Jump to content

శ్రీనాథకవి జీవితము/తృతీయాధ్యాయము

వికీసోర్స్ నుండి

అధ్యాయము 3.

విద్యాభ్యాసము—విద్యాసంపత్తి.

శ్రీనాధుని బాల్యమును గూర్చి మన కంతగాఁ దెలియరాదు. శ్రీనాథునితల్లిదండ్రులను గూర్చియు నేమియు ంర్ఱుంగరాదు. ఇతఁడు బాల్యమునం దెట్లు విహరించెనో విద్యాభ్యాస మెట్లు గావించెనో యదియుం దెలియ రాదు. ఇతఁడు తన కాశీఖండమున

 చిన్నా పొన్నారి చిఱుత కూకటినాఁడు
రచియిం చితి. మరుత్తరాట్చరిత్ర,
నూనూగు మీసాల నూత్నయవనమున
శాలివాహన సప్తశతినోడివితి

అనియును, మఱియును శృంగార నైషధ కావ్యమున:-

క. జగమునుతింపగఁ జెప్పితి ప్రెగడయ్యకు సాయముంగుఁ బెద్దనకు గృతుల్" నిగమార్థ సార సంగ్రోహ మగు నాయారాధ్య చరిత మాదిగ బెక్కుల్

అని తన విరచితములుగాఁ జెప్పుకొన్న మరుత్తరాట్చరిత్రములో గాని శాలివాహనస ప్తశతిలోగాని, పండితారాధ్య చరిత్రములో గాని మరి తదితర గ్రంథములలోఁ గాని యేమైన వివరముగాఁ జెప్పుకొని యుండు నేమోగానీ యాగ్రంథము లిపుడెచ్చటను గానరానందున నేమియుఁ తెలియ రాకున్నది. తాతయే శ్రీనాథునికి చిన్నటనాఁడు విద్యయు గవిత్వము నేర్పియండునని వీరేశలింగముగా రూహించి చెప్పునది సత్య మగునేని శ్రీనాథునివంటి మహాకవి ప్రఖ్యాతిగాంచిన తన యుత్తమ గ్రంథములలో తన పితామహుఁడై న కమలనాభుఁడె తనకు విద్యాగురు వని చెప్పుకొని యుండకమానఁడు.

 గీ. మత్పి తామహుఁ గవిపితామహునిఁ దలతు
గలిత కావ్యక శాలాభుఁ గమలనాభుం<poem>

 
జంద్రచందన మందార సదృశ కీర్తి
సర ససాహిత్య సామ్రాజ్య చక పర్తి

అని కవిస్తుతి వర్ణనములో మాత్రము పక్కాణించి వర్ణించి యున్న వాఁడు గాని తనకు విద్యాగురువును జెప్పుకొని యుండ లేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారిచే కడప పట్టణమున నిర్వహింపఁబ డిన వార్షిక సభలో శ్రీనాగపూడి కుప్పుస్వామయ్య గారు శ్రీనాథుని కవి త్వమునుగూర్చి యుపన్య సించుచు నిట్లు నుడివియున్నారు. ఇతని గురువు 'ఘోడె రాయఁ డను బిరుదుగల భీమేశ్వరస్వామి యని కాశీఖం డము (ఆ .. ప 13)

ఆంధ్ర క్షమాముండ లాఖండలుండైన
వేమభూపతికృపా వీక్షణంబు
ఘోడె రాయాంక సద్గురు రాజభీమేశ్వ
రస్వామి పథసమారాధనంబు
కమలాదీనిలయ మార్కండేయశివమౌళి
చంద్రాంశునవసుధా సారధార
వేదాద్రినర సింహ విపులవక్షస్థలీ
కల్హరమాలికాగమాలికా గందలహరి
కారణంబులు నుద్బోధకములు గాఁగ
సంభవించిన సాహిత్య సౌష్ఠవమున
వీర భద్రేశ్వరుఁ బ్రబంధవిభుని జేసి
కాశీ కాఖండము 'దెనుంగుగా నొనర్తు.

.

