Jump to content

శ్రీనాథకవి జీవితము/చతుర్థాధ్యాయము

వికీసోర్స్ నుండి

ఇన్ని విద్యలను, ఇన్ని శాస్త్రములను, ఇన్ని మత సిద్ధాంత ములను నేకగురు ముఖమున నేక కాలమున శ్రీనాధుఁ డభ్యసించెనని ప్రభాకరశాస్త్రి గారి వాదము విశ్వసనీయమో, ఆయాశాస్త్రములందుఁ బ్రవీణులయిన విద్వాంసులయొద్ద "వే.ర్వేరు శాస్త్రములను వేర్వేరు కా లము లందు శ్రీనాధు: డభ్యసించెనను నావావము విశ్వసనీయమో నిర్ధా రించుకొనుటకుఁ జదువరుల కే విడిచి పెట్టుచున్నాను.

అధ్యాయము 4.

రెడ్డిభూపాలులు

దేనటి ప్రోల రు వేమా రెడ్డి. (1396–73 19)

దేసటి పోలయ (భార్య అన్నమ్మ)

మాచన 1) వేమా రెడ్డి 1 09-30.0340 "పెదకోమటి

  • వేమా రెడ్డి ని ఆశపోత రెడ్డి గోమటి రెడ్డి (చిన్న) 5 అన వేమా గెడ్డి దొడ్డాంబ 'వేము పొని

(2000-00-00) (2X)-1320) (226-0203) రాచవేముఁడు

  • కుమారగిరి

మల్లాంబ (6:302--1900) (భర్త కాటయ వేముఁడు ) కొండవీటి రాజ్యము. (రాజమ హేదవగ రాజ్యము , (Virgo) 1323 వ సంవత్సరమునఁ దురుష్కులు 'కాకతీయసొమాజ్య మును విధ్వంసము గావించి వెనకఁ బంటకులంబున జనించినట్టి దేపటి వేమా రెడ్డి మనుముఁడును ప్రోలయ రెడ్డి రెండవకొడుకును నగు వేమారెడ్డి యాక్యధర్మోద్ధరణాభిలాషియై తురుష్కు లార్యధర్మముల నాంధ్ర దేశంబునం దాటాదూటములుగఁ జేయుచుఁ గలవరు పెట్టుచున్న కాలం బున వికమాడ్యుఁడై కృష్ణానదీ తీర ప్రాంత దేశములఁ దురుష్కుల నోడించి పూంగినాటి దేశంబున రాజ్యమను నెలకొల్పి సామ్రాజ్యము విస్తరింపఁ జేయ నెంతేవి ప్రయత్నించి కృతార్ధజన్ముఁడై యాంధ్ర దేశంబునఁ జరకీర్తిని సంపాదించిన నాఁడు. *[1] స్వదేశాభిమాసము, స్వభా షాభిమానము, స్వమతాభిమానము, స్వజనాభిమానముగల భూపాలుర లో నితఁడగ్రగణ్యునిగా భావింపవచ్చును. కనుకనే 'యెర్రా ప్రెగ్గడ వచించిన ట్లనదాత చరితంబున నఖలజనరంజనం బొనర్చుటం జేసి రాజశ బ్ధమునకు భాజనం బయ్యెను. ఇతఁడు స్వబంధుజనాను రాగము మెండు గాగలవాఁడై బహుభూములాక్రమించి యనుజ తనుజ బాంధవ మిత జనుల కిచ్చెనని హరివంశములోని యీకింది పద్యమువలన విస్ప ష్టమగుచున్నది.

తనకు సడ్డంకి తగు రాజధానిగా బ
రాక్రమంబున బహుభూములా క్రమించి
యసుజతసుజు బాంద పమిత్ర జనులకిచ్చి
నెదుగ యెవ్వారు వేమషహీశ్వరునకు

అద్దంకి యతనికి రాజధానిగాముండెననీ కూడఁ బై పద్యమునల ననే తేటపడుచున్నది. ఇట్లతఁడు భూముల నొసంగి స్వబంధుజనుల

 నాధరించినవాఁ డగుట చేతనే కాబోలు
పంటకుల స్వామి ప్రఖ్యాత గౌరు నే
మయపితామహుఁడను మాశ్యతయును
ధూతకళంకుండు దొడ్డయ సైన్యనా
యకుఁడు నూ తామహుండను తన
'నాదిరాజస్య తుల్యాచార నిధి చూచ
విభుఁడ పూర్వజుడను పళుతియును
శ్రీయుతుల్ పోతయ చట్టయ నాగయ
ప్రభులు మాతులను భవ్యతయును

జనమహత్వంవంబుభూషింప దాసు వారి
పేరు "వెలయింపజాలు గభీరమహిమ
నాత్మగుణముల నోడవించు నన్వయైక
పావనుడు వేమజనపతి కేవలుండె

అను హరివంశములోని పద్యములో నెర్రా ప్రెగ్గడ వేమారెడ్డిని సన్వయైక పావనుఁ డని యభివర్ణింయున్నాఁడు. ఇతనికి బిరుద నామము లనేకములు గలవు. వానిలో పల్ల వాదిత్యుఁడు, జగనొబ్బగండఁడు, అంగరక్షాపాలుఁడు, కే లా ది రాయఁడు, సంగా మధనంజయుఁడు, భుజ బలభీముఁడు, రూపనా రాయణుఁడు, వీరనారాయణుఁడు, గుజ్జరీదళవిభాళుఁడు, జగరక్షపాలుఁడు, చంచుమలచూఱ కారుఁడు, మండలీ కరగండఁడు, కోదండ రాముఁడు, రాయచేకోలుగండఁడు, అర్ధిప్రత్యర్ధి హేమాద్రి దాన నిరతుఁడు, ప్రజా పరిసాలనభరితుడు, అనురాభరణుఁడు, అపరమితభూదాన 'పరశు రాముఁడు, రాచూరీడు విభాళుఁడు, అనేక నగరోపకంఠ ప్రతి పౌధిత. బహువిధారాముఁడు, పరంతాహోబల నిర్వతసోపానుఁడు,బహ్మకుండి సహ్యాజాగౌతనూజలక్రీడావినోదుఁడు: విరోధినృప దానవ నరసింహుడు, పాండ్యరాయగజసింహుడు, ప్రజ్ఞచతుర్విధో పాయుఁడు, నిత్యపరిపాలిత సత్యుఁడు, దుర్మద నై రివీరభయంకరుఁడు, బసవశంకరుఁడు, అనునవి ముఖ్యములై నవిగా నున్నవి. ఇతనికిఁ గాశ్యపగోత్రసంజాతుడుకు, రాజు తంత్రజ్ఞుఁడును సమర్దుడును, అనూత్యశిఖామణియు, శాస్త్రవిదుఁడు, వయోవృద్ధునగు రామా ప్రెగ్గెడయను నియోగి బాహ్మణుఁడు మంత్రి గనుండెను. ఇతనికిఁ దమ్ములైన అన్నా రెడ్డియు, మల్లా రెడ్డియు కుమా కుఁడైన అనపోత రెడ్డియు, మాతులపుత్తు డైన నూకారెడ్డి యుఁ బ్రసిద్ధ సేనానులుగ నుండి 'వేమా రెడ్డికి దిగ్వజయ మొనర్చుచుండిరి. వీరిలో మల్లా రెడ్డి శ్రీ రామచంద్రునికి లక్ముణునివలెను, ధర్మజునకునర్జునునివలె నువేనూ రెడ్డికి విధేయుఁడై సౌభ్రాతృత్వము పుచుసమస్త జనులచే గొనియాడఁ బడుచుండెను. మల్లా రెడ్డి తురుష్కులను జయించి వారాక్ర మించిన బాహ్మణాగ్రహారములను మరళ బ్రాహ్మణుల కిప్పించెనట. ఇతఁడు కాకతీయ సైన్యాధిపతులగు క్షత్రియులను జయించి మోటుప ల్లిని స్వాధీనపటి చికొనియెను. అనపో త రెడ్డి సేనాధ్యక్షుఁడై ధరణికోటయం దుండి పద్మనాయుకుల వలనను, రాచవామవలనను తమ రాజ్యమునకు హానికలుగకుండ గాపాడుచుండెను. ఇట్టి సేనాపతుల సాహాయ్యముతో బర రాజులను జయించి యీవేమాభూ పాలుఁడు కందుకూరి మొదలుకొని గోదావరీనది పర్యంతముగల యాంధ్ర దేశమును బరిపాలించెను. బ్రహ్మకండి కృష్ణ వేణి గోదావరీ మహానదీతటధ్వయు తన్మథ్య దేశం. నేకాగ్రహారం' అను విశేష మొకటి వేమునకుఁ, గలదని శాసనములలో గన్పట్టుచున్నందున వేముఁడు నెల్లూరు మొదలు కటకము,దాక పరిపా లనము చేసినట్లు తోఁచుసనియు, ఇందులోఁ గొంతభాగ మతిశ యోక్తి కింద, గొట్టి వేసిన ప్రస్తుతపు గోదావరీ మండలములోఁ జేరిన దేశమం తయు నతనిపరిపాలనకు లోఁబడినదన్నటకు సందేహముండదనియు శ్రీ జయంతిరామయ్య గారు ప్రాయుచున్నారు గాని యదియంతగా బాటింప పదగినది కాదు. పై దానిలోఁ గటకము ప్రశంస గాన రాదు. *[2] అంతియ

గాదు. ఆ కాలమున నిప్పటిగోదావరీ మండలము కోరుకొండ రాజధానిగాఁ జేసికొన్న మంచికొండడ కూనా రెడ్డి యొక్కయుఁ నతని కుమారుఁడు ముమ్మిడినాయకుని యొక్కయుఁ బాలనమునందున్నట్లు ముమ్మిడినాయపని యార్యవట శాసనాదులు వేనోళ్ళ ఘోషించుచున్నవి. ఆశాసనముల యం దెచ్చోటను కోరుకొండ రెడ్లు ప్రోలయ వేమారెడ్డికి లోబడిన వారని చెప్పండియుండ లేదు. అందువలన పై వేమభూ పొలుఁడు మహా నదియైన గోదావరీ వఱకుఁ గల దేశమును మాత్రమే పరిపాలించియుం డును. మంచికొఁడ కూనారెడ్డికి తురుష్కులను జయించుటకుఁ దోడ్స డినవారు ప్రోలయ నాయకుఁడును నాతని పుత్రుడు కాపయనాయ కుఁడు నని యార్యవట శాసనమునుబట్టి యూహింపఁదగియున్న ది. వేమా రెడ్డియే కాపయనాయకుడని వ్యవహరింపఁబడియుండిన యెడల జయంతి రామయ్య గారి యూహ సరియైన దనవచ్చునుగాని యందునకుఁ బ్రమా ణము గానరాదు. అమరావతీ శాసనములో 'మాద్యన్మన్నెనృపాల ' అని చెప్పుటచేఁ గళింగ దేశము లోని కొండ రాజులను జయించిన మాత్రముచేత నా దేశమును గళింగ దేశమని కొని, కళింగ దేశమును బరిపొలిచెననిగానీ యెట్లు చెప్పనగును? ఇతర ప్రమాణము 'లేవియుఁ గానరాకుండునప్పుడు వేమారెడ్డి కళింగ దేశమును బరిపాలిం చినని సిద్ధాంతము చేయరాదు. ఎజ్రా ప్రెగ్గడ యను మహాకవి యితని యాస్థానమునందేయుండి హరివంశమును రామాయణము నీతని కంకి తము గావించేను. "వేమారెడ్డి అహోబల శ్రీపర్వతముల రెంటికిని సోపా నములను గట్టించి ప్రసిద్ధికెక్కి నవాఁడు. ఇతఁడు శైవభక్తుఁడయినను పరమత సహనముగల వాఁడు. ఇతఁడు 1350 వఱకుఁ బరి పాలనము చేసెను. "[3]

ప్రోలయ వేమా రెడ్డి రాజ్య పరిపాలనము సర్వోత్కృష్టమైనదిగఁ దెలుపుచుఁ డగ్భాగ్య వైభవమును శంభుదాసుకవి (ఎజ్జాప్రెగ్గడ)యిట్ల భివర్ణించి యుండెను.

సీ.జగిహారములు విద్యాతపోవృద్ధ వి
ప్రులకిచ్చి యజ్ఞకర్త లుగ మని వెం
గొమరాగఁ జెలవులుగుళ్ళు ప్రతిష్ఠించి
లోకసం భావ్యంబులంగా నొనర్చె
నిధులు నల్లిండ్లును నిలి పెఁదోటలు సత్ర
ములు చలిపందరిల్ వెలయఁ బెట్టె
హేమాద్రి పరికీర్తి తామిత పత్ర దాన
నివహంబులన్నియు నిర్వహించె

జేఁసెఁజేయుచున్నాఁడు నీయనున్న
వాడు పురుక్త కృతిశు భావలుల నెల్ల
ననఁగ శ్రీ వేమవిభువి కయ్యలను పేర్మి
వశ"మెవర్ణింపఁ దద్భాగ్య వైభవంబు.

అనపోత రెడ్డి భూపాలుడు. (1350 మొదలుకొని1362 వజకు) పోలయ వేమా రెడ్డియనంతరం మతని కమారుడైన అనపోత రెడ్డి శా. శ.1272 వ సంవత్సరమనఁగా క్రీ. శ.


పఱకును రాజ్యము చేసెనని వాయఁబడియుండుటయే గాక పోలయ వేమా రెడ్డితరు వాత ఇతనికుమారుఁడన వేమారెడ్డి రాజ్యమునకు వచ్చెనని వ్రాయఁబడియుండుట నుదాహరించి ఫుట్ నోటులో ? (ఇటీవలివారు కొందఱు కవుల చరిత్రములోని కాలమును నమ్మి తప్పు సిద్ధాంతములను చేయ మొదలు పెట్టినారని నాయాంధ్రుల చరిత్ర ములోని మూఁడవ భాగములో 149 వ పేజీలో వాసియున్న దానిని చదువుకిని శ్రీ వీరేశలింగము గారు వానినంతయు నిప్పటి నూతనగంధమునందు నాగ్రంథ మెంత సహాయముచేసినదో తెలుపక పోయినను మౌనముతో మెల్లగా సవరించుకొన్నందులకు సంతసించుచు వారి నెంతయు శ్లాఘించుచున్నాను. పోలయ వేమా రెడ్డికి బిమ్మట నతనికుమారు డైన అనపోత రెడ్డి రాజ్య భారము వహించెనను సంగతి నాయాంధ్రుల చరిత్రము మూడవ భాగమును జదుకొనువఱకు నెఱుంగ నే యెఱుంగరు, . 1350 దవ సంవత్సరమున సింహాసనమెక్కి రాజ్యబారమును వహించి క్రీ.శ 1392 వరకు రాజ్య పాలము గావించెను.వేమ భూపాలునకున ఆనపోతరెడ్డి కోమటి రెడ్డి అను ముగ్గురు కొమాళ్లును, దొడ్డాంబిక, వేమాంగిక అను ఇద్దరు కుమార్తెలు గలరు. కోమ టి రెడ్డి చిన్నవయస్సుననే గతాను వయెనుదొడ్డాంబిక ను కాటయ రెడ్డికిని, వేమాంబికను నల్ల నూకయ రెడ్డికి నిచ్చి వివాహము గావించెను. అనపోత రెడ్డి "వేమభూపాలునకుఁ గూరిమి పుత్రుడు. అనపోత రెడ్డి రాజ్యభారమును వహించి తండ్రి పోయినమార్గమును బట్టి ప్రజారంజకముగ రాజ్యపరిపాలనము చేసి తండ్రికి గీర్తియు, రాజ్యమునకు వన్నె యి. దెచ్చెను. తోబుట్టువుల భర్తలును సేనాపతులు నై నకాటయ రెడ్డియు,నల్ల నూకయ రెడ్డియు నాతనికి రెండు భుజ ములుగానండిరి. సోదరుఁడును ప్రచండ సేనానియునగు అనవేమరెడ్డియు, విధేయుఁడై యుండెను. దక్షిణమునుండి కర్ణాటకులును, పశ్చిమమున నుండి పద్మనాయకులును, అప్పటప్పట రాచవారును రెడ్డి రాజ్యమును స్వాధీనము చేసికొనవలయునని ప్రబల ప్రయత్నములు చేయుచువచ్చిరి. గాని అనపోత రెడ్డి సమర్థుఁడును, నరాక్రమవంతుఁడు నై నందున వై రివీర మదభంజనుడై తన రాజ్యమును సంరక్షించుచకొనుచుఁ బొగడ్తలను గాంచెను. క్రీ. శ.1321 వ సంవత్సరమున రేచర్ల సింగమనాయని పుత్రులు' అనపోత నాయఁడును, మాదానాయకుడును బహుళ సైన్యము లతో దాడి వెడలివచ్చి ధాన్య నాటీపురమును (ధరణికోట) ముట్ట డించినప్పుడు, అనపోత రెడ్డి ప్రచండవిక్రమార్కు డై భూరి సైన్య ములతో వారల నెదుర్కొనీ ఘోరసంగ్రామమును సలిపి కృష్ణా నది కావలి ప్రక్కకు దరిమెను. అంత వారల పరీభవమునకోర్వఁజాలక తీరుపట్లు పడుచు తుచకు తురుష్కులు స్వరాజధాని పైదండెత్తి వచ్చినారను వర్తమానము రాగా బునః ప్రయత్నమును మానుకొనిమరలిపోయిరి; 'అనపోత రెడ్డి 'యే " యుద్ధమునందు 'సోడి

పోయినట్లు గన్పట్టదు. ఇతఁడు ఆర్యధర్మములను బోషింపుచుండెను. వేదాధ్యయనసంపన్నులైన బ్రాహ్మణోత్తములకు తన తండ్రియొసంగిన యగ్రహారముల నన్ని టిని "పొడుటయేగాక తానును హేమాద్రి దాసఖండమునఁ జెప్పిన ప్రకారము గావించి కీర్తినీయుఁ డగు చుండెను. ఇతఁడు పట్టాభిషి క్తుఁడై న పిమ్మట రెండు సంవత్సరముల వరకును రామా ప్రెగ్గడ నంశములోని వాఁడగు మల్లి నాథుడు మంత్రిగ నుండినట్లు ఒంగోలు తాలూకాలోని మణి కేశ్వరము శాసనమువలన నూహీంపఁ దగియున్నది. ఆశాసనమునందు మల్లనమంత్రి స్వర్గస్థుఁడు కాగా సతని పినతమ్ముఁడు మంచి రాజు శాస్త్రయుక్తముగ నుత్తర క్రియలు నెఱవేర్చి పుణ్యర్ధము శా, శ. 1275 విజయసంవత్సర జ్యేష్ఠ శు 14 శనివారమునాఁడు తానావఱకు శ్రీ శైలములోని పాతాళగంగ పట్టుననుండి కొనివచ్చిన రెండు లింగములలో నొక దానిని మాండు కేశ్వ రస్వామి దేవాలయములో రావినూతుల పర్వతమల్లినాథ లింగస్వామి ప్రతిష్టాపన గావించెను. మఱియొక లింగమును శ్రీగిరిలింగ మనుపేర నెదుటనున్న మండపములో ప్రతిష్టాపన గావించెను. మఱియు నితఁడు శివ క్షేత్రమగు మణి కేశ్వరములోని యాశి వాలయమునకు నారామములు, భూములు మొదలగువానిని దానము చేసి ప్రఖ్యాతుఁ డయ్యెను. [4] ఈమల్ల నమంత్రి గాక మఱియొక మల్లనమంత్రి కలఁడని అమరావతీ శాసనములలోని యొక శాసనమువలన విదితమగుచున్నది. అతఁడు కేత చమూపతి కుమారుడైన మల్లినాథుఁ డనియు, వేముపృ ధ్వీశ్వరుని రాజ్య ధురంధరుఁ డైన మంత్రి యనియు, కులక్ర మూగతమైన మంత్రిత్వ పదవియం దుండెననియు నాశాసనము చాటుచున్నది. అట్టి మల్లి నాధమంత్రికి లక్కాంబిక యందు జనించిన వేమచమూపతి ధాన్య వాటిపురమునందుఁ బ్రతిష్టాపింపఁబడియున్న యమరేశ్వర దేవుని శా. శ శ. 1283 ప్లవ సంవత్సర శ్రావణపంచమి గురువారమునాఁడు ఆన పోతయ రెడ్డి గారికి ఆయురారో గ్యైశ్యర్యాభివృద్ధి కోఱకును ధనకనక వస్తు నాహన సమృద్ధి కొఱకును, పుత్ర పౌత్రా భివృద్ధి కోఱకును పునః ప్రతిష్ఠా పనము గావించెనని యాశాసనము చాటుచున్నది. అనపోతభూపాలుని రాజ్య పరిపాలనాశాలమున జరిగిన మహద్విషయ మొండు సముద్రతీరమునందున్న మోటుపల్లి పురాతన కాలమునండియు వర్తక స్థానమై నౌకావ్యాపారము నకుఁబ్రధానస్థానముగా నుండెను.. కాకతీ యసామ్రాజ్య మస్తమించిన 'వెనుక మోటుపల్లీయం దుండెడు వర్తకులు పరస్థలమలకుఁ బోవుటయు వ్యాపారము తగ్గుటయఁ డటస్థించెను. అనపోత రెడ్డి యీరేవుపట్టణమును వృద్ధికిఁ దీసికొని రావలముసని శ్రద్ధతో సంకల్పించేను. అనపోత రెడ్డి యూజ్ఞాపకారము వాని పుత్రులలో నొక్కఁడగు మోట పల్లి నగరాధీశుఁడు సోమయామాత్యుఁడు,

మోటుపల్లి 'కే వర్తకుకులు వచ్చి నివసింపగోరినను వారిని గౌర వించి వారలకు భూములు నివేశనస్థలములు సిప్పింతుమనియు, వారలు స్థలమునకుఁ బోఁదలచుకొన్నప్పుడు వారిని నిర్భంద పెట్టి నిలుపక స్వేచ్ఛగా విడుతు మనియు, ఏయూరినుకు తెచ్చిన నూ, వారిని స్వేచ్ఛగా నమ్ము" సనిచ్చెద మనియు, పన్నలకై వారిసరకుల గ్ర హింపమనియు శాసనమును వాయించి ప్రచురించెను. ఇకంతయు నె ట్లయిన రేవు పట్టణమునకు సభివృద్ధిలోనికిఁ దెచ్చి ద్వీపాంతరమ లతో వ్యాపారమును పెంపొందింప వలయునని మనఃపూర్వకముగాఁ జేసిన ప్ర యత్న మైనట్టు శాసనముం జదివిన వారికి స్పష్టముగా బోధపడఁగలదు?[5]*

see edit collections అనపోత రెడ్డికిఁ దరువాత. గూడా నీనౌకాభివృద్ధి గాంచినట్లనేక దృష్టాంతములు గనుపట్టు నున్నవి. ఈతని పరి పాలనము సర్వజన రంజక మై యున్నవనుటకు సందియము లేదు. ఈశాననము క్రీ. శ.1385 న వ్రాయః బడినది, మోటుపల్లి ముకుళ పురమని వ్యవహరింపం బనుచున్నట్లుగా " బై శాసనముమునఁ దెలియుచున్నది. అనపోత రెడ్డి పరి పాలనము చేసినది పండ్రెండు సంవత్సరములు మాత్రమే. ఇతఁ డేకా రణము చేతనో అకాల మృతికొంచెను. ఇతఁ డింకను బదికి యుండిన యెడల రెడ్డి రాజ్యమును విస్తరింప జేసే కర్ణాటక సామాజ్యము వలె నొక ఘనసామ్రాజ్య మును దక్షిణ హిందూస్థానమున స్థాపించి యుండు ను. ఇతనికి కుచూరగిరి రెడ్డి యకు కుమారుడును, ముల్లాంబ యను కొమార్తయుఁ గలరు. మల్లాంబను తన మేల్లుడగు "కాటయ వేమన కి చ్చి వివాహము గావించెను.


దక్షిణపు సరిహద్దుననున్న యుదయగిరి రాజ్యము కర్ణాటాధీ శులవశ్యమై వారి పరిపాలనమునఁ బనర్థ మూసమై యొప్పుచున్నందున నెప్పటిక కైనఁ దన రాజ్యమునకు మొప్పము రాగలదని యూహించి తన్నివారణ మార్గముల నారయుచుండెను. నూత్న కర్ణాటసామ్రాజ్యాధీ శ్వరుల పుత్రులును, యుపరాజులు నగువారు తఱుచుగా సుదయగిరి దుర్గ మున నంచుచు నుదయగిరి రాజ్యమును బరి పాలము సేయుచుండిరి, అట్టి యుదయగిరికి సమీపమున' దన రాజధాని యుండుట రాజ్బ వినాశమునకు హేతువగు కుననియో, పద్మనాయక వీరులు తరచు ధాన్య వాటీనగరము పై డండయాత్రలు సలుపు చుండుట చేత తన ముఖ్య పట్ట ణ ము ధాన్య వాటిపుర మునకు సమీపముననుండుటయుచితమనియేచించియో అనపోతభూ పాలుఁ డుశత్రువు , కబేద్యయగు కొండవీడు నకు తన రాజధాని మార్చుకొనియెను.

