Jump to content

ఆంధ్ర కవిత్వ చరిత్రము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

ఆంధ్ర కవిత్వ చరిత్రము

శ్రీ బసవరాజు వేంకట అప్పారావు, బి.ఏ., బి. ఎల్.,

గారిచే విరచితము.







చెన్నపురి:

వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారిచేఁ

బ్రకటితము.

All Rights Reserved.





PRINTED BY

V. RAMASWAMY SASTRULU & SONS

AT THE 'VAVILLA' PRESS

Madras.

పీఠిక.

నాగ్రంథమునకు నేనే పీఠిక వ్రాయుట, నాకు నేనే దండోరా వేసికొన్న ట్లుండును. కారణాంతరములచే నట్లు చేయవలసివచ్చె. గుణదోషవిమర్శనము రసజ్ఞులకే విడిచితిని. ఇచ్చట గ్రంథరచనయం దేనవలంబించిన పద్ధతులఁగూర్చి యొకటిరెండుమాటలఁ దెల్పనెంచితిని.

సాహిత్యవిషయమునఁ బ్రాక్పశ్చిమదేశములకు విరోధభావము తగదనియుఁ, బద్ధతులు వేఱయినను బరమార్థము రెంటికిని రసప్రతిపాదనమేయనియు గ్రహించినవాఁడనగుటచేఁ బాశ్చాత్యసాహిత్య విశారదుల యభిప్రాయముల నచ్చటచ్చట స్థాలీపులాకన్యాయమున సూచించుచువచ్చితిని. ప్రాక్పశ్చిమసంయోగ మసంభవమనియు, 'నెవరికివారే యమునాతీరే' యనియు, నమ్మువారికి నే నవలంబించినపద్ధతి రుచింపక పోవునేమోకాని, విశాలదృష్టితో సమరసభావముతో సాహిత్య చరిత్రము నవలోకించువారికి సాహిత్య మెట్లు జీవసూత్ర బద్ధమై దేశకాలపాత్రానుసారముగ మార్పులఁ జెందుచు, భిన్న పరిణామములఁ దాల్చుచు, నభివృద్ధిఁ జెందుచుండునో గోచరింపకమానదు. అదియునుంగాక, విద్యాలయములఁ గొంతవఱకుఁ బాశ్చాత్యసాహిత్యమును జదివినవాఁడ నగుటచే, నాయభిప్రాయముల నచ్చటచ్చటఁ బాశ్చాత్యవాసన లుండక పోవు. అట్టివానినెల్ల రసజ్ఞులు నిష్పక్షపాతబుద్ధిం బరిశీలించి గుణలేశమునుమాత్రమే గ్రహించెదరుగాత!

రెండవవిషయము: పాశ్చాత్యవాసనలు నన్ను వీడక వెంటాడుచున్నను, భారతీయనాగరికతకునెల్ల మూలకందమనఁదగు సంస్కృతవాఙ్మయమును జుల్కనఁగఁ జూడక మూలాధారముగనే గ్రహించి సర్వత్ర వాదమునకుఁ గడంగితిని. కాని, సాంస్కృతికాలంకారికుల ప్రధానసూత్రమును మాత్రమే కయికొని, యప్రధానము లగు వానినెల్ల విడిచి సాహిత్యమునకును,రసమునకును, శైలికిని సంబంధించిన ముఖ్య సూత్రములచర్చతోడనే గ్రంథమును బూరించితిని. అప్రధాన విషయములఁగూర్చి విపులవ్యాఖ్యానము గావలసినవారికి పూర్వసంప్రదాయానుసారములగు లక్షణగ్రంథము లెన్నియేనియుంగలవు. 'చక్కనిరాజమార్గమే యుండఁగా సందుల గొందుల దూఱనేలనే యోమనసా!' యనుత్యాగరాజవాక్యమునేఁ ప్రమాణముగఁ గయికొని కావ్యతత్త్వాన్వేషణమున ముఖ్యసూత్రములనే యాధారముగఁ గొని రాజమార్గముననే నడువఁ బ్రయత్నించితిని.

ప్రసంగవశమున నెచ్చటనేనిఁ బ్రస్తుతపండితులఁగూర్చి, పరుషవాక్యములఁ బల్కియుంటినేని పండితులు దానిని వ్యష్టిపరముగ నన్వయించుకొని యాగ్రహింపక నేఁజేయువాదముతో సమన్వయముఁ గావించుకొనెదరుగాక! దూషణభూషణ. తిరస్కారములు ఆత్మకుఁ జెందవని నమ్ము మనవేదాంతులకు నిగ్రహము సహజగుణమేకదా!

