జీవశాస్త్ర సంగ్రహము/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదునొకండవ ప్రకరణము.

హైడ్రా (Hydra).

వృక్షజాతిలో మొట్టమొదట కొన్ని సూక్ష్మజీవులు మొదలగు ఏకకణప్రాణులను, తరువాత అనేకకణముల పంక్తులగు బూజుపోగు, పసిరికపోగు మొదలగువానిని, పిమ్మట అనేకకణముల చదరపుపేరుపు అగు ఏక పత్రమును, తదనంతరము కణముల ఘన సమూహమగు వారిపర్ణి, నాచు, మొదలగు పై తరగతులను క్రమముగ నొకదానికంటె మరియొకటి సంమిశ్రమైనవై (Complex) నిర్మాణవి శేషతయందు హెచ్చుచుండుట చూచియుంటిమి.

కాని జంతుజాతిప్రాణులలో వికారిణి, ఆవర్త కారి మొదలగు ఏకకణప్రాణులనుమాత్రము జూచియున్నాము. ఏకకణ జంతువుల వర్ణన ముగించినతోడనే, పసిరికపోగుతో సమాన తరగతిలో జేర్చదగిన కణములపంక్తులగు జంతువులు గానరావు. అయినను, ఏకకణమునందే యనేకజీవస్థానములుగల ఆంత్రకములు (Opalina) మొదలగు జంతుజాతిలోని ప్రాణు లనేకములు గలవు (26-వ పటము చూడుము). ఆంత్రకములు కప్ప మొదలగు జంతువుల పేగులలో నివసించుచు వాని జీర్ణ రసములచే జీర్ణముచేయబడిన ఆహారము పీల్చును బ్రతుకుచుండును.
Jeevasastra Samgrahamu.pdf

కాన నివి పరాన్నభోజులలోనివి. వీనికి నోరు లేదు. వీని యాహారము వీని పలుచని కణకవచముగుండ ఊరి, లోపలికి వ్యాపించుచుండును.

ఏకకణప్రాణుల తరువాత కణములయొక్క ఘనసము అవయములు గానవచ్చు చున్ంవి. అట్టివానిలో మొదటిదనిచెప్ప దగినదియు, సులభముగా గ్రహింపదహినదియు నగు హైడ్రాయను నీటిపురుగును గూర్చి వ్రాసెదము. దీనికిని వృక్షజాతి జీవులకును గలభేదము చక్కగ గ్రహింపనగును.

హైడ్రాయొక్క నివాసస్థానము

హైడ్రా యను నీటిపురుగు కొంచెము అపరిశుద్ధమైన మంచినీళ్ల గుంటలందు సామాన్యముగ నుండునట్టి దైనప్పటికిని ఎన్నడు నమితముగా నుండకపోవుటచేత కొంచెము శ్రద్ధజేసి వెదకినగాని కానరాదు. దీనిని పరీక్షించునిమిత్తమై యొక-స్వచ్ఛమైన గాజుగ్లాసును అట్టి గుంటయందలి నీటితో కొంత తుక్కు సహితము నింపుము. దీనిని కొన్ని నిమిషములవరకు కదపకుండ నొకచోట బెట్టుము. తగినన్ని హైడ్రా లానీటిలో నున్నయెడల, అవి యాగ్లాసుయొక్క ప్రక్కలనుగాని దానియందలి తుక్కును గాని యంటి, సన్నని నూలుపోగులంత లావును, ఒక నూలు మొదలు మూడునూళ్లవరకు అనగా, అంగుళములో పండ్రెండవవంతు మొదలు నాల్గవవంతువరకు పొడుగును గలిగి తెల్లగగాని కొంచె మాకుపచ్చగగాని యుండు సముదాయములు (Masses) గ గనిపించును. ఇవి తమ మొదటిభాగములచే పై జెప్పిన తుక్కు మొదలగువానికి గట్టిగ అంటుకొన్నవై యుండును.

సూక్ష్మ నిర్మాణము.

సూక్ష్మదర్శనియొక్క తగ్గు దృక్ఛక్తితో పరీక్షించిన దాని నిర్మాణమునందలి అంశములు తెలియగలవు. సూక్ష్మదర్శనిలో దీనిమొండెము గొట్టమువలె కనబడును. ఆ మొండెముయొక్క పీఠమువలె నుండెడు చదునైన మొదటిభాగము ఇతరవస్తువుల నంటియుండి వానినుండి మొలచునట్లుగా కనిపించును (27-వ పటములో A-చూడుము). దాని రెండవకొన ఆదోకగ (Cone) నుండి శిఖరమున గుండ్రనిరంధ్రమును గలిగియుండును. ఈ రంధ్రమే దానినోరు (నో). ఈ నోటికి క్రిందివైపున ఆదోకగా నుండుభాగమునకు క్రీవాయి (Hypostome) యని పేరు (క్రీ). ఈ క్రీవాయి మొండెముతో గలియుచోట 6 మొదలు 8 వరకు సంఖ్యగల పొడుగైన మృదువగు మీసములు (Tentacles) కిరణములవలె క్రీవాయిచుట్టును వెడలియుండును (27-వ పటములో మీ. చూడుము). మొండెమును నిలువున ఖండించిచూడగా నది బోలుగా నున్నట్టును, అందు జీర్ణాశయ మను పెద్దయవకాశము పొడుగునను వ్యాపించి యున్నట్టును, ఆ యవకాశము దాని నోటిరంధ్రమార్గమున చుట్టునుండు నీటితో సంబంధముగలదిగ
Jeevasastra Samgrahamu.pdf

ఒక హైడ్రా నిగిడియున్న రూపము. దాని మీసములలో రెండు. ఏదో యొక ఆహారపదార్థమును పట్టుకొనియున్నవి. రెండు పిల్లహైడ్రాలు తల్లినుండి శాఖలుగా పుట్టుచున్నవి. అం దొకదాని కింకను మీఅసములు పుట్టలేదు.

ఇది హైడ్రా సంకోచించిన రూపము. C. హైడ్రాను నిలువున చీరగా నేర్పడిన చీరిక. బ-బహిశ్చర్మము. అం-అంతశ్చర్మము. న.పొ-నడిమిపొర. పీ-పీఠము. మీ-మీసము. నో-నోరు. క్రీ-క్రీవాయి. పి-పిల్లహైడ్రాలు మొటిమలుగా పుట్టుచున్నవి. సూ.బీ-సూక్ష్మబీజాశయము. స్థూ.బీ-స్థూలబీజాశయము.

D. క్రిందిభాగమున హైడ్రాయందలి చిన్న తునక యొకటి మిక్కిలి పెద్దదిగ కనబరచబడినది. కుడివైపున బహిశ్చర్మకణములు (బ). ఎడమవైపున అంతశ్చర్మకణములు (అం). ఈ రెంటిమధ్య (న.పొ) నడిమిపొర. కం-మాంసాంకురములు. మ.క-మధ్యకణములు. తం-తంతితిత్తి. మీ-మీటు. దీని కెట్టిదైనను తాకుడు గలుగగనే తంతితిత్తినుండి పొడుగైన తీగె యొకటి క్రిందిభాగమున E-లో ప్రత్యేకముగ జూపబడినట్లు నిగిడింపబడును. అంతశ్చర్మకణములలో కొన్నిటియొక్కకొనలు వికారిణి యొక్క (పా) పాదములవలె మొండిగను, మరికొన్నిటికొనలు పొడుగైన (మృ). మృదురోమములవలె తోకలుగను ఉన్నవి.

నున్నట్టును తెలిసికొననగును. మీసములుగూడ బోలుగనేయుండి వానియందలి బెజ్జములుకూడ జీర్ణాశయబిలముతో జేరి యుండును.

