకొనుచున్నారు. మనమందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి." అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణోన్ముఖులయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిసి యుత్తరముఖముగా రామపాదముల వైపునకు నడవనారంభించిరి.

రెండవ ప్రకరణము

రాజశేఖరుడు గారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట - నదీతీర వర్ణనము - రుక్మిణికిని సిద్ధాంతి గారి భార్యకును జరిగిన సంభాషణ - నీళ్లకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు - పంచాంగపు బ్రాహ్మణుడు వచ్చి సంకల్పము చెప్పుట - రుక్మిణి స్నానము చేసి బయలుదేఱుట.

రాజశేఖరుడు గారు పౌరబృందముతో నాలుగడుగులు ముందుకు సాగిన తోడనే యొక సుందరి సుందరగమనముతో బాదముల యందలి యందియల మ్రోత మట్టియల మ్రోతతో జెలిమి సేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడి కంకణముల యొక్కయు, గాజుల యొక్కయు కాంతులు ప్రతిఫలించి కుడిచేతిలోని తళతళలాడుచున్న రాగిచెంబునకు జిత్రవర్ణమొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కజేర్చుకొనుచు తిన్నగా దలవంచుకొని మెట్లు దిగివచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబుమూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులో జుట్టి తెచ్చుకొన్న కుంకుమపొట్లము నొక బట్టయుతుకు రాయిపయింబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడు గారి పెద్దకూతురగు రుక్మిణి - ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమున జూడ నోచినవారి కన్నులే కన్నులు. ఆ కాలమున హిందూ దేశమునందలి సుందరులలోనెల్ల దెనుగుదేశములోని వారే రూపరేఖావిలాసముల చేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలచినప్పుడు మాత్రము, ఆ సుందరులొకసౌందర్యవతులని చెప్పుట కెల్లవారును సంకోచ పడుచుందురు. జనులందఱును మిక్కిలి సౌందర్యవతులని యొప్పుకొన్నవారిలో చక్కనివారి నేరి యామె చెంత నిలిపినచో గురూపురాండ్ర నిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. అపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో వొకరినైనను బోలజాలని నేను, ఉన్నత సౌందర్యమును బోధించు పదములు లేని భాషతోను, పదములు బోధించునంత వఱకైన బూర్ణముగా దెలుపలేని బుద్ధితోను వర్ణింపబూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకు గోరంత కలుగజేయుటయే గదా! అయిననూ యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి యీ పుస్తకముం జదువువారి కామె యవయవముల యొక్క రూపము నించుక మనస్సున బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుడును ఘుణాక్షరన్యాయమున బడిన యామె రూపమునకు దలయూచి, తన యపూర్వ వస్తునిర్మాణచాతురిని మెచ్చుకోకపోడని యామెం జూచినవారెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరశ్ఛాయం జూచిన, ఇక నీ భూమి మీద బంగారమునకేమి చాయ యెక్కువ గలదని తోచును; నల్లగానుండునేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వాని యందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగా బరిశీలించినచో నేదో స్థిరవిచారమొకటి యామె హృదయపీఠమున నెలవుకొనియున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకు గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషము చేత నాఱు నెలల క్రిందట దలిదండ్రులతో జెప్పక దేశాంతరము లేచి పోయినాడు. ఇప్పుడామెకు బరిమళ మబ్బినట్లు, ఇప్పుడిప్పుడే యౌవనము తలచూసి యాపె మేనిసోయగమునకు మెఱుగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీద అప్పుడు కట్టుకొన్న తెల్లని బట్టయు బంగారమునకు పటిక పూసినట్టులొక విధమయిన యందమునే కలిగించుచుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పుడేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాల బావిలీలును, చేతుల కంకణములును, మెడలో పట్టెడయును, మొలను వెండి వడ్డాణమును, కాళ్లనందెలును, మట్టెలును, ఆమె యప్పుడు ధరించుకొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవములకేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభ గాంచుట మాత్రము కరతలామలకముగా గనబడుచున్నది.

సృష్టిలోని యే పదార్థమునకును బరిపూర్ణత్వమును దయ చేయని రీతినే, సర్వసముడగు భగవంతుడు రుక్మిణి సౌందర్యమందును గొంత కొఱతను గలిగించినాడు కాని బొత్తిగా గలిగింపక మానినవాడు కాడు. నిజముగా అది యొక కొఱతయే యయ్యెనేని యామెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయిననూ ముష్టి సర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్పుడెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి నిడుదగు మెడ కామిని కులవర్ధని దాని నెఱిగికొండనిరి బుధుల్!" అను సాముద్రిక గ్రంథములోని పద్యమును జదివి పోవుచుండును.
అప్పుడొక్కవిధవ మొల లోతు నీళ్లలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ దలయెత్తి సూర్యుని వంక జూచి దండములు పెట్టుచు, దోసిటిలో నీళ్లు పట్టి సూర్యునకర్ఘ్యము విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయుచుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్లలో బెట్టి రేవునకు సమీపముగానున్న రాళ్లపయిని నిలుచుండి యొక్కొక్క పెట్టు వేయుచు మధ్యమధ్య నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకుకొనుచుండిరి; ఒక వృద్ధాంగన సగము బట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చి కట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలును గోప్యముగా నుంచదగిన తమ యవయవములు స్నానము చేయునట్టియు గట్టున నున్నట్టియు పురుషులకు గనబడునట్లు సిగ్గువిడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటకయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱ కుదికిన వేఱు తడి బట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీజనములు క్రిందబడిన మెతుకులకై కావుకావని మూగిన కాకులను చేయెత్తి యదిలించుచు అంటుతప్పెలలను ఒడ్డున బెట్టుకొని తోముకొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటినీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతులతోను వలను త్రిప్పి లోతు నీళ్లలో విసరవైచి మెల్లమెల్లగా లాగుచుండిరి. మఱికొందఱు లాగిన వలలను నీళ్లలో బలుమాఱు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకు దీసికొని వచ్చి చివర దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయిరప్ప క్రింద బారవైచూచు నడుమ నడుమ వలకన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేత బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందిచ్చుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాల పాటుపడగలిగిన యొక సోమరిపోతు నీళ్లలోనున్న నడదోనె మీదికెక్కి నల్ల యన బడు పేరిననెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువబడి కుడిచేతితో సత్తువ కొలదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతు నీటన్విసరవైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కునాయని తదేకధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినప్పుడెల్ల నులికిపడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమున గుడిచేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కలసట వచ్చిన తరువాత నొడ్డునకు లాగి పెన్నిధి గన్న పేద వలె బరమానందము నొందుచు, ఒడ్డు దాక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలో బడ్డ సొమ్ము పోగొట్టుకొన్నవాని వలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడ బోయెనని విచారించుచు వట్టి చేతులతో నింటికి బోయెను. ఆ సమీపముననే యొడ్డున జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక దారమును గట్టి దాని కొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్లలో వైచుచు దటాలున దీయుచు జిన్న చేపలను బట్టుకొని మఱియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బది జెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని యొండొరులతో జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టు మీద గూర్చుండి చూచుచున్న చెడు గ్రద్ద యొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయి చేతబట్టుకొన్న చేప నెగరదన్నుకొని పోయెను.

అప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టు పెట్టుకొని, బట్టలతోనున్న బుజము మీది బిందెను తీసి చేతబట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవము తోప "అమ్మాయి గారూ! ఏమి? మీరీ వేళ స్నానమునకు దయ చేసినారు". రుక్మిణి - "కార్తీకసోమవారము కాదా? కడపటి సోమవారము గనుక ప్రదోష వేళ మా అమ్మతో కూడ శివాలయమునకు వెళ్లవలెనని గోదావరి స్నానము చేయవచ్చినాను".

పెద్ద ముత్తైదువ - మీరు రాత్రి దాక భోజనము లేకుండనుండగలరా?

రు - "ఒక్క దినమునకేమి? ఏలాగునైన నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు కొంచెము నిమ్మళముగా నున్నదా?"

పె - "ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణెల్లం బట్టి కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాక నిద్ర లేక బాధపడినాము".

రు - "గ్రహబాధా యేమి?"

పె - "అవునమ్మాయీ! ఏమి చెప్పుకోను? మగడు" - అని 'యిక్కడ నెవరును లేరు గదా' యని నాలుగు ప్రక్కలను జూచి మఱింత దగ్గరగా జరిగి చెవిలో మెల్లగా "మగడు పట్టుకొని వేపుకొని తింటున్నాడు. మీరెఱుగుదురు గదా దానికి పెండ్లియయి మూడేండ్లు కాలేదు. అప్పుడే దాని మగడు పోయి ఆఱు నెలలయినది. అప్పటి నుండియు దానికి కొన్నాళ్లు కలలోను కొన్నాళ్లు రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడును కనబడుచునే యున్నాడు. పి‌ల్లకి సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాచినది. నెల దినముల నుండి బొత్తిగా ఎప్పుడును విడువక రేయింపగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్లిన నక్కడికి దిరుగుచున్నాడు. ఏమి పాపమో కాని మూడు దినముల నుండి మఱింత పీకుకొని తింటున్నాడు. ఈ మూణ్ణాళ్లలోను పిల్లది సగమయిపోయినది. ఇంతే గదా? మగనితో" - అని కడుపులో నుండి దుఃఖము బయలుదేఱగా గొంచె మాపుకొనుచు గన్నీరు పైట చెఱగుతో తుడుచుకొనుచు గొంచెము తాళి గద్గదస్వరముతో "మగనితో సౌఖ్యమనుభవింపనా? కాపురము చేయనా?" అని కొంచెము బిగ్గరగా నేడ్వజొచ్చెను.

రు - (ఆ మాటలు మనసుకు నాటి యొడలు పులకరింప గొంత తాళి ధైర్యము తెచ్చుకొని) "పెద్ద ముత్తైదువవు ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో రోగము మనుష్యులకు రాక మ్రాకులకు వచ్చున

పె - ఏడుపు చాలించి - "అమ్మాయీ! దానికే సౌఖ్యము నక్కఱలేదు. ఈలాగునైన నుండి బ్రతికి బట్టకట్టిన జాలును. మా ముసలి ప్రాణములు రెండును బ్రతికి బాగున్నంత వఱకు దానికి యన్నవస్త్రముల కేమియు లోపము రాదు."

రు - కొంచెము సేపేమేమో యాలోచించి - "సోమిదేవమ్మా! మీవారు గ్రామములొ పెద్ద సిద్ధాంతులు గదా? తెలిసి కూడ చిన్నదానికి అంత యర్ధాయుష్మంతున ... "

పె - మాటకడ్డము వచ్చి - "ఔనౌను! నీ వడుగబోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండ మోయవలసిన వ్రాత యుండగా నెవరు తప్పింపగలరు? ఎవరైన జాతకము మంచిదిగా జూచి వివాహము జేయుదురు గాని పెండ్లి కుమారునకు లేని యాయువును తెచ్చి పోయగలరా?"

రు - "అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాబోలు!"

పె - కొంచెమనుమానించి - "పూర్ణాయుస్సా? అవును పూర్ణాయుసే యున్నది. జాతక ప్రకారము జరగదా అందునేమో, వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, అందులోనెన్ని యక్షరములున్నచో అన్ని యక్షరములును జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు గదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడైన జరిగినదేమో చెప్పు"

రు - "కన్నమ్మ గారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారు గాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతి గారే వ్రాసి ... "

పె - "అవును ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యోతిషమునకు బార్వతి శాపమున్నదట! మావా రెప్పుడును ఈ సంగతినే చెప్పుచుందురు. గట్టు మీద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈ పాటికి మనమీ సంగతి చాలింతము" అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డున నుంచి స్నానమునకు నీళ్లలో దిగుచున్నది.

ఇంతలో గొందఱు పుణ్యస్త్రీలును విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ల వెండి పావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరమునున్నవారు వచ్చువఱకు దగ్గఱ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా నీటి సమీపమునకు వచ్చి గృహకృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డున బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడుకొనుటకు నీళ్లకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు గదా? అందుచేతనే వారు సాధారణముగా కొంచెము తీఱుబడి చేసికొని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్లకు వచ్చినప్పుడే మాటాడుకొని పోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యీడు గల పొట్టిదొకతె ముందుకు వచ్చి ముక్కు మీద వ్రేలు వైచికొని "ఓసీ! వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగడు కొట్టినాడట! విన్నావా?"

వెంకమ్మ - "దానిని మగడెప్పుడును ఆలాగుననే కొట్టుచుండును. నెల దినముల క్రింద కఱ్ఱ పుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి."

పొట్టి - "దానిని మగడు తిన్నగా ఒల్లడట." అని బుగ్గను చేయి పెట్టుకొని "ఓసీ! ఓసీ! అతడు ముండ నుంచుకొన్నాడట సుమీ."

బట్టతల ముత్తైదువ యొకతె చేతులు త్రిప్పుకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావధానుల కొడుకుతో మాటాడుచుండగా మగని కంటనే పడ్డదట! మగవాడేలాగున నున్నను దోషము లేదు. ఆడదాని గుణము తిన్నగా నుండనక్కఱలేదా?"

పొట్టి - "దానికేమి గాని, పాపము! చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతే కాకుండ మగడింటికి వచ్చునప్పటికేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును. దాని మీద అతడు ప్రతిదినమును దానిని చావగొట్టుచుండును."

పదియాఱు సంవత్సరముల వయస్సు గల యొక చామనచాయది కన్నుల నీరు పెట్టుకొనుచు - "అత్తగారు బ్రతికియున్న చోట్ల నెల్ల నిదే కర్మము. లోకములో అత్తలెల్ల ఒకేసారి చచ్చిరా ... "

పొట్టిది - "శేషమ్మా! నీ అత్తగారు కూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?"
శేష - "బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచి యంతయు జేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్లన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచు వఱకు పనులన్నియు జేయుదును. అప్పుడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటలో బెంట యట్టే యున్నదని తిట్ట మొదలుపెట్టును. తరువాత పేడ చేసి గోడ మీద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము పొద్దెక్కి చలిదిభోజనమునకు వచ్చు వఱకు, 'ఒక మూల తెల్లవాఱక మునుపే తిండికి సిద్ధపడుదువు. పని మాత్రము ముట్టుకో'వని వంట చేసికొనుచు సాధించుచుండును. పగలు మగనితో మాటాడితే దప్పు కదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత, అత్తగారికి కాళ్లు పిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్లి పడుకోబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్లవాఱిపోవునో, వేళకు బని గాకున్న అత్తగారెక్కడ కోపపడునో యని నిద్రలో సహితములికి పడుచుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలును తప్పవు గదా?" అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పజొచ్చెను.

రుక్మి - "అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?"

శేష - "అయ్యో! రుక్మిణమ్మా! నీకత్తగారు లేదు గనుక నీకీ సంగతులేమియు తెలియవు. ఎంత పని జేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగా జల్లిన, 'ఇల్లంతయు సముద్రము చేసినావు జాఱిపడి చచ్చిపోనా?'యని తిట్టును. పలచగా(జల్లిన "నీళ్ళకు కఱవువచ్చినట్లు వేణ్నీల్లేచల్లినావుకా"వని తిట్టును. అడిగినమాటలకు మాఱు చెప్పిన"నామాట కెదురు చెప్పుచున్నావా" యని కోసి పెట్టును. బదులు చెప్పక యూరకున్న"మొద్దులాగున మాటాడవె"మని తిట్టును. ఆమెముందఱ ఏమి చేసినను తప్పిదమే. "ఆ" అన్న అపరాధము "నారాయణా" అన్న బూతుమాట. నేను కాపురనకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగుదినముల క్రింద పగిలి పోయినప్పుడు రాయివంటి క్రొత్తకుండ పగులగొట్టినా వని నేటివరకు తిట్టుచున్నది".

పొట్టి-"అత్త పోగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ" యన్న సామెతవినలేదా?

