తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/తెలుఁగున ప్రధమావిభక్తి 'ండు' ఎట్టు పుట్టినది

వికీసోర్స్ నుండి

12

తెలుఁగున ప్రథమావిభక్తి ‘ండు' ఎట్టు పుట్టినది?


తెలుఁగుభాషలో నేఁడు ప్రాయికముగా మహద్వాచకము లయిన శబ్దముల తుద ప్రథమావిభక్తి ప్రత్యయముగా 'ండు గలదు. ఇది దీర్ఘపూర్వ మగునేని యరసున్నగా మాఱును. హ్రస్వపూర్వ మగునేని యరసున్నగా గూడ మాఱును. మఱియుఁ బ్రాయికముగా ప్రాతిపదిక మది తత్సమమో, తద్భవమో యగునేని 'ండు'కుఁ బూర్వమున్న హ్రస్వాకారమునకు ఉకారముగూడ వచ్చును. వాఁడు మగండు, మగఁడు, రాముండు, రాముఁడు-అనునవి యుదాహరణములు. కానీ యీ రూపము లర్వాచీనకాలము సాటివి. ప్రాచీన కాలమున నీవి 'వాట్టు' మగజ్జు, రాముజ్జు, అను విధమున నుండెడివి. లిపి యిట్లే యున్నను ద్విత్వ శైథిల్యముచే నివి తేలఁబలుకఁబడుచుఁగూడ నుండెడివి.


ఇంక వీనిలో 'ణ్డు' ఎట్లు వచ్చినదో కనుఁగొసఁ బ్రయత్నింతును. ప్రాయికముగా తెలుఁగుపదములు పెక్కులు ప్రథమావిభక్తి బహువచన రూపములను ముందు పడసి వాని ననుసరించి, తర్వాత నేకవచన రూపములఁ బడయట కాననగును. ఈఁగలు, చిలుకలు, అడుగులు, చెఱువులు ఇత్యాది బహువచనరూపములు ముందు పుట్టిన పిదప వీని ననుసరించి ఈఁగ, చిలుక, అడుగు, చెఱువు ఇత్యాద్యేకవచనరూపములు తర్వాత పుట్టినవి.

ద్రావిడ భాషాకుటుంబమున ప్రథమనిష్పన్నమైన యలవమున అవన్, మగన్, రామన్ అనునవి ప్రథమావిభక్త్యంతపదములు, అజవము తర్వాత పుట్టిన తెనుఁగున కీపూర్వభాషలోని ప్రథమావిభక్త్యంతపదములే


ప్రాతిపదికము లయినవి. ఇట్లగుట సంగతమే. ఇట్లు అవన్, మగన్,రామస్ అనియున్న ప్రాతిపదికములకు బహువచన ప్రత్యయమగు 'ఱు' (ఇది బండి ఱ గా ప్రాచీన శాసనలిపి గలదు} పరము కాఁగా అవను, మగను, రామన్దు అను రూపము లేర్పడవలసి యుండెను. కాని యేకపదమున 'న' కార ఱ' కారములకు సంయుక్తత అలవముననే కాని తెలుఁగున నెక్కడను లేదు. తెలుఁగుభాషాస్వభావమున కట్టి యుచ్చారము విరుద్ధము. అట్లగుటచేఁ దెలుఁగున నకారఱకారములు సంయుక్తములుగా నేర్పడవలసినచోట్ల నకార ఱకారములకు నడుము, బహుప్రాచీనకాలమునఁ దెలుఁగున లిపియు నుచ్చారమును గలిగినట్టియు, క్రమముగా నాలిపియునుచ్చారమును 'డ' గా షూటిపోయినట్టియు నొక వింతహల్లు ఆగమమై వచ్చుచుండెను. అదియే నేను ఆహదనకరశాసనము, సత్యాదిత్యచోడ మహారాజు శాసనము మొదలగు వానిలోఁ గుర్తించిన వింతలిపి గల హల్లు. అది బండి ఱ' కాదు. థ కాదు. ఆ వింతలిపియొక్క ప్రాచీనకాలోచ్చారము కొంత టవర్ణాక్షరముల యుచ్చారమునకుఁ జేరిక గలదై యుండవచ్చును. అదిపెక్కుచోట్ల 'ద' గా మాటినది. కొన్ని చోట్ల 'ట' గాఁగూడ మాటియుండు నట్లు నే ననుమానించున్నాను.

ఇప్పుడు 'న' కారము, 'వింతహల్లు', 'ఱు' సంయుక్తమైన యక్షరముతో శబ్దరూపము లేర్పడఁగా, బహువచన ప్రత్యయమగు 'ఱు' లోపింపఁగా హలంతము లయిన పదముల చివర 'ఉ' చేరఁగా, నేకవచనమున అవను, మగను,

రామను ( న క్రింద నున్నదే వింతలిషి గల వింతహల్లు.) ఇత్యాది రూపములు కలిగెను. ఈ హల్ రూపములే సత్యాదిత్యచోళ మహారాజాదుల శాసనములందు లెక్కలేనన్ని యున్నవి. క్రమముగా నీ వింతహల్లు 'డ'గా మాఱగా 'డ' కుఁబూర్వమున నున్న 'స' 'ణ'గా 132 తెలుంగులు మాజంగా, 'అవజ్ఞు', మగణు, రామణు' ఇత్యాదులు బహువచన రూపములును. 'అవల్లు మగణు, రామజ్ఞు' ఇత్యాద్యేకవచనరూపము లును నేర్పడినవి. ఉరల్ రోలుగా మాణినట్లు 'అవజ్ఞు 'వాణు'గా మాఱినది. తర్వాత వాణు వాఁడుగాను, మగడ్డు మగఁడుగాను అర్వాచీనభాషలో మాతనవి. ఇట్లే నేటి ప్రథమావిభక్తి 'ండు' ప్రత్యయములకెల్ల సమన్వయము గుదురును.

