శ్రీనాథకవి జీవితము/నవమాధ్యాయము

వికీసోర్స్ నుండి

పును నాత్మ గౌరవముతో గూడుకొన్న గాంభీర్య.. భావమును వెల్ల డించుచుఁ గవితాచాతుర్యము గలిమి చూపుచు దివిజ కవివరు • గుండి యల్ దిగ్గురనగ' సరుగు చునాఁడు శ్రీ నాథుడమరపురికి ". అని చెప్పిన పద్యమై యుండవలయునే గాని యేనబదేండ్లు నిండియు వైషయిక వాంఛల విడవజాలక వానికై యంగలార్చుచుఁ జచ్చు చున్నపు' డు భావిప్రపంచమున కుహనావి కుర్శకులు దన్ను నోటికి వచ్చినట్లు గా డిట్టుటకై చెప్పిన పద్యము గాదని కవితావాసన యించుక యేని గలవారికి బొడగట్టక మానచు


నవమాధ్యాయము.


శ్రీనాథుని ప్రవర్తనము


మా మిత్రులగు శ్రీయుత వేటూరి ప్రభాకరశాస్త్రి గారుతమ శృంగార శ్రీ నాథమను గఁథమున శ్రీవీరేశ లింగము పంతులుగారీ సందర్భమున శ్రీనాథుని గొంత' యవగణిచిరి. అతఁడు వార్ధకమున దారిద్ర మనుభవించుట పాపఫలమని కర్మ పాకము చెప్పిరి, అట్లు చెప్పుట వారికే చెల్లినది.” అని వ్రాసి వారి యభి ప్రాయము దాము గుర్హించినట్లు,తోప జేసిరి. ఎద్దానిఁబుక్రస్కరించు కొని వీరేశలింగము - పంతులవారట్లు '.. వ్రాయసాహసించిరో యద్దానినే మాశాస్త్రుల వారును బల పఱుచున్నారు. వీరివ్రాత వైఖరిని.. చూ డుడు

" శ్రీ నాగులకి వైషయిక వంఛలత్యున్నతములు, భోగపరాయణత "మొండు, ఫౌఢ నిర్భరళల, పరిపాకకాల మగుటచే నాతఁడ ప్పుడు శృంగార సముద్రమునఁ దెప్ప. దేలుచున్నాఁడు. దాక్షారామ వ్సరామల యొదళ్ళపై బుగబుగ లొల్పుటకని తెలుగు రాయని గస్తూరి కోరినాడు. శృ.శ్రీ.పు.155


" శ్రీనాథుడు సాంసారిక సౌభాగ్యము నంతగా ననుభవించిన వాఁడు గాఁడఁట, కాని సంసారము మొండుగా గల వాడట, శృం శ్రీ. పు. 293 )

"శ్రీ నాథుఁడు మహాభోగ పరాయణుఁడఁట! స్వర్ణ పాత్ర భోజనములు. దీనారటం కాల తీర్థ మాడుటలు, జంబూవదాబరణధారణములు, కిస్తూకా గంధాంగ రాగాను ' లేవములు, ఉద్యానవిహా రములు, శ్రీనాథుడపేక్షించెనట!. శృం శ్రీ, పు. 299

,

తదుపలబ్దికై గ్రంథముఁల రచించెనఁట! అనుదినము చూచిన సుందరిని గూర్చియా అనుభవించిన యానందాదులను గూర్చియో కవనము కట్టుచుండెడివాఁడఁ శ్రీ (శృం. శ్రీ పు..299


అతఁడు సౌందర్యాభిమాని యఁట! చిన్నారి పొన్నారి చిఱుకూకటీనాడు, నూనూగుమిగా సాలనూత్న యౌవసము ప్రౌఢనిశ్భర వయపరిపాకము నను పదములీ విషయమును దెలుపుచున్నవట! .(శృం. శ్రీ), పు. 300,

మఱియు నాతఁడు శృంగార శేఖరుడఁట! భీమఖుండ కాశీఖండ గ్రంథభాగములు, వీధీ నాటకము, శివరాత్రి మహాత్మ్యము చాటు దారలు, ఐతిహ్యములు, ఇతరకవిస్తుతులు, నీవిషయమును రాద్దాంత పఱచుచున్న షట! ఈ విషయం నిరూపించుటకై కొంత - గ్రంథము వ్రాయ మన సొల్ల క్కున్నదఁట! కొందఱు శ్రీనాథుని శృంగారి యని యనుట కొప్పుకొకున్నారట! అట్టినారు శ్రీనాథు, గ్రంథములు జదువని . వారో, చదివిసను కవితాతత్వము నెఱుగనివారో, యెఱిగినను గప్పి పెట్ట దలంచువారో కౌవలెనట! తామిక్కడ శ్రీనాథుని దిట్టుట .. లేదఁట! కవితాదర్పణముగఁ గన్పట్టుచున్న యా విషయములు గప్పి పెట్టిన మాసిపోపఁట, శ్రీనాథుని చాటుధారలనేకములుదాహారింప జాలకున్నారట! వానిలోఁ గొన్నింటిని బాచీనులు లక్షణ గ్రంథములలో నుదాహరించి నారట! అట్టివాని నెల్ల తాముధహరింపుకున్నను జూచినట్లు సూచించి యైన విడువ వలె నఁట, శృం శ్రీ పు 300)


శ్రీనాథుని శృంగార ప్రవర్తన మను పేరిట నొక పెద్ద ప్రకారణము రచించియు నది పదుగురురును జరువదగినది కాదము కారణమున. . దూరీకరించిరట! ఇంతఁ దాఁక లోకమున జీవించి యున్న శ్రీనాథుని చాటు ధారలిప్పుడు మనమచ్చున దీర్పకున్నంత మాత్రాన జచ్చిపో " వునవి కావట; * వైషయికనర్తనమున సగ్రకోటి నధిష్టించియు మ్రొగ్గ తిలఁబడక చిరజీవితము సాగించుకొన్న వాడట! మేలయిన యాహార విహారములు గలవాడట! మఱియు విశాలోన్నత కాయ్యడట! [శృం....పు, 301]


ఆహా! శృంగారాభిమానులగు . ప్రభాకరశాస్త్రీ గారి పోకడలెట్లున్నవో పరిశీలించితిరి గదా!

