వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 12

వికీసోర్స్ నుండి

పాత చర్చ 11 | పాత చర్చ 12 | పాత చర్చ 13

Invitation from Wiki Loves Love 2019[మార్చు]

Please help translate to your language

Love is an important subject for humanity and it is expressed in different cultures and regions in different ways across the world through different gestures, ceremonies, festivals and to document expression of this rich and beautiful emotion, we need your help so we can share and spread the depth of cultures that each region has, the best of how people of that region, celebrate love.

Wiki Loves Love (WLL) is an international photography competition of Wikimedia Commons with the subject love testimonials happening in the month of February.

The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects.

The theme of 2019 iteration is Celebrations, Festivals, Ceremonies and rituals of love.

Sign up your affiliate or individually at Participants page.

To know more about the contest, check out our Commons Page and FAQs

There are several prizes to grab. Hope to see you spreading love this February with Wiki Loves Love!

Kind regards,

Wiki Loves Love Team

Imagine... the sum of all love!

--MediaWiki message delivery (చర్చ) 10:13, 27 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

FileExporter beta feature[మార్చు]

Johanna Strodt (WMDE) 09:41, 14 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

No editing for 30 minutes on 17 January[మార్చు]

You will not be able to edit the wikis for up to 30 minutes on 17 January 07:00 UTC. This is because of a database problem that has to be fixed immediately. You can still read the wikis. Some wikis are not affected. They don't get this message. You can see which wikis are not affected on this page. Most wikis are affected. The time you can not edit might be shorter than 30 minutes. /Johan (WMF)

18:55, 16 జనవరి 2019 (UTC)

పుస్తకాలను స్కాను చేయుటకు కొత్త కేంద్రము[మార్చు]

టిటిస్క్రైబ్ (TTScribe) వాడి పుస్తకము స్కాన్ చేయుట(వీడియో)

పబ్లిక్ రిసోర్స్.ఆర్గ్ సంస్థ సౌజన్యంతో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లో పుస్తకాలను స్కాను చేయటకు కొత్త కేంద్రము ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా స్వచ్ఛందసేవకులచే నిర్వహించబడుతుంది. కాపీహక్కులు తొలగి ఇంకా స్కాన్ రూపంలో లభ్యంకాని, లేక కాపీహక్కుల సిసి బై రూపంలో పునర్విడుదలైన పుస్తకాలు స్కాను చేసి ఇంటర్నెట్ అర్కైవ్ ద్వారా అందరికి అందుబాటులో వుంచడానికి ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవచ్చు. పుస్తకాలను, Yoga Narasimha,I/C Public Resource.org Scanning Center, Indian Academy of Sciences, C. V. Raman Avenue, Raman Research Institute Campus, Sadashivanagar, Bengaluru 560 080 INDIA Tel.: +91-80-2266 1200 Fax: +91-80-2361 6094 Email: office@ias.ac.in కు వికీమీడియా స్వేఛ్ఛా కాపీహక్కుల ధృవ పత్రంతో సహా (ఉదాహరణ)పంపించగలరు. సందేహాలకు అర్జునని సంప్రదించండి--అర్జున (చర్చ) 04:32, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కని కృషి అర్జున గారూ. ధన్యవాదాలు. అవసరాన్ని బట్టి మిమ్మల్ని సంప్రదిస్తాను. --Pavan santhosh.s (చర్చ) 02:56, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కుడివైపు పెట్టెలో స్కాన్[మార్చు]

ఎడమవైపు పెట్టెలో ocr చేయుటకు కుడివైపు పెట్టె ఖాళీగా వున్నది. నిన్నటిరోజు రాత్రినుండి ఈసమస్య ఉత్పన్నమైనది. పరిశీలించగలరు. --Ramesam54 06:29, 17 ఫిబ్రవరి 2019 (UTC)

నేనూ చూశాను. మీరు పనిచేస్తున్న కళాపూర్ణోదయం, కట్టా వరదరాజ కవి రామాయణం పుస్తకాల్లో కొత్తగా చేయాల్సిన పేజీలు బ్రేక్ అవుతున్నాయి. అదీ సమస్య. ఐతే చాలా ఇతర పుస్తకాల్లో ఈ సమస్య ఎదురుకావట్లేదు. --Pavan santhosh.s (చర్చ) 14:16, 17 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నేర్చుకుంటున్నవారు, కొత్తవారితో ఆఫ్లైన్ వికీసోర్సు కార్యక్రమం - ప్రతిపాదన[మార్చు]

ఇటీవల వాడుకరి:Ramesam54 గారి చొరవతో కొందరు వాడుకరులు తెలుగు వికీసోర్సుకు పరిచయం అవుతున్నారు. వారిలో మధుపత్ర శైలజ అనే రచయిత్రినీ, వారి భర్త గారిని నేను వ్యక్తిగతంగా కలిసి, వికీసోర్సు గురించి నేర్పి, వారితోనే వారి పుస్తకం కామన్సులోకి ఎక్కించేలా చేశాను. ఐతే ఈ ప్రయత్నాలు బలపడడానికి ఒక ఆఫ్ లైన్ సమావేశం జరిగితే బావుంటుందని భావిస్తున్నాను. ఇది ప్రత్యేకించి తెలుగు వికీసోర్సు గురించి వారికి మరిన్ని సంగతులు నేర్పడానికే కాకుండా, ఏయే పుస్తకాల మీద పనిచేస్తున్నారు, ఏయే అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి కూడా ఉపకరిస్తుందని భావిస్తున్నాను. 24 ఫిబ్రవరి 2019న వీరిలో అత్యధిక శాతం హైదరాబాదులో ఉన్నందున హైదరాబాదులో ఈ ఆఫ్లైన్ కార్యక్రమం నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. వీరిని తీసుకువస్తున్న రామేశం గారు సూత్రప్రాయంగా రావడానికి, శిక్షణనివ్వడానికి అంగీకరించారు. ధన్యవాదాలతో --Pavan santhosh.s (చర్చ) 14:24, 17 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి చిన్న చిన్న సమావేశాలు పనికి వచ్చేలా మన అనుభవం తెలుపుతున్నది. కాబట్టి 1-1 ఆఫ్లైన్ కార్యక్రమాలపై దృష్టిపెట్టే పనులు ఉపయోగం. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 11:23, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటి కార్యక్రమాలు/సమావేశాలు చాలా అవుసరం.----Nrgullapalli (చర్చ) 11:37, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Talk to us about talking[మార్చు]

Trizek (WMF) 15:01, 21 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

OCR బొత్తాము[మార్చు]

ఒక పావుగంట నుండి OCR బొత్తాము పని చేయుట చేయుట లేదు .No OCR text అనే సందేశము వస్తున్నది.--Ramesam54 11:48, 25 ఫిబ్రవరి 2019 (UTC)

వికీటెక్ సముదాయం వారు ఉబంటు ట్రస్టీ ఆపరేటింగ్ సిస్టంగా పనిచేస్తున్న ఉపకరణాలన్నీ అచేతనం చేశారు. ఈ క్రమంలో మన ఇండిక్ ఓసీఆర్ ఉపకరణమూ అచేతనమైపోయింది. వాడుకరి:Jayprakash12345 దీనిని డెబియన్ స్ట్రెచ్ ఆపరేటింగ్ సిస్టంకి మార్చి, ఉపకరణాన్ని పునర్నిర్మించి సరిజేశాడు. ఈ వివరాలన్నీ వికీమీడియా ఇండియా మెయిలింగ్ లిస్టులో తెలియజేశాడు. అతని కృషి వల్ల ఇప్పుడు మళ్ళీ మనకు ఉపకరణం పనిచేస్తుంది. వాడుకరి:Ramesam54 గారు మీకు పనిచేస్తోందో లేదో చెప్పండి. --Pavan santhosh.s (చర్చ) 02:55, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సంతోషం, పవన్ సంతోష్ గారూ, ఇప్పుడే చూసాను. పనిచేస్తున్నది. ధన్యవాదాలు. వాడుకరి:Jayprakash12345, Pavan santhosh.s--Ramesam54 06:59, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

IMPORTANT: Admin activity review[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc. ) was adopted by global community consensus in 2013. According to this policy, the stewards are reviewing administrators' activity on all Wikimedia Foundation wikis with no inactivity policy. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the admin activity review.

We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):

  1. రాకేశ్వర (administrator)

These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.

