శ్రీనాథకవి జీవితము/సప్తమాధ్యాయము

వికీసోర్స్ నుండి

అధ్యాయము 7


ఇట్లఖండ కీర్తి వైభవములతో నొప్పొఱుచు శ్రీనాథకవి సార్వభౌముడు క్రీ. శ క 1435 సంవత్స ప్రాంతముల మరల రాజమహేంద్రపురమునకు విచ్చేసెను. ఇతఁడు కర్ణాటాధీశ్వరుడు ప్రౌఢదేవరాయల యాస్థానముననుండు డిం డిమ భట్టారక కవిసార్వభౌముని నోడించి యూతని కంచుఢక్క, బగుల గొట్టించి యాతని కవిసార్వ భౌమ బిరుదము నొపిచికొని కర్ణాట సార్వభౌమునిచేఁ గనకాభి షేక నత్కారమును బొందిన విదమునంతయు నాధ్ర దేశమున బహువిధములఁ గవిపండితకోటి చేఁ బ్రశంసింపఁ బడుటఁ 'దెలిసికొని రాజమహేంద్రపుర పండితులు తను తొంటి వైషమ్య భావములను విడిచి పెట్టి మధిక గౌరవమును జూవ మొదలిడిరి. ఇంతకుముందే అన్నామాత్యుఁడు "మొదలగువారు వేమ వీర భద్రా రెడ్లను శ్రీ నాథకవి సార్వభౌముని ప్రజా ప్రభావములను, ప్రతిభా విశేషములను, ప్రౌఢ సాహిత్య సౌష్టవములను నుగ్డింపుచు నాతనియెడ వారికి విశేష గౌరవ ముదయించునట్లు చేయుచు వచ్చిరి ఇతకుఁ బూర్వము వేమ వీరభద్రా రెడ్లకును శ్రీనాథునకు విశేష పరిచయ మున్నట్లు గాన రాదు.శ్రీనాథుడు రాజమహేంద్ర పురమునకు వచ్చిన వెనుకనో యంతకు బూర్వముననో కాశీఖండమును రచించుటకుఁ బూనుకొనెను. ఈ విషయమును అన్నామాత్యుఁడు వీరభద్రారెడ్డికిఁ జెప్పి యంకితముఁ బొందవలసినదిగా నాతనిఁ బోత్సహించెను. అందుల కాతఁ డియ్యకొ నెను.ఈ సంగతితే శ్రీనాథకవి సార్వభౌముఁడు తాను రచించిన శాశీఖండమునఁ దిట్లు చెప్పుకొని యున్నాడు ,

శ్రీ నాథుఁడు మరలివచ్చిన తరువాత నొకనాఁడు : తనలో

దానిట్లు తలపోసి కొనియెనఁట,

“ చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాడు
రచియించితి మరుత్త రాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యావనమున
శాలివాహనసస్త శతి నొడివితి
సంకరించితి నిండు జవ్వనంబున యందు
హర్ష నైషధకావ్య మాంధ్ర భాష
జాఢ నిర్భరవయః పరిపాకమునఁగొని
యాడితి భీమనాయకుని మహిమా
బాయమింతకుఁ గై వాలకుండఁ
గాసికా ఖండమను మహాగ్రంథ మేను
దెనుఁగుఁజేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవన హేళి శ్రీ నాథభట్టసుకవి.


ఇట్టి సంకల్పముతో గాశీఖండరచనమునకు దొరకొనుటను గర్ణాకర్ణి కావశంబున విని వీభద్ర సృపాలుం డొక్కనాడు-


  • నీత్రైలోక్యవిజయాభిదం బైన సౌధంబు

చంద్రశాలాప్రదేశంబునందు
సచిన సైన్యాధీశ సామంత సృపచార
సీమంతి నిజన శ్రేణి గొలువ
శాస్త్రమిమాంసయు సాహిత్యగోష్ఠియు
విద్వత్కవీంద్రులు విస్తరింప
గర్పూర కస్తూరికా సంకుళ దగంధ
పారసౌరభము దిక్పూరితముగ
నిజభుజావిక్రమంబున నిఖిలదిశలు
గెలిచి తను రాజ్య పీఠమెక్కించి నట్టి
యన్న వేమేశ్వరుని యంశ మాశ్రయించి
నిండుకొలువుండె గన్నుల పండువగుచు,,*

అట్టినమయమునఁ దమ్ముని యభిమత ' మెఱింగి యల్లాడ వేమ భూపతి శ్రీనాథకవి సార్వభౌముని రప్పించి సముచితాసనమునఁ గూర్చుండ

నియమించి యీ క్రింది విధమునఁ జలికెను,

 , వచియింతు వేములవాడ భీమనభంగి
సుద్దండలీల నొక్కొక్క మాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
సుభయవాక్ప్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు దిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కక్కమాటు
పరిఢవింతుప్రభంథ పరమేశ్వరుని దేవ
సూక్తి వైచిత్రి నాక్కొక్కమాటు
నైషధాది మహాప్రభందములు పెక్కు
చెప్పి నాఁడవు మారు నాశ్రితుండవసభు
యిపుడు చెప్పఁబొడంగిన ప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర '...

