తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)
(వ్యాససంపుటి) కర్త శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠము 'శ్వేత' భవనము తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి అం| ప్ర తెలుగు మెఱుఁగులు రచయిత శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి చతుర్థ ముద్రణము : ఫిబ్రవరి 2008 శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి 120 పజయంతి సందర్భముగా ప్రతులు
1000 ప్రకాశకులు శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్., కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి యూనివర్సిటీ జెరాక్స్ ప్రకాశం రోడ్డు, తిరుపతి ఫోన్ ; 2261515 ముద్రణము తిరుమల తిరుపతి దేవస్థాన ముద్రణాలయము తిరుపతి కృతజ్ఞతలు
శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారి వాజ్మయ వ్యాసముల నన్నిటిని
బృహత్సంపుటంగా - శ్రీప్రభాకరసంపూర్ణ గ్రంధావళిలో భాగముగా
ప్రకటించుటకంటే పూర్వము ఎంతో కాలముగా విజ్ఞపారకలోక
మెదురుచూస్తున్న 'తెలుగు మెఱుగులు', 'మీగడ తలకలు', సింహావలోకనము,
మున్నగు గ్రంధములను తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలి
వారితీర్మానము సంఖ్య 269, తేది. 25.07.2007 మేరకు రూపుదిద్దుకొన్న
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయ పీరమువారు శ్రీప్రభాకరసంపూర్ణ
గ్రంధావళి ప్రకటనకు పూనుకోవడము తెలుగువారు హర్షించే విషయము.
అశేష పొఠకలోకము నలరించిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి "తెలుగు
మెఱుగులు" ఇప్పుడు మీ ముందున్నది.
ఇదే క్రమంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వాజ్మయ రచన లన్నీ
తిరుమల తిరుపతి దేవస్థానము వారి నిర్వహణమున అనతికాలంలోనే
పడివడిగా వెల్లడి కాగల వని నమ్ముతున్నాము. శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి
గారి వాజ్మయామృతధారను గ్రోలనివారు, కలియుగ ప్రత్యక్ష కులదైవమైన
శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపావర్షధారలో తడియనివారు మన దేశమున
లేరంటే ఆశ్చర్యము లేదు.
శ్రమసాధ్యమైన గ్రంథముద్రణ భారాన్ని ఇతరసహాయ నిరపేక్షంగా
సమర్థంగా పర్యవేక్షించిన శ్రీవేటూరి ప్రభాకర వాజ్మయ పీఠనిర్వాహకులను
హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ప్రత్యేకంగా మా విన్నప
మాలించి పవిత్రమైన ఈ బృహత్తర కార్యభారాన్ని కర్తవ్యంగా భావించి
తలకెత్తుకోన్న తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలివారి
ఔదార్యాన్నీ శ్రీకార్యనిర్వహణాధికారుల సౌజన్యాన్ని కొనియాడుతున్నాము.
పాఠకలోకం నోచుకొన్న ఈ భాగ్యానికి వారి నభినందిస్తున్నాము. పాఠకుల
ప్రోత్సాహమే అందరికీ ఆనందము.
హైదరాబాద్ 29.01.08
(డా॥ వేటూరి ఆనంద మూర్తి) శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్మారక ట్రస్టు పూర్వాధ్యక్షుడు. ముందుమాట 27.01.2008, భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షులు తి.తి.దేవస్థానపాలకమండలి, తిరుపతి.
తిరుమల తిరుపతి దేవస్థానాలు చేపట్టి, పురోగమిస్తున్న అనేక
సామాజిక, సాహిత్య, తాత్త్విక, భక్తి, ధార్మిక ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో
నూతనోత్తేజాన్ని పెంపొందింప జేస్తున్నాయి. ఈ మార్గంలో రామాయణ
భారత భాగవతాది గ్రంథాల్ని వివరణాత్మకంగా సొమాన్య ప్రజలకు సైతం
అర్థమయి, అందుబాటులో ఉండేవిధంగా ప్రచురిస్తున్నాము,
అన్నమయ్య, వెంగమాంబ సాహిత్యాన్ని విశేషంగా ప్రజలవద్దకు
తీసుకువెళ్లేందుకు శతథా కృషి చేస్తున్నాము. ప్రాచీన సాహిత్యంలో, నవీన
సాహిత్యంలో ధార్మికాంశాలు విశేషంగా ఉన్నవాటిల్ని నేరుగానూ, ఆర్థిక
సహాయం అందించడం ద్వారానూ ప్రచురిస్తున్నాము.