“శ్రీనాథుఁడు శృగారప్రియుఁ డై తన కావ్యమునకు శృంగారనైషధమని పేరిడినందున నాతని నభిరుత మగుట చేతను గ్రంథమునకు తామునున, శృంగార శ్రీనాధ' మని పేడినారట గాని “శృంగారము గంథము పేర నే గాని గంథములో నెక్కడను గానరాదట! ఈ పేరు నేతిబీరవంటిదే' యని తనుకు దామే. తను 'శృంగార శ్రీనా థమం. నందలి. తోలిపలుకు నందే తొలకరింప జేసినందుల కెంతయు సంతోషింప వలసినదే. పలువురు చదువరానివియు, వినరానివియునై చితికి పోయిన ప్రాత తాటాకులలో న బూజు కట్టి మాలిన్యగ్రస్తములై దిక్కు మక్కు లేక యణగి మణగి పడియున్న శృగాకధారలనెల్ల బహు ప్రయాస ముతో సేకరించి పరిశోధించి శ్రీనాథుని తలకు బ్రామి శృంగార ప్రవర్త మము' గూర్చి వ్రాసిన ప్రకరణమును గూడ మూలనుంచక యందుఁ జేర్చిముద్రించుటుకు సాహసించి యున్న యెడ వీరి శృంగార శ్రీనాథము' నేతిబీరకాయ వంటిది గాక సార్థకనామము వహించినదగునుగదా ఎంత వెర్రి పని చేసిరి? శ్రీనాథుని శృంగార ప్రవర్తనము నిరూపించుట కయి కొంత గ్రంధము వివరించి వ్రాయ మన సొల్లకున్న దని వ్రాయుచు నా దిగువనే యందు కొఱకు నొక పెద్ద ప్రకరణమును రచించియు నది పదుగురును జదువదగినది కాదను కారణమున దూరీ కరించితి మనిరి. వ్రాయ మనసొల్లని దానిని తిరిగి వ్రాయుటకు మన సెట్లోల్ల గలిగిందో నునసొల్ల గలిగి వ్రాసి దానిని ముద్రించుటకు మరలమనసెట్లోల్ల నీయక దూరీకరింప జేసినదో శృంగారరసానంద మున నోలలాడు నట్టి ప్రవృత్త చిత్తము గల శృంగార శ్రీ నాథ" కర్తలకే తెలియవలయుఁ గాని నావంటి యరసికున కెంత మాత్రము బోధపడఁ జాలకున్నది

శ్రీనాథుని శృంగారి యన్నను, శృంగారప్రియుఁడన్నను, శృంగార శేఖరుఁడన్నను, నాకు చింత లేదు. వారితో వివాదమును లేదు.శ్రీనాధుని భోగ పరాయణుఁడన్నను మహాభోగ పరాయణుఁడన్నను నేనంతగా విచారపడువాడను గాను.

శ్రీనాథుఁడు దాక్షారామాప్సరోరా రాయల యొడళ్లవయి కస్తూరి బుగ బుగ లొల్పు వాఁడని యొక వంకనుఁ వైషయిక వర్తనముననగ్రకోటి సధిష్ఠించియు మ్రొగ్గఁతిలఁబడక చిరజీవితము సాగించు కొన్న వాఁడని మఱియొక వంకను జాటుచు బయి విశేషణముల దొడిగి తా మత్యంతాభిమానముతో ప్రేమించేడి కవిసార్వభౌముని గేలి సేయుట యెంతయు సంతాపకరమగు సంగతిగదా?

ఈ భావమును పోషించుట కొఱకే శాస్త్రి గారు శ్రీనాథుడు సంసార భారము మెండుగా నున్నను సాంసారిక సౌభాగ్యము నంతగా సమభమించిన వాఁడు కానట్టూట్టూ హించి చెప్ప సాహించిరి. ఈ భావ మును పోషించుట కొఱకే యాతని మేలైనయాహారవిహారము లను, ఉద్యానవిహారములను, కస్తూరికా సుగంధాంగ రాగాను లేపన ములను, స్వర్ణ పాత్రభోజనములను, విశాలాలోన్నత కాయమును, భోజన ప్రియత్వమును బ్రంసింపవలసిన వారయిరి.

ఇట్టి దుర్భావకల్పనము చేయుటకు దృఢతరమైన ఋజు భార మును వహిుపవలసి యుండును, చాటున జీకటిలో నేమో యున్న వని పట్టి ప్రగల్భ వాక్యములఁ బ్రచరించుటయే గాని వీరి శృంగార శ్రీనా ధమునం జూపగలిగిన దొక్క చాటు పద్యముదక్క మఱి యొండు గాన రాదు. ఆయ్యదీ శ్రీనాథుడు చెప్పుటకు సాధ్యము కాదని సరిగాగా విమర్శించిచూచిన పక్షమున నాయంశము దేటపడఁగలదు. పంచమాథ్యాయమున నాపద్యమును నుదాహరించి కొంత చర్చ సలిపి యున్నాను గాని యా పద్యము శ్రీనాథుని దగునో కాదో యంతగా జర్చింప లేదు. దానిని సవిస్తరముగా నిచట చర్చింతును.

