ఆంధ్ర కవిత్వ చరిత్రము/ద్వితీయప్రకరణము

వికీసోర్స్ నుండి

ద్వితీయప్రకరణము.


రసస్వరూపనిరూపణము.

'రసాత్మకం వాక్యం శాప్యమ్' అను కాప్య సూత్రము 'నంగీకరించిన పిదప రసమన నేమియో, ధర్మార్థ కామమోక్ష సంయుతమగు మానవధర్మమున దాని కాశ్రయ మేద్దియో, దానిస్వరూప మేమో చర్చింప నవసరము గలుగుచున్నది, ముందుగ రసమన నేమో దానియాశ్రయ మెద్దియో విచా రించి పిమ్మట కావ్యమున వర్ణితమగు రసముయొక్క ప్రత్యేక స్వరూప మెట్టిదియో తెలిసికొందము.

రస మననేమి?

రసమునకు వ్యుత్పత్తి ననుసరించి 'ఆస్వాదింపఁబడునది' 'యని అర్థము కలుగుచున్నది. స్థూలముగఁ జెప్పిన రసము మానవ హృదయముల నాకర్షించు శక్తిగల వస్తుసౌందర్యమే. ఎట్లన? నాస్వాదింపఁబడు వస్తువునందు నాస్వాదింపఁబడుట కర్హతగల గుణవిశేష ముండి తీరవలయును. ఆగుణవి శేషమువలననే మను జుఁడు వస్తువు నాస్వాదించుట సంభవించుచున్నది. కావున రసమనునది వస్తుగుణవి శేషమునకు సంబంధించిన రనుభావము స్ఫురించుచున్నది. దానికిఁ బూర్వపక్షముగ నింకొక ప్రశ్న ముదయించుచున్నది. తార్కికు లిట్టి ప్రశ్నలను లేవదీయు టలో నేర్పరులు. ఆ ప్రశ్న మేమన. 'అయ్యా! రసము వస్తుగుణ విశేషము నాశ్రయించు ననుచున్నారే! అట్లయినచో రసము వస్తువునకు విశేషణమని చెప్పందగునా? అట్లు రసము వస్తు ప్రథాన విశేషణములలో నొకటి యయినచో నారసమధికా రానధికార భేదము లేకుండ నావస్తువుం దిలకించిన సెల్లరకు నేక రీతిని దైక్ష్ణ్యమునఁ దారతమ్యము లేకుండ గోచరించునా? చదువు రానిమూడునకును, బుద్ధిమాంద్యముగల జడునకును, బ్రపంచజ్ఞానము లేని పసిబిడ్డలకును వస్తువుల నిబిడమైయున్న రసము గోచరించునా?' మీరు చెప్పినట్లు రసము వస్తువునకుఁ బ్రథానవి శేషణమేని నది యెల్లరకును గోచరింపవలదా? అట్లు గోచరించుచున్నదా? గోచరింపనిచోఁ గారణమేమి? అట్టియెడ రసమునకు భిన్నా శ్రయత్వము నాపాదింతురా?' ఈ ప్రశ్నకు సమాధాన మివలయునన్నఁ గొంచెము తర్కవిషయమున వాదము సలుపపలయును.

విశేషణమునకు విశేష్యమునకుఁ గలసంబంధము.

విశేషణ మన నేమి ? అది యెట్లు వ్య క్తమగును? విశేషణము వ్యక్తమగుట వస్తువు యొక్క స్వభాపబలముననా? లేక, యుపలకించు ద్రష్టయొక్క దృష్టి బలముననా! వస్తువును విశే షణమును వేఱుగావు. ఎట్లన! తియ్యందనము పంచదారకు విశేషణము, పంచదార నోటనిడుకొనిన నెల్లరకును దియ్యం గనేయుండును. ఒక్క సర్పదష్టులకుందక్క, ఈ భేదమునకుఁ గల కారణము సరయుదము. తియ్యఁదనము పంచదారకు విశ్లేషణ మగుటం జేసి సాధారణముగ నందజుకును బంచదార తియ్యంగ నుండునట్లు చేయును. కానీ.. సర్పదష్టుఁడై నవానియందు వ్యాపించు విషము పంచదారయొక్క తియ్యందనమును దష్టు నికి దోఁపకుండఁ జేయును. ఈ భిన్నత్వమునకుఁ గారణము విరుద్ద విషబలమే కాని వస్తువునందలి విశేషణము యొక్క సర్వ సమత్వాభావము గాదు. పంచదార యెప్పటికిని దియ్యనిదే, కాని విరుద్ద విషబలమున సర్పదష్టునికి ,బంచదార యెప్పుడును దీయ్యఁగ నుండదు. అట్లే రసము వస్తువునందు విశేషముగ నుండుననుట సత్యమ. కాని, దర్శించుద్రష్టయొక్క చిత్త పరిపాకము ననుసరించి రసము గోచరించును. చిత్తపరిపాకము లేని వారికి వస్తువులందు నిబిడ మైయుండు రసము గోచరింపదు. ఎట్లన, సర్పదష్టునకుఁ బంచదారతియ్యందనము గోచరింపని యట్ల, విశేషణమునకును, విశేష్యమునకునుగల యవినాభావ సంబంధము ద్రష్టృదృష్టి ప్రసారము లేనిది బయల్పడదు. ఎట్లనం బంచదారలోని తియ్యందనము విశేషణముగ మన మంగీకరించితి మే. ఆ విశేషణము అనఁగా నాతియ్యందనము మొట్ట. మొదట నెట్లు బయల్పడియెను?' ఎవరో యొకమనుజుఁడు నాలుక పై వై చికొని రుచి ననుభవించి తీయ్యఁగ నున్న దని చెప్పుటవలననే కదా! కానఁ బంచదార యొక్క తియ్యందనము రుచిచూచిన జిహ్వేంద్రియము లేనిచోఁ బ్రపంచమునకు వ్యక్తము కాదుగదా.

రసికుఁడు లేనిది రసము జనింపదు.

కావున రసికుఁడు లేనిది రసమసంభవమని సారాంశము. పోనిమ్ము రసికుఁడే రసమును సృష్టిం చెనందమా? పంచదార తీయఁదనమును నాలుక కనుఁగొనినదా? సృష్టించినదా? నాలుక సృష్టింపఁగల్గినచో నుప్పును దీయఁగా 'నేల చేయ లేదు? పై నఁ జెప్పిన సర్పదష్టుని సమయ మిచ్చటఁగూడ గ్రాహ్యము, నాలుక యుప్పును దియ్యఁగఁ జేయ లేనటులే రసికుఁడును, విశే షణయుక్తవ స్వభావత్వమున రసము ననుభవింప లేఁడు విశే

ఆంధ్ర కవిత్వ......6

షణము క్తవస్తువు లేనిదీ కవి శూన్యము నుండి రసమును సృష్టింప లేఁడు.

రసికుఁడు నిమిత్తమాత్రుడు.

రసికుడు వస్తువులయం దంతర్గర్బిత మై నిబిడ మైయున్న విశేషణము సొస్వాదించి రసమునకుఁ గారణభూతుఁ డగును, ఎట్లన, భూభారమును మాన్పుటకు శ్రీకృష్ణుఁ డవతరించి యుండ, జనుల ప్రాణములు దీయుటకు మృత్యు దేవత ప్రతి క్షణసన్నిహితయై యుండ, శివుఁడు త్రిశూల పాణియై మూఁడవ కన్ను విప్పుకొని మహాప్రళయమును వ్యాపింపఁ జేయుటకు సంసిద్ధుఁడై యుండ, బ్రహప్రళయానంతరము పునస్సృష్టిఁ గావిం చుటకై ప్రయత్నముల సుపాయములను నాలోచించుచుండ, సర్జునుఁడు గాండీవమండిత హస్తుండై రణరంగమున నిమిత్త మాత్రుఁడై ప్రత్యక్షముగ గాండీవనిర్ముక్త ప్రచండనారాచముల శత్రుసంహారము గావించినయట్లు నరివర్గముల ప్రాణ ములను దీసిన దర్జునుఁడు గాఁడు. పై నఁ "బేర్కొనఁబడిన మహా శక్తులే. అర్జునుఁడు నిమిత్తమాత్రుడే. నిమిత్తమాత్రుఁడనుటలోనే యర్జునుని తాత్కాలిక ప్రయోజనము స్థిరపడుచున్నది. అర్జునుఁడు ప్రత్యక్షముగ నిమిత్తమాత్రుఁడైనను శత్రు సంహా రము గావించెనని గోచరింపక మానదు. సూక్తమగ సేనఁ జంపిన మహాశక్తి యర్జునుఁడు గాఁడని తేలునుగాక! అట్లే కవియు నిమి త్తమాత్రుఁడే, వస్తువునందు లేని రసవి శేషణమును కవి సృష్టింపఁజాలఁడు. వస్తువునందంతర్గర్బితమై తనకుఁ దక్క సన్యులకు గోచరింపనిదగు రసవి శేషణమును గవి "మొట్టమొదట సనుభవించి యితరులకు వ్య 'క్తముఁ జేయును. కవి పరమాత్మ చే బత్యేక ప్రయోజన సిద్దిరోజుకు నియోగింపఁబడినవాఁడు. ప్రకృతియం దంతర్గర్భితమైన రసవి శేషణమును బరమాత్రచే నియోజితుఁడగుకవి మొట్టమొదట గని పెట్టి వ్యక్తముఁగావించును. కావునఁ గవి నిమిత్తమాత్రుఁడే రసము చిరస్థాయియే. రస మేనాఁటి కేనియు ననుభవింప బడవలసిన దే. ఏలనన, వస్త్వంతర్గతమై చిరస్థాయి సందుకతన కాని రసము ఎన్నటికయినను ఎవ్వఁడయిన నొక కవి చే ననుభవింపఁబడి వ్వక్తము గావింప బడవలసిన దే కానీ స్వయం ప్ర కౌశముగ విలసిల్ల జాలదు

రసికునకును రసమునకును గలయన్యో న్యాశ్రయసంబంధము.
.

కావున రసమునకును రసికునకును నన్యోన్యాశ్రయత్వ మున్నది. ఈభావమునే టెన్నిసన్ అనునాంగ్లేయళవి సోదరకవియగు స్విక్ బరను ప్రశంసించు సందర్భమున నిట్లు వాక్రు, చ్చెను. - నామిత్రుఁడు ప్రపంచమునెల్ల గానముగఁ బాడు వేణువు. ఇందులకు సందియము లేదు.' ఈమాటల కర్ణము కొంచెము గమనింతము! ప్రపంచముయొక్క రససంపదను వేణువుంబోలె గాన రూపమున నాకవి వర్ణింపఁగలఁడనియే. ఇచ్చటఁ గవి వేణు వెట్లు నిమి త్తమాత్రముగ వాయువునందు గర్బితమై యున్న సంగీత శక్తిని మాధుర్యవిశేషమును సంగుళీనిక్షేపమూలమున గానరూపమునఁ బ్రదర్శించునో, యట్లే తానును బ్రకృతి యందలి మాధుర్యమును గానరూపమునఁ బ్రదర్శించునని భావము స్ఫురించుచున్నది. కవికిని, రసమునకును గలయన్యో న్యాశ్రయత్వము పై యుదాహరణము వలనఁ జక్కఁగఁ దేట పడినది. కవి లేనిది రస ముండదు. రసము లేక కవి యుండ ________________


నేరఁడు, విత్తు లేనిది. చెట్టుండ నేరదు. చెట్టు లేని విత్తు లేదు. అను తర్కముంబోలె నిదియును నన్యోన్యాశ్రయత్వదోష మునకుం భాలగుచున్నది. కానీ, యన్యోన్యాశ్రయత్వ, దోష మనిరుద్ద్యము. అయ్యవి సృష్టి రహస్య వేదులకు నిశ్చయముగ దోషమునట్ల తోఁపఁదగదు. పాశ్చాత్య వేదాంతమున ముఖ్యముగను, మన వేదాంతమున నాచరణ విషయమునను (సిద్దాంతవిషయమునం గాక పోయినను), నన్వో, న్యాశ్రయము గుణముగనే పరిగణింపఁబడుచున్నది గాని దోషముగఁ బరిగణింపఁబడుట లేదు. ప్రపంచమున మూల సూత్రములన్నియు నొకదానినొకటి యాశ్రయించి యుండునే కాని పరిపూర్ణ స్వతంత్రములుగను నసంగతములుగసు నుండవు.

రస నిర్వచనము ౧, లాక్షణికమతము.

రసికునకును రసమునకును గలయన్యోన్యాశ్రయసంబంధ మును విమర్శించుటలో రసమననేమో యించుక సూచించియే యుంటిమి. ప్రకృతము రసమన నేమో సవిస్తారముగఁ జర్చిం తము. రసమనఁగ 'రస్యంత ఇతి రసా!' అనువ్యుత్పత్తి ననుస రించి యాస్వాదింపఁబడునది యని మనపూర్వలాక్షణికు లస్వయించి యీ క్రింది విధమున దానిని నిర్వచింపఁ బ్రయ త్నించిరి.

    శ్లో. విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిఖిః,
ఆనీయమానస్స్వాద్యత్వం స్థాయీభావో రసస్స్మృతః.

విభాన అనుభాష సాత్విక వ్యభిచారిభావములచేఁ దేఁబడిన మాధుర్యముగలిగిన స్థాయీభావమే రసమని చెప్పంబడినది. వేదొకచోట స్థాయీభావమే రసమని తెల్పుచు 'రసః, సవవ ________________

స్వాద్యశ్వాత్ రసికస్యేవ వర్ణనాత్' అని యొకలాక్షణికుఁడు నిరూపించినాఁడు. దీనియర్ధము రసికునిచే ననుభపనీయ మైనది యనియే. స్థూలముగ దీనియర్ల మేమన రసికునిచే సను భవింపఁబడిన భావమును నవఛయు రససూచకము లగుననియే. ఈనిర్వచనమున రసికునివర్తనమునకు ననఁగా రసికునియను భూతికిఁ బ్రాధాన్య మొసుగంబడినది. ప్రకృతియొక్క గాని మానవజీవితముయొక్కగాని సందర్శనమువలనఁ గవియందు జనియిం చెడు స్థాయీభావమే రసమగుచున్నది. అదియెట్లనఁ, దైనపస్తువునందు రసవిశేషణమును, రసికునియందుఁ జిత్తపరి పాకమును బ్రాయికముగ నుండి రసమునకు జన కారణములగు ననీ తెల్పియుంటిమి?

రస' జన్మ కారణములు ౧. రసికుని జనాంతర లబ్ద సంస్కారము 2, వస్తువుల నిబిడ మైయున్న రస విశేషము.

'ఆభావమే యిచ్చట విప్పి చెప్పిన నిట్లుండును. కవి యేదేని వస్తువునుగాని, యవస్థముగాని దర్శింపక యుండఁడు, అట్లు వస్తువులను మనుజుల జీవితములయందలివివి థావస్థలను దర్శించు 'కవి గ్రుడ్డివానివ లేఁ గన్నులు మూసికొని గుడియెద్దు చేలోఁ బడి సంచరిం చురీతి' దర్శింషఁడు. జన్మాంతర లబ్దమైన దివ్యదృష్టితో సనఁగాఁ బూర్వ జన్మ సంస్కారవాసనా బలమునఁ దీక్ష మగు జ్ఞానదృష్టితో వస్తువులఁ దిలకించును. తోడనే కారణాతీత మగు ననుభవమున కతఁడు వశుఁడగును. కవియొక్క యనుభవమునకు బాహ్యకారణముల సూచించుట యంత విజ్ఞాన సూచకము కాదు. కవియొక్క విచిత్రానుభూతికి జనాంతర

లబ్దమైన చిత్తపరిపాళమే నిశ్చయమగు కారణము. "కాని, జన్మాం. తరలబ్దమగు కవిచిత్త పరిపాకము ప్రకృతియందలి వస్తువు నే దేని నాలంబనముగఁ గొనక తప్పదు. ద్రవపదార్ధములగు జలతై లాదులు పాత్రాధారము లేనిది నిలువ నేరనట్లు కవిచిత్త పరిపాకము శుద్దశూన్యత నాశ్రయింపఁజాలదు. శూన్యత నాశ్ర యించినచో శూన్యత్వ'మే దానికి సంభవించును. ఎట్లన సున్న ను సున్నతో 'హెచ్చించిన యెడల సున్న యే వచ్చునట్లు: కావునఁ గవియొక్క చిత్తపరిపొక మలంబము లేక ప్రవర్తింప నేరదు. రస మనునది యేదో యనిర్వాచ్యమగు విధమున జనిం చునది. జనించునపుడు రసము కార్యకారణసంబంధములకు లోనగుట లేదు. అప్రయత్నముగను హఠాత్తుగను నలౌకి కౌద్భుత రీతిని గవిహృదయమున జనించు రసముసకుఁ గారణ మీదియని నిరూపింప నేట్టివారికిని చుస్సాధ్యము, కాని విమ ర్శకునకు రసము యొక్క జన ప్రకారము వర్ణింపకపోవ వీలు లేదు కదా! ముందు స్థూలబుద్దికి గోచరించు సామాన్య రసధర్మము సూచించి పిమ్మట లాక్షణికులు సూచించిన విభావానుభావవ్యభి, చారీసాత్త్విచారీసాత్త్వికముల ప్రశంసకుం 'గడంగుదము.

“రస” నిర్వచనము. ౧,కవియొక్క పరిపాకము, 2. వస్తువు యొక్క యాలంబనము, 3. కావ్యము యొక్కరససంవాహకత్వము

రసమనునది జన్మాంతర లబ్దపరిపాకము గల్గిన కవిదృష్టి యేదేని వస్తువుపైఁ బ్రసరించుటవలనఁ గవిమనమున జనించు భావవి శేషమే యగును. ఈ నిర్వచనము యొక్క యర్థముసు, బరి నామమును గమనింతము. కవికిఁ జిత్తపరిపాకము లేనిది రసమను

భూతము గాదనియు, కవియొక్క దృష్టి యే దేనివస్తువుపై బ్రసరింపనిది నిరాధారముగా నిష్కారణముగా రసముజనింప నేరద నియు, జనియించురసము తనంతటఁదాను వ్యక్తముగా లేక కవి ద్వారమున నే వ్యక్తము గావలెననియు, ముఖ్యమగు భావము నిర్వచనము స్ఫురింపఁ జేయుచున్నది. కవియొక్క పరిపాకము, వస్తువు యొక్క 'యాలంబనము, 'కావ్యము యొక్క రససంవాహ శత్వమును, నీనిర్వచనమున ముఖ్యముగ సూచింపఁబడినవి. ఇం దొకవిశేషముగూడ గమనింపఁదగియున్నది. అదెద్దన వస్తువు కవి చిత్తపరిపాకమున కాలంబన మైనంతమాత్రముగనే కవి యొక్కయుపజ్ఞ కుసు, సపూర్వస్వతంత్ర కల్పనా ప్రతిభకును నిరోధము సంభవింప నేరదు. వస్తువు గుణ విశేషణములకును, గవియందు జనించు భవమునకును గార్య కారణసంబంధ ముండ నవసరము లేదు. అనఁగా కవి పస్తువును సాధార మాత్రముగఁ గొని యపూర్వములగు కల్పనల: గావించి కీర్తి గడించవచ్చును. "కాని ముఖ్యముగ సూచితమగు నర్థమేమనఁగా గవి మనము నందు వస్తుసందర్శన బలమున జనించు భావోద్రేకమే భావాను భూతియే రసమని,

భావానుభూతియే రసమునకు జన్మ కారణము,

ఈనిర్వచనపుంబరిణామము కావ్య కల్పనావిషయమున నెట్లుండును? కవి ప్రకృతిదర్శనముసు, మానవజీవితము నందలి వివిథావస్థలజ్ఞానమును ననుభవమునకుఁ దెచ్చికొనకుండఁ గననము నల్లఁ భారంభించిన రసనిష్పత్తి కానేరదని తేలుచున్నది. భావానుభూతి రసమునకు జన్మ కారణము. ఊహ తర్క సిద్దాం తాదులవలన రసనిష్పత్తి కానేరదు. భావానుభూతియే రసము నకు జన్మ కారణమని తిరిగి యొకమాఱు హెచ్చరించు చున్నాను. ఆభావానుభూతియే స్థిరత్వమునందలి స్థాయీ భాన మగును.

