శ్రీనాథకవి జీవితము/ద్వితీయాధ్యాయము

వికీసోర్స్ నుండి

అధ్యాయము 2

శ్రీనాథుని జన్మకాలనిర్ణయము

ఇదివఱకు శ్రీనాథుని జన్మ కాలమును నిర్ణయించిన వారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకటలక్ష్మణ రావు గారును, శ్రీవీరేశలింగము గారునై యున్నారు.*[1] శ్రీనాథుని జన్మకాలము 1360 దవ సంవత్సర ప్రాంత మని వేంకటలక్మణరావు గారు నుడువుచున్నారు. వీరేశలింగ ముగారు లక్ష్మణరావు గారి వ్యాసమును బఠించిన మీదట వారి మార్గము ననుసరించి శ్రీనాథుని జన్మ కాలము 1368 దవ సంవత్సర ప్రాం తమని చెప్పిరి. అయినను లక్ష్మణ రావు గారి వాక్యములనే యున్నవి యున్నట్లుగా మాత్రము చెప్పియుండ లేదు. లక్ష్మణరావు గారు వివా దాస్పదములయిన వేఱువిషయముల నేమియు నెత్తక మెల్గగా జాఱి విడిచి హరవిలాసకాలనిర్ణయమునకు మాత్రము పూనుకొని కొంతవఱ

కె యుక్తి యుక్తముగ వాదించి శ్రీనాథుని జన్మకాలము నిర్ణయింపగలిగినను, వీరేశలింగము గారు వివాస్పదములయిన విషయముల నన్నిటిని నెత్తికొని యెట్టిపరీత సిద్ధాంతములను తాము చేయుచున్నారో తెలికొనఁ జాలక, తాము చెప్పిన కాలమును సమన్వయించుకోలేక చరిత్ర కాలములను విస్మరించి గాథలనే ప్రధానముఁ జేసికొని, కేవలము లక్ష్మణ రావు గారి కాలనిర్ణయము పై నే యాధానపడి వారి భావమునే తమ గంథము లోనికిఁ జొప్పించియు వారి నామమునైన సుదాహరింపక వారివాసము నకును దమవాదమునకును గొంచెము భేదము కలదని చదువరులను కొనుటకై యవక తవక మార్పులను గావించి పరిహాసాస్పద మగునట్టి వాడమును నెలకొల్పిరి. లక్ష్మణ రావు గారు శ్రీనాథుని కాలనిర్ణయము నిట్లు గావించిరి.

1360 శ్రీనాథుని జన్మ కాలము
1336. మరుద్రాట్చరిత్ర రచనా కాలము
1385 శాలివాహన సప్తశతి కాలము
1395 ఆంధ్ర నైషధ కాలము
1400.హరవిలాసకాలము
1410. ఫిరంగిపుర శాసనకాలము
1413 అల పాడు తామ్రశాసన కాలము
1426 అమీనా బాదుశాసన కాలము
1420 భీమఖండకాలము
1430 కాశీఖండ కాలము
1435 శివరాత్రి మహాత్మ్య కాలము ..
1440 మరణ కాలము
శ్రీ వీ రేశలింగముగారు శ్రీనాథుని కాలనిర్ణయము నిట్లు గావించిరి :

1365 శ్రీనాథుని జన్మ కొలము.

1383 మరుత్తరాట్చరిత రచనా కాలము 1394 పల్నాటివీరచరిత్ర రచనా కాలము 1387 శాలివాహనసప్తశతి రచనా కాలము 1390 పండితారాధ్య చరిత్ర కాలము

1395 ఆంధ్రనైషధ రచనా కాలము
1400 హరవిలాస రచనా కాలము
1415 పొన్నుల్లి శాసన కాలము
1410ఫిరంగిపుర శాసన కాలము
1413 అలపాడు శాసనకాలము
1416 అమీనాబాదు శాసనకాలము

1420 శ్రీ శైల యాత, శివరాత్రి మాహాత్మ్య రచనాకాలము
1425 డిండిమభట్టు నోడించి కవిసార్వభౌముఁడగుట
1425 సర్వజ్ఞ సింగమనాయుని దర్శించుట
1430 భీమఖండ కాలము
1435 కాశీఖండ కాలము

మరణ కాలమును సరిగా నిర్ణయించి చెప్పియుండ లేదు

1425 శ్రీనామని మఱది దుగ్గన విరచిత నాచికేతూ పాఖ్యాన రచనాకాలము

1480 మఱియొక స్థలమునఁ జెప్పిన నాచి కేశూ సౌఖ్యాన రచ
నా కాలము.

వీరేశలింగ ము గారు శ్రీనాథునీ మరణ కాలమును నిర్ణంచి చెప్ప
కపోయినను పిల్లల మట్టి పిసవీకభప్రకవిని గూర్చి వ్రాసిన ఘట్టమున
యవనదశలోఁ దెలుంగురాయని ఒద్దకుఁ బోయి కవిత్వము చెప్పి,
యాతనిని 'మెప్పించిన శ్రీ నాథుఁడు సృసింహ రాజు యొక్క తండ్రి కాల
ములోనే కాక కొంతవఱకీ నృసింహ రాజుయొక్క రాజ్య కాలములో


గూడ నుండియుండును. కాఁబట్టి కృతిభర్తయైన యీసాళువనృసింహ రోజును, కృతిక ర్తయైన పినవీనన్నయు శ్రీనాథుని యంత్య కాలములోను.తదనంతర కాలములోను జీవించి యుండినట్లిందువలన ..దేలుచున్నది.ఈ మహకవి 1480 వ సంవత్సర ప్రాంతమువఱకును జీవించి యుండవచ్చును. గనుక, శ్రీనాధకవి వార్థఖ్యదశలో వున్నప్పు డితఁడు యౌవనదశయం దుండి యుండుసు . "దానిని బట్టి చూడగా శ్రీనాథుఁడు తానాంధ్రీరకరించిన నైషధము గొనిపోయి ఇప్పుడు జునులకొనునట్లు కవినాగ్రగణ్యుఁడని మభినవముగా బేరొందు చుండిన మహా విధ్వాంసుఁ డైన పిన వీరనకుఁ జూపియుండును. పినవీరభద్రుని జీవిత కొలములోనే శ్రీ నాదుడాతనికి బూర్వక యైనందున శృంగార శాకుంతల కృతిపతి యైన సన్న మంత్రి "సీ. శ్రీనాధ భట్టభాషా నిగుంభ బుల పరిమంళం బుఁ గూడ బరవ నేర్చు" నని పినవీరన కవిశ్వమును శ్లాఘించెను " అని వ్రాసియుంచుటచేత శ్రీనాథుఁడు 35 యేండ్లు జీవించియున్నట్లు తేలుచు న్నది గదా!


ఈ పై విషయముల నన్నిటిని మనము పరిశీలించి శ్రీనాథుఁని జన్మకాలమును నిర్ణయింపవలసి యుండును. ఇట్లు పరస్పర విరుద్ధాంశము లను సమన్వయించుట సాధ్యముగాదు. ఇందేవి సత్యములో, ఏవిసత్య ములు కావో సిద్ధాంతము చేయుట బహుకష్ట సాధ్యమైనను సాధి పవచ్చును. వీని నిష్పక్షపాతబుద్ధితో విమర్శించి చూతము. వేంకట లక్మణ రావుగారును, వీరేశలింగముగారును, హరవిలాస కాలమును బట్టి శ్రీనాథుని జన్మకాలమును నిర్ణయించి, గ్రంథాలయ సర్వస్వములో శ్రీలక్ష్మణ రావు గారు హరవిలాసమును గూర్చి : ----


"ఈశాన్యమునందు శ్రీ నాథుని కావ్యముల కాలనిర్ణయము చేయటకు మంచిస్థానముకలదు. అందును గుఱించి యిచ్చట గొంత చర్చించెదను. “కృతిపతి యొక్క తమ్ముడైన తిరుమలచెట్టిని వర్ణించుచు కవి యిట్లు వ్రాసియిన్నాడు:—

చ. హరిహరరాయ 4-సు బాస్.. నానిని భూ..........
వరులు నిజప్రభావను నూ వగైన సేయఁగు ముం సర్వధీ
శ్వరుని వత త వైభవము స్వమి నొక్కడ నిర్వహించు మా -
మాతిరుమల నాథ సెట్టిని దట్టి నెవ్వతడతిన్.

