పుట:Chali Jvaramu.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


83

ఏడవ ప్రకరణము

చెప్పగలవాడని వైధునకు తొచినప్పుడు రోగియొక్క వ్యాధి చెలిజ్వరమని నిశ్చయముచేసి మందును ఈయవచ్చును.

నెత్తురు పరీక్షించవలెను

దినదినము జ్వరమువచ్చు రోగులవిషయములో జ్వరపుగడ్డ పెరిగియుండని యెడల రోగనిదానము కష్టము. ఏఅవయము నందును జ్వరమునకు కారణము కానరాని యెడల, మశూచికము ఆటలమ్మ మొదలగు వ్యాధులలో నేదైనను సోకి యుండునని అనుమానముగా నున్నయెడల, రెండదినములు నిదానించి చూచిన నవి బయలుపడగలవు. ప్రారంభ స్థితి లోని క్షయజాతిజ్వరముగాని, సన్నిపాత జ్వరముగాని, ప్రస్తుతము మనకు కారణము తెలియని ఇతర్ జ్వరములలో నేదైన గాని, రోగిని బాధించు చున్నప్పుడు వానినుండి చలిజ్వరమును గుర్తించుట కష్టము. అట్టియెడల రోగియొక్క నెత్తురుచుక్క నొకదానిని తీసి వైధ్యుడు తను పరీక్షింప గలిగినయెడల సూక్షదర్శినితో పరీక్షింపవలెను. లేదా చెన్నపట్టణమువద్ద అందుకొరకు ప్రత్యేకముగా సర్కారువారిద్చేనేర్పరుపబడియున్న కింగుఇన్ ట్యూటు (King Institute) అనుఆఫీసునకు ఒక చుక్క నెత్తురును అందు కొరకై యేర్పడియున్న గాజు పలపైపరచి పంపవలెను. అక్కడ రు.5-0-0 లు ఫీజు తీసికొని వారానెత్తురును పరీ