ఆంధ్ర కవిత్వ చరిత్రము/చతుర్థప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చతుర్థ ప్రకరణము.


అనంతో వై రసః.

గత ప్రకరణమున రసమునకు మానవజీవితమున ధర్మార్గ కామమోతములలోఁ గ్రామము ఆశ్రయమగుననియు, కవి యధర బోధకుఁడు గాక లోకోపకారియే యనియు నిరూపిం చితిని. ఈ ప్రకరణమున రసమెట్లు జీవితమునఁ బ్రవర్ధిల్లునో, అది యే ట్లనంతవిధముల నొప్పాఱునో తెల్పెదను. రసమనఁగఁ గవి యనుభవించుభావమే యని పూర్వమే చెప్పఁబడినది. అట్లు కవిచే సనుభవింపఁబడు భావములలో నేదైన యొక పద్దతి గోచ రించునా, లేక కవి యడ్డదిడ్డముగ భావముల ననుభవించు చుండునా? రసవిషయమున సహజములగు పద్దతులుగాని, నియమములుగాని కలవా?

రసమునకుఁ గారణములు కవియొక్క జనాంతరసంచిత సంస్కారమును, వస్తుసందర్శనమును నని యొక చోఁ దెల్సి యుంటిని. పిమట రసమునకు మానవసహజమగు కామ మాత్ర యమని నిరూపించితిని. ఈ రెండు సిద్ధాంతములకును నేమైన సంబంధ మున్న దా? అనఁగ' మానవసహజమగు కామము నేయే పద్ధతుల ప్రకారము రసముగా మార్చి వర్ణించును? కోరి కలు రసీకుని చేతులలో నెట్టి మార్పులను, నెట్టియవస్థాపరిణామ ములను బొంది రసస్వరూపముతో బయ ల్వెడలును? ఇట్టిరస స్వరూపములు మితసంఖ్యాకములా యనంతములా?
కామమునకు జీవసూత్రమునకుఁ గలసంబంధము 

కామము జీవసూత్రము చేఁ గట్టువడియుండును. అనఁగా జీవిత మభివృద్ధి నొందుకొలఁదినిగామ మభివృద్ధినొందుచుండును. జీవిత మభివృద్ధినొందువిధముననే శామ మభివృద్ధినొందును. శామముయొక్క పరిపాటీ వయఃపరిపాకము ననుసరించియుం డును. వయస్సును మీరినకోరికలు గోరువారు ఎచ్చటనై న నున్న ను వా రతీత ప్రకృతు లై యుందురు. అట్టి యతీత ప్రకృతులు సాక్షా ద్వర ప్రసాదులు కావున వాదమునకు లొంగరు. జీవియొక్క ప్రాణ మెట్లు బాల్య యావన-కౌమార. వార్ధక్య - జరా - మరణావస్థల నొందుచుండునో అట్లే కామ మును బాల్య యావన- కౌమార - వార్ధక్య . జరా - మరణా వస్థల నొందుచునే యుండును.

పాశ్చాత్య మనశ్శాస్త్ర సిద్ధాంతములు.

ఈభావము నే పాశ్చాత్యథాస్త్రజ్ఞులు “The Biological aspect of culture"అను పేరఁబిలచుచు నీ భావము ననుసరించి మానవమా నసికాభివృద్ధిని వర్ణించి నిరూపించుశాస్త్రమును “Physiological Psychology" యని పేర్కొ నుచున్నారు. ఈశాస్త్ర సిద్ధాంతమే మన శరీరమును మనస్సును నభిన్న ములును, నభేదములును, నవినాభావ సంబంధముఁ గలవియు ననియు, శరీరము లేనిది. మన స్సుండ నేరచనియు, మనస్సు లేనిది శరీరము వివిధ కృత్యములను జ్ఞానముతో నొనరింప లేదనియు, అందు చేత శారీరక స్థితి నను సరించి మన స్సభివృద్ధి నొందుచుండుననియు, మన స్సభివృద్ధి నొందింపవలెనన్న శరీరమును నభివృద్ధినొందింపవ లెననియు, అనుకూలపరిస్థితులను, అనుకూల పరిస్థితులను ననుసరించి com మానవుఁ డభివృద్ధినొందుననియు, సాక్షద్వర ప్రసాదియై యభి వృద్ధి గాంచఁడనియు నే.