ఈపద్యమునందు ముగ్గురు సమకాలిక లైన రాజుల పేళ్లు చెప్పఁబడి యున్నవి. వీరిలో హహరరాయలు విజయనగరాధీశ్వ రుఁడు. 1377 మొదలు 1426 వఱకు రాజ్యము చేసెను. ఫీరోజుషహా బహమనీ రాజు.1367 మొదలు - 1426 వఱకు - రాజ్యము చేసెను కుమారగిరి కొండవీటి రాజు. ఈతడు శ్రీ జయంతి రామయ్యగారి మతమున 1378 మొదలు 1398 వఱకు రాజ్యము చేసెను. శ్రీ చిలు కూరి వీరభదరావుగారి మతమున 1383 మొదలు 1400 వఱకు రాజ్య ము చేసెను. ఈముగ్గురు రాజులును బ్రతికి యుండి స్వస్వరాజ్యము. లను పాలించుచుండిన కాలము శ్రీ జయంతి రామయ్యగారి యభిప్రాయము ప్రకారము 1377 - 1398 రెండు సంవత్సరములు. శ్రీ వీరభద్రరావు గారి యభి ప్రాయము ప్రకారము 1347 -1461. నాలుగు సంవత్సరములు. ఇట్లు హరవిలాసనిర్మాణ కాలము మనము ఒకటి రెండు సంవత్సరముల యంతరముతో సరిగఁ గనుగొనఁ గలిగితిమి 1450 .వ సంవత్సర ప్రాంత మున ననఁగా 1368లోనో 1369 లోనో కుమా రిగిరి ప్రభుత్వపు చివర భాగమున, ఈ కావ్యము వ్రాయఁబడినదని స్పష్ట పడుచున్నది.దీనిని బట్టి ఇతర కావ్యముల యొక్క కాలనిర్ణయమును చేయవచ్చును" అని వ్రాసి హరవిలాస కాలమును నిర్ణయము " గా వించిగరి.

ఈ కాలమునే వీరేశలింగము గారును . అంగీకరించిరి. విరేశలింగ ముగారి యభిప్రాయము ప్రకారము శ్రీనాథుఁ డిప్పటికీ ముప్పదియైదు సంవత్సరముల ప్రాయము వాఁడు. లక్ష్మణ రావుగారి యభిప్రాయము ప్రకారము శ్రీనాధుడిప్పటికే నలువది- నంవత్సరము ప్రాయము వాడు. హరవిలాస కృతిపతియైన తిప్పయ సెట్టి వయస్సును కను గొనవలయును. కృతిపతియైన తిప్పయ సెట్టి తన్నుబాలసఖుడని యున్నట్లుగా శ్రీ నాధుడే. హరవిలాసవతారికలో


 సీ. 5:22 - పని పాము ను .. కావ్య
11 -9
-2 : 11) నా ద్వాజ
19 : ముకు: 9.5)
ప్రమాల'.! కామా - స.. "
5... - పు. 27
స్య న స . సి.
గీ. ము ము - సాతు మన
'బాల సుష్టుగా : చి శ్యా మొన్న
సవచి నేషయత్ పు - చక్షు రాజు
హతమతో , TE: 30. Kట్టు అని నను.
'
గీ.మద్దియ భాషా కవిత్వ ప్రయోజనంబులు
బాలసఖుగారి కుంచి తాత్పర్య మొప్ప (ఒహంపు గా బుడుపు కు వ్యను 452)
నవచి దేవయ్హత్రిపురాణ యక్షరాజు
హితమితోత్తులు నెలయ చిట్టు అనియ

గీ. అగమగ్నాన విధుని తత్త్వార్థ వనిప
ఒహంపుగా విగ్నుడవు పదభవ్య మతిని
బాలసఖుడవు శైవ ప్రభబంద మొకటి
యవధరింపుము నాపేర నంకితముగ

అను పద్యమ వలన వేన్యమగుచున్నది. పై విమర్శకు లిరువురును “బాలసఖు' డను దానికి నెట్టి యర్థమును యెట్టి వ్యాఖ్యాసము గావించిరో చదువఱకు వినోదకరమై యుండును గావున వాని సుదాహరించి వారి యభిపాయముల సాకారమును జూపింతుము. లక్ష్మణరావుగారు,"హరవిలాసమునందుఁ గవి కృతిభర్త బాల సఖుఁ డని చెప్పబడి యున్నది . (1 - 8)) కృతిభర్త యీక్రిందిచ పద్యము

(అ-6) చెప్పుటవలన వృద్ధుడని తోఁచుచున్నది:--

కంటిని విశుద్ధసతిని
వింటిన బురాణములు పెక్కులు విశ్వము నొగడన్
మంటి బహువత్సరంబులు
గొంటి యశోధరము సుకవి తోటి నుతింపన్

కృతి నందిన యవచితిప్పయ్య వృద్ధయిన నాతని బాలసఖుఁడు గూడ వృద్ధుడే కావలయునుగదా". మా లెక్క ప్రకారము హరవిలాసము రచనా కాలము (1400) వఱకు శ్రీనాథుడు నలువ ఏయేండ్ల వాఁడుగ నున్నాడు. కావున ఈపూర్వపక్షమంత బలవంతమైనది కాదు. మఁటి బహువత్సరంబులు అని యేఁబది యేండ్లు సమీపించినవాడవ వచ్చును. బాలసఖుఁడు" అనఁగానే తూచినట్లిద్దఱికిని ఒక్కటే వయస్సుండనక్కర లేదు. ఇద్దఱికి నేఁడెనిమిది సంవత్సరములు భేదముంగనచ్చును. శ్రీనా థుఁడు చిన్న నాఁడే పెద్దబుద్ధులుగల యప్రతిమ ప్రతిభాశాలి గనుక నాతనికంటెఁ పెద్ద వారుకూడ నాతనితోఁ జెలిమి నేసీ యుండుట యాశ్చ ర్యము కాదు." అని చులకనఁగాఁ ద్రోసి రాజనిరి. ఇంక వీరేశలింగము గారన్ననో విచిత్రమైన మార్గ మవలంబించిరి. ఉభయులను శైవ మతస్థులగుట చేతనోమఱి యే హేతువు చేతనో యట్టి ప్రయాణములయందు శ్రీనాథునకు కుమారగిరిభూపాలుని సుగంధభాండా గారధ్యక్షుడయి కోటీ శ్వరుఁడుగానుండిన యనచితప్పయ సెట్టితోడి మైతి కలిగినది. అందుచేతనే శ్రీనాథుఁడు తిప్పయు సెట్టికి బాలసఖు డయ్యెను. అప్పటికి శ్రీనాథుఁదిరువదియైదు ముప్పది సంవత్సరముల బాలుఁడే యయినను తిప్పయ సెట్టి యాతనికంటె మిక్కిలి పెద్దవాఁడయి యుండును. కొండవీటియందు తప్పు శ్రీ నాథున కనచితిప్పయ సెట్టితోడి మైతి కలుగుట కసకాశము వేరొక చోట గానఁబడదు. శ్రీనాథుఁడు నైషధరచనా సంతరమునఁ దన బాల సఖుఁడైస తిప్పయ సెట్టిని జూచి సమ్మానమును బొందుటకు మ రల గొండవీటికిఁ బోయెను. అప్పుడు శ్రీనాథుఁడు ధనస్వీకారము చేసి హరవిలాసమును రచించి తిప్పయ్య పెట్టి కంకిత మొనర్చెను." అని :