ఈగ్రంథరచనవిషయమున నాకుఁ బ్రేరకులయినట్టి శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికిని, సహజముగఁ బాదుషాల కన్ననుగూడ 'బద్దకస్తుఁడ' నగు నాలోపములనెల్ల సర్దుకొని వచ్చుచు గ్రంథమునఁ జాలభాగము వ్రాసిపెట్టి మూలమును ప్రమాదరహితముగ సంస్కరించిన మన్మి త్రులగు శ్రీపొన్నలూరి సూర్యనారాయణశర్మగారికినిఁ గృతజ్ఞుఁడ నగుచున్నాఁడను. పరుల యభిప్రాయములఁ గైకొనునపుడెల్ల వారిపేరులఁ బొందుపఱచియేయుంటిని. కాని యెచ్చటనేనిఁ బ్రమాదవశమున నెవ్వరి పేరు లేనిఁ దెలుప మఱచితినేని యయ్యది గ్రంథ చౌర్యముగఁ బరిగణింపక ప్రమాదమాత్రమే యని కరుణాలసదృష్టితో రసజ్ఞులు వీక్షింతురుగాక!

ఈ గ్రంథమున కాచంద్రార్క స్థాయి యబ్బుగావుతమని గాని, నాకు సాహిత్యరసపోషణ బిరుదము లభించుఁగావుతమని'కాని కోరునంతటి ఛాందసుఁడఁ గాకపోయినను, సాహిత్యచరిత్రమును యథాశకిఁ బరిశీలించి సాహిత్యశ్రేయము నభిలషించుచుండినవాఁడ నగుటచే, నీనాఁటి పండితులలో జాలమందికి మదీయాభిప్రాయములు సంస్కారచ్యుతి సూచకములుగను మూలచ్ఛేదకములుగను గన్పట్టినను, వెనుకటికి మహాకవి భవభూతి

శ్లో. యేనామ కేచిదిహ నః ప్రథయం త్యవజ్ఞాం
    జానంతి తే కిమపి; తా౯ ప్రతి నైష యత్నః,
    ఉత్పత్స్యతే స్తి మమకో౽పి సమానధర్మా;
    కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ.

యనుశ్లోకమునఁ జెప్పినట్ల నారీతి సాహిత్యవిషయముల నభిప్రాయములు గల్గువారు పుట్టకపోరని యాసించునంతటిసాహసినే! దైవకృపవలన నట్టిసమానధర్ములు ఇప్పటికే చాలమంది యుద్భవిల్లి నాకు వాఁదోడుఁగ నున్నందులకు సంతసించు చుంటిని,

బెజవాడ

1921.

ఇట్లు,

బసవరాజు వేంకటఅప్పారావు.

విషయసూచిక.