స్థాయీభావమే రసము, లాక్షణికులరస , 1 నిర్వచనము. గుప్తపాదాచార్యులమతము.

అట్టి స్థాయీభావమునే మనలాక్షణికులు రసముగా నన్వ యించిరి. ఆస్థాయీభావము కుదురుటకుఁ బూర్యము వివిధము లగు విభావ - అనుభావ - సాత్విక - వ్యభిచారీ భావములను నంతరములు గడువవలసి యుండుంగాన మనలాక్షణికులు వీనినే రసమునకు జన కారణముగా నిరూపింపఁ బ్రయత్నించిరి. కాని,రసము సాత్త్విక వ్యభిచారాది భావములనుండి కార్వకారణ సంబంధము ననుసరించి తప్పకుండ జనించియే తీరవలయునని చెప్పుటకు వీలు లేదు. ఈభావమునే ఆచార్య అభినవగుప్తపాదు లీ క్రిందివాక్యముల వివరించిరి. అవి (రసము) విభావాదికము లేకున్న ను జనించుఁ గావునఁ గారణ జనితము కార్వము గాదు. మఱియు, నది సిద్ధినొందినను గానఁబడకపోవుట చే నిట్టిదని నిరూపించి తెలుప వీలుగానిది. అట్లయ్యు విభావాదికముచే వ్యక్తమై యనుభవింప దగినది. మఱియు నొకేపర్యాయ మా స్వాదింపందగినది.విభావాదికమువలనిపరామర్శయే ముఖ్య మైనం దున దాని(ననఁగా రసమును), గ్రహించునది నిర్వికల్పకము గాదు. ఆకస మనుభవింపఁబడిన యలౌకికానందమయమై తనంతం దెలిసి సిద్దించుఁగావున నది సవికల్పము గూడఁ గాదు. అట్లు నిర్వికల్పకత్వ-సవికల్పకత్వములకుఁ జేరకపోయినను నది యుభయమును, ననఁగా నిర్వికల్పకత్వ సవికల్పకత్వముల నొందించు

చున్న దగుచుఁ బూర్వమువలే నా రెంటికలయిక చే లోకోత్తర భావము నే పొందుచున్నది. కాని, వైరుధ్యమును గలిగించు నది గాదు.

గుప్తసాదాచార్యుల యభిప్రాయమున రసమునకును, విభావాను భావాద్యంతరములకును గార్య కారణసంబంధము లేదని రూఢియగుచున్నది. ఆచార్యులమతమున రసము సవి కల్పకమును నిర్వికల్పకమునుగూడ నయియున్న దని - అనఁగా రసము చిరస్థాయిగఁ గొంత కాలము మాత్రమే నిల్చుననియుఁ, గొంత కాలము విభావానుభావ సంచారీ వ్యభిచారిస్థితుల నందు చుండుననియు సూచింపంబడినది. దీనియంతటికిని స్థూలార్థ మేమనఁగా:- రసము నిశితమగు నతి తేజముతోఁ గోండొక కాలముమాత్ర మే ప్రదర్శింపయోగ్య మగుననియు, మిగిలినపట్ల నట్టి తైక్ష్యము తగ్గిపోవుననియుఁ, గావ్యమున రసమునకు జీవ స్థాన మతి తైక్ష్యముఁ బ్రదర్శించుపట్లగల స్థాయీభావమే యయినను నట్టిస్థాయీభావమును బోషించుటకును, దోహ దముఁ జేయుటకును వివిధములగు విభావానుభావములు వలయు ననియుఁ దెలియుచున్నవి. \

కావ్యమునకును చిత్ర శిల్పమునకును గల భేదము. 1. చిత్ర శిల్పములయందు రసముయొక్కస్థాయీభావమే, అనఁగా, నిశితతీక్ల తయే ప్రదర్శిత మగును. కావ్యమున వివిధ భావములు వర్ణితములగును.

ఇప్పట్టున శబ్దరూపమున నుండుకావ్యమునకును వర్ణ శిలారూపముల నుండు చిత్ర,శిల్పములకును భేదము లరయు దము. చిత్రములయందును, శిల్పములయందును మానవ ప్రకృతి యందుఁగాని, బాహ్య ప్రకృతియందుఁగాని కలసౌందర్య భావా నుభూతి నిశిత లైన్ల్యమునొందు నవస్థలో ప్రదర్శితమగును.

2.చిత్రశిల్పము లింద్రియసాహాయ్యము చే రసమును బ్రదర్శింపఁగల్గును. కావ్యము ఇంద్రియ సాహాయ్య మపేక్షింపనిశుద్ధమానసిక వ్యాపారమే.

చిత్రమునందును, శిల్పమునందును పలుషూటల కవకాశము లేదుగావునఁ 'జెప్పఁదలఁచుకొన్న భావమంతయు నేక స్థాయి నుండునట్లుగను, నిశితతీక్షతఁగలుగునట్లుగును బ్రదర్శింప వలయును. ఒకటే దెబ్బ రెండే తునుక లనునట్లు, చిత్ర కారుఁ డును, శిల్పియును నిశితతీక్ష తఁ గలస్థాయీభాపమును మాత్ర.. మే ప్రదర్శింతురు. అందు చేత నే చిత్రములును శిల్పములును భావతీక్షతఁ గలవై కొట్టవచ్చినట్లుగ నుండి చూపఱమనంబుల నొకేచూడ్కితోనేవశము గావించుకొనఁ గల్గుచున్నవి. శిల్పము నందును జిత్రమునందును వైవిధ్యమున " కవకాశము లేదు. భావతైక్ష్యమే చిత్ర కారునకును, శిల్పికిని బరమావధి. ఇఁకఁ గావ్యముననన్న నో వైవిధ్యమున కవకాశము గలదు.

చిత్రములయందును, శిల్పములయందును గలరసము. చక్షురింద్రియము ద్వారా మనసునకు గోచరించును. అందుచేఁ గన్ను లకుఁ జూచినతోడనే ఒక్క మాటుగ రసము గోచరించు టకై రసము నిశిత తైక్ష్యముతోడను నేకాగ్రతతోడను నొప్పునవస్థయే చిత్ర కారులును శిల్పులును ప్రదర్శింతురు. ఆ నిశితతీక్షత గలభావమును గన్నులు మనసునకు గోచరింప

జేయును. కావ్యమన్న చో నింద్రియముల సాహాయ్యముపై నాధారపడియుండదు. కావ్యపఠనము శుద్ధమానసిక వ్యాపారమే. శ్రవణేంద్రి యసాహాయ్యము ఛందోవిషయమున మాత్రము వర్తించును. అందువలనఁ గావ్యమున భావ మింద్రియ సాహాయ్య మక్కర లేకయే ప్రదర్శితము కావలెను, కాన్యమున రసము శబ్దరూపముననే మనసునకు స్ఫురించవలెను. శబ్దము భావమునకు సంజ్ఞారూప మగుటం జేసే పలుశబ్దముల సూచింపఁ బడురసము పలువిధములగు భావముల సూచించును. కన్నులకు వర్ల శిల్పములవలన నేకాగ్రత సూచితమగుప్ర త్యేకవిధమున శబ్దముల వలన మనసునకు నేకాగ్రతసూచితముకాదు. అర్థము లీనుమాటలచే రసము స్ఫురించవ లెసు అట్టిచో రావ్యమాది నుండి తుదివరకుశబ్దరూపమున నుండుట చేఁ బలుమాటలకును, బలువిధములభావములకును నవకాశ ముగలదు. నిశితమగు భావతైక్ష్యము కావ్యమునఁ జిరస్థాయిగా నేకరీతిం బ్రదర్శించుట దుస్వరమును దుర్భరమును ! ఏలననఁ గావ్యము చదువుటకు చిత్ర శిల్పముల దర్శించుకాలముకంటె నేక్కువకాలము పట్టును. "మొదటినుండియుఁ జివరివజకు వైవిధ్యము లేకుండ నేకస్థాయిని, గవి రసమును బ్రదర్శింపఁ బ్రయత్నించిన నవి విసువుఁ గల్గింపక మానదు. ఉచ్చైస్థాయిని నాటక మాదినుండి తుదివరకు గొంతుకఁ జించుకొని పాడు నాటకసమాజ గాయకుల గానము గొలఁది సేపటి కే విసువుఁగల్గించుట లేదా? సంగీతమున స్థాయిలో భేదములు సూచింపఁబడనిది మాధుర్యము జనింపనేరదు: ఎల్లప్పుడును నేకార్థము సూచించుమాటలతో నిండియుండినగాని యేకాగ్రత సూచించు రసభావము ప్రదర్శితము కానేరదు.


కావున నేకాగ్రత నొందినభావమే వర్ణింపఁ బడవ లెనన్న గావ్యమున మితభాషణ మత్యవసరమగును. కవి చెప్పఁదలఁచుకొన్న భావమంతయు రెండుమూఁడు మాటలలోనో రెండుమూఁడు వాక్యములలోనో పూర్తియగును. 'గట్టె, కొట్టె, తెచ్చె' సన్నట్లగును. అదీగాక చిత్రములయందును, శిల్పములయం దును వర్ణశిల్పముల చే సూచితములగు భావములన్నియు నేక క్షణముననే గోచరించును. కావ్వమున భావము లొకదాని వెంబడి నొకటి గోచరించును. కావున నవి వివిథాంతరములు గల తీక్షతగలుగు వివిధావస్థలతోడఁ బ్రదర్శింపఁబడపలెను. వివిధాంతరములుగల తీక్షతగలుగు వివిథావస్థలును భావమునకు వైవిధ్యము నొసఁగును. అందుచే రసము నిశితతీక్షతతోడను, నేకాగ్రతతోడను మాత్రమే గాక వివిథావస్థలతోడను, 'వివిధాంతరములుగల తీక్షతతోడను బ్రదర్శితమగును. ఏక స్థాయిని బొడుచుండినచో నయ్యది 'కీచు రాయిరొదవలె వినువారికిఁ దలనొప్పిఁ బుట్టింపక మానదు. కావ్యమునకు నిట్లే రసము వైవిధ్యము లేక యేక స్థాయిని బ్రదర్శింపఁబడిన చో 'రోతయు, విసుఁగును జనింపకమానవనియు, నట్టివిసువును రోఁతయు జనింపకుండుటకై కవి సాత్విక వ్యభిచారాదిభావము లను విభావానుభావములను దగురీతిఁ బ్రస్తరించి కొవ్యమున రసమునకు వైవిధ్యమును నాహ్లాదకత్వమును గల్గింపవలెనని మనలాక్షణికులయభిప్రాయ మైయున్నది. ఎట్లయినను, గావ్యమున రసమనునది యే కారణమున జనించినను నిశిత తైక్ష్యముఁ గలిగి యుచ్చైస్థాయి నొందినయవస్థావి శేషమునకే చెల్లును గానీ తదితరములగు విభావానుభావాదికములకుఁ జెల్లదు.అందు వల్ల నే మనవారు స్థాయీభావమే రసమని చెప్పుటలో నెంతయు రసస్వభావపరిచయము వ్యక్తమగుచున్నది. రసము నిశ్చయ ముగ విభావానుభావాదికములలో లేదని చెప్పఁదగదు. అవి రసోపలబ్దికిని రసప్రకటనమునకును సాధనమాత్రములుగను. మనలాక్షణికులు సూచించి యున్నారని మన మంగికరింపక, తప్పదు.

విభావాదికములు,రస ప్రకటనమునకును . - రసోపలబ్దికిని సాధనమాత్రము లే.

విభావానుభావాదికములు రసోపలబ్దికి నంతరములును సాధనములును మాత్రమే యనియుఁ గారణములు మాత్రము. కాజాలవనియు నిశ్చయముగఁ జెప్పవచ్చును.

రసముయొక్క జన్మ ప్రకారము. 'కవి ద్రష్ట'యనీ ' యంగీకరించు వారిమతము. రసము మొదట తీక్ష భావముగ జనించి విభావాదికముల పరామర్శ చేఁ దుదకు స్థాయీభావమునొందును.

ఇట్లు పలుకుటవలన నింకొక ప్రశ్నమున కవకాశ 'మొదవుచున్నది. రసము జనించునపుడు స్థాయీభావముగ జనించునా? లేక విభావాదికముబలమున స్థాయీభావముగఁ బరిణ మించునా? ఈ ప్రశ్నమునకుఁ బ్రత్యుత్తర "మొసఁగుటకుఁ గావ్య జన్మ కారణము నరయవలయు. కవి, మొట్ట మొదట భావము ననుభవించి పిమ్మట ప్రసరించునా? లేక భావాను భూతి నొందనివాఁడై ప్రస్తారములవలనఁ దుదకు భావోపలబ్దిని బడయునా? దీని విషయమున భిన్నా భిప్రాయముల కెడముగలదు. కవి సాక్షాద్ద్రష్టయని నమ్మువారికిఁ గవి ప్రప్రథమముననే భావమును దీక్షముగ ననుభవించునని నిశ్చయమగుచున్నది. అట్లు: దర్శించినమూ ర్తిని ననుభవించినభావమును, వినినశబ్దమును గవి నెమ్మది మీఁదఁ గావ్య రూపమునఁ బరిణమింపఁ జేయుచు సాధనములుగా విభావాదుల నుపయోగించి రససిద్దిని బడయ నెంచును. కావున రసము ప్రప్రథమమున నే జన్మాంతర సంస్కార జనిత చిత్త పరిపొకము గలిగిన కవియొక్క దృష్టి వస్తువు పైని బ్రసరించిన తోడనే జనించును. పిట్టలు ప్రాతఃకాలమున గూండ్లు వదిలి పైరు చేలఁ దిరిగి మేఁత మేసి తటాకముల జలముఁ ద్రావి నానావిధ ఫలవృక్షములపండ్లను దిని సాయంకాలమగు సరికి గూండ్లు చేరునట్లుగనే, కవి సౌక్షాత్కా రలబ్ద మైనరసమును విభావాదికమునెడఁ బ్రసరింపనిచ్చి చివఱకు రసోపలబ్దిం బడయును. కవి యంత్యమున ననఁగాఁగావ్యాంతమునఁ'బడయు రసోపలబ్దికిని, మొట్ట మొదట రససాత్కార మగునపుడు కలుగు భావానుభూతికిని 'వైరుధ్ధ్యము లేదు. ఐక్య భావమే వర్తిల్లును. మొదట సాక్షాత్కార జనితమయిన భావము నిశిత తైక్ష్యము గలదీ యై జనించి యొక్క పెట్టునఁ బెల్లు వెల్లు వయుంబోలెను, మెఱుంగుఁబో లెను గవిని వశముఁ జేసికొని స్తంభతుని గావించి పారవశ్యావస్థను విడియించి యరుగును. పిమ్మట స్మృతిఁ దెలిసి కవి సొక్షాత్కారబలమునఁ దాఁ గాంచిన మూర్తి యిదియా యదియా! యనుచుఁ బ్రకృతియందుఁ గల వివిధమూర్తులతో సరిపోల్చి చూచి మననముఁ జేయుచు నట్లే కాగ్రచిత్తతతో మనసముఁ గావించుటవలన సంకల్ప సిద్ధుఁడై తొల్లింటి మహనీయమూర్తినిఁ దొల్లిఁటి యలౌకిక భావానుభూతిని బడయఁగలుగును. అదియే రససిద్ధి యనం దగును. కావున మామతమున రసము మొట్ట మొదట మెఱుపుల దీపయుం బోలే నిశితతీక్షతగల శాంతితో, జనించి కవికన్నుల మిఱుమిట్లుఁగొల్పును. అనఁగా జనియించునపుడే రసము తైక్ష్ణ్యము గలిగియుండి స్థాయీభావ మనందగియుండును. కాని స్థాయీత్వముమాత్రము చిరానుభూతి వలనస్థిరీకరింపఁ బడఁదగిన దగుటచేఁ జివరకు సిద్ధించును. కాని మొట్ట మొదట, జనించు రసానుభవమున స్థాయీభావమున కుండవలసిన నిశిత లైక్ష్యము పూర్తిగ నుండును. మెఱుఁగువోలె మెఱసి యేఁగిస రసస్యరూపము కవి విభావాదికమును సాధనముగఁ గొని పునర్దర్శనముఁ గావించుటకుఁ బ్రయత్నించి రసోపలబ్దినిఁ బడసి " స్థాయీ భావము నందినవాఁడగును, అనఁగాఁ దొల్లింటి మెఱుంగుఁ బోలిన రసానుభూతిని బారిపోకుండ నెప్పుడుసు దన్నాశ్రయించుకొనియే యుండునటులు బంధించి కైపసముఁగావించి కొని పునఃపునా రసానుభూతి నొందుచు యోగబలమునఁ బరమేశ్వర రూపము నిత్యముఁ గాంచుచు నమేయానందము నందు యోగికరణి సిద్ధుఁడగును. కావున నింతవఱకుఁ జర్చించి తేల్చిన దేమనఁగా:-----

కవికి రససాక్షాత్కారము కావలెను.

రసానుభూతి సాటు, సాక్షాత్కారబలమున నిశీత తైక్ష్ణ్యము తో మొట్ట మొదట లబ్దమయి మననబలమున స్థాయీభావమునొందు ననియేకానీ సాక్షాత్కారబలము లేక విభావ అనుభావ సాత్విక వ్యభిచారీభావముల పట్టికలను జదివినంతమాత్రమునఁ గవికి రససిద్ది యసందగు స్థాయీభావ మేర్పడుట సంభవముగాదని యును గావ్యరచనకు మూలకారణమగు రసానుభవమును భావోద్రేకమును జన్మాంతరసంస్కార వాసనాబలమునను జిత్త సంస్కారము వలనను జనింపవలసిన దేశాని గ్రంథపఠనమువల నను, నందు ముఖ్యముగ లక్షణ గ్రంథపఠ నమువలనను, లభిం చుట యసంభవమనియును. పుట్టుకతోనే కవియై పుట్టవలయుఁ గాని వేఱువిధమునఁ గవి యగుట యరుదు. భావ మెప్పుడును జనాంతరసంస్కారబలమునఁ గవికీ వస్తుసందర్శనముఁ గావించిన నిమేషముననే లబ్ధమగును.

వాల్మీకికవిచరిత్రము.

ఈభావ మాదికవియగు వాల్మీ కిమహర్షి చరిత్ర వలనఁ బరిస్ఫుట మగుచున్నది. తమసా నదీతీరమునఁ గామమోహిత మయిన క్రౌంచమిథునమునందు నొకదానిని జంపిన వ్యాధునిఁ జూచి బాణనిహతమయిన గ్రౌంచమును గాంచి కరుణాపర వశుఁడయి యీ క్రింది విధమున వాల్మీకి దురాతుఁడగు నావ్యా ధుని శపించెను....

శ్లో. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమళ్శాశ్వతీస్సమాః,
యత్ంచమిథునా దేశమపధీః కామమోహితమ్.

జన్మాంతర సంస్కారమును జిత్తపరిపాకమును గలవాఁడగుటచే వాల్మీకికి వ్యాధ బాణనిహతమయిన గ్రౌంచదర్శనము రసోత్పాదకమయ్యెను. జనాంతరసంస్కారము గాకున్న వాల్మీకి కరుణకుఁ గారణము వేరెద్దియు లేదుగదా ! తానుమనుజుడు. హతమయినది క్రౌంచము. ఇరువురకును సంబంధ మంతఁగా లేదు. కాని జన్మాంతరలబ్దసంస్కారముగల వాల్మికి వ్యాధబాణ నిహతమయిన గ్రౌంచమును జూచిన తోడనే కరుణా రసపరవశు డయ్యెను. కరుణారసము నిశిత తై క్ష్ణ్యముతో నతని వశముఁ గొనెననుటకు శ్లోకరూపమున నతనిశోకము వెలువడు టయే తార్కాణము, ఎంత, భాపతైక్ష్ణ్యములేనిది. వాల్మీకి సం బంధము లేని క్రౌంచము విషయమయి తనలో జనించిన కరుణ సనాలలోచితముగ సద్యః కావ్యముగఁ బలుకఁగలిగియుండెను? కావున రసము జనించునపుడు తైక్ష్ణ్యము గలిగియుండి పిదప విభావాదికముచేఁ బోషింపంబడి స్థాయీభావముగఁ గవి యందుఁ దిరముగ బాతుకొనును,

రసస్వరూపము - విభావాదికములు. రసముయొక్క బాహ్యస్వరూపమును బ్రదర్శించును.