ఒక వాచిఅద్దము (Watchglass) లో కొంచెము నీళ్లు పోసి అందులో నెమ్మదిగా కొంచెము తుక్కుతోపాటు ఒక హైడ్రాను ఉంచి దాని నంతటంతట సూక్ష్మదర్శనితో పరీక్షించుచు వచ్చినయెడల దాని నడవడి, ఆహారపద్ధతి, మొదలుగాగల యనేక విషయముల దెలిసికొననగును. ఒకానొకప్పుడు 27-వ పటములో A-లో జూపినప్రకారము హైడ్రా తన వెడల్పుకంటె 15 రెట్లు పొడుగుగలదిగా విస్తరించియుండును. దీని మీసములు మిక్కిలి సన్నని మృదువైన పోగులవలె నుండును. మరియొ కప్పుడు దాని కెడమప్రక్కను B-లో జూపినప్రకార మీ హైడ్రా సంకోచించి గుండ్రనిబొట్టువలె నగును. అప్పు డీ మీసములు గూడ చిన్నచిన్న మొటిమ లగునట్లుగా సంకోచించి యీ బొట్టు చుట్టు నంటియుండును.

హైడ్రా ఎట్లునడచును?

హైడ్రా కీ సంకోచవికాసచలనమే గాక యొక చోటనుండి మరియొక చోటికి మెల్ల మెల్లగా తృణజలూకమువలె ప్రాకుటయు గలదు. ఎట్లన, నది మొట్ట మొదట తన శరీరమును వంచి మీసములుగల చివరకొనచే మరియొక వస్తువును అంటుకొనును. పిమ్మట మొదటిభాగము నెత్తి క్రమముగా చివర కొనయొద్దకు లాగికొనును. ఈ మొదటిభాగము నిక్కడ స్థిరపరచుకొనిన తరువాత చివర భాగమును మునుపటివలెనే ముందుకు జరుపుచు ప్రాకుచుండును. ఒకానొకప్పు డిది తలక్రిందుగా నిలిచి మీసములుమీద ఆనుకొని వానిని కాళ్లుగా నుపయోగించుచు నడుచుటయు గలదు.

హైడ్రా ఎట్లుభుజించును?

హైడ్రా ఎట్లు భుజించునో చూతము. ఇది మిక్కిలి ఆకలిగల జంతువు. వృకోదరునివంటిది. చేపలను పట్టునిమిత్తము వేయబడిన గాలములవలె నెల్లప్పుడు ఆడుచుండెడు దీని మీసములతో నిది యాహారమును పట్టి తినుచుండుట చూడ వినోదముగ నుండును. నీటియం దెల్లప్పుడును చిన్నచిన్న జంతుసమూహము లుండును గదా? అతివేగమున పరుగులిడుచుండెడి యట్టి జంతువులలో నొకానొకటి, నిరంతర మటునిటు నాడుచుండు హైడ్రాయొక్క మీసములలో నొకదానిని తాకి హఠాత్తుగ జడత్వమునొంది, దాని కొన కంటుకొనిపోవును. పిమ్మట హైడ్రా యా మీసపుపోగును క్రమముగ ముడుచుకొని, తనయాహారమును నోటియొద్దకు తెచ్చుకొని, మరియొకపోగు సహాయముతో దానిని నోటిలో వేసికొనును. ఈ హైడ్రాచే మ్రింగబడిన జంతువు లొకానొకప్పుడు మిక్కిలి పెద్దవిగా నుండి దానిపొట్టకంటె లావుగా నుండున వగుటచేత, నవి యిమిడియుండు చోట హైడ్రాయొక్క పొట్ట, కప్పను మ్రింగినపాముపొట్టవలె నెత్తుగ నుబికియుండును. హైడ్రా యొక్క జీర్ణాశయము దానిమొండెము పొడుగునను గొట్టమువలె వ్యాపించియుండునని చెప్పియుంటిమి. ఈ జీర్ణాశయములో కొన్నిరసముల సహాయముచే నీ యాహార పదార్థములలో కొంతవరకు కరగి జీర్ణమగును. దీని మొండెముయొక్క మొదటికొన నెక్కడను రంధ్రము గానరాకుండుటచే, హైడ్రాకు ఆసనమార్గము ప్రత్యేకముగా లేదని చెప్పవచ్చును. జీర్ణముకాని పదార్థములు తిరిగి నోటిమార్గముననే వెలువరింపబడును.

హైడ్రా యనేకకణములకూర్పు.

హైడ్రాయొక్క మొండెమునుండి, నిలువునను, అడ్డమునను సూక్ష్మమైన తునకలు ఖండించి సూక్ష్మదర్శనితో పరీక్షించిన యెడల దానియొక్క సూక్ష్మనిర్మాణము తెలియగలదు. జంతువంతయు ననేకకణములకూర్పు. అందు ప్రతికణమును మూలపదార్థముచే నైనది. ప్రతికణమునం దొక పెద్దజీవస్థానము గలదు. అక్కడక్కడ అవకాశములును గలవు. సమస్తము లైన జంతుకణములకువలెనే యీ కణములకును కణకవచము లేదు. మన మిదివరకు జదివిన వారిపర్ణి, నాచు మొదలగు వృక్షజాతి జీవులయందువలె హైడ్రాయందలికణములు, ఎడతెగనిరాశిగా నమర్పబడియుండక, దాని శరీర మధ్యముననుండు జీర్ణాశయ మనబడు నొక బిలముచుట్టును.. ఆ బిలమునకు శాఖలుగా నుండు మీసపుపోగుల బిలములచుట్టును, కణములవరుసలు అమర్పబడియుండును (27-వ పటములో C-చూడుము). ఈ బిలముల యొక్క గోడయే దాని శరీరావరణపుగోడ. అది యన్ని చోట్లను రెండు కణములవరుసలచే జేయబడినది. అందు వెలుపలివరుసకు బహిశ్చర్మము (Ectoderm) అని పేరు. (బ). లోపలివరుసకు అంతశ్చర్మము (Endoderm) అని పేరు (అం). ఈ అంతశ్చర్మకణములే జీర్ణాశయమునకు సరిహద్దుకణములు. ఈ రెండు కణములవరుసలకు నడుమ పొడుగున నొకపొర గలదు. దీనికి నడిమిపొరయని పేరు (న.పొ). ఇది యాకణములనుండి స్రవించిన యొకానొక జిగటపదార్థముచే జేయబడినదిగాని కణములవరుస గాదు. ఇది మిక్కిలి స్థితిస్థాపకత్వము గలది. అనగా రబ్బరువలె సాగునది. ఇట్టిపొర యుండుట చేతనే, హైడ్రా తన సంకుచితరూపమును విడుచుతోడనే పొడవైనరూపమునకు తటాలున నిగుడుచుండును. ఆవర్తకారియొక్క వెలుపలి పొరయు నిట్టిదే యని చదువరులు గ్రహింపనగు.

బహిశ్చర్మకణములు.

బహిశ్చర్మమునందు రెండువిధములైన కణములు గలవు. అందు ముఖ్యమైనవియు, స్పష్టముగ తెలియునవియు నగు పెద్ద కణములు ఉలివలె (Wedge Shaped) చివర సన్నముగను, మొదట దళముగ నుండును (బ). దళమగు మొదలు వెలుపలివైపునకును, సన్నముగ నుండు కొనలు లోపలి తట్టునకును అమర్పబడి యుండును. ఇట్లు పేర్చబడుటచే ఆదోకగ నుండు లోపలి కొనల మధ్య నెడములు మిగులక మానవు. ఈ యెడములందు రెండవ విధమైన కణము లిమిడియుండును (మ.క). ఇవి గుండ్రని చిన్న చిన్న కణములు. ఇవి అవసరమునుబట్టి పెద్దకణములుగా మారుచుండును. వీనికి మధ్యకణము (Interstitial Cells) లని పేరు.