గోవావరీ మండలములోని యొక శాసనము , అనపోత రెడ్డి జ పరిపాలనము

గానం కొండ మీకును... నిర్మించి రాజధానిగా చేసుకొన్నట్లు 'దెలుపడినది[6]

అనవేమభూపాలుడు

క్రీ. శ. 1362.... మొదలుకొని 1383 వఱకు

అనపోతభూపాలునకుఁ బిమ్మట నతనికుమారుడు బాలుఁ డగుటచేతను గాఁబోలు నతని తమ్ముడు అనవేమారెడ్డి రాజ్య రూడుఁడయ్యెను. అన వేయభూ పాలుఁడు తన యన్న వలెనే శౌర్య సంతుఁడును,సమర్థుఁడును,ధర్మాసక్తచిత్తుడు నై ప్రజపారిపాలము గా చెను. ఇతఁడు బ్రతికీ యున్నంత కాలము రాచకొండ, దేవర కొండ దుర్గ ముల కధిపతులై రాచకొండ రాజ్యమును బరి పొలనము సేయుచుం డెడి అనపోతనాయుఁడు, మాదానాయుడు బలద్విరోధులై యీతని రాజ్య మాక్రమించుకొనవలయునని యనేక పర్యాయములు దండయా ఈలు సలిపి యన వేమభూ పాలునితోడ ఘోరయుద్ధములు చేసి యోడిం పఁబడుచు వచ్చిరి కాని మనోరథ మీడేర్చుకొన్న వారు కారయిరి, వేమభూపాలుని కీవిజయములతో గీర్తి విస్తరించెను. అన వేనుభూపాలుడు కందుకూరు మొదలుకొని విశాఖపట్టణమండలములోని సింహాచలపర్యంతము గల దేశమును బరిపాలనము చేసెను.*[7].. అన వేమభూ పాలుఁడు తన తండ్రి వహించిన జగనొబ్బగండ డాదిగాఁగల బిరుడములను మాత్రమే గాక వసంత రాయఁడను బిరుద మును గూడ వహించెను. అన వేమభూపతి హేమాద్రి దానాధికుడై దారిద్ర్యవిద్రావణుఁ డై శిబికర్ణదధీచులం బో లేఁ బ్రసిద్ధి గాంచెనఁట. ఇతని దానశాససము లాంధ్ర దేశమునం దంతటను గలవు. గ్రంథవిస్త రభీతిచే వానినిట నుదాహరింప మానుచున్నాఁడను. అనవేమభూపా లుఁడు విద్యాభిమానియనియు, బడిత పక్షపాతియనియు, కవుల పాలలి టి కల్పతరువనియు, చాటు చాటు పద్యముల వలసను శ్లోకములనలనను వేద్య మగుచున్నదిగా నీ యితఁడు గాని యితని యన్న యసపోత రెడ్డిగాని కృ నొందిన గ్రంథము లెవ్వియుఁ గాన కావు.

అనవేమ రెడ్డికి సమకాలికుఁ డైన రేచర్ల అనపో తనాయునికి మను మనమ డయిన అనపోత నాయుఁడు, అన వేమ రెడ్డిని యుద్ధములో సంహరించి పట్టుతలాటాంక బిరుదమును బొందెనని వెలుగోటి వారి వంశ చరిత్రము చెలుపుచున్నది గాని యది విశ్వాసపాత్రముగాదు. వానికి సమకాలికుడైన మొదటి ఆనపోతనాయుఁడు చం పెనన్న విశ్వసింపపచ్చును. లేదా అతని కుమారుఁడు సింగమనాయుఁడు చంపె నన్నను విశ్వసింపవచ్చును. అనవేముఁడు చనిపోయిన ముప్ప దేండ్లకు' వెనుక నున్న రెండవ యసపోతనాయుఁడు చంపెనన్న నంత విశ్వాసపాత్రము గాఁ గనుపట్టదు. మఱియు మఱియొక స్థలమున సింగసమాధ వేంద్రుని మునిమనుమఁ డగు సింగమనాయఁడు. అన వేమరెడ్డిని సంహరించి సిం హతలాటబిరుదము బొందెనని పై వేణుగోటి వారి వంశచరిత్ర మే దెలు పుచున్నది. మొదటిది వాస్తవమా? ఈ రెండవది వా స్తవమా? మొదటి దియు రెండవదియు సత్యములు గావు. అని వేమ రెడ్డి సింగనమాధవేంద్రు నకు సమకాలికుఁడుఁ, సింగనమాధ వేంద్రుని మునిమనుమఁడగు లింగము నాయుఁ 'డెట్లు అన వేముని సంహరించి సింహతలాట బిరుదము నొందెనో యూహింపనలవిగాదు. అన వేను రెడ్డి వెలుగోటి వారివంశ చరిత్రములో పక్కాణింప బడినట్లు అనపోత నాయునివలనఁగాని లింగమనాయుని . వలనఁగాని సంహరింపఁబడె ననుట విశ్వసనీయముగాదని రూఢిగఁ జెప్ప వచ్చును. శృంగార నై షధ కృతిపతియగు మామిడి సింగనామాత్యుని తండ్రి 'పెద్దనామాత్యుం డీయన వేమారెడ్డికి ముఖ్యమంత్రిగ నుండెనని శ్రీ నాథుని శృంగార నైషధములో : : ---

అని నారాతి వసుంధ రారమణ సస్తంగా పహారక్రియా
ఘనసంగం భ విబృంభ మాణ పటుపో: ఖర్జూర ద్వితీయార్జ నుం
డన వేమాధిపు రాజ్యభారణ వ్యాపార దక్షుండు "పే
ద్దన మంత్రీశుడు మామిడన్నన్న సుతుఁదేతన్మాతుండే యెన్నగన్ .

అను పద్యమువలనఁ దేటపడుచున్నది.

ఈయమాత్య శేఖరునకు వీరభద్రామాత్యుఁడ', మారనామా
త్యుఁడు నామామాత్యుఁడునను ప్రసిద్ధులైన మూవురు తమ్ములు వివిధ
కార్యశరణదక్షులై మంత్రులై యన్నకు విధేయులై యొక్కోక్కం
డొక్కక విషయంబునఁబ్రజ్ఞాడ్యులై యుండిరని నైషధములోని !
కిందిపద్యములలో "దెల్ల ము చేయఁబడియెను.

ఉ. 'హేమథరాధ రేంద్రమున కొంతటి పెద్దధృతిక భుజంగమ
స్వామికి మేలు చేయు పటుగా గ్విభవంబున బుద్ధిసంపదల్"
దామరచూలికిన్నరి ప్రధానులు దక్కినవారు సాటీయే
మామిడి వీరభద్రువ కసూత్య శిఖామణికివ్వసుంధరన్"

సత్యవ లో నిరూఢుఁడు నిశాకర భక్తి భావనా
సౌత్యన తేయుఁ డుచ్చట భుజబల విక్ర మ కేళీ విక్రమా
దిత్యుఁడు కావ్యఖడ్గ సముర్ణుఁడు మామిడి మంత్రి మారనా
మాత్యుఁడు వానిఁ బోలవశమా ధరణీధవ మంత్రికోటికిన్ "

"శా. స్వామి ద్రోహర గండలాలను వసు - సుగ్రామ 'గాండీవికిన్
వేమక్ష్మాపతి కావ్య రారకల నిటలా విఖ్యాత ధీశక్తి కిన్ "
నామామాత్యుని కన్యరాజ నిలాతు భ్యాగ్యాక్షర:
స్తోమా పాకకరణ ప్రాణులకు మంత్రుల్సాటియే యెవ్వరున్
.”
ఉ., తమ్ములు దన్ను మువ్వురును దైవముగా గురుగా మహా విభా
సమ్ముగ దాతఁగా దమ మనంబులబుల భావన చేసే కొల్వ భా
గ్యమ్ముల కెల్ల నెల్లయము కాంచం ప్రసిద్ధి గృప ప్రధాన న
త్నమ్మగు మత్రి పెద్దన యుదాత్త మతిన్ రఘురాము కైవడిన్."


అన వేమమహీ పాలుని కాలమునఁ గూడ బాలసరస్వతి యను కవియు, సతని వెనుక ఆలోచనాచార్యుండను కవియు విద్యాధి కారులుగ నుండి శాసనముల లిఖింపుచుండిరి. మఱియు నతనిపరిపాలనమున ప్రకాశ భారతీయోగి యని యింకొక యంధ్ర కవీశ్వరుఁ డుండెనని యన వేముని ద్రాక్షా రామ దేవాలయమున వ్రాయించిన పద్యశాసన కృతులవలన, దెలియవచ్చు చున్నది.

కుమారగిరి వసంతభూపాలుఁడు

.

(శ్రీ. శ 1383 మొదలుకొని శ్రీ. శ 1400 నఱకు)

అన వేమభూపాలుని శాసనములు కీ. శ. 1383 వఱకుఁ గనం బడు చున్నవి. గావున నటుతరువాతనే అనపోత రెడ్డి కుమారుఁడగు క మారగిరి రెడ్డి రాజ్యభారమును సహించెను. ఇతనికి వసంతోత్సవముల యఁదున్న ప్రీతి రాజ్యాంగ వ్యవహారములపట్ల లేదని చెప్పఁదగును. ఇతఁడు తండ్రి తాతల వంటి ప్రజ్ఞావంతుఁడుగఁ గన్పట్ట్యడు. విద్వాంసుఁ డై విద్యా వ్యాసంగములఁ బొద్దుపుచ్చు వాఁడే గాని రాజ్యరతుణమునఁ ప్రమత్తుఁడై కనుమఱింగి యుండెను. కర్ణాట రాజ్యాధీశ్వరుండగు రెండ న హరిహర రాయలు సమకాలికుఁడై యుండెను. కర్ణాటయువ - రాజగు దేవ రాయ లుదయగిరి రాజ్యమున కాధిపత్యము వహించి యుదయగిరి నెల్లూరు దుర్గములలో నుండి రెడ్డి రాజ్యమును గ్రమముగ నాక్రమింప

నభిలషించుచు సమయమునకై నిరీక్షించి యుండెను. రాచకొండ దే వరకొండ దుర్గాధీశులగు పద్మనాయక దొరలును , శూరవరపట్టణాధీశ్వ రులగు రాచవారు. మొదలగువారును తన రాజ్య మాక్రమించుకొన వలయునని ప్రబల ప్రయత్నములు సలుపుచుండఁగా నీకుమారగిరి ప్ర భువు వసంతోత్సవములతోఁ గాలము గడపుచు రాజ్యభారము సంత' యును బంధువును, మంత్రియు, సేనాని యునైన కాటయ వేమా రెడ్డి పై నిడి ప్రమత్తుఁడై యుండెను. కుమారగిరిరెడ్డికిఁ దోఁబుట్టువు పెనిమిటి యైన 'కాటయ వేమా రెడ్డి మిక్కిలి సమర్థుఁడు గావుస గునూరగిరి రెడ్డి భూపాలుని కాలమున రాజ్య మన్యా క్రాంతము గాకుండ సంరక్షింప గలిగెను. కాటవేమా- రెడ్డి కర్ణాటక రాజ్యదీశుల తోడ మైత్రిగలిగి యుండి సంగ్రామధనంజయుడని విఖ్యాతిగాంచి శత్రు రాజుల కు భయం కరుఁడై మంత్రియు సేనానియునై తానే రాజ్య పరిపాలనము సేయు చుండెను. "కాటయ వేముఁడు కుమారగిరి రెడ్డికి ధర్మరాజునకు శ్రీకృష్ణు నీవలె మేనమఱదియు సచివుఁడుఁ జెలియునై యుండి రాజ్యమును సంర క్షించుచున్న వాడగుట చేత నితకి రాజమహేంద్రపురము రాజధాని గాగల తూర్పు దేశమును విడదీసి యిచ్చినట్టు తొత్త రమూడి శాసన ముద్ఘోషించు చున్నది.*[8] కాటయ వేముని భార్య మల్లాంబ తొత్తర మూఁడి శాసనములో నిట్లు తెలుపఁబడి యున్నది.


యవివేకతను దుర్బలత్వమును వేనోళ్ళఁ జాటుచుండెను. ఇదియె కుమా రగిరిరెడ్డి యనంతరము రెడ్డి రాజులలో ముఖ్యముగా పెదకోమటి వేమా రెడ్డికిని 'కాటయ వేమా రెడ్డి ని వివాదములు కలుగుటకును, కోమటి వే మారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజ్యము నాక్రమించుటకును గారణమయ్యెను. తన పూర్వులవలెనె కుమారగిరి రెడ్డికూడ విద్యాభిరతి గలిగి విద్వాంసుల నాదరించి పోషించుట యెగాక తానును విద్వాంసుఁడై సంస్కృత భాష లో వసంత రాజీయ" మను పేరిట నాట్యశాస్త్రమును రచించినట్లు దె లియుచున్నది.

ఇతని మేనమరది కాటయవేముఁడును కాళిదాసకృతనాటక త్రయము నకు (అభిజ్ఞాన శాకుంతలము , మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయ ము) వ్యాఖ్య రచియించెను. ఈవ్యాఖ్యానములోఁ దఱచుగాఁ బలు తావుల వసంత రాజీయమునుండి ప్రమాణవాక్యములు గైకొనఁ బడుచు వచ్చెను. కుమారగిరి రెడ్డికి వసంతరాజనం బేరుగలదు గావునఁ దత్కృ తమైన నాట్యశాస్త్రమునకు వసంత రాజీయ మను పేరుగలిగినది. ఇపు డెచ్చటను దీని పొడ గానరాదు. శాకుంతల వ్యాఖ్యయం డిట్లున్నది.

శ్లో. మునీనాంభరతా దీనాంభోజూ దీనాంద భూభుజూన్
శాస్త్రాణి సన్యు గాలో చ్య నాట్య వేదార్థ వేది నామ్
పోక్తం వసంత రాజేన కుమారగిరి భూభుజా నామ్నా
వసంత రాజీయ నాట్య శాస్త్రయ దుత్త మమ్,

వసంతోత్సవములతోడను, వేశ్యాంగనా నర్తనములతోడను ననవరతము భోగైకపరాయణుండై కుమారగిరినామసూత ప్రభువై సింహాసన మధిష్ఠించియుండియు రాజ్యమును మఱచియుండఁగా మహా సమర్దుం డగు కాటయ వేముఁడు రాజ్యమును నిరాటంకముగా సంర క్షించుచుఁ బరిపాలించుచుండెను.

మాళవికావ్యాఖ్యయం దిట్లున్నది.

శ్లో, భాగ్యం నా మసమగ్ర మీదృశమతి న్నే హైక పౌత్రం యతో
హీం 'కాటయ వేమ ముద్ధత రిపుద్వంసే నే నియుజ్య స్వయమ్

నిత్యం నందివర్వైః రభివవైః కాంతై స్వయంతోత్సవైః
సంతానాభ్యుడయై కుమా: గిరి భూపాలో సృపాలోత్తమం


ఈవసంతభూపాలుని కొల్వుకూటమున లకుమా దేవి యను నొక వేళ్యాంగన సహస్రధా నాట్యాభినయంబుల నెఱపుచు నృత్యము లు సలుపుచు వేలకొలది యర్థిజనంబులకు ధన మొసంగుచుండెని ధని యీ క్రిందిశ్లోకము వలన విదిత మగుచున్నది.


శ్లో, జయతి మహిమాలోకాతీతః కుమారగి ప్రభో
స్పదనీల కుమా దేవీ యస్యప్రియా సదృశీప్రియా
నవమభినయం నాట్యర్ధానాంమోతి సహస్ర ధా
వితరతి బహూనర్దానర్థి ప్రజాయ సహస్రశః

అవచి తిప్పయ సెట్టి

ఆకాలమున వసంతోత్సవములు సలుపు నాంధ్రరాజులలో రెడ్డి రాజులు ముఖ్యులుగవాసి కెక్కియుండిరి. వారిలో కుమారగిరి రెడ్డి విస్తరించి సలుపుటచే నాతనికి వసంత రాజనుబిరుదమును స్థిరమై పోయింది. ఇక్కాలమున వీరమహేశ్వరాచార భ క్తిపరుఁ డే శివసా యుజ్యముఁ బొందివ కంచిచిఱుతొండ నంబివంశమున జనించిన యకచి దేవ సెట్టి కుమారుఁడు తిప్పయ పెట్టి కోటీశ్వరుఁడు కుమారగిరి రెడ్డికి మిత్రుడును, సచివుఁడును సుగంధ భాండాగారాధ్యక్షుడు నై యీప్ర ఖ్యాతవసంత రాయడు సలుపు ప్రతి సంవత్సర వసంతోత్సవములకు కస్తూరీకుంకుమ ఘనసార సంకుమదహిమాంబు కాలాగురుగంధ సారప్రభృతి సుగంధ ద్రవ్యంబు లొడఁగూర్చుచు నెక్కువగా దోడ్పడుచుఁ బ్రఖ్యా తిఁ గాంచినవాఁడు. ఇంతియగాక మఱియు నీతఁడు చీనిసింహళతవాయి హురుమంజిజలనోగి ప్రభృతినా నాద్వీపనగరాకరంబు లగు ధనకనకవస్తు వాహనమాణిక్య గాణిక్యంబులు తెప్పించుచు కొండవీటి సామ్రాజ్యధి పతియగు కుమారగిరిభూపాలునకు మాత్రమెగాక విజయనగర సామా జ్యూధిపతియగు రెండవ హరిహర రాయలకుమ్ము ' భూమనీషుల్తానగు ఫీరోజుషాహకును విక్రయించు చుండెడి వాఁడు. ఇతనిమూలముననే మన కుమారగిరి కీర్తిలతాధిష్ఠి శౌష్టావశద్వీపాంతరాళుం డయినది. ఇట్లగుట చేతనే కుమారగిరి వసంతవృపొలునివన సౌందోలికాఛత్ర చామరతు రంగాది రాజచిహ్నములుంబడసినవాడుట. ఇతడు త్రిపురాంతక దేవ దివ్య శ్రీ పాదపద్మారాధకుఁడై కవినై గమిక నాదీ వాంశిక వై తాళి కాదు లగు స్ఫజనంబులకు సర్ధంబులు గుప్పించుధీరుండు, నుదారుండు, గంభీ రుండు, సదాచారుండు నన విఖ్యాతి గాంచినవాఁడట. ఇతని పితృపితా మహులు, మాతామహులుగూడ నిఖిలలోక ప్రసిద్ధ వాణిజ్య వంశధరుఁ లుగాఁ బ్రసిద్ధి గాంచిన వారేయట. అనచితిప్పయ స్థిరముగాఁ గొండవీట నిల్లుగట్టుకొని కాపురము చేయుచుండ వాడు గాఁడు. వసంతోత్సవ సమయములయందు ప్రతిసంవత్సరముఁ గొండవీటికి విచ్చేసి సుగంధిశాలను దెఱచి దానికధ్యక్షుడై వసంతభూ పాలునకుఁ గావలసిన సుగంధి ద్రవ్యంబు లోనగూర్చుచుండెడివాడు.

బాలకని శ్రీనాధునితోడిమైత్రి

చిన్నాఱి పోన్నాఱి చిఱుతకూకఁనాడనఁగాఁ బదునాలు గేండ్ల ప్రాయముననే య ప్రతిమాన ప్రతిభాశాలియై కవితావిద్య నలవఱుచుకొని, 'మరుత్తరాట్చరిత్రమును' రచించి కొండవీడున నొకింత పేరుమోసి క్రీ. శ. 1364 దవ సంవత్సర ప్రాంతమున వసంతభూపాలుఁడుచేయు వసంతోత్సవ సందర్భమున లక్ష్మీపుత్రుడయిన యవచి' తిప్పయ సెట్టి విద్వద్గోష్ఠి నున్న కాలమునఁ గవిపండిత బృందమునకుమ శారదా' విగ్రహముంబోలి కూరుచుండి యర్గళకవితాధారణ బ్రవహింపఁ జేయు చున్న 'బాలకవిని శ్రీనాథు గన్నుల గఱవుదీఱంగఁజూచు భాగ్యమా తనికి లభించి పరమానందభరితుఁడై యసత్కారములఁ బూజించెను. నాటి నుండి తిప్పయ సెట్టికీ బాలనఖు డుగనుండెను. కుమారగిరి రెడ్డి పరిపాల నముతో వసంతోత్సవములు ముగిసిపోయినవి. అన చితిప్పయ సెట్టికొండవీడు. నకువిచ్చేయు భాగ్యము దొలఁగిపోయినది. కుమారగిరి రెడ్డి పరిపాలనము ముగి యువఱకు శ్రీనాథునకు నిరువ దేండ్లకు మించిన ప్రాయము లేదు. పెద్ద కోమటి మరణానంతరము శ్రీనాధుఁడు కాంచీనగరమునకుఁబోయి అప్ప య సెట్టీని సందర్శించినప్పుడు 'బాలసఖుం' డని ప్రశంసించుట యెంత స్వాభావికముగా సమంజసముగాఁ గన్పట్టుచున్నదో వేఱగ నొక్కి వ క్కాణింపనలయునా? కొదువవిషయములు హరవిలాసక రచనా ప్రశంస సందర్భమున విస్తరింపఁ దలఁచి యిచ్చట విరమించుచున్నాను,

శ్రీనాథకవికిఁ గొండవీ డెస్పటినుండి నివాసముగనుండి యుండెనో చెప్పుటకుఁ గాని యూహించుటకుఁగాని యాధార మేమియుఁగాన రాదు. అవచితిప్పయ సెట్టివలెనె ప్రతిసంనత్సర వసంతోత్సవములకు వచ్చుచుఁ బోవుచుండెడి వాడని ప్రభాకర శాస్త్రి గారూహించిన దాని కాధారమేమియు వారు చూపింపరయిరి, పదునై దేండ్ల ప్రాయనుననే శ్రీనాథును;

చ. అవనిపుడాదరించిన భటాళి భటత్వము వైద్యు వైద్యమున్
గవికవితామహాత్వమును గాయకు గానముఁ గోటి సేయున
య్యవలపు గాదరింపని భటాళి భటత్వము వైద్యు వైద్యము
గవిక వితామహత్త్వమును గాయనీ గానము గవ్వ సేయు నే,

అన్నట్టును, రాజాశ్రయము లేక యశోధనములు సమకూఱ నేర పని యాకాలమునఁ "బెనుపుగల్గి రాజ్య మేలుచున్న స్వదేశ ప్రభువులగు 'రెడ్ల ప్రొఫునకై యప్పుడు రాజధానిగా నున్న కొండవీడుచేరి రెడ్లమం త్రులును గార్యనిర్వాహకులు నగు నియోగి ప్రమఖుల యాదర గౌరవ ములు వడయఁజొచ్చి తర్వాత రెడ్లయాస్థానమున విద్వత్కవి యయ్యెనని ప్రభాకరశాస్త్రి గారు వ్రాయుట, పిచ్చ కుదిరినది రోకలి తలకుఁ జట్టు మన్నట్టున్నది. శ్రీనాధుని జన్మకాలము 1385 అని మామిత్రు లగు. శాస్త్రీగారు నిర్ధారణ చేసియున్నారు. పదునై దేండ్ల ప్రాయమున,అనగా 1400 సంవత్సరమున శ్రీనాథుఁడు . రాజాశ్రయముకోఱకు కొండ వీడు చేరె ననుచున్నారు. ఈ సంవత్సరముతో కుమారగిరి రెడ్డి పరిపొ లన మించుమించుగాఁ దుదమట్టినదని , నక్కాణింపవచ్చును. ఇంకొక విచిత్రమైన వ్రాత వ్రాసిరి. " కాటయ వేమన క్రీ. శ. 1398 ( పొంతముల రాజమహేంద్రవరము చేరినాఁడు. విద్యారసికుఁడగు కాటయ వేమన నా కాలమం దీతఁడు దర్శించియుండవచ్చును. సకలవిద్యాసనా థుఁ డగుచున్న యీ ప్రతిభాశాలి నాతఁ డాదరించియు నుండవచ్చును" అని వ్రాసియున్నారు. అనగా శ్రీనాథుఁడు 1398 దవ సంవత్సర కాటయవేముని రాజమహేంద్రవరములో సందర్శించెననియు నంతకుఁ బూర్వము సందర్శించి యుండ లేదని వారి భామని స్పష్టపడుచున్నది గనుక 1400 వఱకు గొడవీడుకు చేరలే దనుటగూడ వారియభి ప్రాయ మైనట్టు స్పష్టమగుచున్నది. మఱియుఁదనకుఁ జేసిన మేలును, చూపిన యాదరణ గౌరవములను నవసానకాలమునఁ గూడ మఱపింపఁ జేయక స్మరింపఁ జేయునట్టి తన మిత్రులను ప్రభుపుంగవుల నొక్కొక్కరినే తలంచుకొని శ్రీ నాథుఁడు చెప్పినాఁ డన్న పద్యములో “భాస్కరుఁడు మున్నే దేవుని పాలికరిగె నన్న పాదములో ప్రశంసింపఁబడిన భాస్కరుడు కాటయ వేమునిమంత్రియగు రాయని భాస్కరుఁడే యనియు నతఁడు శ్రీనాథున కాలంబముగా నుం డె ననియు,


చ. కలయఁ బసిండి గంటమున గాటయ వేమ సమక్షమందు స
త్ఫలముగ రాయస ప్రభుని బాచుఁడు వ్రాసిన వ్రాల మోతలున్
గణంగలు గల్లు గల్లురనగ గంటకషరంగ్రుల గుండెలన్నియున్
జలు జల జల్లు జిల్లురను సత్కవీ వర్యులు మేలు మేలనన్".


