తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఆంధ్రలిపి సంస్కారము

వికీసోర్స్ నుండి

15

ఆంధ్రలిపి సంస్కారము

నేఁడు వాడుకలో నున్నమనతెనుఁగులు మనకు మిక్కిలి చిక్కులు గలిగించునదిగా సున్నది. పసిబాలురకు లిపినేర్పుటలో క్లేశము గలదు. గ్రంథముల సచ్చొత్తించుటలో క్లేశము గలదు. టైపులైటింగునిర్మాణమున కసౌకర్యముగలదు. అంతేకాక వరోచ్చారణ రీతికిఁగూడ విరోధము గలదు. ఇవి యెల్లఁ జిన్నచిక్కులు కావు. వీనిని గొంత వివరింతును.

1.బాలురకు నేర్పుటలో క్లేశము


అచ్చులలో హ్రస్వదీర్ఘములగు అ, ఆ లు ఈషద్భేదముగల సమానలిపులై యుండఁగా ఇ, ఈలు పోలికయే లేనివిగా నున్నవి. అందు ఇ చవర్గాంత్యాను నాసికమగు ఇ-తో పోలిక గలది. ఋ, ౠలు బు,బూల పోలిక గల వై రెండు కొమ్ములు గలిగి పొందికలేక మెలిటుగా నున్నవి. ఒ,ఓ, ఔ లు జ--తో పోలిక గలవి. ఇఁక హల్లులలో కవర్గమెల్లం బోలికయే లేని భిన్నలిపులతో నున్నది. ఖ-కు తలకట్టు లేదు. ఘ - 'ఫ,పుషషు' అక్షరముల పోలిక గలది. చవర్గమున చఛలు పోలిక గలిగియున్నవి. కాని జఝులు భిన్నములుగానే యున్నవి. జ-కు తలకట్టు లేదు. అది ఒఓ ఔల పోలిక గలది. ఝరుడు వర్ణముల పోలిక గలిగి రెండు కొమ్ములు గలిగి యసందర్భముగా నున్నది. ఇ* ఇకారముతోఁ బోలిక గలది. టవర్గమున ట,రలు పోలిక లేనివి.డ ఢలు చఛల వలెఁ బోలిక గలవి. ణ తలకట్టు లేనిది. క, చవర్గముల యంత్యానునాసికములు జ, ఆ లు తలకట్టు లేనివి. అవి చిహ్నము గలవై యుండఁగా ణ-కు అది లేదు. దీనితర్వాతివర్గానునాసికము లగున, మ లకును నాచిహ్నము లేదు. తవర్గమున త మాత్రము భిన్నమై, తర్వాతి మూఁడక్షరములగు థదధలు పోలిక గలిగియున్నవి. స-స-తోఁబోలిక గలది. పవర్గమున పఫలు, బభలును బోలియున్నవిగాని - బకుఁగొమ్ము ముడ్డి క్రింద ఈయవలసెను. వఫలకుఁగూడఁ గొమ్మిచ్చుటలో నిట్టి చిక్కె కలదు. య కొమ్ముగలది. ర ఱ లు. లళ లు, శష లు పోలిక లేనివిగా నున్నవి. స న-తోఁ బోలిక గలది, హవతోఁ బోలికగలది. ఉచ్చారణమునఁ బోలిక యుండుటనుబట్టి లిపిలోఁ గూడబోలిక యుండఁదగినయక్షరములు క ఖ లు, గ ఘ లు, జఝు లు. టర లు, తథ లు, రఱ లు, శషస లు, పోలిక లేనివై, పూర్వోక్ష విధమున నుచ్చారణమున నేమాత్రమును బోలిక లేని యక్షరములు గొన్ని పోలికగలవై యుండుట చేతను, వర్గాక్షరాదులు సరియయిన నిర్మాణక్రమము లేనివిగా నుండుటచేతను బాలురకు లిపిని నేర్పుటలో మిక్కిలి చిక్కుగలదు. చ-కు ముద్దిక్రింద ఒత్తిచ్చినచో ఛ అగునని చెప్పుటకు వీలులేదు. క ఖ, ట ఠ, తథ, లు అట్లులేవు గాన సాహిత్యబోధము కుదురదు. ఇంత వరుసవావి లేని లిపి రూపములను భిన్నభిన్నముగా నేర్చుకొన కష్టమే కాదా? మఱియు నివిగాక అజ్ఞుణితము వేఱు చిహ్నములతో నేర్చుకొనవలెను. హల్గుణితము వేఱుచిహ్నములతో నేర్చుకొనవలెను. ఈ గుణితములలో (గూడఁ బెక్కుచిక్కులు గలవు. ఇవి కొంత ఉచ్చారణరీతికి విరుద్ధముగాఁగూడ నున్నవి. హల్లుపై అజ్ఞుణితమును జేర్చునప్పుడు తలకట్టు అకార మున్నప్పుడు మాత్రమే ఉండఁదగును. తక్కినయచ్చులు చేరునప్పు డుండఁ గూడదు. క, కా, కి, కీలు సరిగా నున్నవీ కానీ, కు కూలు తప్పుగా నున్నవి. తలకట్టు, కొమ్ము రెండును ఉండఁగూడదు. ' కృ కృ' లకును