శా, ఈక్షోణి న్నిమఁబోలు సత్కవులు లేరీ నేటికాలంబునన్
దాక్షారామ చాళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసారఘుసృణ ద్వైరాజ్య భారంబున
ధ్యక్షించుం గవిసార్వ భౌమ భవదీయప్రౌఢ సాహిత్యముల్ ..,


అనినపలికి కర్పూరదాంబూల సహితంబుగా జాబూబూనదా బగాభరణంబు లిచ్చినం బరిగ్రహిచనఁట. అల్లాడ వీరభద్రనృపాలుని మూర్తి కొలువున్న సమయమున నెట్లుండునో యాశృంగా రాకృతి నీరీతి నీక్రింది పద్యమున సభివర్ణించెను.


<poem>*సీ మకరకుండలవజ్ర మాణిక్యదీప్తులు
చెక్కుటద్దములపైఁ జిఱువాఱ
గాలిగండ పెండారంబు దోపున
బొమ్మలె వైరిభూ భుజులు వ్రేల
గలయంగ నలదిన కస్తూరి నిత్తావి
యష్టదిక్కులయందు నవఘలింపు
మొగముచూచినమాత్ర మూర్థాభిషిక్తులు
మోడ్పుజేతులు మస్తములఘటింప

గీ..బొఱుగు జబుఁగు దీగెలఁబోలు భామినులు గొలువ .
నిండుకొలువుండెఁ గన్నులపండు వగుచు

 రాయదేశ్యాభుజంగ వీరప్రతాప
విభవుఁడల్లాడభూపతి వీరవిభుఁడు.,,


ఇట్టి ప్రభువర్యునివలనఁ గర్పూర తాంబూలసహితంబుగా జంబూన దాంబ రాభరణ బులు పరిగ్రహించి తాను గావ్య రచనకు గడంగిన విధము నీకింది పద్యములో ఔలిపి యున్నాడు.

ఆంధ్రక్షమామండలా ఖండలుండైన
వేరు భూపతి కృపా వీక్షణంబు
ఘోడెరాయాంక సద్గురు రాజుభీ మేశ్వ
ర స్వామి పద సమారాధనంబు
కమలాది నిలచు మార్కండేయ శివమౌళి
చంద్రాంశు సవసుధా సారధార
వేదాద్రి నర సింహ విపుల వక్షస్థలి
కల్హారి మాలికాగంధలహరి

గీ. కారణంబు సుక్భోధకములు గాఁగ
సంభవించిన సాహిత్య సౌష్టవమున
వీరభ ధ్రేశ్వరుఁ బ్రబంధవిభునిఁ జేసి
కాశీ ఖండముఁ దెనుంగుగా నొవర్తు. "


ఇతఁ డం దందు నిజ ప్రభావంబుఁ గొంత దెలువు కొన్నను తిక్కనాదులకంటె నెక్కువ ప్రౌఢముగను రసోదంచిత ముగఁ గవవము చెప్పుకు నని కాని డిండిమకవి సార్వభౌముని సుద్భటవివాదమున గెలిచిన వాఁడయ్యును నాడంబరముగా నట్లే ప్రబంధమునను జెప్పు కొనక పైనఁ జెప్పిన విధముగా సాహిత్య సౌష్టవమును బడసి కాశికా ఖండముఁ జెప్పఁ బూనుకొంటినని చెప్పు టెంతయు నౌచితిని దెలుపు : చున్నయది,

ఇతఁడు వేము వీభధ్రనృపతులు చేయు శివార్చనా విధా

నము నిట్ల భివర్ణించియున్నాడు,

  సీ. త్య్రంబకాచల కన్య కాంబు పూరంబున
సఘమర్షణ ప్నా వమాచరించు
నిద్దమైన మడుగు నీర్కాని దోపతి
కవక మేఖలతోడి గడి ఘటించి
మూలమంత్రాక్షరంబుల బూతి మంత్రించి
పుండ్రకంబుగ ఫాలమున ధరించి
క్రొత్త ముత్యములతో రుదాక్షమాలిక
లష్టోత్తర శతంబు లఱుత దాల్చి

గీ, పుండరీకాననన మన గూర్చుండి శంభు
నర్చరము చేయునప్పుడు మహాప్రమధుడు
చాలనొప్పొరు రెండవ శంభునట్లు:
వీర నాయణుఁడు రెడ్డి వేమవిభుఁడు..
సీ. గోదావరీ పాపనోదకంబుల హేమ
కలళశతంబుల జలక మార్చు
గర్పూరకస్తూరికా కుంకుమంబుల
గలవంబుఁగూర్చి శ్రీగంధమందు
సప్త గోదావరీ స్స్వర్ణపుష్కర హేమ
సౌగంధికముల నర్చన మొనర్చు.
గలధాత పాత్రల గా లాగరు చ్ఛేద
బహుధూపంబులు పరిఢవించు

గీ. వేనవేలునివాళుల విస్తరించు
నమృత దివ్యాన్నముల నుపహారమిచ్చు
సంఘటించు సశేషోపచారములను
బొమధ నాయకునకువీరభద్రనృపతి,

వీరలు శైవమతావలంబకులయినను ఫరమతములమ సయితము, సహన భావముతోఁ జూచుచుండిరి కాని యెన్నఁడును ద్వేషబుద్దితో జూచి నట్లు గన్పట్టదు. అల్లాడ దొడ్డ భూపతి విజయ ధాటి,

వేమవీరనృపతులకు సోదరులైన దొడ్డనృపతీయు, అన్న సృప తియు సేనాపతులుగ నుండి రాజ్యము విస్తరింపఁ జేయుట యందన్న లకు దోడ్పడుచుండిరి. వీరిలో దొడ్డ భూపతి స్వారి చేయుట యుం దాఱి తేరిన రౌతుగ నుండెను. అనేక జయములచేతఁ బ్రఖ్యాతి గాంచెను. ఇతఁడు గుఱ్ఱము నెక్కి స్వారి చేయుచు నిరువది నాలుగు మూళ్ళ మేర భూమిని దాటించి యశమును గాంచిన వాడని కాశీ ఖండములోని యీకింది పవ్యము చాటి చెప్పుచున్నది.