యొక యపూర్వ వ్యాఖ్యానమును గావించిరి.. ఇందలి ఫలితార్థ మేమున బౌలసఖుఁడదానికి వీరేశములింగముగారికొక రీతిగను, లక్ష్మణరావు గారు"వేఱొక రీతిగను తేట తెల్ల మగుచున్నది కదా! శ్రీ వీరేశలింగ ముగారు ముప్పది యైయేండ్ల వానిని గూడ బాలుడనుట నత్యాశ్చచర్యము గా నున్నది. పదునారేడ్ల వయస్సునకు దక్కువ వయస్సు గల మగవానిని బాలుడనియు, పదునారేండ్కు దక్కువ వయస్సు గల యాడుదానిని బాలిక యనియు వ్వవహరించుట గలదు. వీరేశలింగముగారు బాల సఖుడను దానికి బాలుడైన సఖుడని యర్దము చేసి నట్టు గంపట్టు చున్నది. లక్ష్మణ రావు గారు చెప్పినది యుక్తి యుక్తముగా నున్నటులు పైకి గంపట్టుచున్నను దానిని బాధించు విషయములు కొన్ని లేక పోలేదు. ఇఱువదియై దేండ్ల వానిని బాలునిగాఁ జేసిన నీరేశలింగము రాబాల ప్రాయమున హరవిలాసమును అంతకు బూర్వమే శృంగార నైషదమును రచించెనని చెప్పుట యుక్తి యుక్తముగా గన్పట్టుచుండ లేదని కాఁబోలుఁ బ్రథమ సమా వేశకాలమునకుఁ బదిసంవత్సరముల తరువాత హరవిలాసమును కృతి యిచ్చినట్లుగా జెప్పినారు. ఇదియొక యద్భుతకల్చనము. బాలుడైన సఖుఁడని యర్ధము యర్గము చేసుకోవలసి వలసిన పక్షమున హరవిలాస రచనా కాలమున శ్రీనాథుడు పదునాఱేండ్ల లోపు వయస్సు గలబాలుఁడని యర్థము చేసుకొనవలయునే గాని వీరేశలింగముగారియసంబద్ధ వ్యాఖ్యానము సరిపడ దని నిస్సంశయముగా: జెప్పుఁదగును. ఏఁబ దేండ్ల వయస్సు గలిగిన వాఁడు మాత్రము 'మంటి బహువత్స రంబులు' అని యనుకొను నన్న నంతవిశ్వాసపాత్రముగా గన్పట్టదు. శ్రీ మాన్ ఉప్పల వేంకటనర సింహాచార్యులు గారు హరవిలాస పీఠికలో నిట్లు తెలిపియున్నారు,

"హరవిలాసము లో నీతడు "మంటి బహువత్సరములు” అని చెప్పుకొనుటచే గృతి నందు నాటికి 65 సంవత్సరముల వయసువాఁడై యుండును. ఇతనికి బాలసఖుడగు శ్రీనాథుఁడును 50 సం॥ వయసువాడై యుండును.[2]*

లక్ష్మణ రావు గారి యభిప్రాయమః ప్రకారము తిప్పయ సెట్టి శ్రీనాథునికంటె నేఁడెనిమిదేండ్లెక్కువ వయస్సు గలవాఁడు. అనఁగా 1352 వ సంవత్సరమునఁ దిప్పయసెట్టి జనియించియుండనయును. శ్రీల క్మణ రావు గారి పద్ధతిని మన మనలంబించిన యడల తిప్పయు సెట్టి వయ స్సు నిశ్చయముగా మనముఁ "జెలిసికొనుటకు మార్గ మాహరవిలాసము సందే గలదు. తిప్పయ సెట్టి తండ్రియగు దేవయ సెట్టి,

క. శ్రీపర్వత సోపాన తసోషాన
స్థాపఁడగు రెడ్డి వేమ జగతీ పతికిన్
బ్రాపైన యవచిదేసయ
యాపావాణికి జనించె సభ్యుదయముతోన్,

అని పోలయ వేమా రెడ్డికి బ్రాపు గానుండెననుటకును 'బై పద్య
మునఁ జెప్పియున్నాడు. మఱియును,

క. శ్రీపర్వత సోపాన
స్థాపక వేసక్షితీశసామ్రూజ్య శ్రీ
వ్యాపారి ముఖ్య యస్వయ
దీపక యలకాధి రాజ 'దేవయుతిప్పొ.

అని చెప్పియుండుట చేతఁ గూడ అప్పయ పెట్టి 'పోలయ వేమక్షితి నాథుని కాలమునఁగూడ వ్యాపారి ముఖ్యుఁడుగా నున్నట్లు 'దెలిపియు న్నాడు. శ్రీ పర్వతసోపానస్థాపకుఁడై వన్నె కెక్కినవాడు పోలయ వే మారెడ్డి గా"ఫున నతఁడు 1350 దవ సంవత్సరము వఱుకును బరి పాలనము చేసినవాడు. అతని రాజ్య పరిపాలన కాలములో వ్యాపారి ముఖ్యుడుగా నుండుటకుఁ దిప్పయ సెట్టికీ గనీస మిరువది సంవత్సరములయిన వయ స్సుండ వలయునుగదా. దీనింబట్టి కాలనిర్ణయము చేయఁ బూనినయెడల తిప్పయ పెట్టి 1330 దవ సంవత్సర ప్రాంతమున జనించి యుండవలయు ను. లక్ష్మణ రావు గారి యభిప్రాయ ప్రకాశ మేడెనిమి దేండ్లు శ్రీనా థుడు తిప్పయకంటె చిన్న వాఁడు. గావున, శ్రీనాథుడు 1338 వ సంవత్సర ప్రాంతమున జనించియుండ వలయునుగాని లక్ష్మణ రావుగారు చెప్పిన చందమున శ్రీనాథుని జనన కాల సంవత్సరము 1360 కోబో దు. శ్రీ వీరేశలింగముగారు చెప్పిన చందమున శ్రీనాథుని జనన కాల సంవర్సరము 1365 కాఁబోదు. అనగా హరవిలాసరచనా కాలము ప్రకారము 1400 సంవత్సర మేయైన యెడల నప్పటికి వారునిర్ణయించిన దిప్పయకు 70సంవత్సరములు, శ్రీనాధునకు 62 సంవత్సరములును వయస్సు గలిగి యుండవలయుననుట హరవిలాసము ప్రకారము సిద్ధాం తమగుచున్నది గాని లక్ష్మణ రావుగారు చెప్పిన ప్రకారము తిప్పయకు నే బ బేండ్లుగాని శ్రీనాధునకు నలున దేండ్లుగాని, వీరేశలింగముగారు చెప్పిన ప్రకారము శ్రీనాథునకు ముప్పదియైదేండ్లు గాని వయస్సుగలిగి యుందురన్న సిద్దాంతము నిలువజాలక పోవుచున్నది గదా! భీముఖండ రచనా కాలము లక్ష్మణ రావుగారు చెప్పినట్లు 1420 దవ సంవత్సర మును కాశీఖండరచనా కాలము గర:1430వ సంవత్సరమునైన యెడల శ్రీ నాధుఁడు తన 52 సంవత్సర ప్రాయమున భీమఖండమును 92 వ సంవ త్సర ప్రాయమునకాశీ ఖండమును రచించినట్లును హరవిలాసమును బట్టి సిద్ధాంతమగుచున్నది. వీరేశలింగము గారు చెప్పిన చందమున భీమఖండరచన కాలము 1430 దవ సంవత్స రముడు, కాశీఖండరచన కాలము 1435 దవ సంవత్సరము నైనయెడల శ్రీ నాథుఁడు భీమఖండమును 65 వ సంవత్సర పాయమునను, కాశీ ఖండమును 70 దవ సంవత్సర ప్రాయమునకు, ఇరువురును. బాల్య సఖులై శ్రీ నాథుఁ డేఁడెనిమిది సంవత్సరములు చిన్న వాఁడైన పక్షమున హరవిలాసమును బట్టి భీమఖండమును 92 వ సంవత్సర ప్రాయ మునను, కాశీఖండమును 95 - వ సంపత్సర ప్రాయను రచించి నట్లు సిద్ధాంతము చేయవలసియుండును. శ్రీనాధుని మరణ కాలము లక్ష్ముణ రావుగారు వక్కాణించిన 1440 సంవత్సర ప్రాంత మే సత్యమైన దైన యెడల శ్రీ నాధుఁడు102 సంవత్సరములును, శ్రీ వీరేశ లింగముగారి యభిప్రాయము ప్రకారము: శ్రీనాథుఁడు సాళ్వనృసింహ రాజు రాజ్య కాలమునఁ గూడ నుండుటయే వాస్తవమైన యెడల 115 సంవత్సరములును, హరవిలాసమును బట్టి శ్రీనాథునకు తిప్పయ బాల్య సఖుఁడే యైన యెడల 122 సంవత్సరములును, పదవతరము వాఁడై న సర్వజ్ఞ సింగభూపతిచే సన్మానంపఁబడిన నాఁడే యైన యెడల 132- సం వత్సరములును దీర్ఘాయుష్మంతుఁ డై జీవించియుండునని సిద్ధాంతము చేయవలసి యుండును. ఇంకొక నూర్గమును బట్టి చూతము.

