జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హెచ్చు తరగతి వృక్షములు.

మొదటి ప్రకరణము.

వృక్షకణము.

Jeevasastra Samgrahamu.pdf

వృక్షజాతిజీవులలో కొన్నిటినిగూర్చి యింతవరకు మనము చదివియున్నాము. అందుకొన్ని మనకంటి కగపడక సూక్ష్మదర్శనిచేమాత్రమే చూడదగినవిగా నున్నవి. వీనిలో మొదటివానియందు ఒక్క టేకణముగలదు (31-వ పటములో మాదిరి వృక్షకణము (Typical Vegetable Cell) చూడుము). అది మంచినీళ్లలో నుండు ఆకుపచ్చని నలకలలో నొకటి. అట్టివాని నిర్మాణము బహు సులభమైనది. మన మనుదినము చూచుచుండెడు వృక్షములలో ప్రతివృక్షమును. ఇట్టికణము లనేకములయొక్క కూర్పుచే నేర్పడి యున్నదని ముందు తెలిసికొనగలరు. ఇట్టికణములన్నియు పెద్ద పెద్ద చెట్లయందు ఇదేరూపమున నుండవు. ఈ కణములలో కొన్ని క్రింద మీరు చదువబోవురీతిని మార్పులు జెందును. కాని ప్రథమమున ప్రతివృక్షకణమును ఈ నిర్మాణమును కొంత కాలమువరకైనను గలిగియుండును. ఈపటములో జూపబడిన కణములకు, పెద్దపెద్ద చెట్లయందలి కణముల కెట్లో అట్లే సెల్లులూసుతో జేయబడిన స్పష్టమైన కణకవచము గలదు.

మూలపదార్థము.

జంతుకణములయొక్కయు వృక్షకణములయొక్కయు నిర్మాణములందలి, భెదములలో వృక్షముల చుట్టును సెల్లులూసుతో చేయబడిన స్పష్టమైన కవచముండుట యొక ముఖ్యమైన భేదము. కణకవచముయొక్క లోపలితట్టున జంతుకణములందువలెనే మూలపదార్థ మనబడు నొకానొక స్వచ్ఛమును వర్ణ రహితమునైన పదార్థము గలదు. ఇదియును వికారిణియందలి మూలపదార్థమును ఒకటియే. ఇది చూచుటకు లేత తాటిముంజె ముక్కవలె నుండునని చెప్పియున్నాము. ఇది ఉడికిన సగ్గుబియ్యమువలె మిలమిలలాడుచు జిగటజిగటగా నుండునని చెప్పవచ్చును. నీటికాయ (Jelly fish) వలె నుండునని ఇంగ్లీషుపుస్తకములలో వర్ణింపబడినది. వికారిణియొక్క మూలపదార్థముచుట్టును ఆవరణపు పొర అనగా కణకవచము లేదు. 1-వ పటమునందు వికారిణియొక్క మూలపదార్థపు సరిహద్దులు చూపుటకు కణముచుట్టు నొక నల్లనిగీటు గీయబడియున్నది. ఆ గీటు కణకవచము కాదు. సూక్ష్మదర్శనిలో జూచునప్పుడు వికారిణియొక్క చుట్టుఅంచు వర్ణ రహితముగ నుండును.

హరితకములు.

వృక్షజాతికణములందు ఆకుపచ్చనిరంగు గల హరితకములను భాగము లుండును. ఇవి జంతుజాతికణములలో (Chromatophores) నుండవు. వృక్షజాతికణముల మూలపదార్థమునందును, జంతుజాతికణముల మూలపదార్థమునందునుగూడ జీవస్థానమను కొంచెము చిక్కగనుండు మూలపదార్థపు భాగము గలదు. లేతవగు కణములందు అవకాశము లుండక కణ మెల్లయెడలను మూలపదార్థముతో నిండియుండును. ఇట్టి ఏకకణ వృక్షములు కొంచెముపస రెక్కిన నీటియం దనేకము లుండును.

జీవస్థానము.