 « మ. హరిదాటించె బురోపకంఠమున వహ్వాళి ఏ దేశంబునం
దరు చేయళ్ళయ 'రెడ్డి నందనుఁడు దొడ్డయ్యు క్షమాధీశ్వరుం
డిరువై నాలుగు మూళ్ళ 'మేర యది పోలెక్కింపఁగా నేల య
ధరణీ సాధు వికీర్తి దాటె గడునుద్దడించి బాహ్మాండమున్

.


ఈ గుఱము పేరు 'రాజకుంజరసింహం బనీ నిశ్శంక కొమ్మన తన శివలీలావిలాసమను గ్రంథమున


 మ. ఆరు దై యళ్ళయ దొడ్డ భూవిభుఁడు నాహారోహరేవంతుడిం
పరుజారవ్వడి మూలగూరి కడ వాహ్వాళిస్థలిన్ రాజుకుం
జర సింహంబను వారువంబును యదృచ్ఛాలీల దాటింపఁడే
తిరమై యిర్వదినాల్గు మూళ్ళ నిడుపు త్సేకంబు చే యెత్తు గాన్ .

ఈ దొడ్డా రెడ్డి చిల్క సముద్రము వఱకు గల దేశమునుజయించి
జయస్తంభములు నాటించినట్లుగా . నీ క్రింది పద్యమునఁ జెప్పి
యున్నాఁడు.

<poem>“, ఔరాయళ్లయ రెడ్డి దొడ్డ వసుధాధ్యతుండు ధాటీ చమూ
భేరీ భాంకృతిఘోరఘోషమున నీర్భేదించె నొడ్డాది శృం
గారం కోటయు లోతుగడ్డయును నుద్ఘాటించే నత్యుద్ధతిన్
క్షీరాంబోధిత టంబునన్నిలిపె డిక్సీమా జయస్తంభరల్ .,

.

కనుకనే శ్రీనాధకవి సార్వభౌముఁడు, వీరభధ్రన్నపాలుడు, చిల్కస ముద్రము వఱకు రాజ్యము విస్తరింపఁ జేసి పరిపాలించు చున్న క్రింది పద్యమునఁ జెప్పీయున్నాడు,

 ఉ. ప్రాకట విక్రము స్ఫురణ రాజము హేంద్రము రాజధానిగా
నేక సితాతపత్రమున నేలును వీరనృపాల ముత్తమరలోకుడు వేమగొరియనుజుండు సమున్నతి పై భవాధ్యుడై చీకటియుం గళింగయును జిల్క సరదము సింహ శైలమున్ .


అగ్రహార బ్రాహ్మణ వర్ణనము.


గౌతమి తటమునందు వేమభూ పొలుఁ డనుజన్ముఁడైన వీరభద్ర నృపాలని చేత ధాత్రిసేవించు కాలమున సగ్రహారములోని బ్రాహ్మణు లెట్టి యైశ్వర్యములతో నొప్పుచుండిరో యా వివరమును గూడ శ్రీనాథకవి సార్వభౌముడీ కైంది రీతి నభివర్ణించియున్నాఁడు,


 « సీ. ధరియింప నేర్చిరి చర్భ పెట్టెడు వ్రేళ్ళ
లీల మాణిక్యాంగులీయక ముల
గల్పింప నేర్చిరి గంగమట్టియ మీఁదఁ
గస్తూరి పుండ్రకముల నొసల
సవరించు నేర్చిరి జన్నిదంబులమ్రోల
దారహారములు ముత్యాలసరులు
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
గమ్మని కొత్త చెంగల్వ విరులు

తే. గ్రామముల వెండియును బైఁడి దడబడంగ
బాహ్మణోత్తము అగహారములలోన
వేమభూపాలుఁ డనుజన్ము వీరభద్రు
ధాతి యేలింప గౌతమీ తటమునందు


అనఁగా నంతకు బూర్వము బ్రాహ్మణులంత . మైశ్వర్యవంతులుగా లేరని భావము 'తేట తెల్లముగుచున్నది,


రాజ్య విస్తీర్ణము

వీరభద్రా రెడ్డి కటకాధిపతియు, కళింగ గాంగవంశజుఁడుసు, భాను దేవునిసోడించి తన రాజ్యమును గజపతియు నగు భానుదేవునినోడించి తన రాజ్యమును విస్తరింపఁ జేసెను,ఈ ప్రదేశమంతయఁ గళింగ దేశమని పూర్వము వ్యవహరింపఁబడినను శ్రీనాథకవిసార్వభౌముఁడు వీరభద్ర సృపాలుని మధ్యాంధ్ర క్షమామండలేశ్వరుండనియు వ్యవహరించి యున్నాడు.ఆనాటికే కళిగ దేశము సంపూర్ణముగా నాధ్ర దేశములోని భాగముగా నేర్పడినది. ఈ రెడ్డి రాజుల పలిపాలించిన భూభాగమం తయును ముప్పది వేల మైళ్ల వైశాల్యము గలది యై యుండెననుటకు సందియము లేదు. అల్లాడ రెడ్డి పుత్రులు నిరంకుశులై యవక్ర పరా క్రమంబున నీరువ దేండ్ల కాలము మధ్యాంధ్ర దేశమును బరిపాలించిన వెనుక దేశము ఘోయుద్ధములకు రంగస్థలమైపోయినది.

