Jump to content

ఆంధ్ర కవిత్వ చరిత్రము/ప్రథమప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

ఆంధ్ర కవిత్వ చరిత్రము.

ప్రథమప్రకరణము.


రసాత్మకం వాక్యం కావ్యమ్.

కావ్యమననేమి? ద్వివిధములగు కావ్యలక్షణములు,

సృష్ట్యాదినుండి వివిధ దేశముల వివిధ భాషలఁ గవితం జిప్పినకవి శ్రేష్ఠులు కోటానకో ట్లుండిరిగాని, 'కావ్య స్వభావము పరిపూర్ణముగ నిర్వచించినవారు లేరైరి. దేశ కాలపాత్ర ముల ననుసరించి కవులు భిన్న భిన్నా చర్శములఁ గయికొని "కావ్యములు రచించి యుండుట చేఁ గావ్య స్వరూపము సర్వకాలముల నీట్లేయుండఁదగు నని శాసింపఁబూనుట యెంతయుఁ గష్ట కార్యము. స్థూలముగఁ గావ్యమునకుఁ 'గవికృత గ్రంథ' మను నర్థముఁ జెప్పు. దుము. అంతియేకాని, కావ్యస్వరూపమును శిలాక్షరముల వలెఁ జిత్రింపవలెనన్న నెంతయో విచారము సలుపవలయును. ఈవిచారము ఖండఖండాంతరముల రసిక శ్రేష్ఠులు తమతమ భాషామర్యాదల ననుసరించి సలిపియున్నారు. భరతఖండము సందలి భాషల కెల్లఁ దలమానిక మనఁదగు సంస్కృత భాషను. నీ కావ్య స్వరూపచర్చ మెండుగఁ గావింపంబడినది.

సంస్కృతమున రసచర్చఁ గావించిన లాక్షణికులు రెండు కక్షలకుం జేరి యున్నారు. ఒకపద్దతివారు శాస్త్రా దేశము శిరసా వహించువారు. రెండవపద్దతి వారు స్వచ్ఛంద ప్రకృతి మార్గముల సనుసరించి శాస్త్ర దేశమును గొన్ని యెడల మీటి రసమునే ప్రధానలక్ష్యముగ సంగీకరించి 'కావ్యలకుణమును నిరూపిం చిరి. శాస్త్రా దేశము ననుసరించి కావ్యలక్షణమును నిర్వచించిన లాక్షణికులలో జామనుఁడును, వాగ్బట్కుడును, భోజుడును, మల్లి నాథుఁడును, విద్యానాథుఁడును ముఖ్యులు. శాస్త్రా దేశ మును ప్రధానముగ గణింపక రసప్రవృత్తియే ముఖ్యసూత్ర, ముగఁ గైకొని కావ్యస్వరూపమును జిత్రించినవారిలో దండి, మమ్మటుఁడు, విశ్వనాథుఁడు, జగన్నాథపండితుఁడును ప్రము ఖులు. ఈయిరు తెగలవారిమతముల ముఖ్యసూత్రముల నిందుఁ బొందుపఱచుచున్నాను.

1, కావ్యశబ్దోయం గుణాలం కారసంస్కృతయోశ్శబ్దార్థ యోర్వర్తతే. రీతి రాత్మా కావ్యస్య --- వామనుఁడు."

2. సాధుశబ్దార్థ సందర్భం గుణాలంకారభూషితమ్, స్ఫుటరీతిరసోపేతం' కావ్యం కుర్వీత కీర్తయే, -వాగ్భటుఁడు

3. నిర్దోషం గుణవత్కావ్య మలంకారై రలంకృతమ్, రసాత్మకం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతిం చ విందతి. -భోజుఁడు.

4. అదోషు సగుణె సాలంకారౌ శబ్దార్థా కావ్యమ్. -మల్లి నాథుఁడు.

5. గుణాలంకారసహిత్ శర్ఘ దోషవర్జితా! గద్య పద్యోభయమయం కావ్యం కావ్య విదో విదుః. -విద్యానాథుఁడు. ఽ6.కావ్యం యశ నేర్థకృతే వ్యవహారవిదే శివేశరక్షతయే, సవ్య: పఠనిర్వృతయే 'కాంతాసమ్మితత యోప దేశయు జే,

రెండవమతము.

౧. ఇష్టార్థ వ్య వచ్ఛిన్నా పదావళీ కావ్యమ్.... దండి.

2. రసాత్మకం వాక్యం కావ్యమ్---.విశ్వనాథుఁడు.

3. నియతి కృతనియమరహితాం హ్లా దై కమయీ మనన్యపరతం త్రామ్, నవరసముచి రాం నిర్మితి మావధతీ భారతీ కవేః....మమ్మటుఁడు.

4. రమణీయార్థ ప్రతిపాదకశబ్దః కావ్యమ్. ---జగన్నాథపండితుఁడు.

పై మతముల యర్థము తెలుఁగునఁ జెప్పిన నిట్లుండు: -

మొదటిమతము,

1. ఈ కౌవ్యశబ్దము గుణాలంకారయు క్తములగు శబ్దార్థ ములయం దే వర్తించు. "కావ్యమునకు శయ్యారీతులే యాత్మ యనందగు.

2. సుశబ్దముల చేతను, గుణాలం కారముల చేతను,భూషి తమై స్ఫుటమగు రసముగలిగిన శబ్దార్థము లే కావ్య మనఁదగు.

3. నిర్దోషమును, గుణవంతమును నలంకారవిలసిత మును, రసాత్మకమును సయి కావ్య ముండఁదగు.

4. దోషరహితములుగను, గుణపంతములుగను, అలం కారయుక్తములుగను నొప్పుళ ఫోర్ధము లే కావ్య మనఁదగు.

5. గుణాలం కారసహితములును, దోషరహితములును, నగుశబ్దార్థములుగల పద్యములుగాని, గద్యములుగాని కావ్య మనఁదగు.

ఆంధ్ర కవిత్వచరిత్రము ప్రథమ .

6. కావ్యము కీర్తికొరకు, ధనార్జనమునకు, వ్యవహార ములఁ దెలుపుటకు, నశుభములఁ బోఁ జేయుటకు, నప్పటి కప్పు డమేయానందము గూర్చుటకు, భార్య బోలినడగుట నుపచే శించుటకు నేర్పడినది.

రెండవమతము.

1" ఇష్టార్ధములు అనఁగా నింపగు నర్థములు సమ కూర్పు పదజాలమే కావ్యము.

2. రసాత్మకమగు వాక్యమే కావ్యము.

3. కర్త, కారణసంబంధములగు నియమముల చే బద్ధము గాక, యితరములపై నా ధారపడియుండక నవరసశోభితమై ప్రొయికముగ సంతోష మొసఁగునదియే కావ్యము.

4. ఇంపగునర్థముల నిచ్చుశ బ్ద జాలమే కాస్య మనదగు.

లాక్షణికమతము,

ముస్తుందు వామన వాగ్బటాది లాక్షణికులమనము విమ ర్శింతము, లాక్షణికులమతమునఁ గావ్యమున నెచ్చటను, నేవిధ మగులోపమును లేకుండఁ గావ్యము సర్వలణలతముగ నుండవలయును లాక్షణికునకుఁ గాప్యమున నెచ్చోటను దోష ము గాన్పింపగూడదు. సర్వమును గుణవంతముగనే యుండ పలయు, అట్లు గావ్యమునందలి సర్వాంగములు నదోషములు గను సగుణములుగను నున్న ఁగాని, కావ్యమున రస ముండ నేర దని యిమ్మతమువారి యభిప్రాయము. కావ్యము సర్వాంగ సుందరమై రాఁతఁ జెక్కినట్లు, అచ్చు గుద్దిన ట్లా కల్పాంతము దేశ కాల పాత్ర జనితంబులగు నవస్థా భేదమ్ములకు లోనుగాక యేకరీతిని జిరస్థాయిగ నున్న చో బాగుండునని యెల్లరును నొప్పుకొనక తప్పదు. కాని, 'ఆదోషా, సగుణె, సాలం కారౌ, శబ్దార్జ్ "కావ్య' మ్మను మల్లి నాథునిమతము నంగీకరించుటకు గొప్పచిక్కు తటస్థమగుచున్నది. మల్లి నాథుఁడు మహావిద్వాం సుఁడును సుప్రసిద్ధవ్యాఖ్యాతయుఁ గానఁ గావ్య వ్యాఖ్యానము “లకు సంబంధించిన మరియాదలను సూచించెనేగానీ, కావ్య సృష్టిని నిరోధింపఁగల నియమముల నేర్పఱుపం దలఁప లేదు. వ్యాఖ్యా తల విమర్శనము లన్నియు నిట్టిఫలితమునే యర్థించుచున్నవి. 'అంతియే కాని యవి కావ్య లక్షణముగ నంగీకరింపఁ దగియుండ లేదు. కారణ మేమన, నెయ్యది దోషమో! యేది దోసము గాదో, యేది గుణమో? యెయ్యది గుణముగాదో నిర్ణయించు టకు శాస్త్రము లే యాధారములు గావలసివచ్చును. అందుచే గావ్యమునకు నిరంతర పారతంత్ర్యాంవస్థ వాటిల్లినది. -

లాక్షణికమతమున కా క్షేపణము:"{శాస్త్రా దేశము రస ప్రవృత్తిని బంధింపఁజాలదు. }

అదీయునుంగాక శాస్త్రాదేశ మెంతవఱకు గ్రహింపు దగినదో నిర్ణయించుట కష్టతరము. శాస్త్రా దేశ మంత్య నిర్ణయ మని యెప్పుకొసువారికిఁ దక్క శాస్త్రా దేశము నధి క్షేపించు వారలకు నీమతము రుచింపనేరదు. శాస్త్రా దేశము నధి క్షే.పించు వార లనఁగా నొడలు దెలియక యున్మత్తులభంగి హద్దుమీరి దుష్పథములఁ జరించువారని యెంచక ప్రతిభాశాలు లై నిజముగ సమ్మకము లేమిం జేపీ శాస్త్రముల శిరసావహింపని మహా మహు లనియే భావింతము. ఇందుల కుదాహరణము. శాస్త్ర మునఁ బరదారగమనము పురుషునకును, బరపురుషునకును సంయోగము స్త్రీకిని నిషేధింపంబడినవి. అందుచే నీశాస్త్రాదేశమునే యాధా


రముగాఁ గొని ప్రపంచమున రాధాకృష్ణుల ప్రేమమును, దారా శశాంకుల ప్రణయమును, బిత్రాంగిసారంగధరులచరిత్రమును రసవంతములు గావని నిరసింతమా! నిరసిపము. ఏలనన, ఈ పయిన నుదహరింపఁబడిన ప్రణయవ్యాపారముల శాస్త్రాదేశ మున కతీతమును, హృదయసమర్పణజనితమును, నవాచ్యమును నగు ప్రేమము గలదు. అట్టి ప్రేమమునే గాయకులును, గవీశ్వరు లును మనోహరముగఁ గానము చేసియున్నారు. నిసర్గముగ నీ ప్రేమము రసవంతమే కానిచోఁ గవులును గాయకులును నెట్లు మనోహరగానము సేయంగలిగిరి? రాతినుండి తై లమును నెట్టిదిట్టయైనం దీయంగలఁ డా? కావున శాస్త్రా దేశ మే మైనది? శాస్త్ర దేశము అంత్యనిర్ణయము గాజాలదని యొప్పుకొనక తప్పదు. -

శాస్త్రాదేశము మహామహుల బంధింపఁజూలడు.

శాస్త్ర మెప్పుడును సామాన్యమానవులకొరకే యుద్దే శింపఁబడినది. సామాన్యజనాతీత ప్రతిభాశాలురగు మహామహు లను సామాన్య జనోపయుక్తములగు శాస్త్రాదేశములు బంధింపం జాలవు. అట్టి మహామహులకు కొస్తాతీతములగు విశిష్టధర్మము లే వర్తించును. అందువలన శాస్త్రాదేశములే యాధారములుగఁ గొని గుణదోషముల నిర్ణయింపనెంచు మల్లినాథాదులపక్షము వారి కవిత్వలక్షణ నిర్వచనము సర్వకావ్యములకు వర్తింపక, సర్వకవి శ్రేష్ఠులయంగీ కారముఁ బడయక లక్షణాణానుసారులగు వారికే వర్తించును. అందుచే లాక్షణికమతము కవిత్వలక్షణ మునకు సంపూర్ణ నిర్వచనము గాఁజాలదు. అట్లని చెప్పుటలో సర్వశాస్త్ర సమ్మతముగను, సర్వలక్షణలక్ష్మితముగను నదోషము

గను, నతీతరసవంతముగ శ్రీపాద్యుమును రచించువారు. పుట్టక పోరని మాయభిప్రాయము కాదు. అట్లయ్యు నింతవఱకు 'అదోషౌ సగుణె సాలంకారౌ శబ్దార్త్ కావ్యా ' మ్మనులక్షణ మునకు సరిగఁ గావ్యమును నసిధారావ్రతముగ సమర్థించిన కవియే జనింప లేదని నుడువుట సాహసోక్తిగాని, యసత్యో క్తిగాని కాదని విన్న వించుచున్నాఁడను. ఎన్నటికైన నట్టి మహా మహుఁడు జనించు నేమో చెప్పఁజాలను. ఒక వేళ నుద్భవించి నను నుద్భవింపవచ్చును. మహామహులు సర్వశిక్షముల లోకోద్ధరణమున కై జనింపవచ్చును. కాని, అట్టివారు విమర్శనా తీతులగుట చేఁ బ్రకృతము మనవాదములోనికి రారు.

,

రసికమతము

ఇఁక రెండవమతమును విచారింతము. ఈమతమునకు మూలసూత్రము 'రసాత్మకం వాక్యం కావ్యమ్' అను విశ్వ నాథుని నిర్వచనమే. ఈమతము ప్రకారము కావ్యమునకు రసమే జీవము, స్త్రీకి సౌందర్యమును, బ్రణయమునకు భావ మును నెట్లో కవిత్వమునకు రసమును నట్లే.

రసస్వరూపరహస్యము

రసమన నేమి? అదీ కవిత్వమునకు నెట్లు ప్రాణమగును? ఈ ప్రశ్నలకు సమాధాన మొసఁగుట మిక్కిలియుఁ గష్టము. ఏలనన: శరీరమునఁ బ్రాణమె ట్లదృశ్యమయ్యును నిండి నిబిడీ కృతమై సర్వావయవముల వ్యాపించియుండునో అట్లే రస మనునది కావ్యమున నిచ్చోట నున్న దనికాని లేక యచ్చోట నున్న దనికాని చెప్పుటకు వీలుగాక కావ్యమున నాదినుండి తుదివఱకును నేక ధారగఁ బ్రవహించుచు నేయుండును. సాధా రణముగఁ జక్కనియువతిని జూచినప్పుడామెయందము ముక్కున సున్నదా? లేక కన్ను లయం దున్న దా! లేక చెవులయం దున్న దా? యనుపృచ్చ కవకాశము లేకుండ నెక్కడఁజూచినను జక్కఁదనము మిట్టిపడుచునే యున్నప్పుడే యాస్త్రీ లోకైక సుందరి యనియందుము. ఒక్కొక్కప్పుడు ఏయవయవమునను సంతసొందర్యము లేకపోయినసు గొన్ని యవయవములఁ గించిల్లోపము లున్నను మొత్తముమీద వాలకమంతయు నేదో యనిర్వాచ్యమగు సౌందర్యముతో నొప్పుచునే యుండును. సాధారణముగఁ బ్రపంచమున "నల్లఁ గానున్న ను చిలుక పంటిపిల్ల చామనచాయ యన్న మాటే. కాని యాపిల్ల కేమమ్మా? చక్కనిచుక్క గావటమ్మా?' అనుచు నమ్మలక్క లాఁడుపలుకులు సూక్ష్మమయిన యీరసరహస్యకహస్యమును సూచించు చున్నవి -

లోపరాహిత్యము రసవిషయమున నరుదు.

ఈ రసరహస్యముప్రకారము చామనచాయగల స్త్రీ యెట్లు వాలకమునసు, నోయారమునను సతి సౌందర్యవతిగా గనుపించునో యట్లే కావ్యమున నెచ్చట నేని శాస్త్ర సమ్మతము కౌనివియు, లోపమనఁదగినదియు నగు విరుద్దలక్షణ మేమయిన నుండినను గావ్యము మొత్తముమీఁద రసజీవిగ సున్నఁ జూలును, ఈవాదమున ముఖ్య విషయము లేవనఁగ: ప్రపంచ మునఁ బరిపూర్ణ సౌందర్యమే వస్తుపునం దేనియు మృగ్యము కావునను, ఒకపరమేశ్వరునియందుఁ దప్ప సకలచరాచర ప్రపంచమునందున నే కొద్దిలోపమేని యుండకమానదు. కాపునను,ప్రపంచవిషయమునను, మానవకృత్యముల విషయముననుఁగించి

ల్లోపములను గణింపక ప్రధానగుణమునే గ్రహింపవలె నను టయే. ప్రపంచస్వభావ వేత్తలకును, సృష్టి రహస్య వేదులకును, నీవాదములోని సత్యము గోచరింపకమానదు. ప్రపంచస్వభావము గుర్తెఱుఁగక భగవంతునికే చెల్లఁదగు దోష రాహిత్య మును సదోషుఁడగు మానవున 'కారోపించి కావ్యమున నే లోపమును నుండఁదగదని శాసించుట న్యాయము కాదు.

ఇంకొకవిషయము: ప్రతిమానవునియందునను బర మేశ్వరుని తత్త్వ మున్నను ప్రతిమానవుఁడును, సర్వశక్తి యుతుఁడును లోపరహితుఁడును నగుపర మేశ్వరుఁ డెట్లుకాఁ జాలఁడో అట్లే కావ్యమున సౌందర్యమును, రసమును బ్రథా నము లైనను నేలోపము లేని పరిపూర్ణ సౌందర్య ముండుట యరుదు. కావున, కొద్దిలోపము లున్న ను వానిని గణింపక ప్రధానవిషయములగు రసమును, కావ్యసౌందర్యమును గ్రహించినఁ జూలును. -

సహజసౌందర్యమే ఎక్కువ భావోద్దీపకము.

మఱి యొకవిషయము: ప్రపంచమున నేదేని సంబంధ మున్నఁగాని యను రాగమును ననుకంపయు నుదయింపఁజాలవు. దగ్గరి చుట్టముల కష్టసుఖములకు దుఃఖమును, సంతోషమును బొందుదుము. కాని యెవ్వరో సంబంధము లేని వారినిఁగూర్చి సంచలనముఁ బొందనే బొందము. హృదయసంబంధమే యను కంపాను రాగములకుఁ గారణము. అట్లే కావ్యమునను మానవులకు సహజమగు స్వభావసౌందర్య మే హృదయమును గరంచి మనస్సున కానందము నిచ్చును. కాని, లోకమున నెచ్చటను కానుపింపని లోపరహితమగు నుత్తమసౌందర్యము రుచింప


నేరదు. కావ్యమునఁ గొన్ని విషయముల మనతోబాటువారును, గొన్ని గుణముల మనకన్న మిన్నలును నగునాయికానాయకులే భావోదయముఁ గలిగింతురు. కాని సర్వవిషయముల మనకంటే మిన్నలును మనతో నేసంబంధమును లేనివారునునగు దేవత లాది గాఁగల నాయికానాయకులు భావోత్పత్తి గలిగింపజాలరు. రంభా సౌందర్యముకన్నఁ బ్రేమభాజనమగు నిల్లాలి ముఖబింబ లావణ్య మెన్ని కోట్ల మడుంగు లెక్కు.పభావోద్దీపకముకాదు? ఈభావమునే "సహజలావణ్య" మనుగీతమందుఁ దెలీపి యుంటిని:---

మోముతీరు సామాన్య మే ముగుద, కురులు
ముడిచి, కుంకుమతిలకము మోమున నిడి
నంతనే యింతసొగ పెట్టుల బ్బెఁ, జెప్ప
వే చెలి, వినంగ నామది వేడ్క పుట్ట.
తీరిగెదీపముదీ ప్తి నల్దెసలఁ బర్వీ .
చదలఁ బీఁకటి నిటునటు కదలఁబార
జేయు చుండ నొయారమ్ము నెలఁగనిలచి
మాటలాడెడు నీసౌరు మనముఁగొనియెఁ
జెలియరో, దేవలోకంపుఁ జేడెలవగు
లోపమే లేని యుత్తమరూపములనుఁ
గంటిఁగాని యదేమొ నాకన్ను లకుసు
నీదుమూర్తియె మోదమ్ము నించె నిజము.
ఉత్తమాకృతి జీవసంప త్తిఁ గలుగు
సహజలావణ్యమున కెట్లు సాటివచ్చు?

కావున దండి, విశ్వనాథ, జగన్నాథపండితు లాదిగాగల పక్షమువారికి కావ్యమున రసముపట్లఁ బక్షపాత మెక్కువ, కావ్యమునందలి లోపములపై కిని, చిల్లర మెఱుఁగులపైకిని వారిదృష్టి చనదు. లోపరహితమగు నుత్తమసౌందర్యముకన్న గించిల్లో పసహితమయ్యు జీవసంపత్తికలుగు సహజలావణ్య మే వారి కెక్కువయింపు నింపును. ఈమతాభిప్రాయ భేదములపరి ణామము కావ్యవిషయమున ననేకవిధములగు వాదోపవాదము లకుఁ గారణ మైనది. అట్టివాదములను సందర్బోచిత్యము నను సరించి చర్చించెదను.