అను పద్యమువలన "వేద్యంబయ్యెడును. “ఇచ్చట 'వేదాద్రి యను క్షేత్ర మేది యని యరయ బ్రహ్మశ్రీ సదాశివశాస్త్రి గారు, అవధానము శేషశాస్త్రి గారు వీరిచేఁ బ్రకటిత మైన వేంకటగిరి రాజుల వంశ చరిత్రలో 42వ ఫుటయందు, హైదరా బాదుసీమలో రాచకొండ యను దుర్గమునకు దక్షిణమున , వేదగిరి యని వ్యవహరింపఁబడుచున్న పర్వతముయొక్క గుహలో నరాహనార

శింహస్వామి యను స్వయంవ్యక్తమూర్తి కలదు. ఆమూర్తి యనాదిగా రేచర్ల రాజులకు పాస్యముగా నుండెనట. దీనివలననే సింగమనా యఁడను నామములు వీరియింట నాకాలమునఁ డఱచుగా గలిగియుండె నని తోఁచుచున్నది." అని వ్రాయఁబడిన దానిని జదువ వేదాద్రి యిది యని తెలియవచ్చె, ఇందలి కమలాద్రి యెద్దియో తెలియకున్నది.”

ఇందు పైని పేర్కొనఁబకిన ఘోడి రాయ బిరుదాంచితుడైన భీమేశ్వరుడు దేవటివంశ్యులైన రెడ్డి రాజులకు వంశగురువు. ఈవిష యము "కాశీఖండములో

  ఈశ్వరుడింటి వేల్సు జగదేక గురుఁడగు ఘ డెరాయభీ
మేశ్వరుఁ డావం వంశశగుగుడీగులు నిత్యవినోద కృత్యముల్"
శాశ్వతధర్మ కీర్తులు దలంపఁగ సమ్మిన సొమ్ము లాదిగ
ర్బేశ్వరుడంట నైజ "మెనయే సృపు లళ్లయ వీర శారికిన్

అను పద్యమువలనను, శ్రీ భీమేశ్వరపురాణములో “రాయగురు పరమేశ్వర సాథుజనవి ధేయ ఘోడెరాయ సకల కళాధామాది బిరుద భాస్వరుండై భీమయ గురువరేణ్య పుణ్య కారుణ్యక టాక్షవీక్షణాలబ్ధ సుస్థిరైధుర్యుండై" అను వచనమువలనను విశద మగుచున్నది. ఇట్టి గురుపకు సమాధనము రాజమహేంద్రపురము నకు వచ్చిన పిమ్మట సంప్రాప్తమై యుండునుగాని యంతకుఁ బూర్వమే సంప్రాప్తమైయుండునని తోచదు. పై పద్యములోఁ బేర్కొనఁబడిన వేమారెడ్డి కృతిపతిని సింహాసనమెక్కించిన యన్న, భీమేశ్వరస్వామి కృతిపతి కులగురువు. కమలాద్రినిలయుఁడైన మార్కండేయ శివుఁడును, వేదాద్రి నరసింహుడును ననుదినమును గృతిపతిచే గొలుంబడుచుండెడి దేవులు. కమలాద్రీయు, వేదాద్రీయు, పుష్పగిరి శేషాద్రి మొదలగునవి రాజమహేంద్రపురములో గోదావరి తీరస్థ , ములై యున్న మిట్టలకు నామములు, శ్రీనాథుఁడు పశిశంసించిన "వేదాద్రి" కుప్పుస్వామయ్య గారు పేర్కొన్న హైదరాబాదు సీనులోని వేదాద్రి

గాదు. ఇందలి కమలాద్రి యెద్దిమో తెలియకున్న దని కుప్పుస్వాము య్యగారు వచించిరి.

శ్రీ నాథుడు భీమేశ్వర పురాణములో


సీ. కమలాచలా గ్రహక్కంటేయ శివ శిరశ్శశి చంద్రి కొధాత సౌధవీ
గోదావరీ పుణ్య కూలంకపాజుల స్ఫారిత శ్రీ ద్రపాదయుగళి
బలవదభ్యున్నత ప్రాకార పదివేప, గండూపీ, తాజాండకుండలంబు
గంధదంతావళి పైవ్రేయు ఘటికా కాంతారముఖర ఘంటాపధంబు

<poem>రాజ బింబననా నూత్న రత్న పేటి
వీర రాహుత్త సుభటకం నీనివాద్రి
వేమ భూపాల రాజ్యాభివృద్ధికరము
పౌండ్ర విభవంబు రాజుమద్ర పురము