ఇట్టి చిక్కె కలదు. ప్రైమరీ స్కూళ్ల పంతులవారు కొందరు 'కృ కు కకార అకార ఋకారములు 'క' అని వర్ణక్రమము చెప్పుటను వింటిని. వారట్లు చెప్పుట వింతగాదు. వట్రువసుడి 'స్వ' ఒత్తులవలె హల్లుగాఁ దలఁపx బడు ననియేకదా కొందఱు లాక్షణికులుగూడ అది యున్నహల్లు తక్కిన యచ్చులతోనున్న యా హల్లుతోఁ బ్రాసమునఁ జెల్లునని చెప్పిరి! కనుక కోమ్ము, కొమ్ముదీర్ఘము వట్రువసుడి, వట్రువ సుడి దీర్ఘము ఉన్నప్పుడు హల్లుకు తలకట్టు ఉండుట అక్రమము.

ఇక హల్గుణీతములో 'వాక్స్వాతంత్ర్యము' అను పదము వ్రాయునప్పుడు 'క్స్వా' లో కకార సకారములు హల్మాత్రములు. వకారము ఆ కారముతో గూడినది. 'క్స్వా' ను విడఁదీసినచో 'క్,స్,హ' అగుసు. కాని మనము లిపిలో ఆకారమును కకారముమీఁదనే ఉంచుచున్నాము. సకారవకారములను క్రింద ఒత్తులనుగా ఉంచుచున్నాము. బడిపంతుళ్లును, గొందఱు పండితులునుగూడ 'క-కు దీర్ఘమిస్తే కొ' కా - కింద సావత్తిస్తే క్సా, క్సా-కింద వాపత్తిస్తే క్స్యా' అనియు 'క కార ఆకార సకార వకారములు క్స్వా అనియు వర్ణక్రమము చెప్పుచున్నారు. ఇది తప్పు గాదా! నాగరాక్షరములు ఈ విషయమున ఉచ్చారణరీతి ననుసరించి సరిగా నున్నవి. ఆ లిపిలో సంయుక్తాక్షరమునఁ గడపటిహల్లుమీఁదనే య చ్చుండును. తత్పూర్వము గల్గుహల్లులు అర్ధాక్షరచిహ్నములు గలవిగానే ఉండును. బాలురకు లిపి నేర్పుటలో నిట్టి చిక్కులు గలవు, అలవాటు పడియుంటిమి గనుక నేఁడు మన కివి యంతగాఁ జిక్కు గూర్చునవిగా దోఁపకపోవచ్చునుగాని బాల్యమునఁ దొలుత నేర్చుకొనునప్పుడు మనల నెల్లరనుగూడ నీ చిక్కు బాధించియే యుండుట వాస్తవము. ఎంత యలవాటయినను బ్రౌఢులనుగూడఁ గొందఱు నీ చిక్కులు బాధించుచునే

యున్నవి. తొలుత నేర్చుకొనునప్పుడు బాలు రెల్లరును బాధపడుచునే యున్నారు. ఈ బాధ సరకుగొనరాని దనరాదు. అక్షరములు వడిగా రాకపోవుటచే బాలు రెందఱో బండబాఱి చదువున సన్నగిలుచున్నారు...బడి యన్న భయపడుచున్నారు. ఈ లిపి కేశములు వారి హృదయప్రసాదమును జెఱుచుచున్నవి. అక్రమపుకేశములకుఁ బొల్పటిచి వారిని బాధింపరాదు.