లాక్షణికరసికమతములకుఁ గల భేదము,

వామన, మల్లినాథాదిలాక్షుణికులు కావ్యమున నలం' కారములుసు, గుణములును, రీతులును, శబ్దశుద్దియును, నదో షమును బ్రధానము లనుచున్నారు, రసికవర్గమునకుఁ జేరిన దండి, విశ్వనాథ, మమ్మట, జగన్నా థాదులు రసము, వ్యంగ్యము, ఇష్టార్థము, హ్లాదై కమయత, అనన్య పారతంత్ర్యము మొదలగు లక్షణములే కావ్యమునఁ బ్ర ధానము లనుచున్నారు. కావున వీరి మతములు రెంటికిని ముఖ్యమును, పరిస్ఫుటమును నగు భేదము కలదు. ఈ భేద మెద్దియో పరికించి పిమ్మట నీ భేదమునకుఁ బరిణామములుగఁ బెరిగిన సాహిత్య విషయిక వివాదములను సత్యా న్వేషణబుద్దితోడఁ బరిశీలించి సత్యమును నిరూపింపఁ బ్రయ త్నింతము. వీరికిఁ గల భేదమును నామిత్రులొకరు "సాహిత్య చర్చ" యను వ్యాసమునఁ జక్కఁగ నీ క్రింది వాక్యములు బొందుపఱచినారుః---

"నాకుఁ జూడ ప్రథమపీఠమువారికి నిషేధము లేక్కువ రెండవపీఠమువారికి విధము లధికము. కవి సృష్టికర్తయనియుఁ, గోవ్యము సజీవనబింబమనియు, రెండవవారు ఆర్ద్ర దృష్టితో

నుపలక్షింపఁగలిగిరి. కవిశబ్దకార్మికుఁడనియు, కావ్యము అదోష శబ్దార్దమయమనియు మొదటివారు నిర్ణయించిరి. అనఁగా మమ్ము టాదులు కవితను కళగా నన్వయించిరి. వామనాదులు కొంచె మించుమించు శాస్త్రముగాఁ బరిగణించిరి. ఒకటి శాస్త్రీయ పథము; మఱియొకటి రామణీయకపథము. మొదటి తెగవారికి శాస్త్రములయెడ నభిమాన మధికము; ప్రమాణబుద్ది విశేషము. రెండవ తెగవారికి రసపక్షపాతము లెస్స;స్వాతంత్ర్యరక్తి యమితము, ఒకరు నియమములను బెంచి ఆదర్శమునకు వైరళ్య మాపాదించిరి. 'వేరొకరు నియమములు అవిలంఘనీయములు కావని ఆచర్శమున కౌన్నత్యము నొప్పికొనిరి

కావ్యము సృష్టియేనా?

మున్ముందుగ సాహిత్యవిషయకవివాదములలో నెల్ల ముఖ్యమగు కావ్యసృష్టినిగూర్చిన భిన్న భిన్న మతములను బరి శీలింతముగాక! పదపడి బాహ్యచిహ్న ములగు, శయ్యారీతులను, బ్రయోగసిద్దిని, శబ్దశుద్దిని, నలం శానములనుగూర్చి సవిమర్శ ముగఁ జర్చింతము. ఆట్లనుటలో విషయమునకును, దత్ప్రకటన మునకును భేదమున్నదని నేను జెప్పుచున్నట్లు తలంపఁదగదు. వాదసౌకర్యము యిట్టివిభాగమును జేయనలసివచ్చింది,

కవిబ్రహ.

కవి మన దేశమునఁ గని బ్రహ, 'కావ్యనిర్మాత, కొవ్య కారుఁడు నను పలునామములతోఁ బిలువఁబడుచున్నాఁడు. ఇట్టి నామకరణ మర్థవంతమయినదో కాదో యరయుదము, కవి సృష్టి కర్తయని పలుకు వారు కొందఱు గలరు. వారిమతమునఁ బర మేశ్వరుఁడు 'ప్రపంచమ నెట్లు నిర్మించెనో కవియు నట్లే, కావ్య ప్రపంచమును నిర్మించును గావునఁ గవి నిశ్చయముగ రెండవ బ్రహ యనుటకుం దగినవాఁడనియు కవి బ్రహ యను నామము నకు దగినవాడనియు నిర్ధారణ మగుచున్నది. సృష్టి అనంతము ప్రతిఫలా పేక్ష నించు కేనియును సృష్టికర్తకు నాషాదింప జాలము. బలవత్తరములగు కారణములుగాని, హృదయము నాకర్షించు ఫలాపేక్షగాని, లేక పరమేశ్వరుఁడు ప్రపంచమును. సంకల్పమాత్రమున నానావిధజంతుసం తానముతోడను, బంచ భూభౌత్మకముగను నిర్మించెను. అట్లే కవియుఁ బ్రత్యక్ష కార ణము లేవియు లేక ప్రతిఫలాపేక్ష యించు కేనియు లేక కావ్య మును, నందు వివిధ ప్రకృతులను వర్ణించి సర్వవిధములఁ బరి పూర్ణమైయొప్పు ప్రపంచమును గావ్యమునఁ బ్రదర్శించు చున్నాఁడు. బాహ్య సృష్టియందుంబ లెఁ గావ్యసృష్టి యందును ననంతమును, నపారమును నగుశక్తి ప్రదర్శితమగు చుండును. విషయబాహుళ్యము గవి బ్రహల గ్రంథముల బాగుగఁ గొన నగును. మహాపురాణములను, నందందు యుగయుగములఁ బ్రపంచములను వర్ణించి, విపులముగ సమర్థించిన వ్యాసవాల్టీ క్యాదిమహాకవులు నిశ్చయముగ నీకవి బ్రహ్మపదవి నధిష్ఠింప దగినవారు. అట్టి వారి కావ్యసృష్టి వలన నే నేటివఱకును మన మాత్మోపలబ్దిని బడయుచు సర్వవిధముల జీవితమును ఫలవంత ముగం గావించుకొనఁగలుగుచున్నాము. ఈవిషయమును. మున్ముందు నింకను విపులముగఁ జర్చిం చెదము.

కావ్య నిర్మాత.

ఇకఁ గావ్య నిర్మాత యనుపదమును గొంచెము విమర్శిం తము. నిర్మాణ కౌశలమనఁగా నెట్టి? ఈ ప్రశ్నకుఁ బ్రత్యుత్తరము కించిజ్ఞులకుఁగూడ నతిసులభముగఁ దోఁచును. నిర్మాణము నిర్మాత యనుపదములు సాధారణముగ గృహనిర్మాణమునకును, గృహని ర్మాతలకును జనులు వర్తింపఁ జేసెదరు. గృహనిర్మాత యెట్లు రాలు, సున్నము, కలప, దూలము లాగాఁగలపరికర ముల నాయత్తముఁ గావించుకొని పునాదుల బాగుగఁ ద్రవ్వి వానిపై స్థిరమగు గృహమును నిర్మించునో యట్లే కావ్య నిర్మా తయు భాపములు, శబ్దార్థములు, అలంకారములు, శయ్యా రీతులు, ఆదిగాగల కావ్యపరికరములఁ గయికొని కార్యసౌధ మును నిర్మించునని యీమతమువారియభిప్రాయము. కావ్య నిర్మాణమునను, గృహనిర్మాణమునను విబ్రమాశ్చర్యము లుదయింపఁ జేయంజాలు సనంతసృష్టి వైభవము గాన కాకున్నను, చేతనున్న పరికరములను దగినరీతి నుపయోగించి యొకసర్వాంగ సుందరమును, బరిపూర్ణమును, నగు కావ్యమునుగాని, సౌధ మునుగాని నిరింపఁగలశక్తి ప్రదర్శిత మగు చుండును. కావ్య - నిర్మాత దృష్టి సర్వప్రపంచమును గబళింపఁగలుగునంత విశాల మయినది కాదుగాని యున్న దానిని బూర్వోత్తరవిరోధము లేకుండ, నంగాంగములపొందిక తప్పకుండఁ బరిపూర్ణ ముగ నుపలక్షించుశక్తి , గలదియైయున్నది. కాళిదాసాదికవి శ్రేష్ఠు - లెల్లరు నీ కావ్య నిర్మాతృవర్గమునఁ జేరినవారు.

కావ్య కారుఁడు.

ఇప్పుడు మూఁడవదియుఁ బై రెండింటికన్నఁ దక్కుఁగల దియు నగు కావ్య శారపదమును జర్చింతము. “కావ్య కోరుఁడు' అనుపదము స్వర్ణ కారుఁడు, కుంభ కారుఁడు, ఘటకారుఁడు మొదలగుపదములతో సామ్యము నందఁగల్గుచున్నది. సాధా రణముగఁ గుండలునేయుకు మరియు, బిందెలఁ గరఁగించిపోత బోయుఁ గమ్మరియు, బంగరుఁ గరఁగించి నగలు చేయు కంసాలియు, నిశితమయిన సృష్టిశ క్తిగొని నిస్త్రాణశక్తిగాని కలిగి యుందురని చెప్పుటకు వీలు లేదు. కరఁగించి యిదివజుకున్న యచ్చులలో బోఁతపోయుచు నొకదానినొకటి పోలినవగు వేన వేలువస్తువులను శీఘ్ర జాలమున నొక్కొక్క వస్తువునకుఁ బ్రత్యేకపరిశ్రమ మక్కర లేకుండఁ దయారు సేయఁగల కుమ్మరి, కమ్మరి, కంసాలు లాదిగాఁగల కర్మకారులను సృష్టికర్తలనిగాని నిర్మాతలనిగాని నొడువుటకు వీలగునా? అట్లే దృష్టి వైజ్యాలము గాని నిర్మాణ కౌశల్యముగాని లేక యూరక పుస్తకములఁ జూచి పుస్తకములను, గావ్యములఁ జూచి "కావ్యములను, బద్దెములఁ జూచి పద్దెములను, ప్రయోగములఁ జూచి ప్రయోగములను రచింపుము నను కరణములఁ గావింపుచుఁ బర ప్రత్యయ నేయబుద్దు లగు నంగటికవులు అత్యంత గౌరవప్రదమగు కవినామమున కర్హులు కాజాలరు. సామాన్య ప్రబంధ కవు లెల్లరు నీ తెగకుఁ జేరుదురు. వీరినిగూర్చి ప్రసక్తి గల్గునవసరమున మున్ముందు విపులముగఁ జర్చించుట కవకాశము గలదు గావున ప్రస్తుతము దీని నింతటితో విరమించి వేఱుచర్చకుఁ గడంగుదుము.

రాజ శేఖరకవిరాజుమతము (సహజ) 

ఆహార్వపండిత ఔపదేశిక (ఉపాసక) కవులు.

పై నఁ జెప్పఁబడిన సంగతులనుబట్టి ప్రపంచమునకుఁ బ్రతి ప్రపంచమును సృష్టింపఁగల మహాశక్తిగాని, సర్వాంగ సుందరముగ నుపలబ్దములయిన సాధనములఁ గావ్యరూపమున నిర్మిం పఁగల నిశితనైపుణిగాని, కవికుండవలసినశీ క్తులలో ముఖ్యము లని తేలుచున్నది. ఈయభిప్రాయముఁ బురస్కరించు కొనియే


భాలరామాయణ బాలభారత కర్పూరమంజరీ కావ్యమీమాంసాది గ్రంథముల రచించిన రాజశేఖరకవి.. కావ్యరచనాశక్తి నిశ్చయముగఁ బ్రతిభ యేయనియు, నయ్యది జన్మాంతరసంస్కా రమువల్ల నే లభ్యముగాఁగలదనియుఁ, బ్రపంచమున మహాకావ్య ముల రచియించిన కవి శ్రేష్ఠు లెల్లరును జన్మాంతర సంచిత ప్రతిభాశాలురే యనియు సిద్ధాంతముఁ గావించి కవులకు ఈసిద్దాంతము ననుసరించి సహజ ఆహార్య ఔపదేశిక కవు లనుమూఁడు తరగతులుగ విభజించెను. నాకుంజాడఁ గావ్యవస్తుతత్త్వమును బ్రధానలక్ష్యముగ సుంచుకొని కవుల గుణతారతమ్యములఁ జర్చించి వారికి యథోచిత గౌరవము నొసుగఁ బ్రయత్నించిన వారిలో నెల్ల రాజ శేఖరుఁడే యగ్రగణ్యుఁడు. ఈతడు గావించిన తారతమ్య నిర్ణయము సంగ్రహముగఁ జెప్పెను. జన్మాంతర సంస్కోరబలిమి నపూర్వ ప్రతిభావి శేషమున ననన్య సాహాయ్యముగ మహా కావ్యసృష్టిం గావింపఁగల యపర బ్రహల సహజకపులని నిర్ణయించెను. పిమ్మట జన్మాంతరసంస్కారము లేకుండినను సత్కా-వ్యపఠనమువల్లను, గురుకుల వాసమువల్లను బుద్దివైశద్యముఁ బడసి కావ్య నిర్మాణమునకుఁ గడంగునిహజ న్మసంస్కార శేముషీ ధురంధరులగు కవులను నాహార్యకవులఁగా నిర్ణయించెను. తరువాత మంత్రతంత్రోపాసనా బలమునఁ బ్రతిభయు నిహజన సంస్కారమును మృగ్యములుగఁ గవనము నల్ల సాహసించు తక్కుంగలకవులను సౌపదేశికు లని నిర్ణయిం చెను. కావున రాజ శేఖరుని మతము ప్రకారము కావ్యము రచింప గల్గుశక్తి జన్మాంతరసంస్కారమువల్లఁ గాని యిహజన్మసంస్కారముపల్లంగాని జనింపవలసిన దేకాని మంత్రతంత్రాగివిద్యల సభ్యసించుటవల్లఁ గలుగ నేరదనియుఁ దేలుచున్నది. కావున

గవి సృష్టికర్తయైన కాని నిర్మాతయైన కానీ కావలెను. రాజ శేఖ రునిపరిభాషలోఁ జెప్పినకవి సహజకవియైనం గావలయు లేక పండిత కవియయినఁ గావలయు. కాని వట్టికర్మ కారునిఁ బోలిన కావ్య శారుఁడు అనఁగా నౌపదేశికకవి కారాదు. .

'పై యభిప్రాయము సాధారముగాఁ గొని రాజ శేఖరుఁడు మహాకవులను తరగతుల ప్ర కారము విభజించి కవిత్వలక్షణ మును నేతదభిప్రాయానుసారముగ నిర్వచించినాఁడు. ప్రసక్తి గల్గిన చోట రాజ శేఖరుని కావ్యలక్షణనిర్వచనమును సంద ర్భానుసారముగాఁ జర్చింపఁ బ్రయత్నింతము.

కావ్యసృష్టికిని, బాహ్య సృష్టికిని గల సంబంధము.కావ్యము బాహ్యసృష్టి కనుకరణ మగునా? లేక స్వతంత్ర జీవియగునా? భిన్న మతములు


కవి సృష్టికర్త యనియు నిర్మాత యనియు నొప్పుకొనిన పిదప నొక ప్రశ్న ముదయించును. అది యేదనఁగా: కవి సృష్టించు ప్రపంచమునకును పరమేశ్వరకల్పితంబగు నీబాహ్య సృష్టికిని సంబంధ మెట్టిది? కావ్య ప్రపంచము బాహ్య ప్రపం చము ననుకరించునా? లేక దానిని మీటి స్వతంత్ర ముగ వర్తించునా? కవి బాహ్య ప్రపంచమును జూచి దాని కనుకరణముగ, ఛాయా పటముఁ దీయువాఁడు మానవునీ రూపమును బ్రదర్శించునటులఁ గావ్య ప్రపంచమును బ్రదర్శించునా?-- ఈ ప్రశ్నమును, దీనికి సమాధానమును, నీ రెండింటికిని సంబం ధించిన వాదోప వాదములును, పాఢ్చాత్య కావ్య ప్రపంచమును సుమారు రెండు వేలయేండ్లుగ సంక్షుభితముఁ గావించినవి. 'నేఁటి ఆంధ్ర కవిత్వ-2 వఱకును నావివాద ముభయకక్షలవారికిని సమ్మతమగునటుల బరిష్కరింపఁబడె ననుటకు వీలు చిక్కకున్నది.

1.ప్లేటో

పాశ్చాత్య విజ్ఞానభానుఁ డనఁదగు 'ప్లేటో' ఈ ప్రశ్నము "మొట్ట మొదటఁ గావించెను. ఆతఁడు 'అతీతసామ్రాజ్య' మను గ్రంథమునఁ 'గవికి స్థాన మొసఁగఁగూడ దని శాసించు సందర్భమున నీ క్రిందిమతమును సమర్థింపఁ జూచెను. అది యద్దియన, "*స్థూలదృష్టికి గోచరమగు నీబాహ్య ప్రపంచము భగవంతునియందు లీనమయియుండు భావ ప్రపంచమునకు ననుకరణమనియుఁ, గవిసృష్టమగు కావ్య ప్రపంచము బాహ్య ప్రపంచమున కనుకరణమనియు, నందుచేఁ గవి సత్యమునకు రెండింతలు దూరమగుచున్నా (డనియుఁ, గావునఁ గవికి అతీత సామ్రాజ్యమునఁ బ్రవేశించుట కర్హత లేదనియు విస్పష్టమగు చున్నది* . పైన చెప్పబడిన ప్లేటో పలుకుల బాహ్యప్రపంచమున కనుకరణమని తేలుచున్నది. "ప్లేటోశిష్యుఁ డగు 'అరిస్టాటిల్' అనునతఁడు గురుమతమును బరిస్పుటముగం జెప్పి యొకయలంకార శాస్త్రమునుగూడ విరచించి పాశ్చాత్యు లలో నొకలాక్షణికవర్గమువారికి మూలపురుషుఁ డయ్యెను.

2. ఆరిస్టాటిల్.

అరిస్టాటిల్ కవిత్వమునకు నిర్వచనము నిట్లు చెప్పెను. “కావ్యము ప్రకృతికి వాగ్రూపమగు ననుకరణ” మని, ఈయను కరణ 'మనుపదమునే 'ఆరిస్టాటిల్” అనేక సందర్భముల సమర్దించెను. అందుచే నీపదము కొంచె మించుమించు సూత్ర

ముగఁ బరిగణింపంబడి తరువాతి కావ్య విమర్శకులకు నాదర్శ ప్రాయ మయ్యెను. ఈయనుకరణ' మనుపదమునుగూర్చి వాదో పవాదములు చెల రేఁగుటకుఁ బూర్వము 'ఇటాలియన్ వ్యాఖ్యాత' లిర్వురు “ఆరిస్టాటిల్' గ్రంథమునకు వ్యాఖ్యానము సేయుచు 'ననుకరణ' మనుపదమును యథామాతృకమగు ఛాయనుకరణమని యన్వయించిరి. తోడనే వాదోపవాద ములు వెల్లుఁ బెరిగినవి అనేకు లారిస్టాటిల్ మతమును బూర్వ పశము సేయుచు రససిద్దాంతముఁ గావించిరి. అట్టివారిలో లాజ్గీ నీస్ ప్రముఖుఁడు."

3. లాజ్గీనీస్. కావ్యము స్వతంత్ర సృష్టియే .....కాని అనుకరణము కాదు.

'లాజ్గనీస్ కావ్యము ప్రకృతికి ఛాయాపటమునంటి యనుకరణము గాదనియు, నట్లయిన చోఁ బ్రపంచములో జను 'లాడెడు నీరసపుఁబల్కులును బ్రేలేడీ యవాకు చవాకులును, గావ్యమున నున్నవి యున్నట్లుగఁ జెప్పువా రెల్లరులు గవులు గావలసియే వచ్చుననియు, నట్టిదురవస్థ రసికులకు భాషావిషయమున నభ్యర్థనీయము గాదనియు, నట్టిదుర్మ తమువలనఁ గుకవులు జనించి వేన వేలు నీరసప్రహసనములను శుష్క ప్రలాపములను రచియించి లోభనీయమగు కావ్యసౌందర్యమును విసర్షించి పాఠకులరసికతను నాశముఁ గావింతురనియుఁ, బూర్వ పక్షముసేసీ వేరొక కావ్వలక్షణమును నిరూపిం చెను. అది యెద్దీ యనిన, కావ్యము ప్రపంచమునకు యథామాతృకమగు ఛాయనుకరణము గాక దానితో సరిసమాన మైనదియు, స్వతంత్రవ్యక్తి గల్గినదియు నగు ప్రతీసృష్టియే యనియు,

సయ్యది స్వతంత్ర ప్రదర్శన మనిపించుకొను నేకాని యథా మాతృకానుకరణ మెప్పట్లను గాదని స్పష్టముఁ గావించెను. ఈవివాదమునకవికి సృష్టిఁ గావించుటకు నపారమగుశక్తియును, దుర్నిరీక్ష్యమగు స్వాతంత్ర్యమును నొప్పుకొనఁబడినవి. కవిని బాహ్య ప్రకృతియుఁ దత్సంబంధములగు నాచారవ్యవహారము లును నియమములుసు బంధింపవనియు స్పష్టమగుచున్నది. కాని కొందఱు కుతర్కమునకు దిగుదురేమో యనుభయమున లాజ్గీనీస్ బాహ్య ప్రపంచమునకును గవితా ప్రపంచమునకును గలసంబంధమును స్పష్టముగ నిట్లు వ్యక్తీకరించెను.

కావ్యసృష్టికిని బాహ్య సృష్టికిని సూత్రాత్మలు యందు భేదము లేదు.

