తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఆంధ్రభాషావతారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2

ఆంధ్ర భాషావతారము

అఖండస్ఫోటమై వెలయు శబ్దబ్రహ్మము ధ్వనితాదాత్మ్యాధ్యాసచే నానాదేశములందు, నానాజాతిజనులందు బహుభాషలుగా, బహ్వర్దములతో బరీస్ఫురించుచున్నది. ఆకసముననుండి మేఘ మతినిర్మల మైనయంబువును వర్షింపఁగా నదియుప్పుబఱ్ఱలందు, రేవడిచెలికలందు, మహౌషధీమయము లగు నరణ్యములందు, రసధాతుభరితములగు పర్వతములందును బడి తతాదాత్మ్యముతో భిన్నరూపములను, భిన్నరుచులను బొందుచు జాలువాటి కోల్లై, సెలయేళ్లై, వంకలై, వాగులై, నదులై, మహానదులై ప్రబలములైన భేదముల బడయుచున్నది. భాషల పుట్టుపూర్వోత్తరములుగూడ నిట్టీవే.

సహ్యపర్వతమునఁ దొలుత జాలువాఱుటలో సమానలక్షణములు గలవై యున్నను కృష్ణా కావేరీనదులు ఆంధ్రదేశమునకును, అఱవ దేశమునకును సాగను సాగను విభిన్న లక్షణముల వెలసి వెలసి వేఱువేఱు తీరులను, పేరులను బడసినట్లుగా ఆంధ్ర ద్రవిడ కర్ణాట భాషలు తొలుత (ఆంధ్రద్రవిడకర్ణాటు లని నేఁడు విభిన్నులుగా నున్నవా రొకప్పు డొక్క చోట నొక్క సంఘముగా నుండి వెడలి వేఱుపడినవారే యని నానమ్మకము.) నొక్కటిగానే యుండి కాలక్రమమున భిన్నభిన్నదేశములఁ జెంది భిన్నత్వములం బడసినవి. ఆంధ్రద్రవిడకర్ణాటకభాషల నేఁటిస్వరూపము లెంత భిన్నములుగా నున్నను, పూర్వపూర్వముసు బరిశోధించుచుఁ బోవనుబోవను వాని భేదములును దక్కువ తక్కువ లగుచుండుట తెలియనగును. ఇట్లు చూడఁగా రెండువేలయేండ్లకుఁ బూర్వ మీ భాషల పృధగ్భావము విస్పష్టలక్షణము లతో వెలసియుండకపోవుట గోచరించును.

వర్షోదకము నేలపై బడినప్పుడు మట్టితో గలసి వండు వాఱితేటదనము, తేలికదనము లేక కలుషమై, యస్వరసమై యుండునట్లు భాషకూడఁ దొలుత శబ్దరూపోచ్చారణాదులందుఁ దేటదనము, తేలికదనము, హృద్యత లేక క్లిష్టమై యుండును. కాలక్రమమున నా నీరు ఏళ్ళలోఁ గోళ్ళలోఁబడి నదులై ప్రవహించుచుఁ దేటవాఱి నడుమ నడుమ గుంటలలోఁ గోనేళ్ళలో నిలువరమంది ప్రసన్నమై రుచ్యమై యొప్పును, అట్లే భాషకూడఁ గాలక్రమమున సాధూచ్చార సంస్కారమంది, అందందు గ్రంధములందు నిబద్ధమై నిలువరమంది, స్వచ్ఛమై, యాస్వాద్యమై వెలయుచుండును వ్యవహార ప్రవాహమున భాష వడివడిగాఁ బరిణామ మందుచుండును గాని యది గ్రంధ నిబంధము నందిన పిదపఁ గొంత కట్టుదిట్టమును బడసి నిలుకడఁ జెందును. ఆవలఁ దత్పరిణామము పూర్వమంత త్వరగా సాగదు. ఆంధ్ర ద్రవిడకర్ణాటభాషల యారంభ మొక్కటి యేయైనను, సంస్కృత ప్రాకృతసంబంధ మల్పముగాఁ బడసి గ్రంధములందు నిబద్ధమై నిలువరమంది లక్షణ పరిష్కారములను బడయుటలో నటవము మొదటి దయినది. ఆ నిలువరముమీఁదను, ఆ లక్షణ పరిష్కారములమీఁదను నాంగక ఇంకను గొంతయుచ్చారవ్యవహారమునఁ బరిణామము బొందిపొంది సంస్కృత ప్రాకృతముల సాహాయ్యము నధికముగాఁ జెందిచెంది, పెంపొంది గ్రంధములందు నిబద్ధమైనది - కన్నడము. ఈ రెండింటి కింకను దర్వాత నీ రెండింటి లక్షణ పరిష్కారములతో నిల్వక యింకను నుచ్చారసంస్కార ములఁ బడసి, సవరనయి యందచందముల నంది సంస్కృత ప్రాకృతముల సరససాహాయ్యమున సభ్యుచ్ఛయముఁగాంచి గ్రంధములందు నిబద్ధమైనది తెలుఁగు. దక్షిణ హిందూదేశ సమష్టిదేశభాషా వధూటి పసిప్రాయపుఁబలుకు లజవము, ఎలప్రాయపుఁ బలుకులు కన్నడము; నెఱతనపుఁ బలుకులు 10

