ఆంధ్ర కవిత్వ చరిత్రము/పంచమప్రకరణము
పంచమ ప్రకరణము.
భావములు భావనాశక్తి,
ఇంతవఱకుఁ గావ్యము రసాత్మకమనియు, రసము కవి యొక్క భావానుభూతియే యనియు, నట్టిరస మనంతవ్యాప్తిగలదగుటచే రసము లనంతము లనియు, నాలంకారికుల చేఁ బేర్కొనఁబడిన నవరసము లనునవి యుదాహరణమాములే యనియు, భావము లనంతములును ససంఖ్యాకములును నగు టచే దదనుభూతియు ననంత వ్వాప్తి గలిగియుండు ననియు, సిద్ధాంతముఁ గావింపఁగలిగితమి, ఇప్పుడు రసమునకుఁ బట్టుఁ గోమ్మలును ఉపాధులును బ్రాణాధారములును నగు భాషముల ప్రశంసం గావించి పిమ్మట భావములను గావ్యమున రూప వంతములుగను, శ క్తిఁగలవిగను, నేకత్వముగలవిగను నిర్మించు • శక్తియగు భావనాశ క్తినిగూర్చి ప్రసంగించెదను.
భావములయొక్క, యాలం కారిక నిర్వచనము నిదివటి కే తెల్పియుంటిని. గ్రహణసౌలభ్యమునకై తిరిగి దాని నిచట సుదాహరించెదను.
సుఖదుఖాది శై ర్భావై ర్భావ సద్భావభావనమ్.
“దృష్టిగోచరములగు వస్తువుల దర్శనమువలన జనించు సుఖ దుఖాదీ వికారములచే హృదయ మావేశమునొందు నవస్టయే భావము. ఇయ్యది భావనయను పదమునుండి జనించినది. సుజా
సనగల పుష్పము ఇతరవస్తువులకు సైతము తన వాసన నొసగు రీతియే భావమునకు వర్తించును." '
పై నిర్వచనముయొక్క తాత్పర్య మిట్లు చెప్పనగును. కన్ను లకు గోచరించు వస్తువుల దర్శనమువలన మానవునకు సంతోషముగాని, దుఃఖముగాని జనించును. అట్లు జనించిన సుఖముగాని, దుఃఖముగాని హృదయము నా వేశించినచో నాయవస్థ భావ మగును. అట్టి భావావేశమువలన మిగిలిన ప్రపంచమంతయు భావానుగుణమగు రూపమును దాల్చునెడ నయ్యది భావన యగును. అట్టి భావనయొక్క విజృంభణమే భావనాశక్తి యగును. కావున భావము శారీరికవిశారము మాత్రమేగాక మానసికవిగారముఁగూడనని యీనిర్వచనము తెలుపుచున్నది. అనఁగా, భావము శరీరమును మాత్రమేగాక మనస్సును గూడ వళముఁ జేసికొని వికారమునకుఁ బాల్సేయును,
భావములయొక్క స్వభావమును జన్మ ప్ర కారు. మును గూర్చిన భిన్న సిద్ధాంతములు.
“భావము లేప, కారము జనించును? వాని స్వభావ మేమి " యను ప్రశ్నకు సమాధానము నరయుదము. భావము యొక్క జనమునకుఁ గారణము మనోవికారమా? లేక శరీర సంబంధమగు విశాలమా? మన శాస్త్రజ్ఞులు, అనఁగ నలంకారి కులు భావము నునోవికారమును శారీరకవికారమును గూడ నగు ననిరి. కాని శరీరవికారము జనించి మానసికవికారముగఁ బరిణమించునా ! అను ప్రశ్నమునకు సమాధానము విస్పష్ట ముగఁ జెప్పరైరి. దృష్టి గోచరములగు వస్తువుల సందర్శనమున సుఖదుగిఖములు గల్గు ననుచున్నారే అవి యెట్టివి? శరీరసంబంధ మయినవా? లేక మనసంబంధ మయినవా? ఈ ప్రశ్నమునకు సమాథానముఁ జెప్పవలయు నన, దీర్ఘమగు మనశ్శాస్త్ర సంబంధమయిన చర్చకుఁ గడంగవలసియుండును. ఆయ్యది యప్రస్తుతమును విశేష ప్రయోజనరహితమును నగుటచే సంగ్రహముగ సూచించి మన విషయమున కనుకూలించు 'నంతవఱకుఁ దెల్పెదను. ,వస్తువును గాంచినతోడనే జనించు 'సుఖదుఃఖములు మానసికములేయని మామతము. శరీరసంబం ధములైన సుఖదుఃఖములు బాధయు, హాయియు మాత్రమే యగును. అట్టి బాధయు హాయియు నింద్రియవ్యాపొర ములకు సంబంధించిన వగుట చే శారీరకసుఖదుఃఖము లనఁ జెల్లును. భావమువలన ముఖ్యముగ మనస్సున కే సంక్షోభము గలుగును. మనస్సంక్షోభము శారణముగ శరీరముగూడి శుష్కించిన శుష్కించుంగాక! అట్లగుటయు సహజమే. శాస్త్ర సమతమును గూడ, ఎట్లన, మనశాస్త్రము యొక్క ప్రధాన సిద్ధాంతము ననుసరించి శరీరమునకు బాధ గలిగినచో మన స్సునకును భాధ గలుగును. మనస్సునకు బాధ గలిగినచో శరీరమునకును బాధ గలిగియే తీరును, మనస్సును శరీకమును ఏక ప్రాణయుతములే. భిన్న వ్యక్తులు గావు. అందుచే నొక దానికి బాధ గలిగిన రెండవదానికిఁగూడ బాధ గలిగియేతీరును. అట్లగుటం జేసి మనస్సంబంధమగు వికారము లన్నియు శారీర సంబంధములగు వికారములుగఁ బరిణమించునని సిద్ధాంతము, మతి భ్రమము నొందిన పిచ్చివాడు వికారములగు చేష్టలు గావించుట మనము నిత్యముఁ జూచువిషయమే. 'మతి తిన్న గా నుండువారు అట్టి వికార చేష్టలకు లోనుగారు,కావుననే దృష్టిగోచరములగు వస్తువుల దర్శనమువలన జనించు సుఖ దుఃఖాదిభావములు శరీరమును గలఁత పెట్టుచుండునని నమ్మదగి యుండును. సంతోషము సగముబల మనియు మనోవ్యాధికి మందు లేదనియు జనులనుకొనుమాటలు ఈ రహస్యమును స్ఫుటముగ బోధించుచున్నవి. భావములు శారీరికవికారములుగ జన్మించి మానసికవికారములుగఁ బరిణమించునని యభినవ పాశ్చాత్యుల సిద్ధాంతము, ఈ సిద్ధాంతమును 'జేమ్సు లాంగ్ సిద్ధాంత' మందురు.
పాశ్చాత్య మతము, జేమ్సులాంగ్ సిద్ధాంతము.-
ఈ పేరఁ బరగు భావములనుగూర్చి వారొకవింతసిద్ధాంత మును గావించినారు. మనకు జనించు భావములు మానసిక వికారములగుటకుఁ బూర్వము శరీరసంబంధములగు వికారములుగ జన్మించి యాశరీర వికారము తగ్గిపోయిన పిదప మానసిక వికారము లై చిరస్థాయినొందఁగలవని వీరిమతము. ఉదా:-- సింహము మనుజుని పైకి దుముక వచ్చుచున్న దనుకోనుఁడు. మనుజుఁడు భయపడి పరువెత్తును. ఇచ్చట భావము భయము. మనస్సులో భయముఁ జెందుటవలన మనుజుఁడు పరువెత్తు చున్నాఁడా? లేక పరువెత్తీన పదప భయము ననుభవించు చున్నాఁడా ! జెమ్సులాంగ్ సిద్ధాంత ప్రకారము వస్తువును దర్శించినతోడనే శారీరిక వికారము జరిగియే తీరును. సింగ మును గాంచుటతోడనే మనుజుని మనోవ్యాపారము ఒక్క మాఱుగ స్తంభించిపోయి యతఁడు కారణము తెలియకనే పరువెత్తసాఁగును. అట్లు కొంతదూరము పఱువెత్తి యేల పరు వెత్తుచుంటినా యని వితర్కించుకొని కారణ మరసి తన్నుఁ
దజుముకొని వచ్చుచున్నది. సింగమని గ్రహించి భయభ్రాంతుఁడగునని జేమ్సులాంగల్ మతము, ఈమతమునకు అనేకము లగు పూర్వపక్షములు గావింపంబడినవి. వారితో మనకుఁ బని లేదు.వస్తువును 'గాంచినతోడనే మృగములరీతి నేవో చేష్ట లకు లోనయి మనుజుఁడు భావమును బిమ్మట మానసికముగ ననుభవించు ననుసిద్ధాంతము మనుజుఁడు మృగములనుండి జన్మించుననియుఁ, దత్కారణముగ మృగసహజములగు చేష్ట నే ముందుగఁ బ్రదర్శించుననియుఁ బిమ్మట మృగములకన్న దనమెదడు ఎక్కు డు దట్టముగను నెక్కుడుఁ జమత్కారముగను సృజింపఁబడియుంటచే వానికన్న నెక్కుడు తెల్విగలవాఁడయి. యామృగము లనుభవింపని మానసికవికారమునుగూడఁ దా ననుభవించి మానవసహజమగు జ్ఞానమును వ్యక్తముఁగావించు ననియు డార్విన్ సిద్ధాంతమున కనుకూలముగాఁ జెప్పఁబడినది.
-ఆర్యసిద్ధాంతము యొక్క పరమార్థము,
మన మన్న నో ప్రపంచమంతయు భగవంతునిచే సృజిం పంబడెననియు, భగవంతుని తేజమును ఆత్మయు మనయందును. వస్తువులయందును సయితముఁ గలదనియుఁ, దత్కారణమున మనము వస్తువులఁ గాంచినతోడనే భగవద్ద త్తమగు నాత్మ బలమువలనను, జ్ఞానమువలనను, వస్తువులయం దంతర్గర్బితములయియున్న గుణవిశేషములను, భగవత్తేజమును నవలోకించి. చుట్టము లొకరినొకరు చూచుకొనుతోడ నేసుఖ దుఃఖాదీ భావములకు లోనగుదురో ఆట్లే సుఖదుగిఖాది భావములకు, లోనగుదుము. మనకును వస్తువులకును గల చుట్టరికము భగ వంతునిచే మనమును వస్తువులును గూడ సృజింపఁబడుటచే సంభ వించినది. ఏకోదరన్యాయము వర్తించుచున్నది. దూర దేశా గతుఁడగు సోదరునిఁ గాంచినతోడనే ప్రేమ మొక్క సొరీగ ననుభూతమగుచున్నదే. రక్తసంబంధము బహుసూక్ష్మముగ ననుభూత మగుచుండును. కొన్ని యెడలఁ దల్లి బిడ్డలు ఎడ బాటు సనుభవించి ఒకరి మొగముల నొకరు గుర్తింపఁగా లేనంత మారిపోయినను మాతృసహజమగు పాలపొంగు జనించి వారల కుండు రక్తసంబంధమును ఎఱుకపఱచునని మన మెఱిఁగిన సంగతి యే. పిట్టలు, జంతువులు, క్రిమికీటకాదులు, వేయేల? సర్వ ప్రాణులును ఇట్టి రక్తసంబంధమును అనుభవిం చుచు వేనియొక్క రక్తసంబంధుల నవి గుర్తెఱుంగుచుఁ బొర పొటుఁ జెందకయే సుఖదుగఖముల ననుభవించును. వేయిపిట్ట లున్నను జ్ఞాన మంతగా లేనిదయ్యు మగపిట్ట తనతోడిది యగు నాఁడుపిట్టనే సాయంకాలము గూటిలోఁ జేర్చుకొని సుఖమను భవించునే, 'వేరొక పిట్టను జేరనీయ దే? వేయిదూడ లున్నను బశువు దనదూడనే వెదకికొని పాలు చేపునే. ఈ వికారములకు ఈయనిర్వాచ్యసంబంధమునకుఁ గారణము భగవద్దత్త దివ్యజ్ఞాన ముదక్క నన్యము గాదు. భగవంతుని సృష్టి వైచిత్ర్యమే యిట్టి రహస్య సంబంధముల కెల్లఁ గారణము. ఇట్టి దివ్యసూత్రమే సృష్టియం దరాజకము లేకుండ శాంతిని స్థాపించి తుష్టిని సర్వ ప్రాణులకుం బ్రసాదించుచుండును. .
