తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/అవీ - ఇవీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

11

అవీ - ఇవీ

చెవపు

హరవిలాసమున 'చిఱుబంతిపసుపుతోఁజెవపు నలఁది' అని యున్నది. పసిబాలురమేన నుండు నెజ్జమచ్చలకుఁ దెలుఁగున 'చెవ, చెవ్వ' అని వాడుక. ఇక్కడ కూడ నదీ యర్ధము కొందగుసుగాని, చెవపు ప్రాంత ప్రతులలో నున్నది. అజవమున ఎఱ్ఱఁదనమునకు 'శివప్పు', 'సెగపు' అని వ్యవహారము. అటువపు “శివప్పు' తెలుఁగున 'చెవపు' అయినది కాబోలును.

చిగురుఁగొమ్మ

మనుచరిత్రములోని పద్యములకుఁ గొన్నింటికి సొ కంటికి గానవచ్చిన పాఠభేదములను, నా బుద్ధికిఁ దోఁచిన యర్ధవిశేషములను ఇక్కడ వెల్లడించుచున్నాఁడను.


అరుణాస్పదపురవర్ణన మీట్లు గలదు.
“అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యా థి
ముది మది దప్పిన మొదటి వేలు
నచటి రాజులు బంటు నంపి భార్గవునైన
ఓంకానఁ బిలిపింతు రంకమునకు
నచటి మేటి కిరాటు లలకాధీపతి నైన
మును సంచి మొద లిచ్చి మనుప దక్షు
అచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాను
నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయం
గాసె కొంగుస వారించి కడపగలరు
నాట్యరేఖా కళాధురంధరనిరూడి
సచటఁ బుట్టిన చిగురఁగొమ్మైనఁ జేవ

పై సీసపద్యము తొలి నాల్గు చరణములలో నాల్గువర్ణములవారీ వర్ణన మున్నది. ఎత్తుగీతి మూఁడుచరణములు వెలయాండ్ర వర్ణనముగాను. నాల్గవచరణము "ఆయూరఁబుట్టినది సర్వమును సారవంతమే" యని సర్వవస్తుసామాన్యవర్ణ నాత్మకమునుగాను ప్రాచీన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించిరి. కాని యిట్టి యన్వయమునఁ గూర్పుసొంపు గొంత కొఱవడును. సీసచరణములు నాల్గింట వేర్వేఱుగా నాల్గువర్ణ్యము లున్నట్టు. ఎత్తుగీతి నాల్గు చరణములను నాల్గువర్ణ్యములు వేర్వేఱుగా నుండుటగాని, రెండేసి చరణముల కొక్కటి చొప్పున నాల్గు చరణములకు రెండు వర్ణ్యములుండుటగాని లేక నాల్గింట నొక్కటే వర్ణ్యముండుటగాని నేర్పుగల కూర్పనిపించును. ఎత్తుగీతిరెండవ చరణముతుదని సమాపకక్రియ గలదు. వాక్య ముక్కడికి సమాప్త మైనది. వ్యాఖ్యాతల వ్యాఖ్యాస రీతికి మూఁడవచరణము నా సమాప్తవాక్యములోని కీడ్చుకొనిపోయి యన్వయింప వలెను. పెద్దనామాత్యున కట్టి యన్వయ మభిప్రేమ యేని అతఁడా మూఁడవచరణమును రెండవ చరణముగానే నిలిపియుండఁగలఁడు. అప్పు డన్వయ సారళ్యము పొసఁగును. పెద్దన పయిపద్యమున నొక్కొక్క వర్జ్యమును 'అచటి' ఇత్యాదిగా వేర్పడిచి వర్ణించినాడు. ఈ తీరును గుర్తింపవలసినదే.

ఇవి యెల్లఁ బర్యాలోచించినపై నాకుఁ దోచిసయన్వయపద్ధతి నిది తెల్పుచున్నాఁడను. ఎత్తుగీతి నాల్గు చరణము లందును వర్ణ్యమొక్కటే వెలయాండ్రే. కాని నాల్గు చరణములలోను తొలి రెండు చరణములు నొకవాక్యము, తుది చరణ మింకొక వాక్యము. మూఁడవచరణము దేహళీ దీపన్యాయమున రెండు వాక్యములందును బొందుపడును. తొలి రెండు చరణములు వేశ్యాసామాన్యవర్ణనము, తుదిచరణమునందు దద్విశేషవర్ణనము. తొలి వాక్యమునకు-అచటి వెలయాండ్రు (దేవలోకము నుండి దిగివచ్చి, రంభాద్యప్సరసల నయినను వంతున కెక్కఁజూచినం దమపృష్ఠభాగపుఁగోఁక (గోచి) కొంగుతో వెనుకకుఁ దొలఁగఁద్రోచి తాము ముందడుగు వేయఁగలరు. కడవఁగలరు = ముందడుగు వేయఁగలరు. ఇక్కడ 'కడప', 'కధుమ', 'కడవ' - పాఠము లున్నవి. ముద్రణమున 'కడప' గలదు. నేను 'కడవ' గైకొంటిని. ఇట్లి రెండు చరణములందును వేశ్యాసామాన్యవర్ణనముచేసి పెద్దన కడపటి చరణమునఁ దద్వీశేషవర్ణనము చేయుచున్నాఁడు. 'నాట్యరేఖాకళా ధురంధరనిరూఢీ' ని 'అచటఁ బట్టినం జిగురుఁ గొమ్మైనఁ జేవ' అచటన్ = ఆయూర, పట్టిన = పరీక్షింపగా నాట్య మాడించి చూడఁగా వంచిపట్టి చూడఁగా. చిగురుఁగొమ్మైనస్ పుష్పిత కానీ, అంగసౌష్ఠవ మింకను సరిగా విరియని పసితనపు (వెల) కొమ్మ - ఆడుదికూడ (కొనసాగుచున్న తలిరుఁ(లేంత గొమ్మ కూడ), చేవ = చేవగలదే, గట్టితనముకలదే.