ప్రతికణముయొక్కయు మూలపదార్థమధ్యమున కొంచెము దట్టమైనభాగముకలదు. కొన్నికొన్ని రంగులలో కొంచెముసేపు ఊరనిచ్చి పరీక్షించినయెడల నీభాగముమిక్కిలిస్ఫుటముగ తెలియుచుండును. ఈభాగముకణముయొక్క ప్రాణసంబంధమైన వ్యాపారములకు ముఖ్యధారమైనభాగము; కాననే యీభాగమునకు జీవస్థానమనిపేరుగలిగినదని మొదటి భాగమునందు వ్రాసియున్నాము. దీనిచుట్టునొకపొర కవచముగా నుండును (32-వ పటములో జీ. క.
Jeevasastra Samgrahamu.pdf

చూడుము). జీవస్థానములోపల వల యల్లికవంటి యల్లికయు, ఆ వలయొక్క కండ్లలో నిమిడి కొంచెము పలుచని పదార్థమును గలదు. ఈ వల యల్లికయందలి త్రాళ్లవంటిభాగములు మిక్కిలి చక్కగ రంగులు పట్టునవగుట చేత వానికి వర్షేణి (Chromatin) అనియు, రంగులు పట్టని వలకండ్లయందలి కొంచెము పలుచని పదార్థమునకు అవర్షేణి (Achromatin) అనియు పేరు. జీవస్థానపు మధ్యభాగమున అంతర్జీవస్థానము (Nucleolus) అనబడెడు యిసుక నలుసులవంటి పదార్థముగలభాగము గలదు.

ఆకర్షణబింబము.

జీవస్థానమునకు వెలుపలివైపున ఆకర్షణబింబమను మూలపదార్థపుకూడిక గలదు. ఇది కణముయొక్క విభాగవ్యాపారమును నడపుశక్తిగలభాగమని కనిపట్టియున్నారు. ఈ యాకర్షణబింబములు జంతుకణములందు సర్వసామాన్యముగా కానవచ్చుచున్నవి. కాని హెచ్చుజాతివృక్షములయందలి విభాగమగుచుండు కణములలోగూడ నీయకర్షణబింబములు కనిపట్టబడినవి.

సంగ్రహము.

ఏకకణవృక్షములనుండి హెచ్చుతరగతివృక్షము లెట్లుపరిణమించునో సంగ్రహముగ నాలోచించెదము. 31-వ పటములో జూపబడినవానివంటి యేకకణప్రాణులేవో కొన్ని తప్ప తక్కిన వృక్షజాతిప్రాణులన్నియు అనేకకణములచే నేర్పడినవియే. అట్టిప్రాణులలో కణములు పంక్తులుగా నమరి దారములవలె నుండు పసిరికపోగు బూజుపోగులగూర్చి చదివియుంటిమి. ఇట్టి యనేకదారములచే నేయబడిన పలుచనివస్త్రమువలె నుండు ఏక పత్రము (Monostroma) అనుకణముల చదరపుపరుపునుగూడ జూచియుంటిమి. ఇందలికణములు ఇటికలచప్టాయందలి ఇటికలవలె పేర్చబడియుండునని చెప్పవచ్చును. వారిపర్ణి యిట్టికణములచే నిర్మింపబడిన పలవలుగల స్తంభమువలె నున్నదని యూహింపదగియున్నది. కాబట్టి వానినిర్మాణమునుబట్టి పరీక్షింపగా నిదివరకు జదివినప్రాణులు వరుసగా ఏకకణములు, కణములపంక్తులు, కణములచదరపు పేర్పులు, కణములగుట్టలు అను నాలుగుతరగతులుగా నేర్పడుచున్నవి.

ఈవరకు జెప్పబడిన వృక్షములన్నియు నీటిచే భరింపబడిదానియందు మునిగి తేలుచుండుటచే తమంతట తాము నిలుచుటశక్తిలేనివై యున్నవి. పసిరికపోగులయం దుండుకణము లన్నిటికి వ్యాపారభేదములు లేమిచే కణములన్నియు సర్వవిషయముల నొకదాని నొకటి బోలియుండును. వారిపర్ణి తనకు కావలసినయాహారమును నీటినుండి కొంతవరకును, దాని యడుగుననుండు బురదనుండి కొంతవరకును, స్వీకరించునది కనుక, దానియందు ఆయావ్యాపారములను జేయునిమిత్తమై కొన్నికొన్ని కణములు నియతముగ నేర్పడియున్నవి. ఈకణములలో వానివాని వ్యాపారములనుబట్టి వాని నిర్మాణములుగూడ మారుట జూచియుంటిమి. ఎట్లన, బురదనుండి ఆహారమును గొను మూలతంతువుల కణములందు హరితకములులేవు. ఈ కణములకు సూర్యకాంతితో బనిలేదు. వారిపర్ణిని నిలబడునట్లు జేయుటకును, దానికి కొంతవరకు ఆహారము నమర్చుటకును కాడ యుపయోగపడుచున్నది. వారిపర్ణి కాహారము స్వీకరించిపెట్టుటకు ముఖ్యముగా నేర్పడియున్న ఆకులయందు హరితకములు పెక్కులు గలవు. కాడయం దీ హరితకములు వెలుపలివైపునమాత్రము స్పల్పముగ గలవు.

