Jump to content

వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 11

వికీసోర్స్ నుండి

పాత చర్చ 10 | పాత చర్చ 11 | పాత చర్చ 12

సంపాదకీయాలు

[మార్చు]

అర్జునరావు గారికి, వికీసోర్సులో సంపాదకీయాలు ఎలా చేర్చాలి. " సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక సంపాదకీయాలు " అనే పేరుతో 1989లో ప్రచురించారు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారు ఒకసారి చర్చిస్తే మంచిదని భావిస్తున్నాను. ఈ లింకు ఒకసారి చూడండి: [1]--Rajasekhar1961 (చర్చ) 13:57, 28 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, పుస్తకం స్కాన్లో పేజీలు వేరు వేరుగా నే వున్నాయి కాబట్టి ఇప్పటికే చేర్చి పుస్తకాలుగా రూపుదిద్దిన వాటిలాగే చేర్చవచ్చు. అయితే దీని దింపుకొనే పుస్తకంగా చేయడానికి ఆసక్తిగల వికీసోర్స్ సభ్యులను గుర్తించి ఆ పని చేయడం మంచిది. నకలుహక్కుల సమస్య లేదు. దీనికంటే పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) ఇటీవల చేర్చిన ముఖ్యమైన గ్రంథాల జాబితాలోని వాటిపై దృష్టిపెట్టటం మంచిది.--అర్జున (చర్చ) 23:59, 30 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పుస్తకంగా ఈ వ్యాసాలు ప్రచురితమైనది ప్రతాపరెడ్డి గారు మరణించాకానే అయినా అసలంటూ వ్యాసాలు ఏనాడో ప్రచురితమయ్యాయి. కాబట్టి పోస్ట్-హ్యూమస్ వర్క్ నిర్వచనం కిందకి రాదనే భావిస్తున్నాను. అర్జున గారన్నట్టు ఆ ప్రకారం భారతదేశంలో కాపీహక్కులు చెల్లిపోయినట్టే. మరీ జాగ్రత్త పడదలుచుకుంటే ముందుమాటలు తొలగించవచ్చు. ఆనీ పుస్తకం కాపీహక్కుల పరిధిలో లేదనే నా అభిప్రాయం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 18:22, 2 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Words hyphenated across pages in Wikisource are now joined

[మార్చు]

Hi, this is a message by Can da Lua as discussed here for wikisource communities

The ProofreadPage extension can now join together a word that is split between a page and the next.

In the past, when a page was ending with "concat-" and the next page was beginning with "enation", the resulting transclusion would have been "concat- enation", and a special template like d:Q15630535 had to be used to obtain the word "concatenation".

Now the default behavior has changed: the hyphen at the end of a page is suppressed and in this case no space is inserted, so the result of the transclusion will be: "concatenation", without the need of a template. The "joiner" character is defined by default as "-" (the regular hyphen), but it is possible to change this. A template may still be needed to deal with particular cases when the hyphen needs to be preserved.

Please share this information with your community.

MediaWiki message delivery (చర్చ) 10:28, 30 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

20 వ విశేష గ్రంథంగా కన్యాశుల్కం ప్రదర్శన

[మార్చు]

నేడు వికీసోర్స్ మొదటి పేజీలో 20 వ విశేష గ్రంథంగా కన్యాశుల్కము ప్రదర్శన చేయబడుతున్నది. ఇప్పటికి వివిధ రకాల, వివిధ దశకాలలో ముద్రితమైన మొత్తం 5115 పేజీలుగల 19 గ్రంథాలు ప్రదర్శితమయ్యాయి. ఈ ప్రక్రియ ప్రారంభమయి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కృషి చేసిన మరియు సహాయపడిన సహ సభ్యులందరికి పేరు పేరునా ధన్యవాదాలు. ముందు ముందు మరింతగా అభివృద్ధి కావాలని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 04:18, 15 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

