శ్రీనాథకవి జీవితము/ప్రథమాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీనాథకవి

——:O:——

ప్రథమాధ్యాయము

ఒడ్డోలగంబుల నడ్డమాకయు లేక వాళ్ళ వాహంబు వేల్వఱిచినాఁడు
అష్టదిగ్జయ యశోపష్టంభు డిండీమ భట్టారకుని నోడగొట్టినాఁడు
అఖిల విద్వల్లోక మగ్గింపఁ గవిస్వాభౌమ సడ్బెరుదంబుఁ బడసినాడు
కలితమౌక్తికి సభాగాలాంతరమునందఁ గనకాభిషేకంబు గాంచినాఁడు

గీ. రాజపన మేళ రాజధిరాజవిభవ
దక్షిణాధీశ దేవ రాంక్షితీంద్ర
కక్షితలు భాభీభటక శూటకటక
పద్మవన హేళి శ్రీ నాధభట్టుకవి.

ప్రభాకరశాస్త్రి.



మ. మహి మున్ వాగనుశాసనుండ సృజియింపం గుండటందుండు ద
స్మహానీయ స్థితమూల మైన లంప, శ్రీ నాధుఁడుప్రోవన్, మహా
మహులై సోమఁడు భాస్కరుండు వెలయింప, సోంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తి మయప్రపంచమున దత్ప్రగల్భ్య మూహించెదన్", "

రామరాజభూషణకవి.



శ్రీనాథుని జన్మస్థానము.



ఇతఁడు పాకనాటి నియోగి బ్రాహణుఁడు; భారద్వాజసగోత్రుఁదు;
ఆపస్తంబసూత్తుఁడు; కమలనాభుని పౌత్రుడు; మారయామాత్యు
సకును భీమాంబకును బుత్త్రుండు. శ్రీనాథుఁడు భీమేశ్వర పురాణములో

ము. కనక జ్మాధర ధీరు వారిఖిత టీ కాల్పట్టణాదీశ్వరున్
మరునిం బద్మ పురాణసంగ హకళా కావ్యప్రబంఛాధపున్

వినమత్కాకతి సార్వభౌముగవి తావిద్యాధరుంగొల్తు నా

[1] యనుగుందాత బ్రాదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్

అను పద్యమునందు తన పితామహుఁడును, కవి తావిద్యా ధురంధరుఁ డును, పద్మపురాణసంగ్రహ కళాకావ్య ప్రబంధాధిపుఁడును నగుకమల నా భామాత్యుఁడు సముద్రతీరము నండని కాల్సట్టణమునకు ప్రభువుగా నుండెనని చెప్పియున్నాడు.

శ్రీ అక్కిరాజు ఉమాకాంతముగారు శ్రీనాథకవిజన్మస్థానము కర్ణాట దేశమనియు, కర్ణాట దేశమున జన్మించినను శైశవమున నే యీతని తల్లిదండ్రులు ద్యోగవశము. సనో మఱి యేకారణముననో కొండవీటి సీమకు వచ్చియుందు రనియు, ఇంటిలోఁ దల్లిదండ్రులలో మిశ్రకర్ణాటము మాట్లాడుచున్నను: బాల్యమునం దెలుగు దేశములో దెలుఁగువారితో గలసిమెలసియున్నందునఁ దెలుఁగువాని వలె' దోచు చున్నాఁడనియుఁ దెలుపు సపూర్వ సిద్ధాంతము నొక దానెలకొలుప బ్రయత్నించి పల్నాటి వీర చరిత్రములోని బాలచంద్రయుద్ధ భాగమునకుఁ బీఠిక వ్రాయునపుడు తమ నూతన సిద్ధాంతమునందు జొప్పించి యా గ్రంథమును బ్రచురించి యున్నారు.

మరియు సుప్రసిద్ధాంధ్రకవి కర్ణాట దేశీయుఁడనుట పలువురికి రుచింపకపోయినను మీదుమిక్కిలి నాకు నిష్టము లేకపోయినను యధార్ధముగ గనఁబడు చున్నది. నమ్మకపోవుట సంభవింప నేరదుగాన నాయభి ప్రాయము తెలుపుచున్నా' నని పలికి సత్యాన్వేషణ పరాయయణులగు 'వారీ యుంశ మునాలోచింపవలయుననియు కూడఁ బ్రార్థించియున్నారు. వీరు తమ వాదమునకు బలముగా నాలుగు 'హేతువులను గనఁబఱిచి యున్నారు శ్రీనాథుఁడు తన "కాళీ ఖండములో కర్ణాట దేశకటక పద్మవని హేళి' యను విశేషణమును జెప్పుకొనియుండుట మొకటిహేతువు. తన భీమేశ్వర పురాణములో నాకవిత్వంబు నిజము కర్ణాట భాష' యని చెప్పుకొనియుండుట రెండన హేతువు. మరియు తల్లీ!కన్నడ రాజ్యలక్ష్మి దయ లేదా? నేను శ్రీనాథుఁడన్' అని యొక చాటువులోఁ జెప్పుకొ నియండుట మూడవ హేతువు. శ్రీనాథుని తాత కనుల నాభామాత్యుని వారిధి తటీ కాల్పట్టనాధీశ్వరు' డని వచించుట నాలుగవహేతువు, ఈ హేతువులఁబట్టి ఉమాకాంతముగారు శ్రీనాథుని జన్మభూమి కర్ణాట దేశమని నిర్థారించుచున్నారు; కాని యివియన్ని యునుభ్రాంతీయంత్రమునం దగుల్కొని తిరుగాడుచుండిన బుద్ధివలన జనించిసట్టి యత్యద్భుతము లైన యుహలుగాని మఱి యొండుగావు. వీరి భావముల నోక్కొ క్కటిగాఁ దీసికొని జర్చించి సారమును గ్రహించి నపుఁడు యధార్థము దేట తెల్లము గాకమానదు,

కర్ణాట దేశ కటకపద్మననహేళీ' (అనగా గర్ణాటదేశాట్టణములను కమలములకు సూర్యుడు) అను విశేషణమును తనకుఁజేర్చుకొనినాడు గనుక జన్మస్థలమునందలి యభిమానము వలన నట్లు చెప్పుకొని యుండునని యుమాకాంతము గారి యూహయైయున్నది, గాని శ్రీనాథుఁ డిట్టివిశేషణముం జేర్చికొనుటకుంగల గాథ నెఱింగియున్న యెడల నట్టియభిప్రాయమును వెలిఁబుచ్చక యుందురు.

అయినను ఇందును గూర్చి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 'కనకాభిషేక, మను నొక చిన్న పొత్త మునఁ జెప్పి నయర్థమునుఁ జేసిన వ్యాఖ్యయును గూడ మనము తెలిసి కొనవలసియున్నది. కనకాభి షేకమున మహా రాజతల్పమునఁ దూగియాడు చుండు నాకర్ణాటా ధీశ్వరుని (దేవరాయలు) నిండోలగమున డొక్క చెదరును బిక్క బెదరును లేక పాండిత్య శౌండీర్యమును వ్యక్త పఱచి యఖండపండితుఁడు మహాకవి బహుశిష్యపరివృతుడునై విజయడిండిమాడంబరమునఁ బ్రత్యర్థుల నద్రుంప జే యుచు నాప్రభుసార్వభౌమునినా స్థానింగవిసార్వభౌమ వైభవమనుభవిం చుచున్న యుండుని డిండిమభట్టారకు నుగ్భటవి వాదమున నోడఁగొట్టి యతని విజయడిండిమమును బగులగొట్టించి యత్యంత గౌర వాస్పద మగు నారాజేంద్రుని ముత్యాలశాలలోఁబ్రభుపండిత బహుమానపుర స్కృతముగాఁ గవిసార్వభౌమపదవిని గనకాభి షేకముతోఁ బట్టాభిషిక్తు డై' కవిసార్వభౌముఁడను బిరుదాంక నామధేయమునఁ బరగుటయ గాక యాకవిమార్తాండుఁడప్పుడు కర్ణాటరాజధాని (యంద లివిబుధ రాజి) యను. తమ్మతోపునల రార్చినకతన కర్ణాట దేశకటక పద్మవన హేళి, యనదనరారెను. " అని తమభావము విస్పష్టము జేసియున్నారు. కాబట్టి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినదే సహేతుకముగను సయుక్తికముగను గనుబట్టుచున్నది. కర్ణాట దేశ కటకమను దానికి కర్ణాట దేశపు రాజధా నియని యర్థమును గ్రహీంపవలయును.*[2] కర్ణాట దేశమని యూహించుట భ్రాంతి గాని మఱియెండుగాదు. ఇంక రెండన హేతువును విచారింతము. శ్రీనాథకవి భీమేశ్వర పురాణములో

ప్రౌడిబరికింప సంస్కృత భాషయండ్రు
పలుకునుడికారమున నాంధ్ర భాషయందు
'రెవ్వ రేమన్న నండ్రుగా కేమకొఱత
నాక విశ్వంబు నిజము కర్ణాట భాష.