పెద్ద బహిశ్చర్మకణములలో ననేకకణములు లోపలితట్టున పొడుగుగా సాగి యాకొనయందు మొనతీరి (Pointed) యుండును. ఇట్లు మొనతీరియుండు కొనలన్నియు కణమునకు సమకోణముగ (At Right Angles) వంగియుండును. అనగా ఇవి హైడ్రా యొక్క పొడుగునకు సమాంతరము (Parallel) గ నుండును. ఇట్లు వంగిన భాగములకు మాంసాంకురము లనిపేరు. ఈ మాంసాకురములన్నియు జేరి నడిమి జిగటపొరకు వెలుపలివైపున నొక పొరగా హైడ్రా పొడుగున నంతటను వ్యాపించియుండును. ఈ మాంసాకురములు హెచ్చుతరగతి జంతువుల కండలయొక్క (Muscles) స్వభావము గలవి. అనగా సంకోచవికాసములు గలవి. ఇవియన్నియు నేకమై సంకోచించుటచేతనే దీని శరీరము ముడుచుకొనుచున్నది. ఇవి యన్నియు నేకమై వికసించుటచేత దీని శరీరము పొడవగుచున్నది మన మీహైడ్రా నొకపుల్లతో తాకిన యెడల నది తటాలున ముడుచుకొని చిన్నదగును. అట్టిస్థితిలో మాంసాంకురములన్నియు పొట్టివగుచు వానితోపాటు శరీరము నంతను క్రిందికి నీడ్చును. ఆవర్తకారియందలి నడిమిపోగును, ఈ హైడ్రాయందలి మాంసాంకురములును నొక్కటే స్వభావముగలవని గ్రహింపనగు.

బహిశ్చర్మకణములకు ప్రేరితసంకోచనము (Irritability) స్వేచ్ఛాసంకోచనము (Automatism) రెండును గలవు. అందు ప్రేరితసంకోచనము అనగా బాహ్యపదార్థముల స్పర్శముచే ప్రేరేపింపబడి సంకోచించుస్వభావము. అది కణముల వెలుపలిభాగములయందు హెచ్చుగనుండును. స్వేచ్ఛాసంకోచనము అనగా హైడ్రా యిచ్చవచ్చినప్పుడు సంకోచించు స్వభావము. ఇది మాంసాంకురములయందు హెచ్చుగనుండును.

తంతితిత్తులు.

పెద్ద బహిశ్చర్మకణములలో కొన్నిటియందు అండాకృతిగల నిర్మలమైన తిత్తి యొకటి కనుబడును (27-వ పటములో D-లో తం). ఈతిత్తియొక్క యావరణపుపొర స్పష్టముగ తెలియుచుండును. ఈతిత్తుల నోటినుండి పటములో క్రిందిభాగమున E-లో జూపినప్రకారము పొడుగును, సన్నమును, మెత్తనయు, కోమలము నైన తీగెవంటి గొట్ట మొకటి వ్యాపించియుండును. ఈ తిత్తులకు తంతితిత్తు లని పేరు. వీనిని సూక్ష్మదర్శనితో శ్రద్ధగ పరీక్షించినయెడల వీని నిర్మాణ మీ దిగువరీతిగ నున్నట్టు తెలియ గలదు. ఈ తిత్తి యొక రబ్బరుకాలిబంతి (Foot-ball) వలె నున్నదని యూహింపుము. దానిలోనికి గాలి జొప్పించుట కుపయో గించెడు తొడిమవంటిగొట్టమును జేర్చి 5 లేక 6 అడుగులు పొడుగు గలిగినట్టియు, క్రమముగ సన్ననగుచు చివరభాగమున నూలుపోగువలె నంతమగునట్టియు మృదువైన రబ్బరు గొట్టమొకటి అతుకబడియున్నదని యూహింపుము. ఈ రబ్బరు గొట్టముయొక్కలోపలితట్టు వెలుపలికి వచ్చునట్లుగా తిరుగదీసి, దానిని కాలిబంతిలోపల చుట్టగా చుట్టిపెట్టితి మనుకొనుము. ఈ బంతియందలి మిగిలిన భాగమంతయును నీటివంటి ద్రవపదార్థముతో క్రిక్కిరియునట్లుగా నింపబడియున్నదని తలంపుము. అట్టిబంతిమీద నొక గ్రుద్దు గుద్దినయెడల దానిలోపల నుండు గొట్టమంతయు తిరుగబడి ఠ పేలున ఎగదన్నుకొని బయటబడును.

ఇదేప్రకారముగా తంతితిత్తియొక్క తంతువు (తీగె) యును తిత్తిలో నిముడ్చబడినదని యూహింపుము. ఆతిత్తిచుట్టును బహిశ్చర్మకణముయొక్క మూలపదార్థ మావరించియున్నది. ఆ మూలపదార్థమునందలి యొక చిన్నభాగ మొక్క చో బాణపు అలుగు (Arrow point) వలె మొనతీరి నీటిలోనికి నిగిడి యుండును (మీ). ఇది తుపాకీ మీటువంటిది. నీటిలో పరుగులిడుచుండు చిన్న చిన్న జంతువులయొక్క తాకు డీమీటునకు గలిగిన తోడనే యాస్పర్శజ్ఞాన మా కణమునందలి మూలపదార్థ మంతటను వ్యాపించి యేదో యొక విచిత్రరీతిని దానిలోపల నిమిడియుండెడు తంతితిత్తి కొత్తుడు గలుగజేయును. ఇట్టి యొత్తు డా తిత్తికి గలిగినతోడనే దానియందలి సన్ననితంతువు తటాలున ఎగదన్నుకొని బయటబడును. ఈతంతువుయొక్క కొనయం దెల్ల ప్పుడు నొక విషపదార్థము స్రవించుచుండును. మిక్కిలి వేగమున అటునిటు పరుగులెత్తు చుండుజంతువు లీ విషముయొక్క స్పర్శమాత్రముననే జడములగును. ఇట్టి తంతితిత్తులు మీసముల కొనలయందు మిక్కిలి దట్టముగ నమరియుండును. కావుననే తనస్థానమును విడచి కదలలేనిదయ్యును హైడ్రా తనకంటె పెద్దవియును, హెచ్చుజాతివియు నగు జీవజంతువులసహితము పట్టి తినును.

నాడీమండలము.

పైని జెప్పిన తంతితిత్తుల వ్యాపారమును మనము గ్రహించితిమేని వీని వ్యాపారముల నడపించు బహిశ్చర్మ కణములకు చలన, స్పర్శనాడుల (Motar & Sensory Nerves) స్వభావములు రెండును గలవని తెలిసికొన గలుగుదుము. నాడి యనగా నరము. నరములు శరీరమునందలి యొక భాగమునుండి మరియొక భాగమునకు సమాచారముల తెలుపు తీగలవంటివి. పైని వివరించిన ప్రకారము నీటిలో నిగిడియుండు బాణపు అలుగువంటిభాగము స్పర్శనాడియొక్క కొనవంటిది (Sensory Nerve ending). దీని నేదైననొక పదార్థము స్పృశించుతోడనే కణమున కాతాకుడుయొక్క జ్ఞానము వ్యాపించును. అంతట నాకణము అంతకుపూర్వమే ముందుకురుకుటకు సిద్ధముగనున్న తంతితిత్తులోని తీగెకు "తయార్" అని ఆజ్ఞ యిచ్చును. అప్పు డా తిత్తులయందు నిలువ జేయబడి యున్నశక్తి (Potential energy) యొక్కసారిగా బయలువెడలి తంతితిత్తులయొక్క తంతువులకు చాక చక్యము గలిగించును. ఒకా నొకప్పు డొక్కకణమునందలి మీటునకు గలిగిన కొద్దిపాటి స్పర్శముచేతనే హైడ్రాయొక్క యనేక కణములయందలి తంతితిత్తుల నుండు తంతువులన్నియు ఒరదూసిన కత్తులవలె నిగిడియుండును. ఇట్లొక్కచో గలిగిన కొద్దిమాత్రపు తాకుడువలన హైడ్రా అమితముగా పనిచేయుచున్నది. ఒకానొకప్పుడు తనకంటె గొప్పజంతువుల యలుకుడుచే భయపడినప్పుడు హైడ్రా మిక్కిలి చిన్న రూపమును వహించి దాగికొనునట్లుగా ముడుచుకొనియుండును. ఈప్రకార మొక్కచో గలిగిన జ్ఞానమును శరీరమునం దంతటును వ్యాపింపజేసెడు నాడీమండలము (Nervous System) ఈ హైడ్రాయం దుండియుండవలెను. మనవలె నీ హైడ్రాకు మెదడు లేదు (Brain). కాని నాడీకణముల (Nerve Cells) వంటి బహుధ్రువకణములు (Multipolar Cells) అక్కడక్కడ దాని శరీరమునందు చిమ్మబడియున్నట్టు కనిపెట్టబడినది. హెచ్చుతరగతి జంతువులలోవలె నాడీమండల మేర్పాటుగ నిర్మింపబడి యుండనప్పటికిని, ఏదోయొకరీతిని నాడీజ్ఞానముయొక్క ప్రథమాంగములు (Rudiments) హైడ్రాయందు గలవని స్పష్టపడుచున్నది.