విశేషగ్రంథాలను ప్రదర్శించడానికి, అందులోని సమాచారాన్ని మొదటిపేజీలో అందరికీ తెలియజేయడం చాలా ప్రాముఖ్యమున్న విషయం. సంబంధించిన సాంకేతిక పనిలో మీరు చేసిన సహాయం గమనించదగినది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:36, 15 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దడం-ఆమోదించడాల్లో తీవ్రమైన నాణ్యతా సమస్యలు

[మార్చు]

తెలుగు వికీసోర్సులో అచ్చుదిద్దడం, ఆమోదించడాల్లో చాలా తీవ్ర సమస్యలు ఉన్నాయి. ఉదాహరణలు పరిశీలించండి:

ఎన్నోమార్లు ఎన్ని విధాల చెప్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

  1. దయచేసి నిర్వాహకులు గట్టి చర్యలు తీసుకుని నాణ్యతను కాపాడి, తోటి వికీపీడియన్ల కృషికి ఉన్న కనీస గౌరవాన్ని నిలపాలని కోరుతున్నాను.
  2. ఇప్పటి వరకూ జరిగిన ఆమోదాల్లో ఇలాంటి పొరబాట్లు వేలాదిగా ఉన్నాయని అనుకుంటే అవన్నీ మనం ఎలా పున: పరిశీలించాలో చెప్పగలరు. ఈ పరంగా నేనైతే ఒక్కో పాత పుస్తకాన్నీ తీసుకుని విడిగా ఓ పట్టిక పెట్టి, ఒక్కో పుస్తకాన్నీ పరిశీలించి అక్కడ మార్క్ చేయాలి.

దయచేసి దీనిపై సత్వర చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:22, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మరో ఉదాహరణ పరిశీలించండి. ఏకంగా మొదటి పేజీలో ప్రదర్శించిన కన్యాశుల్కం పుస్తకంలోని ఈ పేజీని ఐపీ చిరునామా పాఠ్యీకరిస్తే, దభీదభీమని ఇద్దరు వాడుకరులు ఏమీ సరిదిద్దకుండా ఒకరు అచ్చుదిద్ది, మరొకరు ఆమోదించేశారు. తీరాచూస్తే ఆపైన మరో ముగ్గురు వాడుకరులు పనిచేయాల్సిన పరిస్థితి. ఇలా ఎన్ని పుస్తకాలకో ఆమోదించినవాటి మీదే పనిచేస్తూ పోయేకాడికి అసలు, అచ్చుదిద్దడాలు, ఆమోదించడాలు దేనికి? ఇప్పుడు ఏళ్ళ పాటు పనిచేయాలి వీటి మీద. శరవేగంగా ప్రాజెక్టు నాణ్యత ఏళ్ళ వెనక్కి వెళ్తుంటే చూస్తూ ఊరుకోలని ఆవేదన గమనించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 08:32, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ "అచ్చుదిద్దుబాట్లు" మన పని నాణ్యతను దిగజారుస్తున్నాయి. గతంలో నేను ఈ విషయాన్ని సముదాయం దృష్టికి తీసుకొచ్చాను. కొన్ని ఇవి: 1, 2, 3. నిర్వాహకుల్లో ఒకరైన రాజశేఖర్ గారు సానుకూలంగా స్పందించారు. 'గతంలో సదరు వాడుకరులకు చెప్పాం. కానీ, వారిలో మార్పేమీ రాలేదు, తరువాత చర్యలను సూచించండం'టూ ఆయన నన్ను అడిగారు. పదేపదే సలహాలు ఇచ్చాక కూడా ఫలితం లేకపోతే ఏం చర్య తీసుకోవాలో ఒక నిర్వాహకునికి ఏం చెబుతాను లెమ్మని నేను మాట్టాడలేదు. నాణ్యతను మెరుగు పరచే విషయమై చర్యలు మాత్రం ఎవరూ ఏమీ తీసుకోలేదు -అందుకు దృష్టాంతమే మీరు ఉదహరించినవి. ఎంతో శ్రమను, సమయాన్నీ వెచ్చించి టైపిస్తున్నవారి ఔట్‌పుట్‌ను ఈ అరక్షణపు అచ్చుదిద్దుబాట్లు అవహేళన చేస్తున్నాయి. వారి శ్రమకు విలువ లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడిక ఈ అచ్చుదిద్దిపారేసిన వాటిలో అచ్చుతప్పులను సరిదిద్దాలి, పారబోసిన దాన్ని ఎత్తుకోవాలి. ఈ ప్రహసనాన్ని తక్షణమే ఆపేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు మళ్ళీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. __Chaduvari (చర్చ) 14:58, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Change coming to how certain templates will appear on the mobile web