2.అచ్చులో కష్టము!

ఇప్పుడున్న లిపిరీతినిబట్టి ముద్రణమున వేఱువేఱు లిపి సంకేతములు ఇంచుమించుగ అయిదునూఱులు కావలసి యున్నవి. వాని నీ క్రిందఁ జూపుచున్నాఁడను.

అ ఆ ఇ ఈ ఉ ఊలు బూ - ఎఎఐ ఒ ఓ ఔ- ఇవి 16 కకాకికీకు కూకె కే కాకోకాక్ ఇవి - 12 ఇట్టివి క మొదలు క్షవఱకు గల 36 అక్షరములకు మొత్తము 432.


ఖవాజ ఆ యిల్లో ఇవి 49. సంకేతబాహుళ్యముచే సాధారణముగా డెమ్మీ సైజులో నాల్గు ఫారములకు సరిపడు టైపును గొనవలె నన్న అగు విలువకు ద్రవిడలిపిలో 8 డెమ్మీఫారముల టైపు వచ్చును. ఇట్లు ధర తక్కువ యగుటకుఁ గారణము అఱవలిపి సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుటే. అందు 246 మాత్రమే లిపి సంకేతములు. క్రొత్తగా కంపోజిటర్లు తెలుఁ గచ్చుకూర్పును నేర్చుకొనుట కాఱునెలలు పట్టును. అఱవపుటచ్చుకూర్పు ఒకనెలలో నేర్చుకోవచ్చును. 500 గళ్లలోనుండి సంకేతముల నేర్చవలసియుండుటచే తెలుఁగులిపిని గూర్చుటలోఁగూడఁ జాల జాగగును. గంటకు ఒక 'గాలీ' అఱవము కూర్పఁగలుగఁగా, తెలుఁగున 'అఱగాలీ' మాత్రమే కూర్చఁ గలుగుదురు. ఇట్టికారణములచే తెలుఁగు కంపోజిటర్లు విరివిగా దొరకరు. తక్కిన భాషలకంపోజిటర్లకంటె వీరికి జీతము హెచ్చు, ఇదిగాక అచ్చు కూర్పులో సౌందర్యము తక్కువ. ఒత్తక్షరమున 2,4, 3 లిపి చిహ్నములు ఒకదానిక్రింద నొకటిగాఁ జేర్పవలసియుండుటచే బంతులు తీర్చినట్లు సాగవు. 'వాక్స్వాతంత్ర్యము' అక్షరము క్రింద నక్షరముఁ జేర్పవలసి యుండుటచే 'ఫుల్ బాడీ', 'ఆఫ్ బాడీ', యను భేదములతో వేఱుతీరుల యక్షరముల నెక్కువగాఁ బోఁత పోయవలయును. 500 లిపి సంకేతములను నిర్మింపవలసియుండుటచే వ్రాతమోడి, పరిమాణము భిన్న భిన్నములుగా నుండునట్లు అనేక విధములగు లిపి భేదములను గల్పింప సాధ్యపడకున్నది. (మాటవరసకు) మద్రాసులో అఱవమున డెమ్మీఫారము ముద్రణమునకు నాలుగురూపాయలు ఛార్జి చేయఁగా, తెలుఁగున నదేమాదిరి ఫారమునకు ఆఱు, ఎన్మిది రూపాయలు చార్జి చేయుచున్నారు. ఇట్టి వింకనెన్నో చిక్కులు తెలుఁగు ముద్రణవిధానమునఁ గలవు. ఇంతకుముందు మొదటి ప్రకరణమునఁ జెప్పిన వ్రాతచిక్కు లెల్ల నీ ముద్రణమునకును గలవు.

-3. టైపురైటింగు..


అచ్చునకే యిన్నిచిక్కులుండఁగా నింక టైపు రైటింగు కుదరునా? ఇంగ్లీషున, ఆజవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒక దాని క్రింద నొకటి యుండకుండ) యుండుట, ఆ సంకేతములుగూడ నలువదింటికంటే మించకుండుట ఉన్నఁగానీ టైపు రైటింగు సాధ్యము గాదు, కాన ఇప్పటి లిపిరీతికి టైపురైటింగు కుదురనే కుదురదు.


4.సంస్కార మెట్లుండవలయును?