అను చాటువు రాయని భాస్కరుని పై శ్రీనాథుఁడు చెప్పినదేయని మా మిత్రులగు శాస్త్రులవారు వ్రాయుచున్నారు.కాటయ వేమా రెడ్డి వంటి విద్వత్ప్రభువును, రాయని భాస్కరునివంటి విద్వన్మంత్రిని రాజమహేం దవరమున విడిచి పెట్టి రాజాశ్రయమున కై , నియోగి ప్రముఖుల యాద రణ గౌరవములఁ బడయుటకై యెక్కడనో దూరమున నున్న కొండ వీటికిఁ గుమారగిరి రెడ్డి పాలనము క్రుంగిపోయిన కాలమున, అవచితిప్ప య సెట్టి కొండవీకును వీడి వెడలిపోయిన కాలమున నేల కొండవీటికి బోవలసిన వాడయ్యెనో యూశ్చర్యకరముగా నున్నది. వింతలలో వింత మఱియొక్క వింత. "కాటయవేమన కొండవీట నున్న కాలముననే, కొమరగిరి జీవించి యుండఁగనే శ్రీనాథకవిరత్నము కొండవీటికి వచ్చుచు బోవుచునుండి యుండునని నాతలంపు,” అని చదువరులకుఁ గాని చరిత్ర పరిశోధకులకుఁ గాని యెట్టి సంశయము పుట్టకుండ వలయునని యింకొక మాఱు విస్పష్ట పఱచిరి. “దీని భావమేమి తిరుమలేశ" అని ప్రశ్నింప వలసి వచ్చు చున్నది. పదునాలు గేండ్ల వయస్సునకుఁ బూ ర్వమే మరుత్త రాట్చరిత్రము రచించి ప్రఖ్యాతి గాంచుటకుఁ బూర్వమే, మిక్కిలి బాలుఁడుగ నున్న శ్రీనాథ కవిరత్నము కుమారగిరి సలుపు వసంతోత్సవముల సందర్శించుటకై కొండవీటికి వచ్చుచుఁ బోవుచు నున్న వాఁడయినను కాటయ వేమనను గాని వాని మంత్రియగు రాయని భాస్కరునిగాని సందర్శించు భాగ్యము పట్ట లేదని యు, అట్టి భాగ్యము 1398 వ సంవత్సర ప్రాంతముల రాజమహేంద్ర పురమున నాకవిరత్నమునకు లభించినదని మనము గ్రహింపవలయును. పదునై దేండ్లు నిండిన వెనుక పెన్నిధులవంటి వారయిన కోటయవేమా 'రెడ్డి, రాయనభాస్కరుల: ప్రొపును విడనాడుకొని కుమారగిరి ప్రభుత్వ మంతమునొంది కొండవీడు రాజ్యము కల్లోలమై పెదకోమటి వేమారెడ్డి యాకల్లోలములో రాజ్యమాక్రమించుకొనఁబోవు కాలమున శ్రీ నాథకవి రత్నము. రెడ్ల ప్రాఫునకై కోండవీడుచేరెనట! ఎంతచమత్కారమైన విమర్శ ! మామిత్రులు తమ గ్రంథమునకు 'నేతిబీర ' వంటిదని తమకు తామే చెప్పికొన్న 'శృంగార శ్రీనాథ ' మను పేరు పెట్టుటకంటే “చమత్కార ప్రభాకర ' మాను పేరు పెట్టియుండిన నెంతయు నొప్పియుండునుగదా. ఆహా! హరవిలాసములోని 'బాలసఖుం' డను శ్రీనాథుని పద ప్రయోగ మెట్టెట్టి మేధావంతులనయినను 'టెంకాయపిచ్చికుండ' లని పిలచు చున్న దే!


శాలివాహన సప్తశతి.

నేలవిడిచి సాము చేయుటవలనఁ బ్రయోజనము లేదు. 'బాల్యమున శ్రీనాథుఁకు కొండవీడుననే యుండెను. ఆకాలముననే కాటయ వేమా రెడ్డి మంత్రియగు రాయని బాచని పాపున వర్ధిల్లుచుఁ బదునాలు గేండ్ల ప్రాయమువాఁడయియుండగా నవచితిప్పయ సెట్టితోడిమైత్రి ప్రారంభమై యైదాఱుసంవత్సరముల బాటు నడిచెను. కుమారగిరి చేయు వసంతో త్సవములును, తిప్పయ పెట్టి వసంతోత్సముల యందు దనకవితాప్రజ్ఞ ప్రదర్శనమునకు మెచ్చి తనకుఁజేయు సత్కారములును శ్రీనాథకవి భావి జీవితమునకు నొకవింతశోభను గలిగించినవి.


ఈ వసంతోత్సవములే యీకుమారగిరి జీవిత మేమన 'బాలకవి శ్రీనాథుని శాలివాహన సప్త శతి' యను రసోత్తరశృంగార ప్రబంధము ను నాంధ్రీక రింపఁబురికొల్పినది. ఈగ్రంధము ప్రాకృతభాషలో 'హాలు డకు నొక యాంధ్ర రాజుచే వ్రాయబడినది. దీనికి 'గాథాసప్తశతి యని నామాంతరముగలదు. ఇందు 200 గాథలు గలవు. భావపూరిత ములయిన చిన్న పద్యములతో గూడియున్నది. ఇందులోకవృత్తమను దెలుపు గాథలు కొన్ని యున్నను వివిధ రీతుల జమత్కరించి వివరించెడి వివిధనాయికా నాయకాదుల శృంగార వృత్తులను దెలిపెడి గాధల నేకము లందున్నవి. అయ్యవి కథావస్తు సూత్రైతములుగావు. అందుశృంగార రసము పొర్లి పోవుచుండుననుటకు లేశమాత్రమునుసందియము లేదు. మన శ్రీనాథుఁడు నూనూగు మీసాల నూత్న యావనమున 'శాలివాహన సప్త శతినొడివితి' ననియీగ్రంథమును రచించినట్లు చెప్పుకొనియున్నాడు కసుక 'నీగ్రంధమును బదునెనిమి దేండ్ల ప్రాయమున రచించినాడని మనమునిశ్చయింపవచ్చును. కాని యీగ్రంథ మెవ్వని కంకితమియఁబడి నదో తెలిసికొందమన్న నాగ్రంధ మిప్పుడెచ్చటను గానరాదు. శ్రీనాథునిసప్త శతిలోని యీ క్రింది పద్యము మాత్రమ నేక లక్షణ గ్రంథములలో నుదహరింపఁబడియున్నది.


ఉ. నారణ సేయ దాపన నాశవవారిజమందుఁ దేటిక్రొ
వ్వారుచుకుంటనీ వెఱుగఁవా ప్రియహా తెఱగంటి గంటి కె
వ్వాకిగెలుపు గాదు తగవాదుగ వారల దూఱ నీవిభు
డారసి నీ నిజం బెఱుగు నంతకు వంతను నోర్వు నెచ్చెలీ!


ఇట్టియపరూప మధురకావ్యరచనచే బదునెనిమి దేండ్ల ప్రాయము ననే యీతని కీర్తి దశదిశలవ్యాపించి దేశ దేశములకుబ్రాక నారంభించి నది. ఎండ రెందరో మహా రాజుల యొక్కయు, ఎందఱెందరో మంత్రి పుంగవులయొక్కయు జిత్తముల నాకర్షింపఁగలిగినంతటి ప్రజ్ఞాధురంధ రుఁడయ్యెను. మనశ్రీనాధకవి పుంగవుఁడు.

ఆర్యాధ్య చరిత్రము --- ప్రెగడనామాత్యుఁడు

శ్రీనాధకవి శాలివాహనసప్తశతికి వెనుక నారాథ్యచరితము మొదలగు పెక్కు కృతులను రచించి ప్రెగడనామాత్యుని కంకితము చేసి యున్నట్టుగా శృంగారనైషథములోనిఁ జగమునుతింపఁగఁ జెప్పితి, యను పథ్యమువలనఁ దెలియుచున్నదని యాపద్యము నిదివఱకె యుదాహ రించినాఁడను. ఈ ప్రెగడనామాత్యుఁ డెవ్వఁడు. ఇతఁడు శృంగార నైష ధకృతి పతియగు సింగనామాత్యుని యన్నయని యిదినఱ కెఱిఁగితిమి, ఇతఁడేయుద్యోగమునందుండెనో యావివరముగూడ నాగ్రంథముననీ క్రింది పద్యములో సూచింప బడినది.

 మ. తగుఁ గైవార మొనర్ప విక్రయకళాదౌరేయతాసాలిశ్రీ శాలిశ్రీ
ప్రెగడన్న ధ్వజినీశుఁడం బునిధి గంభీరుడు శుంభద్ద్విష
న్నగర ద్వారకవాటనవిధాన ప్రౌడ బాహార్గళా
యుగళుం డాహవ సవ్యసాచి ధరలో నొక్కండు. పేరుక్కున న్.

,

అనిపరాక్రమవంతుఁడు, గంభీరుడు, శత్రు పుర భేద కుఁడు.. 'యు ద్దదక్షుడు, బలము విషయములోఁబొగడనర్హుఁడైనవాడు, డండనాధుఁడి తఁడొక్కఁడేయని చెప్పియున్నాడు. అనవేమాధిప రాజ్య భరభరణ వ్యాపార దక్షుఁడయిన పెద్దనామాత్యుని మూవురు పుత్రులయిన వేమ నామాత్యుఁడు ప్రెగడనామాత్యుఁడు, సింగనామాత్యుడునను వారిలో నీతఁడు రెండవవాఁడు. వీని తడ్రియు బినతండులు నన వేముని కాలము వారు గనుక నీతఁడు కొండవీటి సామ్రాజ్యమును బరి పాలించు నన వేముని యన్న కుమారుఁడగు కుమారగిరి రెడ్డి పరిపాలన కాలమున నాసా మ్రాజ్యమున నొకదండనాధుఁడుగ నుండెనని మనము స్పష్టముగాఁ జెప్ప వచ్చును. మరియుఁ గుమారగిరి రెడ్డి తరువాత నాసామ్రాజ్య పరిపాలన మువహించిన పెదకోమటి వేమారెడ్డి పరిపాలనారంభ దశయందు గూ డ దండనాధుఁడుగ నుండి యాకాలము ననే జగిన నే యుద్ధములోనో వీరమ రణమునొందియుండవచ్చును. ఈ ప్రెగడనామాత్యుని ప్రే రేపణముచేత నే మన శ్రీనాథకవి శాలివాహనసప్త శతి' యను రసోత్తర శృంగారప్ర బంధమును రచించియుండును. అయ్య దికుమారగిరి రెడ్డికో, లేక యీపై గడనామాత్యునికో యంకితముగావించి యుండవలయునని యూహిం చుటక వకాశముగలదు. ఎట్లయిన నాగ్రంధము ప్రెగడ నామాత్యుని, పెదకోమటి వేమా రెడ్డిని నాకర్షించినదని చెప్పక తప్పదు. ఎందువల్లన నఁగాఁ "బెదకోమటి వేమారెడ్డి క్రీ. శ.1404 వ సంవత్సరమున నీతనిఁద న సామాజ్యమున విద్యాధికారిగా నియమించెను. శ్రీనాధ విరచితము లైన యారాధ్య చరిత్రమాదిగాఁ బెక్కుకృతులను ప్రెగడ నామాత్యు డంకితమునొందెను. ఇంతియగాక పెదకోమటి వేమా రెడ్డి హాలవిరచిత మైన సప్త శతి యేడునూర్ల గాధలలోను మిక్కిలిసారములయిన వాని నూరుగాధల నేఱి వ్యాఖ్య వ్రాసి సప్త శతీసారటీక వెల్వఱచి యున్నాడు. ఆవ్యాఖ్య ప్రారంభమున: ---


 శ్లో, హాలః ప్రోక్ సప్త సతీం గాధా కోటేర్వధత్త సంప్రతితు
సాయం వేమ నృపాలస్తస్వ అపిశతక మహరత్సారం

12 దీనిగద్యములో నిట్లున్నది

"ఇతి శ్రీ పెదకోమటి వేమభూపాలేన కృతా సప్తశతీ సారటీకా సామాప్తాః"

దీనింబట్టి ప్రభాకరశాస్త్రి గారు సంశయించినట్లు (బహుశః) శ్రీ నాథుఁడు తన సప్తశతిని నాతనికంకితము చేసి యుండవచ్చునని మఱికొం దఱకుఁగూడ దోపవచ్చును. నాయూహ మఱియొక విధముగాఁ బాఱు చున్నది. రసవత్తరమైన శృంగార ప్రబంధమునంకితముఁబొందిన ప్రభు వేవ్వరైనననేమి! అతఁడు తద్గ్రంధరచనమునకుఁ బిమ్మట రాజ్యసంబంధ మునఁ గలిగిన విహాదములలోఁ బేదకోమటి వేమూ రెడ్డికి బ్రతిపక్ష నా యకకోటిలోఁ జేరినవాడగుట చేతనే పెదకోమటి వేమా రెడ్డి వానివలని స్పర్ధచే సప్తశతీ సారటీకను వ్రాయసంకల్పించి యుండుననియు, ప్రెగడ నామాత్యుని ప్రేరేపణము చేసీ కార్యమునందు శ్రీనాథకవి యాతనికి దోడ్పడియాతని మనోరధ మిడేర్చినవాడయి యుండుటచేత నత్యంతాభిమాన ముతోఁ బెదకోమటి వేమారెడ్డి కొండవీటి సామ్రాజ్యాధిపత్యము తనకు స్థిరపడిన తరువాత 1404 లో నమ్మహాకవిని దన సామ్రాజ్యమున విద్యాధికారిగా నియమించి యుండునని నేను విశ్వసించుచున్నాను. విశ్వేశ్వరపండితుఁ డాదిగా గలమహోద్దండ పండితులుండిన యాకాలమున సామాన్యముగా నిరువది నాలు గేండ్ల ప్రాయమువాని నామహా పదవియం దుంచుట సంభవింపదని నాయభి ప్రాయము. ఏ కారణము చేత నైన నేమి తొలుదొల్త విశేషాభిమానముతోడఁ దగ్గిరకుఁ జేర్చుకొని, తనకొల్వు నువిడిచి పెట్టి మరల పోకుండ నట్లాతని మహోన్నత స్థానమునఁగూరు చుండఁ బెట్టు నదృష్ట మాకాలముననొక్క. వేమారెడ్డికి మాత్రమే పట్టినది.

కుమాగిరి రెడ్డి రాజ్యావసానస్థితి.

కుమారగిరి రెడ్డికి వీరాన్నపోత రెడ్డి యను కుమారుఁడున్నట్లు దొజ్" రామమునందలి -మేక శిథిల శాసనములో ' శ్రీమశ్కు కూరగిరి


భూమిపతే! కుమారో వీరాన్న పోతన్మపతిః' అన్న వాఖ్యము మాత్రము గన్పట్టుచున్నందున వీరుఁడైన యనపోత రెడ్డి యను కుమారుఁడున్నటులు గన్పట్టుచున్నది. కుమారగిరి రెడ్డి మరణానంతరము వీరి కుమారుఁ డైన యనపోత రెడ్డి రాజ్యమును బొంద వలసినవాడై యుండఁగా బెదకోమటి వేమూ రెడ్డి రాజ్యమాక్రమించుకొని పరిపాలనము చేసినట్లు గానంబడుచున్నది. వీరాన్న పోతనృపతి:, అనుటచేత నితఁడు కేవలము బాలుఁడుగా నుండువాడు గాక వీరుడనియు, నృపతియనియు, బ్రస్తావిం పఁబడియున్నాఁడు. కావున నితఁడే మొదట రాజ్యమును బొందియుండును. కాని సామ్రాజ్య మీతనికి నిలిచియుండ లేదు. రాజ్యము పెదకోమటి వేమారెడ్డి పాలయ్యెను. ఇతఁడు బలాత్కారముగా రాజ్యమాక్ర మీంచుకొనుటకుఁ దగిన హేతువు గాన రాదు. కుమారాన్న పోత రెడ్డి యెవరితోడనై న యుద్దములోనో మరణముఁ జెంది యుండవలయును. అట్టియుద్దము రాచకొండ రాజ్యుధీశులగు పద్మనాయక వెలమదొరల తోడ ధరణి కోట సమిపమున జరిగి యుండ వలయును. ఆయుద్ధములో గుమా రాన్న పోత రెడ్డి మృతినొందఁగాఁ గొండవీటి రాజ్యము కాటయవేమారెడ్జి యూక్రమించునేమో యన్న భయముచేత ప్రోలయ వేమూరెడ్డి యన్న యగు మాచారెడ్డి మనుషుఁడు పెదకోమటి వేమా రెడ్డి, దండనాయ కులును, నియోగి ప్రముఖులున్న మామిడి వేమనానూత్యుఁడు, పెగ డనామాత్యుఁడు, సింగనామాత్యుడు మొదలగువారి తోడ్పాటున నాక్రమించుకొని యుండును.ఏతత్కారణము మూలమునఁ గాటయ వేమారెడ్డి రాజమహేంద్రపుర రాజ్యమును స్వతంత్ర రాజ్యముగా బ్రకటించి యుండును. ఈ రాజ్యమును కుమారగిరి రెడ్డి తనకిచ్చినవాడని చెప్పిన విషయ మప్పటి నుండి చెప్పుకోనుట తటస్థమగుటచేత కాటయ వేమా రెడ్డి భార్య మల్లాంబ తొత్త రమూడి శాసనమున నట్లు వ్రాయించి యుం డును. 'రాజమహేంద్రపురము గోండవీటి, సామ్రాజ్యములోనిదే గనుక

రాజమహేంద్రపుర రాజ్యమునకుఁ గూడఁ దానే హక్కు దారుఁడనని పెద కోమటి వేమా రెడ్డి ప్రకటించియుండును. ఏతత్కారణమువల బెదకోమటి వేమూ రెడ్డికిని, కాటయ వేమా రెడ్డికిని మనస్పర్ధలు పుట్టియుండును. కాటయవేమారెడ్డి పక్షమున నన వేమారెడ్డి మనుమరాలి పెనిమిటియైన అల్లాడ రెడ్డి రాజమహేంద్రపుర పాలకుడుగా నుండి కాటయ వేమారెడ్డి పక్షమననుండి రాజమహేంద్రపురము పెదకోమటి వేమా రెడ్డికి స్వాధీ నముగాకుండఁ జేసెను. "కానీ కుమారగిరి రెడ్డి కొడుకయిన యనపోత రెడ్డిని జంసి 'పెదకోమటి వేనూ రెడ్డి యన్యాయముగాఁ గొండవీటి సామ్రాజ్య మాక్ర మించి నాడని నేనూహింపజాలను, ఏమయిననగుఁగాక కొండవీటిసామాజ్యము కుమారగిరి మరణముతో 'రెండుగాఁజీలిపోయినదనుట వాస్తవము. కాటయ వేమా రెడ్డియుఁ బెదకోమటి వేమా రెడ్డియు గూడ సమర్థులును, విద్వాంసులును, బలనంతులు నై యుండుటచేత రెండు రాజ్యములును మఱి కొంతకాలము స్థిరపడియుండుట కవకాశము గలిగినది.పెదకోమటి వేమా రెడ్డి రాజ్యపరిపాలన ప్రారంభకాలమున నాతనికి గొన్ని చిక్కులు గలిగియున్నట్టుగా నీ క్రింది చాటువువలన గూడ నూహింపఁదగును.


సీ. ఆ చెలపనుద్దండ (P) అన వేమ పురమను
గ్రామంబు తోరణకట్టిరేని
ధరణీకోటనుగల్గు ధన ధాన్య వస్తువు
లరికట్టుకొని చూఱలాడిరేని
మునుకొనీ యభిమాన ముద్ద భక్షింపుగ
సారెకుఁ జేతులు సాచి లేని
అభ్యంగనము సేయు నన్న గారికిఁ దెచ్చు
మానెలో జేతులు మాటి రేని

కణగి శత్రులు చేయుసఖాత్యమునకు
నోర్చియుంటివి నీ సొటియుర్విగలఁడే
సమదరపు వీర ! రాయ వేశ్యా భుజంగ!
అతులబలభీమ! " పెదకోమటన్న వేమ

ఈపద్యమున కర్ణ సందర్భము సరిగా నూహింపనలవిగాక యున్నది. ఎన్వియో కొన్ని చిక్కులు గలిగినవని మాత్రము సూచించును. పెదకోమటి వేమభూపాలుఁడు 1400 మొనలు 1420 వఱుకు), ఇతఁడు పూర్వ రాజ మార్గానుసారముగా భూపాలనము గావించి తన జీవిత కాలమునంతయు విద్వద్గోషుతోడఁ గడపి చిరయశము సంపాదింప సంకల్పించుకొని కొండవీటి సామ్రాజ్యమున శాంతి ప్రబలి యుండుట కై మూఁడు సంవత్సరములు తన శక్తియుక్తులను దారపోసి సమర్థుఁడై ప్రజ్ఞావంతుఁడై , భూరిపరాక్రమమున వైరివీరుల ఘోరసం గ్రామముల నోడించి వీరనారాయణ బిరుదాంచితుఁ డై సఫలీకృతమనో రథుఁ డయ్యెనని చెప్పవచ్చును. ఆకాలమున నీతని పరాక్రమధాటి యెట్లుండెనో యీక్రింది శ్రీనాథుని చాటువువలన సువ్య క్తము కాగలదు.

 సీ. కపట కంఠీరవాకార సారాయణ
క్ష్మేళానినాదంబుఁ గేలి సేయు
కల్పాంత దుర్గాంత కాల భైరవ భేరి
ఢమరుకోన్మాదం బడంగఁజేయు
ప్రళయ కాలాభీల పటుఘోర నిర్ఘాత
పటపటారావంబుఁ జటులవ పఱచు
కహనా మహాకాల కోలాహలో త్తాల
పాతాళ నినధంబు భంగపఱచు

గీ. గండు మెఱన రిపుకోటి గుండెలవియ
దండగతి మోయు నీర ణోద్దండ భేరి
జయా రనూ సంగ రాజ వేశ్యా భుజంగా
అతుల బలధామ! పెదకోమటన్న వేమ ! "

పెదకోమటి వేముని విద్యావైభవము.

పెదకోమటి వేముఁడు పౌల్యమునుండియు సంస్కృతాంధముల విశేషముగాఁ గృషిచేసి , యసారమైన .పాండిత్యమును గూడ, సంపా

దించినవాఁడుగావున నప్రతిమాసప్రతిభాడ్యుడై శ్రీనాథుని నన్యనృప తుల పాలిక రగకుండఁ జేసి తనకడ నుంచుకొని యనుదినము నఖిల పురాణవిద్యాగమముల నతవివలస వినుచు "దేశము శాంతి నెలకొల్పన పిమ్మట యార్యవిద్యలం బోత్సహించి వర్దిల్లఁ జేయుటకై 1404 గవ సంవత్సరమున నాతని విద్యాధి కారిపదవి ముందుంచెను. ఈకాలము శ్రీనాధుని యుచ్చదశకుఁ బ్రారంభమని చెప్పఁదగును.

ఈసంవత్సరమున 'బెదకోమటి వేముఁడు చేసిన దానముల ను గూర్చి చేసిన శాసనములు గొన్ని గన్పట్టుచున్నవి. వానిలో మొదటిది కుఱునూతుల శిలాశాసనము. దీనిలో నెఱు పురీ దాశరధికి కుఱు నూతుల .గ్రామమును దానము చేసినట్లు చెప్పఁబడినదిగాని యందు శ్రీనాథుని పేరు గాన రాదు[9]* ఈశాసనమునాటికి శ్రీనాథుఁడు విద్యాధి కారిపదవిని బొందియుండ లేదు. రెండవది పొన్నుపల్లి తామ్రశాసనము , ఈశాసనము చివర శ్లోక మిట్లున్నది.