అని కమలాద్రినిలయుఁడైన మూర్కండేయ శివుడు రాజమ హేంద్రపురములోని వాఁడని తెలిపినందునఁ గమలాద్రి రాజమహేంద్ర పురములోనిదే యని తేటపడుచున్నది గదా. కృతిపతియన్నయైన నేను భూపాలుని కృపావీక్షుణనును, కృతిపతి కులగురువైన ఘోడేరాయ భీమయలింగ పద సమారాధనమును సంప్రాప్తము గాకయున్నఁ దనకట్టి మహా భాగ్యము లభింపదు గావున శ్రీనాథుఁడట్లు వారినిఁ బస్తుతించు టయుగాక' యాపురములోన ముఖ్య దైవతము లైన నృసింహ,మార్కం డేయ శివులనుగూడ నావిధముగాఁ బ్రశంసించి యున్నాఁడు, ఇదంత యును గృతిపతిని వానియన్నను వానికులగురువును సంతోష పెట్టుటకై క్రీనాథుఁడు చేసిన వర్ణనముగాని నిజముగా ఘోడెరాయ భీమయ నీతనికి విద్యాగురునగుట చేతఁ జెప్పుకొన్నది కాదని సూక్ష్మబుద్ధి చేత మనము గ్రహించవచ్చును. శ్రీనాథుని ప్రతిఘటించెడి మత్సరగస్తు లైన పండితు లనేకు లారాజమ హేంద్ర పురఘున నుండుట చేత రాజాశ్రయమునకు దోడ్పడు వారి ప్రస్తుతి ముఖ్యముగా గంథమునం దుండవలయును. కానీ యడ్డ కాళ్లకు బందము తగిలించుట వంటిది. ఇట్టి స్తుతి పాఠములకు

సంతోషించి సర్వవిధములఁ గవివర్యునకుఁ దోడ్పడుదురనుటకు సం దే హముండునా? ఉండదు. ఒక వేళ ఘోడె రాయభీ మేశ్వరస్వామి మత గురువై యుండిన నుండవచ్చును గాని విద్యాగురువని మాత్రము తలం పరాదు. శ్రీనాథుఁడు నేర్చిన దొక్క విద్యగాదు; ఒక్క వేదము కాదు; ఒక్క శాస్త్రము గాదు; ఒక్క కవిత్వము గాదు; ఒక్క పురాణముగాదు; ఒక్క నాకటము కాదు; ఒక మత తత్త్వముగాదు. ఇతఁడు నేర్చినవిద్యలు పెక్కులుగలవు. అన్ని వేదములను బఠించెను; అన్ని శాస్త్రముములనబ్య సించేను. చతుర్విధ కవిత్వములను జెప్ప నేర్చెను; బహుపురాణములను బరించెను. అనేక నాట కాలంగా కారాసాహిత్య సంపత్తి యలవఱచుకొని యెను. ఆంధ్ర గీర్వాణవాణి వాని జిహ్వాగమున నిలుచుండి యను దినమును నృత్యము సలుపుచుఁ దనసమ్మోహనాస్త్రమ పాలుర సౌకర్షింపుచుండెను. ఇందునుగూర్చే శ్రీనాధుని భార్య తో బుట్టినవాఁడగు దగ్గుపల్లి దుగ్గయా యూత్యుఁడు తన నాచీకేతూ పాఖ్యా నములో తన బావ శ్రీనాథుని పొండి త్యాదుల నీకిందిప్యములో నభివర్ణించెను.

సీ. సంస్కృత ప్రాకృత గౌర సేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు
పన్నగపతిసార్వభౌమ భాషీత మహా భాష్య విద్యాసమ భ్యాసబలము
నక్ష పాదకణాదపక్షి లోధీరత న్యాయక లాకౌశలాతిశయము
శత పురాణాగ మస్మృతి సాంఖ్య దాత కబళన వ్యత్పత్తి గౌరవఁ బు

పూర్వక విముఖ్యవిన చితా పూర్వకావ్య
భావర ససు ఖాచర్వణ ప్రౌడతయును
గందళింపంగఁగాశి కాఖండ నైష
ధప్రముఖ వివిధ ప్రబంధము లొనర్చి.

