నాగార్జున కొండ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాగార్జున కొండ


రచయిత:

మారేమండ రామారావు, యం ఏ , పిహెచ్ డి.

చరితాచార్యుడు - నిజాంకళాశాల

ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

నాగార్జున కొండ.pdf

అజంతా ప్రచురణ

________________

mannel పీఠిక బుద్ధభగవానుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యముళ బోధిసత్వ నాగార్జునుడు నివసించిన శ్రీపర్వతమూ, కళాపిపాసులు సమ్యక్సంబుద్దపాదభక్తులూ అయిన ఇక్ష్వాకు రాజపుత్రికలు తయా చేయించిన లోకోత్తరశిల్పాలూ, ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని ఆయి: విజయపురీ గల నాగార్జునకొండలోయ ఆంధ్రులందరికీ పుణ్యస్థల 1828 నుంచీ యిక్కడ జరుగుతూన్న ఖననపరిశోధనకి ఫలితం ఇక్కడ ఎన్నో అద్భుతములైన అవశేషాలు వెలికి వస్తున్నాయి. నాగార్జునసాగరకట్ట నిర్మాణం పూర్తి అవడంతో ఈలో యావత్తూ కృష్ణాజలంలో లీనం అయిపోతుంది. ఆ మీద ఈ పుణ్యస్థల "కలలోని వార్త" అయిపోతుంది. ఈలోగానే ఇక్కడికి యాత్ర చే ఈ పుణ్యస్థలాన్ని దర్శించి ఆంధ్రులంతా తమ విధిని నిర్వహించాలి ఈ లోయ విగురించిన వివరాలు ప్రభుత్వంవారి ప్రచురణలతీ ఉన్నవి. అవి సామాన్యులకి అందుబాటులో లేవు. ఈ పుణ్యక్షేత్రాని చూడబోయేవారి ఉపయోగార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. దీనికి నాగార్జునకొండ ప్రాముఖ్యం సంగ్రహంగా చెప్పబడింది. ఇక్క శిల్పాల ఫొటోలు కొన్ని పుస్తకం చివర వేయబడినవి మిగతవి ఎక్కఅభిప్రాయో సూచించబడింది. ఈ గ్రంథం విషయమై ఆసక్తి చూపి, దీనిని చక్కగా ముద్రించి ఆజంతా ప్రచురణాధిపతులకు నా కృతజ్ఞత. ఈ పుస్తకం ఆంధ్రలోకం యొక్క ఆదరాభిమానాలని పొం! ముందని నేను ఆశిస్తున్నాను. హైదరాబాదు) మారేమండ రామారావు 11.J211056 సుప్రసిద్ధమైన బౌద్ధతీర్థం ఒకటి ఉండేది. ఇక్కడ అంతకుపూర్వమే బుద్ధుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచైత్యం ఉండేది. అది ఖిలం అయిపోతే ఇక్ష్వాకు రాజులకాలంలో దానిని జీర్ణోద్ధారం చేసి, దానికి చక్కని శిల్పాలుగల చలవరాతి పలకలు మలిచారు. చైనా, సింహళం మొదలయిన దూరదేశాలనించి అనేకమంది బౌద్దులు ఇక్కడి తీర్థాన్ని దర్శించడానికని యాత్రలు చేశారు.

ఈ విధంగా చెట్లు చేమలతోటీ, వన్యమృగాలతోటీ భయంక రంగా ఉంటూ వచ్చిన ఈ నాగార్జునకొండలోయ ఒక్కసారిగా తన పూర్వవైభవాన్ని బయలుపరచింది. ఇక్కడికి దగ్గరలోనే నంది కొండవద్ద ప్రభుత్వంవారు కృష్ణకి అడ్డంగా ఒక కట్ట నిర్మిస్తు న్నారు. దీనికి ఫలితంగా కృష్ణ నీరు పైకి ఎగతన్ని నాగార్జునకొండ, లోయ యావత్తునూ ముంచివేస్తుంది. అందుకని ప్రభుత్వంవారు ఈలోయ అంతటా ఖననపరిశోధన సాగించి ఇక్కడి ప్రాచీ నావ శేషములనన్నిటినీ బయటికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 నాగార్జునుడు, నాగార్జున కొండ