కావున రసమునకు జన్మకారణము సాక్షాత్కారలబ్ద నిశితతీక్ష్ణ భావానుభూతియే. ఇక రసముయొక్క.. స్వరూప మెట్టిది? రసమున కాత్తయును, జీవమును ననఁదగునది సాక్షా త్కారమును తద్ద్వారా జనించు భావానుభూతీయే! ఇక బాహ్యస్వరూపమును దత్సూచకములగు నంగోపాంగములును, నీవిభావానుభావాదులే యగునని మన మొప్పికొనినను జిక్కు లేదు. కాని, యీవిభావానుభావాదు లనంతవైవిధ్యము గలిగి యుండును.

లక్షణ గ్రంథములలోని విభావాదుల ప్రశంస యుదాహరణము మాత్రమే.

కావున లక్షణ గ్రంథములకుఁ జెప్పఁబడు విభావాను భావాదుల ప్రశంస యుదాహరణ మాత్ర మేకొని సంపూర్ణ నిర్వ చనముగాని, నిర్ణయముగాని కాజాలదు. మానవ ప్రకృతి యనంతవిధములఁ బ్రవర్తించును. అందుచే భావానుభూతియు సనంత వైవిధ్యముఁ గలిగియుండును. అందువలన భావాను భూతిని సూచించువవియు, దానికంతరము లసందగినవియు నగు

ఆంధ్ర కవిత్వ-7 విభావావికములు లక్షణ గ్రంథముల నుదాహరణ పూర్వకముగ వివరింపంబడియుంట నిశ్చయము. విభావాదులు రసమునకు వై విధ్యము నొడఁగూర్చును... రసము సాక్షాత్కారబలమున ననిర్వచనీయభావాను భూతిని జననమొంది. విభావాదిసాధనముల పరామర్శ చేయ బెంపొంది స్థాయీభావముగ సిద్ధించి కవికి యశమును, గావ్య మునకు స్థిరత్వమును సంపాదించును. కావ్యము శబ్దరూప మగుట చేతను శబ్ద మెప్పుడును నేకస్థాయి నుండక స్థాయీ భేదముల నొందుచునే యుండవలయుఁ గావునను గావ్యమున వైవిధ్యము తప్పనిసరిగ నుండవలయు. "కావ్యమునకు జీవాత్మ సాక్షా త్కారజనితరసమే. కాని, సాక్షాత్కారలబ్దమగు రసము చిత్ర ములను శిల్పములనుబలె నేకస్థాయిని గావ్యమునఁ బ్రదర్శిత మగుటకు వీలు లేదు. కావునం గావ్యమునకు వైవిధ్యగుణా లంకారము నొడఁగూర్చుటకు రసముయొక్క వివిధ ప్రస్తారము లను బాహ్యచిహ్నములును ననఁదగు విభోవానుభావసాత్త్విక వ్యభిచారి భావములకుఁ 'గావ్యమున నవసర ప్రసక్తి గలదు.

విభావాదులు సాధనమాత్రములు,

ప్రాణికి జీవమును నాత్మయును నదృశ్యములయినను నవ యవములు మాత్రము బాహ్యదృష్టికి గోచరించుచు నేయుండును, ప్రాణి యవయవముల సాధనమున నవసరకర్మముల నిర్వర్తించును. ప్రాణ మంతరించి పోవునపుడు సాధనమాత్రములును, బాహ్యచిహ్నములును నగు నవయవములుగూడ నంతరించి యాత్మ యొక్క యదృశ్యత్వమును నై క్యమును, నిరాకారతయు మాత్రమే మిగులును. అట్లే కావ్యమున జీవాత్మ యగు రసము విభావానుభావాదికముల వలనఁ గార్యముల నిర్వర్తించు కొనుచు నిజ స్వరూపమును బ్రకటించుటకు వానిని సాధన ములుగ నుపయోగించుచుఁ దుదకు స్వస్వరూపసంధాన మనం దగు స్థాయీభావము నొంది సిద్దిగాంచినతోడనే విభావాదిక ప్రసక్తిని మఱచి స్థాయీభావజనీతో న్మాదమున నేయోలలాడు చుండును. ప్రాణి యుపాధిని దాల్చి ప్రవర్తించునంత కాలము నవయవము లెట్లు ప్రయోజనముఁ గల్గి యవసరములై యుం డునో యట్లే రసము కావ్యస్వరూపముఁ దాల్చి ప్రవర్తించు నంత కాలము విభావాధికమునఁ బ్రయోజనమును నవసరమును విదితము లగుచుండును. ప్రాణి యుపాధిని విడిచి పోవునపు డవయవముల యవసరము తీఱిపోవునట్లే రసము కావ్యస్వరూప మును వీడి సిద్దినొందు సమయమునకు నిభావాను భావాదికముల యవసరము తగ్గిపోవును. ఇందులకుఁ దార్కాణము కావ్యమున రస మేని యన విభావాకముల సుగతిఁ జెప్పక కావ్య జీవమగు స్థాయీభావమును గూర్చియే నిరూపణ గావించుటయే. స్థాయీభావము కావ్యమున రసమునకు జీవస్థానము వంటిదనీ చెప్పఁదగును. కావ్యమున రసము స్థాయీభావ రూపమున నే సిద్ధించి తన్మూలముననే నిరూపితమగును.

విభావాదుల ప్రయోజనములు. 1.రససిద్దికి ) - దోడ్పడుట. 2. రసమునకును గాన్యమునకును వైవిధ్యము నాపాదించుట.

విభావాదికము నిమిత్తమాత్రమును, సాధనమాత్రమును. వానియొక్క ప్రయోజనము స్థాయీభావమునకు మార్గముఁ జూపించుటయే, రసము అడ్డంకులు లేక యథోచితముగ ననుకూల ప్ర దేశములఁ జరించి యనుకూలమార్గములఁ బురో గమనముఁ గావించి యిష్టాభరణములఁ దాల్చి యానందపార వళ్యమున స్థాయీభావము నొందుటకుఁ దగిన యవకాశము నీవిభావాదికములే గలిగించును. కావున విభావాదికముల ప్రయోజనము రససిద్దికిఁ దోడ్పడుటయు, రసమునకును,గావ్య మునకును పై విధ్యము నాపాదించుటయును నను ద్వివిధములుగ వర్తిల్లును.

భిన్న త్వాంతర్గర్భితమగు నేకత్వమే సృష్టి లక్షణము.

కాని, విభావాదిక ప్రశంసలో మనము గమనించవలసిన విషయ మొకటి కలదు. సృష్టి యనంతమనియుఁ బ్రకృతుల భిన్నత్వ మనంతమనియు ముందుగ మనము గ్రహింపవల యును. సాధారణముగ సంపూర్ణముగ నొకదానిని బోలిన వస్తు వింకొకటి యుండదు. ప్రతివస్తువునకును మూలమును జీవమును నగులక్షణ మేదో యొక టుండును. అప్రధానములగు గుణములు కొన్నియు నుండును. ప్రధానగుణవిషయమున నేకజాతి కిఁ జేరిన వస్తువులకు సౌమ్యముండును. కాని యప్రధాన గుణముల విషయమున నట్టిసంపూర్ణ సామ్య ముండుట యరుదు. ఎట్లంటి మేని, మానవులందఱకును బ్రాణమును, మను ష్యత్వమును ముఖ్య లక్షణములే. ఇచట మనుష్యత్వమను గాఁ బంచేంద్రియ వ్యాపారవశత్వమని యన్వయించుకొనఁ దగును. ప్రతిమనుజునకును బ్రాణ ముండును. ప్రతిమనుజుఁడును పంచేంద్రియ వ్యాపారములకుంగట్టువడియే యుండును. ఈ రెండు విషయములను, సర్వమానవకోటికిని బంచేంద్రియ వ్యాపారముల జయించిన సిద్ధయోగులకుందక్క సామ్యము నిశ్చితము. కాని, వివిధమానవుల ప్రాణముల కుండు శక్తు లును, వివిధమానవుల పంచేంద్రియ వ్యాపార ప్రవృత్తియు భేదించును. ఒక్కొకనిప్రాణ మతిశక్తిఁ గలదియై యెట్టి కష్టములనైన నోర్వంగలదియై యుండును. కొందర ప్రాణీ యతి సుకుమారమై కష్టముల కోర్వక ముట్టుకోనిన వాడిపోవు పూవుంబోలె వర్తిల్లును. ప్రాణికిఁ గలశక్తియం దుండు తారతమ్యము సూచించితిమి. ఇఁకఁ బం చేంద్రియ వ్యాపార ప్రవృత్తియందును గూడ ననంతములగు విభేదములు గానవచ్చుచుండును. రుచుల విషయమునఁగల యనంతవి భేదము 'లోకో భిన్న రుచి:' యను జన ప్రశస్తిఁగన్నది. వాసనా విషయనఁ గూడఁ గొందఱకు గాటు నగువాసన యింపుగనుండును. కొందఱకుఁ దేలికయగు వాసన యింపుగ నుండును. శబ్దము, స్పర్శము, మొదలగు నిత ధేంద్రియ వ్యాపార ప్రవృత్తి యందుఁ గూడ నిట్టి యనంత వైవిధ్యమును సోదాహరణముగఁ బ్రదర్శింప వచ్చును. కానీ గ్రంథ విస్తరభీతి చే ‘స్థాలీపులాకన్యాయ' మునే యనుసరింపవలసిన వాఁడ నయితి. ప్రకృతి యెప్పుడును, నీ క్రింది సూత్రము ప్రకారము ప్రవర్తించును. వివిధ వస్తువులకు జీవగుణముల యందు నైక్యభావమును సామ్యమును, ప్రధానగుణముల యందు వైపరీత్యమును వైవిధ్యమును వర్తించుచుండును. భిన్నత్వము లేనిది యేకత్వము సంభవించుట యరుదు. భిన్నత్వముతోఁ గూడిన యేకత్వమే ప్రకృతియొక్క లక్షణము, ప్రకృతి సృష్టికర్త మనమునందు భావరూపముగ నుండినపు డేకత్వమునే కలిగి యుండును. దీనినే మనవారు పరమాత్మ యొక్క నిర్గుణత్వముగను నేకత్వముగను నిరూపించిరి. సృష్టికర్తృ వదన గహ్వరాంతరములనుండి గుణరూపమున వెలువడిన సృష్టి యనంతమగు గుణ లక్షణ - స్వరూప విభేదములచే ననంత వైవిధ్యములతో నొప్పుచు నర్తిల్లు చుండును. చివరకు సృష్టియంతయు నశించు సపుడీయనంత వైవిధ్యమంతయు రూపఱిపోవును. ఈభావమునే పోతనామాత్యుడు గజేంద్రమోక్షణము........

  శ. లోకంబులు లో కేసులు లోకస్థులుఁ
దెగినతుది నలోకంబగు పెం
జిఁకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

అను పద్యమున సూచించెను. సృష్టి యంతయు లయమయిన పిమ్మట ననఁగా ననంతగుణరూపవి భేదములతో నొప్పు 'లోకంబులు లోకస్థులుఁ దెగినం' దుది నలోకంబగు 'పెంజీకటి కవ్వల నేకాకృతితో భగవంతుఁడు వెలుఁగుననుచున్నారు. వైవిధ్య మంతయు నశించి యేకత్వమున లీనమగును. కావున భిన్నత్వము సృష్టియం దేకాని భగవంతుని యందు లేదు. ఏకత్వము నుండి జనించిన సృష్టి నిమిత్తమాత్ర జీవితముఁ గడపి తుదకు నేకత్వముననే లీనమై పోవును.

భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వము రసముపట్లగూడ వర్తించును.

ఈసృష్టి రహస్య మే రసమునకుఁగూడ వర్తించును. సృష్టి స్థితిలయములు సకలచరాచర ప్రపంచములకు సమానమే. సృష్టికి బూర్వమును, లయమునకుఁ దరువాతను నేకత్వమేకాని భిన్నత్వము లేదు. సృష్టి జరిగి, యది స్థితినొందుచు లయమగువరకు భిన్న త్వసూచిత గుణవై విధ్యము వర్తించును. కావున భిన్న త్వాం తగర్భితమగు నేకత్వమే సృష్టిలక్షణమని తిరిగి హెచ్చరించు చున్నాఁడను.

కావ్యసృష్టి విషయమునఁ గూడ నీభిన్నత్వాంతర్గర్బిత మగు నేకత్వము వర్తించును. ఎట్లన కావ్యసృష్టికి మూలకార ణము జన్మాంతరసంస్కారవాసనాబలమే. ఆయ్యది యాత్మశక్తి యేకాని వేరుకాదు. అట్టియాత్మశక్తిని గవి సాత్కార బలమునఁ బొంది యనుభవింపఁ గలుగును. సాక్షాత్కారమగు నప్పుడు కావ్యాత్మయగు రసము మెఱుపువోలె క్షణదృశ్యమై మాయమగును. భిన్న భిన్న రూపములతోఁ గవికిఁ గనుపింపక నేక తేజముతో హఠాత్తుగా నయ్వది గోచరించును. సాక్షాత్కారమున దృశ్యమైన తేజమును మననముఁ గొవించుటలోనే భిన్నత్వము, ద్వైత భావమును, సృష్టి వైవిధ్యమును జనించుట కవకాశము కలుగుచున్నది. అట్టిమనస బలమున స్థాయీభావము చేకుతీ రససిద్ధి యైనతోడనే వైవిధ్యమునకు, భిన్నత్వమున కును నవకాశమును, బ్రసక్తియుఁ దగ్గిపోవును. అప్పుడు స్థాయీ భావరూపమునఁ దిరిగి యేకత్వమే సిద్దించును. అప్పుడే కవి సిద్ధుఁడగును.

విభావాదులు రసముసకు స్వరూపముఁ గల్పించును.

కావున విభా-వానుభావ-సాత్వక-వ్యభిచారీ భావములు సాక్షాత్కారబలమున జనించిన రసము యొక్క బాహ్య ప్రవృత్తిని దెలుపఁగలుగును. కేవల తేజోరూపమున గోచరమైన రసమున కొక యవయవయుతమగు స్వరూపమును గల్పింపఁజూచును. ఈస్వరూపము ప్రయోజనార్థియును సాధన మాత్రమునని యెంచనగును. నిరంతర మననబలమున మొదట తేజోరూప మున గోచరమైన రసస్వరూపము స్థాయీభావము నందునని యిదివరకే సూచించి యుంటిమి. విభావానుభావాదు లీమనన కార్యమునకుఁ దోడ్పడును. రససిద్ధికి నేంతేనిఁ దోడ్పడును. తుదకు స్థాయీభావరూపమున రససిద్ది యైనతోడనే "లోకంబులు, లోకేశులు, లోకస్థులుఁ దెగి "యలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతి వెలుఁగు” పరమాత్మలో నై క్య మౌకరణి నీవిభావానుభావాదులు స్థాయీభావమున నై క్య మొందును. కావున రసము జనించునప్పుడును సిద్దించు నప్పుడును నేకత్వము నే పొందియుండును. జన్మకును సిద్దికిని నడుమ విభా'వానుభావ సాత్వికవ్యభిచారీభావములు రసముయొక్క నిమిత్తమాత్రమగు బాహ్య స్వరూపమును బ్రకటించును.

విభావాదులు రసమునకుఁ బ్రస్తార భేదములఁ గల్పించును.

అంతియ కాక నీవిభావాదికములు కావ్యమునకు వై విధ్య గుణము నాపొదించునని తెల్పియుంటిని. ఏకస్థాయిని కావ్యమున రసము ప్రదర్శన యోగ్యము కాకుంట చే నే దేని మార్గమున నా రసమునకు ప్రస్తార భేదములఁ గల్పించఁదగును. అట్టి ప్రస్తార భేదములన్నియుఁ గావ్యాత్మ యగు రసమునకుఁ గట్టువడియుండి దానిని సూచించుచుఁ గావ్యమునకు వైవిధ్యము నొడఁ గూర్చును. కావున నీవిభావాదులు కావ్యాత్తయగు రసమును బోషించిదోహదముఁ గావించును. సాక్షాత్కారలబ్దమైనరసము విభావానుభావాదుల సాధనములుగఁ గొని తిరిగి స్థాయీభావ రూపమున స్వస్వరూపసిద్ధిం బడయును గావుననే మనవారు విభావై రనుభావైళ్ళ సాత్త్వికై ర్వ్య భిచారిభిః, ఆనీయమానస్స్వాద్యత్వం స్థాయీభావో రసః స్మృతః." యనుచు విభావాదికముల నిమిత్తమాత్ర ప్రయోజనమును “ఆనీయమాన” అనుపదముచే సూచించియే యున్నారు.

.విభావాదుల విషయమున గమనింపవలసిన విషయములు


కానీ విభావాదుల ప్రసంగవిషయమున ముఖ్యముగ గమ నింప వలసిన విషయములు రెండు. రసము రసికునిచిత్తసంస్కా రము నాధారముగఁ గొనుననుట యొక్కటియుఁ, బ్రకృతిలో సంపూర్ణ సామ్యముండక భిన్న త్వాంతర్గర్బితమగు నేకత్వమే వర్తించుననుట యొకటియు, నీ రెండు విషయముల గ్రహించితిమేని యనంతవిధములఁ బ్రసరించు కవిచి త్తసంస్కారము, రస స్పర్శ ననుభవించి, యసంఖ్యాకములును, ననంత పై విధ్యము కలవియును నగు విభావాదుల నొందుననియు, లాక్షణికులు సూచించెడి విభావాదుల పట్టిక యుదాహరణమాత్ర మేయనియుఁ గవిని బంధింపఁగలుగు శాసనము కాఁజలదనియు, కవి శ్రావ్య సృష్టిపట్లఁబోలె విభావాది కావలంబనముపట్లను నిరంకుశుఁడై ప్రవర్తించి నిజమనోభీప్సిత సిద్ది యనఁదగు రససిద్దిని స్థాయీ భావము రూపమునఁ బడసి ప్రకటింపఁగలఁ డనియుఁ దేటపడం గలదు, కవికిఁ బ్ర ధానలక్యుము లక్షణానుకరణముగాక రస సిద్ధిని స్థాయీభావమును నొందుటయే యగును.

స్థాయీభావత త్త్వము.

రససిద్దియు, రసనిర్వాణమును, రసముముక్షతయు ననఁ దగు నీస్థాయీభావప్రశంస కొంచెమువిపులముగఁ గావింతము . ఆసనాదిసాధన సంపత్తిబలమున యోగి తుదకు యోగ సిద్ధి నంది పరమేశ్వరుని తేజమును నిత్యము నెట్లు సందర్శించి యానందానుభూతి నందు చుండునో యట్లే కవియు విభావానుభావాది సాధనముల బలమున స్థాయీభావము నంది రససిద్ధిఁ బొందినవాఁ డగును. భక్తుఁ డెట్లు' ధ్యాన - మనన-భజన-అర్చనాది సాధన ములద్వారా మనోనైల్యము వీడి నిర్వాణమునొందునో యట్లే కవియు విభావాది సాధనములద్వారా స్థాయీ భావరూపమగు రసనిర్వాణమును జెందినవాఁడగును. జపతప - స్వాధ్యాయ నిరతుఁ డై తపసి యెట్లు దేహేంద్రియ ప్రపంచము మరచి. జీవన్ముక్తుఁడై ముముక్షుత్వము నొంది పరమాత్మతో నైక్య మగునో యట్లే విభావానుభావాదికముల ప్రస్తారము వలనను మననము వలనను రసము వైవిధ్యమును, ద్వైత భావమును, వీడి యేకత్వము నొంది స్థాయీ భావరూపమున సీర్ధినొందిన దగును. కావున రససిద్ధిని సూచించు నీస్థాయీ భావ ప్రశంసయే రసస్వరూప చర్చకు మిక్కిలి యవసరము. స్థాయీభాపతత్త్వము బాగుగ గ్రహించిన వారికి రసస్వరూము గోచరించును. స్థాయీభావమే రసముగ మనలాక్షణికు లన్వయించి వ్యవహ రించుటకుఁ గల రహస్య శారణ మిది యేయని గ్రహింపఁదగును.

