Jump to content

విజయనగర సామ్రాజ్యము

వికీసోర్స్ నుండి

-

(1) దేశాభివృద్ధికి భాషాభివృద్ధి గొప్ప సాధనము. దేశములోని గ్రంథ సంగ్రహంబును వార్తాపత్రికలును నేదోయొక దైవిక కారణముచే, నేఁడు లేకుండనయ్యె నేని ఆ దేశము తన యాదిమ యుగములోని య నాగరికకు దిగునని చెప్పుట యతిశయోక్తి గానేరదు. దేశమునందలి వా వాజ్మయము ఆ దేశమునకు మేలుగాని కీడు గాని కలుగఁజేయఁగల యొక నిరంకుశాధికారి, యని చెప్పవచ్చును. ఇట్టి శక్తిగల వాజ్మకుమున దగిన గ్రంథములు లేని భాష.. శిశువులవచ్చి రాని పలుకులవంటి దై వ్యవహారమునకును జ్ఞానసంపాదనమునకు .పనికి రాకుండును.

(2) ఈ యు దేశమును మనము నందిడుకొని మేము దేశ చరిత్రలను, ప్రకృతి శాస్త్రములను, వ్యక్తి చరిత్రలను, చరిత్రవిషయక నవలలను, నీతిబోధక గ్రంధములను ప్రచురింప సమక ట్టితిమి. ఆ ప్రకారము విజ్ఞానచంద్రికా గ్రంథ మాల ఇప్పటికి 27 గ్రంథములు ప్రచురితము లైనవి. అందు 14 ప్రకృతిశాస్త్ర ములు, 5 దేశ చరిత్రలు, 4 వ్యక్తి చరిత్రలు, 4 నవలలు. ఇవియన్ని యుతజ్ఞులగు వారిచే వ్రాయఁబడినని, చిత్రపటములచే శోభిల్లుచుండును.సుందరమైన క్యాలికో బైండు చేయబడినవి.గ్రంథమాలరూపమున వెలువడునీ గ్రంధములనప్రసిద్ధ పామరుమని విద్వాంసుల అభిప్రాయము,

(3) ఈ గ్రంథములు జనసముదాయము కొనుటకు వీలగునట్లు బహుకొద్ది వెలల కిచ్చుచున్నాము. శాశ్వత పు చందాదారుల పద్ధతిని యమ్మబడును. మేము ప్రచురించు పుస్తక ములనన్నిటిని గొనువారు శాశ్వతపు చందాదాఱులు. 'అట్టి వారికి నూరు పుటలకు 0-8-0 ల చొప్పున ఇయ్యబడును. పోస్టేజి వేరు, ఇతరులకు పోస్టేజి గాక 0-6-0 లగును. ఇంతకుముందు ప్రచురింపఁబడిన గ్రంథములలో కనీసము మూడురూపాయల వెలగల గ్రంధములను కొనువారు ప్రవేశరుసు మియ్యనక్కర లేదు. వెనుకటి పుస్తకములను గొనక ముందు పుస్తకములను మాత్రము గొను నెడల 1-0-0 ప్రవేశరుసు మియ్యవలెను. పుస్తకముల వి.పి. గా పంపి సొమ్ము రాబట్టు కొందుము.

నవంబకు నెల.
1914.

ఆ. లక్ష్మీపతి, బి. ఏ. ఎం.బి. సి. ఎం.

మే నే జరు

తయారగుచున్న గ్రంథములు

పౌతాళ భైరవి ఎ. వి. నరసింహము పంతులుగారు,

స్వీయచరిత్రము (రెండవ భాగము)

రా. బ. క. వీరేశలింగము పంతులుగారు.

సద్వర్తనము కె. వి. లక్ష్మణరావు పంతులుగారు ఎం.ఎ.

ఆంధ్రుల చరిత్రము (మూఁడవభాగము)

చిలుకూరు వీరభద్రరావు పంతులుగారు.

భూగర్భశాస్త్రము (Geology)

త. పానకాలరావు పంతులుగారు, బి. ఏ.

'అస్తమయము భోగరాజు. నారాయణమూ గారు.

అర్థశాస్త్రము (ద్వితీయ భాగము)

కట్టమంచి - రామలింగా రెడ్డి గారు.