నాచీకేతూపాఖ్యాన కావ్యకర్త యగు దగ్గుబల్లి దుగ్గనామాత్యుఁడు శ్రీనాథుని భార్యతోఁబుట్టినవా డని నాచి కేతూ పాఖ్యానములోని,

సీ, కవిస్వాముఁ డై కర్ణాకవిమల చేత :
గనకరత్నాభిషేకములు గనిన
శ్రీనా ధకవి కూరిమి చేయుమఱదిని
డుగ్గాయ కవి రాజు దగ్గుబల్లి
తిప్పనార్యునకు సతీమణి యెట్టకు
కుసుఁ తనూజు డవు పోతనకునెఱ
నామాత్యవరునకుననగు దమ్మండవు
శాండిల్య గోత్రుడ ససమతివి

గీ. చెప్ప నేర్తువు కృష్ణులు బుస్థిరము గాను
గాన నీవు రచింపంలం గడగియున్న
నాచికేత చరిత్రంబు నాదు పేర
నంకితము సేయు కవిరాజు లాదరింప

అనుపద్యములోఁ దెలుప బడినది. మఱియును, "ఇది శ్రీ మత్కమలనాభ పౌత్ర మారయమాత్యపుత్ర, కవి సార్వభౌము సకలవిద్యా సనాథ మహాకవీంద్రప్రసాద లబ్ధ కవితావిశేష దగ్గుబల్లి తిప్పనార్య ప్రియతనూజ దుగ్గన. నామధేయప్రణీతం బైన నాచి కేతూ పాఖ్యానం బను మహాప్రబంధబునందు” అను గద్యలోఁ దాను శ్రీనాథుని శిష్యుఁడైనట్లుగాఁ గూడఁ చెప్పుకొని యున్నాడు. ఇది మాధవవర్మ వంశోద్భవుడై గజపతుల పక్షమున నుదయగిరిదుర్గము నేలిన బసవ భూపాలునకు మంత్రియగు ననంతామాత్య గంగయ మంత్రికి నఁకితము గావింపబడియె! వీరేశలింగముగారు ఘంట సింగ య్య నంది మల్లయ్య' అను జంటకవులను గూర్చివ్రాసిన ఘట్టమున 1365 దప సంవత్సర ప్రాంతమున శ్రీనాథుని ముద్దుమఱిది యైన దుగ్గకవిచేత నాచి కేతూ పాఖ్యాన నాతని కంకితము చేయఁబడియె' సని చెప్పియున్నారు. ఇంతకు బూర్వము: దుగ్గకవిని గూర్చి వ్రాసిన ఘట్టమున ఆవఱకే కాంచీపుర మహాత్మ్యమును రచియించి తరువాతనే సౌచి కేతూ పాఖ్యానమును రచియించి యుండుటచేత నీకడపటిఫుస్త కము 1480 వ సంవత్సర ప్రాంతములయందు రచియింపఁబడి యుండు' నని పరస్పర విరుద్ధముగ వ్రాసియున్నారు. "మొదట వ్రాసిన యభిప్రా యములకంటెఁ గడపటటవ్రాసిన యభిప్రాయము లే సరియైనవిగా గ్రహిం పనలసిన దని తమ పీఠికలో వ్రాసియున్నారు గాపుసఁ గడపటి యభిప్రా యమైన 1465 దవ సంవత్సరమున నాచికేతూ పాఖ్యానమును గంగ యామాత్యున కంకితము చేయఁబడిన దమ సిద్ధాంతమునే విశ్వసింతము. పై పద్యమును బట్టి శ్రీనాథుఁ డప్పటికీ బ్రతికి యున్నట్టు గానంబడుచు న్నది. శ్రీనాథసుకవి కూఱిమి చేయు మఱిది” యని యుండుటచేత శ్రీనాథుఁ డప్పటికి స్వర్గస్థుడై యుండు సనుట సంభావ్య మైయుండు నా? శ్రీనాథుఁడు బతకి యుండినను బ్రదికియుండకపోయినను నాగ్రంథము రచించునాఁటికీ నాతనికి నలునదియై దేండ్లకంటే నెక్కువ వయస్సు గల దని చెప్ప రాదు. ఇతనికంటె నతని యప్పయగు శ్రీనాథుని భార్య 15 సంవత్సరములు పెద్దదనుకొన్నను నామెకు 20 సంవత్సరములు వయ స్సుండు సని చెప్పవచ్చును. ఆమెకు బదవయేఁట వివాహమయ్యె నని చెప్పక తప్పదుగదా. అనఁగా 1415 సంవత్సరము తరువాతనే శ్రీనా థునకు వివాహమై యుండు నని సిద్ధాంతము చేయవలసి వచ్చును.లక్ష్మ ణరావుగారి యభి ప్రాయమును బట్టి వివాహ మగునప్పటికీ శ్రీనాథున కు నేఁబదియై దేండ్ల ప్రాయమును, నీరేశలింగముగా రి యభిప్రాయమును బట్టి యేఁబదేండ్ల « ప్రాయమును, హరవిలాసమును బట్టి డెబ్బది యే డేండ్ల ప్రాయము నుండును సకలవిద్యాసనాథుఁ డైన శ్రీనాథుఁడు శ్రీ పెద కోమటి వేముభూ సొలుని యాస్థానంబున విద్యాధికార పదవీయందుం డియు, మహాభోగము లనుభవించుచుండియు సంతకాలము వఱకు వివా హము లేకయే యుండెనా?