స్థాయీభావ మనఁగ నేమి ?

స్థాయీభావమన స్థూలముగఁ జెప్పినచో స్థాయి నొందిన భావమనియే. స్థాయి యనఁగ నిలుకడ యని యర్థము. తిరముగ పాతుకొని యుండు భావమే స్థాయీభావ మగును. మానవుని కనేక భావములు జనించినను నేదే నొక్క భావమే ప్రాధాన్యము వహించి మిగిలిన వానిని నడపుచు మనమునఁ జిరస్థాయి నంది. యుండును. అదియే జీవసూత్ర మనఁ జెల్లును. ముందుగ భావ మన నేమో పిమ్మట స్థాయీభావమన నేమో స్థాయీభావమే యేట్లు రసమునకు సిద్ధియగునో విచారింతము.

భావమును లాక్షణికు లీ క్రింది విధమున నిర్వచించిరి: “సుఖదుశిఖాది కై ర్బావై ర్భావ సద్భావభావసమ్.” “దృష్టికి గోచరములగు వస్తువులదర్శనమువలన జనించిన సుఖదుఃఖాది భావములచే హృదయా వేళమునొందు నవస్థయే భావమగును, ఇయ్యది భావన, వాసన యనుపదముల నుండి జనించినది. ఇతర వస్తువులకు సైతము సువాసన నొసఁగుభావమే యిచట గ్రాహ్యము” దీనితాత్పర్య మిట్లు చెప్పఁదగును. కన్నులకు గోచరించువస్తు. వులదర్శనమువలన మానవునకు సంతోషముగాని, దుఃఖము. గాని జనించును. అట్లు జనించిన సుఖముగాని దుఃఖముగాని హృదయము నా వేశించినచో నయ్యదియే భావమగును. అట్టి • భావావేశమువలన మిగిలిన వస్తు జాలమంతయు భావానుగుణ దగురూపమును దాల్చును. అదియే భావన. అట్టి భావనయొక్క విజృంభణమే భావనాశక్తి యనఁ బరగును. అట్టి భావనాబల మునఁ గవి 'కావ్య నిర్మాణముఁ గావించి ప్రకృతియందునను మానవ జీవితము నందలి వివి ధావస్థలయందునను సౌందర్యమును బ్రదర్శించి స్వయముగ నానందము ననుభవించి యితరుల నానందము ననుభవింపఁ జేయును. భావనాశ క్తి ప్రశంస యిండొకచో విరళముగఁ జేయుగము. ప్రకృతము భావమునకును, రసమునకును గల సంబంధమును విచారింతము,

రసజన్మ కారణము భావానుభవమే.

భావానుభవమే రసజన్మ కారణమని యిదిపటికే తెలిసి కొంటిమి. అట్టిభావానుభవమే వివిధ ప్రస్తార భేదములనొంది తుదకు స్థాయీభావముగఁ బరిణమించి సిద్ది. బడయు నేని ప్రకృతము హెచ్చరికఁ గావించు చున్నాను. కావున స్థాయీ భావము సిద్ధించుటకుఁ ప్రథమమున నిసర్గ టైశ్యుముగల భావా సుభూతి కారణముగ జనింపవలెను. అట్టిభావానుభూతి యకా'రణముగ జనించునని తెల్పియుంటిమి. అట్టి యకారణజనిత భావానుభూతిఁ గవియొక్క జన్మాంతర లబ్దసంస్కారబలమే యాధారమును, కారణమును నగునని తెల్పితిమి. కవియొక్క, చిత్తసంస్కారమునకుఁ బరమేశ్వరుని యవ్యాజకరుణయే మూల "కారణము. అట్టిజన్మ ప్రకారమునే వైదిక ద్రష్టలు సదనాద్రి తస్య మనుపలుకులను, నాలంకారిళులు అలౌకిక యను విశేషణము నను సూచించిరి. సూచితమాత్ర పూర్వములగు నీవిషయముల సవిమర్శముగఁ జర్చింతము,

భావోదయమునకు జనాంతర సంచిత చిత్త సంస్కారమే కారణము.

భావోదయమునకుఁ గారణ మేమి? అకారణముగ భావో దయ మగుననియు, జన్మాంతర లబ్దమగు చిత్తసంస్కారమే యందుకు మూల కారణ మనియు సూచింపఁబడినది. ఈభావమే యీ క్రిందిపద్యములను ధ్వనించుచున్నది.

 ప్రేమకారణము. కారణం బేమనందునో 'కాంత,
నీదు ముద్దుమోమందమో లేక, మోహపార

వశత నిటునటు చలియించు వాలుఁగనుల
యందమో, కెంపుఁ బెదవుల సందునుంచి
తొంగిచూచుచు వెంటనే తోలగిలోని
కేఁగుచును మోముసీమపై నిచట నచట
మెఱపు మెజిపించు మవ్వంపు చిఱునగవుల
చందమో, లేక ముంగురులంద మౌనో?
 ప్రేమకు నల్గు కారణం బేమనఁగల
మింతిరో! నిన్ను ఁ జూడఁ బ్రేమించుటె చుమి!
ఇంతియేకాని వేట్వేర నెంచి చూచి
యందఁపుఁదళుక్కులని ప్రేమ నందఁగలనె?
దెలియు మాత్మను నాత్మను గలిపి కుట్టు
దార మే నాదు ప్రేమకుఁ గారణమ్ము.

పైన నుదహరింపఁబడిన పద్యములఁ బ్రేమ కారణ మరయుటకుఁ గవి ప్రయత్నించినాఁడు." "ముద్దుమోమందము" కాదు. "మోహపారవశ్యమున నిటునటు చలియించు వాలుఁగనుల . యందము" కాదు. "కెంపుఁ బెదవులసందునుండి తొంగిచూచుచు వెంటనే తొలఁగి లోని కేఁగుచును మోముసీమపై నిచటనచట మెఱపు మెఱపించు మవ్వంపుచిఱునగవుల చందముఁ” గాదు, "ముంగురులందము”ను గాదు. మఱి ప్రేమకుఁ గారణ మేమనఁ దగును? ఇంతని జూచుటయే ప్రేమించుట. అనఁగఁ జూచుట తోడనే ప్రేమించి తీరవలె ననుటయే. ఇంతియే కాని వేర్వేర సెంచి చూచి యందఁపుఁ దళుక్కులనే ప్రేమనందుట సంభవించునే? మఱి ప్రేమకుఁ గారణ మేమి? "ఆత్మను ఆత్మను కలిపి కుట్టు : దార మే” ప్రేమకుఁ గారణము. అనఁగ జనాంతరలబ్దచిత్త


సంస్కార బలమున నాత్మ కును వేవోకయాత్మకును సంబంధ మేర్పడును. ఆసుబంధము వలననే ప్రేమ జనించునని సూచింపఁ 'బడినది. ఆత్మకు నాత్మకుఁ గలయనిర్వాచ్యమును నకారణ జనితమును నగు సంబంధమే ప్రేమకుఁ గారణ మగునను భావము పరిస్ఫుటమగు చున్నది. కావున భావానుభూతీకి జన్మాంతరలబ్దమగు చిత్తసంస్కారమే కారణమనియు, బాహ్యకారణ ములు సూచింపఁ బ్రయత్నించుట యప ధానవిషయము నాధారముగఁ గొనుటయే యనియు స్థిరమగుచున్నది.

స్థాయీభావము-ఆలంకారిక నిర్వచనములు.

అకారణజనితమగు నీభావానుభూతియే వివిధావస్థల ననుభవించి విభావాదికముల పరామర్శనొంది స్థాయీభావము నొందునని తెల్పియుంటిమి. అట్టి స్థాయీభాప తత్త్వమును బరిశీలింతము. ముందు స్థాయీభావమునకు లాక్షణికు లొసంగిన నిర్వచనములఁ బరిశీలించి, పిమ్మట సోదాహరణముగ దాని తత్త్వముఁ జర్చించి, రసస్వరూపము నిరూపింతము. సుప్రసిద్ధ నిర్వచనముల రెండిటి నుదాహరించెదను:--

 విరుద్ధైరవిరుద్ధైర్వా భావై ర్విచ్ఛిద్య తే న యః
ఆత్మ భావం సయత్యన్యాన్న స్థాయీ లవణా కరః,
సజాతీయై ర్విజాతీయైరతిరస్కృతమూర్తిమాన్,
యావరసం వర్తమానః స్థాయీభావ ఉదాహృతః.

(రసగంగాధరము.) పై రెండు నిర్వచనములలో మొదటిది రసవత్తరముగను, భావగంభీరముగను నున్నది; రెండవది వ్యాఖ్యానరూప ముగ నున్నది. మొదటి నిర్వచనమున స్థాయీభావము లవణా కర మనఁగా సముద్రముతోఁ బోల్చబడినది. సముద్రమివ గాంభీర్య యని రామాయణమునఁ జెప్పఁబడినట్లు స్థాయి భావము గంభీరమైనది. అంభోనిధి యింకు నంతటి స్థితి యసం భవముకదా? ఆకల్పాంతము నంభోనిధి చిరస్థాయిగ నుండ వలసిన దేకదా! కావున స్థాయీభావముయొక్క స్థిరత్వము సూచితమగుచున్నది. ఎన్ని నదులు వచ్చి కలసినను, నెన్ని నదు లెండిపోయి కలియకపోయినను సముద్రముమాత్ర మచలమై 'యుండునట్లే స్థాయీభావముఁగూడ విభావాదుల పరామర్శ యున్న ను లేక పోయినను గూడ నచలమై యుండునని స్ఫురించుచున్నది. ఎట్టియమృతము వంటి నీరైనను సముద్రములోఁ బడినంతనే యుప్పనగురీతిని నెట్టివిరుద్దములగు వ్యభిచార భావము లైనను స్థాయిభావమునకు వశములై దానిలో లీనములై దానియొక్క స్వరూపము నే పొందును. నిర్వచనము యొక్క యర్థమును విచారింతము, “విరుద్దములును, అవిరుద్ద ములును నగు భాపములచే నిరోధింపఁ బడకను భేదింపఁ బడకను సర్వమును నాత్మ భావపూరితముగ ననఁగా సర్వమును దనయొక్క రూపమునే తాల్చునట్లుగాఁ జేయునదియు, లవణా కరునిఁ బోలినట్టిదియు నగుభావమే స్థాయిభాష మనఁదగును.” నిర్వచనమున స్థాయిభావము యొక్క యచలత్వమును, సర్వ వశీకరణ, సర్వభక్షణశక్తియు విశదీకరింప బడినవి.

లవణాకరోపమయొక్క సార్థకతయు సందర్భశుద్దియు.

లవణాకరోపమానమువలన స్థాయీభావము యొక్క గాంభీర్యమును, నాకల్పాంత స్థాయిత్వమును ధ్వనించు చున్నవి. సకలచరాచర సృష్టికిఁ బూర్వము జలముమాత్రమే నిండియుం డెను. సకల ప్రపంచమును లయమైన పిదప మహాప్రళయరూపమున జలమే నిండియుండును. సృష్టి యొక్క యాచ్యంతములు - జలములోననే సంభవించు చున్నవి. అట్లే రసము జనించునప్పుడు, సనఁగా విభావాదిగుణవి శేషములతో నొప్పు రసజగత్తు కవిచే సృష్టింపఁబడక పూర్వమును, రసజగత్తు అంతమై లీనమైపోవు నప్పుడును సాయీభావమే మిగిలియుండుననుభావము స్పురించు చున్నది. రసజన ప్రకారమును రససిద్ధి ప్రకారమును సూచితము లగుచున్నవి. అగాధమగు సముద్రమునకు లోఁతెట్లు తెలియదో యట్లే స్థాయీభావముయొక్క లోతును నగాఢత్వమును దెలియఁజాలము, సముద్ర గర్భమున నడఁగియుండు ముత్యములకును, రత్నములకును నెట్లు విలువ నేఱ్పఱింపఁ జాలమో యట్లే స్థాయీభావము వలన జనించు నపూర్వసౌందర్య యుతములగు విభావాదికముల రుచినిగూడ నింతయని నిర్ణయిం పజాలము. భూమిపై నంబలె సముద్రము నందుఁగూడ ననేక ములగు జీవరాసు లెట్లు జీవించునో, యట్లే రసజగత్తు కూడ బాహ్య ప్రపంచమునకు సరిసమానముగఁ దులఁదూగు నట్లుండు ననియు, రసజగత్తునందునను వింత ప్రకృతులును ననేకములగు జీవరాసులును బ్రభవిల్లు చుండుననియు సూచింపఁ బడినది. పంచ భూతాత్మకమగు నీ ప్రపంచమున, ననఁగ పృథివ్యాపస్తేజో వాయు రాకాశయుతమగు నీసృష్టియందు జలరూపమగుసము 'ద్రమున కెంత ప్రాముఖ్యము కలదో యట్లే ధర్మార్థ కామమోక్ష. సంయుతమగు మానవధర్మమున రసమునకుఁ బ్రాముఖ్యము కలదని సూచితమగుచున్నది. "ఉప్పే పస రుచుల కెల్ల” సను లోకపామ్యమునంది సకలరుచుల కెల్లను నాధారమును, నాస్పద మును నగు లవణమునకు మానవ జీవితమున కెంత యవసరము కలదో అట్లే మానవ జీవితమును రసవంతముగను నానంద మయముగను నొనరించు రసమునకు మానవ జీవితమునందు. గల యావశ్యకము వ్యక్తమగు చున్నది. సముద్ర నాదమును, సముద్ర దర్శనమును నెట్లలౌకిక భావానుభూతిని, అలౌకి కానందమును జనింపఁ జేయునో అట్లే రసస్పర్శనయు రసాను భూతియు నలౌకికానందమును నలౌకిక భావానుభవమును జనింపఁ జేయును. ప్రపంచము నందలి వివిధ దేశములకు సముద్ర, "మెట్లు రాకపోకలఁ గల్పించి సంబంధము గలిగించునో అట్లే రసము, అనఁగ రసభావమే రాజకీయవి ద్వేషములచే విచ్చిన్నమైన మానవజాతి నేకసూత్ర బద్దముఁ గావించి, టెన్నిసన్ అను నాంగ్లేయకవియు, గురుజాడ అప్పారావు గారును నీ క్రింది పద్యముల సూచించినట్లు మానవ జూతీయం దైక్యభావము పెంపొందించి మానవకళ్యాణమునకుఁ దోడ్పడుననుభావము. సూచితమగు చున్నది.

"A commonwealth of Dations and federation of worlds'" జూతులసంఘమును లోకముల సమ్మేళమును” నని పై మాటలు యర్థము .)

  చూడు మునుమును మేటివారల
మాటలనియెడు మంత్ర మహిమను
జాతిబంధములన్న గొలుసులు
జూరీ సంపద లుబ్బెడు. ఎల్లలోకము నొక్కయి బ్లె వర్ణ భేదము వెల్లకల్లె
వేలనెఱుఁగని ప్రేమబంధము వేడుకలు కురియ,

ఆంధ్ర కవిత్వ 8

మతములన్నియు మాసిపోవును
జ్ఞాన మొక్కటి నిలిచి వెలుఁగును
అంత స్వర్గసుఖంబు లన్నని
యవని విలసిల్లున్

సూత్రప్రాయముగ నున్న మొదటి నిర్వచనమున నంతర్గర్చిత ములుగనున్న భావములను గొన్నింటిని సూచింపఁగల్గితిని, మిగిలిన భావములు విశిష్టసంస్కారులకు గోచరింపకపోవు. " - పండిత రాయల నిర్వచనము. ఆ ఇఁక వ్యాఖ్యాన రూపముననున్న పండిత రాయల నిర్వచ నమును గొంచెము పరిశీలింతము. సజాతీయములును విజ తీయములును నగుభావములచే మార్పుఁజెందని మూర్తిగల దియు, రసమునంతయు ప్రదర్శించు నట్టిదియు నగుభావమే స్థాయీభావమని చెప్పఁబడినది" ఈనిర్వచనమునందలి "సజా తీయవిజాతీయ” అనుపదములు మొకటి నిర్వచనమునందలి “విరు ద్దైరవిరుద్ధా” అనుపదములయర్థమునే యొసంగుచున్న వి. ప్రధానభావము తదనుగుణములును విరుద్ధములును నగు భావములచే మార్పునొందక రసమును సర్వమును ప్రదర్శించు ననియే పండిత రాయల నిర్వచనముయొక్క" యర్థము. మొదటి నిర్వచనమునందలి “ఆత్మ భావం సయత్యన్యాన్” అనుభావ మును, లవణాకరునితోటి సామ్యత్వమును భావగాంభీర్యమును బండిత రాయలనిర్వచనమునఁ గానరావు,

స్థాయీభావమే రసము.

ఈ కావున స్థాయీభావమునకుఁ బ్రధానలక్షణము విభావాది కము చేతను విరుద్ధములగు పంచారీవ్యభిచారాదిభావముల చేతను విచ్ఛిత్తినొందక, యచలమై చిరస్థాయియై, సర్వభావములను నాత్మ రూపమును దాల్చునట్లుగఁ జేసి వాని యన్నిం టికిని స్వకీయ వాసన నొసఁగుననుటయే. ఇట్టి స్థాయీభావమే రసమగునని మనలాక్షణికులు నిర్వచించి దానికే ' ప్రధాన అంగి ' యనునామాంతరముల నొసంగియున్నారు. రసముయొక్క యాశ్రయమును గూర్చియు, వానియొక్క యనంతవైవిధ్య మునుగూర్చియు, వేఱొకచో ముచ్చటింతము. ముందు రస స్వరూపము మనలాక్షణికులు నిర్వచించినప్రకారము తెలియం జెప్పెదను. రసము లన్నింటిలో మనవారు శృంగారరసమునే యెక్కువ విపులముగఁ జర్చించి యున్నారు.

రసముయొక్క బాహ్యస్వరూపము. "స్వాద " నిర్వచనము.

మన లాక్షణికులు రసముయొక్క బాహ్యస్వరూపమును నిరూపించు సందర్భమున, "స్వాదః కావ్యాఘసం భేదాదా త్మానందసముద్భవః " ఆను సూత్రమును గావించినారు. వీనికి "కావ్యార్దేన విభావాది సంసృష్టిస్తాయ్యాత్మ కేన భావక చేతసః సంఖేదే ప్రత్య స్తమిత స్స్వపరవిభాగే సతి ప్రబలతర స్వానందోద్భూతి స్స్వాదః" అను వ్యాఖ్యానము గావింపఁబడినది. ఈసూత్ర వ్యాఖ్యానముల రెండింటివలన వ్య క్తమయినభావము లేవన:--- స్థాయీభావమునకు విభావాదికమును గలిగిన కావ్యమునందు వర్ణితములయిన వస్తువులతో మనసు పూర్ణముగ స్వపర భేదము లేకుండ లగ్నమగుట వలన జనించు ప్రబలతరస్వానం దానుభూతియే స్వాదము, కావ్యమునందు స్థాయి సంహారీ వ్యభిచారిభావములు ప్రదర్శింపంబడును. అనేకవస్తువులు వర్ణిం పఁబడును. అట్లు వర్ణింపంబడినవ స్తువుల యందుఁ గవియొక్క మనస్సు లగ్నమయినప్పు డనఁగాఁ గవి 'నేను, సమభావమును వీడి వర్ణించు వస్తువునం దే లక్ష్యముంచి యహమును వీడి వస్తువు. సందు లీనమయి పోవునపుడు తత్ ఫలితముగఁ గవికి , ప్రబలతరానందము జనించి తీరును. అట్టియానందమునే మనలాక్షిణికులు స్వాదమని నిర్వచించిరి. స్వాదమనఁగా స్థూలముగఁ జెప్పిన రసపారవశ్యమే!

స్వాదము యొక్క జన్మ ప్రకారము,

ఇంతవఱకు మనలాక్షణికులు చెప్పినది సరిగ నున్నది. కాని, వివాదమున కవకాశ మీక్రింది విషయమునఁ గలుగు చున్నది. అదెద్దియన?