However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, --Base (చర్చ) 01:17, 10 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పాత గూగుల్ ఒసిఆర్ తో బాట్ చేర్చిన పేజీల తుడిచివేత[మార్చు]

ఇంతకుముందు దోషపూరిత పేజీలను తుడిచివేసిన సంగతి (వికీసోర్స్:రచ్చబండ/పాత_చర్చ_11#సయ్యద్_నశీర్_అహమ్మద్_గారి_రచనలలో_యూనికోడ్_పాఠ్యీకరణదోషాల_పేజీల_తుడిచివేత,వికీసోర్స్:రచ్చబండ/పాత_చర్చ_11#బైబిల్_సంబంధించిన_దోషపూరిత_పేజీల_తుడిచివేత_ప్రతిపాదన ) మీకు గుర్తుందే వుంటుంది. నా పరిశీలనలో ఇంకా 5000 పై బడి పాత గూగుల్ ఒసిఆర్ తో బాటు చేర్చిన పేజీలు కనబడినవి. వీటిలో చాలావరకు నాణ్యత మెరుగుపరచబడలేదు. వాటి నాణ్యత మెరుగుకై ప్రతిపాదనలు కోరుతూ, సంబంధిత బాటు చర్చా పేజీలలో వ్యాఖ్య చేర్చడమైనది.

బాట్ వాడుకరులు వికీసోర్స్ నాణ్యత ప్రధానంగా పెట్టుకొని పనిచేస్తే మంచిది. ఒక నెలలోగా స్పందనలు, ప్రతిపాదనలు లేకపోతే వికీసోర్స్ నాణ్యత దృష్ట్యా దోషపేజీలను తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. అభ్యంతరాలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 07:43, 10 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు లేనందున తుడిచివేత ప్రారంభిస్తున్నాను.--అర్జున (చర్చ) 06:22, 11 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పై వాటిని తనిఖీ చేసి కొత్త గూగుల్ ఒసిఆర్ మెరుగుగా పనిచేస్తుంది అని కొన్ని పేజీలలో పరీక్షచేసిన పిదప, వాడుకరి:Pavan_santhoshBot చేర్చినవాటిలో రెండు పుస్తకములు వాడుకరి:RahmanuddinBot చేర్చినపేజీలో ఒక పుస్తకముల లోని దోషపు పేజీలు మాత్రమే తుడిచివేయబడినవి.--అర్జున (చర్చ) 04:11, 12 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2018 గూగుల్ ఒసిఆర్ పాతపుస్తకాలకు సరిపడకపోవచ్చు.[మార్చు]

1966 ముద్రణ పుస్తకం పై గూగుల్ ఒసిఆర్ వాడినా సరిగా పనిచేయటం లేదు. మరింత సమాచారానికి సూచిక_చర్చ:Ganapati_(novel).pdf#గూగుల్ ఒసిఆర్ తో మితిమీరిన దోషాలు చూడండి. పాఠ్యీకరణ మొదలుపెట్టేటప్పుడు ప్రయోగాత్మకంగా గూగుల్ ఒసిఆర్ వాడి, ఉపయోగమనుకుంటేనే కొనసాగించండి. --అర్జున (చర్చ) 07:00, 16 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf[మార్చు]

సూచిక:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf కు గూగుల్ ఒసిఆర్ బాగా పనిచేస్తున్నది. నకారపొల్లు తరువాత ఖాళీలు, పేరాలు సరిచేయటం వంటివి మాత్రమే అవసరమవుతున్నాయి. ఆసక్తికల సహసభ్యులు పాలుపంచుకొనవలసినది. --అర్జున (చర్చ) 12:31, 22 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే సూచిక:ఆంధ్రప్రదేశ్_బడ్జెట్(VOA)_ప్రసంగము_2019-20.pdf కు కూడా తోడ్పడవలసింది.--అర్జున (చర్చ) 21:43, 22 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Read-only mode for up to 30 minutes on 11 April[మార్చు]

10:56, 8 ఏప్రిల్ 2019 (UTC)

Wikimedia Foundation Medium-Term Plan feedback request[మార్చు]

Please help translate to your language

The Wikimedia Foundation has published a Medium-Term Plan proposal covering the next 3–5 years. We want your feedback! Please leave all comments and questions, in any language, on the talk page, by April 20. కృతజ్ఞతలు! Quiddity (WMF) (talk) 17:35, 12 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గణపతి నవల[మార్చు]

గణపతి నవల టైపు చేయడం, అచ్చుదిద్దడం పూర్తయింది. ఇంకెవరైనా దానిని పరిశీలించిన మీదట పుస్తకంగా ప్రచురించవచ్చు. ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన రాజశేఖర్ గారికి, ఈ పనిలో పాలుపంచుకొన్న గుళ్ళపల్లి గారికి, సలహాలు అందించిన అర్జున రావు గారికీ ధన్యవాదాలు. రవిచంద్ర (చర్చ) 02:59, 24 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పుస్తకాన్ని పూర్తిచేసిన గుళ్ళపల్లి మరియు రవిచంద్ర గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:43, 24 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, వాడుకరి:Nrgullapalli గార్లకు ధన్యవాదాలు. ఈ పుస్తకానికి అధ్యాయ కూర్పులు, ఆమోదనకై దిద్దడం మిగిలి వున్నది. --అర్జున (చర్చ) 04:55, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా సంతోషం --Nrgullapalli (చర్చ) 13:58, 1 మే 2019 (UTC)--Nrgullapalli[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దడంలో నాణ్యతా లోపం[మార్చు]

నేను ప్రస్తుతం గతంలో సముదాయం పూర్తి చేసిన బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము నవలను గమనిస్తున్నాను. దాదాపు ప్రతి పేజీలోనూ సుమారు ఐదారు అక్షర దోషాలున్నాయి. ఇవి అచ్చుదిద్దిన వారు, మరోసారి ఆమోదనకై దిద్దినవారు పూర్తిగా తనిఖీ చేయలేదనిపించింది. మనం ఎక్కువ పుస్తకాలు చేసే తొందరలో నాణ్యత మరిచిపోయామో లేక దీని మీద సరైన అవగాహన లేక ఇలా జరిగిందో తెలియడం లేదు. అచ్చుదిద్దే సభ్యులందరూ ఈ విషయాలను గమనింపమని మనవి. రవిచంద్ర (చర్చ) 17:22, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివి చాలా వరకు అక్షర దోషాలు సరిదిద్దాననుకుంటున్నాను. దీన్ని పుస్తకంగా దింపుకునే వెసులుబాటు కల్పించి ఒకసారి దింపుకుని అన్నీ సరిగా అమరాయా లేదా అని చూడాలనుకుంటున్నాను. అర్జున రావు గారూ, సహాయం చేయగలరా? రవిచంద్ర (చర్చ) 11:25, 7 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర:, మీ చొరవకు ధన్యవాదాలు. అచ్చుదిద్దడంలో జరుగుతున్న లోపాల్ని గుర్తించాము. అచ్చుదిద్దుతున్న వారికి సూచించాము. అయినా యీ దోషాలు జరుగుతున్నాయి. ఈ బారిష్టరు పార్వతీశం నవలలో ఒక భాగం మాత్రమే అని గమనించండి. ఇందు విషయసూచిక లేదు; కానీ మొదటి భాగము ఏడు భాగాలుగా చేయబడింది.--Rajasekhar1961 (చర్చ) 12:32, 7 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, అవును రెండు, మూడు భాగాలుండటం కూడా గమనించాను. అవి రెండు కూడా పూర్తయ్యేదాకా కేవలం మొదటి భాగం మాత్రమే పుస్తకంగా దింపుకునే సౌకర్యం వద్దంటారా? రెండు, మూడు భాగాలున్న పుస్తకం 1995 లో ప్రచురితమైఉన్నట్లు చూపిస్తోంది. వాటిని పాఠ్యీకరణ చేయడం వల్ల కాపీరైటు సమస్యలు వచ్చే అవకాశం ఉండచ్చు. కాబట్టి మొదటి భాగం వరకు మనం పుస్తకంగా దింపుకోగలిగే సౌలభ్యాన్ని కలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 12:37, 7 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర,రాజశేఖర్ గార్లకు, అచ్చుదిద్దటం అనేది ఒక క్లిష్టమైన నైపుణ్యం. అందరికీ ఒకలాగే వుండదు. నేను అచ్చుదిద్దినవాటిలోనే మిగిలిపోయిన దోషాలు దిద్దవలసివస్తున్నది. కాని ఇద్దరు లేక ముగ్గురు నైపుణ్యంతో చేస్తే చాలావరకు దోషాలు తగ్గించవచ్చు. వికీసోర్స్ లో ఎవరైనా అచ్చుదిద్దవచ్చు కాబట్టి,నైపుణ్యం తక్కువ వున్నవారు స్థితిని మార్చవద్దు అని విజ్ఞప్తిని పట్టించుకోనప్పుడు, ఏమి చేయటానికి వీలవుతుంది. ఇక కాపీరైటు విషయానికొస్తే, పుస్తకం ముద్రణ తేదీకాకుండా, రచయిత జీవితకాలాన్ని బట్టే కాపీహక్కులు వుంటాయి. ఈ పుస్తకం {{Non-free DLI}} లైసెన్స్ తో వున్నది. దీనిని పుస్తకంగా చేయటానికి సహాయం చేస్తాను. దీనిలో మీరు పాలుపంచుకుంటే బాగుంటుంది. --అర్జున (చర్చ) 00:36, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కుల కార్యశాల ప్రతిపాదన[మార్చు]