వారిపర్ణితరువాత మనము జదివిన నాచుమొక్కగూడ కణములపేర్పుచే నిర్మితమైన స్రంభమువంటిదియే. ఇది నీటిలో మునిగియుండి, తన యాహారమును అందుండిమాత్రమే తీసికొనక కొంచెము నీటిపైకి తలయెత్తి గాలినుండిగూడ కొంతయాహారమును గ్రహించును. దానియాకుల నెల్లప్పుడు నీటిపై నుండునట్లు జేయుటకై దానికొమ్మలు కొంచెము దృఢముగా నుండవలసియున్నది. అట్టివ్యాపారము నెరవేర్చుటకై దానికొమ్మయొక్క వెలుపలివైపున చుట్టునుండుకణములు పొడుగుగనెదిగి బలమైనవిగ నున్నవి. వీని కణకవచములు దళసరెక్కి గట్టిపడియున్నవి. ఇవి గట్టిగనుండుటచే తమ లోపలితట్టుననుండు కణములలోనిపదార్థములు వ్యర్థముగ వెలుపలికిబోకుండ ఆపుటయేకాక, మొక్కకు దృఢత్వముకూడ నిచ్చుచుండును. ఈ పనులను చక్కగ నెరవేర్చు నిమిత్తమై యాహారము సంపాదించిపెట్టుపని ఈకణములు తమకు లేకుండ జేసికొనినవి. కాబట్టి యీ కణములు బలమునిచ్చునవిగను సంరక్షించునవిగను ఉన్నవి. నాచుమొక్కయొక్క కణముల పేరుపులో గమనించవలసిన అంశ మింకొకటి గలదు.

ఒక సాలెవాడు బట్టలు నేయునప్పుడు కొన్నివస్త్రములు కట్టుకొనుటకుగాను కొంచెము ముతుకనూలుతోను, మరికొన్ని తలపాగలకుగాను సన్ననూలుతోను నేయుచుండును. ఆయాసరకులను తయారుచేయునప్పుడు వాని యుపయోగములకు తగియుండుటకుగాను ఆ నూలుపోగుల నొక్కొకచో నొంటిగను, మరియొకచో జంటగను, వేరొకచో మిక్కిలిబలముగ నుండుటకై ముప్పేటగను నెట్టుచుండును. అట్లు నేయునప్పుడు తన కనుకూలపడురీతిని అంచులలో పట్టుపోగులను, జరీపోగులను, మధ్య నూలుపోగులను, ఉపయోగించుచుండును. ఇట్లే నాచుమొక్కయందును వెలుపలనుండుఅంచు బలముగనుండుటకై నారపోగులవంటి దృఢకణముల (Sclerenchyma) తోను, నట్టనడుమ నుండు గుంజువంటి మెత్తని పదార్థము పలుచని కణకవచములుగల మృదుకణముల (Parenchyma) తోను అల్లబడియున్నవి. అంచులనుండు జరీ పట్టులవంటిది దృఢకణములవరుసలు. మధ్యనుండు సామాన్యమైననూలు వంటిది మృదుకణములవరుసలు.

కణసంహతులు.

ఒకదానినొకటి బోలియుండుకణము లనేకములు మొట్టమొదటనుండి గుంపులుగా జేరి, యొక్కొకగుంపునందలి కణము లన్నియు నొక్కరీతిని వృద్ధిక్షయములనుబొందుచు, నొక్కొకగుం పొక్కొకవ్యాపారమున కేర్పడియుండి, ఆయావ్యాపారమును నెరవేర్చుటకుగాను ఆయాగుంపులలోని కణములు ప్రత్యేకనిర్మాణములు గలిగియుండును. ఇట్టిగుంపులకు కణసంహతులు (Tissues) అనిపేరు. నాచుమొక్కయందు వెలుపలివైపున నుండు దృఢకణము లొక సంహతిగా గూడి సంరక్షణ మొదలగువ్యాపారముల జేయుచున్నవి. మధ్యనుండు మృదుకణములు వేరొక సంహతిగా గూడి మొక్కయొక్క ఆహారద్రవముల వ్యాపకమును జేయుచున్నవి. ఇట్టి సంహతులభేదములను సూచించు వృక్షములలో నాచుమొక్క యే మొదటిది.