అను నొక పద్యము గానంబడుచున్నది. ఈ గ్రంథము రాజమహేం ద్ర పురాధిపతియగు నల్లాడ వీరభద్రనృపాలునికి మంత్రియగు 'బెండపూడి అన్నామాత్యుని కంకితము చేయఁబడినది. కనుక నీపద్యరచనా కాలము పెదకోమటి వేమభూపాలుని మరణానంతరము కొండవీటి రాజ్యము కర్ణాట దేశాధీశ్వరుల ఆధీనము కాఁగా శ్రీనాథుఁడు అన్న మాత్యుని సంబంధ బాంధవ్యము మూలమున రాజమహేంద్రపురమునకు నేతెంచి, వారలకడ సాస్థానకవిగ బ్రవేశించిన కాలమై యున్నది. కాకతీయ సామ్రాజ్య మంతరించిన వెనుక నాంధ్ర దేశములో దక్షిణ భాగము (పాకనాఁటిసీమ) కర్ణాటాధీశులు యాధీనమై కర్ణాట రాజ్యముగానే పరీ గణింపఁబడుచు వారిచేతనే పరిపాలింపఁబడుచు వచ్చినది. ఆ భాగము లోనుండు నాంధ్రుల కాలమునను నంతకుఁ బూర్వముననుగూడ గర్ణాట కులతోడఁ దఱుచు పొత్తుగలిగియుండుట సంభవమగుచు వచ్చెను. అంధ్ర కవుల నేకులు గర్ణాట రాజ్యమునందును కర్ణాటకవుల నేకులాంధ్ర


దము " నెఱుగని వానివలె నిట్లు వ్రాసియున్నారు. " ఈ పద్యమునందు కర్ణాట దేశకట ' కపద్మపన హేళి' యని తనకు విశేషణము చేసి"ని తాను గర్ణాట రాజ్యరాజు గాని యండు విద్యావిజయమునొంది యచ్చటి పండిశులను సంతోష పెట్టితినని సూచించి యున్నాఁడు. కర్ణాట దేశకటక పద్మపన హేళి' యనఁగా కర్ణాట దేశ రాజధాని యనెడు పద్మరాజికి నూర్యుడని యర్థము. సూర్యుఁ డెట్లు పద్మవనము నలరించునో యట్లే తానును కర్ణాటకటక వాసులైన విబుథబృందము నలంకరించిన వాడనని కవి యభిప్రాయము. ” తమగ్రంధములో జెప్పిస "నేమి చెప్పుకున్న నేను మూయర్థము సంగీకరించి మాతో నేకీభవించినందులకు సంతసించు చుస్నొరము, రాజ్యమునందును నుండుచుఁ గవిత్వములం జెప్పుచు వచ్చిరి. సుప్ర సిద్ధకర్ణాట కవులగు నాగవర్మ మొదలుగా గొంద ఱాంధ్ర దేశమున జన్మించినట్లు కర్ణాటసారస్వతమువలన విదితము కాఁగలదు. సుప్రసి ద్ధాంధ కవులగు నన్నె చోడాదులు మొదలుగా బెక్కండ్రు కవితా రచనయందుఁ గన్నడపోకల ననుసరించుటయే గాక కర్ణాట భాషాపదములను బెక్కింటిని తమ గ్రంథములలోఁ జొప్పించి యున్నారు. శబ్దశాస్త్రజ్ఞులకు మాత్ర మీవిషయము చక్కగా బోధ పడఁగలదు. శ్రీనాథుఁడు తన కావ్యములకు కర్ణాటభాషా సంప్రదాయా నుసారముగ రచియించిన వాడగుట చేత గోదావరీతీరస్థమైన రాజమహేం ద్ర పురికి వచ్చినప్పు డచ్చట కవులోఁ గొందరతని కవిత్వము ప్రౌఢ మైనదే కాని సంస్కృతపదఘటిత మైనదనియు, మఱికొండఱు పలుకు చమత్కారమున నాంధ్ర భాషనలె నున్నది గాని యాతనిభాష కర్ణాట భాషయనియు వంకలు పెట్టి యీక్ట్యాళువులై 'వెఱి మొఱి యాక్షేపణలు చేయ నారంభించిరి. శ్రీనాథుఁడు సకలవిద్వాసనాథుఁడని యెఱుంగక పండితుల నేకులు వివాదములు పెట్టుకొని యెట్టులైన నాతనివంచించి సాగనంపవలయునని ప్రయత్నించిరి. అందులకే శ్రీనాథుఁడు తన్నధిక్షేపింప వచ్చిన పండితమ్మన్యులను, కుకవులను


తే. బోడ మల్పంబు, గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరంబు ముచ్చరము మనము,
కూపమండూకములు బోలెఁ కొంచే 'మెఱిగి
పండితమ్మన్యులైన నైతండికులకు.

తే. నికటముననుండి ప్రతి పుట నిష్ఠుర ముగ
సడరి కాకులు బిట్టు పెద్దఱచి నప్పు
డుదధి రాయంచ , యూరక యుంట లెస్స
సైపరాకున్న సెం దేని జనుటయొప్పు,

అను పద్యములలో నిందించి తరువాత,

 తే. ప్రౌడి బరికింప సంస్కృత భాషయండ్రు
పలంకుమడి కారమున నాంధ్ర భాషయందు
రెవ్వరేమన్న నండ్రు గా కేమికొఱత ,
నాకవిత్వంబు నిజము కర్ణాట భాష.

అను పద్యము జెప్పె.

ఇట్టి కుకవి నిరాకరణమునందే మనకవిసార్వభౌముఁడు తనకవి త్వము కర్ణాటభాషయని పలికినది. కాఁబట్టి యీతనికవిత్వ మాంధ్ర కవిత్వముగాని కర్ణాటకవిత్వము గాదు. ఈ కవిభాష యాంధ్ర భాష గాని కర్ణాట భాష కాదు. తన భాష కర్ణాటభాష మని చెప్పినది తాను రాజమహేంద్రపురమునకు వచ్చినతరువాతఁ బ్రథమమునఁరచించిన భీమే శ్వరపురాణమునందు మాత్రమె చెప్పెనుగాని యంతకుఁపూర్వము తాను రచించిన పండితారాధ్య చరిత్రమునఁగాని మఱి యేగ్రఁం థమునఁగాని చెప్పి యుండక పోవుటకుఁ గారణము పైని నేనుదహరించిన దేగాని శ్రీనాథుని జన్మ' దేశము తన దేశ మగట కాదు. దీనింబట్టి యాతని జన్మభూమి కర్ణాట దేశమగుట చేతఁ గర్ణాట భాషయం దభిమాసము చూపించెనని యూహించుట బ్రాంతిగాని వేరొండుగాదు. శ్రీ వీరేశలింగముగారు "తా ము: నూతనముగాఁ బెంచి వ్రాసి ప్రచురించిన నూతన గ్రంథములో శ్రీనాథుని జీవిత సంఘట్టమున నాయభిప్రాయమునే తమయభిప్రాయ ముగా నిట్లు లిఖించిరి,

“ఎక్కడనుండి యైనఁ గ్రోత్తగా నొక కవీశ్వరుఁడుగాని పండితుఁ డుగాని తమపట్టణమునకు వచ్చినప్పు డచ్చటి పండితులు మత్సర గ్రస్తు లయి యానూతన విద్వాంసుని నాపించుటయుఁ బరాభవింపఁజూచుట యు సామాన్యములే గదా. శ్రీనాథకవి కర్ణాటక దేశమునుండి రాగానే రాజమహేంద్రవరమునందలి పండితులు శ్రీనాథుని కవిత్వమంతయు సం స్కృత భాషయే యనియు మాటలచమత్కారముచేతఁ 'దెలుఁగుభాష లాగు గనఁబడుచున్నను నిజముగాఁ గర్ణాటభాషా ధోరిణియే యనియు, ఆక్షేపింపజొచ్చిరి. ఈ యాక్షేపణలను మనస్సునందుంచుకొనియె శ్రీనా థుఁడు రాజమహేంద్రపుర పండితులమీఁది కోపము చేత కుకవిదూషణ మను నెపముచేత భీమఖండములో నీక్రింద పద్యములను వేసెను.

" ఈకడపటి పద్యములోనివి తన్నితరులాక్షేపించినపుడు సమాధా నముగాఁ జెప్పఁబడిన పరిహాసగర్భితములైన మాటలే కాని తనకవిత్వ ము కర్ణాటభాషయని శ్రీనాథుని యభిప్రాయ మెంతమాత్రమునుగాదు. ఇట్లన్యాప దేశముగా దూషించుటయేగాక రాజమహేంద్ర పండితులను శ్రీనాథుఁడు బహుపద్యములం దాక్షేపించి యున్నాడు”[3]

ఇట్టి జ్ఞానము శ్రీవీ రేశలింగముగా రాంధ్రుల చరిత్రములోని మూఁడవ భాగములో శ్రీనాధుని చరిత్రమునుగూర్చిన నా చర్చను జదివిన పిమ్మట వారికిఁ గలిగినదిగాని యంతకుఁ బూర్వ మిట్టి యభిప్రాయము గలిగియుండ లేదనుటకు వారి నూతన గ్రంథమునుండియే యిందుకు భిన్న ముగా వ్రాసిన దని నుదహరించుచున్నాఁడను. వేములవాడ భీమకవి జీవితములో

“ఆకాలమునందలి తెలుఁగుపండితుల కందఱికిని సంస్కృత కర్ణాటక భాషలు సాధారణముగా వచ్చుచుండెను. అందు చేత దెలుఁ గును సహితము గర్ణాటకమనుచుండుట యప్పుడప్పుడు గలదు. శ్రీనా థుఁడు తన భీమఖండములో నేమనెనో చూడుఁడు:

<ప్రొఢిఁ బరికింప సంస్కృత భాషయండ్రు
పలుకునుడి కారమున నాంధ్ర భాషయందు
రెవ్వరేమన్న నండుకా కేల కొఱత,
నాక విత్వంబు నిజము కర్ణాట భాష


అని పై యభిప్రాయమునకుఁ భిన్న ముగానే వ్రాయఁబడియున్నది! ఇందునుగూర్చి పల్నాటి వీరచరిత్ర పీఠికలోనే శ్రీఉమాకాంత ముగారు వ్రాసినదానినే వీరికిఁ బ్రత్యుత్తరముగా నిట నుదహరించు చున్నాఁడను.

“1 ఈపద్యము"లోని కర్ణాటభాష' యను దాని ఆంధ్ర భాషయని
యర్థ మనియు నాకాలమున సంధ్ర రాజులను గర్ణాట రాజులని చెప్పుచుం
డిరనియు నొకరు వ్రాసిరిగాని యది యప్రామాణికము. ఆకాలము
నందుఁ గర్ణాట రాజులు నంధ్ర రాజులు వేఱు వేఱుగా నుండిరనియు నంధ్ర
భాషయు కర్ణాటభాషయు వేఱు వేఱుగ నెంచఁబడుచుండెననియు
శ్రీనాథకృత గ్రంథములలోని యీ క్రింది పద్యములవలనఁ దెలియఁగలదు.