-ప్రకృతికిని మనుజునకును గల రహస్యసంబంధము
ఆట్లే ప్రకృతికిని మనకును రహస్య సంబంధము గలదు. అట్టి రహస్య సంబంధమును గుర్తించినవాఁడే రసికుఁ డగును.. ప్రకృతియు భగవంతునిచే సృజింపఁబడినదనియు నందును భగ వంతుని తేజము గలదనియు గహించి యనుభవించిన వాడే రసికుడగును. అట్లు గ్రహించినవానికిఁ జూచినతోడనే యే శరీరవికారమును నక్కర లేకయే సుఖదుఃఖాదిభావములు జనిం చుచునే యుండును. అటులనే జంతువుల విషయమునఁగూడ. ముద్దులొలుకు నావుదూడలనుగాని, గంభీరముగ నుండి మిగుల బలసిన యాఁబోతులనుగాని, రౌద్రరసస్ఫూర్తిని విడంబించు సింహమునుగాని, పడగ విప్పి యాడు నాగుఁబామునుగానీ, జూచినతోడనే యొకరకమగు భావము మనల నావేశించును. కావున భావమునకుఁ గారణము భగవద్ద త్తవిజ్ఞానమును, (అనఁగా మనశ్శక్తి) మనకును జరాచర ప్రకృతికిని గల రహస్య సంబంధమును, నని గ్రహించునది. అందుచే మనవారు విభావ మను వేరఁ బిలిచిన మానసికవి కారమే ముందనియు, మానసిక వికారమును బాహ్యముగఁ బ్రదర్శించు ననుభావము వెనుక వచ్చుననియుఁ జెప్పుట. విభావములు మూలకముగ భావము మనస్సునకుఁ దట్టి యనుభావములు మూలకముగఁ బ్రదర్శితము ' లగును. కావున నే మనశ్శ క్తియు జన్మాంతరసంచిత రసహృదయ మును లేనిది భావము జనింపదు. శరీరవికారములు భావమును గలిగింపజాలవు. భావము మనస్సున ననుభూతముగానిది పైకి ప్రదర్శింపఁబడ నేరదని మామతము. వీభావములు ముందు, అను భావములు పిమ్మట.
భావన యన నేమి?
భావములయొక్క జన్మప్రకారమును సూచించితిమి భావము మనస్సు నావేశించినతోడనే సర్వ ప్రపంచమును దదను గుణమగు రూపమును దాల్చియున్నట్లు గన్పట్టును. అదియే భావనయని మనలాతుణికులు వివరించిరి. పుష్పము సుగంధమును వెదఁజిమ్ముట వలన దారిని బోవువారికి దాని వాసన యనుభూత మగుచుండును. అట్లే సుఖదుఃఖాదిభావములయొక్క వాసన యితర విషయములకు సయితము వర్తిల్లు చుండును.ఎట్లనఁగా;దుఃఖము చే నావేశింపఁబడిన మనుజునకుఁ బ్రపంచము సర్వమును. దుఃఖపూరితముగ నున్న ట్లే గోచరించుచుండును. అది యొక యున్మాదమే కావచ్చును, ఒక వికారమే కావచ్చును. కాని అట్టిది మానవునకు సహజముగ ననుభ వములోనుండు నవస్థలలో నిదియే. తన భావమును మనుజుఁడు ప్రకృతి కారోపించును. తాను సంతోషముగనున్నఁ బ్రకృతియంతయు సంతోషముగ నున్నట్లే భావించుచుండును. తాను విచారముగనున్నఁ బ్రపం చము సర్వమును విచారమున మునింగియున్నట్లు భావించును. ప్రపంచము నిజముగ నట్టి సుఖదుఃఖములకు నేతదవసరముల లోనగునో కాదో చెప్పుట యప, స్తుతము. గ,హణీయాం శము మానవుఁ డట్లు భావించునా? భావింపఁ డా ! యనునవి మానవునకుఁ బ్రకృతి యాభావమును ననుభవించునట్లుగను దదనుగుణమగు రూపమును దాల్చియున్నట్లుగను గనఁబడు టయే ముఖ్యమగు విషయము. భావపూరితు లయినవార లనేకులు అట్లు భావించియున్నారు. అది యున్మాదమే కా నిండు. అట్టి యున్మాద మే భావన యగును. అట్టి యున్మాదము నకు రసికుల చరిత్రల యందును భావవూరితు లగువారి చరిత్రల యందును అనేకదృష్టాంతములు చూపవచ్చును. కాంతా విరహముచే స్రుక్కి యేక వర్ష ప్రపొసశీక్ష ననుభవించుచు రామగిర్యాశ్రమములపొంతఁ ద్రిమ్మరుచున్న యక్షునకు భావా వేశమున నే కదా;
శ్లో. ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నీ పాతః క్వ మేఘుః,
" సుదీశార్థాః శ్వ పటుకరణైక ప్రాణిభిః ప్రాపణీయా:
ఇత్యాత్సు క్యాదపరిగణయః గుహ్యక స్తం యయాచే
కామార్తా హి ప్రకృతిశృపణా శ్చేతనా చేత నేషు.
అనుశ్లోకమున వర్ణింపఁబడినయట్లు చేతనా చేతనముల విషయ మయిన జ్ఞానము నశించెను ! ఇత్యౌత్సుక్యాత్ అనుపద ముననే యీభావము ధ్వనించుచున్నది. కాంతావిరహముచే నార్ద్రీ భూతమనస్కుఁడై మాసముల నెట్లో కడపుచు విచార మున మునింగియున్న యతనికి ధూమజ్యోతిస్సలిలమరుత్తుల యొక్క కలయికమాత్ర మేయయి ప్రాణశూన్యమయియున్న మేఘము. ప్రాణయుతముగను జేతనముగలదిగను నయి మాన వులయొక్క ప్రణయసందేశమును గొనిపోయి ప్రియురాం డ్రకు, విన్నవింప సమర్థతఁ గలిగినట్లుగను గన్పట్టుట భావావే ముమూలమున నేకద? 'భావౌత్సుక్యము గల్గినవారు పూర్వాపర ములును సత్యాసత్యములును బరిగణింపరు, కామార్తులు సహజముగఁ గృపణులగుట చేఁ జేతనా చేతనములయెడ విశేషము తర్కముఁ గావింపక భావమును విప్పి చెప్పుచుందురు. భావనయే ప్రధానాంశము. • -
జీవితమున భావనయొక్క ప్రయోజనము.
అట్టిభావన లేనిది ప్రపంచమున మహత్కార్యములు జరుగుట దుర్లభము. మనుజుఁ డెప్పుడును, దనవలె నితరులును భావపూరితులై యుందురని గ్రహింపనిచో, సమ్మనిచో, నితరు లతో సాంగత్యము చేయుటగాని, యితరులకుఁ దనభావమును విప్పి చెప్పుటగాని, యితరులను సత్కార్యాచరణమునకుఁ బురి కొల్పుటగాని యసంభవము. ఎదుటివాఁడు మంచివాడు గాడనియు, నతని స్వభావమునకును దన స్వభావమునకును నేసంబంధమును లేదనియుఁ దనకును నితరులకును నేసంబంధ మును లేదనియుఁ దా నొరులకుఁ జెప్పునదియు, నొరులు దన వలన వినఁదగునదియు నేమియు లేదని నమ్మువాడు కార్యో త్సాహముఁ జూప నశక్తుఁడై , నిర్వీర్యుఁడై, యైకమత్యమునకు సభ్యంతరముఁ గల్గించువాఁడై , ప్రయోజనరహితుఁడై కీడునే యాపాదించుంగాని, మే లెన్నఁడును జేయఁజాలఁడు. భాననం గలిగినవాఁ డెప్పుడును ముందుచూపే చూచుచు నెట్టి కార్య మును నిర్వహించుటకైన సాహసించును.
భావనాశ క్తి యన నేమి?
పై నఁ జెప్పఁబడిన భావనయొక్క విజృంభణమే భావనా శక్తి యగును. ఏప్రభావమువలన మానవుఁడు మానసికము లగు తనభావములు ప్రకృతియందుఁ బ్రతిబింబితము లగుచు న్నట్లుగాని, ప్రకృతియం దాకృతిఁ దాల్చినట్లుగాని భావించి యనుభవింపఁగలఁడో ఆశక్తియే, ఆ ప్రభావమే భావనాశోక్తి యనఁబరగును. భావనాశ క్తియొక్క స్వభావమునుగూర్చియు, దానియొక్క ప్రయోజనములనుగూర్చియు విచారణ గావిం తము. భావనాశ క్తియొక్క స్వభావ మత్యద్భుతము, భావనా శక్తిబలమున కవి యనేకములగు భావముల రూపసహితము లుగఁ గాంచి యనుభవించి యితరులకుఁగూడ నాభావములను రూపసహితములుగఁ బ్రదర్శింపఁజాలును. ఈ భావనాశ క్తియొక్క స్వభావమునుగూర్చి శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి గారు తమ. కవిత్వతత్త్వవిచారమున బహువిపులముగను, చక్కఁగను మన.. సున "కెక్కునట్లుగను వ్రాసినారు. వారు సర్వతోముఖముగను సోదాహరణముగను జర్చించిన విషయమును మితముగ సూ చించి విడిచెదను.
"భాపనాశక్తి యనఁగా విషయముల మనసులోఁ బ్రతి బింబించునట్లు చేయు సామర్థ్యము. ఒక్క ప్రతిబింబించుట యన నేల? ప్రత్యక్షముగ నవతార మెత్తునట్లు చేయుట, చూడుఁడు. సీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి "మొదలగు. స్త్రీలు కవికల్పనలకుం జేరినవారయ్యును మనకుఁ జరిత్రముల లోని స్త్రీలకంటెను మఱియు మనము నిత్యమును జూచుచు, వాదాడుచునున్న యిరుగుపొరుగు భాగ్యశాలినులకన్న ను నెన్ని యోమడుంగులు సత్త్వముం దాల్చినవాడై స్ఫురించు చున్నారుగదా! చూడంబోయిన పాండవులు, దుర్యోధనా దులు, రామభరతులు మొదలగు మనస్సృష్టిమానవులు మిథ్యలా, మనమె మిథ్యలా? ఈ తీరున కృత్రిమములపై తము మూర్తీభవింపఁ జేయువారే మహాకవులు" అని వ్రాసియున్నారు. -
భావనాశక్తి భగవద్ద త్తమే కాని వేఱుకాదు.