తెలుగు వికీసోర్సు సభ్యులకు కాపీహక్కుల కార్యశాల నిర్వహించాలని, తద్వారా తెలుగు వికీసోర్సు సముదాయానికి ఈ అంశంలో మరింత అవగాహన పెరగడం ప్రాజెక్టుకు ఉపకరిస్తుందన్న అంచనా మేరకు ప్రతిపాదిస్తున్నాను. దయచేసి ఈ అంశంపై సముదాయ సభ్యులు తమ అభిప్రాయం చెప్పగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:59, 9 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ప్రతిపాదన. తప్పక ఏర్పాటు చెయ్యండి. ఈ అవగాహన సభ్యులందరికీ అవసరమే.--Ramesam54 17:16, 9 మే 2019 (UTC)
నాకూ అంగీకారమే. మనమంతా ఎంతో కష్టపడి అరుదైన పుస్తకాలను యూనీకోడ్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నాము. ఎలాంటి పుస్తకాలు కాపీరైటు కిందకు వస్తాయో, ఎలాంటివి రావో అందరికీ ఒక అవగాహన వస్తే బాగుంటుంది. రవిచంద్ర (చర్చ) 17:53, 9 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కాపీహక్కుల కార్యశాలలు ఇప్పటికే మూడు జరిగాయి (హైదరాబాదు, బెంగుళూరు మరియు ఢిల్లీ) ప్రస్తుతం ఇక్కడ (వికీసోర్స్ లో) పనిచేస్తున్న వారికి ముందుగా జరిగిన చర్చల వలన ఒక సమగ్రమైన అవగాహన కలిగినది. అందులకు చదువరి, పవన్ మరియు అర్జున గార్లకు నా ధన్యవాదాలు. ఇప్పుడు మనకు కావలసినది కాపీహక్కుల అవగాహన కన్నా, కొద్దిమంది చక్కగా పనిచేసే వ్యక్తులు. అందుకోసం ఆ త్రోవగా మన ఆలోచనలు ప్రసరిస్తే మంచిదని నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 08:06, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

60 ఏళ్ళకు ముందు గతించిన రచయితలు[మార్చు]

వికీడేటాలో ఒక క్వెరీ (ప్రశ్న) ద్వారా 60 ఏళ్ళకు ముందు గతించిన రచయితల జాబితా సేకరించగలిగాను. ప్రస్తుత కాపీరైటు చట్టాల ప్రకారం ఈ జాబితాలోని రచయితల రచనలన్నీ ప్రచురించిన తేదీతో సంబంధం లేకుండా కాపీరైటు చెల్లినవని అనుకోవచ్చా? అలా అయిన పక్షంలో మనం వారి రచనలు సేకరించి రాబోయే కాలంలో వాటి మీదే కృషి చేయగలిగితే మనల్ని ఆక్షేపించేవారు ఎవరూ ఉండరని నా అభిప్రాయం. ఇందులో ఏమైనా లొసుగులున్నాయేమో మిగతా సభ్యులు తెలియజేయగలరు. రవిచంద్ర (చర్చ) 09:17, 14 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర: గారూ, సుళువుగా వికీడాటా నుండి 1959కి ముందు మరణించిన వారి జాబితా లభించినా; వారి రచనలు ప్రస్తుతం ఇందులో దొరకడం లేదు. మేమొక జాబితాను తయారుచేశాము: వికీసోర్స్:కాపీహక్కుల పరిధి దాటిన రచయితలు ఇందులో కాపీహక్కుల పరిధి దాటిన రచనలు వారి రచనలు వికీసోర్సులోనే కొన్ని వున్నాయి. మీకు ఇష్టమైన కొన్నిటి మీద మీరు పనిచేయవచ్చును. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:27, 16 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర: గారూ, మీరన్నది సరిపోయిందండీ. అమెరికన్ చట్టాల ప్రకారం వీటిలో కొన్ని అమెరికాలో కాపీహక్కుల పరిధిలో ఉన్నా వికీమీడియా కామన్స్ ఆ విషయంలో ఆయా దేశాల (ఇక్కడ భారతదేశ) చట్టాల ప్రకారమే పోతోంది. కాబట్టి 60 సంవత్సరాల క్రితం మరణించిన భారతీయ రచయితల రచనలన్నిటి మీదా పనిచేయవచ్చు. --Pavan santhosh.s (చర్చ) 04:10, 24 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తవారు వచ్చాకా "నిలుపుకోవడం" (Retention)పై దృష్టిసారించే మిని టిటిటి కార్యక్రమం[మార్చు]

పైన తెలుగు వికీసోర్సు సముదాయ సభ్యులు చేసిన సూచనలు, కానీ గత ఏడాది నుంచి తెలుగు వికీపీడియా, వికీసోర్సు చేస్తున్న ఆలోచనలు కానీ, కొత్తగా వికీపీడియన్లను తీసుకువచ్చాకా "చక్కగా పనిచేసే వికీమీడియన్లుగా" వారిని నిలుపుకోవడం (Retaining) అన్నది కీలకమని పదే పదే చెప్తున్నవి. కొత్తవారికి సహాయం వంటి ప్రయత్నాన్ని కొత్తగా వస్తున్నవారికి శిక్షణనిచ్చి, ఇక్కడ కాలునిలదొక్కుకుని, చక్కని కృషిచేసేవారిగా నిలుపుకోవడంలో ఆసక్తికల వికీపీడియన్లు పనిచేయాలన్న ఆలోచనతో ఇది మొదలైంది. కొందరు వికీపీడియన్లు ప్రయత్నించారు. అలానే సముదాయంలో ఉన్న చాలామందికి సముదాయాన్ని విస్తరించడంలో సహకరించడంపై ఆసక్తి ఉన్నదని మనకు గతంలో జరిగిన కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం చెప్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారిని నిలుపుకోవడానికి (Retention of Newbies) ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాలను అందిస్తూ మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాన్ని ఇప్పటికే ఉన్న సభ్యులకు చేయాలని సంకల్పం. జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించాలన్నది ప్రతిపాదన. వికీపీడియా, వికీసోర్సు ప్రాజెక్టుల విషయంలో మనకు తెలిసిన అంశాలు మనకు వీలుచిక్కినంత సమయంలో మరో కొత్తవ్యక్తికి నేర్పి, మనకి ఇందులో పనిచేయడానికి కలిగే ఉత్సాహాన్ని వారికి కూడా ఏర్పరిచి సముదాయాన్ని విస్తరించాలని, అందుకోసం అవసరమైన నైపుణ్యాలు సంతరించుకోవాలని ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు దీనిలో ఆహ్వానితులు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. దీనిపై సముదాయం స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:00, 23 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన , వికీ లో జరుగుతున్న క్రొత్త మార్పులు తెలుసుకోవడానికీ, నైపుణ్యాలను పునర్నవీకరించడానికీ ప్రయోజనకారి అవుతుంది.--Ramesam54 07:17, 24 మే 2019 (UTC)

దీన్ని వచ్చే జూలై వారాంతానికి వాయిదా వేసినట్టు వికీపీడియా రచ్చబండలో ప్రకటించి ఉన్నాము. ఇక్కడ ప్రకటించడంలో ఆలస్యమైంది. క్షమించాలి. జూలై తొలి వారాంతానికి దీన్ని వాయిదా వేశాము. గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 15:50, 13 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikimedia Campaigns/Contests Survey[మార్చు]

Hello fellow Wikimedians,

Apologies for writing in English. Please help me in translating this message to your language.

I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikime dia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.

If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.

You can read the Privacy Policy for the Survey here

Please find the link to the Survey at: https://forms. gle/eDWQN5UxTBC9TYB1A

P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.

Looking forward to hearing and learning from you.

-- SGill (WMF) sent using MediaWiki message delivery (చర్చ) 06:09, 25 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వొకేట్ ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ[మార్చు]

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ వారి యాక్సెస్ టు నాలెడ్జ్ ప్రాజెక్టు (సీఐఎస్-ఎ2కె) ద్వారా తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం వార్షిక ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలుపరిచే దిశగా నేను పనిచేసిన సంగతి సముదాయ సభ్యులకు తెలిసిందే! 2015 డిసెంబరు నుంచి ఇప్పటివరకు ఉద్యోగబాధ్యతల పరంగా నేను ఈ పనిచేశాను. ప్రస్తుతం కెరీర్‌ పరంగా వేరే సంస్థలో వేరే ఉద్యోగానికి మారాలని నేను తీసుకున్న నిర్ణయం కారణంగా సీఐఎస్-ఎ2కెలో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను.

