తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/గ్రంధగ్రంధులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10

గ్రంథ గ్రంథులు

ఆంధ్ర గ్రంథములందు ముడులువిడని గ్రంధ గ్రంధులుగాఁ గొన్ని పద్యములు, పదములు గానవచ్చుచున్నవి. అట్టి వానిలోఁ గొన్నింటి కిక్కడనా చేతనయినంతలలోఁ జిక్కులు ఏడఁదీయఁ బ్రయత్నము చేయుచున్నాఁడను.

-1-

చందమామఘుటిక

"పాత్రసంశుద్ధి కాజ్యం టుపస్తరించి
యూరకుండిరి యిది యేమి యొక్క వీరు?
కానరా విష్ణు శాకపాకములు నెదుర
మనకు నిజమయ్యె నల చందమామఘుటిక, "

(భీమఖండము.)


కాశిలో వారముదినములనుండి తిండిలేక త్రిప్పులఁ బడుచున్న వ్యాసాది మహర్షు లొక పెద్దముత్తయిదువ యన్న ప్రదానము చేయుదు ననఁగా ననుష్ఠానములు దీర్చుకొని కూర్చుండిరి, విస్తళ్లు వేసిరి; పాత్రాభిఘారముచేసిరి. అంతే! వడ్డనగాని, యింట వంటవాసనగాని కానరాదయ్యెను. అప్పుడు వ్యాసాదు లనుకొన్న ట్టున్నచొప్పు పయిపద్యము ఇందు “మనకు నిజమయ్యె నల చందమామఘుటిక” అన్నపాదమున కర్దము కావలెను.


“తూప్లీం స్థితాః కి మేతన్ను నాణ న్నాదిక మవేక్ష్యతే:
సత్యాం భూ దధునా స్మాకం శశాంకఘుటికాకధా. "


అని పయి తెలుఁగుపద్యమునకు సంస్కృతశ్లోకము. నా కీట్లు తోఁచినది: ఉడుగక మారాముపట్టి యేడ్చుచున్నపసిబాలురను పెద్దవా రెత్తుకొని, వెన్నెలలోని కరిగి కనువిందు గొలుపుచందమామను జూపుచు “చందమామ రావే జాబిల్లి రావే.... వెండిగిన్నెలో వెన్న పెట్టుకుని, పమిడి గిన్నెలో పాలు పోసుకొని, ఒలిచిన పండు చేతఁ బట్టుకొని, ఒలవనిపండు ఒడిలో ఉంచుకొని రావే చందమామా, అబ్బాయీ నీవూ ఆరగింతురు కానీ' అని పాటపాడుచు చందమామ తన కేదో తినుబండారములు తెచ్చిపెట్టు నని బాలకు లూఱడిల్లియుండునట్లు మోసగింతురు. ఇదీ శశాంకఘుటికొకథ. సంస్కృత భీమఖండమునను, తెల్గు భీమఖండమునను. 'శశాంకఘుటిక-చందమామఘుటిక ఉన్నదిగాని, ఈ నానుడి విష్ణువురాణమున మడొక్క మాడ్కిగా నున్నది.


"ఆందని పంటి కేమిటికి నట్టు నిగిడ్చెడు విష్ణుం డన్నయా
కందున, చందమామగుటకల్. విను మీపని కట్టి పెట్టు

( 2 అశ్వా)


ఇక్కడకూడ 'ఘటికల్' అని మార్చవచ్చును గాని అచ్చులో 'గుటకల్' అని యే కలదు. ఈ పాఠమునకు, చందమామ యేమో తెచ్చి పెట్టఁగలఁ డని నోరూరఁగా బాలకులు గుటకలు మ్రింగుచుఁ జూచుచుండు టర్థమగును. భీమఖండపు 'ఘుటిక' కంటే నీ 'గుటక' సారస్యముగలది. కాని సంస్కృతపు 'ఘుటిక' కు 'గుటక' తెలిఁ గింపుగాదుగదా!

ఈ 'చందమామగుటక' మాదిరిగా 'చందమామ గ్రుక్కిళ్లు' అని ప్రయోగాంతరము గలదు.


"ఎలమి సుముహూర్తముసఁ డెరయెత్త సంతం
బ్రేషు చుడి మీఁగాఁ జందమామచెలుల
కెంపుమోవుల సుధకు గ్రుక్కిళ్ళు మ్రింగ
క్షితి గలిగెఁ జంధమామ గ్రుక్కిళ్లు నాఁడు."

(తారాశశాంకము) శబ్దత్నాకరకారు లీపద్యము సుదాహరించి 'చందమామ గ్రుక్కిళ్లు' అనుపదమును 'అధరామృతము' అని యర్థము వ్రాసిరి. కాని, వారే అక్కడ "ఇట్లు, చందమామగుటకలు, ఈ యర్ధ మింకను విచార్యము" అని వ్రాసిరి, అధరామృత మన్న యర్థము సంగతముగాదు.


-1. కేనము


'కేసము = అసూయ మొదలగు నర్థములందు నన్నిచోడఁ డుపయో గించెను 'కేణ' క్రొత్తకన్నడముననే కలదు గాని ప్రాచీనకావ్యములలోఁ గానరాదు. కావునఁ దత్రయోగముగావించిన కవి ద్వాదశశతాబ్దికంటెఁ బ్రాచీనతరుఁడు గాఁజాలదు." అని శ్రీ లక్ష్మీపతిశాస్త్రిగారు. నన్నయ భట్టారకునకు నూడేండ్లపూర్వపువాఁడును, కర్ణాటప్రాచీన మహాకవియు నగుపంపకవి తన విక్రమార్జునవిజయమున 'కేణ' పదమును పదవయాశ్వాసము 77వ, 81వ, పద్యములందు రెండు చోట్ల నన్ని చోడఁ డేయర్థమునఁ బ్రయోగించెనో ఆ యర్ధముననే ప్రయోగించెను. కాన ఇది యాంధ్రకర్ణాటకవితల యాదికాలముననుండియు రెండు భాషలలో వ్యవహృత మగుచున్న పదమే యని తెలియనగును.