ప్రథమప్రకరణము

రసాత్మకం వాక్యం కావ్యమ్. ద్వివిధములగు కావ్యలక్షణములు - లాక్షణికమతము - లాక్షణికమతమున కాక్షేపము - శాస్త్రాదేశము రసప్రవృత్తిని బంధింపఁజాలదు - శాస్త్రాదేశము మహామహుల బంధింపఁజూలదు రసికమతము - రసస్వరూపరహస్యము - లోపరాహిత్యము రసవిషయమున నరుదు - సహజసౌందర్యమే యెక్కువభావోద్దీపకము - లాక్షణికరసికమతములకుఁ గలభేదము - కావ్యము సృష్టియేనా?—కవిబ్రహ్మ—కావ్యనిర్మాత—కావ్యకారుఁడు, రాజశేఖరకవిరాజుమతము - సహజ, ఆహార్య (పండిత), ఔషదేశిక (ఉపాసక) కవులు - సహజ ఆహార్యకవులు - కావ్యసృష్టికినీ, బాహ్యసృష్టికిని గలసంబంధము - కావ్యము బాహ్యసృష్టి కనుకరణమగునా? లేక స్వతంత్ర జీవియగునా? భిన్నమతములు-1. ప్లేటో, 2. అరిస్టాటిల్. 3. లాభైనీస్ - కావ్యము స్వతంత్ర సృష్టియేకాని, యనుకరణము కాదు - కావ్యసృష్టికిని బాహ్యసృష్టికిని సూత్రాత్మలయందు భేదము లేదు - అనుకరణ సృష్టివాదములయొక్క భిన్నపరిణామము - రోమను వాజ్మయస్వభావము - విప్లవములకు నవతారములకును గలప్రయోజనములు. విజ్ఞానోజ్జృంభణయుగము - ఛాసర్, షేక్స్పియగుకవులు లాక్షణిక కవిత్వము - పరాసువిప్లవము - మాత్యూఆర్నాల్డు - ఆధునికాంగ్ల కావ్యపద్ధతి - కవి నిరంకుశుఁడా? - శాస్త్రశృంఖలా విచ్ఛేదము - వ్యాకరణశాస్త్రము - వ్యాకరణశాస్త్ర ప్రయోజనము - వ్యాకరణము స్వాభావిక, శాస్త్రైకము లనిద్వివిధము స్వాభావిక వ్యాకరణపద్ధతి. 1. వచనభేదములు, 2. లింగభేదములు, 3. పురుషవిభేదములు, 4. కాలవిభేదములు - వాడుకపదముల స్వరూపమును సమర్థించువిపులవ్యాకరణ మవసరము. శాస్త్రైకవ్యాకరణము - విధినిషేధములు- 1. థాతురూపములు, 2 లింగవిభేదవిషయములు, 3. వచనవిభేదవిషయములు, 4. కాలవిభేదములు, విభక్తులు - ఆంధ్రవైయాకరణుల యధికారనిర్వహణము, 1. అర్ధానుస్వారము, రేఫశకటరేఫముల ప్రశంస - వ్యాకరణమునకుఁ గావ్యముపై బ్రభుత్వము లేదు - రసమే ప్రయోగముల సాధుత్వమును నిర్ణయించును - గౌవ్య మునకును తర్కకొస్త్రమునకును గల భేదము- కావ్యమునకును ధర్మశాస్త్రమునకును గల భేదము - సమష్టి మానవ శ్రేయమే ధర్మ శాస్త్ర నిరీక్షణము-వ్యక్రియొక్క స్వతంత్ర రసప్రవృత్తియే కావ్య నిరీక్షణము- కావ్యమునకును నీతిశాస్త్రమునకుసు గల భేదము, నీతిశాస్త్ర స్వభావమును, దాని ప్రధాననిరీక్షణతత్త్వమును " కావ్యము నీతిని బోధింపవలెనా? గా విద్యానాథుఁడు, ఈ శాస్త్ర ములు చేయుపనులను కవి చేయఁజూచుట యనవసరము. కావ్య మున నై తిక ప్రయోజనముల ప్రధానములు - 'మమటుని ' మతము - కావ్యమున నీతి ధ్వని మాత్రముగ నుండుసు - కావ్యము నీతిబోధకమా? • 1 ప్లేటో అరిస్టాటిలులమతము - '2. లాజీనీ సు మతము - ఆంగ్లేయసాహిత్య విమర్శకులమతము, 1 సీడ్నీ , 2 షేక్ స్పియరు, 3 మిల్టక్, 4 పోపు మొదలగు వారు • 5 పరాసు విప్లవము తరువాతి కవులు , 6 మాత్యూ 'ఆర్నాల్డుని మతము "కావ్యము జీవితవిమర్శనమే యగును" - '7 • రస్కి, శార్లెలు - వర్గము పొరి మతము. 