దాదాపు మూడున్నర సంవత్సరాల కాలం పాటు నా తెలుగుకు, నా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు పనిచేసుకునే అవకాశం రావడాన్ని నేనెంతగానో ఆస్వాదించాను. నా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, సముదాయ సభ్యుల సహకారాన్ని సాధ్యమైనంత తీసుకుంటూ ఎంతో నేర్చుకున్నాను. ఆ క్రమంలో సముదాయ విస్తృత లక్ష్యాల దిశగా పనిచేస్తూనే చాలామంది సముదాయ సభ్యుల స్వచ్ఛంద కృషికి సహకరించగలిగానని భావిస్తున్నాను. నేను ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చేసిన పనివల్ల సముదాయంలోకి వచ్చిన వికీపీడియన్ల కృషి సాగుతూ ఉండడం, పెంపుదల చేసిన ప్రాజెక్టులు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతూండడం వంటి పరిణామాలెన్నో నాకు వృత్తిగతంగా సంతృప్తినిచ్చాయి. సముదాయానికి నాపై ఉన్న నమ్మకం, తమతో భుజం భుజం కలిపి పనిచేసే అవకాశాన్ని నాకు ఇవ్వడం వంటివే లేకపోతే నేను సాధించానని అనుకుంటున్నవేవీ ఊహించడం కూడా సాధ్యమయ్యేదే కాదని నమ్ముతున్నాను. ఇందుకు నాతో కలిసి పనిచేసిన సముదాయ సభ్యులందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏ సందర్భంలోనైనా ఉద్యోగ పరంగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించమని కోరుతున్నాను.

ఐతే, తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల మీద నేను కృషిచేయడం అన్నది సీఐఎస్‌-ఎ2కెలో ఉద్యోగం ప్రారంభించడంతో మొదలుకాలేదు. అంతకు రెండేళ్ళ క్రితమే నేను వికీపీడియన్‌ని, ఆ ఉద్యోగం చేసిన కాలమంతా స్వచ్ఛంద కృషి సాగిస్తూనే వచ్చాను. ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేశాకా వికీపీడియాలో నా ప్రమేయం తగ్గకపోగా స్వచ్ఛంద కృషి మరింత గాఢంగా, స్వేచ్ఛగా చేయగలుగుతానని నమ్ముతున్నాను. ఈ రిజిగ్నేషన్ కేవలం ఉద్యోగ బాధ్యతలకేనని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఉద్యోగ బాధ్యతలు వదిలివేస్తున్నాను కాబట్టి ఇకపై సీఐఎస్-ఎ2కె తరఫున అధికారికంగా ఏ ప్రకటనా చేయబోవట్లేదు. ఇక నుంచి నేను తెలుగు వికీపీడియాలో ఏ చర్చలో ఏమి రాసినా, బయట ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగత స్థాయిలోనే చేయనున్నాను.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 17:57, 4 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ వంటి వ్యక్తులు ఏ సంస్థకైన మకుటాయమానమైన వారు. సంస్థ వ్యక్తిత్వం అందులోని వ్యక్తుల సమష్టి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. లేనిపక్షంలో అవి నిర్జీవమైనవే. ఒక విధంగా నేను వికిసోర్సులో ఆసక్తితో కృషి చేయడానికి కారణభూతుడైనవాడు పవన్ సంతోష్. వ్యక్తిగత కారణాలేవైనా అవి ఆతడి పురోభివృద్ధికి హేతువులు కావాలని , పవన్ సంతోష్ ఒక సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను , ఆశీర్వదిస్తున్నాను--Ramesam54 02:05, 7 ఆగస్టు 2019 (UTC)
@వాడుకరి:Pavan santhosh.s గారికి, మీరు సిఐఎస్-ఎ2కె తరపున జరిపిన వికీసోర్స్ కృషికి ధన్యవాదాలు. మీ ముందు కృషికి శుభాకాంక్షలు--అర్జున (చర్చ) 05:00, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్సులో వీవీఐటి కృషికి సహాయం కోరుతూ[మార్చు]

వీవీఐటి వికీకనెక్టు ద్వారా నిర్వహిస్తున్నా తెలుగు వికిసోర్స్ ట్రైనింగ్ కోర్సు సందర్భంగా విద్యార్థులు ఈ కింద లంకె లో ఉన్న పుస్తకాలను ప్రచురించి వాటి మీద పనిచేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పుస్తకాల మీద పనిచేయడం వాళ్ళ వాళ్ళకి ఆసక్తి ఉంటుందని తలుస్తున్నాను. కాబట్టి తోటి వికీపీడియన్లు వీటి ప్రూఫ్ రీడింగ్ పూర్తయ్యేదాక వీటిపై విద్యార్థులనే పనిచేసే అవకాశమిస్తారని, వీరిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

లంకె - వికీసోర్స్:వికీప్రాజెక్టు/వీవీఐటీ వికీకనెక్ట్

ధన్యవాదాలు - Mekala Harika (చర్చ) 15:34, 10 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Mekala Harika గారికి, మీ కళాశాల విద్యార్ధులు తెలుగు వికీసోర్స్ లో కృషి చేయటానికి ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నాను. వికీసోర్స్ లో గత అనుభవాల దృష్ట్యా విద్యార్ధుల పనికి స్పందించకపోతే కొన్ని దోషాలు కొనసాగి పని నిరర్ధకమై చివరికి తొలగించాల్సి వచ్చింది. వికీసోర్స్ సమిష్టికృషి కాబట్టి, ఇతర అనుభవమున్న వారు మీ కృషిని గమనించి సూచనలు, లేక కొంత పని చేసి సహాయ పడడమే మంచిది. మీ కృషి గురించిన గణాంకాల గురించి మీకు దిగులైతే, ఆ వివరాలు, SQL query ద్వారా పొందవచ్చు. శుభాశ్సీసులు. --అర్జున (చర్చ) 04:34, 16 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంకొక విషయం పుస్తకాలు కామన్స్ లో ఎక్కించేటప్పుడు, తెలుగు పుస్తకాలకు తెలుగులోనే పేరు పెట్టండి. దానితో రచయిత పేరు చేర్చవద్దు. వికీసోర్స్ లో పనికి చాలా సహాయకరమవుతుంది. --అర్జున (చర్చ) 04:39, 16 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జున మొదటిగా మీరు మాకు సహకరించడం చాలా ఆనందదాయకం. మీరు సూచించిన విధంగానే తరువాతి పుస్తకాలను కామన్స్ లోకి ఎక్కిస్తాము. మేము మీ సలహాలను ఎప్పుడు ఆహ్వానిస్తాము. ధన్యవాదములు --Mekala Harika (చర్చ) 14:10, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Mekala Harika, మీ స్పందనకి ధన్యవాదాలు. ఇప్పటికి పుస్తకాలలో సూచిక పేజీ తప్ప పని జరిగినట్లు లేదు. ఒకవేళ పని జరిగినా వాటిని కొత్త పేరుగల సూచిక పుటల కు తరలించవచ్చు. పుస్తకాల పేజీలు వికీమీడియా పిడిఎఫ్ మునుజూపులో కనబడడం లేదు కావున, ఆ పుస్తకాలు కూడా తెలుగు పేరుతో కామన్స్ లో ఎక్కించి, గతంలో ఆంగ్ల పేరుతో ఎక్కించినవాటికి తొలగింపు అభ్యర్ధన చేయండి.--అర్జున (చర్చ) 23:00, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను గమనించిన దోషాల పిడిఎఫ్ లు File:Kalakshepam Volume 01 Bhamidipati Kameswararao 1956 134 P 2020010005572.pdf, File:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf, File:Pelli Training Bhamidipati Kameswararao.pdf. --అర్జున (చర్చ) 23:05, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జున పిడిఎఫ్ లలో దోషం ఉండినందువల్ల సూచిక పేజీ మాత్రమే సృష్టించబడినవి. త్వరలో పిడిఎఫ్ లను సరిదిద్ది మరల కామన్స్ లోకి ఎక్కిస్తాము. మీరు చెప్పిన సూచలను పాటించి ఈసారి సరిగ్గా చేస్తాము.--Mekala Harika (చర్చ) 06:22, 19 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Mekala Harika గారికి,మీ బృందం పని మొదలు పెట్టటం గమనించాను. తొలిగా అందరూ ఒకే పుస్తకంపై ఇప్పటికే చేర్చబడినపుస్తకమైనా సరే, కృషి చేస్తే మంచిదనుకుంటాను, ఆ తరువాత వేరు పుస్తకాలపై పనిచేయవచ్చు, ఎందుకంటే తొలిగా వికీసోర్స్ గురించి, రూపం సరిగా చేయటం, అధ్యాయాలు చేయటం లాంటి పనులను అందరు కలిసి నేర్చుకోవచ్చు. --అర్జున (చర్చ) 04:34, 22 ఆగస్టు 2019 (UTC).[ప్రత్యుత్తరం]
తోటి వికీపీడియన్లకు సూచన. ఇది విద్యార్థి వికీపీడియన్ల నేతృత్వంలో వారి ప్రణాళికలతో సాగుతున్న కార్యక్రమం. నేను వీరికి అవసరమైనంత మేరకు శిక్షణను అందించాను. ఐతే వారి ప్రోగ్రాం డిజైన్‌లో మార్పుచేర్పులు చేయలేదు. ఎందుకంటే, ఇక్కడ వారు నాయకులు. సాధారణంగా ప్రిన్సిపాళ్ళతో మా సీఐఎస్-ఎ2కె వాళ్ళు మాట్లాడి పిల్లల మీ కార్యక్రమాన్ని రుద్దేలాంటి పద్ధతి కాదిది. వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తున్న అంశాల్లో వారే నాయకులన్నదీ ఒకటి. ఆమాటకి వస్తే ఆ బాధ్యతాయుతమైన స్వతంత్రతే మిమ్మల్నీ, నన్నూ, సమస్తమైన వికీపీడియా లోకాన్ని కూడా నడిపిస్తోందని నా ఉద్దేశం. గత సంవత్సరం వీరు దాదాపు 13-16 మందిని వికీపీడియన్లను వారి దోవన వెళ్ళి తయారుచేసుకున్నారు. కొత్తవారిని తెచ్చి నిలబెట్టడం ఎంత కష్టమో మనకు తెలిసిందే కదా. నేను చెప్పేదేమంటే వారి దారిన వారిని వెళ్ళనిద్దాం, మరీ దారుణమైన పొరబాట్లు చేస్తూ ఉంటే తప్ప. ఆపైన 3 నెలలకు ఓ సమీక్షా కార్యక్రమంలో కార్యక్రమాన్ని దిద్దుకుని ముందుకుసాగుతారు. ఇదీ నా ఉద్దేశం. --Pavan santhosh.s (చర్చ) 09:34, 22 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
::::::