నిర్మాణభేదములబట్టి వ్యాపారభేదములు గలుగుట.

ఇట్లే ఒక్కొకతరగతి హెచ్చినకొలదిని, జంతువులకుగాని, వృక్షములకుగాని తమతమ వ్యాపారములయందు మార్పులు గలుగుచు, ఆయావ్యాపారములకు తగియుండునట్లు నిర్మాణమునందును భేదము పుట్టుచుండును. ఇందున కుదాహరణము:- నీటియందు ఎల్లప్పుడు నీదునట్టివ్యాపారము గలవగుటచేతనే కప్పలయొక్కయు, బాతులయొక్కయు వ్రేళ్ళమధ్య పలుచనిచర్మము లేర్పడి, యవి తెడ్లవలె పనిచేయుచుండును. ఇట్టిమార్పులు జంతువుయొక్కగాని, వృక్షముయొక్కగాని తరగతి హెచ్చినకొలదిని సంమిశ్రమగుచుండును. ఇది యొక చిన్నయుదాహరణమువలన చక్కగ తెలియగలదు. ఒక పల్లెటూరి మోటబండికి రెండు చక్రములు, చట్రము, పోలుగర్ర, కాడి - ఇవియే నిర్మాణమునందలి ముఖ్యాంగములు. దానినడక బైసికిల్ (Bicycleకణసముదాయము తప్ప విశేషనిర్మాణము లెవ్వియును లేవు. పుష్టికరములగు ద్రవాహారములు వాని మిక్కిలిపలుచని కణకవచములగుండ యొకకణమునుండి మరియొకకణమునకు ఊరి, నలుప్రక్కలను వ్యాపించుటచే ఆ కణములన్నిటికిని ఆహారము లభించును. కాని వీనికంటె పైతరగతి వృక్షములందు కణములకు కాఠిన్యము మొదలగు స్వభావములుండుటచే వాని యావరణపు పొరలుమిక్కిలి దళమైనవై పైజెప్పిన ద్రవాహారములను వానిగుండ వ్యాపించనియ్యవు. అట్లగుటచే ఆపనిని నెరవేచ్చుటకై ప్రత్యేక సేవకులని చెప్పనగు కొన్నికణములు సంహతులుగగూడి యొక్కొకసంహతి యొక్కొకవ్యాపారమునకు ప్రత్యేకముగ నేర్పడియుండును. గాలియందలి తమకు కావలసిన కర్బను (C) మొదలగు ఆహారపదార్థములను, ఆకులనుండి వృక్షశరీరమున కంతటికిని వ్యాపింపజేయునవి ఈ కణములే. వేళ్లనుండి నీటిని, లోహసంబంధమైన పదార్థములను ఆకులకు జేర్చు మార్గములుగా నేర్పడునవియు నీ కణములే. ఇట్లే కణములయం దనేకమార్పులు గలుగుచు అట్టి మార్పులవలన ఆయాకణములవ్యాపారములు నిర్ణీతము లగుచుండును. కణములయందలి మార్పులు వాని యావరణపుపొరలయందుగాని, వానియందలి మూలపదార్థమునందుగాని గలుగవచ్చును.

ఈ మార్పులు ముఖ్యముగా నైదువిధములు:

1. కణకవచము పెరుగుట.

2. కణకవచము దళసరెక్కుట. 3. కణకవచముయొక్క రసాయనసమ్మేళనము (Chemical Combination) మారుట.

4. కణముయొక్క మూలపదార్థమునందలి మార్పులు.

5. కణము లొకదానితో మరియొక టైక్యమగుట.

1. కణకవచము పెరుగుట.

కణముయొక్క ఆవరణపుపొర పెరుగుటచే కణమును పెరుగును. ఈకణము పెరుగునప్పుడు ప్రక్కకణముల యొత్తుడు మొద

Jeevasastra Samgrahamu.pdf

1-గుండ్రనికణము. 2-అండాకృతిగలవి. 3-గొట్టమువలెనుండునవి 4-బహుభుజకణములు. ఇవి మృదుకణముల సంహతులలో తరుచుగ నుండునవి.

5-బల్లపరుపుకణములు.

6-నక్షత్రాకారమైనకణములు.

7-పొడుగైనకణములు, దృఢకణముల సంహతులలో నీ కణము లుండును.

