పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యో గని ద్రో ప్రహసనము - *-

- ఈనాటకమునందువచ్చు పాత్రములు -

మతిమంతుఁడు—యోగ శాస్త్రాభ్యాసము చేయుచున్న యొక వృద్ధుఁడు

సుబలుఁడు - మతిమంతుని మేనల్లుఁడు

సదానంద యోగి _ భూత వైద్యము తెలిసిన యోగి

గజాననదాసు-వైద్యుడు

రాముఁడు—మతిమంతుని సేనకుఁడు "

సుమతీ-- మతిమంతునికూఁతురు

గౌరి- మతిమంతుని యింటిదాసి

      -----

రంగము--నుతిమంతుని యిల్లు,

      (సుమతి ప్రవేశించుచున్నది]

సుమతి-- వొంటిరిగాకూర్చుంటే యేమీ తోచకుండావున్న ది. మాట్లాడడానికి వక్క రాముడుతప్ప మరి యెవరూ కనపడరు. వాడు యెప్పుడూ యేదో సణుక్కుంటూవుంటాడు. నాన్నగారు యోగపు పిచ్చిలోపడి రాత్రీ పగలూ ముక్కుమూసుకునీ కూర్చుంటూ పాత తాటాకుల పుస్తకాలు ముందు వేసికొని ఆకులు తిరగ వేస్తూ రెంఏడో ధ్యానం లేకుండా వున్నారు. ఆపిచ్చ పుస్తకాలచేత ఆయనకు మతిపోతూ వున్నట్టున్నది. అనుకో యేదో చప్పుడవుతూ వున్నది. చూచి