ఇంచుకవివరణము.. ప్రౌఢలగు నాయూరివెలయాండ్రు రసికుల కలయికలం దాటితేఱి యనుభవజ్ఞానము గడించినవారు గాన రంభాదులతో నారసి, శృంగారరససంప్రదాయ విశేములను నాట్యాభినయములందుఁ జూపి నేర్పు మెఱయింపవచ్చును. అది విశేషముగాదు. రసానుభవమునక్కు దగ్గవయ సింకను రాక ముందే పసిప్రాయమందె-ఆయూరి వెలకన్నెలు నాట్యాదులందుఁగడుచతురలు. అర్థాంతరన్యాసముగా నాల్గవచరణము మాత్రము వేర్పఱిచిన నాయూరఁబట్టి (వంచి) చూచిన లేఁత కొమ్మలుగూడఁ జేవగలవే. పసివారుకూడఁ గడుఁబ్రోడలే యనియు నేర్పడును. ఈ పద్యమున కానె కొంగున వారించి కడవలగలరు' అన్న పాఠము 'గదుమఁగలరు' అన్నపాఠముకంటెను, 'కడపఁగలరు' అన్న ముద్రితపాఠము కంటెను సుందరతమము. మఱియు అంచటఁబుట్టిన చిగురు' అనుపాఠము కంటె 'అచటఁ బట్టినఁ జిగురుఁ' అన్నపాఠము సుందరతరము. తెనుఁ గున పట్టిన... కొమ్మ' పలుకుబడికల్మికి నే పట్టింది. మునగకొమ్మ కాదులే' అని రామదాసు కీర్తన తార్కాణ.

ఈ పద్యమునుగూర్చి కడప వాస్తవ్యులు కళాప్రపూర్ణులు శ్రీ శేషాద్రిశర్మగారు కడపమండలముస సిగరచెట్లని చెట్లు కలవ నియు, వానికిఁ జేవ యుండ దనియు, ఆ సిగరచెట్ల కొమ్మలే చిగురుకోమ్మ లనఁబడె సనియు, పెద్దన కడపమండలమువాఁడు గాన, తదనమ్మురణమున వరణానదీతీరపు టరుణాస్పదపురవర్ణనమున వానిఁ బేర్కొనె ననియు ననిరి. ఈ పద్యమున వేశ్యలుగూడఁ గడపమండలమువారు గావచ్చును. 'కడపఁగలరు' పాఠ మున్నది గదా!!

ఆనందో బ్రహ్మా


"ఎందే డెందము గందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వృతిన్
జెందున్, గుంభగత ప్రదీపకళికా శ్రీ దోఁప నండందుఁబో
కెందే నీంద్రయముల్ సుఖంబు గను, నా యింపే పరబ్రహ్మ మా
నందో బ్రహ్మయటన్న ప్రాజడువు నాంతం బర్ధ మూహింపుమా!"


నాకు నచ్చిన పాఠప్రకారమునఁ బైపద్యము నుదహ రించితిని. అచ్చులోను, వ్రాఁతలోను దీన మఱికొన్ని పారాంతరములుగలవు, 'కందళింప', 'అంతుర్బుద్ధి' అనునవి యాపాఠాంతరములు.

ఇందు 'ఎందే డెందము' - ఆదిగా సుఖంబుగను వలకు రెండు వాక్యములు. తొలి వాక్యమున 'కందలించు'కు శ్రీజయపురాధీశ్వరులు పొసఁగించిన ధాతుజ విశేషణత్వము సుందరము. ఈ విషయము కాదు ప్రధానముగా నే నీపద్యమునఁ జెప్పఁబూనీనది.

'ప్రాఁజదువు సంతర్బుద్ధి నూహింపుమా' అన్న పాఠముకంటె 'ప్రాఁజదువు నాంతం ఐర్ల మూహింపుమా' అన్నపాఠము చాలా సుందరమయినది. ఎట్లనఁగా పయిపద్యోపన్యాసముఁబట్టి ఆనందమే బ్రహ్మమన్న యర్థము వ్యక్తపడును. కానీ యింతమాత్రమున వరూధీనివాదము నెగ్గదు. ప్రవరుఁ డనఁగలఁడు. 'ఇది యథార్థమే. ఆనందమే బ్రహ్మము. ఆయానందము నాకు గృహ్యాచారధర్మానుష్ఠానమువలన లభించును' అని. అట్లనుటకు వీలులేకుండ 'ఆనందమే బ్రహ్మము, ఆ యానందము సంభోగరూపము.' అని నిరూపించుటకు 'ఆనందో బ్రహ్మ' అన్న యుపనిషన్మంత్ర ప్రతీకము నిచ్చి యా మంత్రమును కడ ముట్టఁ జదువుకొని యర్ధ మూహించి చూడు మనుచున్నది. ఆమంత్ర మిది.


“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్,
ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయస్తే,
ఆనందన జాతాని జీవని
ఆనందం ప్రయ స్త్యభిసంవిశంతీతి",


దీనికి పరూథినితలఁపులో నున్న యర్థ మిట్టిది.

