Jump to content

వికీసోర్స్:కాపీహక్కుల పరిధి దాటిన రచయితలు

వికీసోర్స్ నుండి

రచయితల కాపీహక్కుల స్థితిగతులు

[మార్చు]

తెలుగు వికీసోర్సు అన్నది ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛానకలు హక్కులున్న రచనలుగల గ్రంథాలయం. దీని నిర్వచనంలోనే ఉన్న స్వేచ్ఛా నకలు హక్కులు అన్న పదం వల్ల ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ముందస్తు అనుమతి అవసరం లేకుండా, వాణిజ్యావసరాలకు సైతం తిరిగి వినియోగించుకోగలిగిన కృతులు మాత్రమే ఇందులో ఉండాలి. ఇలాంటివి సాధారణంగా రెండు విధాలుగా ఉంటాయి:

  1. సార్వజనీనమైన కృతులు - స్వంత సృజనల (original creations) మీద వాటి సృష్టికర్తలకు (రచయితలు, సంగీతకారులు, శిల్పులు, చిత్రకారులు, వగైరా) దక్కే పలు చట్టపరమైన హక్కుల సమూహమైన కాపీహక్కులు చట్టప్రకారం కొన్ని పరిధుల మేరకు కొంత కాలం మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో రచయిత పేరు తెలిసిన సాహిత్య రచనలు రచయిత జీవితకాలంలో ప్రచురితమై ఉంటే రచయిత మరణానంతరం 60 సంవత్సరాలు గడిచాకా ఆ కృతి కాపీహక్కుల పరిధిలో ఉండవు. అలా కృతి తొలి ప్రచురితమైన, రచయిత పౌరసత్వం ఉన్న దేశానికి అనుగుణంగా కృతి సార్వజనీనం అవడానికి స్థానిక చట్టాలు వర్తిస్తాయి.
  2. స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల అయిన కృతులు - కాపీహక్కుల స్వంతదారు స్వయంగా స్వేచ్ఛా నకలు హక్కులకు సంబంధించిన లైసెన్సుల్లో (అవేమిటి అన్నది కామన్సులో చూడండి)

తెలుగు వికీసోర్సులో ఉండే పుస్తకాలు సాధారణంగా వికీమీడియా కామన్సులో అప్‌లోడ్ అవుతాయి. వికీమీడియా ఫౌండేషన్ సైట్లకు సర్వర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండడం వల్ల వికీమీడియా కామన్సులో ఉండే కృతులు ఆ కృతి మొదట ప్రచురితమైన దేశంతో పాటుగా, అమెరికా చట్టాలు కూడా వర్తిస్తాయని. రెండు దేశాల్లోనూ కాపీహక్కుల పరిధిలో లేకుంటేనే చేర్చవచ్చని విధానాలు ఉన్నాయి.[1] భారతీయ కాపీహక్కుల చట్టం 1956 దాని తదనంతర సవరణల ప్రకారం, భారతదేశంలో రచయిత జీవితకాలంలో, వారి పేరు మీదనే ప్రచురితమైన భారతీయ రచయిత పుస్తకాలు రచయిత మరణానంతరం 60 సంవత్సరాలకు సార్వజనీనం అవుతాయి. (ఇది చాలా సరళమైన వివరం. స్పష్టత కోసం వికీసోర్స్:తెలుగు వికీసోర్స్ కాపీహక్కుల మార్గదర్శిని చూడండి) అయితే భారతదేశం అమెరికాతో కాపీహక్కుల సంబంధాలు ఏర్పరుచుకున్న నాటికి అంటే యురుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ తేదీ 1996 జనవరి 1 నాటికి భారతదేశంలో సార్వజనీనం అయివుండడం లేదా కాపీహక్కుల నోటీసు లేకుండా 1989 మార్చి 1కి ముందు ప్రచురితమైనది లేదా కాపీహక్కుల పునరుద్ధరణ పొందకుండా 1964కి ముందు ప్రచురితమైన భారతీయ కృతులు మాత్రమే అమెరికాలో సార్వజనీనం అయివుంటాయి. దీన్ని కూడా బాగా సరళంగా చెప్పాలంటే 1941 నాటికి మరణించిన రచయితలు, తమ జీవితకాలంలో ప్రచురితమైన పుస్తకాలు ఇటు భారతదేశంలోనే కాక, అమెరికాలోనూ సార్వజనీనమే.

భారతదేశంలో సార్వజనీనం

[మార్చు]

అమెరికాలోనూ, భారతదేశంలోనూ సార్వజనీనం

[మార్చు]

పాత జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 2018 అక్టోబరు నాటికి, ఈ విధానం మరీ కచ్చితంగా అమలు కావడంలేదు. కృతి ప్రచురితమైన దేశంలో సార్వజనీనం అయివుంటే అమెరికాలో కాకున్నా వికీమీడియా కామన్సులో ప్రస్తుతానికి తొలగింపు నోటీసుతో లేని కృతులు అనేకం ఉండడానికి కామన్స్‌లో దీని అమలు విషయమై ఉన్న భిన్నాభిప్రాయం కొంత కారణం.