Jump to content

వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 6

వికీసోర్స్ నుండి

పాత చర్చ 5 | పాత చర్చ 6 | పాత చర్చ 7

అన్నమయ్య కీర్తనలు

[మార్చు]

అన్నమయ్య కీర్తనలను అన్నింటిని (32,000 / అక్షరాలా ముప్పైరెండు వేలు) వికీపీడియాకు అంగీకరించినట్లు తిరుపతి సమావేశంలో తెలియజేశారు. మార్చి 2015లో విష్ణువర్ధన్ గారు అన్నమయ్య కీర్తనల సమగ్ర సూచికను సూచిక:Annamayya Keertanala Samagra Soochika.pdf చేర్చారు. పిదప తిరుపతిలో తి.తి.దే.వారు ఒక ఉత్సవంగా వీటిని సి.సి.బై.వై క్రింద విడుదల జరిగిందని తెలిసినది. కానీ ఇంతవరకు వాటిని తెవికీ సోర్సులోనికి అప్లోడ్ చేయలేదు. ఎందువలనో తెలియదు. A2K లో ప్రస్తుతం చురుకుగా నున్న రహ్మానుద్దీన్ మరియు పవన్ గార్లు దీనిగురించి కృషిచేసి వాటిని త్వరలో వికీసోర్సు ద్వారా తెలుగువారు అందరిగా అందజేయగలరని ఆశిస్తున్నాను. దీనికోసం అర్జునరావు గారితో సంప్రదించి చేసిన బాగుంటుంది. లేకపోతే చాలా తప్పులు జరిగితే వాటిని మానవీయంగా సరిచేయడం మన తరంగాదు.--Rajasekhar1961 (చర్చ) 11:23, 22 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ సరైన విషయాన్ని సముదాయం ముందుకు తీసుకువచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అంశం నవంబర్ 29న జరిగిన ఐఆర్సీలో చర్చకు వచ్చింది. అందులో అర్జున గారు అన్నమయ్య సంకీర్తనలు యాంత్రికంగా, దోషరహితంగా సోర్సులో చేర్చే వీలుందా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా రహ్మానుద్దీన్ (tuxnani అన్న పేరుతో చూడవచ్చు) చేర్చవచ్చు కానీ, సముదాయంలో ఈ విషయం చర్చించి ఏకాభిప్రాయంతో చేయవచ్చు అని సమాధానమిచ్చారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది ఇదే థ్రెడ్ లో అర్జునరావు గారు, తదితరులు చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సివుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:18, 29 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, అన్నమయ్య కీర్తనలు చేర్చే విషయంలో ఇప్పటికే వున్న సంబంధింత విషయంతో అనుసంధానించి లేక అనుసంధానించకుండా చేయటానికి పెద్ధఅభ్యంతరాలు లేవు. కాకపోతే యాంత్రికంగా విషయం చేర్చేముందు. ఇంతకుముందు ఇలా ప్రయత్నించితే జరిగిన తప్పులను సరిదిద్దడం చేస్తే మంచిది. --అర్జున (చర్చ) 05:35, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ క్షమించాలి. ఇప్పటికే వున్న సంబంధింత విషయంతో అనుసంధానించి లేక అనుసంధానించకుండా చేయటానికి అంటే ఏంటో సరిగా అర్థం కావట్లేదు. కొంచెం సవివరంగా రాయగలుగుతారా?