గ్రంథికణములు (Gland Cells)

బహిశ్చర్మకణములలో పీఠము (పీ) నం దుండువానియందలి మూలపదార్థమునందు పెక్కుఅణువు లుండును. ఈకణముల నుండి యొకానొకవిధమైన జిగురుపదార్థము స్రవించుచుండును. ఈజిగురుపదార్థముయొక్క సహాయముచేతనే హైడ్రా స్థిరముగ పీఠముతట్టు నితరపదార్థముల నంటుకొనియుండును. ఇట్లు స్రవించు స్వభావముగల అవయవములకు గ్రంథు లని పేరు. ఇందలి కణములు గ్రంథికణములు. ఇట్టిగ్రంథులు మననోటియందును, జీర్ణాశయమునందును, పేగులయందును అనేకములుగలవు. అందు నోటియందుండు గ్రంథులనుండి ఉమ్మినీరు ఊరును. జీర్ణాశయము పేగులు వీనియందలి గ్రంథులనుండి జీర్ణ రసము లూరును. మన కడుపునందు పసరు పుట్టించెడు కాలేయము (Liver) అనునది యొకానొకవిధమైన గ్రంథులసమూహమే దీనినుండి యెల్లప్పుడు పసరుపుట్టి చేదుకట్టు (Gall bladder) అను తిత్తియందు జేరుచుండును.

అంతశ్చర్మకణములు.

ఇవి సామాన్యముగా బహిశ్చర్మకణములకంటె పెద్దవి (అం). వీనియందు పెద్ద అవకాశ మొకటి యుండును. ఇది వికారిణియందలి సంకోచనావకాశమువలె ముకుళించునది గాక ఎల్లప్పుడును స్థిరముగనుండును. ఈ కణముల వెలుపలికొనను మాంసాంకురము లనబడు మొనతీరినఅంచులు బహిశ్చర్మకణముల లోపలియంచున నున్న వానివలెనే మధ్య జిగటపొరను జేర్చి యమర్చబడియుండును. కాని వీని మాంసాంకురములు మిక్కిలి చిన్నవి. ఈ కణములయొక్క లోపలిఅంచులు జీర్ణాశయములోనికి చొరబడి వచ్చుచుండును. ఈ కొనలు కొన్ని కణములయందు కొంచెము మొండిగానుండి వికారిణి పాదములవలెను, మరికొన్ని కణములయందు మిక్కిలిపొడుగుగ నుండి సూక్ష్మజీవుల తోకలవంటి మృదురోమములవలెను ఉండును. ఈమృదురోమముల చలనమువలన గలిగెడునుడిచే నెల్లప్పుడు కొంత నీటిప్రవాహము హైడ్రాయొక్క జీర్ణాశయములోనికి వచ్చుచు పోవుచుండును. అట్టి ప్రవాహములో చిన్న చిన్న జంతుసముదాయములు కొట్టుకొనివచ్చుచు, నవి యంతశ్చర్మకణముల పాదములచే మూల పదార్థములో నాహారముగా నిముడ్చుకొనబడును. ఈయాహారము వికారిణియందువలెనే కణములలోపల నిమిడినతరువాత కణముయొక్క మూలపదార్థమునందు జీర్ణ మగును. ఇట్టి జీర్ణ పద్ధతి కణాంతర్గతజీర్ణ (Intra-cellular digestion) మనబడును.

రెండవవిధమైన జీర్ణ పద్ధతి.

అయినను హైడ్రాయొక్క యాహారమంతయు నీరీతిగా జీర్ణము కానేరదు. ఇది పెద్దజంతువులసహితము గాలములవంటి తనమీసములతో పట్టి మ్రింగునని చెప్పియుంటిమి. అవి దిగువ జెప్పబడురీతిని జీర్ణ మగును. క్రీవాయి యను భాగమునందుండు అంతశ్చర్మకణములు గ్రంథికణములవలె నుండును. ఇవి తక్కినచోట్ల నుండువానికంటె చిన్నవిగను, సన్ననియిసుకవంటి యణువులతో నిండినవిగను ఉండి, మన జీర్ణాశయములో స్రవించు జఠరరసమువంటి యేదో యొకరసమును స్రవింపజేయునవిగా నున్నవి. ఈరసముయొక్కశక్తిచే దానియాహారములో చాలవరకు జీర్ణ మగును. ఇట్లు జీర్ణమైనయాహారము అంతశ్చర్మకణముల కవచములగుండ వానిమూలపదార్థములోనికి వ్యాపించును.

హరితకములు.

హైడ్రాలలో నాకుపచ్చ హైడ్రాలనబడెడు ముఖ్యమైనజాతి యొకటి గలదు. దాని శరీర కాంతినిబట్టియే దాని కా పేరు గలిగినది. దాని యంతశ్చర్మకణములలో నక్కడక్కడ హరితకము లుండును. బహిశ్చర్మకణములు స్వచ్ఛమై వర్ణ రహితమైన వగుటచేత హైడ్రాయంతయు ఆకుపచ్చగ గనుబడును. ఈ హరితకములు వృక్షకణములయం దుండునట్టివియేగాని వేరుగావు. కాన నిట్టి హైడ్రాయొక్క యాహారము కొంతవరకు వృక్షాహారమని తెలిసికొననగును. కాన సూర్య కాంతిసహాయముచే హరితకముల మూలమున బొగ్గుపులుసుగాలినుండికూడ హైడ్రా తనయాహారమును సంపాదించుకొనును.

శ్రమవిభాగము.