ఈస్వాదము పృపథమమునఁ గవి వస్తువును సందర్శించుట తోడనే కలుగునా? లేక విభావానుభావాదికముగల వర్ణనానంతరమునఁ దత్ ఫలితముగఁ జనించునా! ఈ ప్రశ్నము యొక్క భావము విప్ప చెప్పిన నిట్లుండును. కవి రసపారవశ్య మును ననఁగా స్వాదము ననుభవించి "కావ్యరచనకుఁ గడఁ గునా? లేక యూరక కావ్యాలాపముఁ గావించి 'తీయఁగా తీయఁగా రాగమును, మూలుగంగా మూలుగంగా రోగమును' నన్నట్లు దుదకు స్వాదమును ననుభవించునా ? అనియే. ఈ ప్రశ్నకు సమాధానము రసజన్మ ప్రకారమును సూచించు సంద ర్భమున నిరూపించియుంటిమి. కవి సాక్షౌద్ద్రష్ట, అట్టిసాల్ట్ అట్టి సాక్షాత్కారమును దివ్యదృష్టియును లేనికవి యుత్తమకావ్యముల రచింప నేరఁడు: కావ్యనిర్మాణశక్తి యనఁగా రసాస్వాదనశక్తి జన్మాంతరలబ్ధచిత్తపరిపాకము ననుసరించి కవికి లభ్యము గావలయునేకాని యూరక సాక్షాత్కారబలము లేక దివ్యదృష్టి లేక గ్రంథపఠనమును నలంకారశాస్త్రపఠనమును గావించినంత మాత్రమున రాదు. స్వాదమనునది. హృదయసంబంధవిశేషమే కాని యూహవిశేషము గాదు. స్వాద మెప్పుడును ననుభవ నీయమేకాని నిర్వచనీయమును సిద్ధాంతీకరింపఁదగినదియును గాదు. స్వాదమునకును వివిధాంశములును, వివిధాంతరములును గలవు. కాని, నిసర్గముగ స్వాద మకారణజనితము. జన్మాంతరసంచిత చిత్తసంస్కారముచేఁ బరిపక్వమయిన కవి హృదయము వస్తువులసందర్శించినప్పుడు స్వాదము జనించును. అట్లు జనించిన స్వాదమే వివిధావస్థల నొంది స్థాయీభావ రూపమున సిద్ధినొందు ననియే మామతము.

రసమునకు జన్మ కారణములు,౧. రసికుని చిత్తపరిపాకము ౨.వస్తుసందర్శనము.

రసస్వరూపనిర్ణయముఁ గావించుటయందు రసము యొక్క జన్మప్రకారమును, వృద్ధియు, సిద్ధియుఁ,జర్చనీయములు. జన్మప్రకారము అనఁగా _జన్మకారణము_రసికునియొక్క జన్మాంతరలబ్ధచిత్తపరిపాకమే. అనఁగాఁ గవియొక్క జన్మాంతర లబ్ధచిత్తపరిపాకమువలన వస్తుదర్శనానంతర ముద్భవించు స్వాదమే యగును. రసము వస్తుదర్శనానంతర ముద్భవింపవలసినదే కాని శూన్యత నాశ్రయింపదని మున్నే యెఱింగించియుంటి. ప్రపంచమునందలి వివిధరసప్రవృత్తులకెల్ల వస్తుసందర్శనమే ప్రధానాశ్రయము. అట్టి వస్తుసందర్శనము జన్మాంతరలబ్ధచిత్తపరిపాకము గలిగిన కవిమనమున స్వాద ముదయింపఁజేసి మెఱపు మెఱసినట్లు భాషమును జనింపం జేసి కవిని స్తంభితుని గావించి యేఁగును. ఈభావము మనలాక్షణికులకన్న పాశ్చాత్వలాక్షణికులు స్థూలముగను, నరవిందఘోషు సూక్ష్మముగను జర్చించినారు. రస ప్రవృత్తికి నకారణజనితస్వాదమే కారణమని మనవారు గ్రహించినట్లు స్పష్టముగఁ దోఁచుట లేదు. మన వా రెంతవఱకును నవస్థాదికమున భావము పరిపక్వము నొంది తుదకు స్థాయీ భావముగఁ బరిణమించునని తెలుపు చున్నారు మామతమున, రసము చిత్తపరిపాకము నను సరించి రససందర్శనానంతరమున జనించి పర్యాలోచన మనఁదగు విభావానుభావాది వివిధావస్థల యనుభూతి వలన స్థాయీత్వము నొందుననియే? రసమునకుఁ గారణ మాథ్యాత్మికముగాని, భౌతికము గాదు. ఎట్లనఁ: గవికిఁ జిత్త సంస్కారమే ప్రధానగుణ మగుటచే నదీ లేనివారికి రసాను భూతి యసంభవమగును. కనుక జన్మాంతరసంస్కారముఁ గల వాఁడయ్యు భౌతికవస్తువు నాధారముగఁగొని తనజన్మాంతర సంస్కారవాసన నావస్తువున కొసఁగి తద్భావనావిశేషమున స్వొదమును ననఁగా నపరిమితానందమును బొందినవాఁడగును. ఈమతముయొక్క సిద్ధాంతము ప్రకారము. వస్తువులలో నిసర్గముగ దుర్గుణము లుండవనియు, నట్టిదుర్గుణములకుఁ గార ణము కవియొక్క జన్మాంతర సంస్కారాభావత్వమే యనియు స్పష్టమగుచున్నది. ప్రకృతియందలి సర్వవస్తువులును స్వాదము నొసంగఁగలుగును గాని యట్టిస్వాదము సంస్కారికిమాత్రమే జనించును. అట్టిస్వాదము సంస్కారముగలిగిన కవికి నెట్టి వస్తువుషలననైనను గలుగును. స్వాదము హృదయానుభూతమే కాని వేఱుగాదు. అనుభవించువానికిఁ జిత్తసంస్కారమువలన నేవస్తువునందు మనంబు లగ్నంబగునో యావస్తువే స్వాదమునకు బాహ్యాశ్రయ మగును. అనఁగాఁ బైకి నావస్తువే స్వాదము జనింపఁ జేయునట్లు దోఁచును. నిజమరసిసఁ గవి యొక్క సంస్కార వాసనయే వస్తువునకు స్వాదజనకత్వము నాపాదించును. ఎట్లనఁ: బూవుయొక్క పరిమళము చేఁ జుట్టునున్న ప్ర దేశమంతయు సువాసిత మగునటుల; ఈభావమే 'తాను మునిఁగినది గంగ తా వలచినది రంభ; తన చావు జగము గ్రుంగుట' యనులోకోక్తుల వ్యక్త్యమగుచున్నది. ఈభావ మునే విక్టర్ హ్యూగో యను ఫ్రెంచి కవీశ్వరుఁ డీ క్రింది వాక్యమున వివరించెను.

["There is no forbidden fruit is the beautiful garden of Poesy." (Victor Hugo.)]

(సుందరశరకవిత్వోద్యానమున వర్షనీయమగు ఫల మొక్కటియు లేదనియు సర్వఫలములును రుచికరమలును నవశ్యగ్రహణీయములును: ) అని పై మాటల యర్థము. ప్రతి వస్తువును నిసర్గముగ నేదోయొక గుణవిశేషమును గలిగియుండును, అట్టిగుణవి శేషము నాస్వాదించి వ్యక్తముఁ జేయువాఁడే కవియగును. అట్టికవి దనశక్తిచే నెట్టివ స్తువునయినను రసదృష్టితో నవలోకించి తత్ఫలితముగ రసాస్వాదమును ననుభవించు ననియే పై వాక్వము యొక్క భావము. కావున నింతపఱకుఁ దేల్చిన దేమనఁగా రసమునకు జన కారణము రసికుని) జనాంతర సంస్కారమువల్లను, వస్తుదర్శనమువల్లను, ఫలితముగ జనించు స్వాదమే యని. వాని యొక్క సంసర్గమువలన హఠాత్సంభవ మగు నలౌకికానందమే స్వాదమగు. ఆట్టిస్వాదమే రసజన్మ కారణ మగును.

120

ఇంక రసము యొక్క వృద్ధిని గొంచెము విచారింతము: మనలాక్షణికులు విభాపోనుభావాదు లే రసముయొక్క వృద్ధిని సూచించునవి యని కొంచె మించుమించుగఁ దెల్పియే యున్నారు. అట్లు దెల్పినవారిలో ముఖ్యుఁడగు నభినవగుప్త పొదాచార్యుని యభిప్రాయము నిదివరకే చర్చించియుంటిని. విభావాదిక ప్రశంస గాక, రసముయొక్క వృద్ధినిగూర్చిన ప్రశంస యలం కారశాస్త్రమునఁ గొన్ని కొన్ని సందర్భములఁ జేయఁబడినది. శృంగారరసము యొక్క దశావస్థల నిరూపణమ యిందులకుఁ దార్కాణము.

శృంగారరసము యొక్క దశావస్థలు.

  శ్లో. “దళావస్థస్స త త్రాతాదావభిలాపో2థ చింతనమ్,
సృతిర్గుణకథో ద్వేగ ప్రలాపోన్మాదసంజ్వరాః;
జడతా మరణం చేతి దురవస్థం యథో త్తరమ్”
దృజ్ -మనస్సంగ-సంకల్ప-జాగరాః, కృశతా, రతిః,
హ్రీత్యా గోన్మాద మూర్ఛాంతా ఇత్య నంగదళా దళ"

ఆదియందు నభిలాషము, పిమ్మట చింతనము, పిమ్మట స్మృతి, గుణవర్ణనము, ను ద్వేగముఁ, బ్రలాపము, నున్మాదము, జ్వరార్తి, జడత, మరణము; ఆనుదసశావస్తలు శృంగార రసవిషయమునం జెప్పఁబడినవి.

చూచుట, మనస్సొంగత్యము, సంకల్పము, (అభిలాషము) జాగరము (అనఁగాఁజింతనము,) కృశించుట, ఆసక్తి, సిగ్గువిడు చుట, పిచ్చి, మూర్ఛ, మరణము; అనియు నింకొకరినిర్వచన మునఁ జెప్పంబడి యె.

రెండు నిర్వచనములును నేకార ప్రతిపాదకము లేకాని, రెండవ నిర్వచనమున దృక్ అనుపదమున భౌతిక వస్త్వను భూతి స్ఫుటముగ వచింపఁబడినది. మొదటి నిర్వచనమున నభి లాషమచు పదమున ధ్వని మాత్రముగ నున్నది. ఈయవస్థల క్రమముఁ దప్పకుండఁ గాదంబరీ కర్తయగు భట్టబాణుఁడు వర్ణించినాఁడు. ఈ యవస్థలు క్రమముగ సంభవించునా? లేక పాత్రముయొక్క స్వభావమును శక్తిని ననుసరించి కొన్ని మాత్రమే యనుభవింపఁ బడునా? అనునది వివాదాంశము.

రసముయొక్క యవస్థల వర్ణించుటలోఁ గవి సర్వస్వతంత్రుఁడు.

గావ్యమున నెప్పుడును రసప్రవత్తియే ప్రధానలక్షణముగ గణింపఁదగినది. అట్టి రసప్రవృత్తి కవియొక్క.. చిత్తపరి పాఠమును, జిత్తవృత్తులనుననుసరించునే దాని యొక నియమము ప్రకారము వృద్ధినొంద నేరదు. అనఁగాఁ గవి తాను వర్ణింపఁ దలచుకొన్న విషయము రసోచితముగ నుండుటకుఁ బొత్రములకు నేయేయవస్థలఁ గల్పింపఁదగునో, యేయేయవస్థల ననుభ వింపఁ జేయఁదగదో స్వబుద్దిబలమున యోచించి వర్ణించును. ఎట్లనఁగా నుపాధ్యాయుఁడు విద్యార్థులకుఁ బాఠములు చెప్పు నప్పుడు విద్యార్థుల తెలివి తేఁటల ననుసరించి కొందర కొకొక్క గ్రంథమునందుఁ గొన్ని యధ్యాయములు మాత్ర మే చెప్పి మఱియొక్క పుస్తకమును భారంభించును. కొందఱకు వరుస దప్పకుండ గ్రంథమాదినుండి తుదివఱకు బోధించును. 'తెలివిగల విద్యార్థి గ్రంథమున నొకటి రెండ ధ్యాయములు సదుపఁగనే పొత్తములోని సారమును గ్రహించి మిగిలిన భాగములను దనంతటఁ దానే చదువుకొని యన్వయించుకొనఁగలఁడు. మందమతియగు విద్యార్థి గురువునకును, దనకును గంఠశోష జనించునట్లుగ నుపాధ్యాయునిచే గ్రంథము సర్వముం జెప్పించు కొనును. కొందఱుపిల్ల లేఁ డాదిలోపల మందమతులు నాల్గేండ్లు. సదువు చదువును ముగించి పై తరగతులకుం బోవ నర్హులై యుందురు. కొందఱు మందమతులు సంవత్సరమున కొకతరగతిచొప్పునఁ జదువుచు జీవిత కాలమున సగము చదువుతోనే గడపెదరు. కొంద ఱొకసారి చెప్పఁగనే గ్రహించు నేకసంధాగ్రాహులు. కొంద టెన్నిమారులు చెప్పినను బాఠము రాని, వారు గలరు. ఉపాధ్యాయుఁ డిట్టి వివిధాంశములుగల బాలుర బుద్ధిబలమును గ్రహించి యెవరి కనుకూలమగు రీతి వారికిఁ బాఠ ములు చెప్పి విద్యయం దుత్తీర్ణులఁ గావించు.

రసముయొక్క దళావస్థాశ్రమమునకుఁ బాత్రలు.యధికారము ననుసరించి ప్రసక్తి కలుగును. 

అట్లే పాత్రములు చూచుటతోడనే భావో ద్రేకము నొంది రసపారవశ్యము జెందుదురు. కొందఱు. చూచినతోడనే భావోద్రేకము నొందక యేదో యొకరీతిని, జీవితము నెగ్గించుచు వివిధావస్థల నొంది తుదకు రసస్పర్శ ననుభవించినవారుం 'గలరు. పూర్వకాలపు టమాయకులందు భావోద్రేకముగాని రసపారవశ్యముగాని యేమాత్రము నను భవింపక గతానుగతికములగు లోకమర్యాదల ననుసరించి జీవితముఁ గడపుచు నే యొడిదొడుకులును ననుభవింపక స్వ స్వరూపమును స్వవిషయమును స్వోత్మోపలబ్దియు గ్రహింపని వారై జీవితములఁ జాలించువా రెంఱునుగూర్చి మనము వినియుండ లేదు? ఈభావమునే వర్డ్స్ వర్త్ అనునొకయాంగ్లేయ కవి మైకల్ అనుకావ్యమున వృద్ధులగు గొల్లదంపతులజీవిత మును వర్ణించుచు వారియనురాగమును ప్రశంసించుచు క్రింది విధమున వ్రాసెను.

"Thus, living on through such a length of years, The shepherd if he loved himself, must needs. Have loved bis helpmate."

(అనఁగా నన్ని యేండ్లు కాఃపురముఁ జేసినవాఁడగుటచే మైకేలు తన పెండ్లమును బ్రేమించియే యుండవచ్చును. తన్ను - దాను బ్రేమించుకొన్న యెడలఁ దన పెండ్లమును గూడఁ బ్రేమించియే యుండును. అని పై మాటలభావము.) మన పెద్దల కాలమున నిప్పటి భావోద్వేకమును నిప్పటి రసావేశమును దక్కువగనే యుండెను. ఇప్పటి కాలముననో యువతీయువకులు అవాచువ్వలుఁ బోలె భావోద్రేకమున రివ్వున బైకెగయు చుందురు. చూచుటతోడనే రసావేశము ననుభవించు ప్రణయినులు నేటికాలమునఁ జాలమంది గలరు. అట్టిరసహృదయులకుఁ జూచుటయు, భావానుభూతి ' నొందు టయు, రసపారవశ్యము నందుటయుఁ గూడ నేకక్షణ జనితములే యగును. వారికి మనయాలంకారికులుప దేశించిన దశావస్థల యసుభూతి క్రమాంతరముగ లభియింప నక్కలు లేదు. దశావస్థలయంత్య పరిణామమనఁదగు రససారవశ్యమును రససిద్దియు నేకక్షణముననే లభ్యమగును. అందులకనియే కవి పాత్రములయొక్క శక్తులను, జిత్తవృత్తులను, జిత్తసంస్కార ములను లక్ష్యమున నుంచుకొని దశావస్థలలోఁ దగినవానిని ననుభవించునట్లు చేయఁదగును. సింహమునకు మృగరాజు ఠీవియు, మత్తేభహననశక్తియు నేయవస్థాదికమును గ్రమాంతర ముగ ననుభవించుటచేఁ గలిగెను. మత్తేభమును జూచిన తోడనే కుంభస్థలము పైకుజీకి దానిని జీల్చి యందలిమాంసమును భుజించుగుణము సింహమునకుఁ బుట్టుకతోడనే జనించును. ఈ స్వభావమే 'పులిపిల్ల పులిపిల్ల యే, మేఁకపిల్ల మేఁక పిల్ల యే' అనులోక్తి గన్నది. తోఁకఁ దొక్కినతోడనే త్రాచుఁబాము కాటువేయునుగాని మానునా? తోఁకఁదొక్కిన మనుజుని గాటు వేయఁ బ్రయత్నించుటకు నాగుఁబామేయే యవస్థాదిక క్రమము ననుభవించును? తొక్కుడు పడుటయుఁ గాటొందుటయు నేక నిమేష జనితము లే.

అవస్థాశ్రమ మవశ్యానుభవనీయము గాదు.

కావున నింతకును జెప్పవచ్చిన దేమనఁగా : జన్మాంతర సుస్కారము ననుసరించి జీవికి రససిద్ది వివిధావస్థాశ్రమము ననుభవింప నవసరము లేకయే జనించును. జన్మాంతర సంస్కారము లేనివారికి వివిధాపస్థానుభవము రససికిఁ గారణభూత మగుఁగాక ! కావున నీయవస్థాశ్రమమంతయు వివేచనాబలము "నను, విమర్శన బలమునను దోఁచవలసిన దేశాని, కావ్యమున సంపూర్ణముగను నావశ్యకముగను వర్ల నీయముగాదు. రపాను భూతిలో మనలాక్షణికులు సూచించినయవస్థా క్రమ మంతర్గర్భితముగను, సూచీతముగను నుండవచ్చును. కాని, రసాను భూతి మాత్రము తప్పనిసరిగ నీయవస్థాక్రమము తప్పకుండ ననుభవించి తీజవలయుననుట భ్రమ ప్రమాదము. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు దెల్పినట్లు జలమునందు ఆక్సిజ, హైడ్రోజన్" అను. రెండువాయువులు కలిసియుండును. వేర్వేరుగ ఆక్సిజ హైడజనులఁ దయారుగావించి మిళితముఁ జేసిన జల ముద్భ వించును. ఇంతవఱకును శాస్త్ర సమ్మతమే, కాని సృష్టికర్తయగు పరమేశ్వఁడు మొట్ట మొదట ఆక్సిజన్ సృజియించి పిదప హైడ్ర జనును సృజించి యా రెంటిని మిళితముఁ జేసి జలమును సృజించెనని చెప్పఁ గలుగు బుద్ధిమంతుఁ డెవ్వఁడు నుండఁడని, మానమ్మకము.