"ఆనందమే బ్రహ్మ మని తెలిసికొనెను. అనందమున నుండియే {సంభోగానందముననుండియే) భూతములు జనించుచున్నవి. పుట్టిన యా భూతములెల్ల నా (సంభోగా) నందముచేతనే వర్ధిల్లుచున్నవి. ఆ యానందములోనికి ప్రవేశించుచున్నవి. ఆ యానందమునకే యభిముఖ స్థితిని బొందుచున్నవి”. ఇంత కింకను బచ్చిగా వివరించి చెప్పుఁదగినట్టిది వరూథినితలఁపులోని యర్థము.

వరూథినీ యచ్చరపువ్వుఁబోఁడి; స్వాధ్యాయానుష్ఠానపరు లగువిప్ర వర్యులెందలో స్వర్గమునకు రాఁగా వారితోఁ బ్రసంగములు గావించి ప్రొడి కెక్కినది. అద్వైతులు జీవబ్రహ్మైక్యప్రతిపాదకత్రుతులను, ద్వైతులు జీవబ్రహ్మ విభేదప్రతిపాదకశ్రుతులను, ఇంక నాయావైదికమతములవారు తమతమ మతముల కనుకూలము లగుశ్రుతులను సేకరించి యుంచుకొనునట్లు, వరూథిని తృతీయపురుషార్థమే పరమార్థ మని నిరూపించుటకుఁ దగ్గశ్రుతులను గూర్చికోని నేర్చుకొనియున్నది గావలయు, పయి శ్రుతికి వరూధీని నిర్ణయించుకొన్న యర్ధము చొప్పుననే నన్నిచోడ మహాకవి యొక పద్యము రచించినాఁడు.


"పృథుల విశ్వంభరా రథమున కెదురుగా
బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు.
కొంచనాచల కార్ముకమునకు సాటిగాఁ
జేపట్టి నెవ్వాఁడు చెఱకువిల్లు,
అవిరళ (తథ?) పాశుపతాస్త్రమ్మునకు వాడి
మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
అతులితామరదానవాదిబలంబుల
గెలిపించే నెవ్వఁ డయ్యలిబలమ్ము
నట్టి జగజెట్టి మన్మథుఁ డఖలిలోక
ములకు వెఱగొంగ జీవులమూలకంద
మతని యిలుసొచ్చి వెడలనియతఁడు గలఁడె


యతని యమ్ములఁ బడకున్న యదియుఁగలదా?" వరూధిని యుపనిషన్మంత్రమునకు గోచరింపించిన క్రొత్త యర్థమును బర్యాలోచింపఁగా ప్రవరుసకు సిగ్గును, వెగటును బొడమినవి. సంభోగవిషయ మని సిగ్గు, పవిత్రమైన మంత్రార్ధము పాడుపడిన దని వెగటు. పాఠ్యాగమసూక్తపంక్తి

“ఈ పాండిత్యము నీకుఁదక్క మణి యెం దేఁగంటిమే కామశా
సోపాధ్యాయివి సా వచించెదవు మే లోహో త్రయీధర్మముల్
పాపంబుల్, రతీ పుణ్యమంచు నిఁక నే లా తర్కముల్ మోక్షల
క్ష్మీపథ్యాగమసూత్ర పంక్తి కివెపో మీ సంప్రదాయార్ధముల్."

అన్నాఁడు. ఈ పద్యమున "మోక్షలక్ష్మీ పాఠ్యాగమ సూక్త (త్ర) పంక్తి కివివో మీ సంప్రదాయార్ధముల్". అన్న పాఠము సుందరము. మోక్షలక్ష్మిని (అచ్చరపూఁబోఁడినికాదు) బడయుటకుగాను పాఠ్యమయిన యుపనిషన్మంత్ర క్రమమునకు మీ సంప్రదాయమువారు (తృతీయపురుషార్ధమే పరమార్ధ మను వారు) చెప్పెడు నర్ధ మిట్టిదియా యనుట నేఁజూపిన పాఠమున కర్ధము.

కృష్ణదేవుఁడు గాదు, బాలకృష్ణుఁడు

తెలుఁగు సకలకథాసారసంగ్రహము అయ్యలురాజు రామభద్ర విరచితము "శ్రీకృష్ణదేవరాయ ప్రేరణమున తదంకితముగా రచితమయ్యె" అని వెనుక నొకప్పుడు వ్రాసితిని. అది కృష్ణరాయప్రేరణముననే రచింప బడెనుగాని శ్రీకృష్ణదేవరాయనికిఁగాక శ్రీకృష్ణదేవుని కంకితము సేయఁ బడినది. అం దిట్లు గలదు.

"కనకవస్త్రంబు గల మృదుతనువువాఁడు
భర్మనూపురయుతవదాబ్దములవాఁడు
మీంచి వేదాంతముల సంచరించువాఁడు
ప్రౌడి శ్రీకృష్ణుఁడను పేరఁబరగువాఁడు”.

మదీయభాగ్యవశంబున స్వప్నకాలంబునఁ బ్రసన్నుండై పరమ మంత్రోపదేశపూర్వకంబుగా సకలకథాసారసంగ్రహంబునకుఁ గృతి నాయకునిఁ గావింపుమని హితోపదేశంబు చేసి యంతర్షితుం డయ్యె!. స్వప్నవృత్తాంతమును గవి కృష్ణరాయల కేఱిగించెను. ఆ రాజముఖ్యుం డిట్లనియె.