-3. కనుమారి


భారత శాంతిపర్వము (ఆశ్వా.1. ప.307) న -
"కల్లు ద్రావిన పాతకం బది యగ్నివ
ర్ణముగాఁగఁగాఁచి పానంబు సేయం
గనుమారియులుకంగ ననలంబుఁజొర మహా
ప్రస్థాన మాచరింపంగఁ బాయు. "


అని కలదు, ఇందు 'కనుమూసి యుఱుకంగ' అని పాఠాంతర మున్నది. అది పరిగ్రాహ్యము గాదు. ఇక్కడ 'పానంబు సేయఁగను మారి యుఱుకంగ' అని పదచ్ఛేదమా, 'పానంబు సేయఁ-గనుమారి యులుకంగ' అని పదచ్ఛేదమా అని సంశయము. ఈ సంశయము నీక్రింది నాచనసోముని పద్యము తీర్చినది.

“పాయఁదగు మీమ్ముఁ గసుమారిఁ బడఁ బొసంగు
విషముఁ ద్రోవుట యోగ్యంబు వెల్లిలోన
ముసుఁగు టుఛితము మీ రెల్ల కనుఁగొనంగ
నాత్మవిడుచుట చను నాకు ననుచు నడలి. "

(ఉత్తరహరి. అ.4)

పదము కనుమారిఁబడుట' యగుట స్పష్టము. 'కనుమారిఁ బడుట'కు భృగుపతన' మర్ధము. శాంతిపద్యమునకు మూల మిది:

"సురాపానం సక్మత్ కృత్వా యో. .గ్ని వర్ణాం సురాం పి బేత్
మరుప్రపాతం ప్రపతన్, జ్వలనం హి సమావిశన్,
మహాప్రస్థాన మాతిష్ఠన్ ముచ్యతే సర్వకిల్పి పైః,"

(శాంతి, ఆ.34)

“మరుప్రపాతమ్ = నిర్జలదేశ పర్వతాగ్రాత్ పతనమ్) అని ప్యాఖ్య- శ్రీశైలముపై కర్మారీశ్వర మని యొక పుణ్యస్థల మున్నది. అది కొండకొమ్ము:. అక్కడనుండి భక్తులు పుణ్యలోకప్రాప్త్యర్ధమై నేల కుఱికి ప్రాణత్యాగము చేయుదురు. క్రిందఁ బడుచున్నవాఁడు, అంతరాళమున నున్నవాఁడు, ఉఱుక నున్నవాఁడు అన్న క్రమమున ఎడతెడకుండ శివరాత్రినాఁ డక్కడ భక్తులు ఉఱుకుచునే యుండెడివారు.

"కరమర్ధిఁ జేసి యా కర్మారీ నుఱుకు
ననఘుల భవపరిత్యక్త మానసుల
నఱిముఱి నవలి కర్మారీశ్వరమున
సులకు పుణ్యులఁ జూచి
పడియెడు దేహంబు పడిన దేహంబు
నడిమి దేహంబు లెన్నంగఁ టెక్కాడు"

(పండితారాధ్య చరిత్ర)

ఈ కర్మారియే తెనుఁగున 'కనుమారి' యయినది. ప్రాకృతమున ర-లు న-లుగా మారుట కలదు.

టాటాలు గుణించుట

కర్ణాటస్త్రీలు కటారికత్తి యలటే రాపాడఁగాఁ బట్టంగా
డాటా లీడ గుణింపరాదు పెఱుచోటంబోలెఁ బై పాటుసన్ "

(కీడాభిరామము)

తెలుగుఁనాట తెలివితక్కువవానికి 'తద్దన్న' అనియు, మనసు మెత్తనివానికి 'పప్పమ్మ' అనియు, గడుసరివానికి 'టట్టణ' అనియు, బూకరింపునకు 'చచ్ఛ' అనియు నాసు ళ్లున్నవి. తవర్గము దంత్యము, చవరము తాలవ్యము; టవర్గము మూర్ధన్యము, పవర్గము ఓష్ఠ్యము. 'తద్దన్న వట్టిమాటకారియే కాని కార్యకారి కాఁదు. పల్లుబిగింపే కాని కార్యపు సొంపు లేనివాఁడు (దంత్యముగాన), 'పప్పమ్మ' నే వెఱిపప్పు', ' వెఱిపప్పమ్మ' అనియు నందురు, వట్టి మెత్తనివాఁడు గట్టిగా మాటాడను, మాటాడను నేరనివాఁడుఁ (ఓష్ఠ్యముగాన). 'చచ్ఛ' బూకరింపు (తావల్యముగాన) 'టట్టణ్ణ' ఉద్ధతుడు-బ్బిఱబిగిసి నెత్తికెక్కి మాటాడువాఁడు (మూర్ధన్యముగాన) ఈ యర్ధమునకు సాధకముగాఁ గర్ణాటభారతమున పంపకవిప్రయో మున్నది.

"పన్నతర నడువ నుడియు
ల్కెన్న భుజర్గళమె సాల్లు మెసెమే ణ్ము సమే
శెన్ననుడి 'టారదాడణ
మెన్నం బెససువుదు రాజసూయం బేళల్ "

భీముని భాషణము “టారదాఢణ' అనఁబడినది. ఉద్గతము, కరినము అని, క్రీడాభిరామప్రయోగములగూడ టాటాలు గుణింపరాదు' అనఁగా, గడుసరి దుడుసుఁదనములు సాగింపరా దని యర్ధమగును

అధ్వానము

హరవిలాసమున రతివిలాపములో------

"న-న్నతిదు:ఖాన్విత డించిపోవఁ దగునా
యధ్వానపుం బట్టునన్"

అని కలదు. 'అధ్వానము--అమార్గము' అని శబ్దరత్నాకరకారు, లనిరి. 'అరణ్యము' అని కర్ణాటనిఘంటుకారులనిరి. ఈ యర్ధము లెట్లు వచ్చినవో వారు లక్ష్యము లుదాహరింప లేదు. కర్ణాట పంపభారతమున 'అధ్వానపదపరిశ్రాంత' అనియున్నది. తన్ముద్రాపకులు 'అధ్వానము మార్గము' అని యర్ధము వ్రాసిరి. అది సంస్కృత సమాసమున నున్నది. శ్వ- శ్వాస శబ్దములవలె అధ్వ-అధ్వాన శబ్దములు సంస్కృతమునే కలవేమో! అధ్వశబ్దము తత్సమ మనుకొన్న శ్రీసాథ ప్రయోగమునకు సాధుత్వము, నర్ధము నిర్భాధము లగునుగానీ కర్ణాటప్రయోగము రక్షితముగాదు. తెనుఁగున 'అధ్వాన్నము శత్రుమధ్యము' అని నానుడి యున్నది. త్రోవలో వంటచేసికొని తినుట. శత్రువు లప్పుడు చుట్టిముట్టియుండుట దాని కర్ధము. కాని సంస్కృతమున 'అధ్వాంతశాత్రవః = మార్గసీమారిపు: ' అని ప్రయోగమును, అర్ధమును వాచస్పత్యాది నిఘంటువులలోఁ గాననగును. తెలుఁగునఁగల 'తలపొలము' పదమున కీ 'యధ్వాంత' పదము సరియయిన సంస్కృతము.