శాస్త్రీ గారి ప్రమాణ చాటువు.

వీరి శృంగార శ్రీనాధమునం దా చాటు విట్లున్నది,

శా.అక్షయ్యంబగు పొంచ.. (నంబు), రాయని 'తెలుంగాధీశ ! కస్తూరికా బిక్షా దానము సేయుగా ! సుకవిరాడ్బం దారక శ్రేణికిన్", (స్వామికిస్ ) దాక్ష రామ చళుక్య భీమువర గంధర్వాప్సరో భామినీ పక్షోజద్వయ కుంభికుంభముల పై వాసించుఁదద్వాననల్


శాని యాంధ్రలోకమున విశేష వ్యాప్తినిగాంచిన పాఠమీట్లున్నది,

అక్షయ్యంబగు సొంప రాయని తెలంగాదీశ కస్తూరికా,
బిక్షాదానము చేయు రాసుకవి రాడ్బృందారకా శ్రేణికిన్
దాక్షారామ పురీవిహార పర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వ్య కుంభి కుంభముల పై నాసించుఁదద్వాసల్ ,


ఈ పాఠమునకు భిన్నముగా శాస్త్రులవారుదహరించిన పాఠములో శ్రేణికిన్' అను పద్యమునకుఁ బక్కను స్వామికిస్ ! అను కుండ లీకరణమున నుంచబడింది. 'పురీవిహారవర' యను దానికి బదు లుగా చళుక్య భీమవర' యని చేర్పఁబడియున్నది.


ఇయ్యది శ్రీనాథునిదనుట కేమి నిదర్శనమని యడుగుదు మేని ప్రభాకరశాస్త్రి గారిట్టి పద్య మొకటి క్ష ప్రాసముతో కాశీఖండమున నున్నడని మాత్రము చెప్పవత్తురు. ఆపద్యమును గూడ నేనిదివఱకే పంచ అధ్యాయమున నుదహరించి యున్నాను. ఆపద్యము కాశీఖండ ములో నిట్లున్నది.

శా. ఈ క్షోణిన్ని నుఁబోలు సక్కవులేరీ నేటి కాలంబునన్ ,,:
దాక్షారామ చళుక్య భీమువరగంధర్వా స్సురోభామినీ
వక్షోజద్వయ గంధసారతార ఘునృణ ద్వైరాజ్యభారంబున
ధ్యక్షించున్ గవిసార్వభౌమ భవదీయ ప్రౌఢ సాహిత్యముల్ ,

,

రెండునుశార్దూలవృత్తములు, రెటియందును శ' ప్రాసముండుట, వంటియు విశేషించి . దాక్షారామ చళుక్య భీమపర గంధర్వా వ్సరో భామినీ వక్షోజద్వయ” ఆను నంతనఱకు రెంటియందు సుండుట. ఈ కారణముల చేత చాటువద్యముకూడ శ్రీనాథునిదని శాస్త్రిగారి విశ్వాసము.

స్థూలవిముర్శదృష్టితోఁ జూచినప్పు డీ రెండు పద్యములను రచించి నవాడు శ్రీనాథుఁడే నని యనుమానించుట కవకాశము గలదు గాని సూక్ష్మ విమర్శ దృష్టితోఁ జూచినప్పుడు మాత్రము పై చాటు పద్యము శ్రీనాథకవిసార్వభౌను విరచిత మని తోపఁ జేయఁదు. ఎందుకన ఈ పద్యము వీరభ ద్రారెడ్డి తైలోక్యవిజయాభిందంబైన సౌధములో జంద్రశాలాప్రదేశమునందుఁ సచివసేన్యాధీశ సామంత వృపనారసీ నుంతి ణీజు శ్రేణిగొలువ, శాస్త్రంమిమాంసయు, సాహిత్య గోష్ఠి మువిద్వాం సులు విస్త రింపుచుండఁ కర్పూరకస్తూరికాసంకుమదగంధ సార సౌభముదిక్పూరిత మగుచునుండ, నిజభుజా విక్రమ బుచనహ్కి దిశలు గెలిచి తన్ను రాజ్యపీఠ మెక్కించినట్టి యన్న వేమేశ్వరుని యంక మాశ్రయించి, విమల ధర్మశీలుండగు వీరభదనృపాలుండు గన్నులపండువఁ గానిండు గొలు వుండు వేళ నల్లాడ వేమవిభుఁడు తన్ను రప్పించి పలికినట్లుగా గాశీఖండ మున శ్రీనాథకవి విరచితమై గంథస్థమైయున్న యీపద్యమును తమ శృంగార శ్రీనాధమును గంధమున సుదాహరించి దీని భావమును వెల్ల డింపకయె క్ష ప్రాసము తో గాశీఖడమున ఇట్టి వద్య మొకటి యున్న దనిమాత్రము చెప్పి వివరించి వ్యాఖ్యానము సలుపక చల్లగ జారవిడిచి శ్రీనాథుని దగునో కాదో సంశయా స్పదమై యనర్ధ దాయకమైన యా చాటుపద్యమును మాత్ర ముదహరించి యేమేమో పలికి కవి సార్వ భౌముని సపహసించిరిఈ కాశీఖ డములోని పద్యముయ్కొ భాష మే కుని యెంద టెదర పండితులనో సాహితీగోష్ఠి గల వారి నడిగితిగాని యెవ్వకును దృప్తికరముగాఁ జెప్పఁ జాలక పోయిరి కొందఱు ద్వైరాజ్య భారంబనుటకు బదులుగా ద్వై రాజ్య భావంబన వలయుననియు, ద్వైరా జ్య భానంబనఁగా వైరభావంబ నియు అధ్యక్షించున్ ' అగుగా వహించు సనియు సర్ధము చెప్పిరి. ద్యైరాజ్యమనగా వైరమము సర్ధమే నిఘంటు వునఁగలదో చెప్పు జాలరైరి మణికొందఱు రెడుగాజ్యముల యొక్క బరువును బరిపాలించునని యర్ధము చెప్పుచున్నాడు.

