Jump to content

జీవశాస్త్ర సంగ్రహము

వికీసోర్స్ నుండి

విజ్ఞానచంద్రికా గ్రంథమాల 3.

జీవశాస్త్ర సంగ్రహము.



ఇది

చెన్నపట్టణపు వైద్యకళాశాలలోనున్న

ఆచంట లక్ష్మీపతి, బి.ఏ., గారిచే

రచియింపబడి

యిందలి యుపోద్ఘాతలేఖకులగు

కే. వి. లక్ష్మణరావు, ఎఫ్.ఏ., గారిచే

సంపాదితమయ్యె.


రెండవకూర్పు 1000 ప్రతులు


చెన్నపురి :

ఆనంద ముద్రాక్షరశాలయందు ముద్రింపించి

ప్రకటింపఁబడియె.

1909.

All Rights Reserved.

దీని వెల రు. 1-8-0.

పూర్తి విషయసూచిక

[మార్చు]

విషయసూచిక.

ఉపోద్ఘాతము. 1-38.

మొదటి భాగము.

మొదటి ప్రకరణము.

వికారిణి (Amoeba)

వికారిణియొక్క శరీరనిర్మాణము, మూలపదార్థము, జీవస్థానము, సంకోచనావకాశము, కణమనగానేమి? వికారిణియొక్క వ్యాపారములు, చలనము, పోషణము, వృద్ధి, వికారిణి అంగుళములో నూరవవంతుకంటె ఏల పెరుగదు? మలమూత్రోత్సర్జనము, సంతానవృద్ధి, ద్విఖండనము, వికారిణియొక్క నివాసమునకు తగిన స్థితిగతులు, మన రక్తమునందలి కణములు, తెల్లకణములు, ఎర్రకణములు. 1-25.

రెండవ ప్రకరణము.

సూక్ష్మజీవులు (Micro-organisms).

సూక్ష్మతర్కువులు, సూక్ష్మగుటిక, సూక్ష్మదండిక, సూక్ష్మకంపర, సూక్ష్మవ్యావర్తక, మృదురోమము, శ్రమవిభాగము, సంతానవృద్ధి, సూక్ష్మ జీవులఆహారము, హరితకములు, వికారిణి ఎట్లు ఆహారముతినును? వృక్షజాతిసూక్ష్మజీవులెట్లు ఆహారముతినును? కర్బనికామ్లవాయువును విడదీయుట, మూలపదార్థమునుకట్టుట, వికారిణి ఎట్లు జీర్ణముచేసికొనును? వృక్షజాతి జీవులు ఎట్లు జీర్ణము చేసికొనును? కేవల జంత్వాహారము, కేవలవృక్షాహారము, మధ్యమజాతిసూక్ష్మజీవులు, పూతిభుక్కులు, పరాన్నభుక్కులు, చీము ఎట్లు పుట్టుచున్నది? సూక్ష్మజీవులవలన గలుగుమార్పులు, సూక్ష్మజీవుల జీవనమున కనుకూలమగు స్థితిగతులు, సమాప్తి. 26-59.

మూడవ ప్రకరణము.

మథుశిలీంధ్రము (Saccharomyces-Yeast).

కల్లును చెరుకురసమును సారాయిగామార్చునదేది? నిర్మాణము, సంతానవృద్ధి విధానములు, మధుశిలీంధ్రములశక్తిచే సారాయియెట్లు పుట్టును? పాస్ట్యూరు కషా యము అతనిశోధనలు, మధుశిలీంధ్రమును కాల్చిన నేమి మిగులును? మథుశిలీంధ్రము మధ్యమ జాతిజీవి, దానిఆహారము పూతికాహారము, మధుశిలీంధ్రమున కనుకూలమైన స్థితిగతులు, విభేదకములు. 60-74.

నాలుగవ ప్రకరణము.

జీవులు, అజీవులు (The Living & The Non-Living)

జీవోత్పత్తిక్రమము, తల్లిదండ్రులు లేక నేపుట్టినవా? సూక్ష్మదర్శని అజ్ఞానమును నశింపజేయుట, అజీవపదార్థమునుండి జీవులు పుట్టవు, సజాతీయసృష్టివాదము, పరిణామసృష్టివాదము, విజాతీయసృష్టి వాదము.