శేష- నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు? నావిధవవదినగారు బ్రతికియున్నప్పుడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో -దైవము కడుపుచల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూడుపూటలును కడుపునకింత తన్నగా అన్నము నైన దినుచున్నాను. ఆడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్నమాట చుప్పవలెను. ఎన్నియన్నను ఇప్పుడు నాఅత్తగారు అన్నము తిన్నగాతినవైతివని తిటునుగాని తినిపోతినని తిట్టదు.

పొట్టిది-"లోకములో నెటువంటివారును లేకున్న - పిండిబొమ్మను జేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆఁడుబిడ్డతనమున కదిరదరిపడ్డది-అన్నసామెత యూరకేపుట్టినదా?"

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచి చెంబులోనీళ్ళు పాఱఁబోసి మీకు మాటలసందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసినవారున్నారని యయిన రాజశేఖర చరిత్రము లేదు. ఊరికే నీళ్ళు విదలుపుకొంగురు. మీఁద మయిలనీళ్ళు పడిస్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగుచున్నాను" అని గొణుఁగుకొనుచు లోతు నీళ్ళలోకి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందునుమీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడంట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమందియు, వేముతీపునులేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు. కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూఁడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరువాత మరల మూఁడుమాఱు లాత్మప్రదక్షిణములు చేసి మెట్లక్కియదృశ్యురాలయ్యెను.

శేషమ్మ- నాలుగు వంకలు ఁజూచి వడవడ వడఁకుచు" అమ్మలారా! నేనీలాగున అన్నానని మీరెవ్వరితోనైన ననెదురునుండీ!మా అత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును. ఈవఱకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లి ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితేబాగుండునని తోఁచుచున్నది." అని వలవల నేడ్వఁజొచ్చెను.

వెంకమ్మ- "ఊరుకో! ఊరుకో! అటువంటి అవాచ్యములెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు." అని యూరడించుచున్నది.

శేషమ్మ- ఆ మాటలతో దుఃఖము మాని " గోదావరికి వచ్చిచాలసేపయినదమ్మా! ఇంతసే పేమిచేతుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను." అని వేగముగా నీళ్ళుముంచుకొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.

రెండవ ప్రకరణము

అప్పుడే నీళ్ళకు వచ్చినవారితో ఇరువదియేండ్లప్రాయముగలయొకతెచేరువ నున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి"కాంతమ్మ! ఈపట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీ కేమి? నీవు అదృష్టవంతురాలవు. గనుక తల మొదలుకొని పాదములవఱకు నీమగఁడు నీకు నగలు దిగవేయుఁచున్నాఁడు."

కాంత-నిన్ననే కంసాలిసుబ్బయ్యచేసి తెచ్చినాడు. నాలుగు పేటల పలకసరులు కూడ చేయిచున్నాఁడు. పేరమ్మా! మీ మగనికి నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా!

పేర-ఎందుకువచ్చినదయ? సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాలనగ చేయించిపెట్టుట లేదుగదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మమందుఇటువంటి-

ఇప్పుడు ప్రక్కనునిలచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోనివ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమయిన అన్నమునకు తక్కువయిబదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పుడు నగలు లేకపోయిన నేమి! మగనికి ప్రేమ లేకపోయినతరువాత, దిక్కుమాలిన నగ లేందుకు విట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగారమ్మకు శరీరము నిండనెన్నినగ లున్నవో! అనగలపేర్లె కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి డానిమగఁడు బోగముదానియింటిలోఁగూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగఁడెప్పుడును చీఁకటి పడ్దతరువాత వీధిగుమ్మము దాఁటఁడు.

పేర-నీవు చదువుకొన్నదానవు గనుకు, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పగలవు. నీకువలె మా కెవ్వరికిని ఇటువంటి వేదాంతము రాజశేఖర చరిత్రము తెలియదు. నలుగురును నగలు పెట్లుకొనివచ్చినప్పుడు, వట్టి మోడులాగున ఎక్కడి కయినను పేరింటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగుచున్నది. జానకమ్మా! నీకు నామగనివంటి బీదవాడు జాన-పేరమ్మతల్లీ! నేనేమో తెలియక అన్నాను కోపపడకు అని బిందె ముంచుకొని వెళ్ళిపోవుచున్నది'

తక్కినవారందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేఱి, " ఓసి పూజారిపాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది"కరణమువండ్లా మెంతయొయ్యారముగానడుచునో చూచినావా"" అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనేమాటాడదే" " పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట!"'కన్నమ్మది కొంచెము మెల్లకన్ను సుమీ' కరణమువారి సీతమ్మకునగలే లేవే అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకునడిచిరి. విద్యాగంధమేయొ!ఱుగను మూఢవనితలకు మాటాడుకొనుటకంతకన్నా మంచివిషయము లేమి దొరకును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలును, మాఱుతల్లుల దుర్మార్గములును, మగల యనాదరణమును, మొదలైనవి తప్ప మఱియేమియు నుండవు.

అప్పుడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావిదోవతి కట్టుకొని, మడత పెట్టిన చిన్నయంగవస్త్ర మొకటి బుజముమీఁద వేసికొనిమొగమునను దేహమునను విభూతిపెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేసి రుద్రాక్షలుగల కంఠమాలప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుముకాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండిపోవుచు గోదావిరిలో స్నానము చేయువారెవ్వరోయని కనులకుచేయి యడ్డమువెట్టుకొని నిదానించిచూచి, గిరుక్కున మళ్ళి యొక బ్రాహ్మణుడు మెట్లుదిగివచ్చెను. బ్రాహ్మణుడు - "రుక్మిణమ్మగారూ! సంకల్పముచెప్పెదను స్నానము చేయండి"

రుక్మి - ' నేను డబ్బు తీసుకొనిరాలేదే'

బ్రా - డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగానిలెండి; (అనివంగినిలుచుండి) ఆచమనము చేయండి.కేశవా-నారాయణా-మాధవా-గోవిందా-తూర్పుమొగముగా తిరుగుండి.సూర్యునికేసి.

రుక్మి - స్నానము చేయవలెనా?

బ్రా - 'సంకల్పముచెప్పనిండీ' అని పొడుముబుఱ్ఱను రొంటి నుండి తీసి, మూతతీసి రెండుమాఱులు నేలమెద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూతవేసి కాయను రొండిని దోవతిలో దోపుకొని యెడమచేతిలో నున్న పొడుమును బొటనవ్రేలితోను చూపుడు వ్రేలితోను పట్టగలిగి నంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలినదానిని రెండవపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కట్టుకొన్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, 'శుభేశోభనముహూర్తే శ్రీమహావిష్ణువరాజ్ఞయ - ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణ: - ద్వితీయ ప్రహరాధెన్ - శ్వేతవరాహకల్పే - వై వస్వతమన్వంతరే - కలియుగే - ప్రథమపాదే - జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే - అస్మిన్‌వతన్‌మానే వ్యావహారిక చాంద్రమానేన - కాళయుక్తి నామసంవత్సరే - దక్షిణాయనే - శరదృతౌ - కాతిన్‌కమాసే - కృష్ణపక్షే - ద్వాదశ్యాం - ఇందువాసరే - శుభనక్షత్ర శుభయోగ శుభకరణాద్యనేకగుణ విశిష్టాయా మాస్యాంశుభతిధౌ - క్షేమస్తైర్యవిజయాయురారోగ్యైవ్శ్వర్యాభి వృద్ధ్యధన్‌ం - అఖండగౌతమీస్నానమహం కరిష్యే - మూడుమాఱులు స్నానము చేయుండి".

రుక్మిణి, తఱుచుగా స్నానము చేయుమనదికాచుగాన లోఁతు నీళ్ళలోనికి వెళ్ళుటకుభయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలి లోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితోతలమీఁద నీళ్ళు పోసికొనుచుందెను. అప్పుడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమిత్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్ట కొంగుతో తలతుడుచుకొని, శిరోజముల చివర ముడి చైచుకొని గట్టువంకఁ జూచి దూరము నుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేఱీ, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నిళ్ళు చెంఋమీఁద పోసి తీసికొని ,రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని , బట్టతిన్నగా సవరించుకొని, ఉతికినబట్టలను బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁగూడ గృహమునకు బోవ బయలుదేఱెను.

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట - గృహవర్ణనము - రాజశేఖరుఁడుగారు వచ్చి కచేరిచావడిలోఁ గూర్చుండుట - బందుదర్శనము - స్వహస్తపాకియైన వైశ్వదేవపరుడు.

సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడి చేతి వంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పువైపు సందు లోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుకకు తిరిగి రెండుమాఱులు మెల్లగాదగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి ' అమ్మాయీ! నేనుందునా?' అని వెనుక తిరిగి పలికెను.

రుక్మి-'మంచిది. సోమిదేవమ్మగారూ! నా కొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?'

సోమి -ఎంతచుట్టు?నిమిషములో వెళ్ళెదను.

రుక్మి- 'పోయిరండీ

సోమి- బీదవాండ్రము మా మీఁద దయయుంచవనుజుండీ.

రుక్మి- 'దానికేమి? వెళ్ళిరండీ' అని నాలుగడుగులు నడిచి మరల వెనుక తిరిగి ' సోమిదేవమ్మగారు ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్కపర్యాయము వచ్చెదరుకాదా?'

సోమి- అవశ్యము, ఆలాగుననే వచ్చెదను. నేను పోయివస్తునా?

అని సోమిదేవమ్మ నదచినది. సిద్ధాంతిగారు గాని ఆయన పెద్దలుగాని యెప్పుడును యజ్ఞము చేసినవారు కాకపోయినను , సోమి
రాజశేఖర చరిత్రము

దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ౙము జేసినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాతుగా ఆమె పితామహుఁడే యజ్ౙము చేసి యేఁటేట నొక్కక్కటిచొప్పున మూడు పదులమీఁద నాలుగు శ్రావణ పశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపబోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ౙము చేయకపోయినను, తండ్రి యెంతో ధన వ్యయము చేసి సంపాదించుకొన్న వేళ్ళను మాత్రము పోఁగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమ జులనియు, మారెకు సోమిదేవమ్మ యనియు, నామకరణములు చేసెను. రుక్మిణియు సందులో నూఱుబాగలు నడిచి, అక్కడనుండి దక్షిణ్ముగ తిరిగి, ఆ సందులో రెండుగుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఅఖురుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందరమైనది. వీధిగుమ్మమునకు రెండుప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు అరుగులకును మధ్యనుపల్లముగా లోపలికిఁబోవునదవ యున్నది. ఆనడవమొగమున సింహద్వారమున్నది. ద్వారబంధువు పట్టెలకు గడపదావున ఏనుఁగుతలమీఁద సింహము గూర్చుండి కుంభస్ధలమును బద్ద్దలు చేయుచున్నట్టు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రకలనందు నా సింహములయెక్క శిరోభాగములు మొదలుకొని గొడుగుబల్లవఱకును పువ్వులును కాయలను గల లత చెక్కఁబడి యున్నది. ఈకమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱగుఱ్ఱములు వీధి వైపునకు ముందరి కాళ్ళు చాచి చూచువరిమీఁద దుముకవచ్చునట్లుగాఁగానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్లకే శుభదినములందు మామిడాకులతోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమనుండు గొడుగుబల్లమీదఁ నడుమను మూడవ ప్రకరణము

పద్మమును పద్మముల కిరుపార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రములయిన యాకులును పువ్వులును తీఁగెయును చెక్కఁబడియున్నవి.ఆఁతీగపైని కాళ్లు మోపి ఫలములను ముక్కుతో పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలఉ చిత్రింపబడి యున్నవి.వీధితలుపులకు బలమైన గ్రంధులు చేయఁబడి వానిపయినిసహి మొకవిధ మయిన పుష్పలత మలచఁబడియున్నది.


గుమ్మము దాటిలోపలికి వెళ్ళినతొడనే చావడియుండెను. ఆచవడి కెదురుగా పెద్దకుండు ఒకటియు౦డెను. వర్షము కురియునప్పుడు నాలుగు వైపులనుండియు చూరు నీళ్ళాకుండులోఁబడి వీధీచావడి క్రింద నుండు తూమూగుండ వీధీలోనికి బోవును. ఆకుండుకుత్తరవైపునను దక్షిణపువైపు నను ఒకదానికొకటియెదురుగా రెండు చావళ్ళుండును. అందుదక్షినపుదిక చేరిచావడి. దానిలో వివాహదులయందు తాంబూలములకు పిలిచిన బంధువులును పెద్ద మనుష్యులును సభ చేసి గూర్చుండగా , క్రింద బోగముమేళము జరుగుచుండెను. ఇతరసమయములలో పెద్ద మనుష్యులు చూడ వచ్చినప్పుడును. మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణకాల క్షేపము జరుగునప్పుడు, శిష్యులప్పుడు చదువుకోవచ్చినప్పుడును రాజశేఖరుడుగా రందుకూర్చుందురు.ఆచావడి రెండుప్రక్కలను రెండుగదులు గలవు. ఆచావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్పుడెల్లను సభవారిచెమట లార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండెను. ఆతలుపులకు వెనుక పంచపాళియు,దానివెనుక పలువిధము లయిన పూలమొక్కలతో నేత్రములకు విందుకొలుపు చిన్నదొడ్డి యుండెను. ఆచావడిలో మూడు గొడలకును నిలువె డెత్తునకుపయిని మేకులకు గొప్పపటములు

రాజశేఖర చరిత్రము

 వేయఁబడియున్నవి. అందు దశావతారములును మాతమే కాక, కృష్ణుఁడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టు మీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతు లెత్తి మ్రొక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందు కయి తల్లి రోటను గట్టిపెట్టి దాని నీడ్చుకొని పొయి మద్దులఁ గూలఁద్రొచినట్టును, మఱియు ననేక విధముల కృష్ణ లీలలుగల పట్టములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపుసంహరమును చేయుచున్నట్టును నున్న సంబంధము లయిన పటములును, విఘ్నేశ్వరుడు ,సరస్వతి, గజలక్ష్మి , చతుర్ముఖుడు మొదలుగాగల మఱికొన్ని పటములును, గొడల నలంకరించుండెను.ఉత్తరపు ప్రక్క చావడిము ఈ విధముగానే యుండును. గాని గోడ కొక్కగుమ్మముమాత్రమే యుండి, అది తరచుగా మూయఁబడి యుండును. ఈ చావడిలో రెండు మూడు పాతసవారీ లెప్పుడును వ్రేలాడఁ గట్టఁబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱచుగా నెరు వడుగునప్పుడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారీ మాత్రము ఋరకా వేయఁబడి చావడిలొ క్రిందనే పడమటిగోడదగ్గఱఁ జేర్పఁబడి యుండును. ఈచావడిగోడ కున్న తలుపు తీసి యుత్తరపు పంచపాళిలోనికి సోయినతోడనే దొడ్డిలొ నుయ్యియొకటి కనఁ బడును ఆనూతిపయి నుండుగిలకలు కీచుధ్వని చేయుచుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళుతోడుకొని పొవుచుందురు. ఆనూతికి పడమటివైపున ధాన్యము నిలువ చేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగాఁ గడ్డింపఁబడియున్నవి. నూతికి సమీపముగా వీధిలొనికి పాణిద్వార మొకటియున్నది ఇంతకు మునుపు రుక్మిణివచ్చిన దాద్వారముననే. ఆదారినే యిరుగుపొరుగు వారు

మూడవ ప్రకరణమ

వచ్చి నీళ్ళుతోడుకొని పొవుచుందురు. మఱియు మధ్యాహ్నసమయమున చుట్టుప్రక్కల నొండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పుడు, రాజశేఖరుఁడుగారు కచేరిసావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెల్లవసినపుడును, ఆత్రోవనేవచ్చుచుఁబోవుచుందురు.