హరవిలాసమున నవచి దేవయతిప్పయ సెట్టి,

“అఖలపు రాణవిద్యాప్రవీణు, నధ్వర్వు, వేదశాఖా తిధినిష్ణాతు,"

అని ఆగమజ్ఞాననిధివి, తత్వార్థ ఖనివీ, బహుపురా-జ్ఞుడవు" అని తన్ను గూర్చి పలికనట్లుగా శ్రీనాథుఁడే తేలుపుకొనియున్నాడు. మఱియును బహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధ్వాత బ్రహ్మజ్ఞానకళా నిధానమ' వని యాంధ్ర నైషథకృతిపతియైన మామిడిసింగనామాత్యుః డు పలికినట్లుగాఁ జెప్పుకొనియెను. శ్రీనాథుకు తన భీమేశ్వరపురా ణములోఁ గాళిదాసుని రసభావ భావనామహనీయ కవితాసముల్లాసునిగా ను భట్టభాణుని నిరవద్యగద్యపద్య నిబంధపరితోషిత స్థాణునిగాను, ప్రవర సేనుని సాహిత్య పదవీ నుహా రాజ్య భద్రాసనాసీ సునిగాను, శ్రీహ ర్షుని సంబోధి నార్వీ చిగంభ తొసార జాక్సముత్కర్షునిగాను స్తుతించి భావశివభధ్ర సౌమిల్ల భల్లులకుల మాఘభారవిబిల్హణులకును భట్టిచిత్త వకవిదండి పండితుకునుఁ గేలుదోయి నొసలిపై ఁ గీలు గొలిపెను. ఇమ్మ హాకవుల కావ్యముల నెల్ల నీతఁడు పఠించియుండుననుటకు సందియము లేదు. ఇంకఁ గవి తామహాత్మ్యముననో ! బ్రాహ్మీద త్తవరప్రసాద లబ్ధకవితాధురంధరుండగుటఁ జెప్పనక్కరయే లేదు. ఇతఁడు శృంగార నైషధకర్తయగు భట్టహర్షుని షట్కు మర్మక చక్రవర్తి' యని చెప్పి యున్నాఁడు. ఇతనిం గూ- 'షట్తర్కమర్మైక చక్రవర్తి' యని మన ము చెప్పవచ్చును.*[1]

ఇట్టివాడగుటం జేసి శ్రీనాథుఁడు 'సకలవిద్యాసనాథుఁడను పట్టము నొంది కొండవీటినగరంబున శ్రీ పెదకోమటి వేమభూ పాలవర్యుని


యాస్థానంబున వివ్యాధి కారి పీఠము నధిష్టించి బహువత్సరంబులు విద్యాసామ్రాజ్య పరిపాలనమును జేయుటకును, అష్ట భాషాకవితాసామ్రా జ్యూభిషిక్తుగుడును, డింకమకవిసార్వభౌమ బిరుదాంకితుఁడును, శ్రీకం ఠాగమ శిఖండమండనమణియై ప్రప్రథమమున విజయుడిండిమము నా ర్జించిన డిండిముప్రభుని దౌహిత్రుఁడును, సభాపతి భట్టారకచార్య భాగినే యుండున, సరస్వతీ ప్రసాదలబ్దికవితా ననంథుడును, యోగానంద ప్రథా నకర్యునగు నరుణగిరినాథుఁడును మహావిద్వాంసుని, నజేయుఁడై ప్రౌఢ దేవ రాయమహారాయల యాస్థాన మలంక రించియున్న వానితో సుద్భటని వాని మును 'బెట్టుకుని వాని నోడించి వానికంచుఢక్క పగుల గొట్టించి వానీ కవిసార్వభౌమ బిరుదముఁ జూఱగోని యమ్మహా రాయల ముత్యాలశాలలోఁ గనకాభి షేక మహోత్సవమును బడయగాంచుటకు సాధ్యం బయ్యెను.

ఇన్ని విద్యలను నేర్చి యింతటి ప్రజ్ఞావిశేష మలవర్చుకొన్న వాడు బాల్యములో పితృపితామహులు స్వగ్రామమునఁ " గూరు చుండి సామాన్య గురువులకడఁ గవితావిద్య నేర్చుకొనుచుఁ గాలము గడపెనని తలంపకాదు. కావున బితామహుఁడుద్యోగముఁ జేసిన పట్టణములో నే శ్రీనాథుఁడుండెననుట పొసఁగ నేరదు. శ్రీనాథుతండ్రి నివాసము తెలియరాదు. ఏది 'యెట్లున్నను మారయామాత్యుఁడు శ్రీ నాథుని బాల్యములోఁ గొండవీటి సీమకు వచ్చియుండును.