మీఁద వివరింపఁబడినచిక్కులెల్లఁ దొలఁగునట్లు, అనఁగా బాలురకు సులభముగా నేర్పఁదగియుండునట్లు అది విస్పష్టముగా నౌక నిర్మాణ విధానముతో నుండునట్లు, ఉచ్చారణరీతికి భిన్నము గాకుండునట్టు, అచ్చులో సౌకర్యమేర్పడునట్లు, టైఫురైటింగుకుఁ గుదురునట్లు సంస్కరించుట సాధ్యమేని యది యవశ్యకర్తవ్యము గాదా? తాతలు త్రవ్విన నూయిగదా యని యందుండి యుప్పునీటినే యెప్పుడును ద్రాగుచుండఁదగునా - దగ్గఱనే మంచినీటి బావి త్రవ్వఁదగియుండెనేని? అదిగాక, నేఁటి లిపిరీతి మాత్రమే మంతనిశ్చలము? అయిదువందల యేండ్ల పూర్వమునఁ గల లిపికిని, మననాటి లిపికిని నెంతేని భేదము గలదు. నేఁటిలిపికూడ బహు పరిణామములఁబొందుచు వచ్చుచున్నదే.

లిపిలో నిప్పుడున్న కీళ్లను దొలఁగించుకొనుట ఆశ్యకమే కాని, వానిఁ దొలఁగించుకొనుటకై చేయు మార్పులలో నున్న మేళ్లుగూడ- గొన్ని యూడుట యగునేని యా విధాన మంగీకారార్ధము గాఁగూడదు. మఱియు నా మార్పులు సులువుగా జరపఁదగినవై యండవలెను గాని మూలచ్ఛేదులుగాను, సర్వము తార్మారుపఱుచునవిగాను, అమితవ్యయా పాదులుగాను, జనసామాన్యమునకు ఆరంభముననేని ఉక్కిరిబిక్కిరిగా అర్ధముగానివిగా నుండునవిగాను. "గారాదు. అట్టివానివలన అలజడి. అశాంతి యేర్పడును. నేఁటి తెలుఁగక్షరములనే తీసివేసి దానికి బదులు ఇంగ్లీషక్షరములనో, నాగరాక్షరములనో పెట్టుద మనువారు కొందఱు గలరు. ఈ సూచన లనర్ధదాయకములు. ఆ మార్పులు సులువైనవిగాపు. ముత్తెపుసరులను జాచి పట్టినట్టు తెలుఁగు వ్రాంతబంతులు గుండ్రని వ్రాలు గలవై యందముగా నుండును. ఇది మన లిపి కున్న యున్నతసుగుణము. దీనిని గోల్పోరాదు. ఇంగ్లీషు నాగరలిపుల కీ యందము లేదు. మఱియు చేసిన సంస్కారము, ఇప్పుడున్న లిపికి అలవాటు పడియున్నవారి కెల్లరీకి క్షణములో గుర్తింపఁదగినదై, యనుసరింపఁదగినదై యుండవలెను. అది వ్రాతలో, అచ్చులో, టైపులో మూఁడిటను భేదము లేక ఒకే తీరుగా నుండవలెను. వ్రాఁతలిపి వేఱు, అచ్చులిపి వేఱు, టైపులిపి వేటు అన్న ట్లుండరాదు. మహారాష్ట్ర గుర్జర దేశములందు నాగరిలిపి కిట్టి చిక్కు గలదు. అందు వ్రాత మోడిలిపి వేఱు. అచ్చులిపి వేఱు. అట్టి విభేదము మనకుఁ గల్గరాదు.

సంస్కార విధానము

మీఁద వివరించిన దోషము లెల్లఁ దొలఁగునట్లును, గుణములెల్ల గూడియుండునట్లును గుదిరియున్న దని నేను విశ్వసించిన సంస్కార విధానము నిక్కడ చూపుచున్నాఁడను.

అచ్చులు:

అచ్చులలో అకార మొక్కటి తక్కం, దక్కిన యక్షరముల నెల్ల విడిచి పెట్టవలెను. అ కారముమీఁదనే దీర్ఘము, గుడి మొదలగు అజ్ఞుణిత చిహ్నములను (చిత్రము చూచునది) జేర్చినచో అచ్చులెల్ల నేర్పడును. అకారమును మాత్రమట్లే యుంచునది. హల్లుల మీఁద నీ ------- అకారము తలకట్టు రూపమును బొందును. ఆకారాది స్వరములు హల్లుల మీఁద నున్నప్పుడే గుణితము లగునుగాని అకారముమీఁద నున్నప్పుడు గావు - అచ్చులకు గుణితము లేదుగాన.