లోపలికుండునకు నాలుగుప్రక్కలను పనస కాయచేక్కననాలుగుస్తంభములున్నవి. వీధిచావడి కెదురుగానుండు పడమటిచావడిలొ లొపలికి పోవు నడిమి గుమ్మమొకటి యున్నది. ఆ గుమ్మమున లోపలికి ఁ బోవఁగానే చావడియొకటి కనిపించును. ఆ చావడి దక్షిణపు వైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలివెళ్లిన రాజశేఖరుఁడుగారు బరుండు గదిలోఁ బ్రవేశింతుము. గదిలొనుత్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతిదిమ్మల మీఁద నాలుగుగాళ్ళనుమోపి వేయబడియున్నది. మంచమునకు చుట్టును దొమతెరయును జలరును దిగవేయఁబడియున్నది. పందిరిస్తంభములకు నడుమును లక్కపూసిన కొయ్యపళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను పువ్వులను గల చిలకల పందిరియొక్కటి వ్రేలాడుచుండేను. గొడాలకు సుద్దతొ వెల్లవేయఁబడి యుండెను. గోడలపొడుగునను రుక్మిణియుతల్లియు నోపికచేసినట్టిన గోడసంచులు తగిలించఁబడి యుండెను.ఆ గోడసంచులకు కొంచెము మీఁదుగా గుడ్డ చిలుకకు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగ కదులుచుండును.గోడకు పెద్దమేకులు కొట్టి వానిమీఁదఁబెట్టిన బల్లమీద కొండపల్లి బొమ్మలును లక్కపిడతలును గది కలంకారభూతముగ నుండెను. గోడ సంచులు కొట్టిన మేకులకు దశావతారములు మొదలయినపటములు చిన్నవి వేయబడియున్నవి. దక్షిణపుగోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింపబడి యున్నది. దానినే రాజశేఖరుడుగారు నిద్రలేచినతోడనె చూచి, ఆవల మఱియొకవస్తువునుజూతురు. గదికంబయిని ఆందమయిన బల్లకూర్పుకూర్పుబడియుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడపోడుగునను గడమంచెమీగా వరుసగా కావడిపెట్టెలు పెట్టబడి యున్నవి. ఆ పెట్టెలలో సాధారణముగా ధరించుకొను వస్త్రములును నాగరలిపితో బంగాళాకాకితములమీద వ్రాయబడిన రాజశేఖరుడుగారి సంస్కృతపుస్తకములును వేయబడియుండెను. గదిలో పడమటిగోడతట్టున పెద్దమందస మొకటి గట్టితాళము వేయబడి యుండెను. ఆమందసములోపలనున్న చిన్న తాళపుపెట్టెలలో నగలును పండుగదినములలో ధరించుకొను విలువబట్టలును రొక్కమును ఉండును. చీకటిరాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుడుగారు ఆమందసముమీదనే పఱపు వేయించుకొని పరుందురు. మందసమునకును కావడిపెట్టెలున్న గడమంచెకును మధ్యను దక్షిణవైపున గదినుండి దొడ్డిలోనికి బోవుమార్గ మొకటి కలదు. ఆ మార్గమున దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను మొగ్గలతోను నేత్రోత్సవము జేయుచుండెను. దాని కెడమ ప్రక్కను గొంచెముదూరమున మల్లెతీగెలు పందిరిమీద నల్లుకొని యకాలమగుటచే నప్పుడు పుష్పింపకపోయినను పచ్చనికాంతుల నీనుచు మనోహరముగా నుండెను.

రాజశేఖరుడుగారి పడకగది ముందఱిచావడిలో దూలమునకు జిలుకపంజర మొకటి వ్రేలాడగట్టబడియుండెను. అందులో నున్న చిలుక సదా "ఎవరువారు" "ఎవరువారు" "పిల్లివచ్చె కొట్టు కొట్టు""కూరోయితోటకూర" మొదలగుమాటలనుసహజ మధురస్వరముతోపలుకుచుండును. ఆదూలమునకేమఱికొంత దూరమునరామాయణము మొదలయినతాటాకు లపుస్తకములుత్రాళ్ళతో వ్రేలాడఁగట్టఁబడియుండును. ప్రొద్దుననేనిద్రలేచిరుక్మిణి చిలకనుపంజరమునుండి తీసిచేతిమీఁదనెక్కించుకొని "చేతిలోవెన్నముద్ద "మొదలుగాఁగల పద్యములనుసహితము నిత్యమునునేర్పుచుండును. ఆకాలములోఁదఱచుగా స్త్రీలుచదువుకొను నాచారములేకపోయినను, రాజశేఖరుఁడుగారుతనకుమార్తెమీఁదిముద్దుచేతిదానెరుక్మిణికిక్రొత్తపుస్తకమును అన్యసాహాయ్యము లేకుండనర్ధముచేసికొను శక్తిగలుగునంత వఱకువిద్యనుచెప్పెను ఆమెస్వభావముచేత నేతెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయమయి చిన్నతనములోనే యుక్తాయుక్తివివేకమును జ్ఙానమునుకలదియాయెను. తండ్రి యామెకు చదువుచెప్పుటచూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసుగుసలాడు కొనిరిగాని, రాజశేఖరుఁడుగారు ధనికులగుట వలన నేమియుఁబలుకు సాహసింపకపోయిరి. అట్లనివారు బొత్తిగానూరుకున్నవారుకారు. పెద్దవాఁడని రాజశేఖరుఁడు గారుగౌరవముతోఁ చూచుచుండెడి యొకయాప్తబంధుని మెల్లఁగాబ్రేరేపించి, ఆయనచేతాందఱునుసభలోఁ గూర్చుండియుండగా "నాయనా!మనయింట ఆఁడుపిల్ల్లలను జదివించు సంప్రదాయములేదే, మనరుక్మిణినేలచదివించెదవు? "అనిపించిరి. రాజశేఖరుఁడుగారు విద్యవలని లాభములనెఱిఁగిన వాడగుటవలనను, స్త్రీవిద్యయే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపుపతివ్రతలందఱు విద్యావతులయి యుండుటయు నెఱిఁగినవాఁడగుట వలనను ఆవృద్ధుని వాక్యములను లక్ష్యముచేయక స్త్రీవిద్యాభ్యాసమునకనుకూలముగాఁ గొన్ని స్మృతివాక్యములను జదివి మీ రాజశేఖరచరిత్రము

యభిప్రాయమేమనిసభలోనున్నవారినడిగెను. వారందఱునుమనస్సులో స్త్రీవిద్యయన్ననేవగించువారేయయినను రాజశేఖరుఁడుగారి యభిప్రాయముతెలిసి న పిమ్మటదానికివ్యతిరిక్తముగా నేమియుజెప్ప నలవాటుపడినవారుకారుగావునస్త్రీవిద్యాభ్యాసమువలనగణనాతీతములయినలాభములుగలవనిపొగిడిరుక్మిణికివిద్యనేర్పుచున్నందునకయి రాజశేఖరుఁడుగారినిశ్లాఘించిరి.


చిలుక పంజరమున్న తావునుండి నాలుగుబారలు నడిచిన తరువాత పడమటింటిద్వారమున్నది. పడమటియిల్లు విశాలమయి యేఁబదిమందిబ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇఁకఁగొంచెము సేపునకు భోజనములకులేతురనఁగావెళ్ళిచూచినయెడల, మూరెడుమూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీటలునుపీటలకుముందఱపిఁడిమ్రగ్గుతోపెట్టిన పట్లును చాలుగానుండును. పడమటింటి యీశాన్యమూలను గచ్చుతోఁగట్టినదేవునరుగుకలదు. ఆయరుగుపయిన 'భువనేశ్వర ' మనుదేవ తార్చనసామానులను సాలగ్రామాదులును పెట్టుపెట్టెయుండును. ఆపెట్టెమీఁదనే రాజశేఖరుఁడుగారు మడితో నిత్యమునుపారాయణచేయు శ్రీమద్రామాయణమును సుందరకాండము పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చిదేవునరుగుముందఱ పీటవేసికొనికూర్చుండి రామాయణమును పంచపూజయుచేసికొందురు. దేవునరుగునకెదురుగానున్న తలుపుతీసికొని యావలకువెళ్ళిన చోనొకపెరటిలోనికిఁబోవుదము. అక్కడసున్నముతోను ఇటుకలతోనుకట్టినతులసి కోటయొకటి నాలుగయి దడుగులయెత్తున నందమైయుండెను. ఆకోట లోపలల క్ష్మితులసియుకృష్ణతులసియు శ్రద్ధాభక్తులతోఁ బెంపఁబడుచుండును. ఆసమీపముననే కొంచెముదూరమున తులసివనమును మూడవప్రకరణములు


ఆవల నిత్తెమల్లిచెట్టును వాని చేరువనున్న నందివర్ధనపుచెట్టుమీఁదనల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుఁడు గారికి నిత్యమునుదేవతార్చన కయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆపైని రుక్మిణియుఁ జెల్లులునుప్రేమతోఁ బెంచుకొనుచున్నబంతిచెట్లను, బొగడబంతిచెట్లను, జంత్రకాంతపుచెట్లను గోడపొడుగుననువరుసగానుండును. పడమటింటినంటియేదక్షిణవైపుననున్న వంటయింటి దొడ్దిలోపల నరఁటిబోదెలుపిలకలతో నిండియుండి చూపుపండువుగానుండును. రాజశేఖరుఁడుగారు ప్రత్యహమునూ అబోదెమొదలనెస్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసివచ్చి గోదావరినుండి చెంబుతోఁదెచ్చిన నీళ్ళను తులసికోటలోఁబోసిమ్రొక్కి, తడిబట్టలతోనే చుట్టునుమూడు ప్రదక్షిణములుచేసి, లోపలికిఁబోయితడిబట్టవదలి పట్టుబడ్డకట్టుకొని యొక చేతిలోఁగుంకుమబరిణియు రెండవచేతిలో నక్షతలను బసపును బియ్యపు పిండియును గల గదులు పట్టెయునుబట్టుకొనివచ్చి, తులసికోటలో నంటియున్న ముందరివేదికమీఁద నీళ్ళుచల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపుపిండితోపద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమ నడుమఁజిత్రముగాఁ గుంకుమతోను పసపుతోను నలంకరించుచుఁగూర్చుండి, మధురస్వరముతోమెల్లగా, 'లంకాయోగము ' పాడుకొనుచుండును.

ఈలోపుగా రాజశేఖరుఁడుగారు వెంటనున్నవారితో నానావిషయములను ముచ్చటించుచునడుమనడును వారి కిఱ్ఱుచెప్పులజోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలనుమరల నడుగుచుఁబలువురతోఁగలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలోవిడిచి యొకరొకరేవచ్చి కచేరిచావడిలో రత్నకంబళముల మీఁదఁగూర్చుం
రాజశేఖర చరిత్రము

నగాఁ దామును దక్షిణపు గోడ కానుకొని యెండలో నుండి నడిచి వచ్చిన బడలిక చే బట్టిన చెమ్మట పోవ నుత్తరీయముతో విసరు కొనుచు గూరుచుండిరి. అప్పుడు నభిరాఘవాచార్యుడు నామముల తిరుమణి బెత్తికలు లేవ నెడమచేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగము మిద జూడ్కి నిగిడించి,'దేవరనారి కీనడుమ స్వామి మిద్ కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది.'అని యొకచిఱునవ్వు నవ్వి లేచి నిలువబడి బట్టలో నున్న గన్నేరుపూలలో మాలెను దీసి చేతిలో బట్టుకొని 'స్వామివారి యందు బరిపూర్ణకటాక్ష ముంచవలెను'అని వినయముతోప బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను.

రాజశేఖరుడుగారుభక్తితోబుచ్చుకొని,'యీమధ్య మనజనార్దనస్వామివారికి జరగవలసిన యుత్సనము లేమయిన నున్నవా' అని యడిగిరి.

రాఘ: పదియేనుదినములలోమార్గశిరశుద్ధచతుర్దశినాడును, పూర్ణిమనాడును వరుసగా తిరుమంగయాళ్వారి యొక్కయు,తిరుప్పాణాళ్వారియొక్క యుతిరునక్షత్రిములు వచ్చుచున్నవి.నెల దినములలో ధనుర్మాసము వచ్చుచున్నది. ఆ నెలదినములును స్వామికి నిత్యోత్సవములు సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి.ధనస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొందరడిప్పొడియాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది.ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.


రాజ-నిత్యమును స్వామికిబాలభోగమును నందాదీపమును క్రమముగా జరుగుచున్నవా? మూడవ ప్రకరణము

రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రూపాయలును బాలభోగమునకు జాలకున్నవి. ఇప్పుడుస్వాము లధికముగా వచ్చుచున్నారు.నందాదీపము క్రిందఁదమరు దయచేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపుకొనివచ్చుచున్నారు కాని నందాదీపములో మఱియొకరికి భాగముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములులేవు; పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యద్యయనోత్సవములో నెంతయైన నిండుగానుండును. అది యీయేటికిఁగాకపోయిన మీఁదటికైనను మీకేదక్కవలెను. ముందుగా చెవిని వేసియుండిన నెందున కయినను మంచిదని మీతోమనవిచేసినాను.


రాజ-మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పొట్లాడినారట.


రాఘ-ద్వారకాతిరుమల నుండి వచ్చినస్వామి సాపాటుచేసి కూర్చుండి యుండగా, పెంటపాడు నుండి వేంచేసినస్వామి పెరుమాళ్ళ సేవచేసి వచ్చి కూర్చున్నరు.వారిద్దరిలో నొకరు తెంగలెవారును ఒకరు వడహలెవారును గనుక, నామముక్రింద పాద ముంచవచ్చును కూడదని మాట పట్టింపులు పట్టుకున్నారు.

రాజ-ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ-తరువాతఁగొంచెము చేయిచేయి కలసినదిగాని ముదర నీయక నేనును నాతమ్ముడును అడ్డమువెళ్ళి నివారించినాము.

రాజ-మన జనార్దనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ- ఏడుపుట్ల మాన్య మున్నందురుగాని, అయిదుపుట్లు మాత్రము భోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపుట్ల భూమియు అర్చకులది గాని స్వామిది కాదు.
రాజశేఖర విజయము


రాఘ-మొన్న జరిగిన స్వామి యుత్సనములలోభోగము మేళము రాలేదే.


రాఘ:.... వారన్ని యుత్సవములలో రారు. రాజమహేంద్ర వరములో గాపుర మున్నారుగనుక చిల్లరపండువుల కెల్ల బండ్లుచేసికొనివచ్చు, బహుప్రయాసము. ఒక్క స్వామి కళ్యాణదినములలో రధోత్సవము నాడు మాత్రము వత్తురు. అప్పుడు వారి బత్తెము క్రింద స్వామి ద్రవ్యములో నుండి నాలుగు రూపాయిలు మాత్ర మిచ్చుట యాచారము.


ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయ గృహస్థు తెల్ల బట్టలు గట్టుకొని కుడిచేతిలో నున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱనక కూలివాడు బట్టలమూటను నెతిమిద బెట్టుకొని నడువ,నడవలో నుండి చావడిలోనికి చొరనగా నడచివచ్చి అచ్చట నిలువబడి,"ఓరీ! రామిగా!మూట లోపలికి తీసికొనిపోయి యెవరినైన బిలచి రాజశేఖరుడుగారు పరుండుగదిలోబెట్టి రా" అని కూలివానిని నియమించి, కూరుచున్న వారి నందఱిని త్రోచుకొనుచు నడుమ నుండి వచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరుడు గారి ముందఱ తివాచిమిద గూర్చుండెను. రాజశేఖరుడుగా రావఱ కెన్నడును అతని మొగమే యెఱుగక పోయినను పెద్దమనుష్యు డింటికివచ్చినప్పుడు మర్యాదచేయక పోయిన బాగుండ దని, కొంచెము లేచి 'దయచేయుడ 'ని చేయిచూపి తాను గొంచెము వెనుకకు జరగి చోటిచ్చి"యింటివద్ద నందఱును సుఖముగా నున్నరా?" యని కుశలప్రశ్నమును జేసి "మిరెవర"ని యడిగిన దప్పుపట్టుకొందురేమేయని సం శయించుచు నూరకుండిరి. అప్పుడావచ్చినాతడు తన పొడుము కాయను రాఘవాచార్యుల వంక మూడవ ప్రకరణము


బొర్లించి యాతని పొడుముబుర్రకు పుచ్చుకొని  ; మునుపు చేతిలో నున్నపట్టును బాఱవ్ై చి క్రొత్తపట్టు పట్టీ నగము పీల్చి రాజశేఖరుఁడు గారివ౦కఁ దిరిగి “రాజశేఖరుఁడుగారు ననుమఱచి పోయినట్టున్నారు| ”. అనెను.