డార్వినుపండితుని ప్రపంచపరిణామసిద్ధాంతము

ఈసిద్ధాంతము ప్రపంచమంతయు నణువునుండి యుద్ప వించినదనియు, మానవుఁడు అమీబాయను రూపరహితజీవ వస్తువునుండి వివిథాంతరములఁ గడచి వివిధ జన్మముల నెత్తి తుట్ట తుదకు శాఖామృగమనఁదగు చింపంజీ యనుమర్కటమునుండి జన్మించెనని చెప్పు(Darwit) డార్విక్ పండితుని"Evolution theory" అనఁగ ప్రకృత్యభివృద్ధి సిద్ధాంతమును దోహదముఁ జేయు చున్నది. పాశ్చాత్యమానసిక్శస్త్రము ప్రకారము శిశువులకు మాన . సీకాభివృద్ధి తక్కువయనియు, జ్ఞానము కొంచెమైన నుండ దనియు, మాతృవదన దర్శనజ్ఞానముఁ దక్క వేరు ప్రపంచమును 'గూర్చిన .జ్ఞాన ముండదనియు, మృగ ప్రాయుఁ డై చేజిక్కిన దానినెల్ల గ్రహించుచు నుండుననియు, దీనికంతకుఁ గారణము శిశువు యొక్క జ్ఞాననివాసస్థానమగు 'మెదడు అభివృద్ధినొందక లేతఁయైనస్థితియం దుంటయును, అవయవము లభివృద్ధినొంది కృత్యముల నెర వేజ్చుకొనఁగల స్థితిలో లేకపోవుటయునే యనియు, మెదడు గట్టిపడి అవయములు స్వాధీనములై శరీర సంబంధములగు కృత్యముల నెఱవేర్ప సమర్థము లైనంత నే జ్ఞానాభివృద్ధి కలుగుననియు, నట్టిజ్ఞానాభివృద్ధి మానవునిశరీర సౌష్ఠనమును, ఆరోగ్య సంపత్తినీ, వయఃపరిపాకమును ననుసరించి యుండుననియు, రోగపీడితుఁడై మంచముఁ బట్టియుండు వానికినిఁ బంచేంద్రి యవ్యాపొరములు తిన్నఁగా జరగుచుండని వానికిని, జ్ఞానము కుంటుపడియే యుండుననియు నిర్ధారణ యగుచున్నది. ఇట్టి వయోవృద్ధితో బాటు, మానసికాభివృద్ధితో బాటు , కామము కూడ సభివృద్ధి నొందుచునే యుండును. శైశవమున మాతృవదనదర్శనమును, తల్లిపాలును దక్క సస్యములయెడ శిశువునకుఁ గొంతయును గామమును నుండవు. బాల్యమున నాటవస్తువుల పై నను, నాటపాటలపై నను, చెలిమికాండపై నను, తోబుట్టువులయెడను 'భాలునికిఁ గామ ముండును. ఇట్లే యౌవనమునం క్రీడాసక్తియుఁ గామవికారమును మిక్కుట ముగ నుండును. కౌమారమున భార్య పై నను, బిడ్డలపై నను,, ధనధాన్య భాగ్యభోగములపై నసు విక్కిలియాసక్తి యుం డును. వార్ధక్యమున బిడ్డలయెడను, మనుమలు మనుమరాండ్ర యెడను, బందుగులయెడను, సుఖము నెడను, శాంతి యెడను మమకారము మిక్కుటముగ నుండును. జరయందు భగవద్బ కియుఁ, జిత్తశాంతియు, సుఖమరణముపై నాసక్తియు నెక్కువ యుండును. మరణకాలమున సర్వేంద్రియపటుత్వ మును దప్పుట చేతఁ బునః శైశవావస్థ సంభవించును. - మానవుని సప్తావస్థలనుగూర్చి 'షేక్స్పియరు . కవి యభిపోయము.