ఈ మధ్య "శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠాన్ని'
శ్వేతలో నెలకొల్పి, శ్రీప్రభాకరశాస్త్రిగారి సాహిత్యాన్నీ, అన్నమయ్య కీర్తనల
పరిశోధనలో వారుగావించిన కృషినీ, సహృదయ సమాజం చిరకాలం
గుర్తుంచుకొనేట్టుగా కార్యక్రమాలు రూపొందించి, నిర్వహిస్తున్నాము.
శ్రీప్రభాకరశాస్త్రిగారు సంస్కృతాంధ్రాల్లో గొప్పపండితులు.
తెలుగులో అనేకాంశాలపై ఎంతో పరిశోధించి, అనేక నూతనాంశాలు
వెల్వరించారు. “మాస్టరు సి.వి.వి" యోగాన్ని సాధించి, ఆశ్రయించిన వారి
శారీరక, మానసిక వ్యాధుల్ని పోగొట్టి, ధనాపేక్ష లేకుండా గొప్ప వైద్య
సేవలందించారు.
గ్రంథరచన, విమర్శలు, పఠనం, పాఠనం, తాళపత్ర గ్రంథాలు
సేకరణ, పరిశీలన, అనేక ప్రాచీన శిల్పాలు సేకరించడం, - ఇలా అనేక
కోణాల్లో జగమెరిగిన ఉత్తమకవిపండితులు - శ్రీశాస్త్రిగారు. వీరి విమర్శలు
నిష్పాక్షికంగానూ, సశాస్త్రీయంగానూ, సునిశితంగానూ ఉంటాయి.
తెలియని విషయాన్ని తెలియ'దని ధైర్యంగా చెప్పే సహృదయపండితుల్లో
శాస్త్రిగారు అగ్రగణ్యులు,
శ్రీ శాస్త్రిగారి 120వ జయంతి సందర్భంగా {07-12-2008)
వీరి రచనల్లో కొన్నింటిని పునర్ముద్రించి, సాహితీలోకానికి అందిస్తున్నాము..
ప్రస్తుతం “తెలుగు వెఱుగులు". "మీగడతఱకలు". "ప్రజా ప్రభాకరము",
సింహావలోకనము" ఆనే నాల్గు పుస్తకాలు ప్రచురిస్తున్నాము.
వీటిలో "ప్రజా ప్రభాకరం" యోగానికి సంబంధించింది. తక్కినవి
ఆంధ్రసాహిత్యానికి సంబంధించిన వ్యాసరత్నాలు. నన్నయనుండి చిన్నయ
వరకూ గల సాహిత్యాన్ని ఆపోశనం పట్టిన శాస్త్రిగారి ఈ వ్యాసాలు
సాహితీ విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు - వారిలో కొత్త
ఆలోచనలకూ, విమర్శనధోరణికి బాటలు వేస్తాయి. ప్రాచీన సాహిత్యంపై
అభిరుచిని కలిగిస్తాయి.
సాహితీ ప్రియులు మా యీ కృషిని అభినందిస్తారనీ, ఆదరిస్తారనీ - శ్రీశాస్త్రిగారి వాజ్మయ పీఠం ద్వారా ఉత్తమపరిశోధనలు వెల్వరిస్తారనీ అక్షాంక్షిస్తున్నాను.
