వాడుకరి:Bhaskaranaidu

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to searchనాగురించి[మార్చు]

నేను హైదరాబాదు నివాసిని. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని. జన పదులు, జానపదాలు, పై నాకు మక్కువ ఎక్కువ. పైగా ఈ వర్గంలో కృషి స్వల్పంగానే వున్నది. ఇందులో కొంత వరకైనా పురోగతిని సాధించాలనే ఉద్ధేశంతొ ఈ చూచి వ్రాత పనికి పూనుకొన్నాను. ఆ విథంగానైనా కొంత విషయ సంగ్రహం చేయవచ్చుననే ఆలోచన లేక పోలేదు. వికీ పీడియా, విక్షనరీ, వికి బుక్స్ లలో కొంత కృషి చేశాను. వాటిని కొనసాగిస్తూనె ఇందులో కూడ కొంత పని చేసి ఈ విభాన్ని కూడ కొంత ఆభివృద్ది చేయాలని వుంది. అదే ఈ నా ప్రయత్నం.

ఇ.భాస్కరనాయుడు

మార్పులు (గణాంకాలు)[మార్చు]

వికీసోర్సులో నేను ఏప్రిల్ 15, 2012 న చేరాను. 27 సెప్టెంబర్ 2013 నాటికి అనగా సుమారు 17 నెలలలో నేను చేసిన మార్పుల సంఖ్య ...... 5,000 కు మించింది.

నా స్వంత చిత్రము(చిన్నప్పటిది)
నావ్యక్తిగత చిత్రము

ఇంతవరకు నేను లిప్యంతీకరణ చేసిన గ్రంధములు:[మార్చు]

 1. తెలుగువారి జానపద కళారూపాలు: గ్రంథ కర్థ: మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి: పుటలు...784
 2. అంటువ్యాధులు: గ్రంధ కర్థ: ..... ఆచంట లక్ష్మీపతి.... పుటలు......257
 3. యోగాసనములు: గ్రంధ కర్థ: ....... లంక సూర్యనారాయణ....188
 4. సుభద్రా కళ్యాణం గ్రంధ కర్త : తాళ్ళ పాక తిమక్క: (పూర్తయినది 12/4/2014)పుటలు 56
 5. వృక్షశాస్త్రము, రచయిత వి. శ్రీనివాసరావు. పుటలు. 188(పూర్తయినది)
 6. రామచంద్రప్రభుశతకము (పూర్తయినది)
 7. ద్వారకాపతి శతకము(పూర్తయినది)
 8. భద్రాద్రిరామ శతకము(పూర్తయినది)
 9. భర్గ శతకము(పూర్తయినది)
 10. దేవకీనందన శతకము(పూర్తయినది)
 11. వృషాధిప శతకము ‎ (పూర్తయినది)

ప్రస్తుతం లిప్యంతీకరణ కొన సాగు తున్నవి:

1. ఆంధ్ర గుహాలయాలు, రచయిత దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి. పుటలు 54.
రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర
ఢిల్లీ దర్బారు
శతావధానసారము
ప్రబంధ రత్నావళి
సరిపడని సంగతులు
నాగార్జున కొండ
శంబుకవధ
విజయనగర సామ్రాజ్యము
పానశాల
మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము
అమెరికా సంయుక్త రాష్ట్రములు
శ్రీనాథకవి జీవితము
ఢిల్లీ దర్బారు
శతావధానసారము
ప్రబంధ రత్నావళి
సరిపడని సంగతులు
నాగార్జున కొండ
విజయనగర సామ్రాజ్యము
పానశాల
మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్' స్వీయచరిత్రము.
రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర
కవికోకిల గ్రంథావళి
తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)
శ్రీనాథకవి జీవితము
ఆడిదము సూరకవి
రాణీ సంయుక్త
ఆంధ్ర కవిత్వ చరిత్రము
తిరుమల తిరుపతి యాత్ర
శాసన పద్యమంజరి
జీవశాస్త్ర సంగ్రహము
ప్రభుత్వము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)