ఈయవస్థాక్రమము యొక్క ప్రయోజనము తక్కువ యని నిరూపించుటకే యింతదీర్ఘ ప్రసంగముఁ గావింపవలసి వచ్చినది ఉత్తమపాత్రముల కెప్పుడును రససిద్ది యతి శీఘ్రముగ లభ్యమగుసు. మధ్యమాధమ ప్రకృతులకు రాయఁగా రాయఁగా రాతీయందు అఱువడిపడునట్లు వివిదావస్థల యనుభవమున నెన్న టిగో యొక సొంటికి రససిద్ధి కలుగు నేమో ! అందుకనే మృకండ మహర్షి యల్పాయుర్దాయుఁడై నను బ్రతిభాశాలియం జ్ఞానసిద్ది సత్వరముగఁ బడయఁగలిగిన సిద్ధుఁడును నగుకుమారునే దయ చేయుమనియు, దీర్ఘాయుష్టంతుఁడయ్యు జ్ఞానసిద్ధిని బడయఁ జాలని యల్పబుద్ధిని దయ చేయవలపదనియుఁ బరమేశ్వరుని వేడుకొనెను. మహాకవులును గావ్య నిర్మాణమున నీసూత్ర, మునే గ్రహించి యవలంబించిరి. రోఁకటిపాటవలె దశావస్థలం గ్రమముఁ తప్పకుండ నొకదానివెంట నొకటిని నొక్కొక్క ప్రకరణమున వడ్డించుచుఁ గావ్యముల ననవసరముగఁ బెంచి సీరస స్థితికి ద్చోడ లేదు. ఒక్క బాణుఁడుమాత్రము దశావస్థలను గ్రమముతప్ప కుండ నేక కావ్యమున వర్ణించియున్నాడు. కాని, కాళిదాసా మహాకవులును దశావస్థలను సొంగోపాంగముగ నొకేకావ్యమున వర్ణించుపద్దతి నవలంబింప లేదు. శ్రావ్యము అవస్థావిశేషవర్ణనల నముగ నుండవలయునుగాని యవస్థానము దాయముగ నుండఁదగదు. అనఁగాఁ బాత్రముయొక్క స్వభావమునకును గుణములగు నవస్థావిశేషములను మాత్రమే కవి వర్ణించి పొత్ర సంపోషణముఁ జేయవలయుఁగాని యూరక ప్రస్తుత పాఠశాలల విద్యార్థుల తరగతివారి చదువువలె వర్ణంచుట తగదని మామతము,

లాక్షణికుల చే నుదహరింపఁబడిన అవస్థాక్రమము యొక్క ప్రయోజనము.

లాక్షణికు లాదేశించిన రసావస్ట్రాకమ మవశ్యవర్ణనీయము గాకపోయినను విమర్శకునకుఁ గొన్ని విశేషములను బోధింపఁ గలుగు చున్నది. రస మెప్పుడును సృష్టిస్థితిలయము లను సవస్థాపరిణామ భేదములను నందుచుండుననియే లాక్షణి కుల యాద్దేశమునకు ముఖ్యోద్దేశమయి యుండును. రస మెప్పుడును బెల్లముఁగొట్టిన రాయివ లెం గ్రుక్కుమీక్కుమని యూరకుండక సచేతనులగు మానవులయవస్థావి శేషముల ననుసరించి యవస్థా భేదముల నందుచుండునని మనము ముఖ్యముగ నేర్చుకొనవలసిన విషయము, రస మెప్పుడును నేకస్థాయిని నిల్చి యుండదని యిదిపటికే తెలిపియుంటిని, ఆభావమునే ప్రస్తుత సందర్భమున నీ క్రింది విధముగఁ ద్రిప్పి చెప్పెదము, భావ మెప్పుడును నవస్థాయి భేదము నొందుచుండుననియు నట్టియనభేదము లన్నియు ననుభవించు మానవుని యవస్థాభేదములను, జిత్త వృత్తులను ననుసరించుచు సంపూర్ణమగు. చైతన్యము నొందు ననియు గ్రహింపఁదగు. భావము జనించునపుడు నిశితముగను తీక్లముగను జనించునని యిదివరకే తెలిపియుంటిమి. ఆట్లు జనించిన భావము మనవాది వివిధ ప్రసక్తులం దవిలి వివిధావస్థల నొందుననియు నట్టి వివిధావస్థలు విభావానుభావాదులచే సూచితము లగుననియు నిదివరకే సూచించి యుంటిని. సాధారణ ముగా మానవునిభావ మెట్లు జన్మించి వృద్ధినొంది. సిద్దిఁబోందునో సోదాహరణముగా నిరూపింపఁ బ్రయత్నింతును.

జనాంతరసంస్కారమువలన మానవుఁ డేదేని వస్తువును గాంచిన తోడనే జన్మాంతర సంస్థితమగు నాత్మసంబంధము వలన నావస్తువు నెడ మనసు తగిలినవాఁడగును. అట్లు మనస్సు తగులుటకుఁ గారణము మున్ను దెల్పినట్లు అవ్యాజమును, నకారణ జనీతమునునగు నాత్మ సంబంధమకాని వేఱుకాదు. ఇట్టి యాత్మ సంబంధము నే కాళిదాసు శకుంతలా దుష్యంతుల ప్రణయ సుదర్భమున సూచించెను. దుష్యంతుఁడు వేటకై చనీ తపోవసముననున్న శకుంతలను గాంచి యామె వివాహితయో, యవివాహితయో క్షత్రియ కన్యకయో, బ్రాహణ కన్యకయో, యెఱుంగక చూచుటతోడనే యామెయెడ బద్దాను రాగముఁ గలవాఁడయ్యెను. దుష్యంతుఁడు తనమనో వృత్తిని దానే వితర్కించుకొనుచు నీ క్రిందిళ్లోకమునఁ జెప్పిన భావమే మాయభిప్రాయమున స్పష్టపడియున్నది,

 శ్లో. అసంశయం క్షత్రపరిగ్రహక్షమా
యదార్యమస్యామఖిలాషి, మే మనః,
సతాం హి సం దేహప దేషు వస్తువు
ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః.

(ఈకన్యక నిశ్చయముగా క్షత్రియుఁడ నగునా చే బరిగ్రహింపఁబడఁదగినదే. నామనస్సు ఈమె పైదగులుటయే యిందులకుఁ దార్కాణము. బుద్దిమంతులగు సత్పురుషులకు సం దేహాస్పదములగు విషయములయందు నంతఃకరణ ప్రవృత్తు లనఁగా నంత రాత్మ యొక్క యా దేశము లే ప్రధానలక్షణములు. అని పై శ్లోకముయొక్క భావము.)

నిష్కల్మషహృదయు లేదేని వస్తువును బ్రేమించిరేని నయ్యది నిశ్చయముగఁ బ్రేమార్హమై యుండియే తీరవలయును. లేనిచో నట్టివస్తువులందు వారికి మనసు దగులుట యసంభవము. సత్పురుషులకు శుద్దాంతఃకరణముండుఁగాన నట్టి యంతఃకరణ ప్రవృత్తియే వారిసందియములను బాపి చక్కని మార్గముఁ జూపించుననియే పై శ్లోకాభిప్రాయము.

అట్లు ఆశ్రమమును దర్శించి యకారణముగఁ బ్రేమించిన యాశకుంతలా జన్మ వృత్తాంతము చెలికత్తెలవలన వినిదుష్యంతుఁడు మనమున నెంతయు సంతోషమును, శాంతిని నొందిన వాఁడయ్యెను. కానీ యిచ్చటఁ బ్రధానముగా గ్రహించ వలసిన విషయ మంతఃకరణశుద్దియే. అట్టియంతఃకరణశుద్దియే సర్వమును జక్కఁజేయఁ గల్గును. రసవిషయమున నెప్పుడును, సంతఃకరణశుద్ధి యనఁగా మనోనైర్మల్యము ఆవశ్యకము. అర్థముకొరకుఁ గాని, పదవులకోరకుఁగాని, అన్య ప్రయోజనముల కొఱకుఁ గాని వస్తువులను ప్రేమించుపట్ల నీయంతః కరణశుద్ధి లభ్యమగుట యసంభవము. చూచినతోడనే జన్మాం తరసంచితా నుబంధమువలనఁ బ్రేమించు శుద్దమనసుల ప్రణయము నిష్కల్మషమై, స్వచ్ఛమై ప్రకాశమానమై, భావోద్దీషక మై యొప్పును. అట్టి నిష్కల్మష ప్రణయమే 'కావ్య మున నవశ్య వర్ణ నీయమని రసహృదయులకు గోచరింపక మానదు.

ఈ రసాభివృద్ధియుఁ బ్రాణికోట్లయభివృద్ధి వోలె ఈ జీవసూత్ర బద్ధమై యుండును.

ఈ రసాభివృద్ధియుఁ బ్రాణికోట్లయభివృద్ధి వోలె ఈ జీవసూత్ర బద్ధమై యుండును. జనాంతర సంచితాత్తానుబంధము వలన జనించిన ప్రేమము. వివిధ రీతుల నభివృద్ధినొండి ఫలసిద్ధి, బడయును. చూడుఁడు.

1. ఉదాహరణములు. ప్రకృతి స్వభావము.

ప్రకృతి స్వభావము ఎట్లు ఈయభిప్రాయమును స్పష్టముఁ జేయుచున్న దో, చెట్టు పుట్టుట తోడనే. చెట్టైపుట్టుట లేదు గదా! విత్తుననుండి చిన్న మొలక యుద్భవించి యది. పెరిగి పెద్దదై శాఖోపశాఖలు గాంచి పూత బూచి, కాయగాచి ఫల, సిద్దిఁ బడసి యితరులకు ఫలదాన మొసఁగ సమర్థమయి. యున్నది. లతలును, బూవులును, గాయలును, సర్వమును నిట్టి, యవస్థాశ్రమమునే యనుభవించి యుద్భవిల్లి సంపూర్ణత్వ మును బొందిన వగుచున్నవి. మొగ్గనుండి పూవును, పూవు నుండి ' పిందెయుఁ, బిందెనుండి కాయయుఁ, గాయనుండి పండును, సంత రాంతరములుగ సభివృద్దిగోచర మగుట లేదా?

2. మానవునివిషయము.

మానవునిసంగతిఁ బరికింతము. మాతృగర్భమునుండి వెలువడి తల్లిపాల చేఁ బోషింపఁబడి వరుసగ శైశవమును, బాల్య మును, యావనమును, గౌమారమును, వార్ధక్యమును, మరణము గూడ, ననుభవించి తాను "మొదట "నేకాలగర్భమునుండి మరుగున వెలువడెనో ఆ కాలగర్భము నే చొచ్చు చున్నాఁడు. ఈభావము నే మనవారు 'మంటిలోఁ బుట్టి మంటిలోఁ జేరే' నని చెప్పుదురు. మట్టిలోఁ బుట్టి మట్టిలోఁ జేరువఱకు నీజీవి యనుభవించు సుఖ దుఃఖాదిక మనంతము. శైశవమున జీవి లక్ష్మీ సమానమగు మాతృవదనసందర్శనమున నేతృప్తిఁజెంది తజ్జనితానందముననే యోలలాడు చుండును. తల్లీకిని అప్పటికుమారుని యప్పలప్పల యను జిలిబిలి పలుకుల యవ్య కరమణీయవచన ప్రవృత్తులే యింపునింపును. అట్లు శిశువు పెరిగి పెద్దవాఁడై యాటపా టలఁ బొద్దుపుచ్చుచుఁ, బిమ్మట యావనము వచ్చినవాఁడై వయో విలాసమున విజృంభించుచుఁ, దల్లికి సంతసముఁ గూర్చును. పిమ్మటఁ బెద్దవాఁడై సంసారముఁ జేయుచు, నాలుబిడ్డలతో వర్ధిల్లుచుఁ దల్లి దండ్రులకు మనస్సంతోషముఁ గూర్చును. ఇట్లే మానవుని యొక్క వివిథావస్థలును నాత్మ సంబంధము గలి గిన తలిదండ్రులకు సంతోషమును గలిగించుచునే యుండును. మానవుని వివిధావస్థలవలనఁ జైతన్యమునకు సంపూర్ణత్వమును వైవిధ్యమును సిద్దించును. అట్లే ప్రణయమును వివిధా వస్థల వివిథానుభవముల నందినఁగాని సంపూర్ణత్వమునొంద నేరదు. నిష్కల్మషముగఁ బ్రేమిం చెడుమానవునకుఁ బ్రియు రాలిసర్వావస్థలును బ్రేమోద్దీపకములుగనే యుండునుగదా! ఈభావమే కొంచెము విపులముగఁ బర్చింపఁ బ్రయత్నింతుము. ప్రేమకుఁ గారణము జనాంతర సంచితహృదయానుబంధమని మున్నే తెల్పియుంటిని. అట్టి ప్రేమ హఠాత్సంభవముగాని వేరు గాదు. హఠాత్తుగ మెఱుఁగు మెఱసినట్లు మెఱపించి యేఁగిన ప్రియు రాలివదనమును, లావణ్యమును, ఠీవిని, నడకలయందమును బలుమాఱు సంస్మరించుకొనుచు జపతపస్స్వాధ్యాయ ములు సేయు యోగి యెట్లు పరమేశ్వరుని దివ్య తేజమును దర్శించి సిద్దిబొందునో యట్లే ప్రియుఁడును ఆపెయందు మనస్సు లగ్నముఁ గావించి తద్ద్యానబలమువలనఁ బ్రపంచమున సర్వమును నామెయందే యుపలక్షించి యామె దక్క నన్య ప్రపంచము లేదని నమ్మి యామెయే సర్వముగ భావించి యా మెయొక్క సర్వసుఖదుఃఖములను దనవిగనే భావించి యామె లేనిది బ్రదుకు దుర్బరమగునవస్థకుఁ బాల్పడి తుదకు నామెకై ప్రాణముల సహతము ధారపోసి యకారణలబ్దమును జనాంతరసంచితహృద యానుబంధ ఫలమును నగు ప్రణయసిద్ధిని బడయఁ జూచును. ఈభావమునే యనేక కావ్యముల నాయికానాయకులవిషయ మున గోచరించును. ఇట్టిభావము నాయికా నాయకులకుఁ బర స్పరమని కూడ గ్రహింపఁదగును. అట్టిపరస్పర ప్రణయాభివృద్ధి వలననే మానవునికి ఫలసిద్ధియుఁ, గావ్యమున రససిద్ధియు లభించును. ప్రకృతము రస స్వరూపు నిరూపణమునకు ననుకూలించు సుదాహరణములమాత్రమే కైకొని విమర్శింతము. ' -

శ్రీ సీతారామచంద్రుల ప్రణయ కధనము. 

అయోధ్యాపురాధీశుఁడగు దశరథ మహారాజు నడిగి విశ్వామిత్ర మహర్షి శ్రీ రామలక్షుణులను గొనిపోయి వారిచేఁ దాటకాసంహారముఁ జేయించి తనయాగమును కొనసాగకుండ నాటంకములు గలిగించు చుండిన రాక్షసులఁ జంపించి నిర్వర్తిత శృత్యుఁ డయ్యెను. పిమ్మట విశ్వామిత్రుడు 'రామలక్ష్మణులను దపోధనుఁడగు జనకునియాస్థానమునకుఁ గొనిపోయి యయోని సంభవయు, నిమిత్తమాత్రముగ జనకునియింట సున్నదియు నగు శ్రీజానకీ దేవిని శ్రీ రామచంద్రున కిచ్చునటు లేర్పాటు గావించెను. అనంతరము ఆర్యపద్దతిని జనకుఁడు:

 "ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీక్ష్య చైనాం భద్రం తే పొణిం గృహీష్వ పాణినా.”

యను వచనములఁ బలుకుచు సీతను శ్రీ రామచంద్రమూర్తి కర్పించెను. నాటనుండియు వారిరువురకును బ్రణయమభివృద్ధి జెందెను. తుదకుఁ బినతల్లియగు కై క్లయితంత్రము కారణముగ శ్రీ రాముఁ డడవుల కేఁగునప్పుడు సీతయు వలదని యితరులు వారించినను వినక భర్తతోఁగూడ నరణ్యమునకు జని యట భర్తతోఁ గూడఁ గాలముఁగడపుచు, నతనితోడి వాసమే స్వర్గభోగముగ నెంచుచు రససముద్రమున నీదు లాఁడుచుండెను. వివాహ వేదిక పై నొండొరుల సందర్శించు కొనునప్పుడు హఠాత్తుగ మెఱుపువోలె జనించిన సీతారాముల ప్రణయము చిరసహవాసయోగమువలనను, గష్టానుభవము వలనను, బరిశుద్ధ ప్రకృతి జీవనము వలనను, స్థాయీభావము నొందెను. పిమ్మట సీత "రావణుని చే నపహరింపఁబడుట తటస్థించె, ఆయవస్థ రామునకు దుర్బర మయ్యెను. తనసర్వస్వముగ భావించుచుండిన సీత దూరస్టురా లగుటచే నాతనికి బ్రపంచ మంతయు నంధకారమగ్నమైనట్లు తోఁచెను. జీవితపథమున విస్పష్టీకరించు దివ్య ప్రణయజ్యోతిగ భావించుచున్న సీత తనకు దూరమయిపోవుట చే నతనికి దారి తోఁపకుండెను. సీతకొరకయి యాతఁడు విలపించిన విధమంతయుఁ గరుణాస్పదము. సీత నన్యు లెవ్వరో యపహరించిరని భావించి సర్వ ప్రపంచమును నాళముఁ జేయుటకును, సర్వలోకములను డిందుపడఁజేయుట కును సర్వసముద్రములను క్షోభింపఁ జేయుటకును సమక టటెను, సీతాపహరణమునకై ప్రతి క్రియగ శ్రీ రాముఁడు కావింపం బూనినకృత్యములు లోకభీకరములుగ 'జాల్మీకి మహర్షి చే వర్ణంపఁబడినవి. ఇట్టి మహావైష్ణుర్య ప్రతీకారమునకు నిజమగు కారణము సీతయందుఁ దగిలి స్థాయికొందిన శ్రీ రాముని ప్రణయ రసమేకాని యన్యము గాదు. లవణాకరుఁడు సర్వమును గబళించునట్లును, నగ్ని దేవుఁడు సర్వమును సాహుతిగఁ గొని దహించునట్లును, రాముని ప్రణయము సర్వవిషయములను మఱచునట్లును, సర్వభావములను ద్యజించునట్లును, సీత దక్క నన్యము గోచరింపకుండునట్లును చేసెను. స్థాయీభావలక్షణ మదియేకదా!

శ్రీసీతారామచంద్రుల ప్రణయ వ్యాపారముల భావము నకు స్థాయి బాగుగ గుదిరినట్లు సంస్కృత గ్రంథములవలన స్పష్టమగుచున్నది. ఎంత స్థాయి గుదిరినది; అట్టి ప్రయాసముల కోర్చి సుగ్రీవాదుల సాయము నపేక్షించి యన్యాయముగ వాలిని సయితముఁ జంపి కొండయనక, కోనయనక, చెట్టనక, పుట్టయనక, సర్వ దేశములను వానరులచే వెదకించి సీతజాడ గని, సామాన్యమానవుల కజేయుఁడును, దపోధురంధరుఁడును “అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హిజంతుషం కరణాం విపాకః" అనుసర్యోక్తికి గాళిదాసుని చేఁ బ్రధాన లక్ష్యముగఁ గైకొనఁబడినవాఁడును, నహంకారస్వరూపుడును, నిజ శిరస్సులచే శివునకు నిత్యమునుఁ బూజయొనర్చునట్టి భక్తాగ్రే సకుఁడును, సపూర్వమే భావంతుఁడును, శౌర్య రాశియు నగు రావణునంత వానినిఁ బోర నెదిర్చి యమిత శ్రమమున కోర్చి, తుదకు నతని నిర్జించి, సీతను గైకొని యయోధ్య కరు థెంచి ప్రథమమున సగ్ని సాక్షిగఁ గొన్న యామెను దిరిగి యగ్నితప్తం గావించి స్వీకరించి నిర్వర్తిత ప్రతిజ్ఞుఁడై యుండును?

సీతా రాముల సౌఖ్యానుభవ వర్ణనము.

సీతారాముల ప్రణయము స్థాయీభావము నొందిన యంశ మును స్ఫుటముఁ గావించు శ్లోకముల రెండిటి నుదాహరించె దను. ఒకటి వారి సౌఖ్యానుభూతికి సంబంధించినది. మఱియొ కటి వారి వియోగమునకు సంబంధించినది. అందలి రసమును బాఠకులు గ్రహింతురు.

శ్లో. కిమపి కిమపి మంధం మందమాసక్తియోగా
దవిరళితకపోలైర్షల్పతోరగ్ర మేణ
అశిథిలపరిరంభ వ్యాపృతై కై కదోషో
రవిదితగతయామా రాత్రి రేవం వ్యగంసీత్.