“నీవును బాలకృష్ణ పదనీరజభక్తుఁడ వార్యచిత్త మో
చాపహసద్గుణుండవు రమాధిపునిం గలలోనఁగాంచి య
దేవు హితోపదేశమునఁ దేజము నొందినవాండ విన్నిటన్
గావున నీ ప్రబంధము ప్రకాశముగా హరి కిమ్ము నావుడున్"

ఇందు పురాణాదులనుండి పుణ్యకథలను రామభద్రకవియే సేకరించిన ట్లున్నది, రాయలవారీ సంస్కృత గ్రంథానుస్మరణము లేదు. ఉపలభ్యమానమగు గ్రంథము తుదిపద్య మిది.

"కడు వచియింపరానిఘనకష్టము లెల్లను గృష్ణుసత్కృషన్
గడచితి మింకమీఁదను ఘనస్ఫుట రాజ్య రమాభివృద్ధిచొ
ప్పుడు నని మీరు గోరుటలు బాపురె వ్యర్ధము లాయె, నింక నే
నుడువఁగ నేల మృత్యువెడసూల్కొని కాసఁగవచ్చు చోటులన్

. ఈ తుదిపద్యము కృతికర్తదో, కాదేని కృతి ప్రేరకునిదో యవసానమును దెలుపుచున్నట్లున్నది.

శ్రీకృష్ణదేవరాయలవారీ కడపటికాలపుకడగండ్లకే యీపద్యము కడుంగడు సరిపడునదిగా నున్నది. ఏకపుత్రుఁడు చనిపోవుట, తిమ్మరుసుకన్నులు తీయించుట, తత్పుత్రుని తిరుగఁబాటు, తగవులు, ఈ సంక్షోభములో రాయల మరణము–ఇన్నింటి నీ పద్యము ధ్వనించుచున్నది.

శ్రీకృష్ణరాయఁడు రామభద్రకవి 'నీవును బాలకృష్ణ పదనీరజభక్తుఁ డవు' అన్నాఁడఁట. ఇక్కడ విశేష మే మనఁగా, నుదయగిరిని జయించి నప్పుడక్కడనుండి మిక్కిలి చక్కని బాలకృష్ణ విగ్రహమును శ్రీకృష్ణదేవరాయలు విద్యానగరమునకుఁ గొనివచ్చి దేవళము కట్టించి యందుఁ బ్రతిష్ఠించి పూజించుచుండువాఁడట.

ఆయన బంగరునాణెములందుఁగూడ నాబాలకృష్ణుని విగ్రహము ముద్రితమయి యున్నది. కృష్ణరాయలతోపాటు రామభద్రకవియు నా బాలకృష్ణ మూర్తిని గొల్చుచుండువాఁడు గాఁబోలును! దివ్యసుందరవిగ్రహ మగునాబాలకృష్ణమూర్తి యిప్పుడు మద్రాసు మ్యూజియములో పూజూ పురస్కారములు లేకున్నను దర్శనీయమై యున్నది.

దొరకినవఱకు 'శ్రీకృష్ణరాయకృత మగుసకలకథాసారసంగ్రహ శ్లోకము లివి:-

"క్షీరాంభోధితపఃఫలేన మహతా నీరాజితోరఃస్థల
స్తారాధీశదీనాధీనాధనయనో ధారాధరశ్యామలం
యో వేదాంతగిరా మలక్ష్యమహిమా దేవేశమువ్యైస్సుతః
సో2 యం తిష్ఠతు మామకీ సహృదయే శ్రీ వేంకటాద్రీశ్వరః"

"సాంద్రానందఘన సృషుగ్రకరుణాసంపూర్ణనేత్రాంచల:
మందాకిస్యధివాసమంజుళజటాజూటో.......
కళ్యాణాచలకార్ముకః కలయతాం కళ్యాణ మవ్యాహతం
చంద్రాలంకృతమౌళీ రద్రితనయాశృంగారితాంగ శివః "

"శ్రీమా నభూతుర్వసువంశమౌళి గీతిమ్మభూపో జగదేకవీరః
స దేవకీనామ్ని కళత్రరత్నే ప్రాసూత ధీరం సుత మీశ్వరాజ్యమ్"

"స బుక్కమాంబాం పరిణీయ తస్యామౌదార్య గాంభీర్య వివేక శౌర్యైః
దాక్షిణ్య కారుణ్య నయైశ్చయుక్తం లేభే తనూజం నరసక్షితీశమ్. "

"సబాల్య ఏపావని మర్థనాం తా మత్యర్ధశౌర్యేణ నిరంకుశేన,
మాంధాతృముఖ్యాన్ మహలాస్ మహీపాన్ యతోవిశేషై రఖిలా సజైషీత్. "

“బాహ్వోర్బలే నార్జితవిత్త జాతైః కృతార్ధయి త్వాభిల మర్దిసార్ధమ్-
కాశీ ప్రయాగాది మహార్షతీర్దే మహాంతి దానాని ముహు తృకార."

"కుశలేన శీలేన గుణేన భక్త్యా ప్రేమానుకూల్యేన చ సంయుతాయామ్.
నాగాంబికాయాం సరసక్షితీతః ప్రాసూత మాం న్యక్కృతవైరివర్గ:"

సోం హం సుతం శ్లాష్యుగుణాన్వితాయాం తిమ్మాంబికాయా మిహ తిమ్మభూపమ్
ఉత్శాద్య నామాస్య సహార్ధజాతై స్సమార్పయం వేంకటశై లభళ్. "

"ఏవం చ చేతస్య నవాప్య తృప్తిం వాతాపి పూజాం కలయే కథం వా,
శ్రీవేంకటాధీశిశు రిత్యుదారం చిత్తే విచారం కలయ న్న వాత్సమ్."