భావనాశ క్తి భావములను ప్రతిబింబించునట్లు చేయవలె సన్నను, వానిని ప్రత్యక్షముగ నవతార మెత్తునట్లు చేయవలె నన్నసు కవి యాభావములఁ బూర్లముగ ననుభవించి వాని . యొక్క మూర్తులను, ప్రతిబింబములను మనోదృష్టి చేఁ గాంచి యుండవలెను. అట్టి మనోదృష్టిచే విషయముల ప్రతిబింబములను, భావముల మూర్తులను గాంచని కవి యితరులకు వానిని:
ప్రత్యక్షములుగఁ బ్రదర్శింపజాలఁడు, “ఇట్టి దృష్టి బలము దివ్య, ప్రభావమేగాని యన్యము గాదు. అయ్యది భగవద్దత్తమేగాని యన్యమార్గలబ్దము గాదు. భావనాశక్తి గలవారిని చూచి నేరిచికొనుటవలన వచ్చెడుపని కాదు. జన్మతో రావలసిన దే. అందుకనియే "కొయ్యలరీతినో, మహర్షులచందంబుననో నిర్వి కారస్థితి నుండువారు పద్దెములు వ్రాయనేర్తురుగాని కవులగుట యసంభవము. ఏవృత్తాంతమునైనఁ జూచునట్లు వర్ణింపవలయు నన్న దానియొక్క స్థితిగతులను నందలి పొత్రముల సుఖదుఃఖములను రోమరోమమునకుఁ దానే మనఃపూర్వకముగ నను భవించినందప్ప తద్రూపముగ నభినయింప నెవరికిని దరముగా దనియు, భావనాశక్తి సుద్దీపింపఁ జేయునది ప్రకృతి భావ తైక్ష్ణ్యమే యనియు, రెడ్డిగారు వచించుట. ఇట్టి భావతైక్ష్యము కార్యోత్సాహముఁగలిగిన వారియందునను వీరయుగముల జన్మ మునొంది పవిత్ర కార్యసంఘటనోత్సాహముఁ గలిగిన మను జులయం దెక్కువగ నుండుననియు నక్కారణముననే వీర యుగముల నాఁటి కవిత్వము భావనాశక్తి నమితముగఁ బ్రద ర్శించుననియు, దేశ చరిత్రము ననుసరించి జనులలో శౌర్యము హెచ్చుగ నున్నపుడు కవులకు భావనాశక్తి యెక్కువగ సుండు ననియు, శౌర్యము క్షీణించునపుడు భావనాశక్తి క్షీణించి పొండిత్యమును తత్ప్రసాదలబ్దమగు నూహాశక్తియు మెండుగ నుండుననియు రెడ్డిగారు నిరూపించిరి. ఇందెంతయు సత్య మున్న దని యెల్లరు నంగీకరింపక తప్పదు. అది యెట్లో ఆంధ్ర కవిత చరితమును వర్ణించునపుడు సోదాహరణముగఁదెల్పెదను.
ఆంధ్ర కవిత్వ-14 .aa.
భావనాశ క్తియొక్క- స్వభావము,
భావనాశక్తి చిత్తవృత్తుల ననుసరించుచు నియమిత మార్గములనే చరించును.
భావన చిత్తవృత్తి ననుసరించి వృద్దినందునని యంగీక రించినచో వేరొకవిషయమునఁ గూడ నంగీకరింపవలసివచ్చును. అది యెద్ది యన, మానవునకు సాధారణముగ నొక్కొక్క సమయమున నొక్కొక్క భావము ఆవేశించియుండు కతన దద్భావముల కనుగుణములగు వస్తువి శేషములును, వస్తులక్షణ ములును, గోచరించుట సహజము. ఏపనిమీఁదఁ బోవువాఁడు ఆపనికి సంబంధించిన విషయములపైననే దృష్టి యుంచునే కాని, యూరక చోద్యముఁ జూచువానిపగిది, దిరునాళ్ల దర్శింపవచ్చు వాని పగిది నసంగతవిషయములపై దృష్టిఁ బోవనిచ్చునా? అట్లే భావావేశము గలిగినవాఁడు దద్బావానుగుణములగు వస్తువులనే, గుణములనే, విషయముల నే వెదకుకొను చుండును. అన్యవిషయములపై మనసుఁ దగులనీయఁడు, కావుననే భావ దృష్టి యెతయుఁ బరిమిత దృష్టియే, అనఁగా వస్తువు యొక్క సర్వగుణములను సర్వవి శేషములను విచారింపక భావానుగుణ ములగు_అనఁగా భావావేశమునఁ దాత్కా లికముగ మధికి దట్టు విషయములను విశేషములను, గుణములను మాత్రమే గ్రహించుననియు నన్వయించుకొనునది.
భౌవనాదృష్టికిని శాస్త్ర దృష్టికిని గల భేదము.
శాస్త్ర కారుని దృష్టి యట్టిది గాదు. శాస్త్ర కారుఁడు ఏ దేనివిషయమును బరిశీలించుచో ఆవిషయమును సొంగో పొంగముగ విమర్శించి దాని లక్షణముల సన్నియు గ్రహించి సర్వతోముఖ పాండిత్యమును, సంపూర్ణ విజ్ఞానమును వెల్లడింషం బ్రయత్నించును. శాస్త్రకారునికి విషయముపై భావసంబంధ మగు నభిమానముండదు. అతనికున్న యభిమాన మెల్ల విషయమును గ్రహింపఁగోరుటయే. భావకున కట్లుగాదు. భావన చేయు విషయముపై నతనికి సభిమానము మెండు. అందుచే నతఁడు. దన యభిమానమును అనుసరించి తన కవసరమయిన విషయ మునే, తన మదికింపగు సంగతులనే, తన చిత్తవృత్తికి ననుగుణములగు విశేషములనే యరయుంగాని సంపూర్ణ పొండిత్వ ప్రకరకై పెనంగులాడఁడు. భావనాబలమునఁ గవికి భావమున కనుకూలములును, బ్రథాసములును నగు గుణములు మాత్రమే గోచరించును. అట్టివానినే యాతఁడు వర్ణించును. అంతియే కాని యూరక శుష్క ప్రలాపముఁ గావింపఁడు. ఈవిషయ మును గొంచెము విమర్శించి నిజమగు భావనాశ కికిని భావనా శక్తియని మనవారు.. అందును ముఖ్యముగఁ బండితులు తప్పఁ దలంచు నూహాశక్తికిని భేదము నరయుదము,
భావనాశక్తికిని సూహాశక్తికిని గల భేదము మితభాషిత్వము.
భావనాశక్తిగల కవి సహజముగ మితభాషి. తాను వర్ణించు విషయమును దనయొక్క చిత్తవృత్తికిఁ దన్నావేశించుకొని, యుండు భావనకు ననుగుణమగు రీతిని వర్ణించును. అంతియే కాని, సంపూర్ణ సౌందర్యము కొఱకుఁగాని, సంపూర్ణ ప్రతిభా ప్రకరము కొఱుకుఁగాని ప్రయత్నింపఁడు. ఈవిషయమునఁ గావ్యవర్ణనాపద్ధతులలో భావనాశక్తిగల కవులకును నూహా శక్తిగల కవులకును భేదము విచారింపఁ దగును. భావనాశక్తి గల కవులకు విషయమున నేవోకొన్ని లక్షణములు మాత్ర మే పరిస్ఫుటములుగ గోచరించును. చూడుఁడు. కొందఱు స్త్రీలకు మొగమే యందముగ నుండును. కొందఱకుఁ జక్కని కన్ను లుండును. కొందఱకుఁ జక్కని ముక్కు లుండును. కొందఱ రేచక్కఁదనమును లేకున్నను మనస్సు సౌకర్షింపఁగల టీవియు 'హొయలును వాలకమును మందహాసమును నుండును. భావనా శక్తి గలిగి రసికుఁడగు కవి యాయా వ్యక్తికిఁ బ్రత్యేక విలక్షణము లనందగు నవయవసౌందర్యవి శేషములనే వర్ణించునుగాని 'యూరక ప్రపంచముననున్న సౌందర్య లక్షణము లన్నీయు, పర్ణింపఁబూనఁడు. అట్లు వర్ణింపఁబూనిన హాస్యాస్పదుఁ డగును. 'సీతమ్మకు ముక్కు సొగసు, రుక్మిణమ్మకుఁ గన్నులు సొగసు, కావున నీయమ్మ ముక్కును నాయమ్మకన్నులును దీసి బ్రహ్మ దేవుఁడు వేరొక పెద్దమ్మను సృజించెను. కావున నీమూఁడవ యమ్మ సీతా రుక్మిణులకన్న రెండింతలు సొగసుకత్తియ యని వ్రాయువారికి శిల్పముయొక్క తెఱంగను వాసన యేమాత్ర, మైనఁ దెలియుసని వచింపనోనా?' అని శ్రీ రెడ్డి గారు ప్రశ్నించుటలో నట్టివర్లనము యొక్క వెకిలితనము పూర్తిగా వెల్లడియగు చునేయున్నది. అందుచే భావమునకును, అనఁగా నాభావము నకు నాశ్రయమగు పాత్రమునకును, బ్రత్యేక ప్రాణమును బ్రత్యేక సౌందర్యమును, బ్రత్యేక గౌరవమును, బ్రత్యేక విలక్షణతను నొసఁగఁగల సౌందర్య విశేషములే వర్ణనీయములు గాని, యన్యములు గావు. అందుచే భావనాశక్తిగల కవి మిత భాషీయని మేము మున్ను వచించియుంట.
ఊహాశక్తి గల కవులకు మితభాషిత్వము సున్న,
ఊహాశక్తిగల కవు లట్లుగాక విషయమునందుఁ బ్రత్యేకముగ నభిమానము లేనివారగుట చే శాస్త్ర కారుని రీతిఁ బ్రపంచ ముననున్న సంగతులనన్ని యువర్ణనీయ విషయములతో సరిపోల్చి చూచి యయ్యది సర్వలక్షణ సమేతమనియు, సంపూర్ణ సౌందర్య విలసిత మనియు, వర్ణింతురు. ఇట్టివర్ణన స్వభావవిరుద్దమనియు, రసాభాస కారణమనియు వేఱుగఁ జెప్పనక్కర లేదు. కవి విషయమునందు అభిమానము గలవాఁడైనచో విషయమున కను కూలించు గుణములనే వర్ణించి సంతసముఁ బొందును. చూడుఁడు...మన కడుపులఁగన్న బిడ్డలు మన కంత ప్రేమా స్పదులుగ నుండుటకుం గారణము వారు తోడివారలకన్న నంద ముగ నుండిరనియా? లేక మన కడుపునఁ బుట్టి వారి వన్నె చిన్నెలచే మన మనస్సుల కైవసముఁ గొనుచుందురనియా!' కారణము తప్పక స్పురించును. మనకును వారికిని గల రక్త సంబంధము కతన వారికై మనకుఁ గల యను రాగము కతన వారి యొక్క పన్నె చిన్నెలు తమంతటఁ దామే మిగిలిన విషయములతొఁ బ్రసక్తియు నవసరమును లేకుండఁగ నే యానందము నొసంగుచుండును. అందువలన మనము వారి నెడఁభాసియుండు సపుడు వారియొక్క ప్రత్యేకములగు ఎన్నె చిన్నె లే మనమనస్సుల నిరంతరముఁ గలఁత పెట్టుచు వారిని జ్ఞప్తికిఁ దెచ్చుచుండును. కావ్యవిషయమునను నిట్లే
తిక్కనమిత భాషిత్వమున కుదాహరణములు
చూడుఁడు. కవి మితభాషి, యనుటకుఁ జక్కని యుదాహరణము, అభిమన్యుని మరణమున కై పరితపించుచు 'శోకించు.. నర్జునుని విలాపమును దిక్కన యెట్లు వర్ణించెనో
క. “అన్నగుమోమును న త్తెలి
గన్నులు నవ్వెడఁదయురముఁ గన్నారంగా
గన్నను బ్రదుకుదుఁ గానక
యున్న ను బ్రాణంబు లెట్టు లుండగనేర్చు ౯
భాపనాశక్తియుతుఁడగు తిక్కనకవి బ్రహకును శోకసంభిత మనస్కుఁడగు నర్జునునకును నభిమన్యుని యాకృతీ సర్వమును జ్ఞాపకమునకు రాక యతని నగుమోమును దెలిఁ గన్ను'లును, వెడఁదయురమును మాత్రమే జ్ఞప్తికివచ్చుచున్నవి. ఈవర్లన మెంతయు సహజమనుటకు సందియ మున్న దే? తండ్రికిఁ జూచుతోడనే ముద్దుఁగొలుపు నవ్వుమోమును, హృదయభావనైర్మల్యమును సూచించు దెలిఁగన్నులును, శూర సహజమగు వెడఁదయురమును మాత్రమే యర్జునుఁడు మనస్సునకుఁ దెచ్చికొనినాఁడు. అర్జునునిచే నట్టిపలుకులఁ బలికించిన తిక్కన భావనాశ క్తియు, నౌచిత్య గ్రహణశక్తియు నెంతపొగడకుం దగినవి !
