రచయిత:సోమరాజు రామానుజరావు
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: స | సోమరాజు రామానుజరావు (1896–1934) |
నాటకకర్త, నాటక ప్రయోక్త, నవలా రచయిత. |
-->
రచనలు
[మార్చు]- విష వాహిని (1916)
- లక్ష్మణ మూర్ఛ[1]: రామాయణంలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆయన ప్రాణాలు దక్కించేందుకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. ఆ పనికి అమితాదరం పొందిన రాముడు హనుమను కౌగలించుకుంటాడు. అపురూపమైన ఈ ఘట్టాన్ని రాముడి వద్దకు హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం నుంచి మొదలుకొని ఐదు అంకాల నాటకంగా రచించారు కవి. ఈ గ్రంథం 1933లో ప్రచురణ పొందింది.
- అదృష్ట విజయము[2]: రామానుజరావు రచించిన ఈ నాటకానికి ప్రపంచ ప్రసిద్ధమైన అరేబియన్ నైట్స్ గ్రంథంలోని కథ మూలం. ఈ అరేబియన్ నైట్స్ కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అత్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు. వాటిలోని ఆలీబాబా నలభై దొంగలు ఈ కథకు మూలం. రహస్యంగా దొంగలు దాచిన నిధిని కనిపెట్టిన ఓ నిరుపేద జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ముఖ్య కథాంశం. పారశీక ఇతివృత్తాన్ని రచయిత భారతీయ నేపథ్యంలోకి మలిచారు.
- రంగూన్ రౌడీ: వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా రచించిన నాటకమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం సినిమాగా కూడా రూపొందించారు. ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గృహలక్ష్మి: హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. దీని కథా రచయిత సోమరాజు రామానుజరావు. రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.
- కాలకేతనము[3]: కాలకేతుదనే రాజు కథను ఈ నాటకంగా మలిచారు. ఇది జానపద ఇతివృత్తంగల నాటకం.
- స్వరాజ్య రథము: సోమరాజు రామానుజరావు వ్రాసిన ఐదు అంకాల నాటకం ఇది. ఆంగ్లేయుల దురంతాలకు తల్లడిల్లిన భరతమాత తనను కాపాడుమని ఇంధ్రసభలో వేడుకొంటుంది. తిలక్ గాంధీగా అవతరించి, ప్రజలను చైతన్యపరచి స్వరాజ్య రథాన్ని ముందుకు నడిపించి స్వాతంత్య్రాన్ని సాధించడం ఈ నాటకంలోని ఇతివృత్తం. వందలాది ప్రదర్శనలకు నోచుకొన్న ఈ నాటకం బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధించబడింది.
- పార్వతీ గర్వభంగము[4]: ఈ నాటకానికే గంగావతరణమని మరో పేరు. ఈ నాటకాన్ని ఆయన రంగూనులోని ఆంధ్ర జాతీయ నాటక సభ కోసం రచించారు. జానపదుల నోళ్లలో నానుతూన్న గంగా గౌరీ సంవాదం, పౌరాణికంగా వర్ణితమైన గంగావతరణం సమన్వయం చేసి రచించిన నాటకమిది.
- భోజ కాళిదాసు[5]: భోజరాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్నట్టుగా, వారిద్దరి మధ్యా జరిగిన సరస, సాహిత్యపరమైన వివిధ కథలు చాటువులుగా ప్రచారంలో ఉన్నాయి. రకరకాలైన శ్లోకాలు కాళిదాసు చెప్పినట్టుగానూ దానికి భోజరాజు కారణమైనట్టుగానూ ఉన్నాయి. వీటిలో చాలా భాగం చమత్కారయుతంగానూ, సాహిత్యంలోని సూక్ష్మ విశేషాలు తెలిపేవిగానూ ఉంటాయి. వీటన్నిటినీ స్వీకరించి రచయిత గ్రంథాన్ని రచించారు.
- సతీ సక్కుబాయి[6]: సక్కుబాయి ప్రముఖ భక్తురాలు. ఆమె కథ చాలా ప్రాచుర్యం పొందింది. అత్తగారి ఆరళ్ళు భరించి, కృష్ణునిపై భక్తిని పెంచుకున్న ఆమెకు అత్తగారు చేయలేని పనిని అప్పగించినప్పుడు కృష్ణుడే కాపాడాడని ప్రతీతి. ఆమె కథను మహిళాభ్యుదయంతో ముడిపెట్టి ఈ నాటకాన్ని రచించారు.
- ధరణికోట[7]: రెడ్డిరాజుల పరిపాలననూ,అందులోనూ ముఖ్యంగా వారు పోరిన ఓ సంగ్రామాన్ని కథావస్తువుగా స్వీకరించి ఈ నాటకం రచించారు.
- భీష్మ బ్రహ్మాచారి [8]: మహాభారతంలోని భీష్ముడి గురించిన నాటకం
- వీరాభిమన్యు [9]
- దోమాడ యుద్ధము (1921) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- సంగీత సావిత్రి [10]
- దానవీర కర్ణ [11]
- హైమావతి నవల ఆర్కీవులో.
- పండ్రెండు రాజుల కథలు (1933)
- సతీ అనసూయ (1928) External link.
మూలాలు
[మార్చు]- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణ మూర్ఛ నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో అదృష్ట విజయము నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో కాలకేతనము నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో పార్వతీ గర్వభంగము పుస్తకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో భోజ కాళిదాసు నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో సతీ సక్కుబాయి నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో ధరణికోట నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో భీష్మబ్రహ్మాచారి నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో వీరాభిమన్యు నాటకం.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో సంగీత సావిత్రి నాటకం
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో దానవీర కర్ణ నాటకం