కావ్య ప్రపంచమునకును బాహ్య ప్రపంచమునకుసు సూత్రాత్మ, లసఁదగు ప్రథానవిషయముల నెక్కువ భేద ముండ దనియు, నప్రధానములగు తక్కుంగల నియమములవిషయము ననే భేదము గలుగుననియు, బాహ్య ప్రపంచమునకును గావ్య ప్రపంచమునకును జన్మస్థానమగు భగవంతుఁడే యీ రెండు ప్రపంచములకును సూత్రాత్మలవిషయమునఁగల యైక్యభావమునకుఁ గారణమనియుఁ దెల్పెను, అట్లు తెల్పి కావ్య ప్రపంచ మభూత కల్పితము గాదనియుఁ, బ్రకృతిపరిణామ భేదము లన్నియు సూక్ష్మముగను గోన్ని యెడల స్థూలముగను. గూడఁ గావ్య ప్రపంచమునకు వర్తించుననియు, నందుచేఁ గావ్యపర మావధి ప్రహసనప్రలాపాదిశుష్క నీరసవాక్యరచనగాదనియు, రసోద్దీపకమగు స్వతంత్ర కావ్యరచనమే యనియు, నందుచే గవి యసత్య ప్రలాపి కాఁడనియు, నాతీత సామ్రాజ్యమున వేదాం

తులకన్నను మత స్థాపకులకన్నను శాస్త్రకర్తలకన్నను నెక్కుడుగ గౌరవింపఁబడి వారియందటికన్న మిన్నయై పరమేశ్వరునితోడ నర్దసింహాసనాసీనుఁడగుననియు నగారా మ్రోయించి నటుల వాకుచ్చి గురుశిష్యు లికువుర సిద్ధాంతములను గాలి కెగురగొట్టి లాజ్గీనీసు రససిద్దాంతమునకుఁ బాశ్చాత్యులలో నెల్ల మార్గపర్శి యయ్యెను,

అనుకరణసృష్టి వాదములయొక్క భిన్న పరిణామములు.

లాజ్గీనీసు వాదము బయలు వెడలఁగనే అరిస్టాటిల్ వర్గమువారు కన్నులు తెఱచి తమతప్పు దిద్దుకొనుచుఁ బ్రత్యక్ష ముగఁ దా మంత వఱకుఁ బొరపడితిమని జెప్పుటకు మోమో టముఁ జెపినవారగుట 'సరిష్టాటిలు చే' నుపయోగింపఁబడిన ‘యనుకరణ' మనుపవమునకు ఛాయాపటరూపానుకరణ మర్థముగాదనియు, నట్టి యతీర్థము నరిష్టాటిలు గ్రంథమును విమర్శించిన ల్యాటిన్ వ్యాఖ్యాతలచే గల్పింపఁబడినదనియు నేదో విధముగఁ జెప్పి విచిత్ర సిద్ధాంతముఁ గావించుచు, సరిస్టాటిలును సమర్థింపఁజొచ్చిరి. కాని యరిష్టాలుచే నుపయుక్త మయిన యనుకరణ పదబీజము గ్రీకు,ల్యాటిన్ వాజ్మయ క్షేత్రముల దిట్టముగ నాఁటుకొని యనేకశాఖాపరివృతమగు వృక్ష ముగఁ బరిణమించి తుదకు శుద్ధనీరసొనుకరణ కావ్య విషఫలము లుద్భనము లగుటకుం గారణమయ్యెను. • పిన్హట నరిస్టాటిలునకు వ్యతి రేకముగ వ్రాసినలాడ్జినీసు మతము వారు దేశ కాలనియమముల బద్దులయి యుండి వాజ్మయము తొక్కుచున్న పెడదారుల పొంతఁబోవక సత్యైకపథ గాములై కావ్యము చూచినది చూచినట్ల చెప్పు దంపుడు పాట


పంటిది కాదనియు, నపూర్వ ప్రతిభాజన్యంబయి నూతన ప్రపంచ సృష్టిఁగావించి ప్రకృతిగర్భమున నడఁగియున్న పరమరహస్య, ములనెల్ల గోచరింపఁ జేయునది యనియు, మానవకల్యాణమునకు మతము, శాస్త్రము, ధర్మము లాదిగాగల ప్రయోజనముల. కన్న నెక్కువఁ దోడ్పడంగలదనియు విస్పష్టముఁ గావించిరి,

రోమను వాజ్మయ స్వభావము.

కాని గ్రీకునాగరికత యప్పటికే చరమావస్థనొంది భోగపరాయణత్వ ప్రధానమయిన రోమను నాగరకత విచ్చల. విడిగఁ బెచ్చు పెరుగసాఁగెను. అయ్యది భారతవర్ష ముసఁ బ్రబంధంచనకుఁ దావల మయిన దౌర్భాగ్యయుక్తకాలముఁబోలిన కాలము. అక్కాలమువారు దానినించుమించు మహాయుగమని పొగడిరి. కాని కావ్యాత్మ వినాశ సూచకముఁగుఁ బెక్కుడు. బొమ్మలు దక్క. ప్రతిభావంతమగు కావ్యసృష్టి విరివిగ జరిగి యుండ లేదని మాయాశయము, 'డాంటి, పర్జిల్ అను నీరువురు మహాకవులుదక్క నప్పటి కవు లెల్లరును సమకాలికాచార వ్యవహారములనే యున్న వున్నట్లు మన ప్రబంధ నియమములకుఁ దీసిపోవని కృత్రి మనియమములను గాప్యపోషణమున కై వలయు నుపొంగములుగ నేకరించుకొని కృత్రిమముసు సహజ ప్రతిభాశూన్యమును నగు లాక్ష్ణిక కాప్య పద్దతి నొక దానిని బయటికిఁ దీసిరి. వారికావ్యముల నసుసరించి పాశ్చాత్య దేశ ములఁ గొంతకాలము కావ్యవధూటీస్వచ్ఛందవిహారమునకు నిరోధము గలిగెను. విమర్శకులు వారిపద్దతిని వ్రాయఁబడిన కావ్యములనే ప్రశంసించుచు మిగిలినవానిని నిరసించుచుఁ గావ్యరచనకు సంబంధించిన 'సూత్రాత్మను మఱుఁగుపఱచిరి.

జ్ఞానభాను డస్తమయముగా నున్న యట్టి సమయములల బ్రజలకు నిశ్చితార్థములు సహజములుగఁగాని గురు ప్రసాద మునఁగాని యలవడుట యరుదు. కాని దయామయుఁడగు పరమేశ్వరుఁడు ప్రపంచ మంధకారబంధురమై యుండుట కంగీకరింపక, విప్లనములను సాధనములచే జ్ఞానోదయముఁ గావించును. లేదా, యవతారము లెత్తియైన జనులలో సంశయవిచ్చేదముఁ గొవించును. పాఠ్చాత్య దేశముల విప్లవములకు దఱచు ప్రసక్తి గలిగినది. కారణము; వారు రాజపురుషు లగుటయు మన వారివలెఁ గారణ మరయక యొకదానినిగాని యొక నిసిద్ధాంతముసుగాని మూఢభ క్తితో సేవింపక స్వచ్చంద వృత్తిని 'సత్యాన్వేషణముఁ గావింపఁ బ్రయత్నించుటయు, నట్టి ప్రయత్నముల సఫల మొంభించుటకయి ధన ప్రాణముల నయినఁ దృణీకరింపఁ జూచుటయే! మనమన్న నో ప్రమాణ బుద్ది గలవార మగుటను, సహజదయాంతఃకరణుల మగుటను, విప్లవమున్న జంకుదుముగావుటను, మనకుఁ బరమేశ్వరుఁడే కష్టసమయముల శరణమగుచున్నాడు. ఈభావమునే భగ వానుఁడగు శ్రీకృష్ణుఁడు గీతలలో నీ క్రింది శ్లోకముల సుపదేశించినాఁడు.

శ్లో. యదాయదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత!
అభ్యుస్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.

శ్లో. పరిత్రాణాయ సాధూనాం వినాళాయ చ దుష్కృతామ్,
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే.

24

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


ఈవేదాంత ప్రసక్తి యేలకలిగినదనఁ బ్రాచ్యపాశ్చాత్య లాక్షణిక పద్ధతులకుం గల భేదమును సూచించుటకే. అది 'యెట్లో నిరూపింతుము.

విజ్ఞానోజ్జృంభణయుగము ఛాచాపర్ ,షేక్స్పియరు కవులు,


రోమను (ల్యాటిన్) సాహిత్యము క్షీణదశకు వచ్చి యందుఁగల నీరసకావ్యములకుఁ బ్రశస్తి హెచ్చి తన్మూలమున నైరోపాఖండ వాజ్మయము క్షీణదశకువచ్చునపస్థ వచ్చిన తరుణమున భగవంతుఁడు గొప్పవిప్లవముతో మత - సాంఘిక- రాజు కీయ - వ్యవస్థాపనల నన్నిటిని గబశింపఁజులునంతటి వైశాల్యము గలిగిన దానినిగాఁ బ్రసాదించెను. ఆవిప్ల వఫలితముగ నైరోపీయ విజ్ఞానము నూతనపథముఁ జరించి కొంచెము ప్రతిభాపక్షపాతము వహించి నిశ్చయ మైన కావ్యసృష్టికి గారణభూతమయ్యెను. ఈవిజ్ఞానవిజృంభణము ఇంగ్లాండు దేశమునఁ గావ్య రూపమున నమితఫలవంత మై దాసర్, షేక్ స్పియర్, మాగ్లో 'మొదలగుకవులు ప్రభవించుటకుఁ గారణ చుయ్యేను. వీరెల్లరును గావ్యము ప్రకృతికి శుష్క నీరసాను కరణము గాదనియుఁ, బ్రతిభావంతమగు స్వతంత్ర ప్రపంచ సృష్టియే యనియుఁ గావ్యములఁ బ్రపంచమునకుఁ బరిస్ఫుటము గావించిరి. వీరినిఁగూర్చి ప్రసక్తి గలిగినయ పసరముల మన దేశము నందలి కవులతోఁ బోల్చి గుణతారతమ్యచర్చకుఁ గడంగెదను. అంద చేత " బ్రకృతము ననుసరించి కొవ్వలక్షణము యొక్కనిర్వచనము పొందిన మార్పులను విశదీకరింప నెంచితిమి.

లాక్షణిక కవిత్వము.

షేక్సియరును, నతనిమతముననే కొంతవరకు ప్రవర్థ మాసుఁడైన 'మిల్టన్' కవియు సూర్యచంద్రులు వోలె సం. గతులగుట చేతను, నప్పటి కాలసరణివలనను నింగ్లండు దేశము నను నితరములగు నైరోపీయ దేశములను స్వతంత్ర కావ్యరచనా ప్రతిభ కొంతవటి కడుగంటిన కతన యా దేశముల కవు లెల్లరును దిరిగి ల్యాటిన్ కవు లేర్పఱచిన లాక్షణికపథమునే తొక్క వలసిన వారైరి. ఆ కాలమున సమకాలికాచారవ్యవహారములు ల్యా టిన్ కవుల చేవ లె నాంగ్ల పరాసుకవులచే మిక్కిలి విరివిగఁ గావ్యముల వర్ణితములై స్వతంత్ర 'కావ్యరచనా ప్రతిభను నగాధ సముద్రమున నడుగంటఁ దొక్కి వైచెను.

పరాసు విప్లవము

కాని సముద్రుఁడును నెంత గభీరుఁడయ్యును నట్టి శుష్క కావ్యముల జీర్ణించుకొన లేక వానినెల్ల నొక్క పెట్టున 'పరాసువిప్లవ' మను మహాజ్వాలకు నాహుతియగునటులఁ బై కి వెడలఁగ్రక్కెను. నిరంకుశ పరిపాలన వ్యథను దరతరములఁ గుంది యొక్క మాఱుగ దాస్య పొరతం త్ర్యాది శృంఖలలను భేదింప దొరకొన్న పరాసులు కావ్యమునఁ గూడఁ బూర్వకవి సాంప్రదాయ దాస్యమును ఛేదించి స్వతంత్ర కావ్య సృష్టికి దారులు తీసిన వారైరి, పరాసు విప్లవ ఫలితముగ నైరోపాఖండ మునఁ గాన సృష్టియే ప్రధానముగ నెంచఁబడి ఛాయాపట రూపానుకరణము గౌరవపదమును గోలుపోయి స్వతంత్ర వాజ్మ యము బయలు వడుటయు సంభ విశ్వప్నము లెప్పుడుసు జిరస్థాయిగ నుండునటుల మతము ఖాతరు నేరవు.


విప్లవములచే జనించిన వాజ్ఞ్మయము తాత్కాలికముగ నిర్మింపఁ బడు పొఁకలు, పందిళ్లుంబోలె దిట్టమగు పునాదులు లేనివగుట శీఘ్రముగ నధఃపతనము నొందునవస్థకు రాఁగలవు. దీనికి దార్కాణము విప్లవానంతరమున నొకశతాబ్దమేనియు ముగియకపూర్వమే తిరిగి ల్యాటిన్ వాజ్మయమునెడఁ బక్షపాతము. మొలకెత్తుటే!

మాత్యూ ఆ ర్నాల్డు.

'ఆర్' నాల్డు' అనువిమర్శకుడు కావ్యము జీవిత విమర్శన మని యొక యపరూపసిద్ధాంతముఁ గావిం చెసు. ఇతఁడు 'కావ్య. కర్తను సృష్టికర్తగఁ గాని 'ఛాయాపట గ్రాహకునిగఁ గాని భావింపక జీవితవిషయములను విమర్శించి, శాస్త్ర దృష్టితోడ నని సమయముఁ జెప్పినను సత్యదూరముగాదు.) యాదర్శమును సర్పించువానిఁగ నిర్ధారించెను.

ఆధునికాంధ్ర కావ్య పద్ధతి.

వెంటనే కవి విమర్శకుఁడు గాఁడనియు, సృష్టికర్తయే యనియుఁ, గవిస్వతంత్ర జీవియే కాని పరులపై నాధారపడి యుండు వాఁడు కాఁడనియుఁ, గావ్యమునకుఁ గావ్యదృష్టిదక్క శాస్త్ర దృష్టియు విమర్శక దృష్టియు న ప్రధానము లనియుఁ, గావ్య మునకుఁ బరమావధి హ్లాదై కమయతయే యనియు సిద్ధాంతము గావించి యనేకులగు విమర్శకులు ఆర్ నాల్డుమతముసు బూర్వ పక్షముఁగావించి రసికమతమును నిల్పిరి. 'నేఁటివర కును భగవత్ కృపవలన నామతము మార లేదు. మొస మొన్న నే తిరిగి 'యను. కరణ' పద్దతి నవలలయందును, నాటకములయందును, గొన్ని

యెడలఁ గవితయందునుగూడఁ దలచూప నెంచుచున్నది. కాని యింతలో లోకభీమమగు నీమహాసంగ్రామము ప్రాప్తించి యుంటచే వాజ్మయము స్తంభించి పోయినది. ఇఁకముందు నేపరి నామముఁ దాల్చునో చెప్పుట దుస్తరము.

కవి నిరంకుశుడా!

కావునఁ గవి సృష్టికర్త యనియుఁ బ్రతిభాశాలి యనియు నొప్పుకొన్న తోడనే వేరొక ప్రశ్న మున కవకాశము గలుగుచున్నది. ఆ ప్రశ్న మెద్దియనఁ గవి నిరంకుశుఁ డా? కవిని బంధింపఁగల నియమము లేమైన నున్న వా? యనియే. ఈ ప్రశ్న మునకు సమాధాన మీవలయునన్నఁ గొంచెము చర్చలోనికి దిగవలసివచ్చును. ఆచర్చ భిన్న భిన్న శాస్త్రములపై దాడిగాఁ బరిణమింపఁగలదు. అందుచే నేను శాస్త్రములయెడ గౌరవము లేని వాఁడనని భావింపఁదగదు. సాహిత్య శ్రేయోభిలాషినై సాహిత్యస్వచ్ఛంద ప్రవృత్తికి నిరోధములగు నియమముల నాపొదించు వివిధశాస్త్రముల నొక్కింత చుఱచుఱఁ జూచి దూరముగఁ దొలఁగిపోవ నానతీయ దొరకొందును.

శాస్త్ర శృంఖలావిచ్చేదము.

ఈ ప్రప్రథమమునఁ గవి నిరంకుశుఁడని స్థాపించుట నాయభిమతము. కవిని బంధించుటకయి మనవారు తయారుగావించిన శాస్త్ర శృంఖలలను ఛేదించుటకుఁ బ్రయత్నింతును. లాక్షణిక, వర్గమునకుఁ జేరినవి మర్శకులందఱును “అదోపౌ, సగుణె, సాలం శారౌ" అనుమాటలను దమ విజయపతాకల పై విలిఖించి కవిని బ్రతిఘటింపఁ జూచుచున్నారు. లాక్షిణిక సైస్వముల నతిరథులు,, మహారథులు, నరథులుఁగూడ నున్నారు. వీరిలో వైయా కరణు లతిరథులు. పాణిని యేపుణ్య దివసమున భూమి పై నవత రించెనోకాని, యానాఁటి నుండియు నీ వైయాకరణులయధికారము నిరంకుశముగను, నిర్వికల్పకముగను పొంగుచునే వచ్చినది.

వ్యాకరణశాస్త్రము,

దీనికి ప్రధాన కారణము వ్యాకరణమును సాయభి మానియగు పాణిని వేదాంగముగ నిర్ణయించుట చే చానికి నమిత గౌరవమును, గవిని బంధింపఁ గలుగునంతటి యధి కారు మును మనవార లొప్పుకొని శబ్దశుద్ధియని సాకు పెట్టి, కవియొక్క స్వచ్ఛందవృత్తికి భంగము నొదవించుచు వ్యాకరణమునకు జోహారు లొనరించు చుండుటయుఁ, గవులు వైయాకరణుల దౌర్జన్యమునకు వెఱచి వారియధి కారమునకు లోబడి స్వస్వ రూపమును గుర్తింప లేకపోవుటయునే! -

వ్యాకరణశాస్త్ర ప్రయోజనము.

వ్యాకరణ మన నేమి ? శబ్దశ్శుద్ద్గి యన నేమి ? ఈ రెంటికిని గవికర్మకును సుబంధ మేమి ? వ్యాకరణమనఁగా శబ్దముల స్వరూపమును సాధుత్వమును జర్చించి నిరూపించు శాస్త్రము. శబ్దశుద్ధియన వ్యాకరణ నియమానుసారముగా శబ్దములకు నలవడు నిశ్చితమయిన రూపలక్షణాదులే, దానినిగూర్చి సంది యముగాని, వివాదముగాని లేదు. కాని "వైయాకరణుల నియమములు కవిననుసరించునా? లేక కవిని తాబేదారుగా గొని యిష్టానుసారముగ నడపించునా?" ఈ ప్రశ్నకు సమాథానము నించుక నిష్పక్షపాత బుద్ధితోడను దత్త్వాన్వేషణా సక్తితోడను నరయుదము,

వ్యాకరణము స్వాభావిక శాస్త్రికమని ద్వివిధము.

కావ్య విషయమునఁబోలె వ్యాకరణ విషయమునను భిన్న మతముల కవళాశము కలదు వ్యాకరణశాస్త్ర మనుసంధించుటలో రెండు పద్ధతులు వ్యవహారయోగ్యములు. అవి యేవ్వి యనిన? స్వభావపద్ధతి, ప్రమాణపద్ధతియును, స్వభావపద్ధతి నను సరించి వ్రాయఁబడు వ్యాకరణముల శిష్టజన వ్యవహారమేగాక గ్రామ్య జనవ్యవహారముపై తముఁ బడసిన పదజాలముఁ గొని శబ్ద స్వరూప నిర్ణయమును విశాలదృష్టితోఁ గావించుటయే వైయా కరణులు కావింపఁదగుపని..

స్వాభావికవ్యాకరణ శుద్ధతి.

పదముల నన్నిటీ నున్నవి యున్నట్లుగ సుగ్రహించి స్వరూప నిర్ణయము గావింపవలెను. "కాని “ఈ రూపము సాధువు, ఇవయసాధువు ” నను శాసనములకు నెడమిచ్చి వైయాకరణులు నిషేధ మార్గము ప్రసాదింపఁగూడదు. ఈస్వాభావిక వ్యాకరణముల సూత్రములు మితసంఖ్యాకములు. సృష్టి కెల్లను సూత్రా త్మకములనఁదగు ప్ర ధానసూత్రము లెట్లు మిత సంఖ్యాకములు గను నిర్వికల్పములుగను నుండునో యట్లే స్వాభావిక వ్యాకరణ మూల సూత్రములు కొలఁదిగనే యుండి సర్వ ప్రపంచ సామాన్య ములును సర్వ భాషాసామాన్యములును సర్వదేశ కవిజనాదరణీయంబులును నైవర్తించుచుండును. ఇందులకు దాహరణములు వచన - లింగ - పురుష • కాల-విభేదాదులఁ గూర్చిన నియమములు.

1.వచనవి భేదములు.


ఏ దేశమున నేమి, యేభాషయం దేమి వచన భేదముఁ జెప్ప వలసిన యవసరముల నేవ్వరైన "రెండు పిట్ట వచ్చినవి” అని గాని, “ఒకబల్లలు ఉన్న వి” అనిగాని, చాలమంది జనులు కూరుచున్నది” యనిగాని పల్కుదురా? పలుకరు. వేయేల? గ్రామ్యు లేని, పిల్లలేని, ఎవ్వరు నేని యట్టితప్పుఁ గావింపరు. భాషయేమి యుఁ దెలియని పరదేశీయు లట్లు పల్కుదు రేమో? సాధార ఇముగా తెనుఁగు తిన్న గారాని తురకలును, విదేశీయులగు శ్వేతజాతుల పోరును నిట్టి యుభ్యంశములఁ దఱచువాఁడుచుండుట మనకు విదితమే, కాని వ్యాకరణశాస్త్రమన నేమియో తెలియని పామరులు సైతము సహజమగు వ్యావరణజ్ఞానబల మున పచనభేదముల సూచించుపట్ల పై నుదాహరింపఁబడిన యప శ్రంశముల నుపయోగింపరు.