రెడ్ల ధర్మకార్యములు


అల్లాడి వేమ భూపాలుని శ్రీనాథకవి సార్వభౌముఁడు దేవ బ్రాహ్మణ భక్తి వర్ధిత ధరిత్రీచక్ర సొమాజ్య లక్ష్మీ వాస్తోష్పతి' యని వర్ణించి యుండఁగా నాకని ధర్మకార్యము లెట్టి వై యుండు నోఁ వేఱుగ జెర్చక్క లేదు. ఇతడనేక భూ వానములను కావించి శ్రీగిరి కాశీ పంచారామాది దేవభవనంబులలో శాసనములు వ్రాయించెనని యీ క్రింది పద్యమునలన 'వేద్యము కాఁగలదు.


 “ కం. కాంచీ శ్రీగిరి కాశీ
పంచారామాది దేవభవనంబుల వ్రా
యించెనువేమక్ష్మాపతి
యంచిత భూధాన శాసనాక్షర పజ్జుల్ .,

గీ. ధర్మశాసన ఘన లాస్తంభ మెత్తే
ముకుందోద్భవ స్వామి శివుని మ్రోల
వీరభద్రేశుడా చంద్ర తారకముగ
నగ్రహారాళి నఖిల మాన్యంబు లొసంగి

అను పద్యము గన్పట్టుచున్నందున వీర నృపాలుడు సైతము మత సంరక్షకులగు బ్రాహ్మణులకు నగహారము నొసంగు చుండెనని విదితము కాగలదు. ఇట్లు కొండవీటి రెడ్లు, రాజమహేంద్రపుర రెడ్లు బాహ్మణులకు భూదానము చేసినారన్న కుక్షింభరమాత్రుతులయిన బ్రాహ్మలకు వ్యర్థముగా భూదానములు చేయుచుండి రని నవనాగరికులు కొందఱ తలుచి పరిహసిం పవచ్చునుగాని యట్లు తలుచుట న్యాయుముగాదు విద్యలన్నీయు బ్రాహ్మణుల యాధీనమై యుండుట చేత వేదశాస్త్రాది విద్యల పోషణార్థము సర్వకాలములందు పుణ్యము పేరు చెప్పుకొని వేద వేదాంగ వేత్త లయిన బ్రాహ్మణులకు మాత్రమే భూదానములు మొదలగుచేయుచుండిరని భావింపవల యును. వారియు దేశ ముగూడ నట్టిదై యుండెను. వీరభధ్ర భూపాలుని పట్టమహిషి యుగు అనితల్లీ దేవి ఆయుర్వేద పారంగతుఁడైన పరహి తాచార్యుఁడను బ్రాహ్మణునకు కలువచేరను గ్రామమునకు అన్నవర మని పేరిడి దానము చేసి యుండెను వరహితుని పూర్వు లెల్లను నా యుర్వేదపారంగతులయిన భీషజ్ఞణుల ని శాసనమునం దభివర్ణింప బడిరి. అట్టి యుత్మ విద్యను నేర్చి బహుజనోపకారకులై ప్రసిద్ధి నొందిన బ్రాహ్మణోత్త ముల బోషించుట యాయుర్వేదవిద్యను బోపించుట కాదా ! ఇట్టి యుత్తను శాస్త్రములు నశింపళుడంజేయుటకే వారాకాలమునందు గ్రామములు భూములునానిని బ్రాహ్మణోత్త ముల బోషించుట బోషించుట కాదా ! ఇట్టి యుత్తను శాస్త్రములు నశింపకుండ జేయుటకే వారాకాలమునందు గ్రామములు భూములు మొదలగు వానిని బ్రాహ్మణోత్తములకు దానము చేయుచుండిరి. పై దానము శా.. శ. 1354 (1428] శోభకృద్వర్ష శ్రావణ కృక్షైకాదశీ దినంబున శ్రీ మార్కండేయేశ్వరుని నన్నీ ధానమునఁ జేయఁబడినది.