"ఆంధ్ర రచయితలు" కృషికి అభినందనలు[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Bhaskaranaidu గారికి, ఆంధ్ర రచయితలు అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 03:13, 1 మార్చి 2015 (UTC)

kotta linkulu[మార్చు]

https://meta.wikimedia.org/wiki/Grants:Learning_%26_Evaluation/Global_metrics

నాదిద్దుబాట్లు[మార్చు]

నాదిద్దుబాట్ల సంఖ్య: 15,050 8.4.2015 నాటికి 15000 దిద్దుబాట్ల సంఖ దాటినది. వికీసోర్స్ లో మొత్తం (అందరు వ్రాసినవి) ఎన్ని దిద్దుబాట్లు వున్నవో తెలియరాలేదు. Bhaskaranaidu (చర్చ) 16:50, 8 ఏప్రిల్ 2015 (UTC) ఇది నా అవగాహన కొరకు వ్రాసుకొన్నది.

పతకం[మార్చు]

నావ్యక్తిగత చిత్రము
తెలుగు మెడల్

తెలుగువారి జానపదకళారూపాలు గ్రంథాన్ని ఎంతో ఓపికగా వికీసోర్స్ లో చేరుస్తున్నందులుకు కృతజ్ఞతసూచకం గా ఈ పతకం అందచేస్తున్నాను. --అర్జున (చర్చ) 10:30, 16 ఆగష్టు 2013 (UTC)

పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/62[మార్చు]

"తదేత ద్భారతం వర్షం సర్వ బీజం ద్విజోత్తమ!" "ఈ భారతవర్షము అఖిలమానవజాతికి పుట్టినిల్లు."

భారతీయార్యుడే ప్రపంచములోని సమస్త జాతులకును మూల పురుషుడు. అతడే స్వాయంభువ మనువు. మనువు సంతానమైనందున వారు "మానవులు" అని పిలువబడిరి.

.అందు సంఘమునుండి బహిష్కృతులయిన బాహ్లికు లనేకులుపోయి హిమాలయముల కుత్తరముగా పశ్చిమ భాగమున గల "బాక్" నగరము ప్రధాన స్థానముగా గల దేశమున నివసించిరి. శకులు నివసించిన దేశము "శాకస్థాన" మని (ఇది పర్షియాలో దక్షిణ పశ్చిమముగా గలదు.) పేరొందినది. "పరశకులు" పోయి నివసించినభూమి 'పారశీక' మైనది. ఇందే పల్లవులు కూడ (దక్షిణమున) నివసించిరి. బహిష్కృతులయిన భారతీయ క్షత్రియ జాతివారగు యవనులు భారతమున గల యవన రాష్ట్రములనుండి అసంఖ్యాకులుగా వెడలిపోయిరి. అట్టివారిచే ఆక్రమింపబడిన ప్రదేశము "అయోనియా" యని పేరుపొందినది. అందు నివసించిన భారతీయక్షత్రియశాఖవారు 'అయోనియను' లనబడిరి. కాలము గడచుచుండగా ఉత్తర ఐరోపానుండి క్రీ. పూ. వేయి సంవత్సరములక్రింద దిగివచ్చిన "గ్రీకు" లను పేరుగల మోటుజాతివారివలన "అయోనియను"ల నాగరికత యంతయు నాశన మొనర్పబడినది. అయోనియనులును గ్రీకులునుకలిసి సాంకర్యమును జెందిరి. అయోనియా దేశము జయించిన జాతివారల పేరున "గ్రీస్" అని పిలువబడినది. అందు నివసించుచుండిన అయోనియనులు కూడ గ్రీకుల సాంకర్యమున 'గ్రీకు' లని పిలువబడిరి. కాని నాగరికులగు అయోనియనులతో రక్తసంబంధము కలిగినందున గ్రీకులు క్రమక్రమముగా నాగరికులయి అయోనియనులతో మిశ్రమమయి పోయిరి. క్రూరత్వములో ఉభయులును సమానులైనందున అది ఆ మిశ్రమజాతులందు మితిమీరిపోయినది. ఉభయజాతి వారలును నాగరికులగు అయోనియనుల పేర్లనే హెచ్చుగా పెట్టుకొనుచుండిరి. అతిపురాతనకాలమున భారతవర్షమునుండి పారశీకమునకును అచటినుండి క్రమక్రమముగా ఐరోపాకును పోయి అచట గిరి గహ్వరములయందు నివసించెడి భారతీయులయిన మోటుజాతి వారును భారత దేశమునుండి వలసపోయిన శక, యవన, హూణ, రూమకాది బహిష్కృత క్షత్రియజాతివారును కలిసి ఒకరొకరితో రక్తసంబంధములను కలుపుకొని వారితో మిళితమై అనేక సంకీర్ణజాతులు (Mixed