ఓ విచ ? వర్తీ ! ఈ నేటికాలమునందీ భూమిలో నీవంటి సత్క- వులు లేరు. నీ సంభంధ మయిన ప్రౌఢ సాహిత్యము (గడి తేఱినట్టియు, ఆ నేక విషయ విజ్ఞానములు గలట్టియు, (పాండిత్యములు,) ద్రాక్షారామ చళుక్య భీమవరములలో నివసింపుచు పాటల యందును, ఆటల యందును నేర్పు గలిగి యున్న వేశ్యా స్త్రీ యొక్క చనుఁగవల యందలి మంచి గంధము, కుంకుమపువ్వు రెండు రాజ్యములయొక్క బరువును బరిపాలించు నని శబ్దార్దము స్ఫురించుచున్నది గాని భావము విస్పష్టముగ స్ఫురింప నందున నీ కాలము నందలి సాహితీ మండితులయిన పండితులకి పభ్రమలు కలుగుటకుఁ గారణముగు చున్నది. ఈ పద్యము యొక్క ... భావమును దెలిసికొనవ లెనన్న నాకాలము నాటి దర్బాల తీరులెట్టివో ఆచారములను, నడవళ్లలోను నేవిదూష్యములో, ఏవిదూష్యములు గావూ, కవిసాంప్రదాయము లెట్టివో కవుల పోకడ లెట్టివో దేవ దాసీ ప్రతిష్టాపన మెట్టిదో స్థాపన మెట్టిదో వీని నెల్లనవ గాహనము జేసికొన్న మీదట సాధ్యపడును గాని స్థూలదృష్టితోఁజూచు నీ కాలపు వారికంతగా బోధ పడదు. కవి హృదయమును గ్రహించిననఁ గాని వ్యాఖ్య లపహాస్య భాజనములగును.


ఎట్లు రాజసభలయందు వేశ్యాస్త్రీల యొక్క వక్షోజద్వ యములందలి గంధ సారఘు స్వణముల యొక్క సౌరభములు సభోంతరాళమున నల్గడల బర్వి సభ్యుల నానందపరవశుల గావించునో యట్లే వాని నతిశయించి కవిసార్వభౌముని ప్రౌడ సాహిత్యములు గూడ సభ్యుల నానందవరవశులఁ జేయునని భావమెగాని యంతకన్న విపరీత భావ మేమియు లేదు, ఇట్లు ప్రొఢముగా ప్రభువుల నభలలో వక్కాణించుట యాకాలమున గౌరవలోపముగా భావింపఁబడకుండుట చేతనే శ్రీనాథ కవిసార్వభౌమడు తన్ను గూర్చి వలికినట్లు ప్రభువు నోటఁ బలికించినాడు.

'కాశీఖండము లోని పర్యమను గాంచి యపభ్రమల పాలయి యౌచిత్య మెఱుంగని కవియెవ్వడో యొక యనామకుండు శ్రీనాథకవి


సార్వభౌముని గేలిచేయుట కొరకో లేక యుపయశస్సు గల్పించుట కోఱకో పై చాటు పద్యమును గల్పించి యుండును. శ్రీనాథ విరచితము కాదనియే నా నిశ్చితాభిప్రాయము. అడిగిన సమయము, అగిన రీతి అడిగిన యెత్తుగడ తృణీకారముఁ జూపుట, పోకిరితనము వెల్వరించుట కౌచిత్య మెఱిగి మాట్లాడక పోవుట, దీని నన్నింటీని బర్యాలోచించి చూడ నాపద్యము శ్రీనాథ వీరచితము గాదని స్పష్టపడగలదు. పాఠ భేదముగూడఁ గలదు ప్రాచీన పొఠమై యాంధ్ర దేశములో వ్యాప్త మై యున్న సుకవి విరాడ్భృందదారక శ్రేణిన్ ' అనునదియే నిజమైన పొఠ మైన యెడల సుకవీ"శేష్ఠులను దేవ తాసమూహమునకు దానము చేయమని అడిగి నట్లున్నదే గాని శ్రీ నాథుడు నామము స్ఫురింప జేసెడి పదజాల మేమియును గానరాదు కనుకనే శృంగార శ్రీనాథ మున . శ్రేణికిన్ ? , అని యున్న ను సరిపడదు కాబోలు స్వామి అని చెప్పబడినది. అప్పుడు సుకవిరాజులను బృందారకులకు, బ్రభువని యర్థమగును గావున నయ్యది శ్రీనాథకవి సౌశ్వభౌమని స్ఫురింప జేయునని తలచి యట్లు చేసి యుండ బోలు అప్పుడు సుకవి రాడ్భృందారస్వామి శ్రీ నాథ భట్టనియె యేల తలుపవల ముము? వామన భట్టు కాగూడదా? డిండిమభట్టు కాఁకూడదాస్తూ, విశ్వేశ్వర భట్టు కాఁగూడదా? వీరెల్లరు గవిసార్వభౌములే గదా! అనియందుమేని కాశీఖండము లోని పద్యములో “ద్రాక్షారామ చళుఖ్య భీమవర గంధర్వోప్సారో పుగో భామినీ పక్షోజద్వయ' అన్నంతవఱకుఁ బాదయంతయు నిందున్నది కావున నియ్యది శ్రీనాథునిదే యని చెప్పవత్తురు. అట్లయిన సుకవిరాడ్బందారక స్వామి నని తన్ను త్కర్షించుకొనడు. దానకర్తయైన యొక మహాప్రభువును భిక్ష దానముఁ జేయరా: యని యేక వచన ప్రయోగముతో నీచముగా సంభోధించునా? కాని అది యును .దానామడుగుచున్నప్పుడా! అడిగెనుబో యాచిత్వమెఱు కుండ