2 లింగవి భేదము.

ఇంక లింగవిభేద విషయముఁ బరిశీలింతము. ఎట్టిపశు ప్రాయుఁ డేని “ఆఁడువాఁడు వస్తాడు, రాముఁడు మంచిది, ఆవు మంచి వాఁడు బల్ల మంచివాడు” మొదలగు ప్రయోగ ములఁ గావించునా? కావింపఁడు. ఎవ్వఁడేని యట్టిప యోగము గావింపఁగ నే మన మెల్లరమును జేరి చెన్నపురికో, విశాఖపట్టణ మునతో కబురుఁ జేసి యతనికిఁ బిచ్చియాసుపత్రులలో నెందేని ప్రవేశము సంపాదించెదము. కాని “గుఱ్ఱముగారూ, ఆఁడ వాడు” అని పలుకు జాతీయులు భాష తెలియనివారగుట చే క్షంతవ్యులు; స్వభావసిద్ధములగు వ్యాకరణ నీయమముల కేనియు నతీతులు. ముక్కుల నూపిరిఁ గలిగి చైతన్యముఁ దక్కియుండని జీవు లెల్లరకు నీలింగవిభేదజ్ఞానము తల్లి పాలతో వచ్చునదియే. ఇందులకు వారి కేవైయాకరణులసాయమును నక్కరయే యుండదు.

3, పురుషవిభేదములు,

పురుష విభేదజ్ఞానము కూడ నిట్టి సహజప్రతిభయే. ఎవ్వం డుగాని “నేను వస్తావు, నీవు వస్తాను, వాడు వస్తాము” అని పల్కునా? పలుకఁడు. ఒక వేళ నట్లు పలికినచో వానినిగూడ పై నఁ బేర్కొ నఁబడిన వారితో కట్టఁగట్టి పంపుదుము. నీవు, నేను, అతఁడు, ఆమె యనువిభేదములు కన్నులున్న ప్రతిమానవునకు గోచరించును. ఆభేదము కనఁజాలని యతఁడు సాక్షా త్తు అద్వైతమూర్తియైన గాని, తనకుమించిన దెద్దియుఁ బ్రపంచ మున లేదని నమ్ము నహంకారస్వరూపుఁ డైనఁగాని, చైతన్య రహితుఁడగు జడ ప్రకృతి యైనఁగాని కావలెను.

4. కాలవి భేదములు.

తుదకు కాల విభేషజ్ఞానము కూడ జన్మ లబ్ద మేకాని యన్యము కాదు ఎట్టివాఁడును “నిన్న వస్తాము, రేపు వచ్చితిని” అనిపలుకునా! పలుకఁడు నిన్న, నేఁడు, రేపు లనుని భేదములు బిడ్డలకు సై తము గోచరించును. ఏది ముందు జరిగినదో, ఏది జరుగుచున్నదో, ఏవి ముందు జరుగఁగలదో జనులు "కాల క్రమానుసారముగ నేర్పజింపఁగలరు. నిన్నటీ సంగతి 'రేపటి దిగను, వేపటి సంగతి నిన్నటి దిగను సన్వయిం చుగుణము కాల జ్ఞానము వీడి తపోనిష్ఠ మై యుగయుగములు ముక్కు-లను గన్ను లను మూసికొని జపముఁ జేయుచుఁ జై తన్యముఁ దక్కి శిలలు ఆంధ్ర కవిత్వఛరిత్రము బోలియుండు మహర్షులకుఁ జెల్లు నేకాని యితరులకుఁ జెల్లదు. పిశాచావేశమున మతి భ్రమనొంది ,పూర్వాపరజ్ఞానముఁ దక్కిన, వారికిఁ జెల్లిన నొక వేళఁ జెల్లవచ్చును. అంతీయకాని పంచేంద్రియ వ్యాపారములకు పశుడై సజీవుఁడై యుండు ప్రతిమానవునకు నీ కాలవి భేదవిమర్శనజ్ఞానము సహజసుభసమే.

వాడుకపదములస్వరూపము సమర్థించ్చు విపుల వ్యాకరణ మవసరము.

కావున వైయాకరణులు కావింపవలసిన దేమి? వాడుకలో సున్న శబ్దజాలమును సమగ్రముగఁ బరిశీలించి వాని తత్త్వముఁ బ్రకాశముఁ గావించుటయేకాని 'సాధుత్వాసాధుత్వారి చర్చ. యనుసాకు పెట్టి లేనిపోనినియమములఁ గల్పించి నిషేధముల వేన వేలుగఁ గావించుట గాదు. లింగ-వచన-పురుష. కాలవి భేద విషయముల సహజనియమముల మాజీచనక యితరవిషయములఁ గూడ స్వచ్చంద స్వభావ ప్రవృత్తి కేసూత్రమును నిరోధములఁ/ల్పించు కొనక సహజమధురమగు రీతినిభాషించు సామాన్య జనుల చే వ్యవ హరింపఁబడు పద రూపముల నన్నిటిని సాధువులు గఁగాని,యంత కుంజాలనిచో శుద్ధమైన రూపములకు రూపాంతరములుగఁ గాని వైయాకరణు లంగీకరించి ప్రయోగమునకు వైరశ్య మాపా దించుటయే భాషకు శ్రేయోదాయకము. అట్లు వైయాకరణులు ప్రయోగ విషయమున వైరశ్య మొప్పుకొన్న చో వ్యవహార మున నున్న పదముల రామణీయకము నశించిపోవక యెన్నియో వన్నె ల చిన్నెలతోఁ బ్రకాశించి కావ్యమునకు నిత్య నవ్యత నొడఁ గూర్పఁజూలును. అప్పుడు సొమరులయ్యు హృదయ భావోద్వేగ బలమున సామాన్యులు నైతము కవిత, జెప్పి యిన్ని శతాబ్దములు

నుండియుఁ బండితుల పిత్రార్జితమగు నాస్తివలె నున్న కవిత్వ సంపదను బ్రపంచమున నెల్లెడల విరఁజల్లి లో కాభ్యుదయ మునకు సెంతో తోడ్పడఁగలుగుదురు.

శాస్త్రైకవ్యాకరణము-విధినిషేధములు. 1. థాతురూపములు.

కాని మనవైయాకరణులు కావించిన మహోపకార మెయ్యది? ఒక్కొక థాతువునకు బహుళ సంఖ్యాకములగు రూపాంతరములఁ గల్పించిరి. విచిత్ర నియమములచే నెల్లం గల్పింపఁబడిన రూపాంతరములన్నియు వ్యాకరణశాస్త్ర గ్రంథ స్ధములుగ నున్నంతమాత్రమున, నిఘంటువులమూలల నడఁగి యున్నంతమాత్రమునఁ, బ్రజలచే వ్యవహారమున నిత్యము వాడఁబడకుండినను,గవుల చే గ్రంథముల విరివిగ నుపయోగింపఁ బడకున్నను, నగమ్యగోచరములుగ నున్నను, వైయాకరణుల చేతియక్షతలు తలలపై బడినంతనే సాధువులగు చున్నవి. దైవ కరుణ చేతను, మన యదృష్టవశమునను మహాకవు లెల్లరు నీ యసంఖ్యాకములగు రూపాంతరములకుఁ దమగ్రంథములఁ దావీయరైరి గాని, యిచ్చినచో గన్నులపండువుగ నుండు కావ్వ ప్రపంచమంతయు రాలురప్పల తోను, ముండ్లుమోఁడులతోను నిండియుండెడిదే. సంస్కృతమున ధాతురూపముల సన్నిటి నుపయోగించు నుద్దేశముతో వ్రాయఁబడిన “భట్టికావ్య "మను నొక గ్రంథమున్నది. సాహిత్యమును బిత్రవస్తు ప్రదర్శనశాలగ' భావించి యిన్ని మహా కావ్యము లుండఁగ నిట్టగచ్చపొదపంటి నిరర్థక కావ్య మేల యుండఁగూడదని యెంచియేకాఁబోలు కవి. శ్రమమంతయుఁ వృథఁబుచ్చి యీగ్రంథమును రచించి మన ఆంధ్ర కవిత్వ---3

పాలఁ జదువుఁడని పడవై చెను. వ్యాకరణ శాస్త్రము నిరంతరము పఠించుటవలనఁ సిద్ధములగు ధాతురూపముల విసర్జించి మారుమూలలనున్న రూపములనే వల్లించి ప్రయోగించుట తటస్థించును. కోఁతికిఁ గొబ్బరికాయ దొరకిన చందమున వ్యాకరణశాస్త్ర పరిచయ మబ్బినతోడనే యువకుల కన నేల, యారి తేరిన పండితులకు సై తము విపరీతములగు ధాతురూపముల యెడఁ బక పాతము మెండై స్వారస్యము నెడను, వైశద్యము నెడను సాదరమును సభిమానమును సన్నగిల్లి పోవుచున్నది, వ్యాకరణశాస్త్ర పారంగతులు కాని కవులు వ్యవహారమున నున్న పదములను, వానికుండు సుప్రసిద్ధరూపొంతరములను మాత్రమే సేకరించి యెల్లరకుఁ దెలియు నటులు స్వచ్ఛమును, మధురమును, సులభమును నగు భాషలో గ్రంథరచనఁ గావింపఁ గలుగుచున్నారు.

2. లింగవిభేదవిషయము.

ఇంతియ కాదు. వైయాకరణులు సృష్టికిఁ బ్రతిసృష్టిం జేయు టకుఁగూడఁ గడంగినారు. లింగ విషయమున నిరంకుశాధికార ధూర్వహులై పదములకుఁ దమయిచ్చవచ్చిన భంగి లింగముల దానముఁ గావించిరి. ఒకేపదమును స్త్రీలింగముగను, పుంలిం గముగను, నపుంసకలింగముగను వాడుచు, గవులకుఁ దీర రాని కష్టములఁ గల్పించినారు. వ్యవహారముననున్న పద్దతి కిని వైయా కరణకల్పితమగు పదముల లింగ పద్దతికిని భేద మెం తేనిఁ గన్పించును. వారియించ్చవచ్చినట్లు నీపదము స్త్రీలింగము, నీపదము నపుంసకలింగము, నీపదము పుల్లింగము ననుచు వైయాకరణు లవ్యాజకరుణమెయిఁ బదములకు లింగదానపత్రముల నొసగ నవి కవులపాలిటి శాసనములై నాటి వర్తింపరాని వయ్యెను. ఈ లింగవి భేదముల విచిత్ర పద్ధతులచే సమాసరచనలో నెన్నో కష్టములు సుభవించు చున్నవి. గణ విభజనము విషయమునను సంధి విషయమునను నమితములగు కష్టము లుత్పన్నము లగు చున్నవి.

3. వచనవి భేదము,

వచనవిభేదముల విషయమునఁగూడ నిట్టిచిక్కుల ననేకముల వైయాకరణులు కల్పించియున్నారు. సంస్కృతమున వచనములు ఏక - ద్వి - బహువచనము లనుమూఁడువిధములుగ నుండుటయేగాక యనేకశబ్దములు నిత్యబహువచనాంతములు గనో, నిత్యై కవచసొంతములుగనో, నిత్యద్వివచనాంతములు గనో యుండుటకూడ సంభవించి గోరుచుట్టుపై రోఁకటి పో టన్న భంగి యీ వరకున్న కష్టములకుఁదోడు కొత్తవి కలుగు చున్నవి. ఇట్టి విచిత్ర పద్దతులను గల్పింపఁబడిన వచనాంతవిభేద ములనెల్ల వల్లెవేయ 'నిది కవితఁ జెప్పఁగడంగుట సాహస కార్యమే యగుచున్నది. ఈవిచిత్ర వ్యాకరణ విశేషముల నన్నిటిని నేకరువు పెట్టుసరికి యున్న సాహిత్యాభిరుచి కొంచెమును గవితోద్రేకమును నశించిపోవును.

విభక్తులు, కాలవి భేదములు.

ఇఁక విభక్తుల విషయమును భూత - భవిష్య - ద్వర్త మాన శాలవి భేదముల విషయమును గష్టముల కాస్పదములగు చున్నవి. ఒకవిభ క్తియర్గమున నింకొకవిభక్తి యుపయోగింపు బడు నియమములును, నొకకాలమును సూచించుటకై వేరు

శాలమును సూచించు క్రియారూపములుపయోగింపఁబడు పద్ధతులును నానావిధములగు కష్టములఁ గూర్చుచున్నవి. సులభ గ్రాహ్యములును, సర్వసమ్మతములును, సర్వవిషయ సామాన్యములును నగునియమముల నేర్పఱచి సర్వమతములకు సమన్యయము గావించుపద్దతి మన వైయాకరణులకు రుచింపదు. ఎంత దూరస్థములుగను, స్వభావవిరుద్ధములుగను నున్న నియమముల కంత గౌరవము ప్రాప్తించునని మన వైయాకరణులమతమై యున్నట్లు తోఁచెడుసు.

ఆంధ్రవైయాకరణుల యధి కారనిర్వహణము.

సంస్కృత వైయాకరణుల చేఁ గల్పితములగు నియమములు చాలవని కాఁబోలు మనయాంధ్ర లాక్షణికులు నర్దానుస్వారము రేఫఱకారములకు భేదము, ౘ ౙ లకు భేదము, మొదలు గాగల నియమములను నేర్పఱచిరి.

1.అర్ధానుస్వారము.

ఇందు నర్ధానుస్వార నియమమును 'రేఫఱ కార భేదమును గూర్చిన నియమమును జూలకాలమునుండి వివాదాంశములుగం బరిగణింపం బడుచువచ్చినవి. అర్ధానుస్వారమునకుఁ బ్రయోజనము శూన్యమని చెప్ప వలనుపడదు గాని, తదభావము మాత్రము గవికి శాశ్వతఘోరసరక ప్రాప్తి నాపాదింపఁగల మహాదోషము కాదని నావిజ్ఞప్తి. పదసద్వివేకులగు పాఠకులు కొండోకయెడ సర్ధానుస్వారమును గవి ప్రయోగింపకున్నను సందర్భముననుసరించియు, బుద్ధిబలమునను సర్గము గ్రహింప లేకపోరు, అట్టి యర్ధానుస్వారము లేకపోవుటచే నర్థభేదము

వాటిల్లెడు తావులందక్క సర్ధానుస్వార విసర్జనము సర్వత్ర దోషముగఁ బరిగణింపఁదగదు.

2. రేఫ శకట రేఫముల ప్రశంస.

ఇంక "రేఫశకట రేఫముల విషయము: వీనికి నేమో నిసర్గ భేదమున్న దనియు, నందువలన వీనికి మైత్రి గల్పించుట మహాదోషమనియు భావించి యాంధ్ర దేశలాక్షణిక శిరోమణి యనందగు సప్పకవి పోతనామాత్యునిచే విరచితమగు శ్రీమ ద్భాగవతమును నధఃపాతాళమున నడుగంటఁడొక్కఁజూచెను. కానీ, మన యదృష్టఫలమునను, బోతన కవితా ప్రభావమునను భాగవతము నప్పకవ్యాదిలాక్షణికంమన్యుల తాఁకుడులచే సశింపక ద్విగుణీకృత వైభవముతోడను, శక్తితోడను నాంధ్రరసికులహృదయముల వశముఁ గావించుకొనుచున్నది. వైయాకరణుల చేఁ గల్పింపఁబడిన నియమములఁ గొన్నింటి మాత్రమే యుదాహరించితి.

వ్యాకరణమునకుఁ గావ్యముపయిఁ బ్రభుత్వము లేదు.

నాయభి ప్రాయ మేమనఁగా వ్యాకరణశాస్త్రము గౌరవార్హ మయ్యుం గౌవ్యనిర్మాణము నెడఁ బ్రభుతవహించు టకు సమర్థము గాదనియు, వ్యాకరణనియమములకు లోనై రసవ త్తర కావ్య కల్పనముఁ జేయఁగల్గుట ధీవైభవ ప్రదర్శక త్వమే యైనను వైకల్పికములగు వ్యాకరణ నియమములను మాత్ర మతిక్రమించి సహజములగు నియమములఁ బాటించి రసమునే ప్రధానలక్షణముగ నుంచి కవితఁ జెప్పంబూనుట యొక్కింత సాహసకృత్య మయిననుఁ భాపకార్యము మాత్రము గాదనియునే|

ఈసందర్భమునఁ బాఠకులు నాయభిప్రాయమును నిష్పక్షపాతబుద్ధితో నరయుదురుగాత. నేను జెప్పునది. బుద్ధిపూర్వకముగ వ్యాకరణము నగౌరపపజచుటకయి దుష్ట ప్రయోగముల పొంతఁ బొమ్మనుట గాదు. ప్రధానలక్ష్యమగు రససంపోషణము నకై తప్పని సరిగ పెడ త్రోవల ననఁగా - వ్యాకరణ విరుద్దము లయిన త్రోవలఁ జనీనం దిప్పు లేదనుటయే!

రసమే ప్రయోగముల సాధుత్వమును నిర్ణయిం చును.

వైయాకరణులచే సంగీకృతములగు విష రీతరూపాం తరముల నంగీకరించుటకన్న సహజములును, వ్యవహారమున సున్న వియును, నగు పదరూపములనే యవి కొంచము కష్టములైనను సంగీకరించి ప్రయోగింపఁడగుననియుఁ గృత్రిమ వ్యాకరణ నియమ విరుద్దములయి నంతమాత్రమున రసబంధురము లగు "చూచీచూడనిరోసీరోయని....రోళ్లారోఁకళ్లా” మొదలగు ప్రయోగంబులు ప్రయోగానర్హములు గావని నావిన్నపము. న్యాయముగ విచారింతు మేని వైయాకరణులు దుష్టములని చెప్పు వ్యావహారిక ప్రయోగములందునను, సొ'మే తలయందునను, నున్న రసపుష్టి యెరువుం దెచ్చి పెట్టుకొన్న సంస్కృత వ్యాకరణ నియమానుబద్ధములగు విపరీత ప్రయోగ ములయందు మృగ్యము. కావుననే యాంధ్రమున విపుల వ్యాకరణసం గ్రహరచన మత్యావశ్యకము. అనేక భాషలలో వ్యావహారిక పద ప్రయోగముల స్వరూష పరిణామములఁ దత్త పరిశీలన దృష్టితో విమర్శించు వ్యాకరణములు పెక్కులు గలవు. తుదకు బూతుల తత్త్వమును, స్వరూపమును జర్చించు. వ్యాకరణములుగూడ నాంగ్లేయ భాషయందుఁ గలవు, వ్యావ,

హారిక పదప యోగములత త్త్వమును, స్వరూపమును బ్రకాశింపఁ జేయు విపులవ్యాకరణ 'మొకటి యుండిన వైయాకరణులకును రసికులకును సంప్రదాయసిద్ధముగను నిర్వికల్పముగను వచ్చుచున్న యీపోరాట మంతరించి యాంధ్ర కావ్య వధూటి సొంతసొమ్ములతో నవ్యలావణ్య స్ఫురణలతో మనయెదుటఁ దాం డవమాఁడఁగలదు. రసహృదయులగు పాఠకులీ సందర్భమునఁ గాళిదాసమహాకవి రచితమగు నీ క్రింది శ్లోకభావమును మన నముఁ జేయుదురుగాక!

  శ్లో . సరసిజ మనువిద్దం శైవ లేనాపి రమ్యం
మలినమపి హిమాంశోర్లకు లక్ష్మీం తనోతి,
ఇయ మధికమనోజ్ఞా పల్క లేనాపి తన్వీ
కిమివ హి మధురాణాం మండనం నాకృతీనామ్.

ఆకృతియే ప్రధానముగాఁ గలవారికి నెట్టివి యైనను భూషణ ములే యగును. అది లేనివారికి నెన్ని యున్నసు దీరని కొఱంత యెప్పటికప్పుడు గోచరించుచునే యుండును. చంద్రుని గూర్చి విచారించునప్పుడు మనకుఁ బ్రధాన లక్షమతని శోభా పటలమే కాని యతని యందున్న మచ్చగాదు. అట్లే సరసిజము విషయమునను దాని సౌందర్యమే ప్రధానలక్షమగుంగాని దానీ నంటఁజుట్టు కొనిన నాఁచుగాదు. ఇన్ని లోపములున్నను సరసిజమును, జంద్రుఁడును బ్రభావిశేషముననే లోపముల నతి క్రమించి ప్రకాశింపఁగల్గుట సంభవించుచున్నది, వతద్విధముసనే కావ్యమునఁగూడ బ్రధానలక్ష్యము రసమే యగుటం జేసి చిల్లరనిషయము లనందగు వ్యాకరణలోషములు పరిగ ణింపఁదగినవి కాననియు, రసమనునది వ్యాకరణలోపముల

కతీతమై స్వతంత్ర జీవనముఁ గల్గియుండుననియు, నెట్టివ్యాకరణ దుష్ట ప్రయోగము లైనను రసభరితాకృతియగు కావ్య కన్యక కలంకారములు గాకపోవనియు నావిన్నపము.

2. కాస్యమునకును, తర్కశాస్త్రమునకును భేదము.