“ఉత్సాహం మము వీక్ష్య మద్గురు రథ శ్రీ వ్యాసతీర్థో ముని?
పర్యాలోచ్య పురాణశాస్త్రవివిధామ్నా యేతిహాసాది కాస్,
లబ్బా స్తత్ర కథా హరేః పశుపతే స్వామ్యం నీరూప్యా (రస్యా?) ధికం
విష్ణుం కీర్తయ సర్వధే త్యుపదిశన్ మహ్యం ముదా దత్తవాన్. "

ఆహిపెట్టు

“ఆహివెట్టితి జొన్న గడ్డాగ్రహారమృత్తి యేనూఱు దూకల వృత్తముసకు " (క్రీడాభిరామము, పొ, 80

ఆక్షేపము :

“ఇందు 'ఆహిపెట్టు = తాకట్టు పెట్టు' అని శ్రీ శాస్త్రిగారు (పీఠిక పొ. 123) అర్థము వ్రాసినారు. 80 పొరటలో మూలమునగూఁడనిట్లే యన్నది. కాని 'ఆహిపెట్టు' అను పదమే యెక్కడను గాన్పింపదు. కావున నిట 'ఆధిపెట్టు' అని యుండవలయును. ఆధిశబ్దమునకుఁ దాకట్టు అను నర్ధము గలదు.

ఈ క్రింది ప్రయోగములోఁగూడ 'ఆధిచెట్టు' పదము గలదు.

“గ్రహణసంక్రమణాదుల రాచనగరం - గాసువీసంబు వెడలమీ గ్రాసమునకు
నాధివెట్టిరి క్షేత్రంబులందుఁగొన్ని - లేస్సయుండునె గృహభర్తలేని బ్రదుకు."

(మనుచరిత్ర. 3-341

దీనికి నేఁ జెప్పు సమాధానమిది :

నిఘంటువులలో ఏకమాత్ర ప్రయోగముతో ఎన్నో పదములు పరిగృహీతము లయినవి. ప్రాంతప్రతిలో సున్న 'ఆహివెట్టు' ప్రయోగము సరికా దన్న యపనమ్మకము నాకు లేదు. కాన దానిని నే దిద్దలేదు. 'ఆధీ' పద మొకటి 'తాకట్టు' అర్థముగలది ఉన్నంతమాత్రాన 'ఆహి' ఉండ దనవుచ్చునా?,

గౌరన హరిశ్చంద్రోపాఖ్యానమున ఎల్లవ్రాతప్రతులలో 'ఆహికంబులు పెట్టి' అన్నప్రయోగము గానవచ్చు చున్నది- “ఆహికంబులు పెట్టి యవి దక్కుమితులు సాహసంబునఁ బల్కి (చూ. ఉత్తరభాగము). బ్రౌనుదొర గారిపండితులు ఇందు 'తాకట్టు పెట్టి' అని యర్ధము వ్రాసిరి. తేవప్పె రుమాళ్లయ్యగారు వ్రాతప్రతులను, బ్రౌనుదొరగారు వ్రాయించిన టీకను బరిశీలించి 'ఆహికము' తాకట్టు అనువర్ధముతో ప్రకటించిరి (చూ. 194 పుట). పిదప శ్రీవేంకటరాయ శాస్త్రులుగారు మరల నాగ్రంథమును బ్రకటించుటలో ఆహికము శబ్దరత్నాకరాదినిఘంటూధృతము గాకుండుటచేఁగాఁబోలును “ఆహితము' అని దిద్దిరి (చూ. 151 పుట), తాకట్టు అనియే యర్థము వ్రాసిరి. ఆ పాఠము ప్రాంతప్రతులలో లేదు. తెలుఁగున 'ఆయకము' అను పదము తాకట్టు అనుసర్థమున వ్యవహారమునం గలదు. 'ఆయకము' రూపాంతరము 'ఆహకము' అని యుండునని కాఁబోలును బ్రౌను, సీతారామాచార్యులు తమ నిఘంటువులలో గౌరన ప్రయోగమును 'ఆహకముగా గ్రహించిరి. కాంతప్రతులలో లేని 'ఆహకము' రూపము గ్రాహ్యముకాదు. గౌరన నవనాథచరిత్రమునఁగూడ 'ఆహికము' కలదు- ఆహికంబులు పెట్టి యప్పులు వార, వృద్ధి కొసంగుదు..' (చూ. 153 పుట), ఆహి, ఆహికము రూపభేదములు కాఁ బోలును. ఆహిపదప్రయోగము ఇంత సాధకసామగ్రి కలది. శ్రీనాథ ప్రయుక్తమయిన యీ 'ఆహి' ప్రయోగము విడనాడి యీ యర్థమున శ్రీనాథరచనముల నారగించి, జీర్ణించుకొని, కవితాబలము గడించినవాఁడు

పెద్దనామాత్యుఁడు 'ఆధివెట్టిరి' అని ప్రయోగించుట యేల యని పరిశీలింతునుగదా, మనుచరిత్రమునఁగూడ 'ఆహివెట్టిరి' అనియే యుండుట కానవచ్చెను. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో మనుచరిత్ర వ్రాత ప్రతులు 15 ఉన్నవి. అందు 11 ప్రతులలో 'ఆహిపెట్టిరి' ఉన్నది. తక్కినవి కొన్ని కాగితపుఁబ్రతులు, ఇటీవలివి. అందు 'ఆధివెట్టిరి' ఉన్నది. ఆహిపెట్టు = తాకట్టు పెట్టు అనుసర్ధముననే ప్రయోగాంతరము,