ఈభావమునే షేక్స్పియరుమహాకవి"As you like it"అను , నాటకమున “The seven stages of man" (మానవుని సప్తావస్థ లను) వర్ణించుపట్టున వార్ధక్యము నిట్లు వర్ణించియున్నాడు

 ;-----

"Last scene of all
That ends this strange eventful history,
 Is second childishness and were oblivion,
Sane teeth, sans eyes, sabs taste, sans every things

(తిరిగి శైశవావస్థ సంభవించ, సర్వమును శూన్యముగ నుండి పండ్లు వినా, కన్నులు వినా, రుచి వినా, సర్వము వినా మానవుఁడు జీవితయాత్ర, జాలించును) అని పై పద్యము యొక్క భావము.

శ్రీశంకరాచార్యుల యభిప్రాయము.-

ఈభావమునే శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకములలో నిట్లు వర్ణించినారు....

బాలస్తావతీ డాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః,
వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహణి గోపి న సక్తః.
వయసి గతే కః కౌమవి కారః ఓణే విత్తే కః పరివారః,
శుష్కే నిరే కః కాసారః జ్ఞాతే త త్త్వే కః సంసారః,

పై శ్లోకములభావము వయఃపటుత్వ మున్నంత కాలమును శ్రీడాసక్తి కాంతానురక్తి మొదలగు కామవికారము లుండు ననియే. అట్టివయసు గతించిన చోఁ గామవికార మేడది ? విత్తము క్షీణించిన వానికడఁ బరివారమును, నీరమెండిపోయిన శాకారమును, తత్త్వజ్ఞానము తెలిసినపిదప సంసారమును నెక్క డుండును? కావున కామము వయఃపరిపాకము ననుసరించియు, శరీరపటుత్వము ననుసరించియు వర్ధిల్లుచుండుననియుఁ దేలుచున్నది.

మనోవికారములు శరీస్థితి ననుసరించును.

కావున శరీర మెన్ని వికారములకు లోనగుచుండునో మనస్సుగూడ నన్ని వికారములకు లోనగుచునే యుం డును. ఇట్టివికారము లన్నియు నాయావయోవిశేషములకుఁ జెందుచుండును. ఒక్కొకవయస్సునకుఁ దగిన కామములును, - తదనుగుణములగు భావములును కలుగుచు, ననుభూతము లగు చుండును. వయోధర్మముల ననుసరించియే రస ప్రవృత్తియు వర్ధిలుచుండును.

ఆర్యధర్మమునందలి ఆశ్రమపద్ధతుల ప్రయోజనము.