లగు అనేక కారణములచేత నవి కొన్ని గుండ్రముగను (Round),కొన్ని అండాకృతిగను (Oval), కొన్ని పొడుగుగను (Long), కొన్ని బహుభుజములుగను (Polygonal), కొన్ని గొట్టముల వలెను (Cylindrical), మరికొన్ని యిటికలవలె బల్లపరుపుగను (Flat), కొన్ని నక్షత్రములవలె చిత్రమైన యాకారములుగలవిగను ఉండవచ్చును.

2. కణకవచము దళస రెక్కుట.

ఇట్టి దళసరి కణకవచమున కంతటను ఏకరీతిగ గలుగవచ్చును. అట్లయిన చో కణకవచ మన్నిప్రక్కలను సమానముగా పెద్దదగుచుండును. ఒక కణము మిక్కిలి పొడుగుగ నెదిగి, దాని కణకవచము మిక్కిలి దళసరెక్కి మూలపదార్థము హరించిపోవు

Jeevasastra Samgrahamu.pdf

టచే నారపోడు ఏర్పడుచున్నది. ఈ నారపోగు లధికమైనకొలదిని మ్రాకునకు జిగి హెచ్చును. లేక యిట్టి దళసరి కవచమునందలి కొన్ని భాగములకుమాత్రము గలుగవచ్చును. ఈమా ర్పనేక విధములుగ నున్నది. కొన్నికణములందు వానికవచముయొక్క లోపలితట్టున కడియములవలెనుండుమిట్టలు వరుసగ నొక దానిపై నొకటి చారలుగ నేర్పడియుండును (34-వ పటములో A). కొన్నిటిలో నాచారలు మరచుట్లవలెనుండును (B) కొన్నిటిలో నీ చార లొండింటితో నలుముకొని వలయల్లికలవలె నుండవచ్చును. (C) మరికొన్నిటిలో నీమిట్టపల్లములు గుంటలుగుంటలుగ నుండును (D) ఈమార్పు లింక ననేకవిధములుగ గలుగవచ్చును.

Jeevasastra Samgrahamu.pdf

1-4, దారువాహికలు:- 2 అను అంకె కెదురుగా నుండు వాహికలో కడియపుచారలు గలవు. 4 అంకె కెదుటనున్న వాహికలో మెలిచార గలదు. కడయపుచారలయొక్క అంచు లొకదానితో మరియొకటి జేరి మరచుట్టవలెనుండు నేకచార యేర్పడుచున్నది. 1, 3 వాహికలలోని చార లెవ్వియును చూపబడలేదు. (232-వ పుట చూడుము).

మనము సూక్ష్మదర్శనిలో జూచునప్పుడు కణకవచములమీద కనుబడు నిచ్చెనమెట్లు, మెలికలు, గుంటలు మొదలగు వివిధాకారములుగల చారలు మచ్చలు మొదలగున విట్టి దళసరియందలి మార్పులవలననే యేర్పడుచున్నవి. ఈరూపములు 35-వ పటములో జూపినప్రకారము దారువాహికల (Wood Vessels) యొక్క యుపరితలమున గానవచ్చు చుండుట మనము చూడగలము.

చారల రూపనిష్పత్తి.

పైని వివరించిన నాలుగురీతుల చారలును కడియములవంటి చారలనుండి పుట్టినవియే. ఏలయన, ప్రతికడియమును పూర్ణముగా కణముచుట్టును తిరిగియుండక, ఆకడియముల కొనలన్నియు నొకదానితో నొకటి యతుకుకొని పోయినయెడల నిచ్చెనమెట్లవంటి ఆకారముగల చారలు మరచుట్టు మెలికలవంటి ఆకారముగల నగును. ఇట్టిమరచుట్టు మెలికలవంటిచారలు కుడివైపునకు కొన్నియు, ఎడమవైపునకు కొన్నియు పోవుచు నవియన్నియు నొక దానితో నొకటి యలుముకొనియున్నచో వలయల్లికలవంటి యాకార మేర్పడును. ఈ చార లుండుచోట్లయందు దళసరి హెచ్చుచు వలకండ్లవలె నుండు మధ్యస్థలముల యందలి కణకవచము పలుచగనే యుండినచో గుంటలవంటి మచ్చ లేర్పడును.

3. కణకవచముయొక్క రసాయనసమ్మేళనమునందలి మార్పులు.

