తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/వింతనిఘంటువులు

వికీసోర్స్ నుండి

9

వింత నిఘంటువులు

ఆలజాలము

"ఆలజాలంబు నీరిలో నాడుజాడ
గాలిపడగ యాకసమునఁ గ్రాలుత్రోవ
నిదురలోపలఁ గలదోచు నీడవిధము
గానవచ్చునె యప్పుడ కన్నఁ గాక! "


"కలలోఁ గన్న పురుషుని, నా చూచినప్పుడు గుర్తింపవలసినదే కాని పిదప మరలఁ గాననగునా” యని యుషతోఁ జిత్రరేఖ యను సందర్భమున, ఉత్తరహరివంశమునఁ బంచమాశ్వాసమునఁ బైపద్యమున్నది. ఇందు 'ఆలజాలము' అన్న పదమున కర్ధము గావలెను. ఈ పదము తెలుఁగున నా కన్యత్ర కానరాలేదు. సంస్కృతమునఁ గాదంబరిలో రెండు చోట్లఁ గాన వచ్చినది.

(1) “యేషాం చ క్షుద్రాణాం ప్రజ్ఞా పరాభిసంధానాయ న జ్ఞానాయ శ్రుత మాలజాలాయ".

(2) ఇత్యేతాని చాన్యాని చాలజాలాని దుర్జీవితగృహీతా చిన్తయన్తీ జాగ్రత్యేవా ౽ తిష్ఠమ్".

ఇందు తొలివాక్యమున 'ఆలబాల' పదమునకు ముద్రిత వ్యాఖ్యలో టీకలేదు. రెండవ వాక్యమున "ఆలజాలాని = స్వప్నాం తర్గత ప్రాగణి" అని యర్థమున్నది. సంస్కృతమున నింక నితరత్ర నా కీపదము గానరాలేదు.

కన్నడమున పంపభారతమున 'బాణజాలమదుభోంక నెనోడువు డాళజాల మాయైనె కడిదొట్టి' {12-68) అని యున్నది. పై కర్ణాటక ప్రయోగమున, ఆలజాలపదమునకు ఛిన్నభిన్నమయినది. మాయమయినది అన్న యర్థము పొసఁగును.కాదంబరీ ప్రయోగములకు పలవరింత, చీకాకు అన్నరీతి సర్ధము పొసఁగును. తెలుఁగు ప్రయోగమున కీ యర్థములు పొందుపడవు. ఔపచారికముగా నేదో యర్థము పై ప్రయోగముల కనుగుణముగాఁ గుదుర్చుకొనవలెను. కానీ, వృద్ధానుశ్రుతిలో 'ఆలజాలం మీనపదమ్' అని నిఘంటువాక్య మున్నది. ఈ వాక్య మేనిఘంటు లోనిదో యెఱుఁగరాదు. నా చూచినంతవఱకు నేసంస్కృత నిఘంటువునను గానరాలేదు. ఇది నాచనసోమనపద్యమున కైయే పుట్టిన నిఘంటువేమో యనిపించుచున్నది. ఈ నిఘంటువు ప్రకారమునఁ జూడఁగాఁ బద్యమునకుఁ జక్కని యర్ధము పొసఁగును. నీటిలో చేపయడుగు నడచుజాడ, ఆకసమున గాలిపడగ యాడుబ్రోవ ఇత్యాదిగా సుందరమయిన యర్థసంగతి యేర్పడును.

“ఔదుంబరాణి పుష్పాణి, శ్వేతః కాకశ్చ దృశ్యతే,
మత్స్యపాదో జలే దృశ్యః, నారీచిత్తం న దృశ్యతే".

అని శ్లోక మొకటిగూడ ఆలజాలమునకు మీన పదార్ధమును

బలపడుచునది గలదు, మఱియు
"తటతట నన్నీటిమీఁద నాలజాలంబు
సీటునటుల జరియించ యీఁదీయీంది
అటువలెనే పో తమకమందిన సంసారపు
ఘటనకై తిరిగితిమి కడ గానలేక,
"ఆలపోళువానితోడ నంటిన మేనివాఁడు
ఆలగాపరుల తోడ నాడినవాఁడు
ఆలజూలమై సన్నీల నలరఁ దేలినవాఁడు
ఆలపోతుకొండమీద ననువైనవాఁడు".

