శ్రీనాథకవి జీవితము
శ్రీనాథకవి
(జీవితము)
గ్రంథకర్త
చిలుకూరి వీరభద్రరావు.
(రెండవకూర్పు)
శ్రీ రాజన్ ముద్రాక్షరశాలయందు ముద్రింపఁబడి
ఆర్యపుస్తకాలయమువారిచే
బ్రకటింపఁబడియెను.
రాజమహేంద్రవరము.
1930
ఈ కవిజీవితమును నేను 1918 లో ముద్రించి ప్రచురించి యున్నాను. తరువాత నైదు సంవత్సరములకు అనఁగా 1923 సంవత్సరమున నా మిత్రులగు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు శృంగారశ్రీనాథ మను పేరుతో నీ కవిజీవితమునే వ్రాసి ప్రచురించినారు. ఆ గ్రంథమున శృంగారమును గూర్చి యేమియు లేకపోయినను ఎగతాళి చేయుటకో యన్నటులు వారా నామకరణముఁ గావించిరి. వీరును వీరేశలింగం పంతులవారి విమర్శామార్గమును గర్హించువారివలెఁ గన్పట్టినను, మాటలభేదమె గాని పంతులవా రేయుద్దేశముతో నట్లు వ్రాయ సాహసించిరో నామిత్రులును దృష్టాంతపూర్వకముగా బలపఱచుటకుఁ బ్రయత్నింప సాహసించిరి. అందువలన వీరి యభిప్రాయములను గూడ నీ రెండవకూర్పున సహేతుకముగా ఖండింపవలసి వచ్చినది. ఎనుబది సంవత్సరముల కాలము బ్రదికి నలుబది సంవత్సరము లఖండవైభవ మనుభవించి కీర్తి శేషుఁడై చన్న సార్వభౌమునిజీవితచరిత్రమును దెలుపుటకు మాత్రమె యీ గ్రంథ ముద్దేశింపఁ బడినది గాని యాతని సాహిత్యసౌష్టవముల విమర్శము ప్రకాశింపఁ జేయుట కుద్దేశింపఁ బడినది కాదు. వీని జీవముతో సంబంధించిన గాథలు పెక్కులు గలవు. వీరి పేరుతో సంబంధించిన చాటువు పెక్కులు గలవు. వీని సత్యాసత్యములను దెలుపునట్టి విమర్శ లిందుఁ గలవు. ఈ నడుమ నీకవిని గూర్చి పండితులు పత్రికలలో గావించిన విమర్శలు గూడ సందర్భానుసారముగా వారి వారి నామములతో నిందుఁ బేర్కొనఁబడి యున్నవి. వారికెల్లరకు నా కృతజ్ఞతా వందనముల నిందుమూలముగాఁ దెలుపుచున్నాను. దుర్భరవ్యాధి పీడితుఁడనై యుండుట చేత నచ్చుపడిన చిత్తుప్రతులను స్వయముగాదిద్దు కొనుటకు సాధ్యపడనందున నందందు నచ్చు తప్పులుండవచ్చును. చదువరులు మన్నించి వాని సంస్కరించు కొనవలయునని ప్రార్థించుచున్నాను.
గ్రంథకర్త.
మొదటికూర్పు పీఠిక.
శ్రీనాథమహాకవి యేనూఱు సంవత్సరములకుఁ బూర్వమున నున్నవాఁడు. ఉత్త మాంధ్రకవులలోఁ బరిగణింపఁదగినవాఁడు. కర్ణాట సామ్రాజ్యాధీశ్వరుఁడగు ప్రౌఢదేవరాయ సార్వభౌముని మౌక్తికా గారమునఁ గనకాభిషేకముఁ గాంచిన కవిసార్వభౌముఁడు
వీరేశలింగముగారు ఏవిధమైన ఋజువుభారమును వహింపక గాలికబుర్లను పోగుచేసి యేనూఱు సంవత్సరములగుఁ బూర్వమున నున్నవాని వర్తనమును తాము ప్రత్యక్షమునఁ దమ కన్నులతోఁ జూచినట్లుగా స్త్రీలోలుఁడై వయఃకాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధననికాయమును జెడఁగొట్టు కొన్న మహా పాపి యని నిందించుటయే గాక యాతని కాలమునాటి యాంధ్ర హిందూసంఘము జూరత్వమును ప్రతిష్టావహమైనది గను, శ్లాఘ్యమైనది గాను భావించునంతటి దౌర్భాగ్యస్థితి యందుండెనేని యేమో దూషించి నిర్హేతుకముగా ద్వేషబుద్ధిని బూని దురభిమానపూరితములైన యుక్తి రహిత దూషణ భాషణములచేఁ దమ యాంధ్రకవుల చరిత్రములోని శ్రీనాథకవి జీవితము నంతయు గళంకపఱిచి యున్నారు. ఇది యెంతయు సంతాపకరమైన విషయము. ఆశాపరుఁడై , అర్హసంభావనలకై , స్వార్థము తీర్థము కలసివచ్చుటకై, త్రిమ్మరియై జారుడై, దేశములు తిరిగి దేహమున ధనమును జెడఁగొట్టు కొని కష్టపడివలసిన వృద్ధదశను దెచ్చుకొని దిక్కు లేక చచ్చినట్లుగా దేల్చినట్టి వారివ్రాఁత వైఖరిని జూచినప్పుడు నాకుం గలిగిన పరితాపమునకు మేర లేకుండెను. ఎనుబది తొంబది యేండ్లు నిండి కాఁటికిఁ గాళ్ళు చాచుకొన్న ముసలితొక్కు శ్రీనాథుని వంటి శివభక్తాగ్రేసరుఁడు, వేదాంతి కస్తూరి కొఱకు, రత్నాంబరముల కొఱకు నంగలార్చుచుఁ బ్రాణములు విడిచి నాఁడని చెప్పెడి పద్యమును విశ్వసింప వచ్చునన్న జ్ఞానము యొక్క తత్వము డెబ్బ దేండ్లు వయస్సు చెల్లిన వయోవృద్ధులును, ప్రపం చానుభవైకవేద్యులునగు శ్రీవీరేశలింగము గారికే బోధపడవలయును గాని యస్మదాదులకు దురవగాహముగా నున్నది... ... ... ఇది మిక్కిలి శోచనీయము వీరి దురభిప్రాయములను బదర్శించి లోకమునకు జూవుటయె నాకు గర్తవ్యముగా గన్పట్టు చున్నది.అందుకొఱకే నేడు శ్రీనాథకవి జీవితము నెత్తికొని యున్నాడను. దీనిలో శ్రీనాథుని యొక్కయు, అతని గ్రంథము యొక్కయు చరిత్రాంశములను గూర్చిన విమర్శతో గూడుకొని యున్నది.
విషయసూచిక
1 |
14 |
16 |
21 |
26 |
30 |
45 |
51 |
విద్యా భ్యాసము-విద్యాసంపత్తి . 45
దేసటి పోలయవేమూ రెడ్డి ,62 అనపోత రెడ్డి 71 అన వేమారెడ్డి 76. కుమాగిరి వసంత భూపాలుడు 79, అవచి తిప్పయ్య సెట్టి 82., బాలకవి శ్రీనాథుని తోడి మైత్రి 83 శాలివాహన సప్తశతి 87, కుమారగిరిరాజ్యావస్థానస్తితి9ఒ, పెదకోమటి వేముని విద్యావైభవము 93 సర్వజ్ఞచక్రవర్తి - 95, శృంగారదీపిక 96, సాఫీ త్యచింతానుణి,99, శృంగార నైషధరచనాకాలము 111, కొండవీటి గార్ధభములు 116, వామనభట్ట బాణుఁడు117, ఇతర విద్వాంసుల పోషణ నం 120, భాస్క రార్యుఁడు 121, సిగ నార్యుడు 128 వెద్దియ జ్వ, 124, శంకరగురువు 124, పిసిపాటి రామభద్రసోమయాజి. 128 విశ్వేశ్వర పండితుఁడు 125 , రాముచద్రజ్యోతిషుకుడు. 125 శ్రీనాథుని వివాహము 126, సంతాన సాగరనిర్మాణము 130 పెదకోమటి వేముని యంత్యదశ 133, పల్నాటి చరిత్రరచనాకాలము 134.
హరవిలాసరచనము 136, ధనంజయవిజయము 148, రాచవేమారెడ్డి 151, తెలుంగు రాయని సుదర్శించుట 152, పంటమైలార రెడ్డి ని సందర్శించుట157, అల్లాడ రెడ్డి. : -రాజమహేంద్రపుర రాజ్యము.157,లింగనా మాత్యుడు 162, శ్రీనాధకవి రాక 164, శ్రీనాథుని కనకాభి షేకము 168, డిండిముని జయించుట 170, డిం ,డిగువ శ్యుల పూర్వచరిత్ర 174, శ్రీనాధుని విద్యానగర ప్రయాణము 178, వల్లభాభ్యుదయము 185,. క్రీడాభి రాముము ,188, క్రీడాభి రామకర్తృత్వ విమర్శన197
సర్వజ్ఞ సింగమనాయుని సుదర్శించుట,210, ప్రభాకరశాస్త్రి గారి సర్వజ్ఞుడు. ---220 ఓమ్మెర పోత నానూత్యుఁడు -226
శ్రీనాధుఁడు రాజమహేంద్రపురమునకు విచ్చేయుట 237 అల్లాడ దొడ్డభూపతి విజయధాటి 242, -అగ్రహార బ్రాహ్మణ వర్ణనము. 243, రాజ్యవి స్తీర్ణము 244, రెడ్ల ధర్మకార్యములు 244, .మధ్యాంధ్ర దేశ విప్లవము. 246, . -శివరాత్రి మహాత్మ్యము 248,
.అవసాన కాలము, 255
2. శ్రీనాధుని ప్రవర్తనము 262
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.