పుట:Chali Jvaramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

25


పించునది. అన్యేద్యుష్కజ్వరమని చెప్పందగును. జ్వర వేగము కల్గిన దినము మొదలు మూడవనాడు మరల వ్యాపించునది తృతీయక జ్వరమనందగు. జ్వర వేగము కల్గిన దినమునకు నాల్గవనాడు వ్యాపించునది.

తృతీయక జ్వరము

చతుర్ధక జ్వరమనదగు . ఇచట పగలు రెండుకాల ములయందును రాత్రి రెండుకాలములయందును వ్యాపించు జ్వరము సతతక జ్వరమనియు,

చతుర్దక జ్వరము

పగలు ఒక కాలమునందును రాత్రియొక కాలమునందును వ్యాపించునంది అన్యేధుష్క జ్వరమనియు కొందదు వచించెదరు.

మతాంతరమున విషజ్వర లక్షణము:-

శ్లో॥ కేచిద్బూతాభిషజ్గోత్ధం
      బ్రువతే విషమజ్వరమ్॥
తా॥ కొందరు భూతసంబంధమువలన జనించిన జ్వరమునకు విషజ్వరమని వచించెదరు.
శ్లో॥కఫపిత్తాత్త్రిక గ్రాహీన్బష్టాద్వాతరి ఫాత్మక:
     వాతపిత్తాచ్చిరొగ్రాహిత్రి విధ స్స్యాత్తృతీయక:॥

తృతీయక జ్వరభేదములు

తా॥ కఫపిత్తములు అధికములై యున్నప్పుడు జనించిన తృతీయక జ్వరము తొలుత వెన్నెముకకు జ్వరభేదములు క్రిందిభాగమున వేదనను కల్గించి శరీరమున వ్యాపిం