పోకిరితన మచ్చుపడ వక్షోజ సంభి కుంభములపై బ్రాముటగని దెల్పురా ! పోకిరితనమున గడి తేఱిన దుండగీడు సయితము నట్లడుగుటకు వెఱచునే ఇంతకును శ్రీనాథునకు తెలుగు రాయని యాశ్రయమెప్పు డేర్పడినది యనునది సిద్ధాంతమైన, ప్రభాకరశాస్త్రీగారు భీంమఖండ రచనము తరువాత ద్ద్రాక్షారామరామాసరూ యోగము కల్గిన యాపము క్రీ.శ. 1435- 1440 ప్రాంతమున "తెలుంగురాయని యాశ్రమము మేర్పడినదని వ్రాయుచున్నారు, ఆ కాలమునరాజమహేంద్రపురాధీశ్వరులగు నల్లాన వేమారెడ్డి వీరభద్రారెడ్ల యాశ్రయమున నున్నవాడు కాని తెలుంగు రాయని . యశ్రమమున లేడని స్పష్టముగాఁ జెప్పవచ్చును. భీముఖడ రచనము తరువాతనే యోగము శ్రీనాథుకు లభించినట్లుగా వ్రాయుచున్నారు. కనుక రాజమహేంద్ర పురమున 'రెడ్లరాజ్యము నశించిన వెనుకనే తెలురాయని యాశ్రమము మేర్పడి యుండ వలయును. ప్రభాకరశాస్త్రి గారి సిద్ధాకము ప్రకారము 1440 సంవత్సరము నాటికి శ్రీనాథునకు నేబదియైదు సంవత్సరముల వనుస్సుండును. నాయభిప్రాయం ప్రకారము ఆరువది యేండ్ల వయస్సు వార్దకము గాని ప్రౌడనిర్భర వయఃపరిపాక కాలము గాదని శాస్త్రి గారు స్పష్టముగా వక్కాణించినారు. చిన్నారి పొన్నారి చికుతకూకటి నాడు కాదే నూనూగు మీసాల నూత్న యవనము గాదె, ప్రాయమింతకుఁ గై వ్రాలకుండుననీ చె ప్పుకొన్న కాలుముగాదే! వార్ధకము వైఁబడి గడచుచున్న కాలమే! అష్ట కష్టములం బడుచున్న కాలమే! ఇట్టి కాలమున నాద్రాక్షారామాచళుక్య భీమవరగంధ రాప్సరో భామినీవక్షోజవ్వయ కుంభి సంభము లపై శ్రీనాథకవి సార్వభౌముఁడు తద్వాసనల వాసింపఁ జేయుటకై తెలుంగురాయని యాశ్రయించి కస్తూరి గాబి దానము చేయురా యని యడుగుట? ఇంకొక చిత్రము చూడుఁడు. ఈ తెలుంగురాయని చాటుపద్యమును నిలువఁ బెట్టుటకై యెన్నో తికమకలు పడినట్లు గన్పట్టు చున్నది తెలఁగురాయని కొడుకు తిరుమల రాయలు క్రీ.శ 1470 సంవత్సరములలో నూతులపాడున సెలకొల్పిన శాసనమును జతుర్థ ప్రకరణమున బేర్కొనుచు నాతఁడు శ్రీ శ .1470 లో జన్మించెననీయు, అతఁడు పుట్టి వెనుకనే తెలుఁగురాముఁడు మరణించే ననియు, అతని మరణ కాలమునకును శ్రీనాథుని మురణ కాలమునకు నడుమ నాలుగై దేండ్లకంటె నెక్కువ వ్యత్యాస ముండఁజాలదనియు మొదటి ప్రకరణను. లోవక్కాణించుచున్నారు. ఎంత యాభాపసిద్ధాంతము? తెలుగు రాయని యాశ్రయమంత కాలము శ్రీనాథునికున్న యెడల బొడ్డుపల్లెను గొడ్డేలి మోసపోయి యెడ్డ ప్రభువుల చే నేలడ గండ్లు పొందవలసి వచ్చెము? ఇది యంతయు నేలవిచి చేయు పామువలె నున్నది.