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ,ఋ,ౠ, 7, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అను విధములఁ గల బదునాఱులిపులకును చిహ్నముల నుంచవలెను. (చిత్రము చూచునది.)

ఇట్లు మార్పఁగా బాలురకు ఒక్క అకారము మాత్రము నేర్పి, తర్వాత దీర్ఘము గుడి మొదలగు అజ్ఞుణితపు చిహ్నముల నేర్పినచో నచ్చు లెల్ల వచ్చును. కకారాదుల మీఁద నిఁక వేఱుగా అజ్ఞుణితమును నేర్పఁ బనియుండదు. ఒక్క తలకట్టు మాత్రమే నేర్పవలసియుండును. దీర్ఘము, గుడి మొదలగు నజ్ గుణితవు చిహ్నములు అచ్చులలో నేర్పుటచే నా చిహ్నములే హల్లులపై నుండును. కావున పదునైదు భిన్నాక్షరముల నేర్చుకోవలసిన బాధ తగ్గింది. ముద్రణమునఁ గూడ అచ్చులలో పదునైడు చిహ్నములు తగ్గిపోయునవి. అఆఅఆఅఆఅం! బు జూ à అ అ అ. అ. తెలం

లత అఅఅంఅంఅః (మఱొకతీరు) అలా ఆ ఆలులు అ అ అ అ లెలి ఆతల అంఅం అః

- C, 0, : - అరసున్న, నిండుసున్న, విసర్గము పూర్వముపలెనే ఉండవలెను. హల్లులలో క, చ, ట, త, ప వర్గములు సమాన లిపి నిర్మాణముగలవిగా నిట్లు మాటవలెను. వర్గప్రథమాక్షరమునకు ప్రక్కను ఒత్తిచ్చినచో ద్వితీయాక్షరమగును. వర్గతృతీయాక్షరములకు ప్రక్కను ఒత్తిచ్చినచో వర్గచతుర్ధాక్షర మగును. వర్గతృతీయాక్షరమునకే తలమీఁద 160 తెలుంగుమెఱుంగులు అనునాసిక చిహ్నము చంద్రకళ (ఇప్పటి 'జ,ఇ' ల కున్నది.. ) ఉంచినచో వర్గపంచమాక్షరమగును. అకారముతోఁ గూడిన హల్లులకెల్లఁ దలక టుండవలెను. తలకట్టు అక్షరమునంటియే యుండవలెను. అనఁగా, ప. స-లు తలకట్లతో నంటి యుండవలెను. ఇట్లు తీర్చఁగా వర్గాక్షరము లిట్లేర్పడును. (చిత్రము చూచునది. } 5888 ) b22 lu 3 3347 Ye zx d 9 as on aa & en " bes & & & & & ఛ జ జ ఝ ఇ ఘ 8X9 12:13 325 x3 a to B Bozorg W YO BY 3 3 YI

ఇందు బాలురకు వర్గ ప్రథమతృతీయాక్షరములను బదింటిని మాత్రమే వ్రాయనేర్చుకొనుటలోఁ బ్రయత్నమగును. ఒత్తుగల యక్షరములను ఒత్తి పలుకవలెనన్న విషయము తృటిలో బాలుర హృదయముల నాటి నెలకొనును. క నేర్చినవానికి, దాని ప్రక్కనే ఒత్తుగీత గల యక్షరమును ఖ నుగా గుర్తించుట, ఉచ్చరించుట కడు సులభము. వర్గ, ద్వితీయచతుర్ధాక్షరములెల్ల నిట్లే సులువుగా నేర్వఁదగిన వగును. భిన్నభిన్న రేఖలతోఁ క్రొత్త లిపులను దిద్దుట, యుచ్చారణమును జ్ఞప్తియం దుంచుకొనుట యను కష్టము లుండవు. వర్గతృతీయాక్షరము ముక్కుమూసికొని యుచ్చరించినచో వర్గపంచమాక్షరమగుట నుచ్చారణ శక్యనుసారముగా బాలురకు నేర్పుటగును. దీనినిబట్టి యిరువది యైదు వర్ణాక్షరములలో బదిమాత్రమే కొద్దీ నేర్వవలసినవి. తక్కినవి కడుసులభముగా జ్ఞాపకమునం బెట్టుకొని రెండు ఒత్తుగఁతల భేదముతో, తలమీఁది చంద్రవంకతో వ్రాయఁ దగినవియగును. వర్గాక్షరములెల్ల నొక్క నిర్మాణక్రమము గల వగును. ఇట్లు మార్పఁగా ముద్రణమునఁగూడ నిర్వదియైదు వర్గాక్షరము లలోఁ బదునై దక్షరములు దగ్గిపోవును. వర్గద్వితీయచతుర్ధాక్షరముల నచ్చునఁ గూర్పవలసినప్పుడు, వర్గప్రథమతృతీయాక్షరములఁగూర్చి వాని ప్రక్క నంటి యొక్క నిలువుగీత (1) అంకెను జేర్చిన సరిపడుము. వర్గ పంచమాక్షరమునకు వర్గతృతీయాక్షరము తలకట్టు నొట్టు నట్టు చంద్రకళ చేర్చినఁ జక్కఁబడును.