మహారాష్ట్ర మహాయుగము

కె. వి. లక్ష్మణరావు పంతులుగారు, ఎం. ఏ.

నవ లా బ హుమతి

రు.500-0-0 లు

కథ

హిందూ దేశ చరిత్రాత్మకముగా నుండ వలెను

గ్రంథము

1915-వ సంవత్సరము ఏప్రిల్ 31 వ తేదీలోగా విజ్ఞానచంద్రికా కార్యాలయమునకు చేరవలెను.

నిబంధనలు మునుపటివలెనే

విశేషములు తెలిసికొనగోరువారు మాకు వ్రాయవలయును

ఆ. లక్షీ శ్రీపతి, బి. ఏ., ఎం. బి., సి. ఎం., నవంబరు.1914) మే నేజరు - విజ్ఞానచంద్రిక, చింతాద్రి పేట మద్రాను.

దు. రాఘవచంద్రయ్య చౌదరి.


VISWANATHAN TEKUMALLA,

FLAT 501. "PRASANTH TOWERS

MUSHIRABAD MAIN ROAD,

HYDERABAD-500048. (A.P.)



THE VIJNANA CHANDRIKA SERIES

EDITED BY

K. V. LAKSHMANA RAO, M, A.,

విజ్ఞాన చంద్రికా గ్రంథమాల


విజయనగర సామ్రాజ్యము



ఇది

దుగ్గిరాల - రాఘవచంద్రయ్య చౌదరిగారిచే

రచింపఁ బడినది.



విజ్ఞాన చంద్రికా మండలి వారిచే

ప్రకటితము


చింతాద్రిపేట

మద్రాసు

1914


సర్వస్వామ్యసంకలితము


వెల 1-4-0

. |


కృతి సమర్పణ ము

అత్యంత ప్రేమతో నన్నుం బెంచి సకల విద్యాబుద్ధులంగరపిన


మత్ ప్రి య జ న క ఁడు

మ-రా-శ్రీ దుగ్గిరాలు పురుషో త్తముగారికిని

ప్రియ జనని

పుల్ల మాంబగారికిని

ఈ కృతిని

సమర్పించుకొనుచున్నాఁడ.

ఇట్లు

విధేయుడుడు

గ్రంథకర్త

1913 వ సం|| ఏప్రేలు నెల 26 వ తారీఖున వేసవి సెలవులంగడపుటకై స్వగ్రామమగు నంగలూరునకేగి గ్రంథమేదే నొకఁడు వ్రాయ నిశ్చయించి కథకై హిందూదేశచరిత్రము

పఠింపఁదొడఁగితి. విజయనగర సామ్రాజ్యనాశము నాకెంతయు ననుకూలించునని తోఁచుటయు దానిం గైకొంటి. గ్రంథమును విజ్ఞానచంద్రికామండలివారి పోటీపరీక్షకుఁ బంపవలయునని యూహజనించుటయు, అత్యంత త్వరితగతి మేనెల 1-వ తారీఖునఁ బ్రారంభించి 26 వ తారీఖున (అనఁగా 26 దినములలో) ముగించితి. మండలివారి పరీక్షయుఁ బ్రోత్సాహమును లేక యున్న నింతత్వరలో ఈ నవలను రచించి యాంధ్ర పాఠకలోకమున కొసంగఁబూనియుండు వాఁడఁగాను. కాన మండలివారికిం గృతజ్ఞుఁడ.