[మార్చు]

CKoerner (WMF) (talk) 19:35, 13 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ocr ni upayoginchadam elago telupagalaru

[మార్చు]

indulo unna pusthakalu scanned nundi text roopaloki ela vastunnayo naku arthad kavatam ledu. daya chesi everina naku teliayacheyandi.-- 2018-11-16T21:02:49‎ User:Prasadgosala

User:Prasadgosala గారికి, Wikisource handbook for Indian Communitiesపుస్తకం చూడండి.--అర్జున (చర్చ) 14:37, 19 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Community Wishlist Survey vote

[మార్చు]

18:13, 22 నవంబరు 2018 (UTC)

భారతీయ భాషల లిప్యంతరీకరణ

[మార్చు]

శ్రీ అర్జున గారూ వాడుకరి:Rajasekhar1961 గారూ, విష్ణు గారూ ఇతర ఆత్మీయ మిత్రులారా నమస్తే,

మన తెవికే ఇంతర భారతీయభాషలలో వికీపీడియాకు మార్గదర్శకం చేస్తున్నదని విని, ఎంతో గర్వించాను... చిన్న సూచన ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావించి మీతో పంచుకుంటున్నాను దయచేసి ఒపికగా చదవండి.

మనం ఒక భారతీయ భాషల లిపులకు “లిప్యంతీకరణ” (ఇది నేను వాడే పేరు ఆంగ్లంలో transiliteration అంటారు) మనం తయారుచేద్దాం. దీనిని వాడి ఏ భారతీయ భాషలో ఉన్న వికీసోర్సు లో ఉన్న విషయాన్ని వాడుకరులు వారి లిపిలోకి మార్చుకుని చదువుకుంటారు. మన విషయాలలో సంస్కృతం, తమిళం వ్యాసాలు తెలుగు లిపిలో వ్రాసుకుని వాడుకుంటున్నాము. అలా అన్ని భాషలలో ఉంటాయి కనుక తప్పకుండా లిప్యంతీకరణ ఉపయోగపడుతుంది. తరువాత, అనేకులకు మాతృభాష మాటలాడటం వచ్చి లిపి చదవడం రాకపోయినా దేవనాగరి లిపి వస్తోంది. నా అవగాహన మేరకు ఇట్టివారు 10% ఉంటారు. వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వికీపీడియాలోనే ఎక్కువగా ఉపయోగపడుతుంది అని నా భావన....

ఈ ఉపకరణం చేయడానికి పనికొచ్చే సమాచారం, ప్రముఖ్ మున్నగు కన్వర్టరులు ఉన్నాయి. వారు కోడింగు మొత్తం అంతర్జాలంలో పంచుకుంటున్నారు. ఈ ప్రచురణకర్తలు ఇండిక్ కీబోర్డు, కన్లర్టరు ఉపకరణం మున్నగు రూపాలలో చేసారు. కాని వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటిని సరిచేస్తే ఎందరో వాడుకుంటారు. ఉదా. తెలుగులో ఏ, ఏ, ఐ ఉన్నాయి దేవనాగరిలో ఏ, ఐ రెండే ఉన్నాయి. ఇది లిప్యంతీకరణలో తప్పు చూపిస్తోంది. అలాగే కొందరికి కచడతపలు ఉంటవు గజడదబలే ఉంటాయి.. వీటిని అధిగమిస్తే చాలు అంతే..