@Pavan santhosh.s గారికి, మీ సూచన ప్రాజెక్టు నాణ్యతాపరంగా ఏమాత్రం ఆచరణీయం కాదు అని గతంలో విద్యార్ధి లేక వికీసోర్స్ ప్రాజెక్టుల దోషాలు సవరించడానికి ఎంతో సమయం వెచ్చించిన మరియు వికీప్రాజెక్టులోపల, బయట ప్రాజెక్టు నిర్వహణలో అనుభవమున్నవానిగా నాకు అనిపిస్తుంది. వికీసోర్స్ అనేది సమిష్టిగా చేయవలసిన పని. ఒక పుస్తకానికి,కనీసం ఇద్దరు కృషిచేస్తేనే నాణ్యతగా చేయకలుగుతాము. ప్రస్తుతం ఒక పుస్తకానికి ఒక విద్యార్ధికే కేటాయించారు. ఇక 13 మంది కృషిని ఒక వికీపీడియన్ గమనించి సూచనలు చేయడం తలకు మించిన పని. సాధారణ దోషాలు జరగకుండా వుండటానికి, వికీసోర్స్ లో నాణ్యత పరంగా మంచి పద్ధతులు నేర్చుకొనడానికి నేను తెలిపిన సలహాకంటే మెరుగైన సలహా వుంటే తెలపండి. ఉదాహరణకు ఇద్దరు విద్యార్ధులు, రెండు వారాల పాటు, చురుకుగా వున్న వికీసోర్స్ పుస్తక ప్రాజెక్టులో పనిచేస్తే వారు మెరుగైన పద్ధతులు నేర్చుకోగలుగుతారు. ఈ పదమూడు మందిలో కొంత మందికి ఏ కారణానైనా వికీసోర్స్ లో పనిచేయటం అంత నచ్చకపోతే వారు తప్పుకుంటారు. ఆసక్తి గల వారే చురుకుగా కొనసాగుతారు. అప్పుడే వికీసోర్స్ నాణ్యతను పరిరక్షించగలుగుతాము. రెండు వారాలు ఒకే పుస్తక ప్రాజెక్టులో పనిచేయమని కోరడం, లేదా ఏదైనా చురుకుగా వున్న పుస్తకపనిలో పాల్గొని పనిచేయడం నేర్చుకోవటం వారి స్వాతంత్ర్యాన్ని హరించివేసినట్లుకాదుకదా. అది పైలట్ ప్రాజెక్టు అవుతుంది. ఇంకొకసారి ఆలోచించండి.--అర్జున (చర్చ) 23:11, 22 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్కొక్కరు వాళ్ళకిష్టమైన పుస్తకం మీద పనిచేస్తేనే వాళ్ళకు ఉత్సాహం ఉంటుందని నా ఉద్దేశ్యం. వాళ్ళు పొరపాట్లు చేస్తుంటే కొంచెం కష్టమైనా సరే అందరికీ సరైన సలహాలు అందించడం ద్వారా మనం ఎక్కువ సభ్యులను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 07:00, 23 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, మీరు నా వ్యాఖ్య సరిగా అర్ధం చేసుకున్నట్లు లేదు. ఒక్కొక్కరు చేయటం నాణ్యతగా పనిచేయటానికి సహకరించదు. పుస్తకాన్ని కనీసం ఇద్దరైనా అచ్చుదిద్దితేనే నాణ్యతగా తయారయ్యేదని మీకు తెలియనిది కాదు. వికీప్రాజెక్టులలో జట్టు కృషిని ప్రోత్సహించాలి. ఇక పుస్తకాల ఎంపిక వారి ఇష్ట ప్రకారం చేయవచ్చు. కేవలం పైలట్ ప్రాజెక్టుకే వారు గుర్తించిన పుస్తకంలో కాని ఇప్పటికే పనిజరుగుతున్న పుస్తకాలలో కొంతకాలం పనిచేయవచ్చు అని చెప్పాను. --అర్జున (చర్చ) 02:10, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీ వ్యాఖ్యలు సరిగానే అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయలేరని నేను అంగీకరిస్తాను. ఒక్కొక్కరు కనీసం రెండు తమకిష్టమైన పుస్తకాలు ఎంచుకుని ఒక పుస్తకం టైపింగు, మరో పుస్తకం ప్రూఫు రీడింగ్ చేస్తే వాళ్ళకి ఆసక్తి తగ్గకుండా ఉంటుందని నా ఉద్దేశ్యం. మనం ఇదివరకే పని జరుగుతున్న పుస్తకాల మీద వాళ్ళకి ఆసక్తి ఉంటే నేర్చుకోవడం కోసం వాటిమీద పనిచేయమని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ వాటి మీద ఆసక్తి లేకపోతే తమ కిష్టమొచ్చిన పుస్తకాల మీదనే పనిచేస్తూ నేర్చుకోమంటే సరిపోతుంది కదా. రవిచంద్ర (చర్చ) 11:35, 26 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, మీ వివరణకు ధన్యవాదాలు. ఇప్పటికే పనిజరుగుతున్న పుస్తకాలలో పనిచేస్తే సహసభ్యులు తనిఖీ చేయడం, సలహాలివ్వడం సులభం. పుస్తకం పూర్తిగా చేయకపోయినా, చేసినంతవరకు నాణ్యతతో చేస్తే మంచిదే. అందుకని ప్రాజెక్టు పేజీలో పైలట్ ప్రాజెక్టు వివరాలు, స్వంతంగా నైపుణ్యాల మదింపు పట్టిక చేర్చాను. అవి విద్యార్ధులు ముందుపాటిస్తే నాణ్యతగా చేయగలుగుతారు. --అర్జున (చర్చ) 00:12, 27 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Wikisource Advance Training 2019 host for Bid & Application open[మార్చు]

Call for bids to host Wikisource Advance Training 2019 & participation of the program.

Apologies for writing in English, please consider translating the message.

Hello everyone,

It gives us great pleasure to inform that the Wikisource Advance Training 2019 programme organised by CIS-A2K is going to be held from 11 October & 13 October 2019.This year CIS-A2K is seeking expressions of interest from interested communities in India for hosting the Wikisource Advance Training 2019.Wikisource Advance Training is a 3 (three) days residential training program for which attempts to aims to groom experienced Wiki-librarians for Indic language Wikisource to proofread even better quality content on Wikisource.

If you're interested in hosting the program, Following are the per-requests to propose a bid:

  • Active local community which is willing to support conducting the event.
  • At least 4 active Wikimedian ( not specific for Wikisource contributor) community members should come together and propose the city. They should reside in the city/nearby or states.
  • Women Wiki-librarian in organizing team is highly recommended.
  • City should have at least a national airport.
  • Venue and accommodations should be available for the event dates.
  • Participants size of Wikisource Advance Training generally will be around 22.
  • Needed a venue which will have good internet connectivity and conference space for the above mentioned size of participants.
  • Discussions/announcement with the local community by mailing list/village pump.

For participation in this program, you should apply here:

  • The selection will be done by each Indic Wikisource community.
  • We may select maximum 2 (two) Wiki-librarian from each language community.
  • Eligibility criteria for supporting a candidate for a participation: He/she should have a minimum 50 proofread in their languages Wikisource before 15th August 2019.
  • The applicant for participation in this program should have a minimum 500 proofread in their languages Wikisource before 15th August 2019.
  • Self nomination can be done at with a new section.
  • We encourage for female participants.

Please learn more about the Wikisource Advance Training program please visit this page and to submit your bid please visit this page. Feel free to reach to me for more information or email jayanta@cis-india.org.