మొత్తముమీద జూడగా బహిశ్చర్మకణములు ముఖ్యముగా సంరక్షణపుపని చేయునని యనియును, స్పర్శజ్ఞానము, చలన జ్ఞానము మొదలగు నాడీసంబంధమైన వ్యాపారములుగూడ వీనికి గలవనియును తెలియగలదు. అంతశ్చర్మకణములు ఆహారమును జీర్ణముచేయు వ్యాపారము గలవి. అక్కడక్కడ రెండింటియందును హైడ్రాకు కావలసిన జిగురు మొదలగు పదార్థములను స్రవింపజేయు గ్రంథికణములు గలవు. రెంటికిని మాంసాంకురము లుండుటచే కండయొక్క స్వభావము అనగా సంకోచవికాసములు కొంతవరకు గలవు. హైడ్రాను నిలువుగ నిలువబెట్టుటయందు సహాయపడు నడిమిపొరయే మన అస్థిపంజరము (Skeleton) యొక్క ప్రథమరూపమని యూహింపదగియున్నది. హైడ్రాయొక్క ఆహారమునుండి తయారుచేయబడిన శరీరపోషక ద్రవములను నలువైపులను వ్యాపింపజేయుటకు మనశరీరమునందుండు నెత్తురు కాలువల బోలిన కాలువ లెవ్వియు నిందు లేవు. దీనియందలి కణము లొకదాని కొకటి దూరముగ నుండినచో నొకకణము నుండి మరియొకకణమునకు ఆహారద్రవములను వ్యాపింపజేయుటకు పై జెప్పినకాలువ లుండవలసినయవసర మేర్పడును. అట్లుగాక హైడ్రాయందలికణము లొకదానినొకటి జేరియుండుటచే దాని యాహారరస మొకకణమునుండి మరియొకకణములోనికి ఆకణముల పలుచని కవచములగుండ సులభముగ నూరుచుండును. మనవలె నీజంతువునకు శ్వాసకోశములు (Lungs) లేవు. అంతటి చిన్న జంతువునందు దాదాపుగా నన్ని కణములును నీటితో సంబంధము గలవిగా నున్న వగుటచే నవి యానీటియందు లీనమైయుండు ప్రాణవాయువును తీసికొనుటయు, తిరిగి యానీటిలోనికి బొగ్గుపులుసుగాలిని వెడలబుచ్చుటయునగు శ్వాససంబంధమైన వ్యాపారములను సులభముగా జరుపుచుండును. అందుచే నీ హైడ్రాకు శ్వాసకోశములు లేవనులోపము లేదు. కాని అనవసరమైన పదార్థముల విసర్జించునట్టి అవయవములగు ఆసనము మూత్రాశయములు మొదలగునవి హైడ్రాయందు ప్రత్యేకముగా లేక పోవుటమాత్రము కొంచెము చిత్రముగా నున్నది. మిక్కిలి క్రిందితరగతిలోనిదగు వికారిణియందు సహితము సంకోచనావకాశ మిందునిమిత్తమై యేర్పడియున్నది. బహుశ: జీర్ణ రసమును తయారుచేయు అంతశ్చర్మమునందలి గ్రంథికణములే శరీరమునందలి వ్యర్థపదార్థముల విసర్జనముగూడ జేయునని యూహింప దగియున్నది.

1. స్త్రీపురుష సంయోగరహిత సంతానవృద్ధి.

1. స్ఫోటనము (Budding) :- పూర్తిగా నాహారముగలయప్పు డీహైడ్రా స్ఫోటనవిధానముచే సంతానవృద్ధి నొందును. ఇట్టి సంతానవృద్ధి చెట్లకు కొమ్మలు పుట్టునట్టిదియే. కాని యాకొమ్మ లెల్లప్పుడు తల్లిచెట్టుననే యంటియుండి జీవించుచుండును. హైడ్రాయొక్క శాఖలు పూర్ణముగా తయారయినపిమ్మట తల్లినుండి వీడిపోయి ప్రత్యేక హైడ్రా లగును. ఏదోయొక చోట అంతశ్చర్మ బహిశ్చర్మకణములు రెండును తక్కినచోట్లకంటె వేగముగ పెరిగి యొక మొటిమగా వెలుపలికి ఉబికియుండును. ఈ మొటిమలోనికి జీర్ణాశయముయొక్క పాయ పిల్లగొట్టముగా వ్యాపించును (27-వ పటములో C-లో పి. చూడుము). ఈమొటిమ క్రమముగా పెద్దది కాగా దాని చివరమీసము లొకటొకటిగా పుట్టును. తోడనే యామొటిమయొక్క చివరభాగమున మీసములమధ్య నొకబీట గలిగి యది యాపిల్ల హైడ్రాకు నోరుగా నేర్పడును. పిమ్మట కొంతకాలమునకు పిల్లహైడ్రాయొక్క మొదటిభాగమున, తల్లికిని పిల్లకును మధ్యనున్న అతుకులో ఉరిబోసినట్లుగా నొక్కుకొనిపోయి జీర్ణాశయము రెండుగావీడిపోవును. తుద కీ పిల్ల హైడ్రాతల్లినుండి వీడిపోయి తనబ్రతుకు తెరువు తాను చూచికొనును. ఒక హైడ్రాయం దిట్టిమొటిమ లనేకము లొక్కసారిగా పెరుగవచ్చును. ఈ ప్రకారము ఒక్కొకహైడ్రా కొద్దిమాసములలో 50 హైడ్రాలుగా వృద్ధిబొందును. 2. ఖండనము :- ఒక హైడ్రాను అనేక ముక్కలుగ నరికినయెడల అందు ప్రతిముక్కయు, తగినయాహార ముండునెడల పూర్ణమైన హైడ్రాగా తయారగును. ఇట్లు నరికివేయబడినభాగములు తిరిగి పెరుగునప్పుడు, పిల్లహైడ్రాలయందలి బహిశ్చర్మకణములు పూర్వపు బహిశ్చర్మకణములనుండియే పుట్టును. అంతశ్చర్మ కణములు తల్లిహైడ్రాయొక్క అంతశ్చర్మకణములనుండియే పుట్టును. కాని యొకవిధమైన కణములనుండి వేరొకవిధమైన కణములు పుట్టనేరవు. పూర్వకాలపు శోధకులలో నొకరు హైడ్రాయొక్క లోపలితట్టు వెలుపలికివచ్చునట్లుగా తిరుగదీసి, యది మునుపటివలె జీవింపగలదని తలచిరి కాని యట్లు కానేరదు. దీనికి కారణము అంతశ్చర్మ బహిశ్చర్మ కణముల వ్యాపార భేదముల నాలోచించిన తెలియగలదు.

స్ఫోటనవిధానమున సంతానవృద్ధి అనంతముగ జరుగ నేరదు. జరిగినను బలహీనకరము. అప్పటప్పట స్త్రీపురుషులజీవస్థాన పదార్థముల మిశ్రణ ముపయోగకరము. ఇట్టి మిశ్రణము స్త్రీపురుషసంయోగ సంబంధమైన సంతానవృద్ధివిధానముచే గలుగును.

II. సంయోగజనిత సంతానవృద్ధి.

సూక్ష్మస్థూలబీజాశయములు రెండు నొక్క హైడ్రాయందే యుండును. కావున హైడ్రా ఉభయాంగి, అనగా హైడ్రా యర్ధనారీశ్వరునివలె కొంతవరకు ఆడుదియు, కొంతవరకు మగదియుగా నున్నది. బీజాశయములు బహిశ్చర్మమునందలి మధ్యకణములనుండి పుట్టును. అందు సూక్ష్మబీజాశయములు క్రీవాయి సమీప మునను, స్థూలబీజాశయములు పీఠ సమీపమునను పుట్టును. ఈ ప్రదేశముల రెంటియందును, ఒకానొకచోట మధ్యకణములు మిగుల చురుకుగా పెరిగి బహిశ్చర్మమును కొంచెము వెలుపలి కొకదిమ్మగా నుబికించును (27-వ పటములో C-లో సూ. బీ, స్థూ. బీ. చూడుము). కాని యీ దిమ్మలు స్ఫోటనవిధానములో జెప్పబడిన మొటిమలవంటివి కావు. ఏలయన, స్ఫోటనమునందలి మొటిమయందు అంతశ్చర్మ బహిశ్చర్మ కణములు రెండునుగూడ జేరియుండును. ఈ దిమ్మయందు అంతశ్చర్మ కణము లెంతమాత్రము జేరియుండవు. ఈదిమ్మ స్థూలబీజాశయముగా పరిణమించ నేర్పడినయెడల నక్కడి మధ్యకణములలో నేదో యొకటి వికారిణీత్వమునొంది (Becomes amoeboid), సమీపముననున్న మధ్యకణముల నన్నిటిని తన పాదములచే ముట్టడివేసి తినుచు పెరుగును. ఇది యిట్లు తిని కొంతయాహారపదార్థమును నిలువజేసికొనును. ఆకుపచ్చ హైడ్రా యైనయెడల హరితకములును దీనియం దేర్పడును. తుద కీ కణమే స్థూలబీజమై పెరుగుట మాని గుండ్రనైన దగును.