"శ్రీ వేంకటేశచరణ్ శరణం ప్రపద్యే "
శ్రీవారి సేవలో,
(భూమన కరుణాకరరెడ్డి) "శ్రీవేంకటేశ చరణ్ శరణం ప్రపద్యే " నామాట 28.01.2018. 3.వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్., కార్యనిర్వహణాధికారి, తి.తి. దేవస్థానములు, తిరుపతి,
తిరుమల తిరుపతి దేవస్థానములవారు చేపట్టిన ప్రజాకత కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో భక్తి ధార్మిక చైతన్యాన్ని కల్గిస్తున్నాయి. శ్రీవారి యందు అచంచల భక్తినీ, ప్రగాఢ విశ్వాసాన్నీ దృఢతరం చేస్తున్నాయి. వీటికితోడూ ప్రాచీన సాహిత్యంలో ఆణిముత్యాలైన రామాయణ భారత భాగవతాది గ్రంథాలను సరళసులభ వివరణాత్మకంగా ప్రజలకు అందిస్తున్నారు.
ఏ దేశంలో ఉత్తమసాహిత్యం విశేషంగా వ్యాప్తి జెంది, ప్రజా హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందో, ఆ దేశంలో ధార్మికసంస్కృతి, నాగరికత,జ్ఞానం, భక్తి, ఆధ్యాత్మిక చింతన. సౌభ్రాత్రం. సౌశీల్యం, సుఖశాంతులూ వర్ధిల్లుతాయి. సంసారం సంస్కారంతో రాణిస్తుంది. ఈ దిశలో భాగంగా దేవస్థానంవారు "శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠాన్ని "శ్వేత" లో స్థాపించారు. ఈ పీఠం శ్రీశాస్త్రి గారి రచనలనూ, పరిష్కరణలనూ, సాహిత్యజ్ఞులకు సన్నిహితం చేయడమే కాకుండా ఉత్తమపరిశోధనలూ జరిపించి, అనేక నూతనాంశాలు - సమాజ శ్రేయోదాయకమైనవి వెల్వరించా లసీ ఆశిస్తున్నాము. శ్రీ శాస్త్రిగారు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో చాలాకాలం పరిశోధకులుగా ఉండి, అనేక అముద్రిత తాళపత్ర గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఎన్నో గ్రంథాలు పరిష్కరించి, పీఠికలు సంతరించారు. వీరి పీఠికలు గ్రంథహృదయాన్నీ, కవి ఆశయాన్ని ఆవిష్కరిస్తాయి. మొగమోటం కోసం అంతా బాగుం దనే పద్ధతిలో కాకుండా వీరి విమర్శనధోరణి నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా. ప్రామాణికంగా, సహృదయరంజకంగా ఉంటుంది.
అన్నమయయ్య సంకీర్తనల విషయంలోనూ, తాళపత్ర గ్రంధాల సేకరణ, పరిరక్షణలోనూ. ప్రాచీన శిల్ప సంపదను ఒక్కచోట చేర్చి, 'మ్యూజియం స్థాపించడంలోనూ, "మాస్టర్.సి.వి.వి" యోగంద్వారా వ్యాధులు సమం చేయడంలోనూ శ్రీ శాస్త్రి గారి నిర్విరామక షి మహత్తరమైనది. శ్రీ శాస్త్రిగారి 121వ జయంతి (07.02.2008) సందర్భంగా -- వీరి అలభ్యరచనలను "1) ప్రజాప్రభాకరము, 2) సింహావలోకనము, 33 తెలుగువెలుగులు 4 ) మీగడతఱకలు" అనే నాల్గింటిని పునర్ముద్రించి, సహృదయసాహితీప్రియులకు అందిస్తున్నాము. ఇందలి వ్యాసాలు సాహిత్యానికే గాక, యోగాడి విషయాలకూ, సద్విమర్శనచింతనకూ, ఆటపట్టులు. ఇలాంటి రచనలు చదివి, జీర్ణించుకోవడం ద్వారా సాహితీ ప్రియులు ప్రాచీన సాహిత్యాఢీలాషనూ, పిచుర్యసశక్తినీ, కవితానురక్తినీ, పటిష్టం చేసుకోవచ్చు.