అట్లుకాదేని శ్రీనాధుని 'బాల్యములోఁ దనతండి స్వర్గస్థుఁడు కాగా శ్రీనాథుడే కొండవీటి సీమకు నేతెంచి విద్యాసముపార్జనము చేసి యుండవలయును. ఏమనఁ గొండవీటి ప్రభువు కుమారగిరీవసంతనృపాలుని సుగంధ వస్తుభాండాగా 'రాథ్యడు డైన యవచిదేసయతిప్పయ సెట్టి శ్రీనాధుని బౌలసఖుఁడని యన్నట్లుగా శ్రీనాథుఁడే హరవిలాసావతారిక పద్యములలో వక్కాణించి యుండుటచేత: : బాల్యములో

కొండవీటి రాజధానియందు నివసించియుండునని యూహ పొడమక నూనదు. అనేక హేతువుల చేత కుమారగిరి రెడ్డి కాలములో కొండ వీటి రాజధానియందు నివసించియుండెనని మనము నిర్ధారణము సేయవ చ్చును. ఇన్ని విద్యలు నేర్చిన శ్రీనాథునికి గురు వొక్కఁడే యుండి యుండడు. శ్రీనాథుఁడు వేర్వేఱు గురువుల-కడ పేఱవేఱ శాస్త్రముల నభ్యసించియుండును. కొన్నిటిని స్వయముగా సభ్యసించినను పెక్కు. శాస్త్రములను గురుముఖమున సభ్యసించినఁ గాని యంతటి పొండిత్య ము సలవఱచుకొని యంతటి ఖ్యాతిని గాంచి యుండఁడు. ఆ నేకులకడ విద్యాభ్యాసము జేసియుండుట చేతనే శ్రీనాథకవి ప్రత్యేకముగా నొక్కని నామమైనఁ బేక్కొనకుండుటకుఁ గారణ మైయుండును. శ్రీనా థకవికి బాల్యమునందు విద్యాభిలాష యత్యధికముగా నంకురించి ప్రోత్సహించుటకుఁ గారణము శ్రీనాథుని పితామహుఁడైన కమలనా భామాత్యుని జీవితమై యుండ నసుటకు లేశమాత్రమున సంశయము లేదు. శ్రీనాథుఁడు తన తాతగారి జీవితము నాదర్శము గాఁ బెట్టుకోని విద్యాదీక్ష గైకొని కష్టములు కోర్చి యత్యధిక పరిశ్రమమును గావించి విద్వల్లోక మగ్గించునంతటి విద్వాంసుఁ డయ్యెను.

నేనీ కవిచరితమును బ్రకటించిన వెనుక నైదు సంవత్సరము లకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు 'శృంగార శ్రీనాధ. మను పేరిట నీ కవిచరిత్రమునే ప్రకటించిరి. అందు "విద్యాభ్యాసము --- గురువు” అను శీర్షిక క్రింద నాయభి ప్రాచుముల నొప్పుకొనుచు నొప్పు కొనని వానివలె, జదువరులు తలంపవలయుని కాబోలు విచిత్ర మైన వ్యాఖ్యానము విస్తరింపఁ జేసియున్నారు.