మిక్కిలి లేతయిన వృక్షకణముయొక్క కవచము ప్రథమమున పలుచగ నుండి దూదిసంబంధమైన సెల్లులూసు అనుపదార్థముతో జేయబడినదని చెప్పియుంటిమి. కాని కణకవచము దళసరెక్కినకొలదిని యొకానొకప్పుడు దాని రసాయన సమ్మేళనము మారును. ఇట్టి మార్పుచే కణకవచము గట్టిపడుటయు, మనము సామాన్యముగా ఔషధపుసీసాలకు బిరడాలుగా నుపయోగించెడు బెండు (Cork) వంటి పదార్థముగా మారి నీటిని చొరనియ్యకపోవుటయు, నివి మొదలగుగుణములు కణకవచమునకు గలుగుచున్నవి. ఇట్లే వృక్షములయందలి బెండుపొరయును, దానిపైనుండు బెరడును ఏర్పడుచున్నవి. ఇవి వృక్షములను ఎండ వానల దెబ్బలనుండి కాపాడును. చెట్లకొమ్మలయొక్క లోపలిభాగమందుండు నీటియావిరి వ్యర్థముగ వెలుపలికిబోయి చెట్టున కమిత దాహము గలుగకుండ బెండుపొర సంరక్షించు చుండును. వెలుపలనుండు ఎండ ఉడుకు లోపలిభాగములకు వ్యాపించి చెట్టునకు వడ తగులకుండునట్లును కాపాడుచుండును. కావుననే లేత మామిడి మొక్కలు మొదలగు కొన్ని చెట్లయొక్క పైపట్ట నరికివేసిన నవి యెండి చచ్చును. కణకవచము గట్టిపడుట యు, నీటిని చొరనియ్యకపోవుటయునే గాక మరికొన్ని మార్పులవలన మ్రానులయొక్క పలురంగు లేర్పడుచున్నవి. ఇట్టిమార్పులచేతనే చెట్లయొక్క చేవయును, సొంపును, నాణెమును గలుగుచున్నవి. ఇట్టి రసాయనసమ్మేళనమునందలి మార్పులచేతనే తుమ్మజిగురు మొదలగు జిగటపదార్థములు పుట్టుచున్నవి. ఇంకను నిట్టిచిత్రమైన విషయములనుగూర్చి వృక్షశాస్త్రము భోదించును.

Jeevasastra Samgrahamu.pdf

4. కణమునందలి పదార్థములలోని మార్పులు.

లేతవృక్షకణములందు ప్రథమమున మూలపదార్థము నిండుగ నుండునని వ్రాసియుంటిమి. కణము పెరిగినకొలదిని దానితో సమముగ మూలపదార్థము పెరుగలేక కణముయొక్క చుట్టుగోడను జేరి కొంతస్థలము ఆక్రమించుకొనియుండును. ఇదికాక యీమూలపదార్థము కణముయొక్క మధ్యభాగమున జీవస్థానముచుట్టును స్వల్పమాత్రమును, దానినుండి కణకవచముయొద్ద నుండు మూలపదార్థము వరకు వ్యాపించు కిరణములుగా స్వల్పమాత్రమును వ్యాపించియుండును. ఈవిషయమై పసిరికపోగులో జెప్పియుంటిమి (36-వ పటము చూడుము). తక్కిన మధ్యభాగమంతయును అవకాశముగా నుండును. ఇది కణరసము (Cell sap) అను నీటివంటి ద్రవపదార్థముతో నిండియుండును. ఈ ద్రవపదార్థమే ఆయావృక్షముల స్వభావమునుబట్టి చెరకు మొదలగు వానియందు తియ్యనిపానకముగను, నిమ్మ మొదలగువానియందు పుల్లనిరసముగను, నువ్వు, ఆముదము మొదలగువాని గింజలయందు చమురుగను ఏర్పడియుండును. కణమునందలి పదార్థముయొక్క మార్పులచేతనే ధాన్యాదులయందు నులువజేయబడు వరిపిండి (Starch)

Jeevasastra Samgrahamu.pdf

మాంసకృత్తు (Proteid) మొదలగుపదార్థములు తయారగుచున్నవి. (ఫ్రక్కపటము చూడుము). ఈ మార్పులచేతనే అనేకపుష్పములయొక్క చిత్రవిచిత్రమైన రంగులేర్పడుచున్నవి. ఈ కణములచే విసర్జింపబడు పదార్థమునుండియే నల్లమందు మొదలగు విషములును పలువిధములయిన అత్తరువు లందలి సువాసన ద్రవ్యములును పుట్టుచున్నవి. ఇట్టి అనేకాంశములు మిక్కిలి యుపయోగకరము లయ్యును గ్రంథ విస్తరభీతిచే నిం దుదాహరింపబడవయ్యెను.