శా.. కర్ణాటోత్కలపారశీకనృపసఖ్య ప్రాభప, శ్రీనిధీ
యగ్ణోరారాశి ఫరీత భూ భువనమధ్యాంధ్రక్షమాధీశ్వరా,
కర్ణాభ్యర్ణ విశాల నేత్ర, జగదేక రాజ్య సామ్రాజ్య, దృ
క్కర్ణాగ్లాధీశ్వరహారభక్తినిరతక్ష్మా పాలచూడామణి!

కాశీ, అ. 3.

గీ.. యవసకర్ణాట కటక భూధవులతోడ
బలిమి వాటించి యేలిం చెఁ దెలుఁగుభూమి
దన నిజ స్వామి యల్లాడ ధరణి నాధు,
బలిద యరి యేటి లింగన ప్రభువరుండు.

మ. ఆగళీ భావ,తురుష్క, భాష గజకర్ణాటాంధ్ర గాంధారి ఘు"
ర్జరభాషల్" మళయాళ భాష, శక భాషాసింధు సౌవీర బ
గ్భగ భాషల్ కరహాట భాష మఱియు భాషావిశేషంబు ల
చ్చెరువై వచ్చున రేటియన్న నికి గోష్టీసంప్రయోగంబులన్

. భీమ. ఆ, 1. . ఇట్టి పట్యములింకను గలవు కర్ణాట దేశమనఁగా నంధ్ర దేశమని కాని కర్ణాట భాషయన నంధ్రభాషయని కాని శ్రీనాథుని కభిప్రాయము లేనట్లు పై పద్యముల వలన స్పష్టము కాఁగలదు". కాఁబట్టి యంధ్ర భాషను కర్ణాటభాషయని శ్రీనాథుఁ డన్నాడనుట వాస్తవము కాదు'

ఇంక మూఁడవ హేతువును విచారింతము..

తల్లీ ! కన్నడ రాజ్య లక్ష్మి! దయ లేదా నేను శ్రీ నాథుడన్

అనునది ఇది యీ క్రింది చాటువులోనిది.

శా. కుళ్ళాయుంచితిఁ గోక జుట్టితి మహాకూర్వాసముం దొడ్డితిన్,
వెల్లుల్లిం దీలపిష్టము న్మెసవితిన్ - విశ్వస్త వడ్డింపఁగా
జల్లాయంబలిఁ ద్రావితి ? రుచుల్" దోషంజంచుఁ బోనాడిన్ ,
తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయ లేదా ! నేను శ్రీనాధుఁడన్

ఈ చాటు పద్యము నిజముగా శ్రీనాథుఁడు రచించెనో లేక మఱీ యాతని పేరితో మఱియెవ్వఁడైన రచించెనో తెలిసికొనుట కాధార మేమియు లేదు.

ఈతఁడు కర్ణాట రాజ్యలక్ష్మిని 'తల్లీ' యని సంబోధించినాఁడుగనక నీతని జన్మ దేశము కర్ణాట దేశమై యుండునని యూహ, ఈ చాటువును శ్రీనాథకవి సార్వభౌముఁడే చెప్పి యుండునని తప్పక మన మొప్పుకోవల సినయెడల మిక్కిలి దైస్య స్థితియందున్న కౌలమునఁ జెప్పి యుండవలయునని తలంప వలయును. బాల్యస్థితి మనకంతగాఁ దెలియకపోయినను యుక్తవయస్సు వచ్చినది మొదలుకొని వయస్సు ముదిరి దేహ పటుత్వము సడలు వఱకు నీతడు మహా రాజుల యాస్థానముల నుండి పండిత కవియై ప్రసిద్ధికెక్కి వారల ప్రాఫున మహా రాజు భోగము లనుభవించుచు వచ్చిన వాడగు కుటకు సంశయింపం బనిలేదు. ఇట్టి దైన్యస్థితి యవసాన కాలమునఁ దటస్థించి యుండెనని యపవాదులు గలవు గాని యౌవన కాలమునఁ దటస్తించి యుండెననుటను సాక్ష్యము గాన రాదు. ఈపద్యమును శ్రీనాథకవి చెప్పియుండినదే వాస్తవమైన యెడల వార్థక్యమునఁ

జెప్పియుండ వలయును. తన కాశ్రయులుగా నుండు కొండవీటి రెడ్లు, రాజమహేంద్ర పురపు రెడ్లు, తెలుగు రాయఁడు, మైలార రెడ్డి "మొదలు గాఁ దన ప్రభువు లెల్లను, తన్నెఱిగిన మిత్రులను మంత్రిపుంగవు లును స్వర్గస్థులుకాఁగా నీతఁడు దుర్దశ పాలై కన్నడ రాజ్యమునకు లేచిపోయి తనకు సమ్మానము జరుగకున్నప్పుడు చెప్పినపద్యమై యుండ వలయును. ఏమున మున్నొక తూరి నిండు యౌవనమునఁ గర్ణాట రాజ ధానికిఁ బోయి కవిసార్వభౌముఁడైన డిండిమ భట్టారకుని నోడించి దేవ రాయలముత్యాల శాలలో స్వర్ణాభిషేక మహోత్సవమును బడసిన వాడని యెఱుఁగక కాలస్థితిని బట్టీ యుపేక్షించియుండ వారలకు జప్తికిఁ దెచ్చుటకై తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ ! అప్పుడే నన్ను మఱచి పోయితివా? నామీద డయలేదా? ఇచ్చట ముత్యాలశాలలో స్వర్ణాభిషేక మనుభవించిన శ్రీనాథుఁడన. జుమీ " యని పలికిజ్ఞప్తికిఁ దెచ్చిన విషయముగా భావింపవలయునే గాని దీనింబట్టి యీతఁడు కర్ణాటకుడనిగాని యీతని జన్మ దేశముక్క కర్ణాటమని గాని చెప్పసాహసింపరాదు.[4]

శ్రీనాధుఁడు తన తాతను వారిధితటీ కొల్పట్టగా ధీశ్వరుండని భీమేశ్వర పురాణములోఁ జెప్పియుండు విషయమును విచారింతము,

తన తాత సముద్ర తీరమునందలి 'కాల్ ', అనుషట్టణమున కథిపతి యని చెప్పినాఁడు. ఇది పశ్చిమ సముద్రతీరపట్టణమై కర్ణాటములోఁ జేరి యుండునని యుమా కాంతము గారు వక్కాణించియున్నారు గాని యందులకుందగిన ఋజువు భారమును వహింప లేదు. 'కాల్పట్టణమనునది యెద్దియో నిర్ధారించి యయ్యది పశ్చిమ సముద్ర తీరమున నున్నదియో పూర్వ సముద్ర తీరమున నున్న డియో విస్పష్టముగాఁ దెలుపనలసి యుండును. కాఁబట్టి శ్రీనాథుడు తన తాతను గూర్చి చెప్పి సపద్యము సయితము శ్రీనా థుని జన్మభూమి కరాటమనటకుఁ జూలియుండ లేదు. మఱియు విన మత్కాకతి సార్వభౌము ' నని చెప్పియుండుటచేత కమలనాభామాత్యుడు కాక తీయాంధ్రచక్రవర్తి యైన ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమునఁ గాల్పట్టగా ధీశ్వరుఁడుగ నుండెనని తేటపడుచున్నందునను "కాకతిసార్వభౌమునకుఁ బశ్చిమ తీరమునందు గిద్దెడు భూమియైనను లేనందునము కాల్పట్టణము తూర్పు సముద్రతీరమున నుండెననుట యొప్పుకునక తప్పదు. శ్రీనాథుఁడాంధ్ర దేశస్థుఁ డైన యాంధ్రుడు; శ్రీనాథుఁడాంధ్రుఁ డనియు, పాకనాఁటి నియోగి బ్రాహణుఁడనియు రెండు ప్రబలము లైన హేతు వులను జూపుచున్నాఁడను. భీమేశ్వరపురాణము సంకితమునొందిన బెండపూడి అన్నామాత్యుఁడు, శ్రీనాథుని

పాక నాటింటి వాఁడవు బాంధవుఁడవు
గమలనాభుని మనుమడ పమలమతిని'

అని ప్రశంసించియున్నట్లుగా నాగ్రంథమునఁ డెలిపియుండుటఁ జేత పాకనాఁటి నియోగి బ్రాహ్మణుఁడని విస్పష్టమగుచున్నదీ, అంతీయగాక కనులనాభుని మనుమఁడవనుటలో నొకవి 'శేషము పొడసూపుచున్నది. కమలనాభుఁడా' యన్న మంత్రికి జుట్టమని విస్పష్టము సేయుచున్నది, 'బాంధవుఁడను పదమే సమస్త సంశయములను నివారించుచున్నది. పాక నాటింటి వాఁడవను దానిలో బాకనాటి నివాసుఁడవని గాక పాకనాటి నియోగిశాఖలోని వాడవని యర్థమగు చున్నది. పాకనాఁటి నియోగిబ్రా హ్మణులాంధ్రులే గాని కర్ణాటకులు గారు; పాకనాఁటిలో నివసించు కర్ణా టకులు కన్నడిగ నియోగి శాఖపొరని శాసనమ లో వ్యవహరింప బడిరి. మఱియును శ్రీ నాధునిభార్య తోబుట్టిన వాడు దగ్గుఁబల్లి దుగ్గ యామాత్యుడు దగ్గుబల్లి తిప్పయామాత్యునకు ఎఱఱముకును బుత్రుడు; పోతనకు నెఱనామాత్యునకుఁ దమ్ముడు, దుగ్గయామాత్యుఁడు నాసి కేతూ పాఖ్యానము నాంధ్రము నరచించి యాదగిరి పాలకుడైన బసవ భూపాలుని మంత్రి , యైన చిట్టిగంగనామాత్యున కంకితము చేసియున్నాడు. శ్రీనాథునకిట్టి బాంధవ్యము లాంధ్రులతోఁ గన్పట్టుచుండగాఁ గర్ణా టకుడని లేనిపోని సిద్ధాంతములఁ జేయుటకు ప్రయత్నించుట సమం జనము గాదు. ఉమాకాంతముగారు నుడివినట్లే శ్రీనాథుఁడు కర్ణాటక ఁ డేయై, కర్ణాట దేశముసందును, కర్ణాటభాషయందున , సంతటి యభి మానమే యున్న యెడల, నంతకాలము మహాపండితుఁడై , బతికియం డియుఁ, గర్ణాటరాజులతో. బరిచయము గలిగియుఁ, గర్ణాటం పద్మవన హేళియయ్యు, నొక్క. కావ్యమైనను, నొక్క.. పద్యమైనను, గర్ణాట భాషలో రచించియుండఁడా? ఏదీ యొక్క పద్యమైనఁ గానరాదే!