Best! Jayanta (CIS-A2K) (చర్చ) 17:28, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Update on the consultation about office actions[మార్చు]

Hello all,

Last month, the Wikimedia Foundation's Trust & Safety team announced a future consultation about partial and/or temporary office actions. We want to let you know that the draft version of this consultation has now been posted on Meta.

This is a draft. It is not intended to be the consultation itself, which will be posted on Meta likely in early September. Please do not treat this draft as a consultation. Instead, we ask your assistance in forming the final language for the consultation.

For that end, we would like your input over the next couple of weeks about what questions the consultation should ask about partial and temporary Foundation office action bans and how it should be formatted. Please post it on the draft talk page. Our goal is to provide space for the community to discuss all the aspects of these office actions that need to be discussed, and we want to ensure with your feedback that the consultation is presented in the best way to encourage frank and constructive conversation.

Please visit the consultation draft on Meta-wiki and leave your comments on the draft’s talk page about what the consultation should look like and what questions it should ask.

Thank you for your input! -- The Trust & Safety team 08:03, 16 ఆగస్టు 2019 (UTC)

తెలుగు వికీసోర్స్ కు మెరుగైన లోగో (ఉపవరుస మెరుగుగా కనిపించేటందుకు)[మార్చు]

తెలుగు వికీసోర్స్ ప్రస్తుత లోగోతెరపట్టు(ఫైర్ఫాక్స్ వెబ్ డవలపర్ వాడి) 160pxపరిమాణంలో
తెలుగు వికీసోర్స్ కు ప్రతిపాదిత లోగో v2
లోగో 'స్వేచ్ఛా గ్రంథాలయం'అనే ఉపవరుసతో ప్రతిపాదిత లోగో v3( ఉబుంటు ఇంక్ స్కేప్ తో సమస్య వుండడంతో గింపు వాడ్ చేసినది)


తెలుగు వికీసోర్స్ లో ఉపవరుస పరిమాణం తక్కువగా వుండి వెబ్సైట్లో చూసినపుడు చదవడానికి వీలుగా లేదు. దానిని పెద్దది చేసే ఉద్దేశ్యంతో లోగోకు ఇంకొక రూపం ( మూలం) తయారు చేయబడింది. దీనిపై సహసభ్యులు మరీ ముఖ్యంగా నిర్వాహకులు రాజశేఖర్,సుజాత,రహ్మానుద్దీన్ స్పందనలు ఒకవారంలోగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 05:14, 19 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొక విషయం ప్రస్తుత లోగో మూలంలో దీర్ఘచతురస్రంలో వుండి ప్రదర్శించేటప్పుడు చతురస్రపు 160*160 పరిమాణానికి కుచించబడుతున్నది. అదికూడా ప్రతిపాదిత లోగోలో ఈ సమస్యకూడా సవరించబడుతుంది.--అర్జున (చర్చ) 05:18, 19 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
లోగోలో ఈ స్వేచ్ఛా విజ్ఞాన మూలములు ఏమిటి @Arjunaraoc: గారూ. వికీసోర్సు అంటే ఫ్రీ లైబ్రరీ. ఆ లెక్కన స్వేచ్ఛా గ్రంథాలయం. అలా స్వేచ్ఛా గ్రంథాలయం అంటే పాఠకులకు తేలికగా అర్థమవుతుంది కూడాను. కాబట్టి దీన్ని స్వేచ్ఛా గ్రంథాలయంగా మార్చమని ప్రతిపాదిస్తున్నాను. --Pavan santhosh.s (చర్చ) 23:19, 19 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చాన్నాళ్ళ క్రితం దీనిపైన మీరే చర్చ లేవనెత్తినట్టున్నారు, అది కూడా లోగో ఖరారు సందర్భంలోనే. ఏకాభిప్రాయం లేకపోవడంతో చర్చ మీరే విఫలమైనట్టు ప్రకటించారు. కనీసం ఇప్పుడైనా మళ్ళీ చర్చించి దీన్ని సరిజేసుకుందాం. --Pavan santhosh.s (చర్చ) 23:22, 19 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Pavan santhosh.s గారికి, మీ ప్రతిపాదన ప్రకారం లోగో చేర్చాను. --అర్జున (చర్చ) 01:51, 20 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రెండవ బొమ్మ బాగుంది. రవిచంద్ర (చర్చ) 04:58, 20 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
స్వేచ్ఛా గ్రంథాలయం అని వాడుదాము. రెండవ లోగో బాగుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:06, 20 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదిత లోగో కొరకు సముదాయ సమ్మతి[మార్చు]

తెలుగు వికీసోర్స్ కు ప్రతిపాదిత లోగో (160px పరిమాణంలో)

పై చర్చ ప్రకారం లోగోని ఎంపిక చేసి మరింత మెరుగు (ప్రధాన శీర్షికకు రామరాజ ఖతి) చేసి, సభ్యుల అమోదానికై వోటింగ్ కొరకు పెట్టడమైనది. సభ్యులు ఒక వారం రోజులలో (4 సెప్టెంబరు 2019 లోపల) తమ అభిప్రాయాన్ని తెలియచేయవలసినదిగా విజ్ఞప్తి. --అర్జున (చర్చ) 08:47, 27 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Johanmarkraj777,

Bhavya ECE, Hariwiki23, Mekala Harika, Architha Swetha, Bhaskaranaidu, Ramesam54, Nallam.venkata sai pravallika, Sushma.Maddipatla, Mekala Aruna, Sri Lekha Pathakamuri, Bhavya2207, Eeswaramma Manam, MadySneha, Saranya lakshmi marreddy, Pavan santhosh.s, Mohana Narahari, Manaswini2498, Kattepogu.Anusha, Krishnapriya00, Nrgullapalli, Udayasri13, Poojitha manchi, Jahnavi morla, Ganta.Keerthi, Paruchuri Bhanu Chandra Sekhar guptha, Mani moraboina, Aditya4710, Lalitha53, Asrija1, INDRAREDDYT, 1997kB, మత్స్యగిరి (ఛత్రపతి), గార్లకు, మీరందరూ గత నెలలో (,వికీసోర్స్ చురుకైన ఎడిటర్లు accessdate=2019-08-31) చురుకుగా వున్నారు. దయచేసి క్రింద వోటింగ్ లో మీరు విషయంపై స్పందించగలిగితే పాల్గొనండి. ఇంకా నాల్గురోజులే సమయముంది.--అర్జున (చర్చ) 02:10, 31 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వోటు వేయండి[మార్చు]

అంగీకారం
  1. రవిచంద్ర (చర్చ) 08:52, 27 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Rajasekhar1961 (చర్చ) 14:22, 28 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --శ్రీరామమూర్తి (చర్చ) 14:42, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --అర్జునరావుగారు చేసిన మార్పు చక్కగా ఉంది. ఇప్పుడు లోగో లోని అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ మార్పు చేసినందుకు అర్జునరావు గారిని అభినందిస్తు మద్దతిస్తున్నాను.T.sujatha (చర్చ) 15:10, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

< పై వరుసలో # చేర్చి సంతకం చేయండి >

వ్యతిరేఖం

<పై వరుసలో # చేర్చి సంతకం చేయండి >

తటస్థం

<పై వరుసలో # చేర్చి సంతకం చేయండి >

ఫలితం(Result)[మార్చు]

The above proposal for updating Telugu Wikipedia logo is approved unanimously with four votes in favour and non against or neutral. --అర్జున (చర్చ) 04:07, 5 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాపరచడం[మార్చు]

ఈ రోజు కొత్త లోగో తాజాపరచబడింది. కాని పరిమాణం 120*160 గా వుంది. --అర్జున (చర్చ) 03:34, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

New tools and IP masking[మార్చు]

14:19, 21 ఆగస్టు 2019 (UTC)

పద్యాలు, శ్లోకాలు రూపు దిద్దడం[మార్చు]

పద్యాల రూపుగురించి మెరుగైన సూచనలకొరకు సహాయం:పద్యాలు, శ్లోకాలు చూడండి. --అర్జున (చర్చ) 23:38, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీసోర్స్ లో అచ్చుదిద్దుటకు మార్గదర్శిని[మార్చు]

ఆంగ్ల వికీసోర్స్ లో అచ్చుదిద్దుటకు మార్గదర్శిని ఈ రోజే చూశాను. ఇది ఇంకా మెరుగుచేయబడుతున్నట్లుగా వుంది. కాని వికీసోర్స్ లో ఇప్పటికే వున్న సహాయ పేజీలకంటే మెరుగుగా పుస్తకంలోని వివిధ అంశాల కోణంనుంచి మార్గదర్శకంగా వుంది. తెలుగు వికీసోర్స్ సభ్యులు దీనిని చదివి, ఒక పుస్తకానికి ఏవైనా సవరణలు అవసరం అయితే, ఆ శైలి సూచనలు, ఆయా పుస్తక సూచిక చర్చ పేజీలో తెలపమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:37, 28 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Strategy Draft Recommendation Discussion Salon[మార్చు]

Please translate this message to your language if possible.