వైయాకరణులతో మనకుఁ బెద్దపోరాట మాయెను. వారిని వీడి రసికపథమునఁ గావ్యతత్త్వాన్వేషణపరులమై చనియె దముగాక! కాని విరోధివర్గ మింకను నాశముకాలేదే! అరుగో తార్కికులు, నైతికులు, దర్మవేత్తలు మొదలగు నతిరథార్ధరథ శ్రేష్ఠులు బారులుతీరి యుద్ధపరికరములతోఁ గావ్య రసాన్వేషుల నెదిరింపఁ జూచుచున్నారు. కావున మనకు వీరితోఁ బోరాటము తప్పదు. ద్వంద్వయుద్ధమే కరణీయము, ముందుగఁ బార్కీకుని నోఁడింప యత్నింతము. కావ్యమునఁ బధానాంశము రసముగుటచేఁ గార్యకారణ సంబంధములఁ గూర్చిన చర్చకుఁ దర్కశాస్త్రమున సున్నంత ప్రసక్తి లేక పోవుట చేతను గావ్యమునకును దర్కమునకును దరతరముల నుండి యెడచూపు పెడచూపు లయినవి, తర్కమున నెంతవరకును నిదిముందా? యదిముందా? దీని కాధారమనియా? దాని కాధార మిదియా ? యను హేతువాదమున కెక్కువ ప్రసక్తి కలదు. కావ్యమున నట్టి ప్రసక్తి యసంగతము. ఎదుట నున్న వాఁడే పెండ్లి కొడుకన్నట్లు కవికి మొట్ట మొదటం దట్టుభానమే కావ్యమూలబీజమగును. కవికి రసపోషణముతోఁ బని కలదు గాని పూర్వాపర చర్చతోడను కార్యరణవిభేద విచారము తోడను బని లేదు. తార్కికుడు చిత్తవికారములకు లోను గాక నిప్పడు పొతబుద్ధితో న్యాయ్యై కవిమర్శనదృష్టితో సందిగ

విషయముల నిదమిత్థమని నిర్ణయించును. కవి సహజముగఁ బక్షపాతి, యభిమాని, చిత్తవికారములకు దాసుఁడు, పక్ష పాతము, నభిమానము, చిత్తవిశారజనితమగు వ్యామోహ మును లేనిది కవిత పుట్టుటయే యసంభవము. కావునఁ గవిత ప్రభవిల్లవ లెనన్నఁ దార్కికుని దూరముఁగ దొలఁగిపొమ్మనుట యవశ్యకరణీయము. కవిత్వ మెన్నఁడును సిద్ధాంత విషయము గాదు. చర్చవలన సత్యము నిరూపించుట 'కవకాశముగల శాస్త్రము గాదు. కవిత్వరస మనుభవైకవేద్యము గావలయుఁ గాని సిద్ధాంతములవలన నలవడదు. ఈ భావమునే భోజుని యాస్థానమున నొక కవి యీ క్రింది చాటుశ్లోకమున వర్ణిం చెను.

   శ్లో.ఆధరస్య మధురిమాణంకుచ కాఠిన్యం దృణోశ్చ లైక్ష్యం చ,
 కవితాయాః పరిపాకం హ్యనుభ వరసితో విజానాతి.

కావ్యమునకు ధర్మశాస్త్రమునకుఁ గల భేదము.

తార్కికునితోడి పోరాటము ముగిసిన తోడనే ధార్మి కునితోడి కయ్యము సంప్రాప్తమగు చున్నది. ధర్మశాస్త్రమననేమి? మానసవ్యవహారముల నుద్భవించుకలహముల సమ దృష్టితో సవలోకించి న్యాయ్యముగా తీరుమానము నిచ్చు శాస్త్ర మే ధర్మమే ప్రపంచమున నుండనిచో నిరంతరసంరంభము తప్పదు. ధర్మశాస్త్రము జీవితసమస్యను న్యాయముగఁ బరిష్కరించి జీవితమున సామరస్యముఁ గల్పింప యత్నించును, ఇవి తగునివి తగదని ధర్మశాస్త్రము విధినిషేధముల నిర్ణయించుకు. శబ్దస్వరూపము విషయమున వ్యాకరణమునకు బలె మనవారు లౌకిక వ్యవహారముల ధర్మశాస్త్రమునకు శాసనాధి కారము నొప్పికొనిరి. ధర్మశాస్త్రము మితిమీరి వర్తించువారు దండ

నార్హులుగఁగూడ నెన్నఁబడుచున్నారు. అట్టిచో ధర్మశాస్త్రము కవి నెంతవఱకు బంధించును ? కవి ధర్మశాస్త్ర నిర్ణయములకు వ్యతిరేకముగాఁ గావ్యము రచియింపవచ్చునా? అట్లు రచించుట సత్రావ్యలక్షణ మగునా? ఈ ప్రశ్నములకు సోదాహరణములగు ప్రత్యుత్తరములను సంపూర్ణముగ నింకొక సందర్భమున విన్న వించెదను. ప్రస్తుతము స్థాలీపులాకన్యాయమునఁ గొంచెము సమాధానము సూచిం చెదను. కవి రచించెడి కావ్యము ప్రపంచమును, నందలిజీతమును, ఛాయాపటమురీతి ననుకరింపక, స్వతంత్ర ప్రపంచమును సృష్టిం గావించునని యీవరకే తెల్పి యుంటినిగదా! ప్రకృతులు భిన్నము కానప్పుడు వానికి వర్తించు సూత్రములును భేదింతమానవు కదా! ధర్మశాస్త్ర, మెప్పుడును బ్రకృతుల కనుగుణముగ సమర్థింపఁబడును గాని వేఱుపద్ద తులఁ గావింపఁబడదు. ధర శాస్త్రము నుపనిబంధిం చునవి దేశ కాలపొత్రములు. 'దేశ కాలపాత్రములు మాజుకొలఁదిని ధర్మ సూత్రములును మాఱుచునే యుండును. కవి 'దేశ కాలపాత్ర ములపై ననే యాదారపడియుండఁడు. దేశ శాలపొత్రముల కతి తమును, స్వతంత్ర, జీవనరహితమును నగు రసప్రకృతి కాధార ముగఁ గొనును. అందువలనఁ దనచేఁ గల్పితమగుఁ బ్రకృతి కనుగుణముగ స్వతంత్ర ధర్మ సూత్రములను ధర్మసూక్ష్మములను గవియే నిర్ణయించుకొనునుగాని యొకరుగావించినధర్మశాస్త్ర ము నాధారముగఁగొని కావ్యములలోని పాత్రములకుఁ బార తంత్ర్యము ఘటింప నిచ్చగింపఁడు. మూలసూత్రములను మిగి లినవిషయములనుగూడఁ 'గావ్యము లవలంబించుధర్మశాస్త్రము నళును, సాధారణమగు ధర్మశాస్త్రమునకును వ్యత్యాస మెంత యేనియు నుండును. ప్రధానసూత్రముల రెండింటికిని నీ ముఖ్యం.

భేద మున్నది. సామాన్య ధర్మశాస్త్రమున విధులకుఁ బ్రభుత మెండుగనుండును. స్వాతంత్ర్యమున కనేకములగు నిరోధము లేర్పఱుపఁబడును. అందు మనధర్మశాస్త్రము మానవస్వాతంత్ర్య మునకు వేన వేలు నిరోధములఁ గల్పించినది. మనకు ధర్మము లన్నియు సతీతపథమునే చూపింప యత్నించుటచే ధర్మమాచ రించవలెనన్న మనము వియత్పథముననైనఁ జరింపవలెను. ధర్మము విసర్జింపవలెనన్న నధోలోక ప్రాప్తియైన నందవ లెను. మధ్యస్థమగు మార్గాంతరము కన్పింపబడ లేదు. కావ్యము లీపనికిఁ జాలఁ దోడ్పడినవి. కవి స్వతంత్రేచ్ఛఁ గలవాఁడగుటచే స్వతంత్ర పథమన నడచుటవలన వచ్చుఫలితముల నన్నింటిని యోబించి దానివిషయమై తగినకట్టుదిట్టములఁ జేసికొనుచునే యుండును. రసవిషయము సూక్ష్మ గ్రాహ్యమైనదగుట చేఁ దత్సం బంధములగు ధర్మములును గడుసూక్ష్మములుగ వర్తించును. ప్రత్యక్షానుభవమున నధర్మములుగఁ దోఁచువిషయము లెన్నో కావ్య సంబంధమైన రసదృష్టితో నవలోకించిన ధర్మములట్లు గంపడును.

సమష్టిమాను శ్రేయ మేధర్మశాస్త్ర నిరీక్షణము.  వ్యక్తి యొక్క స్వతంత్ర రస ప్రవృత్తియే కావ్య నిరీక్షణము.

ఈ భేదమునకుఁ గారణము రెండుమతములకును గల భిన్న నిరీక్షణ మేకాని వేఱుకాదు. ధర్మశాస్త్రమునకు నీరీక్షణము సంఘ శ్రేయము, మానవవ్య క్తియుఁ దత్సంపోషణమును, సాధన మాత్రములును, నప్రథానములును. కావ్యమునకో సంఘ. శ్రేయ మప్రథానవిషయము. సాధనమాత్ర మే, ప్రథానవిష యమగు నాలంబము మానవవ్యక్తియొక్క రసప్రవృత్తియే. అందుచే ధర్మశాస్త్రము మానవ వ్య క్తిస్వాతంత్ర్యమునకు నిరో ధకములగు ధర్మములను సంఘ శ్రేయోభినృద్ధికై నిర్ణయించును. కావ్యమన్ననో మానవవ్యక్తికి సహజమగు ప్రవృత్తులలో నొకటియగు రసప్రవృత్తిని బెంపొందించు నుద్దేశముతో దాని కనుగుణములగు ధర్మములనే నిర్ణయించి సంఘ శ్రేయోభివృద్ధికి గొన్ని యెడల హానిఁగూర్చుధర్మములఁగూడ బోధింపఁజూచును. కావుననే "కావ్యధర్మములకును బ్రాపంచిక ధర్మములకును వైప రీత్యముండుట. ఈవి ఖేదము పాత్రలచర్యల విమర్శించుచు ధర్మాధర్మవిమర్శన చేయఁగడంగు నవసరముల ముఖ్యముగఁ బాటింపఁ దగినదై యుండును కొన్ని యెడలఁ గవులు సూతనపాత్రముల నిర్మించుచు నూతనధర్మముల సూచించెదరు. అనఁగా పాత్ర, ములచర్యలను నూతనధర్మముల ననుసరించి చేయఁబడినయట్టి హనినిఁ బ్రదర్శించి ప్రత్యక్షముగఁ గాకపోయినను పరోక్షముగ నైనను నూతనమార్గముల విశదీకరింతురు. నిస్తంద్ర, ప్రతిభాశాలురగు కవులు భావనాశ క్తిబలమున భావిపరిణామమును 'గూడఁ దాము గాంచి మనకుఁగూడ గోచరింపఁ జేయుచు విరుద్ద ధర్మములపై మనలోఁ బక్షపాత ముకయింపఁ జేతురు. ప్రతీ మనుజునకును స్వాతంత్ర్యేచ్ఛ యుండుట చేఁ గావ్యధరముల యెడ నభిమానము లోలోనఁ జెందుదుము గాని, బహిరంగ ముగ దానిని వెలిఁబుచ్చుటకు జంకుడుము. ఈభావమునే పెల్లి యను నాంగ్లేయకవివరుఁడు కవులు శాసనాధి కారహితులగు ధగ ప్రవక్తలు” అను వాక్యమునఁ దెల్పి రెండుధర్మమతముల కును గల భేదమును వివరించెను.

కావ్యమునకును నీతిశాస్త్రమునకును గల భేదము.

ఇంక నైతికునితోడి వివాద మున్నది. ఈవివాదము కావ్యముయొక్క బహిరింద్రియము లనందగు శబ్దస్వరూపాదీ విషయములకు సంబంధింపక కావ్యాత్మ యనందగు విషయ మునకే సంబంధించుస దగుటచే నేంతయు విపులచర్చకుఁ దగి యుండును. నీతి యన నేమి? నీతికినిగావ్యా త్మకును సెట్టి సంబంధ బాంధవ్యములు? -

నీతిళాస్త్ర స్వభావమును దాని ప్రధాన నిరీక్షణతత్త్వమును. 

నీతి యనఁగా మానవులకుఁ దా మొనరించు కార్యముల విషయమునఁ గల గుణదోషవిచక్షణతయుఁ బుణ్య పాపవిచక్షణతయునే! ధర శాస్త్రమునకుబలె నీతి శాస్త్రమునకుఁగూడ సంఘ శ్రేయమును, మానవజాతి శ్రేయమును బ్ర ధాననిరీక్షణ ములు. నైతికుఁడు భగవంతుఁడను నొకయతీత న్యాయాధికారి యున్నాఁడనియు, నతఁడు సదసద్వివేకసంపన్నుడనియు, మానవులకృత్యములను న్యాయబుద్దితోఁ బరిశీలించి యిది పుణ్యము, నీది పాపము నని వానియందలి మంచి చెడుగులను నేఱ్పజచి సర్వజనసామాన్యముగ నాదరణీయమగు జీవితపద్దతిని నాదే శించుననియు, నట్టియా దేశ మే నీతిశాస్త్ర మనఁదగుననియు వాదించును. జీవితానంతరమునఁ బుణ్య పాపవిమర్శన 'మొనర్చు న్యాయాధికారియెదుట స్వీయకృత్యములకు నుత్తరవాదులై యుండవలయు ననుభయమున జను లిహలోకమునఁ బాప కార్యములకుఁ గడంగక సర్వమానవకోటికిని శ్రేయోదాయక మగు నీతిపథమునఁ జరింతురనియు నై తికునియాశయము..

ఈయాశయము సఫలమగుటకొఱకై నైతికుఁడు స్వర్గమును నరకమును నను రెం డతీతలోకము లున్న వని భ్రమింపఁ జేసి నీతిపథమునఁ జరించువారికి స్వర్గలోక ప్రాప్తియు, నీతిపథమును వీడి పొపపథమునఁ జరిం చువారికి నరకప్రాప్తియుఁ గలుగునని నిర్దేశించు చున్నాఁడు. ఈనరకభీతియు స్వర్గలోక ప్రాప్తియందలీ యాస క్తియు మానవుల జీవితపథమును ననేకవిధములఁ ద్రిప్పు చున్నవి. నరకభీతిచే మానవుఁడు స్వచ్చంద ప్రవృత్తిని నిరోధించుకోను చున్నాఁడు. స్వర్గప్రాప్తికొజుకై మానవుఁడు తన కిష్టము లేనివై నను స్వచ్చంద ప్రవృత్తికి బాధగలగించునట్టి వైనను గొన్ని నియమములకుఁ గట్టుపడి కొన్ని విధుల ననుష్ఠించు చున్నాఁడు. ఇహలోకమున దండనాధికారిభయ మెటులో, పరలోకమున యమదండన భీతియు నల్లే నీతిశాస్త్రమువలని మేలును నింతయని నుడువుటకు వీలుగాడు. అట్లయ్యు నీతి శాస్త్రము కావ్యసృష్టికి నిరోధముఁ గల్పింపఁజూలవని నావిజ్ఞప్తి. ఆది యెట్లో యించుక విపులముగఁ జర్చించెదను. ధర్మశాస్త్రము నకుబలె నీతి శాస్త్రమునకును బ్రధాన నిరీక్షణము సంఘ శ్రేయమే యని మున్నే తెల్పియుంటినిగదా! కావ్యమున వ్యక్తియొక్క స్వచ్ఛంద ప్రవృత్తియే యవశ్యాలంబనీయను. మానవుని రస ప్రవృత్తియే ప్రధాసనీరీక్షణమై 'కావ్యమునకు నొక్కింత స్వతంత్ర ప్రతిభ నాపాదించును.

కావ్యము నీతిని బోధింపవ లెనా? 1. విద్యానాథుఁడు.

కావ్యము మానవజాతి శ్రేయమును బ్రధానలక్ష్యముగ నూని నీతి-ధర్మ- తర్కశాస్త్రములచే నిర్ణయింపఁబడు నియమములచేఁ గట్టుపడి, స్వచ్ఛందరస ప్రవృత్తిని నిరోధింప

జూచునా? ఆట్లు చూచుట మంచిదగునా? ఈ ప్రశ్నకు సమాధానము ననేకులగు విమర్శకు లనేకరీతుల నొసఁగిరి. ఈవిషయ మునుగూర్చి ప్రాచ్యపాశ్చాత్య విమర్శనసంప్రదాయము లోకే విధమగు నవ భేదముల నొందినవి. మన దేశమునఁ గావ్యము నీతిబోధకముగ నుండవలెనని కసించిన లాక్షణికశాసనము లలో నెల్ల ను "కావ్యం యశనే౽ర్టకృతే వ్వవహారవిదే శివేతరకు తయే, సవ్యః పరనిర్వృతయే కాంతాసమితత యోప దేశయు జే" అనువాఖ్యమే ప్రమాణాధికారము నందియున్నది. ఈ వాక్యము యొక్క యర్ధముఁ బరిశీలింతు మేనిఁ గవి కావ్యము యశస్సు గొఱకును - నర్థసంపాదనముకొఱకును వ్యవహారజ్ఞానముఁ దెల్పుట కొఱకును నశుభములఁ దొలఁగించుట కొఱకును తా త్కాలికసుఖ మొడఁగూర్చుట కొఱకును భార్యయుం బోలె సమతముగ నుపదేశించుట కొజుకు నని తేలుచున్నది. కవి నిశ్చయముగ నిన్ని ప్రయోజనముల నర్థించి కావ్యము వ్రాయునా? వ్రాయఁదగునా? వ్రాయుటవల్ల నేమైన నష్టముగల్గునా? కావ్యము రసాత్మకమని యంగీకరించుటకుఁ బై శాసన మభ్యం తరము గల్గించును గావున దీనిని గొంచెము విమర్శింపక తప్పచు. యశంబనఁగ నెట్టిది? అర్థమనఁగ నెట్టిది? శుభాశుభము లెయ్యవి? వీనికిని గవికిని నేమిసంబంధము ?

శాస్త్రములు చేయుపనిని కవి చేయఁజూచుట యనవసరము.

కావ్యమునఁ గవి కల్పనఁ జేయుపొత్రలు స్వతంత్ర ప్రవృత్తింగలవిగ నుండునని యింతకుమున్నే మన " మంగీకరించి యుంటిమి, ఇప్పుడు కవిని బ్రయోజనములకు అనఁగా యశస్సు, ధనము, శుభము, మొదలగువానికి దాసునిగఁ జేయఁదగునా? వివిధ ప్రయోజనముల సాఫల్యమునకు వివిధశాస్త్రములు నిర్దే శింపఁబడియుండఁ గవి పని లేనిపనిగ వానిపొంత నేలఁ బోవల యును? ఎవరిపని వారు చూచుకొన్నఁ దమకుసు, మిగిలినవారి కిని మేలగు కవి తనస్వధర్మమును వీడి శాస్త్రములపొంత బోయినచోఁ భారతంత్ర్యమునఁ బరాధీనతయు నేర్పడు నేకాని వేఱ ప్రయోజనసిద్ధి లభింపదు. ప్రకృతియం దెప్పుడును సనవసర వ్యయముగాని యనవసర ప్రతిభావ్యయముగాని యుండ రాదు. ప్రకృతి సహజముగ లోభిని చేతనున్న శక్తి ననవసరముగ వ్యయము చేయదు. వివిధశాస్త్ర కారులు వివిధశాస్త్రముల రచించి వివిధ మానవధర్మముల నిర్దేశించియుండుఁ గవి స్వస్ధానము వీడి తన కావ్య ప్రపంచమును వీడి తనరమణీయపథము నతిక్రమించి కార్య కారణములఁ గూర్చినయు ధర్మాధర్మములు గూర్చినట్టియు, శుభాశుభములఁగూర్చినట్టియుఁ, బుణ్యపాప ములఁగూర్చినట్టియు వివాదముల జోలి కేలరావలయును? రాఁదగదు. శాస్త్ర మెప్పుడును సమష్టి విషయకదృష్టి నే కలిగియుండును. కావ్య మెప్పుడును స్వస్వరూపసం ధానపూర్వకమగు వ్యష్టి విషయకదృష్టియే కలిగియుండును. కావున నీ రెంటికిని బ్రథాననిరీక్షణమున భేదమున్నది.

శావ్యమున నైతిక ప్రయోజనము లప్రథానములు. రసప్రవృత్తియే ప్రధానము. మమ్ముటునిమతము.

అట్లనుట చేఁ గావ్యమున నీతియుఁ బై నఁజెప్పిన ప్రయో జనములును సిద్ధింపఁదగనివని నాయభిప్రాయము గాదు. అవి ప్రధానలక్ష్యుములు గావని నంతమాత్రమున - వానికి బద.