ఇంతియగాక వెల్గోటివారి వంశములో బదవ తరము వాడైన సర్వజ్ఞ సింగమనాయని సందర్శింప శ్రీనాథ మహాకవి వాని యాస్థానము నకుఁ బోయెననియు నా ప్రభువునలన సమ్మానము నొందే శ్రీవీరేశలింగముగారు సత్యముని వ్రాయుచున్నారుగదా! అదెప్పుడు సంభవమయ్యెను. 1425 దవ సంవత్సరమని శ్రీ వీరేశలింగముగారు వ్రాసియున్నారు. అహహా! విఘ్నేశ్వరుని జేయఁబోయినఁ గోతియైన ట్లుగా వీరిసిద్ధాంత మపహాస్య భాజన సుగుచున్నదే. 1425 దవ సం వత్సరమునాటికి వీరు వక్కాణించిన పదవతరము సర్వజ్ఞ సింగమనాయ నికి నప్పటికీ 25 సంవత్సరముల పాయము గల దనుకొన్నను నాయన జన్మకాలము 1400 అగుచున్నది. కాని యేఁడవతరము వాఁ డైన సింగమనాయని పుత్రుఁడు రావుమాధవరావు క్రీ శ. 1427--1429 సంవత్సరములలో రాచకొండలో నివసింపుచు రాజ్య పాలన ము చేయుచున్న ట్లితని భార్య యగు నాగాంబిక శాసనమువలన స్పష్ట ముఁగా దెలియుచున్నది. ఈ శాసనములో రావుమాధవరావు రాయ రావు బిరుదమును స్థిరీకరించినాడని వాకొనఁబడి యున్నది. మఱియును శాలివాహనశకము 1351 సౌమ్య సంవత్సర చైత్రమాసమున రావు మాధవరావు భార్య నాగాంబిక నాగసముద్రమను తటాకమును శాశ్వత ధరాభివృద్ధి కై ప్రతిష్ఠాపించె నని యాశాసనము ద్ఘోషించుచున్నది. [3]*ఎనిమిద తరరము: వాఁడైన రావుమాధవభూపాలుడు క్రీ.శ.1430 దవసఁ నత్స రప్రాంతముసఁ బరిపాలనము సేయుచుండఁగా బదవతరము సింగమునా యఁడు 1400 లో బుట్టి యిరువదియై దేండ్ల ప్రాయముననే సర్వజ్ఞుడై యెట్లు పరిసాలనము చేయుచు సకలవిధ్యాసనాధుఁడైన శ్రీనాథుని సమ్మానింపఁగలిగెనని యే గణితశాస్త్ర ప్రకారము లెక్కింపగలిగిరో, ఏదివ్యదృష్టి చేతఁ గని పెట్టఁగలిగిరో యూహింప నలవిగాక యున్నది. ఎనిమిదవ తరములోని పురుషుఁడు 1430 లోఁ బరిపాలించునప్పుడు పురుషుడు మఱి (కనీస మెంచి చూచినను) నలువది యేండ్లకుఁ దరువాత బరిపాలనము చేసి యుండవలెను.అట్లయిన యెడల పదవతరము వాడైన సర్వజ్ఞ సింగమనాయడు 1470వ సంవత్సరము ప్రాంతమున నుండవలయును గాని యంతకు లోపుగానుండి యుండెననుట యసంభవము, శ్రీనాథుఁడు పదవతరము సింగమ నాయని సభకుఁబోయి సమ్మానముఁ బొందినదీ వాస్తవమైన యెడల హరవిలాసమును బట్టి శ్రీనాథునకు వయస్సు 132 సంవత్సరము లగు చున్నది.పితామహుఁడగు కమలనాభామాత్యునకు 87 సంవత్సరము లాయు విచ్చినప్పుడు వానిమనుమడైన శ్రీనాథునకు 132 సంవత్సర ములైన యాయువీయకున్న వారి యుదారస్వభావమునకు వెలితిగనపట్టదా హరవిలాసములోని,

"శ్రీపర్వత సోపాన స్థాపక వేమ క్షతీశ సామ్రాజ్య శ్రీ న్యాసాల ముఖ్య యశ్వయ దీపిక యలకాది రాజ దేవయ తిప్పా,

అనుపద్యమును గూర్చి వీరేశలింగముగారు

"అంతేకాక తృతీయాశ్వాసొరంభములోని యీపద్యము తిప్పయసెట్టి కూడ పోలయ వేమా రెడ్డి కాలములో నుండినట్టు తెలుపుచున్నది. పోలయ వేమారెడ్డి కాలములోనే తిప్పయ్య సెట్టి వ్యాపారి ముఖ్యుం డైనందున నప్పటి కిరువది సంవత్సరములవాడయిన నాయియుడి, కుమారగిరి రెడ్డి రాజ్యారంభ కాలమునకే, 'యేఁబది సంవత్సరములవాడయి, హరవిలాసరచన కాలమునకే యజువదేండ్లు దాటిన వాఁడయి యుఁడవలెను. హరవిలాసము 1440 వ సంవత్సర ప్రాంతమున తిప్పయసెట్టికి కంకితము సేయఁబడినదని చెప్పెడి బుద్ధిమంతుల యభిప్రాయము ప్రకారము తిప్పయ సెట్టికి నూటపది యేండ్లు దాటిన తరునాత శ్రీ నాధుఁడు హరవిలాసము నంకితము చేసెనని యేర్పడును గనుక నది గొప్పయ సంగతము. కాబట్టి హరవిలాసము కుమారగిరి భూపాలుఁడు జీవించియుండ గానే 1890వ సంవత్సరమునకు లోపలనే తిప్పయ సెట్టి కంకితము చేయఁ బడుట నిశ్చయము. అప్పటి కే తిప్పయ శెట్టికి దాదాపుగా డెబ్బది సంవత్సరముల యీడుండును.1360 వ సంవత్సరములోపల జనన మొందిన శ్రీ నాధుఁడు వృద్ధుఁ డైన తిప్పయ శెట్టికి బాలసఖు డెట్లగును. ఇద్దరును సమాన వయస్కులు కాకపోవుట నిశ్చయము. తిప్పయ సెట్టి వృద్ధు డే శ్రీనాధుడు బాలుడై యుండినప్పుడు సఖ్యము కలిగియుండుట చేతనే తిప్పయ పెట్టికి శ్రీనాధుఁడు బాలసఖుడయ్యెనుగాని యుభయులును 'బాలు రైయుండి నప్పుడు కలిగిన మైత్రి చేత గాదు.....................కాఁబట్టి 1360 నము 1400 - లకును నడిమికాలము లో సనగా 1400 వ సంవత్సర ప్రాంతమున హరవిలాసము రచింపఁబడెను. అప్పటికీ శ్రీనాథుఁనకు ముప్పదినాలుగు ముప్పది యైదు సంవత్సరముల వయస్సుండును." అని వ్రాయుచు లక్ష్మణరావు గారికిఁ బ్రత్యుత్తరమిచ్చియున్నారు. ఇంతగా వ్రాసిన నీ రేశలింగముగారు సర్వజ్ఞ సింగమ నాయని ప్రశంస వచ్చునప్పు టీకి నదియేమి మహత్మ్యముననో కాని తమతొంటి బుద్ధి కౌశలము నంత జాఱవిడిచి విపరీతాప్రమాణవాదమునకుఁ గడంగుదురు. వీరి వాద వైపరీత్యమును గనుఁడు. సర్వజ్ఞసింగమనాయని గూర్చివ్రాయుచు, 'బేతాళనాయనికి నేడవతరమువాఁడుసర్వజ్ఞసింగమ నాయఁడ గుటకు సందేహము లేదు; రసార్ణ వసుధాక గానీ సంస్కృత గ్రంథము లను రచించినవాడతడే యగుటకును సందేహము లేదు. శ్రీనాథ పోత నార్యులాతని కాలపువారు కాకపోవుటయు సందుచేత నాతని యాస్థాన మునందుండకపోవుటయు నిశ్చయమే. అంతమాత్రముచేత పదవతరము వాఁడైన సింగమనాయడను విద్వాంసుఁడుచు సర్వజబిరుదాంకితుడును గాఁడససిద్ధాంత మేర్పడ నేరదు." * అనివీరేశలింగముగా రేడవతరము సింగమ నాయని కాలములో శ్రీనాధుఁడు లేఁడనుట నిశ్చయముని నొక్కి వక్కాణించు చున్నాడు. 1368 వ సంవత్సరమునఁ బుట్టి ముప్పదై దేండ్ల ప్రాయ సనఁగ 1400 సంవత్సర ప్రాంతమున డెబ్బదేండ్ల ప్రాయముగల తిప్ప య శెట్టికి హరవిలాసమంకింతము చేసెనని యొక ప్రక్కను సిద్ధాంతము సేయుచు నేఁడవతరము సింగమనాయని కాలములో శ్రీనాధుఁడు లేఁడని నొక్కి వక్కాణించుట పరిహాసాస్పదమైన విపరీత సిద్ధాంతమనుటకు లేశమాత్రమును సంశయింపఁబని లేదు. ఆఱవతరమువాఁడైన అనపోత నాయడు 1381 వఱకును బ్రతికి యుండి పరిపాలనము చేయుచున్నట్టు శాససములు ఘోషించుచుండగా వాని తరువాతవాని కుమారుఁడేఁడవ తరము సింగమనాయడు పరిపాలనము చేసిన ట్లాసింగమనాయని పుత్రుడగు రామమాధవరావు కాలమునాటి శాసనమున, రసార్ణ వసుధాకర గ్రంథము మొదలగువాని వలనఁ దెల్లమగుచుండ నా కాలమున శ్రీనాథుడు లేఁడనుట స్వవచన 'వ్యాఘాతము కాదా? శ్రీనాథుఁడు పదవతరము సర్వజ్ఞ సింగమనాయని సందర్శింపఁ బోయి యాతనిపై బద్యములు చదివినది వాస్తమని సిద్ధాంతము చేయవల వలసిన పక్షమున లక్ష్మణరావుగారు శ్రీనాథుని జన్మకాల సంవత్సరమని నిర్ణయించి 1360 దవ సంవత్సరమును గాని వీరేశలింగముగారు నిర్ణ యించిన 1465 దవ సంవత్సరమును గాని మన మంగీకరింప రాదు. సర్వజ్ఞ సింగమనాయని కధను లక్ష్మణ రావుగారు విశ్వసించుచున్నారో లేదో మనకుఁ దెలియరాదు. వీరేశలింగముగారు విశ్వసించుచున్నారు. శ్రీనాథుని జన్మకాలమును నిర్ణయించునారు. హరవిలాసమును మాత్ర మెత్తుకోని తక్కిన విషయములను విస్మరించుట కూడదు. లక్ష్మణ రావుగారు హరవిలాసమును బట్టియే కాలనిర్ణయమునకుఁ బూనుకొన్నం దునఁ బైన చెప్పి నరీతిగా విపరీతసిద్ధాంతము లేర్పడుచున్నవి. బాలసఖుఁ డను దానిని వీరేశలింగముగారు గాని లక్ముణరావుగారు గాని తృప్తి కరముగా సమన్వయింప లేదు. ముప్పదియై ద్వేడ్లవానిని బాలునిగా జెప్పి, వానికిని వృద్ధుడైన తిప్పయకును సమావేశమును గలిగించి, సఖ్యతఁ గావించి, మఱి పదియేడ్లకు రప్పించి, బాలసఖుఁ డనిపించి, కృతినిప్పించినట్టి వీరేశలింగము గారివాదము యొక్క పటుత్వమంత తృప్తికరముగాఁ గానంబడదు. ఒక చోట వీరేశలింగము గారు, ఈనైషధ కావ్య రచనవలన శ్రీనాధున కాంధ్రకవులలో నత్యంత ప్రసిద్ధి కలిగినది. ఎంతటి ప్రసిద్ధిగలిగినను శ్రీనాథుఁ కింతవఱకు రాజస్థానములలో బ్రవేశము కలిగినది కాదు.ధనార్జనమునకై పెదకోమటి వేమనృపా లుని సంస్థానమునకుఁ బోయి యతని మంత్రులు మొదలైనవారి నాశ్రయించినట్టే శ్రీనాథుఁడు స్వస్వస్థలమును వచ్చిన యారంభదరి