ఈభావమును బురస్కరించుకొనియే మనయార్యధర్మజ్ఞులు మానవజీవితమును నాశ్రమముల క్రింద విభాగముఁ జేసి నారు. అట్టియాశ్రమములు నాలుగు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమమును ననునవి. వయాశ్రమమునకుఁదగిన యాహారనియమములు శారీ రకపద్దతులుఁ, గామ్యార్థములు, భావములు మొదలగువానిని మసధర్మజ్ఞులు 'పేర్కొనియున్నారు. వయస్సును మించినబుద్దులును గోరికలును కూడదని ధరజ్ఞులు నిషేధించిన దానిలోని పరమార్థము వయస్సునకును, కామమునకును భావానుభూతి కిని గలసంబంధము సూచించుటయే. బ్రహచర్యాశ్రమము బౌల్యావస్థయే దాని కనుగుణములగు క్రీడాసక్తి విద్యాను రక్తి తెలియని తనము, పసితనపుటానందము, మొదలగుభావ విశేషము లనుభూతము లగుచునే యుండును. గృహస్థాశ్రమ మున నున్న వానికి బాధ్యతలును అనుభ వములును మెండు. భార్య, బిడ్డలు, బందుగులు, స్నేహితులు మొదలగువా రెంద తో యనుదినము మనతోఁ గలసిమెలసి వర్తించుచుందురు. అందుచేఁ దదనుభవానుగుణములగు భావవి శేషము 'లెన్ని యో మానవుని సంచలింపఁ జేయుచుండును. వానప్రస్థాశ్రమమున నున్న మానవునకు సంసారబంధములు వీడుచువీడుచు, భగ వద్భావము కుదురుచుఁ గుదురుచు నుండును. అందు చేయ దదనుగుణములగు సంశయమును, సంచలనమును, ఆశయు, జిజ్ఞాసయు మానవుని సంచలింపఁ జేయుచునే యుండును. తురీయాశ్రమమగు యత్యాశ్రమమున మానవుఁడు సర్వ బంధములఁ ద్రించికొని, రాగవిముక్తుఁడై , శాంతియుతుఁ డై భగవద్భావము చేఁ బ్పూర్తిగ నావహింపఁబడినవాఁడై నిశ్చలుఁ డై ధ్యానతత్పరుఁ డై భగవంతునిలో నైక్యమగుటకు వేచి యుండును. అందుచేఁ దదాశ్రమానుగుణములగు శాంత భావమును చిదానందమును మానవుని పశముఁ జేసికొనును, వీరప్రసాదులగు శంకరాచార్యుల వంటివారు బ్రహచర్యముననే తురీయాశ్రమమగు యత్యాశ్రమమును గ్రహించి జ్ఞాన మయులై బ్రహ్మతో నై క్యము నొందిరి. అట్టివారు వయసును మించిన శక్తిగలుగు మహామహులు. సామాన్యులందఱకును ఆశ్రమపద్దతియుఁ దదనుగుణములగు కామ్యార్ధములును, భావానుభూతియు లభ్యమగుచునే యుండును. కావున నే మనధర్మము సమగ్రమును సర్వభావసము పేతమును సర్వరసోపే తమును నై యున్నది. అట్టిభావములన్నీ యుఁ బూర్తిగ ననుభ వించిన యతనిజీవిత మే సఫలమైనదిగా నెంచఁబడుచున్నది.

మానవుని యభివృద్ధినిగూర్చిన భిన్నాభి . 1 ప్రాయము. ప్రాచ్య దేశ వాసులయభి ప్రాయము.

ఇంత వరకును శైశవమునుండి మానవుఁ డభివృద్ధినొందు చున్నాఁడని సామాన్యజను లెల్లరు నొప్పి కొనఁజెల్లు సిద్ధాంతము గావించితిమి. "కానికొందఱుకవులును, వేదాంతులును మనము అభివృద్ధియని యెం చెడు నది నిజమగు సభివృద్ధి కానేరదనియు, శిశువు భగవదంశ సంభూతుఁడగుటచేఁ బూర్వజన జ్ఞానము కలిగి

యుండుననియు, జన్మ మెత్తిన కొన్నాళ్ల వరకును . భగవదంశ మును కలిగియే యుండుననియు, వయస్సు వచ్చిన కొలఁది విచారములచే బద్ధుఁడై కుంగుచు భగవంతునికి దూరుఁడగుచున్నాఁ డనియు, శైశవావస్థయే జీవితమున నెల్ల: నుత్తమమగునవస్థ యనియు వర్ణించినారు. భారతీయులలో శిశువులకు మూఁడు మాసములవఱకు భగవదంశము, బూర్వజన్మ జ్ఞానము నుండు నని యొకమతమును, భూమిపై జన్మించి దాది చే జలమునఁ గడగఁబడినని మేషమున నే పూర్వవాసన మరచిపోవునని వేఱొక మతమును కలదు. బర్మాలోని పుంగీలను వారు శిశువు జన్మించి, సప్పు డేడ్చెదరంట. కారణ మది స్వర్గసీమనుండి ఈ పాడుభూలోశమునఁ బడినదనియేనట. అంతియగాక మనుజుఁడు మృతుఁ డగునప్పుడు సంతసిం చెదరఁట. కారణ మతఁడు నిజ నివాసమగు. భగవన్నిలయమున కేఁగు ననియే నఁట.