నా ఆలోచన ఇలా పంచుకోడానికి అవకాశం ఇచ్చిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు, గణనాధ్యాయి 05:50, 25 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గణనాధ్యాయి గారి సూచనకు ధన్యవాదాలు. ఇప్పటికే ఇటువంటివి అంతర్జాలంలో అందుబాటులోవుండేయి. కొన్ని సర్వర్ లు పనిచేయడం లేదు. ఇప్పటికి https://sanskritdocuments.org/ లో సంస్కృత మూల రచనలు కావలసిన భాషలో చదువుకొనే వీలుంది. మిగతా భాషలవారికి ఉపయోగపడే తెలుగు రచనలు అన్నమాచార్య కీర్తనలలాంటివి మాత్రమే అనుకుంటాను. వికీపీడియా వాడుకరులకి అంత ఉపయోగం లేదని నా భావన. అందుకని నేను ఈ విషయమై సహాయ పడలేను.క్షమించాలి.--అర్జున (చర్చ) 01:30, 27 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

Johanna Strodt (WMDE) (talk) 11:03, 26 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

User:Arjunaraoc కు interface-admin హక్కు

[మార్చు]

మిత్రులారా,

ఈ మధ్యన interface-admin గ్రూపు సభ్యులే మీడియావికీ పేరుబరిలో జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ మార్పులు చేయగల పరిమితి అమలులోకివచ్చింది. మీడియావికీలో మార్పులు వలన క్రాప్ ఇమేజ్ స్క్రిప్ట్ ద్వారా బొమ్మలు చేర్చే అదేశం పనిచేయడంలేదు. వాటిని సరిచేయడానికి స్టివార్డ్ ల ద్వారా ప్రయత్నించాను కాని సఫలం కాలేదు. అందువలన మరియ వికీసోర్స్ లో అధికారులు లేనందున ఒక సంవత్సరం పాటు interface-admin హక్కు అనుమతి కోరుతున్నాను. ఒక వారంలోగా (అనగా 4 డిసెంబరు 2018) మీ స్పందన సంతకంతో క్రింద తగిన విభాగంలో తెలియచేయండి. --అర్జున (చర్చ) 01:37, 27 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమ్మతి

[మార్చు]
  1. --Rajasekhar1961 (చర్చ) 05:11, 27 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. T.sujatha (చర్చ) 05:24, 27 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --శ్రీరామమూర్తి (చర్చ) 05:47, 27 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Ramesam54 14:52, 4 డిసెంబరు 2018 (UTC)
  5. <పైన #తో సంతకం చేర్చండి >

అసమ్మతి

[మార్చు]
  1. <పైన #తో సంతకం చేర్చండి >

ధన్యవాదాలు

[మార్చు]

Rajasekhar1961, T.sujatha ,శ్రీరామమూర్తి,వాడుకరి:Ramesam54 గార్ల స్పందనకు సమ్మతికి ధన్యవాదాలు. స్టివార్డులను హక్కు ఇవ్వమని కోరతాను. (Summary: Granting of interface-admin right to user:Arjunaraoc for one year has received the concurrence of community as per the disussion above.)--అర్జున (చర్చ) 04:42, 5 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Done. --MarcoAurelio (చర్చ) 10:20, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ మార్పూ చేయకుండా అచ్చుదిద్దడం, ఆమోదించడం మానాలి

[మార్చు]