3.ఆర్యుడే' మూలపురుషుడు. కనుక 'ఆర్యులు' అతిపురాతన జాతివారై యున్నారు. మిగిలిన జాతులన్నియు వారికి పిమ్మటి వారినుండి యేర్పడిన వైయున్నవి. ప్రపంచమంతయును ఆర్యజాతితోడనే నిండియున్నది. మిగిలినవాటి నన్నిటిని ఆర్యులనుండి యేర్పడిన వివిధశాఖలుగా చెప్పవలయునే కాని అవియన్నియు ఆర్యులకంటె వేరైన ప్రత్యేక జాతులని చెప్పదగదు. 4.కృష్ణాగోదావర్యాది మహానదులచే పవిత్రమగు చుండిన మన నివాసభూమి ప్రాచీనకాలమున 'ప్రాచ్యక^ దేశ మని పిలువబడుచుండెడిది. దాని నొకకాలమున .బలి' యనెడి మహారాజు పాలించియున్నాదు. ప్రాచ్యక దేశము ఉత్తరమున బెంగాలునకు ఉత్తర సరిహద్దునుండి దక్షిణముగా ఇప్పటి మద్రాసునకు దిగువవఱకు వ్యాపించియుండెను. బలిమహారాజు అనంతరము ఆతని కుమారులు ఆరుగురును దాని నాఱుభాగములుచేసి పంచుకొని ఎవరి వాటాకు వచ్చిన భూభాగమును వారు తమ పేరులతో వ్యవహరించుకొని యుండిరి. బలియొక్క కుమారులు 1 అంగరాజు 2 సింగరాజు 3 కళింగరాజు 4 సుంహ్మరాజు 5 పుండ్రరాజు 6 ఆంధ్రరాజు అనెడి పేరులుగలవా రైయుండిరి. వారు తమతమ భాగములకువచ్చిన దేశభాగములకు వరుసగా అంగ దేశమనియు వంగ దేశమనియు కళింగ దేశమనియు సుంహ్మదేశ మనియు పుండ్రదేశ మనియు ఆంధ్ర దేశమనియు పేరులనుంచి పరిపాలించియుండి రని పూర్వ చరిత్రల యందు సూటిగా చెప్పబడియుండగా ఎవరో 'అంధ్ర' లనబడెడి బాహ్యజాతివా రుత్తరదేశమునుండి వచ్చి ఆక్రమించి నివసించి యుండవచ్చుననియు అందువలననే యీదేశమునకు 'ఆంధ్రదేశ' మనుపేరు వచ్చియుండవచ్చు ననియు సందేహముతో గూడిన యీ వికల్పము లేల చేయవలసి వచ్చినదో తెలియరాకున్నది. మన సందేహములకు, వికల్పములకు, కల్పనలకు ఎట్టియవకాశమును లేకుండ భాగవతమునందు ఆంధ్రదేశమున కీపేరెటుల వచ్చినదో సూటిగా చెప్పబడినది. ప్రాచీన ప్రాచ్యక దేశ భాగమే 'ఆంధ్రదేశ' మని పిలువబడినది. అట్టి ఆంధ్రదేశములో అతిపురాతన కాలమునుండి నివసించుచుండిన ప్రజలందరును 'ఆంధ్రు'లని పిలువబడిరి. వారు మాటలాడు తెలుగుభాష కూడ ఆంధ్ర భాష యను నామాంతరమును పొందినది. కనుక 'ఆంధ్రులు' అనబడెడి ప్రజలందరును 'చాతుర్వఋణ్యస్థులును' స్వచ్ఛమైన ఆర్యజాతీయులైయున్నారు.

సూచిక:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf[మార్చు]

స్వాగతము[మార్చు]

{{Subst:స్వాగతం}}

పుట సంఖ్య[మార్చు]