ఇట్లు స్వల్పకాలములో వ్రాసినదగుటచేతను, సంస్కరణమునకైనఁ దగినయవకాశము లేకుండుటచేతను, ఇందుదొరలినదోషములను లేశమేని దిద్దకయే పరీక్షకులకుఁ బంపవలసిన వాఁడనయితి. దానింజేసి పరీక్షకులకుఁ జాల శ్రమ కల్గించితి. అయినను. బ్రయాసతోవిమర్శించి నవలకువన్నెఁదెచ్చిన పరీక్షకులకు వందనములు. xii ఇందలి కథను మ-రా-శ్రీ కే. వి. లక్ముణరావు పంతు లుగారి మహమ్మదీయ మహాయుగమునుండి స్వీకరించితిని. కావున శ్రీపంతులుగారి సాయము నొకపరి యిచ్చట సంస్మరిం చుట నాకుంగర్తవ్యము. ఈ గ్రంథమును శీఘ్రముగను, శుద్ధము గను, అచ్చు వేయించిన హెచ్. వి. కృష్ణ అండు కో వారికిని అండందు మార్పులఁ జేసి వన్నె బెట్టిన శ్రీయుత ఆచంట లక్ష్మీపతి బి. ఏ., ఎం. బి., సి. ఎం., గారికిని నాకృతజ్ఞ తావందనములు. మండలివారీ గ్రంథమును చిరకాలము క్రిందనే ప్రక టింప నిశ్చయించిరి. అయినను నాకుఁదగిన సానకాశము గల్గమిం జేసియు శరీరస్వాస్థ్యములేమి మొదలగు మఱికొన్ని యని వార్యములగు ఆటంకముల వలనను మండలివారికిని ఆంధ పాఠక ప్రపంచమునకును ఆశాభంగము కల్గించితిని. నేఁ జేసిన యాలస్యమున కెల్ల నోర్చినమండలివారి యౌదార్యము, శాం తము ప్రశంసనీయములు. పాఠకమహాశయులీ యాలస్యమును మన్నింతురుగాక. గుణదోషని యమునకుఁ ప్రాజ్ఞలోకము శరణ్యము.

ఆపరితోషా ద్విదుపాం నసాధుమ న్యే ప్రయోగ విజ్ఞానం బలవదని శిక్షి, తానా మాత్మన్య ప్రత్యయంచేత. (కాళికాను)


బాలసరస్వతీ పుస్తక భాండాగారముఅంగలూరు


19.9.14.

ఇట్లు విధేయుఁడు దుగ్గిరాల. రాఘవ చంద్రయ్య చౌదరి.

ఇది 1913 -వసంవత్సరపుబహుమతి పరీక్షలో రు. 500 ల బహుమతిగన్న 'నవల.దీని నిదివరలోఁ గొంత కాలము క్రిందటనే ప్రచురింపఁదలఁచితిమి కాని గ్రంథకర్తగారు పీఠికలో సూచించిన కొన్ని కారణములచే నింతనజుకుఁ జందా దారుల కందఁ జేయఁజాలమైతిమి.

ఆ సంవత్సరపు బహుమతి పరీక్ష, కంపఁబడిన పది గ్రం థములలో నీ గ్రంథముయొక్క యాధిక్యతను దీనిని బటంచిన చదువరు లెఱుఁగఁగలరు. తాము నిర్మించిన చిత్తరువులకుఁ దక్కినవారు చక్కఁగాఁ బ్రాణమును బోయ లేకుండుటయు నీ గ్రంథకర్త తన కల్పనాచాతుర్యముచేఁ దానిని సజీవముగాఁ జేయుటయు నందలి రహస్యము. ఐనను బరీక్షకు ఆ గ్రంథము సందు సుగుణములనియెంచిన కొన్ని యంశములను సంక్షేప ముగా నిందుదాహరించెదము.


i.విజయనగర సామ్రాజ్య నాశనము కథా సారమైనను గ్రంధకర్త చేతులలో నీ సామ్రాజ్య ము యొక్క వైభవము మిక్కిలి చక్కగను, ఉర్కృష్టముగను బ్రకాశించు చున్నది. ఇందలి కల్ప నాచాత్యుము పటుత్వమును, గాంభీర్య మును గలిగి చదువరుల కానందమును, పగవశతను తుదవరకు గలిగింపగలదు. మహమ్మదీయ చక్రవర్తులు బహిర౦గముగ యుద్ధమును గాక జిత్తులచే నీసామ్రాజ్యమును నశింపఁ జేయఁ బ్రయత్నించుటయే హిందూ సామ్రాజ్యము " మొక్క ప్రతి భావిశేషమును "వేయిరెట్లు హెచ్చించుచున్న ది.