కణము లైక్యమగుట.

కణములయొక్క అనేకములగు వరుసలు చిక్కులుచిక్కులుగా నల్లుకొనుచు పెరుగునప్పుడు, అందుకొన్ని కణములయొక్క కవచము లొకానొకప్పుడు పగిలి హరించిపోవును. అంతట సమీపముననుండు కొన్నికణములు కలిసి ఏకకణము కావచ్చును. ఒకానొకప్పు డొక్క చోట నుండు కొన్ని కణములరాశి మొత్తముగా చితికిపోయి వాని కణపదార్థమంతయు నితరకణములలోనికి క్రమముగ వ్యాపించి కణకవచములు హరించిపోవచ్చును. ఈ కణము లాక్రమించియుండినచోటు అట్టిస్థితిలో శూన్యముగా నుండిపోవును. ఇట్లు లేతమొక్కయం దొక్కొకకణము నశించి పోవుటచేత దానిసంతతి కాదలచిన కణములన్నియు లేకపోవును.

Jeevasastra Samgrahamu.pdf

కాని వానికొర కేర్పడియున్న స్థలముమాత్రము శూన్యముగా నిలిచిపోవును. ఈ శూన్యస్థలములే చింత, మామిడి మొదలగు పెద్దవృక్షములలోని వికృతాకారముగలతొర్రలు (38-వ పటము చూడుము). ఈ ప్రకారమే వరుసగనుండు కణముల రాసులు కొన్ని నశించుటచే టేకు మొదలగు పెద్దమ్రాకులయందుండు నిలువురంధ్రము లేర్పడుచున్నవి.

దారువాహికలు.

ఇవిగాక ఒక్కటే వరుసలోని కణముల అడ్డగోడలుమాత్రము హరించిపోవుటచేత కణములవరుసలు 35-వ పటములోజూపినట్లు గొట్టములుగా నేర్పడవచ్చును. ఈగొట్టములు చెట్లవేళ్లచే పీల్చబడిన నీటిని ఆకులలోనికి వ్యాపింపజేయు కాలువలు. వీనికి దారువాహికలు (Wood Vessels) అనిపేరు.

జల్లెడ కాలువలు.

లేదా అట్టి యేకపం క్తిలోని కణముల అడ్డుగోడలందు జల్లెడకండ్లవలె రంధ్రము లేర్పడవచ్చును. ఈ రంధ్రములగుండ ఆ వరుసయందలికణము లన్నిటికి ఏకమార్గ మేర్పడును. ఇ ట్లేర్పడిన కాలువలకు జల్లెడకాలువలు (Sieve tubes) అని పేరు. ఈకాలువలు కొమ్మయొక్క త్వక్కు అను వెలుపలిభాగమున పొడుగునను సామాన్యముగ వ్యాపించి యుండుటచేత వీనికి త్వగ్ వాహికలనియు పేరు. ఈ కాలువలగుండ వృక్షముయొక్క

Jeevasastra Samgrahamu.pdf

1-జల్లెడ కాలువ నిలువున చూపబడినది. మూ.ప-కణముయొక్క మూల పదార్థము. స్వే-కోడి గుడ్డులోని శ్వేతధాతువు (Albumin) వంటి మాంసకృతుపదార్థము. రెండుకణముల మధ్యనుండు జల్లెడ రేకులోని రంధ్రముల చూడుము.

2-జల్లెడరేకు. దాని యందలి రంధ్రములు.

అనేకభాగములకు ఆకులయందు తయారుచేయబడిన పుష్టికరమగునత్రజనసంబంధమైన ఆహారరసములు వ్యాపించుచుండును.

దారువాహికలును, జల్లెడ కాలువలును మన శరీరము నందుండు రక్తవాహికల (Blood Vessels) వంటివి. ఇవి 40-వ పట
Jeevasastra Samgrahamu.pdf

ములో జూపినప్రకారము ఆకులయందు ప్రారంభించి, వాని తొడిమలగుండ గుంపులు గుంపులుగచిన్న కొమ్మలలోనికిజేరి, వానిగుండ తల్లికొమ్మద్వారా వేళ్లయొక్క చివరభాగము వరకుపోవును. ఇట్టికాలువల గుంపులకు వాహికాపుంజము లని పేరు.