ఉమాకాంతము గారు తమపీఠికలో 'తల్లిదండ్రులతో నప్పుడప్పుడు మిశ్రమకర్ణాటమును మాట్లాడుచుండినను' అని యూహించి తమ చెవులతో నిన్నట్లుగావ్రాయుట మాత్ర మతి చిత్రముగా నున్నది. శ్రీనాథుఁ డింట మిశ్రమ కర్ణాటము వాడుచుండునో స్వశ్చమైన యాం ధ్రమును మాట్లా నుచుండునో ఏనూరుసంవత్సరములకుఁ బూర్వమున నున్న వాని కుటుంబ భాహవ్యవహారిస్థితి యెట్టిదో, వీ రేట్లు తెలిసికొన గలిగిరి! కాఁబట్టి ఉమాకాంతముగా యూహలు బ్రాంతిజనకము లని పై చర్యవలనఁ జదువరులకు బోధ పడక మానదు; గావున గ్రంథ విస్తరభీతివలస నీవిషయమును గూర్చినచర్చ నీఁక విరమిం చెదను, కాల్పట్టణ ప్రశంస.

కొల్పట్ట ణమనునది. పశ్చిమ సముదతీకమునందు గాక పూర్వ సముదతీరమునందే యుండవలయు నని నిర్ధారణ చేయఁగలిగితిమి కానీ కాల్పట్ట మిదియని గుర్తించి చెప్పుట మాత్రము సాధ్యముగాక యున్నది. దీనిం గుర్తించుటకై శ్రీవీరేశలింగముగా రొక యద్భుత మార్గముం బట్టిరి. కాల్పట్టణ ప్రశంస విద్యావినోదములలో నొకదాని గాఁ జేసిరి. చేతిలోనిపని గనుక వెనుకముందుఁ బాఱజూడక కాల్ప ట్టణ మనువానిని కాలుకాల్పట్టణము గాగా సవరించి శ్రీనాథు: డట్లే భీమఖండ ములోఁ జెప్పియున్నాడనిరి. అటుపిమ్మట గాల్పట్టగా న్వేషణకు, దొడంగి, యిట్లు వ్రాక్రుచ్చి యున్నారు.


“కాల్పట్టణమేదో క్రొత్త పట్టణము. ఒక వేళ నిజముగానేక్రొత్త పట్టణమై యుండవచ్చును. కొల్పట్టణము ప్రకాశించు పట్టణము . కొత్తది ప్రకాశించును గనుక కొత్త పట్టణ మనవచ్చును. వినయ త్కాకతి సార్వభౌము' సని చెప్పుటచేతఁ గమలనా భామాత్యుఁడు 1320 న సంవత్సర ప్రాంతమున కాకతి ప్రతాప రుద్రసార్వభౌముని కొల్పట్టణమునకు కరణముగా నుండి యుండును.

ఇట్లు శ్రీనాథుని చరితములో మొదటి ఫుటయుందు వ్రాసి యుండియుఁ జదునకుల మనస్సులను బాగుగాఁ బట్టి యుండ దను తలంపునఁ గాఁబోలు మఱి కొన్ని పుటలలో 'రెడ్ల చరిత్రమును జెప్పిన వెనుక మఱల నిట్లు వక్కాణించి యున్నారు.

ఈ కాల్పట్టణ మేదో తెలియదు; ఆ ప్రాంతములయందు బ్రసిద్ధి కెక్కిన మోటుపల్లి యను రేపుపట్టణ ముండెకు;గాని యది యిది కాదు. మోటుపల్లికి మొగడపల్లియని నామాంతరము గలదు. శాసనముల యందీ రేవుపట్టణము ముకుళ పురమని వాడఁబడినది. అనపోత రెడ్డి కాలమునందలి యొక శాసనములోని యీక్రింది శ్లోకములను జూఁడుడు.

" శ్లో. ఆహితతమః కృశాను ర్వేదుచు భూపాలసూను ?
స్తుతక లికత మహిశా న్నాన్నపోత క్షితీశ
శాకాబ్దేగగ నాష్ట్ర నూర్య గణితేతీ రేమహాంబో నిధి :
ప్రఖ్యాతమ్ము కళాహ్వయే పువరేశ్రీసోమ మంత్రీశ్వరః

ఆందు చేత కాల్పట్టణము మోటుపల్లి గాక వేఱొక సముద్ర తీర గ్రాముమై యుండును. అది యేదియో నిర్ధారణమగు వఱకును క్రాల నఁ గొత్త యని యర్ధము చేయవచ్చును. గనుకను, కడను పట్టణ శబ్దము న్నది గనుకను, కొత్త పట్టణమునుగా భావింతము. కమలనాభుఁడికా ల్పట్టణమునకుఁ గరణము. 'విచమత్కాకతిసార్వభౌము' నని పద్యము లో నుండుట చేత నితఁడు బాల్యములో 1320 సంవత్సరమునయందు కాకతి ప్రతాపరుద్రమహా రాజు కాలములో నుండి యాతనిచే సమ్మానిం పఁబడి యున్న వాఁడనుటకు సందేహము లేదు.

ఆంధ్రకవుల చరిత్రము రచియింపఁబడి ముప్పది సంవత్సరములు దాటిపోయినను, అనేక జన్మాంతరములను గాంచి నూత్న వేషములను దాల్చుచు వచ్చినను, మొన్నటివఱకు కాల్పట్టణము క్రొల్పట్టణముగా మార్పుఁజెంది యుండ లేదు. భీమేశ్వర పురాణముయొక్క ముద్రిత ప్రతి లో నేమి, అముద్రిత ప్రతులలో నేమి, శ్రీరామమూర్తి గారి కవిజీవిత ము'లలో నేమి, 'కాల్పట్టణమనియే. యున్నదిగానీ కొల్పట్టణమని యుం డ లేదు. ఆంధ్రకవిచరిత్రకారు లిట్టిమార్పు నాక స్మికముగాఁ జేయుటకుఁ గల కారణము మన కిప్పుకు స్పష్టముగాఁ బోధపడగలదు. కాల్పట్టణ ముకై పూర్వ సముద్రతీరము నన్వేషించునపుడు వీరికి కొత్త పట్టణము మనస్సునకు స్ఫురించి యుండును. అంతల బొంతలమాఱిగంత దొరకనది గదా యను సంతోషముతో నొక్కగంతు గంతుకొని కాల్పట్టణమును కొల్పట్టణమునుగాఁ జేసి యొక నిమిష కాలములోఁ జిర కాలము నుండి యున్న పాఠముసు గారణము చెప్పకయే యూడ్చి పెట్టి పాఠాంతరభేద మును గల్పించిరి. ఆంధ్ర ప్రపంచమునకు మార్గదర్శకులు గావున నా రెట్టి • సాహసంబనికి నైన నొడిగట్టగల సమర్ధు లగుదురు దాదిభీశువు యెట్టు సాధ్యమగును? పాఠకమహాశయులారా! మేదియోనిశ్చయముగా నెవ్వరికిని దెలియదు. తెలియనప్పుడు మూహించిపింపవచ్చును. దోష మేమియును లేదు గాని కారణము చెప్పక పూర్వ పాఠముల నిష్టమునచ్చినట్లు మార్చుట మాత్ర మని సాహస మని నొక్కి వక్కాణింపఁదగును. మనము నిరూపించుటకు సాధ్యము గాక యున్నప్పుడు 'కాల్పట్టణము పూర్వసముద్ర తీరమునందు న్న యేపట్టణమునకో నామాంతరమై యుండునని యూహపుట్టకమా నదు. అట్టీయూహలు చేయునప్పుడు నిర్ణేతుకముగాఁ బూర్వపాఠము లను మార్పక వాని కనుగుణముగా నుండునట్లుమనము నిర్ధారణముచే యుట యధార్ధమునకు విరుద్ధముగాఁ గన్పట్టినను దోషదూషితముగాఁ జాలదు. ఆంధ్ర కవిచరిత్రకారుల పథకమును మనమవలంబించుట కా క్షేపము లేకయున్న పక్షముసఁ బూర్వపాఠములను మార్పుఁ జెందింప కయే కాల్పట్టణ మేదియో నిర్ధారణ చేయవచ్చును. ఎట్లన శ్రీనాథుఁడు పాకనాటి నియోగి కావున నాతని జన్మసీను పాకనాఁడని తలంచుట వింత సంగతి కాదు. కావునఁ గాల్పట్టణము పొకనాటి సీమలో నైనను, దానికి సమీపము నందైనను సముద తీరము నందుండునని యూహించుట య సంభావ్యముగాదు. నెల్లూరునకు సమీపమున సముద్ర తీరమున కృష్ణ పట్టణమనును 'రేవుపట్టణ మొకటిగలదు. అది పూర్వకాలమునండియు మోటుపల్లికిఁ దరువాత పేరు మోసిన "రేవు పట్టణముగానుండెనని శాసన ములం బట్టికూడఁ దెలియుచున్నది. ఇందును గూర్చియాంధ్రుల చరిత్రము లోని ద్వితీయ భాగములో రెండవ ప్రకరణమున నిట్లు వ్రాసియున్నాఁడను. “మనుమసిద్ధి రాజునకుఁ బిమ్మట సిద్ధి రాజుకొడుకగు రెండవతిక్క రాజు గద్దెయెక్కి నటులు గానుపించు చున్నది. ఈయిమ్మడి తిక్క.. రాజు