పాశ్చాత్యులయభిప్రాయము. వర్డ్సువర్తుకవి యభిప్రాయము,

ఆంగ్లేయ కవివరుఁడగు వర్డ్సువర్లు “Ode on the latinations of Immortality" , " అమరత్వ సూచనా ప్రశస్తి" యను శైశవస్తృతి గీతమున నీ భావమునే ఈ క్రిందిపద్యముల వివరించి, నాఁడు.

Our birth.is but a sleep and a forgetting,
The soul that rises with us, our life's star,
Hath had elsewhere its setting,
And cometh from afar:
Not in entire forgetfulness,

ఆంధ్ర కవిత్వ

Not in utter nakedness
But trailing clouds of glory do we come
From God who is our home
Heaven lies about us in our infancy
Shades of the Prisoo-house begin to close
apon the growing boy.
But he beholds the light and whence it flows
He sees it in bis joy
The youth, who daily farther from the east
Must travel still is Nature's priest,
And by the vision splendid
Is on his way attended
At length the man percieves it die away
And fade into the light of Commor day


Thou whose exterior Semblance doth belie
Thy soul's itmapsity,
Thou best Philosopher, who yet dost keop
Thy heritage, thou eye among the blind
That deaf and silent read'st the eternal deep
Haunted for ever by the eternal mind
Mighty prophet! Seer blest!
On whom those truths do rest
Which we are toiling all our lives to find
In darkness lost, the darkness of the grave
Thou over whom thy immortality
Broods like the day, & master over a slave
A presence which is not to be put by;


Thou little Child yet glorious in the night
Of heaven born freedom on thy beings height
Why with such earnest pains dost thou provoke
The years to bring the inevitable yoke,

Thus blindly with thy blessedness at srife?
Fuli soon thy soul shall have her earthly freight
And custom tie upon thee with a weight
Heavy as frost and deep almost as life.

పై సిద్ధాంతములలో నేది సత్వమో యేవి కాదో విమర్శించుట య ప్రస్తుతము. రెండును భావనావి శేషములే యగును. కాని యొకటిమాత్ర మొప్పుకొనక తప్పదు. అది యేమన నెంత పాపభూయిష్ట మైనను గానిండు; ప్రపంచము. మానవుఁ డందు శిశురూపమున జన్మించి జీవించునంత కాలమును జీవ సూత్రముల చేఁ గట్టుపడియే యుండును. అంతవఱకును సవస్థా పరిణాను భేదములకు లోనగుచునే యుండును. ఇట్టి యవస్థ పరిణామ భేదములస ముదాయమే జీవితము..

కామము మానపజీవిత క్రమము ననుసరిం చును.

మానవజీవిత శ్రమము ననుసరించి కామమును నవ పరిణామభేదములకు లోనగుచునే యుండును. తన్మూలముగ భావములును సవస్థాపరిణామములకులోనగుచుండును. అనఁగా రస మనంతముఖములఁ బ్రసరింపుచు ననంత వ్యాప్తి గలిగి యుండు ననుటయే యగును. అది యెట్లు సంభవించునో సోదా .హరణముగఁ జర్చించెదను.