అంతస్థములు. ఊష్మలు


య-కుఁ గల కొమ్మును దొలఁగింపవలెను. ర-కే ప్రక్కసు ఓత్తిచ్చినచో బండి ఱ అగును. ల-కు తలక ట్టుండవలెను. ల-కే ప్రక్కను ఒత్తిచ్చినచో ళ ఆగును. వ-ను ప-ను గాఁ జేసితిమి గాన వ స్థానముఁ క్రొత్త యక్షరము వ్రాత 'వ' చేర్చవలెను. శ యథాపూర్వమే. శకు ప్రక్కను ఒత్తిచ్చి నచోష అగును సస్థానమున స యుంచునది. హ స్థానమున నేఁటి ళను, అనంగా కర్ణాటకపు హ కారమును ఉంచునది. హ తలకట్టు, దీర్ఘము కలిగియున్నది గాన దానిని దొలఁగింపఁదగును. క్షకారము కష సంయుక్తాక్షరము గాన దానికి వేఱురూప మనావశ్యకము. ఇట్లు తీర్చగా నంతస్థమలు, ఊష్మలు నిట్లేర్పడును. (చిత్రము చూచునది). ఈ మార్పు వలన యాదళాంతమగు పది యక్షరములలో మూఁ డక్షరములు దగ్గినవి. ఒక నిర్మాణ క్రమ మేర్పడినది.


గుణితము

అజ్ఞుణితము: - అజ్ఞుణిత చిహ్నము లెల్ల అచ్చులు నేర్చుకొనుట లోనే వచ్చినవిగాన బాలుర కిఁక హల్లులలోఁ దలకట్టు ఆకారస్థానీయ మనియును తక్కిన యచ్చులకెల్ల అకారముమీఁదఁ బెట్టిన గుర్తులే పెట్టిన సరిడు ననియుఁ జెప్పి, క్షణములో అజ్ఞుణితమును నేర్పవచ్చును.

ముద్రణమున తలకట్టు, దీర్ఘాదీస్వరచిహ్నములు వేఱువేఱుగా నిర్మించి (కన్నడలిపికిఁబోలె) చేర్చవలెను. దీనిచే ఒక్కొక్క హల్లునకును అజ్ఞుణితము క్రింద నిప్పుడు వ్రాయఁబడుచున్న ప్రత్యేకాక్షరములు పదేసి పదేసి తొలఁగిపోవును. దీనిచే అచ్చుపోఁతలోఁ గల యమితభారము తప్పి పోవును. హల్గుణితము: - ఉచ్చారణ రీతికి విరుద్ధముగాకుండ లిపిరీతి యుండవలెను గాన, హల్సంయుక్తాక్షరములందు కడపటి హల్లుమీఁదనే అచ్చు ఉండవలెను. కడపటిహల్లే పూర్ణాక్షరముగా నుండవలెను. తత్పూర్వపుహల్లులు తలకట్టు లేనివిగా (అనఁగా హల్మాత్రములుగా) నుండవలెను. (తలకట్టు తొలఁగిన హల్లులు హల్మాత్రములు). ఒక యక్షరముక్రింద నొక యక్షరము నిఱికించుట యనువిధానము మాసవలేను. లిపులెల్లఁ బ్రక్క ప్రక్కలనే ఉండవలెను. అనఁగా నిట్లు. దివ్యధ్వని-అను పదమును 'దివ్య వని' అని వ్రాయ వలెను. రెండిటికంటే హెచ్చుగా హల్లులు సంయుక్తములై యున్నప్పుడు మాత్రము, కడపటి హల్లుగాక తత్పూర్వపు హల్లులు, తలకట్టు లేనివిగా నుండునుగాన, ఒక దాని క్రింద నొక దానిని బెట్టినను బెట్టవచ్చును. ఎట్లనఁగా - వ్స్క్యావాతంత్ర్య అను పదము 'వాక్సవాతంత్ర య' అని వ్రాయవచ్చును. ఇట్టి మార్పువలన బాలురకు హల్గుణితపు ఒత్తును నేర్చుకొనవలసిన శ్రమము తొలఁగును. ఉచ్చారణరీతి ననుసరించి లిపిరీతిని నేర్చుకొనుట యగును.