భంశము విధించితినని తలంపకుఁడు, కావ్యమున నీవియెల్లను సాధనములుగ నుండిన నుండవచ్చును. ప్రధానవిషయమగు కావ్యసృష్టికి నిరోధము కలిగింపనంతవరకు వానికిఁ గావ్య మునఁ దావీయవచ్చును. అంతియేని వానిని గావ్యమున రసమునకు నీడువచ్చునధి కారినిగా శాస్త్రమునకుఁ దావొసంగితిమేనిఁ జనువిచ్చినఁజంకెక్కె' ననులోకసామ్యము యథార్థమై కావ్యమున రసమునకుఁ బదచ్యుతి సంభవించినను సంభవించును. కవి యనేకులగు యజమానులకు దాసు, డైనవారిలో నెవ్వరినిఁ దిన్నఁగ సేవించుటకు వీలు కలుగకపోవుటయే కాకరెంటికిం జెడిన రేవడిభంగిని ఆత్మ గౌరవమును నన్యుల యాదరణమును గోల్పోవలసిన యవస్థయు సంభవించును. తమతమ నెలవులు దప్పిన తమమిత్రులె శత్రులగుట తథ్యము అగునటుల స్వీయకృత్యమును మఱచి పిలువని పేరంటములకు బోయి యగౌరవమునందుఁ గవి రసికలో కాదరణమునకుఁ గూడఁ బాత్రుఁడును కాకపోవుట తటస్థమగును. నీతి, ధర్మము మొదలగునవి కావ్యమున ధ్వనించుచుండును. కాని ప్రధాన ప్రయోజనములు గా నేరవని నా విన్న పము, ఈయభిప్రాయ మునే మమ్మటుఁడు 'అనన్యపరతం త్రాం' అనుకావ్యవిశేషణ మున సూచించినాఁడు. కావ్యము అన్యములపై నా ధారపడి యుండదు, అసఁగా నీతి, ధర్మము మొదలగు నన్య ప్రయోజనముల సర్జింపదు. స్వతంత్రమై వానిని సాధనమాత్రములుగఁ గైకొని సేవకపడముల నియోగించు నేకాని వాని కెన్నఁడును దసతో సమానమగు గౌరవమును స్థానమును నొసంగదు. ఈ భావమునే పండిత రాయలు విశ్వనాథుఁడు మొదలగు రసిక వర్గమువారెల్లరు నంగీకరించిరి. ఆంధ్ర కవిత్వ---4

కావ్యమున నీతి ధ్వనిమాత్రముగ నుండును.

కావ్యము నీతిబోధకముగనేయుండవలయునను టొకటి, నీతి కావ్యమున ధ్వనించుచుండవలయునను టొకటి, కావ్వము నీతిబాహ్యముగ నుండఁదగుననుట వేరొకటి. కావ్యము నీతి బోధకముగనే యుండవలయునని శాసించుటయుఁ, గావ్యము నీతిబాహ్యముగ నుండఁదగు ననుటయు రెండును గూడని మతములు. కావ్యము నీతిబోధకముగ నుండవలయునని పలుకు వారు స్వధర్మముఁ బరిత్యజించి కవి యన్వధర్మములు స్వీకరించి దానికి దాసుఁడై పదభ్రష్టుడు గావలెనని సూచించుచున్నారు. ఇఁకఁ గావ్యము నీతి బాహ్యముగ నుండవచ్చు ననువారు మానవజాతికి ముఖ్య లక్షణమగు నీతిని సంపూర్ణముగ నాశముఁ జేసి దానిని అనఁగా మానవజాతి గౌరవమును నడుగంటల దొక్కఁ దలంచుచున్నారు. మామతమున నీతి కావ్యమున ధ్వనించుచుండవలయును. కావ్యమునకు నీతి సాధనమాత్రము గను నుపాంగముగను నుండి సర్వసంపూర్ణమగు కావ్యసౌందర్యమునకు దోహదముఁ గావింపవలయును. ఉత్తమప్రకృ తులచరిత్రములును, దుర్మార్గులలో సయితము గ్రహింపనగు సద్గుణాభివర్లనమును నీతిని సూచించుచునేయుండును. దాని వలన మానవునకు నాత్మవికాసము గలుగుచునే యుండును. అంతియేకాని 'కవి ఇది చేయుము, అది చేయకుము” అనుచు "ధార్మికుని వలెను నైతికునివలెను శాసింపఁబూనుట పిలువని పేరంటమునకుఁ జనుటంబోలిన దే. పాశ్చాత్య సాహిత్య చరిత్ర, మునఁగూడఁ దుట్టతుదకు నీనిర్ణయమే జరిగెను,

కావ్యము నీతి బోధకమా? -1. పేటో అరిస్టాటిలులమతము.

ప్లేటో మతమువారందఱును గావ్యము నీతివిదూరమని భావించిన సంగతి నిదివరకే తెల్పియుంటిని. అరిస్టాటిలుమతమునఁ గావ్యమునకుఁ బ్లేటోచే నాపొదింపఁబడిన దోషములు నిశ్చయముగ లేవనియుఁ గావ్యము ప్రాయికముగ నీతి బోధళమే యనియు నిరూపింపఁబడెను. కవి మానవజాతియభ్యున్నతికిఁ గావ్యమును సాధనముగ నుపయోగించి తోడ్పడుననియు, సరి స్టాటిలు సూచించెను.

2. లాజ్గీసు జీవితము

ఆరిస్టాటిలుతరువాతి వారగు లాజ్గినీసువర్గము పోరును కవి మానవాభ్యున్నతికే నిజముగఁ దోడ్పడువాఁడే యైనను బ్రాయికముగ నీతిబోధకుఁడు గాఁడనియు, స్వీయపథమగు రస పోషణమున నే కవియొక్క స్వచ్చంద ప్రతిభ విజయ మొందఁ గలదుగాని నీతిధర్మము మొదలగుశాస్త్ర విషయముల నిరా ఘాటసంచారముఁ గావింప లేవనియు, నిర్ణయించి కవికిఁ బార తంత్ర్యావ్వస్థను, దొలఁగించి రసికమతము స్థాపించిరి. ఇంగ్లండు నను, ఫ్రాన్సు దేశమునను దేశ కాలపాత్రముల ననుసరించి యభి ప్రాయములు మాఱుచు నొక్కొక్కప్పుడు అరిస్టాటిలు పద్ధతిని వేరొకప్పుడు, లాజ్గీనీసు మొదలగు వారి పద్ధతిని వర్ధిల్లుచు వచ్చెను.

ఆంగ్లేయ విమర్శకులలో నెల్లఁ బ్రథముఁ డనఁదగు 1. సిడ్నీ

యనునతఁడు కావ్యము ప్రత్యక్షముగ నీతిబోధకముగాదనియుఁ బచ్చన్నముగ నీతిని బోధించియే తీరవలయుననియు శాసించి తనమతమును నీ క్రింది విధమునఁ దెలిపెను. వైద్యుఁడు చేదు మాత్ర నిచ్చినయెడల రోగి మింగ లేఁడని తలంచి యామాత్రకుఁ గొంచెము తీయని పదార్ధము ననఁగాఁ జుక్కెర, తేనే మొదలగు. వానీని బైపూఁతఁ బూసి యిచ్చి యెటులు రోగము మాన్పఁ జూచునో యట్లే కవియు నీతినిఁ బ్రత్యక్షముగ బోధించినచో జనులకు రుచింపనేరదని యెంచి రసమును నొక పై పూతఁగఁ గావించి కథావర్ణన మొదలగు నలంకారములచే నీతిని జనులకు హృదయంగమమగురీతిని బ్రదర్శించనని సిడ్నీ తెల్పెను. ఈయుదాహరణమునఁ గవికి నీతిబోధన ప్రధానకర్తవ్య మనియు, రసము, సాధనమాత్రమే యనియు ద్రుపపడు చున్నది. కాని సిడ్నీ తరువాతః గవులు నప్పటి దేశ కాలపొత్రముల సరణి ననుసరించి సిడ్నీ మతము నంగీకరింపక యింగ్లండు పరదేశముల నిర్జించి జయోద్దతి చేఁ బ్రకాశించుకతమున నింగ్లండు దేశము యొక్క యాన్న త్యమును నందలి, ప్రజల యొక్క జీవితములును వర్ణించిరే కాని నీతిని బ్రత్యక్షముగ బోధింపఁ బ్రయత్నింపరైరి.

2. షేక్స్పియరు.

సిడ్నీ తరువాత నింగ్లీషు విమర్శకులలో నెన్నఁదగిన వాడు. షేక్స్పియరు మహాకవియే." షేక్స్పియరు గొప్ప నాటకకర్త.

నాటక లక్షణమును విమర్శించుచు సర్థాంతరన్యాసముగ సర్వ విధములగు కావ్యములకు వర్తించురీతిని నతఁ డోకకావ్య లక్షణ నిర్వచనముఁ గావించెను. నాటకము ప్రకృతిని నద్దమునఁ బోలెఁ బ్రదర్శించునని తెల్పెను. అంతియే కాని నాటకము జనులకు నీతిబోధించునని చెప్ప లేదు. ప్రకృతిని, మానవజీవిత మును గన్నులఁగట్టినట్లుగ రసవంతముగ, స్వతంత్రముగ వర్ణించుటయే కవికృత్యమనియు, నీతిబోధన, ధర్మ శాసనముఁ గవి కనవసరము లనియు నిర్ణయించి షేక్స్పియరు తన కావ్యముల 'నన్ని టిని: బై పద్దతి నే రచించి లోక విఖ్యాతుఁడయ్యె.

3. మిల్టను.

షేక్ స్పియరు తరువాత నింగ్లీషు కవులలో మిల్టన్ అను నతఁడు చాలగొప్పవాడు. ఇతఁడు మతసాంప్రదాయములు బెరిఁగినవాఁడు. చిన్నటనాఁట నుండియు మతావేశము గల వాఁడు. అతనిమతావేశమునకుఁ దోడుగ నింగ్లండు దేశమున నాకాలమున విజయౌద్దత్యము క్షీణించి దురభిమానమునకుఁ బ్రసక్తి "మెండయ్యెను. అందుచే మీల్టను మానవునిజీవిత మంతయు గొప్ప కావ్యము కాఁదగుననియుఁ, గావ్యమున సద్గుణములన్నియు మానవునియందుఁబలె వర్ధిల్లవ లేననియుఁ, గావ్యము మానవుని గుణాభివృద్ధికి దోడ్పడవ లెననియు నెంచి భగవంతునిచర్యలను మానవులకుఁ బ్రదర్శించి మానవ కల్యాణమునకు, ననఁగా మానవజాతి యొక్క, నీత్యభ్యుదయ మునకుఁ దోడ్పడుటకై సృష్టి యొక్క చరిత్రమును, మానవుని యథఃపతనమును, మానవుని పునరుద్దరణమును మొదలగు విషయములను గైకొని నీతిబోధకములగు కావ్యములను


విరచించెను. కాని మిల్టను రచించిన కావ్యములలో నెల్ల దుర్నీతిపరుఁడును నహం కార స్వరూపియు నగు సై తానుని వర్లనమే యెంతయు రసవత్తరముగ నుండి నీతిబోధకముగ సంతరింపఁబడిన యితర కావ్యభాగములన్నీయుఁ 'బేలవముగ నుండుటయే మిల్టను మతమును దమంతఁదామే యన్యవాద సాహాయ్య మక్కజ లేకుండఁగ నే పూర్వపక్షముఁ గావింపఁ జాలియున్నవి.

4. పోపు మొదలగువారు.

మిల్టన్ తరువాతఁ గవులు సమకాలికాచారవ్యవహారము లను వర్ణించుచుఁ గావ్యము సమకాలికొచారవ్యవహారములను సరియగు పద్ధతిని నడపించు నీతిని మాత్రమే బోధించునని తలంచి కావ్యమునఁ దాత్కాలికోపయోగములగు నీతి సూత్రములను మాత్రమే బోధింపజూచిరి. వారికాప్యముల విశాల ప్రకృతివర్ణ నముగాని విశాలమానవజీవిత వర్లనముగాని సర్వ సమతమగు నీతిబోధముగాని మృగ్యమై తాత్కాలిహోప యోగములగు నీతివిషయము మాత్రమే వర్ణింపఁబడి కావ్య ములన్నియు నొకేతీరున సంతరింపఁబడి మన ప్రబంధముల రీతిని “పొడినదే పాడుము పొంచిపండ్లదాసరీ” యనునిందకు లక్ష్య ములై దేశమునకుఁ గాని కావ్యమునకుఁ గాని 'యే మేలును నొడఁగూర్పంజాలకపోయినవి.

పరాసువిప్లవముతరువాతి కవులు.

ఇంతలో శృంఖలలనన్నియు విదలించి పరాసుజాతీ స్వాతంత్ర్యపతాకను దేశ దేశములకుఁ బంపించునటులఁ బ్రదర్శిం చెను. తోడనే నియమములయెడ భక్తియు, భయమును దగ్గి పోయేను. మతాచార్యులందఱును దొంగలుగను నిరంకుశాధి కారవర్గమిత్రులుగను భావింపఁబడుటచే వారి చేఁగావింపఁబడిన నైతిరధారిక నియమములన్నీ యుఁ దిరస్కార పొత్రములుగ గణింపఁబడినవి. నీతి నియమముల నేర్పఱచుటకు మతాధికారు లకుఁగల ప్రభుత్వమును దిరస్కరించి పరాసులు మానవుని జన్మ గౌరవమును జన్మస్వత్వములును, బవిత్రములుగ భావించి తదనుగుణమగు స్వాతంత్ర్య ప్రవృత్తియే యుత్తమనీతిపథమని నిర్ణయించి కావ్యమున నట్టిస్వాతంత్ర్య ప్రవృత్తికే తావొసంగిరి. శానినీతికి గౌరపపద మీయ రైరి. వర్డ్ స్వర్, కోలరీడ్స్, షెల్లీ, కీట్స్, బైరన్ , మొదలగుకవులు నీతికిఁ గావ్యములు బ్రాధాన్య మొసఁగక రసప్రవృత్తినే మిక్కిలి పోషించిరి. బైరస్ ఇంచుమించు నతని దిరస్కరించెననియే చెప్పవచ్చును. మొత్తముమీఁద బరాసు విప్ల వముమూలమున నతివాదము నకుఁ బెద్ద దెబ్బ తగిలినదని యాంగ్లేయసాహిత్యపరిచితులకు విశదమగును. కాని స్వాతంత్ర్యరక్తి యతిశయించినకొలఁది నీతియందలి రక్తియు సన్న గిల్లుచుండెను. కోలరిడ్జ్, డిక్విడ్ సి, బైరస్, షెల్లీ, కీట్స్, మొదలగు కవుల జీవితచరితమే యిందులకుఁ దార్కాణము. ప్రతిభాశాలు లెల్లరును నీతివిదూరులై యకాలమరణమువాఁతఁ బడుట సంభవించుచుండెను.

5. మాత్యూ ఆర్నాల్డునిమతము. 'కావ్యము జీవిత విమర్శనమే యగును.”

. .. ఇట్టిసమయముల “మాత్యూఆ ర్నాల్డు' అనుకవి యుద్బ విల్లి యాంగ్లేయసారస్వతమును నీతిపథమునఁ ద్రిప్పజూచేను. అతఁడు కావ్యము జీవిత విమర్శవ మనియుఁ, గావ్య పరమావధి

యత్యుత్తమ మైనదనీయుఁ, గావ్యము మానవుని విచారములఁ బోఁగొట్టి ధైర్యము నొసఁగి చిత్తశాంతిఁ జేకూర్చి యుత్తమ గతి నొడఁగూర్చుననియుఁ, గావ్యమున నీతి మృగ్యము గాఁ గూడదనీయు, మఱి ప్రధానముగ నే యుండవలయు ననియు, నీతి లేని జాతులన్నియు నశించుననియు, నీతి బగ్గమయినజూతి చీరసాయిగ వర్దిల్లుననియు, నుత్తమపరమావధిగల కావ్యము సత్పు రుషులయొక్కయు, నీతియుతుల యొక్కయు, మహాపురుషుల యొక్కయుఁ జరిత్రములను గావ్యముల వర్ణింప వలయుననియు, సామాన్యమానవుని జీవితము నిసర్గముగ వర్ణ నీయము గాద నియుఁ, గవియొక్క శక్తియంతయు సర్వకాలములకును, సర్వ దేశములకును, సర్వమానవులకును వర్తింపఁగల మహావాక్యములను నీతి వాక్యములను రచించుటయే యనియు సిద్ధాంతముల జేసి స్వాతంత్ర్యరకులగు షెల్లీ. బై రణ్ - కీట్స్ మొదలగుకవు లను నాదర్శప్రాయులుగ నంగీకరింపక పూర్వులగు గ్రీకు రోమన్ కవులనే యాదర్శప్రాయులుగ నంగీకరించెను.

6. రస్కిను, కాథ్లెలు వర్గము వారి మతము.

ఆర్ నాల్డు కవియొక్క వాక్యము లాకాలపు టాంగ్లేయు లకు శ్రవణ కఠోరములుగ నుండెను. కాని రసశాస్త్ర వేత్తయగు రస్కిన్ యొక్కయు, సంఘలోపముల నచయుఁడై ఖండించిన కాగ్లైలు యొక్కయు వాక్యములు 'ఆర్' నాల్డుని మతమునకు వ్యాప్తిగల్గిం చెను 'రస్కిన్ కాగ్లైలు లిరువురును నాంగ్ల దేశమునం బ్రకృతిశాస్త్ర విజృంభణము వల్ల నీతి యడుగంటుచున్న దని భయపడి దేశ క్షేమమునకై నీతి వాదమును సమర్థించుచుఁ గొంచె మత్యు క్తి దోషమునకు సహితము పాల్పడిరి. ఫోన్సున సెయింట్

బ్యూపండితుఁడును, జర్తను దేశమున గీతేకవియు, నమెరికా దేశమున యమర్సన్ పండితుఁడును, సొంగ్ల దేశమున నార్నాల్డు కార్టెల్, రస్కిన్ ప్రభృతులును బ్రపంచమున ననఁగాఁ బ్రకృతిశాస్త్ర విజృంభణమునను, ధనమత్తతవలనను నీతివిదూర మయిన పాశ్చాత్య ప్రపంచమున నీతియుగమును స్థాపింపవలయు నని చాలఁ బ్రయత్నించిరి. కాని వారియత్నములు చిరస్థాయిగ నుండుఫలితమును బడయఁజూలకపోయెను.

7. స్విన్బర్ను వర్గమువారిమతము, “కావ్వము నీతిబాహ్యముగఁగూడ నుండవచ్చును.”

పై వా రంతరించినతోడనే రోజటీ, స్విక్ బరన్, స్టీవెన్ సన్, ఆస్కార్ వైల్డు మొదలగు విమర్శకులు బయలు దేరి కావ్యమునకును, నీతి కిని సంబంధమే లేదనియుఁ, గవి సర్వస్వతం త్రుఁడనియుఁ, 'గావ్యమున న న్వేషింపఁదగినది రస మే కాని నీతియు ధర్మమును "గావనియుఁ, గావ్యము రసవంతముగ నున్న చో నీతి బాహ్యముగ నున్నను దప్పులేదనియు శాసించి నిరంకుశమగు రసికమతమును స్థాపించి నీతిపథమును నడుగంటఁ దొక్కి 'ఆర్నాల్డు' ప్రభృతుల యాశయములను భగ్నములఁ గావించిరి. తత్పలితములుగ ననేకములగు మధురగీతములు వెలసినవి. కాని నీతియుత మై సర్వలక్షణశోభితములగు పెద్కావ్యములు బయలు వెడలవయ్యెను. స్విస్ బరన్ మొదలగు సాధునికాంచ్లో యకవు లెల్లరును నీతి యప్రధానముగ నున్న విషయములఁ గూర్చియే కవిత వ్రాసి కీర్తిగడించిరి. కాని, నీతి ప్రథానవిష యముగఁ గొని కావ్యరచనకుఁ గడంగ రైరి. ఫ్రాన్సు దేశము నను సౌందర్యారాధనము మెండుగఁ గవులు కావించిరి. కొని కావ్యమున నీతికిఁ బ్రాధాన్యము నొప్పుకొన రైరి. జర్మన్ దేశ కవులును నీతిదక్క నన్యవిషయము లగుబాహుబలము, జాతి బలము మొదలగు నైహికవిషయములనే ప్రధానములుగఁ గొని నీతిని గనుచూపు మేర నే నిలిపి కావ్యరచనకుఁ గడంగిరి.

8. ఆధునిక విమర్శన పద్ధతి.ప్రత్యక్ష విషయపర్ణనము, '

ప్రస్తుత ఘోరసంగ్రామమునకుఁ బూర్వము కవి యున్న దున్నట్ల నీతిధర్మ సూక్ష్మములఁగూర్చి విచారణములఁ గాలము వృథపుచ్చక ప్రపంచస్థితిని, మానవజీవితమును గన్నులఁగట్టినట్ల వర్ణింపవలయు ననియు, నీతి 'కావ్యమునఁ బ్రధానాంశము గాదనియు నిశ్చయించి, ప్రత్యక్ష విషయవర్ణనము అను సంప్రదా యమును నెలకొల్పిరి. ఈ సంప్రదాయముయొక్క ఫలితము కావ్యములయందును, నాటకముల యందును, పాటల యందును, కథల యందును, నవలల యందును విశేషముగఁ గన్పట్టెడిని. ఇంతలో ఈ మహాసిద్దాంతఫలితమో యన ఘోరసంగ్రామంబు. సంప్రాప్తించె.సారస్వతము స్తంభించెను. ఈసంగ్రామ ప్రళయము నుండి యాంగ్లేయ సారస్వత మేరూపముతో బయల్వెడలునో యూహించుట పుట్టనిబిడ్డకు బేరుపెట్టఁ జూచుటయే యగు.

9. రవీంద్రునివర్గమువారిమతము, 1 1 "నీతి జావ్యమున ధ్వనిమాత్రముగ నుండును.” ,

యుద్దమునకుఁ బూర్వమే యాధునిక భారతీయకవిశిఖామణి యనందగు రవీంద్రుఁడు కావ్యము నీతి ప్రధానము గాక పోయినను నీతిబాహ్యము మాత్రము కాఁజాలదని తనకావ్య ములను నీతి ధ్వనించునట్లుగనే వ్రాసెను. వానిని జదివిన కొంత మంది యాంగ్లేయకవులును ముఖ్యముగ ఈట్స్ మొదలగు


నైరీష్ కవులును, దిరిగి నీతియుగమును గావ్య ప్రపంచమున స్థాపింతు రేమో యనునూహ పొడముచున్నవి.