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, వర్గం:అన్నమయ్య పాటలులో ఇప్పటికే 1553 వున్నాయి. వాటిని వదిలి మిగిలిన పాటలు చేర్చటం లేక మొత్తం అన్ని పాటలు చేర్చడం. --అర్జున (చర్చ) 09:53, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నమయ్య కీర్తనలను అన్నింటినీ తెవికీసోర్స్ లో చూడాలనుకొనే కోరిక తీరేనా. A2K వారి ప్రకారం మనం ఒక నిర్ణయానికి వస్తేగాని వారు అప్లోడు చేయరని తెలుస్తున్నది. ఇప్పటికే వున్న వాటిని ప్రక్కన పెట్టి మొత్తం 13,000 పైగా ఉన్న అన్ని కీర్తనలను అప్లోడ్ చేయవచ్చును కదా. పాతవాటిని వేరుచేయడానికి వాటి చివర స్టార్ (*) ఉంచితే (విజువల్ ఎడిటర్ ద్వారా) సరిపోతుంది కదా. అప్పుడు క్రొత్తవాటిని చేర్చడానికి అవి అడ్డం రావు అని నా అంచనా. అర్జున గారూ దీనికి మనం నిర్ణయం తీసుకుంటే వారు ముందుకువెళతారని తెలియజేశారు. దయచేసి ఈ ప్రాజెక్టు పూర్తయేటట్లు సహకరించమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 15:05, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావుగారితో చర్చించాను. ఆయన తెలియజేసినదాన్ని అనుసరించి, ఇప్పటికి ఉన్న కీర్తనలను తొలగించి; మొత్తం అన్నింటినీ క్రొత్తగా చేర్చడమే ఉత్తమమని చెప్పారు. కానీ అది మన తెలుగు వికీసోర్స్ పనిచేసే విధానాన్ని అనుసరించి స్కాన్ కాపీల ఆధారంగా చేస్తే బాగుంటుందని సూచించారు. దానివలన మూలాల్ని నిర్ధారించే వీలుంటుందని ఆయన అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 02:47, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు Rajasekhar1961 గారు. స్వల్ప స్పష్టత వ్యాఖ్య. పుస్తకం రూపంలో వున్న కృతులకు ఆయా పుస్తకాల్ని బట్టి వేరే అధ్యాయపుపేజీలు తయారవుతాయి. పుస్తకాలన్నీ చేర్చిన తరువాత స్కాన్ అధారితం కాని ఇప్పటికే వున్న అన్నమాచార్య కీర్తనల పేజీలను తొలగించితే ముందు ముందు దోషాలు ఏమైనా వుంటే ఒకచోట మాత్రమే సరిదిద్దటానికి, మరియు చదువరులకు సౌలభ్యంగా వుంటుంది. --అర్జున (చర్చ) 04:20, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimania 2016 Scholarships - Deadline soon!

