వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/అబద్ధాల వేట - నిజాల బాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అబద్ధాల వేట - నిజాల బాట(2011)- నరిసెట్టి ఇన్నయ్య

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం


ఇంద్రియాతీత శక్తులున్నాయా? ప్రార్ధనలతో ప్రాణాలు నిలుస్తాయా? బాబాలు, ఆశ్రమాలు, ఆస్తులలో నిజాలేంటి? సెక్యులరిజం అంటే ఏమిటి? సుప్రసిద్ధ మానవతావాది ఎం.ఎన్.రాయ్ జీవితంలో మర్మంగా వున్నదేమిటి?హోమియో శాస్త్రీయమా? తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీస్థాయిలో జ్యోతిష్యం తొలగించటం ఎలా జరిగింది? చిన్న పిల్లలు వేసే ప్రశ్నలకు విజ్ఞానబద్ధంగా జవాబులు ఇవ్వడం ఎలా? శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటీ? పునర్జన్మ వుందా? అలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రపరిధిలో సమాధానాలు తెలుసుకోవాలనివుందా?

ఇన్నయ్యగారు వివిధ పత్రికలకు రాసిన అనేకానేక వ్యాసాల్లోంచి ఇసనాక మురళీధర్ ఏర్చి కూర్చిన ఈ సంకలనం చదవండి. పరిష్కర్త చెప్పినట్లు ఈ వ్యాసాలు అనేక సంఘటనల్ని, అనేక విషయాల్ని నిశితంగా స్పృశిస్తాయి. దొంగల్ని పట్టిస్తాయి. దగా కోరుల్ని, నిలదీస్తాయి. శాస్త్రీయతనీ, అశాస్త్రీయతనీ వేరు చేసి చూపెడతాయి. మంచికీ చెడుకూ మధ్యన గోడలు కడతాయి. పాఠకుడు సమగ్ర మానవ వాదిగా మారే అవకాశాన్ని కలిగిస్తాయి.

హేతువాది, మిసిమి మరియు వివిధ వార్తాపత్రికలలో, 1990 దశకంలో ప్రచురితమైన హేతువాద,మానవవాద వ్యాసాలతో పాటు, జీవిత చిత్రణలు, సైన్స్ సంగతులు, పుస్తకపరిచయాలు కూడి వున్నాయి. ఈ వ్యాసాలు రాసే సమయం వ్యాసం చివరన ప్రచురణయిన పత్రికతో సహా యివ్వబడినది. ఆ సంఘటనలు, అందులో వ్యక్తులు ఆ సమయంలో ప్రవర్తించిన తీరు తెన్నులు, వాటి చారిత్రాత్మక ప్రాముఖ్యత తెలుసుకోవడానికి పూర్తి గ్రంథం చదవండి.