“సాదు రేఁగేనేని
న్విను తలపొలమునన కాని నిలువదు సుమ్మీ"

అన్న తిక్కన్న ప్రయోగమునకు 'సాధువయిన పసరము చెలరేఁగినదా అది యెందాఁకఁ బోఁగలదో అందాఁకఁ బోయికాని నిలువదు' అన్న యర్ధము సంగతము. ఊరిబాట ముగియునట్టి పొలిమేరపట్టు 'అధ్వాంతము -తలపోటము' తిక్కన్న ప్రయోగమున కర్ణ మిదే యని నిరూపించుట కీ క్రింది ప్రయోగము కాటమరాజుకథలోనిది సాధకము ;


“తల పొలమునకుఁ బాటి నిలఁబిడ్డ గోవులను
కలవీలుచుకొన్నట్టు కాదు కయ్యంబు. "


తిక్కన భారతము, కాటమరాజుకథ రెండును నెల్లూరి కావ్యములే , 'తలపొలము' పద మక్కడ వాడుకకలది కాఁబోలును!


కనకస్వామి

బసవపురాణమున---


“జాలిఁబడి కనకములు దమక
వేలిచి కొన్న యావిధమగుఁ దమకు"


అని యున్నది. శివాలయములలో శివనివేదితాన్నాదికము నరకు లక్కడి బోయల కారగింప నిచ్చుట బసవేశ్వరునిపూర్వకాలపు సంప్రదాయము. బసవేశ్వరుఁ. సంప్రదాయము మాన్పించి, యర్చకులచే నారగింపించెను. బోయలు తగవు సాగించిరి. “శివునికి విషము నివేదింతుము, అది మీ రారగింపఁగలరా?" యని బసవన బోయల నడిగెను. “ప్రసాద మారగించి, బ్రదుకఁగోరుదుము గాని ప్రసాదము విషముచేసినఁ దిని చత్తుము గదా?" అని బోయ లనెడుపట్టునఁగల ద్విపద యది. బసవపురాణము ముద్రించనా డీద్విపద యర్ధము నాకు స్పష్టపడలేదు. 'కనకస్వాములు' అనఁగా రసవాదము (బంగారము) చేయువా రనియు, తత్ ప్రక్రియ సరిగా తెలియక తప్పుప్రయోగములు చేసి వారు తమశరీరములనే కాల్చుకొనుచుండుట జరుగునుగాఁబోలు ననియు నే నప్పు డనుకొంటిని. ఇటీవల కర్ణాట విద్వాంసులు. శ్రీశేషయ్యంగారు కర్ణాటభారతమున నేతత్సంబంధికథ యుండుటఁ జూపిరీ, అది యిది; అరణ్యపర్వమున యక్షప్రశ్నలసందర్భమున భీమాదులు నలుగురుసోదరులు యక్షునాజ్ఞ మీఱి, నీరుద్రావి చెఱువుదగ్గల నప్పుడు కృత్యకు యక్షదేవత (యముఁడే) ప్రత్యక్షమై "నీవు జాతిగల దేవతవైతేని నాచే నిప్పుడు నిపాతితులయి యెంగిలిపడియున్న యీ నల్వురను నీ వారగింపరాదు. ఎంగిలితిండి తిందువా నీవు నీవదేవత వగుదువు. నా మహత్త్వముముందు నీనీ చదేవతాకార్యక్రమము సాగఁ జాల”దని గద్దింపగా కృత్యాదేవత యప్రయోజకురాలై "అయ్యో, నే నాఁ కలిగానీ వచ్చితినే; ఆహారము కావలెనే” అనెను. "అక్రమముగా నిన్నిట్లు ప్రయోగించిన యాకనక స్వామినే యారగింపు" మని యక్షుఁ డనెను. అట్లే యా కృత్య దుర్యోధన పురోహితునిఁ గనకస్వామినే యారగించెను.


 “కనకన బేల్వె తగుళుడు
కనకననెం బొందు మాతుధర గెసెయు సుయో
ధననపురోహిత సప్పా
కసకస్వామియనె మునిదు కృత్తి గే ఉందళ. "

(పంపభార. 8 ఆశ్వా, 44 ప. }


ఈ కథ సంస్కకృతాంధ్ర భారతములలోఁ గానరాదు. కర్ణాటభారత రచనమునకుఁ బూర్వమే "కనకనిపేల్మి కనకనికే తగిలిన" దన్న సామెత యేర్పడియున్న దని పద్యము తెల్పుచున్నది. తొలుత నీ నానుడి రసవాదకారునిఁబట్టి పుట్టి వాడుకలో నుండఁగాఁ బంపకవి దానిని గొని, దుర్యోధనపురోహితునిఁ గనకస్వామిని సృష్టించి తత్పరము గావించి యుండఁబోలును.

-7- ఉప్పుతోఁ దొమ్మిది.


రామాభ్యుదయమున


“ఉప్పుతోఁ దొమ్మిదియును బెట్టి కృపణరక్షణము
గావించునే గుణసముద్రు" డనియున్నది.
'ఉప్పుతోఁ దొమ్మిది' యనఁగా ---

“ఘటః, పటం,జలం. కాష్ఠం, తండులం, తైలమేవచ! శాక, మగ్నిసమాయుక్తం. లవణం నవ సంయుతమ్"

- 8 - కోహళి


"మౌళిం గోహళ సంఘటించిన క్రియన్
మధ్యాహ్నవేళన్ మహా
కాళంబైన నభోవిభాగమున వీఁ
కంగా సెబీ ఱైండ.... -

(హరవిలాసము)

ఇందు 'కోహళి' పదమున కర్ధము తెలియదు

.