మస్లీమ్ వాయము. రూబయత్తులను కావ్యములస్వరూపము. - సుధీకవుల పద్దతి నీతికిని రసమునకు సమన్వయ మనఁదగును.

ఇంక మహమదీయవాగ్మ యముఁగూడ నించుక స్థాలీపులా కన్యాయమున నవలోకింతము, ముస్లిమ్ కవులలోను గోంతమంది ప్రాయికముగ నీతి బోధనం గావించిరి. సాధారణముగ. రూబయత్తులు---అనఁగాఁ 'గెంపులదండలు' అను కావ్య రూప ముల ముస్లిమ్ కవు లుపమానోపమేయముల సాధించి నీతి బోధనఁ గావింపఁజూచిరి. వీగలలో ఓమార్ ఖయమ్, జలా లుద్దీన్, సౌదీ, మొదలగువారు ప్రముఖులు. వీరును బ్రాయిక ముగ నీతిబోధనఁ గావించిరని నిర్ధారించుటకు వీలు లేదు. ముస్లిము 'లెప్పుడును రసప్రవృత్తి. గలవారే. వారిజీవితము ద్రాక్షారసము, హుక్కా, ఉద్యానవిహారము, పుష్పధార ణము మొదలగు మనోహర విషయములచే రసవంతముగ. నొనర్పఁబడుచుండును. అందుచేఁ బాయికముగ నీతి బోధనఁ. గావింపఁజూచిన పాఠకులు మన్నింప రనుభయమునం గవులు మనోహర విషయములను గూర్చి వ్రాయుచు మానవునికి సంతోసమొనఁగూర్చు విషయముల విసర్జింపక సర్వమును భగవ త్పరముగ నన్వయించుటకు నపకాశముఁ గల్గించుచుఁ గావ్య, మును రసవత్తరముగను నీతి ధ్వనించు నట్లుగను వ్రాసిరి. ఇట్టి కవులు సాధారణముగ సుఫ్వీమతమునకుఁ జేరినవార లై

యున్నారు. హపీస్ జేబ ఉన్నీసా మొదలగు కవి శ్రేష్టు లెల్లరును నీ సుఫ్వీసిద్దాంతమును కొంచెముగనో, గొప్పగనో గౌరవించి కావ్వరూపమునఁ బరిణమింపఁ జేసిరి. కాని రసజ్ఞులగుటచేఁ జప్పిడి నీతి వాక్యములట్ల రచింపక పైకి రసాత్మకముగను నీతివిదూర ములుగసు నుండి నీతియు, భక్తియు ధ్వనించు చుండునటుల గావ్యముల రచించి వివాదములబారి నుండి తప్పిం సుగొనిరి. వీరినిగూర్చి వేటొకచో సోదాహరణముగఁ జర్చిం చెదను.

కావ్యమున నీతధ్వనిమాత్రముగ నుండవలెను.

ఇంత పఱకుఁ దేలిన దేమనఁగాఁ గావ్యమున నీతి ప్రధా నాంశము గాదనియు, ధ్వని రూపమున మాత్రమే యుండఁదగు ననియు, నీతిబాహ్యముగ నుండఁదగదనియుసు. కావ్యమున నీతి ధ్వనించుచున్నంతవఱకుఁ గావ్యయము మానవ కల్యాణమునకుఁ దోడ్పడుచునే యుండును, కాని నీతిబాహ్య మైన తోడనే కావ్యము లోకమునకుఁ గీడు నాపొదింప జూలును. కాని యెయ్యది నీతి బాహ్య విషయమో యెయ్యది కాదో నిర్ల యిం చుటకుఁ గొంచెము సూక్ష్మబుద్ధి యుండవలయును.

కావ్యమునకు విశిష్ట నీతిధర్మము లే వర్తించును.

కావ్యసృష్టి కావ్య ప్రపంచమును గవి కపోలకల్పితములు గావునను, స్వతంత్ర ప్రతిభం గలవి యగుటను,సామాన్య ప్రకృతి కివ ర్తించు నీతినియమములు కావ్య ప్రకృతికి వర్తింపవు. కావ్య ప్రకృతి. కనుగుణములగు విశిష్టధరములును నతీత నీతినియమములును మాత్ర మే కావ్యమునెడ వర్తించుసు. ఉదాహరణములుగ రాధామాధవ, చిత్రాంగిసారంగధరుల ప్రణయ వ్యాపారములను సూచించితిమిగదా, కావున సూక్ష్మ పరిశీలన

చేయనిది కావ్యము నీతిబాహ్యమో కాదో యనునంశము నిర్ధారణఁగావించుట యెంతయుఁ గష్ట కార్యము. నీతివిషయిక ప్రశంసం గావించుట ముండ్లపొదను గదలించుటం బోలిన దే! కావున "కావ్యమున నీతి ధ్వనిమాత్రముగ నున్నఁ జాలునని సమయముదక్క నన్యనియమముల నేర్పఱచుట వ్యవహారలక్షణము గాదు. ఏలననఁ దీరనిచిక్కులు కల్గును.

కావ్యమునకును, వేదాంతమునకునుగల భేషము. వేదాంతమునకు నీర్వి - కారతయు, బుద్ధిని శేషమును నావశ్యకములు. కావ్యమున భావోద్రేకమును, చిత్తవికారములును నావశ్యకములు.


ఇఁకఁ గావ్యమునకును, 'వేదాంతమునకును నెట్టి సంబంధము? వేదాంతశాస్త్రమన నేమి? దృష్టి గోచరంబగు నీ ప్రపంచ. మునకంతయు మూలాధార మనఁదగు పరతత్త్వమును గూర్చిన విచారణయే. వేదాంతి చిత్తవిశారాది చేష్టలకు లోబడక యతీంద్రియుఁడై పరతత్త్వము నిశ్చలమగు యోగై కదృష్టితో బరిశీలించి మానవులకు వ్య క్తము గావింపఁ జూచును. కానీ, కవికి చిత్తవికారాది చేష్టలును, నింద్రియ వ్యాపారములును. గావ్యరచనకు ముఖ్య విషయము లగును. కవికీ రాగము, నభి మానము, భావోద్రేకము మొదలగు చిత్తవికారములు లేనిది కవిత ప్రభవించుటయే దుస్తరము. వేదాంతి సిద్ధాంతము మూలమునను, నిశ్చల ధ్యానము మూలమునను, జ్ఞానయోగ ముమూలమునను, సాధించు పరతత్త్వజ్ఞానము కవి భక్తివల్లను, రసముపల్లను సాధించి పరమార్థతత్త్వమును శుద్ధసిద్ధాంత రూపముగ గాక రమణీయమగు నాలంబముగఁ బ్రదర్శింప గలుగును. కావున వేదాంతికిని కవికిని నిరీక్షణ మొకటియే యని యొప్పుకొందమన్న ను సాధనములును, మార్గములును 'రెంటికిని 'భేదించును,

మతమునకును, కావ్యమునకును గలసంబంధము. 1. మతము కావ్యమునకు వలయు విషయసామగ్రిని - సేకరించి యిచ్చును. 2. కానీ మతమునకు సమష్టి మానవశ్రేయమే లక్ష్యము; కావ్యమున వ్యక్తి యొక్క రస ప్రవృత్తియే లక్ష్యము,

ఇఁక మతమునకును గావ్యమునకును గలసంబంధ మొక్కింత యరయుదము. కావ్యమునకుఁ గావలసినవిషయము లను మతవిషయిక గ్రంథములు సమకూర్చుననుట యేల్లరకును దెలిసినవిషయమే. మతగురువులయద్భుతచరిత్రములును, బండుగులకు సంబంధించిన కథలును, వ్రతములు నోములు మొదలగు వానికి సంబంధించిన కథలును గావ్య విషయము లగుననుట నిశ్చయమే. అయినను గావ్యమునకును మతమునకును నిరీక్షణ మున భేదము గలదు. మతము జీవితమున సామరస్యము నెల కొల్పుటకును, బరతత్త్వజ్ఞానము కరతలామలక మగుటకు వలసిన నిష్ఠను విధించుటకొరకును నేర్పడినది. అందుచే సమష్టి మానవ శ్రేయమే మతమునకుఁ బ్ర ధాసనిరీక్షణము. కావ్య మునకన్న నో వ్యక్తియొక్క స్వాతంత్ర్యమును, రసప్రవృత్తి యును బ్రధాననిరీక్షణములు. మతము విధుల ననుష్ఠించుట వలన జనులు జ్ఞానలబ్ధికిఁ దగియుందురని చూపును. కావ్యము రాగాధిక్యముచే, రసప్రవృద్ధి చే, భావతైక్ష్ణ్యముచే మాన సిగో త్తేజముఁ గలించును. కాని మతమునను సన్ని విధులను బ్రతిబంధక మాత్రముగ నుండిన మతముపట్ల జనుల కాదరము సన్నగిల్లు ననుభయమున మతకర్తలు పండువులు, వ్రతములు, నోములు మొదలగు సామాన్యజనోపయోగకర ములును, సామాన్య జనాంగీకృతములును నగు పద్ధతుల నేర్ప జచి మతమును గొంచెము రసవంతముగను; నాకర్షణశక్తిమంత ముగను జేయనెంచిరి. కవికి మతమునకు సంబంధించిన వివాద ములును, గర్మలును, సిద్ధాంతములును, వర్ణనయోగ్యములు గావు.

కవి మతవిషయములలో రసవత్తరములగు - వానినే సంగ్రహించును. కావున మతము కావ్యమునకు సాధనమాత్ర మే యగును.

మతమున నుండు మనోరంజకవిషయములను మాత్రమే కవి సంగ్రహించి స్వీయ పద్ధతి ననుసరించి కావ్యమున వర్ణింపఁ జూచును. కావున మతవిషయము "కావ్యమున నుపొంగము గను సాధన మాత్రముగను నుండఁదగునని నాయాశయము, కావ్యముల కుపయోగించునది మతమునందలి యాచార వ్యవహారములు గాక జనసమ్మతములగు విషయములే యనితెలిసికొనఁదగు. కావ్యమునకును మతమునకును బలవద్విరోధముమాత్రము లేదు. అనేక సమయముల గొప్పగొప్పకవులు మతాభిమానమును రసమును సమన్వయము చేసి చక్కని కావ్య ములను వ్రాసియుండుటయే యిందులకు నీదర్శనము. భక్తిగీతముల రక్తి మొలవఁ బాడిన తుకారాం, రామదాస్, చండీదాస్, కబీరు మొదలగు భక్తు లెల్లరును సకలకావ్య లోకవంద్యులు,

ఈవిషయమున భక్తికవిత యనుప్రకరణమున విపులముగఁ జర్చించెదము.

సారాంశములు: 1. కావ్యమునకు రసమే ప్రధానము 'రసాత్మకం వాక్యమ్' అనుసూత్రమును, మమ్మటుని 'నియతికృత నియమరహితాం' అనువ్యాఖ్యానమునునాదరణీయంబులు.

కావునఁ దేలిన దేమనఁగాఁ గావ్యము స్వతంత్ర సృష్టి యేకాని పారతంత్ర్యమును సహింపదనియుఁ, గావ్యమునకు రసమే ప్రధానముగాని యన్య విషయములు గావనియు, నెన్ని విషయములయినను గావ్యమున సాధనమాత్రములుగ నేయుండ వలయుననియుఁ గావ్య గీసమనఁదగు రస ప్రవృత్తికి భంగము కల్గింప రాదనియు నే! మొట్టమొదట మన ముదాహరించిన నిర్వ చనములలో విశ్వనాథుని 'రసాత్మకం "వాక్యం కావ్యం' అను వాక్యమును బండిత రాయల 'రమణీయార్థ ప్రతిపాదళళ బ్దః కావ్యం” అను వాక్యమును దండికవి శ్రేష్ఠుని 'ఇష్టార్థ వ్య వచ్ఛిన్నా పదావళీ కావ్యం' అనువాక్యమును నించుమించు సమానార్థ కము లనఁదగి యుంటచే వీనిలో నెల్ల 'రసాత్మకం - వాక్యం కావ్యం' అనువిశ్వనాథుని వాక్యమునే కావ్య నిర్వచనముగ నంగీకరింపఁదగునని మామనవి. మమ్ంటుని “నియతికృతనియమ రహితొం హ్లాదై కమయీ మనన్యపరతంత్రాం, నవరసరుచి రాం నిర్మితి మాదధతీ భారతీ కవే....”అనువాక్యమును 'రసాత్మకం వాక్య'మ్మను నిర్వచనమునకు సంపూర్ణ వ్యాఖ్యానముగ నంగీక రింపదగును. మమ్మటుడు సామాన్య నియమాతీత స్వభావము,


దై కమయత, స్వాతంత్ర్యము, అనన్యపారతంత్ర్యము, రసబంధురత్వము గావ్యమునకు ముఖ్య లక్షణములుగ శాసించి రసాత్మకం వాక్యం కావ్యమ్' అను నిర్వచనమునకుఁ గల పరిపూ ల్లాన్వయమును విశదపఱచినాఁడు. ఇంత వఱకును, విశ్వనాథుని, నిర్వచనమును, మమ్మటుని వ్యాఖ్యానమును, గావ్యలక్షణ ములలో నెల్ల సమంజసములుగ నున్న వని యెప్పుకొనక తప్పదు.

ఆధ్యాత్మిక కావ్యమతము.

కాని యాధునిక కావ్య ప్రపంచము నాథ్యాత్మికపథము నకుఁ ద్రిప్పఁజూచు విమర్శకులు కొందఱు బయలువెడలు చున్నారు. వీరిలో నెల్ల నానంద కుమారస్వామిగారును, యోగి సత్తముఁడై భారత భాగ్య నిధానమనఁదగు నరవిందఘోషు, గారును, భారతీయ కవికులతిలకుఁ డసందగు రవీంద్రనాథ శాకూరుగారును ముఖ్యులు. వీరలమతమును ప్రస్తుతము సంగ్రహముగసు ప్రసక్తిగలిగిన చోట విపులముగను దెల్పెదను.

ఆనందకుమారస్వామి, కావ్యము -. ఆధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము. )

ఆనందకుమారస్వామిగారు గొప్ప శిల్పతత్త్వవేత్త. భారతీయ శిల్పమును గూర్చి యభిప్రాయ మీఁగలయధికారి. భారత. శిల్పతత్త్వమును సూచించుచుఁ బ్రసంగవశమున వీరు కొవ్య: తత్త్వమునుగూడ నిరూపించిరి. వారిమత మేమన? భారతజాతి, యాథ్యాత్మికదృష్టి బలమున శుద్ధసత్యమును గ్రహింపఁగలిగే ననియు, మానవజీవితపరమావధి భగవంతునితత్త్వమును శక్తిని, గ్రహించుటయే యనియుఁ, గాప్యములను శిల్పములను జిత్ర, ఆంధ్ర కవిత్వ---5


పటములను నెల్ల విషయము లాథ్యాత్మిక దృష్టితో వర్ణింప బడవలయుననియుఁ, గావ్యము శిల్పముఁ జిత్ర రచన మొదలగు వానియందలి రస ప్రవృత్తి యాధ్యాత్మికతత్వమునకును, ఆధ్యాత్మికశక్తికిని, ఆధ్యాత్మిక తేజమునకును, సంజ్ఞామాత్ర, కముగను, ఉపాధి మాత్రముగను నుండఁ దగుననియు, రస ప్రవృత్తి తనంతటఁ దాను మానవునకుఁ బ్రధాననిరీక్షణము గాఁదగదనియు, నాత్మకు జీవుఁడుపాధియగున ట్లాధ్యాతి కజ్ఞాన మునకు రసప్రవృత్తి గలకళలు సాధన మాత్రములు సంజ్ఞా మాత్రములును నుపాధిమాత్రములును నగుననియే వీరిమతము.

భారతచిత్ర శిల్పములసిద్ధాంతము.

ఈమతమును బురస్కరించుకొని వీరు భారతశిల్పమును విమర్శించుచు నాధ్యాత్మిక జ్ఞానోపలబ్దికి సోపానము లనందగు భగవదవతారములను, వానియొక్క లీలలను, శక్తులను, ప్రదర్శించు శిల్పములనే యుత్తమములని యంగీకరించి, యయ్యవియే యాదర్శ ప్రాయములనియు శాసించి, యెల్లోరాగుహ అజంతా, కార్లీ మొదలగు గుహలలోని శిల్పములను, నందు ముఖ్యముగ నటరాజ, కాళీ, థ్యానిబుద్ధ "మొదలగువి గ్రహముల యాథ్యాత్మికశక్తి ప్రదర్శనమును " నాధ్యాత్మి కజ్ఞానోత్తేజక ప్రతిభయును బ్రశంసించి, ప్రసంగవశమువఁ గావ్యమునకును నట్టి మహద్విషయములే యాదర్శ ప్రాయములని నిరూపించిరి. చిరకాలమునుండియు విదేశమున నివాసముగ నుండిన, కతముననో యేమో వీరు భారత సాంప్రదాయమును సర్వతో ముఖముగ ననఁగా నందలి దేశ కాలప్రాంతానుగతములగు యవలక్షణములతో సహితము సమర్థింపఁ జూచుచు నూత

నాళయములపట్లను, కాలస్వభావానుగతములగు మార్పుల పట్లను నిరాదరులై యున్నారు. కాని, _ వీరి ప్రధానసిద్ధాంతము కొంతవఱకు సమర్థనీయమని యొప్పుకొనక తప్పదు.

2. అరవిందఘోషం. ఆధ్యాత్మికళ క్తియే భారంతీయుల సర్వస్వము భారతధర్మస్వరూపము. ,

అరవిందఘోషుగారు మొట్ట మొదట రాజకీయవిషయ ములఁ గూర్చి విశేషముగ వ్రాయుచు పానీని భారతధర్మము 'ననుసరించి సమన్వయముఁ జేయఁజూచిరి, భారత దేశ మభివృద్ధి "నందవ లేననిన యుగయుగములనుండి వచ్చుచున్న భారతధర్మము మూలసూత్రములకు భంగము లేకుండ ననుష్టింపఁబడవలయు సనియు, భారతశక్తి స్వతంత్రశక్తిగఁ బ్రజ్జ్వరిల్లి కాలమహా శతో సరిసమానముగఁ జేతులఁ జేతులు గలిపి కొనుచు స్నేహభావముతో సంచరింపవలయుననియు వీరు బోధించుచున్నారు. ఈభావమును బురస్కరించుకొనియే స్వదేశీ వ్రతమును, స్వరా జ్యూదర్శమును, స్వధర్మనిరతీయు వారు ప్రజలకుఁ బత్రికా ముఖమున నిరంతరము నుపదేశించుచుండిరి. వారియుప దేశ బీజ ములు భారతభూమిని దిట్టముగఁ నాటుకొని మన ప్రస్తుతాభి వృద్దికిఁ గారణభూతము లయినవి. వీరికి దాస్యము గిట్టదు. స్వాతంత్ర్యరక్తి మెండు. కాని పరులతోడి విరోధమునుగూడ సాధ్యమయినంతవజకు నవసరము లేదు. ఆనఁగా భారత దేశ మునకుఁ బర దేశముల సంసర్గము మేలుగ నున్నంతవఱకుఁ గూడుననియు, గాలశక్తిసంచారమును నిరోధింపఁ జూడరా దనియు, స్వదేశ స్థితిగతులకును, స్వధర్మమునకును, ననుకూలము లగు మార్పులు జరుగుచునే యుండవలయుననియు, నట్లు జరుగ

నిచో జాతియాన్నత్యము స్తంభించి జాతీశ క్తి ఘనీభవించిపోవు ననియు వీరి రాజకీయమతము. ఈ రాజకీయమతముఁ బురస్కరించు కోనియే వీరు కావ్యసృష్టి స్వభావమును నిరూపింపఁజూచిరి.

భారతీయకావ్యధర్మము. కావ్యము మానవాత్మ, ప్రకృత్యాత్మ, ( పరమాత్మలకుఁ గలసంబంధమును వర్ణించును. )

"ఆర్య' పత్రి కలయందు 'భవిష్యత్కవిత్వ' మసువిషయ మునుగూర్చి వ్రాయుచు భారత కావ్యధర్మమును వీరిట్లు నిరూ పించిరి... "కావ్య మాత్మానుభవప్రకటన మేకొని బుద్ధివి శేష సూచకము గాదు. కావ్యము మానవాత్మకును, బ్రకృత్యాత్మ కును, బరమాత్త కును గల యనిర్వాచ్యము నగమ్యగోచర మును నగుసంబంధమును వ్యక్తీకరింపఁ జూచును. . వేదమత మునఁ బర బ్రహ్మ వాజాత్ర మున లోకముల నెట్లు సృజిం చెనో, యడ్లే కవియును గావ్యమువలనఁ గొద్దిగఁగాని, గొప్పగఁగాని, శకలములుగఁ గాని, యఖండముగఁగాని, జీవములతోడను, వస్తువుల తోడను, ననుభవములతోడను గూడుకొనిన మనో ౽ంతర్గర్బిత ప్రపంచమును సృష్టించును. సృష్టియెల్లను గొప్ప, మాయ, అందలి బాహ్య విషయములు మాత్రమే విచారణసుల భము లగును. కావ్యసృష్టియు నిట్లే. కవి తనమంత్ర ప్రభా, వము నెఱుఁగనిమాంత్రికుఁడు. కావ్య నిర్మాణశక్తియు నాత్మాను భవమే కాని బుద్ధి చాతుర్యము గాదు. కవి యాత్మశక్తిపరి పూర్ణుఁడై మనస్సు ద్వారా 'శావ్య నిర్మాణమునకుఁ గడంగి యా "ధ్యాత్మి తానుభవమువలననే తన కావ్యశోభకు సంతసించుచు మనలో లగూడ సంతసముఁ బురిగొల్పును.