 * విద్వాధి కారీ శ్రీనాథో వీర శ్రీ వేమభూపతేః
ఆక గోదాకరోవాచాం నిర్మలం ధర్మశాసనం. "

అని యుండుటచేత 1404 వత్సరమునుండి విద్యాధికారిగ నుండె ననుట స్పష్టము. శ్రీనాథుని ప్రతిభాప్రఖ్యాతికి బెదకోమటి వేముని విద్యారసికత తోడ్పడి యుభయుల యశస్సును నాంధ్ర ప్రపంచమునం దంతటను వ్యాపించునట్లు చేసినది. విద్యాధి కారపదవి సొమాన్యమైనది కాదు. రాజసందర్శనార్దము శ్రౌతులు, "వేదవిదులు, షట్తర్కముల


నెఱింగిన వారు, నాయుర్వేద మభ్యసించినవారు, దైవజ్ఞశిఖామణులు, వైయాకరణులు మొదలగువారెందరో సత్కారములం బడయ వచ్చుచుందురు. వారి యర్హతానర్హతల నిర్థారించుట కాయాపండిత ప్రకాండులతోడ సంభాషించినంగాని దేటపడునది కాదు. అట్లు సంభా షించుట కాయా విద్యలయందుఁ బావేశము గల వారికి మాత్రము సాధ్య మగునుగాని తదితరులకు సాధ్యముకాదు.


అట్టి సామర్థ్యము , ప్రతిభ, యోగ్యత శ్రీనాథునియందుఁ గల వను విశ్వాసముతోనే వయస్సునఁ చిన్న వాఁడని యెఱింగి యుండియు? బ్రభువు వానినే యమహోత్సవపదవి నధిష్ఠింపఁ జేసెను.. కనుకనే శ్రీనాథుఁడు గడు సామర్థ్యముతో నాపదవీ నిర్వహించి యావిద్యా పీఠ మున కధిక గౌరవము గలుగఁజేసి చిరకీర్తిని గడింపఁ గలిగెను. భీమే శ్వరపురాణకృతి పతియగు బెండపూడి అన్నమాత్యుఁడు;---


భాషించినాఁడవు బహుదేశ బుధులతో
విద్యాపరీక్షణ వేళలందు
వెదచల్లి నాఁడవు విశదకీర్తి స్ఫూర్తిన్
కర్పూరములు దిశాంగణములందు.”

అని తన్ను గూర్చి ప్రశంసించినట్లుగా శ్రీనాథుఁడు తన గ గ్రంథము జెప్పుకొనఁ గలుగుట సంభవించినది.

సర్వజ్ఞ చక్రవర్తి.

పెదకోమటి 'వేమభూపాలునీ యాస్థానంబుస సకలవిద్యాస నాధుఁడైన శ్రీనాథుఁడు విద్యాధికారి పదవియందును, అభినవ భట్ట బాణ బిరుదాంచితుఁడగు వామన భట్టాస్థాన కవిపదవియందును, ప్ర తాపగుణ భూషణుండును, పరిణ తీర్థ సంభాషణుండును, వితీర్ణ మహి మార్ణవుండును, విభపయోగ సంక్రందనుండును, పంచాగ స్థిరమంత రమణ కళాప్రౌడుండును, యవనాధీశ సభానిరంకుశ వచో వ్యాపార మునం పారంగతుండును, మహాస్యా సామ్రాజ్య రక్షామణియు నగు సింగనామా త్యుఁడు ప్రధానమంత్రిత్వ పదవియందును, సున్న వారని తెలిసికొన్న ప్పుడు పెదకోమటి వేమభూపాలుఁడు మహాపండితుఁడు. మహారసికుఁ డునై యుండునని తెలిసికొనక మానము. అందుచేతనే కాఁబోలు పెద కోమటి వేమభూపాలునకు శ్రీనాథునివంటి విద్వాంసులచే 'సర్వజ్ఞ చక్ర వర్తి' యను బిరుద మీయఁబడినది. అభినవ భట్ట బాణ బిరుదాంచితుఁ డగు వామనభట్టుకూడ 'తానురచించిన వీర నారాయణ చరిత్రమను నా మాంతర ముగల వేమభూపాల చరిత్రమును. సంస్కత కావ్యమున బెదకోమటి వేమభూపాలుని 'సర్వజ్ఞ చక్రనర్తి'యని ప్రశంసించినాఁడు. శ్రీనాథుని శాసనకృతులందుఁగూడ.

 " చూడామణిగ్నృపాణాం
దుర్మద పుపంది శిఖదంభోళి?
సర్వజ్ఞ చక్రవర్తి
పెదకోమటి వేమభూపతి ర్జయతి.”

అని పేర్కొనబడి యుండుటయు నిందుకుఁ బ్రమాణములుగఁ జూప వచ్చును.

శృంగార దీపిక.

సప్తశతీసారటీక గాక 'శృంగారదీపిక' యను పేరిట శృంగార కావ్య మగు (సమరుశతకమునకు నొక జగత్ప్రసిద్ధమైన వ్యాఖ్య రచియిం చెసు. ఎన్ని వాఖ్యలు విరచింపఁబడినను, వానికంటెను వీని వ్యాఖ్య కే ప్రచార మెక్కువగాఁగలదు. ఇయ్యది విస్తరింపఁబడి చక్కగా వ్రాయఁబడినది. శ్రీనాథకవి ప్రణీతమైన ఫిరంగిపుర శాసనకృతిలోని రెండు శ్లోక ములు శృంగారదీపిక యందుండుటచేతను, శృంగార దీపికలోని మఱి యేకశ్లోకము శ్రీనాథకవి ప్రణీతమైన పొన్ను పల్లి శాసన కృతియందుం డుటచేతను శృగార దీపిక శ్రీనాథవిరచితమై యుండుసని కొందజు తలం . తురుగాని యీరచనమున శ్రీనాథకవి వేమభూపాలునకు.. నెక్కువగఁ


దోడ్పడి యుండవచ్చును. అట్లుకాదేని పీఠిక భాగమును మాత్రము శ్రీనాథకవి రచించి యుండవచ్చును.•[10]

వీరేశలింగముగారు తమ కవుల చరిత్రములో ఈ పెదకోమటి వేమభూపాలు నియొద్ద శ్రీనాథుఁ డాంధ్రకవిగాను, పార్వతీపరిణయమును రచియించిన వామనభట్టు సంస్కృతకవిగాను ఉండిరి. సంస్కృతమున వేసుభూపాలీయమను పేర నీతని గూర్చియే యొక వచన కావ్యమును రచియించెను. వేమభూపాలీయమునందు భట్టీతనిని సర్వజ్ఞ చక్రవర్తునిగాను. ఈతని పూర్వులను మహాచక్రవర్తు లను గాను పొగడెను. వేమభూపాలునకుఁ దాను గ్రంథభర్తయగుట కంటె గ్రంధకర్తయగుటయం దెక్కున యిష్టముగలిగి యుండినట్టు


-

. 13 గన్పట్టుచున్నది. వేమభూ పొలుఁడు సంస్కృతాంధ్రములయందు మంచి పొండిత్యము కలవాడయినట్టు చెప్పుచున్నారు. అమరుకమను శృంగా రకావ్యమునకు సంస్కృతమున శృంగార దీపికయను వ్యాఖ్యానము నీతఁడు రచించెను. ఈ గంథరచనము నందు శ్రీనాథ వామన భట్టు లీతని సహాయులుగా నుండినట్టు కొందఱును శ్రీనాథుఁ డే గ్రంథమునంతను వేమభూపాలుని పేరు పెట్టి రచించేనని కొందఱును చెప్పుచున్నారు. శ్రీనాథుని శాసనములలోని శ్లోకములే భేదమించుకయు లేక సరిగా నిందుఁ గనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగార దీపికను రచించియుండును " అని యొక విచిత్ర వైఖరి నవలంబించి స్వాభిప్రాయమును వెల్ల డించిరి ఈ పెదకోమటి వేమభూపాలుని సర్వజ్ఞచక్రవర్తియని పొగడి నది వామనభట్టు మాత్రమే గాక శ్రీనాథకవికూడ పొగడియున్న వాడని పొన్నుపల్లి శాసనములోని


“చూడామణగ్నృపాణాం దుగ్మడపరిసంధి శిఖరిదఁ భోళి
సర్వజ్ఞ చక్రవర్తిపెదకోమటి వేభూపతిర్జయతి. "


అను చరణములే వేనోళ్ళఁ జాటుచున్నవి.

శ్రీవీరేశలింగముగారు'బేతాళనాయనికినేఁడవతరమువాఁడు సర్వజ్ఞసింగమనాయఁ డగుటకు సందేహము లేదు; రసార్ణవసుధాకరాది సంస్కృతగ్రంథములను రచియించినవాఁ యగుటకును సందేహము లేదు."అనియు, “ఎట్లుల వచ్చినను పదవతరము వాడైన యీసింగభూపాలుఁడు పాండిత్య ప్రభావముచేతను, పండితజన సమాదరణముచేతను "కావ్య క్రియశ్వముచేతను సర్వజ్ఞ నామమున కర్షు డై నట్లుకనుపట్టుచున్నాఁడు” అనియు, "ఇద్దఱును విద్వాంసులు కావచ్చున ఇద్దఱును కృతిపతులు కావచ్చును; ఇద్దఱు కు సర్వజ్ఞ బిరు వాంచితులుకావచ్చును" అనియు, ( మొదటి రసార్ణ వసుధాకరము; రెండవది చమత్కారచందిక; మొదటివి సింగభూ పాల విరచితము; రెండవది సింగ మభూపాలా ంకితము" అని వ్రాయుటకు నేవిధమైన సందేహమును బొందియుండ లేదు. కాని పెదకోమటి వేమభూపాలునిగూర్చి వీరికన్నియు సందేహము లే తోఁచుచున్నవి. మీకు రసార్ణ వసుధాకరగ్రంథమును బరిం చియున్న యెడల నింత సాహసముతో బైవాక్యములను రచించియుం డరు. 'పదవతరము సింగమనాయఁను పాండిత్య ప్రభావము చేతను, పండిత జనసమాదరణ చేతను కావ్య ప్రియత్వము చేతను, సర్వజ్ఞ నామమున కర్ణుఁడై పట్టు గన్పట్టునప్పుడు పెదకోమటి వేమభూ పొలుఁడు పై హేతు వులచేత సర్వజ్ఞ చక్రవర్తి బిరుదమున కర్హుడై నట్టు ఏలగన్పడకుండెనో చెప్పిన బాగుండునుగదా! రసార్ణన సుధాకరగ్రంథమును సింగమనాయ కుఁడు రచించెనని చెప్పుటకు సందేహము లేదు గాని 'పెదకోమటి వేమా రెడ్డి శృంగార దీపికను రచించెననుటకు సందేహము కలుగుచున్నదంట!

సాహిత్య చింతామణి

ఇయ్యది యలంకార శాస్త్ర గ్రంథములలోఁ బేర్కొనఁ దగినయుత్కృష్ట గ్రంథ ప్రభాకరశాస్త్రిగారు తెలుపుచున్నారు.ఈగ్రంథమును నేను కావున దీనింగూర్చి ప్రభాకరశాస్త్రిగారు వ్రాసిన వాక్యములనే యిట నుదహరించుచున్నా ను. " ఈ గ్రంథము కావ్య ప్రకాశమువంటిది. ప్రతాపరుదీయవ్యాఖ్యాత కుమారస్వామి సోమవీధి దీని నుదాహరించినాఁడు. మనుమభట్టు ననుమానము నిది ఖండించును. ధ్వన్యాలో కాదుల నీది పరామర్శించును. అమరుశతక శ్లోకములు పెక్కు లిందుదాహరింపఁబడినవి. మఱియు ననేక ప్రాచీన గ్రంథములలోని శ్లోకము లుదాహరింపఁబడినవి. 'యథామమైవకావ్యే అనియు, 'యథామమైవ కావ్యే వీరనారాయణ చరితే యనియుఁ బెక్కు శ్లోకము లుదాహరింపఁ బడినవి.కోమటి వేమకృతులగు నాగ్రంథము లిప్పుడు తెలియరావు. హామున భట్ట బాణునికృతి వీరనారాయణ చరితము గద్యగ్రంథము గలదు. జూచినవాడను బడినవి. కాని యిందుదాహరింప బడినది గద్య గ్రంధముగాదు. శ్లోకరూప మగు 'కాన్యము.. ఎడనెడ వీరనారాయణ పెదకోమటి వేమభూపాల ప్రశ స్తిప్రస్తావశ్లోకములు పెక్కు. లుదాహరింపఁబడినవి. మీనారాయణుఁడే గ్రంథకర్తయగునప్పుడు తనపొగడ్తకు, దానే పాల్పడిననాఁ డగును. సమ్మానార్థమై వేమభూపాలు నాస్థానము సకువచ్చిన యనేక కవీశ్వరు లు చెప్పిన ప్రశంసాల్లోకముల నిందు దాహరించుకొన్నాఁ డేమో! యలంకారాదులకు లక్షముగాఁ బ్రయత్న పూర్వకముగా రచియింపఁబడి నవిగాలే వాశ్లోకములు. ప్రతాపరుద్రీయ రసగంగాధ రాదు లందలి శ్లోకము లట్టివి. "

ప్రభాకరశాస్త్రిగా రూహించినట్టు తనయాస్థానమునకు విచ్చేసిన కవీశ్వరులు తన్ను గుఱించి చెప్పిన శ్లోకములం దుదాహరించుకొని యుండుననుట పొటింపవలసియుండును. మరియు సాహిత్యచింతామణి లోని శ్లోకముల మఱికొన్నిటి సుదాహరించి యయ్యవి శ్రీనాథునికృ తులయందుఁ గన్పట్టుచున్న వని ప్రభాకరశాస్త్రి గారు తెలుపుచున్నారు. కాని యలంకారగ్రంథములలో లక్షములుగాఁ గైకొని చూపబడినవానిఁ బట్టి గ్రంధకర్తృత్వమును నిర్ణయింపఁబూనుట న్యాయ్యముగాఁ గనుపట్టదు. సాహిత్య చింతామణిలోని:

శ్లో. ఆటో పోయనటన్మహానట జటాస ఘాట శృంగాటక
క్రోమాటకరోటకోటక కుటీవారాట వీచీఘటా
కస్తుస్వస్పటినీ విశంకట తటీపాటిక వాటీభవ
ల్లాటీకోటి లలాటపాటలు సటాపాటల్య సాటచ్చరీ,

అను నాటోప పదారంభముగల పద్యములు శ్రీనాథునివీ పెక్కులు
గలవు, భీముఖండ మందలి యీ క్రిందిపద్యమున నొక సమాసపదము
మీదీ శ్లోక మందలిదే కలదు.

శా. ఆ డెం దాండవమార్భటీ పటహలీలాటోప వీస్ఫూర్జిత
క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీపుండు జూటాటపీ

క్రోడాఘాటక రోటికోటన కుట్లీకోటిలు దత్సింధువీ
చీడో లాపటలీ పరిస్ఫుట తర స్ఫీతధ్వని ప్రాధిమన్
 .
అని యుదాహరించుటయేగాక ప్రభాకరశాస్త్రిగారు

వాణీనఖముఖముఖరిత వీణామాధుర్యడుర్య వాగ్వృత్తి
స్వశ్యధ్వ ధ్వన్య పెదకోమటి వేరు భూపతిర్జయతి : 1,

అను శ్లోకమును, హరవిలాసమునందలి:

క. వాణిజ్యచణునకంత
ర్వాణిమస్తూయమారగ్విభవునకున్
వాణీనాథముఖమఖరిత
వీణావి క్వాణనిభ కవిత్వఫణికిన్

అను పద్యముతోఁ బోల్చి చదువుకొనుఁ డని వ్రాయుచున్నారు. ఇదంతయు సత్య మేకాని 'వేమభూపాలుని గూర్చిన యిట్టి ప్రశస్తి ప్రస్తా పనశ్లోకములను శ్రీనాధాదు లీగ్రంథరచనయందు వేమభూపాలునికి దోడ్పడినవారగుటచేత ప్రఖ్యాతము లైన యాశ్లోకములనందుఁ జేర్పిం చియుందురు. అంతియగాని తానే రచించితినని లోకమనకొనవలయు నను తలంపుతో కోమటి వేముఁడు వానిని తన సాహిత్య చింతామణి యందుఁ జేర్చియుండఁడనియే నా యభిప్రాయము.

ఇంతియగాక పెదకోమటి వేమభూపాలుఁడు సంగీతచింతామణి యందు మఱియొక గ్రంథమును రచించెననియు నయ్యది తిరువనంతపుర ప్రాచ్య లిఖితపుస్త కథాండాగారమున నున్నదనియుఁ దత్పుస్తక పట్టికలో పేరును మాత్రము చూచినానని వారే తెలుపుచున్నారు.

శృంగారనైషధరచనాకాలము

ఆంధ్ర భాషలో రచింపఁబడిన యుత్తమ ప్రౌఢకావ్యములలో శ్రీనాథుని శృంగార నైషధ మొకటిగాఁ బరిగణింపఁ బడుచున్నది. కాశీఖండమయఃపిండం నైషధమ్ విద్వదౌషధమ్' అని విద్వాంసులు గొనియాడుచుందురు. శ్రీనాథుఁడు దీనిలో మొదట "సంతరించితి నిండు జవ్వనంబునందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష” నని నైషదమును

నిండుజవ్వనమున రచియించినట్లు చెప్పియున్నాఁడు. నిండుజవ్వస మనఁగా ముప్పది మొదలు ముప్పదియైదు సంవత్సరములవఱకు నని చెప్పవచ్చును. అట్టి కాలమున శ్రీనాథుఁడు శృంగార నైషధమును రచిం చెను. . ఈయుత్తమ "కావ్యమును కొండవీటి ప్రభువైన శ్రీ పెద కోమటి వేనుభూ పాలుని ప్రధాన మంతియగు మామిడి సింగనామాత్యున కంకితము గావించెను. [11]*

ఈసింగనామాత్యునికి దాతయగు మామిడన్న భారద్వాజ గోత్రుఁడై , పెదతూర్క నమంత్రికి మనమఁడై , విక్రమపు రీసింహాసనా ధ్యాసియైన చిటి పెద్ద ప్రభునకుఁ గుమారుఁడై యధికవిమల శివాచార తత్పరుఁడై బంధురణ మహనీయసంపదచే విలసిల్లుచు ధర్మశీలుఁడై అక్కాంబికయందు 'నంశ పావనులైన నల్వురుపుత్తు లను బడసియుం డెను. వారలలో నగ్రజుడైన పెద్దనామాత్యుఁ డన వేమాధిపురాజ్య భార భరణన్యా పారదకుఁడై యుండెను.


ఈ యమాత్య శేఖరునకు వీరభద్రామాత్యుఁడు మారనామా త్యుఁడు, నామామాత్యుఁడు నను ప్రసిద్ధులైన మూవురు తమ్ములు వివిధ కార్యకరణదక్షులై యన్నకు విధేయులై యొక్కొక్కఁ డొక్క- విషయంబునఁబ్రజ్ఞాడ్యులై యుండిరని నైషధములోని పద్యములను నింతకుఁబూర్వము చూపియున్నాను.


ఈ పెద్దనామాత్యుఁడు గౌతమగోత్ర విఖ్యాతుఁడును ఆప స్తంబ సూత్ర పావనుఁడును, 'నగు శ్రీ కేతనామాత్య శేఖరునకుఁ బుత్రు డై చౌహ త్తమల్లుండు, చౌహత్తనారాయణుండు ఖడియ రాయండు, నను బిరుదములచే దసరినట్టి యల్లాడమంత్రికి మహితపుణ్యయగు నన్న

మాంబయందు జనించిన తల్లమాంబిక సుద్వాహమై వేమనామాత్యుని ప్రెగడనామాత్యుని, సింగనామాత్యుని గనియెను. ఈ కడపటివాడైన సింగనామాత్యుఁడే త్రిభువనరాయ వేశ్యా భుజంగుఁడనియు. కదనగాం డీవియనియు, జగనొబ్బగండఁడనియు మొదలుగాగల పెక్కు బికుదము లను వహించి వేమక్షితీ పాల రాజ్య విభవకళారణా మణియై విమలతర మైన తన కీర్తి నాల్గు దెసల వ్యాపింపఁ జేసి మిక్కిలి బాసిగాంచినవాఁ డని యీకింది పద్యమువలనఁ దేటపడఁగలదు.

సీ. కనకృపాణము సముద్ధత వైరి శుద్ధాంత తాటంక నుల కెగ్గుదలంచుచు క
దన బాహుసీకంబు ధరణి భృత్కమరాహిసా మజంబులకు విశ్రాంతి, యొసఁగ
దనకీర్తినర్తకి ఘసతరబ్రహ్మాండ భవనము భూముల కొండ్లి పండవిల్ల
దనదానమహిమ సంతాన చింతారత్న జీమూతసురభుల సిగ్గుపలుపఁ

తే. బరయు శ్రీ వేమమండ లేశ్వరుని మంత్రి
యహిత దుర్మంత్రి పదన ముద్రావతార
శాసనుఁడు రాయ వేశ్యాభుజంగ బిరుద
మంత్రి పెద్దయసింగ నామాత్య వరుఁడు.

ఈ పై పద్యముసఁ బేర్కొ నంబడిన వేమమండ లేశ్వరుఁడు క్రీ. శ. 1400 మొదలుకొని 1420 వఱకును కొండవీటి రాజ్యమును బరి పాలించిన పెదకోమటి వేమభూపాలుఁడు గాని కొందఱు తలంచినట్లన వేమభూపాలుఁడు గాడు.

ఈశృంగార నైషధ కావ్యమును శ్రీనాథుఁడు క్రీ. శ.1395 దవ సంవత్సర ప్రాంతమున రచించి యాకాలమున నొక చిన్న సంస్థానమున కధిపతిగానున్న పెదకోమటి వేమునకు మంత్రిగా నుండిన మామిడి సింగ నామాత్యున కఁకితము చేసెనని శ్రీలక్మణ రావుగారి ముఖ్య వాదమై యున్నది. దీనినే వీరేశలింగముగా రనునదించిరి. శ్రీలక్మణ రావుగారు " పెదకోమటి వేమా రెడ్డి 1400 లో కొండవీటి రాజ్యమునకు వచ్చినను అంతకుఁ బూర్వ మేమియు లేని యష్టదరిద్రుడు కాడు. కొండవీటి వంశ ములోనివాఁడు. పెద్ద కుటుంబమువాఁడు. . . . . . ఈతఁడు మాచని వంశ ములోని వాఁడు. మాచని తమ్ముడైన వేమ (ఈతనినే ప్రోలయ వేమ యందురు) మిక్కిలి శూరుఁడగుట చే కొండవీటి రాజ్యమాతనికే పోయెను. ఇట్లు కొండవీటి రాజ్యము రెండవవంశమునకుఁబోయినను మాచయ' అతని రెండవకుమారుఁ డైన ' పెదకోమటి' అనామధేయులుగ నుండలే దనియు రాజ్యము చేయుచున్న వారికిఁ దోడుగ నుండిరనియు, మనమూ హింపవచ్చును. *వేమభూపాలీయమునందు వీరిని గొప్ప రాజులుగఁ గవి వర్ణించినాఁడు: ఆయతిశయోక్తిని వదిలినను కొన్ని గ్రామములు భూతాది నిమిత్తమైనను వీరి క్రింద నుండెనని యెంచుట ప్రమాదము కానేకదు. కావున పెన కోమటి' కుమారుఁ డైన వేమారెడ్డి కుమారగిరి మరణానంతరము రాజ్యమునకు వచ్చుటకు బూర్వము ఒక చిన్న జమీం దారుగను రాజవంశమునందు గౌరవముగలవాడుగను ఉండెననుటకు సందేహము లేదు. శ్రీనాథుఁడాకాలమున నాతని మంత్రియైన మామిడి సింగన్నకు నాంధ్రనైషధమును అంకితమిచ్చి వేమరాజునకు మంత్రి యని వర్ణించుటయందు విరుద్ధ మేమియు లేదు. అనఁగా కుమారగిరికొం డవీటిలో ప్రభుత్వము చేయుచున్నప్పుడు అతని పెత్తాత (పెద తాత) మను మఁడగు 'పెదకోమటి వేమా రెడ్డికూడ కొండవీటికీ రాజుగాక పోయినను ఒకచిన్న జమీందారుగ నుండెను. నాలుగూళ్లుగల వారినిగూడ పెద్ద రా జులుగను వారియొద్దనున్న గుమస్తాలను మంత్రులుగను వర్ణించుట మన కవుల, సంప్రదాయమని యాంధ్ర కావ్య పాఠకులకు నేను 'వేఱుఁగ జెప్ప నక్కర లేదు * ' అని యసంబద్ధ వ్యాఖ్యానమును జేసి శ్రీనాథుడు తన్న శృంగార నైషధమును నొక చిన్న జమీందారుఁడైన పెదకోమటి వేము నకు గుమస్థాగానున్న మామిడి సింగన్నకు సంకితము చేసెనని సిద్ధాంత ము చేసినారు. శ్రీలక్ష్మణరావుగారి మాటలవంటి మాటల నుపయోగిం చకపోయినను శ్రీవీ రేశలింగముగారుకూడ వారిపాట నే పాడియున్నారు. పెదకోమటి వేముడస్వతంత్రుడై యున్నకాలమున నీశృం యున్న కాలమున

గారనైషధము రచింపబడి యుండునని వీరి ముఖ్య తాత్సరమైయున్నది. ఆ కాలమున నిత్య ఇక్కడ పరిపాలనము చేసెనో వీరుచెప్పఁజాల కున్నారు. కాలమున వీనిదానధర్మములను దెలుపు శాసనము నొక్క దానినైనఁ గనఁబఱుపం జాలకున్నా ఇవియన్నియు వీరి యూహలు. ఇట్టి యూహలు చేయుటకుఁ గారణము హరవిలాసమున శృంగార నైషధము పేర్కొనబడుటయు హరవిలాసము కుమారగిరి రెడ్డి కాలమన రచింపఁబడెనని విశ్వసించుటయునై యున్నది. కాని యాంధ్రశృంగార నైషధమును వీరు బాగుగా, బరిశీలించి వాసినట్లు గానరాదు. గ్రంథమును విమర్శించి విషయములను జక్కగా బరిశీలించిన బుద్ధిమంతు లేవ్వరును. వీరివలె సవిశ్వాసమునకు బాత్రులుకాఁజూలరు. శ్రీ నాథుడతిశయోక్తులు చెప్పియుండ లేదని మేమునఁజాలముగాని శ్రీలక్ష్మణరావుగారూహించినంత నిరసనముగాఁ దలపోయుటకు మాత్రము సాహసింపజాలము. శృంగార నైషధము గృతినొందు నాటికి మామిడి సింగనామాత్యుడెట్టి స్థితిలోనుండెనో మనము విచా రించుటకు శ్రీనాథుఁడు శృంగార నైషధమును రచించి సింగనామాత్యుని కంకితము చేయుటకుఁ బూర్వమె యాతని యన్నయగు ప్రెగడ నామా . త్యునకు పండితారాధ్య చరిత్రమను మొదలగు కృతులను రచించి యంకితము చేసి జగంబుననుతి కెక్కి యున్న వాఁడని యిదివఱకె తెలిసి కొని యున్నారము. శృంగార నైషధవ తారీకయందు శ్రీనాథుఁడు సింగ నామాత్యు నిట్ల భివర్ణించి యున్నాఁడు.