తిరుల తీరుపతి దేవస్థానంచారు చేస్తున్న ఈ వాజ్మయ సేవను సాహితీహృయు లందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము. శ్రీ వేంకటేశాయ మంగళమ్ శ్రీవారి సేవలో,
(కె.వి. రమణాచారి) శుభాశయము భూమన్, సంచాలకులు, ఎస్.వి. ఉద్యోగుల శిక్షణ కేంద్రము. ఎస్. వి. కేంద్ర గ్రంధాలయము & పరిశోధన సంస్థ. క్రైవేటూరి ప్రభాకరశాస్త్రి వాకుడు పేరము. సూర్య శ్రీ తరిగొండ వెంగమాంబ చాట్యుయ ప్రాజెక్టు. చేత భవనము, తి తి దేవస్థానములు, కరపతి,
తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప ధార్మిక సంస్థ. సాహిత్యం, భక్తి సంగీతం, ఆధ్యాత్మికం, ధార్మికప్రచారం, కళ్యాణమస్తు, శాంతియాగాలు. దళిత గోవిందం, అర్చకపునశ్చరణ తరగతులు - ఇలా ఎన్నో విధాలుగా ప్రచార సేవలు అందిస్తూ, సమాజాన్ని ధార్మిక చింతనమార్గంరలోకి తేవడానికి అహర్నిశలు కృషి చేస్తుంది. ఎంత చేసినా ఎంకా చేయాల్సింది ఎంతో వుందనే తోస్తూంది.
ఈ శుభాశయంతో ఇటీవల క్రొత్తగా "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీరాన్ని "శ్వేత" లో స్థాపించడం జరిగింది. ప్రభాకరశాస్త్రిగారు సుప్రసిద్ధకవి పండితులు. గొప్ప విమర్శకులు, సరంతర సాహితీపరిశోధకులు. తిరుమల తిరుపతి దేవస్థానంతో శాస్త్రిగారికి ఎంతో అనుబంధం ఉంది. పీరాన్ని స్థాపించకమునుపే చేటూరివారి వర్ధంతిని నిర్వహించటం జరిగింది. పీరాన్ని స్థాపించిన వెంటనే శ్రీశాస్త్రిగారి 120 వ జయంతి రావడం, ఈ సందర్భంగా శాస్త్రిగారి ఆలభ్య పుస్తకాలను నాల్గింటిని సింహవలోకనం, ప్రజా ప్రభాకరం, తెలుగు మెఱుగులు, మీగడతఱగలు" పునర్ముద్రించి, సాహితీ ప్రియులకు అందించడం ఆనందంగా ఉంది శ్రీ శాస్త్రిగారి 120 వ జయంతి సందర్భాన 'శ్వేత' భవనం ఎదురుగా - వారి కాంస్య విగ్రహాన్ని స్థాపించడమూ గొప్పస్తూర్తి దాయకం! శ్రీశాస్త్రిగారి అలభ్య, అముద్రతరచనలను ముద్రించడం, వారి సాహిత్యలపై పరిశోధనలు గావించడం, వారు వ్యాఖ్యానించిన "ఉత్తర హరివంశాన్ని (అసమగ్రం) సుప్రసిద్ధ పండితులతో పూర్తి చేయించడం, మున్నగు కార్యక్రమాలతో పీఠం నానాటికీ విస్తృత చుచ్చుతుందని ఆకాంక్ష. ప్రస్తుతం జయంతి సందర్భంగా ముద్రిస్తున్న పుస్తకాలు, శ్రీశాస్త్రిగారు ఆయా సందర్భాల్లో గావించిన ఉపన్యాసాలూ, సమర్పించిన పత్రాలూ ఒకచోట చేర్చి - అనేకాంశాలపై నున్న వ్యాసాలు. ఇందులో ఆంధ్రసాహిత్యం సారభూతంగా ఆణిముత్యాల్లాంటి శీర్షికలో - సాహితీ ప్రియులకు హృదయానందాన్నీ, నూతన ఆలోచనలనూ, విమర్శనధోరణినీ - త్రివేణీ సంగమంలాగా - నింపుతుంది.
ఈ వ్యాసాల్లో శాస్త్రిగారి సంగీత, సాహిత్య, వేదాంత. భాషాశాస్త్రాది బహుముఖీనమైన ప్రజ్ఞా వైశిష్ట్యం సర్వత్ర గోచరిస్తుంది. శాస్త్రిగారు కొన్ని గ్రంథాల్లో స్వయంగా రాసుకున్న "చిత్తు వాతలు" పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తాయి.