రాజ–“లేదు లేదు.” అని మొగమువ౦కఁ బాఱఁజూచిరి.క్రొత్త–ఇంకను నానవాలుపట్టలేదు. మీరు నన్నూ పది సంవత్సరములు క్రి౦దట రాజమహే౦ద్రవరములో రామమూర్తిగారి లొపల జూచినారు. నేను వామరాజుభైరవమూర్తిని. మనమందఱమును దగ్గ బ౦ధువూలమూ , మీతల్లిగారి మేనత్తయల్లుఁడు మామేన మామగారికి సాక్షాత్తుగా నొకవేలు విడిచినమేనత్తకొడుకు , మొన్నమాఅన్నగారు సా౦బయ్యగారు మీయింట నెలదినములుండివఛ్ఛిన తరువాత మీరుచేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు విచ్చిరి; వెళ్ళునపుడు మీరుపెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపినారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీ రింతయనుకూలమయిన స్ఢితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.


ఆమాటలువిని లోపలి గదిలోఁబండుకొని యున్న యొక ముసలాయన దగ్గుచు లేచివఛ్ఛి“ఓరీ భైరవమూతి నీ వెప్పుడు వఛ్ఛినావు”


భైర−ఓహోహొ  ! ప్రసాదరావుగారా మీరు విజయంచేసి యొన్నాళ్ళయినది ‽


ప్రసా–రెండుమానములనుండి యిక్కడనే యున్నాను.బంధువని రాజశేఖరుని జూచిలపోదమని వఛ్ఛి యితనిబలవంతమునకు మాఱు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజశేఖరుఁడు బహుయోగ్యుఁడు సుమీ;”అని కూర్చుండెను. రాఘ - తాతగారూ ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు‽

ప్రసా - ఇప్పుడు మావాని బంధుత్వము విన్నారుగదా ? వీని మేనమామ బావమఱది నాకుమా ర్తెయత్తగారి సవతితమ్ముఁడు.

ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండగా లోపలినుండి స్త్రీకంఠముతో సీతా! సీతా!" అని రెండుమూడు పిలుపులు వినబడినవి. అప్పుడు రాఘవాచార్యు లందుకొని, "అమ్మాయీ సీతమ్మా" అని పిలిచి లోపల అమ్మగా రెందులకో పిలుచుచున్నారు. అని చెప్పెను. అప్పుడు నూతివైపు పంచపాళిలో దన యీడుపడుచులతో గూడి గవ్వలాడుచున్న యేడుసంవత్సరముల యీడు గల చామనచాయపిల్ల పరికిణి కట్టుకొని కుడిచేతిలో పందెమువేయు గవ్వలను ఎడమచేతిలో గళ్ళుగీచినసుద్దకొమ్మును బట్టుకొని 'వచ్చె వచ్చె' నని కేకలువేయుచు కాళ్ళగజ్జెలు గల్లుగల్లుమన చావడిలోనుండి పడమటింటి గుమ్మమువైపునకు బరిగెత్తుకొని వెళ్ళెను. ఆచిన్నది రాజశేఖరుడుగారి రెండవకుమార్తె. అట్లువెళ్ళి గుమ్మమున కీవలనే నిలుచుండి సీత - 'అమ్మా ! ఎందుకుపిలిచినావు?'

మాణిక్యాంబ - నాన్న గారితో వంటయినదని స్నానమునకు లేవచ్చు నని చెప్పు.

మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి గలదియు విద్య నేర్చినదియు గాకపోయినను, గృహకృత్యములను జక్క పెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమాన మయిన ప్రజ్ఞ కలది; రూపమున చాలవఱకు పెద్దకుమార్తెను పోలియుండునుగాని మొగము కొంచెము ముదురుది గాను దేహచ్ఛాయ యొకవాసి నలుపుగాను కనబడును. ఆమె
మూడవ ప్రకరణము


ముప్పదినాలుగేండ్లవయస్సు కల దయ్యును దూరమున నుండి చూచుటకు చిన్నదానివలెనేయాండును.


అంతట సీత మరల జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, 'నాన్నగారూ!వంట అయినదట!అమ్మ స్నానమునకు లెమ్మనుచున్నది ' అని చెప్పి, యెప్పటియట్ల గవ్వలాడుట కయినూతి పంచ పాళిలోనికి బోయెను.


రాజ-ప్రసాదరావుగారూ!మిరుస్నానము చేయుదురేమో నూతిదగ్గఱకు బొండి. భైరవమూతిగారూ! గోదావరికి వెళ్లెదరా?లేక నూతియొద్దనే నీళ్ళుపోసుకొనెదరా?


భైర-----కార్తికసోమవారము గనుక గోదావరికే వెళ్ళెదను.


అప్పుడక్కడ నున్నవా రందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు వుచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుడు గారును పడమటింటి లోనికి నడచిరి. లోపల సానమిద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియలచప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి,యొకకాలు గడప కీవలను రెండవ కాలు పం చపాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువబడి 'రుక్మిణీ!బాబయ్యగారు స్నానమునకువచ్చినారు;వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము 'అని కేకవేసెను. ఆ పిలుపు విని,దేవతార్చనకు బూలు గోయుచున్న రుక్మిణి "వచ్చుచున్నాను "అనిపలికి తొందరగా రాగిహరివారణముతో నిత్య మల్లిపుష్పములను తులసి దళములను దెచ్చి దేవున కరుగుమీద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికి బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలును గూటిలోనున్న యద్దమును విభూతి పెట్టెను గొనివచ్చి దేవు నరుగువద్ద నున్న పీటదగ్గఱ బెట్టినది.
రాజశేఖర చరిత్రము


తోడనే లోపలి నుండి నలుపదియేండ్లు దాటిన విధవయొకతె విడిచికట్టుకొనిన తడిబట్టచెఱగు నెత్తిమిదినుండి రానిచ్చి మునుగు వేసికొని, పొయిలోనిబూడిద నొపటను బొట్టు పెట్టుకొని వెండి చెంబులజోటితో మడినీళ్ళను దెచ్చి పీటయొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుడుగారు స్నానముచేసి, జుట్టు తుడుచుకొని కొనలు ముడివై చుకొని, అప్పు దాఱవేశిమడిబట్టను గట్టుకొని వచ్చి, దేవునరుగు ముందఱనున్న పీటమిద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్ఠమును కనిష్ఠకయు దప్ప తక్కిన మూడువ్రేళ్ళతోను నొసటను భజములను కంఠమునకు కడుపునను ఱొమ్మునను రేఖలను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామములను పళ్ళెములో నిడిమంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కినవా రందఱును స్నానముచేసివచ్చి గోడల పొడుగునను పీటలమిద గూరుచుండిరి.


భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరువాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడక గదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలోవీధి తలుపువద్ద "రాజశేఖరుడుగారూ!" అని పిలుపుమిద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినబడెను,"వచ్చె వచ్చె"నని లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ వచ్చులోపలనె, కేకలతో గూడ తలుపు మిద దబదబ గుద్దులు వినబడెను. ఆమె వెళ్ళి తలుపుగడియ తీయునప్పటికి, నుదట దట్టముగా బెట్టినవిభూతి చెమ్మటతో గలిసి చప్పిదౌడలకు వెల్లవేయ జెవుల కుండలములు య్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ మూడవ ప్రకరనము


వస్త్రముతో జేర్చి చుట్టినబట్టలస దునుమం దునుండి కనబదు తెల్లని జుట్టుగతయును లొపలి నీరుశావినోవతులపై నున్న దర్భాసననముచే లవుగాగన ఁబడు క్రష్ణాజినపుచుట్టగల మూపులును వీపునుండి కుడిభుజముమమీ ద్రుగా వచ్చిన కృష్ణాసనపుత్రాడుకునను గట్టబ్రడ్డ రాగిజారీయును వారసంచియు గల యెండు ఱొమ్మనుగల నల్లనిపొడుగయిన విగ్రహ మొకటీ ద్వారబంధము పొడుగునను నిలువంబడి యుండెను. తలుపుతీయగ్రానే యావిగ్రహము తిన్నగా పడమటింటీవై పునకు నడచి లోపల రాజశేఖరుఁడుగారి కెదురుగా నిలువంబడెను.

                                               రాజ–శాస్త్రులుగారూ;  విూదేయూరు?                                    
                                                శాస్త్రి–మాది కాసూరగ్రహారము,  మా  యింటిపేరుబులుసువారు;  నాపేరు  పేరయ్యసోమయూజులు. విూకీర్తి జగద్విఖ్యాత  మయినది. పదిమందిబ్రాహ్మనుల కింతయన్నము  పెట్టినను సంభావన  యిచ్చినను  భూమివిూద్ర సార్దకజన్మము మీదికాని నావంటి  వ్యర్దుని  బ్రతు కెందుకు?     
                              

రాజ–శార్తికసోమవారము విూరు రాత్రిదాక నుడేదరా?

సోమ–పెద్దవాఁడ నయినాను, ఇపుడుండ లేను,

రాజ–సొరుయాజులుగా రెండబడినట్టున్నారు. అట్లయిన వేగిరము నూతిదగ్గఱ్ నాలుగు చేదల నీళ్ళు పోసికొనిరండి. వడ్డన యవుతున్నది.

సోమ: మీ భోజనములు కానిండి. నాదొక్క మనవి యున్నది. నాకు స్వహస్త పాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధి చేసి నాలుగు వస్తువులు అమర్చిన యడల స్నానము చేసి వచ్చి పాకము చేసి కొనెదను. రాజశేఖర చరిత్రము


రాజ-వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసిమాపాకములోరావలెను.


సోమ-నాకుస్త్రీపాకముపుచ్చుకోనని నియమము. మీయింటవంటచేయువారు పురుషులేకదా?


రాజ-మాపినతల్లికుమార్తెవంటచేసినది. మాయింటనెప్పుడును స్త్రీలేవంటచేయుదురు.


సోమ-అయ్యా!స్త్రీపాకమేకాకుండనియోగిపాకముకూడ నేనెట్లుపుచ్చుకొందును? కొంచెమత్తెసరుపెట్టించిన నేనువచ్చిదింపుకొనుదును.


సోమ-(కొంచెము సేపనుమానించి)నేనెఱుఁగుదును. మీదిమొదటినుండియుశిష్టసంప్రదాయము-మీతాతగారెంతోకర్మిష్టులు; మీతండ్రిగారుకేవలముబ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనము చేసినానన్న మఱియొక చోటను గూడనాలాగుననే చేయమందురు. నేనిక్కడభోజునము చేసినమాటనుమీరు రహస్యముగా నుంచవలెను. కార్తికసోమవారము గనుక గోదావరిఁబోయి నిమిషములో స్నానము చేసివచ్చెదను. ఇంతలో వడ్డనకానిండి.


అని పేరయ్య సోమయాజులు కృష్ణాజినమును నారసించుయు నట్టింటఁ బెట్టిగోదావరికిఁ బోయి స్నానము చేసివచ్చి, కృష్ణాజినమునువ చావడిలో క్రిందఁబఱిచి దానిమీఁద దర్భాసనమువేసికొని కూర్చుండి, గోముఖములోఁ జేయి దూర్చి లోపలరుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసుకొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్లమందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును
మూడవ ప్రకరణము


కూరలును చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళ ముంద ఱగనిపెట్టుకొనియున్న వారు లేచివచ్చి పలుమాఱు పిలువగాబిలువగా సోమయాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరిముందఱ గూరుచుండెను. అప్పు డందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.


రాజ- రాజమహేంద్రవరమునుండి శుభ లేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడివెంకయ్యజాడ లేదు. ఎక్కడ గూర్చున్నాడు?


వెంక-అయ్యా! అయ్యా! ఇదిగో సోమయాజులు గారి వెనుకమూల విస్తరివద్ద గూరుచున్నాను.


సోమ-ఈపాకము దిన్యముగా నున్నది. దీని ముందఱ నల భీమపాకము లెందుకు?


వెంక- సోమయాజులు గారూ! నిన్న సత్రములో పండిన బీరకాయ యింతరుచిగా లేదు నుండీ!


రాజ-ఏ సత్రము?
వెంక-నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటియింట గృహప్రవేశమునకు సంతర్పణ జరగినది. బొల్లి పేరయ్యగాడు వంటచేసివాడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపజ్త్కినే కూరుచున్నాము.

ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనము చేసి యందఱును పడమటిం టి దొడ్డిలో చేతులు కడుకొని తేనుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలో గూర్చుండిరి.

సోమయాజులుగారు మొట్టమొదట నాలుగుదినము లుండదలచుకొనియే వచ్చినను, భోజనమయమున జరగిన ప్రసంగమును జరగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడగకయే వెంటనే తాంబూలము బుచ్చుకొని నడచిరి.

నాల్గవ ప్రకరణము

   
పురాణకాలక్షేపము-రాజశేరుడుగారి స్థితి-ఆయన దానమఱది
దామోదరయ్య చరిత్రము- మిత్రుడు నారాయణమూర్తి కథ-ఎఱుక
యడుగుట.


రాజశేరుడుగారు భోజనము చేసిన తరువాత ఒక్క నిద్రపోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావడిలోనికి వచ్చి కూర్చుండిరి.అంతకుమునునే గ్రామమున గల పెద్దమనుష్యులు పలువురు వచ్చి తగినస్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేరుడుగారు 'సుబ్రహ్మణ్యా!'అని పిలిచినతోడనే 'అయ్య 'అని పలికి లోపలి నుండి పదియాఱు సంవత్సరము వయసు గల యెఱ్ఱని చిన్నవాడొకడు వచ్చి యెదురు నిలువబడెను. అతడు రాజశేరుడుగారి జేష్ఠపుత్రుడు; సీత పుట్టిన తరువాత రెండుసంవత్సరములకు మఱియొక పిల్లవాడు కలిగెనుగాని యాచిన్నవాడు పురుటిలోనే సందుగొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపు లేదు. సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పుడు పసపుకొమ్ముతో గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగానుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తలవెండ్రుకలు నిడువుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులును చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాసిన కుందనంపుపని యుంగరమును ఉండెను.

రాజ-సుబ్రహ్మణ్యా! అందఱితో గూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?</poem>
నాల్గవ ప్రకరణము


సుబ్ర-కార్తికసోమవారము గనుక,ఈదినము రాత్రిదాకనుండి మఱిభోజనము చేయవలెనుకున్నాను.


రాజ-లోపల బల్లమీద ఆదిపర్వ మున్నది తీసికొని వచ్చి శాస్త్రులుగారిని వెళ్ళి పిలుచుకొని రా.


తండ్రి యాజ్ఞ ప్రకారము సుబ్రహ్శణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి,నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్నయొక నల్లని విగ్రహమును జూచి 'వేగిరము రండి 'అని కేక వేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుముగా పుస్తకమును ముందఱ బెట్టుకొని కూర్చుండెను.ఇంతలో శాస్త్రులును బుజముమిద చినిగిపోయిన ప్రాతశాలువును మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమనడుమ లోపలి లక్క కనబడుచున్న కుండలములజోడు చెవులనల్లలవాడుచుండ వచ్చి సభలో గూర్చుండెను. రాజశేఖరుడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అథము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచబడుచుండును గనుక,ఆ శాస్త్రులు వచ్చువరకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.


రాజ----మి రీవేళ నింతయాలస్యముగా వచ్చినారేమండీ?