Greetings,
You know Strategy Working Groups have published draft recommendations at the beginning of August. On 14–15 September we are organising a strategy salon/conference at Bangalore/Delhi (exact venue to be decided) It'll be a 2 days' residential event and it aims to provide a discussion platform for experienced Wikimedians in India to learn, discuss and comment about the draft recommendations. Feedback and discussions will be documented.

If you are a Wikipedian from India, and want to discuss the draft recommendations, or learn more about them, or share your valuable feedback you may apply to participate in the event.

Please have a look at the event page for more details The last date of application is 5 September.

It would be great if you share this information who needs this. For questions, please write on the event talk page, or email me at tito+indiasalon@cis-india.org

Regards. --MediaWiki message delivery (చర్చ) 07:50, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Event page can be seen for more details at Wikimedia movement strategy recommendations India salon--Ananth (CIS-A2K) (చర్చ) 03:27, 3 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించు మూస మెరుగు[మార్చు]

{{తొలగించు}} మెరుగు చేసి ప్రయోగత్మకంగా రెండు పేజీలపై వాడాను. ఇప్పుడు తొలగించు మూసతో తెలిపిన కారణాన్ని తొలగించు చర్చ పేజీలో నకలు చేయటానికి పాఠ్యాన్ని అందిస్తుంది. ఆ పేజీ రచ్చబండలో సహాయం కావాలిలో ప్రతిఫలిస్తుంది. మీరు ప్రయత్నించి స్పందించండి.--అర్జున (చర్చ) 11:27, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస చర్చపేజీలో తొలగింపు చర్చాపేజీకి లింకు చేర్చడానికి, కూడా పాఠ్యాన్ని అందించేటట్లుగా మెరుగు చేశాను. --అర్జున (చర్చ) 07:37, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్స్ ఫ్రూప్ రీడ్ వాడుక గణాంకాలు[మార్చు]

మే 9, 2014 నాడు తెలుగు వికీసోర్స్ అన్ని వికీసోర్స్ ల లో 19 వస్థానంలో వున్న ( గత చర్చ ) మనం నేటికి 10వస్ధానానికి పురోగమించాము. స్కాన్ ఆధారిత పేజీలలో 14.05% నుండి 31.31%స్థాయి కి చేరుకున్నాము.(గణాంకాల లింకు), 5 సంవత్సరాల కాలంలో ర్యాంకు పెరగటం మరియు స్కాన్ ఆధారితం పెరగటం ఆహ్వానించదగినదే. పది ర్యాంకులలో నార్వే, కటాలన్ తొలగగా, స్వీడిష్, తెలుగు భాషలు వచ్చి చేరాయి. తొలి 10 లో స్కాన్ ఆధారితంలో మనం ఆరో స్థానంలో వున్నాము.

Wikisource Proof read Extension usage Statistics on Statistics on Mon Aug 26 04:54:24 2019 (First set of 6 columns after language column refer to page name space) and the last set of 5 columns relate to main name space
language all pages not proof. problem. w/o text proofread validated all pages with scans w/o scans disamb percent
fr 2492861 704970 8 21 168971 1618099 483691 272546 258222 9086 5238 96.60
en 1938518 712902 29359 151828 1044429 404988 454804 240000 207995 6809 53.57
pl 517127 170209 2640 34378 309900 235989 209105 201389 3832 3884 98.13
de 272346 16363 102 8535 247346 215560 166066 42719 122624 723 25.84
it 371413 101592 3921 25382 240518 125775 79820 46119 33570 131 57.87
ru 184229 81907 1503 5949 94870 10735 491314 143688 344011 3615 29.46
hy 75809 12364 111 1298 62036 41628 7420 1447 5914 59 19.66
es 94685 20101 162 6750 67672 34332 93726 10402 82704 620 11.17
sv 78140 16524 197 2760 58659 18248 10544 5570 4842 132 53.50
te 54298 16456 69 1270 36503 26389 13333 4175 9158 0 31.31

ఈ కృషిలో పాలుపంచుకున్న సభ్యులందరికి ధన్యవాదాలు. తెలుగు వికీసోర్స్ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని కోరుతున్నాను. చాలా పుస్తకాలు అచ్చుదిద్దబడిన, స్కాన్ నాణ్యత దోషాల కారణంగా లేక {{దింపుకొనుటకు తనిఖీ}} పూర్తికాకపోవడం ద్వారా అసంపూర్తిగా మిగులుతున్నాయి. మీ సమయంలో కొంత ఆ పనులకై కేటాయించి సహకరించమని కోర్తున్నాను. ఈ వివరాలు {{సహకారం స్థితి}}లో కన్పడతాయి లేక దానిలోని లింకుల ద్వారా, మరియు ఇతరత్రా పొందవచ్చు--అర్జున (చర్చ) 02:44, 31 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రామాణిక సార్వత్రిక దశాంశ వర్గీకరణ (యూడిసి) వాడుక[మార్చు]

వికీసోర్స్:UDC_వర్గీకరణ వారీగా అన్ని జ్ఞాన వర్గాల పుస్తకాలు కనీసం ఒక పుస్తకంతో మన తెలుగు వికీసోర్స్ లో వున్నాయని తెలుపుటకు సంతోషిస్తున్నాను. --అర్జున (చర్చ) 00:39, 3 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొనదగిన పుస్తకాలు 50 కి చేరాయి.[మార్చు]

తెలుగు వికీసోర్స్ లో 50 ePub పుస్తకాలు

సహసభ్యులకు, వికీసోర్స్ లో దింపుకొనదగిన పుస్తకాలు 50 కి చేరాయని తెలుపుటకు సంతసించుచున్నాను. మీ అందరికృషికి ధన్యవాదాలు. దాదాపు 7 సంవత్సరాల క్రింద ఫ్రూప్ రీడ్ ఎక్స్టెన్షన్ వాడడం ప్రారంభంనాటినుండి జరిగిన, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహత్తర కృషి చేసిన User:Rajasekhar1961 మరియు వాడుకరి:శ్రీరామమూర్తి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగు వికీసోర్స్ అభివృద్ధికి పేజీ నాణ్యతగా అచ్చుదిద్దడమే కాదు, నాణ్యమైన పుస్తకాల ఎంపిక చేయడం, వాటినుండి నాణ్యమైన epub పుస్తకరూపం చేయటం,వీటికి వికీపీడియా వ్యాసాలనుండి లింకు ఇవ్వగలగటం లాంటి నైపుణ్యాలు, ఇంకా పెరగవలసివుంది. ఈ దిశగా అందరూ కొంత కృషి చేస్తారని ఆశిస్తున్నాను. --అర్జున (చర్చ) 12:06, 5 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

7 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్వేచ్ఛానకలుహక్కులు కలవి ( జాబితా)
18 పుస్తకాలు భారత సార్వజనీయమైన కృతులు ( జాబితా)
10 పుస్తకాలు CC-BY లైసెన్సులు గలవి (జాబితా)
15 పుస్తకాలు {{Non-free DLI}} కి చెందినవి(జాబితా)
0 పుస్తకం లైసెన్స్ తెలియనిది. (జాబితా)

--అర్జున (చర్చ) 09:57, 12 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పై సమాచారంలో ప్రాణాయామం పుస్తకం {{Non-free DLI}} కి మార్చి సంఖ్యలు సవరించాను. జాబితా శాశ్వత లింకు.--అర్జున (చర్చ) 03:38, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి[మార్చు]