"పార్వతీపతికిఁ బ్రభాత పతి గొన్న
యలరుఁగెందమ్మికోహళీ యనంగ"

(ఉత్తరహరివంశము

పయి రెండు ప్రయోగములు తక్కఁ దెలుఁగున నీ పద - సా కిఁక నెక్కడ 17 గానరాలేదు. కుమార వ్యాసకృతషట్పదీ భారతమున 'కోహళ పద మున్నట్టు కన్నడ నిఘంటువున చెప్పండినది. దానికి Cover, Envelope అని అర్థము వ్రాయఁబడినది.

" ఎనుత దీవ్యావయవ కాంతీయ
మినుగు మోహరదే? మూడిద
పనిమిషాంగద లుధగ కాయడ
కోహళెయ నుగదు."

(కుమార వ్యాస

నహుషుఁడు సర్పశరీరపుటాచ్ఛాదనమును తొలఁగించు కొనుట యిక్కడ చెప్పఁబడినది. కాన కన్నడ నిఘంటుకారుల ఖరము వ్రాయుట సంగతమే. కుమార వ్యాసునికంటెఁ జాలఁ బ్రాచీనులగు మన తెల్గుకవుల ప్రయోగములు 'ఆచ్ఛాదనము' అన్న యర్ధమునకు ససిపడ వనుకొనెదను. తెలుప్రయోగములు రెండింటికి ('ఉల్లడ' ఒండె 'ఆలవట్టము) ఛత్రము అర్థము కాదగు ననిపించును. హరీవంశపుఁబ్రయోగముఁబట్టి చూడంగా నది వేల్పులకు రాజులు మొదలగువారు పూజాచిహ్నముగా ధరించు ఛత్రచామరధ్వజాదులవంటిదిగాఁ గానవచ్చును. పార్వతీపతి గగనకేశుఁ డుగాన నాదేవుని తలమీఁదికి వచ్చునట్టు ప్రభాతరాజు పైకెత్తిన యాలపట్టమువోలె భానుబింబ మున్న దన్నవర్ణనము సంగతము కాఁ దగును. హరవిలాసప్రయోగము నిందు కనుకూలించును. రాగిడివంటి యలంకారవిశేషమో, కిరీటమో యనుకొందమన్న 'నలరుఁగెందెమ్మి' పదమునకు తామరపూవునాకృతిగలది యని చెప్పవచ్చును గాని ప్రభాతభూపతి 'కొన్న' యన్న పదమునకు సార్థక్యము కుదురదు. ఆలవట్టము కాని ఉల్లడ కానీ 'యలరుఁగేందమ్మి' యాకృతిగల వని యన్వయింపవచ్చును. ఇట్లేల్ల యోచించితిని; గాని 'కోహళె' పదమునకు సమానార్థకముగా మహరాష్ట్రమున 'భోళి' పదము కల దని కిట్టెన్ వ్రాసినాఁడు. మహారాష్ట్రపు 'భోళె' సులువుగాఁ దెలుఁగున 'కుళా' అయియుండవచ్చును. 'కోహళి' శబ్దమును 'కోహళె, ఖోళి, కుళ్లా; పదములు క్రమపరిణామ రూపములు కావచ్చును. కాఁగా 'కోహళి' శబ్దమునకు 'కుళ్లాయి, టోపి అర్థమగును. తెలుఁగుప్రయోగములు 'కుళ్లు' అర్థమునకు సరిపడఁగలవు. 'కుళ్లా' శీర్షాచ్ఛాదనమేకదా! అది యలరు కేందమ్మియాకృతి గలది గావచ్చును.

కన్నడపు కుమార వ్యాసప్రయోగము 'శిరఆచ్ఛాదన' మనుటకు ససిపడదు. అతఁ డౌపచారికముగా శరీరాచ్ఛాదనమునకు దానిని బ్రయోగించి యుండఁబోలును.

శక 1214 నందనపుష్య శు 5 సో... నాడు శ్రీమన్మహామండలేశ్వర శ్రీవిక్రమోత్తుంగ రాజేంద్రచక్రవర్తి స్వస్తి శ్రీ త్రిపురాంతక శ్రీమన్మహాదేవరకుం బుత్తించిన పహిండిచతుర్ముఖకోహళి. దోర్దండద్వయ నిర్మదీకృత చతుర్టీ పాధిపస్థాపనాచార్య స్సూర్యసమప్రతాప మహిమా శ్రీవిక్రమోత్తుంగరాట్. ప్రయచ్ఛత్రిపురాంతకాయ వసుధాభర్తాప్రహర్తా ( ) హేమమయం చతుర్దశపలోనాభ్యాం తులాభ్యాం మితమ్.


{మార్కాపురంతాలుకా త్రిపురాంత కేశ్వరాలయ శాసనము. }


శక 1344 - శుభకృత్కార్తిక కృష్ణతృతీయ - శ్రీవిష్ణువర్ధన మహారాజు అయిన శ్రీ నరసింహాదేవర చక్రవర్తులు.. ... .... ధర్మలింగానకు పంచవరక్షకోహళి భంగారానం జేయించి సమర్పించిరి.

(విశాఖపట్నం జిల్లా --పంచదారులో ధర్మలింగేశ్వరాలయ శాసనము. ) ఈ రెండుశాసనములవలనను. శివలింగమునకు అయిదు ముఖములతోఁ జేయించిన 'టోపి' - 'కుళ్ళా'- శిర ఆచ్ఛాదనము అగుట స్పష్టపడినది, తొలి శాసనము సంస్కృత శ్లోకమున ప్రధానభాగము స్పష్టముగాలే దయ్యేను. అచ్చో ఉద్ధీషపద ముండు ననుకొనెదను. శాసనప్రతిబింబము సరిగాఁ బరిశీలింపవలెను. ఇట్టికసూఁడినవాఁడు

ఉత్తరహరివంశమున నరకాసురున కోడి దిక్పాలురు పారిపోవుటను వర్ణించుటలో యమునిఁ గూర్చి యీ క్రింది పద్య మున్నది.