(తాళ్ళపాకవారి పదములు), నాచన సోమనాథుని “యాలజాలంబు నీరిలో నాడు జాడ" యన్న ప్రయోగముకంటె స్పష్టముగాఁ బై తాళ్ల పాకవారిపదములు 'ఆలజాల' మనఁగా 'మీనపద' మన్న యర్ధమును సమర్ధించుచున్నవి.

మాఘమాసే గహమీవ

"అర్జునస్య ఇమేబాణా
నేమే బాణా శిఖండిన,
కృష్ణని మమ గాత్రాణి మాఘమాసే గవామివ"

మహాభారతము భీష్మపర్వమున (17)-64) నీశ్లోక మున్నది, తిక్కన సోమయాజులవారు దీని నీ క్రింది విధమునఁ దెలిఁగించిరి.

"అశనికల్పము లివి యర్జుసుభాణముల్
గాని శిఖండివి గావు సుమ్ము
కర్కటి గర్భంబుకరణి గాత్రము ప్రచ్చె
నిట్టివి వానికి నెందుఁగలవు "

'మాఘమాసే గవా మివ' అన్నదానికి 'కర్కటి గర్భంబు కరణి' తెలుఁగుసేత. ఈ తెలుఁగు సేత కనుగుణముగా నొక వింతనిఘంటువు గలదు. 'మాఘమా కర్కటీప్రోక్తా తదపత్యంతు సేగవా', ఈ నిఘంటు వెక్కడిదో యెఱుఁగరాదు. కాని తిక్కననాఁటికే యిది కలదో, తిక్కన తెలిఁగింపునుబట్టి పుట్టినదో యెఱుఁగరాదు. 'మాఘమాసే గపొయివ' అన్న చరణమునకు సరళరీతిని 'మాఘమాసే' గవామ్, ఇవ అన్న పదవిభాగము తోఁచును. 'మాఘమా' సెగవామ్' అన్నది కుటిలరీతి. మాఘమా-ఆకారాంత స్త్రీలింగము గాఁబోలును. ఈ పైశ్లోకార్థమున కీ నిఘంటువును, నీ నిఘంటువున కీశ్లోకమును నాశ్రయములు. సాతవాహనసప్తశతిలో మాఘమాసే, గవామివ అన్న పదవిభాగమున కనుగుణ మనందగినది గాథ యొకటి కలదు.

"విక్కిణిఇ మాహమాస - మ్మిపామరో పాఇడం వఇల్లేణ
శోద్ధూమ మమ్మురవ్వి ఆ - సామలియథణో పడిచ్ఛన్తో",

దీనికి శ్రీసాథుని తెలిఁగింపు :

>"మాఘమాసంబు పులివలె మలయుచుండఁ
బచ్చడం బమ్ముకోన్నాఁడు పణములకును (వసరమునకు)
ముదితచన్నులు పొగలేని ముర్మురములు
చలికి నొఱగోయ కేలుండు సైరికుండు". (క్రీడాభిరామము

ఇందు మాఘమాసమున గోవులు తక్కువ ధరలకును, పచ్చడములు హెచ్చుధరలకు నమ్మకమునకు వచ్చుట చెప్పఁబడినది. మాఘమాసమున గోవులధరలు పడిపోవుట చలికాలమున వారికి వ్యాధ్యాది బాధ లుండుటచేఁ గాఁబోలును. భారతకాలమునుండి రెండువేలేండ్ల క్రిందటినాఁటి దాఁక మాఘమాసము నేఁటి ధనుర్మాసమువలె శైత్యాధిక్యము గలది గాఁబోలును, -3- అట్టశూలా జనపదాః