(శా. శ 1900) (క్రీ.శ.1278)వ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁడైనటుల గూడూరు సీమలోని కృష్ణ పట్టణము శాసనముంబట్టి "దెలియుచున్నది. ఇతఁడు సింహాసన మెక్కిన రెండనయేఁటనే అనఁగా శా.శ.1211టవ సంవత్సరమున మీన మాసమున శుద్ధ దశమి గురువారమునాఁడు గండ గోపాలపట్టణమని మెడికొల్లిత్తు రై పట్టణమున నివసించునట్టి వర్తకులు తిరుక్కా వనమునందు సమావేశులై తాము చేసికొన్న యొడంబడిక ప్రకార మా రేవు పట్టణములో చేయ బడునట్టి యుఁదిగుమతి చేయబడునట్టియు బస్తాల యొక్క మదింపు విలువను బట్టిగొల్లితుం గ్రామములోని సిద్ధీశ్వరుని యాలయ నిర్మాణము కొరకును, ధూపదీప నై వేద్యాకొఱకును వినియోగించునటుల దాన సాసనము వ్రాయించిరి, ఆకాలమునందు కొల్లీతు " యనియు, గంగోపాల పట్టణ మనియుఁ బేర్కొనఁబడిన కృష్ణ పట్టణము గొప్ప రేవుపట్టణముగా నుం డెనని పై శాసనము నుబట్టి విస్పష్టమ గుచున్నది. పదునెనిమిది దేశములనుండి యైదువందల మంది విదేశవర్తకులును, ఆయానాడులనుండియు, పట్టణముల నుండియు వచ్చినట్టి వర్తకులును ఆ రేవుపట్టణమున నివసించు చుండిరని యాశానమునందుఁ జెప్పఁబడియుండుట చేతనే యాకాలమునందు కృష్ణ పట్టణము గొప్ప రేవుపట్టణముగా నుండెననియు, విదేశములతో విరివిగా వర్త క వ్యాపారము జరుగుచుండె ననియుఁ జక్కగా బోధపకుచున్నది. "

ఈకృష్ణ పట్టణమునే మనము కొల్పట్టణముగా నీకింది. హేతువులచే నిర్ధారణ చేయవచ్చును. కృష్ణ శబ్దమునకు నలుపనుగలదు. కాలశబ్దమునకును నలుపును సర్ధ ముగలదు. కాఁబట్టి కాలశబ్దమునకుఁ బర్యాయ పదముగా నెంచి కృష్ణ పట్టణమును కాల్పట్టణమనిపద్యములో వ్రాసి యుండును. తన శాతకమలనాభామాత్య చూడా మణి యీకృష్ణ పట్టణమునకు ప్రభునిగాఁ గాకతి సార్వభౌముఁ డైనరెండవ ప్రతాపరుద్ర దేవునిచే నియమింపఁబడి యుండు వచ్చును. మనుమ సిద్దిరాజు కాలముసనే యీ దేశమంతయును గాకతీయాంధ్ర చక్రవర్తులకువశ్యమైనది. ఆంధ్ర చక్రవర్తిని యైన రుద్రమ దేవి "కాలముననే కాకతీయులపక్షమున నధికారు లీదేశమునకు నియమింపఁ బడుచు వచ్చిరి.కావున రెండవ ప్రతాపరుద్ర దేవుఁడు ముఖ్యమైన వర్తక స్థాన మగుట చేత మన కమలనా భామాత్యునిఁ గృష్ణ పట్టణమునకు సర్వాధికారిగ నియమించి యుండును.కమలనాభుఁకుద్యోగపడవియందుండుటమాత్రము చేతనే గాక మహావిద్వాంసుడై పండితకవియై పద్మపురాణాది కావ్వయ ప్రబంధములను రచించి యాసార్వభౌమునకు నంకితము గావించి యాతనిచే విశేష గౌరవ సమ్మానములను బొంది దేశమునఁ ఖ్యాతి గాంచి యుండవచ్చును. అందు చేతనే వినమత్కాకతిసార్వభౌము' సని ప్రస్తుతించి యుండును. ప్రతాపరుద్రుఁడు కమలనాభుఁడు తన రాష్ట్రము లోని యొక చిన్న యధికారియైనను, మహావిద్వాంసుడును, కవివర్యుడును, మఱియు విశేషించి బ్రాహ్మణుఁడు నైనందున నాకాలపు మర్యాద సనుసరించి పై విధముగా సమ్మానించె ననుట యొక యాక్షేపణీయాంశము గాదు.


ఇంకొక సంగతి జ్ఞప్తియందుంచుకొన వలయును. కొల్లతురై యనునది యఱవలు పెట్టిన నామముగా నుండెను. తెలుఁగు వారు కృష్ణపట్టణమనియే యప్పటినుండి యిప్పటి వఱకును వ్యసహరించుచున్నారు.గండగోపాలుఁడను బిరుదము వహించిన చోడరాజుచే నభివృద్ధికి గానిరాఁబడినది గావున గండ గోపొల పట్టణమని నామాంతరము గూఁడఁ గిలిగియుండెనుగాని మఱియెండు గాదు.వినమత్కాకతి సార్వభౌము' ననుపాఠము ననుసరించుటవలనఁ గమలనాభుఁడు రెండవ ప్రతాపరుద్రుని కాలమున నున్న వాఁడని వేద్యమగుచున్నది. రెండవ ప్రతాపరుద్రసార్వ

భౌముఁడు క్రీ. శ.1295 మొదలుకొని 1323 పటకును బరిపాలనము చేసినందున గమలనాభుఁడు నాకాలమున నుండెనని యొప్పుకొనక తప్పదు.


కాళీపట్టణమే కాల్పణము


"శ్రీనాథుని జీవితము" యొక్క ప్రథము ముద్రదణగ్రంథముప్రకటింపఁ బడిన వెనుక శ్రీ) వేటూరి ప్రభాకరశాస్త్రి గారు శృంగార శ్రీనాథము' అను పేరిట తాము రచించిన గ్రంథములో," కాల్ పట్టణ మనగా గాలపట్టణము. (కాల = నల్లని) కాలపట్టణము. ఇది నెల్లూరి చేరువవున్నది. వీరభద్రరావు గారియూహయిది. ఈయూహవారికే తృప్తి గొల్పదయ్యెను. కృష్ణపట్టణమని పద్యమునఁ జెప్పఁగుదరక "కాలపట్టణముగా మార్చుకొని యటులుసుగు చురక, కాల్ పట్టణముగాఁ గుంచించుకొని శ్రీనాథుఁడు చెప్పవ లసినవాడయ్యె ననుట యుచితముగా నుండదుగదా

కాల్పట్టణము కాదు "కాల్ పట్టణమని యుండవలెను. "కాల్పట్టణమునగా ప్రకాశించు పట్టణము. ... బ్రకాశించును గనుకగొత్త పట్టణమని యర్ధమువచ్చును"అని వీరేశలింగము పంతులు గారీ సంభావనము, ఇది మిక్కిలియసంగతము గానున్నది. కృష్ణ పట్టణమని చెప్పఁ జూచు చోఁజొప్ప జెడ, దోషములు దీనికి విడప్పినవి కావు. మఱియు విశేష మొక్కటి. కొత్త పట్టణమేర్పడి యిప్పటి కిన్నూ రేండ్లుకా లేదు. ఇది వంగవోలునకుఁ దూర్పునఁబది మైళ్ల దూరములో సముద్రపు టొడ్డుననున్నది. అర్నూరేండ్ల కుముందీ పట్టణమునుగూర్చి ప్రశంస యసంగతముగదా." అని యాక్షేపించియున్నారు. తూర్పు తీరమున నిజమైన కాల్పట్టము బయలుపడువఱకు సుప్రసిద్ధ మైన కృష్ణపట్టణము నే కాల్పట్టణ మనుకొందమని వ్రాసితినే గాని కృష్ణ పట్టణంను కాల్నట్టణనుని నిశ్చయించి నేను వ్రాసియుండ లేదు,


నాగ్రంధము వెలువడిన వెనుక "ఆంధ్రవార్తా పత్రికలలో 'కొల్చట్టణ మేది? యను.టను గూర్చి పెక్కులు వాదోపవాదములు జరిగియున్నది. చర్చలో మఱిరెండు గ్రామనామములు బయలుపడినవి. అందొకటి కాళీపట్టణము; 'రెండవది కలపటము. సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులై యాంధ్రులకుఁ బూజ్యనీయులును నాకుఁ బరమమిత్రులును నై యిప్పుడు కీర్తి శేషులు నైన లక్ముణ రావు పంతులుగారొక ప్రాచీన శాసనములో కలుపట్టణ' మను పేరును గాంచి శ్రీనాథుని కాల్పట్టణ మదియే యని నిర్ణయించిరి. అట్లు శానసములోఁ బేర్కొనఁబడిన కలుపట్టణము' నేను కలపట' మను పేరుతో నొప్పుచున్నదని గుర్తించుచున్నారు. కపటము నరసాపుమునసు బందరునకు నడుమనున్నది. మఱికొంఱు నర సాపురమునుండి. బందరునకుఁ బోవు బాటలో ముత్యాలపల్లికి సంబల దీపికి సమీపమున నైదాఱు మైళ్ళ దూరములోనున్న కాళీపట్టణమని శ్రీనాథుఁడు ప్రశంసించి యుండునని వక్కాణించిరి. కాల్ శబ్దమునకు క్రొత్త, కృష్ణశబ్దములు దూరస్టములు. అర్ధములను బట్టి చెప్పుకొన వలసిన నగుచున్నవి. కలు, కాళీశబ్దములు మాత్ర మక్షరముల మార్పు కలవి. కనుక కాల్ శబములకు సమీపించియున్నవి. కలు, కాళీశబ్దము లను పద్యములో గుదుర్చుకొనుటకై కాల్ శబ్దముగా శ్రీనాథుఁడు మార్చుట కవిసంప్రదాయమునకు విరుద్ధము కాదు గాన మన మంగీక రింపవచ్చును. కలపటమా? కాళీపట్టణమా? అని మరలగలుగుచున్న దీ. లక్ష్మణ రావు గారి శాసనములోని కలుపట్టణ మే తరువాత కాళీ పట్టణమని వ్యవహరింపఁ బడుచున్న దేమో! లేక కలుపట్టసంశయము కలపటము

గ్రామము కంటెను కాళీపట్టణము యొక్క శిథిల స్వరూపము ప్రాచీన 

వైభనమును సూచించు చున్నది. ఇంతకన్న వివరముగాఁ దెలియునంత వఱకు కాళీ పట్టణ మునే కాల్పట్టముగా భావించు కొనుచుండవచ్చును. కాకతీయ చక్రవర్తు లాంధ్ర దేశమును శ్రీ. శ. 1324 వఱకును మహా వైభనముతోఁ బరిపాలించిరి. ఆకాలమున బాకనాడునుండి నియోగులు పెక్కుండ్రు కృష్ణ వేణ్ణా గోదావరీ మధ్యస్థ ఖండప్రదేశములకు మంత్రులుగనో, దండనాథులుగనో, మఱియు నిత రములగు రాజకీయోద్యోగముల మూలముననో వచ్చి యుండిరచుట చరిత్ర ప్రసిద్ధ విషయము.