ఈపద్య మూహాశక్తిచేఁ గల్పింపఁబడిన దనుటకు సందియము లేదు. ఆలోచించి, ఆలోచించి, అభిమన్యుని సౌందర్య మెట్లుండెనాయని వితర్కించి వితర్కించి పిముటఁ జెప్పినయ ట్లున్నది గాని శోకరస మొక్కుమ్మడి పెల్లువెల్లువఁగ నుదయింప దత్త రంగములచే సంక్షోభితమగు మనస్సుగల యర్జునుఁడు చెప్పినయట్లు లేదుకదా! అప్రధానములును, ఆలోచనాబలము ననే మనసునకుఁ దట్టు విషయములను మాత్రమే వీరు వర్ణించిరి. దీనికిఁ గారణము వీరికి తద్భావసాక్షాత్కారము లేమియే, అభిమన్యుని శౌర్యరసోపేతమగు మూర్తిని గన్నులఁ గాంచకుంటయే, అనఁగ భావనాశూన్యతయే. ఆంధ్ర కవులలో నెల్ల భావనాశ! ప్రదర్శకమగు మితభాషిత్వమునఁ దిక్కనయు, వేమనయు ముఖ్యులును నీడు లేనివారుసు. వారు వర్ణించు మూర్తిని గన్నులఁగాంచిన పిదపనే, అనఁగ విషయసాక్షాత్కార మైన తరువాతనే పర్లింతురు. అందుకనియే వారి వర్లనములయందు సఖ శిఖాదిపర్యంతవర్ణనము గన్పట్టదు. రెండుమూఁడుమాటలలో ప్రధానలక్షణములను వర్ణించి మన కన్నుల యెదుటఁ దాము వర్ణింపఁదలఁచిన విషయము యొక్క మూర్తిని బరిస్ఫుట రీతిని సాతాత్కరింపఁ జేతురు. తక్కుంగలవారో యట్టి భావనాశక్తి లేమి నూహాపోహములఁ గావించి యప్ర ధానవిషయముల జాబితాలను సమర్పించి మూర్తిని సాత్కరింపఁ జేయఁజాల కున్నారు. చూడుఁడు. ద్రోణాచార్యకల్పితమై పాండవవీరుల కెల్లరకు న భేద్యమై ధర్మ రాజునకుఁ బ్రాణభీతిఁ గొల్పిన పద్మ వ్యూహమును భేదించుటకై సాహసించి ప్యూహమున జొరబడిన యభిమన్యుని శౌర్యముసు, ధైర్యమును, గాంభీర్యమును, మహోత్సాహమును .దిక్కన మెట్లు వర్ణించినాఁడో!
ఆ. 'మెఱుఁగు మెఱసినట్లు మెఱపించి యరదంబుఁ
గర్ణి "కార కేతు కాంతిఁ జెలఁగ
సంపగముల గురుని నలయించి కడచి యిం
ద్రజుని కొడుకు మొగ్గరంబు సొచ్చే:
మెఱుఁగు మెఱసినట్లు” అని వర్ణించుటలో నభిమన్యుఁ డెంత వేగముతో నెల్లరకు దుర్నిరీక్ష్యుఁడై., ఎల్లరకన్నుల మీరు మిట్లు గొలిపి శౌర్య రాశియై పద్మవ్యూహమును భేదిం చుకోని పో రెనో యా తెఱంగు సువ్యక్తమై కన్ను లఁగట్టినట్లుండి యభి మన్యుని శౌర్వము కౌరవవీరుల నెట్లు కన్నుల మిఱుమిట్లు: గొలిపించెనో యట్లే మనలఁగూడ గన్నుల మిఱుమిట్లు గోలిపి స్తంభితులఁ గావించుచున్నది. అట్టి మితవర్ణ నాశక్తి , భావనాబలమునను, విషయసాక్షాత్కా రమువలనను, కనిసహజ మగు దివ్య ప్రభావమువలనను లభ్యము కావలసిన దేశాని యూహాశక్తివలనను, బాండిత్య బలమునను లభ్యము కాదు. అందుకని “జన్మనా జాయ తే కవి:” యనుసూత్రమును పాఠ కులకుఁ దిరిగితిరిగి, పదేపదే, విన్నవించుట. "అధిప భీష భానుఁ డస్తమిం చె”యను మాటలలో భీష్ముని మహాప్రతాపమును, సతని గాంభీర్యమును, నతనిపడుట వలన జనించిన మహద్విచారమును సర్వమును వర్ణించిన తిక్కన యమేయకవితా ప్రభావము సర్వలోకసంభావ్యమకదా !
-శాఫో కవయిత్రి.
పాశ్చాత్యకవులలో నెల్ల శాఫో యను గ్రీకు దేశపు కవ యిత్రి యీమిత భాషణమును, నీసం గ్రహవర్ణనాశక్తిని విశేషముగఁ బ్రదర్శించినది. ప్రణయస్వభావమును ' నామె వర్ణించిన విధంబుఁ గాంచుఁడు..
Love is so strong a thing
The very gods mast yield
When it is welded fast
With the unflinching truth,
Love is so frail a thing A
word, a look will kill
Oh lovers, bavaa care
How ya do deal with love
నిశ్చలసత్యముతో జతఁగూడిన
నెంతోశ క్తివంతంబగు ప్రేమము
దేవతలైనను దాని థాటికిని
లోబడి పోవలసినవారే,
చపలము వికటము సుండీ ప్రేమము
చంపెడు నొకమాటే యొకచూపే,
కావున జాగ్రత కాముకులారా!
యేవిధిఁ బ్రేమల మెలఁగెదరో!
ప్రణయము యొక్క శక్తిని నామే యెట్లు వర్ణించినదో!
ప్రేమమును సత్యమును జతఁగూడిన దేవత లైనను లొంగి పోయెద రనిన దానియొక్క శక్తని వేరె వర్ణింపవలయునా !'ప్రేమరియొక్క చపలస్వభావము నామె యెట్లు వర్ణించినదో ! ఒకమా బే, ఒకచూపే చం పెడునన్న చోఁ జేమయొక్క చాప ల్యము వేతే వర్ణింపవలయునా? ఒకచూపునకు బ్రమసియే,, యొకమాటకు మురిపెము నొంది యే, యేందఱు ప్రణయినీ జనులు బ్రేమోపహతులగుట లేదు ! ప్రణయభావస్వభావ మును, ప్రణయినీజనుల చిత్తవృత్తియొక్క వై చిత్ర్యమును నెంత ఛప్తముగాను 'సింత హృదయంగమముగాను వర్ణించినది? అందుకనియే యీ మేకవిత్వమును విమర్శించుసందర్భమున (Theodorewatts.Danton) తియోడరు నోట్సు డంటును' అను నాంగ్లేయవిమర్శకుడు. నుడివిన వాక్యముల నిటఁ బొందుపటు పక మాసంజులను, "Never before these songs were sung, and never since did the human soul, in the grip of a fiery passion utter a cry like hers; and, from the executive point of view, in directness, in lucidity, in that high, imperious.
Verbal economy which only nature can teach the highest artist, she has no egua, and none worthy to take the place of second. "' "అంతకుఁ బూర్వ మిట్టిపాటల నెవ్వరును పొడియుండరైరి. అంతకుపూర్వ మెన్నండును ప్రచండభావవశ మై మానవుని యాత్మ యిట్టి యాశ్రందన మొనర్పదయ్యెను. శైలివిష యమును విచారించినను బ్రత్యక్ష వర్ణనమునందును వైశద్యము నందును మహత్తరశక్తి గలిగినదియుఁ గవికీ జన్మతః లబ్దముగాఁ దగునట్టిదియు నగు మితభాషణమునందునను నీకవయిత్రి, యసమానయు నద్వితీయయు నని చెప్పకతప్పదు.”
భావనాశ క్తిగలకవులు మానవస్వభావము ననుసరింతురు.
కావున భాపనాశక్తిఁ గల కవి తచ్చక్తివలన భావాను గుణములగు విశేషములనే తాను గాంచి యితరులకు వర్ణింపఁ గలుగుననియుఁ దేలినది. మనుజుల స్వభావము దీనికి సరిపోవు చున్నది. చెప్ప లేదా శాఫో--
'చపలము వికటము సుండీ ప్రేమము చంపెడునొకమాటే, యొకచూపే'
అని? 'మనుజుల స్వభావ మేమన, నేయొక్క ఠీవినో యేయొక్క సొగసునో, యేయొక్క పల్కు తీయదనమునో, యేయొక్క మందహాసమునో, యేయొక్క నడకసొబగునో కనిభ్రమించి, తద్వ్యామోహముచేఁ దపించుచుఁ గొట్టు కాడు చుండుటయే, అంతియేగాని విమర్శకులరీతి భావముయొక్క సర్వపరిణామములను, సర్వతోముఖవ్యాప్తిని, ననుభవించిన పిదపఁ దద్భావమునకు వశుడగుననుట మనుజస్వభాపజ్ఞానము
లేమియే. కావున భావనాశ క్తి విషయమును సంగ్రహముగను క్షప్తముగను భావప్రకటనమునకవసరము,నుచితమును నగునట్లు గను వర్ణించి, విషయమును బ్రత్యక్షముగఁ గన్ను లయెదుట సాతూత్కరింపఁ జేయఁగలుగును. ఊహాశక్తి యట్లుగాక విష యముయొక్క గుణభేదములను విశేషములను సూహాబలము నను జాండిత్య బలమునను వర్ణించి విషయమును బ్రత్యక్షముగ సాటూత్కరింపఁ జేయఁజాలదు. అట్టిశ క్తిగలవా రెంతవఱకును జాబితాలఁ దయారు చేయఁగల్గినవా రేకాని ప్రాణవంతములగు మూర్తులను బ్రత్యక్షముగఁ బ్రదర్శింపఁజూలరు. మూర్తిని 'తా దర్శించిన కవియే దానిని ప్రదర్శింపఁగలఁడుగాని యూరక యాముదపు దీపముల వెలుంగున వాయుసంచారము లేని చీఁకటి కోణములఁ బూర్వకవికృత కావ్యముల వ్యాఖ్యానసాహాయ్య ముతో గ్రుడ్డిపాఠము గావించు పండితం మన్యులు బ్రదర్శింపం గల రే! ప్రాణ ప్రతిష్ఠఁ జేయుటకు వైద్యునకును, జీవతత్వము బాగుగ నెఱింగిన జీవశాస్త్రజ్ఞునకును సాధ్యమగు నే? ప్రాణము నకు వీర్య మాధారమనియు, వీర్యమునకు రక్త మాధారమ నియు సిద్ధాంతముఁ గావింపంగల వైద్యులును, జీవశాస్త్రజ్ఞులును ఆరక్తమును వీర్యముఁ గావించి, యావీర్యముతో నొక ప్రాణిని సృష్టింపగలరా? అట్టి ప్రాణప్రతిష్ఠ శాస్త్రాతీతము, మనుష్యాతీతము. అది భగవంతునికే సాధ్యము, అట్లే శావ్య మునఁగూడ విషయమునకు మూర్తిని, బ్రాణమును నొసంగుటకుఁ గావ్వలక్షణములను గవిసమయములను బూర్వకవి విరచితకావ్యములను బాగుగఁబాఠముఁగావించిన పండితులకు సాధ్య మగునే ప్రచండభావావేశమునకు లోనయి భానుకరతప్త శరీరునిభంగిఁ దపించుచు నార్తి చేఁ గావ్యరచనకుఁ గడంగి తాను వర్ణింపందలంచిన మూర్తిని గన్నులఁ గాంచి వర్ణిం చెడు కవి బ్రహకే చెల్లుంగాని యన్యులకుం జెల్లునే! అందులకనియే.. “కవిబ్రహా కవిర్విష్ణుః కవిర్దేవో మహేశ్వరః కవి స్సొక్షాత్ పరం బ్రహ తస్మై శ్రీకవయే నమః " యని కవిస్తోత్రముఁ గావించుట. ఆ జన్మనా జాయతే కవి.