స్థూలబీజమునందు గలుగుమార్పులు.

పిమ్మట నీస్థూలబీజమునందలి జీవస్థానము రెండు సమభాగములుగా చీలి యం దొకముక్క స్థూలబీజమునుండి వెలువరింపబడును. రెండవది కణములోనేయుండి తిరిగి రెండుసమభాగములుగాచీలి యీచీలికలలో నొకటికూడ కణమునుండి వెలువరింపబడును. ఇందు మొదట వెలువరింపబడిన ముక్కకు ప్రథమ ధ్రువ రేణువు (First Polar Body) అనియు, రెండవసారి వెలువరింపబడిన ముక్కకు ద్వితీయ ధ్రువ రేణువనియు పేరు (28-వ పటములో A.B.లలో ధ్ర. 1,2. చూడుము). స్థూలబీజము యొక్క జీవస్థానపు సమీపమున ఆకర్షణబింబము (Attraction Sphere) అను పేరుగలచుక్క యొకటి గలదు. (28-వ పటములో A-లో ఆ.బి). ఇది ప్రతికణమునందును జీవస్థానముప్రక్క నెల్లప్పుడు నుండుననియు, అది జీవస్థానము విభాగమగునప్పుడు స్పష్టముగా కనుబడుననియు కనిపెట్టబడినది. ఈఆకర్షణబింబమే కణముయొక్క విభాగక్రియను నడపునది యని నిశ్చయించియున్నారు.

Jeevasastra Samgrahamu.pdf

అథూలబీజము సూక్ష్మబీజముతో గలసి సంయుక్తబీజ మేర్పడువరకు గలిగెడు, వివిధావస్థలు

A - స్థూలబీజముయొక్క జీవస్థానడు కణకవచముయొద్దకు బోయి ప్రథమ ధ్రువరేణువును (ధ్ర) 1. విసర్జించుచున్నది. ఆ. బి-ఆకర్షణబింబము. B. ధ్ర. 1, 2-ప్రథమ, ద్వితీయ ధ్రువరేణువులు. ఇవి రెండును విసర్జింప బడినతరువాత కణకవచమునందు సూక్ష్మరంధ్రమను (సూ) నొక పగులు పుట్టినది. తమపొడుగైన తోకలవంటి మృదురోమముల సహాయము చే చుట్టుప్రక్కల నీదులాడుచుండు, సూక్ష్మబీజము లాపగులుగుండ కణములోనికి ప్రవేశింప బోవుచున్నవి.

C. స్థూలబీజముయొక్క మూలపదార్థములో దాని జీవస్థానమును (స్థూ. జీ.) సూక్ష్మబీజముయొక్క జీవస్థానమును (సూ. జీ.) రెండునుగలవు. వీని రెంటియొక్క ఆకర్షణబింబములుగూడ చూపబడినవి.

D. స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు మిశ్రమ మగుచున్నవి.

E. ఫలించిన సంయుక్తబీజము.

సూక్ష్మరంధ్రము.

పైని జెప్పబడిన రెండు ధ్రువరేణువులును ఖండింపబడగా కణములో మిగిలిన జీవస్థానము మొదటనున్న జీవస్థానములో నాలుగవవంతుమాత్ర ముండును. ఈ ధ్రువ రేణువులు తల్లి హైడ్రాయొక్క సంతతియందలి పురుషసంబంధమైన పదార్థమనియు, నాపదార్థము స్త్రీ బీజము పురుషబీజముతో సంయోగమగుటకు పూర్వము వెలువరింపబడుననియు, పక్వమైన స్థూలబీజమునందు మిగిలిన జీవస్థానపదార్థమంతయు హైడ్రాయొక్క స్త్రీసంబంధమైన పదార్థమే యనియు కొందరు నిర్ధారణ చేసియున్నారు. ఈ తరుణమున స్థూలబీజము పైని కప్పియుండు ఆవరణపుపొరలో చిన్న రంధ్రము పుట్టి యారంధ్రముగుండ వెలుపలనుండు నీటికిని, స్థూలబీజమునందలి మూలపదార్థమునకును మార్గ మేర్పడును. ఈ రంధ్రమునకు సూక్ష్మరంధ్ర మని పేరు (28-వ పటములో B-లో సూ).

స్త్రీపురుషబీజములజీవస్థానము లైక్యమగుట.

ఇంతలో సూక్ష్మబీజాశయములోని మధ్యకణము లనేక కణములుగ చీలి యందు ప్రతి చిన్న కణము నొక సూక్ష్మబీజమగును. అంతట నా సూక్ష్మబీజాశయము పగిలి సూక్ష్మబీజములు నీటిలోనికి చెదరి తమ పొడుగైన తోకల సహాయముచే నీదులాడుచు స్థూలబీజమునిమిత్తమై వెదకుచు బోవుచుండును. అం దొకటి చిట్టచివరకు స్థూలబీజమును జేరి సూక్ష్మరంధ్రముగుండ దాని మూలపదార్థములో ప్రవేశించును (28-వ పటములో B-లో సూ). సూక్ష్మబీజముయొక్క జీవస్థానము మెల్ల మెల్లగ స్థూలబీజముయొక్క జీవస్థానమును జేరును. C-లో స్థూ. జీ, సూ. జీ, లు వరుసగ స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు. ఇప్పు డీ స్థూలబీజములో ఆకర్షణబింబములు రెండు గలవు (C-చూడుము). అం దొకటి స్త్రీబీజసంబంధమైనది. రెండవది పురుషబీజసంబంధమైనది క్రమముగా నీ స్థూలసూక్ష్మబీజముల జీవస్థానములు మిశ్రమై యేక జీవస్థాన మగును (28-వ పటములో D. E. చూడుము). స్థూలబీజముయొక్క జీవస్థానము సూక్ష్మబీజముయొక్క జీవస్థానముతో నైక్యమగుటయే ఫలించుట (Fertilisation).

సంయుక్తబీజము. ఏకకణపిండము.

ఇట్లు స్త్రీపురుషబీజముల సంయోగముచే నేర్పడినసంయుక్తబీజము తనచుట్టును దళమైన గూడువంటి పొర నొక దానిని
Jeevasastra Samgrahamu.pdf

-సంయుక్తబీజము రెండుకణములుగా చీలినది. 2-ఇందు అది నాలుగు కణములు అయినది. 3-ఈ నాలుగుకణము లెనిమిదిక ణములై ఆ యెనిమిది పదునారుకణము లైనవి. 4-వీనినుండి యనేకకణము లేర్పడి యవియన్నియు సర్వవిషయముల నొకదాని నొకటి బోలియున్నవి. ఇట్టిస్థితికి మల్బెరీదశ యని పేరు. 5 - కణములన్నియు మధ్యనుండి వెలుపలికి గెంటబడి చుట్టును కడియమువలె జేరియున్నవి. మధ్యభాగము శూన్యముగా నున్నది. ఈదశయందు కణములో కొంత వ్యత్యాసము కన్పట్టుటకు ప్రారంభమైనది. ఎట్లన, పైభాగమున నుండు కణములు చురుకుగ పెరిగి పొడవగుచున్నవి. క్రిందిభాగమునందలి కణములు మందముగ పెరుగుచు పొట్టివిగ నున్నవి.

6 - ఇందు పైభాగమున నొకచోట కొంచెము గుంటపడి యక్కడికణములు క్రిందికి దించుకొనిపోయి యున్నవి.

7 - ఈగుంట క్రమముగా పెద్దదయి యొక గొట్టముగ నేర్పడుచున్నది. ఈగొట్టముయొక్క సరిహద్దుగోడ రెండువరుసలకణములచే నేర్పడియున్నది. 6-వ పటములో పైభాగమున నుండు పెద్దకణములు ఈగొట్టమునకు లోపలితట్టునను క్రిందిభాగమున నుండు చిన్న కణములు వెలుపలి తట్టునను అమరియున్నవి. ఈ లోపలివరుసలోని పెద్దకణములే హైడ్రాయొక్క అంతశ్చర్మకణము లగును. వెలుపలివరుసలోనిచిన్న కణములు బహిశ్చర్మకణము లగును.