వేల్నాడు. పాకనాడు


టెంకణాదిత్య కవితతకుమార సంభవము నందు :---

మ ఆవృపాల మౌళి దళితాంఘ్ర - యుగండయి పొక నాటీయ
దిరువది యొక్క వేయిటిక దీశుఁడు - జను చోడబల్ల కిం
జిరతర కీర్తి కగ్రమహిషి ........................
బర శశి రేఖయైన గుణ భాసిని శ్రీ సతి కిం దనూజుఁడన్,

అనియు, ఓపిరిసిద్ధి శాసనమున: ---

చ. బిరుదును కొన్న యా తెలుగు బిజ్జనకున్మండు మల్లిదేవుడమల్లె దేవుడ
చ్చెరు వగుచున్న పొత్తనయ చిన్నాగు వీడును వ్రాలి పాక నా
డిరువదియొక్క వేయి జన మేలుచుఁ బల్లవుండుఁగెల్చి త
త్కరివర సంభ మౌక్తిక వితాంతతఁ బుచ్చె నిలాసై పుత్రికన్

అనియు, ముంచెనకవి తన కేయూర బాహుహు చరిత్రము నందుః----

ము. ఆరుదఁందన్ వెల నాటి చోడమను జేంద్రాజ్ఞాపనం బూని దు
స్తరశక్తిన్ జని యేక వింశతి సహస్రగ్రామ సంఖ్యాక మై
ధరణిం చేర్చిన పాక నాడు నిజదోర్ద..... కలగ్నంనింబుగా
బరిపొలించె సమాక్యా కొమ్మక జగత్పఖ్యాత చారిత్రుండై.

అనియును వర్ణించి వక్కాణించిన పాక నాఁడు ఇరువది యొక్క వేలు సంఖ్య గల గ్రామములను గలిగియున్నట్టుగా దెలియుచున్నది, శ్రీ శైల పూర్వతట నికటమునుండి పూర్వ సముద్ర ముదాక ప్రవహిం చు కుండితరంగిణి యను గుండ్లకమ్మ (బ్రహ్మకుండి) నది కిరుప్రక్కల నుండు సీమకే పూంగినాఁడను నానుమున్నట్టి పోలయ వేమా రెడ్డి శాసనమువలనఁ దెలియుచున్నది. ఈ పూంగినాఁడే శబ్దార్ధ సంగతిని బట్టి పాకనాడు' కావచ్చు" నని కొందరభిప్రాయపడుచున్నారు గాని వేమా రెడ్డి శాసనమునకుఁ బూర్వము బహుశతాబ్దములనుండి పాకనాఁడ నునది వ్యవహారములోనున్నట్లు పై పద్య ప్రమాణముల వలనను శాసన ప్రమాణము వలనను దేటపడుచున్నది. అదియునుగాక పూంగినాఁడరు వది యొక వేల సంఖ్య యున్నట్లుగ నందును జెప్పఁబడి యుండ లేదు. 'పూం గినాటికంటే బహువిశాలతరమైన ప్రదేశమునకుమాత్రమె పాకనాఁడ ను షేరు చెల్లి యుండ వలయును. ఇచ్చట నీ చర్చయనావశ్యకమని విరమిం చుచున్నాను.

కృష్ణ వేణ్ణా నదికి దక్షిణ భాగము "కమ్మక కరాఠము" (కర్మక రాష్ట్రము) అని వ్యవహరింపఁ బడుచుండెడిది. చాళుక్యలను వేల్కు లముల వారు దండెత్తి వచ్చి యీమ దేశము నాక్రమించు కొని పరిపాలిం చిన నాట నుండి వేల్నాడనియు ఆఱు వేల సంఖ్యతో నొప్పు చుండెడిది గనుక నాకు వేల్నాడనియు, సంస్కృతమున షట్సహస్ర దేశమనియు ను వ్యవహారనామము గలిగియుండెను. ఇంతకుఁ బూర్వము కమ్మక రా ట' మను ప్రాచీన నామ ముండుట చేత "కమ్మనాఁడు” అని కూడ వ్య వహరింపఁ బడుచు, పాకనాటి కుత్ర భాగమునకు మాత్రమే గూఢ నామమై యొప్పుచుఁ దరువాత నాఱవేలనాటిలో సంతర్భాగమై ప్ర ఖ్యాతికివచ్చెను.

ఆరు వేలని యోగులను వారు 'మొదట ఆఱు వేలనాటిసీనులోనివసించిన వారగుటచేకాఱువేల నియోగులనియు పాకనాటి లో మొదట

  • పూర్వచాళుఖ్యుఁ డగు రాజరాజునరేంద్రుని కుమారుఁడగు కులోత్తుంగచక్ర వర్తి

కొంకి గొంక రాజ్జూ తనకు యుద్ధములో సహాయ చేసినందున పట్సహప్రావనీ మండ లాది పత్యము నొసం గేనని యొక శాసనములో నిట్లు చెప్పబడినది.

  • సంగ్రామ సాహాయ్యను శుష్టచిత్తాత్ శ్రీ రాజరాజు ప్రధనాత్మ సువీరః

యః షట్ససహ స్రావనీ మండలాధిపత్యం సమాసాద్య చిరంభునక్తి ."

నివసించిన వారికి పాకనాటిని యోగులనియు నామ భేదములు గలిగినవిగాని వీఱందరు మొదట నొక్క శేఖవారే. వీరుభయులకు సంబంధ బాంధవ్యములు గలవు.

బెండపూడి అన్నామాత్యుఁడు తన్ను " పాకనాటింటి వాడవు బాంధవుఁడవు " అని అన్నట్లుగా శ్రీనాథుఁడు తన్నుభీమేశ్వర పురాణ మునఁ దెలుపుకొని యుండుటచేత కొందఱు శ్రీనాథునియింటి పేరు 'పాకనాటి వారని తలంచుచున్నారు.

నాచి కేవతోపాఖ్యాన విమర్శమునందు నామిత్రులగు శ్రీ టేకు మళ్ల అచ్యుతరావుగారు రెండు ధర్మసందేహములను వెళిపుచ్చిరి. అందు మొదటిది:-

“పాకనాటింటివాఁడవు బాంధవుఁడవు” అని బెండపూడి అన్నమంత్రి తో చెప్పినట్లు శ్రీనాథుఁడూ వాసికొనెను. * పాకనాటింటివాడవు అను వాక్యము పాకనాటి దేశస్థుఁడని యర్ధమిచ్చునని బ్ర శ్రీ. వేం. ప్రభా కరశాస్త్రి గారు వ్రాసినారు. ఇంటివాడవు అని చెప్పుటలో గృహనామ మని నేనూహించు చున్నాను." అనునది. ఇక రెండవడి: దుగ్గనకవి బహుశః ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు" అనివక్కాణించుట*[5]

అచ్యుత రావు గారి పై సంశయములకు శ్రీకుందూరి ఈశ్వరదత్తు గారీ క్రింది విధముసఁ బ్రత్యుత్తర మొసంగినారు . " ప్రాదాత్త్రిలింగ విషయే వేల్నాం విసీమని " " ప్రాదాత్త్రిలింగ విషయే వేల్నాడా పుణ్య సీనుని ”

శ్రీనాథుని చే వ్రాయబడిన "వేమా రెడ్డి శాసనములు,

" శ్రీనాధుఁడు తనభీమేశ్వరపు పుణమునందుఁ గృతిభర్త తన్ని ట్లు సంబోధించినట్లు వ్రాసికొనెను:సీ||వినుపించిన వాడవు వేమ భూ పొలువ కలపురాణ విద్యాగమములు కల్పించి నాఁడవు గాజపాకు బైన హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష భాసించి నాడను బహు దేశభుదులతో విద్యాపరీక్షణ వేళలందు వేదజల్లి నాడవు ఒకరకర్త స్ఫూర్తి.. కర్పూములు దిశాంగణములందుఁ పాక నాటింటి వాడవు బాంధవుడవు కమలనాభుని మనుమడ విమలదుతివి నాఁ గృపసేయు మొక ప్రబంధంబు నీవు క లితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య .