మ. ఆరు దారంవివిదాగ్రగహారము లతో నాందోళి కాచ్ఛత్త్ర చా
మరక ళ్యాణకళాచీ కాజ బహుసమ్మా నార్హ చిహ్నంబు లా
దర వెంప్సొగఁ వేమభూనరుని చేతంగాచె సామాజ్య సం
భరణప్రౌడు డమాత్య సింగడు నయప్రాగల్భ్య గర్వోన్నతిన్.


ఇందలి తాత్పర్యము సింగనామాత్యుఁడు నీతిప్రౌడిగలిగి , నేర్ప రియై సామ్రాజ్య సంరక్షణమును జేసినందున సంతోషించి యపూ

ర్వముగా వేమభూవరుడాతనికి వివిధాగ్రహారములతో, బాటు అందళము, ఛత్రము, చామరము (వీచోపులు), బంగారు తమ్మపడిగముమొదలుగా గలసమ్మానార్హ చిహ్నములు లొసెంగెనని గహింపవలయును. మఱియు షష్ఠ్యంతములలో నాతని గూర్చి


శ్రీ మహిత పెద్దకోమటి
వేమక్షితి పాల రాజ్యవిభవకళా
క్షామణికి సింగ సచిన
ఫ్రామణికిం బాండ్య రాజుగజ 'కేసరికిన్ .

అనియుఁగూడఁజెప్పి యున్నాఁడు. కాఁబట్టి యాసింగనామాత్యుని మహా ప్రధాన శేఖరునిగాఁ జెప్పియున్నందునఁ బెదకోమటి వేమభూవ రుఁడు కొండవీటి సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడైన వెనుకనే యీ శృంగార నైషధము సింగనామాత్యున కంకితము చేయఁబడియెనని యూ హింపవలయును. ఇంతకన్న విస్పష్టముగా ద్వితీయాశ్వాసాదియందిట్లున్నది


క. శ్రీ రాజరాజ వేమ
క్ష్మారమణ కృపాకటాక్ష సంవర్థి తల
క్ష్మిరక్షితబుధ లోక యు
దారగుణాధార సింగ నామాత్యమణీ.


శ్రీనాధుడీ పై పద్యమునందు రాజాధి రాజైన 'వేమభూపాలుని కరుణతోడి కడకంటి చూపు చేత 'పెంపఁబడిన సంపద చేత పోషింపఁ బడిన విద్వాంసు లసమూహము కలవాఁడాయని సింగనామాత్యుని సంబోధించినాఁడు. పెదకోమటి వేముఁడు కొండవీటి సామ్రాజ్యమున కభిషిక్తుడైన వెనుక నే యీశృంగార నై షధము సింగనామాత్యుని కఁకితముచేయఁబడియెనని తెలుపుటకీ నిదర్శనములు చాలవా? వీటినన్నిటిని నతిశ యోక్తులని[12]

పెద్దనిండుసున్న పెట్టి తాటియాకు కవిలెకట్టు మోయు గుమస్తా కంకితము చేసెనను భావమునుదెల్చుచు నాకాశ పంచాంగము విన్పించెడి లక్ష్మణ రావు గారి పల్కులు విశ్వాసార్హము లెట్లగును? ఆపల్కులనే చిలుకవలే రెట్టించి పల్కెడి కవిచరిత్ర కారుని పల్కు లెట్లాదరణీయము లగును? సింగనామాత్యుఁడు కొండవీటి సామ్రాజ్యాధీశ్వరుడైన పెదకో మటి వేమభూ పొలుని మంత్రులలోఁ బ్రధాన శేఖరుండగుటచేతనే సక లవిద్యాసనాథుడైన శ్రీనాథుఁడు సింగనామాత్యుని కొల్వుకూటము నిట్ల భివర్ణించి యుండెను. "

“వృదుమధుర చిత్ర విస్తరకవితా విలాస వాగీశ్వరులగు కవీశ్వరు లుసు, పతంజలి కణాదాక్షచరణ పక్షిలాది శాస్త్ర సిద్ధాంతకమలవహం నులగు విద్వాంసులును భరతమతందత్తిల కోహలాంజనేయ ప్రణీత సంగీత విద్యారహస్య విజ్ఞాన వై జ్ఞానిక స్వాంతులగు కళావంతులును, శక్తి త్రయచతురు పొయషాడ్గుణ్య ప్రయోగయోగ్య విచారులగురాయ బారులును నిఖిల పురాణేతిహాససంహితా తాత్పర్య పర్యాలోచనాధు రంధరధిషణాసము త్సాహంబగు పౌరాణిక సమూహంబును బరి వేష్టింప గొలువుండి,"

ఇట్లు విద్వద్య్బృదముతో కోలువుదీర్చిన సింగనామాత్యుఁడు కవిలెకట్టలు మోయు గుమస్తాయని పల్కుటకు నాకునోరాడదు.అయినను ఈసింగనామాత్యుని తండ్రి పెద్దనామాత్యుడు అన వేమభూపాలు సకు మంత్రిగనుండె ననియు అనవేమభూపాలుఁడు కొఁడవీటి సామ్రా జ్యమున కవీశ్వరుడనియు శ్రీలక్మణరావుగారును శ్రీవీరేశలింగముగారు నుగూడ నొప్పుకొని యేయున్నారు. అటువంటి పెద్దనామాత్యుని పుత్రు డైన సింగనామాత్యుఁ డతనికంటెను ఖ్యాతుఁడై యుండెననుటను బై వర్ణనములు వేనోళ్ళ జాటుచున్నవికాని యతిశయోక్తులని గన్పట్టు చుండ లేదు. ఇదియునుం గాక సింగనామాత్యుని యన్నలగు వేమయా మాత్యుని ప్రగడనామాత్యుని దండనాథులనుగా వర్ణించియున్నాడు వేమవఃంత్రిని దండనాయకచూడావతంసమని వర్ణించిన పిమ్మట పెగడ నామాత్యుని



మ, తగు గై వారి మొనర్ప విక్రమకళాధారేయతాశాలిశ్రీ
ప్రెగడన్న ధ్వజినీశుడంబునిధి గంభీరుడు శుంభద్ద్విస
న్నగం ద్వారకవాట పొటున విధాన ప్రౌడబాహార్గళా
యుగ ళుండా హవసవ్య సాచీ ధరలో నొక్కండు పేరుక్కునన్

.


అని పరాక్రమవంతుఁడు, గంభీరుఁడు, శత్రుపుర భేదకుఁడు, యుద్ధదశుఁడు బలము విషయములో పొగడనర్హుడైన వాఁడు దండనాధుఁడితఁ డొక్క డేయని 'చెప్పియున్నాఁడు. వామనభట్టు 'పెదకోమటి 'వేమభూసాలుని చక్రవర్తియని వర్ణించిన వర్ణన మతిశయోక్తిగాఁ ద్రోసిపుచ్చినను వేమ భూపాలుఁడు కొండవీటి రాజ్యమున కభిషిక్తుఁడై స్వతంతడై పరి పాలనము చేయుచుండ సామ్రూజ్య సంభరణ ప్రౌడ్డై సింగనామాత్యుడు సకలవిద్యా సనాథుఁడైన శ్రీనాథుని సంప్రార్థించి నైషధ కావ్య రచనకుం భోత్సహించినది. యతిశయోక్తి కాజాలదు. శ్రీ వీ రేశలింగముగారు సెదకోమటి వేమన నృపాలుని మండ లేశ్వరుఁడని చెప్పుటచేత నైషధ గ్రంథరచన 'కాలము నాటి కతఁడు రెడ్డి సామ్రాజ్య పట్టభద్రుఁడు కాలే దనియు రెడ్డి రాజ్యములోని మండ లేశ్వరుఁడుగా నుండెననియు దెల్ల దుగుచున్న దని వ్రాసియున్నారు కాని పైన నే సుదాహరించిన శ్రీ రాజు రాజ వేమమ్మోరమణ' యను ద్వితీయాశ్వాసములోని పద్యమును జూచి యుండ లేదు. శ్రీనాథుఁడు శృంగార నైషధము రచించునాటికి వేమా రెడ్డి సామ్రాజ్య పట్టభద్రుడై యుండెననుట (రాజ రాజశబ్దమే వేనోళ్ళ జాటు చున్నది గదా! శ్రీ లక్మణ రావుగారు వీనిం దప్పించుకొనుటకు వేఱు మార్గము గొన రానందున నతిశ యోక్తులని యొక్క తోపు త్రోసి తమ సిద్ధాంతమును నిలుపఁజూచిరి. వీరి వాద దౌర్బల్యమును గమనించి శ్రీ వీరేశలింగముగారు. తమవాదమును గారణయుక్తమైనదానిగఁ జేసి నిలుపఁ బూని ముండ లేశ్వరుఁ డను దానికి వెనుకను ముందును. జూచు కొనక వ్యాఖ్యానము చేసి చెప్పిరి. ఇప్పుడన్ననో శ్రీలక్మణరావుగారి నీడ కేచేరి వారితో పాటుగా నతిశయోక్తు ' లను నొక్క పాట పాడుదురు. కాఁబోలు! పోలుంగద! పెడకోమటి వేమభూపాలుడు కొండవీటి సామ్రాజ్య పట్టభద్రుఁడు కాక పూర్వమే నైషధము, హరవిలాసము రచించి యుండిన యెడల 1400 మొదలుకొని 1420 వఱకు శ్రీనాథుడు గ్రంథరచనము లేక చేతులు నలుపుకొనుచుఁగూరుచుండెనా యనియెవ్వ రైన ప్రశ్నింతురను భయము చేత కాఁబోలు నాకాలమున శ్రీనాథుఁడు పల్నాటి వీరచరితమును రచించుచుండెనని శ్రీలక్మణ రావుగారును శివ రాత్రినూహాత్మ్యమును రచించుచుండెనని శ్రీ వీరేశలింగము: గారును వ్రాసియున్నారు. పల్నాటి వీరచరితము బాల్యమున రచించెనని శ్రీ వీరేశలింగమ గారు వచించిన దానికి నేను యాక్షేపణములు చెప్పఁబడి నవో యాయాక్షేపణములు నిండుజవ్వనమున రచిఁంచెనను లక్మణ రావుగారి సిద్ధాంతమునకును వర్తింపుచున్నవి. నైషధము హరవిలా సమువంటి యుత్కృష్ఠ గ్రంథములను రచించి సకలవిద్యాసనాథుఁడను బిరుదమును వహించి పెదకోమటి వేముభూపాలుని యాస్థానంబున విద్యాధి కారిపదవి సధిష్ఠించియున్న శ్రీనాథ కవివర్యుండు శబ్దసౌష్ఠవ జ్ఞానము విడిచి పల్నాటి వీరచరిత్రము వంటి ప్రబంధము నల్లి యుండునని చెప్ప సొహసించినందులకు లక్ష్మణ రావుగారి ధైర్య ము నెంతయినం గొండాడఁ దగియున్నది. సకలవిద్యాసనాథుఁ డైనను శ్రీనాథున కప్పటికిఁ గవిసార్వభౌమ బిరుదము - లభింప లేదు. పల్నాటి వీర చరిత్రములో శ్రీనాథుఁడు కవిసార్వభౌమ బిరుదము గలవాఁడనని చెప్పుకొని యున్నాడు. శ్రీలక్ష్మణరావుగారు పల్నా టివీరచరిత్రమును బఠించియుండ లేదు కాఁబోలు! పల్నాటివీరచరిత్రమా కాలమున రచి పఁబడ లేదని "కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి శ్రీనాథుఁడనువాడ శివ భక్తి పరుఁడ నని యతఁడు చెప్పుకొన్న వాక్యములే బాధించుచున్నవి: ఇక వీరేశలింగముగారు శివరాత్రి మాహాత్మ్యమని చెప్పిన దానిగూర్చి విచారింతము. వారేమి వ్రాసియున్నారో చిత్తగింపుఁడు. 1400 వ సంవత్సరము మొదలుకొని గర 1420 వ సంవత్సరము వరకును మహాకవి యైన శ్రీనాథుఁ డొక్క గ్రంథమునై నఁ జేయక యూరకుండఁ జాలఁడు. ఇట్లు వృధపుచ్చఁ బడినదనుకొన్న కాల మిరునది సంవత్సరములే యన నేల. ఇరువదినాలుగు సంవత్సరములు కావచ్చును. . . . . . ఎట్లయి నను వింశతి దీర్ఘ సంవత్సరములు నిరర్గళ కవితాధారగల కవిచేతి లేఖుని యు సనల్పకల్పన సమర్థమైన బుద్ధియు స్వసామర్థ్యమును మఱచి య స్వాభావిక నిద్రను వహించుట సంభాన్యముకాదు. అందు చేత శ్రీనాథుఁడీ కాలములో నేదో మహాగ్రంథమును రచించుచుండి యుండవలెను. అమహాగ్రంథము శివరాత్రి మాహాత్మ్యమని తోచుచున్నది. శ్రీనాథుఁడు దీనిని తన ప్రభువైన పెదకోమటి విభుని కంకితము చేయవ లెననియే యుద్దేశించి యుండును. కాని యింతలోపల కొండవీటి రాజ్య మన్యా క్రాంతమగుటయుఁ దనకాశ్రయులైన వేమనృపాల సీంగనామాత్యాదు లు పరలోకగతులగుటయుఁ దటస్థించి నందున శ్రీనాథ మహాకవి రాజ ధానియైన కొండవీటియందు నిలువ నాధారము లేక తనగ్రంథపరికరము లతో నావీడు విడిచి దేశాంతరగనునోన్ముఖుఁడై 1420 వ సంవత్సర ప్రాతములయందు ముందుగా స్వార్థమును తీర్థమును గలిసి వచ్చునట్లు గా శ్రీశైలయాత్రకు "వెడ లెను. అట్టి పుణ్యస్థలమైన శ్రీశైల దివ్య క్షేత్రమునకు కొండవీటి రెడ్డి రాజ్య నాశనా నంతరమున శ్రీనాథుఁడుయాత్రకుఁబోవ 'దేవతాదర్శనము చేయుటయేగాక యచ్చట మఠాధికారులయి లక్షాధికారులయి యుండిన గురుపీఠమువారిదర్శనము చేసి వారి యనుగ్రహమునకు బాత్రుఁడై తాను రచించిన శివరాత్రి మాహాత్మ్యమును ముమ్మయపుత్రుఁడైన శాంతయ్య కంకిత మొనర్చెను. . . . . ఆవఱకుఁ దాను గోమటి వేమనృపాలుని

జీవిత కాలములోనే రచియించుచుండిన గ్రంథమునే యవశిష్టమును ముగించి యవతారికను వ్రాసి యాశ్వాసాద్యంత పద్యములను జేసి శ్రీశై లయాత్రాసమయమునం దర్హసంభాననమును బడసి శ్రీనాథుఁడే శివరా త్రిమాహాత్మ్య మహా కావ్యమును మహాధన సంపన్నుఁడైన ముమ్మడి శాంతయ్య కంకిత మొనర్చినట్లు తోఁచుచున్నది. ఈ గ్రంథము 1424 వ సంవత్సర ప్రాంతమునందు సంపూర్తి చేయఁబడి యుండును...

అని శ్రీవీ రేశ లింగముగారు తమకుంగల యనల్పకల్పన సామర్ధ్య విశేషమునంతయు నచ్చుపడం జేసి యున్నారుగదా? వీరివాఖ్యములలోని యుక్తిరత్నములవంటి యుక్తిరత్నముల .. మన మెన్నఁడును జూడఁ బోము. పెదకోమటి వేమభూపొలుని యాస్థానంబున విద్యాధికారపదవి యందుండిన యిరువది సంవత్సరముల కాలములో శ్రీనాథ మహాకవినం టివాడు శివరాత్రి మహాత్మ్యమను కావ్యమును రచించినాఁడఁట! ఈకృ తిరత్నము నంకితము నొందకుఁడ వాని.......... యులుగనుండిన ప్రభువ తంసము 'లెల్లరును స్వర్గస్థులైరట! స్వార్ధమును తీర్థమును గలిసి వచ్చు సని 1460 లో శ్రీశైయాత్రకు బయలు దేఱైనఁట! అచట నవతారి కను, ఆశ్వాసాద్యంత పద్యములను జేసి గ్రంథము సంపూర్తిచేయుట 1424వ సంవత్సర ప్రాంతమునందుగాని సంభవింప లేదఁట! అటుపిమ్మ టనే శ్రీనాథుఁడు ప్రౌఢ దేవరాయని కర్ణాటరాజధానికిఁ బోయి డిండిమభట్టును నోడించి కవిసార్వభౌమ బిరుదము లాగుకొనియుండె నఁట! కాని యాగ్రంథావ తారికలోనే మహా ప్రసాదంబని సత్కవిసా ర్వభౌముఁడగు శ్రీనాథకవివ రేణ్యుని కృపావి శేషంబున, నీశివరాత్రిమ హాత్మ్యము చెప్పంబడి యుండెనని వ్రాయఁబడియున్నదట! వీడే గవిసార్వభౌము విమలచరితు' ననిగూడ యున్నడంట! పల్నాటి వీరచరి త్రమునకును బట్టిన కవిసార్వభౌమ బిరుదము బాధ శివరాత్రి మహా త్మ్యమునకుఁ బట్టినదన్నమాట ఏ రెఱుంగకపోయిరి. “ఈతనిని (డిం శ్రీ మభట్టును) శ్రీనాథుఁ డోడించుట 1423 వ సంవత్సరమునకుఁ దరువా తనయి యుండవలెను. 1426 వ సంవత్సర ప్రాంతమున నని తోచు చున్నది. " అని వారే వ్రాయుచు శివరాత్రిమహాత్మ్యము రచించి శాంతయ్య గురుదేవర కంకిత మొనర్చునాటికే శ్రీనాథుఁడు కవిసార్వభౌమ బిరుదాంచితుఁ డై యుండెనని కనపడు నవతారికలోని గద్యపద్య ముల నెత్తి ప్రచురించుచు స్వవచన వ్యాఖాతములతోఁ గూడిన వితండ నాదమును గ్రంథస్థము గావించుట యపహాస్య భాజనమగుటకు, దక్క మఱి యెందునకుం గొఱుగాకయున్నది. శ్రీవీ రేశలింగముగారు శ్రీనాథు నకు (1426వ సంవత్సరమున) రాయలసందర్శనలాభము కలుగుట యేగాక తదాస్థానమునందు విపక్ష విద్యాం సవిజయలాభమును , తగ్బిరు దాంక సంపొదన లాభమును, కనకాభిషేకలాభమునుగూడఁ గలిగి • శ్రీవాణి ప్రసాదలబ్ద సకలవిద్యాసనాథుఁడగు శ్రీనాథు డే విజయము నొంది యూగౌడడిండిమభట్టు కంచుఢక్కను బగుల గొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును లాగుకొన సమర్ధుఁడయ్యె" నని వ్రాసియుండుటచేత వారివాక్యములే వారి వాదమును సమూలచ్ఛేదము గావించుచున్నవి. శ్రీవీ రేశలింగముగారు "ఇట్లు శ్రీశైలయాత్రవలన తీర్థమును స్వార్థమును గలిసివచ్చి యభిమతార్ధ సిద్ధియయిన తరువాత శ్రీనాథుఁ డక్కడనుండి వెలుపడి ధనాగమసమ్మాన సముపౌర్జనార్ధమయి స్థలాంత రాన్వేషణము చేసికొనవలసినవాఁడయ్నెను.... ఈ హేతు వుల చేత శ్రీనాథుఁ డాకాలమువండు మహాబలిష్ఠమై యుండిన కర్ణాట రాజధానికిఁ బోవల సినవాఁడయ్యె నని విస్పష్టముగ వాసి యొప్పుకొని యుండుట చేత మఱియొక వాధమునకు గడంగ వీలులేదు. అప్పు డింతకున్నను, నపహాస్య,భాజనముగఁ బరిణమించును. ఏమున, కర్ణాటాధీ శ్వరునీ సభకుఁబోయి గౌడడిండిమభట్టును నోడించి వానికవిసార్వభౌమ భీరుడమును :గొని యమ్మహా రాజు ముత్యాల శాలలోఁ గనకాభిషేక మును బొందిన వెంటనే స్వార్థమునకై శ్రీ శైలయాత్ర చేసి యొక జంగమ గురు దేవసకుఁ గృతినిచ్చెననుట హాస్యాస్పదముగఁ గస్పట్టుచుండ లేదా? ఆట్లు కనకాభిషేకముగాంచిన కవిసార్వభౌముఁడు (శ్రీవీ రేశలింగముగా రెగతాళిగాఁ బలికినట్లు) అర్హ సంభావనకై జంగమగురు దేవరకుఁ గృతి నొసంగియుండఁడు. కావున 'బెదకోమటి వేమభూపాలుని యాస్థానంబున సకల విద్యాసనాథుఁడైన శ్రీనాధుఁడు. విద్యాధి కారపదవి నధిష్టించి యున్న కాలమున శ్రీలక్ష్మణ రావు గారు నుడివినట్లు పల్నాటివీరచరిత) మునుగాని' శ్రీ వీరేశలింగముగారు నుడివినట్లు శివరాతి మహాత్మ్యము గాని రచించియుండ లేదని ఋజువుచేసి యున్నాడను. శ్రీ వీరేశలింగము గారు పలికినట్లు వింశతిదీర్ఘ సంవత్సరములు నిరర్గళకవితాధారగల కవి చేతి లేఖనియు సనల్పకల్పన సమర్థమైన బుద్ధియు స్వసామర్థ్యమును మఱచి యస్వాభావిక నిద్రను వహించుట సంభాన్యము ' కాదనుట యొప్పుకో దగియున్నది. శ్రీనాథుఁడు కొన్ని గ్రంథములను రచించియుండక పోఁడు. పొనిలో ముఖ్యమైనది శృంగారనైషధమనుటకు సంశయింపఁ బనిలేదు. ఎందుకన, " శ్రీ రాజ రాజ వేమక్ష్మారమణ కృపాకటాక్షు సంవర్ధితలక్ష్మీ రక్షి తబుధ లో క " అని సింగనానూత్యుని శ్రీనాథుఁడు సంబోధించి యుండు టచేత 1400 సంవత్సరమునఁ గొండవీటి రాజ్యమునకు బెదకోమటి వేము భూపాలుఁడు పట్టాభిషిక్తుడైన తరువాతనే వానిమంత్రిగా నున్న మామి డిసింగనామాత్యునకు వానికోరిక మీద శృంగార నై షధమును భాషాంత రీకరించి యంకితము చేసియుండెనని దృఢముగాఁ జెప్పవచ్చును. మామిడి సింగనామాత్యుఁడు రాజ కార్యధురంధరుఁడు మాత్రమేగాక విద్వాం సుఁడును, గణితశాస్త్రజ్ఞుడును దైవజ్ఞ శిఖామణియుఁ గూడనై యున్న వాడు. ఈసింగనామాత్యుఁడు 1415 దవ సంవత్సరమునఁ దాను బెదకోమటి వేమభూపాలునకు మంత్రిగానుండియు సోమసిద్ధాంతముసకు వ్యాఖ్యానమును జేసియున్నాడు. శ్రీనాథుఁడు....సింగనామాత్యు : సభివర్ణించుచు నీవిషయమువనే యీకింది పద్యములో సూచించి యున్నాడు.