'అల్లాడ భూపతి పుత్రులుక్రీ శ. 1444 వఱకు నవక్రవరాక్రమంబున శత్రు రాజుల సదిమిపట్టి యవసకర్ణాట కటక భూధవులతోడఁజెలిమి వాటించి రాజమహేంధ్రపుర రాజ్యమును బరిపాలించిరని తెలిపి యున్నాఁడను. వీరి రాజ్యము గజపతి రాష్ట్రమునకుఁ బక్కలో బల్లెమై యుండెను. ఈ రెడ్డి రాజ్యము ప్రవర్ధమానమై యున్నంతవఱకు గజపతు లభివృద్ధి గాన రాక యుండిరి, వీరికిఁ గర్ణాటకులు శత్రువులుగ నుండిరి. కర్ణాటకులును రెడ్లు నప్పటప్పట మైత్రిగలిగి యుండుచు వచ్చిరి అదియుఁగూడ నొక విరోధ కారణమై యుండెను పశ్చిముమున బహమనీ రాజ్యము వర్ధిల్లుచుండెను. అహమ్మదు షాహ మరణముఁ జెందఁగా అల్లా ఉద్దీ షాహా 1435 సంవత్సరమున రాజ్యారూఢుడై కర్ణాటక సామాజ్య చక్రవర్తి యగు పౌఢ దేవరాయనితోయుద్ధములు ప్రారంభించెను. ప్రౌఢ దేశరాయలు తురక ప్రభువైనబహమనీ సుల్తాను మాత్రమేగాక హిందువైన గజపతి గూడ శత్రువుగ సుంచుట చేత నొకపక్కగజపతులతోడను, మఱియొకప్రక్క తురకలతోడనుయుధ్ధములుచేయవలసివచ్చెను. యవన . కర్ణాటకభూధవులు సనూనబలులు సమర్థులుగావున దక్షిణ హిందూ దేశమునదమతమ సామ్రాజ్యములను సుస్థిరముగా నిలుపుటకై , 'ఘోరముగా ,బోరాడుచు వచ్చిరి ఇట్టి యుధ్ధతుల నడుమ రెడ్డి రాజ్య మెంతో కాలము నిలువఁ జాలక పోయినది. గజపతులు రెడ్డి రాజ్యమును మ్రింగివేయవలయునని చలముపట్టి యుండిరి. అందులకుఁ గాలము కర్మము సమకూడినది. ఇట్లుండఁగా 1435 వ సంవత్సరమున గజపతుల రాజధానియైన గటక పురమున విప్లవము తటస్థించి రాజైన భాను దేవుడు సంహరింప బడెను. ఈతనితోఁ గళింగ గాంగవంశమంతరించినది. మంత్రియగు' కపిలేంద్ర గజపతి . రాజ్యారూఢుండయ్యెను. ఇతఁడు మిక్కిలి సమర్దుడు, విక్రమాడ్యుఁడు నగుట చేతఁ దన రాజ్యమును విస్తరింపఁ జేయ సంకల్పించెను. రెడ్డి రాజ్యము నాపోవనముఁబట్టిన గాని తన సంకల్పము నెఱవేఱజాలదని తలంచెను. అందులకై పది సంవత్సరములు కృషి చేసెను 1444 వ సవత్సరముఁ గపిలేంద్ర గజపతి రాజమ హేంద్రపురముపై దండయాఎత్ర వెడలివచ్చెరు. ప్రౌఢ దేవ రాయలు రెడ్లకు సొయ్యము జేయవచ్చెను. ఉభయపక్షముల వారికి యుద్ధములు జరిగినవి. కపిలేంద్ర గజపతి యుద్ధమున గెలువఁ యాతడవకు మరలి పోయెను గాని తన పట్టువిడిచిన వాడు గాఁడు. ప్రౌఢ దేవరాయ లాసంవత్సరమున దక్షారామ భీమేశ్వరుని సందర్శించి యొక దాన శాసనమును వ్రాయించి వెడలిపోయెను తరువాత రెండు సంవత్సర ములకు విద్యానగరమునం ప్రతాప దేవ రాయలు మరణయుఁ బొందిసందునగజపతికి బలమెక్కువ యయ్యెను మహా సమర్దుడైన తన శత్రువుకఁడు మరణము నొందినందున గజపతి కర్ణాట సామ్రాజ్యమును స్వాధీన పఱచుకొని పిమ్మట తురుష్కులను జయించి దక్షిణ హిందూదేశమున నేక సామూజ్యమును స్థాపింపవల యునని సంకల్పించి క్రీ శ 1447బ్ వ సంవత్సరమున విజృంభించి యసంఖ్యాకములగు సైన్యములతో దండయాత్ర, బయలు దేఱి రెడ్డి రాజులను జయించి రాజమహేంద్రపు రాజ్యమును మాత్రమేగాకదక్షిణమున నుదయగిరి వఱఁగల కర్ణాట రాజ్యమును, ఏకశుకానగరము వఱకుగల పద్మ వెలమ నాయకుల రాజ్యమును నాక్రమించుకొని యారాజ్యముల బరిపాలించుటకైప్రతినిధి పాలకుల నియమించెను. పరశురామరఘునాధ రాజు, వీరభధ్ర రాజు, కంబము మెట్ట, ఓరుగిల్లుసీమలఁ బాలించుటకు నియమింపఁబడిరి.గజపతిపాత్ర సామంతులలో నొకడు రాజమహేంద్ర పుర రాజ్యమును బరిపాలింపుచుండెను.కొండవీటి రాజ్యమును బాలించుటకు గణదేవుఁడు నియమింపఁబడెను. వినుకొండ రాజ్యమును కమ్మ సేనాని సాగిగ న్నమనాయఁడు గన్న క్షితిపాలుఁడు పరిపాలనము సేయుచుండెను. ఉదయగిరిరాజ్యమునుమ ధవవర్మకులోద్భవుండయిన తమ్మిరాజపుత్రుడు బసవ రాజు పరిపాలనము సేయుచుండెను. వీరెల్లరును 1450 దవ సంవత్సరమునకుఁ బూర్వముననే యీ దేశము లను జయించి పరిపాలించుచున్నట్లు శాసనములవలనఁ దెలియవచ్చు చున్నందున నప్పటికే యాంధ్ర దేశములో మూఁడువంతులు గజపతుల స్వాధీనమయ్యెనని చెప్పవచ్చును.