అయిదవ ప్రకరణము.

రక్తాక్షి (Euglena).

నిర్మాణము, రక్తాక్షి వృక్షమా? రక్తాక్షి జంతువా? రక్తాక్షి వికారిణికంటె హెచ్చుజాతిలోనిది, రక్తాక్షివృక్షము, రక్తాక్షిజంతువు, సంతానవృద్ధి. 84-89.

ఆరవ ప్రకరణము.

ఆవర్తకారి (Vorticella).

ఆవర్తకారియొక్క నిర్మాణము, ప్రేరితసంకోచనము, మాంసాంకురము, వికారిణిపాదము, మృదురోమము, కండపోగు వీనిసంకోచనమునందలి భేదములు, సంతానవృద్ధి విధానములు, తల్లిదేశము, కాలనీలు, రూపపరిణామము, అఖండావర్తకారి. 90-106.

ఏడవ ప్రకరణము.

బూజు, కుక్కగొడుగు (Penicillium and Agaricus)

సూక్ష్మనిర్మాణము, బూజుపోగు అనేక కణములపంక్తి, బూజుపోగులయొక్క శాఖలు: కొనదిమ్మలు, బూజుపై గప్పియుండుధూళియే దానిబీజములు, అంత్యకణము, బూజుయొక్క ఆహారము, కుక్కగొడుగులు, శోభి, తామర. 107-120.

ఎనిమిదవ ప్రకరణము.

పసిరికపోగులు (Spirogyra).

సూక్ష్మనిర్మాణము, సంతానవృద్ధివిధానములు, స్త్రీపురుషవివక్షత, ఏకాంగులు; ఉభయాంగులు. 121-131.

తొమ్మిదవ ప్రకరణము.

ఏకపత్రము; వారిపర్ణి (Monostroma and Chara).

వారిపర్ణి, ప్రకాండము, కాండము, బీజాశయములు, సూక్ష్మనిర్మాణము, శాఖాంతముయొక్క సూక్ష్మనిర్మాణము, అంత్యకణముయొక్క నిర్మాణము, అంత్యకణ ఖండనము, ఉపాంత్యకణము, వారిపర్ణి యంతయు నొక్కకణమునుండి పుట్టినది, శాఖోత్పత్తి, ఆకులయుత్పత్తి, మూలతంతువులు, బీజాశయములు, స్థూల (ఆడ) బీజాశయము, సూక్ష్మబీజాశయములయుత్పత్తి, స్థూల బీజాశయములయుత్పత్తి, పిండోత్పత్తి, కణగుణనము, కణవ్యత్యాసము. 132-158.

నిర్మాణము, సంతానవృద్ధి, స్థూలబీజాశయములు, ఏకకణపిండము, జంతుపిండమునకును వృక్షపిండమునకును గలభేదము, సిద్ధబీజాశయము, ప్రథమతంతువు, నాచుకణముయొక్క యాహారము, ఉపశ్వాసము, శ్రమవిభాగము. 159-179.

హైడ్రాయొక్క నివాసస్థానము, సూక్ష్మనిర్మాణము, హైడ్రా ఎట్లునడచును? హైడ్రా ఎట్లుభుజించును? హైడ్రా యనేక కణములకూర్పు, బహిశ్చర్మకణములు, తంతితిత్తులు, నాడీమండలము, గ్రంథికణములు, అంతశ్చర్మ కణములు, రెండవవిధమైన జీర్ణపద్ధతి, హరితకములు, శ్రమవిభాగము, సంయోగజనిత సంతానవృద్ధి, స్థూలబీజమునందు గలుగుమార్పులు, సూక్ష్మరంధ్రము, స్త్రీపురుషబీజముల జీవస్థానము లైక్యమగుట, సంయుక్తబీజము: ఏకకణపిండము, మల్బెరీదశ, వృక్షములకును జంతువులకును ఆదిజీవియొక్కటియే, పోలికలు, వ్యత్యాసములు, హైడ్రా నాచుమొక్కలకు గలపోలికలు, మల్బెరీదశనుండి హైడ్రా ఎట్లుపరిణమించును? జంతువర్గమునందలి మూలవిభాగములు. 180-212.

రెండవ భాగము.

హెచ్చుతరగతి వృక్షములు.

మొదటిప్రకరణము.

వృక్షకణము.