పురాణములలో కలికాలవర్జనఘట్టమున నీ శ్లోకముండును.
“అట్టశూలా జనపదా శివశూలా శ్చతుష్పథాః,
ప్రమదాః కేశశూలీన్యో భవిష్యంతి కలౌ యుగే"

ఈ శ్లోకమున కర్ణ మెఱుఁగరాదు. 'అట్టశూలంబుల యగును దేశములెల్ల' అన్న రీతిని దేలిఁగింపవలసినదే. నేఁటి కైదువందల యేండ్ల ప్రాంత కాలమునాటి దగు ప్రసంగరత్నావళిలో నీ పురాణ శ్లోకమున కీ క్రింది నిఘంటువునుబట్టి యర్ధము చెప్పఁబడినది.

“అట్ట మన్న మితీ ప్రోక్తం, బ్రాహ్మణశ్చ చతుష్పడు,
కేశో యోని, శ్శివో వేదః, శూలో విక్రయ ఉచ్యతే'.

4.రఘుకులాన్వయ రత్నదీపం

"శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమ్
ఆజానుబాహు మరవీందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి".


ఈ శ్లోకము నిట్లే యూపామరపండితము పఠింతురు 'రఘుకులా న్వయ రత్నదీపం' అనుట కర్ధము పొసఁగదు. ఈ క్రింది వింతనిఘంటువు పొసంగించుచు,

“అన్వయస్తు సముద్రస్స్యాత్ -రత్నదీపశ్చ చంద్రమః",


4.వానవా

“గ్రంథగ్రంథిం తదా చక్రే ముని రూఢం కుతూహలాత్
యస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాహ ముని ద్వైపాయన స్వీదమ్.
అష్టా శ్లోకసహస్రాణి హ్యాష్టా శ్లోకశతానిచ,
అహం వేడ్మి శుభ వేత్తి, సంజయో వేత్తి వానవా,
తశ్లోకకూట మద్యాపీ గ్రథితం సుదృఢం మునే
భేత్తుం నశక్యతే ఒరస్య గూఢత్వాతశితస్యచ "

భా. ఆ. అనుక్రమణికాధ్యాయము.

'సంజయో వేత్తి వానవా' యనుచోట సరసార్ధ సంధాయకముగా నొక వింతనిఘంటువు గలదు. “వానవా దీర్ఘదర్నీ స్యాత్ ” అని - యది. అక్రీతదాసః

"యస్య సౌతి మతం మనీషిసదసి శ్రీనీలకంఠధ్వరీ
కొండాజ్యోతిషికశ్చ యస్య కురుతే సమ్మాన పూర్యై స్సమమ్
యత్రానుగ్రహ దృష్టి మర్పయతి చ శ్రీ బాలకృష్ణో గురుః
స్కో యం దీవ్యతి చొక్కనాథమఖినా మకీదాసః కవిః".


“ఆక్రీతదాసో జామాతే" అని వింతనిఘంటువు. రామభద్ర దీక్షితుఁడు చొక్కనాథమఖికి అల్లుఁడే. కాని యీ నిఘంటు వెక్కడిదో?