8 స్విస్బర్ను వర్గము వారి మతము. కావ్యము నీతి భాహ్యముగలగూడ నుండ వచ్చును. 9. ఆధునిక విమర్శనపద్ధతి, ప్రత్యక్ష విషయవర్ణనము, 10 రవీంద్రునివర్గమువారిమతము. “నీతి కావ్యమున ధ్వని మాత్రముగ నుండును.” ముస్లిమ్ వాజ్మయము, రూబయత్తు లను కావ్యములస్వరూపము - సుఫీకవుల పద్దతి నీతికిని రసమునకును సమన్వయ మనఁదగును. కావ్యమునకు నీతి ధ్వని మాత్రముగ నుండవలేను . కావ్యమునకు విశిష్ట నీతి ధర్మములే వర్తించును - కావ్యమునకును వేదాంతమునకును గల భేదము - వేదాంతమునకు నిర్వికారతయు, బుద్ధివి శేషమును నావశ్యకములు - కావ్యమున భావోద్రేకమును జిత్తవికార ములును నావశ్యకములు - మతమునకును గావ్యమునకును గలసంబంధము-1 మతము కావ్యమునకు వలయు విషయసామగ్రిని నేకరించి యిచ్చును. 2 కాని, మతమునకు సమష్టి మానవ శ్రేయ మే లక్ష్యము, కావ్యమున వ్యక్తి యొక్క రసప్రవృత్తియే లక్యుము, కవి మతవిషయములలో రసవత్తరములగు వానినే సంగ్రహించును. కావునమతము కావ్యమునకు సాధనమాత్ర మే యగును-సారాంశములు! - 1.కావ్యమునకు రసమే ప్రధానము. 'రసొత్త కను' అనుసూత్రమును, మదుటుని 'నియతి కృతనియమ రహితాం' అనువ్యాఖ్యానమును నాదరణీయంబులు-ఆధ్యాత్మిక కావ్య మతము , ఆనందకుమారస్వామి, "కావ్యమాధ్యాత్మిక సకి సంజ్ఞా రూపకము”.భారతచిత్ర శిల్పముల సిద్ధాంతము 2 అరవిందఘోషు "ఆధ్యాతి కళక్తియే భారతీయులస్వస్వము”, భారతధర్మస్వరూపము - భారతీయ కావ్య ధర్మము, “కావ్యము మానవాత్మ ప్రకృత్యాత్మ పరమాత్మలకుఁ గలసంబంధమును వర్ణించును" - కావ్యశ క్తియే వాగ్దేవి యనఁదగును. తాంత్రి కులమతను, “పశ్యంతీశబ్దప్రయోగము, దాని భావము- కావ్య శక్తి జన ప్రకారము - వైదిక ద్రష్టల కావ్య నిర్వచనములు-కవికి కావ్యశ క్తిసాక్షా త్కార మవసరము - ఆధ్యాత్మ కళ కి ప్రదర్శ కములగు నుత్తమరావ్యము లే కవిత్వపరమావధి - "ప్రజ్జు పురాణీ" యనఁబరఁగు భారతళకి, కొన్ని శంకలు - ఆధ్యాత్మిక జీవితస్వభావము - ఆధ్యాత్మక జీవితము లక్ష్యము, శరీరమా? దులు సాధనసూత్రములు. ప్రాచ్య పాశ్చాత్యధర్మనిరీక్షణ ములకుఁ గల భేదము ఆధ్యాత్మిక కావ్యరచనాసూత్రము- కావ్య మాధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము - 3 రవీంద్రు, నిమతముసు వైష్ణవసుఫీకవులమతమును - మమ్మటుని నిర్వచనముసు, విశ్వ. నాథుని “రసొత్మకంపోక్యం” అనుసూత్రముసు నాదరణీయం బులు . “రసాత్మకం పాఠ్యం కావ్య” మ్మనుసూత్రము యొక్క ప్రాతిపది కౌచిత్యము, గా 'వాక్య మనఁగా వాక్చక్తియే”' • రసము కావ్యమున కాత్మ యగును.