“జన్మనా జాయతే కవిః
యనుమాట సత్యము, “జన్మనా జాయతే శూద్రః కర్మణా జయతే ద్విజః” యసున్యాయము ననుసరించి మనవారు అనఁగా లాకుణికులు కర్మణాకర్ష చేత: అనగాఁ గావ్యపఠనము చేతను,లక్షణ గ్రంథపఠనము చేతను సత్కవి యగునని భ్రమించుచున్నారు. జన్మతో శూద్రుఁ డై కర్మాచరణము వలన బ్రాహణుఁ డగుననీ చెప్పిన యార్యవచనము కావ్య విషయమునఁ దల క్రిం దవు చున్నది. కవి పుట్టుకతోడనే కవియై పుట్టును. పుట్టుకతోడనే కవి సహజమగు భావనా శక్తితోఁ బుట్టును. ఎట్లలన: సింహము పుట్టుకతోడనే తనజాతి స్వభామును లక్షణమును నగు మత్తేభహనన కాంతఁ గలిగి యుండిన ట్లే నాగుఁబాము పుట్టుకతోడనే తోఁకఁ ద్రొక్కిన వెంటనే పడగవిప్పి బుస్సుమని కఱవ నుద్యమించునట్లే, అగ్ని రవులు కొనుతోడనే సర్వవస్తువులను దహించి భస్మముఁ జేయఁగల్గునట్లే, కావునఁ గవి సామాన్యమానవుఁ డనియుఁ గావ్యరచన ధీశక్తి ప్రదర్శకమనియుఁ జమత్కారజనకమనీయు భావించువారికి గావ్యస్వరూపమును గవి ప్రభావమును దెలీయషని చెప్పసాహ సించుచున్నాము. అట్టి సాహసమునకుఁ బండిత శ్రేష్ఠులు గినియక .
వాదమునందలి సత్యమును గ్రహించి కావ్యపరమార్థమును గుర్తెఱింగిన నంతియే చాలును.
పాశ్చాత్యుల సిద్ధాంతము, వర్డ్సువర్త్ ' భావనాశక్తి యేకత్వమును, నూహాశక్తి ఆయనేకత్వమును సూచించును.
ఊహాశక్తికిని, భావనాశ క్తికిని పాశ్చాత్య విమర్శకులు వొక భేదవి శేషమును సూచించిరి. అదెద్దియన భాషనాశక్తి విషయమును ఒక్కటిగ నుపలక్షించును. ఊహాశక్తి విషయ మును వివిధ విభాగములు గలదిగ నుపలక్షించును. ఈభావమును * వర్డ్స్ వర్త'ను కవి తన విమర్శనవ్యాసముల వివరించెను. దీనిభావ మేమనఁగా, భావనాశక్తి గల కవి విషయములయందు అనఁగా వస్తువు యొక్క గుణవిశేషములయందుఁ గల యేకత్వ మునే దర్శించి దానిని ఏకప్రాణముగల వస్తువుగనే వర్ణించును. భావనాశక్తిఁగల కవి కుప్ప తెప్పలుగఁ బడియున్న రాలగుట్టల యందును, నడ్డదిడ్డముగఁ 'బెరిఁగియున్న యటవీ వృక్షముల యందును, గిచగిచ... కిలకిల -- కలకలమని యొక నియమమును రీతియు లేని పక్షిసమూహముల గానములయందును, రసమును, సౌందర్యమును, జీవమును గ్రహించి యనుభవింపం గలుగును. అట్టికవికి నెట్టి భిన్న గుణములుగల వస్తువునందైనను బరిస్ఫుటమగు రసమును, సౌందర్యమును, భావవి శేషమును గన్పట్టుచునే యుండును. అట్టికవికి నసహ్యమును, సౌందర్య రహితమును, జీవశూన్యమును నగు 'వస్తువు ప్రపంచమునఁ గంపడనేకన్పడదు. అట్టికవి వస్తువు యొక్క విశేషములనన్ని యుఁ లోహకారుఁడు లోహమును గరఁగించి యొకయచ్చునఁ బోఁత పోయునట్లు పోతఁబోసి యప్రధానవిషయములను విసర్జించి ప్రధానగుణములే మూర్తీభవించి ప్రాణవంతమగు రూపముఁ దాల్చునట్లు వర్ణించును. ఊహాశక్తిగల కవి యన్ననో యట్టి భిన్న త్వాతీతమగు నేకత్వమును, రసమును, సౌందర్యమును జీవమును గ్రహించి యనుభవించి వర్ణింపంజాలక యూహల బన్ని వస్తువు యొక్క విశేషణముల నొకదానివెంటఁ నొకటిఁ బేర్కొనుచు వస్తువు యొక్క మూర్తిని సాక్షాత్కరింపఁ జేయ లేకుండును. ఇతఁడు ప్రాణ ప్రతిష్ఠఁ జేయఁగల కవి బ్రహకాడు.భావనా శక్తియుతుఁడగు సత్కవి ప్రాణప్రతిష్ఠ జేసిన విగ్రహ మునకు నీయూహాశ క్తిగల కవి నగిషీఁ జెక్కి యలంకారముల నొడఁగూర్పఁ బ్రయత్నించును. కాలునేతులకుఁ దొడవులును, వస్తాద్యలం కారములను గూర్చి, వివిథావయవములకు నాభరణ ములను గూర్చి యాభరణములును, దొడవులును; నలంకార ములును దక్క మూర్తియొక్క సొగసుఁగాని, నిసర్గ సౌందర్యముఁగాని, జీవశక్తిగాని, తేజముఁగాని గనుపింపకుండఁ జేసీ చింపిరిగుడ్డల బరువుతోఁ దలయాడించు గంగి రెద్దులయట్టి యాకృతులను నీయూహాశక్తిఁగల కవి వర్ణించును.
భావనాశ క్తిగలకవి యాకృతిని, నూహాశక్తి, "గలకవి వస్తుగుణవి శేషములను వర్ణించును. "
భావనాశ క్తిఁగలకవి యాకృతిని నిర్మించుటకై ప్రయత్నిం చును. ఊహాశ క్తిగల కవి వస్తుగుణవి శేషముల వివరించుటకై తొక్కిసలాడును భావనాశక్తిఁగల కవి వస్తుగుణముల కతీ తమై సామాన్యమానవళాస్త్ర దృష్టి కగోచర మై దివ్య ప్రభతో వెలుఁగుచు వస్తువునకు జీవమును దేజమును నొసఁగు చైతన్య
మును దర్శించి, దాని మహత్త్వమును గురైఱింగి దాని ప్రభావము ననుభవించి, దానియొక్క తేజము గని, స్తంభితుఁడై, తెలివి నొందిన పిదపఁ దాను గాంచిన యాదివ్యమూర్తిని, చైతన్యమును, ప్రాణవంతముగను 'తేజస్సహితము గను వర్ణించును. అట్టిమూర్తులు మఱవరానంత పరిస్ఫుటాకృతులఁగలిగి మన కన్ను లయెదుటఁ దొండవించుచునే యుండును. ఊహాశక్తి గల కవు లట్టి దివ్య చైతన్యమును గాంచ లేక యూరక పై పై మెఱుఁగులఁ బచరించుటతోడనే తృప్తిఁ జెందుదురు. ఈసత్యమును గ్రహించియే వర్డ్సువర్తు కవి తన కావ్యముల ననవసరవర్ల నములకుఁ దావీయక విషయముయొక్క చైతన్యమును మాత్రమే ప్రకటము గావించుచుండెను. ఈ సత్యమును గ్రహింపజాలకుండిన యప్పటి యాంగ్లేయ విమర్శకులు వర్డ్సువర్తు యొక్క కావ్య శైలి పేలవమనియు నలం కారశూన్యమనియు నాక్షేపించిరి. కాని కాలమే వారి వాద దౌర్భల్యమును, వర్డ్సువర్తుకవి యొక్క ప్రతిభను సమర్థించినది.