శాస్త్రి---ఇంతకుమును పొకపర్యాయము వచ్చి చూచిపోయినాను. తమరు లేవలేదని చెప్పినందున, వేఱేయొజ్ పెద్ద మనుష్యునితో గొంచెము మాటాడవలసిన పనియుండగా మీరు లేచుచున్నప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచెమాలస్య మయినది. క్షమించవలెను- నాయనా! సుబ్రహ్మణ్యమూ పుస్తకము విప్పు?
రాజశేఖర చరిత్రము


సుబ్రహ్మణ్యము పుస్తకమును విప్పుచు, తుండము వేశదంతమును దోరపుబోజ్జయు యను విఘ్నేశ్వర సవపద్యమును నారంభించి చదువుతుండగా శాస్త్రులందుకొని యా పద్యము కడవఱాకు నయిన తరువాత, 'అంజలిజేసి మ్రొక్కెద మదంబకు ' మొదలుగాగల సరస్వతీ ప్రాధకానమును, పిమ్మట ప్రాంళుపయోదసీలతను భాసితు ' మొదలుగాగల వ్యాసస్తోత్రములను , పిదప మఱికొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను . ఈ లోపల సుబ్రమహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి , అర్జునుడుద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి


 " ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగ నేని గం

గాదిమహా నదీ హీనవదాది మహాగిరిదశాన్ంబు మీ

సాదప యోజనదర్శనము పన్నుగజేయుట జేసి పూర్వసం

పాదితసర్వపాపములు వాఎస్ భృశంబుగ నాకు నచ్యుతా! "


అను పద్యమును జదివెను. అప్పుడు శాస్తుృలు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియు గల్పించి దీఘములు తీయుచు వధముచెప్ప మొదలుపెట్టెను. అర్ధము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకు గట్టియున్న పుడకను జ్రతిలో బట్టుకొని త్రిప్పుచుండెను . అదిచూచి శాస్తుృలు ఉలికిపడి ముక్కుమీద వ్రేలు వైచుకొని పుస్తము చదువు చుండాగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసులవారు దానిమీద గూరుచుందరే' యని దగ్గఱ నున్నవార్రి కావిషయమయిన కధ నొకదానిని జెప్పెను. ఆమాటమీద నందులో నెవ్వరో నడిగినదానికి బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, వారప్పు డామార్గ

నాల్గవ ప్రకరణము

ముననే యాకాశముమీద దివ్యవిమాన మెక్కి వెళ్ళుచునారనియు చెప్పి ఆకాశమువంక జూచి కన్నులు మూసుకొని మూడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసి నందున వాటికి బురాణకాలక్షేపమును జాలించి " స్వస్తిప్రజాభ్యః " మోదలుగాగల శ్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు వెళ్లి పోయిరి.


రాజశేఖరుడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచి పోయినను వంశావృక్షముల సహితము చూచుకోనక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుగారి మీదిప్రేమచేత నాతనినిచూచి యాదరించి పోవలెనను నిద్దేశముతో వచ్చి నెలలకొలదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగువానిని బహుమానములు నడయు చుందురు. ఊరినుండు పెద్దమనుష్యులు అపరిచితులయిన వారును గూడ రజశేఖరుడుగారియింట వంట దివ్యముగాచేయుదు రని శ్లాఘించుదురు; వారు చేయుస్తోత్రపాఠముల కుబ్బి రాజసేఖరుడుగారును వారువచ్చినప్పుడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగువాన్ని చేయించి వారిచేత మెప్పువడయ జూచుచుందురు. అన్న ముడుకక పోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయినుకూడ వారివంట బాగుండలేదని యెవ్వరును జెప్పలేదు - ఊరకే వచ్చినపదార్ధమునం చెప్పుడును రుచి యధికముగా నుండునుగదా ? కోందఱు బంధువులు తాము వెళ్ళునప్పుడు కొంత సొమ్మును బదులుపుచ్చుకొని అదివఱకు దఱచుగా వచ్చుచు బోవుచు నుండువారే యైనను అంతటి నుండి తీరికలేక బదులుతీర్చుట కయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధనవంతుడు గనుక

రాజశేఖర చరిత్రము

ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి - ఆ మిత్రసహస్రములలో నొకడైనను నిజమైనయాప్తు డున్నాడో లేడో యన్ననగతిని మాత్రమాయనకు ధనలక్ష్మీ తెలియనిచ్చినదికాదు. అట్టి మిత్రోత్తము లందరును రాజశేఖరుడుగారికి స్తుతిపాఠములతో భూమి మీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింప జేయుచుదా మాయన యిచ్చెడి ధనకనవస్తు వాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగానిచ్చి తమ కష్టకధలను గాధలుగా జెప్పి చినఱకు దమ కేమయినను ఇమ్మని తేల్చుచుందురు- అట్టివారు నటించెడి యాపదల నన్నిటిని అతడు నిజమయినవానిని గానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనమునము చెసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చెయించెద మనియు, చెప్పి యాయన వద్ద ధనమార్జించుకొని పోచుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖర్ గారియింట రాత్రులు తరుచుగా గానవినోదములును నాట్య విశేషములును జారిపోతాది నాటకగోష్టులును జరుగుచుండును. మోసగాండ్రు కొందరు తమకమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి , వానిలో జెక్కినరాళ్లు వెలయెఱిగి కొనగలిగి సరసులు రాజసేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువులంత వెల చేయక పోయినను మాటలనే యక్కువవెలకు విక్రయించి పోవుచుందురు. గ్రామములోని వైదిక బృందముయొక్క ప్రేరణచేత సప్తసంతానములలో నొకటైన దేవాలయ నిర్మాణము జీయ నిశ్చయించుకొని, రాజవరపు కొండనుండి నల్ల రాళ్ళు తెప్పించి రాజశేఖరుడుగారు రామపాద క్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడికట్టింప నారంభించి నాలుగు

నాల్గవ ప్రకరణము


సంవత్సరములనుండి పనిచేయుచుండె . కాని పని సగముకంటె నెక్కువ కాకపోయిన ను పనివాండ్రును పనిచేయింప దిరుగుచుండెడి యాశ్రితులును మాత్రము కొంతవరకుభాగ్యవంతులయిరి. ఈ ప్రకారముగా దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచువచ్చు చున్నందున, ధనదేవత కాతనియం దాగ్రహమువచ్చి లేచిపోటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిరపరిచయమును బట్టి యొక్క సారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్య దేవత యప్పుడప్పుడువచ్చి వెలుపలనుండియే తొంగిచూచు, భాగ్యదేవత యాతనిగృహము చోటుచేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీద గొంతఋణ మైనందున దానిమీద వడ్డి పెరుగుచుండెనే కాని మఱియొక తొందర యేమియును గలుగుచుండలేదు.


రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారయణమూర్తియు ముఖ్యులు. ఆఇద్దరిలో దామోదరయ్య రాజశేఖరుడుగారి బావమఱది; రాజశే ఖరుడుగారి తోడబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి. కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలము చేసెను, ఆ కుమారున కిప్పుడు పదియేను వత్సరములున్నవి; అతని శంకరయ్య . అతని కెనిమిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున , అతడు చిన్నప్పటినుండియు మేనమామగారియింటనే పెరిగినాడు. అతనికే సీతనిచ్చి వివాహముచేయ వలయునని అల్లిదండ్రుల కిద్దరికీని నుండెను, భార్య పోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుడుగారి సాయముచెతనే రెండవవివాహము చెసిగొనెనుగాని యాచిన్నది

రాజశేఖర చరిత్రము

పెండ్లినాటికి తొమ్మిదిసంవత్సరములలోపు వయస్సు గలది. గనుక, ఈడేరి కాపుగమునకువచ్చి రెం డుసంవత్సరములుమాత్రమే యయినది. అతనికి ద్వితీయ కళత్రమువలన సంతానమింకను కలుహలేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాడు; అతనికి రాజశేఖరుడుగారి చెల్లెని నిచ్చునప్పటికి రాజశేఖరుడుగారి తండ్రియు ధనవంతుడు కాడు. వారిది పూర్వము వసంత వాడ నివాసస్ధలము, రాజసేఖరుడుగారి తండ్రి తనయింటికి గోడలు పెట్టుంచుట కయి పుట్టలు ద్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొఱకినది. ధనము దొరికిన తరువాత స్వస్ధలములో నున్న విశేషగౌరవ ముండదని యాచించియో, లోకుల యోర్విలేని తనమునకు జడిసియో రాజశేఖరుడుగారి తండ్రి దారపుత్రోదులతో నిల్లుని వాడ వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములు గొని కొంత కాలమునకు మరణము నొందెను. భాగ్యపోవు వఱకును దామోదరయ్య రాజశేఖరుడుగారి యింటనే యుండి , ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తా నపహరించుచు బయికి దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టి నపుడు రాజశేఖరుడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడబుట్టిన పడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. అందుమీద గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱిది కట్టుబట్టలతో నిల్లు వెడలగొట్టినాడని యూరివారందరి ముందఱ జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, యాఱు నెలలకు గడ్దమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూత

నాల్గవ ప్రకరణము


వైద్యుడనని వేషమువేసుకొని నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. అవరకే దామోదరయ్య తా నార్జించుకొన్న ధనమును వేఱుజాగ్రత్త చెసికొన్నందున అప్పు డాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొక చోట గాపురముండెను. అతని భూతవైద్యము నానాటికి బలపడి నందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చుకొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామోదరయ్య భాగ్యవంతుడగుట యేగాక , జనులచేత మిక్కిలి గౌరవసహితము పొందు చుండెను.


రెండవయాతడైన నారాయణమూర్తి మొదట సద్వంశమున బుట్టినవాడేకాని దుర్మార్గులతో సహవాసముచేసి తనకుగల కాసువీసములను వ్యయము జేసికొని బీదవాడయ్యను పయికిధనికుని వలె నటించుచుండెను. అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించి యుండిన చిహ్నములుమాత్రము పోనందున , నారాయణమూర్తి తఱచుగా రాజశేఖరుడుగారి యింటికి వచ్చుచు రహస్యమనిచెప్పి రాజశేఖరుడుగారిని లోపలికి బిలిచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగు చుండును. ఆఋణము మరల తీరునది కాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవతుల గౌరవమును కాపాడుచుంటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, అతడు చిన్నతనములో తనసహ పాఠిగనుకను, అడిగిన మొత్తమును రెండవా రెఱుగకుండ చేతిలోబెట్టీ పంపుచుందురు. అతిధానముతో సరిగవస్త్రములు సుగంధద్రవ్యములు మొదలగువానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయుచుండును. ఇదిగాక యాత డితరస్ధలములలో జేసిన ఋణములకయి ఋణప్రదా

లు తొందరపెట్టినందున, రాజశేఖరుడుగారు తన సొంతసొమ్ములో నుండి అప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండుసంవత్సరముల క్రిందట నారయణమూర్తి యొక్క పెత్తండ్రిభార్య సంతులేకుండ మృతినొందినందున , ఆమె సొత్తు పదివేలు రూపాయలు అతనికి జేరెను. ఆ సంగతి తెలిపినతొడనే రాజశేఖరుడుగారు పారమానందభరితులై నారాయణమూర్తి యింటికి బోయి యాతని నాలింగనము చెసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినపని లేదనియు యావద్ధనముతోను గౌరవముతో సుఖజీవనము చేయవలసినదనియు జెప్పి యాదరించిరి. రాజశేఖరుడుగారి కీవఱకు బదులు చేయవలసిన యవస్యకమంతగా తట స్దింపనందునను , ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తనధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితో బలుమారు పూర్వము చెప్పుచు వచ్చెను.


ఒకనాడు నాలుగు గుడిల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడు గారు కచేరిచావడిలో బలువురతో గూరుచుండియున్న సమయమున రుక్మిణి నూతి వద్దకువచ్చి యక్కడనుండి పెరటి గుమ్మము దగ్గఱకు బోయి లోపలనేనిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలో బాఱవేయవచ్చినన పొరిగింటివారి యాడుపడుచుతో మాటాడుచుండెను . అప్పుడు చెతితో తాటాకు గిలకగుత్తుల నాడించుచు నెత్తిమీద నొకబొట్టుపెట్టుకొని యొక్క యెఱుగత యామార్గమున బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొక విచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీ మనసులో నున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను .

నాల్గవ ప్రకరణము


అ మాటలు విని యాప్రబోధికను దొడ్దిలోనికి బిలుచుకొని పోయి కొట్లచాటున గూరుచుండబెట్టి తాను లోపలికిబోయి చేటాలో బియ్యము పోసి తెచ్చి యాబియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి ఫాలమున మోపి మ్రొక్కి కార్యమును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచిపెట్టెను. అప్పుడాయెఱుకత తాను వల్లించినరీతిగా నిష్టదైవతముల దలచుకొని నాకీయుడని వేడుకొని యామచేయి పట్టుకొని "భాగ్యము కల చెయ్యి, ఘ్రొష్ట గల చెయ్యి" యనిపలికి, నీ నొక్క తలపుతలంచినావు; ఒక్కకోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు; అది కాయో పండో కల్లో నిజమో చేకూఱునో చేకూఱదో యని తొృక్కట పడుచున్నావు; అది కాయ కాదు పండు ; కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూరనున్నది. ఆడువారివంక తలంపా మగవారివంక తలపాయందు వేమో మగవారంటే గడ్డము ఆడువారు అంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి 'మగ వారివంక తలం' పన్నప్పుడామె మొగ మొకవిధముగా నుండుట చూచి సంగతి నూహించి "నీది మగవారివంక తలంపు ; శీఘ్రము గానే కార్యము గట్టెక్కనున్నది; నీరొట్టెనేతబడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సమ గతి నంతను దెలిసికొని, రుక్మిణిమగడు దేశాంతరగతు డయినవాతనా వఱకే విని యున్నదికాన "నీమగడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాడు; నీమీది మోహముచేత నెల దినములలొ నిన్ను వెదకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని వేరునొకదానిని తీసి పసపుదారముతో చేతికి కట్టి ప్రాత బట్టయు రవికయు బుచ్చుకొని, మగనితొ గలిసి కాపురము చెయుచున్న తరువాత క్రొత్తచీర

రాజశేఖర చరిత్రము
పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణీయు బరమానంద భరితురాలయి అంత సూటిగా దన మనోగతమును దెలిపి నందునకై యెఱుకతయొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి బోయెను.

ఐదవ ప్రకరణము

సీత యొక్క వివాహ ప్రయత్నము- బైరాగి యొక్క ప్రసిద్ది- అతడు వైద్యమునకు గుదురుట - జనార్దన స్వామి యుత్సవము- రుక్మిణి యొక్క కాసులు పేరు పోవుట .


ఒకనాటి యుదయమున రాజశేఖరుడుగారు సభ తీర్చి చావడిలో గూర్చుండి యుండగా సిద్దాంతి వచ్చి తాటాకులతో అల్లిన యొరలోనుండి సులోచనముల జోడును దీసి ముక్కునకు దగిలించుకొని దాని దారమును నొసటనుండి జుట్టుమీదుగా వెనుకకు వేసుకునికూరుచుండి తాటాకుపుస్తకమునకు గాట్టిన దారములో గ్రుచ్చిన చిన్నతాటాకు ముక్కలను నాలు గయిదింటిని పయికిదీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంక జూడసాగెను.


రాజ - సిద్దాంతి గారూ ! సీత కేసంబంధము బాగున్నది ?


సిద్దాం - చక్కగా నాలోచించి చూడాగా మంత్రిప్రగడ బాపి రాజు గారి కుమారునుజాతకము స్ర్వ విధముల నౌకూలముగా గనబడుచున్నది.


మంత్రిప్రగడ బాపిరాజు తన కొమారున కేలాగున నైన సీతను జేసికొన రాజశేఖరుడుగారితోడి బాంధవ్యమువలన బాగుపడవలెనని చిరకాలమునుండి కోరియున్న వాడు కాన , ఈనడుమ దన యింట జరిగిన సీతాకళ్యాణ సమయమున సిద్దాంతికి మంచి దోవతుల చాపు కట్టబెట్టుటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటె మంచి బహుమానము చేసెదనని యాశపెట్టెను.