ఒక యోగి ఆత్మకథ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన An Autobiography of a Yogi అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం. ఈ పుస్తక రచయిత పరమహంస యోగానంద గారు 1952 లో పరమపదించారు. తెలుగు పుస్తక ప్రతి ఆర్కైవ్ లో ఉంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం ఎవరు చేశారు? తెలుగు పుస్తకాన్ని ఇక్కడ చేర్చడానికి కాపీ హక్కులు అంగీకరిస్తాయా?కాపీ హక్కుల మీద అవగాహన కలిగిన వారెవరైనా విశదీకరించగలరు. ఈ పుస్తకాన్ని పాఠ్యీకరణ చేయడానికి నాకు ఆసక్తి ఉంది. రవిచంద్ర (చర్చ) 18:25, 7 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున, Pavan santhosh.s, Rajasekhar1961 ఈ పుస్తకంపై మీ అభిప్రాయం ఏమిటి? రవిచంద్ర (చర్చ) 17:11, 11 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, ఇది డిఎల్ఐ పుస్తకం కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసినఅవసరం లేదు. దీనిని ఇతర డిఎల్ఐ పుస్తకాలలాగానే పాఠ్యీకరణ చేయవచ్చు. ఇక అనువాదం ఎవరు చేసినా, ఈ పుస్తక నకలుహక్కులు యొగోదా సత్సంగ సంస్థ వారికే చెందుతాయి. వారు వారి సంస్థ, గురువు గురించిన ప్రచారంలో భాగంగా ఈ పుస్తకం ఉపయోగ పడుతుంది కాబట్టి, తెలుగు వికీలో ప్రస్తుత డిఎల్ఐ పుస్తకాలకు అనుసరించే నియమాలకు వారినుంచి వ్యతిరేఖత ఉండదని నా అభిప్రాయం. మీరు మరింత జాగ్రత్త వహించాలనుకుంటే లింకులో నకలుహక్కుల గల సంస్థని సంప్రదించవచ్చు.--అర్జున (చర్చ) 01:29, 12 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర: గారూ
1. భారతీయ కృతికి రచయిత చనిపోయి 60 ఏళ్ళు కావడంతో ఒరిజినల్ వర్క్ (ఈ సందర్భంలో రచయిత రాసిన ఆంగ్ల ప్రతి) కాపీహక్కులు తీరిపోయి ఉంది.
2 ఆపైన అనువాదానికి కాపీహక్కులు ఎలా ఉన్నాయన్నది చూడాలి.
2ఎ. ఇక్కడ అనువాదానికి కాపీహక్కులు కనుక సంస్థ చేతిలో ఉంటే అనువాద రచన తొలిగా ప్రచురితమైన 60 సంవత్సరాలకు దాని హక్కులు తీరిపోతాయి. ఇది నిర్ధారించుకోవడానికి కాపీహక్కుల వివరాలు పుస్తకంలో ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి (4వ పేజీ చూడండి) కాబట్టి, అనువాద రచన తొలి ప్రచురణ ఎప్పుడన్నది చూసుకోవాలి.
3. డీఎల్‌ఐలో ఉండడం అన్నది కాపీహక్కులకు సూచిక అన్న అంశం తెలుగు వికీసోర్సులో (ఆమాటకి వస్తే భారతీయ కాపీహక్కుల నిపుణుల ప్రకారం అయినా) ఆమోదయోగ్యం కాదు. బహుచర్చితమైన ఆ అంశంలో కాపీహక్కులకు డీఎల్‌ఐ గీటురాయి అన్న ఏకాభిప్రాయానికి వికీసోర్సు రాలేదు. కాబట్టి డీఎల్‌ఐలో ఉందా లేదా అన్నది మనకు అనవసరం. పుస్తకం పబ్లిక్ డొమైన్లో ఉందా? లేదు. పుస్తకం పబ్లిక్ డొమైన్లో కానీ, స్వేచ్ఛా నకలు హక్కుల్లో కానీ విడుదల చేస్తున్నట్టు కాపీహక్కుదారు నుంచి సుస్పష్టమైన డాక్యుమెంటు మనచేతిలో ఉందా? లేదు. ఇదీ మన లిట్మస్ టెస్టు. కాబట్టే, డీఎల్ఐ ప్రస్తావన అనవసరం.
4. అలానే కాపీహక్కుదారుల ఉద్దేశాలు ఏమిటన్నవి మనం ఊహించడమో, పోనీ తెలుసుకోవడమో కూడా దానికదే ఉపయోగకరం కాదు. మనకు అనుకూలంగా కాపీహక్కుదారు ఉంటే వారు మనకు లైసెన్సులో విడుదల చేయడం మాత్రమే మనకు పుస్తకాన్ని ఇక్కడ వాడేలా సాయం చేస్తుంది.
తేలేదేమంటే సంస్థ చేతిలో కాపీహక్కు ఉన్న ఈ అనువాద రచన 1958కి ముందు తొలి ప్రచురణ పొందివుండకపోతే, సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో విడుదల చేయడానికి ముందుకువచ్చే వరకూ ఉపయోపగపడదు. ఈ సందర్భంలో కాపీహక్కుదారులను మనం మెయిల్‌ ద్వారా సంప్రదించి చూడాల్సివుంటుంది. --Pavan santhosh.s (చర్చ) 07:51, 12 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Wikisource Advance Training 2019 Application open[మార్చు]

Call for application for participation in Wikisource Advanced Training 2019. Apologies for writing in English, please consider translating the message.

Hello everyone,

It gives us great pleasure to inform that the Wikisource Advance Training 2019 program organized by CIS-A2K is going to be held from 11 October & 13 October 2019 at Pune.

Wikisource Advance Training is a 3 (three) days residential training program for which attempts to aims to groom experienced Wiki-librarians for Indic language Wikisources to proofread even better quality content on Wikisource.

Interested candidates are requested to apply with the following registration link: https://docs.google.com/forms/d/1Uhab4qpMUZYMnO_VeHRfN0FinbhNiCwiooSxHFPGxpI/edit

Please learn more about the Wikisource Advance Training program and Other details will be updated from time to time on this page. Feel free to reach me for more information or email jayanta@cis-india.org.

Best! Jayanta (CIS-A2K) (చర్చ) 17:35, 12 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

The consultation on partial and temporary Foundation bans just started[మార్చు]

-- Kbrown (WMF) 17:14, 30 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Feedback wanted on Desktop Improvements project[మార్చు]

07:15, 16 అక్టోబరు 2019 (UTC)

Community Wishlist 2020[మార్చు]

IFried (WMF) 19:30, 4 నవంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey[మార్చు]

This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.

MediaWiki message delivery (చర్చ) 09:06, 18 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధర్వణవేదము / అథర్వణవేదము[మార్చు]

అధర్వణవేదము అనే పేజీ చూడండి. సంస్కృత వికీసోర్సులో దీన్ని అథర్వవేదః గా రాసారు. ఎన్వికీలో, ఇంగ్లీషు వికీసోర్సులో (1, 2) కూడా దీన్ని "అథర్వ" అనే రాసారు. నా ఉద్దేశం "ధ" బదులు "థ" ఉండాలేమో అని, "ణ" గురించి కాదు. పెద్దలు పరిశీలించ గలరు. __Chaduvari (చర్చ) 07:05, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, మీరు చెప్పింది సబబుగా ఉంది. నేను కూడా అథర్వణ వేదము అనే ఉండాలి అనుకుంటున్నా. ఆంధ్రభారతి లో ఇలాగే ఉంది. ఆ నిఘంటువులోనే అధర్వణ వేదం అనే పదాన్ని అథర్వణ వేదం అనే పదానికి దారి మళ్ళించారు. సంస్కృతంలో అథర్వ వేదం తెలుగులో అథర్వణ వేదం ఎందుకైందో నాకూ తెలియదు మరి. రవిచంద్ర (చర్చ) 12:12, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, రాజశేఖర్, అర్జున వంటి పెద్దలు ఏమంటారో..!? __Chaduvari (చర్చ) 04:46, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నిఘంటువులలో రెండుపదాలు వాడుకలో ఉన్నట్టుగా తెలియజేస్తున్నాయి. ఇలాగే ఉంచేద్దాము.--Rajasekhar1961 (చర్చ) 08:05, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకను బట్టే నిఘంటువులు తయారై ఉండవచ్చు. ఇదే ప్రశ్న నేను తెలుగు పదం సమూహంలో అడిగితే అథర్వవేదం అనేది సరైన పదమన్నారు. అది కాకపోయినా కనీసం అథర్వణ వేదం అని అయినా మార్చాలని నా ఉద్దేశ్యం. రవిచంద్ర (చర్చ) 10:32, 29 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, ఏ నిఘంటువులు రెండుపదాలూ వాడుకలో ఉన్నట్టుగా తెలియజేస్తున్నాయి? __Chaduvari (చర్చ) 00:34, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్రభారతిలోనే రెండు పదాలతో వెదికాను; బహుజనపల్లి వారి శబ్దరత్నాకరములో అధర్వణము అని ఉన్నట్లు చూపిస్తున్నది. సంస్కృత ఉత్పత్తిపరంగా అథర్వణవేదము సరైన పదముగా అనిపిస్తున్నది.--Rajasekhar1961 (చర్చ) 13:59, 17 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సంస్కృత, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీషు ల్లో దీన్ని అథర్వ అనే అంటున్నాయి. ఆంధ్రభారతి లోని నిఘంటువుల్లో ఎక్కువ శాతం అథర్వ అనే వాడుతున్నాయి. ఎక్కువగా ఏ పేరు ప్రాచుర్యంలో ఉంది అన్నది చూసుకుని ఆ పేరుతోటే పేజీలు పెట్టడం వికీ పద్ధతి. ఇక్కడ దానికి మినహాయింపు ఉంది అంటే.., సరే. నమస్కారం. __Chaduvari (చర్చ) 01:33, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: గారూ, అథర్వణవేదము గా మార్చండి. కానీ చాలా పేజీలు మార్చాల్సి ఉన్నది. shortcut లో త్వరగా చేయగలమేమో చూడండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:10, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, నేను వేరే వికీపీడియా పనుల్లో తలమునకలుగా ఉన్నాను. ఇక్కడ సమయం పెట్టలేను, మన్నించండి. ఇక్కడ పని చేసేవారెవరైనా చెయ్యగలరు. ధన్యవాదాలు. __Chaduvari (చర్చ) 06:14, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]