గతంలో అచ్చుదిద్దడాలు, ఆమోదించడాల్లో ఏ రకమైన నాణ్యతాపరిశీలన చేయకుండా ముందుకుపోవడాన్ని అడ్డుకోవడం గురించి చర్చించాం. అయితే దీనికొక ఖచ్చితమైన నియమం రూపొందించుకుని తీరాలి. లేకుంటే నాణ్యతకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది కొన్ని వందల పేజీల్లో జరుగుతూనే ఉంది. నిజానికి మనం అచ్చుదిద్దిన పేజీలన్నిటినీ పరిశీలించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి వ్యక్తి నిష్టంగానో, లేక మొత్తం సముదాయ నిష్టంగానో ఒక నియమాన్ని ఏర్పరుచుకుని తీరాలి. నేను ప్రతిపాదించదలిచేది ఏమంటే - "పేజీలో ఏ మార్పూ చేయకుండా చేసిన అచ్చుదిద్దడాలు, ఆమోదించడాలు సాధ్యం కాకుండా చేయాలి. పేజీని శ్రద్ధగా చదివి అచ్చుదిద్దడం చేస్తున్నట్టయితే, దాని చర్చ పేజీలో ఓ విభాగం పెట్టి ఈ పేజీలో ఏ మార్పూ చేయకుండా అచ్చుదిద్దగల నాణ్యతతో ఉంది అని ఓ నోట్ పెట్టి ఊరుకోవాలి. ఆ నోట్ అనుగుణంగా వేరేవారు అచ్చుదిద్దాలి." - ఇది కాస్త మన ప్రాసెస్ ని ఆలస్యం చేస్తుందని తెలుసు. కొందరు వాడుకరులకు విసుగు కలిగిస్తుందని తెలుసు. కానైతే జరుగుతున్న నాణ్యతా దోషాలకు ఇంతకుమించి మేలైన ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. దయచేసి వందలాది పేజీలు రాస్తూ ఈ సమస్య ముఖాముఖి ఎదుర్కొంటున్న వాడుకరి:శ్రీరామమూర్తి గారు కూడా ఈ ఆలోచన ఎలా ఉందో చెప్పగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 17:44, 29 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దడం మానివేస్తున్నాను --Nrgullapalli (చర్చ) 02:51, 30 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల తెలుగు యూనికోడ్లో మార్చడం మొదటి దశ పూర్తి

[మార్చు]
ఆర్కీవ్ తెలుగు అత్యధిక వీక్షణల తెరపట్టు
పరిచయ దృశ్యశ్రవణమాధ్యమము

ఇంతకుముందు రచ్చబండ లో చర్చించిన పనిలో తొలిదశగా శీర్షిక, రచయిత వివరాలు మార్చడం పూర్తయిందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. అలాగే పుస్తకం భాష ఇతర భాషలవి తెలుగుగా తప్పుగా గుర్తించినవి, ఆయా భాషలకి మార్చడం, అలాగే ఇతర భాషలుగా గుర్తించబడిన తెలుగు పుస్తకాలని, తెలుగుకి మార్చడం, కొంతవరకు ముద్రణా తేదీలు సరిచూడడం పూర్తయింది. ఈ పనులన్నీ జరిగిన తరువాత 22828 పుస్తకాలు లెక్కకురాగా, వాటిలో 3556 పుస్తకాలకు 5244 100 శాతం నకలులున్నాయని మూల స్కాన్ పుస్తక పరిమాణం ఆధారంగా గుర్తించి కార్ల్ సహాయంతో ధృవీకరించి, ఆ నకళ్లను ఆర్కీవ్ లో తొలగించడం జరిగింది(మరిన్ని వివరాలు). వాటి లింకులు వికీపీడియా లో వికీసోర్స్ లో వున్నట్లయితే వాటిని ఆయా మూల పుస్తకాలకు మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు 17584 తెలుగు పుస్తకాలతో ఆర్కీవ్ వాడుకోవడానికి అనువుగా వుంది. మీరు ఈ లింకు ద్వారా అన్ని పుస్తకాలను చూడవచ్చు. శోధనయంత్రంలో నేరుగా తెలుగులో వెతకవచ్చు. గూగుల్ లో వెదికినా మీకు ఆర్కీవ్ లింకులు అవి వాడిన వెబ్ పేజీలనుబట్టి కనబడతాయి. ఇదొక 10నెలలపైన సాగిన పెద్ద పని. ఈ పనిలో సహకరించిన వారందరికి ధన్యవాదాలు. ప్రధానంగా పవన్ సంతోష్ గారికి, వారి తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు ఫలితాలను వాడుకున్నందులకు, చదువరి గారికి, వారు తొలిగా కొంతవరకు చేసిన మానవీయ ఊహాజనితంతో మూకుమ్మడి మార్పుల వలన నేను చేసిన సాఫ్టవేర్ పనిచేస్తున్నదని తెలియటానికి, కొన్ని దోషాలు సవరించడానికి తోడ్పడినందులకు, ఆఖరు కాని ప్రాముఖ్యం ఏమాత్రం తక్కువలేకుండా రవిచంద్ర గారికి, సాధ్యమైనంతవరకు పుస్తకం తెరచి వివరాలు గూగుల్ స్ప్రెడ్ షీట్ లో చేర్చటంలో కొన్ని నెలలుగా సహాయ పడినందులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన ఆర్కీవ్.ఆర్గ్ లో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియ పుస్తకాల నిర్వహణాధికారి కార్ల్ మలమూద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ కృషికి మూలమైన రచయితలు,సంస్థలకు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహకులకు, పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్న ఆర్కీవ్.ఆర్గ్ సంస్థకు కూడా కృతజ్ఞతలు.