ద్వితీయప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

“రసమన నేమి?" విశేష్యవిశేషణములకుంగల సంబం ధము-రసికుఁడు లేనిది. రసము జనింపదు. రసికుఁడు నిమిత్త మాతుఁడు - రసికునకును, రసమునకును గలయన్యోన్యాశ్రయ సంబంధము. “రస” నిర్వచనము, లాక్షణికమతము - "రస జన కారణములు. . రసికుని జనాంతర లబ్దసంస్కారము, 3. వస్తువులందు నిబిడ మైయున్న రసవి శేషము - రసనిర్వచనము 1. కవియొక్క పరిపాళము, ఆ వస్తువు యొక్క, యాలంబము - 3. కావ్యముయొక్క రససంవాహకత్వము. భావానుభూతీ యే. రసమునకు జన కారణము - స్థాయీ భావమే రసము - లాక్షణి కుల రసనిర్వచనము, గుప్తపాదాచార్యులమతము, - కావ్య: మునకును జిత్ర శిల్పములకును గల భేదము . , చిత్ర, శిల్పముల యందు రసముయొక్క స్థాయీభావ మే, అనఁగా నిశితతీళ్లు తయే ప్రదర్శితమగును. కావ్యమున వివిధభావములు వర్ణితము లగును. 2. చిత్ర శిల్పము లింద్రియ సాహాయ్యముచే రసమును బ్రదర్శింపఁగల్గును. శ్రావ్యము ఇంద్రి యసాహాయ్యము నపేక్షింపని శుద్దమానసిక వ్యాపారమే - విభావాదికములు రస ప్రకటనమునకును, రసోపలబ్దికిని సాధనమాత్రము లే - రసము యొక్క జన్మ ప్రచారము. "కవిద్రష్ట" యని యంగీకరించు వారిమతము, - రసము "మొదట తీక్ష, భావముగ జనించి విభా వాదికముల పరామర్శ చేఁ దుదకు స్థాయీభావము నొందును - కవికి రస సాక్షా త్కారము కావలెను - వాల్మీకి చరిత్రము - రసస్వరూపము.విభావాదికములు రసముయొక్క బాహ్యస్వరూ పమును బ్రదర్శించును - లక్షణగ్రంథములలోని విభావాదిక ప్రశంస యుదాహరణ మాత్రమే - విభావాదులు రసమునకు వై విధ్యము నొడఁగూర్చును - విభావాదులు సాధనమాత్ర ములు - విభావాదుల ప్రయోజనములు, • రససిద్దికిఁ దోడ్ప డుట, విరసమునకును గౌవ్యమునకును వైవిధ్యము నాపొదించుట - భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వమే సృష్టి లక్షణము - భిన్న త్వాంతర్గర్బితై కత్వము రసముషట్లఁగూడ నన్వయించును - వివాదులు రసమునకు స్వరూపముఁ గల్పించును. - విభా వాదులు రసమునకుఁ బస్తారభేదములఁ గల్పించును - విభా వాదులవిషయమున గమనింపవలసినవిషయములు - స్థాయీ భావతత్త్వము - స్థాయీ భావమనఁగ నేమి? - రసజన్మ కారణము భావానుభవమే - భావోదయమునకు జన్మాంతరసంచితచిత్త సంస్కారమే కారణము - స్థాయీభావము, ఆలంకారిక నిర్వ చనములు - లవణాకరోపమయొక్క సాధకతయు, సందర్భ శుద్దియు - పండిత రాయల నిర్వచనము - స్థాయీభావమేగసము. రసముయొక్క బాహ్యస్వరూపము - స్వాదముయొక్క నిర్వచ 'సము - స్వాదముయొక్క జన్మ ప్రకారము రసమునకుజన్మ కారణములు, 9. రసికుని చిత్తపరిపాకము, 9. వస్తుసందర్శనము, రసవృద్ధి ప్ర కారము - అవస్థాక్రమముయొక్క ప్రశంస - శృంగారరసము యొక్క దశావస్థలు - రసముయొక్కయవస్థల వర్ణించుటలోఁ గవి సర్వస్వతంత్రుఁడు - గసముయొక్క దళావస్థాక్రమ మునకుఁ బాత్రల యధికారమున నుసరించి ప్రసక్తి కల్గును - అవస్థాక్రమ మకళ్యానుభ వనీయము గాదు - లాక్షణికుల చే సుదాహరింపఁబడిన యవస్థాక్రమము యొక్క ప్రయోజనము రసాభివృద్ధియు ప్రాణికోట్ల యభివృద్ధివోలె జీవసూత్ర బద్ధమై యుండును - ఉదాహరణములు, .. ప్రకృతిస్వభావము, 2. మానవునివిషయము, సీతారాముల సౌఖ్యానుభవసర్లనము. శ్రీ రాముని వియోగావస్థావర్ణనము - రసపారవశ్యస్వభావము స్థాయీభావమునకును 'రసికునకునుగల యద్వైత భానము • స్థాయీభావము విరుద్ధభావములనుసయిత మాత్మ భావమును దాల్చున ట్లొనర్చును " లై లామజ్నూను లకథ-స్థాయీభావము యొక్క విశ్వవ్యాపకత్వము - ఉపసంహారము.


తృతీయప్రకరణము.

మానవధర్మమున రసము దేని నాశ్రయించుకొనును?