కావ్యశక్తియే వాగ్గేవి యనఁదగును.

కావ్య మొకశక్తిగ భావించి మన వేదయుగమునాఁటి ఋషులును, దత్త్వవేత్తలును గొవ్యశక్తికి వాగ్గేవీనామమిడిరి. తాంత్రికులును వాక్శకి మనలను న నేకవిధముల సంచలింపఁ జేయునదిగ నిరూపించిరి. కవి యాథ్యాత్మికదృష్టి బలమున నాధ్యాత్మికశక్తిని, నాథ్యాత్మిక భావములను, నాధ్యాత్మిక ప్రపంచమును సాక్షాత్తుగఁగన్నులఁ దిలకించిన వానిరీతిని వర్ణించి ప్రదర్శించును. "కావ్యశక్తి బుద్ధిబలమున కతీతమగును. ప్రపం చమునను, బ్రకృతియందునను, మానవ జీవితమునను నంతర్గర్బి తమై నిబిడ మై యున్నయా ధ్యాత్మికశక్తిని రసవంతమును బరీ స్ఫుటమును సనీరుద్ధ్యమును నగువాక్కున కవి వర్ణించి ప్రద ర్శింపఁజూచును.

'తాంత్రికుల'మతము, 1 'పశ్యంతీ' శబ్దప్ర యోగము దాని భావము.

ఈవాక్కును దాంతికులు 'పశ్వంతి' యనుపదమున సూచించి కావ్యశక్తి యొక్క పరిమితిని సూచించియున్నారు. ఈ భావముఁ గొంచెము విప్పి చెప్పిన నిట్లుండును. కవికి విషయ సాత్కారముతోబాటు వాగ్గేవీసాలు త్కారము ననఁగాఁ బదసాక్షత్కారమును గలుగని, యుత్తమకవిత జనింప "నేరదు. దీనిభావము కవి పదసాక్షాత్కారలబ్దములగుమాటలం ధక్క. సన్యమార్గలబ్దములగుననఁగా నిఘంట్వాదిమార్గము లచే లబ్దములగు పదములఁ గవిత చెప్పఁదగదనియు, నట్లు చెప్పినకవిత యుత్తమకవిత గాదనియు విదితమగు చున్నది, కావ్యమువ సాక్షాత్కృతవిషయమునకును, భాషకును వికల్ప ముగాని, భేదముగాని యుండఁదగదనియు, రెంటికి నవీనా భావసంబంధమును బరివూర్ణైక్యమును నుండవలయుననియు. వీరిమతము.

కావ్యశక్తిజన్మ ప్రకారము.

కావ్యశక్తి సాధారణబుద్ది కతీతమగు సంత రాత్మ వలన జనించుచున్నది. ఆయంతరాత్మ యాధ్యాత్మిక ప్రభావ మున వస్తువులఁ దిలకించి యందలి యలౌకిక ప్రభను, నుత్తేజక శక్తిని పొత్కృతమును నా థ్యాత్మికశక్తిసూచకమును నగు. సరసవాక్కులఁ బ్రదర్శించును. అంతరాత్మ బుద్ధి యహంకారము మొదలగు మానవశక్త్మును వశముఁగొని కావ్యసృష్టికిఁ గారణ భూతమగుచున్నది. ఈయంతరాత్త శక్తి ప్రభావమున 'మెద డును, హృదయమును, నాళములును గంపితములగుచున్నవి.

వైదిక ద్రష్టల కావ్య నిర్వచనములు. 

వైదిక ద్రష్టలు కావ్యమును 'సదనాదృతస్య ' నునఁగా “సత్యజన్మ స్థానాగత' మని వక్కాణించి కావ్యము బుద్ధికి సతీత మగు సంత రాష్ట్ర ప్రభావమున జనియిం చుసని నిర్దేశించిరి. జాగ్రూపమునఁ బరిణమించుటలో నీవిషయసాక్షాత్కారము నకుఁ గొన్ని మార్పులు గలుగుచున్నవి. అనేకములగు ససంగతవిషయములు పెల్లు వెల్లువగ మనకుఁ దట్టుచుండును. వానినెల్లం బరిశీలించి భావమునకును, వాక్కునకును సనిరుద్ధ్య సంబంధ మును గల్పించుట మనపని. వాక్కు అంతరాత్మ నుండి రహస్యం ముగ వచ్చి మనలోఁ బాతుకొని యుండును. అట్లు పాతు కొనియుండిన వాక్కును గవిత్వోద్రేకమునను భావోద్రేకము నను మనము మార్పు చేయువిషయమును వైదిక ద్రష్టలు

'హృదా తష్టం మనీషా' యను వాక్యమున సూచించియున్నారు. ఈ కావ్యశక్తి ప్రవహించుటకు మనయంతరాత్మయే మార్గము. ఈశక్తి మనలో గర్బితమై నీబిడమై యుండి యప్పుడప్పుడు కొంచెముకొంచెముగ మనకు వ్యక్తమగు విషయమును వైదిక ఋషులు 'నియతం గుహాయాం గుహాహితం గహ్వరేజిస్టమ్' అనువాక్యమున సూచించియున్నారు.

కవికీ కావ్యశక్తిసాక్షాత్కార మవసరము.

ఈనిబిడశక్తిని మనము బాగుగా గ్రహించి తత్సాక్షాత్కార బలమునఁ గవితఁ జెప్పనచో నయ్యదియే యుత్తమకవి తగాఁ బరిణమింపఁగలదు. అట్టియాత్మ సాత్కారము లేనికవి బుద్ది చాతుర్యమును మాత్ర మే ప్రదర్శింపఁ గలుగును. ఇట్టిసాక్షాత్కారజనీత కవిత్వమును గొందఱు కవులు కోలఁదిమాత్రముగఁ బ్రదర్శింపఁ గడంగుచున్నారు. అట్టివారలలో నైరిష్ కవులును, రవీంద్రనాథ ఠాకూరును, హరీంద్రనాథచట్టోపాధ్యాయులును, సరోజినీ దేవియును నెన్నఁదగినవారు. కాని యింకను విషయ మునకును, బదములకును గల యనిరుద్యసంయోగము దాప రించలేదు.

ఆధ్యాత్మికశక్తి ప్రదర్శకములగు నుత్తమ కావ్యములే కవిత్వపరమావధి యగును.

"అట్టిసంయోగము భావమునకును, భోషకును నేనాడు గుదురునో యానాఁడే యతీత ప్రతిభావంతమును, నాధ్యాత్మిక శక్తియుతమును నగు దివ్య కవిత యుద్బవింపఁగలదు.” పై వాక్యములఁ జెప్పిన యరవిందుని కావ్యమతమునకుఁ గలచిక్కులును సందేహములును సూచించి వాని నభూతము

లని నిరసించి స్వీయమతమును వ్యాఖ్యాన పూర్వకముగ నర విందుఁడే సమర్థింపఁ జూచెను.

ప్రజ్ణా పురాణీ' అనఁబరగు భారతశ కి.కొన్ని శంకలు.

అరవిందుఁడు పునరుజ్జీవితమయిన భారతశక్తి, ప్రజ్ణా పురాణీ యని ప్రస్తుతిఁగన్న ప్రాచీన భారతశక్తి ననుసరించి యాధ్యాత్మిక ప్రభావముఁ గలిగియుండవలయునని నిర్దేశిం చెను. కాని "కావ్యమున నాధ్యాత్మికశక్తి యెటులు ప్రభ విల్లును? కావ్యమునకు నాధ్యాత్మికశక్తి వలన నేమి ప్రయో జన?"మనుచుఁ బాగ్చొత్య నాగరకతా సాంప్రదాయములఁ బెరిఁ గినవా రడుగుదురు. పాశ్చాత్యులకు మతమును, నాధ్యాత్మిక జీవితమును నొకటిగను, బుద్ది చాతుర్యమును బాహ్య జీవిత మును వేరొకటిగను నుండుననియు,వొక్కొకదానికిఁ బ్రత్యేక నియమములు గలవనియు, వానియనుసరణ మే సిద్ధికిఁ గారణ మగుననియు మనకుఁ దెలియుచున్నది. అంతియళాక 'ప్రజ్ఞూ పురాణీ' ననుసరించి యాధ్యాత్మిక జీవితమునే యాలంబముగం గొని ప్రకృతిశాస్త్రము లాది గోఁగల సాధనముల చే విజృంభించు చున్న నవీన కాలశక్తిని నిరోధింపఁదగునా? యనునింకొక ప్రశ్నము కలుగుచున్నది. వీనికిఁ దగురీతి సమాధాన మీయందగును,

ఆధ్యాత్మిక జీవితస్వభావము.

ఆధ్యాత్మి కజీవితమునకును,సర్వసంగపరిత్యాగమే ప్రధాన థికము సమునకును ముదు. కాలమున నట్టి యపోహ' మప్పటి స్థితిగతులమూలమున జని

యించియుండు నేకాని యాధ్యాత్మిక జీవితమునకును సన్న్యాసమునకును నెట్టినిసర్గ సంబంధమును లేదు. ఆధ్యాత్మిక జీవితము సకును, బ్రత్యేకమత సిద్ధాంతములకును సంబంధ " మంతగా లేదు. ఆధ్యాత్మిక జీవితము సామాన్య మతసిద్ధాంతములను, మతాచారములను, నతిక్రమించి వాని కతీతమయి యుండి మానవుని యందున్న పరమాత్ తతత్త్వమును గోచరముఁ గా వింపఁజూచును.

ఆధ్యాత్మిక జీవితము లక్ష్యము. శరీరము. శరీర మార్గాదులు సాధనమాత్రములు. ప్రాచ్యపాశ్చాత్య ధర్మనిరీక్షణములకుఁ గల భేదము.

ఇంతియకాక మానవ యమునకు సహాయభూతము లుగ నుండుసాధనములలో వేనికిని నాధ్యాత్మిక జీవితముతోడ విరోధ ముండదు. బుద్ధి వినా యాత్మయు, శరీరము వినా యాత్మయు నుండఁజాలవు. కావుననే బుద్దికిని శరీరమునకును బలమును దేజంబును నిచ్చి వానిపరిపూర్ణ తకుఁ దోడ్పడు సాధనములన్నియు నాధ్యాత్మిక జీవితమునకు సహాయకారు లే కాని......విరోధులు మాత్రము గావు. ఏలనన నాత్మ, బుద్ధి, శరీరము. అవినాభావ సంబంధమున వర్తించును. గమక ప్రొచీన భారత నాగరకతయందు నిట్టి సాధనములన్ని టికని నుచిత గౌరవ మొసంగఁబడియెను. కాని యిట్టి సాధనములవిషయ మునఁ బాశ్చాత్య ప్రాచ్య నాగరకతలకు నిరీక్షణమున భేద మున్నది. అది యెద్దియనఁ బాశ్చాత్య నాగరకతయందు శరీర మార్గము, ధనసంపత్తి, బుద్ధివికాసము మొదలగు విషయములు. సాధనమాత్ర ములుగఁ బరిగణింపఁబడ సాధ్య దేవతలం బోలె,

నుపాసింపంబడుటయే సంభవించి పాశ్చాత్యలోకమునఁ గొన్ని యెడల నాస్తిక మతమునకును, సర్వత్ర యనాధ్యాత్మిక జీవిత మునకును గౌరణభూతము లయినవి. భారత దేశమునందలి మహర్షులును, దృష్టలును బై వానిని సాధనమాత్రములుగనే పరిగణించి యాధ్యాతక జీవితోపలబ్దికిని ధర్మానుష్ఠానమునకును సాధనములుగ నుపయోగించిరి. 'శరీర మాద్యం ఖలు ధర్మసాధ నమ్' అనువచనమే యిందులకుఁ దార్కాణము. ఆధ్యాత్మిక దృష్టిగలవారు జీవితమునందలి సర్వోపొంగములను నాత్మోప లబ్ది కై వినియోగించెదరుగాని వానినే సాధ్యములుగ నుపా సింపరు. వారు బాహ్యసృష్టియందును, సాధారణ మానవజీవి తమునందును మానవ సంస్థలయందును గలయాధ్యాత్మికశక్తిని, దేజమును వ్యక్తముఁగావింపఁ జూచెదరు.

ఆధ్యాత్మిక కావ్యరచనాసూత్రము. "కావ్య మాధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము.”

కావ్యమున బాహ్య సృష్టియు మానవజీవితమును సాధ్య దేవతలవలెంగాక సాధనమాత్రములుగను, బరతత్త్వమున కును, నాధ్యాత్మిక ప్రపంచకమునకును సంజ్ఞారూపకములుగ వర్ణింపఁబడినచో నయ్యదియే యాథ్యాత్మికకావ్యసృష్టియగును. అయ్యది 'వేదాంతమువలె సిద్దాంతరూపమున నుండక సృష్టి రూపముననే యుండి యాధ్యాత్మిక ప్రపంచమును సంజ్ఞా రూప మున గోచరింప జేయును. కావునఁ గాప్యరసమునకును, నాధ్యా త్మీకదృష్టికిని, విరోధభావము ' లేదనియు నొండొంటికి సహకారభావ మేవర్తిల్లుననియు, నట్టిసహకారభాపము పూర్తిగఁ గుదిరిన కావ్యము లే యుత్తమకావ్యము లగుననియు, నట్టి కావ్య రచనకే 'ప్రజ్ఞా పురాణీ' సంతతి వారగు భారతీయులు చిరానుగతమగు స్వీయ కార్యధర్మమును వీడక కడంగి యాథ్యాత్మిక జ్యోతి చే నుద్దీప్మములుగాని దేశములకుఁ బ్రకాశము గూర్పఁ దగుననియు నరవిందుఁడు భారతసాహితీ కుమారుల నుద్బో ధించుచున్నాడు. - రవీంద్రుని మతమును, వైష్ణవ సుఫీ కవులమతమును. ఈయుద్బోధ ననుసరించి వ్రాసెనని రవీంద్రునిగూర్చి పలుకుట ప్రమాదము. ఏలనన నరవిందుఁడు కావ్యతత్త్వమును నిరూపింపక మున్న యెన్నో యేండ్లుగ రవీంద్రుఁ డాథ్యాత్మిక శక్తి యుక్తమగు కవిత్వమును జెప్పుచుండి నాఁడు. కాని ప్రధాన విషయముల రవీంద్రుని పద్దతి యరవిందుని కావ్య లక్షణమునకు లక్ష్యమగుచున్నది. చండీదాసు మొదలగు వైష్ణవకవుల కవిత్వ మును, సుఫీకవుల కవిత్వమును నరవిందుని కొవ్యలక్షుణమువకు సరివచ్చుచున్నవి. ఇందుఁ బరమాత్మతత్త్వము బాహ్యవస్తువర్ణ నమువల్లను, మానవ జీవితపర్ల నముపల్లను,సూచింపఁబడుచున్నది. ప్రకృతికిని, మానవునకును, బరమాత్మకునుగల యవినాభావ సంబంధ మనిర్వాచ్యైక్యము నీ కావ్యపద్దతి పరిస్ఫుటీకరించు చున్నది, ఈమహదాశయము సంపూర్ణముగ నేప్పట్ల నెవ్వరి యందునను నెఱవేఱినదని చెప్ప వీలు చాలకున్నది. కానీ కాల, ప్రభావము వలన పురోగమనముమాత్రము జరుగుచునే యున్నది. ఈపురోగమన ఫలితముగ గతానుగతీకముగ మనలను. వేధించుచుఁ దలయెత్తకుండ సడఁగద్రొక్కిన భావదాస్యమును,, లక్షణదాస్యమును, బ్రయోగమొలభ్యముని పీడ వియ్యో అయత్తమకవిత్వమును జనించి ప్రపంచమునకు భారతీయ కవితాశ క్తిని,

వ్యక్తముఁ జేయు ననునాశకు నెడముఁ గల్గుచున్నది. కావున నింతదీర్ఘ చర్చఁ జేసి తేల్చినసారాంశ మేమనఁగా:

మమ్మటుని నిర్వచనమును,విశ్వనాథుని రసాత్మకంవాక్య'మ్మను సూత్రమును నాదరణీయములు.

మమ్మటుఁడు వచించినట్లు కావ్యము నియతికృత నియమ రహితాం , హ్లాదై కమయీ మనన్యపరతంత్రాం, నవరసముచిరాం, అనువర్ణ నమునకు సరివచ్చుననియే యిప్పటికిని మామతము. ఏల నన, సౌఖ్యాత్మిక కావ్యదృష్టి,యనవసర నియమ రాహిత్యమును, ననన్యపరతంత్ర తయును,హ్లాదైకమయతను, రసముచిరత్వమును జుల్కనగాఁ జూచుట లేదు. వాటినెల్లను సాధనములుగ నుప యోగించి యతీత శోభాయుతమును నాధ్యాత్మికశక్తియుత మును నగుకావ్య రూపమునఁ బరిణమింపఁ జేయును. మమ్మటుని కావ్య లక్షణమునకు, నాధ్యాత్మిక కావ్యలక్షణమునకును విరోధ మేమియు లేనిచో విశ్వనాథుని 'రసాత్మకం వాక్యం కావ్యమ్' అనులక్షణమునకు మాత్ర, మేల విరుద్దభావము పొసఁగును? పొసఁగదని నావిజ్ఞప్తి. ఎట్లన రసమునకును, నాధ్యాత్మికళక్తి కిని స్నేహమేకాని విరోధము లేదు. కావున రసాత్మకమగు వాక్య మాధ్యాత్మికళ క్తితో విరోధమునకుఁ బాల్పడదు. ఇట “రసాత్మకం వాక్యం కావ్యమ్' అనునిర్వచనము యొక్క ప్రాతిపది కౌచిత్యమును గమనింపఁ బ్రార్థితులు.

"రసాత్మకం వాక్యం కావ్య” మ్మనుసూత్రముయొక్క ఆ ప్రాతిపది కౌచిత్యము. 1. వాక్యమ్మన వాక్శకియె.

మొట్ట మొదలుగ 'వాక్యమ్' అనుపదము వైదిక ద్రష్ట లుపయోగించిన వాగ్గేవీ 'యను పదమునకుఁ బర్యాయముగనుండి తద్భావమును సువ్వ క్తముఁగావించుచున్నది. వాక్శక్తికి మహా శక్తియని మనమహర్షులు భావించి తచ్ఛక్తికి వాగ్గేవీ యను. నామము నిడిరి. వాగ్గేవీపదనగహ్వరాంతరమునుండి యనంత ముఖములతో నఖండ తేజ!పూరంబుతో నప్రతిమాన ప్రతిభా విభవముతో, దుర్నిరీక్ష్యశక్తితో వెల్వడి వచ్చుపదమే వాక్య. మనందగును. కావున “వాక్యమ్' అనుపదము కావ్యము నాథ్యాత్మిక ప్రపంచమును సధ్యాత్మిక శక్తిని బ్రదర్శించు ప్రయోజన కారి యని సూచించుచున్నది.

2. రసము కావ్యమున కాత్మ యగును.

ఇక 'రసాత్మకమ్' అనుపదౌచిత్యమును బరిశీలింతము. కావ్యమున కాత్మ నీతి - ధర్మ- మత, వేదాంతములు మొదలగు. శాస్త్రములు కావనియు, మానవ ప్రకృతి నవలీలగ వశముఁ గావించు కొని బంతియుంబోలె పల్లవములు గుసుమములను నాడించు బాలపవనునింబోలె నాడించు గల రసమే యనియు సూచితమగుచున్న ది. ఇంతియ కాదు. రసము కావ్యమున "కొత్త యనుటలో నింకొకవి శేషార్థము స్ఫురించుచున్నది. అదేదన, . రసము కావ్య జీవ మనందగు విషయమునకే వర్తించునుగాని కల్పతములును, మార్పునకు లోనగునట్టినియు నగు కావ్యము యొక్క బహిరింద్రియము లనఁదగు భాషామర్యాదలవిషయ మున వర్తింపదని సూచిత మగుచున్నది. అందువలనఁ గావ్య బహిరింద్రియ వ్యాపారముల నిర్ణయించి శాసింపనెంచు శాస్త్ర ములఁ బ్రభుత్వమునకుఁ గొంచెముగ 'నడ్డు దవిలి కావ్యము రసజీవియై రసాత్మకమై యనన్యపరతంత్రమై ప్రభవిల్లుటకుం ________________


గారణమగు చున్నది. కావునం గోవ్యమును రసజీవిగను రసా త్మకముగను గవిని ననన్యపరతంత్రునిగను, వాక్కును 'శక్తి యుతముగను నిరూపించు విశ్వనాథుని యద్భుత కావ్యలక్షణ నిర్వచనమే సర్వత్ర యంగీకారార్హమని తోఁచుచున్నది. తుట్ట తుదకు ననేక యుద్ధముల జయించి, యనేకవీరుల నిర్జించి కావ్య శక్తి ద్విగుణీకృత ప్రతిభాయుతమై యనంత తేజోరాశియై రసా త్మకమగు వాక్యముగఁ బ్రపంచమునఁ జిరస్థాయీభావము నందఁగల్గుమహాభాగ్యముఁ బొందినది.