“కుశాగ్రబుద్ధియు నద్భుత ప్రతిభాశాలియునగు నీతఁడు పలు వురు గురుల యొద్ద గురుకుల వాస క్లేశమునకు లోనయి చిరకాలము జాడ్యముతో విద్యాభ్యాసము చేసెనని తలంప రాదు." అనివ్రాసి నది, ఇన్ని విద్యలు నేర్చిన శ్రీనాథునికి గురువొక్కఁడేయుండి యుండడు. శ్రీనాథుఁడు వేర్వేరు శాస్త్రముల నభ్యసించి యుండును; కొన్నిటిని స్వయముగా నభ్యసించినను పెక్కు శాస్త్రములను గురుముఖమున నభ్యసించినగాని యంతటి పాండిత్యము నలవటి చికొని యంత ప్రఖ్యాతిని గాంచియుండఁడు; అనేకులకడ విద్యాభ్యాసముఁ జేసియు డుటచేతనే శ్రీనాథకవి ప్రత్యేకముగా నొక్క నినామమైన బేర్కొనకుం డుటకుఁ గారణమై యుండు' నని 'నేను వ్రాసిన దానికి ఖడనముగా వాసియున్నారు. వీరే యీసందర్భమున నే మఱియొక చోట “ఉత్తమ కవితకు సహజశక్తి, లో కానుభవాదులమున నైపుణ్యము కావ్యజ్ఞ శిక్ష. యావశ్యకము. సంస్కృత ప్రాకృతాని భాషలలో, బరి జ్ఞానపాటవము", తర్క, వ్యాకరణాది శాస్త్రములందుఁ దలస్పర్శముగు వైదుష్యము, పండితులతో శాస్త్రార్ధములు సల్పఁజాలీన పాండితీ ప్రౌడి వయిపయి పూత మెఱుంగు చాతుర్యముతో నలవడఁదగినది కాదు. సకలవిద్యాసనాధుఁడై యితఁడిక ముందు కోమటి వేమారెడ్డి యాస్థానమున విద్యాధి కార్యున్నతోద్యోగము వహింపనున్నాఁడు. మఱియు డిండిమభట్టారకాదులతో విద్యావివాదములు సలుపనున్నాడు. ఇట్టివాడు గట్టిగా గురుశుశ్రూషతో శాస్త్రాభ్యాసము నల్పితీఱ వలసి యుండును అని తమకుఁదామే జవాబు చెప్పుకొన్నారు. ప్రభా కరశాస్త్రి గారి మొదటి వాక్యమును బట్టుకొన్న జూడ్య పిశాచము రెండవ వాక్యమును పీడించక విడిచి పెట్టినది. చిరకాల విద్యాభ్యాసనజిగీష జాడ్య మని యనుకోనటవలన నాపిశాచమెక్కడ "వేధించునో యన్న భీతిచే తనుగాఁబోలు నాపిశాచమునుండి. శ్రీనాథుని విడిపించుటకై యీసం దర్భముననే యీదిగువ శ్రీనాథునకు గురువే లేఁడను భావము చదువరు లకు జనింపఁ జేయుటకై, " ఆలోకసోమాన్య ప్రతిభాశాలి యగుటచే నాతఁ డోక వేళనా యఖండ పొండిత్యమును గూడ నాచార్య సన్నిధి వలసి యుండును." నభ్యసింపక యేయలవఱచుకొన్నాఁడేమో యను సంశయమున కీ క్రింది పద్యమవకాశముక లిగించుచున్నది.

శా. బాహ్మీదత్తపం ప్రసాడుఁడవు వుగుప్రజావిశేషోదయా
జిహ్వాస్వాంతుఁడ వీశ్వరార్చన కళాశీలుండ నభ్యర్హిత
బహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత
బ్రహ్మజ్ఞాన కళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే.

అని శృంగార నైషధములోని పద్యము నుదహరించిరి.
కాని శ్రీనాథుఁడే తన కాశీఖండమున నొక చోటఁ జొప్పించిన: -

గీ.శాస్త్రమా ర్యుసన్నిధి జదువఁడేని
యిద్ధబోధంబు మది సంగ్రహీంపఁడేని ,
తెగువమిఱిప్రతిజ్ఞ సాధింపఁడేని
జ్ఞాతిజయమంద డేని తజ్జనుఁడుజనుఁడె.

అను పద్యము నడ్డమువచ్చి తమ యభిప్రాయమును ఖండించుటచేత “విద్యోపలబ్ధికిఁ గూడ నుద్భోధకముగాఁ గొంత గురుశుశ్రూష యుండ వలసినదే యగును. శాస్త్రాధ్యయనము గురునియొద్దఁ జేయవలసినదే* యనివక్కాణించుచుఁ పై బ్రాహీదత్త మను పద్యము నాధారముగా గొని శ్రీనాథునకు విద్యాగురువు లేఁడని తలంప రాదు” శ్రీనాథుని చిరకాల విద్యాభ్యసనమను జాడ్యము పాలు గావించిరి.

శ్రీప్రభాకరశాస్త్రి గారు శ్రీనాథునికి గురువున్నాఁడని యెప్పుకో వలసిన వారై యున్నారు గనుక నింక నాగురు వెవ్వరని వెదక నారం భించిరి. తాత కమలనాభుని గురువునిగాఁ జేయఁ బ్రయత్నించియు నది సాధ్యపడనందున కమలనాభుని సాదుపదేశముల నీతఁడు కాంచె సనిగాని లేదనిగాని స్పష్టపఱుప నాధారములుగారా"వని యాతని వద లుకొన్నారు. ఇంక మిగిలి పట్టుకొనవలసిన వాడు ఘోడెరాయభీమయు గురువ రేణ్యుఁడు. ఇతఁడల్లాడ వేమారెడ్డి వీరభద్రా రెడ్ల కుల గురువనియుఁ వీరభద్రాచల (పట్టిసము) నిలయుఁడగు .వీరభద్రేశ్వరు,

నకు భక్తుఁడనియు, వేద శాస్త్రాది విద్యాని మాధుఁడనియుఁ దెలియఁ జేయు పద్యములను నిశ్శంక కొమ్మనామాత్యుని శివలీలా విలాసమును ప్రబంధము నుండి యుదాహరించి కడపట నిట్లు వ్రాసిరి.