వల్మీకః


"వల్మీకాగా త్రభవతి ధనుఃఖండ మాఖండలస్య” అన్న మేఘసందేశ వాక్యమున కర్ధము కుదుర్పనుగాఁబోలుసు "వల్మీక స్సాతపో మేఘః" (ఎండతోడి మబ్బు వల్మీక మనఁబడును) అన్న నిఘంటువుముక్క నెవ్వరో పుట్టించిరి. వ్యాఖ్యాతలు గొంద ఱీనిఘంటువు సుదాహరించిరి. కాని యది యే నిఘంటువులోని దనిరో నా కెఱుకపడలేదు. పుట్టమీది నుండి యింధ్రనువు కొనవచ్చు ననుటకు బృహత్సంహితాప్రమాణమును, దదనుగుణముగా "పుట్టవెడలి నభోభిత్తిఁ బుట్టుశక్రకార్ముకపుఁ బెద్ద పలువన్నె కట్టజెజ్” అన్న యాముక్తమూల్యదాప్రయోగమును శ్రీ వేంకటరాయ శాస్త్రిగారు మేఘసందేశాంధ్రవివరణమునఁ బ్రకటించిరి. “వల్మీక స్సాతపో మేఘః" అన్న నిఘంటువు నెవ్వఁడో యెఱుక చాలనివాఁడు సృష్టించినాఁ కనవచ్చును. గంధర్వనగరమ్ రామాయణమునను, కాదంబర్యాదిగ్రంధములందును 'గంధర్మ నగర'మను పదము మిధ్యార్ధమున, అనఁగా చూపట్టియుఁ జూచుచుండఁ గనె మాయ మగునది యన్నయర్థసందర్భమునఁ బ్రయోగింపఁబడినది ఆకసమున నగరాకారముగా గోచరించుమేఘచిత్రములను గంధర్వ నగరము లనుట ప్రసిద్ధము. బృహత్సంహితాది జ్యోతిష గ్రంధములందు పానీస్వరూపవర్ణనము విపులముగాఁ గాననగును ఈ విషయము నెఱుఁగకో యేమో ప్రాచీనులే యెవ్వరో “గంధర్వ స్స్వప్న ఈరితు" అని నిఘంటువును గ్రంధస్థీకరించి రని శ్రీరామకృష్ణ కప్ గారు వెల్లడించిరి ఈ నిఘంటువునుబట్టి గంధర్వనగర మనఁగా 'గలలోఁ గానవచ్చిన పట్టణము' అని యర్ధమగును.

-9- జీర్ణారణ్యం

ఉత్తరరామచరిత్రమున

“చిరం ధ్యాత్వా ధ్యాత్వ నిహిత ఇవ నిర్మాయ పురతః
ప్రవాసే చాశ్వాసం నఖలు నకరోతి ప్రియజసః
జగ జీర్ణారణ్యం భవతిచ కళత్రవ్యుపరమే
కుకూలానాం రాశౌ తదసుహృదయం పచ్యత ఇవ" (6–35)


అన్న శ్లోకమున 'జీర్ణారణ్య' పదమునకు 'పొడువాటినయడవి అని యర్థము సంగతమగుచున్నను, సారస్య విశేషాధాయక మని కాబోలుసు వ్యాఖ్యాతలు “జీర్ణారణ్యం శ్మశానం స్యాత్" అని నిఘంటువు నుదాహరించిరి. ఈ నిఘంటు వెక్కడిదో ! శమీపత్రం

“శమీపత్రప్రమాణేన పిండం దద్యా ధయాశీరే,
ఉద్దరే తృప్త గోత్రాణి కుల మేకోత్తరం శతమ్".


ప్రత్యాబ్దికశ్రాద్ధ ప్రయోగమున పిండ ప్రదానకాలమున గయపిండ దానప్రశంసాపరముగ నీశ్లోకమును వైదికులు పఠింతురు. ఇక్కడ జమ్మియాకంతమాత్రము (అనఁగా నొక యన్నపుమెదుకుఅగును) గయాశిరమునఁ బిండప్రదానము చేసిన నది సప్త గోత్రములను, నేకోత్తర శతకులమును నుద్ధరించును అని యర్ధము పొసంగుచునే యున్నను, పలో కొందబు “శమీపత్రంతు కందుకమ్” అనియు, “శమీపత్రం కుక్కుటాండమ్” అనియు శమీపత్రపదమునకు బంతియని, కోడిగ్రుడ్డని అర్ధము వచ్చునట్లు నిఘంటువులఁ జెప్పుచున్నారు. కాని పాల్కురికి సోమనాథుఁడు.