శ్రీనాధుఁడు 'పెదకోమటి భూపాలుని మరణానంతరము రాజమహేంద్ర వర రాజ్య మునకు వచ్చుటకుఁ గారణము లేమి? అచ్చట వేమ వీరభద్రనర పా లకులకు సచివగ్రామణియై, పండిత పోషకుడై, బాంధవుడై, యున్న బెండపూడి అన్న మంత్రి తనకర్హసత్కారము లోసంగు ననియె. అన్న మంత్రి కృతిభర్తయై శ్రీ నాధుని పాకనాటింటి వాడవు బాంధవుఁడవు' అని హెచ్చరించుటఁ గనినచో ఆపద్య పాదమున కిట్లర్గము చేసికొన వలెను:

«« నేను కృతిభర్తను, నీవుకృతిక ర్తవు; మనమిరువురము ఒక్క టియే శాఖవారము, మీదుమిక్కిలి బంధువులము.” ఇచ్చట వారివారి స్వశాఖాభిమానమును ప్రస్ఫుటము చేయుచున్న వాక్యరత్నములే కాని మీ యింటి పేరు పాకనాటివారు, మీరును, మేమును బంధువు లము” అని యర్ధమిచ్చు మాట లెంతమాత్రమును గావు. దూర దేశ మునఁ గలుసుకొన్న శాఖాభిమానమువలన గలిగినలాభమే శ్రీ నాధుని నట్లు వ్రాయుటకుఁ బురికొల్పినది.

అదియును గాక ఆంధ్ర దేశమునఁగల ఆర్వేల నియోగులలో పాకనాటి నియోగి శాఖకూడ గలదని మనవాజ్మయమే సాక్ష్యమిచ్చు చున్నది. కృష్ణ రాయ విజయమును రచించిన కుమారదూర్జటి 'పాక నాట్యా ఱవేల వంశప్రసిద్ధులి' అని చెప్పుకొని యున్నాడు. కావున : పాక ' నాటింటివాడవు' అను వాక్యమునకు పాకనాటి నియోగిశాఖా బ్రాహ్మ ణుఁడవు' అను నర్థమే చేసికోవలెను. ప్రసిద్ధాంధ్ర చరిత్ర కారుఁడట్లే వ్రాసెను. శ్రీ ప్రభాకర శాస్త్రుల వారట్లే వ్రాసిరి. దీనికి 'వేఱొక యర్ధము సందర్భశుద్ధి లేక కల్పించుట పరిహాసాస్పద మైనపని."

మరియు 'భక్తానంక కల్పదుమ' ప్రబంధ కారుఁడును పాకనాటి బాహ్మణుఁడు బాపి రాజకవి తనగద్యములో నిట్ల వ్రాసికొన్నాడు .

"ఇది శ్రీ మహా దేవ కాళీ వర ప్రసాదలబ్ధ సకలజనమత సమ్మత స్తుతవిహాయత ధౌరేయ నిరంతరోద్గాఢార్ధ సౌందర్య తాత్పర్య మా ధుర్య శబ్ద గుంభనాలంకార ప్రేకానుగుణ్య ప్రకటనటన నానా దేశా న్విత భాషా కవి తాంధ్ర గీర్వాణ ఘటి కాశత గండకల్పక విద్వజ్ఞ నాహ్లాదకర పొకనాటి శేష్ఠ పరాశరగోత్ర శివపూజు దురంధర షట్సహస్ర నియోగి రత్నాకరశంక పరమ పతివ్రత తుల్యాచ్చ మాం బాధ వేశ్వరవదప్ప రాజాబ్దిసుధాకర (దివాకర రాజు శేషా చలా నులావతి,)వేంకమాంబాసుత బాపిరాజు ప్రణీతం బైన భక్తానంద కల్ప ద్రుమంబను ప్రబంధంబునందు ప్రథమాశ్వాసము. "

ఇంకఁ 'బాక నాటి నియోగియగు శ్రీనాథుని బావమరదియగు దగ్గుబల్లి దుగ్గనామాత్యుని నియోగి యని చెప్పుటకు నామిత్రునివలె నెవ్వరును సంశయింపఁ బనిలేదుగదా.*[6]

శ్రీనాధుని తాత.

"కమలనాభుని మనుమఁడ వమలమతిని " అనుటచేఁ గూడ నొకవిశేషము గలదు. శ్రీనాథుని తాతయగు కమలనాభుఁడు గూడ అన్నమంత్రికి జుట్టమనియుఁ బరిచితుఁడనియు దేట తెల్లముసేయ చున్నది." అని యాంధ్రుల చరిత్రము మూఁడవభాగములో వ్రాసియున్నాను. అన్నమంత్రికి గమనాభుఁకు పరిచితుఁడనుట పొరబాటు.ఆయర్థ మిందు లేదు. కమలనాభుఁడు ప్రసిద్ధపురుషుఁడై నందున నూరక కమలనాభుని మనుమఁడ, వని వక్కాణించి యున్నాఁడు. కమలనాభుఁడు బహుసంవత్సరములు జీవించి యుండవచ్చును గాని అన్న మంత్రియును, శ్రీనాథుఁడును, కమలనాభుఁడు బ్రతికియుండగాఁ బుట్టియుండిన నుండవచ్చును గానీ కమలనాభుని వీడు బాగుగా నెఱిఁగియుందురనుట సంశయాస్పదమైన విషయము. ఆంధ్రు లచరిత్రము . మూడవ భాగములో, బరిచితుఁడని నేను వ్రాసినదానిని బురస్కరించుకొని శ్రీవీరేశలింగముగారు. పరిహాస భాజనమగునట్లుగా నూహా ప్రపంచమును విస్తరింపఁ జేసి నేఁడిట్లు వ్రాయుచున్నారు. " తాతయే శ్రీనాథునకుఁ జిన్నప్పుడు విద్యయుఁ గవిత్వమును నేర్పియుం డును. భీమఖండకృతిపతి కమలనాభుని నెఱింగియుండినట్టు చెప్పుటచేత సతఁడు.. 1365 వ సంవత్సరమునకై బదికీ యుండవచ్చును. అప్పటికి శ్రీనాథునికి తప్పక పదు నేను సంవత్సరములకుఁదక్కువకానియీడుండును.దానినిబట్టి శ్రీనాధుఁడు 1365 వ సంవత్సర ప్రాంతమున జనన మొంది యుండును. "


మఱియును వీరు కమలనాభుని శ్రీనాధునికి గురువును గాఁ జేయుటకై శ్రీనాధుని తండ్రిని పండితపుత్రుని గావించిరి. శ్రీనాధుఁడు తనతాతసు గూర్చియె కాని యేపుస్తకము నందును తండ్రిని గూర్చి యంతగాఁ జెప్పియుండక పోవుట చేత' “అతఁడొక వేళ పండితపుత్రుడే యే .

మో?* అని పరిహాసముగ నక్కాణించు చున్నారు. పండిత పుత్రుఁడను మాట నటుండనిండు. రెండవ ప్రతాప రుద్రుఁడు 1323 వ సంవత్సర మువఱకును రాజ్య పరిపాలనము చేసినవాఁడు గావున నప్పటికీఁ గమల నాభుఁడు ముప్ప దేండ్ల వయస్సు గలవాఁడై యుడవలయును. శ్రీవీరేశ లింగముగారు చెప్పినట్లు 1380 వరకు గమలనాభుఁడు బ్రతికికయుం కుటయే నిశ్చయమైన యెడల కమలనాభునకప్పటికి 87 సంవత్సరము లైన నుండును.ఏవిధ మైన లిఖితమూలక సౌక్ష్యమును లేకుండఁ గమల నాభుఁ డంత కాలము జీవించి యుండెనని విశ్వసించుట క్రమమైన పద్ధతి 'కాఁజూలదు. మఱియును అన్నమంత్రి 1430 వ సంవత్సర ప్రాంతమున నున్న వాఁడు గావున నప్పటి కాతని కేబదేండ్లున్నవని యొప్పు కొన్నను 1380 సంవత్సర ప్రాంతమునఁ బుట్టి యుండవలయును గావుకఁ గమలనాభునితో అన్న మంత్రికి స్నేహము గలదని కాని, అతఁడు కమలనాభుని నెఱింగియున్నవాడనివిశ్వాసపాత్రము గాదు, ఇంకొక చిత్రము చూడుఁడు. వెల్గోటివారి వంశములోఁ బదవపురుషుడైన సర్పజ్ఞ సిం గనాయని సభకుశ్రీనాథుఁడు 1425 దవసంవత్సరమునఁ బోయి.యుండెనని శ్రీవీరేశలింగముగారు వ్రాసి యున్నారు. ఆఱవరుషుఁ డైన ఆన పోతనాయఁడు 1381 సంవత్సరమువజకు బ్రదికియున్నట్లు శానసములు నిరూపించుచున్నవి. 1425 దవ సంవత్సరము నాటికి సర్వజ్ఞ సింగమ నాయనికి 25 సంవత్సరములు వయస్సు కలదనుకొన్నను, (కనీసప శము) అతఁడు 1400 సంవత్సర ప్రాంతమున జన్మించి యుండును గదా! ఏఁడవపురుషుఁడు 1400 వఱకు బ్రతికి యున్నాడనుకొన్నను, ఎనిమిదవ తొమ్మిదవ పురుషు లేమైరి? శ్రీనాధుని సర్వజ్ఞ సింగమనాయుని సభకుఁ గొనిపోవుటకై వెల్గోటివారి వంశములో రెండు పురుషాంతర ముల నంతరింపఁ జేసినవా రొక్క సారిగా శ్రీనాథుని తాతకు 87 సంవత్స రముల వయస్సు నిప్పించుట వీరి యుదారస్వభానమును తేటపఱచక మానదు. ఈచరిత్రమున నిట్టి విచిత్రవిషయము లెన్నెన్నో పొడఁగట్ట గలవు. వాని ప్రశంస యిప్పటికి నిలుపుదము. కమలనాభుఁ నెంత కాలము బ్రదికి యుండెనో మనము చెప్పజాలము. మనకుఁ దెలియ నప్పు డొకనిఁ బండితపుత్రు డని వెక్కిరించుటయు సంభావ్యము గాదు. " కమలనాభుఁడు గాని సూరయగాని కరణములనీ చెప్పుటకుఁ బ్రమా ణము లేనప్పుడు అతఁ డాగ్రామకరణమగుటచే సౌతని పుత్రుడును శ్రీనాథుని తండ్రియునగు మారయయు నాగ్రామమునందే యుండి కరిణిక పువృత్తి చేసి జీవనము చేయుచు నుండియుండవచ్చునని వ్రాయుట విశ్వాసపాత్రమైన వ్రాతకాఁబోదు. తన తండ్రి తాతలు కరణము "లేయై నిజముగాఁ గరిణిక పువృత్తినలస జీవించువారే యైనయెడల శ్రీనా థుఁడు గూడు వంశపారంపర్యపు హక్కును విడనాడుకొ"ని యుండఁడు. ఆ విషయమును బహిరంగముగాఁ జెప్పకపోయినను పరోక్షముగా నైనను దా నేదో పట్టణమునకుఁ బ్రభువునని యే చెప్పుకొనియుండును. అట్లు చెప్పుకొని యుండసందున నతని తండ్రి తాతలు కరణములని యూహిం చుట యుక్తముకాదు. మన మేది మూహించి చెప్పినను హేతు యుక్తమై యుండవలయును.