శ్రీనాథునకు తెలుగురాయని యాశ్రయ మేకాలమున లభిం చి యుండవలయునో తమకు దామైనను స్థిరపరచుకొని యుండ లేదు.భీముఖండకృతిభర్తయగు నన్న మంత్రి దక్షవాటిక యందుఁ దరుణేందుమౌళికి మొగలివాకిట ధామముమును రచించి కీ.శ.1428.లోశాసనము వ్రాయించిన ధర్మ కార్యము భీముఖండమునఁ బ్రశంసింపబడియుండుటచే భీమఖండ రచనము క్రీ.శ.1428 కి దరువాత నే జరిగెనను విషయము నిశ్చలమైన సిద్ధాంతమనియు భీమ ఖండరచనమునకు దఱువాతనే శ్రీనాథునకు దాక్షరాను రామా సమాయోగము కల్గినదని చెప్పెడు శాస్త్రీగారంతకుఁ బూర్వమే తెలుఁగురాయని యాశ్రమము మనకవి వరేణ్యునకు లభించినదనియు నప్పుడే పై కస్తూరికా బిక్షాదానము చేయు రా, యను చాటుపద్యము చెప్పి యుండునని తలంచుటకునై నను సాధ్యపడదుగదా! సింహాచల శాసనములో కన్న en డదేశమందలి నంబురాయుని కొడుకు తెలుంగు రాయడు అని చెప్పు యుండుట చేత నప్పటికి ఖ్యాతుఁడుగాక తండ్రి చాటు వాఁడనియు నిరువదేండ్లులో పడిన వయస్సు వాడయినట్లు తలుపవలయునని దృఢముగా విశ్వసించెడు ప్రభాకరశాస్త్రి గారు --


44. ధాటీ ఘోట ఘట్ట ఘట్టన మిళ ద్రాఘిష్ట కళ్యాణ ఘం
టాటంకార విలుంఠలుండిత మహోన్మత్తా హితకోణీ భృ
త్కోటీ'రాంకిత కుంభినీ ధరసము త్కూటాటవీ ఝూట క
ర్ణాటాంద్రాధిప! సాంప (సం] రాయని తెలుంగా! నీకు బహ్మా[దీర్ఘా]యునౌ


ఆసు పద్యమును జెప్పి శ్రీనాథుఁడు 'తెలుంగు రాయని దీవించిన వాఁడని యెట్లు చెప్పెసాహసింతురు ? అదియును గాక అశ్వారూఢుఁ డయి యయుద్దోన్ముఖుడై యున్న వాని నట్లు దీవించిన తరువాత ,కస్తూ రికా భిక్ష దానంబు సేయురా దాక్షారామ చళుక్య భీమవర గంధ ర్వాప్సరో భామినీ నక్షోజద్వయ . కుంభి కుంభముల పై వాసించు త ద్వాసవల్ అని ప్రశంసించు ? అహహా ! ఎటువంటి సమయము దొరకినది. ఇట్టి శాస్త్రిగారి విశ్వాసమును వివేకులెట్లు విశ్వసింపగలరు? రాచవేముని యనంతరము ప్రౌఢదేవరాయని పక్షమున నుండి కొండ వీటి సామాజ్యమును జయించి పాలించిన వారిలో నీ తెలుంగురాయని మొదట పేర్కొన వలసి యుండును. అందుచేత యాఅతని కర్ణాటాంద్రాదిప యని కవి సంభోదించు చున్నాడని తలంపవలయును. కనుక తెలుగు రాయని యాశ్రమము లభించిన మాట వాస్తవమే యగునేని నయ్యది క్రీ.శ.1420- 1426 సంవత్సరముల నడిమి కాలమయియుండును. అప్పటికి శ్రీ నాథుఁడు రాజను హేంద్రపురమునకు వచ్చి యుండ లేదు ప్రభాకరశాస్త్రిగారు తలంచి నట్లు శ్రీనాథునకు దాక్షా రామ రామసమాయోగము కల్గినదని తలంచుటకును సాధ్యముగాదు. కావున నీ రెండవ చాటుపద్యము శ్రీనాథుడు చెప్పినదేయని విశ్వసిచుట సాథ్యముగాదు. పయినుడివిన హేతువు లచేత ' (అక్ష్మయ్యుంబుగ) అను చాటు పద్యము శ్రీ నాథ విరచితము గాదని నేను దృఢముగా - నమ్ముకున్నాను.

వీథీ నాటకము


ఇందును , గూర్చి ప్రభాకర శాస్త్రి గారిట్లు వ్రాయుచున్నారు.


... శ్రీనాథకృతములును దదితర కృతములును నగు చాటుపద్య కొన్నింటిని జేర్చియచ్చు వచ్చిన తరువాత గొందఱు శ్రీనాథుని వీధినాటక' మను పేర నొక గ్రంథమును ముద్రించుచు పద్యసముదాయము ప్రాంతవ్రాత ప్రతు లలో గానరాదు. అట్టి పద్యములఁ గొన్నంటినీ జూటు వద్య మణిమంజరిలో నేను సంధానించినాఁడను శ్రీనాథుని వీధి నాటక మందలి పద్యంములు కొన్ని పబు పద్యసము దాయమునఁ జేరిన ననవచ్చును. కాని యూపద్య సముదాయమే శ్రీనాథుం వీథినాటకమనుట సరిగాదనినేను దలంచుచున్నాఁడను."

ఇట్టి ప్రభాకరశాస్త్రి గారి యభిప్రాయము తో నేను కూడా నేకీ భవించుచున్నాను గాని యిందేవి శ్రీ నాథునివో యేవి కావో నిర్ధారణ సేయుకుండ : శ్రీనాథుని శృంగారప్రవర్తన మిట్టిదని ప్రభాక రశాస్త్రి గారి వలే నా కవిసార్వభౌముని దూషించుట తగదని మాత్రము నేను చెప్పవత్తును.

శ్రీడాభిరామమే నిజమైన వీధి నాటక మనియు, అది శ్రీ నాథ విరచిత మే గాని వల్ల భామాత్య విరచితము గాదని శాస్త్రి గారి ధృఢ తరమైన యభిప్రాయము. ఇందున గూర్చియు మూడు పద్దతులు శాస్త్రి గారితో . నేనేకీభవింతును గాని యిది యాధార్థముగా , ధీసికొని శ్రీనాథునికి దుష్ప్రవర్తన యారోపించుటకు మాత్రము నామన సొల్లున్నది.