శివరాత్రి మాహాత్మ్యము*[1]


ఇంతవఱ కువలబ్ధములయిన శ్రీ నాధుని గ్రంథములలో శివరాత్రి మాహాత్మ్యము గడపటిదిగాఁ గన్పట్టుచున్నది, రాజమహేంద్ర పుర రెడ్డి రాజ్యము నశించిన వెసుక వచ్చిన యొడ్డ రాజుల దొరతనమున శ్రీనాథకివిసార్వభౌముని నాదరించు ప్రభుపుంగవులు లేకపోయిరి. 1450 సంవత్సరమునకుఁ పిమ్మట శ్రీనాధకవిసార్వభౌముడు మరల దేశాటనము ప్రారంభించి కొండవీటి సీమలో సంచారము సేయుచు శివరాత్రి పర్వకాలమున శ్రీగిరి మల్లి కార్జున భ్రమరాంబికల సందర్శిం చుటకై శ్రీ శైలయాత్రకు బయలు వెడలెను శ్రీశైలమున బిక్షావృత్తి మఠమను జంగమ మఠ మొకటి గలదు. అక్కడ నా మఠాధీ శ్వరులు ధర్మకర్తలుగా నుండిరి. వారు శ్రీ నాధకవిసార్వభౌముని సత్కరించి శివరాత్రి మాహాత్మ్యమును జెప్పగోరినందున నతఁ డీ గ్రంథమును రచియించెను.

అక్కడి మఠాధీశ్వరులకు బిక్షావృత్తులని పేరు. వారిలో శాంతభిక్షా వృత్తి ప్రఖ్యాతుండైన మహోన్నతుడు నుండెను. శివరాత్రి మహోత్సవ సమయమున శాంతబిక్షావృత్తి యతీశ్వరుఁడు శివక థావినోదంబులం బొద్దుపుచ్చుచుఁ దన ప్రియభృత్యుఁ డగు - శాంతయ్యను శ్రీనాథునిచే గృతికొమ్మని ప్రబోధించినట్లు శివరాత్రి మహాత్మ్యమునఁ జెప్పబడినది. అట్లు శ్రీ నాధుఁడు లక్షాధికారులయి యండిన జంగమగురు పీఠము వారి యనుగ్రహమునకుఁ బాత్రుడై... వారి ప్రార్థనము మీద శివరాతి మహాత్మ్యమును రచించి పువ్వుల ముమ్మిడి దేవయ్య పుత్రుడయిన శాంతయ్యకు సంకితము గావించెను. ఈ కావ్యమునందు కృతిపతి యిట్ల భివర్ణింపబడి యున్నాడు.


పరవాది మత్తేభ వంచాన నాఖ్యుండు
పరహిది మండూక పన్నగుండు
వరనాది నవ మేమ ప మావధీశుండు
పరవాది సాగర బాడబుండు
పరవాడి కుత్కీల భాసురవంధోళి
పరవాదిగే ధన పావకుండు
పరవాది చయతమః: వటలోగ్రభానుండు
పరవాది భోగీ సుపర్ణుఁ డనఁగ

గీ. జటులైన కోలాహల సమర బిరుద
ఘనుఁడు నంగ్రామ పార్థుండు విమత యశుఁడు
శుభుఁడు ముమ్మడి దేవయ్య సంతుఁడనఁగ
వెలసె శాంతయ్య విక్ర మకవీవరుండు.


ఈ గ్రంథమును గూర్చి యీనడును నొక విచిత్ర వివాదము బయలు వెడలినది. ఈ గ్రంథమును శ్రీనాథుడెవరికి నంకిత మొనర్పక ముం దే స్వర్గస్థుఁడై యుండు ననియు, ఈ గ్రంథమునకు భర్తగా గప్పడు నట్టి ముమ్మిడి శాంతయ్య యెట్లో యీకృతిని సంగ్రహించి తన కతి కించుకొని యవతారికాదులను స్వహస్తముసనో,పరహస్తముననో