అప్పుడే గోవిందునికి ఆహివెట్టితిఁజిత్తము.
(తాళ్లపాకవారి యధ్యాత్మ సంకీర్తనములు, పుట. 69)

ప్రాకృతమున గాథా, కధా శబ్దములకు 'గాహా', 'కహా' రూపములు కలవు. 'ఆధి' శబ్దమునకు 'ఆహి' ప్రాకృతరూపము కాఁబోలును! ధ,ధలకు హకారాదేశము కొన్ని ప్రాకృతములందు గాననగును.


'తేడు.


“వీడిదె తెల్లసాకులను వీడెము సేయుచు వీధి వచ్చుచు
న్నాఁడు మదించి తిండి తినినాఁడుసుమీ యిటమీఁద నేడకో
తేఁదంగఁ బోయెడిన్ గరణదేశపుజాణఁడు గాఁగనోపు నీ
బాఁడు పడోపహార పరిపాటి యెఱుంగఁగవచ్చు వీనిచేన్||

(కీడా. 53 పొ.)


ఆక్షేపము


ఇట 'తేఁడు' = వెదకు' అని (పీఠిక 121 పా.) శ్రీ శాస్త్రిగా రర్థము వ్రాసినారు కాని తేఁడు ధాతువున కీయర్ధమును, తన్నిర్ణాయక ప్రయోగములును గాన్పింపవు. ఇదియేగాక ఈ పద్యమునఁగూడ వీరు వ్రాసిన యర్థ మేమాత్రమును సందర్భోచితముగా లేదు. శబ్దరత్నాకరములో నీ పదమునకు 'తెండు', 'శయనించు' అనునర్థము వ్రాసి,

ఆతివ పూర్ణేందుభీతిఁ దదశ్మశాలం
దేఁడి యతఁ డందు నినుమడి తీంద్ర దోఁప
మింటిపై నుంట కాదని యింటి పైకి
దెచ్చుకొంటి నటంచుఁ బెచ్చ వెడలు.

(ఆముక్త. 5-146)

ఉదాహరణముగా నీయఁబడినది. ఈ యర్థమే క్రీడాభిరామ ప్రయోగమునఁగూడ నెంతయు సమంజసముగా నున్నది. ఈ బ్రాహ్మణుఁడు పూటకూటింట భుజించి తాంబూలము వేసికొనుచు నెక్కడకో శయనింపం బోవుచున్నాఁ డని యిట భావము. మఱియు,


"అనలునిఁ గాఁడుచుం జముని నాడుచు రాక్షసుఁ బాడుచుం గప
నొసలు చూడుచుం దనుజు ప్రేవులు దోడుచు గాడ్పు కదులో
గునుకులు గోడుచున్ వరుణు గుండియఁ దేఁడుచు వాహనేంద్రు సం
దీని జన వేఁడుచున్ సృపతి నేర్పులు దీడుచు వెండి వాడిగన్',

(కకుత్స్థ. 5-123)

'గుండియఁ దేఁడుచున్ = గుండియయందు శయనించుచు --- ఇతరులను బెదరించునప్పుడు 'నీ గుండెలో నిద్రపోవుదును' అనుట వ్యవహారమునఁగలదు. దానినే యీ కవి యిట గ్రహించినాఁడు. మఱియు 'తేఁడు' ధాతువుసమానార్ధక మగు 'తెండు' ధాతువుసకుఁ గూడ 'శయనించు' అను సర్ధమే సప్రమాణముగాఁ గాన్పించుచున్నది. పై విషయము లన్నియుఁ బరిశీలించి చూడఁగాఁ గ్రీడాభి రామప్రయోగములో శ్రీ శాస్త్రిగారు వ్రాసినయర్థము సమంజసముగా లేదని తోఁపకపోదు."

ఇందుకు నా సమాధానము.

'తేఁడు' కు 'వెదకు' అను నర్థముకూడఁ గల దనుటయే నాయాశయముగాని ' శయనించు' అను నర్థము లేదనుట గాదు. 'వెదకు'

అర్థమున 'తండుదల్ తేడుదల్, 'తేడి తేడి', ఇత్యాదులు దమిళమున సర్వసామాన్యముగా వాడుకలో నుండును. రెండు తేఁడులు రూపాంతరము లగుట అంగీకరించిన విషయమే కదా. తెలుఁగునంగూడ "వాఁడు తెండుకు తెండుకు అవస్థ పడుచున్నాఁడు నే నన్న మాటకు" ఇత్యాది వ్యవహారము నా జన్మదేశమగు కృష్ణా ముండలమున నున్నది. 'తెండు' కు “తిరుగఁ దోడు, కలఁబెట్టు' పేనఁగులాడు, వెదకు, తదేకవిచారముతో నుండు" ఇత్యాది విధముల నర్థము సంగత మయియున్నది. ఆముక్తమూల్యదా, కకుత్ స్థవిజయప్రయోగములు నేఁజెప్పిన యర్ధమునకుఁగూడఁ బొసఁగునవియే “చంద్రకాంతశిలాశాలలోఁ దాపము గొల్పని పట్టు వెదకి" అనియు, “వరుణుని గుండెల వెదకుచుఁ (గలఁ బెట్టుచు)' అనియు మీఁది పద్యములలో నేఁ జెప్పిన యర్థము సరిపోవుచునే యున్నది. మఱియు నాముక్తమాల్యదాపద్యమున ప్రాచీన ప్రతులలో గొన్నింట.