8 - ఈ దశయందు హైడ్రా మృదురోమములు గలిగి యీదుచుండును. తరువాత కొంతకాలమున కిది యేదో యొక పదార్థమున కంటుకొని మృదురోమముల విసర్జించి నిలువున పెరిగి సంపూర్ణమైన హైడ్రా యగును.

ఏర్పరచుకొనును. ఈప్రకారము సంరక్షింపబడిన పిండము (Embryo) నీటిలో బడి మునిగి నేల నంటి కొంతకాలము విశ్రమించును. పిమ్మట కొంత కాలమునకు దీనినుండి హైడ్రా యెట్లు పుట్టునో క్రింద వ్రాయబడును.

సంయుక్తబీజము ప్రథమమున ఏకకణము. దీని కేకకణ పిండ మని పేరు. ద్విఖండనవిధానముచే నా పిండము రెండుగా చీలును (29-వ పటములో 1. చూడుము). ఈ రెండుకణములలో ఒక్కొక్కటియు తిరిగి రెండేసికణము లగును. ఇట్లే క్రమముగా 4, 8, 16, 32, 64, మున్నగు ననేక కణములుగ చీలి యాపిండము, చిన్న చిన్న కణములుగల గుండ్రనిరాశి యగును. ఈ రాశియందుండు సమస్తకణములును ఒక దానినొకటి తేనెతెట్టెలోని కండ్లవలె సర్వవిషయముల బోలియుండును.

మల్బెరీదశ.

ఇంతవర కీకణములందు రూపవ్యాపారాదిభేదము లీషన్మాత్రమైన నుండవు. ఇట్టి యనేక కణపిండదశ సమస్తమైన జీవులకును గలదు. ఇట్టి దశకు మల్బెరీదశ యని పేరు. మల్బెరీ () యనగా పట్టుపురుగులుండు చెట్టు. ఈ కణములరాని పట్టుపురుగు యొక్క గ్రుడ్లరాశిని బోలియుండుటచేత కాబోలు నీయనేక కణపిండదశకు మల్బెరీదశ యనిపేరు కలిగినది (30-వ పటములో గ్రుడ్లను, 29-వ పటములో 4-వ దశను పోల్చి చూడుము).

Jeevasastra Samgrahamu.pdf

వృక్షములకును జంతువులకును ఆదిజీవి యొక్కటియే.

వృక్షజాతిలోని నాచుమొక్కయొక్క పిండమునకును జంతుజాతిలోని హైడ్రాయొక్క పిండమునకును మల్బెరీదశకు వచ్చువరకు నేవిధమైన భేదమును లేదు. రెండును ఏకకణపిండమునుండి పరిణమించినవియే. ఈ విషయమును జక్కగ పరిశీలించినయెడల నాచు మొక్కకును హైడ్రాకును ఆదిజీవి యొక్కటియే అని తెలియగలదు. అనగా నీ రెండును ఒక్క సంతతిలోనివే. ఆ యాదిజీవియొక్క బిడ్డలు అన్నియు నొకదాని నొకటి బోలియుండి యనేక విషయములయందు తమతల్లిని బోలియుండును. ఈ బిడ్డలన్నియు మొట్టమొదట నేకకణపిండములుగా నుండి యేక మార్గముననే నడచుచు కణవృద్ధి కణవిభాగము మొదలగు మార్పుల జెందుచు కొంతవరకు అనగా పైని జెప్పిన మల్బెరీదశను జెందువరకు ఆ మార్గమును విడువక పోవుచు, పిమ్మట రెండుజాతులును విడివడి వేర్వేరుమార్గములబోయి తమతమ యిచ్చవచ్చినట్లుగా వృద్ధిబొందుచు ఒకజాతివి వృక్షములుగను, రెండవజాతివి జంతువులుగను పరిణమించెనని యూహింపనగు.

పోలికలు; వ్యత్యాసములు.

ఈ సంగతి మన మనుదినము లోకములో జూచు దేష్టాంతమువలన స్పష్టమగును. మనవారలు చంటిబిడ్డలను జూడగానే పోలిక లెంచుచుందురు. సామాన్యముగా ఆ బిడ్డలు కొలదిగనో గొప్పగనో తల్లిదండ్రులను బోలియుందురు. అందు కొందరు ప్రత్యేకముగ తల్లిని, కొందరు ప్రత్యేకముగ తండ్రిని బోలియుందురు. సామాన్యముగా నట్టిపోలికలు దగ్గిరబంధువులలోనే యుండును. బంధుత్వము దూరమైనకొలదిని పోలికలును తగ్గుచుండును. మేనమామ దగ్గిరబంధువుడే గాన నాతనిపోలిక మేనల్లురకు గలుగుటయు గలదు. ఇట్లు పోలికలు గలుగుస్వభావమునకు వంశపారంపర్యము (Heredity) అని పేరు. కాని యీప్రకారము ఒక్కపోలిక గలఇద్దరికిని సర్వవిషయములయందును ఆపోలికలు సంపూర్ణముగ నుండినపక్షమున మనము వారలనిద్దరిని ఆనవాలేపట్ట లేము. అట్లు కించిత్తయినను భేదము లేకుండనుండుట యసాధ్యము. ఏవో కొన్ని భేదము లుండుచునే వచ్చు చుండును. మనలో నందరమును అనేకవేలమానవుల ముఖములను చూచియున్నాము. అందు ప్రతిరెండుముఖములకు ఎంతకొంచెమైనను భేదమున్నదిగాని లేకపోలేదు. అయినను అందులోకొందరియందు కొన్నిపోలికలు కానవచ్చును. ఎట్లన, పైనిజెప్పినప్రకారము అన్నదమ్ములు దగ్గిరబంధువులు గనుక వారిద్దరకు నొక్కపోలిక నుండవచ్చును. కాని మనము అన్నదమ్ములబిడ్డలను పోల్చిచూచిన వారిలో కొంచెముపోలిక యుండినను ఉండవచ్చును గాని అన్నదమ్ముల కున్నంతపోలిక యుండదు. వారిలో నొకరినుండి మరియొకరిని భేదపరిచెడు చిహ్నములకు నై సర్గికవ్యత్యాసము (Natural Variation) అని పేరు. అనగా సృష్టిచే నేర్పరుపబడిన పరస్పరభేదములు. ఇట్లే మనము తాతాసహోదరులలో ననగా, తమ తాతలు సహోదరులుగా గలవారిని పరీక్షించినయెడల అంతమాత్రమును పోలిక యుండదు. ఈ వంశవృక్షమనుచెట్టునందు ఆదిపురుషుడనదగిన మొదలునుండి దూరపు కొమ్మలకు వెళ్లినకొలది 'ఆవ్రేలి కావ్రేలు ఎడము' అన్నట్లు పోలికలు దూరమగుచుండును. ఒక సంతతిలోనివారికి బాంధవ్యము దూరమైనకొలదిని నై సర్గిక వ్యత్యాసములు హెచ్చగుచుండును. ఈ న్యాయమును మననాచుమొక్కకును, హైడ్రాకును గల సంబంధ బాంధవ్యములను గనుగొనుటలో ప్రయోగించిచూతము.

హైడ్రానాచుమొక్కలకు గలపోలికలు.