 శా. పంచాగస్థిరమంత్రరక్షణకళా ప్రౌడుండు రాలాస • :
పొంచాలండు విరించి వంశజలధిప్రాలేయ సోముడు దో
శ్చందచ్చాపళ్ళపొణ: విజయేశ్వక్యుడు దిక్కామినీ
కాంచీమాక్తిత కీర్తిపెద్దవిభు సింగిండొక్క నాడీమ్ములన్ .

సింగనామాత్యుఁ డొక్కనాఁడు విద్వద్బృందము పరివేష్టింపం గొలువుండి సరససాహిత్య గోష్ఠీవినోదప్రసంగంబున శ్రీనాథుని గారవించి గంభీర వాక్ప్రౌడిమతో నిట్లు ప్రశంసించెను.


 బాహ్మీద త్తవర ప్రసాదుఁడవురు ప్రజ్ఞావి శేషారయా
జిహ్మ స్వాంతుఁడ విశ్వరార్చనకళాళీలుండ నభ్యర్తిత
బ్రహ్మాండాది మహా పురాణచయ తాత్పర్యార్ద నిర్ధారిత
బ్రహ్మ జ్ఞానకళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే.

 క. జగము నుతీ పఁగ జెప్పితి
ప్రెగడయ్యకు 'నాయనుంగు బెద్దనకు కృతుల్
నిగమార్ధ సార సంగ్రోహ
మగు నానాయారాద్య చరితమాదిగబెక్కు ల్

సీ. కవిరాజరాజిత శేఖర హీరము కుటుంబ
శ్రీహీరకలశాబ్ధిశిశిరకరుడు
మామల్లదేవీ కుమారరత్నంబు చిం
తామణీమత్ర చింతనపరుండు


  • శ్రీ వేదము వేంకట రామశాస్త్రి గారు " పంచాంగ సిద్ధి మంత్ర రక్షణకళాప్రౌడను దానికెట్లర్థము వ్రాసి యున్నారు.

పంచాంగ = (సహాయులు, సాడషోపాయములు, దేశ కాల విభాగము ప్రాత ప్రతీకారము సిద్ధి అనెడి)యయుదంగముల చేత స్థిర= నిశ్చలమైన మంత్ర . లోచన హెక్క రక్షణ= కాపాడు- యొక్క కళా = విద్యయందు ప్రౌడుండు = డిదేఱిన వాడు మామిడి సింగనామాత్యుడు సోమ సిద్ధాంతమునకు వ్యాఖ్యానము చేసి యున్న సంగతి నెఱింగియున్న యెడలశ్రీశాస్త్ర్య్ల వారు పైరీతినధర్మమున వ్రాసి యుందురని తలంప జాలను

 కవికులా పృహధ్వగమనాథ్వ ననుండు
కాశ్మీకనృప సభాకమః హేళి
ఖుడగ్రఆంధసంగం పక్క శబు
షట్లను క చ మచక్రవర్తి

గీ. భట్టహర్షుకు పో నా క్పాటవమున
నెద్దె చించె బుగవ లోక హితము పొం ఓ
నట్టి నైపధసత్కావ్యమాంధ్ర భాష
ననము యొనరింపు నాషే నంకితముగ,

చ. పశివడి నాళ మలపాకమునం జవిమైన భట్టహ
గుని కవితానుగుంభనములు సోమరిపోతులు కొందజయ్య
సని కొనియాడ సేవళది; యట్టిది లేజవ శాలలు చెక్కు, గే
టిన వసపల్చు బాలకుఁడు డెందమునం గలంగ నేర్చునే,


అని జుట్లు ప్రశంసించి సబహుమానంబుగాఁ గహ్పర తాం బూలం బొసంగి జాంబూ దాంబరాభణంబులు గట్టనిచ్చి పీడ్కొలిపే సని శ్రీ నాథుఁడు చెప్పుకొని యున్నాడు. తర్వాత శృంగార నైష ధము నాంథ్ర భాషను రచించి సింగనామాత్యున కంకిత మొనరించి యున్నాఁడు. (సంతరించితినిండు జవ్వనంబున ముందు హర్షనైషధ వ్య మాంథ్రభాష' యని కాశీఖండమునఁ జెప్పుకొనియుండుటచేత ముప్పు దియైదవసంవత్సరప్రాయమున శృంగార నైషధమును రచించి మామిడి సింగనామాత్యుని కంకితము చేసియుండుననుట కెంత సూత్రమును సంశ బంపఁ బనిలేదు.


ఈ మామిడీ సిఎగనామాత్యుఁడు వేమభూపతి మహాసోమ్రాజ్య రక్షామణియగుట చేతనే గాక మహావిద్వాంసుఁడై ప్రత్యేకము జ్యోతిష సిద్ధాంత భోగమున ససమాన ప్రజ్ఞా పాండిత్యములు గలవాడై క్లిష్టార్ధ యుతమైన సోమసిద్ధాంతమున కొకవ్యాఖ్య వ్రాసి ప్రసిద్ధి గాంచినవాడు. ఈత డీవ్యాఖ్యను. క్రీ.శ.ర 1415 దవ సంవత్సరమున రచించెను. అందుఁ

దన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు. "

  ఆ శ్రీమద్వాలలో తే. ట్రయ చూసలను
వస్తా శ్రీ కట్టు కళ్యాణ్య పౌల్‌ మామిడీ చుఁam
కు పెద్దగ్యాస్య తం జోగుహాయకాః
షెడకోమటి నే మేం క్రమం లో నా లేక థీమతా
జ్యోగాలు సృశా దృశ్యజా
సి.యామాత్యు లే: సు)లోకి హితైషిణా
సచసి..కి న్యాఖ్యాగూ ళ


ఇతఁడు దైవజ్ఞశి ఖామణి యగుటచేత సీ శ్రీనాథభట్టరుకవి పం బాంగ స్థిర మంత్ర రక్షణకళా ప్రౌడుండని తన నైషధమున నీతని సభివర్ణిం చియుండఁబోలు. సకలవిద్యా పారంగతుండయిన యీ యమాత్య శేఖ రుండెప్పుడును “మృదుమదుర చిత్ర విస్తర కవితావిలాస వాగీశ్వరులగు కవీశ్వగుల చేతను, పతంజలిక ణాదాక్ష చరణపక్షీలాది శాస్త్ర సిద్ధాంత కమలవసహుసులగు విద్వాంసుల చేతను, భరతమతంగద త్తళ కాపాలాంజ నేయ ప్రణీత సంగీతవిద్యారహస్య విజ్ఞా వైజ్ఞానిక స్వాంతులగు కళావం తుల చేతను, శక్తి త్రయ చతురుపాయ షాడ్గుణ్యప్రయోగ యోగ్యవిచా రులగు రాయ బారులచేతను, నిఖిలపురాణేతిహాస సంహితా తాత్పర్య పర్యాలోచనా ధురంధరధిషణా సము త్సాహులగు పౌరాణిక వర్యుల చేతను, గొల్వుకూటంబుగఁ బరి వేష్ఠింపుఁబడియుండి సరససాహిత్య గోష్టీ వినోదప్రసంగంబులు జరుపుచుండు” నని నైషధమహా కావ్యము నందభి వర్ణింపఁబడి యుండుటఁ జూచియు మహా మేధావులయిన లక్ష్మణ రావు గారును, వీరేశలింగముగారును నొక్కకలముపోటుతో గవిలెకట్టలుమోయు గుమాస్తాగా నీడ్చి వేయఁ బ్రయత్నించిన దెంతయు శోచనీయము.

కొండవీటి గార్దబములు

కొండవీడాకాలమున నసంఖ్యాకులగు కవులతో నిండియుండెడి దనియు, వారిలో సరసకవులు, వీరసకవులు, కుకవులు గూడ నుండెడి వారనియు, ఎక్కడఁజూచినను సుకవుల కవితారచనము లేగాక యసమర్ధు .. లగువారి కవితారచనములు గూడ వినంబడుచుండెడి వనియు, శ్రీనాధుడు "

డొకనాఁడు 'పుర మేగిన పుడిట్టి యసమర్ధ కవి తారచనములు చెవికీ వినంబడి సపు డీక్రింది చాటువును జెప్పి వారి నపహాస్య భాజనులుగాఁ జేసెనని తెలియుచున్నది.

ఉ. బూడిదబుంగయొడలుపోడమీఁదక్క మగ ంబు నెల్లనై
వాడల వాడల దిగే వారును వీరును జొచ్చొచోయనిన్
గోడల గొందులం నొడిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిడ నీవుమంగవివి కాదుగదా యనుమాన మయ్యెడిన్ .


వామనభట్ట భాణుఁడు.

వేమభూపాలుని యాస్థానమున శ్రీనాథునిఁ జెప్పిన వెనక బేరెన్నిక గాంచినకవి వామనభట్ట బాణుఁడు. ఇతఁడొక గొప్ప సంస్కృతకవి, ఇతఁడు సంస్కృత భాషలో గ్రంథములఁ బెక్కింటినీ రచియించి విశేష ముగాఁ బ్రఖ్యాతిగాంచి వేమభూపాలుని మన్ననకుఁ బాత్రుడయ్యెను. వీరనారాయణ చరిత్రమను సామాంతరముగల 'వేమభూపాల చరిత మను నాఖ్యాయిక యు, రఘునాథాభ్యుదయము నలాభ్యుదయమునను కావ్యములను, పార్వతీపరిణయ శృంగారభూషణములను రూపకములను శబ్దచంద్రిక , శబ్దరత్నాకరము, అను నిఘంటువులను, హంస సందేశమను ఖండ కావ్యమును రచించిన వాడు. తన నిఘంటువులలోఁ బ్రారంభమున


శ్లో. విద్యారణ్యగురూన్ సార్వభౌమాద్య ఖిల సత్క వీన్
నమస్కృత్యాథ బాణేశ క్రీయ తే శబ్దచంద్రీకా!
శ్లో. వర దాగ్ని చిత 8 పౌత్ర పుత్త మటియజ్వ నః
జాగర్తీ వా మనో బాణోవత్స వంశశిఖామణి!!


అని చెప్పుకొని యుండుటచేత నితఁడు విద్యారణ్యులకు శిష్యుం డనియు, సార్వభౌమకవి యనఁగా శ్రీనాథుని ప్రత్యర్థి యగు ఉండిమకవి సౌర్వభౌముఁ డై యుండుననియు, శృంగారభూషణ భాణము తుంగాభద్రా తీరమున విరూపాక్షోత్సవమునందుఁ బ్రదర్శింపఁ బడినట్టురచింప బడినదగుటచే నీతని జన్మస్థలము విద్యానగర ప్రాంత మేమోయలి సంశ.. వాఁడు. యముగలుగుచున్న దనియు, శ్రీ ప్రభాకరశాస్త్రిగారు వాయుచున్నారు. ఈయూహలు నిలుచునవి యైనను గాకపోయినను జన్మస్థలము నిర్ధా రించుట కీశ్లోకములు చాలవు. విద్యారణ్యుల జన్మస్థానము విద్యానగ నము కాదు. విద్యానగరము క్రీ. శ. 1336 వ సంవత్సరమున మొదటి హహన రాయలచే విద్యారణ్యుని పేరీటఁ బునరుద్ధరింపఁబడినది. అప్పటికి విద్యారణ్యునికి ముప్పదియైదు సంవత్సరములయిన నుండియుండునను టకు సంశయింపఁబని లేదు. డిండిమకవి సార్వభౌముఁడు దేవరాయలు యొక్క తుది కాలమునను ప్రౌఢ దేవరాయ" యొక్క ప్రారంభ కాల మునను ప్రఖ్యాతి గాంచియున్న వాఁడు. దేవరాయలు క్రీ. శ. 1406 వ సంవత్సరమున విజయనగర సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుడయిన విజయనగర సామ్రాజ్యమును పాలించిన వారిలోఁ జక జక్రవర్తియని జెప్ప దగినవాడు రెండవహరిహర రాయలు, ఇతఁడు విద్యారణ్యులకు శిష్యుండేయైయుండి విద్యాభ్యాసమునుగావించి వాడనిన చెప్పినయెడ నేకాలము నందనిప్రశ్నము పుట్టక మానదు. 'రెండవహరిహరుఁడు క్రీ. శ. 1322వ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁడయ్యెను, గనుక సప్పటి విద్యారణ్యుడు కొంచెమించుగా 51 సంవత్సరముల వాఁడై యుండును. అట్టివానివద్ద విద్యాభ్యాసము చేసియున్న యెడల నడమమిగువ దేండ్ల ప్రాయమువాఁడై సయిన యుండవలయును. విద్యారణ్యస్వామిపట్ల నతి గౌరవము జూపెడి రెండవ హరిహరుఁడు విద్యారణ్యుని శిష్యుని విద్యానగర వాసుఁడైన పండితుని తనకంటెను దక్కువస్థితియందుండిన గోమటి వేమభూపాలు నికి విడిచి పెట్టియుండునా! ఇతఁడు విద్యారణ్యునకు శిష్యుడై విద్యానగ గనివాసియై యితఁడు పేర్కొన్న సార్వభౌమకవి డిండిమ భట్టారకుఁ డే మైనయెడల, వీరూ పాక్షోత్సవమునునది. హంపీవిగూ పాక్షస్వామియే మైయుండిన యెడల, నమ్మహా సామ్రాజ్యమును, ఆ మహానగరమును విడిచి కొండవీడు చేరి వేమభూపాలునీ యాస్థానముననుండి "వేమభూపాలచరిత మును రచించి యనేకాతిశ యోక్తులతో నతని నొకమహాచక్రవర్తి గానభి బరిశోధించి సిద్ధాంతీక గానంబకు

వర్ణించుటకు విజయనగర సామ్రాజ్యము పైని, ఏతచ్చక్రవర్తుల పైని, జన్మభూమి పయిన నెద్దియేని ద్వేషము ఫుట్టినఁగాక వేరు కారణము చెప్పు రాదు. అదియునుంగాక విద్యారణ్యులు డిండీమకవి సార్వభౌముఁడు నేక కాలమున విద్యానగరమున నున్న వారుగారు. ఈ విషయముఁ జక్కగా బరిసోదించి సిద్ధాంతీకరించిన ప్రభాకరశాస్త్రిగారు సమున్వముముకు సమ ర్ధింపఁజూలము. ఎట్లయిన నేమి? పెదకోమటి వేముని ఆస్థానకవీశ్వరుం డుగానుండెనని తెలిసికొనఁగలుగుచున్నారము. వేమభూపాల చరితము గద్య కావ్యము పఖ్మాత, డైన బట్ట బాణుని మార్గము ననుసరించి యీతఁడేగద్య కావ్యమును గచించెను. ఈ వేమ భూపాలచరిత్రమున వేమ భూపాలుని నంత్యత్యచరిత్రమును దెలుపువిషయము లంత గాఁ గానరావు, గాని దాక్షారామ వేశ్యావర్ణనము మాత్ర మెక్కువగా గానంబడుచున్నది. కోమటి వేముఁడీగ్రంధమునందు, సరసకవి కావ్యశరణభూషణేన కళా ప్రతిదినమలం కుర్వన్' అని వర్ణింపఁబడియుండుటచేత ప్రభాకర శాస్త్రి గారు శ్రీనాథుఁడు సరసకవులలో నగగణ్యుఁడవును గదా యను చున్నారు. వామనభట్ట బాణుఁడుగూడ నందగగణ్యుఁడు గాఁడా! "శ్రీనాథుని వలె దాక్షా రామ వేశ్యావర్ణన మెక్కువగా జేసి యుండినవాడే గదా.

మఱియు గంధోంతమం దీశ్లోకమున్నది. శ్లో. సుగుణాలంకృతి శుభ గా సుకృతి లయం కట్టబాణభవ . అధరయతి, ధులే సముఖత kణా సాగా దమాధుశ్యామ్,

ఇది వామన భట్ట బాణుని రచనము కాగూడదనియు, మఱియొక కవి యాతనిఁ బ్రశంసించుచుఁ జెప్పీ నదనియు ఇయ్యది శ్రీనాథుఁడు చెప్పి నవనియు వారియభి ప్రాయము. శ్రీనాథు: కు చెప్పిన యీశ్లోకమును దన ప్రఖ్యాతికై తనగంధములొనర నలంకరించుకోని యుండె.ముగాఁబోలు! వామనభట్ట బాణుఁడు. ఇంతకుముందు దాహరింపబడిన హరవిలాపము లోనిపద్యమె యీతలంపునకు సాధకమని నాము "సుత్రులగు శాస్త్రి గారు దెఖుపుచున్నారు. అట్లయినయెడల సకల విద్యాసనాథుఁడగు శ్రీనాథుఁడు పెదకోమటి వేమారెడ్డి, వామునభట్టును, తిప్పయ సెట్టిని నొక్క యుయ్యెలలో నేయుంచి యొక జోల పాట పాడి జోకొట్టిన వాడని తేలు చున్నది పర్యవసానము.

ఈతని సశస్తి యెట్టిదో యీ క్రింది. ఇందుశ్లోకములవలన బాగుగాఁ దెలియనగును.

 శ్లో, సౌభాగ్యస్య వెళ్తు విధిశ్శృతవసర్వి వ్యా వధూ నాం వగో
ఇక్ష్వాకకేళిగృహు ప్రసూతి భవనం శీలస్యకీర్తేపదమ్
నిస్సామాన్యవికామయాకవితాయ జాగర్తి వత్సాద్వయా
శ్రీమాకన్ సమసభట్టబాణసుకవి స్చాహిత్య చూడామణిః
శ్లో.గాధాస్తాసమాద్యం తారోదధతు వితధతాం తార్కికాస్తర్కవిద్భ
స్సత్రాపత్రాధాగతారోదద్తాం ఫణిఫణితజాషో నః కృతంప్రక్రియాభీః
భూమ్నాం సాహిత్యవీమ్నామది భంవిధువనే నామనే భట్టబాణే
దీప్యత్యస్మిన్ కవీంద్రే జహితజహితభో దద్వరావిద్వాదాస్థాం

భట్ట బాణుని వెనుక నైపుణ్యతను జూపఁగలిగిన గద్యకావ్యకర్తలులేరను లోపమును దీర్చిన వామనభట్ట బాణుని గద్యకవిసార్వభౌముఁడని వచింపనగు.

ఇతర విద్వాంసుల పోషణము

.

ఆర్యవిద్యల సంరక్షణార్థమును, విద్యత్కుటుంబముల పోషణార్థము సకలవిద్యాసనాథుఁడై విద్యాధికారి పదవియం దుండిన శ్రీనాథుడు పెదకోమటి వేమభూపాలునిచే ననే కాగ్రహారముల నిప్పించెను. ఆకాలమున నాంధ్ర దేశమున నాయుర్వేదము విశేషవ్యాప్తి నొందు చున్నటులనేకశాసనములం బట్టి మనము తెలిసికొనఁ గలుగుదుము, అట్టి బహుమానములను గాంచిన యాయుర్వేద విద్యా పారంగుతులయిన మహనీయులు వేమభూపాలుని విద్యాపరిషత్తు , నలంకరించినవారిరువురు గలరు. వారిలో మొదట బహుమానముగాంచినవాఁడు భాస్క రార్యుఁడు. అటుపిమ్మట, బహుమానముఁ గాంచినవాడు సింగనార్యుఁడు (C) భాస్క రామ్యుఁడు; — ఇతఁడు కప్పయెముక గ్రుచ్చుకోనుటచే వ్యధ : జెంచుచున్న పాముబ్రదికించి 'ఇరహితబిరుదమును” బొందిన పండితవంశమున జనించిన పరహితుని కుమారుడు.

<poem>మండూక సయవ్యదత సర్ప ప్రాణాభిరక్షణాత్ ఆసేమషాం పండితానాం కుఱే పరహితాసేవామ్

మొదటి పొన్ను పల్లి శాసనము.


“భూలోకధన్వంతరి యనుప్రసిద్ధిగలవాఁడు; యజుశాఖాధ్యాయి, ఆపస్తంబ సూత్రుఁడు; కాశ్యపగోత్రుఁడు; ప్రభాకరశాస్త్రిగారు భారద్వాజ గోత్రుఁ డని వ్రాయుట, కాశ్య పాయ యజుశ్శాఖాధ్యాయినే సుకృతాత్మనే' యని శాసనములో వ్రాయఁబడిన దానికి విరుద్ధముగాఁ గన్పట్టుచున్నది. అనితల్లి కలువచేఱు శాసనముసగూడ నీశాసనమునం దున్నట్లే పరహితవంశప్రశంస గలదు. అక్కడఁగూడఁ బరహితవంశ్యుఁడే ప్రతిగ్రహీత" అని ప్రభాకరశాస్త్రిగారు వ్రాయుట చూడఁగా వీరిరువురుని నొక్క వంశమువారిగా భావించినట్టు గన్పట్టు చున్నది. ఈ రెండువఁశములు భిన్న వంశమ లని శాసనమ.యుదున్నది. కలువచేటు శాసనములోని పరహీ తాచార్యుఁడు "అత్రిగోత్రకమలాకరభాను" అని 6 తేయగోతుఁడని శాసనములో వక్కాణింపఁబడియెను. కాని దానినిఁఆంధ్ర సాహిత్య పరిషత్పతికలోఁ బ్రకటించిన శ్రీ జయంతి రామయ్య గారు శాసనములోఁ జెప్పఁబడిన దానికిభిన్నముగా భారద్వాజస గోత్రుడని వ్రాయుట వింతగా నున్నది. పరహితవంశ్యులకును, కాశ్యపగోత్రుఁడు నైన భాస్కరార్యుని శ్రీ ప్రభాకరశాస్త్రి గారును,పరహితనం శ్యుఁడు.కు, ఆత్రేయగోత్రుఁమును నగు పరహితాచార్యుని శ్రీజయంతి రామయ్య గారును భారద్వాజసగోత్రులని వ్రాయుటకుఁ గారణమేమో యూహింపనలవిగాదు. వీరుపండితులు పరిశోధకులు నై యుండియు భిన్న గోతులని శాసనములలో స్పష్టముగా వ్రాయఁబడి యుండగా నాశాసనములం బ్రకటించిన వారయ్యు నిట్లు వ్రాయుట వింతగాగన్పట్టదా..కలువచేఱు శాసనముం బ్రకటించిన శ్రీ జయంతి రామయ్య గారు పరహితుఁడు కాళనాధునితనయుఁడు ప్రకృతముశాస నస్వామియగు కాళనాథభట్ల సుబ్రహ్మణ్యముగారీ కాళనాథుని వంశ ములోని వాడనియు, కాళనాథభట్ల వారను నింటి పేరీ కాళ నాధుని బట్టియే వారికీ వచ్చెననియు నూహింపఁదగి యున్నది. వీరు కాసలనాటి వారు. వీరిది. భారద్వాజసగోత్రము. యజుశ్శాఖ వీడియింట వైద్యవిద్య నేటికిని గలదట. * అని వాసి విమర్శలో తప్పుతోవదీసిరి. వీరి వాక్యములను విశ్వసించి ప్రభాకరశాస్త్రీగారు కూడ శాసనముల విమర్శింపక పంజరములోని కీరమువలె రామయ్య గారి పలుకే పలికిరి. రామయ్య గారి యూహసరియైనది కాదు. కాసలనాటి శాఖవారై న కాళనాధభట్ల సుబ్రహ్మణ్యముగాకు కలుసచేఱు శాసనములోని నాధుని వంశములోనివారుగారుట స్పష్టము. వీరిది భారద్వాజ గోత్రము వానీది యాత్రేయనగోత్రము'. కాళవాధభట్ల యను నింటి పేరుగల వారొక్క. కాసలనాటి శాఖ వారిలోనే గాక యాంధ్ర దేశమున నీతరశా ఖల వారిలోఁగూడ నున్నవారు. కావున రామయ్యగారి యూహసరి యైనది కాదని చెప్పక తప్పదు. పొన్ను పల్లి శాసనములోని భస్కరా ర్యుఁడును, కలువచేఱుశాసనములోని పరహి తాచార్యుఁడును కప్ప పొము కథకు సంబంధించిన పరహితువంశశములో జనియించినవారే యుండ నొకరిని 'F శ్యప.గోత్రనిగాను. మఱియొకని నాత్రేయ గోత్రుని గాను భిన్న గోత్రులుగాఁ జెప్పుటకుఁ గారణము గనుపట్టదు. ఆంధ్ర దేశమున బాహ్మణులలో నేక గోత్రముగలవారి వంశనామములు వేర్వేరుగ నుండుట గనంబడునుగాని యొకపురుషుని వంశములోని వారు భిన్న ఋషి.గోత్ర ములలోఁ బరగిన వారిని బాహ్మణులలో నేను గనుగొని యుండ లేదు. ఇదియే ప్రథమమున నాకన్నులకుఁ దట్టింది. 'పొన్ను పల్లి శాసనములో మూల పురుషుఁడయిన పరహీతుని గూర్చిన కథ. కలువచేఱుశాసనములో వివరణముతోఁ గూడి యిట్లున్నది. 03