మానవునిచి త్తవృత్తులును వికారములును శరీరస్థితుల ననుసరించి యుండును,


-ఉదాహరణములు. -

ఉదహరణము. రోగముతోఁ దీసికొను చున్న దానికి సర్వ జగమును చిరాకు గలిగించునదిగను నసహ్యముగను నుండును. శామెరరోగము కలవానికి జగమంతయుఁ బచ్చఁగాఁ గను పించును. ఇంక శరీరసౌఖ్యముకల వానికి సర్వజగమును సంతోషం మయముగాను, సంతోషకరముగాను గన్పట్టును. సుఖముగఁ గడుపునిండ భుజించి హాయిగ హంసతూలికా తల్పమునఁ గూరుచుండి సరసపుష్పఫలసమన్వితమగు నుద్యానము వంకఁ జూచుచున్న వానికిఁ బ్రపంచ మానందమయముగను, సౌఖ్య, మయముగను గన్పట్టునుగదా? తలనొప్పిగ నున్న వానికి నెంత మధుర గాన మైనను తలనొప్పి నెక్కువఁ జేయును. అట్టిబాధ లేని నాని నెట్టిసొమాన్య గాన మైనను గరఁగింపఁజాలును.

-చిత్తవృత్తు లనంతములగుటచే రసములనంతములు.

చిత్తవృత్తులు శారీరక స్థితుల నాశ్రయించుకొనునటుల భావములును, రసమును జిత్తవృత్తుల నాశ్రయించుకొనును. ఎట్లనఁగా మనుష్యుని చిత్తవృతి యెట్లుండునో వానిభావములును నట్లేయుండును.ఉదాహరణము; వివాహకాలమున శుభమున నెల్లరును నోలలాడుచు నానందపరవళులై యుండు సమయమున వారి కెట్టి విచారభావములును నుండవుకదా! అంతి యకాదు, ఎన్ని చిక్కులైనను, ఎన్ని విచారములైనను నాసము యమున వారిమతుల కెక్క నే యెక్కవు. విచారమగ్ను లై యున్న వారికి, అనఁగా పుత్ర వియోగము చేతనో, దారవియోగము చేతనో కృశించువారికి నెట్టిశుభవార్తయైనను పెడ చెవిఁబడి నీరసమై పోవునుగదా? మనుచరిత్రమున గృహోన్ముఖుఁడై పలవరించు ప్రవరాఖ్యునికి దివ్యసుందరవిగ్రహయగు వరూధినిసౌందర్య మేమైన నచ్చెనా? నచ్చ లేదు? అతఁ డట్టి యెడ నుడివిన పలుకులలో నెంత సత్యమున్నదో కనుఁడు. “అనాళ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్యమన న్నెఱుంగవే?” యని పల్కిన మాటల యర్థమును మననముఁగావించిన సత్యము గోచరించును గదా? కావున రసమును, భావములును మానవుని చిత్తవృత్తుల ననుసరించియుండును. దుర్మార్గున కేవస్తువుఁ దిలకించినను దుష్టభావము లే తల లెత్తుచుండును. సన్మార్గవ ర్తనున కేవస్తువుఁ గాం చినను సద్భావము లే కలుగుచుండును. సరియే. మానవ ప్రకృతులును, చిత్తవృత్తులును ననంతవై విధ్యము కలిగియుండును గదా! అట్టిచో భావములును, రసమును ననంతవై విధ్యముకలిగి యుండక మానునా! ప్రపంచమున నెన్ని కోట్ల భిన్న ప్రకృతులు, మిశ్ర ప్రకృతులు, విపరీత ప్రకృతులు, అతీత ప్రకృతులు కలరో, అన్ని వింత భావములును, విపరీతరసములును, వర్తిలుచునే యుండును. రసములు తొమిదియే యని మనలాక్షణికులు తెల్పునది యంత శుద్ధసత్యము కాదు. సృష్టియు, మానవ ప్రకృతియు నెట్లనంతములో భావమును రసమును నట్టులే యనంతములు, ఈభావమునే రసవేత్తలు "ఆనంతో వై రసః” యని నిర్వ చించిరి.


#####-------