“అతివ పూర్ణేందు భీతిఁ దదర్మశాలం
ద్రేణి యతఁ డందు నినుముడి తీండ్రఁదోఁప"


అని కలదు (ఓరియంటల్ లైబ్రరీ 11-2-1 ప్రాంతప్రతీ). దీనికి శ్రీనివాసీయవ్యాఖ్యలో “యువతి పూర్ణచంద్రునిమీఁద భయపడి చంద్రకాంతశాలలో ప్రవేశించి, ఆచంద్రకాంతశాలయందు చంద్రుడు మిక్కిలి వేండ్రముగా కానవచ్చేటప్పటికి” అని కలదు. సి.పి. బ్రౌనుదొరగారుకూడఁ దమనిఘంటువున నీపట్టున ప్రయోగమును "శ్రేణి" యనియే గ్రహించిరి బి. సీతారామాచార్యులవా రేలొకో, బ్రౌనుదొరగారి పాఠమును గ్రహించినవారు గారు. మఱియు, బ్రౌనుదొరగారు "శ్రేణి "కి ఆముక్తమాల్యదనుండియే ప్రయోగాంతరమును గూడఁజాపిరి. అది యిది:

'

హత్తుకొని యొక్క కొందు
సత్తెదువుం గట్టఁ బనిచి యందజకీయం దోఁ
దిలీ యొకటి గాని త్రేణి మ
కుత్తర ముత్తరమటంచు నొకప్రొద్దుకడన్."


శ్రీ వేంకటరాయశాస్త్రుల వారీ పాఠమునే గ్రహించిరి. మఱియు వ్యాఖ్యలో నిట్లు వ్రాసిరి:

“తేండి" దొరికిన వ్రాతప్రతు లన్నింటను 'త్రేణి'అని యున్నది. 'శ్రేణి' అని 'తెండి' ( శయనించి) అనుటకు ఈ ప్రాంత పుస్తకములలో తఱచుగఁగలదు. 'తేఁడు' ధాతువు “తెండు ధాతువునకు రూపాంతరముగా శ.ర.లో నున్నది. కొన్ని దేశ్యశబ్దములందు తొలియక్కరమునందలి క్రారవడులు అంతరించుట ప్రసిద్ధమే. డ కారము తావున ణకారము నిలుచుటయు సిద్ధమే. ఉ. అణఁగు-అడఁగు, పోణిమి-పోండిమి ఇత్యాదులు. కావున నిట కవి ప్రయోగించిన పదము 'శ్రేణి' అని యుండు సని యూహింపఁబడినది. ఆ ప్రాంతపుస్తకములలో టీకయుఁగలదు. అందు "శ్రేణిమటి' 'నిద్రమేల్కాంచీ' అని అర్ధమును వ్రాయఁబడినది". 'తేఁడు'కు 'వెదకు' అర్థమును నిరాక్షేపముగా నిరూపించు ప్రయోగ మీధి యొకటి గలదు;


"జూదంబుఁ బన్నిదంబును
వాదునుఁ బతితోడఁవేఁడ వలవదు కడుఁబో
రా దయ్యెనేని భృత్యులు
భేదము గాకుండు గెలువు పెనుపఁగవలయున్,"

(భోజరాజీయము)


ఆముక్తమాల్యదపీఠిక 51 - వ పుటలో శ్రీవేదము వేంకటరాయ శాస్త్రులవా రీప్రయోగమును గూడఁ జూపి యిట్లు వ్రాసిరి. * తేఁడు అనఁగా వెదకుట అని యరవమునఁ బ్రసిద్ధము. ఆ యర్థమున శ.ర. లేదు. " 'తేఁడు'కు 'వెదకు' అర్థము స్పష్టమగుచుండఁగాఁ, దదనుసారిగా క్రీడాభిరామపద్యమునకు నేఁ జెప్పిన యర్థము “ఏమాత్రము సందర్భోచితముగా లేదు", "సమంజసముగా లేదు" అఁట! ఏలో ? ఆ బ్రాహ్మణుఁ డోరుఁగంటికి వేడుకలమీఁద వేడుకలు దిలకించుటకు, విహరించుటకు వచ్చినాఁడుగానీ యారగించి నిద్రించుటకుఁ గాదు. దిట్టముగా తిండి దీని తాంబూలచర్వణము సేయుచు వేడుకపట్టులు వెదకఁబోవు చున్నాఁడను నర్థమేల సమంజసముగాదు?