ఈ నాగార్జునకొండలోయలో కృష్ణ ఒడ్డున నాగార్జునకొండ అనే పేరుగల పెద్దకొండ ఒకటి ఉన్నది. ఈ కొండకి ఈ పేరు నాగార్జునుడనే వ్యక్తినిబట్టి వచ్చి ఉంటుంది. ఈ కొండకి ఈ పేరు చిరకాలంనించీ ఉంటూ వస్తున్నది. అందువల్ల నాగార్జునుడి సంబంధాన్ని గురించి ఇక్కడ సంగ్రహంగా చెప్పడం ఉచితం. బౌద్ధుల వాజ్మయంలోనూ, గాథలలోనూ నాగార్జునుడి పేరు తరుచుగా కనిపిస్తుంది. ఈ ప్రశంస చైనా, టిబెటు దేశాలలో ఎక్కువగా ఉన్నది. నాగార్జునుడనే పేరుగల వ్యక్తులు ఇద్దరు ఉండేవారు. అందులో ఒక నాగార్జునుడు క్రీ. శ. 2వ శతాబ్దిలో ఆంధ్రసాతవాహనచక్రవర్తి అయిన యజ్ఞశ్రీ సొతకర్ణి సమకాలి కుడుగా వుండేవాడు. రెండవ నాగార్జునుడు క్రీ. శ. 6వ శతాబ్దిలో ఉండేవాడు. ఇద్దరూ ఆంధ్రదేశంలో బౌద్ధమత ప్రచారం చేశారు మొదటి నాగార్జునుడు నాగార్జున జోధిసత్వుడనీ, నాగార్జున పూస అనీ చాలా ప్రసిద్ధి కెక్కాడు. విదేశాలలో ఈ మహా నీయుడు బుద్ధుడి తరువాత మళ్ళీ అంతటి వాడని కీర్తి చెందాడు టిటెటు దేశంలోని ఒక గాథననుసరించి ఇతడు శ్రీపర్వతముమీద నివసించినట్లు తెలియవస్తుంది. ఈ శ్రీపర్వతమనే పేరు నాగార్జుని కొండకి వర్తిస్తుంది. అందువల్ల నాగార్జున బోధిసత్వుడు ఈ కొండమీద నివసించడంవల్లనే ఈ కొండకి నాగార్జునకొండ అనే పేరు వచ్చింది అని నిర్ణయించవచ్చును.

ఈ నాగార్జునుడు విదర్భ దేశంలో జన్మించిన బ్రాహ్మణుడు. మహా మేధావి అయిన ఇతడు బాల్యంలోనే సర్వశాస్త్రములను అభ్యసించి, హేతువిద్యలోనూ, ఇంద్రజాలంలోనూ నిపుణుడు ఆయాడు. యౌవనంలోనే సన్యసించి ఇతడు దేశాటనం చేశాడు. హిమాలయాలలో ఒక ముసలి భిక్షువువద్ద ఇతడు ఎన్నో మహా యాన బౌద్ధమత గ్రంథాలని చూచి, వాటి సారం గ్రహించాడు. అమీద నాగార్జునుడు సింహళద్వీపానికి పోయి అక్కడనించి మరి కొన్ని గ్రంథాలు తెచ్చాడు. వీటిలో చాలా గ్రంథాలమీద ఇతడు చక్కని వ్యాఖ్యానాలు వ్రాసి మహాయానమతం అందరికీ తెలిసే టట్టు చేశాడు. ఆమీద ఈ మహనీయుడు తన పాండిత్యాన్ని, ఉపజ్ఞనీ తోడుచేసుకొని మాధ్యమికవాదమూ, శూన్యవాదమూ అనే క్రొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించి, ప్రచారం చేశాడు. అనేక మంది శిష్యులూ, ప్రశిష్యులూ ఈ సిద్ధాంతాలని దేశమంతా ప్రచారం వేశారు. ఈ ఆచార్యుడు వ్యాఖ్యానములుకాక 24 స్వతంత్ర గంథాలు వ్రాశాడు. నాగార్జునుడు కొంతకాలం కుషాను రాజైన హువిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. అమీద విదర్భలో ఒక సంఘారామంలో ఇంతకాలం నివసించాడు. చివరకి కృష్ణాతీరాన వున్న శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీది విహారంలో జీవిత శేషం గడిపాడు. ఈ బౌద్ధాచార్యుడు భార దేశపు తాత్త్వికులలో అగ్రశ్రేణికి చెందినవాడు. ఇతడు వైద్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించి సుశ్రుతమనే ఆయుర్వేద గ్రంధానికి వ్యాఖ్యానం వ్రాశాడు. ఇతనికి రసాయనశాస్త్రంలో చక్కని ప్రవేశం ఉండేది స్వర్ణ యోగం కని పెట్టి ఇతడు రాళ్ళను బంగారంగా మార్చాడట !