సామాన్యముగ ప్రతియాకుయొక్క యుపరి తలమునను మనముపరీక్షీంచి చూచిన ఒకటి మొదలు నాలుగైదు వరకు పెద్ద ఈనెలును, వానినుండి వెలువడు చిన్న చిన్న నారపోగులవంటి యీనెలాల్లికలును గానవచ్చును. ఈయల్లికలలో రెండు ముఖ్యమైన భేదములు గలవు. ఆభేదములబట్టి వృక్షములలోనికొన్ని జాతులను విభజనసేయ నగును. 41,42-వ పటములలోనుండు అరటాకుయొక్కయు, ఆముదపాకుయొక్కయు రూపములను చూడుము. అందు అరటాకులో, నడిమిభాగమున

Jeevasastra Samgrahamu.pdf

తల్లి ఈనె ఒక్కటే యుండును. దానినుండి రూళ్లవలె సమాంతరముగ నుండు గీట్లు మొదటినుండి కడవరకు నుండును. పటములోచూపిన ఆముదపాకులో 9 తల్లిఈనెలు గలవు. దానినుండి చిన్నచిన్న నారపోగులవలె పిల్లఈనెలు అనేకమార్గముల వ్యాపించి వల అల్లికవలె దట్టముగ అల్లుకొనియుండును. ఈ రెండువిధములైన ఈనెల యల్లికలుగల రెండుజాతుల వృక్షములగూర్చి ముందు వివరింపబడును. ఈ యీనెలయందు పై జెప్పిన కాలువలు గలవు. ఈ వాహికలు ఆకుయొక్క కాడద్వారా ఆయాజాతుల కేర్పడియున్న నిర్ణయరీతిని కొమ్మలగుండ వేళ్ళచివరలవరకు బోవుచుండును.

Jeevasastra Samgrahamu.pdf

వాయుమార్గములు.

పైని జెప్పినప్రకారము కణములలోపల కాలువలుగా నేర్పడినమార్గములుగాక కణములవెలుపల ఆయాకణముల మధ్యనుండు సందులను ఒండొంటితో జేర్చి చెట్టుపొడుగునను వంకర టింకరలుగా వ్యాపించుమార్గములును గలవు. (ప్రక్కపటము చూడుము). ఇవి వృక్షమునందు సర్వదా వ్యాపించు చుండెడు ప్రాణవాయువు, బొగ్గుపులుసుగాలి, నీటియావిరి మొదలగు వాయువుల శీఘ్రప్రచారములకు మిక్కిలి యుపయుక్తములుగ నుండును.

హెచ్చుజాతి వృక్షములన నెవ్వి?

హెచ్చుజాతి వృక్షములయొక్క సూక్ష్మనిర్మాణములను వివరముగ వర్ణించుట కిచ్చ టెడములేనందున వానిని గూర్చి సంక్షేపముగమాత్రమే వ్రాయుచు, వానికిని, మన మిదివరకు చదివియున్న నాచు, వారిపర్ణి మొదలగు మొక్కలకును గల తారతమ్యములను సూచించెదము. హెచ్చుజాతివృక్షము లనగా పూవులుపూయు వృక్షములు. మామిడిచెట్టు, కొబ్బెరచెట్టు మొదలగునవి. వీనికిని నాచుమొక్కకువలెనే ఆకులు, కొమ్మలు, వేళ్లు గలవు. ఆకులు వెలుతురువైపునకు, అనగా, పైవైపునకు పెరుగుచుండును. వేళ్లు భూమిలోనుండు నీళ్లవై పునకును, చీకటివైపునకును, అనగా క్రిందివైపునకును బోవుచుండును. నాచుమొక్క యందలి వేళ్లకుమాత్రము వాని సూక్ష్మనిర్మాణమునందలి భేదములచే నులివేళ్లు అని పేరుగలిగె. నిజమైన వేళ్లనిర్మాణము తెలిసికొనునప్పు డీ భేదములను గ్రహించగలము. ఈ శాఖ ఆకు, వేరు అను మూడుభాగములగూర్చి రాగల మూడుప్రకరణములలో వివరించెదము.

పిమ్మట వాని పూవులయొక్క నిర్మాణమును వివరించుచు, అవి సంతానవృద్ధి కలిగించుట కెట్లు తగియున్నవో సూచించెదము. తరువాత గర్భవతులయిన పూవులనుండి పుట్టిన కాయలయొక్క వ్యాపారములను నిర్మాణములును కొంతవరకు వర్ణించెదము.


Jeevasastra Samgrahamu.pdf