తెలుఁగు; ద్రవిడకన్నడములు తెలుఁగుభాషాకస్య కందచందములు, పలుకుపొంకములు హెచ్చు. అఱవ పదములకును దత్ ప్రత్యయముకును, కర్ణాటపదములకును దత్ ప్రత్యయములకును సుచ్చారణమునఁ దోచు కార్కశ్యము నాఁటనాఁట దొలఁగి తొలఁగీ సవరనయినయుచ్చారణమును బడసిపడనీ తెలుగుపదములును, బ్రత్యయములును వెలసినవి. ఉచ్చారణ సుందరములయిన తెలుఁగుపలుకుల పూర్వ పూర్వపరిణామ క్రమదశలలో ద్రవిడకర్ణాటపద రూపములు రెండునుగాని, రెండింట నేదే నొక్కటి గాని పొందియుండుట పెక్కుచోట్లఁ గొననగును.


పై యుభయభాషాసంబంధము లేనివి యచ్చపుఁ దెలుఁగుఁ బలుకులు, ప్రత్యయములు గొన్నియున్నవి. ఇవీయేకాక, సంస్కృత ప్రాకృతోభయ భాషోచ్చారణ క్రమపరిణామముల బొందినవియు, ప్రాకృత మాత్రోచ్చారణ క్రమపరిణామములఁ బొందినవియుఁగూడఁ బెక్కుపలుకులు, ప్రత్యయములు తెలుఁగునఁ గలవు. ఇట్టివెల్లనుగూడి సుకు మారోచ్చార సంస్కారములను బడసిపడసి వానికంటె వైలక్షణ్యమును బొంది మన తెలుఁగు వెలుఁగొందు చున్నది. మీఁదఁ బేర్కొన్న విషయమున కుదాహరణముగా నొక పదమును బరిశోధించి చూపుదును. 'నూనె' ఈ పదము 'నూవు' 'నెయి' అను పదముల సమాసము. 'నూవులనెయి' అనగా 'నూవులసారము' అని అర్థము. ఇందు 'నూవు' అనుపదము ద్రవిడ కర్ణాట భాషల సంబంధ మేమాత్రమును లేని యచ్చపుఁ దెలుఁగుఁబలుకు. నూవులకు అఱవమునను, గన్నడమునను 'ఎళ్ అని పేరు. 'నెయ్' అను పదము ద్రవిడమునను, కర్ణాటకముననుగూడఁ గలదు. కానీ యది కర్ణాటకమున 'నే' 'నేయ్' ఇత్యాది రూపములఁగూడఁ బొందియున్నది. తెలుఁగున ఉచ్చారణ పరిణామములలో నసుందరమయిన