అన్నమయ్య కీర్తనలను వెలుగుకు తేవడంలో శ్రీశాస్త్రిగారి కవి ప్రశంసనీయం!
శ్రీ శాస్త్రిగారి వాజ్మయపీఠాన్ని నెలకొల్పి. ఆందుకు తగిన సంపూర్ణ సహకారం అందిస్తున్న తీరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు గౌరవశ్రీ భూమన కరుణాకరరెడ్డిగారికీ, గౌరవ పాలకమండలి సభ్యులకూ, కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి. ఐ.ఏ.ఎస్. గారికీ, ఇతర అధికారబృందానికి, శ్రీ శాస్త్రిగారీ గ్రంథాలయాన్ని పీఠానికి సమర్పించిన శ్రీ శాస్త్రిగారి కుమారుడు ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారికీ, శ్వేత, కేంద్ర గ్రంధాలయం మరియు పరిశోధన సంస్థ తరఫున ధన్యవాదా లర్పిస్తున్నాను. సాహితీప్రియుల ఆదరప్రోత్సాహాలతో ఈ వాజ్మయపీఠం ఇతోధికంగా సాహితీసేవలో ధస్యమవుతుందని ఆకాంక్షిస్తున్నాను. ముద్రణ విషయంలో డి.టి.పి. చేసి యిచ్చిన 'మూనివర్సిటీ జెరాక్స్' వారికీ, సకాలంలో ముద్రించియిచ్చిన తి.తి.దే. ముద్రాణాలయం వారికీ, ముద్రణ విషయంలో నిరంతరం శ్రమించిన - వాజ్మయ ఓం సమన్వయకర్త డా|| పి. చెంచుసుబ్బయ్య గారికీ ధన్యవాదాలు.
- భూమన్ ఓం నమో వేంకటేశాయ
కృతజ్ఞతాంజలి
విద్వాన్, డాక్టర్ పమిడికాల్వచెంచుసుబ్బయ్య
సమన్వయ కర్త
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయ పీఠము, 'శ్వేత' భవనము, తి.లీ. డేవస్థానములు. తిరుపత.
తిరుమల తిరుపతి దేవస్థానం వారుహిందూ ధర్మప్రచార పరిషత్ కార్య దర్సి పదవి నుండి స్వచ్ఛండంగా నా అంతట నేనే వైదొలిగినా నామీద విస్వాసాభి మానాలుంచి నన్ను శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి వాజ్మయ ప్రాజెక్టు ఇన్ చార్జి సమంవ కర్తగా - మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్టుకు ఇన్ చార్జి సమన్యయ కర్త గా. నియమించిన పాలకమండలి అధ్యక్షులు గౌరవ శ్రీ భూము: కరుణాకరరెడ్డిగారికిని . గౌరవ శ్రీ పాలకమండలి సభ్యులకూ, కార్య నిర్వహణాధి కారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి ఐ.ఎ.ఎస్. గారికి, తదితర ఉన్నతాధికారులకు ఈ సమయమున తము సంపూర్ణ సహకారాన్ని నందించిన 'శ్చేత సంచాలకులు మానం, భూమన్ గారికి హార్దిక కృతజ్ఞతాంజలులు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సింహావలోకనం ఒకప్పుడు విద్ద్వాన్ కోర్సుకు పాఠ్యాంశంగా ఉండేది. బోదస సందర్భంగా ఆ పుస్తకాన్ని చదివే భాగ్యం చేకూరింది. అప్పుడు అని పించింది - శ్రీ వేటూరి పాండి తీగరిము, విమర్శన నైపుణ్యాలు, రచనలో వారు పాటించే నిబద్ధత. గ్రాంధిక భాష, ప్రాచీన సాహిత్యంపై వారికున్న స్సునిసిత పరిశోధన హదయం. ఆనితర సాధద్యమైనవని ఆనాడే వారిపై ఎనలేని గౌరవం ఏర్పడింది.
జన్మాంతర బంధమో - ఎందరో ప్రతక్ష శిష్యులున్నా - ఒరోజు శిష్యుడైన నాడు శ్రీ శాస్త్రిగా వాజ్మయానికి సేవ చేసే భాగ్యం శ్రీనివాస్సుని కృపాకటాక్షంతో లభించింది. మొదట్నుంచి ప్రాచీన సాహిత్యంపై మక్కువగుటకు... నాకు ఈ సేవ లభించడం మహాడ్యష్టం!