ఈశ్లోకము భవభూతి కృతోత్తరరామచరిత నాటకము లోనిది. పూర్వము గోదావరీ తటస్థ నికుంజములయందు సీతారామచంద్రు, లనుభవించిన ప్రణయవ్యామోహము రామునిచే సీతాపునస్సంయోగకాలమున స్మృతిపూర్వకముగ వర్ణింపం బడినది. దీనిభావము తేఁటగ బోధించిన నిట్లుండును. సీతా రాము లిరువురును రహస్యముగ సరససల్లాపములాడు నవస్థ యిందు వర్ణింపఁబడినది. ఏమేమో మాటాడుకొను చుండిరఁట. ఆయాపు యాభావానురక్తి వారలకే గోచరింపవలయుఁ గాని, మనబోంట్లకు గోచరించుట దుర్లభము. అవిరళితకపోలులై -ఒకవరుస, యొకతీఱు.ఆనునది లేక యిష్టమువచ్చిన దేల్ల-- మనస్సునకుఁ దట్టిన దెల్లఁ బల్కుచు, సల్లాపములఁ గావించు చుండిరట! గాఢపరికంభమువలన జనించిన మందోష్ణసంస్పర్శచే నొడలు మఱచి యిగువురును బ్రపంచము సర్వమును మఱచి రస సిద్ధినొందినవా రయిరి. అట్టివారికి యామములును, నంతయేల? రాత్రి, సయితము గతించిన సంగతి తోఁచు నే? ప్రణయపారవశ్య మును భవభూతి యీశ్లోకమున నెంతయుఁ జక్కఁగ వర్ణించి నాడనుట నిస్సంశయము.

రసము స్థాయీభాపము నొందినప్పు డస్యవిషయములు స్మృతికి రాకుండును. స్థాయీభావముచే నావహింపఁబడిన రస హృదయులకు నిజభావనా ప్రపంచము దక్క సన్య ప్రపంచ ముండదు. సీతారామచంద్రులకును సౌఖ్య సమయమునఁ బ్రపంచము సర్వమును స్మృతిదూరమై అశిథిల పరిరంభ వ్యాపృతై కై కదోషత చేఁ బరవశు లయినవారికిఁ దాము గావించుకొను చున్న సల్లాపములయందలి యాసక్తిబలమున రాత్రి యంతయు గడచిన సంగతి కూడ గోచరింపదయ్యెను గదా! ఆహా! సౌఖ్యాను భూతి యన్న రసానుభూతి యన్న నిట్లే యుండవలయుఁ గదా!

శ్రీ రామునివియోగాపస్థావర్ణనము.

ఇంక సీతా వియోగమునఁ గార్శ్యమునొందియున్న రామునియవస్థ వర్ణించు శ్లోకము నొకదానిని స్మరింతము.

శ్లో. ప్రాసాదే సా, సథిపథి చ సొ, పృష్ఠత స్సొ, పురస్సా,
పర్యంకే సా, దిశి దిశి చ సా, తద్వియోగాతురస్య;
హంహో చేతః! ప్రకృతిరపరా నాస్తి తే కా౽పి సా,సా
సాసొ సాసా జగతి సకలే జయ మద్వైత భావః,

సీతా వియోగముచే మతి చెడి సీతాదర్శనమునే గోరుచు నెల్లప్పుడును దదేక ధ్యానమున నుండు రామునకుఁ బ్రపంచ మున నెల్లెడలను సీత కన్పించునవస్థయే యిందు వర్ణితము. దీని భావము విప్పి చెప్పిన నిట్లుండును.

సీతావియోగా తురుఁడగు రామునకు నేమేడయందుఁ జూచినను సీతయే! ఏదారిని జూచినను సీతయే! ముందునను సీతయే! వెనుకను సీతయే! ప్రక్క ను సీతయే! సర్వదిశలను సీతయే! ఆహా! ఏమి యామనోవైచిత్ర్యము! ఆయనకు నితర ప్రకృతి శూన్య మైతోఁచెను. సీతయే! సీతయే' సీతయే! సీతయే! సకలజగత్తును సీతయే! సీతవినా యాతనికి వేరు ప్రకృతి లేనే లేదు గదా! ఆహా! యేమి యద్వైతభావము! పై శ్లోకమున సీత యందు మనస్సును లగ్నముఁ గావించి యుంటచే రామునకు సర్వప్రపంచమును స్మృతివిదూరమై సీతదక్క నన్యము గోచ రింపదయ్యె. అనఁగా సీతాదేవి సురూపమే యాతనిమనస్సు సావహించి యాతనియందు స్థాయీభావము నొందెను. సీత యన్ననే ప్రపంచము! సీత తోడిదే సౌఖ్యము. సీతయే సర్వ జగత్తునను నేకరీతి వెల్లుచు జీవితపథమును విస్పష్టముగల జూపించు ప్రణయజ్యోతి! అట్టి సీత లేని ప్రపంచము అరణ్యముతో సమాన మని '

"వినా సీతా దేవ్యా కిమివ హి న దుఃఖం రఘుపతేః,

ప్రియానాశే కృత్స్నం కిల జగ దరణ్యం హి భవతి.”

యను శ్లోకమున భవభూతి వర్ణించినదంతయు సత్యముగను హృదయంగమముగను నున్నది.

రస పొరవశ్య స్వభావము,

రసముచే నావహింపంబడి రసము స్థాయీభావము నొందిన కారణమున రసజీవియగు నతనికి సకల ప్రపంచమును రన విషయముగనే గోచరించును. రసవిషయము దక్క నన్యవిష యము లాతని మనము నాకర్షింపంజాలవు. ఏయవస్థయందున్నను నెటఁ దిరుగుచున్నను నేకార్వముఁ గావించుచున్నను రసవిషయమే ప్రధానముగ నతనికి గోచరించుచుండును. ఈభావమునే రామభక్తుఁడగు శంకరాచార్యులు రామకర్ణామృత మున నీ క్రిందిశ్లోకమున వర్ణించెను.

 శ్లో. మార్లే మార్గో శాఖనాం రత్న వేపీ
వేద్యాం వేద్యాం కిన్న రీబృందగీతమ్;
గీతే గీతే మంజులాలాపగోష్టి
గోష్ఠ్యాంగోష్ట్యాం త్వత్క థా రామచంద్ర!

 శ్లో. పృక్షే వృక్షే వీక్షి, తాః పక్షి సంఘాః
సంఘ సం ఘే మంజులా'మోదవాక్యమ్,
వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠ.. '
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్క థా రామచంద్ర!

పై శ్లోకములకర్ణ మీ క్రిం విధమున నుండును.--

"ప్రతివృక్షపంక్తుల మార్గములందును రత్న వేదికలును వేదులందున వేదులందునఁ గిన్నరీసమూహముల గీతములును, గీతమందున గీతమందున మృదువైన యాలాపగోష్ఠియును, గోష్టియందున గోష్టియందున నోరామచంద్రమూర్తీ! నీదు కథయే వినంబడుచున్నది.”

"వృక్షమందున వృక్షమందున పక్షి సంఘములు కనంబడి నవి. సంఘముదున సంఘమందున మంజులమైన శుభాహ్వాన వాక్యమును, వాక్యమందున వాక్యమందున మంజులమైన ________________


యాలాపగోష్ఠియు, గోష్ఠయందున గోష్ఠియందున నోరామ చంద్రా! నీదుకథయే వినంబడుచున్నది.”

        పై శ్లోకములభావమును రసపరముగ నన్వయించి విమర్శింతము. భక్తుఁడొక యరణ్య 

ప్రదేశమునఁ ద్రిమ్మరు చున్నాడు. అట్టియెడ నతనికిఁ బ్రకృతి యెట్లు గోచరించెనో యిందు వర్ణింపఁబడినది. భక్తుఁడు రామపాదారవింద భజనతత్పరుఁడు. అట్టిభక్తునకు ప్రపంచము సర్వమును రామమయముగఁ గన్పడుటలో నాశ్చర్యము లేదు. ఈసత్వమే పై శ్లోకముల వ్యక్తమగుచున్నది. భక్తుడు చనెడు ప్రతిమార్గమునను వృక్ష శాఖలపైన రత్న వేదులు కనఁబడుచున్నవి. ఆరత్న వేదులపై సుఖోపవిష్టములయిన కిన్నరీ సమూహములు గీతములఁ బాడు చున్నవి. అట్టిగీతముల ప్రతిదానియందునను మంజులమగు నాలాపగోష్టి అనఁగా, మృదులమును రహస్యమునునగు సల్లాప గోష్ఠియుఁ దెలియనగుచున్నది. అట్టియాలాప గోష్ఠియందున శ్రీ రామచంద్రుని దివ్య చరిత్రమే వినవచ్చుచున్నది. వృక్షముల, పై నఁ బక్షులు గుమికూడి కూరుచున్నవి. ఆపక్షులు సంతోషముతో రారమ్మనునటులు పాటలు పాడుచున్నవి. ఆపాటలలో రహస్యమగు మృదుసల్లాపగోష్ఠి వినవచ్చుచున్నది. ఆ రహస్య సల్లాపగోష్ఠయందు శ్రీ రామచంద్రమూర్తియొక్క దివ్య, కథయే వినంబడు చున్నది. ఆయరణ్య సీమయందు భక్తుని చెవుల సోఁకెడునది యొక్క శ్రీరాముని దివ్యకథయే కాని వేఱుకాదు. వృక్ష శాఖలును, రత్న వేదులును, కిన్నరీబృంద గీతములును,, మంజులాలాపగోష్టియు, పక్షి సంఘములును, మంజులామోద ! వాక్యములును, మంజులాలాపగోష్ఠులును, శ్రీరామునీదివ్య కథ. వినిపించు సాధనములు మాత్రమే యగునుగాని, స్వతంత్ర, వ్యక్తులు కాఁజాలవు. మన భక్తునికి రామనామమే సర్వత, విని పించుచున్నది. తదితరము విన వచ్చుట లేదు. కారణము హృదయము రామనామపూరితమై యుండుటయే, మనము రామ నామామృతపానముచే మత్తిల్లి యుంటయే, కన్నులు రామ మూర్తిని దర్శించి దర్శించి యన్యమును గాంచ లేకుంటయే, వీనులు రామనామగానమునఁ దనిసి యన్యశబ్దముఁ జొర నీకుంటయే.

స్థాయీభావమునకును, రసికునకుఁ గల యద్వైతభావము,

ఆహా, స్థాయీభావమన నిట్టు లేకదా రసికుని హృదయ మును పశము గావించుకొనును! స్థాయీ భావము చే పశుఁడగు రసికునకుఁ బ్రపంచము. సర్వమును శూన్యముగను, రసవిషయమే సర్వమును శాశ్వతముగను గోచరించును. అంతయేల ? అన్య ప్రపంచము గోచరింపనే గోచరించడు.. ఒక వేళ గోచరించెడు వస్తువులైనను స్థాయీ భావమును దోహదము గావించుటకుఁ దోడ్పడు నే కానీ స్వతంత్ర వ్యక్తి గలిగియుండ నేరవు. స్థాయీభావమే సర్వము. స్థాయీభావమే సత్యము, స్థాయీభావమే సాధ్యము. తదితరములు సాధనమాత్రములు. అసంపూర్ణ సత్యములు. రామనామమే సర్వము, రామనామమే సత్యము, రామనామమే శాశ్వతము, రామనామమే సంపూర్ణ జీవిత పరమార్థము, ఇట్లు భావించుభక్తునకుఁ బ్రపంచము సర్వమును శ్రీ రామచరణారవింద ప్రాప్తికి , సాదన మాత్రములుగ గోచరించు నేకానీ స్వతంత్ర వ్యక్తిగలవిగను, పరమార్గములు గను, లక్ష్యములుగను, గోచరించునా? గోచరింపవు. అందు కనేకదా మహాభ క్తుఁడును రామపాదారవింద భజనతత్పరుఁడును నగు శ్రీ గోపన్న యను రామదాసుగారు రామపద ధ్యాన లోలుఁడై తత్పారవస్యయమున “అంతా రామమయం జగ మంతా రామమయ"మని గానముఁ జేసెను! ఆహా! రసప్రవృత్తి కన్న నుత్తమమగు జీవితాలంబన మేమి కలదు? అట్టిరసజీవులగు రసీక శేఖరులు పూర్వజన్మ సంస్కారవాసన చే స్థాయీభావము నకు . వశులై యన్య ప్రపంచమును మఱచి రసాధిష్టాన దేవ తలఁ గీర్తించీ కీర్తి కాము లై శాశ్వతజీవమును గడించినారు! అదృష్టమన రసికులదే కదా! జీవితమందంతయు రసాధిష్టాన దేవత కన్ను లయెదుట నిలచి తాండవముఁ జేయుచు జీవితపథము విస్పష్టముగఁ జూపించుచుండ నియమితపథమున జీవితముఁ గడపుచు స్వచ్చందసంచారము గావించు రసిక శ్రేష్ఠులకును, మేఁకలమందవోలె గతాసుగతికులై స్వీయజీవితపరమార్గముల గుర్తెఱుంగ లేక, కూపస్థమండూకములుంబోలెఁ దమ సంకుచిత భావములతోఁ దృప్తినొందుచు, మృత్యుపథమున నిరంతరము బ్రయాణ మొనర్చుచు, కీర్తికాములు గాక పేరు ప్రతిష్ఠలు లేక నశించుచుఁ దమకును, తముగన్న దేశమునకుఁగూడ నపఖ్యాతి నొడగూర్చుసామాన్య మానవులకును నేట్టిసంబంధము? వారికిని వీరికిని హస్తిమశ కాంతరము గదా? వారు ధన్యులు, మృతజీవులు, వీరు హత భాగ్యులు! జీవన్మృతులు ! ! !

2, శ్రీ రాధాకృష్ణుల ప్రణయకథనము.

శ్రీ సీతారాముల ప్రణయకథన మెంత ప్రాముఖ్యము గడించినదో శ్రీ రాధాకృష్ణుల ప్రణయకథనము కూడ సంత ప్రాముఖ్యము గడించినది. శ్రీ సీతారాముల ప్రేమము శాస్త్ర సమ్మత మైనది. సర్వశాస్త్రములును, సర్వమతములును, సర్వసిద్ధాంతములును నంగీకరించు ప్రణయ వ్యాపొరమే కాని విరుద్ద ధర్తములు కలది కాదు. గురుజనాజ్ఞానుసారముగ భార్యా . భర్తలై రామచంద్రుఁడును జూనకీ దేవియు ప్రణయ వ్యాపారములఁ జలిపిరి రాధామాధవులన్న నో అట్లు గావింప లేదు. రాధామాధవులు భార్యాభర్తలు కారు. శ్రీకృష్ణుఁడు సుక్షత్రియుఁడు. నిమిత్తమాత్రముగ యాదవవంశమున నందుని, యింటఁ దిరిఁగి యాదవుఁడుగ నెంచఁబడినవాఁడు. అట్టి సుక్షత్రియుఁడగు శ్రీకృష్ణుడు నందునికిఁ జెల్లెలివరుసయగు రాధను బ్రియురాలిఁగఁ జేపట్టుట యంత శాస్త్ర సమ్మతమయిన విషయము కాదని సామాన్యశాస్త్ర పరిజ్ఞానముకల వారికి సైతముఁ దెలి యును. అందులో రాధ వివాహితయగు నిల్లాలని సైతముఁ బ్రసిద్ధి. అట్టిచో శ్రీకృష్ణుఁడు పరుని భార్యయు,గొల్లయిల్లాలును నగు 'రాధతోఁ జెలిమి చేయుట సామాన్యముగ నీతిశాస్త్ర పరిచయులకు దోషముగఁ దోఁపకమానదు. శ్రీకృష్ణుని యేకపత్నీత్వమునకు, రాధయొక్క పాతివ్రత్యమునకునుఁ గూడ హానినీ, విరోధమును నాపొదించును. అంతీయ కాక సామాన్యమానవు లకు దుర్నీతిపై తము బోధించుననియుఁ గొందఱవాదము. ఏల నన: శ్రీకృష్ణునంతటి మహాత్ముడు గావించుటచే నిట్టినీతి విదూరకృత్యములు పవిత్రములనియే భావించి సామాన్యులును నీవిషయమున శ్రీకృష్ణు ననుకరించుచు దుర్నీ తీపరులై పర దారాపేక్షుకులై చరింతు రేమో యని వీరికి భయము,

     ఈనీతి సంగతి యెట్లున్నను రాధాకృష్ణుల ప్రణయవ్యా పారము సామాన్య విషయము కాదు. దానికి సామాన్యములగు శాస్త్ర నియమములు వర్తింపవు. శ్రీకృష్ణుఁడు సామాన్యమాన, వుఁడు గాఁడు. జగన్మోహనా కారుఁడు, వేణుగానము చే సకల చరాచర ప్రపంచమును గరఁగింపఁగలిగిన గాయకశిఖామణి, అమేయ ప్రతాపశాలి. శ్రీకృష్ణుని మహిమలఁ బొగడుటకు శక్తి చాలమిచే నింతటితో ముగించి ప్రకృతము ననుసరింతును. ఆట్టిమహాపురుషుఁడగు శ్రీకృష్ణునిసౌందర్యముఁ జూచియో, గానమునకు భ్రమనొంది యో, మహిమల చేఁ బారవశ్యముఁ జెంపియో, మఱి యేకతముననో రాధ వరించెను రాధ సామాన్యు రాలగు గొల్లపడుచు కాదు. రసహృదయము కలది. శ్రీ కృష్ణునిగుణములఁజూచి వ్యామోహిత యయ్యెను. కండ కొవ్వి దుర్వృత్తిలో దిగు సొమాన్యాభిసారికలుంబోలెఁ గాక రాధ రసహృదయ యగుటం జేసి గుణాభిరాముఁడగు శ్రీకృష్ణునిఁ జూచినతోడనే ప్రేమించినది. శ్రీకృష్ణునిగుణముల గ్రహించి, యాతని మహిమకు వ్యామోహముఁ జెంది రాధ వలపుఁ జెందెను. అట్టి రాధను సామాన్య వ్యభిచారిణులతోఁ బోల్పఁదగదు. ఆమెయెడ విశిష్ట ధర్మములు వర్తింపఁ జేయవలెను రాధ యొక్క స్వభావమును రసవృష్టితోడను దయాపూర్ణ హృదయము తోడను విమర్శించు విమర్శకున కాపి గుణము లద్దమునంబ లేక బరిస్ఫుటముగఁ గన్పడును సంకుచితస్వభావులకు రాధయొక్క చరితము నీతిబాహ్యముగఁ గన్పడుటలో నాళ్చర్యము లేదు.