లోనే రెడ్డి రాజ్యమునకుఁ బ్రధాన నగరమైన కొండవీటికిఁ బోయి కుమా రగిరి రెడ్డి యొక్క మంత్రులు మొదలగువారి నాశ్రయించి యుండును. యచ్చటి వారీతని కచ్చటఁ బ్రవేశము కలుగనీయ లేదు.” అని వ్రాసిరి ఇదెప్పుడు తటస్థమయ్యెను, వారి యభిప్రాయము ప్రకారము వారు చెప్పినరీతి నిరువదియై దేండ్ల బాలుఁడై యున్నప్పుడు గదా ! మఱియొక చోట (అటుతరువాత రెండుమూఁడేండ్ల కనఁగా 30 వ సంత్సర ప్రాంతమున శ్రీనాధున కిఱువదియై దేండ్లుండినప్పుడు పండితారాధ్యచరి త్రము రచింపఁబడి యుండు" నని వాక్రుచ్చియున్నారు. ఈపండితా రాధ్య చరిత్రము నైషధకృతిపతియైన సింగనామాత్యుని యన్నయును, దండాధీశుఁడు నైన ప్రగడన్నగంకితము చేయఁబడినది..ఈ విషయమై సింగనామాత్యుఁడు పలికినట్లుగా శృంగార నైషధమున

క. 'జగము నుతింపగఁ జెప్పెడి ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్ నిగ మార్ధసార సంగ్రహా మగు నాయారాద్య చరిత మాదిగ బెక్కుల్. ,