ఈ గ్రంధమునకుఁ బ్రతసపరుద్రుని కాలమున నున్న రావిపాటి త్రిపురాంతకుడను అప్ప రాజుచే సృస్కృతమున రచియింపఁ బడినప్రేమాభిదాభి రాము' మను గ్రంథము మూలమై యున్నది. దాని భాషాంతరీకరణ మిది యని యందు బేర్కొనఁబడినది. ఆ మూల గ్రంధమునేడు గాన రాదు, ఇన్యుది పదర్శనాను కూలనుగు నాటకముగా భాపాంతరీకరణింప బడక యేకాశ్వాసపు ప్రబంధముగా దెలిగింపఁబడినది. కావుననే యే వర్ణవము అధికముగ నున్న బ్రా, ఏయే వర్ణనములు భిన్న ములుగ నున్నవో తెలిసికొనుట కవకాశము లేదు, 'వీథి 'యనునది దశరూపములో నోకటియైన చిన్న నాటకము. ఒకరు గాని యిద్దకు గాని విలాసపురుషులను నాయకులు శృంగార విహారాసక్తులై యేదేని నొక నగరమునందును దప్పరిసర ప్రాంత ప్రదేశములందను సుచరింపుచు నందందుఁ గన్పట్టుచుండిన యాటపాటలను, ఉత్సవాది వినోదములను, కేళీవిశేషములను వీక్షించి సంతోష సాగరమునఁదేలుచు శృంర భోగ పరాయణులై వేశ్యావాకికాపరిభ్రమణమునకామాసక్త చిత్తులై యారాత్రి గడపి మరునాడు తనుదారెని పోవుచుందురు, ఇట్టి నాటికలకు 'వీథి ' యని మన పండితులు పేర్వెట్టిరి.ఇట్టివి సంస్కృతమునఁ బెక్కులు రచింపఁబడినవి. వానివలెనె రావిపాటితిప్పరాజు : ప్రేమాభిరామమును రచియించెను అయ్యది శ్రీడాభి రాముకును పేరితో దెలిగింపఁబడి వల్ల భామాత్య విరచితమై నట్టుగ వెలసి యున్నది. ఎంతకొట్టు మిట్టాడినను దీనికిని శ్రీనాథునకును గల సంబంధమును దొలగించుటకు సాధ్యము కాదు. తను కాలము నందు వీరేశలింగము పంతులు గారు వేశ్యాభుజంగులగు విద్యాధికులను గూర్చి తమ ప్రహసనములలో " తీవ్రముగఁ బరిహసించిన రీతినే యేనూజు సంవత్సరముల కిందట వల్ల భామాత్యుఁడు , గానిండు శ్రీనాథుఁడు గానిండు, ఎవరైన నేమి శిష్టాచార సంపత్తిలో నగ్ర స్థాన ste

జమునఁ దగిన

మలంకరించిన విద్యాధికుడగు గోవిందయంచన శర్మను వాని సఖుడగు టిట్టిభ సెట్టిని నెత్తికొని భావగర్భితము సభివర్ణించి యెక్కువగా నపహసించి యుండుట నిజము. ఇందలి శృంగార రసము నీచమైనది, అశ్లీలమైనది. నీతి బాహ్యమైనది. స్త్రీలుసు, బాలురును జదువ దగిన గ్రంథము గాదు. కాని యీ గ్రంథ మాకాలము నాఁటి సాంఘిక చరిత్రమునకు

గొంతవఱకు విలువయైన వస్తు వస్తుసముదాయము నొసం

గుచున్నది. ఈ గ్రంధమును జదువు సప్పుకప్పటి సంఘస్థి యెట్లుం డెనో దాని స్వరూపము ముస కన్నులకు గోచరించు నట్లు కావ్వరూ పమున నంభివర్ణింపఁబడినది.


అందలి కథా సారము


ఒక నాడు కాసల్మాటి గోవిందమంచనశర్మ యను శోత్రియు బాహ్మణుడును, వాని చిఱుత కూకటి నాటి చెలికాడగు టిట్టిభ సెట్టియను కోమటియ, 'ఆంధ్రనగర 'మును నాంమాంతరముగల యోరుగల్లు నగర నీధులలో విలాసార్దము విహరించి యచట గోచరమగు వినోద ములను, క్రీడలను, ఆటపాటలను శ్రవనాసందకరముగఁజూచి యాసందించుటకై ప్రభాత వేళ నొక శుభ ముహూర్తమున బయలు దేఱును,