హైడ్రాయును, నాచుమొక్కయు నొక్కసంతతిలోనివే యైనయెడల వాని యాదిపురుషము ఏకకణపిండము. ఆ యాదిపురుషముయొక్క సంతతి రెండుకణములు గలపిండములు. వీనియందు వ్యత్యాసము లున్నట్టు కన్పట్టదు. అనగా నివిరెండు నన్నదమ్ములవలెనొక్కపోలిక నుండును. రెండుకణములు గల యీపిండముల సంతతి నాలుగుకణములు గల పిండములు. ఈస్థితియందుగూడ నాచునకును హైడ్రాకును వ్యత్యాసము లేదు. ఇట్లే కొన్నితరములవరకును అనగా మల్బెరీదశయందలి పిండములదనుక వచ్చువరకును పోలికలు ఎంతమాత్రము చెడలేదు. పిమ్మట హైడ్రాయొక్క మల్బెరీప్ండమును, నాచుమొక్కయొక్క మల్బెరీపిండమును వేరుదారులు త్రొక్కినవి. ఇంతవరకు రెండును ఏకముగా నొకటేదారిని వచ్చుచుండినవి. ఈదశదాటినపిమ్మట నిట్లు వేరుదారులు త్రొక్కగానే వాని బిడ్డలపోలికలలో నై సర్గిక వ్యత్యాసములు హెచ్చినవి. ఒకటి అనగా నాచు వృక్షజాతిదిగను, రెండవది హైడ్రా జంతుజాతిదిగను పరిణమించినవి. నాచుమొక్కయొక్క మల్బెరీదశయందుండుకణములలో నేదో యొకకణము కణఖండన వ్యాపార మును ప్రత్యేకముగా జేకొని వృద్ధిబొందుచుండును. ఈకణమే యంత్యకణము (Apical Cell), తక్కిన కణములన్నియు అంతటితో వృద్ధిహీనము లగును. ఈ యంత్యకణమునుండియే నాచు మొక్కయంతయు నిర్మాణ మగుచున్నది.

మల్బెరీదశనుండి హైడ్రా ఎట్లుపరిణమించును?

మల్బెరీయవస్థను దాటగానే నాచుమొక్కనుండి వీడిపోయిన హైడ్రాయొక్క పిండమున కీ దిగువరీతిని పెంపుగలుగును.

ఇంతవరకు నేకరూపముగ నుండిన కణములు ఒండొరుల యొత్తుడుచేత కొన్నిమార్పులను జెందును. ఆ కణముల వలయాకారమైన గోడలు పలకలు దేరును. అందుచే నాకణములు బహుభుజ (Polygonal) కణము లగును. పిమ్మట కొద్దికాలములోనే యీ రాశియందలి కణములు మధ్యనుండి వెలుపలికి గెంటబడి నూతియిటుకలవలె నొకదానిప్రక్క నొకటిజేరి తమ లోపలి తట్టున కొంత అవకాశము నావరించును (29-వ పటములో 5. చూడుము). ఈ కణములు క్రమముగా పెరుగుచుండును. అందొకభాగమునందలి కణములు తక్కిన భాగమునందలి కణములకంటె చురుకుగ పెరుగుటచే నాభాగము రెండవభాగముకంటె పొడుగైన కణములుగలది యగును (29-వ పటములో 5, 6 లలో పైవైపున చూడుము). ఈపొడుగుకణములు గలచోట నొకగుంటపడి ఆగుంట క్రమముగా పెద్దదై లోపలికి దించుకొనిపోవుచు వెలుపలనుండు పొట్టికణముల డిప్పలో మరియొకపొరగా నేర్పడును (29-వ పటములో 6, 7. చూడుము). ఇందు లోపలి పొరయే హైడ్రాయొక్క అంతశ్చర్మముగా నగును. వెలుపలిపొర బహిశ్చర్మ మగును.

పిమ్మట ఈ బహిశ్చర్మకణములకు మృదురోమములు గలిగి వీని సహాయముచే నీ పిండము మెల్ల మెల్లగ నీదులాడుచుండును. ఇప్పటికి పిండమును కొంచెము పొడుగుగా నెదుగును. పిండముయొక్క మధ్యభాగము పొడుగున నంతటను గొట్టమువంటి బిలముగా నేర్పడును. ఇదియే హైడ్రాలోని జీర్ణాశయముయొక్క ప్రథమరూపము. పిమ్మట నీ పిండము మృదురోమముల విసర్జించి నీటిలో మునిగియున్నట్టి యేదోయొకపదార్థము నంటుకొని నిలువుగ నెదుగును. తదనంతరము కొనసమీపమున చిన్న చిన్న మొటిమలు పుట్టును. ఇవి మీసముల ప్రథమరూపములు. ఈ మొటిమలకు పై తట్టుననుండుభాగము కొంచెమెదిగి క్రీవాయి యగును. ఈక్రీవాయియొక్క చివరభాగముననుండెడి రంధ్రము జీర్ణాశయమునకు వెలుపలి నీటికిని మార్గముగా నేర్పడును. ఇదియే దీని నోరు. ఇంతటినుండి హైడ్రా తన మీసముల సహాయముచే జంతువుల పట్టి తిని బ్రతుకును.

ఏకకణదశనుండి మల్బెరీదశవరకు నాచుమొక్కయొక్క పూర్వికులును, హైడ్రాయొక్క పూర్వికులును, నొక్కపోలికనే యుండెడివారనియు, అందుచే వారు బహుశ: ఒక్క సంతతిలోని వారే యనియు వ్రాసియుంటిమి. తదనంతరము మల్బెరీదశను దాటినపిమ్మట కొన్నిపిండములు చెట్లుగాను, మరికొన్నిపిండములు జంతువులుగాను పరిణమించి నాచుమొక్కలును హైడ్రాలును ఎట్లు ఏర్పడెనో చూచియున్నాము. ఇట్లే ప్రాణులయందలి పోలికలనుబట్టి జీవశాస్త్రజ్ఞులు సృష్టియందలి సమస్తప్రాణులను తరగతులుగ విభజించి వానికి గల సంబంధబాంధవ్యముల గ్రహించుటకు తగినయేర్పాటులు చేసియున్నారు. అందు జంతువులలోని ముఖ్యభాగముల నిం దుదాహరించియున్నాము. ఇందు మూలవిభాగములు అయిదు:

జంతువర్గమునందలి మూలవిభాగములు.

1. వంశాస్థిమంతములు (Vertebrata), వెన్నెముక గలవి. మనుష్యులు, మృగములు, పక్షులు, పాములు, చేపలు మొదలగునవి.

2. సంధిమంతములు (Articulata), శరీరమునందు కణుపులు గల జంతువులు, తేళ్లు, పీతలు, సాలెపురుగులు మొదలగునవి.

3. మృదుశరీరవంతములు (Mollusca), మెత్తనిశరీరములు గలవి. నత్తలు, జలగలు, ఎర్రలు మొదలగునవి.

4. జీర్ణాశయబిలవంతములు (Coelenterata), శరీరములోపల పొడుగునను జీర్ణాశయమను బిలము గలవి.

5. స్వతంత్రకణవంతములు (Protozoa), ఏకకణప్రాణులును, ఒకదానితో మరియొకటి సంబంధము లేకుండ జీవింప శక్తిగల కొద్ది కణముల సమూహములును, ఈ తరగతిలోజేరును.

హైడ్రా.

5-వ తరగతిలోని జంతువులనిర్మాణమునందలి ముఖ్యాంశముల తెలుసుకొనునిమిత్తమై వికారిణిని, ఆవర్తకారినిగురించియు, 4-వ తరగతిలోని జంతువులకు ఉదాహరణమగు హైడ్రానుగూర్చియుమాత్ర మీ గ్రంథమునందు వ్రాయగలిగితిమి. మొదటి మూడుతరగతులగూర్చి తెలిసికొనదగిన అంశములు ప్రత్యేకముగ నొక గ్రంథమును నింపుటకు చాలినన్ని యున్నందున, వానినిగూర్చి మరియొకప్పుడు వ్రాయదలంచి ప్రస్తుతము హెచ్చుజాతి వృక్షములగూర్చి వ్రాయబోవుచున్నాము.

Jeevasastra Samgrahamu.pdf
Jeevasastra Samgrahamu.pdf