తియోడర్ వాట్సుడంటను పండితునిమతము. సర్వస్వతంత్ర భావనాశ క్తికిని పరిమితభావనా శక్తికిని గల భేదము
Encyclopaedia Brittanica (ఆంగ్లేయ విజ్ఞానసర్వస్వము) అను గ్రంథమున కవిత్వ మనువిషయమై యమూల్యమగు వ్యాస రత్నమును రచించిన Theodorawatts-Dunton (త్రియోడర్ పొట్సుడంటన్) అను విమర్శక శేఖరుఁడు భావనాళ క్తి విషయమున నింకొక విభేదమును సూచించినాఁడు. అతఁడు భావనా శక్తి Absolute Imagination, Relative Imagination అను రెండు విధములుగ నుండునని సూచించినాఁడు. Absolute Inagination అనఁగా సర్వస్వతంత్రమగుభాపనాశక్తి, Relatiya Inagination అనఁగాఁ గవియొక్క చిత్తవృత్తి ననుసరించుచు కవియొక్క స్వభావము చే పరిమితమగు భావనాళక్తి. సర్వస్వతంత్ర భావనా శక్తి, యఖండశక్తియుత మైనది. దాని నేనియమములును బాధింపనేరవు. భావసామ్రాజ్యమున దానికి సర్వస్వతంత్రాధి కారము కలదు. అట్టి భావనాశక్తి కవియొక్క స్వభావము చేత గూడఁ గట్టుపడియుండదు. అట్టిభావనాశక్తి తఱచుగ నాటక ములయందే ప్రదర్శిత మగుచుండును. అట్టి భావనాశక్తి నిజముగఁ బరకాయ ప్రవేశ విద్యవంటిది. తత్ప్రభావము చేఁ గవి. తాను వర్ణింపఁదలఁచి కొనిన పాత్రమునందు లీనుఁడై పోవును. అట్లు లీనుఁడై పోయినకవి యాపాత్రమునఁ దనయొక్క భావ మున కనుగుణముగఁగొని తన చిత్తవృత్తి కనుకూలముగఁగాని, తన యూహానుసారముగఁగాని వర్ణింపఁజూడఁడు. మఱి యాపాత్రము యొక్క స్వభావ మెట్లు నడచునో యట్లే వర్ణించును. ఆపొత్రముయొక్క మూర్తిని సొత్తు కన్నులదర్శించి యా పాత్ర ముయొక్క చేష్టాదికములను, సంభాషణమును తాను గాంచినట్లే తాను విన్న యట్లే వర్ణించును. ఆపొత్రము వర్ణించు నపుడు కవి తన వ్యక్తిని, స్వభావమును సంపూర్ణముగ వదలినవాఁడై , పాత్రమునందు లీనుఁడై , పాత్రహృదయ: గహ్వరాంతరమునఁ బ్రవేశించి, తానే పాత్రమై పాత్రము, పల్కించు పలుకుల నే పలుకుచుఁ, జేయు చేష్టలనే వర్ణించి ప్రదర్శించును. అట్టిశ క్తిగల కవి సిద్ధునివంటివాఁడు. యోగ. బలమున సిద్ధుఁడు దేవతాస్వరూపముల నెట్లు గాంచి యను భవించునో యట్లే స్వతంత్ర భావనాశ క్తిఁగల కవి కూడ
ఆంధ్ర కవిత్వ-15
తాను వర్ణింపఁదలఁచిన విషయములను దివ్యశక్తి చేత స్పుటముగఁ గాంచి, యనుభవించి వర్ణించును. అట్టిదివ్యశక్తి కవికి జన్మతా లభ్యమౌనని యిప్పటి కేవిన్నవించి యుంటిని. అట్టి దివ్య శక్తి మున్ను భారతయుధ్ధప్రకారమును ధృతరాష్ట్రుని కెరింగించుటకై యుద్ధరంగమున సర్వత్ర జరగుచున్న విషయముల కన్ను లార గాంచి వర్ణింపుమని సంజయునకు వేదవ్యాసుఁ డొసంగిన దివ్యదృష్టి వంటిది. పుట్టుగుడ్డియైన ధృతరాష్ట్రునకు శ్రీకృష్ణుడు తనవిశ్వరూపము దర్శించుటకై యొసఁగిన దివ్య దృష్టివంటిది. అట్టిదివ్యదృష్టి బలమున నే రవి గాంచ లేని వాని నెల్లఁ గాంచఁగలుగుట, అట్టిదివ్యదృష్టి బలమున నే సామాన్య కవులు 'గాంచ లేని విషయముల నీస్వతంత్ర భావనాశ క్తిగల కవి వర్ణింపఁగలుగుట. అట్టి స్వతంత్ర భావనాశ క్తిని నాటకరచనా శక్తి యనియు, దివ్యదృష్టియనియు గ్రహింపఁదగును. ఇట్టిశక్తి నాటకముల యందును కథాభాగము విశేషముగాగల పురాణము లాదిగాగల మహాకావ్యములయందును నప్పుడప్పుడు ప్రదర్శితమగుచున్నది. అది యొక తపస్సిద్ది వంటిదని చెప్పుటచే నయ్యది సర్వదా యనుభూతము కాదనియుఁ, దపస్సు సిద్దించిన వేళల మాత్ర మే లబ్దమగుననియు గ్రహించునది. కవి కట్టి దివ్య దృష్టి 'మెఱుఁగు మెరసి య ట్లెప్పుడో లభ్యమై యితర సమయముల మాయమైపోవుచుండును. మఱియు నాటకకర్తకుల గూడ నీపరకాయప్రవేశము సర్వదా సాధ్యముకాదు. అతఁ డేదో యొక ప్రాతమందే లీనమైన మనస్సుగలవాఁడగును.అట్టి పొత్రము యొక్క స్వభావమందైనను నెప్పుడోయొకప్పుడు లీనుఁడై స్వశక్తి నశించినవాఁ డగునుగాని మిగిలిన వేళలను స్వభావము మీరి చరింపజూలక తనయూహాప్రకారమే పాత్రముయొక్క స్వభావమును వర్ణించుచుండును. ఇట్టి నాటకరచనాశక్తి ఎచ్చటనో కొన్ని రంగములనే ప్రదర్శితమగుచుండును. అట్టి నాటకపుఁబట్టులయందుఁ గవి యనవసర వాగ్వ్యయముఁ గావింపక పొల్లుమాటయైనఁగాని, పొల్లుఅక్షరమైనఁగాని రానీయక యథాశ్రుతమును, యథాదృష్టమునునగు పలుకులను రీతులను వర్ణించును. సాధారణకవు లెల్లరును భావనాబలమున నిట్లుండు నని యూహించి యాప్రకారము వర్ణింతురు. వారికి దివ్యదృష్టి యంతగా లేని కారణమున నూహాపరిమితములును నూహా చింతితములును నగు పలుకులును మూర్తులును ననుభవైక వేద్యము లగు చుండును,దివ్యదృష్టిగల కవుల పలుకు లట్టి దివ్య దృష్టి ప్రదర్శితమగు పట్టుల ననితరతుల్యములును,ననితర సామా న్వములును, కేవలో పగ్నాసూచకములును నై యాశ్చర్యముఁ గొలుపుచు "ఔరా, ఈకవి దక్క నన్యు లెవరైన నీవర్లనం జేయఁగల రే! యీభావముల వ్రాయఁగల రే! ఈ భావ మితని సొమ్మేకాని యితరులది కాదు ఈభావము రచించినవాఁ డితఁడే గాని ఇట్టివాఁడు పుట్ట లేదు, పుట్టఁబోఁడుకూడ” ననుతలఁపుల మనలో నుదయింపఁ జేయును.
సర్వస్వతంత్ర భావనాశక్తి కుదాహరణములు. 1. షేక్సిపీయరు మహాకవి రచితమగు హామ్లెట్ నాటకము.
ఇట్టి దివ్య దృష్టి సూచకమగు భావనాళ క్తికి వాట్పుడం టను పండితుఁ డొకయుదాహరణము నొసంగినాఁడు అయ్యది షేక్సు పియర్ (Shakespeare)అను నాంగ్లేయకవి శేఖరునిచే రచిం పఁబడిన(Hamlet) హామ్లెట్ అను నాటకమునుండి కై కొనఁబడి నది. హామ్లెట్ అను రాచకుమారుని తండ్రి మరణించెను. అతఁడు మరణించిన విధ మనుమానాస్పదముగ నుండెను. రాకుమారునకు మాత్రము తన తండ్రి మరణము మిక్కిలి మనో వేదనను గలిగించెను. తన పినతండ్రి వెంటనే రాజ్యము స్వాధీనముఁ జేసికొని సింహాసన మధిష్టించి యన్న భార్యను సతి గాఁగూడఁ గైకొనెను. ఈసంగతులనన్నియు విని హామ్లెటు రాకుమారుఁ డత్యంత విషాదసంక్షుభితమనస్కుండయ్యెను. ఇట రాకుమారుని సుంగతి యిట్లుండఁగాఁ గోటగుమ్మము కడఁ గావలి యుండు పహరా జహనులకు వరుసగా మూడు రాత్రులు ప్రతి రాత్రయందున్నను రెండు జాముల వేళకు చనిపోయిన హామ్లెటు రాజు నిజాకృతితోఁ గంపడెనంట. కన్పడిన తోడనే యాకావలివాండ్రు భయభ్రాంతు లైరఁట. వారలలో ధైర్య వంతుఁ డొకం ఎట్ట కేలకు నాఁటి రాత్రి, యారాజు యొక్క యాకృతినిగని దాని కేమైన కోరిక లుండెనో కసుఁగొనవలె నని పలుకరింపఁబోవఁగా నయ్యది ప్రత్యుత్తర మీయకుండ నేఁగెను. అంత నాకావలి వాండు మఱునాడు హామ్లెటు రాకుమారునికడ కేఁగి యతనితో జరిగిన సంగతియెల్లఁ దెలిపిరి. తెలుఫునవసరమున వారి కీ క్రింది సంభాషణము జరిగెను:--
“కావలి: - అయ్యా, మూఁడు రాత్రులనుండియు మాకుఁ గనిపించుచునే యున్నది. రాకుమారుఁడు:— ఆభూతముయొక్క యాకృతి యెట్లుండెను? కావలి.. అచ్చముగ హామ్లెటు రాజుగారి యాకృతియే మహాప్రభూ! రాకుమా:- ఆట్లైన నేను దానిఁ జూచియుండవలసినది.. కావలి: --మీరు తప్పక భయభ్రాంతు లయ్యెడివారే! రాకుమా;- నిజము. నిజము, ఆయాకృతి చాలనే పుండెనా?" ఇచ్చట కావలివాండ్రు, రాజుయొక్క భూతాకృతిని గాంచి భయపడియున్న వా రగుట చే రాకుమారుఁ డాభూత మును తాను గాంచియుండవలసినదని చెప్పినప్పుడు తమవలెనే యతఁడును భయపడియుండునని తలఁచి యాభావమును “ మీరు తప్పక భయభ్రాంతు లయ్యెడివారే” యనిరి, తోడవే పొమాన్యకవి యెవ్వఁడై నను హామ్లెటు రాకుమారునిచే “ఏమి, నేనా, భయ భ్రాంతుఁడ నగుదునా? లోకములు తల్లక్రిందులు గావే? నేనే భయపడినచో! నేనెన్న టికిని భయపడియుండను. మీరు పిఱికి వారగుటచే నేనును మీవలెనే భయపడియుందు నని తలంచితిరి గాని నేను భయపడుదునే? ఎంతమాటాడి తిరి?” ఇత్యాద్యా క్షేపణాపహాసపూర్వకమగు దీర్ఘ ప్రసంగముఁ జేయిం చెడివారే. కాని , హామ్లెటు రాకుమారుని యంతరాత్మ యందుఁ బరకాయప్రవేశవిద్య చేఁ బ్రవేశించిన షేక్స్పియరు మహాకవికి హామ్లెటుమనసులో నున్న భావము విస్పష్టముగఁ గన్పడెను, హామ్లెటు రాకుమారుఁడే షేక్స్పియరుచే తనమనో భావము నెఱుకఁ గావించెను. హామ్లెటున కప్పుడు వారితో వాదాడ పమయము కాదాయెను. ఆతఁడు వారివలన ననుమానాస్పదమగు పితృమరణవృత్తాంతమును వినఁగోరి తన్ను చింతాంబుధి విడిచి స్వర్గమున కేఁగిన తం,డి, యాకృతిని గని యాతఁడు చెప్పదలఁచిన పలుకుల వినుట కుత్సాహముకలు వాఁడై యుండెను. అట్టి హామ్లెటు వృత్తాంతము యావత్తును వినకపూర్వమే వారితో శుష్క వాదము గావించుచు కాలము వృథాపుచ్చుచు తనమనస్సునందలి తృష్ణ నాఁపికొనకుండ.యూరకొనునా? అందుకనియే హామ్లెటు వారితో వాద ముపసంహరించుటకై కావలిపోండ్రిమాటనే యొప్పికొని తరువాత ప్రశ్నము వైచెను. “నిజము, నిజము.” అని కావలి. వాండ్రమాటల హామ్లెటు బదులు చెప్పుటయే యిందులకుఁదార్కాణము. కావలివాండ్రతో వాదుసల్పకుండుటకై వారి మాటలనే యొప్పికొని తలయూఁచి హామ్లెటు తరువాతి ప్రశ్నము నడిగెను. “ఆహా! ఎట్టి దివ్యదృష్టి ? ఎట్టి సందర్భశుద్ధి! ఎట్టి యాచిత్య గ్రహణము? రవి గాననిచోఁ గవికానకుండును. యను నార్యో యిట్టి సందర్భమున నుపయోగింపఁ జెల్ల దే, సామాన్యకవుల 'కెల్లరకు గోచరింపని హామ్లెటు రాజకుమార హృదయాంతర్గతభావము భావనాశక్తియుతుండగు షేక్స్పియరు మహాకవి కర్ణమునఁ జూచిన దానియట్లు 'సొంత విస్ఫుటముగను,. నెంత సత్యముగను, నెంత శుద్ధముగను, నెంత 'యనన్యపర తంత్రముగను గన్పిం చెసు? ఎట్టి పరకాయ ప్రవేశ ప్రభావము: ప్రపంచమందలి నాటకకర్తలలో నిట్టి సర్వస్వతంత్ర భావనాళక్తి గలవా రరుదుగ నుందురు, షేక్స్పియరైనను నిట్టియద్భుతళ , కొలఁదిసందర్భములలో నే యుపయోగింపఁగలిగెను, 'ఇంకం గొన్ని యుదాహరణముల నొసఁగకమానఁజూలను.