' యజ్ఞశ్రీ చక్రవర్తి ధాన్యకటకం (అమరావతి) లోనూ, బోధిసత్వ నాగార్జునుడు శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీదనూ నివ సిస్తూ, ఇద్దరూ మిత్రులై చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఈ బౌద్ధాచార్యుడి ప్రేరణవల్లనే జగత్ప్రసిద్ధమైన అమరావతీ మహా చైత్యానికి లోకోత్తరమురైన శిల్పములతో అలంకరింపబడిన ప్రాకారం నిర్మించబడింది.

ఈ విధంగా శ్రీపర్వతంమీద నివసించి బోధిసత్వ నాగార్జునుడు నాగార్జునకొండలోయనీ, యావదాంధ్రదేశాన్ని కూడా పవిత్రం చేశాడు.

ఇక్ష్వాకు రాజులు

క్రీ శ 3వ శతాబ్దిలో నాగార్జునకొండలోయలోని విజయపురి రాజధానిగా సుమారు ఏభై సంవత్సరాలకాలం దక్షిణాపధ ప్రాగ్భాగాన్ని ఇక్ష్వాకువంశీకులైన రాజులు పరిపాలించి ప్రఖ్యాతులైనారు. వీరి పరిపాలనాకాలం ఆంధ్రదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. పురాణములలో ప్రాచీన రాజవంశముల ప్రశంస ఉన్నది. వాటిలో ఆయా రాజవంశముల పేర్లు, వంశముల క్రమమూ, ఆ వంశాలలోని రాజుల పేర్లూ, వారి పరిపాలనాపరిమితీ మొదలయిన అంశాలు ఉన్నవి ఇందులో ఆంధ్రరాజుల ప్రశంసకూడా ఉన్నది. ఈ ఆంధ్రరాజులే సాతవాహనరాజులు. ఈ ఆంధ్రసాత వాహనవంశంలో ముప్పయిమంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినతర్వాత క్రీ. శ. 218 ప్రాంతంలో వారి సామ్రాజ్యం అంతరించింది. ఆతర్వాత మరి 50, 60 సంవత్సరముల కాలం అనేక రాజవంశములవారు సమకాలికులుగా పరిపాలించారు. ఇందులో కొందరు సాతవాహనుల కాలంనించీ ఉంటూ వచ్చారు. ఇట్లాంటి వారిలో ఆంధ్రభృత్యులూ, శ్రీపర్వతీయులూ ముఖ్యులు. ఈ రెండువంశాలవారూ ఆంధ్రులలోనివారే అని పురాణములలో చెప్పబడిఉన్నది. పురాణములలోని శ్రీపర్వతీయులే, శాసనముల వల్ల తెలియవచ్చే ఇక్ష్వాకువంశీయులని చరిత్రకారులు నిర్ణ యించారు.