1: వేద శాస్త్రాదివిద్యోపదేశము చేఁ గాక యభీమయ గురువఱే ణ్యుఁడు శైవమంత్రుద్యుపదేశముచే సతనికి గురుడయి యుండవచ్చును."

మామిత్రులగు ప్రభాకరశాస్త్రి గారి పై 'వాక్యములు శ్రీనాథుఁడు తన కాశీఖండములోఁ జెప్పుకొన్న దానికీఁ గేవలము భిన్నములుగా నున్నవి. తనకు సంభవించిన సాహిత్య సౌష్ఠనమునకు కారణంబులు సుద్బోధకములుగ నుండు వానిలో ఘోడె రాయాంక సద్గురు రాజ భీమేశ్వరస్వామి పదసమారాధనంబు* నొకటిగాఁ జెప్పుకొనియున్నాడు గాని శైవమం త్రాద్యుప దేశ ప్రశంసను సలిపి యుండ లేదు. వేదశాస్త్ర ధికవిద్యా నిరూఢతవదిన సరస్వతి నదువు వాడని వర్ణింపఁబడిన శైవ గురువు శైవమం త్రాద్యుప దేశమును జేయుగలిగి వేష శాస్త్రాది విద్యోప దేశము చేయఁజాలి యుండక పోవునా! మొదటి దాని సంగీక రించినపుడు రెండవవాని నంగీకరింపకుండుటకుఁ గారణ మేమి? ఈ ప్రశ్నమునుండి తప్పించుకొనుటకై : "పయివిదన మునఁ బరామర్శింపబడిన యా "కాశీఖండ పద్యము శ్రీనాథుని బాల్య విద్యాభ్యాసవిషయము దెలుపుపునదిగా : దోపకున్న "దని వ్రాయుచున్నారు.