తెలుఁగుబాసలో నకార అకారములకు సంయుక్తత ప్రసక్తించు నపుడు నడుము వింత హలాదేశము వచ్చుననుటకు 'వడ్డేణు, ఎనుబణు' ఇత్యాది పదములఁగూడ సుదాహరణముగాఁ జూచుకోవచ్చును. తెలు గున పది పన్ అయి, ఇరండు రెండు అయి సంధి యేర్పడినది, అలవమునఁగూడ పత్తు పన్ అయి, ఇరండుతో సంధింపఁగా పన్నిరండు అని రూప మేర్పడినది. తెలుఁగున పన్+రెండులో నడుమ వింత హల్లు వచ్చి, అది డగా మాజీ, 'న' 'ణ' అయి 'పప్లైణు' అను రూప మేర్పడినది. కానీ 'ఫన్లైన్దు' అను రూపము తెలుఁగున నెన్నఁడు నున్నట్లు కొనరాదు. వాణు (టు), పట్టెణు { } అను పదములలోని రెండవ సంయుక్తాక్షరములలో రెండవ యక్షరము డ కారము, డ కారపు బూర్వరూప మగు వింత హల్లు కోఁదగునే కాని బండిజ ఎన్నఁటికిని గానేరదు. ఏలనగా మూఁడుహల్లుల సంయోగములో రెండు బండిజ లుండవు. అట్టి యుచ్చార ముండదు

సరికాని, యింతవఱకును జెప్పిన ప్రక్రియ చొప్పున రాదు - రామఁడు, కొద్దిద్దు-కోండఁడు ఇయ్యది రూపములు సిద్ధించు ' , ని రాముఖు-T Wఁడు, పుత్రుజ్జు -పుత్రుఁడు, చందురుజ్జు ఇత్యాది విధముల రామ, పుత్ర, చందురేత్యాది ప్రాతిపదికముల తుదియకారమునకు ఉకారాదేశము కలదుగదా, ఇది యెట్లు సమర్జిత మగును? అను ప్రశ్న మున్నది. దీని కిట్లు బదులు;

సంస్కృత భాషలో అకారము రెండు దెఱఁగులు గలది. 'అ ఆ' అను సూత్రమున పాణిన్యాచార్యులు సంవృతము వివృతము అని అకారము రెండు విధము లనియు, ప్రక్రియాదశలోని అకారము వివృత మనియు, ప్రయోగదశలోని అకారము సంవృత మనియుఁ జెప్పిరి. తెఱపినోటితో నుచ్చరించిన అకారము వివృతము. ఆంధ్రద్రవిడకర్ణాట దేశములందు అకారము ప్రయోగదశలోఁగూడ నిట్లు తెలిపి నోటితో వివృతముగానే ఉచ్చరింపఁబడుచున్నది. ఈ యుచ్చార మపొణినీయము. ఆంధ్ర ద్రవిడకర్ణాటభాషల సంప్రదాయము సంస్కృత ప్రాకృత భాషలసంప్రదాయము నకంటె వేరయిన దనుట కిదియు నొక సాధనము, ఓడ్రదేశము మొదలగు నుత్తరదేశములందు హ్రస్వాకారము సంవృతముగానే ఉచ్చరింపఁబడును వారు నోరిని గొంత ముడిచియే అ కారోచ్చారము జరుపుదురు. ఆ సంవృతోచ్చారము మనకు ఉ కారమునకు, ఒకారమునకు నడిమిదిగా వినవచ్చుచుండును.

సంస్కృత ప్రాకృతములు, తద్భవములునగు పదముల తుదిహ్రస్వా కారము ఇక్ష్వాకులు మొదలగు నౌత్తరాహరాజుల శాస్త్రీయ సంవృతో చ్చారణరీతి ననుకరించుటలోఁ దెలుఁగున కా రీతి యపరిచిత మగుటచే ఉత్వముగా మార్పు చెందినది. ఈ కారణముచేతనే విభక్తి 'oడు' కు పూర్వమున నున్న అకారమునకు ఉకారాదేశము వచ్చుట ప్రాయికముగా సంస్కృత ప్రాకృత సమభవ శబ్దములకే కొనవచ్చుచున్నది. దేశితెలుఁగు శబ్దముల కట్టులేదు. కొండఁడు, తిక్కఁడు, మారఁడు, రేచఁడు ఇత్యాదిశబ్దముల కుత్వము రాలేదు గదా? ఇవి ద్రావిడ భాషా కుటుంబ సంప్రదాయోచ్చారము గల శబ్దము లగుటచే వీనికి సంవృతోచ్చారము లేదయ్యెను. ఉకారాదేశము రా దయ్యెను.