 “ఇట్టిక సూఁడినవాఁడో
యెట్టిడుకొన్నాఁడొ యనుచు నుల్లసమాడన్
బట్టగుచు మగిడి చూడక
పట్టణమున కేఁగె లజ్జిబండతనమునన్."


పై పద్యమున కనేకు లర్ధము నడిగిరి. లోకాచారము గొంత యెఁగిన వారు గాని దీని యుద్ధము వివరింపఁజాలరు. నరకున కోడిపోయి యముఁడు తనపురమునకుఁ బరుగువాఱు చున్నాఁడు. అట్లు పరుగువాఱుటలో ముందరిచూపే కాని వెనుకచూపు లేదు. అది చూచినవారు “ఈతఁడేమి యిటిక యావమునకు నిప్పంటించి వెళ్లుచున్నాడా? మఱి, వెనుకకుఁదిరిగి చూడనే చూడనని యొట్టుపెట్టుకొని వెళ్లుచున్నాఁడా" అని పరిహాసమాడఁ దగినట్లున్నది. ఇటిక యాపమునకు నిప్పుముట్టించు వారు ముట్టించిననిప్పు అంటుకొన్నదా, లేదా అనియేని వెనుకకుఁదిరిగి చూడకుండ వడిగా ముందుచూపుతోనే వెడలిపోవలెను. అట్లు వెనుకకుఁ దిరిగిచూచిన నా యావము కాల్పు సరిగా సాగక చెడు నని లోకప్రతీతి. ఈ లోకప్రతీతి దెలియకున్న పద్యార్ధ మెఱుకపడదు.

మఱియు నీపద్యము నాల్గవచరణమున 'లజ్ఞబండతనమునన్' అని యున్నది. దీనికి 'లంజెబండతనమునన్' అనియు, 'లంజెబండతనమునన్' అనియు బాఠాంతరము లున్నవి. కవికర్ణరసాయనమునను, గౌరన హరిశ్చంద్ర చరిత్రమునను ఈ పదము ప్రయోగింపబడినది. లబండ సిగ్గుమాళినవాఁడు. (మనుచరిత్రము శ్రీకృష్ణదేవరాయలవారి కాలమున వెలసిన యాంధ్ర ప్రబంధములలోఁ బేరెన్నిక గన్నది. విద్వాంసు లెందఱో దానిపయి విమర్శనముల వెలయించి యున్నారు. దాని ఘనత కవి తార్కాణములు. జాగ్రత్తతోనే నీ నడుమ నాగ్రంథమును జదువఁగా గొన్ని సందేహములు, తన్నివారణకై పరిశీలింపఁగా గొన్ని చక్కని పాఠములు, అర్ధవిశేషములు గోచరించినవి. అందుఁ గొన్నింటి నిందు వెల్లడించుచున్నాను.)


- 10 - చేర్చుక్క

“చేర్చుక్కగా నిధ దీన్ని జాబిల్లిచే
సిందూర తిలకంబు సెమ్మగిల్ల."


ఇది ముద్రితపాఠము. ఈ పద్యము సరస్వతీమూర్తివర్ణనాత్మకము. సరస్వతీదేవి చేర్చుక్క యను నగగాఁ జంద్రకళ నలంకరించుకొన్న దన్న యర్థము మీ ముద్రితపాఠమున. “చేర్చుక్కగా నుండు చిన్ని జాబిల్లిచే " నని కొన్ని వ్రాత ప్రతుల పాఠము. సాజముగానే సరస్వతీమూర్తి చంద్రకళా లంకృతమస్తక కావున తలపై నున్న యా చంద్రకళ చేర్చుక్క యన్న యలంకారపుసొంపును గూర్చుచున్న దన్న యర్థ మీ ప్రాంత ప్రతిపాఠమున. వ్రాత ప్రతిపాఠము సుందరతర మగు నేమో!

భరమై తోఁచు కుటుంబరక్షణ


“భర్తమై తోచు కుటుంబరక్షణకుఁగాఁ, బ్రాల్మాలి చింతన్ నిరం
తరతాళీదళసంపుటప్రకరకాంతారంబునం దరపుం
దెరువాటుల్ గొని కొట్టి తద్జ్నపరిషద్విజ్ఞాతచౌర్య క్రియా
విరసుండై కొలఁతం బడున్ గుకవి పృథ్వీభృత్సమీ పక్షితిన్."

కవీశ్వరులనే యధికముగా సత్కరించుచుందురుగాన శ్రీకృష్ణదేవ రాయలవారి యాస్థానిలో కవిత చేతఁగానికుకవులు కవిసత్కారము బడయగోరి, ప్రాచీసతాళపత్ర పుస్తకగతములయియున్న గ్రంథములనో, గ్రంథ భాగములనో స్వరచితములఁగాఁ బ్రకటించుకోనుచుండుటయుఁ , పెద్దనాదులు వాని గుర్తించి రాయలసన్నిధి నవమానపఱుచుచుండుటయు జరుగుచుండెడిది గావలయు.జాలీమాలి పెద్దనామాత్యులవా రటువంటి చేతఁగాని దొంగకవుల నీ పద్యమునఁ జెంగనాడినారు.


ఈ పద్యమును విని కోపించి కావలయును, పెద్దనగారియు, శ్రీకృష్ణదేవరాయలవారియు కాలముననే వర్తిల్లినవాఁ డొక యసహాయ కవితాశూరుడు, కవిరాజు (కవిరాజపద మీట తత్పురుష, కర్మధారయములు రెంటను సంగతమే. ) పెద్దనామాత్యుల వారిని వారి మాటలనే త్రిప్పికొట్టినాఁడు.


“అతికుటుంబరక్షణా పేక్షఁ బ్రాల్మాలి
కృతులు మూఢభూమీవతుల కిచ్చి
చచ్చి నీరయమునుఁ జనుకంటె హరిహరా
ర్పణము చేసి సుగతిఁ బడయరాదె?"


