రచయిత:పరవస్తు చిన్నయసూరి

వికీసోర్స్ నుండి
(రచయిత:పరవస్తు చిన్నయ సూరి నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
పరవస్తు చిన్నయసూరి
(1809–1861)
చూడండి: వికీపీడియా వ్యాసం. ప్రసిద్ధ తెలుగు రచయిత, గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.

రచనలు[మార్చు]

రచయిత గురించిన రచనలు[మార్చు]