ప్రస్తుతం డిప్పుడే ఈ వాజ్మయపీఠం రూపు రేఖలు దిద్దుకొంటూంది. శ్రీ శాస్త్రిగారి సాహిత్యం - వ్రాతప్రతులు ఇంకా చేరవలసినవి చాలా ఉన్నాయి వాటి ఆధారంగా - అనేక కో:ణాల్లో పరిశోధనలు జరిపి విలువైన ప్రాచీన సంపద ఆంధ్రసాహితీ ప్రియులకు అందించాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది. ఈ దిశగా కృషి జరుగుచున్నది. శ్రీశాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి హృదయం స్పృశింపని విషయం లేదు. నన్నయ నుండి నారాయణుని వరకూ. భాషాశాస్త్రం నుండి భాషా వధూటి వరకూ - అక్షరంనుండి అక్షరతత్త్వంవరకూ - యోగంనుండి యోగేశ్వరుని వరకూ. పరమాన్నంనుండి పరమాత్మవరకూ సజీవస్రవంతిగా ప్రవహించింది - ప్రవహిస్తుంది - ప్రవహిస్తుంది - శ్రీశాస్త్రిగారి 'అక్షరగంగ'. వీరి పరిశోధనలూ, విమర్శలూ సాహితీకృషీవలులకు బంగారుపంటను పండిస్తాయి. నూతనాలోచనలనూ. పరిశోధనాసక్తినీ ఇసుమడింప జేస్తాయి. గుణాన్ని గుణంగా,దోషాన్ని దోషంగా వివరించడంలో శ్రీ శాస్త్రిగారు "నిర్మాగూటం'గా వ్యవహరించడం వీరి వ్యాసాల ద్వారా వ్యక్తమవుతుంది. ముఖప్రీతికీ - సాహితీప్రీతికీ పొత్తు కుదురదు కదా!
శ్రీ శాస్త్రిగారు సమాజానికి త్రికరణ శుద్ధిగా - త్రికరణాలకూ సేవచేసన ధన్యులు.
శ్రీ.శాస్త్రిగారి 120 వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన నాల్గు పుస్తకాలు సాహితీ సౌధానికి నాలుగుస్తంభాలు ఇందులో ముఖ్బ్రాముఖ్యాలకు తావు లేదు. దేని ప్రాముఖ్యం, విశిష్టత దానిదే! సహృదయర సాహితీలోకం ఆవిశిష్టతకు దర్పణం.
శ్రీశాస్త్రిగారి కాంస్య విగ్రహాన్ని 'శ్వేతకు ఎదురుగా స్థాపించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకే కాక, 'శ్వేత'ను. అటు శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని దర్శించి, ఉభయత్ర - అనేక కార్యక్రమాలపై వచ్చే విద్యార్ధులకూ, పెద్దలకూ కూడ శాస్త్రిగారినిగూర్చిన పరిచయం. అవగాహన చేకూర్తుంది. ఈ నిర్ణయం మిక్కిలి అభినందనీయం!
శ్రీ శాస్త్రిగారి జయంతి, వర్థంతి - సందర్భంగా క్రమంగా వారి రచనలు ముద్రింపబడి - సాహితీప్రియులకు అందుబాటులో ఉండే విధంగా కృషి జరుగుతూంది. ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్స్వార్థంగా, నిష్కళంకంగా సాహితీ సమాజ సేవతో ధన్యులైన శాస్త్రిగారు ఆదర్శ పండితులు. పరిశోధక శిరోచుణులు. ఉత్తమ యోగులు
కృతజ్ఞతాంజలులతో,
తిరుపతి. 29.01.2008 మరి కొన్విలావణ్యం
(నమిడికాల్వ చెంచుసుబ్బయ్య) విషయసూచిక
వ.నెం. వ్యాసము పుట
1 |
8 |
15 |
21 |
29 |
35 |
62 |
73 |
78 |
88 |
111 |
130 |
134 |
146 |
151 |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.