ర్ఘాస్థి మ్యూక వస్త్రభ ముపు ఏ ముసకు కర్మయుల సమాస్యం
దృష్ట్పావల్మీక పార్శ్వేభుంగవరము పేతెయాభయో యంకృపాళు యు సేద్యాభయో
కృత్వాసమ్యక్తికి మచిక " ముపరు జాతేవ దత్తాభియశ్రీ
న్యాత్దోన్ పాక్రమతాత్పరహితభిషజోనామతస్వార్థన్ యుక్తం

పరహితాచార్యుఁడకు వైద్యునకు మూలపురుషుఁడగు పరహితుఁడను నాతఁడొకానొకప్పుడొక సర్పము దౌడలు రెంటికిని నెముక గుచ్చు కొని బాధపడుచుండుటఁ జూచి యయెముక నూడఁబెఱికి పుండునకుఁ జికిత్సయెచర్చి, పరహితుఁడను ననర్థ నాముఁడై యాపామువలన నభయ దానమును బొంది చికిత్స చేయనారంభింప నాటినుండియు సర్పచికిత్స యాకవివంశమున బరంపరగ నడచివచ్చుచుండెనఁట. భాస్కరార్యుఁడు భూలోక ధన్వంతరియని శ్రీనాధుఁడు లిఖించినాడుగాని ప్రసిద్ధ సర్పచికి త్సకునిగాఁ జెప్పీయుండ లేదు. తండ్రిని దక్క భాస్కరార్యుని పూర్వుల మఱియెవ్వరిని గూడ పొన్ను పల్లి శాసనము పేర్కొనియుండ లేదు. కలున చేఱు శాసనమునఁ బరహితుని పూర్వు లెల్లరును గొప్ప సర్పచికిత్సకులని పేర్కొనంబరి. పొన్ను పల్లి శాసనము 1404 వ సంవత్సరమునను , కలువ చేఱు శాసనము 1423 వ సంవత్సరమునను లిఖయింపఁబడినవి. ఇంచుమించుగా గెంటికీ నడుమ 19 సంవత్సరము లుండును. ఇంత మాత్రము కాలవ్యవధిగల శాసనములలో నొకేవంశము యొక్క గోత్ర ములు భిన్నములు గానుండుటకు హేతువేమయి యుండునో దుకూహ్యము. వేమభూపాలుడు కృష్ణ వేణి నదికి దక్షిణ తీరముననుండు పొన్ను పల్లియను గ్రామమునకు వేమవరమనుసొమమును 'బెట్టి సోమేశ్వరస్వామి, సన్నిధానమునఁ బుత్త పొత్త పారంపర్యముగా ననుభమిష ననేక బా హ్మణులయెదుట భాస్కరార్యునకు దానము చేసి యుండెను.

(2) సింగనార్యుడు; — కళ్యాణగుణ శాలియగు పెరియ పిళ్ళకు సప్తసాంగ వేద వేదియు బ్రహ్మ వాదియు నగు భట్ట భాస్కరార్యుని పాత్రుడు పదు నెనిమిది విద్యల ముందు పారంగతుడైన విళ్ళ యార్యునకు బుత్రుడు; సాష్టాంగమయిన యాయుర్వేద మధ్యయనము చేసినవాడు, ఫణి రాజమహాభాష్యఫ్క పరమేష్టి; పూర్వోత్తరమీమాంసాశాస్త్ర ములు బాగుగా నెఱింగిన నాఁడు; కణాదగీతముల తర్క శాస్త్రముల నేర్చినవాడు యజుర్వేది; ఆపస్తంబ సూత్రుడు; 'కాశ్యపగోత్రుఁడు శివభక్తుడు. ఈశాసనకాలము శా. శ. 1330 అనఁగా క్రీ. శ 1408 దవ సంవత్సము, దత్తాగ్రహారము పొన్నుపల్లి. ఇయ్యది దివిసీమలో కృష్ణాతీరమున నున్నది. ఇందలి పెరియపిళ్ళ, విళ్లయార్య నామములను యీ దానప్రతిగ్రహీతయగు సింగనార్యుఁడు ద్రావిడ బ్రాహ్మణుఁ డగునేమోయని సంశయము కలుగుచున్నది.

(3) "సిద్దియజ్వ: ఇతఁడు యజు ర్వేది. హరితసగోత్రుఁడు; కృష్ణా తీరమున సనేక యజ్ఞములను జేసిన మహావిద్వాంసుఁడగు భీమయజ్వ యూయనముత్తాత (తాతతండ్రి షట క్కకర్క శాలాపప్రక్రియాపర మే శ్వరుడనఁ బ్రసిద్ధిగాంచిన మహా విద్వాంసుఁడు. పోతయ యీయన తాత పౌండరీక యాగము జేసి బ్రహ్మసంతతికి నలంకారమయిన వాఁడు. గుండయ యీయనతండ్రి; గోదావరీతటమునం బెక్కు యజ్ఞములను గావించిన వాఁడును బ్రహ్మ, సూర్యాది సిద్ధాంతములను శోధించి తఱచి చూచిన దైవజ్ఞుఁడును త్రికాల వేత్తయునై నవాఁడు పెద్దియజ్వ: ఇతఁడన వేమభూపాలునివలనఁ గూడ నగ్రహారమును బడసినవాఁడు. ఖండ వాటనున్న కల్యవాములయను గ్రామమును నగ్రహారమును బడసిన నాఁడు. ' ఈశాసన కాలము శా.శ. 1326 వ సంవత్సర మనఁగా క్రీ.శ. సంవత్సరము. ఇతఁడె శా. శ. 1333 అనఁగా క్రీ. శ. 1411 వసంవశ్సరమున వేమభూ పాలునివలన ఖండ వాటి సీమలోని సందమూరు గ్రామమును దానము నొందెను.

(4) శంకరగురువు; ఇతఁడు. వేమభూపాలునీ మాంత్రి శేఖరుఁడు సింగనామాత్యునగు గురువని శృంగార నై షథములో శ్రీ గురు శంకరమానీ

దయా గౌరన నిత్య నర్థి తాన్వయ' యని సింగనామాత్యుని సంబోధిం చిన శ్రీనాధుని సంబోధన పద్యపాదమువలన గ్రహిపనగును. పినపా డునందున్న యుద్భటారాధ్యుని సంతతి వారగువారు తామిళంకరగురు సంతతి వారమని చెప్పుకొనియెదరు. వేమభూపాలునీవలన శా. శ. 1327 అగు పార్థివ సంవత్సర మాఘ మహాశివరాత్రి పుణ్య కాలమున శ్రీశైల మునకుఁ బోయినపుడచట పీనపాడను గ్రామ మీశంకర దేశికునకు దానము చేయఁబడినది.

(5) పిసిపాటి రామభద్రసోమయా----- ఇతఁడు షట్కర్మలనిరతుఁడు. యజుర్వేద వేత్త ఆపస్తంబ సూతుడు భారద్వాజసగోత్రుడు బహుతపస్సంపన్నుడు; బ్రహ్మవేత్త శా. శ. 13301 అగు సర్వధారినామసంవత్స రాశ్వీయుజ బహుళానవాస్యా సూర్యగ్రహణ పుణ్య కాల మున క్రీ. శ. 1408 వేమభూపాలుడీయనకు సహిరణ్యాదక దానధారాపూర్వకముగా పొట్ల పొడు అనుగ్రామము నగ్రహారమునుగా జేసియొసంగెను.

(6) విశ్వేశ్వరపండితుఁడు:--- ఇతఁడు చమత్కారచంద్రికయనుశాస్త్రమును రచించిన వాఁడుగఁ గన్పట్టుచున్నాడు. ఇతఁడుయశోనిధి, మహా మేధోవి విద్యానిహార భూమి, యగు మాథవార్యుని పౌత్రుడు. వేదాదినిద్యలకు జన్మమందిరమువంటివాఁడగు గుండయా ర్యుఁ డీతని తాత! లక్ష్మీనరసింహ మంత్రసిద్ధుఁడును, శాపాను గ్రహదీక్షుడును సకలకవిసార్వభౌముఁడును నగుమాధవార్యుని కుమారుఁడు; మహా విద్వాంసుఁడు, విద్యావిసయాన్వితుఁడు. 'వెలనాటిలో తుంగభద్రాతీరమునందున్న ఆలపాడనుగ్రామము నీతని కగ్రహారముగా నోసంగఁబ *నదీ. వి శ్వేశ్వర భట్టారకుఁడు వెను వెంటనే యరువది పాళ్లుగా విభజించితనవంతు భాగముగాక తక్కిన భాగములను విశిష్ట బాహ్మణులకుఁ బంచియిచ్చెను.

"17) రామ చంద్రజ్యోతీషికుఁడు - ఇతఁడు పెద్దియజ్వ పుత్రుడు నలంకారశా SE

బ్రహ్మసూర్యాది సిద్ధాంతరహస్యా ధైక వేది. ఇతనికి రుద్ర వరమను గ్రామము దానము చేసి సపుడితఁడును మఱికొందఱు బ్రాహ్మణులును బంచికొనిరి. .

ఇట్టినుహా విద్వాంసులతోఁ గూడుకొని సకలవిద్యాసనాధుఁడైనశ్రీనాధకవి యధ్యక్షుడుగానున్న పరిషదఁబుచే నలంకరింపబడినయాస్థానము చేనలంక సింపఁజున కొల్వుకూటమున సర్వజ్ఞ చక్రవర్తీ బిరుదాంకితుఁడైన పెద కోమటి వేమభూపాలునిఁ జూచీ యొక కవి:---


శ్లో. జ్ఞాతాయది వహిదాతా
'దాతాచే త్కో ౽పికి ముని విజ్ఞాతా
జ్ఞాగా వాతా చాభూ
పెదకోమటి వేముకు ఫతే చిత్రమ్.

శ్లో. అర్ధిజనచింతతార్థా
దధకం చేతప్తతో౽సితేవాణీ;
అస్యాఅపిదిశతికరః
పెదకోమటి వేమభూపతే చిత్రమ్ .

శ్లో. శ్రిత పోషణ రిపుశోషణ
బుధతోషణ సత్య భాషణాది గుణాన్
దదతేతే దశరథ రామ
ప్రాగద్యక లౌతు కోమటివిభు వేష !

అని పొగడు టొక యూశ్చర్యకరమైన విషయముగాదు.


శ్రీనాథుని వివాహము.

కీ. శ. 1448 దవ సంవత్సరమునాటికి 'రెడ్డి రాజ్యము లనందగిన రాజమహేందపుర రాజ్యమును, కొండవీరురాజ్యమును, విజయ సగరసామ్రాజ్యాధీశ్వరుల దగు నుదయగిరి రాజ్యమును కటకపు రాధీశ్వరుఁ డయిన కపిలేంద్రగజపతికి సంపూర్ణముగా వశ్యములై యాతని చే బరిపాలింపఁబడుచుండిన వనట స్పష్టము. మాధవనర్మ వంశోద్భవుఁ డగు బసవభూపొలుఁ డుదయగిరి రాజ్యమును .గజపతుల పక్షమునఁ బరి

పాలించుచున్న కాలమున నాతనికి మంత్రిగానున్న చందలూరి గంగ యామాత్యునకుఁ దాను రచియించిన నాచికేతోపాఖ్యానము నంక్ తము గావించినవాడు శ్రీనాథుని మజడి ఉగ్గుబల్లి దుగ్గనామా త్యకవి. ఇతని యక్క యె శ్రీనాథుని భార్య. ఇతఁడు శ్రీ) నాథునకు మజుఁదిమాత్రమేగాక శిష్యుఁ డవనిగూకఁ జెప్పుకొనియున్న పోడు. కపి లేంద గజపతి క్రీ. శ. nen వజకు మాత్రమే యీరా జ్ళు నులను బరి పాలించియుండే నని మన మెజుంగుదుము. కాని బసవ భూపాలు డెప్పటినుండి యెప్పటినటకుబరిపాలించియుండెనోయూధార మంతఁగాఁ గానరాదు. ఎట్లయినను కపి లేందగజపతి బ్రతికియున్న కాలమున అనఁగా క్రీ. శ. గిరరణ మొదలుకొని శ్రీ. శ.వఱకుఁ గల మధ్యకాలమునందు ఉపయగిరి రాజ్యమును బసనభూపా లుఁడు బరిపాలించుచుండే ననుట సశ్యమునకు విరుద్ధము కాదుగనుక నాకాలమున నాతని మంతియగు గంగయామాత్యుం డుండెనని చెప్పఁ దగును. కావున దుగ్గనకవి తన నాచికేతూ పాఖ్యానమును గంగయా మాత్యునకు (1940 దవ సంవత్సరప్రాంతముల నంకితము చేసియుండు ను. శ్రీనాథుఁడు పెదకోమటి వేమభూ పాలునికడ విద్యాధికారిగఁ బ్రవే శించిన కాలముననే నీతఁడు ఫుట్టియుఁడవచ్చును. ఇతని యక్క కు బెండ్లీ నాటికి పదేండ్లు వయస్సు గలిగి యుండుముగనక నామెకు గరం సొటికీ వివాహమయిన యెడల (రంగ నాటికి శ్రీనాథుఁడు విద్యాధి కారి పదవికి వచ్చునప్పటికీ నిరుపదినాలు గేండ్ల ప్రాయముగలవాడై యుండుటయు, భార్య పదునాలు గేండ్ల వయస్సుకలదై కాపురమునకు వచ్చియుండుట సత్యమున కంతదూరములు కావు. దుగ్గనకును, అతని యక్క కును 10 సంవత్సరములకన్న నెక్కువ వ్యత్యాస ముండు నని తలంపఁజాలను. శ్రీనాథునకు మజఁదియు, శిష్యుఁడునై యుండుటయె గాక (కాంచీపురమహాత్మ్య' మను ప్రబంధమును గూడ రచియించిన వాడుగావున శ్రీనాథుఁడు కొంచీపురమునకుఁ బోయి యవచితిప్పయను సందర్శించినకాలమున దుగ్గనకూడ పోయియుండును. అప్పటి కితడిరువతె యేడ్ల ప్రాయము గలవాఁడై యుండవచ్చును. గంగయామాత్యుఁడును వాని ప్రభువగు బసవభూపాలుఁడును. పురుషోత్తమగజపతి కాలములోఁ గూడ గొంతకాల ముండియుండవచ్చును. గంగయామా త్యుఁడు ప్రథమమునఁ గృతిపొందిన గ్రంథము నాచికేతూ పాఖ్యానమె. తరువాత నంతము నొందినది. ప్రబోధ చంద్రోదయము. నంది మల్లయ్య, ఘంట సింగయ్యల కంటే (ప్రబోధచందో దయ కర్తలు)వయస్సున దుగ్గన "పెద్దనోడుగాని సమానవయస్కుఁడు గాఁడు. దుగ్గనకవిత్వమును గంగయామాత్యుఁడు ప్రశంసించి ప్రస్తుతించిన విధ మీక్రిందిపద్యమున నభివర్ణింపఁబడినది.

వ, శుతులకు హార దేశములు సుస్థిర వాక్య పద ప్రమాణ శా
స్త్రతతుల యిక్క లాగము పురాణచయమ్ముల మేలిపద్మ ముల్
స్మృతుల నివాసముల్ కవిసమాహిత సత్కవితాగుణ ప్రసా
దితములు దగ్గుబల్లికవి తిప్పుడు. దుగ్గన గద్య పద్యముల్ -


వేముని కాశీ రామేశ్వరయాత్రలు.

పెదకోమటి వేమభూపాలుఁడుశా.శ.1326 తారణ సంవత్సరములో (క్రీ. శ.1404 రామేశ్వరయాత్రకుఁ బోయినట్లు ద్రవిడ దేశమునందలి తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి సువర్ణ కిరీటముసమర్పించినట్లు వాయించి యూ దేవాలయమునఁ జిక్కించిన శాసనము బట్టి 'దెలియుచున్నది. ఈ శాసనమున నితని వంశసర్జన. మంతయుఁబద్యములలో సభివర్ణింపఁ బడియున్నది. ఇందిత డిక్ష్వాకువంశమునఁ బుట్టిన క్షత్రియుఁడుగా " నీక్రిందిపద్యములో వర్ణింపఁ బడియెను.

శా. ఏవంశంబున సుద్భవించీ కరుణాహృత్కజుఁ డిక్ష్వాకుడున్
ధీవర్యుండు రఘుం డజుండు ఘనపంక్తిస్యందనూండుంహుకుం
డివిశ్వం బును ఖ్యాతి నేలి రలఘుప్రే కాంవయ బంచు నా
త్రీవర్యుల్ జనియించి 'యేలి నతం బీతిన్ బెక్కురా పిమ్మట

.ఉ. అయిదవపంశమునందు నరపాగ్రణి ప్రోలనృపుడుపుట్టెరా
హాయతశక్తి మంతుడు క్రమంకుఁ హతౌఘు నిపాటనశూరవర్యుడున్
న్యాయగుణుండు వేమ వరనాథుడు పుట్టెను నానివంశమం
దాయుతమైన భూవయలను మంచిత రీతినిని వేలు దింపుగన్
 
మఱియు నావంశవర్ణనము చివర

<poem>సీ. శక వత్సరంబులు శరపక్ష గుణ
శశ సంఖ్యయ బాగుగ జరుగుచున్న
సుము హిత తాగణాబ్ద కూన శ్రావణ కార్ణి
మంటున నాదివారంబునండు
శారు తిక్వళ్ళూకు వీర రాఘవునకు
నిజ రాజ్యవృద్ధికై నిర్మలతి
మేటి యూ స్వర్ణకిరీటంబు నర్పించే
సకలకోవిదులు తక సుస్తుతి - ప
మాకమాంబికాయౌనచా స్తోశవనపన
వసంతు దహితాళి కాముఁడు సత్యగతుడు
వీరనారాయణుడు మహాధీరవరుడు
విమలగుణసాగరుండు = వేమవిభుఁడు.

*[13]

ఇయ్యది శ్రీనాథుఁడు విద్యాధి కారిగ నేర్పడక: త్సరము ప్రథమ భాగమున జరుపఁబడియుండును. ఈయాత్ర లో. వేమ భూపాలునితోఁ గూడ శ్రీనాథుడరిగి యుండునుగావున నీశాసవమును నాతండే రచించియుండునని యూహించుట కనకాశము గలదు.

మఱియు ఫిరంగిపుర శాసనమునందు,

శ్లో. శ్రీ శై లేస్థిర మూలతా ముపగతా వృద్ధిం కుమారాచలే పంచారామకలే ప్రశానసుషమా సింహాచలేంద్ర తనః శ్రీకూర్మే పురుషోత్త మే కుసుమితా యుద్మ ర్లతో

కాశ్యాం విశ్వపతే: పురః ఫలవతీ నిత్యోవ్హారోచితం.

శ్రీనాథకవి


"పెదకోమటి వేముని కీర్తిలత శ్రీశైలమున స్థిరమూలమై కుమా రాచలమున వృద్ధినొంది పంచారామములునుము, సింహాచలమునకు బందిరి యల్లి, శ్రీకూర్మమునను, పురుషోత్తమమునను బుష్పించి కాశిలో విశ్వనాథు నెదుర నిత్య నైవేద్యమున కుచితముగా ఫలించే " నని వయిశ్లోకమున కర్ణము. వేమభూపా చరితమున నాకఁడు దిగ్విజయార్థముగా నాసేతుహిమాచలము యాత్ర సలిపినట్టా గ్రంథమునం దదియే ముఖ్యవిషయముగా వామన భట్టబాణుఁడుభివర్ణించి యున్నాఁడు. శ్రీనా ధుఁడుగూడ గాశీయాత్రలో వేమభూసాలుని వెంబడించియుండును. ఈ క్రిందిశ్లోకముగూడ వేమభూపాలుఁడీ యాత్రలను చేసినట్టు బలపడు చుచున్నది.

శ్లో. 'కావేర్యాం తిపురాంతకే జయపురే కాశీపురేగోకులే
పంచారామ పురీషు పట్టసపురే మార్కండ శంభో శపు రె,
గంగా సాగర సంగమేఘ నిరతం శ్రీకొండవీటీపురే
చాళుక్యామయు తొన్న దాన నిరతయు శ్రీ వేమభూపపభు.

రామేశ్వరయాత్ర ముగించిన వెనుకఁ గాశీ యాత్రకుఁ బోయుండును.

సంతానసాగరనిర్మాణము.

ధాన్యవాటిపురమను నామంతరముగల ధరణికోటకుఁ బ్రభువగు గన్న భూపాలుని కూతురైన సూరాంబను పెదకోమటి వేమభూపాలుడు వివాహముఁ జేసికొనియెను. ఆమె సంతానసాగరమను నొక పెద్ద చెఱువును ద్రవ్వించి శా. శ.1331 విరోధి సంవత్సర ఫాల్గుణ బ 2 , శుక్రవారమునఁ బతిష్ఠ యొనర్చెసని ఫిరంగిపుర శాసనమువలనఁ దెలి యుచున్నది. ఈశాసనము చివరను,

విద్యాధికారి శ్రీ నాథా వీరశ్రీ వేమభూపతే
అకరో దాకరో వాచాం నిర్మలం ధర్మశాసనం."

అని యుండుట చేత నియ్యది శ్రీనాథ విరచితమని స్పష్టపడు

చున్నది. ఈశాసనముతుదను శ్రీనాథ విరచితములై న యీక్రింది' సీస

చతుర్థాధ్యాయము

163


పద్యములు మూడును సంతానసొగర ప్రతిష్ఠను దెలుపునవియైయున్నవి.


" సీ.శాకాబ్దములు సహస్రమును మున్నూటము
ప్పది యొకండునైన భవ్యముఖ్య
వఱలు విరోధి సంవత్సరంబున ఫాల్గు
నంబున బహుళ పక్షంబు విదియ
శుక్రవారంబున శుభముహూర్తంబున
శ్రీ ధాన్య వాటీ పురాధిపతియు
కృష్ణ వేణ్ని జలక్రీడావినోదుండు
నగు గన్నభూపాలు ననుగుబుత్రి,
గీ. వీరనారాయణుడు వేమవిభుని దేవి
భూరి సద్గుణ నికురుంబ సూరమాంబ
జగమ వినుతింప సంతాన సాగరాఖ్య
వగతటాక ప్రతిజోత్సవం బొనర్చె',

సీ. జూహ్నవీ యమునాది సకలపావన.....
వీమలతగ్జాంభ పవిత్రతంబు
సవిధి దేశస్థాయి శివమౌళి భాలేందు
కౌముదీ సంపుల్ల కైరవంబు
బహు మహాపరివాహ పొదోభరద్ఘన
ఘుమఘుమాయితదిశా గోళకంబు
జల సొగణీనేక సంవర్ధి తో నేక
ననీ వినీ తాధ్వ గాఢ్వ శ్రమంబు

గీ. బలవ దురుమత్స్య కచ్ఛిపడుళికుళీర
తిమితమింగళ విక్రమక్రమవిహార
తరళతర తుంగభంగా కదంబచుఁలవి
............ మహాపయోధి,

సీ. కపట సూకర మైన కైటభాసుర వైరి
ఖుర పుటంబులఁ బరంక్షుణ్ణమయ్యే
రఘుకులో ద్వహ ధనుర్యంత్ర ముక్తములైన
చిచ్చుర మ్ముల వేడిఁ జేవఁడఱిగె

గుంభకంగవుని హస్తంబోరుహంబున
నాపోసనంబయి హ్రస మొందె
బాషాణముల సచ్ఛ వల్ల గోలాంగూల
కపియూధముల చేతఁ గట్టుపడియె

గీ. వనధి యేభంగి సరివచ్చుననగవచ్చు
నారపా తల గంభీర వ్గారయగుచు
విపగ తా సాయమగుచు శోభాస్యపగుచు
సమసచుండైన సంతానవనధి తోడ.