ముద్రణమున నీ మార్పు బహుసుఖావహము. బంతిలో నక్షరము లెల్లఁ దీర్చినట్లుండును. ప్రతిపదము అక్షరము క్రింద నక్షరము వచ్చి బంతి వంకరవోదు. 'హాఫ్ బాడి, ఫుల్ బాడీ' టైపుల గజిబిజి యుండదు. సమ్మతమగుచో రెండింటికంటే నెక్కువ హల్లులు సంయుక్త మైనప్పుడు మాత్రమే తలకట్టు లేని హల్లులు అక్షరము క్రింద నక్షరముగా నేర్పడును. అది యసాధారణముగా నెక్కడనో వచ్చును.కాన యంతచిక్కుండదు. కానియిక్కడ ససౌకర్యమువలెఁ దోఁచఁదఁగిన విషయ మొక్కటి యున్నది.ఏదనంగా - సంయుక్తాక్షరములు హల్లు క్రింద హల్లుగాఁ గాకుండ ప్రక్కప్రక్కగాఁ గూర్చుటచేత నిప్పటి లిపిఆక్రమించుకొను స్థలముకంటే నీ మార్పు లిపి హెచ్చుస్థల మాక్రమించుకొనునుగదా అనునది. ఇది యోచింపఁదగినదే. ఒకానొక యాంగ్లాభిమాని ప్రముఖుఁడు ఆంధ్రలిపిని దొలఁగించి తత్ స్థానమున నాంగ్లలషిని చొప్పింతుమేని నూఱుపుట లాక్రమించుకొనుగ్రంధమును ఏఁబదిపుటలలో సమకూర్పు వచ్చు నని కొన్ని యేండ్ల క్రిందట వాదించుట వింటిని. ఇంగ్లీషక్షరములు బెక్కక్షరములను గూర్పనగు ననియా లిపిజ్ను లనిరి. అట్లు తలఁచువా రుండఁగా నే నిపుడు పేర్కొను లిపి సంస్కారము ఇప్పటి లిపి కంటే హెచ్చుస్థల మాక్రమించునదిగా నుండునేని యది ప్రాజ్ఞసమ్మతము గాకపోవచ్చును. కాని యీ సంస్కారము నిజముగా నట్లు హెచ్చుస్థల మాక్రమించుకొనదు. వ్రాతలో నించుకంత స్థలము హెచ్చుతగ్గు లగుటలోఁ జి క్కుండదు. అచ్చులో స్థలము పెరుగుటమాత్రమే చిక్కు అచ్చులో లిపిక్రింద లిపీ నుంచి కూర్చినట్టు కన్పట్టుచున్నదే కాని, వాస్తవమునకు (హాఫ్ బాడీ తప్పు) ప్రక్కనే ఉండును, వానిని గూర్చుటలోఁ గొంచె మించుమించుగా విడఁబలిచి వ్రాసిన నెంత స్థల మాక్రమించుకొనునో యంతస్థఫలమును వెనుక ముందుల ఆ 'స్పేసు' ఆక్రమించుకొనుచున్నది. పైగా బంతి వంకరవోవుచున్నది. అట్టి సంయుక్తాక్షరములు గల బంతికొఱకయి కొన్ని 'లెడ్లు' ఎక్కువ వేయవలసివచ్చుచున్నది. కాన వీనిని గలిపి కట్టుకొనినచో నంతగా నీ మార్పు హెచ్చుస్థల పక్రమించు కొనునది గాదని యేర్పడును. మఱియు ఋ,ౠ, ఘు,ఝ,మ,యలు, హలలో జరపఁబడిన మార్పులవలని స్థలలాభము కొంత గలదు.కావున నిది యంత యనర్ధావ హము గాదని నాతలంపు. అఱవలిపి యీ విధముననే కలదు. అందు లిపి క్రింద లిపి చేరదు.దానివలన వారి కెట్టి యసౌకర్యమును లేదు.