గుణలుబ్దమై శ్రీకృష్ణునివరించిన రాధ యాతనియందు బద్దానురాగ యయ్యెను. ఏశుభముహూర్తమున శ్రీకృష్ణుని జూచినదోళాని యాముహూర్తమునుండియు రాధ యతని నుండి తనమనముఁ ద్రిప్పికొనఁ జూలదయ్యెను. నిముసముచిము సమును నాతని గొంచుట కామె కేక్కు డవకాశము కలి గెను. ఏలయన నిరువురు నొక కుటుంబములోనివారై యొక యింటఁ బెరుగుచు నిరంతరము నొకరిసాన్నిధ్యమున నొకరు వర్తిలుచు నుండిరి. అందుచేత వారిప్రణయలత పెరిఁగి పెంపొంది యనూన సౌందర్యయుతములగు పల్లవములను, పుష్పములను దాల్చి, సౌరభము వెదఁజల్లఁగలిగెను. ప్రొద్దు ప్రొద్దుననె లేచిన తోడనె శ్రీకృష్ణునివదనదర్శనసౌభాగ్యమే, భోజనమువేళ శ్రీకృష్ణుని దర్శనమే, పాలుదీయువేళను పెరుఁగు చల్లఁజేయువేళను, పసుల దోలుకొనిపోయి మేఁపుచు నెండకుఁ దాళలేక చెట్టునీడ విశ్రమించెడివేళను, సాయంకాలమున వనాంతమునందుఁ గుసుమితసమయమున సైకతస్థలములఁ జంద్ర కిరణములవెలుఁగున రాసక్రీడఁ దేలువేళను, శ్రీకృష్ణునిదర్శనమెప్పుడును రాధకు లభించుచునేయుండెను అందుచేఁ బ్రథమమున నేక్షణముననో చూచి వరించినరాధకు శ్రీకృష్ణునిమూర్తి ప్రతిక్షణసన్నిహిత మైయుండి తీఱనిమానసోల్లాసముఁ గూర్చుచుండెను. అట్లు నిరంతరదర్శనపటిమచే రాధమనమందు శ్రీకృష్ణునిపైఁ బ్రేముడి యతీశయించి స్థాయీభావము నొందెను. అట్టిస్థాయీభావము కుదిరినకతన రాధకుఁ బ్రపంచమునెడ భయ రాహిత్యమును శ్రీకృష్ణునియెడ నద్వైతభావమును గలిగెను. పరులు కన్నఁ దప్పువెట్టెదరేమో యనుభీతి నశించెను. సర్వకాలసర్వావస్థలను శ్రీకృష్ణనామస్మరణముఁ గావింపుచు నాతనినే ప్రాణసమునిగను, ప్రాణములకన్న నెక్కువగుప్రియునిగను, నిష్టదైవముగను భావించి హృదయమును—సామాన్య శుష్కనీరసనారీహృదయము కాక ప్రణయార్ద్రీభూతమైన రసహృదయము—నాతని కర్పణముఁ గావించెను. శ్రీకృష్ణుఁడు దక్క నన్యము రాధకన్నులకుఁ గన్పడదయ్యెను. నీళ్లు ముంచుకొనుచుఁ జెఱువులోఁ గంఠములోఁతునీళ్లలో నిలువఁబడి యున్న రాధకు ముందు శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహము గోచరించెను. తోడనే యామె ప్రాణములకునై తము వెరవక శ్రీకృష్ణు నాశ్లేషించుకొనునాసతో ముందంజ వేయఁ బోయెను. సామాన్యాభిసారిక యంతటి ప్రాణాపాయమునకుఁ దెగించునా? రాధ తెగించెను. ఏల? శ్రీకృష్ణగా త్రపరిష్వంగ సుఖ మెక్కువయా? తద్విరహితములగు ప్రాణము లెక్కువయా? 'రాధకు మనోనిశ్చయము కుదిరెను. శ్రీకృష్ణుడు మెచ్చెను భక్తపరాధీనుఁడగు శ్రీకృష్ణుఁడు భక్తాగ్రగణ్బు రాలగు రాధ యొక్క నిష్కల్మష హృదయమును మెచ్చి యామెతపోనిష్ఠకు సంతసించి యామే కభీష్టసిద్ది గావించెను. రాధను శ్రీ కృష్ణభగ వానుఁడు హృదయసమాను రాలగు ప్రేయసిగ నంగీకరించి, యామేయ భీప్సితమును నెజవేఱ్చి యామెజీవితమును సఫలము గావించెను

ఆట్లు శ్రీకృష్ణుని చేఁ బరిగ్రహింపఁబడి, లాలింపఁబడి, యతనిచే భార్యలందఱకన్న నెక్కుడు ప్రేమతోఁ జూడఁబడి, రాధ పరితుష్టహృదయ యయ్యెను. ఆమె చేసిన తపస్సు ఫలిం చేను. శ్రీకృష్ణుఁడాపె వాఁడయ్యెను. ఇందుల కొక్కదీన్ని యుదాహరణముఁ దెల్పెద! రాధ యొకనాడు శిరముపై బెరుగు ముంతల నిడికొని వీథి నమ్ము కోసం బోవుచుఁ బెరులో యమ్మ పెరుగు, పాలోయమ్మ పాలు' అంచు గేకలిడుటకు మారు మాధవా! గోవిందా! యనుచుఁ బ్రేమామృతపాన మత్తయై పలువరింపసాఁగెను. ఆహా! రాధ, శ్రీకృష్ణునిపయిఁ బ్రేమచే నెంతయవశయయినది? రసపొరవళ్యమన్న సద్దియేకదా!

స్థాయీభావము విరుద్ధభావములను సైత మాత్మభావమును దాల్చునట్లోనర్చును.

అట్టి రసపారవళ్యముఁ గన్న రాధకు స్త్రీ జనసహజమగు నీర్ష్యయయు మృగ్యముగ నుండును. ప్రపంచమున నెట్టిపతి వ్రతయయినను భర్త యన్య కాంతారతుఁడై యుంట కంట గింపుగను ఏర్యా జనకముగను నుండును. ప్రపంచమునందలి , యుంపుడుకత్తెల ఈర్ష్యావిషయమును విస్తరించు టనవసరము. కాని, ప్రేమపరవశయగు రాధకు శ్రీకృష్ణుని యవగుణ ములు సవినయమును గోపమును చెప్పించుటకు మాఱుగఁబ్రేమము నే జనింపఁ జేయును. శ్రీకృష్ణుఁ డెచ్చటనై నను నెవ్వతే తోనైనను సంతోషముగనున్న జాలును. రాధకు! తనతోడనే సౌఖ్య మనుభవింపవలె ననులోభబుద్ధి ప్రణయసిద్ధి గలిగిన కతన బాధయందు నశించెను. స్వసౌఖ్యము గాదు! శ్రీకృష్ణుని సౌఖ్య మే రాధ కభ్యర్థనీయము. ఈభావమును జయ దేవకవి తన గీతగోవింద శ్రావ్యమున నిట్లు వర్ణించినాఁడు..

 శ్లో. గణయతి గుణ గ్రామం గ్రామం భ్రమాదఫి నేహ తే
వహతి చ పరితోషం రోషం విముంచతి దూరతః,
ఇహ ,విహరతి వనే కృషే వల తృ మాం వినా
పునరపి మనో వామం కామం కరోతి కరోమి కిమ్?

ఆహా ! రాధ యెంతటి ధన్యాతురాలు ? 1.పెమనస్సు ఎంత నిర్తల మయినది? ' గుణములనే గ్రహించునుగాని పొరఁబాటుననైనను లోపముల గ్రహింపదు! పరితోషమును బొందునేకాని, రోషమును బొందదు! రోషమును దూరముగఁ బారద్రోలును! తన్ను విడిచి అతీతృష్ణతో, నస్య కాంతల యెడఁ ఆంధ్ర కవిత్వ--10 దగిలి వారితో వనమునఁ గ్రీడాసక్తుఁడై యుంట కన్నులారఁ జూచి తిరిగితిరిగి యాతనినే ప్రేమించుచున్నది. ఆతనిసౌందర్యము చేతనే చొక్కుచున్నది! అట్లు చొక్క కుండుట వశము గాదనికూడఁ దెల్పుచున్నది! ఆహా! ఏమి యాయనురాగాధిక్యము? స్థాయీ భావలక్షణము పూర్ణముగ వ్యక్తమగుచున్నది కదా! విరుద్ద విషయములను సయిత మాత్మపరముగఁ గావించు శక్తి స్థాయీభావమున కున్న దనుటకు రాధయొక్క ప్రేమయే ప్రబలతార్కాణ మగుంగదా!

3.లైలా-మజ్నూనులకథ, 

లైలా-మజ్నూ నులు పారసీక దేశ పువారు. వీరిరువురును బాల్యమున నొండొరులఁ బ్రేమించి యుండిరి. "కొలవళమున నా బాల్య ప్రవర్తితమగు వీరి ప్రేమలత హఠాచ్ఛిన్న మయ్యెను. తత్ఫలి తముగ లైల వేజోళనిని దలిచండ్రుల నిర్బంధము చేఁ బెండ్లి యాడుట తటస్థించెను. జీవితమంతయు లైలతోఁ గూడ సుఖముగఁ గడపనెంచిన మజ్నూ నునకు లైల యన్యుని వివాహ మగుట వజ్రపాత నిభమయ్యెను! జీవితసాఫల్యము లైలరౌఁగి లియే యని యువ్విళ్లూరుచుండిన మజ్నూను లైల యన్యునిఁ జే పట్టెనని విన్న తోడనే హతాశుఁడై భగ్న మనోరథుఁడై స్వబంధు జనమును, స్వదేశమును, స్వగృహమును వీడి పిచ్చివానీపలె నడవుల సంచరించుచుండెను. అందుకనియే యాతనికి మజర్నా నని పేరువచ్చెను. మజ్నూ ననఁగఁ బారసీక భాషయండు నున్నత్తుఁడని యర్థము, అడవులు గుమఱుచు నెల్లప్పుడును లైలా ముఖబింబ లావణ్యమునే స్మరించుచు, లైలా నామమునే జపించుచుఁ దపోనిష్ఠ గలవాడై యుండెను. ఇట్లుండఁ గొంతకాల మునకు లయిల భర్తృవియోగమునొంది మజ్నూనునిపయిం దలఁపుగలుగ నాతనిఁ జూడఁగోరి యాతని వెదకుటకయి యరణ్యములఁ గ్రుమఱుచుఁ దుట్టతుదకు నోళయాశ్రమప్రాంత మునఁ గృశించిన శారీరముతోఁ దపోబలమునఁ బ్రశాశించువదన ముతో ధ్యానమగ్ను డై యున్న మజ్నూ నునిఁ గాంచి చిన్న తనంపుఁ, బ్రేమమంతయు నొక్క-సారిగఁ బై కుబుక నార్ద హృదయయై యాతని నిట్లు ప్రార్థించెను. —

తే. “లయిల నోయి!ప్రియా, కన్ను లారఁ గనవె?”
యనుచుఁ బిలచినకంఠము నాసవాలు
పట్టినట్లుగఁ గనులిట్టె పయికి నెత్తి
చటుకునను మూసి మజ్నూను సంచలింప
కుండ జపమాలికను త్రిప్పుచుండఁ జూచి
లైల యను రాగపపనసంచాల యౌచు
గద్గదక్లాంతి నిట్లనుఁ గరుణ దోప
“గట్టులను పుట్టలను దాఁటి కానసములఁ
గడచి యే,ళ్ళెన్ని యో యీఁది కట్టకడకు
సన్నిధిని జేర ఫలమి దాకన్ను లకును?
మఱచితో గాఢవై రాగ్యపరవశతను
లైల మున్నుండె నీ ప్రియురాలటంచు
లేక ద్రోహాత్మనౌ నాదురాక చేత
భగ్న ప్రణయంపుగాథ జ్ఞాపకము వచ్చి
పొపినౌ ననుఁ గాంచఁగా నోపలేవో?
విధివశతఁ జూపలమ్మున వేరొకనిని

బెండ్లియాడితి నేకాని హృదయమెల్ల
నిండియుంటివి నీవె నానిశ్చలంపు
బ్రేమ సర్వేశ్వరుఁడు సైత మేమెఱుంగు?
నాథ! మన్నింపవే దయణ నాదుపాప
చయము నెల్లప్పు డింక నీచరణదాసి
నగుచు జీవముఁ గడ పెద నాథ! కనవే!
ప్రాణముల మజుం చెడు ప్రాణమిచ్చి .
దివ్య దివ్యామృతముకన్న దివ్యమయిన
నీదుగానామృతముఁ గ్రోలి నిన్ను గూడి
నిభృతకుంజగృహంబుల నెల్ల కాల
మీ నవోద్యా నమున విహరింపనీవే!”
అనఁగ మజ్నూ ను సూర్యునీయట్ల వెలుఁగు
వదనమునఁ (ముజడల నావలకుఁ ద్రోసి
కనులఁ బై కెత్తి లైలను గాంచి నవ్వి
“లై లవా? కల్ల నీ వెట్లు లైల వౌదు?
విశ్వమెల్లను దాన యై వెలుఁగునా మె
స్వచ్చ కాంతిదౌ సంఛన్న శకల మేమొ?
అంతియే కొని లైల వీపన్న నమ్మ! నిదుగొ
నాలైల నీకుఁ జూపింతుఁ గాంచు.”
మంచు లైలా యనుచు గౌఁగిలించి లతలఁ
బూవులను లైలా యంచు ముద్దుఁగొనుచుఁ.
బక్షులను లైలా యంచుఁ బలుకరించి

,

పలుదిశల లైలా యంచుఁ బరుగులిడుచు
బోయె మజ్నూను ఆనందపురముఁ జేర,

స్థాయీభావముయొక్క విశ్వవ్యాపిత్వము.

లైలా మజ్నూ నునిఁ దన్నుఁ బరిగ్రహింపుమని కోరెను. కాని మజ్నూను సామాన్యవాంఛా ప్రపంచమును మీరిపోయినాఁడు. కామ్య వాంఛ లన్నియు విడనాడి లైలానామస్మరణ మున కాలముఁ గడపు చుండెను. అందుచే లైలాయొక్క ప్రేమమూర్తి యతనిమనగఫలకమునఁ దిరముగఁ జిత్రింపఁబడెను. లై లదక్క నన్యము ప్రపంచమున నతనికి గోచరింపకుం డెను. అతనితపము సిద్ధం చేను. ఏలైలపొందు నతఁడు యావనోనా దవళమునఁ గోరెనో యాలైల పొందే యిప్పుడు తపోబలిమిచే నతఁడు మానసికముగ ననుక్షణ మనుభవించుచుఁ దనినిఁ జెంది ప్రణయనిర్వాణానందమున నోలలాడుచుండెను. అందు చే బకృతిస్వరూపియగు లైలయొక్క బాహ్య స్వరూప మతని నాకర్షింపదయ్యెను. లైలయొక్క స్త్రీ సహజమగు ప్రణయ వేదన యతని మనస్సుఁ గరఁగింపఁజాలదయ్యెను. చివజుకు లైల యొక్క బాహ్యస్వరూపమునే యతఁడు గుఱుతింప లేకపోయెను. లైల స్త్రీ సహజములగు చంచలతయు, మృదుస్వభావ మును కలది. అందు చేత నే మజ్నూను వీడి యింకొకనినిఁ బెండ్లి యాడినదియు నతనిమఱువజాలక యాతనియందే బద్దాను రాగయై యుండెను. తత్కారణమున భర్త చనిపోయిన పిదప మజ్నూనుకడ కేతెంచి తిరిగి తన్నుఁ బరి గ్రహింపుమని యాతని వేఁడుకొనెను. తనవియోగముచే మజ్నూను నందుఁ గలిగిన మార్పును, అతఁడు వడసిన తపస్సిద్దియు నెఱుఁగదయ్యేను. మజ్నూ నుని సామాన్యమానవునిగ లైల ఖావించి త న్నాతఁడు వరించునని నమ్మి యతని ననేకవిధములఁ బ్రార్థించెను. కాని పిట్టపిడుగువో లే మజ్నూ సొమెతో “నీవు లైలవే కావు పో ' మ్మనుచు లైలను జూడుమని చెట్టు చేమలు, పూవులు, పక్షులుమొదలగు వానినెల్లఁ జూపి తనదారిని దానుఁ బోయెను, మజ్నూను చెప్పిన వాక్యము లెంతయు గంభీరములుగ నున్న వి. లైల విశ్వమెల్లను దానయై వెలుఁగునఁట, నిజముగ నట్లు వెలిఁగి నను వెలుఁగకున్న ను మజ్నూనునకుఁ బ్రణయ తపస్సిద్దివలనఁ బ్రపంచమున నెల్ల యెడలను లైల యే వెలుఁగుచుఁ గనంబడెను. అందుచే నతనికి లైల కానవస్తువు లేనే లేకుండెను. స్థూల రూపము ధరించి యున్న లైల యామె స్వచ్చకాంతియొక్క ఖండమేమో, సంఛన్న శకలమేమో. అంతియోకానీ లైలయా మెయే యనిన నతఁడు నమ్మడు. ఆహా! మజ్నూను ప్రణయ భావ మెంత విశ్వవ్యాప్తి నొందెను. ఆహా! స్థాయీభావమున కుండఁదగిన విశ్వవ్యాప్తి మజ్నూనుని ప్రణయ వ్యాపారమున నెట్లు ప్రదర్శితమైనది?

ప్రప్రమథమున స్థూల వస్తువు నాశ్రయించుకొని మజ్నూ నుని రసభావము స్థూలవస్తుసంబంధమను శృంఖలల విదిలించు కొని స్వచ్ఛంద ప్రవృత్తం 'గాంచి విశ్వమెల్లను విహరించుచు విశ్వవ్యాప్తినొందెను. అట్లేకదా రసవిషయము? కవికిని ప్రకృతికినిఁ గలసంబంధ మట్టిదియేకదా! రసీకుఁడు జనాంతరసంస్కార బలముచే నిమిత్తమాత్రముగ నొకవస్తువు నాధారముగఁగొని తన్మూలమున రసానుభూతి నొందును. "కొని యతఁడు కొంత కాలమైన పిమ్మట రసానుభూతియొక్క బలిమిచే వస్తువుసంబంధమును గూడఁ ద్యజించి స్వతంత్రముగ రసానుభూతిఁ బడయఁ

గలుగును. అట్లు కవి స్వతంత్రముగ రసానుభూతిఁ బడయ గలిగినప్పుడే యత నిరస భావము విశ్వవ్యాప్తమై సిద్దిఁ గాంచును. అట్టిరససిద్ధియే యాత్మ వికాసమునకు స్వస్వరూపసంధానమునకు సొయము గావించును. అట్టి రససిద్ధులే సిద్ధపురుషులు, అట్టివారి నాశ్రయించుకోనియే ప్రపంచము వర్ధిల్లుచున్నది.

ఉపసంహారము.

రసమునకు పర్యాయపద మనఁదగు స్థాయీభావము యొక్క ముఖ్య లక్షణముల మూఁడిటీనీ బై మూఁడుదాహరణ ముల వ్యక్తముఁ గావించితిని. శ్రీ సీతారాముల ప్రణయమువిష యమున రసికునకును రసాశ్రయస్థానమగు వస్తువునకును గల యవినాభావసంబంధమును, నద్వైతభావమును, స్పష్టముఁ గావించితిని. శ్రీ రాధామాధవుల ప్రేమవిషయమున స్థాయీభావ మెట్లు విరుద్ధ భావములను సై తము నాత్మవశము గావించుకొని తనలోఁ గలిపి కొనునో విశదీక రించితిని. లైలామజ్నూ నుల ప్ర ణయవిషయమున రసభాప మెట్లు స్వతంత్ర వ్యాప్తినంది. విశ్వ వ్యాప్తి నొంది సిద్ది. జెందునో వ్యక్తముఁ గావించితిని. రసము యొక్క యితర లక్షణములను జూపించుట కింక నేన్నీ యో యుదాహరణములను జూపింపవచ్చును. గ్రంథవిస్తరభీతి చే ముఖ్యము లగువానిని మాత్రమే యిచ్చితిని. మిగిలిన దానినిఁభాఠకులు తమ యనుభవమున సరిపోల్చికొనియెదరు గాక! స్థాయీభావము విరుద్దభావములను సైతము తనలో నిమిడ్చి కొనుననుటకు "చిత్రాంగీ సారంగధరులచరిత్ర” మొక నిదర్శనము. ప్రాణపదముగఁ బ్రేమించిన సొరంగునీఁ జిత్రాంగి చంపించుటయే యిందుకుఁ దార్కాణము. టెన్ని సన్ అనునొక కవి

ఈభావమునే డోరా (Dora) యను శాశ్వమున “I loved him, yet, I killed him" అనుమాటల వెలిబుచ్చెను. రసాశ్రయ హేతువగు వస్తువు నశించినను రసము రసికునియందు నశింప దనుటకు ఇందుమతీమరణానంతరము అజుఁడు గావించు విలాపమే తార్కాణము. ఈరహస్యమునే కాళిదాసు శరీర నా శెపి సమాను రాగయోః " అనుపద్యముల సువ్యక్తము గావించెను.

రసవిషయము మహాసముద్రము వంటిది. తలచినకొలఁది రత్నములు దొరకుచుండును. కావ్యరత్నములు కోటానకోట్లు రసజగత్తును ప్రకోశమానము గావించుచున్నవి. అతిగఁదఱు చిన పూర్వము పాలసముద్రమునుండి విషము జనించినయట్లు ప్రమాదము లేమైన జనించునేమో యనుభీతిని ముఖ్యవిషయముల యథాశ క్తిని జర్చీంచితి. ఇంక వరార్థ కామమోక్షయుత మగు మానవధర్మమున రసమున కాశ్రయస్థాన మెద్దియో నిరూపించెదను.

+++++