ఇంకా చేయవలసినది చాలావుంది. కొన్ని పుస్తకాల వివరాలలో ఇంకా కొంత తప్పులు వుండి వుండవచ్చు. విషయం వివరాలు తెలుగులోకి మార్చి చేర్చాలి. పుస్తకరకాలు(సాధారణ పుస్తకము, పత్రిక, పత్రికల సంచయము) చేర్చాలి. మీ దృష్టికి వచ్చిన దోషాలను సలహాలను తెలియచేస్తే తదుపరి సవరణలు చేయవచ్చు. ఈ పని వికీసోదరసోదరీమణులకు మరింత ఉపయోగంగా వుంటుందని ఆశిస్తాను మరియు తమ స్పందనలు, ఏమైనా సందేహాలుంటే అవీ తెలియచేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 08:11, 30 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Selection of the Wikisource Community User Group representative to the Wikimedia Summit

[మార్చు]

Dear all,

Sorry for writing in English and cross-posting this message.

The Wikisource Community User Group could send one representative to the Wikimedia Summit 2019 (formerly "Wikimedia Conference"). The Wikimedia Summit is a yearly conference of all organizations affiliated to the Wikimedia Movement (including our Wikisource Community User Group). It is a great place to talk about Wikisource needs to the chapters and other user groups that compose the Wikimedia movement. For context, there is a short report on what happened last year. The deadline is short and to avoid the confusing vote on the Wikisource-I mailing list of last year, we created a page on meta to decide who will be the representative of the user group to the Wikimedia Summit.

The vote will be in two parts:

  1. until December 7th, people can add their name and a short explanation on who they are and why they want to go to the summit. Nomination of other people is allowed, the nominated person should accept their nomination.
  2. starting December 7th, and for a week, the community vote to designate the representative.

Please feel free to ask any question on the wikisource-I mailing list or on the talk page.

For the Wikisource Community User Group, Tpt (talk) 15:15, 5 December 2018 (UTC)

New Wikimedia password policy and requirements

[మార్చు]

CKoerner (WMF) (talk) 20:03, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

క్రాప్ ఇమేజ్ (స్కాన్ నుండి బొమ్మ చేర్చటం తిరిగి చేతనం)

[మార్చు]
క్రాప్ ఇమేజ్ 2018 తెరపట్టు

క్రాప్ ఇమేజ్ (స్కాన్ నుండి బొమ్మ చేర్చటం) తిరిగి చేతనం చేశాను. ఇటీవల విడుదలైన మీడియావికీలో కోడ్ హైలైట్ చేతనం అయివుంటే దానిలో బగ్ వలన క్రాప్ ఇమేజ్ వున్నప్పుడు ఫ్రూఫ్ రీడ్ పేజోలో ఎడమ, కుడి వైపు భాగాలలో అసమతౌల్యం వుంటుంది. అలా అయినట్లయితే, కోడ్ హైలెైట్ అచేతనం చేసి (ఉన్నత ఆదేశానికి ముందువుండే పెన్సిల్ బొమ్మపై నొక్కి, మరల పేజీని తెచ్చుకొంటే సమస్య తీరిపోతుంది. మీరు పరీక్షించి ఏదైనా సమస్యలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 16:17, 8 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Wikisource Community User Group representative vote

[మార్చు]

Dear all,

Sorry for writing in English and cross-posting this message.

Following the previous message, the vote for the representative of the Wikisource Community User Group to the Wikimedia Summit 2019 is now open.