పెద్దన గారి “భరమై తోఁచు కుటుంబరక్షణకుగాఁ బ్రాల్మాలి" యన్నకూర్పు నీతఁడు “అతికుటుందిరక్షణా పేక్షఁ బ్రాల్మాలి' యని యనుకరించుట. పెద్దనగారు చేసిన కుకవినిందను గుర్తించి, వారి త్రోవనే సూటిగా వారికే తగులునట్లు ప్రతినింద చేసినాఁడుసుమా యని విజ్ఞులు వివేకించి తెలిసికొనుటకో యన్న ట్లున్నది. కుటుంబరక్షణకై ప్రాల్మాలి తెక్కులికవులు ప్రాచీనగ్రంథార్థముల హరించి రాజులదగ్గటు వెల్లడించుకోఁ బోయి కొలఁతఁబడుదు రని పెద్దనగా రనఁగా నీతఁడు "కుటుంబరక్షణకై ప్రాల్మాలియే సుమండి సత్కవులుగూడఁ గొందఱు మూడు లయిన (స్వయము రచింపను, ఒండె అన్యులు రచించిన గ్రంథముల సారస్యము గ్రహింపను నేరని) రాజులకు స్వరచితకృతులను (కృతికర్తృత్వ రూపముననో, కృతిపతిత్వరూపముననో) అంటఁగట్టి ( ఈలోకమున భోగభాగ్యములతో నందలా లంబారీలు నెక్కి యూరేఁగిన నేమి) పరలోకమున బాధలు పడుదురు" అని పెద్దన గారి కెదురుదెబ్బ కొట్టినాఁడు. ఇట్లు నిబ్బరించి చెప్పిన మొనగా డెవ్వఁ డనఁగా బైచరాజు వెంకటనాథకవిరాజు. ఈతని కృతి పంచతంత్రము. తెలుఁగున దేశిరచనాచమత్కారము గల గ్రంథ మీతని గ్రంథమును బోలునది వేఱొకటి గానరాదు. “ఈ రాచకవిత్వబాధ పడరాదు పరామరిసింపు దైవమా" యని 'శారద నీరూప' మనఁబడిన గడుసరీ కవిచేఁగూడఁ బిలికించినవాఁడు. ఈతఁడు తన కృతిని తిక్కన, నాచన సోమనలవలె హరిహరార్పణము చేసినాఁడు.

"ఏ చనవు గలదు హరిహర
సాచివ్యము నొంద నన్యజనులకు మది సా
లోచింపఁ దిక్కయజ్వకు
నాచనసోమునకు నింక నాకుం దక్కన్?"


ఇతరరాజులతో పాటు కృతికర్తృత్వమును సొమ్మిచ్చి తనపై వేయించుకొన్న వాఁడే యీ రాజుగూడ నని లోకులనఁ బోవుదు రన్న భయమునఁగాఁబోలు, స్పష్టముగా నీతఁడు-----


"అసహాయసరసకవితా
రసికుఁడ వేంకటధరావరప్రభుఁద, గుణ
ప్రసరప్రకాండమదవ
ధృసలాయితవిద్వదఖిల బంధుప్రజుఁ డన్."


అని చెప్పి కొన్నాఁడు.మఱియు గద్యమున “నిస్సహాయకవితా నిర్మాణభోజ భూదార” అని తనకు విశేషణముఁ జేర్చుకొన్నాఁడు. “నిస్సహాయకవితానిర్మాణ చతురుఁ డానాఁటికి భోజదేవుఁడు, నీనాటకి మరల నేను " అని యీతఁడు గుండె సంచికొని చెప్పుకొన్నాఁ డన్నమాట. కొఱుత


పెద్దనగారి పయిపద్యమున 'కోలంతన్ బడున్' అనుచో 'కాటం తన్ = న్యూనతను' అని యొక యర్థము, 'కొఱుతన్ = కొఱున' అని యింకొక యర్థము రావలెను. ఒక యర్థమున నా పదమున 'ఱ' అ కొరవిశిష్టము. సాధానుస్వారము; ఇంకొక యర్ధమున ఉ కారవిశిష్టము, నిరనుస్వారము. ఒక యర్థమున 'నా పదమున నరసున్న గలదు! వేరొక దాన లేదు. "శ్లేషే సఖడనిర్బింద్వో ర్మేళనం కుత్రచి న్మతమ్" అన్న శాస్త్రము చొప్పునను, “లడయోర్నణయో శైవ...... స్యా దభేదేన కల్పనమ్" అన్న శాస్త్రము చొప్పునను అఱసున్న కలిమిలేములు శ్లేషార్థమునకు బాధకములు గావుగాని, అకారోకారభేదము బాధక మనియు, ఇక్కడ శ్లేషార్ధము దుస్సాధ్య మనియు పెద్ద లందఱుఁ జెప్పుచున్నచొప్పునే నే నెప్పుడో వెల్లడించితిని. గుంటూరి విద్వాంసు లొకరు ఈభేదముకూడ పాటింపరానిదే యని, శ్లేషము చెల్లు నని కావ్యాలంకార సూత్రాంధీ కరణమునఁ గాబోలును వ్రాసిరి. తలుపు, తలఁపు ఇత్యాదులకు శ్లేష సంగతి చెల్లుననుటగదా యిది! విజ్ఞులు ప్రమాణము.

-13.

శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁడు.

 *ప్రజల రాజాధిరాజ వీర ప్రతాప
రాజపరమేశ బిరుదవిభ్రాజి యెవ్వం
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుల
డొక్కనాఁడు..."

ఇందు "శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుం” డనుచోట "కృష్ణరాయ వీరాగ్ర గణ్యుఁ" డని పాఠ మున్నది. "శ్రీ కృష్ణదేవరాయ" పదము సంజ్ఞావాచక మనుకొనుచో “అగ్రగణ్యుఁడు" అన్న పదముతో సమాసము ససిపడదు. “శ్రీ కృష్ణరాయ వీరాగ్రగణ్యుడుఁ" డనుపారము సుందరమయినది. తొలిపాఠమునే యభిమానించువారు 'కృష్ణదేవ' నామముగల రాజాగ్రగణ్యుల డని పొసఁగించుకొనవలసియుందురు.

14 పాలింపఁగాను


...... భూవిభుని కృష్ణరాయఁ డభ్యుదయ మంది - పెంపుమీఱంగ, ధాత్రి పాలింపుచుండ" నని యచ్చు. ప్రతులలో నున్నది. ప్రాంతముద్రణము నందును. వ్రాతప్రతులలోను "పెంపుమీఱంగ ధాత్రిఁ బాలింపఁగాను" ఉన్నది. ప్రాచీన కవులు కొందఱు 'పాలించుచు' అనియే కాని, 'పాలింపుచు' అని ప్రయోగము చేయరయిరి. పెద్దన యాత్రోవవాఁడు గావచ్చును.