“ఆకాంక్ష శ్రీగిరియం దొక్క జమ్మి
యాకు పట్టెడునంత యన్న మొక్కనికి
దానంబు సేయు నుద్యత్పలంబునకు
మానుగా నవియ సమానంబు లనఁగ",


(పండితాధ్య చరిత్ర, పర్వత ప్రకరణము) అని 'శమీపత్రప్రమాణ' పదమునకు 'జమ్మియాకంత' అన్నయర్థమే ప్రాచీన విద్వత్సమ్మత మగుట గ్రంథసపటీచినాఁడు. ప్రసన్న వదనం


 "శుక్లాంబిరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే. "


ఈ శ్లోకమును వైష్ణవులు విష్ణుస్తుతిగాఁ బఠింతుఁరట! దాని కిందు 'విష్ణుమ్' విశేష్య మగుట సాధకమే కాని, 'శశివర్ణమ్' 'శుక్లాంబరధరమ్' అన్నవిశేషణములు బాధకము లగును. స్మార్తులు విఘ్నేశ్వరపూజలో బ్రప్రథమముననె విఘ్నేశ్వరవాచకము విశేష్యము దుర్ఘట మయినది. ఈ బాధ తొలఁగుటకే యేమో యీ క్రింది నిఘంటువు పుట్టినది; "ప్రసన్నో మత్తవారణ!" 'ప్రసన్న' మనఁగా మదపుటేనుఁగు. 'ప్రసన్నవదనుఁ' డనఁగా 'మదగజాననుఁడు.' విఘ్నేశ్వరవాచక మయిన విశేష పదము పయిని ఘంటువుచే ఘటిల్లినది. జైను లీశ్లోకమును శ్వేతాంబరజీన దేవతాస్తుతిపర మందురంట. ఇట్లు నానా దేవతాస్తుతి పరముగా నీ శ్లోకము విఱుగుచుండుటను గమనించి కొంటె విద్వాంసుఁ డొకఁడు దీనికి గార్దభ స్తుతిపరముగా సర్థము చెప్పినాఁడు. - 12 - సుందరకాండ రామాయణమున నైదవకాండమునకు సుందరకాండ మని పే రగుటకు పలువురు పలుతీరుల నర్ధములు చెప్పుచున్నారు. ఆ యర్థములకు నిఘంటువులఁ జెప్పుచున్నారు. “ సుందరో హనుమాన్ స్మృతః" అనియు, “సుందరం త్వంగుళీయకమ్" అనియు ఆ నిఘంటువులు. హనుమంతునికి సంబంధించిన కథార్థము గలదిగాన, మటి యంగుళీయకప్రదాన కథాప్రధాన మయినదిగాన "సుందరకాండ' మని పే రయ్యెనని పై నిఘంటువు అర్ధము గుదుర్చును.

- 13 . మదిరాక్షి

మదిరాక్షి, మదిరాయతలోచన ఇత్యాది విధముల సంస్కృతాంధ్ర ములలో స్త్రీ వర్ణన ముండును. దీనికి 'మద్యపానము చేయుటచే నెఱవారిన కనులవంటి కనులుగలది' అని కొంద అర్థము చెప్పదురు. 'మదిరో మత్తఖంజనః' అని ఒక నిఘంటువు సుదాహరించి, మదిరశబ్దమునకుఁ బొగ రెక్కిన కాటుకపిట్ట యనియు, దానీవంటి కనులు గలదిగాన మదిరాక్షి యయ్యె ననియు పలువు రర్ధము చెప్పుదురు. 'మదిరో మత్త భంజనః! ఎక్కడిదో తెలియదు. కొన్ని వ్యాఖ్యాన గ్రంథములలోఁగూడ నిది గలదు. ఇటీవల ఉద్యానపత్రికాధిపతులు శ్రీ తాతాచార్యులుగారు శృంగార దృష్టులలో నొక దృష్టివిశేషమునకు 'మదీర' మని పే రుండుటను నాట్యశాస్త్రమునుండి యుద్ధరించి చూపిరి. కాన 'మదిరో మత్తఖంజనః అన్నది అప్రౌఢకల్పితనిఘంటు వగుట వ్యక్త మయినది.