క్రైస్తవమానముచే సంతానసాగర ప్రతిష్టాలిధి 1410 వ సంవత్సరము ఫిబ్రవరు 21 తేదీ శుక్రవారమగుచున్నది. ఈసంతానసాగరమును చెఱువునకు నీరువచ్చుటకే యీ సూరాంబకొడుకు రాచవేముఁడు శా. శ. 1337 మన్మధ సంవత్సర మాఘ 15 దినమునకు సరియైన కైస్త్రవమానము 1416 సంవత్సరము జనవరి 16 వ తేదీ మంగళవారమునాఁడు జగనోబ్బగండకాలువను' తవ్వించునట్లు అమినా బాదు శాసనము దెలుపుచున్నది. అది శ్రీనాధకృతియైన యొక సీసపద్యముగా నున్నది. దాని మీదిగువ నుదాహరించెదను.

.సీ. * కాకొబ్ధములు సహస్త్రంబును మున్నూట
ముప్పదియేడును నొప్పు మిగుల
మహనీయ మైన మన్మధవత్సరంబున
మఘమాసమునఁ బూర్ణిమాదినమున
"హేమాద్రి దానచి, తొమణీయంరాయ
బసవశంభకుఁ డాజీ ఫల్గుణుండు
సమదారి రాయ వేశ్యా భుజంగుండు 'వే
మయరాచ వేమనక్ష్మా వరుండు

గీ. తల్లి సూరాంబచే సమున్నత మగుచు
జరుగు సంతాన దార్దికి పరువ గాగ
నొలయు గిరి వాహినుల జగ నొబ్బగండ
కాలువఘటించె నా తారకంబుగాఁగ.

శ్రీనాథ కృతి. 033

పెడకోమటి వేముని యంత్యదశ.

పెదకోమటి వేమభూపాలుని పరిపాలనము సర్వవిధముల చేత శ్లాఘా పాత్రమైనదిగా నున్నది. అతఁడు మిక్కిలి సమర్థుఁడు. ప్రజ్ఞావం శుఁడు. అతనిమంత్రు లెల్లరును ప్రజ్ఞానంతులు. బాహుబలవిక్ర మసంప త్తికలవాడగుటచేత శత్రురాజు లెవ్వ రెన్ని విధములఁ దనరాజ్య నాక్ర మీంచుకొనవలయునని ప్రయత్నించినను వారలను బరాజతులను గావించి నైపుణ్యముమీర జనరంజకముగా ధరాసాలనంబు గావించెను. క్రొత్త సుంకములను వేయక ప్రాతపద్ధతునే బలపఱచి సుంకములు రాఁబ ట్టుచుండెను. సర్ణాశ్రమధర్మములను బోషించెను. వేదాధ్యయన సంప న్నులును శాస్త్ర వేత్తలునగు బ్రాహ్మణోత్త ములకు భూదానములు మొదలగునవి చేసి సత్కరించుచు సమస్త విద్యలను బోషింపుచుండెను. దేశమున వర్తక వ్యాపార మభివృద్ధియగు మార్గములను వెదకుచుండెను. బావులను చెఱువులను త్రవ్వించి వ్యవసాయకులకు నుపకారము గావిం పుచుండెను. దేశమున ననేక మతప్రతిష్ఠాపనములను గావించెను. ఈతఁడు 1420 వఱకుఁ బరిపాలనము చేసినట్లు గానంబడుచున్నది. కుమార గిరి రెడ్డి మరణానంతరము పెదకోమటి వేమభూ పాలునిఁ దిరస్కరించి 'కాట యవేముఁడు రాజమహేందపుర రాజ్యమును స్వతంత్రుడైపరిపాలనము చేసెను. అందువలనఁ బెదకోమటి వేమభూపాలునకును, కాటయ వేమభూ పాలునకును మనస్పర్ధ లేర్పడి యొండొరుల రాజ్యము లాక్ర మిం చుకొనుటకై యుద్ధములగూడఁ జరుపుచువచ్చిరి. ఈ యుద్ధములవలన నిరు వురకుఁ గూడఁ బ్రయోజనము లేకపోయేను. ఎవ్వరి ప్రభుత్వములు వారికి నిలిచియుండెను. ఈపోరాటములోఁ గొండవీటి రెడ్ల జ్ఞాతియైన అల్లాడ రెడ్డి కాటయ వేమభూపాలుని పక్షమున నిలిచి యాతనికి సాహాయ్య మును సలుపుచుండెను. అల్లాడ రెడ్డి కొండవీటి రెడ్లకు జ్ఞాతిమాత్రమె గౌక కొండవీటి రాజ్య పాలకుడైన అన వేమభూపాలుని మనుమరాలి భర్తయై యుండెను. "కాటయ వేముని మేనమామయగు అనపోతభూపా ar(ను ఈ అల్లాడి రెడ్డి భార్య వేమాంబతల్లికిఁ బెదతండ్రియై యుండిను. అనఁగా కాటయ వేముఁడును, ఆల్లాడ రెడ్డి భార్య వేమాంబ తల్లియును మేనత్త మేనమామ బిడ్డలగుదురు. ఇట్టి సంబంధ బాంధవ్యము చేత అల్లా డరెడ్డి కాటయ వేముని పక్షముననుండి పెదకోమటి వేమభూపాలునికి బ్రత్యర్థిగఁ బనిచేసెను. కుమారగిరి యనంతర మక్రమముగాఁ "బెనకోమటి వేమభూ పాలుఁడు కొండవీటి రాజ్యము నాక్రమించెను గోవునఁ గాట యవేమా రెడ్డియును, అల్లాడ రెడ్డీయును న్యాయములుకే పోరాడి యుందురు. కాని యీవిరోధముల వలన రెడ్డి సామ్రాజ్యము యొక్క యున్నతికి భంగము కలిగించెను. పెదకోమటి వేమునికంటె నైదుసంవ త్సరములు ముందుగానే అనగా 1415 వ సంవత్సర ప్రాంతమునఁ గాటయ వేముఁడు మృతినొందెరు. అతఁడు మృతినొందినను అతనిసంతా నము పక్షమున గల్లాడ రెడ్డి పెదకోమటి వేమునితోఁ బోరాడిజయించెను. పెడకోమటి వేముఁడు 1420 దవ సంవత్సర ప్రాంతమున మృతినొంది యుండును. ఈతని తరువాత నీతనికుమారుఁడు రాచవేమన రాజ్యభార మును సహించి నాలుగుసంవత్సరములు పరిపాలనము చేసెను గాని యి తఁడు తన దుష్ప్రవర్తనము చేతఁ దండ్రికి నపయశస్సు గలిగించుటయు గాక తన ప్రాణములను గూడఁ గోలుపోయెను. వీనితరువాత రాజ్యమంతయును గర్ణాటాధీశ్వరుల స్వాధీనమాయెను. శ్రీనాథుఁడు గార...20 నజకుఁ గొండవీటి నగరమున నున్న వాఁడనుట విస్పష్టము.

పల్నాటి చరిత్ర రచనా కాలము.

శ్రీనాథుని పల్నాటి వీరచరత్రమని యొక భాగమును బ్రచురించిన శ్రీ అక్కిరాజు ఉమాకాంతముగారు పీఠిక లో నిట్లు వ్రాసియున్నారు. “ప్రథమమున గౌరవము పడయకపోయినను రానురాను శ్రీనాథుఁడు పల్నాటి వారితో మిక్కిలి మైత్రి పాటించి తన వార్ధక్యము సంత యు నచ్చటనే గడపెను. పల్నాటివీరచరిత్ర మచ్చటనుండియే వ్రాసి నాఁడు. కాళీఖండము తరువాత నితడు రచిండి నది హరవిలాసము హరవిలాసము తరువాత నితఁడు రచించినది పల్నాటి వీర చరిత్రము వీరచ రిశ్రమ యొక్క పార్వాపర్యము తెలిసికొనుట 'కాగ్రంథమున నాధార ములు గన్పట్టుచున్నవి. బాలచం ద్రుని యుద్ధ ఘట్టమున; —

ద్వి. ఎసఁగెడు శివకంచి యే కామపతికి
జిఱు తొండ భక్తుఁడు చెలఁగు మాతండ్రి
పెంక లసిరుపను చెలువమాతల్లి
సిరియాళుఁడనఁబుట్టి చెన్నొందినాడ.

అని తన హరవిలాసములోని చిరుతొండనంబి కథను సూచించియున్నాడు. గనుకఁ బల్నా టివీరచరిత్రమే యికఁడు రచించిన గ్రంథములలో 'నెల్ల జివర గ్రంథమని చెప్పవలయు "దీనికిఁ బ్రతిపక్ష వాదముగా శ్రీవీరేశలింగముగారు నూతనముగాఁ బ్రచురింపించిన కవుల చరిత్రములో నిట్లు వ్రాసియున్నారు.“కాఁబట్టి నురుత్త రాట్చరిత్రము 133 వ సంవత్సర ప్రాంతమునరచించెనని చెప్పవచ్చును. నాకీ పుస్తకము లభింపనందున శైలియెట్లున్నదో యందు వ్యాకరణాది దోషము లేమయిన నుండినవో యది యెవ్వరికైననంకితము చేయఁబడినదో లేదో చెప్పఁజాలను, ఈతఁడు చేసిన రెండవ గ్రంథము పల్నాటివీరచరిత్రము నందలి బాలునికథ. ఇదియు నింటికడనున్నప్పుడే (కొత్త పట్టణము.లో) స్వగ్రామము నందలిపల్నాటివీరుల కులమువారి ప్రోత్సాహముచేత రచియింపఁబడి యుండును. ఈపుస్తక రచనమువలన శ్రీనాథునకుఁ గొంతధనలాభము గలింయుండును. పల్నాటి వీరచరిత్రము ద్విపద కావ్యము. ఇది 1384 వ సరివత్సర ప్రాంతములయందు రచియింపఁబడి యుండును. పల్నాటివీరులచరిత్ర ద్విపద నోరుగంటి పురములో ' నాడినట్లు 1420వ సంవత్సర ప్రాం తములుడు నల్లభరాయనిచే రచియంపఁబడిన క్రీడాభిరామమునం దిట్లు చెప్పబడినది. -

గీ. ..విప్రు, డీక్షించెఁ బలనాటి వీరపురుష
పరమదైవత శీనలింగభవనవాటి,

మ. ద్రుత తాళంబున......
యతిగూడం ద్విపద ప్రబంధమున మీ జానీకముం 'బాడే నొ
ప్రత్యేకముగాఁ గుమారికులు బీట్కారంబునతూలగన్.

గీ......పడతి పల్నాటి వీరుల బాడునవుడు.”

ఈ పుస్తకమువలన గలిగిన ప్రోత్సాహమునుబట్టి శ్రీనాథుఁడు గొప్పవానికిఁ గృతులిచ్చి ధనార్జనము చేయవచ్చు నన్న యాశగలవాఁడై స్వ! గామముకు విడిచి స్వస్థలమునకు మిక్కిలి సమీపమున నున్న యొక చిన్న సంస్థానమునకుఁ బోయెను. ఆ సంస్థానమున కప్పుడధిపతి పెదకోమటి వేముకు.

శ్రీవీ రేశలింగము గారిచేతగంతు తడిక నల్లించినది యాంధ్రు చరిత్రము మూఁడవభాగములో నాయీవాక్యములై యున్నవి.“ప్లల్నాటివీరచరిత్రమును శ్రీనాథుఁడు రచించెనని చెప్పెదరు కాని శ్రీనాథవిరచితమైన పల్నాటివీరచరిత్రము యొక్క.. సంపూర్ణ గ్రంథమేచ్చటను గాన రాదు. చెన్నపురి ప్రాచ్య లిఖంతపుస్తక భాండాగారమున శ్రీనాథవిరచితమని వ్రాయబడిన పల్నాటి వీర చరిత్రముబోని యొక భాగము మాత్రము గన్పట్టుచున్నది. ఆ భాగమైనను శ్రీనాథ విరచిత మనీ విశ్వసించుటకుఁ బ్రతిబంధకములుచాలఁ గలవు. శ్రీయుతులైన ఉమాకాంతముగాకు ప్రచురించిన పల్నాటి వీరచరిత భాగము శ్రీనాథ కవి రచితము కాదని తోఁచుచున్నది. ఉమాకాంతముగారు పల్నాటి వీరచరిత్రమును శ్రీనాథుఁడు వార్డకదశయం కు వ్రాసెనని వ్రాయు చున్నారు గాని నిక్కముగా నాతండా చరితమును రచించియుండు నేని

బాల్యముననే వ్రాసియుండును గాని యాతప్పుల తఃక వాగ్గకదశ యందు నల్లి యుండడు."

శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర సంపూర్ణ గ్రంధమెచ్చటకు గానరాదని నేను వ్రా యుటచేత వీకేశలింగముగారు పల్నాటివీరచరి త్రమునందలి బాలునికధ మాత్రము వ్రాసెనని చెప్పినారు. పందొ మ్మిదేండ్ల ప్రాయమున నిల్లువిడిచి పెట్టనివాడు సముద్ర తీరమునఁ గొత్త పట్టణములోఁ గూరుచుండి శ్రీనాథుడు పల్నాటి వీరుల కులము వారి ప్రోత్సాహము చేత రచించినాడు . పల్నాటి వీరుల కులమఁట! పల్నా టి వీరులలో క్షత్రియులు, గొల్లల్లు, రెడ్లు' పద్మనాయక వెలమలు, మాలలు, మాదిగలు కులముల వా రెందఱొ కలరు. పల్నాటి వీరుల కులమువారన్న నాకర్థమగుచుండ లేదు. పల్నాటియనుభవము లేని పిన్నవాడు పల్నా టివీరచరిత మెట్లు వ్రాయఁ గలిగెనో యూహింపనలవిగాక యున్నది. కంటిరా యీచిత్రము ఈపందొమ్మి దేండ్ల పిన్న పొఁడు గ్రంథారంభ మునను గ్రంథాంతమునను నేమనుచున్నాఁడో యొక్క మాఱు చిత్త గింపుఁడు. గ్రంథాదిని.

సంగీత సాహిత్య చాతుగ్య కివిత
జెప్ప నేర్చినవాఁడఁ డెలఁగి మాచెర్ల
చెన్నరాయని పాదసేవారతుండ
పలను భారద్వాజవంశ వర్ధనుడ
గవిసార్వభౌమడ ఘనతగన్నట్టి
శ్రీనాధుఁడను వాడ శివభక్తి పరుండ,

అనియును గ్రంథాంతమున

“ఘనుఁ డైన శ్రీనాథకవిరాజరాజు
చెన్నుని కృపచేతఁ జిత్తముప్పొంగి
బాలుని విక్రమ ప్రౌడియంతయును
వివరించె జనులకు విశదమౌ రీతి,

18 అని వాయఁబడియున్నదే. ఆహా! ఇది యెట్టివిపరీతసిద్దాంతము! క్రీ. శ. 1526వ సంవత్సర ప్రాంతమున శ్రీనాథుఁడు కర్ణాటరాజధానికిఁ బోయి ప్రౌఢదేవరాయల యస్థానంబున గవిసార్వభౌమ బిరుదనాంచు డైన గౌడడిండిమభట్టుతోడ సుద్భటవివాదమును బెట్టుకోని వాని నోడించి యాదేవరాయమహా రాయల ముత్యాలశాలలో కనకాభి షేకమహోత్సవమును గాంచినది మొదలుకొని కవిసార్వభౌమ బిరుదముతోఁ బ్రవరిల్లుచుండెనని వ్రాసిన శ్రీవీరేశ లింగముగారు 1384 వ సంవత్సరమున శ్రీ నాధుడు తన పందొమ్మిదవ యేఁటనే కవి ర్వభౌమ బిరుదాంచితుఁడై పల్నాటి వీరచరితమగు తప్పుల తడికను రచించెనని వ్రాయుట హాస్యాస్పష మగుచుండ లేదా? 1420 అందవ సంవ త్సరము నాటికే యోరుగంటిపురములోఁ బల్నాటి వీరచరితము పాడు చున్నారు గనుక నంతకుఁ బూర్వమే పల్నాటి వీరచరతమును శ్రీనా థుఁడు రచించినాఁడని యొక హేతువు. ఆ పాడుచున్న ద్విపద ప్రబంధ ము శ్రీనాధుని దనుటకు హేతువు లెవ్వి! కొండన మల్లన యనువార లుకూడ ద్వీపదలలో బల్నాటి వీర చరిత్రమును జెప్పి యుండ లేదా? అట్టివారు మఱికొందరు చెప్పియుండ రాదా? ఆ పాడునది. శ్రీనాథుఁడు చెప్పిన ద్విపద కావ్యమేయని యెక్కడ చెప్పఁబడినది! ఇదియంతయు నేలవిడిచి సాము చేయుట వంటిది. కాఁబట్టి పల్నాటి వీరచరితము తప్పుల తడిక గావున బాల్యములో రచించి యుండుసని యూహచేసినది హాస్యాస్పదమైన సిద్ధాంతమునకు మూల మయ్యెను."*[14]

  1. * శ్రీశైల పూర్వతట నికటమునుండి పూర్వసముదము దాక ప్రవహించు సం ఉతరంగణిమను గుండ్లకమ్ము నది కిరుప్రక్కలనుండు సీమకేపూంగి నాడసు నామముగల దని తెలియుచున్నది.
  2. * ఆంధ్ర భారతి సంపుట 2 సంఖ్య 3 పేజీ 116 చూడుఁడు.
  3. *ఆంధ్రకవుల చరిత్ర మనండు ప్రోలయ నేమా రెడ్డి 1328 వ సంవత్సరమునందు స్వతంత్రుడై. వీరుకొండ రాజ్యము "నాక్రమించుకొని 1335 వ సంవస్సరము
  4. * నెల్లూరిశాసము 3 వ. సంపుటము , ఒంగోలుశాసనము 1810పేజీ 1:028*
  5. ఈశానసమును ఆంధ్రుల చరిత్రములని మూడవ భాగములో (180 పేజీ ప్రచురించియున్నాఁ డను, దీనింబరిశీలించి యే .వీరేశలింగము గారు “శ్లో | ఆహితత మశికృశాను ... ... ... శ్రీ సోమ మంతీ శ్వరః, ఆను వానిని గృహించి తమనవీన గ్రంధములో 138 పేజీలో జొప్పించయు న్నారు,
  6. శ్లో.తతోన్న పోత నృపతిః పరిపాలన కర్మణి అపొలయస్తస్య పుత్ర స్తదం తేంద్రవసుందరా కొండనీ డుం రాజుదానం 'సతిచితాదుకల్పయల్ " దృష్టాత్వష్టాపీ చిత్ర్యధుభూద్యస్యాస్స విస్మయ Elliot's collections Page. 270. ఈశాసనము లోని కొన్ని శ్లోకములను ఆంధ్రుల చరితము మూడవ భాగములో (23 పేజీ లోఁ బ్రచురించియున్నాను.దీనిం జదివి వీరేశ లింగము గారు తన నవీన గ్రంధమున (కవుల చరిత్రము) 42 పేజీ . * *ను పైశ్లోకమును 426, 427 పేజీలలోను బ్రచురించియున్నారు. పూర్వం గ్రంధమున నీశ్లోకమున అన్న పోతయనుటకు మారుగా అన్న వేమ నని పడుట తప్పని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు సూచించి నందుకు వారికి కృతజ్ఞుడను ,
  7. తస్యా బ్రాతా నీఘృత వత్స తాపోద సేంద్ర వ్యాప్త నీరంద్రకీర్తి ! శ్రీవెల నారసింహడెల తత్:క్ష్మాం దత్తోధర్మేణాన నేమక్ష్మీ శతీశ!!
  8. కాటయ వేముని భార్య మల్లాంబ తొత్తర మూఁడి శాసనములో నిట్లు తెలు పఁబడి యున్నది.

    శ్లోఆసీదమాశ్యరత్నం కాటయ వేమ ప్రభుస్తస్య
    అతిసురగురు భార్గవమతి గతి భార్గం విజయనీఖ్యాతి ||

    శ్లో. సింహాస నే సి ఛాయా సౌకుమారగిరి భూవరం
    ఆ తేజయమ్మహా తేజా శ్రీకృష్ణ ఇవ ధగ్మణం
    కుమారగిరి యానాధో యస్యైవిక్రమ తోషితః
    ప్రాదాత్ స్రాధీభువం రాజమహేంద్రనగర ముఖాం

    -. . ఈ శాసనము జయంత రామయ్య గారి వలన పత్రికలో ముదింపఁ బడినది.

  9. ఈ శాసనము ప్రభారశాస్త్రి గారి గ్రంధమున నుదాహరింప బడినది. అందిట్లున్నది.

    శ్లో. మహారాజుస్సోయం రపకడహుతా లళేంమండితే
    శతాబ్దే శ్రావణ్యాం శశభృదుపరాగే ప్రకటితే
    వరంప్రీతకొసాదెఱ(విర) పురి దాశారధయే
    పరంగ్రామం కుల్నోంతి సమాఖ్యోముపగతం"

  10. రాజ్యం వేమస్సచికమకగాత్ ప్రాజ్య హేమాద్రి దానో భూమి దే వైర్భువ మురుభుశోభుక్త శేషామభుజ్క, శ్రీ శైలా గ్రాత్' ప్రభవతి పథి ప్రొత్త పాతాళం గంగా సోపానానీ ప్రమద పదవీమారుము క్షుశ్చ కార. మాచలక్షోణీపతి ర్మ హేంద్ర విభవో పేమక్షి తీశాగ్రజో హేమాద్రే సదృశోబభూవ సుగు ఆంతేస్తస్య త్రయో సందనా కీర్త్యాజూగ్రతి రేడిపోత సృపతి శ్రీకోమటీంద్రస్త తో సొగక్ష్మా పతి దిత్యుపాత్త పఫుషోధర్మార్ధ కామాఇవ."</poem> శృంగార పీఠిక లోని పై రెండు శ్లోకములు ఫిరంగిపుర శాసనములలో గలవు. పై రెండు శ్లోకములు మాత్రమె గాదు. శృంగార కీపిక లోని :.....

    "వేమాధికి చూచకభుశ్చ నందనో
    శ్రీకోమటీఘ్రస్య గుణైక సంశ్రయా
    భూలోక మేకోదరజన్మ వాఞయా
    భూయోవతీర్ణా వివరామ లక్ష్మణౌ”

    అను శ్లోక ముగూడా శ్రీనాథకవి విరచితమై పొన్ను పల్లి శాసన మునంగలదు. కాబట్టి అమరు వ్యాఖ్యాన పీఠిక భాగమును మాత్రము శ్రీ నాథకవి రచించి యుండవచ్చునని యు అమరు కావ్య వ్యాఖ్యను చూపము "పెదకోమటి వేమును పొలఁడే రచించి యుండుననియు విశ్వసింపవచ్చును.

  11. శ్రీనాథుఁడు శృంగార నైషధమును రాజమహేంద్రవరము నేలిన వేమారెడ్డి మంత్రి మామిడి సీంగ నార్యునకు ఆంకితము చేసెనని బ్రహ్మ శ్రీ వేదము వేంకటరాజరుశాస్త్రి గారు తమ సర్వంక షావ్యాఖ్యా సమేత ముద్రిత శృంగార నైషధ గంథాపతారక లో వ్రాసినది పొరపాటు,
  12. *ముద్రితగంధములలో శ్రీమహిత పెద్దకోమటి' యను దానికి బదులు గా శ్రీ మహితు "పెద్దసుతునకు ' అని యున్నది. చరిత్రము తెలియనందున బెద్దకోమటీ .'యనుగాని యర్ధము తెలిసికొనజాలక తప్పనుకోని శృంగార నైషధమును ప్రథమమున వారట్టిమార్పు చేసి యుందురు.
  13. * ఈ శాసనము శ్రీమాన్ శేషాద్రి రమణకవులు మందడి వెంకటకృష్ణకవి గార్ల చే రచించ బడినది ........... చంద్రిక యను గ్రంధమున పేర్కొన బడినది.
  14. *ఉమాకాంతము గారు సల్నాటి వీర చరితమున శ్రీ నాథుఁడు వార్ధక దశయందు వ్రాసె నని వ్రాయుచున్నారు గాని నిక్కము"గా నాత డాచకతమును వచించియుం డ"నేని బాల్యముననే వాసియుండును గాని భూతప్పులతడిక వార్ధక దళియుడన సల్లియుండఁడని నేను వ్రాసినదాని భావమును సరిగా గ్రహింపక బాల్యమను పదమును మాత్రము పట్టుకోని విడువక పూర్వాపరం చర్భములను గమనింపక పోయిరి. ఏపల్నాటి వీర చరితమును శ్రీనాథకృతమని వ్యవహరించుచు వ్రాచున్నారో అది శ్రీ సాథకృతము కాదని నాయభిప్రాయము.