9. షేక్స్పియరుకృతమగు నొతెల్లోనాటకము.-
ఒతెల్లో యను మూరు దేశపు వీరుఁ డొకఁడు డెస్టిమోనా యను గ్రీకుకన్యను, జమీఁందారుని కొమరితను గాంధర్వ వివాహమునఁ గొని యామెతో సమితసౌఖ్య మనుభవించు చుండఁగా అయాగో యను దుష్టుఁడొకఁడు చూచి యోర్వ లేక కుతంత్రముఁ బన్ని డెస్టిమోనాతోడ కాసీయో యను సుద్యోగియుని నేదో తనయుద్యోగమును గూర్చి ప్రసంగింప నియమించి యొతెల్లోను బిలిచి కొనివచ్చి యాసంభాషణము నందలి డెస్టిమోనావాక్యముల కెల్ల సపొర్ణములఁగల్పించి డెస్టి 'మోనాకును శాసియో కును రహస్యసంబంధ ముండెననియు చెప్పి, పిమ్మటఁ దన భార్య ద్వారా యొతేల్లో డెస్ట్ మోనాకు భ్రమసూచకముగా నొసంగిన చేతిరుమాలును రహస్యముగ దొంగిలించి దానిని కౌసియో కోటు జేబులో నతనికిఁ దెలియ కుండఁ బెట్టించి, ఆ రుమాలు కాసీయోకు డెస్టిమోనా యిచ్చె ననియు, నయ్యది కాసియోకోటు జేబులో నుండుననియు నొతెలోకుఁ జెప్పెను. ఒతెల్లో యీర్ష్యాగ్రస్తుఁడై రాసియోను జంపి, యాతని జేబులో నున్న రుమాలును సంగ్రహించి, పిదప నిజ మందిరమున కేఁగి భార్యను తిట్టి, యవమానించి, ఘోరముగ తలదిండులతోఁ జావమోది చంపెను. పిమట నీసమాచారము రాజునకుఁ దెలియఁగా నతఁడొ తెల్లోను బట్టుకొనుటకై భటు లను బంపెను. వారు వచ్చులోపల నయాగో భార్యవలన నయో గోదు స్తంత్రము సర్వమును నెఱింగి, నిష్కారణముగ నిర్ధ్యా విశాచగ్రస్తుఁడై పవిత్ర శీలయగు భార్యాతిలకమును, నేపాప 'మెఱుంగని కాసియోను జంపి నందులకును, తనకో జూకై యయా గోచేతిలో దుర్తరణము నొందిన యయోగో భార్య మృతికిని, విభిన్న హృదయుఁడై బిట్టువగచి కడకు పొయమున నాత్మహత్యం గావించికొని తన మనోవేదనను, దుర్బరజీవయాత్రను నంత . మొందించెను. అతఁడు పొడుచుకొని 'చచ్చుటకుఁ బూర్వము చెప్పినపల్కులలోఁ వీనిని బరికింపుడు....
"Not easily jealous, but being wrought
And perplexed in the extreme."
“సాధారణముగ నీర్ష్యాగ్రస్తుఁడను గాకుండినను, వారును వీరును సూరిపోసి చెప్పుటచే, మనసు పూర్తిగవికలము నొందినవాఁడనై యిట్టిపనిఁ గావించితి”నని చెప్పెను. పై మాట లలోని “wrought" అనుశబ్దము షేక్స్పియరునకే తట్టఁదగినది. ఆమాటలోని కఱకుఁదనము వాగతీతము, అనుభవైక వేద్య మే.
"Tha marvellous timber of the word wrought"
"అని పాట్పుడంటను గావించిన వ్యాఖ్యాన మెంతయు నుచితమును సత్యమును భావప్ర కాశకము నై యున్నది. ఒక్క మాటలో నొతెల్లోహృదయమును ఱంపపుకోఁతఁ గోయుచున్న విచారముల శౌర్యమును, కఱకుఁదనమును, నొతెల్లో యొక్క దుర్బర వేదనయు, మరణావస్థయు, యాగో యొక్క దుశ్చరి తమును, డెస్టిమోనా పొందిన దుర్మరణము యొక్క భయంకర త్వమును, నొతెల్లో గావించిన క్రౌర్యముయొక్క యస్యాయ మును, నతనికి రానున్న పాటును, వాగతీతములగు నితరభావ ములను సర్వము ననిర్వాచ్యమగు రీతిని సూచింపఁగలిగినాఁడు. ఆహా! శబ్దసిద్ధియన నిట్లేకదా యుండఁదగును?
3 షేక్స్పియరు కృత మెక్బెత్ నాటకము.
మెక్బెత్ అను నాటకమున నొకసందర్భమున నిట్టియద్బుతపరశాయ ప్రవేశ శక్తి ప్రదర్శిత మగుచున్న దని కొందఱు విను ర్శకులు తలంచిన దానిని డంట పండితుఁడు పూర్వపడముఁ జేసెను. మెక్బెత్ అనునతఁడు రాజ్య కాంతూ పరుఁడై తన్ను'c బోషించు తండ్రివోలెఁ దనకు నండయైయుండిన డంక" అను స్కాట్లండు దేశపు రాజును భార్యయొక్క దుర్బోధము వలనను తాను రాజు కాగలఁడని చెప్పిన మంత్రకత్తెల మాటల నమ్మిద్రోహచిత్తుఁడై తన మందిరమున అతిథిగ రావించి యర్ధరాత్రమున సుఖసుప్తుడై యున్న వానిని జంపనేఁగి ధైర్యముసొలక మరలివచ్చెను. తోడనే మహాశ క్తి స్వరూపిణి యనఁదగు నతని భార్య యతనినిఁ దూలనాడి యతని పిరికితనము సపహసించి యతని కరముల నున్న ఖడ్గమును దాను గయికొని నిద్రారతిం జొక్కియున్న 'రాజును జంపనేఁగేను. ఏఁగి యేకారణముననో యాతనిఁ జంపక మరలివచ్చి భర్తతో నీ క్రిందిమాటలఁ దాను రాజును జంపకుండుటకుం గల కారణమును నివేదిం చెను.
For, had be n0t looked like my father, I bad done the deed.
(అతఁడు నాతండ్రియాకృతిని గన్పట్టకుండినచో నాతనిని దప్పక చంపియుండెడిదాననే..) ఈపలుకులు కవియొక్క దివ్య ప్రతిభను ననితరసొమాన్య కవితాశక్తిని సూచించునని కొందఱు అభిప్రాయపడిరి. కాని వాట్ స్టంట అనుపండితుఁడు అయ్యది పై యుదాహరణములఁ బ్రదర్శితమయిన యత్యద్భుతభావనాశక్తిని బ్రదర్శించుట లేద నియు, నంతకన్నఁ గొంచెముతక్కు వరకపు భావనాశ క్తినే ప్రద ర్శించుననియు, దానికిఁ దార్కాణముగ నిట్టిసందర్భమే ఒక 'యరబ్బీకథ యందు వర్ణితమయినదనియుఁ, గావున నియ్యది యని తరకవిదుర్లభమగు నంత తీక్షమగు భావనాశ క్తిని బ్రదర్శించుట లేదనియు విమర్శించెను.
కాళిదాసకృత శకుంతలావర్ణనము,-
ఇట్టి యత్యద్భుతపుశక్తి కాళిదాసును భవభూతియుఁ. దిక్కనయు నచ్చటచ్చటఁ బ్రదర్శించిరి. చూడుఁడు!
సౌందర్య రాశియు, కిమివహి మధురాణాం మండనం సొకృతీనామ్' అను వచనమునకు లక్ష్యమయినట్టియు, సహజలావణ్యవతి యునగు శకుంతలను గాంచిన తోడనే దుష్యంతమహా రాజు. 'అయే! లబ్దం నేత్ర నిర్వాణమ్' అనుపలుకుల నా పెయెడ దనకుఁ గల యభిలాషము, నభిమానము, నాశ్చర్యమును,. సంతోషమును, నొక్క మాఱుగ ధ్వనించునట్లు మాట్లాడినారు. అన్యకవు లన్న నో కాళిదాసునివ లెఁగాక లేనిపోని యుత్ప్రే క్ష సహితమగు విపరీతభావముల నేవో మన నెత్తిన కొట్టి యుండెడివారే! 'త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః' అను వాగ్గేవ్యసునయమునకుఁ బాత్రుఁడైన కాళి దాస మహాకవి సామాన్యకవులఁబోలె విపరీతాలంకారములతో దుష్యంతుని భావమును వర్ణింపక తాత్కాలికము గదుష్యంతుని యాత్ర చే నావహింపఁబడినవాఁడై దుష్యంతుని హృదయాంత రాళమున ధ్వనించుచుండిన పల్కులను పట్టి సందర్భమునఁ దాను వర్ణించెను. 'అయే' యను మాటవలన దుష్యంతుని స్తంభితునిఁ జేసిన యాశ్చర్వ భౌషమును, 'అబ్దం' అనుమాటవలన నతఁడు పొందిన మనస్సంతోషమును 'నేత్ర నిర్వాణమ్' .అనుమాట వలన శకుంతల యొక్క యలౌకి కాద్భుతలావణ్యమును, దద్ద హణమును నొక్కమాటుగ ధ్వనించుచున్నది. ధ్వనిసిద్ధియన్న నిట్లుకదా యుండవలయును?
భారతమునుండి యొకయుదాహరణము.