హలంతత్వము దొలగిపోయి 'నెయ్యి', 'నెయి', 'నేయు', 'వై', 'నే' అను రూపములు వెలసినవి. 'సేయి' అను రూపమునకంటె నీరూపము లుచ్చారణ సుందరములు. తెలుఁగు బాస హలంతత్వము నేపగించును గాన 'నెయ్'ని అజంతముగాఁ జేసికొనుటలో 'ఇ' ని జేర్చు కొనఁగా 'నేయి' అయ్యెను. 'నెయ' పదము అజాది పదములు పరమయినపుడు 'నెయది' అనురూపము ఉచ్చారణసహము గాడు గాన, 'సన్ + అది = నన్నది', 'అన్ + అతఁడు = 'అన్నతఁడు' అను రూపము లందినట్లు, 'నెయ్యది' ఇత్యాది రూపముల నంది, అట్టి సంధినుండి పదచ్ఛేదముఁబడయుటలో 'నెయ్యి' అను రూపమును బొందెను. ఏకలఘుపూర్వకహల్మాత్రము గల శబ్దములు ఉచ్చారణ పుష్టి గలిగియుండవు గావున హలుచ్చారణబలము పూర్వహ్రస్వమునకుఁదన్ని దానిని గురువునుగాఁ జేసి యంతలోఁ దాను గరిఁగిపోవఁగా 'నే' అనురూపమేర్పడెను. ఆ కరఁగిన హల్మాత్రయకారము అజాదీ పదములు పరమగునపుడు వానితో గలసి యకారముగా నిలువ గల్గుచున్నది గాన దానిపై నజంతత్వపుఁ జికిలి జరగఁగా కొంత దుర్బలమయిన యుచ్చారముగల యకారముతో 'నేయు', 'నేయి' అను రూపము లేర్పడెను. హల్మాత్రమగు యకారము దుర్బలమగుటచేతనే 'నెయియ' అను రూప మేర్పడినట్లు 'నేయ్యి' అను రూపము పుట్టఁ జాలక పోయెను. 'నెయ్' లోని 'య్' 'ఇ' గా మాఱఁగా 'నై' అను రూపము పుట్టెను. పై రూపము లందు 'సాయి', 'నై' రూపము లర్వాచీనములు. ఇట్లు "నేయ్' శబ్దముపై నేర్పడిన బహు సుందరపరిణామములెల్ల మన తెలుఁగునఁ గలవు. 'చెయ్, వెయ్' మొదలగు శబ్దములుగూడ నిట్టిపరిణామములు బొందెను. శబ్దముల ప్రాచీన రూపములకుఁ దాఁతలనాఁటివన్న గౌరవ ముండగా నర్వాచీనరూపములకు హృద్య సంస్కారముల ననేకములఁ \

బడసి వెలసిన వన్న వేఱొక గౌరవవిశేషముగలదు. ఆంధ్రుల కాచారవ్యవహార స్వరూప స్వభావాహార దేశలక్షణాది బహుకారణములచే గల్గిన భిన్నభిన్న లక్షణముల కనుగుణముగా నేర్పడిన శబ్దరూపములను మీఁదఁ జూపితిని. 'నెయ్ 'శబ్దము తెలుఁగులో నిన్ని హృద్యరూపముల నందినది గాని యిది 'నూవు' శబ్దముతో సమాన మందినప్పుడు కొన్ని ప్రాకృత భాషా సంబంధ సంభవములైన వికారములకుఁగూడఁ బాల్పడెను. 'నూవు' శబ్దము తొలుత 'నూవ్' అను రూపము గలది. తెలుఁగుహలంతత్వము నేవగించుకొనును గాన నది 'సూవు' అను రూపమును బడసెను. ఆ హల్మాత్రము కరఁగి పోపుటచే 'సూ' అను రూపమేర్పడెను. కరఁగిపోయిన యాహల్మాత్రమయిన 'వ్' అచ్చుపరమయి నప్పుడు మరలఁ గానవచ్చును. 'నూ + నెయ్' పదములు రెండును సమసింపఁగా, 'నెయ్' పద మెన్ని రూపములతో నున్నదో, అన్ని రూపములతోను ఆ సమాస ముండుట న్యాయ్యము. అనఁగా 'నూనెయి', 'నూనెయ్యి', 'సూనే', 'నూనేయి', 'నూనేయు' 'నూనై' అను రూపములుగూడ నుండవలెననుట. కానీ యట్టిరూపములు తెలుఁ గున పుట్టలేదు. దానికిఁ గారణ మే మనఁగా, 'నూనె' యనుసమాస పదము 'నెయ్' పదము మీఁదఁ బేర్కొన్న పరిణామముల నెల్లఁబడయుటకు బూర్వమే పుట్టి రూఢమైనది. అప్పుడు 'నూ + నెయ్' అని యుండి తెలుఁగునకుఁ బ్రియముకాని కడపటి హల్మాత్రము లోపింపగా సమాసదశలో నాపదము గురు లఘుఘటితమగుటచే 'సెయ్' 'నే' రూపమును బడయ నక్కలు లేకపోఁగా 'నూనె' అయ్యెను. కరఁగిపోయిన కడపటి హల్మాత్రవు 'య్' అచ్చుపర మయినపడు మరలఁగానవచ్చును గాన 'నూనె + అది' కలసినపుడు 'నూనెయది' అయ్యెను. ఇట్టి యకారమునే తెలుఁగు వైయాకరణులు 'యడాగమ' మని పేర్కొనిరి. ఇట్లు యడాగమ మని పేర్కొనబడుచున్న స్థలము లనేకము లట్టి పదాంత యకార హల్మాత్రము ద్రవించిపోఁగా నచ్చు పరమయినపుడు మరలఁ గానవచ్చుట నుబట్టి యేర్పడినవే. అట్టి దేశిశబ్దముల రూపసాజాత్య మునుబట్టి యకారపుచ్ఛము లేనివయినను తెలుఁగునఁజేరిన సంస్కృత ప్రాకృత శబ్దములకును నట్టి యడాగమము పుట్టెను. రమ + అది = 'రమ యది' ఇత్యాదులు.

