వాడుకరి:Pranayraj1985

వికీసోర్స్ నుండి
నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. మాది నల్గొండ జిల్లా మోత్కూర్. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరిలో జరిగింది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయము వారి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
నా వ్యక్తిగత చిత్రపటము
నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
08.03.2013 మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.