ii. గ్రంధకర్తయొక్క వచనరచన మృదుమనుగ మై, ప్రౌడమై, స్వాభావిక మైన ప్రవాహము గలదై, కొండలంతటి లోపము లనుగూడ "నుక్కొకతరి నలుసులవలెఁ జేయు చున్నది. తముల కనుగుణ దన్న ను వారితో iii. ఇందలి వర్ణనలు స్వాభావికము లై, ఆయాపాత్ర: ములుగా నున్నవి. రామరాజు బహు చైర్యశాలియు, న్యాయమూర్తియునగు చక్రవర్తి. ఇతని కాత్మవిశ్వాసము హెచ్చు. కౌటిల్యము తెలియదు. స్వామి ద్రోహులగు, ఆదిల్ శాహా చక్రధరులు త్రవ్వుగోతులను బుద్ధిసాగరుఁడు చూపించినను లక్ష్యు పెట్టక, కన్ను లుమూసికొని వానిలోదుమికెను. తుదకీతఁడు తనలోపములనుగనుఁగొని మిక్కిలి పశ్చాత్తాపపడుచు తన్ను (దాను నిందించు కొను వాక్యములు పలుమారు పఠింపఁదగినవి. బుద్ధి సాగరుని నీతియు, నిరుపమాన రాజభ క్తియు నెంతయు శ్లాఘా పాత్రములు, స్వర్ణకుమారీ జగన్మోహినులు రూప రేఖాలావణ్యాతిశయములును విద్యాబుద్ధులునుగల యాకాలపు హిందూ నారీమణులు. వీరుతమభర్తలు వలదన్నను 'యుద్ధరంగమున కరుగుట వారిపాతి వ్రత్యమును శూరత్వమును జాటుచున్న ది. ఆకాలపువీరు గుణములన్నియు విజయసింహుని యందు మూ ర్తీ భవించియున్న వని చెప్పవచ్చును, ఈ గ్రంథమునందలి చరిత్రాంశములను సుబోధకము లుగ జేయుటకుఁగాను కొన్ని పటముల నందందిమిడ్చితిమి. మఱి కొన్ని రంగుపటములను బాత్రోచితముగఁ జిత్రింపఁ బ్రయ త్నించితిమి. కాని ప్రస్తుతము మన దేశమునందు సంక్షోభముఁ గలిగించుచున్న మహాయుద్ధమువలన గలిగిన యాటంకముల చేత వలనుపడినదిగాదు. అందుల కెంతయుఁ జింతిలుచున్నాము.

చిం తాద్రి పేట,
5-10-14. .

ఇట్లు

సంపాదకుడు

ప్రకరణము

పుట.


1.యోగి .. .......................... 1
2. తారానాథుడు ............... 15
3 చదరంగము ప్రారంభము 21
4. ఢిల్లీకి బ్రయాణము ....... 27
5.ఒక వీరపురుషుడు ..........35
6.. ఏమియు లేదు ............. 41
7. ఆమె కాశలు గల్లెను .........47
8. అతని హృదయము ఝల్లు మనియెను 55
9.రాజద్రోహి యెవరు ? ....... 66
10. చీకటి.............................78
11.పట్టమహిషి.......................83
12.గగనకుసుమము...............82
13..దుష్టగ్రహ కూటము..........93
14. దర్బారు .......................103
15. తిరస్కారము.................106
16.జ్యోతిషము......................114
17.దీర్ఘ దర్శి....................... 121
18. ఆశ...............................132
19,. రాధా కుమారుఁడు........146
20. నిరాశ...........................154
21.వెన్నెల..........................156
22.ఆ చప్పుడేమి ?.............. 166


23 ప్రయాణము..............173
24.మోసము...................183
25.ప్రతి ఫలము.............190
26. కాలకూటము............196
27. ఆంధ్రులు................201
28. తురుష్కులు.............207
29 .జైత్రయాత్ర...............213
30 దుష్ట గ్రహకూటము .. 222
31 రాయ బారము.....[[.....240
32 నూర్జహాను...........[[.....247
33 మార్ణ...................[[.....256
34 వివాహము.............[[....263
35 నిద్ర...........................266
36 యుద్ధము....................273
37 ఆదిల్సాహా పరాభవము. 280
38. విజయము..................285
39. స్వామిద్రోహము............289
40. తరువాత ...................296
41.బుద్ధిసాగరుఁడు............301
42. ఉపసంహారము...........306


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.