రాజ - బాపిరాజు కుమారుడు నల్లని వాడు. చదువులోను తెలివిలేదని వినుచున్నాను. వా డప్పుడే దుస్సహవాసముచేత చెడు

రాజశేఖర విజయము


తిరిగుళ్ళు తిరగ నారంభించినాడట ! వానికి సీతనియ్యను, మస శంకరయ్య జాతక మెట్లున్నది ?


సిద్దాంతి - మీ మేనల్లునిజాతకము చూచినాను. సమస్తవిధముల చేతను దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతదికూడ కృత్తికానక్షత్రమే- శ్లో. అజైక ప్రాచ్చవిష్ఠాచ పూర్వ స్వధకృత్తికా ! మృగశీర్షించ విత్తాచ నవితోత్తర ఫల్గునీ ! జ్యేష్ఠాచ విశ్వతోయంచ నక్షత్రక్యేనినస్యతి! ఏకారాశౌపృధగ్ధిస్ణ్యేచో తమస్పూణివీడనం - అని శాస్త్రములో పయి నక్షత్రముల యైక్యము నందు కన్యావరులకు నశనము సంభవించునని చెప్పబడియున్నది . బాపిరాజు కొమారుని జాతకము సర్వోత్తమముగ నున్నది - అందులో కేంద్రాధిపతికి త్రికోనాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరు లయిన తృతీయ, షష్ఠ, ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు- శ్లో. కేంద్రత్రికోణపతయ స్సంబంధేన పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేషశుభదాయకా అని శాస్త్ర ప్రకారమతడు మిక్కిలి యదృష్టవంతుడు. తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి ? మఱినాలు గేండ్లు పైబడిన యెంత బుద్దివంతుడగునో యెన రెరుగుదురు ? నా మాట విని చిన్నదాని నాతని కిండి.


రాజ- నేను బాపిరాజు కొడుకునకు పిల్ల నియ్యను. నాచెల్లెలు పోవునప్పుడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చెయి వేయించుకున్నది, దామోదరయ్యయు సీతనిచ్చి శంకరయ్యను మీయొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమోట పెట్టుచున్నాడు. ఇప్పుడు నేను పిల్ల దానిని మఱియొకరి కిచ్చిన యెడల నా చెల్లెలు పోబట్టి యట్లుచేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మాశంకయ్య బహుబుద్దిమంతుడు; స్ఫుహద్రూసి; విద్యావినయసం ప

         ఐదవ ప్రకరణము
           

న్నుఁడు, పిల్లనాతనికే యిచ్చెదను, జాతకమును మీరు మఱియొక సారి శ్రద్దతో జూడవలెను,

అప్పుడు సిద్దాంతి తాను మఱియొక విధముగాఁ జెప్పిన కార్యము లేదని తెలిసికొని కొంచెముసే పాకాశమువంకఁ జూచి యనుమానించి "సీతజననము కృత్తికానక్షత్రముయొక్క యేపాదము?" అని ప్రశ్నవేసెను.


రాజ----ద్వితీయ పాదము,


సిద్దాం----శంకరయ్యది ప్రథనమపాదము, అవును, అనుకూలముగానే యున్నది----శ్ల్లో|| ఏకరేచైకిపాదేతు వివాహః|ప్రాణహానిదః దంపత్యోరేక నక్షత్రె భిన్నపాదేశుభావహ?|| ---- అనుశాస్త్రమునుబట్టి దోషము లేకపోఁగా శుభావహముగా కూడనున్నది. తప్పక సీత నీతని కిచ్చి వివాహము చేయుండి.


రాజ----ఈసంవత్సరములో పెండ్లికనుకూలమయిన ముహూర్త మెప్పుడున్నది?


సిద్దాంతి ----"శ్లో|| మాఘ పాల్గున వైశాఖ జ్యేష్టమాసా శుభప్రదాః" అనుటచే మాఘమా స మనుకూలముగ నున్నది. బహుళపంచమీమంగళవారమునాఁడు రవి కుంభలగ్నమం దున్నాఁడు. ఆముహూర్తము దివ్యమయినది ----

శ్లో|| అజ గో యుగ కుంభాళిమృగరాశి గతేరవ్ౌ | ముఖః కర్మ గ్రహ స్త్వన్యరాసికేన కదాచన|| అని ప్రమాణవచనము.

రాజ----మీకొమార్తె జబ్బు నీమ్మళముగా నున్నదా ?

సిద్ధాం----తమ కటాక్షమువలన నిమ్మళ్ముగానే యున్నది. నాఁడు మీరుచెప్పిన బైరాగి బహుసమర్దుఁడు. అతడు మాయింటగ్రహమును నిమిషములో వెళ్ళగొట్టినాఁడు. భూతవైద్యు లంచ

          రాజశేఖర చరిత్రము

ఱును మాచిన్నదానికిఁ బట్టినగ్రహమును వదిలించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. అతడు మూడుదినములు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టీనాఁడు. నాఁటినుండియు పిల్లది సుఖముగా నున్నది.

          రాజ ----మాచెల్లెలు సుబ్బమ్మకు దేహ మస్వస్తముగనున్నది.
   మనగ్రామములో నెవ్వరును మంచివైద్యులు కనఁబడరు. నాకేమి చేయుటకును తోఁచకున్నది.

రాఘ----బైరాగిచేత మం దిప్పించరాదా! అతడు మీరు సోమ్మిచ్చిన మాత్రము పుచ్చుకొనఁడు ; ఈయూర నెందఱికో ధర్మా ర్ద్దముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాఁడు.

రాజ----గట్టీవాఁ డయినయెడల నీ వాతని నొక్కపర్యాయము మధ్యాహ్నము మాయింటికి వెంటబెట్టుకోనివచ్చి సుబ్బమ్మను చూపెదవా ? నాలుగుదినములనుండి దానిశరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బందిపడు చున్నాము.

రాఘ----అవశ్యముగా దిపికొనివచ్చెదను. అతని కాభేషజములు లేవు. ఎవరుపిలిచినను వచ్చును.

సిద్ధాంతి----ఆతనిజడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ----ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట ! ఆతఁ డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయుచున్నాఁడు. ఈవిద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడనుండి వచ్చును  ?

రాజ----రాఘవాచారీ ! దేవున కధ్యయణనోత్సవములు శ్రమ ముగా జరుగుచున్నవా  ?. రాఘ - తమయనుగ్రహముండగా ఉత్సవములకేమిలోపము ? నిరుడు పుష్యమాసములో సంక్రాంతినాటి యుత్సవము ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో జరిగినది. నిన్ననో మొన్ననోలాగున కనబడుచున్నది; అప్పుడే సంవత్సర మయినది. రేపే సంక్రాంతి - ఈసంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మగారికి జబ్బుగా నున్నందున సమయముకాదని యూరకున్నాను.

రాజ - క్రిందటి సంవత్సరము నూటయేబది రూపాయల నిచ్చినాను. ఈసంవత్సరము మాలోపల వివాహములు తటస్థమయినవి గనుక నూఱురూపాయలనుమాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను.

రాఘ - చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను.

రాజ - రాఘవాచార్యులూ! బైరాగి నవస్యముగా నేడే మాయింటికి తీసికొనివచ్చి నీవు మఱియొకపనిని చేసుకోవలెనుజుమీ? ప్రొద్దెక్కు చున్నది. శీఘ్రముగా వెళ్ళు - సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్నపక్షమున శంకరయ్యజాతకము మఱియొకసారి చూడుండి; ఎవరితోనైనా నాలోచించవలసి యున్న యడల, లచ్చయ్య శాస్త్రిగారికి కూడ ఆజాతకము చూపవచ్చును.

సిద్ధాంతి - చిత్తము. నా కటువంటి సందేహము లేదు.

రాజ - అట్లయిన, ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి.

అని చెప్పి పంపినతరువాత సభ వారందఱును తమయిండ్లకు బోయిరి. రాజశేఖరుడుగారు భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు లాభైరాగిని వెంట బెట్టుకొనివచ్చి యింట బ్రవేశ పెట్టెను. నిత్యమును రాజశేఖరుడుగా రాతనికి సకలోప 64 రాజశేఖర చరిత్రము


చారములును చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలె ననునాసక్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పాలును పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్ళకు వలయు పుల్లలను సమకూర్చుచు బహునిధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహసంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయుచుండెను.ఈ ప్రకారముగాఁగొన్నిదినములు జరగఁగా నింతలో జనార్దనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్సవమును జూచుటకై చుట్టుప్రక్కలగ్రామముల నుండి వేలకొలది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండెను.

     మాఘశుద్ధమున నేకాదశినాఁడు రిధోత్సవమునకు వలయు ప్రయత్నములన్నియు జరుగుచుండెను. నాలుగుదినములు నుండి 

రధమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డలను చిత్రవర్ణము గల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును గరుడవిగ్రహమును గల ధ్వజపటములను గట్టి రధమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గొలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండలతోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరటికంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రధము నీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తు కొని మోరలు సారించి వీధివంకఁ జూచు చుండెను. ఆ రధమునకుఁ బదియడుగుల దూరమున వెదురు వేళ్లతో నల్లబడి పయిన గుడ్డ మూయబఁడి వికృతాకారముతో నున్న యాంజనేయ విగ్రహములోను గరుడ విగ్రహములోను మనుష్యులు దూరి చూడవచ్చిన పల్లెలవాండ్రును పిల్లలును జడిసికొనులాగున

ఐదవ ప్రకరణము

నెగిరెగిరిపడుచు లక్కతలకాయల ద్రిప్పుచుండిరి . అప్పుడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యములతో గొండదిగివచ్చి రధమునకు మూడు ప్రదక్షణములను జేయించి స్వామి నందు వేంచేయింపజేసిరి. చెంతలనున్నవరందఱును క్రిందనుండి యరటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రధముమీద, గూర్చున్న యర్చకులును తదితరులను చేతులతో దెలు తగులకుండ గాచు కొనుచు నడుమనడుమ జేగంటలు వయించుచు గోవిందా యని కేకలు వేయచుండిరి. ఆ కేకలతో రధమునకు గట్టియున్న మ్రోకులను వందలకొలది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులు వీధి యరుగులును కూలునట్ట్టుగా రధమునీడ్చుచుండిరి. అంతట బోగముమేళ యొకటి రధమునకు ముందు దూరముగా నిలువబడి మద్దెలమీద జేయివైచుకొని యొకటే యాడసాగెను. మద్దెలమీద దెబ్బ వినబడినతోడనే దేవునితో నున్న పెద్దమనుష్యులందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్లి యాటక త్తియలముందు మున్నున్నవారిని వెనుకకు పంపి తాము పెద్దలయి యుత్సవమునందు గానవినోదమనకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి .


అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషితురాలయి ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీగాళ్లపై నొఱయ, ఎడమ భుజము మీదనుండి వచ్చి జరీచెట్లుగల సరిగంచు పయ్యెదకొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొక వింతయందమును గలిగింప , కాళ్ల యందియలును, పాంజేబులును, గళ్ళుగళ్ళున శ్ర్యావ్యనాదము చేయ , కుడుచేయితప్ప గడమభాగ మంతయు బయిటలో డాగి కనబడకయున్న వ్ంగపండుచాయగల గుత్తపుపట్టురైక నీరెండెలో ద్విగుణ

రాజశేఖర చరిత్రము

ముగా బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకు బరిమళము లెనంగుచు గంధవహుని సార్ధకనాముని జేయ నడచివచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రధమువంక జూచుచుండెను. ఈదేశములో సాధారణముగా స్త్రీలు తమభర్తలు గ్రామమున లేనప్పుడు విలివచీరలు కట్టుకొని యలంకరించుకొనుట దూష్యముగా చెంచువా రయినను, యితరులయింట జరుగుశుభ కార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామికళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములును జూడబోవునప్పుడు గాని యెరుపుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచినగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యమునేమని చెప్పుదును ! నిడుదలై సోగ లైనకన్నులకు గాటుకరేఖలొకసొగసు నింప, లేనవ్వుమిషమున నర్ధచంద్రుని బరిహసించు నెన్నుదురున బలచంద్రుని యకృతినున్న కుమ్మబొట్టు ర్ంగు లీన శృగారరస మొలికెడి యా ముద్దు మొగము యొక్క యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలిసినదే కాని చెప్పితీఱదు. రధ మామె దృష్టిపధమును దాటి పోయినతోడనే ద్వాదశోర్ధ్వవుండృములను దిట్టముగా ధరియించి దానరులు ఇనుప దీపస్తంభములలో దీపములు వెలిగించుకొని నడుమునకు బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతితో నెమలికుంచె యాడించుచు రెండవచేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ పోకకుండ నేర్పుతో దేహమునిండ నంటించుకొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీపస్తంభముల మట్లలో వేయుచు నదిచిరి. ఆ సందడి యడిగినతోడనే రుక్మిణీ తల్లియు మఱికొందఱును తోడనడువ బయలు దేఱి ఉత్సవమునిమిత్తమయి పొరుగూళ్ల నుండివచ్చిగిడారములలో

ఐదవ ప్రకరణము
బెట్టిన కంచరి దుకాణములను పండ్లయంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలునువిసరివైచుచు, కాశికావళ్ళు ముందుపెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శనార్ధము వెళ్ళెను. అక్కడ నిసుకుచల్లిన రాలకుండు మూఁకలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లయ్యవలె ననునపేక్షతో దూఱి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యీవలంబడినఁ జాలునని నడుమనుండియే మరల యీవలకువచ్చి సంతోషించు చుండిరి. వారికంటెబలవంతులయినవారు గర్భాలయము వఱకును బోయి పండ్లను డబ్బును పూజారి చేతిలోఁబెట్టియీవలఁ బడుచుండిరి. అర్చకులును ఒకరు విడిచి యొకరు వెలుపలికివచ్చి చెమటచేఁదడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యాయుక్కలో బాధపడుచుండిరి. ఈప్రకారముగా వచ్చినయర్చకులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యామెచేతిలోనిపండ్లను బుచ్చుకొని లోపలికిఁబోయిస్వామికి నివేదనచేసి వానిలోఁగొన్నిపండ్లను తులసి దళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱశిరస్సుల మీఁదను శఠగోపమునుంచెను. అంతట మాణిక్యాంబ వెనుకకుతిరిగి యాలయ ద్వారమును దాఁటుచుండెను.రుక్మిణి యామెచెఱఁగు పట్టుకొని వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయుమఱియొకప్రక్క నొకముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయి పోనిచ్చి కాసుల పేరును పుటుక్కున
రాజశేఖర చరిత్రము
త్రెంచెను. రుక్మిణి వెనుక మరలి చూచునప్పటికి చేయియు గాసుల పేరునుగూడ సదృశ్యములాయెను. రుక్కిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నము చేసిరి కాని యాదొంగనే వెదకుచుండెను.అప్పుడు రుక్కిణి మొదలగువారు ప్రదోషసమయమున నగపోయినం దునకయి మఱింత విచారించుచు నింటికి బోయిరి.