యవతరింపఁ జేసిననియుఁ బ్రచారము పుట్టించుచున్నారు. ఆవతారికా భాగము దోషభూయిష్టమై, అప్రౌడకల్పనాజల్సాకమై యుండుట కొరణమట. ఇంతమాత్రమునఁ బ్రబల ప్రమాణముఁ జూపించు సంత వఱకిట్టి వాదము నంగీకరింపరాదు, శ్రీనాథక విసార్వభౌముఁడు తన వార్ధక్యదశ యందు శివరాత్రి పర్వ కాలమున కృతిభర్త యగు " శాంతయ ప్రోత్సహించి నందువలనఁ ద్వరితగతిన గ్రంథమును రచించి నట్లు మనమూహింపవచ్చును గానీ తదితరములయిన యూహల కవ కాశము గన్పట్టదు. అవ తారీకాభాగముదోష భూయిష్టమై యుండు టకుఁ గారణము పరిషత్తునకు లభించిన ప్రతి శిథిలాతి శిథిలమై యుండుటయే కారణము, శాంత బిక్షవృత్తి యతీశ్వరుడు శ్రీ నాధునకుసమకాలికుఁడని నిస్సంశయముగాఁ జెప్పుడగును కృతిపతి యునుశాంతయ జంగమదేవర శాంత బిక్షావృత్తి యతీశ్వరునకు మూలభృత్యుడని శివరాత్రి మహాత్మ్యముసఁ జెప్పబడియున్నది. కనుక ముమ్మయ శాంతయ్య శ్రీశైల మందలి బీక్షావృత్తి మఠస్థ జంగముడని తేటవడఁగలడు. హరిశ్చంద్య చరిత్రను ద్విపద కావ్యముగా రచిం చిన గౌరన ముహాకవి తన పెదతండ్రి పోత రాజు దేవరకొండ రాజ్యాధి పతి యగు సింగన మాధవక్షితిపతిపాలమణికి మంత్రిగానుండెనని చెప్పి యుండుట చేతను, సింగన మాధవభూపాలుడు క్రీ.శ. 1423 లో రామాయణమునకు వ్యాఖ్య రచించినాఁడని వీని భార్యయగు నాగాంబిక 'రాచకొండ కుత్తరమున నాగసముద్ర మను తటాకమును ద్రవ్వించి వ్రాయించిన శిలాశాసనములో నుండుట చేతను, గౌరన తన నవనాథ చరిత్ర పీఠికలో శాంత బిక్షావృత్తి యతీశ్వరుని విశేషముగా నభివర్ణించి యుండుట చేతను1430 ప్రాంతములనున్న పోతన మంత్రి తమ్ముని కుమారుడైనజన గౌరనకవి 1440 ప్రాంతములనుండుట సత్వ మునకు విరుద్ధము కాకుండ చేతను గౌరన నవనాథ చరిత్ర పీఠికలో 'శాంత బిక్షావృత్తి యుతీశ్వరును ప్రాభవమును విశేషముగా సభివర్ణించి యడుట చేతను శాంతబిక్షావృత్తి యతీశ్వరును గూడ నా కాలము: నందున్నాడనుట సత్యమునకు విరుద్దము గాదు. . ఈ కాలమున నీ దేశ మంతయు నొడ్డె రాజుల గజపతుల స్వాధీనమయ్యెను. తన్నాదరించు నాంద్ర ప్రభువులెవ్వరు లేకుండుటచే వార్ధక్యము ముంచుకొని వచ్చుచున్నను సంసార భారమును భరించుటకై గజపతికి సామంతుడగు నే గణదేవునో యాశ్రయించి గృష్ణా తీరమునందలి బొడ్డుపల్లెను గుత్తకు దీసికొని గుత్తపైకమును చెల్లింపలేక వారి వలన నానా విధ కష్టములను బొందినట్లాతేనిచే రచింపబడినదను నీక్రింది చాటు పద్యమువలన దెలియ గలదు.

సీ. కవిరాజు కంఠంబుఁ గౌగిలింనుగదా,
పురవీధి నెదు రెండు పొగడ దండ,
ఆంధ్రవ సైషధ కర్త యంఘ్రి యుగ్మంబున
దగిలియుండెను గదా నిగళ యుగము,
వీరభద్రారెడ్డి విద్యాంను ముంజేత
వియ్యమం దెను గదా వెదురు గొడియు,
సార్వ భౌముని భుజాస్కంద మెక్కెనుగదా
నగరివాకిట నుండునల్ల గుండు,

గీ. కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు దీనిపోయెఁ దిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేలి మోసపోతి
సెట్లు చెల్లింతు టంకంబు 'లేడునూర్లు,


వార్థక్యము పై బడిన తరువాత, తన్నాదరించిన మహారాజు నాశనము జెందుటయు, పరరాజుల నాశ్రయించియొక గ్రామమును గుత్తకుఁదీసికొనుటయు, చిర కాలము గంటముఁబట్టినహస్తముతో నాగలిబట్టుటయు, దురదృష్టవశమునఁ బండించిన పంటసంతను గృష్ణ వేణమ్మ వరదలతో ముంచెత్తి కొని పోవుటయు, పోగా మిగిలిన పంటలను బిలబిలాకులు దీనిపోవుటయు, గుత్త ధనము చెల్లింప లేక పోవుటయు, పర ప్రభువులు దయాదాక్షిణ్యములను విడిచి గౌర వమునైన పాటింపక పురవీధిలో నెదు రెండలో నిలువ బెట్టి కాళ్ళకు గదలకుండ సంకెళ్ళు దగిలించి నగరి వాకిటనుండు సల్లగుడును నొక దాని బుజము పైబెట్టించి బాధించిన విధనంతను వర్ణించి చెప్పిన పద్యము శ్రీనాథునిది కాదని చెప్పుటకు నోరు రాఁగలదా ? ఇట్టి కష్ట ముల పాల్పడిన వెనుక నే శ్రీనాథ ! విసార్వభౌముఁడు శ్రీ, శై లయాత్రకుఁ బోయి యచటి మఠాధిపతులతో మైతి గావించుకొని ధన సంపాదన కై వారల ప్రోత్సాహమున శివరాత్రి మాహాత్మ్య మను నీ గ్రంథము సత్యల్ప కాలములో త్వరితగతిని రచించి యుండుననుట వాస్తవనుని విశ్వసింపవచ్చును. ఇట్టి పరిభవమును బొందినవాడగుట చేతను, వార్ధక్యము పెరుగుచున్న వాఁడగుట చేతను, ఆవతారి కాదులు కొంత వఱకుఁ బేలవముగా నుండవచ్చును. కాని గ్రంథమును మున్మయు శాంతయ కంకికితము చేయ లేదనుటకు సప్రమాణములగు నాధారముల నెవ్వరును జూపింప లేదు. శిథిలాతి శిథిలమగు ప్రతియొక్కటియె పరిషత్తు వారికి లభించటచేతను గ్రంథపాతములు పెక్కులు గాన పచ్చుచుండుట చేతను, ఇట్టి యపోహల కవకాశమిచ్చుచున్న దిగానీ గ్రంధమును బండిత వర్యులు నిష్పక్ష పాత బుద్ధితోడను, సత్యైక దృష్టి తోడను జక్కగా విమర్శించి కవిహృదయానుసారముగ నౌచిత్యభంగ ము లేకుండ నుచితసంస్కరణములను గావించి ప్రచురింపవలసిన గ్రం థమై యున్నది. ఇట్టిపని యాంధ్ర పరిషత్తువారి చేతను 'నెఱువేర్పఁబడి వలసి యున్నది.