మానవధర్మముయొక్క నిరీక్షణము - మానవజీవితము యొక్క భాగములు, 1. ఆత్మ జీవితము, 2. సాంఘిక జీవితము. మానవునకును, సంఘముసకును గలసం బంధము - ఆర్యధర్మము. ఆత్త జీవితమునకును సాంఘిక జీవితమునకును సమన్వయముఁ గూర్ప యత్నించును - ఆర్యధర్మము ధర్మార్థ కామమోక్ష యుతము - జీవితసంరంభముయొక్క స్వభావము - ధర్మశాస్త్ర నిరీక్షణము, విధులయొక్క స్వభావము , కామముయొక్క స్వభావము - కోర్కులు వివిధములు - కామ్యార్ధములు భిన్న మగుచో నెట్లు? శాస్త్రావశ్యకత శాస్త్రము కామమును శాసింపం జూలదు - శాస్త్రము కవిత్వమును రసమును నిరోధింపఁజాలదు రసము అర్ధము నాశ్రయింపదు - రసము మానవసహజమగు, కామము నాశ్రయించును -కామము విశ్వవ్యాప్తి - ప్రకృతి కూడ భావసంచలనము నొందును - జగదీశ చంద్రవసువు గారి నూతన సిద్ధాంతము - వాల్మీకి రామాయణము నుండి యుదాహరణములు - పాఠ్చాత్యుల సిద్ధాంతము-1), వర్డ్సునర్తు, 9, బెన్నీ సక, ఉపసంహారము- కావ్యము యొక్క ప్రయోజన మాసంద జనకత్వమే - కావ్యమునకును శాస్త్రములకును బరమార్గమున విశేష భేదము లేదు - పాశ్చాత్యు లమతము, 1. ఆర్నాల్డు, 9, వర్డ్సువర్తు - పూర్వపుఋష్యాశ్రమములు రసభావప్రపూతములు.


చతుర్థప్రకరణము.

అనంతో వై రసః.

కామమునకును జీవసూత్రమునకును గలసంబంధము.పాశ్చాత్య మనశ్శాస్త్ర సిద్ధాంతములు, డార్విన్ పండితుని ప్రపంచ పరిణామ సిద్ధాంతము మానవుని సప్తావస్థలఁగూర్చి షేక్స్పియరు కవి యభి ప్రాయము - శ్రీశంకరాచార్యుల యభి ప్రాయము.. మనోవికారములు శరీరస్థితిననుసరించును - ఆర్యధర్మమునందలి యాశ్రమపద్దతుల ప్రయోజనము . మానవుని యభివృద్ధిని గూర్చిన భిన్నాభిప్రాయము, ప్రాచ్య దేశ వాసుల యభి ప్రొ యము-పాశ్చాత్యులయభి ప్రాయములు, 7. వర్డ్సుపర్తుకవి యభి ప్రాయము- ఉదాహరణములు - చిత్తవృత్తు లనంతములగుటచే రసము లనంతములు


పంచమప్రకరణము.

భావములు; భావనాశక్తి

పాశ్చాత్యమతము, జేంసు లాంగ్ సిద్ధాంతము - ఆర్య సిద్ధాంతముయొక్క పరమార్థము - ప్రకృతికినీ మనుజులకును గలకహస్య సంబంధము. భావనయన 'నేమి? - జీవితమున భాననా ప్రయోజనము- భావనాశక్తి భగవద్దత్తమే "కానీ వేఱుగాదు భావనాశ క్తి యొక్క స్వభావము - భావనాశక్తి చిత్తవృత్తుల ననుసరించుచు నియమిత మార్గములనే చరించును - భావనా దృష్టికిని శాస్త్ర దృష్టికిని గల భేదము. భావనాశ క్తికిని ఊహాశక్తి కిని గల భేదము - 1. మితభాషిత్వము - ఊహాశక్తిగలకవులకు మితభాషిత్వము సున్న-తిక్కన మితభాషిత్వమున కుదాహరణము. శాఫోకపయిత్రి-భాపనాశక్తి గల కవులు మాననస్వభా వము ననుసరింతురు. "జన్మనా జాయతే కవి?” - పాశ్చాత్యుల సిద్ధాంతము, వర్డ్సువర్తు, భావనాశక్తి యేకత్వమును, సూహా శక్తియ నేకత్వమును సూచించును-భావనాశ క్తింగల కవి యా కృతిని; ఊహాశక్తిగలకవి గుణవి శేషములను వర్ణించును.---- తియోడర్ పోట్సుడంటన్ పండితునిమతము - సర్వస్వతంత్ర, 'భావనాశక్తికిని బరిమితభావనాశ క్తికిని గల భేదము - సర్వస్వతంత్ర భావనాశక్తి కుదాహరణములు.గా, 'షేక్స్పియరు మహాకవి విరచితమగు హామ్లెట్ నాటకము - షేక్స్పియరు కృతమగు ఒథె ల్లో నాటకము.3. షేక్స్పియరుకృత మెక్బెత్ నాటకము - కాళి దాసకృత శాకుంతల వర్ణనము-భారతమునుండి యొకయు దాహ రణము-రూపకల్పనావిషయము, కేవలకల్పన సాధ్యమా? - పా శ్చాత్వశాస్త్రజ్ఞులవాదము పాశ్చాత్యకవుల యభి ప్రాయము, 10. షేక్స్పియర్ - 3. కోలరెడ్జి - స్వా భావిక, అస్వాభావికవిష యము లన 'నేవి?-సారాంశము.