అని డృఢముగాఁ జెప్పియున్నాడు. దీనింబట్టి శ్రీనాథుఁడు తాము చె ప్పిన చొప్పున ఇరువదియై దేండ్ల ప్రాయమున దండనాథుఁడైన పిగడ న్న నాశ్రయించి పండి తారాధ్య చరిత్ర మాదిగాఁ బెక్కు గ్రంథములు రచించియుండగా ధనార్జనమునకై కొండవీటికిఁ బోయి కుమారగిరి రెడ్డి మంత్రుల నాశ్రయించినను బ్రవేశము లేదనియు, ఉభయలును శైవ మతస్థులగుట చేత తిప్పయ సెట్టికి నిరువదియై దేండ్ల బాలుఁడైన శ్రీనాథునకు మైత్రి కలిగినదని చెప్పుట సంభావ్యమగునా! ధనార్జనమునకై పోయిన వాఁడు, శైవమతాభిమానమువలన మైత్రి గావించుకొనిన తిప్ప యసెట్టి కప్పుడేమియు నంకితము చేసి ధనసంపాదనము చేయక చేతులు జాడించుకొనుచుఁ బోయె ననియు, మఱి ఫదియేండ్లకు వచ్చినప్పుడు తిప్పయ శెట్టి వానిని బాలసఖుఁడని గారవించి శైవమతగ్ధంథమును డెబ్బ దేండ్ల వయస్సునా డంకితము నొందె ననియుఁ జెప్పినది నాకంత విస్వాసపాతముగాఁ గన్పట్ట లేదు. వారి యభిప్రాయమును బట్టిగా 1390 వ సంవత్సరము నాఁడు పెగడయ్యకుఁ బండితారాధ్యము మొదలగు పెక్కు కృతులను నంకితము గావించెనుగదా! 1395వ సంవత్సర ప్రాంతమున నాతని తమ్ముఁడును 'పెదకోమటి వేముభూపాలుని మంత్రి యు నగు సింగనామాత్యునకు శృంగారనైషధకృతి సంకితము గావిం చెసుగదా! ఇట్లయిదు సంవత్సరముల కాలము. పెదకోమటి వేమభూ పాలునీ మంత్రుల నాశ్రయించి వారి ప్రాఫున గ్రంథరచననులో మునింగి యుండియు, ఆకాలమున ధనార్జనముసకై కుమారగిరి రెడ్డి మంత్రుల కడకుఁ బోయె ననియు, వారెవ్వరు నాతని నాదరించకపోఁగా ? : శైవమతాభిమానము చేత శైవుడైన శ్రీనాథున గారవించి మైత్రి నెరపి యూరక యామహకవిసత్తమునిఁ బంపి వేసి సిమ్మట మఱి పదిసంవత్స రములకు బాలసఖుఁడని ప్రేమించి హరవిలాసము కృతినొందె ననుట యెట్లు విశ్వాసార్హ మగును. మఱియును నీ రేశలింగ మగారు దుగ్గన శ్రీనాథుని కాలములో బాలకయై యాతని యనంతరముననే కాంచీపు రమహాత్మ్యముకు, నాచి కేతూ పాఖ్యానము జేసినట్టు కానంబడుచు న్నాఁడు' అని వ్రాసియుండుట గూడ నారు పైనచెప్పెడు నభి ప్రాయముల కు బాధకముగా నుండకపోదు. దుగ్గన శ్రీనాథుసకు మఱిఁదియు, శిష్యుఁడుగూఁడ నై యున్నాడు. శ్రీవీరేశలింగముగారు. శ్రీనాథుని జీవిత కాలములో నీతఁడు బాలకవిగా నుండెనని వచించుచున్నారు. శ్రీనాథుఁడు 1365.లోఁ బుట్టెననియు, నాచికేతూ పొఖ్యానము 1465 దుగ్గన రచించి యనంతామాత్య గంగయ్యకు నంకితము చేసెనని యుఁ జెప్పెడి వీరేశలింగము గారి యభిప్రాయములో శ్రీనాథుని జీవిత కాలములో దుగ్గన బాలకవిగా నుండెనను వాక్యాభిప్రాయమును సమ స్వయింప వలసి యుండును గదా ! సొచికేతూపాఖ్యాన రచనా కొలముసకు దుగ్గనకు నలువదియైదు సంవత్సరములున్న పను కొన్నను దుగ్గన 1425 వ సంవత్సరమునఁ బుట్టి యుండ నలయును గదా! శ్రీనాథుని యవసానకాలమునకు లక్ష్మణ రావు గారి యభిప్రాయము ప్రకార మా బాలకవియైన దుగ్గనకు 15 సంవత్సరము లును, వీరేశలింగము గారి యభి ప్రాయము ప్రకార మా బాలకవికి 35 సంవత్సరములు నుండి యుందును. దుగ్గనకంటె నతని తోబుట్టువు శ్రీనాథుని భార్యకు -90 సంవత్సరములు వయస్సులో నెచ్చుతగ్గులన్న వన కొన్నను 1405 దవ సంవత్సరమున నామె జనించి యుండవల యును. మఱి పదియేండ్లకనఁగా 1415 సంవత్సర ప్రాంతమున వివాహ మై యుండనలయును. అటుపిమ్మట మూడేండ్ల కుఁ గాని కాపురమునకు బోయి యుడడుగదా! అనఁగా శ్రీనాథునకు నేఁబది యేండ్లు దాటిన తరువాతనే వివాహమును, భార్య కాపురమునకు వచ్చియుండుటయుఁ దటస్థమై యుండవలయును గదా. శ్రీనాధుఁ డేబదేండ్లు దాటువఱకు ను వివాహము లేకుండ నున్నాఁడనుట నాకంత విశ్వాసపాత్రమైన విషయముగాఁ దోఁచలేదని యిదివఱకే తెలిపియున్నాఁడను. అట్లయిన వీరివాక్యముల నన్నిటిని సమన్వయించుట యెట్లు! హరవిలాస రచన కాలయును. మసము స్థిరీకరింపఁ గలిగిన యెడల మరము శ్రీనాథుని జన్మ కాల సమస్యను పరిష్కరింపఁ గలము.

హరవిలాస రచనా కాలనిర్ణయము,

హరవిలాసరచనము కొండవీడు పురమున గాక కొంచీపురమునజరిగినది. ప్రఖ్యాత విమర్శకులయిన లక్ష్మణ రావు గారు హరవిలాసకృతి యగు తిప్పయ పెట్టి తాత పావాణి సెట్టి,

 తే. సింహావిక్రమ పట్టణ శ్రేష్టుడైన
సెట్టిజగ జెట్టి పావాణి సెట్టి' విభుఁడు

ఘనుఁడు నగరీశ చంద్ర శేఖర పదాబ్జ
వందనానందితాత్ముండు వంశకరుడు.

అని హరవిలాసమున సింహవిక్రమ పట్టణ (నెల్లూరు, శ్రేష్ఠుఁడుగా వర్ణింపఁబడి యుండుట చేతను,

క, కొమరగిరి వసంతనృపా
గమక వివరగంధసార కస్టూరీ కుం
కుమ కర్పూరహిమాంభ
ముదంచిత బహుసుగంధరాలాధ్యక్షా.

అని తిప్పయ సెట్టి కుమారగిరి నిమిత్తము 'దెప్పించిన కర్పూరమును, గఁథసారమును, కస్తూరిని విక్రయించు గొప్ప సుగంధ ద్రవ్యముల వాణిజ్య శాలను "బెట్టినవాడా యని సంబోధింపఁబడి యుండుటచేతను, ఆనాటికి తిప్పయ సెట్టి నిజముగా గొండి వీటి పుర శాసియని నమ్మి, విద్యానగరాధి పతియగు రెండవహరిహర రాయలు, బహుమనీ సుల్తానగు ఫిరోజ్ షాహ, కుమారగిరి రెడ్డి, మూవురు బ్రతికిఁయున్న కాలమున క్రీ. శ. 1400 సంవత్సర ప్రాంతమున కుమారగిరి ప్రభుత్వపు జివరభాగమున, అనఁగా 1398 లో గాని, 1399 లోఁ గాని రచింపఁబడి యుండునని విశ్వసించి, సులువుగాఁ దెలిసికొనఁదగిన దానికి లేనిపోని కల్పనలను గావించి శ్రీనాథుని జీవిత కాలనిర్ణ యమునకుఁ బ్రతిబంధకమగు గొప్ప చిక్కును గలిగించిరి. ఈచిక్కును దొలగించునట్టి విషయము మనము సరిగా హరవిలాసమును బరిశీలించి విమర్శదృష్టితోఁ బఠించినయెడల మనకే దృష్టి గోచరము కాగలదు. శ్రీనాథుఁడు తన హరవిలాసమున ::

ఉ. మంకణమానివంశ మణిచందన కాంచీ పురనివాస! యే
ణాంక కిరీట దిశ్యచరణాంబుజ సేవక ! వైరిభధ్ర నా
గాకుళ! హారిహరదర హాసవి పాండువ కీర్తి చంద్రికా
లంకృత దిగ్విభాగ ! శుభలక్ష్ముణ! చారిరుహాయ తేక్షణా!

అని తిప్పయ సెట్టిని కాంచీపురీనివాస యని సంబోధించుచున్నాఁడు. దీనిఁ బట్టి తిప్పయ పెట్టి కాంచీపురనివాసియై యున్న కాలముననే హర

విలాసమును రచించి తిప్పయ పెట్టి కోరిక ననుసరించి యూతని కంకి తము గావించెననుట స్పష్టమగుచున్నది. మఱియు,

 మ. ఖుషిమీఱన్ సురదాణి నిండుకొలువై కూర్చున్నచో నీకరా
భ్యసనంబు న్నుతియిం చురాయవచితిప్పా! చంద్రసారంగ నా
భిసము త్పాదిత తాళవృంత పవన ప్రేంఖోలసప్రక్రియా
వసరోదంచిత సార సౌరభిర సన్యాలోల గోలంబముల్ .