శివరాత్రి చూహాత్మ్యమున కృతిభర్త తల్లియైన' యొమ్మ మాంబను వర్ణించిన యీక్రింది.-

"పరమపాతి వ్రత్యభావంబు తలపంగ
గౌరి గాబోలు నీకాంత తలప
సకలసంపత్స్ఫూర్తి చాతుర్యమహిమల
నిందిర గాఁబోలు నిందువదన
సకల విద్యాప్రౌడి నడినన్న గిరిమల
భారతి గాబోల భామ యెపుడు
సర్వ లక్షణ గుణసంపన్నతోన్నతి
నింద్రాణీగాఁబోలు నిగరబోడి
యనగ నిద్ధాత్రియే ప్రొద్దు సతిశయిల్లె
బరఁగమున్ముడి దేవన్యు భామ జగతి
గామీ తీర్థక సంతాన గల్పవల్లి
యంత్త్వ లద్దుణనికురంబ యొమ్మమూంబ.

అను సీస పద్యము శ్రీ నాథవిరచిత భీమఖండావ తారిక యందలి యీ క్రింది


 'సీ, జగ దేక సంస్తుత్య సౌభాగ్యసంపద
రతి జీవిబోలు నీరాజనదన
పరమపాతి వ్రత్య భాగ్య గౌరవమున
భూపుత్రుబోలు నీ పువ్వు జోఁడి
యక్షీణమహిమఁ గళ్యాణ వైభవమున
బార్వతీఁబోలు నీ పద్మగంధి
మృదుగభీరప్రౌఢమిత భాషణంబుల
భారతిబోలు నీపరమసాద్వి.

యనుచు బంధులు వినుతింప నవనిమించె
నధిక శుభ గాత్రి విశ్వనాయకుని పుత్త్రి
యన్న విభు దేవమంత్రి యుర్థాంగలక్ష్మి
రమ్య సద్గుణ నికురంబ రామమాంబ.


అను సీసపద్యమును బోలియున్నది. ఈ గ్రంథము నందలి మూలకథ

స్కౌందపు కాణమందలి శంకరసంహితలోని దని శివరాత్రి మహాత్మములోని


ఉ.తాపస సార్వ భౌములు సదా శివరాత్రి మహావ్రతంబు దో
షాసహృతిక మంబు విను డాదరణంబున నేను సద్గురు
శ్రీ పదపద్మముల్ దలఁచి చే ప్పెద శంకర సంహితాకథా
దీపిక భవ్యమార్గమునఁ దేటపడన్ మొదటింటి నుండియున్ .

,
కవి యీ గ్రంథమును త్వరితముగా ముగింపవలసిన నాఁడగుట చేత
నో' లేక మహాకవి యగు బాణుని యందుగల యత్యం తాభి మానము
చేతనో కాదంబర్యనుసరణము నెక్కువగాఁ జూపియున్నాడు.

మఱియు మన కుపలబ్ధమయిన ప్రతి గూడ నాలుగా శ్వాసముల
గ్రంథమై చతుర్థాశ్వా సొంతమున నున్న


<poem> గీ. పరమ మునులు సూ త్యాహసంభవు సూతు
భక్తి బూజించి యధిక తాత్పర్య గరిమ
భటులు ప్రమధులచే భంగపడుట చూచి
చిన్న బోయి యముండేమి చేసిఁ బిదప,,.


అను గీత సద్యమ వలన సమగ్రమయిన దట్లు - స్పష్టనుగు చున్నది ఇట్ల సమగ్రమై గంథపాతములతోఁ గూడి శిథిలాతి శిథిలమై యున్న ప్రతిలోని పదజాలమును బురస్కరించుకొని నిరాధారము లయిన యపోహలతోఁ జేయు నాక్షేపణములకు బత్యుత్తరమును జెప్పుట గ్రంథము విస్తరింవఁ జేయుటకు మాత్రమె తోడ్పడును సంశయగ్రస్త మాససమూల సంతృప్త పఱుప జాలదని ఈ విషయ మీంతటితో విరమించుచున్నాను.

  1. * ఈ గ్రంధ మాంధ్ర సాహిత్యపరిషత్తువారి చే సంపాదిత మై వారి యాంధ్రసాహిత్య పరిషత్పత్రిక యందే ప్రకటింపఁ బడియున్నది. ఆద్యంతము శిథిలమైనప్రతి యొక్కటియే దొరకినది. గ్రంధపాతములు గలవు.