ఈ మార్పుచే హల్లుల యొత్తులు . a మొదలగునవి అక్కరలేక పోవును. అజ్ఞుణిత చిహ్నములను వేఱుగాఁబోఁతపోసి తలకట్టులేకుండఁ బోసిన హల్మాత్రములమీఁదఁ జేర్చుటకు వీలు గలుగును. సంయుక్తాక్షర మందలి హల్మాత్రములు తలకట్టు లేకుండఁ బూర్వముననుండి కడపటి హల్లు అచ్చుతోఁ గూడియుండుట గుదురును. మొత్తము లిపియెల్ల నిట్లు మార్పఁగా నచ్చుకై పోఁతపోయవలసినరేఖాచిహ్నములు ముప్పదియైదుమాత్రమే యగును. వర్గద్వితీయచతుర్ధములకు, ళ,అ,ష - లకుఁబెట్టవలసిన ఒత్తుగీఁత యొక్కటి, వర్గానునాసికములకుఁ బెట్టవలసిన చంద్రకళ ఒక్కటి గలవు. ఈ రెంటిని జేర్చుకొనఁగా ముప్పదియే డగును. ఇప్పుడు ముద్రణములకై యుపయోగింపఁబడుచున్న చిహ్నములు 500 లలో 468 తగ్గి పోయినవి. ముద్రణమున కీ మార్పు అమితోపకారకముగదా!


ఈ మార్పునుబట్టి టైపుమీషనును సృష్టించుట కడుసుకరముగదా! దంత్యములగు చజలకు వేలు లిపు లక్కఱ లేదు. ఇప్పుడు వాని భేదము నెవ్వరును లిపిలో పాటించుట లేదుగాని కావలెనని యభిమానించు వారికై ప్రత్యేకలిపి కల్పించితిని. రేఫముసకుఁ బూర్వపులిపిలో వలపలిగిలక -౯ అను చిహ్నమును, నకారమునకు ” అను చిహ్నమును గలవు. ఈ లిపు లభిమానింపఁ దగినవి. కాని వలపలిగిలక 'వగ౯ము' అను విధమున వ్రాయఁబడును. ఇది 'వ౯గము' అనువిధమున మార్చుట ఉచ్చారణాను గుణము. అప్పుడది డాపలిగిలక యగును. ఇష్టమేని వీని నుంచుకొన వచ్చును. అనిష్టమేని మానవచ్చును. కర్ణాటాంధ్రలిపులకుఁ జాల సాన్నిహిత్యమున్నది గాన, ఉభయలిపులకు నైక్యము కలుగుట యుభయ దేశముల వారికిని జాల లాభకర మని నా యీ సంస్కారములో కర్ణాటలిపిరీతిని కొంత చేకొనుటయ్యెను. ఉభయలిపులకు నైక్యము పొసగుట నాకోరిక. 166 తెలుగు ఖంగులు (శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు లిపి సంస్కారమును గూర్చి వ్రాసిన జాబు ఆనాటి దిది. తదుపరి యిందున్న విధమున మరి కొన్ని సంస్కారములనుగూడ శ్రీ శాస్త్రిగారు కావించిరి) బందరు అందా, తవురు బారతిలో ఎరబురించి తయాశము చదివి, అతడు బలలు ) 18 అకశరములతో, ఆలులతో , మండిరిన ta e a son sex ano ano. Soda² soen, 'వ' sv , పేద ముబజు అss. చ అతగించ కపేలు. . జోగ గరాజువలు చేస్తా o fios. తమరు భారతిలో ప్రచురించిన వ్యాసము చదివితిని. అయిదు బళ్లు 18 అక్షరములతోను, 17 పొల్లులతోను పూర్తి అగుటచే టైపుకు వీలుగ నుండును. కాని వ కును య కును భేదము బహు తక్కువ. చిత్తగించవలెను భోగరాజు పట్టాభిసీతారామయ్య.