షష్ఠప్రకరణము.

భావప్రకటనము.

భావముల ప్రత్యేకస్వభావ మే పదజాలము. అనుశరణ ముల విషయము- పర్యాయ' 'సమానార్ధక' పదములవిషయము భావమును శైలియు న భేదములు - ముఖపరీ శాస్త్రము-శైలి కవియొక్క ప్రత్యేక స్వభావమును సూచిం చును . ఒకనిశైలిని వ్రాయ నింకొకనికి సాధ్యముకాదు అనుకరణ మాత్మహత్యయే యగును.ఉదాహరణములు. కావ్యమున శయ్యారీతుల ప్ర ధా నములు - ఆలం కారము లవసరములా ! రామలింగా రెడ్డిగారి వాదము. శబ్దార్థాలంకారముల తారతమ్యము - పూర్వలాక్షణిక మతము - అలంకారము లనావస్యకములు - శబ్దార్థాలంకార ములు సమాన గౌరవారములే - శబ్దార్థాలంకారములకు గోన్ని యుదాహరణములు - ధ్వని త్రివిధము - 1. శబ్దధ్వని-2, అర్థధ్వని -3. భావధ్వని - శైలిగుణములు. ౧. తుష్టి . పుష్టి, 3. కాంతి. 4.. బ్రహ్మానందజనకత్వము- బ్రహ్మానందజనకములగు పద్యములు , సారాంశము - ఛందోవిషయము. 'కావ్యమునకుఁ బద్య మవసరమా? - పాశ్చాత్య విమర్శకులమతము - పాట్సు డంటన్ పండితుని సిద్ధాంతము- అక్షర, మాత్రా, ఛందములకు గల సంబంధమును, తారతమ్యమును . సారాంశము • సహజకవి స్వభావలక్షణములు-1. స్వాతంత్ర్యము, పోతనకవి-2, ప్రాపంచికాద్భుతపరిజ్ఞానము, వాట్సుడంటను పండితుని మతము - పద్య గద్యరచనలయందుఁగల భేదము - పద్య మే ముందుపుట్టెనను టకుఁ గారణము.1. మానవజీవితచరిత్ర రహస్యము 2 షేక్స్పియరుకవి యభిప్రాయము-చమత్కారజనకమగు నింకొకసిద్దాం తము - జీవద్భాషాస్వభావము - పురాతన భాషలను మృతభాష లనఁ జెల్ల దు-జీవద్భాషలు జీవసూత్ర బద్దము బై కించిల్లో సహిత మగు నవత చే విలసిల్లుచుండును-పురాతన భాషలకుఁ ఓ స్థాయి త్వమే ముఖ్య లక్షణము-పాశ్చాత్య సాహిత్య విమర్శనః నందలి క్లాసికల్ , రోమాంటిక్కు మతసిద్ధాంతము. సంస్కృతము స్వాతంత్ర్యమును సవతను నిషేధింప లేదు. భవభూతి కాళిదా సులమతము, ఆంధ్ర పండితుల విపరీతవాదము-ఆంధ్ర సాహిత్య మున స్వాతంత్ర్యమును 'నాంధ్రత్వమును నభ్యర్థనీయములు గాని సంస్కృతపొరతం త్ర్యముకాదు. త్రివిధాంధ్ర కవులు, 1.' స్వతం త్రాంధ్ర కవులు. 2. సంస్కృత న్నే హాభిలాషులు. 3, సం స్కృత దాసులు. ఆంధ్ర త్వమే యాంధ్ర సాహిత్యమునకు జీవన మును గౌరవమును నొసంగును.


This work is in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in its home country on the URAA date (January 1, 1996 for most countries).


The author died in 1933, so this work is also in the public domain in countries and areas where the copyright term is the author's life plus 80 years or less. This work may also be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.