బెడంగు

బసవపురాణమున-

"కోర బెడంగునో కుంచెఁడు లేవొ
ఆరగింపంగం నేరకుండినా"

అని గొడగూచికథలో ద్విపద గలదు. ఇందు 'బెడంగనో' కు అర్థము కుదరక తంటాలు పడితిని. శ.ర. బెడఁగు = అందగించు ఇత్యాద్యర్థములు పొసఁగవు. వెడఁగు = వికారము అర్థముగల దగుటచే, పాలగిన్నె పాలు త్రాగుట కనువుగా లేక, మూతి వెడల్పై వికారముగా నున్న దనీ త్రాగవైతివా అని యర్ధము కుదురుట గుర్తించి, 'అని + ఓ (అనియో) ఉండక, 'అనో' ఉండుట అతృప్తి గొల్పఁగా, సందేహచిహ్నముతో నాయర్థము పీఠికలోఁ దెల్పితిని. ఆ నడుమ శ్రీరాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగా రొకనాఁడు సంభాషణలో భీమకవి కన్నడ గ్రంథమున గిన్నె తోమనైతినా' అని పరివర్తన ముండుటను దెలిపిరీ; తెలుఁగున బెడఁగు= శుభ్రపఱచు అనుటకు ప్రయోగాంతరము లున్న గదా యా యర్థము చెప్పుఁగుదురుట అనిరి. శబ్దరూపనిష్పత్తిరీతిని పూర్వపూర్వము గుర్తించిన, వెలుఁగు, బెడఁగు పదము లొక్కదాననుండి యేర్పడినవేయగు సనుకోంటిమి. కాని భాషలో ప్రయోగము లుండ వలదా? కొన్నాళ్ళకు భారతిలో ప్రకటితమయిన త్రాళ్ల ప్రొద్దుటూరిజాసనమున “తెలు పక్కఁ గలువోవ బెళగిన పునుక మించిన వెండికోరగాఁ జేతఁ బట్టి" అని ప్రయోగము గానవచ్చినది. ఇందు 'బెళగిన' అనుచో 'ళ,గ' ల నడుమ సున్న లేదు. బెళగు, బెడగు రూపభేదములే. సోమనాథుఁ డీ ధాతువును సానుస్వారముగాఁ బ్రయోగించెను, శాసనము ననుసరించి, కోరను బెడగనో' అని సోమనాథుని, పాఠము సంస్కరించుటా? అర్థము కుదిరినదిగానీ అది సానుస్వారపదమా? నిరనుస్వారపదమా? సందేహమే.


దోహరి


క్రీడాభిరామమున ..... దాత్యూహవ్యూహంబులుం గలిగిన మోహరివాడయందు...” “కొలుచును జేనవెట్టి " ఇత్యాది పద్యము కుట్రపువాని వర్ణనముతో నున్నది. దానిఁ బ్రకటించునాఁడు మోహరివాడ యనఁగా నా కర్థము తెలియదయ్యెను, “యుద్ధభటు లుండువాడ యనుకొందును" అని పీఠికలో వ్రాసితిని. మోహరము = యుద్ధవ్యూహము అని అర్థ ముండుటనుబట్టి యట్లనుమానించితిని. ఇటీవలఁ దెలియవచ్చిన క్రొత్తయర్థము:

కాశీఖండము సప్త మాశ్వాసమున-

"ప్రార్ధింప నున్నాఁడు పాదాగ్రముల వ్రాలి
వెలివాడవాండ తద్విప్రకులుని"

ఇత్యాది పద్యమున,

-దీపింప నున్నాఁడు తెలిసి దోహరిబంటుఁ తెవి నక్షమాలికఁ జెరివి ద్విజుఁడు " అన్నచోట 'దోహరిబంటు' ఉన్నాడు. ఈతఁ డిక్కడ మఱియు చండాలుఁడు, మాల, వెలివాడవాఁడు అనియుఁ జెప్పఁబడినాఁడు. - మఱియు నాముక్తమాల్యదలో, "అనినఁ గహకహనవ్వి యదోహరికి సురద్రోహి యిట్లనియె" (9-31 వసము) అని కలదు. ఇక్కడ ' దోహరీ' యనఁగా మాల (దాసరి), చండాలుడు వెలివాడవాఁడే. అచ్చుపుస్తకములలో “అద్దాసరికి సురద్రోహి యిట్లనియె" నని కలదు కాని, ఓరియంటల్ లైబ్రరీలోని వ్రాత ప్రతులలో ఒక్కదానం దక్కఁ దక్కిన న్నింటను ' దోహరి' అనియే కలదు. బ్రౌనుదొరగారును, సీతారామా చార్యులవారును దాహరి యన గ్రహించి నేఁ జూపిన యాముక్తమాల్యదా ప్రయోగమునే యుదాహరించిరి. దాహరీ-దాసరి రూపభేదము లని వారి తలపు. కాని యా పదము 'దోహరి' యే! ఆముక్తమున ' దోహరికి సుర-⑥మి' యని 'ద్రో-ద్రో' యతీసంగతి యుండుటఁ ప్రాంతప్రతు లన్నింట దోహరి యనియే కానవచ్చుట, కాశీఖండమునను 'దోహరి బంటు' ఉండుట, అది 'దోహరి' యే యనుటకు సాధకములు, మటియు, బసవపురాణమునను, పండితారాధ్య చరిత్రమునను 'దోహరి కక్కయ్య' యను శివభక్తుని చరిత్ర మున్నది.

శివభక్తులయిన మాలలతో ద్విజులు సరిగా రని చెప్పు కథా సందర్భములో

“ముక్కంటిగుణము దాఁ గక్కయ్య నాఁగ-
నీ ద్విజులకు వైరి...

(విష్ణుమాహాత్మ్యము వర్ణించు పురాణభట్టును ముక్కలుగా నఱికి చంపెను. )

దోహరి కక్కయ్య మాహాత్మ్య మెఱఁగి
యూహింప భక్తుల నొండనందగునె"

(బసవపురా.7 ఆశ్వా!

అని కలదు. పండితారాధ్యచరిత్రమున-

"కలసె నంత్యజుఁ డనఁగా నెట్లు వచ్చు. "
నిక్క మట్లునుగాక కక్కయ్యగణము.

{బసవపురాణకథయే