మూలపదార్థము, హరితకములు, జీవస్థానము, ఆకర్షణబింబము, కణసంహతులు, కణములయందలి మార్పులు, 1. కణకవచము పెరుగుట, 2. కణకవచము దళసరెక్కుట, చారలరూపనిష్పత్తి, 3. కణకవచముయొక్క రసాయనసమ్మేళనము నందలిమార్పులు, 4. కణములందలి పదార్థములలోని మార్పులు, 5. కణములైక్యమగుట, దారువాహికలు, జల్లెడ కాలువలు, వాయుమార్గములు, హెచ్చుజాతివృక్షములన నెవ్వి? ... ... 215 - 237.

ద్విబీజదళవృక్షము, ఏకబీజదళవృక్షము, శాఖా ప్రసారము, కిరణ ప్రసారము, సర్ప ప్రసారము, గొడ్డు మొటిమలు, శాఖయొక్క ఉపయోగములు, శాఖయొక్క సూక్ష్మనిర్మాణము, ద్విబీజదళశాఖ, ఏకబీజదళశాఖ, వాహికాపుంజముల వ్యాపకము, అంత్యవిభాజ్యము, శాఖలయుత్పత్తి, గాయములు. 238-262.

పత్రపీఠము, పత్రమధ్యము, పత్రదళము, పత్రవిశేషములు, ఆకుల ఆకారము, ఆకులయొక్క ప్రసారము, ఆకుల అంచు, ఆకుల అగ్రము, రోమములు, నిర్మాణభేదములు, మిశ్రమపత్రము, లఘుపత్రముము, కొమ్మకును ఆకునకునుగల భేదములు, సూక్ష్మనిర్మాణము, ఆకునందలి వాహికాపుంజముల వ్యాపకము, ఏక కాష్ఠము, బహు కాష్ఠము, పిల్లయీనెలవ్యాపకము, ఆకుయొక్క ఉత్పత్తి, ఆకురాలుపు. 263-281.

ఆకారము, వేరుయొక్క సూక్ష్మనిర్మాణము, పిల్లవేరులయుత్పత్తి, వేరుయొక్క ఉపయోగములు. 282-287.

అయిదవ ప్రకరణము.

పూవు (The Flower).

పుష్పముయొక్క ఉపయోగ మేమి? అంటులు, గింజలు, స్త్రీపురుష వృక్షములు, పుష్పముయొక్క నిర్మాణము, 1. రక్షకపత్రములు, 2. ఆకర్షణ పత్రములు, 3. కింజల్కములు లేక పురుషపత్రములు, కింజల్కములు ఆకులయొక్క పరిణామరూపములు, 4. అండాశయములు లేక స్త్రీపత్రములు, అండాశయములు ఆకులయొక్క పరిణామరూపములు, స్త్రీ పురుషసంయోగము, దూతలు:- భృంగాదులు, వాయువు, నీరు, సంపర్కము, స్థూలబీజాశయముయొక్క సూక్ష్మనిర్మాణము, సూక్ష్మబీజముయొక్క సూక్ష్మనిర్మాణము, సూక్ష్మస్థూలబీజముల సంయోగవిధానము. 288-317.

ఆరవ ప్రకరణము.

కాయ (The Fruit).

కాయయొక్క ఉపయోగము, కాయయొక్క సూక్ష్మనిర్మాణము, చిక్కుడుకాయయొక్క నిర్మాణము, స్థూలబీజాశయమునందలి యితరమార్పులు, ఏక బీజదళవృక్షముయొక్క మొలక, అండాశయమునుండి పరిణమించుభాగములు, ఫలకవచనము నందలి భేదములు, గుంజు కాయలు, ఎండు కాయలు, పగులు కాయలు, ద్వివిదారణఫలములు, బహువిధారణఫలములు, గట్టికాయలు, నిజమైన కాయలు, దొంగ కాయలు, ప్రకృతిసిద్ధమైన జగడము. 318-351.

విశేష పదసూచిక. - 353-362.

పరిశిష్టము - 363-366.

ఇతర మూల ప్రతులు

[మార్చు]


This work is in the public domain in the United States because it was published before January 1, 1929.


The author died in 1962, so this work is also in the public domain in countries and areas where the copyright term is the author's life plus 60 years or less. This work may also be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.