తొలుత ఏకశిలానగర వరిసరముననున్న వెలిపాళెమునం బ్రవేశించి యచటనున్న మేదర సానిని దర్వాత మొక చండాల యువతిని నాపిమ్మట నొక కర్ణాటాంగనసు వారు వీక్షించి శృంగార పరపశులై మోహావిభ్రాంతిఁ జెంది యటుపిమ్ముట నొక కొంతదప్వు మేర నొక కాపుపనితను, కర్ణాట వేశ్యను జూచుట తటస్థించెను. ఇట్లు వీరిని వీక్షించి పరమోల్లాసముననుండ సంపెంగనూనె నమ్ముచున్న యొక పడతి వారికంట బడుటయు నామె మేని యందము గాంచి యామె నట్టి దానిగా సృజించిన విధాతను దూఱుచు మోహరివాడలోఁ బ్రవేశించు టకై యగడ్తడను గడచి పైడితల్పులు బిగించిన వంక దారిగుండ' రాజ మార్గముఁ బ్రవేశించిరి, వారణఘటా ఘోట శకటి కాళటకోటిసంకు లంబుగా నుండెకి యారాజు మార్గమునఁబోవుట ప్రియముగానందున నటుపోపుటవలనఁ బ్రయోజనము లేదని క్రంతశ్రీవల కలక లంబులు లేక సుఖవినోదములు గలుగునుగాన సందు దారులఁ బ్రోవుట సుఖకరముగా నుండునని యామార్గమును బట్టి జనిరి. అట్లు కొంత దూరమగునప్పటికి వారికన్నులు ముందు వల్నాటివీరుల కథనమును బాడుచున్న యాట కాండ్రపాటలఁ గొంత సేపాలకించి మెచ్చుకొని ముందుకు సాగి పోవ నేక వీరా దేవి గుడియును మాహురమ్మ గుడి యును, గస్నుల తనివితీఱు దేవతల యత్సవాదులను దిలకించి జక్కులవారు, మైలార భటులు మొదలగువారు చేయు జాతరలను వీక్షించి, చమడేశ్వరీ యాలయముసు బౌద్ధవిహారమును, ముద్దరాలుముసానమ్ము నివాసమును, కుమారస్వా మివసతిని, పాండవులగుడిని, కర్తారుని మశీదును, మున్నగు దేవాఅయతన ములను పలక్షించి, తరుహత నెదుటఁ గన్పట్టిన స్వయంభూ కేశవస్వా ములకుఁ జేతులు జోడించి దండములు పెట్టి మహా భైర వేశ్వర స్వామికి సమస్కరించి నల్లడలం దేఱిపాఱ జూచుచుండ నాంద్ర చక్రవర్తి మొగసాల నైనున్న గడియారవనం వదునాఱుఘడియలుగా చక్రపర్తి, మొగసాల వై నున్న గడి రూరము పదునాఱుముడియలు గొట్టుట వినిపించెను.ఆఘంటధ్వనులు చెవినిబడినతోడనే మధ్యాహ్నమైనదని యూకలిగొన్న వారగుటచేఁ బూటకూటింటికిఁబోవఁ ద్వరపడుచు బ్రాహ్మణ వాడకుఁ బోయి లక్ష్మణ యొజ్జలయింట నొక్కొక్క రూక నొసఁగి మృష్టాన్నమును భుజించిరి. ఆయింటనున్న వితంతువు యొక్క పరిచయమును సంపాదించుకొని మరల పురమార్గములఁబట్టిరి. తరు వాతే వారిరువురును పువ్వులమ్ము నంగడికిఁబోయి యచటి , పుష్పలావి కల ప్రౌడవచో విలాసముల నాకర్ణింపుచు వేశ్యవాటికం బ్రవేశించి యచట నొక యుత్సవంపు కలకలము వీక్షించి యయ్యది. 'ప్రతాపరు ముగా నెఱింగి యచటి రిగి\

ద్రమహా రాజుగారి యుంపుడు కత్తెయగు మాచల్డేవియను వేశ్యాంగన చిత్రశాలా ప్రవేశముఁ గావించుచుఁ జేయునట్టి పుణ్యాహవచన సమయముగా కొంత కాలమచట నిలిచి యామహారాజులాలించు నాకళావతిని సందర్శించి కొంత తడవు సుచిత్ర సంభాషణ బులుసలిపి మంచనశర్మడగు పూర్వపువారాంగన యుగు గాంధారిగన్పట్లగా నామె కడ గొంత తడవు విశ్రమించి మరల బయలు దేఱి నాగసర్వమునఁ బాడుచున్న నాగుల వానిని 'మెచ్చికొనుచు నటుపిమ్మట పొట్టే ళ్ళపందెములను, గోడిపందెములను గాంచి సంతోషమును జెందుచు నా వెనుక నావిట శేఖరుసకుఁ బ్రియులగు కామమంజరి గృహముఁ బ్రవేశించి యాఱేయి యచట యధేచ్ఛముగా గడపి గడపి తరువాత తమ మార్గమునం బోయిరి.


ఈగ్రంథమంతయుఁ గ్రీడా విషయములతో నిండియున్నది. జన సామాన్యము యొక్క సంఘజీవిత మంతయును మహానగరములలోను, మహాపట్టణములలోను. ప్రాయకముగా విశాలమై గంపట్టుచుండును , ఇట్లు నానావిధ జాతుల యొక్కయు, మతముల యొక్కయు, వర్ణముల యొక్కయు, నిమ్నోన్నతావస్థలును, సుగుణ దుర్గుణరూప భేదములు, శీల భేదము లను అవస్థా భేదములును మహానగరములలో నొకేస్థానమున నొకేకాలమునఁ జూచుట కెక్కువయవకాశ ముండును. ఈవివిధ రూవమానవ ప్రకృతిఁజూచిన ప్రతిమానవునకుఁ గొంత సంతోషముగలుగక మానదు,


సమర్ణుఁ డైనకవి యట్టి వివిధ మానవ ప్రవృత్త ములనురీతిని కవన రూపమున వర్ణించి తానానందము " ననుభవించుట యేగాక లోకము కొఱకు తన కాలసాంఘిక స్థితిని - దర్పణమ నఁజూపినట్లు చూపి యానందింపఁ జేయును. ఇట్టికవులు - సకల దేశములయందును' గలరు, ఎల్లకాలముల యందును గలరు: ఇట్టి గ్రంథము. లఖిల భాషలలోను