ఇక్ష్వాకువంశం చాలా ప్రాచీనమైనది. వేదవాజ్మయం లోనూ, పురాణములలోనూ ఈ వంశం ప్రశంస ఉన్నది. ఈ వంశపు రాజులు అయోధ్యా, మిథిలా, వైశాలీలవంటి కేంద్రాల నించి రాజ్యం చేశారు. ఈ వంశీకులు అనేకమంది దక్షిణాపథానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడి కొన్ని రాజ్యాలు స్థాపించుకున్నారు. వీరిలో కొందరు ఆంధ్రులలో కలిసిపోయి, క్రమక్రమంగా దక్షిణంగా వ్యాపించి, సాతవాహనసామ్రాజ్యం వైభవంగా సాగుతూన్న కాలంలో నాగార్జునకొండప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ. శ. 2వ శతాబ్దిలో ఈ వంశీకులలో కొందరు ప్రబలులై సాతవాహన చక్రవర్తులకు మహాతలవరు లనే పేర సామంతులుగా ఉండేవారు, క్రీ. శ. మొదటి పాదాంత్యంలో సాతవాహన సామ్రాజ్యం క్షీణించింది. నాలుగవ పులోమావి అనే రాజు మరణించడంలో అది అంతరించింది. ఆమీద సామంతులు స్వతంత్రులయారు. రాజవంశం యొక్క వివిధశాఖలవారు ఎక్కడివారు అక్కడ స్వతంత్రులై. ఎవరికి దొరికిన భూమిని వారు ఆక్రమించి స్వతంత్రంగా పాలిస్తూ వచ్చారు. ఈ సమయంలో వాసిష్ఠీపుత్ర చాంత మూలుడనే ఇక్ష్వాకు వంశీయుడు విజృంభించాడు. సామంతమండలీకులు కొంత మందిని కూడగట్టుకుని ఇతడు దిగ్విజయం ప్రారంభించి, మిగిలివున్న సాతవాహన వంశీయులందరినీ జయించి స్వతంత్ర రాజ్యస్థాపన చేశాడు. ఇక్ష్వాకువంశంలో నలుగురు రాజులు స్వతంత్రులుగా పరి పాలన చేశారు. వారిలో మహారాజ వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు మొదటివాడు. ఇతనిని మొదటి చాంతమూలుడనికూడా వ్యవహ రిస్తారు. ఇతనికి చాంతిశ్రీ, హమ్మశ్రీ అని యిద్దరు సోదరీలు ఉండేవారు. ఈ రాజు భార్య మాఢరీదేవి. మొదటి చాంతమూలుడికి మహారాజ శ్రీవీరపురుష దత్తుడనే కుమారుడు, అడవి చాంతిశ్రీ అనే కుమార్తె ఉండేవారు. ఇందులో పురుషదత్తుడు ఉజ్జయినీ రాజపుత్రిక అయిన రుద్రధర భట్టారికను, భటిదేవను, తన మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహం చేసుకున్నాడు. ఇతనికి మహారాజ ఏహువుల చాంతమూలుడనే కుమారుడూ కొడబలిశ్రీ అనే కుమార్తె వుండేవారు. వీరిలో కొడబలిశ్రీ వన వాసిమహారాజును వివాహం చేసుకున్నది. ఇక్ష్వాకుల ఆడపడుచులు కొందరు ధనకులు, పూగియులు అనే తెగలవారికి కోడళ్లుగా వెళ్లారు. ఇక్ష్వాకువంశంలోని కడపటిరాజు శ్రీరుళుపురుషదత్తుడు.

ఇక్ష్వాకు వంశీయులు 100 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను, 52 లేక 50 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను పురాణములలో చెప్పబడి ఉన్నది. ఈ రెండు కాలపరి మితులూ సరియైనవే కావచ్చును. ఈ రాజుల శాసనములను బట్టి వీరు 35 సంవత్సరములైనా పరిపాలించినట్లు తెలుస్తూంది. మొదటి చాంతమూలుడు ఎంతకాలం ఏలినదీ సరిగా తెలియదు. (అతడు 16, 17 ఏళ్ళు పాలించి ఉండవచ్చును. ఇక మిగిలిన 50 సంవత్సరములూ ఇక్ష్వాకులు సాతవాహనులకు సామంతులై మహా తలవరులుగా ఏలినకాలం కావచ్చును మొదటి చాంతమూలుడు క్రీ శ. 218_285 నడుమ, వీరపురుషదత్తుడు క్రీ శ. 235_255 నడుమ, రెండవ చాంతమూలుడు 255_266 నడుమ, రుళపురుష దత్తుడు 268_270 నడుమ పరిపాలించినట్లు నిర్ణయించవచ్చును.