- 15. వామనసుతి

"ప్రత్యూషపవనాంకురములు పై కొనువేళ హమన స్తుతిపరత్వము: లేచి" - - ఇక్కడ 'వామనమూర్తి ప్రోత్రము నందలియాసక్తిచేత విష్ణుమూర్తి స్తోత్ర పారాయణముతో ననుట' అని వ్యాఖ్య.కానీ యిక్కడ వామనస్తుతి యనఁగా 'దధివామనగ్రోత్ర' మను సంస్కృత స్తోత్రగ్రంధ మగును శ్రీకృష్ణదేవరాయలవారు తెల్లవారుజామున నిద్ర లేవఁగానే యీ దధివామన స్తోత్రమును బారాయణము చేయుట పరిపాటి. రాయవాచకమును యవాచకమును జూచునది. దధివామను+డనఁగా 'వెన్నముద్ద బాలగోపాలకృష్ణమ్మ' ఆంధ్రదేశ మంతటను సామాన్యముగా స్త్రీ పురుషులు తెల్లవారుజామున నిద్ర లేచి భూపాలరాగముతో 'గుమ్మఁడేఁడే గోపిదేవీ' ఇత్యాదిగా దధి వామన స్తుతినే చేయుచుందురు.

-16.

 మండలిక తపన
“మండలికతపన శోభిత!
కుండలిపతి శయన కర్ణకుండలిత రసా
ఖండకవి కావ్య! దిగ్వే
దండశ్రుతిడళనకలహతాడితపటహా ! "

“మండలికతపనుఁ డను బిరుదుచే శోభిల్లువాఁడా! కుండలిపతి శయనునికిఁ గర్ణకుండలములుగాఁ జేయఁబడిన రసాఖండము లగుకవి కావ్యములు గలవాఁడా!” అని వ్యాఖ్య.

'మండలికతపనశోభిత' అని సమాసమగుచో మండలిక తపనుఁడు అను బిరుదుచే శోభిల్లువాఁడా' అని యర్థము నీయఁగలశక్తి దాని కుండదు, వ్రాతప్రతీపాఠ మిట్లున్నది. “మండలికతపన! పూజితకుండలి పతిశయన!" 'మండలికతపన!' బిరుదాంకసంబోధనము. ఇఁక పద్య మీకిందితీరు సంబోధనములతో నుండును.


  • మండలికతపన! పూజిత

కుండలిపతిశయన! కర్ణకుండలిత రసా
ఖండకవికావ్య! .... ....."


రసాఖండము లగుకవుల కావ్యములను కృష్ణరాయలే కర్ణకుండల ములుగాఁ జేసికొనుచుండువాఁ డని యర్ధమగును. -17. చతుర్విధ కవితలు


“శరకోపప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని” అని యాశ్వాసాంతగద్యమునఁగలదు. 'చతుర్విధకవిత' లనఁగా 'బంధము, చిత్రము, గర్భము, ఆశువు' అని వ్యాఖ్య. ఇది సరిగాదు. ఆశు, మధుర, చిత్ర విస్తరము లన్నవి చతుర్విధకవితలు.


- 18 - రాచవారు

'వల రాచరాచవాం డలీకాక్షు కనువెచుఁ గరఁగిన యల కనికరపుఁజోటు". (2-10


పై పాఠ మచ్చులో నున్నది. 'రాచవాఁడు' అని యేక వచనాంతముగా నా పదమున కెక్కడను బ్రయోగము గాన రాదు. 'రాచవారు' అన్నపదము ' దొరవారు' అన్నపదమువంటిది.

“ఒక చపలాక్షి లేఁజిగురుటూయేలం యలరాచవారి నిక్కకు నెలయింపవచ్చు... " (ఉత్తర హరివంశము

“ఏనిక మోముతాల్పెలుకనెక్కిసరావుతు రాచవారు" (భీమఖం. "ము)


కనుక నిక్కడఁగూడ 'వలరాచరాచవా రలికాకు కనువెచ్చ' ... సియే యుండవలెను. - 19 - అనుకూలగతి


“అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంత మది నెంత గుందునొక్కొ”. ఇక్కడ 'అనుకూలవతి' యన్న పదము కేశపడి సమర్ధింపవలసినది, అనుకూలపదమున కానుకూల్య మర్ధము చెప్పుకోవలెను. 'అనుకూలగతి' యన్న పాఠము వ్రాతప్రతులలో సున్నది. దీని గ్రహించిన నే యసందర్భము నుండదు.


- 20 - కుఱంగలి, ఓసరించక


 “గొంటుందనం బెఱుంగక కుటుంగటనున్న యమ్మహీసుర ... గదురు
మనంబున నొసరించక చంచల దృగంచలప్రభలు.............. ( (2-61)

పయి వచనమున అనుప్రాససంగితినిబట్టి 'కుఱంగట కంటె 'కులుంగట' యుండఁదగు ననిపించును. శబ్దనిష్పత్తికూడ (కుఱు + కలను) 'కుఱుఁగలి' యగుటకే ససిపడును. ప్రాంతప్రతులలో 'కుఱుంగట' అన్నరూప మున్నది. మటియు నీపదము సోమనాథుని యుత్తరహరి వంశమునఁగూడ 'కుఱుంగలి' యని యనుప్రాససంగతితోనే కలదు.

 “చక్రంబు మొదలగు కైదువలు మెఱుంగులు
గుఱుంగలించిన రవీమండలంబు తెఱంగున

(ఉ.హరీ. 4 ఆశ్వా)

ఇట్లు చూడఁగా 'కుఱుంగలి' రూపము సాధు వని యేర్పడినది. 'కులంగలి' రూపపు సాధుత్వము చింత్యమే. మఱియుఁ బయివచనమున 'ఓసరించక' పెద్దన సమ్మతించినది.