There is two great candidates on page on meta to decide who will be the representative of the user group to the Wikimedia Summit. You can support a candidate now. All active Wikisource users can vote. The vote is ending on December 14, 2018.

Feel free to ask any question on the wikisource-I mailing list or on the talk page.

కృతజ్ఞతలు!

For the Wikisource Community User Group, Tpt (talk) December 8, 2018 at 18:53 (UTC)

కంప్యూటర్ ద్వారా పాఠ్యీకరణ సౌలభ్యం (Gadget-IndicOCR)

[మార్చు]

User:Jayprakash12345 కృషి వలన సులభంగా కంప్యూటర్ ద్వారా పాఠ్యీకరణ ప్రక్రియ (OCR) తెలుగులో అందుబాటులోకి వచ్చింది. దీనిఉపయోగించి పాఠ్యం నేరుగా టైపు చేయకుండా, కంప్యూటర్ అందచేసే పాఠ్యాన్ని చేర్చవచ్చు. నేను పరిశీలించినపుడు, చాలావరకు ఉపయోగపడుతుందని అనిపించింది. దీని తెరపట్టులు చూడండి.

‎ కంప్యూటర్ ద్వారా పాఠ్యీకరణ ఉపకరణ (IndicOCR) మీట తెరపట్టు
‎ కంప్యూటర్ ద్వారా పాఠ్యీకరణ ఉదాహరణ తెరపట్టు
అభిరుచులలో కంప్యూటర్ ద్వారా పాఠ్యీకరణ సౌలభ్యాన్ని చేతనం చేయడం (రెండవ విభాగంలో Gadget-IndicOCRకు ఎదురుగా పెట్టెను టిక్ చేసి అమరికలు భద్రపరచాలి)

ఇలా వాడటానికి వికీసోర్స్ లో ప్రవేశించిన సభ్యులు మీ అభిరుచులలో ఇండిక్ఓసిఆర్ (IndicOCR) గేడ్జెట్ ని చేతనం చేసుకొని భద్రపరచాలి. ఉదాహరణ తెరపట్టు చూడండి. మీరు ప్రయత్నించి మీ అనుభవాలు తెలపండి.--అర్జున (చర్చ) 05:58, 16 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇండిక్ వికిసోర్సు కన్సల్టేటివ్ కమీటీ మీటింగ్ 2018 ,కలకత్తాకు వెళ్ళినప్పుడు నా లాప్టాప్ లో భద్రపరచాను. చాల చక్కగా పనిచేస్తున్నది. దీన్ని ప్రతి ఒక్కరు తమ కంపూటర్ లో భద్రపరచే విధముగా కాకుండా వికిసోర్స్ లోనే ఈ బటన్ ఏర్పాటు చేయవచ్చునేమో అర్జునరావుగారు పరిశీలించాలి . అర్జున ధన్యవాదాలు .--Ramesam54 06:11, 17 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ధన్యవాదాలు. ఇది చక్కగా పనిచేస్తున్నది. స్కాన్ పేజీ స్పష్టంగా లేకపోతే ఇది సరిగా పనిచేయదు. మరోసారి ధన్యవాదాలు. నేను ఉపయోగిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 06:20, 17 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
User:Ramesam54, Rajasekhar1961 గార్ల స్పందనలకు ధన్యవాదాలు. వ్యక్తిగత Common.js లో మార్పులు చేయనవసరంలేకుండా (ఇప్పటిదాకా User:Ramesam54 గారు వాడినట్లు) వాడుకరులు తమ అభిరుచులలో సంబంధిత గేడ్జెట్ ని చేతనం చేసుకుంటే సరిపోతుంది. అదే పైన మూడవ తెరపట్టులో చూపించబడినది. --అర్జున (చర్చ) 07:15, 17 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ప్రస్తుతానికి నేను, రామేశం, రాజశేఖర్ గార్లు ప్రస్తుతానికి మా స్వంత commons.jsలో మార్పుచేర్పులు చేసుకుని వాడుతూనే ఉన్నాం. అయితే దీన్ని కొంత పరిశీలించి మొత్తం సైట్ వ్యాప్తంగా Commons.jsలో మార్పులను (అవసరమైతే కొంత పరిశీలించి) చేయడం మేలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే - ప్రస్తుతానికి ఓసీఆర్ ప్రయోజనకరంగానే పనిచేస్తోంది, ఇది మరింత మెరుగు కావాలంటే మనం చేయగలిగిన పని మరింతగా వాడడమే. బెంగాలీ వంటి భాషల వికీసోర్సు ప్రాజెక్టుల్లో వేలాది పేజీలను ఓసీఆర్ చేయడం ద్వారా దీన్ని మాసివ్ స్థాయిలో మెరుగుపరుస్తున్నారు. కాబట్టి సైట్ వ్యాప్తంగా దీన్ని అమలుచేసే ప్రతిపాదన పరిశీలించమని అందరికీ మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 06:38, 19 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, జయప్రకాష్ గారి సూచన మేరకు ఇప్పటికే అనామకులు కాని వాడుకరులందరు చేతనం చేసుకొనేటట్లు గేడ్జెట్ తయారు చేసి అమర్చడమైనది. స్వంత common.jsలో మార్పులు చేసుకున్నవారు, అవి రద్దుచేసి, గేడ్జెట్ చేతనం చేసుకోవచ్చు. అన్నట్లు బెంగాలీ వికీలో ప్రోగ్రామ్ ద్వారా విపరీతంగా చేర్చిన పేజీలు మన నశీర్ అహమ్మద్ పుస్తకాల పేజీలలాగా అంత ఉపయోగపడవని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 08:42, 20 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యత పరిశీలన