ఆఱవ ప్రకరణము

సొమ్ము పోయినందుకుమంత్రజ్ఞులు చేసిన తంతురుక్మిణిమగఁడు పోయిన వర్తనొకఁడు చెప్పుట. రుక్మిణికి రుగ్మ త వచ్చుట సోదె యగుట మగడుఁ పట్టుట భూతవైద్యము సువర్ణవిద్య బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.</poem>

మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు చీధియరుగుమీఁదఁ గూరుచుఁడియుండఁగా సిద్ధాంతి తంతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁదీసికొని వచ్చియరుగుమీఁద నొకప్రక్కను చతికిలఁబడెను.చేతిలో వెండిపన్నువేసిన పేపబెత్తమును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళును బెంచుకొని కనుబొమల సందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరుచున్న యీవిగ్రహమును నఖ శిఖపర్యంతమును తేఱిపాఱఁజూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహామంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలమునుండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరిపేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయినవస్తువుల నిమిషములో దెప్పించి యిచ్చిన్నార; వీరు నాలుగు సంవత్సరముల నుండివానప్రస్థాశ్రమమును స్వీకరించి యున్నారు." అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁడయినను జన్మదినము నుండియు నెఱిఁగియున్నవానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖగోమైర్వనాశ్రమీ' యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్ళును వెండ్రుకలును బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరిశాస్త్రులు తనమంత్రసామర్ధ్యమును గొంతసేపు పొగడుకొని తా నావఱకు పోయినవస్తువులు తెప్పించినానన్న స్థలములపట్టిక నొక దానిని బహుదినములు ప్రయాసపడి వల్లించినవానివలె తడవుకో కుండ జదివెను. అప్పుడు సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని ప్రార్థించెను. తోడనే హరిశాస్త్రులు తన ముక్కుపుటములయొద్ద వ్రేలుపెట్టుకొనిచూచి, ఆకాశము వంక జూడ్కినిగడించి వ్రేళ్లుమణచి యేమో లెక్కించి నిమిష మాలోచించి 'పోయినవస్తువు ఇక్కడకువచ్చుచు బోవుచు నుండు వారిచేతనే చిక్కినదికాని యిల్లు దాటిపోలే' దని చెప్పెను. ఇంతలో రాజశేఖరుడుగారి ముఖప్రక్షాళన మయినందున నందఱు గలిసి లోపలికి బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్త్రులు వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భార మనియు, మధ్యాహ్నము వచ్చి యంత్రము వేసెదనుకాబట్టి యాసమయమున కింట నున్న సేవకు లందఱును సిద్ధముగా నుంచవలయు ననియు జెప్పి, 'లోపలి నుండి కొంచెముబియ్య మిప్పుడు తెప్పింపుడు' అని కోరెను. సిద్ధాంతియే లోపలికి బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్త్రుల కోరికప్రకారము గృహమున గనబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమీదట శాస్త్రులు తన మంత్రప్రభావమును గొంచెము చిత్తగింపవలయు నని మనవిచేసి, అక్కడ నున్నవారిలో నెవ్వరైన నొనవస్తువును దీసి రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని చెప్పి, తాను వీధిలోనికి బోయెను. అప్పుడు రాజశేఖరుడుగారు తన యుంగరము లొకనిచేతి కిచ్చి పదిలముగా దాపించి, యాతడు వచ్చి కూరుచున్నతరువాత శాస్త్రులనులోపలికి బిలిచి యుంగరమును దాచినవానిని జూపు మని యడిగిరి. శాస్త్రులు తోడనేయక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొక రొకరే వచ్చి బియ్యమును పళ్ళెములో బోయవలె నని చెప్పి ఆఱవ ప్రకరణము

తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పు డందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్లెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసిన వాఁడీతఁడని చూపెను. అప్పుడక్కడనున్నవారందఱును నద్భుతరసాక్రాంతులయిరి. రాజశేఖరుఁడుగారును అతఁడు మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తిచేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్నమునఁ దప్పక రావలయు నని పలుమారు ప్రార్ధించి తీసుకొని రమ్మని సిద్దాంతితోను జెప్పెను. సిద్దాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చున్నప్పుడే సిద్దాంతియు శాస్త్రియు రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాఁబట్టి రాజశేఖరుఁడు గారికి నమ్మకము పుట్టించుట కయి ముందుగా చేయవలసిన తంతును కూడఁబలుకుకొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుకఁ దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దాచినాఁడని చెప్పవలసిన దనియు సిద్దాంతి యింటివద్దనే నిర్ణయము చేసినందున శాస్త్రు లాతని సాహాయ్యము చేత నిమిషములో నుంగరమును దీసిన వానిని చూపఁగలిగెను. మధ్యాహ్నాభోజనము చేసి బయలుదేరి కావలసిన పరికరములతో సిద్దాంతియు హరిశాస్త్రులును వచ్చి రాజశేఖరుడు గారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులను తక్కిన వారును రావింపబడిరి. హరిశాస్త్రులకు వినబడినట్లుగా సిద్ధాంతి రధోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచట నుండొరో యా సంగతులు వెంట వెళ్లినవారి నడిగి తెలుసుకొను చుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొక 72

రాజశేఖర చరిత్రము

మాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి వారినందఱిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను. తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతి కొక రాగికడియమును దొడుగుకొని మరల వచ్చి, అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్కవిగ్రహమును వేసి, దాని నాభిస్థానమునం దానుతెచ్చిన యిత్తడి పెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేక వేసి కొంతసే పేమోకన్నులు మూసి కొని జపము చేసి , రాజశేఖరుఁడుగారివంక జూచి యొక తెల్ల కాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడు గారికుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్లకాగితము దీసికొని వచ్చి యిచ్చెను. అప్పుడాకాగితము నందఱును జూచుచుండఁగాఁ సమానము లైన యెనిమిది ముక్కలుగాఁ జించి యం దొక్కముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారికిచ్చివేసి, తాను సాసించు దేవతయొక్క శక్తి చేత ఆకాగితపు ముక్కమీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడి పెట్టెలోఁబెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యాముక్కను మరలఁ బయిటికిఁ దీసి తన చేతులోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రింద నుంచి మూలలను కుంకుము రాచి. హారతికర్పూరపు తునకతో దాని మిఁద బీజాక్షరములును యంత్రమును వేసి క్రిందనునిచి, యొకరొకరేవచ్చి దాని మిఁద జేయివైచి పొండని యాజ్ఞపించెను. స్పష్టముగా గనబడుచున్న యాతెల్లకాగితము మిఁద నెల్లవారును చేతులు వేసి పోయి యేమిజరుగునో చూత మనువేడుక

ఆఱవ ప్రకరణము

చేత దమస్ధానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయినతరువాత హరిశాస్తృలాముక్కనుదీసి సాంబ్రాణి దూపమువేసి, హారతికర్పూరము వెలింగించి దానిమీద ఆముక్కను నాలుగయిదుసారులు మోపి రాజశేఖరుడుగారి చెతికిచ్చెను. ఆయని చేతిలో బుచ్చుకొని చూచునప్పటికి దానిమీద పెద్దయక్షరములతో 'చాకలసరడు ' అని వ్రాసియుండెను. ఆకాగితముపైకెత్తగానే యెల్ల వారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడు చుండెను. దగ్గరనున్న వారిలో నొకరుదానిని పుచ్చుకొని చదువు నప్పటికి చాకలి నర్వడొకడుతప్ప మిగిలినవా రందఱును నద్భుతప్రమోదమగ్న మానసులయి చప్పటలు గొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనా బలమును వేయినోళ్ళం గొనియాడ జొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో ' వీడెనగదీసినదొంగ అప్పుడు వెనుక నిలుచున్నాడని వానిని నిందింపసాగిరి. సీత వచ్చి కాసులపేరు పోయినప్పుడు సర్విగాడు పండ్లుచేతిలో బట్టుకొని మా వెనుక నిలువబడినా డని చెప్పెను. అందుమీద నందఱును నగ హరించిన వాడు చాకలి సర్విగాడు తప్ప మఱియొకడు కాదని నిశ్చయించిరి. యింటనున్న వారును రాజశేఖరుడుగారునుకూడ ఆప్రకారముగానే నమ్మిరి. ఆవస్తువును రాజశేఖరుడు గారునుకూడ ఆప్రకారము గానే నమ్మిరి. ఆవస్తువును శీఘ్రముగా దెచ్చియిమ్మని యడిగినప్పుడు , ఆచాకలివాడు కంటికి నేలకు నేకధారగా తోదనము చేయుచు దా నేదోషము నెఱుగనని బిడ్డల మీదను భార్యమీదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యదియంతయు దొంగయేడువని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున వాని నన్నివుధముల నడిగినను వాడు తను నిరపరాధి ననియే చెప్పి యేడుచుచు వచ్చినందున , హరిశాస్త్రులు రాజశేకరుడుగారిని చాటునకు 'మాట ' యని పిలుచుకొనిపోయి ' మీ సెల

రాజశేఖర చరిత్రము

వయినపక్షమున వీనుకి ప్రయోగము చేసి పోయిన వస్తువును దెప్పించెద ' నని చెప్పెను. వాడు చిన్నతనము నుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవా డయినందున వానికే హానియు జేయ నొడబక రాజశేఖరుడు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి ననియేడ్చుచు నింటికి బోయెను. మొదట సిద్దాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వనిపేరు వ్రాయుమనియే. అతడమ్మవారిపెట్టెను దెచ్చుమిషమీద నెలుపలకు బోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతో 'చాకలసరడ ' ని యక్షరజ్ఞానము చక్కగా లేకపోవుటచేత వా ఒత్తు పోగొట్టి వ్రాసి యాఱపెట్టి పెట్టెలో బెట్టుకొని వచ్చెను. రాజశేఖరుడుగారి కొమారుడు కాగితమును తీసికొనివచ్చినపుడు తానాపేరును వ్రాసిన కాగితమంత ముక్కను జింపుకొని తక్కిన దానినిచ్చివేసి, దానిని పెట్టెలో పెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిందీసెను . అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమాన పడలేదు. ఆ కాగితము మీద హారతికర్పూరముతో బీజాక్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకే కాని మఱియొకందు నకుగాదు ; తరువాత సాంబ్రాని పొగలోను కర్పూరపు దీపము మీదను పొగచూరబెట్టుట మున్నుకనబడకుండ నున్నయక్షరములు స్పుటముగా గనబడు నట్టు చేయుటకయి కావించిన తంత్రము . ఈ ప్రకారముగా తన మంత్రప్రభావము చేత శాస్త్రులంతటి ఘసకార్యమును జేసినందునకయి వస్తువు దొరకక పోయినను రాజశేఖరుడుగా రతని కొక దోవతులచావును కట్టబెట్టి నాల్గు రూపాయల రొక్కము నిచ్చిరి. యింటికి బోయిన తరువాత హరిశాస్త్రులును సిద్ధాంతియు వానిని సమభాగంబులుగా బంచుకొనిరి .

ఆఱవ ప్రకరణము

ఆమఱునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యిక్కతెయు వడమటింటి పంచపాళిలో గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే యింకను మగడు రాడాయెనేయని తలపోయుచు వస్తువు పోయిందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొకచిన్నవాడు లోపలికివచ్చి చేతిలోని బట్టల మూటను క్రింద బడవైచి రుక్మిణి మొగము వంక జూచి పెద్దపెట్టున నేడ్చెను. అదిచూచి రుక్మిణి సంగతియేమో తెలిసికొనకయే తానును నేడ్వజొచ్చెను. ఆరోదనధ్వని విని యింట నున్నవారందఱును లోపలనుండి పరుగెత్తుకొనివచ్చి యేమియని నడిగిరి. అప్పుడా చిన్నవాడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణి మగడు నృశింహస్వామి కాశినుండి వచ్చును త్రోవలో జగన్నాధము వద్ద పుష్యశుద్ధ నవమి నాడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు, దహనాదికృత్యములను తానే నిర్వహించితి ననియు జెప్పెను. ఆమాటలు విన్నతోడనే యింటనున్న వారందఱును నొక్కసారిగా గల్లుమని యేడ్చిరి. ఆయాక్రంద ధ్వని విని చావడిలో నున్న రాజశేఖరుడుగారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబున దెలిసికొని పలుతెఱింగుల విలపించిరి. అప్పుడక్కడనున్న పెద్దలందఱును వారిని వోదార్చి వారిచే స్నానములుచేయించి వేదాంత వచనముల నుపదేశిం పసాగిరి. యిట్లు కొన్నిదినములు జరిగిన తరువాత బంధువులు మొదలగు వారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజఏశేఖరుడు గారితో బ్రసంగించిరి గాని, ఆయన తనకొమార్తె మీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును కూడ దానివలన నొకబాధకము లేదని చెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి. 76

రాజశేఖర చరిత్రము

మనదేశములో పతిరహీతులగు యువతుల దురవస్ధను తలచుకొన్న మాత్రమున పగవారి కయినను మనస్సు కలుక్కుమనకమానదు. పతిశోకమును మఱువునట్లుచేసి యాదరింపవలసిన తల్లిదండ్రులే జీవితే శ్వరులుపోయి దుఃఖసముద్రములో మునిగియున్న తమ కడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారములకును దూరురాండ్రను జేసి, తలగొఱిగించి కురూపిణులను జేసి మునుగువేసి మూలగూర్చుండ బెట్టుదురు ; రెండు పూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయినతరువాత మూడుజాములు కిన్ని మెతుకులు వేయుదురు ; మనసయినను మంచిబట్ట కట్టుతో నియ్యక అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తురు. వేయేల ? మగడు పోయిన వారిజీవనములనే దుఃఖభాజనములనుగా జేసి వారిని జీవచ్చవములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుడలంకారముగా దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాసి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దతుడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే తోచును ; యింటగల కష్టమయి నట్టియు నీచమయనట్టియు పనులన్నియు వారిమీదనే పడును పుట్టినింట జేరగానే , వదినెలు మఱదండ్రును దాసినిగా జూతురు గారవమను మాట యుండదు; శుభకార్యము లందు నలుగురిలో దలయెత్తుకొని తిరుగుట నోచుకోగ పోగా మొగ మగపడినమాత్రమున మీద మిక్కిలి యెల్లవారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ " యనుమాటయే వినుటకు శూలమువలె గర్ణ కఠోరముగా నుండును ; యెవ్వనినైన 'విధవ ' యనుపేరును బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాడు మండిపడును.

ఆఱవ ప్రకరణము

ఈ స్దితి యంతయు కన్నులకు గట్టిన ట్లగపడి, ఆవర్తమానము తెలిసినదనినము మొదలుకొని రుక్మిణి రాత్రియు బగలును గదిలో నుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను . విచారమునకుతోడు దేహముననేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధిసంగతిని నెవ్వరును కనుగొన్నవారుగారు. కనుగొన్నతోడనే రాజశేఖరుదుగారు ఘనవైద్యుడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించిరి. అతడు రుక్మిణి పరున్నమంచము మీద గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదనిచెప్పి, యామెకు బెక్కు దినములనుండి , శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనక పోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియు జెప్పి వైద్య గ్రంధమునుండి -శ్లో పారాద్వారి మహాబలా త్రికటుకా జాజీరసోనా స్తధా ! విష్ణు క్రాసతినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వక్పత్ర నిర్గుడికా ! భార్గీపక్వ పట చ్చదాచ్చ సకలాన్ శీతజ్వరా న్నాశయేత్ - అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగితముమీద వ్రాయించి యప్పటి కింటికి బోయెను. ఆమధ్యాహ్నమునకే రాజశేఖరుడు గారు వస్తువులనన్నింటిని దెప్పించి వైద్యునకు వర్తమానము నంపినందున, అతడువచ్చి వస్తువులను చూణముచేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడువేళలను మూడుపొట్లములిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి, పులుసు, కంద పనస మాత్రము తగుల గూడదని పధ్యమును విధించి , ప్రతిదినమును రెండు పర్యయములు వచ్చి చేయిచూచి గుణమును కట్టుకొని పోవుచుండును.

రాజశేఖర చరిత్రము

మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్ధపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలవరింతలు మొదలయినవి పుట్టి జ్వర మధికముగా సాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా అతడు "రేవత్యామను రాధాయాం జ్వరో బహుదిన్ంభవేత్ " అని చదివీ యీ జ్వరము రేవతీనక్షత్రమున వచ్చినదికాన బహుదినమిలకుగాని పోదని చెప్పెను. కానియాతని మాటలయం దం తగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యుని బిలిబించి, రాజశేఖరుడు గారు రుక్మిణి జూపించిరి. అతడు చేయిచూచి పైత్య జ్వరమని చెప్పి , మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్భవచనములు పలికి, అతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుకప్రకారముగా 'లంఘనం పరమౌషధ ' మన్న యొక్క సూత్రమునే శరణము గావించుకొని లంకణములు కట్టనారంభించెను . అతడు నవజ్వరపక్వము కావలేనని పలుకుచున్నను లక్ష్యముచేయక , దినదిన క్రమమున రుక్మిణీ శుష్కించి యంతకంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని యాతని వైద్యమును మానిపించి , మరల మొదటి వైద్యునే రావింపగా నతడు వెంటనే పధ్యము పెట్టించి యౌషధ సేవ నారంభించచెను. అ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము వట్టినను ఒక పట్టున నిశ్శేషమయినది కాదు.