అని వర్ణించియుండుటచేతఁ బై పద్యములోఁ బేర్కొనఁబడిన సురథాణి ఫిరోజషాహా 1422 వఱకుఁ బరిపాలను చేసినవాఁడుఁ గావున నాతఁడు హరవిలాసరచనా కాలమున బ్రతికియుండెనని చెప్పవచ్చును. కనుక హరవిలా సరచనా కాలము 'పెదకోమటి వేమా రెడ్డి మరణకాలము నకును, ఫిరోజిషా మరణకాలమునకును నడిమికాలమున అనగా 1421 వ సంవత్సర ప్రాంతమునై యుండునని నిర్ధారించుట కెవ్వియు నడ్డుకోనఁజూలవు. ఇంకను ఈవిషయము హరవిలాసమును గూర్చి వ్రాయు సందర్భమున సవిస్తరముగా విశదీక రింపఁబడును. [4]*

శ్రీనాథుని జన్మ కాలనీర్ణయము

హరవిలాసరచనా కాలము నిర్ణయమైనది గనుక నిపుడు శ్రీనాథునిజన్మకాలము 'దెలిసికొనట సుకరము కాగలదు. అవచి తిప్పయ సెట్టి తన్ను బాలసఖుఁడని ప్రశంసించినట్లుగా శ్రీనాథుఁడు హరక్షిలాసమున విశదపఱచి యున్నాడు. తిప్పయ పెట్టి వృద్ధుఁడై కాంచీపురములో సుఖుఁడై యున్న కాలమున బాల సఖుండవని ప్రశంసించుటచేత 'శీనాథుఁడు బాలుఁడుగా నున్న కాలమున వానితో మైత్రి గలిగినదని స్పష్ట పడఁగలదు. ఆమైత్రి యెచ్చట నెప్పు డేవిధముగా సంభవించెనని ప్రశ్న యుపుట్టఁగలదు. కొండవీటి సామ్రాజ్యమును బరిపాలించిన కుమారగిరి రెడ్డి పరిపాలన కాలమునఁ గొండవీడులో కుమారగిరి రెడ్డి ప్రతిసంవత్స రము వసంతోత్సవ సందర్భములందు సుగంధవస్తు భాండాగారాధ్యక్ష్యు డైయున్న సమయములందు బాలుఁడైన శ్రీ నాథకవితో యౌవనవయ స్కుఁడయిన అప్పయ సెట్టికి మైత్రి గలిగినని చెప్పవచ్చును. కునూర గిరి రెడ్డి1383 మొదలుకొని 1400 వఱకు ప్రతిసంవత్సరము వసంతోత్సవములను జరుపుచు వసంతభూపాలుడని ప్రఖ్యాతి గాంచినది చరిత్ర ప్రసిద్ధ మైనవిషయుము. ఆకాలమున మన శ్రీనాధకవి బాలుఁడుగా నుండినను, అప్రతిమాన ప్రతిభావంతుడై గవితావిద్య నలవఱచుకొని ప్రఖ్యాతగాంచుచున్న వారచేత వసంతభూపాలుఁడు జరపు వసంతోత్సవములకు శ్రీనాధుఁడు బోవుచుండు వాడగుట చేత నాతనితోఁ దిప్పయ సెట్టికిఁ బరిచయము గలిగి క్రమముగా మైత్రి యేర్పడినదని చెప్పుదగును. కుమారగిరి రెడ్డి మరణకాలమునకుఁ దిప్పయ సెట్టికి 45 సంవత్సరములకు మించిన వయస్సుం డదు. శ్రీనాథమహాకవికీ 20 సంవత్సరములకు మించిన వయస్సుండదు. చిన్నారిపొన్నారి చిఱుత కూకటి నాటినుండి (అనఁగా 14 సంవత్సర ముల ప్రాయముగల కాలము) శ్రీనాధకవి తిప్పయ సెట్టికి మిత్రుఁ డై యుండెను. వసంతోత్సవముల వైభవములు వసంతభూపొలుని మర ణముతోనే నిలిచిపోయినవి. ఏనాఁడు వసంతభూపాలుని కొండవీటి సొ మ్రాజ్యము పెదకోమటి వేమా రెడ్డి యాక్రమించుకొని పరిపాలనను చేయుట సాగించి తనకు పరమమిత్రుఁడైన కుమారగిరి రెడ్డి కుటుంబ మునకు శత్రువయ్యేనో నాటినుండియుఁ దిప్పయ సెట్టికిఁ గొండ వీటితో సంబంధము విడిపోయి కాంచీపురమే సుస్థిరనివాస మయ్యెను. .. పెదకో మటి వేమా రెడ్డి యాస్థానమున శ్రీనాథ మహాకవి విద్యాధి కారిపదవి సంపాదించి పెదకోమటి వేమూరెడ్డి మరణ పర్యంతము సత్యంత ప్రతిభా నై పుణ్యములతో నిహ్వహించినది సుప్రసిద్ధమైన చరిత్రాంశము. పెద్ద కోమటి వేమారెడ్డి మరణాంతర మనఁగా నిరువది సంవత్సరపు కాములకుఁ బిమ్మట శ్రీనాథ మహాకవి కాంచీపురమునకు శిష్యుడును మఱియునగు దగ్గు పల్లి దగ్గనతోఁ బోయి తన్ను సందర్శించినప్పు డరువదియేండ్ల వయస్సు గడచిన వృద్ధుఁడు తిప్పయ సెట్టి మనకవిని బాలసఖుఁడని హెచ్చరించి జ్ఞప్తికిఁ దెచ్చుకొనుట యాశ్చర్యకరమైన విషయము గాదు. కావున హరవిలాస రచనాకాలము నాటికి శ్రీనాధునకు నలువది సంవత్సరములును, తిప్పయ సెట్టికి నరుపది యైదు సంవత్సరములకు మించిన సయస్సుండబోదు. కనుక మన శ్రీనాధమహావి క్రీ. శ.1380 దవ సంవత్సక ప్రాంతమున జనించి యుండవలయుననుట సత్యమున కంతదూరమున నుండునది కాదు. ఈకాలము శ్రీనాథుడు తన గ్రంధములలోఁ జెప్పుకొన్న విషయముల నన్నిటిని క్రమముగా సమన్వయించుటకు సరిపోవుచున్నది. నేను శ్రీనా థకవి జీవితము యొక్క ప్రథమ ముద్రణ గ్రంథమును జేసిన యీమావాద స్వభావమును జక్కఁగా నవగాహనముఁ జేసికొన్న శ్రీ ప్రభాకర శాస్త్రిగారు తరువాత తాము వ్రాసిన 'శృంగార శ్రీనాథ'ను ను గ్రంథమున శ్రీనాథుని జన్మ కాలంలమించుక యించుమించుగా క్రీ. శ.1385 అగు ననీ వ్రాసియున్నారు. కాని 1404 సంవత్సరము నాటికి పెదకోమటి వేమా రెడ్డి యాస్థానమున విద్యాధికారపదని యందుండి శ్రీనాథుఁడు శాసనాచార్యుడుగా నున్నట్టు గొన్పించుచున్నది. గావున నప్పటికి శ్రీనాధునికిఁ బదు నెనిమిది పదుతోమ్మిది సంవత్సరముల వయస్సు మా త్రమే యుండును. అప్పటికీ శ్రీనాథ మహాకవికి నిరువదినాలుగు యిరువడియైదు సంవత్సరములయిన వయస్సుండునని నాయభిప్రాయము, ఇందలి వివరణము చదువరులకు ముందు బోధపడఁగలదు.

  1. *వీరిపుడు కీర్తిశేషులయినవారు. గ్రంధాలయ సర్వస్వము, ద్వితీయసంపుటము, ప్రధమసంచిక, శ్రీనాథుని గ్రంధముల కాలనిర్ణయమను వ్యాసము.
  2. వావిళ్ళ రామస్వామి , శాస్త్రీ అండ్ సన్సు వారిచేఁ బ్రకటిత మైన ప్రతి (1916)
  3. *వెల్గోటివారి వంశ చరిత్రములోని యనుబంధములో నున్న శాసనములు జూడుడు.
  4. * ప్రభాకర శాస్త్రి గారు తాము రచించి 1923లోఁ బ్రకటించిన శృంగార శ్రీనాథమను గెంథములో నా పాదము నే. ప్రవేశ పెట్టి ప్రథమ ముద్రణ గ్రంధమున "నేను - జెప్పిన కాలము నంగీకరించి బలపఱచియున్నారు,