భీమేశ్వరపురాణకృతిభర్తయగు 'బెండపూడి అన్న మంత్రి తాతయగు అన్నమంత్రిని:-

<సీ!! కాకతీక్ష్మపాల గుంధదంతావళి
ధ్వజునీమహాధురంధరుడనంగ
నవలక్ష కోదండ నాధ రాజ్యాంబోధి
సద్వరపూర్ణిమా చంద్రుఁ డనఁగ
నాంధ్రభూమండలాధ్యక్షు సింహాసన
సంప్రతిస్థాపనాచార్యుఁ డనఁగ

వీరరుద్రాశేషనిశ్వంధరాధీశ
పృగులదక్షిణ భుజా పీఠమనంగ:
యవససంహార విలయ కాలాగ్నియనఁగ
ధాటింఘటిత కుమ్మశోద్యానుఁడనఁగ
విశ్వలోకి ప్రశస్తుండై వినుతికెక్కె
కతులబలశీల పోలయ యన్న శౌరి


అనఁగా ఈతఁడు ప్రతాపరుద్రుని గజఘట సేనల కధ్య క్షుడనియు, నవ లక్షతధనుర్ధరులుగల రాజ్యాధిపతి సేనాసముద్రముసకుఁ జంద్రునివంటి వాఁడనియు, ఆంధ్రభూమండలాధ్యక్షు సింహాసన ప్రతిష్టాపకుండనియు, వీరరుద్రమహా రాజు యొక్క సమస్త రాజ్య భారధురంధరుఁడనియు, యవ నుల సంహరించుటలోఁ గానాగ్ని రుద్రకల్పుఁడనియు, కుమ్మరమను ప్రదేశమును జయించెననియు, శ్రీ నాథకవి వర్ణించి యున్నాడు. ఆపులా రణమునందే తన తాతయగు క్షమలనాభామాత్యుఁడు కవితా విద్యాధు రంధరుండనియు, పద్మపురాణసంగ్రహ కళాకావ్య ప్రబంధాధిపుడని యును, సముద్ర తీరమునందలి కాల్పట్ల గాధీశ్వరుఁడుగా నుండెననియు వర్ణించిన పద్యము నీయధ్యాయము మొదట నిదివఱకే యుదాహ రించి యున్న వాఁడను. ఇందువలన భీమేశ్వరపురాణ కృతిభర్త యొ క్కయు, కృతికర్త యొక్కయు బితామహు లిర్వురును రెండవప్రతాప రుదుని కాలమున రాజకీ యోద్యోగులుగ నుండి సమకాలికులై ప్రసి ద్ధిగాంచినవారుగఁ గనుపట్టుచున్నారు.మఱియుఁ గాశీఖండమున పూర్వకవి స్తుతి వర్ణన సేయుచు


మత్పితామహుఁ గవిపి తామహునిఁ దలఁతు
కవిత కావ్యక ళాలాభుఁ గమలనాభుఁ
చంద్ర చందస నుందార సదృశ కీర్తి,
సరససాహిత్య సామ్రాజ్య చక్రవర్తి.

అని వర్ణించే నే కాని తన తాత తనకు విద్యాగురువునుగాజెప్పుకోనియుండ లేదు. ఇక తన తండ్రియగు మారయామాత్యుని శ్రీనాధకవి కాశీఖండ మున విద్యారాజీవభవుఁడు' అని ప్రస్తుతించియుండెను. గనుక మారయ కమలనాభునివంటి విద్వాంసుఁడు గాకున్నను, బ్రాగ్నుడువిద్యా వంతుఁడు ననియే తలఁపదగియున్నాడు' అని ప్రభాకరశాస్త్రిగారు వ్రాసియున్నారు.*[7].


  1. * ఈపద్య మారీతిని ముద్రిత పత్రియైన భీమేశ్వర పురాణములో నున్నది. విన మత్కాకవిసార్వభౌమ' యను పాఠమునకు బదులుగా నాంధ్ర కవులు చరిత్రము :- “విడుమ ధ్యాంత సార్వభౌము' అనియు, ఇట్లే కవివ జీవితముల యందును, ఉమాకాం. తముగారి పల్నాటి వీర చరిత్ర పీఠిక లోని పద్య మునులందు విన ముజ్జ్యాంత సార్వబౌమ "అని మఱియొక పాఠాంతర భేదమును గన్పట్టుచున్నది. కావున ముద్రిత ప్రతి లోని "విమత్కాకవిసార్వభౌమూ నను పాఠమె సరియైనది కావచ్చును. అట్లయిన యడల శ్రీనాథుని తాత కాకతి సార్వభౌముడగు దండ ప్రతాపరుద్రుని యాస్థానము నలంకరించియుంన్నవాడనుట సమంజసముగా నుండు" నని నా యాంద్రుల చరిత్రములో తెలిపి యున్నారు దీనింజదువుకొని శ్రీ వీరేశ లింగము గారు తామిప్పుడునూతనము బ్రచురించినట్టి యాంద్రక పులచరితములోఁ దమ వెనుకటి పాఠమును విడిచి యాంద్రులను గూర్చి ఏమియుంజప్పకయే వినమత్కవిసార్వభౌమా నను బిరుదమునే క్రమమైన దానిగాగ్రహించి కమలనాభుడు కాకతి సార్వబౌముడైన చండ ప్రతాపరుద్రుని కాలములో నున్న వాడని నేను చిప్పిన సిద్ధాంతము నంగీకరించి యున్నారు.
  2. * శ్రీ రేశలింగము గారు నాయాంధ్రుల చరిత్రము మూడవ భాగములో నేను ప్రవేశ పెట్టిన యీ వాదస్వభావమును గుర్తించి 'తామీ నడుమ నూతనముగా బెంచి వ్రాసిన యాంధ్రకవుల చరిత్రలో శ్రీ నాధునిగూర్చి వ్రాయు సందర్భమున నానా.\ దీన్ని బట్టి శ్రీనాథుని జన్మభూమి
  3. శ్రీ వీరేశలింగము గారు తమ కవుల చరిత్త్రమునుండియే యాంధ్ర చరిత్రకారుఁ డీసిద్ధాంత మునంతయు గృహించెనని భావికాలపుజనులు తలంపవలయునను సుద్దేశముతోఁ గాఁబోలు దను తొంటి యభిప్రాయమునుమార్చుకొని యూంధ్ర చరిత్ర కా రుని యభిప్రాయమును సరియైనది గ్రహించితిమని నెచ్చటసు జప్పకయే 'మెల్ల గా నిట్టిభావములను జడీచప్పుడు లేకుండఁ బ్రవేశ పెట్టిన. తద్భిన్న ముగు నభిప్రాయము నింకను గ్రంథము నందే యుంచి యేల పరిహాస పాత్రులు గావలయును?
  4. ఆ పయిపద్యమునే శ్రీవీరేశలింగము గారు మఱియొక సందర్భమున దాము నూతనముగా బెంచి వ్రాసిన గ్రంథములో . నుదాహరించును. పయిపద్యము లో తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మీ!' యని కర్ణాటక దేశము సంబోధింపఁ బడియుండుటను బట్టి, శ్రీనాథుఁడు కర్ణాట దేశస్థుఁడని యేకానొకరు విషయవిచారము చేయక వ్రాసిరిగాని యుది గ్రాహ్యము కాచు' అని చులకనగా ద్రోసి వేసి నాసిద్ధాంతము నంగీకరించి యున్నారు. ఆంధ్రకవుల చరిత్ర వ్రాసిన శ్రీవీరేశ లింగము గారికిఁ బల్నాటివీర చరిత్రపీ ఠికలో శ్రీనాథుఁడు కర్ణాటకుఁడని శ్రీయుమా కాంతము గారు చేసిన సిద్ధాంతము నిర్భాన క మైనదిగాఁ గానుపించి శ్రీ నాథుఁడు సాళ్వనరసింహరాయని యూస్థానకవియైన డి. డిమ భట్టాకమని నోడించి నాడని శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు క్రీడాభిరామ పీఠిక లో నేప్పుడో వ్రాసిన యభిప్రొమము మహాఘోర మైనది గాఁ గానుపించెను గాఁబో లు! అందుకొఱకు కొన్ని పుటలు వ్రయ పెట్టఁగిలినవా రిందునుగూర్చి పాప మొక్క- వాక్యమును మాత్రము చెప్పి ముగించిరి,
  5. * భారతీపత్రిక పుష్య మాసపత్రిక చూడుఁడు.
  6. * A Triennial Catalogue of Manuscripts. Telugu.vol III, part III, R, No. 316, page, 933.
  7. 1908 దన సంవత్సరమున వంకాయల కృష్ణస్వామి శ్రేష్ఠ గారి శ్రీరంగ విలాసము ద్రాక్షరశాలయందు ముద్రించి ప్రచురించబడిన ముద్రిత గ్రంధము నాకడ నున్నది. అందెక్కడను సూరయామాత్యుఁడు విద్యారాజీవభవుఁడని వర్ణింపఁబడిన పద్యము గాని పచనము గాని నాకంటఁబడలేదు. మఱి యే గ్రంథము నైననున్న శాస్త్రీ గారు మఱచి 'కాశీఖండ' మని ప్రస్తావించియుందు రేమో? ఏమో?