[మార్చు]
Please help translate to your language

A reminder - applications for scholarships for Wikimania 2016 in Esino Lario, Italy, are closing soon! Please get your applications in by January 9th. To apply, visit the page below:

Patrick Earley (WMF) via MediaWiki message delivery (చర్చ) 01:49, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2016 WMF Strategy consultation

[మార్చు]
Please help translate to your language

Hello, all.

The Wikimedia Foundation (WMF) has launched a consultation to help create and prioritize WMF strategy beginning July 2016 and for the 12 to 24 months thereafter. This consultation will be open, on Meta, from 18 January to 26 February, after which the Foundation will also use these ideas to help inform its Annual Plan. (More on our timeline can be found on that Meta page.)

Your input is welcome (and greatly desired) at the Meta discussion, 2016 Strategy/Community consultation.

Apologies for English, where this is posted on a non-English project. We thought it was more important to get the consultation translated as much as possible, and good headway has been made there in some languages. There is still much to do, however! We created m:2016 Strategy/Translations to try to help coordinate what needs translation and what progress is being made. :)

If you have questions, please reach out to me on my talk page or on the strategy consultation's talk page or by email to mdennis@wikimedia.org.

I hope you'll join us! Maggie Dennis via MediaWiki message delivery (చర్చ) 19:06, 18 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఫాదర్ జోజయ్య గారి పుస్తకాలు CC-BY-SAలో విడుదల, ప్రాధాన్యత నిర్ధారణ

[మార్చు]

అందరికీ నమస్కారం,
విజయవాడకు చెందిన ఫాదర్ జోజయ్య గారు తమ పుస్తకాలు సీసీ-బై-ఎస్ఎ లైసెన్సుల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి పుస్తకాల శీర్షికలను కింద ఇస్తున్నాను. ఆ పుస్తకాలు ఏ ప్రాధాన్యత క్రమంలో డిజిటైజ్ చేయవచ్చునన్న విషయంపై సభ్యుల అభిప్రాయాలు తెలియజేయగలరు.

  1. ఆధ్యాత్మిక జీవితం
  2. ప్రాత నిబంధన కథలు
  3. ప్రాత నిబంధన కథలు-2
  4. ప్రాత నిబంధన కథలు-3
  5. ప్రవక్తల వాణి
  6. పునీత పౌలు బోధలు
  7. బైబిల్లో స్త్రీలు
  8. గెలుపు బాట
  9. లోచూపు
  10. నైతిక మార్గం
  11. నూతన నిబంధన కథలు
  12. పునీత పౌలు సందేశ వివరణం
  13. పునీత పౌలు బోధలు
  14. పునీత మాత
  15. పూర్వ నిబంధన కథలు
  16. తోబీతు

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:34, 10 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బైబిల్ సామెతలు పుస్తకాలు పూర్తిచేయబడ్డాయి. కానీ వాటిని విభజించడము గురించి రచయిత, కాపీహక్కు కలిగిన వారితో చర్చిస్తే బాగుంటుంది. ఇక క్రైస్తవ సాహిత్యం మీద నాకున్న అవగాహన వరకు ప్రాత నిబంధన కథలు, బైబిల్లో స్త్రీలు, పూర్వ నిబంధన కథలు కొంతవరకు విజ్ఞాన సర్వస్వానికి ఉపయోగపడేవిగా భావించవచ్చును. మిగిలిన పుస్తకాల కంటెంట్ తెలిస్తే గాని ఒక నిర్ణయానికి రాలేము. ఒకసారి రచయితతో చర్చించండి. తెవికీసోర్స్ లో చురుకైన సభ్యులు తక్కువగా ఉన్నందున ఈ పనికి కళాశాల విద్యార్థుల ద్వారా చేయిస్తే ఇంకా బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక ఇన్ని పుస్తకాలను అందరికీ అందుబాటులోని తెస్తున్న ఫాదర్ జోజయ్యగారికి నా ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:42, 11 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

యీపుస్తకములోని మూలాలు (references) మార్చవద్దు --శ్రీరామమూర్తి (చర్చ) 03:39, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాల వీక్షణల విశ్లేషణ

[మార్చు]

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము 2012-09-05 నప్రదర్శనతో పుస్తకాలను యదాతథంగా చేర్చడం తెలుగు వికీసోర్స్లో ప్రారంభమైంది. నేటికి 51 అమోదించబడిన పుస్తకాలుండగా, వాటి పేజీల వీక్షణల విశ్లేషణ ఇపుడు చేశాను. వివరాలు వికీసోర్స్:పేజీవీక్షణలు లో చూడండి. వీటికొరకు పనిచేసిన సభ్యులందరికి ధన్యవాదాలు. ఈ విశ్లేషణపై స్పందించండి. --అర్జున (చర్చ) 11:56, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారికి చాలా ధన్యవాదాలు. ఇది మన తెవిసోర్స్ సమూహం యొక్క విజయంగా పరిగణించాలి. ఇందులో మిది కీలకమైన పాత్ర పోషించారు. ఈ గణాంకాలలో పుస్తకం తయారుచేయడానికి శ్రమిస్తున్న వాడుకరులు కూడా ఉంటారా, లేదా బయటివారేనా. మిగిలిన భాషలతో పోల్చితే తెలుగు వికీసోర్స్ వీక్షణలు ఎలావున్నాయి. ఇక ముందు ఎలాంటి పుస్తకాలపైన శ్రద్ధ వహించాలి అనే విషయాన్ని ఇది తెలియజేస్తున్నదా. నా అనుమానాలను మరోలా భావించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 14:24, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
-Rajasekhar1961 గారికి, వికీసోర్స్:పేజీవీక్షణలు లో స్పందించాను. చర్చలు అక్కడే కొనసాగిద్దాం. --అర్జున (చర్చ) 07:03, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సూచికపేజీల వివరాలు, విశ్లేషణ