మొదటి చాంత మూలమహారాజు : ఇతడు మహావైభవంతో పరిపాలన చేసిన ప్రతిభాశాలి. ఇతడు అశ్వ మేధాగ్నిష్టోమ వాజ పేయాగ్నిహోత్రము లనే యజ్ఞములను చేశాడు. అనేక కోటి గోదానములను' హిరణ్యహలశతసహస్రదానములను చేశాడు. " ఇతడు అప్రతిహత సంకల్పుడు. మహాసేనుడనే కుమారస్వామి భకుడు. అశ్వమేధయాగం చేయడం చాలా కష్టసాధ్యం అయిన పని. అనేకమంది రాజులు తన అధికారానికి తలలొగ్గిన పరాక్రమశాలిగాని ఈ యజ్ఞం చెయ్యలేదు. అలాగే వాజపేయ యాగం చేయడానికి ఎంతో అర్థబలం, అంగబలం కావాలి. ఈ యజ్ఞములు చేసి చాంతమూలుడు సమ్రాట్ సార్వభౌమ బిరుదులను వహించాడు. నాగార్జునకొండలో దొరికిన ఒక స్తంభంమీద ఈ మహా రాజు హిరణ్యదానంచెయ్యడం యజ్ఞములు చేసినతర్వాత ఊరేగడం శిల్పించబడినవి. ఇతని రాజ్యం పశ్చిమోత్తరంగా ఉజ్జయినీ పాలకులయిన శకక్షాత్రపుల రాజ్యం వరకూ, దక్షిణ పశ్చిమాన వనవాసీపాలకు లైన ఆంధ్రభృత్యుల రాజ్యంవరకూ వ్యాపించి ఉండేవి. చాంతమూలుడు మంచి రాజనీతి చతురుడు. ఇతడు తన సోదరి చాంతిశ్రీని పూగియులనే తెగకు చెందిన స్కందశ్రీ, తన కూతురు అడవిచాంతి శ్రీని ధనకులనే తెగకు చెందిన స్కంద . పుట:నాగార్జున కొండ.pdf/17 పుట:నాగార్జున కొండ.pdf/18 పుట:నాగార్జున కొండ.pdf/19 పుట:నాగార్జున కొండ.pdf/20 పుట:నాగార్జున కొండ.pdf/21 పుట:నాగార్జున కొండ.pdf/22 పుట:నాగార్జున కొండ.pdf/23 పుట:నాగార్జున కొండ.pdf/24 పుట:నాగార్జున కొండ.pdf/25 పుట:నాగార్జున కొండ.pdf/26 పుట:నాగార్జున కొండ.pdf/27 పుట:నాగార్జున కొండ.pdf/28 పుట:నాగార్జున కొండ.pdf/29 పుట:నాగార్జున కొండ.pdf/30 పుట:నాగార్జున కొండ.pdf/31

అతిముఖ్యమైన నాగార్జునకొండలోయ కృష్ణా గర్భంలో లీనమయి పోతూంది. బుద్ధభగవానుడి ధాతువుమీద కట్టబడిన పవిత్రమహా చైత్యం మనకి కనుపించదు. బోధిసత్వ నాగార్జునుడి విద్యాపీఠం కనుమరుగై పోతుంది. ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధానిగా కీర్తి చెందిన విజయపురి అదృశ్యమైపోతుంది. ఈ పవిత్రనిర్మాణాలూ, స్థలాలూ భావుకులైన వారి హృదయఫలకాలమీదనూ, మనో వీధులలోనూ మాత్రం నీలిచి వుంటాయి.

నాగార్జున కొండ.pdf
పుట:నాగార్జున కొండ.pdf/33 పుట:నాగార్జున కొండ.pdf/34 పుట:నాగార్జున కొండ.pdf/35