ఈ లోపల మాణిక్యాంబ యొక యాదివారమున నాడు నాలుగు గడియలకు దెల్లవాఱుననగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టు కొని యెవ్వరును వెళ్ళక ముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీద ప్రేమ చేత స్వయముగానే కోరలమ్మ గుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆగుడి యొద్దనున్న మాలది

ఆఱవ ప్రకరణము

మాణిక్యాంబ ధూపమువేసిన మీదట నిష్టదేవత తన కావేశమయి నట్లు కనబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి , కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటాయే గాక తాను రుక్మిణి మీదమోహముచేత వచ్చితిననియు , ఆమెనుదనవద్దకు తిసుకొని పోయెదననియు జెప్పెను. ఆసంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయు గూడ నేడువ సాగిరి ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పించ వలసినదాని నర్పించి యింటికి బోయిరి. రుక్మిణికిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొను నప్పుడునుమగడెదుటా గనబడు చుండెను. ఒకా నొకప్పుడు మాటాడునట్లు సహిత మామెకు వినబడుచు వచ్చెనుగాని యా మాటలనామె గ్రహింప గలిగినదికాదు. ఆమె యొకానొకప్పుడెవరో గుండెల మీద నెక్కి కూరుచున్నట్టు తలచి నిద్రలో గేకలు వేయు చుండును.

ఇట్లుండగా నొకనాడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణి చేయిచూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బై రాగిచేత విభూతి పెట్టించిరి కాని, అందు వలన రుక్మిణీ కేమియు గుణ మగపడలేదు . ఒక నాడొక బుడబుక్కల వాడు నెత్తి మీద తలగుడ్డ లో బక్షియీకలను బుజము మీద వేపబెత్తములు కట్టయు వీపున బెత్తములకు వ్రేలాడ గట్టిన పెద్దతోలు సంచియు నుండ డక్కి వాయించుచు వచ్చి , మాణిక్యాంబ శకున మడిగినపుడు గీతలును బొమ్మలును వేసి యున్న తాటాకుల పుస్తము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచుట్టు మీద నిండి వచ్చి యొక కామినీ గ్రహమున సోకిన దినమున దిగదుడు పుపెట్టిన బోవుననియు జెప్పి యొక వేరుమొక్క యిచ్చి దానిని వెండి

రాజశేఖర చరిత్రము

తాయెతులో బెట్టి దండ చేతికి గట్టుమని చెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణి దిగదుడుపు పెట్టెనుగాని యందువలనను గార్య మగపడలేదు . ఒక దిన మున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలబడి యది యంతయు దన మహత్మ్యమే యనియు కొండకు వచ్చి తనకు నిలువు దోపిచ్చెద ననితల్లి మొక్కున్నపక్షమున సర్వము నివర్తియగు ననియు జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను. గాని దాని వలనను రుక్మిణి దేహ స్ధితి యనుకూల దశకు రాలేదు .అంతట హరి శాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్న దాని చేత బలికించి దయ్యమును వదల గొట్టేదనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దువేళ నే వచ్చి చావడి అలికించి దానినిండ రంగు మ్రుగ్గులతో ధైర్యశాలులయిన పురుషులు చూచినను భయపడు నట్టుగా వికృత మయిన స్త్రీ విగ్రహము న్నొకదానిని వేసి తాను స్నాననము చేసి జుట్టు విరియబోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టలతో న ట్టునడుమ గూరుచుండబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందె నాదములు మ్రోగునట్టు మనుష్యుల నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదుర గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యోద్రేకము చేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్ల లోని పిల్లలదఱును జడిసిగొనులాగున"హ్రం" "హ్రీం " అని పెద్ద గొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱచేసి బెత్తముపుచ్చుకొని కొట్టబోయినట్టుగా రుక్మిణి మీదకి వెల్లి "ఉన్నది యున్నట్టుగా జెప్పు" మని కేకవేసెను. అవఱకే దేహస్మృతి తప్పి వికారముగా ఆఱవప్రకరణము. 81

జూచుచున్న యారుక్మిణి తల్లి సొదెకు వెళ్లి వచ్చి చెప్పిన ప్రకరముగా తాను నృసింహస్వామిననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించి నాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెద ననియు పలికెను. అంత నాపై త్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమోరాచి యామెకు తెలివి వచ్చిన మీఁదట లోపలికిఁగొనిపోయి శైత్యోపచారములు చేయుఁడని దగ్గఱ నున్న వారితో జెప్పి, హరిశాస్ర్తులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహ మంత్రముచేతఁ గాని శాబరముల చేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెద ననియుఁ జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్త వస్త్రమును, అఖండమునిమిత్తము మణుగు నేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనారత్రాడును, నాలుగుమేకులను, రెండుకుంచముల నీరుపట్టు లోత్తెన యిత్తడిపళ్లెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలేని యొకగదిని గోమయముతో నలికించి యుంచుఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగారా ప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచు చుండిరి. అతఁడు రాత్రితొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండ దీపమును వెలిఁగించి; అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు ముగ్గుతో గదికి నడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్భంధనము చేసి గది నాలుగు మూలలను మంత్రోదక మును చల్లి రుక్మిణి నావలకు దీసికొనిపోవచ్చు నని చెప్పి, ఆమెను లోపలికిగొనిపోయిన తరువాత గదితలుపు లోపలిగడియవేసికొని గడియసేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆగ్రహమునకు బ్రతికియున్నకాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోబడినది కాదనియు, తనయావచ్ఛక్తి వినియోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించిమాత్రము వచ్చితిననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడునుగాని మఱియొక విధముగా లోబడదనియు చెప్పి - "ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్-సర్వశత్రు సంహారిణే-శరభ సాళ్వాయ-పక్షిరాజాయ-హుం-ఫట్-స్వాహా" - అని శరభసాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱియెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్న దెబ్బలు వినబడినవి; ఆపిమ్మట నొకపెద్ద దెబ్బ వినబడెను. ఈప్రకారముగా నరగడియసేపు దెబ్బలు వినబడుచువచ్చి సద్దడగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలో గలిపెదననియు జెప్పి తానొక్కడును, గదిలోనికిబోయి యందలి సమస్తవస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆమఱుచటిదినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బువదిలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నాబ్రాహ్మణు డొకదినము రాగిరేకుమీదనొకప్రక్కను ఆంజనేయవిగ్రహమును బీజాక్షరములును రెండవ ప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగా బదునాఱు గదులుగల యీక్రిందనున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును
కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf

రుక్మిణిమెడకు గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోకదనిచెప్పెను. కొమార్తెయొక్క గ్రహబాధ నివారణచేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాపు కట్టబెట్టుటయే కాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పు డందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపివేసి తా నొక్కడును లోపల గూరుచున్నప్పుడు తలుపువేసుకొని గదియొక్క మట్టిమిద్దెకు నడుగామ మేకులను దిగగొట్టి యామేకులకు జనుపనారత్రాడును గట్టి, కొత్తబట్టలో గొంతముక్కను జించి వానికి గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడివైచి గుడ్డను దిట్టముగా నేతిలోముంచి యొకకొనకు జనుపనారత్రాడుకు వ్రేలాడగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెమునిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బఱచి, ఆగుడ్డకొనకు దీప మంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. అత డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డ యంటుకొనగా మండుచుండెడుచమురుబొట్లు నీటిలోబడి టప్పుమని మనుష్యునిమీద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మరాళ్ళవఱకును కాలినప్పు రాజశేఖర చరిత్రము

డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్పధ్వనిని జేయుచు వచ్చెను గాని పళ్లెములో నడుగునఁ ఋవ్వులుండుటచేత నిత్తడిపళ్లెముమీఁద వాయించిన ట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆగుడ్డయంతయుమండిపోయినతరువాత ఆతడు లోపలికిఁ బోయి మసి మొదలగువానినిపూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

  రాజశేఖరుఁడుగారు నువర్ణ వద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బై రాగికి సమస్తొపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, అతఁ డొకనాడు గంజాయిత్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నప్పుడుచేరబోయి వనయముతో "బావాజీ !లోకములో సువర్ణముచేయువిద్య యున్నదా?" అని యదిగెను. ఆతడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆపయిన మాటలధోరణిని 'ఆవద్యయొక్కసంగతి యెటువంటిద 'ని రాజశేఖరఁడు మహాభక్తిశ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీఁద నతఁడు 'ఆసంగతిపరమరహస్య మయినను నీకుఁజెపెద 'నని పూర్వ యుగములో స్పర్శ వేదివలన నినుము బంగార మగుచు వచ్చెనుగాని యీకలియుగములో స్పర్శవేది లేదనియు, పూర్వము శంకరాచార్యు లవా రొక యీఁ డిగవానికి సువర్ణముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె ననియు, తనగురు వావద్యను తనకుపదేశించెను గాని మంత్రముయొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింపలే దనియు,  తానిప్పుడు పసరులతోమాత్రమే బంగారమును జేయగల ననియు, రాజశేఖరఁడుగారిమీఁది యనుగ్రహముచేతనే చెప్పినట్లుచెప్పి, ఎల్ల వారును దన్ను బంగారము చేయుమని బాధింతురు                                             ఆఱవ  ప్రకరణము

గాన ఆసంగతిని మహాస్యముగా నుంచవలె నని కోరెను, రాజశేఖరుఁడు తా నాప్రకారము గోప్యముగా నుంచెడనని ప్రమా ణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁ డని బహువిధముల వానిని బ్రార్ధించి, దానిపయిని ఆబైరాగి యడి గృహ లు చేయఁగూద దనియు, చేసినయెదల వంశక్షయ మగువనియుఁ జెప్పి తనయెదల విశ్వసముగలవారికి తానే బంగారమును జేసి యిఛ్ఛెదనుగాని యోగమునుమాత్రము చెప్పనని చెప్పెను.

                                                అందుమీఁద     బంగారమునైన     జేయించుకోవలెనను   నాశపుట్టీ మరింత    శ్రద్ధాభక్తులతో     నాతని    నాశ్రయించుచు    నొకనాఁటి    యుదయకాలమున   రాజశేఖరుఁడుగారు    పాలును  శర్కరయుఁ డీసికొనిఛ్ఛి   యిఛ్ఛి  కూరుచుండీయుండఁగా ,    ఆబై రాగి     రాజ శే ఖ రుడుగారిమిఁద   దనకుఁ  బరిపూర్ణానుగ్రహముగలిగినటు . ముఖచిహ్నములవలనఁ     గవఁ బఱచుచు   నొకబేడయత్తు     బంగారమును   బేడయొత్తువెండినిఁ     దెమ్మని   యడిగి    యాతఁడు   తెఛ్ఛీయిఛ్ఛినతరువాత    వానిని రెండిని     నొకగుడ్డలో   కట్టి   రాజశేఖరుఁడుగారు      చూచుచుండఁగా   నిప్పులలో    వేసి   కొంతసే   పుండనిఛ్ఛి   యొకపసరును   దానిమీఁద   పిండి  కొంచెముసేపు  తాళపట్టుకారుతోఁ   దీసి  రెండుబేడలయెత్తు   బంగారమును  చేతులోఁబెట్టెను,అందుమీఁద   రాజశేఖరుఁదెగారు  మరింత   యాశకలవా రయి,    తమయింట   గల   బంగారమును   వెండిని   గలిపి   యేకముగ  బంగారమును   జేసిపెట్టుఁడని  బానిని  బహువిధముల  వేఁడుకొనిరి.   అట్లు   బేఁడుకొఁగా  బేఁడుకొఁగా   గోసాయి  యాతని   ప్రార్ధన    సంగీకరించి   యింటఁగల  బంగారమును  వెండినిఁజేర్చి  యొకముట  గట్ట్ట నియమించెను.   ఆతని   య్వగజాఞనుసారముగా  రాజశేఖరుఁడుగారు   తమయింటఁ  గలవారి   నగలునువెండిపాత్రములును   ధనమును  పోగుచేసి యొకపెద్ద 
రాజశేఖర చరిత్రము
మూటను గట్టి యింట నున్న వారుసహిత మెఱుగఁకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి. అతడు వెంటనే పిడకలదాలిపెట్టించి యామూటను రాశేఖరుఁడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుతము వేసి ఆయనను లోపలికిఁ బోయి విసనగఱ్ఱను చెమ్మని పంపెను. రాజశేఖరుడుగారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వఛ్ఛ్హునప్పటికి బైరాగి గొట్టముతో నూదుచుండెను; పిడకలసందున నుండి మూటయు కనఁబడుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైని బెట్టి మంట చేసి, తానువేమగిరికొడమీఁదఁ నున్న మూలికలను గొనివచ్చుట కయిఁ వెళ్ళె దననియు, తాను బోయి వానిని గొని వచ్చి పసరు పిండిన గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడకలను వేసి మంటచేయుచు జాగ్రతతోఁ గనిపెట్టుకొని యుండవలయుననియుఁ జెప్పి. మూలికలనిమిత్తమయి వెళ్ళెను. అతఁడు వనమూలికల కయివెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్క డనేయుండి, బైరాగిని పిలుచుకొని వచ్చుటకయి మనుష్యులనుబంపిరి. వారును గొడయంతయు వెదకి యొక్కడను అతని జూడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపుకొండలకు బోయినాఁ డేమో యనుకొని మరలవచ్చి యావార్తను జెప్పిరి. ఆబైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలుమరలరానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజశేఖరుఁడుగారు పుటము దీసిచూచునప్పటికి దానియందు బంగారమును వెండియు లేదుగాని తెల్లని భస్మముమాత్ర ముండెను. సులభముగా రజితభస్మమును సువర్ణభస్మమును నయినందున రాజశేఖఁడుగారు సంతొషించి పదిలముగా దానిని దాచిరికాని, యేమికారణముచేతనొ యాభస్మమునందు బరువుగాని సువర్ణాదిభస్మములయందుండు గుణముకాని కనఁబడలేదు.

ఏడవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారి బీదతనము- సుబ్బమ్మమరణము- బంధుమిత్రుల ప్రవర్తనము- రాజమహేంద్రవర ప్రయాణము- గ్రహణస్నానము.

పూర్వము పుస్తకములయందు- శ్లో|| ఆధివ్యాధిశతైర్జనస్య వివిధైరారోగ్యముమ్మాల్యతే| లక్ష్మీర్యత్ర ప్రతంతిత్ర విసృత ద్వారా ఇప వ్యాపదః|| ఇత్యాదులకు ధనమే యాపదలకెల్లను మూలమని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరగ్యము గలిగి రాజశేరుఁడుగారు దారిద్ర్యమునుగోరుచు వచ్చిరి. లక్ష్మివలెఁ గాక యామెయప్పయైన పెద్దమ్మవారిప్పుడు నాశ్రితసులభురాలు గనుక, అతని కోరిక ప్రకారము దరిద్రదేవత వేంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది. కాని తాను మునుపను కొన్నరీతిని పేదరిక మాతని కంత సుఖకర మయినదిగాఁ గనిపించలేదు.ఇప్పుడు మునపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినదిగనుగ, ఈ వరకు నాతని నింద్రుడవు చంద్రుఁడ వని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందరును మెల్లమెల్లగా నాతనిని విడిచి పెట్టి , అతని వలె ధనికులయి బాగుపడినవారి యొద్దకు ఁ బోసాగిరి. అయినను రాజశేఖరుఁడు గారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మన లేక నోటితో లేదనునది చేతితోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగిన వారికి భోజనము పెట్టుచుండిరి. అందుచేత నతిధి యెంతబీదవాఁడయిన నంత సంతోషించుచుండునే కాని మున్నుపటి వలె విందులకు విజయంచేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాఁబట్టి ఇంటగల యిత్తడి సామనులను కుదువ </poem>