- 21 - ఉపాధ్యాయి

"ఈ పాండిత్యము నీకుఁదక్క మఠ యెందేఁగంటియే"

అన్నపద్యములో 'కామశాసోపాధ్యాయివి” అనంగా ఉపాధ్యాయుని పత్ని అనికాక, స్వయము వ్యాఖ్యానము చేయనేర్చిన యుపాధ్యాయురా లని యర్ధము. వరూధిని యుపనిషన్మంత్రమునకు స్వయము క్రొత్తర్ధము కల్పించినది గదా!


-22- బాహూమూలరుచి


ప్రవరుఁడు రోఁతచెంది 'చెప్పకు మిట్టి తుచ్ఛసుఖముల్ మీసాలపైఁ దేనియల్' అని తెగడఁగా వరూధిని హృదయాజ్ఞము జల్లన. నీవీ బంధ మూడఁగా, కొప్పు వీడఁగా, రతిసంరంభము మీఱఁగా, పైపాటున

"ప్రాంచద్భూషణబాహుమూలగుచితోఁ బాలిండ్లు పొంగారఁ బైయంచుల్ మోవఁగ గౌఁగలించి యధరం బాసింప........"

ఈ పద్య మిట్లు ముద్రణములం దున్నది. వ్యాఖ్యాతలు "ప్రాంచ ద్భూషణములయొక్కయు, బాహుమూలముల యొక్కయుఁ బ్రకాశముతో పాలిండ్లు, పొంగారన్ = ఉబ్బఁగా, పైయంచుల్ = చనుమొనలు, హెచః గన్ = అనునట్లుగా, కౌఁగిలించి" అని వ్యాఖ్య వ్రాసిరి. కాని ప్రాంత ప్రతులలో : పాలిండ్లు పొంగారి పైయంచుల్ మోవఁగ' అని పాఠ మున్నది. ప్రాంచద్భూషణములగు (ప్రాంచద్భూషణపదము బాహులకుల గానీ, తన్మూలములకుఁగాని విశేషణము) బాహుమూలముల కాంతితో (ఆ కాంతి యలముకొనె ననుట) పాలిండ్లు పొంగారి, పై యంచుల్ మోవఁగ = దోర్మూలకూలంకషములుకాఁగా ('ప్రతిక్షణ విజృంభణా దుభయబాహుకూలంకషస్తనత్రుటితకంచుక' మిత్యాది ప్రయోగముల ననుసంధించునది). అధరం బాసించినది. ఇక్కడ పైయంచుల్ = చూచుకములు అని వ్యాఖ్యానము సుందరము గాదు. రతిసంరంభము మీట పై పాటునఁ జేసిన కౌఁగిలింత యట్టిదిగా నుండదు. ఈ సందర్భము నింకను దెలిఁగించుట బాగుగాదు. కళాప్రపూర్ణులు శ్రీ శేషాద్రిశర్మగా రిక్కడ నిట్లు వ్రాసిరి. "బాహుమూలరుచితోన్ = భుజశిఖరముల కాంతితో... మూల మనఁగా మొదలు,బాహుమూలము లనఁగాభుజశిఖరములు అను సర్ధ మేరుడుసు.బాహుమూలము కేయూరము లనుభూషణము లుండును. స్త్రీలకు నుండునా యని ప్రశ్నింతురేమో! స్త్రీపురుషసాధారణము లగుభూషణములే యవి యని యేర్పడును. కేయూరచతుష్టయము పరమేశ్వరికీ భూషణములుగాఁ జెప్పఁబడినవి. కావున నా పేరుగల భూషణములతోఁ గూడిన బాహుమూలముల కాంతితోఁ బాలిండ్లు పొంగార, అనఁగా నాకేయూరరత్నకాంతులు వక్షోజములపై వ్యాపింపఁగా నని యర్ధము సిద్ధమగును... ..... కంచుకము సడలించిన దని యంగీకరించినను రూఢ్యర్ధమగు బాహుమూలకాంతి యసంగత మనవలయును. వీనికిఁ బ్రోద్బలముగాఁ బై పద్యమున “నీ వీ బంధ మూడన్' అను మొదలగు రతిసంరంభచిహ్నములు చెప్పుల బడినవి. కనుక రూఢ్యర్ధ మంత సరసము గా దని తోఁచెడిని".


విమర్శ మిదె యేమో నేఁ దెలియఁజాలకున్నాఁడను. సంస్కృతాంధ్ర కవులు పలువురు భుజయుగము వయికెత్తిన సందర్భములందు స్త్రీబాహుమూలద్యుతుల' వేలమువెఱిగా వర్ణించిరి. ఆంధ్రమున నిట్టి సందర్భము వర్ణింపని యర్వాచీన కవి యుండఁ డనవచ్చును. వరూధిని

. భుజము లెత్తినప్పుడు వర్ణ్యము భుజశిఖరము లగునో, యిం కేమగునో చర్చ యెందుకు? 'పెద్దనామాత్యుఁడే తెనాలిరామలింగఁ డన్నట్టు 'బాహుమూలరుచి' వర్ణనాభిమానము విడువఁజాలక కాఁబోలు మరల మరల నీ తీరుననే పంచమాశ్వాసమున వర్ణించినాఁడు.


ఉత్కంరాగ్రయై నిక్కి నా


ధుని మౌళిన్ దలఁప్రొలువోసె నవలా దోర్మూలకూలంకష
స్తనవిస్ఫూర్తికి సందిదండలధళల్ సాహోని సాదం బిడన్

ముడివడు కంకణ ప్రభల ముత్తెపు సేసలు దోయిలించి యె
తాడు తటి బాహుమూలకుచదీప్తుల పైఁ బతిదృష్టి పర్వీనన్
బాణీయుగమున్ వెసవంచియ మౌళిమీఁదికై
పొడవునం జల్లె- "

(మనుచరిత్ర 5 ఆశ్వా)

రంగనాధ రామాయణమందును ఇట్టి వర్ణన ఉన్నది. ఇదిగో.

“పొంగారు కుచకుంభములు పదార్వన్నె
బంగారుపొడిరాలు బాహుమూలములు",

పెద్దనామాత్యుఁడు తాను తొలుతఁ జెప్పిన పద్యములోని 'ప్రాంచ ద్భూషణము' లను స్పష్టముగాఁ బంచమాశ్వాస పద్యమున 'సందిదండ'లని తెలియఁజెప్పినాఁడు గదా !