మఱియు కాళీఖండముస, "బేర్కొనఁబడిన భీమయ శ్రీనాథునకు సంతా ద్యుప దేశకర్తయ యగు గురునై యుండవచ్చునని యొక వంక ఘోషించుచు కాశీ ఖండక రచనాకాలముని నాతనికి దాతాత్కాకోత్సా హ కారణముగా భీముయగుకుని బ్రస్తుతించినాఁడుగాని, 'ఉపలబ్ధమైన శ్రీనాథుని గ్రంధములం దాతని గురువెవ్వరో తెలియకున్నాడని యింకొకవంక ఘోషించుచున్నారు. ఇది 'యేమి ఘోష , శైవమంత్రా ద్యుపదేశకర్తయగు గురువు గురువుకాడనయా వీరియుభిప్రాయుము? ఇంకను శాస్త్రిగారు :-- శ్రీనాధుఁడు కృష్ణయజు ర్వేద.ము నధ్యయనము చేసినాడు. స్వ"వేద శాఖాధ్యయనము బాహ్మణుని కాపశ్యక కార్యమని స్మృతి కారు లనిరి. దాని నీతఁడు పాటించెను. అధ్యయనముఁ జదివి మఱుచుచంద మునగాక చక్కగానుపస్థితిలో నండునట్లే చేసెను. ఈయర్ధము “ అధ్వర్యు వేద శాఖాధీకినిష్ణాతు” అన్న పదమెఱిఁగించుచున్నది. అధ్వ ర్యు వేద శాఖ యనఁగా గృష్ణయజు ర్వేదము ఉభయభాషాకవియై శ్రీనా థావదాని' యనియె గాక వేదాధ్యయనపరుఁడై శ్రీనాథావధాని' యని కూడ శ్రీనాధుఁడు పేర్కొనఁదగినవాఁ డయినాఁడు." అని తమగంథమునందలంకరించిరి. ఆ కాలమున గురుముఖమునఁగాని యిట్టియోగము సంప్రాప్తముగాదని ప్రభాకరశాస్త్రిగా రొప్పుకొనక తప్పదు. పల్వురు గురువులున్నారని చెప్పుటవలన శ్రీనాధుని కుశాగ్రబుద్ధికిని నద్భుతప్రతిభకును భంగమువాటిల్లును గావున శ్రీనాధుని కొక్కఁడే గురువుఁడవలయునని చెప్పెడివారు ప్రభాకరశాస్త్రి గారె గదా ప్రభాక రశాస్త్రి గారి యభిప్రాయము ననుసరించి తన్న వధానిగ నొనరించిన వేద వేదాంగవిదుఁడైన గురువుకడ నే శ్రీనాధుఁను శ్రౌతనూత్రదుముల తోఁ బాటు కామసూత్రములను బఠించినాడు. అష్టాదశస్మృతులను, అష్టాదశపురాణములను, ఉపపురాణములను, సాంఖ్య యోగ సిద్ధాంత ములను శైవాగమమ:లను జదివినాఁడు. మఱియు నావిద్యలను ముద్దలు చేసి మ్రింగినట్టుగా నశ్రమమున గ్రహించి వ్యుత్పత్తి నార్జించినాఁడు. మాహారాష్ట్రి, శౌరసేని మొదలగు ప్రొకృతభాషలందు బరిజ్ఞాన పాట వము గడించినాఁడు. పతంజలి ప్రణీతమగు వ్యాకరణ మహాభాష్యమును బాగుగాఁ బఠించినాఁడు. న్యాయపైశేషిక దర్శనములందుఁ గౌసల్య ముగాంచినాఁడు. వీనిపై వ్రాయఁబకిన భాష్యకర్త ల గ్రంధముల నన్ని టిని సభ్యసించెను. అతనిక డి నే పూర్వకవి ముఖ్య విరచితా పూర్వకా వ్యభావరససుధాచరణ ప్రౌడత యును గాంచినాఁడు. ఇన్ని విద్యలను, ఇన్ని శాస్త్రములను, ఇన్ని మత సిద్ధాంత ములను నేకగురు ముఖమున నేక కాలమున శ్రీనాధుఁ డభ్యసించెనని ప్రభాకరశాస్త్రి గారి వాదము విశ్వసనీయమో, ఆయాశాస్త్రములందుఁ బ్రవీణులయిన విద్వాంసులయొద్ద "వే.ర్వేరు శాస్త్రములను వేర్వేరు కా లము లందు శ్రీనాధు: డభ్యసించెనను నావావము విశ్వసనీయమో నిర్ధా రించుకొనుటకుఁ జదువరుల కే విడిచి పెట్టుచున్నాను.

అధ్యాయము 4.

రెడ్డిభూపాలులు

దేనటి ప్రోల రు వేమా రెడ్డి. (1396–73 19)

దేసటి పోలయ (భార్య అన్నమ్మ)

మాచన 1) వేమా రెడ్డి 1 09-30.0340 "పెదకోమటి

  • వేమా రెడ్డి ని ఆశపోత రెడ్డి గోమటి రెడ్డి (చిన్న) 5 అన వేమా గెడ్డి దొడ్డాంబ 'వేము పొని

(2000-00-00) (2X)-1320) (226-0203) రాచవేముఁడు

  • కుమారగిరి

మల్లాంబ (6:302--1900) (భర్త కాటయ వేముఁడు ) కొండవీటి రాజ్యము. (రాజమ హేదవగ రాజ్యము , (Virgo)

  1. షట్తర్కములనఁగా షడ్డర్శములనీ యాధునికులు కొందరు తలంచిరి. పూర్వు లచే ఈ రెండును వేఱవేఱని తెల్పబడి యున్నవి. కవికల్పలత లో:- (షడ్వజ్రకోణ త్రిశిరోనేత్ర తర్కాదర్శనమ్ చక్రవర్తి మహా సేనపద నర్తుగుణారసా, సౌగత నైయాయిక యోగ సాంఖ్య వైశేషిక నా స్తికమతములుషట్తర్కములు, (స్యాద్యాద వాద్యార్హతః స్యాత్ ) శూన్య నాడీతు సౌగతః నైయాయిక్వాక్ష పాదో, యోగి ! 'సాంఖ్యను కాపీల వైశేషిక ః స్యాదౌలూక్యో, బార్హస్పత్యమునా స్తిక, జార్వాకో కౌ కాయతీక శ్చై తేషడకి తార్కి కాట” హేమాచార్యుఁడు, శ్రీ వేదమువేంకట గాయశా స్త్రీ ఈ చితసర్వం, షాహ్యఖ్యా సమేత .. ముద్రిత శృంగార నైషగ్రంథము. "పేజీ 11