[మార్చు]

వికీసోర్స్:సూచికపేజీలు లో సూచిక పేజీలు వివరాలు, విశ్లేషణ చేర్చాను. 244 పుస్తకాలకు , మొత్తము పేజీలు:48741 వుండగా, 23542 పేజీలు సృష్టించబడగా వాటిలో 16250 పేజీలు కనీసంఒకసారి అచ్చుతప్పుదిద్దబడినవి కావున, సభ్యులు రాసి కంటే వాసిపై దృష్టిపెడితే వికీసోర్స్ పురోగతికి మంచిది. --అర్జున (చర్చ) 11:52, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అబద్దాల వేట-నిజాలబాట విశేషగ్రంథం ప్రతిపాదన

[మార్చు]

అబద్ధాల వేట - నిజాల బాట లో మిగిలిన అచ్చుతప్పులు సరిచేయటం చాలావరకు ముగిసింది. తదుపరి విశేషగ్రంథంగా ప్రదర్శించే ప్రతిపాదన చేస్తున్నాను. ఏవైనై అభ్యంతరాలు, సలహాలు వుంటే రెండు రోజులలోఅనగా 22. మార్చి,2016లోగా తెలియచేయండి. --అర్జున (చర్చ) 11:48, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అనామక సభ్యుని స్పందనకు ధన్యవాదాలు. పరిచయపత్రం చూసి సవరణలు చేయండి లేక దాని చర్చాపేజీలో చర్చించండి. --అర్జున (చర్చ) 08:30, 21 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారికి, విశేషగ్రంథంగా అబద్ధాల వేట - నిజాల బాటను ప్రదర్శించాను. మీ సహాయానికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:23, 21 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు విశేష గ్రంథంగా మార్చటం బాగానేవుంది. ఇంకో రోజుంటే సలహాలు ఏమైనా వచ్చేవేమో. పరిచయపత్రం మెరుగయ్యేదేమో. సరే ఇంకెవరైనా సూచనలు ఇస్తే ఇప్పుడైనా అమలు చేద్దాం. --అర్జున (చర్చ) 11:26, 21 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలు-అధ్యాయాల గణాంకాలు

[మార్చు]

వికీసోర్స్:పుస్తకాలు-అధ్యాయాల గణాంకాలు ఈ రోజు స్థితి చేర్చాను. పుస్తకాలు అధ్యాయాల రూపుదిద్దడంలో ప్రాధాన్యత నిర్ణయించడానికి, ఈ పట్టికలో అదనపు నిలువువరుసలు చేర్చుకొని ఉపయోగించవచ్చు. --అర్జున (చర్చ) 08:23, 22 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

IP నామకులచే ఎక్కువదోషాలుగల పేజీలు ఎక్కింపు

[మార్చు]

సూచిక:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdfలోని పేజీలలో ఎక్కువదోషాలుగల పేజీలు 59.90.232.127 IP వినియోగదారునిచే ఇటీవల అనగా 2016-02-24T13:44:24‎ నాడు ఎక్కించడం జరిగింది.ఇంతకు ముందు ఇటువంటి చర్యల అనుభవం సభ్యులందరికి వున్నందున, ఇటువంటి చర్యలు తెలుగు వికీసోర్స్ నాణ్యతను పెంపొందించడానికి దోహదపడవు. నిర్వాహకులు గమనించి అటువంటి సభ్యులపై తగు చర్యలు తీసుకోవాలి. --అర్జున (చర్చ) 03:58, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]