చూడుఁడు. భారతమున దుర్యోధనుఁడు భీమునిచేఁ దొడలు విఱుగఁగొట్టఁబడినవాఁడై యశ్వత్థామ యుపపొండ వులను, ధృష్టద్యుమ్నుని, శిఖండిని వేయేల? పంచపాండువు లును, గృష్ణుఁడును, సాత్యకీయును, ద్రౌపదియుం దక్క పాండవసైన్యమును సర్వమును నాశముఁ గొవించివచ్చిన పార యతని నోటనే వినినవాడై ప్రాణంబులు విడుచుటకు బూర్వము “అమువ్వుర మొగంబులఁగలయంగనుంగొని మీరు శృతకృత్యులరు. సుఖుల రై యుండుఁడు. పునర్దర్శనంబు త్రిది పంబున నయ్యెడుంగాక. పగలు మాని పొండనిషలికి ప్రాణం. బులు విడిచిన వార లవ్వసుమతీ పతిఁ గౌఁగిలించుకొని వలగొని వచ్చి మరలి చూచుచు నరదంబు లెక్కి యరిగిరి." ఈ వాక్యము నందలి 'మీరు కృతకృత్యులరు. సుఖుల రై యుండుఁడు' అను మాటలలో గస్పట్టు నార్తి యనుభవైకవేద్యము. 'పునర్దర్శ వంబు త్రిదివంబున నయ్యెడుంగాక' యనుమాటలవలన దుర్యో ధనునకును, దిక్కనకును ఏకసమయమునం దే స్వర్గము కన్ను ల గట్టినట్లు మనకును దోఁచుచునేయున్నది. 'మరలి చూచుచు' అనునూటవలన నశ్వత్థామాదుల మూర్తులును వారియొక్క విచారమును, నొక్క పెట్టున మనల నావహించుచుండును. ఆహా! దుర్యోధన నిర్యాణరంగము తిక్కన కనులయెదుటఁ గట్టి యుండనిచో నాతఁ డిట్లు వ్రాయఁగల్గియుండునా? భారతమున నిట్టిపట్లు ఎన్నేనియుంగలవు! వాని నన్నింటిని సుదాహరింప బూనుట గ్రంథవి స్తరభీతి చే మానుకొంటిని. కావున నాటకరచనకు సంబంధించిన భావనాశక్తి కొందొకయెడలఁ గవియొక్క భావమునకును, జిత్తవృత్తికిని అంద "రానిదై సాక్షాత్ పరకాయ ప్రవేశ ప్రభావమువలననే వర్ణింపఁ దగినదై యుండునని తిరిగి విన్నవించుట. మిగిలిన కావ్యము లలోఁ గవి తన చిత్తవృత్తికిని స్వభావమునకును ననుకూలము లగు భావముల నే వర్ణించుచు నొక్కొక్కప్పుడు భావనాబల మునఁ బాత్రములయొక్క స్వభావమును దన మనస్సున కంది నంతవరకు వర్ణించును.
-రూపకల్పన విషయము. కేవలకల్పనము సాధ్యమా?
ఇచ్చట రూపకల్పనవిషయమయి రెండుమాటలఁ జెప్పెదను. కొందఱు కవులు అసహజములును, బ్రపంచసామాన్య ములుగానివియు నగు మూర్తులను వర్ణించి యున్నారు. ఉదా హరణము - పదితలల రావణుఁడు, యోజనాయతములగు బాహువులు గల కబంధుఁడును మొదలగు రూపములు: ఇవి పాక్షార్దృష్టములా? సర్వస్వతంత్ర భావనాశక్తి ప్రదర్శకములా? లేక యూహా మాత్ర కల్పితములా? అను ప్రశ్నములకు సమా ధానము విచారింతము. ఇయ్యవి యూహామాత్ర జనితము లే యని పాశ్చాత్యశాస్త్రజ్ఞుల యభి ప్రాయము.
పాశ్చాత్య శాస్త్రజ్ఞులవాదము.
There is nothing like pure imagination. Ac object of pure imagination is a myth" అని పాశ్చాత్యమనశ్శాస్త్రజ్ఞులలోఁ గొందఱు వాదించుచున్నారు. కేవలకల్పనమనునది యబద్ద మనియుఁ, బుక్కిటి పురాణమనియ్యు బై వాక్యముల యర్థము. అనఁగాఁ గవికల్పితమూర్తులన్నియు నెంతవిపరీతములుగ నున్న ________________
ను, నెంత యపూర్వములుగ నున్నను బ్రకృతియందలి యే వస్తువు యొక్క విశేషముల నేకొన్నింటినో గయికొని వానీ యాధారమువల్ల నే కల్పింపంబడినవికాని, కేవలము సృష్టములు గావని వీరి వాదము,
పాశ్చాత్యకవుల యభి ప్రాయము, 1. షేక్స్పియర్.
కాని, వారలలోఁ గవీశ్వరులు దీనికిఁ బూర్వపక్షముగా వ్రాసిరి. చూడుఁడు.
- The luntic, the lover, and the poet
Are of imagination all compact;
One sees more devils than vast hell can hold,
That is, the madman the lover, all as frantic,
Sees Helen's beauty in a brow of Egypt
The poet's eye, in a fipe frenzy rolling,
Doth glance from heaven to earth, from earth to heaven;
And as imagination bodies forth
The forms of things upknown, the poet's pen
Turns them to shapes, and gives to airy nothing
A local habitation and a name
(Shakespeare's A Midsummer Nights Dream Act V.)
పై వాక్యములనుబట్టి కవి యెట్లు కేవలకల్పనా సొమర్థ్య మును గలిగియుండునో స్పష్టమగుచున్నది. పిచ్చివాఁడు ప్రపం చమున నెల్లెడల దయ్యములను, భూతములను గాంచునట్లును, ప్రియుఁడు కోఁతిరూపుఁగల్గి నల్ల మొద్దువలెనే యున్న ప్రియు రాలిని రంభయంత లావణ్యముఁ గలదానినిగాఁ గాంచునట్లు కవి తన దృక్కులను భూమినుండి యాకాశమువజకును నాకాశమునుండి భూమివజకును బ్రసరింపఁ జేసి, భావనాశక్తిచే నప రూపములగు మూర్తులను గాంచి, వాని కాకృతి నొసంగి నిరామయమగు శూన్యత కొరయూరును వేరును గల్పించి వర్ణింపఁగలుగునని షేక్స్పియరు మహాకవి భావనాశ క్తియొక్క యేంద్ర జాల ప్రభావమును, కవియొక్క మహత్త్వమును గూడ . వర్ణించినాడు.
2.కోలరెడ్డి,
కోలరిడ్జి (Colaridge) అను నాంగ్లేయకవి తా నొకరాత్రి 'కలలోఁ గాంచిన విషయమును 'Kbla Khan' అను కావ్యశకల మున వర్ణించెను. అయ్యది యేప్రయత్నము లేకుండ నే నిద్దుర మంచమునుండి . లేచుచునే కావ్య రూపమున వెలువడెను. అయ్యది కేవలకల్పన యే యనియు నట్టిదీ ప్రపంచమున నెచ్చ టను గని విని యుండనంత యపరూపమును నవూర్వమును సని యాంగ్లేయసాహిత్య విశారదు 'లెల్లరు నేకగ్రీవముగ నంగీకరించిరి. ఇట్టి యాంగ్లేయవాజ్మయమున నద్వితీయమనియు, కోలరిడ్జి యత్యద్భుత దృష్టిని బ్రదర్శిం చెననియు, నీయొక్క కావ్య 'శకలమువలననే యతని కీర్తి యాకల్పాంత స్థాయిఁ గాంచఁగల దనియు నాంగ్లేయపండితుల యభిప్రాయము, అట్టి కేవలరూప కల్పన యసంభవము కాదు. విషయస్కా రముఁ బడసిన కవులు మూర్తులను బ్రత్యక్షముగఁ గాంచి వర్ణింతురు. అట్టి మూర్తులు కేవలరూపకల్పన లేగాని కవియొక్క చిత్తవృత్తి కేమాత్రమును సంబంధించియుండునవి కావనియు భారతీయ వాజ్మయ చక్రవర్తులందఱికును సువ్య క్తమే. ఈవిషయము మహత్తరమైనది. అందుచేఁ గేవల కల్పనాసామర్థ్యము కవికి
దుర్లభమును, నసంభవమును కాదని సూచించి ఈ చర్చ ముగించి 'వేవొక విషయమునుగూర్చి ముచ్చటిం చెదను.
స్వాభావికాస్వా భావికవిషయములన నేవి-
ఇంక స్వాభావిక, అస్వాభావికవిషయములకు సంబంధిం చిన వివాదాంశముల రెంటిని సూక్ష్మముగ సూచించి భావనా శక్తిప్రశంసను ముగించెదను. స్వాభావికములన నేమి? అస్వా భావికము లన నేమి? ప్రకృతియందు మన స్థూలదృష్టికి గోచరము లగునంతవఱకే వస్తువులు స్వాభావికములా? తద్విపరీతములుగ నున్న నస్వాభావికములా? పంచతంత్రము, బృహత్కథ మొదలగు పురాతన కథలయందుఁ బక్షులు, మృగములు మానవవాక్కుల సంభాషణను గావించినటుల వర్ణింపఁబడి యున్నది. ఈ పద్ధతి కొంచెము స్వభాపవిపరీతముగ నున్నను గేవలసత్య విదూరమును నస్వాభావికమును గాదనియు, నిట్టిపర్ణనము బాల్యావస్థయందు మానవులకు సహజముగ నుండు చపల స్వభావమును దత్ఫలితముగఁ బిల్లలు జంతువులతోడను అచేతనములతోడను మాట్లాడుటను గ్రహించి, యాభావమునే విస్త రించి వేఱువిధముగ మార్చి యట్టి బాల్య చాపల్యము మానవుని యందు వయసు వచ్చిన పిదపఁగూడ నుండుననియుఁ, దత్కారణ మునఁ బిట్టల మాటలును, జంతువుల పల్కులును మానవుఁడు విని వాని యర్థమును గ్రహించుటకు వీలగుననియు శ్రీయుత రామలింగా రెడ్డి గారు యుక్తియుక్తముగ సమర్థించిరి.
ఇట్టి స్వభావవిపరీతవర్ణ నములయం దెల్లను బరస్పర వైరు ధ్యము లేకుండ రచింపఁగల్గిన కవి ప్రతిభాశాలియే యనం దగును. స్వభావవిపరీతమగు విషయములను.. అనఁగా మానవ సహజములుగాని విషయముల వర్ణించునపుడు కవి యొకనియమము ,పొటింపవలెను. కొంత సేపు విషయము స్వభావాతీతము గను ఆలోకసహజముగను నున్నట్లు వర్ణించి, వెంటనే యింకొకచోట దానికి స్వాభావికములును లోకసహజములును నగు గుణవి శేషములను గల్పించి వ్రాయఁజూచుట యాచిత్య భంగ హేతువు, పరస్పర వైరుధ్యము లేనంతవఱకు నెట్టిస్వభా వాతీతవిషయవర్ణనమైనను నెట్టి యలౌకిక సహజరూపకల్పన యైనను బొసఁగుననియు రసాభాస హేతువులు గాపనియు విన్న 'వించుచున్నాను.
పొరాంశము.
కావున నింతవజకుఁ దేలిన దేమనఁగా? కావ్యము రసాత్మకమనియు,రసము భావానుభూతియే యనియు, అట్టి భావాను. భూతి భావనాశక్తియను నింద్ర జాలమహిమచే లబ్ద మగునని యునే. ఈ భావనాశక్తి యొక్క మహిమను నెంత వర్ణించినను వర్లింప వలయుననియే యుండును. ఎన్ని యుదాహరణములు చూపినను నింకను గావలయుననియే యుండును, అందులకనియే. యమేయభావనాశ క్తియుతులగు కవులు మితభాషణముచే విషయమును వర్ణించినట్లు ప్రతిభా శూన్యుఁడనగు 'నేను మిత భాషణమువల్ల సూచించుటతో మాత్రమే తృప్తి నొందెదను. భావనాశ ! కవికిమాత్ర మే సొముగను, బలముగను, అండగను నుండి యతనికి గాప్యనిర్మాణ విషయమునఁ గృష్ణసారథ్యముం బోలె సహాయకారియై యుండునని తెల్పి యింతటితో నీ ప్రశం సను ముగించెదను. -