[మార్చు]

సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి రచనలలో యూనికోడ్ పాఠ్యీకరణదోషాల పేజీల తుడిచివేత

[మార్చు]

సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి రచనలలో యూనికోడ్ పాఠ్యీకరణదోషాల వలన తెలుగు వికీనాణ్యత దెబ్బతిన్నది. వాటిని సవరించడానికి వాటికై కృషిచేసినవారు,తరువాత బాధ్యత వహించవలసినవారు స్పందించకపోవటంతో నేను బాట్ సహాయంతో దోషాలుగల పాఠ్యాలను తుడిచేశాను. ఇప్పుడు indicOCR సౌలభ్యంతో మరల పేజీలను చేర్చి దిద్దవచ్చు. అలాగే ఇప్పటికే అచ్చుదిద్దిన పేజీలలో ఇంకా చేయవలసిన మార్పులు (బొమ్మలు సరిచేయడం, అధ్యాయపుకూర్పులకొరకు పేజీలో మార్పులు చేయడం, అధ్యాయపుకూర్పులు చేయడం లాంటి పనులు కూడా వున్నాయి. మరిన్ని వివరాల కొరకు రచయిత_చర్చ:సయ్యద్_నశీర్_అహమ్మద్#యూనికోడ్_పాఠ్యీకరణ_లో_దోషాలు_సవరణ చూడండి. --అర్జున (చర్చ) 00:28, 24 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

బైబిల్ సంబంధించిన దోషపూరిత పేజీల తుడిచివేత ప్రతిపాదన

[మార్చు]

క్రింది పుస్తకాలలో యాంత్రిక కూర్పులో విపరీతమైన దోషాలున్నందున తుడిచివేయాలి. తుడిచివేసినతరువాత కొత్త indicOCR తో ఆసక్తివున్న వారు సరిగా పాఠ్యం చేర్చవచ్చు. అభ్యంతరాలున్నవారు 2018-12-31 లోగా సరిచేసే ప్రణాళిక తెలియచేయండి.

  1. బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు - 268 పేజీలు
  2. బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం - 299 పేజీలు
  3. బైబుల్ సామెతలు 1 - 81 పేజీలు
  4. బైబుల్ సామెతలు 2 - 92 పేజీలు
  5. బైబుల్ సామెతలు 3 - 110 పేజీలు
  6. బైబుల్ సామెతలు 4 - 90 పేజీలు

--అర్జున (చర్చ) 13:00, 24 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధిత దోషపేజీలు తుడిచివేయబడినవి. --అర్జున (చర్చ) 10:16, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]