పైనిఁ బేర్కొన్న విధమున నూనె పదము తెలుఁగు సంప్రదాయ పరిణామమునుబట్టి పుట్టి యుండఁగా దానిమీఁద 'నూనియ' అను రూపము ప్రాకృత భాషా సంప్రదాయమునుబట్టి పుట్టెను. 'కన్నియ' 'వన్నీయ' 'దీవియ' మొదలయిన శబ్దములు కన్యకా, వర్ణక, దీపికా శబ్దాదులనుండి ప్రాకృత సంప్రదాయమునుబట్టి పుట్టి తెలుఁగునఁ జేరినవి. వీనికి 'కన్నె 'వన్నె 'దీవె' రూపములును గలవు. వీనిపోలికనుబట్టి 'నూనె' శబ్దమునకుఁగూడ 'నూనియ' అను రూపమువచ్చెను. నూనె, నూనియ శబ్దములు పుట్టినతర్వాత వానీసాదృశ్యముచే 'తేన్' అని యజవమున రూపముగల 'మధు' వాచకశబ్దము తెలుఁగున తేనె 'తేనియ' అను రూపములఁ జెందెను.

ద్రవిడ కర్ణాట ప్రాకృత భాషల పలుకుబడి నూనె శబ్దముమీఁద నెంత చెల్లెనో పై పరిశీలనమువలనఁ దెలియవచ్చెను. కాని యిందు సంస్కృతపు పలుకుబడికూడ హెచ్చుగాఁగలదు. ఎట్లనఁగా "నెయ్' అను పదము దేశిపద మని కొంద అన్నను 'స్నేహమను సంస్కృత పదమునకు వికృతియని కొంద బందురు.

ద్రవిడభాషలో 'నెయ్' పదము 'సారము' అని యర్ధము గలది. క్షీరములనుండి యెత్తిన సారమగు ఘృతమునకే తర్వాత నది \

రూఢమయినది. 'నూనె' యను సమాసమునఁ జేరుటచే నెయ్ 'స్నేహ' వాచకమైనది కాని యది స్నేహశబ్ది వికృతి కాక దేశిపదమే యగు నని కొందఱు.

మఱియు, నూనే యను నర్థముననే సంస్కృతమున 'తైల' పదము గలదు. తైలపదము శబ్దనిష్పత్తినిబట్టి నూవుల సారమునకే వాచకమయినను స్నేహసామాన్యమునకును చెల్లుచున్నది. తిలతైల, ఇరండతైల భల్లాతక తైలాదులు చూడఁదగును. నూనెపదముగూడ నిట్లే తీలస్నేహవాచకమే యయినను, స్నేహసామాన్యమునకును జెల్లుచున్నది. నూవులనూనె, కొబ్బరినూనె, వలిసెల నూనె ఇత్యాదులు చూడఁ దగును. అఱవమునఁగూడ నూనెకు 'ఎళ్ నెయ్' 'ఎడ్జెయ్' అని పేరు. అదికూడ స్నేహసామాన్య వాచకమే. 'తేజ్లో యెజ్లయ్' ఇత్యాదులు చూడఁ దగును. నూనె పదము తైలపదమువలె తీలస్నేహవాచకముగానే పుట్టుట, అది స్నేహసామాన్యమునకు వాచకమగుట సంస్కృత భాషావ్యవహార సంప్రదాయసంస్కారమును దెలుపుచున్నది.