పుట:Chali Jvaramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ లి జ్వ ర ము

54

}} మునకు తేలుచు తమతోకలో నుండు నొక చిన్న గొట్టముగుండ గాలిని పీల్చుకొని తిరిగి మునుగు చుండును.

నీటి యుపరితలముననుండు గాలిని దోమపిల్లలు పీల్చుకొనలేక పోయినచో నవియెల్లను తక్షణమే చచ్చిపొవును.

దోమగూడు

ఇట్లు 6 లేక 7 దినములయిన తరువాత నీ దోమ పిల్లలు కొక్కెమువలె ముడుచుకొని, రెండుమూడు దినములవరకు చురుకు తగ్గియుండును. ఇపు డీ పురుగుపై నొకగూటివలె నేర్పడి ఆ గుల్లలొపల నత్తవలె దోమపిల్ల రూప నిష్పత్తి జెందుచుండును. వీని తల పెద్దదగును నల్లగను ఉండును. వీని తల యందు బూరాలవలెనుండు గొట్టములు రెండు గలవు. ఇవి ఈ గొట్టములద్వారా గాలిని పీల్చుకొనును. ఈస్థితియందు అనాఫలీసు దొమలను క్యూలెక్సు దొమలనుండి గుర్తించుట కష్టము. రెండు దినము లిట్లుండవీనికి రెక్కలు పెరిగి తమపై నుండు గూటినకస్మాత్తుగా పగల్చుకొని బయటికి గాలిలో కెగిరిపోవును.

రెక్కలుగల దొమలు

ఇట్లెగిరి పొయిన తరువాత నీ దోమ రెండు మూడు దినములలో గ్రుడ్లను పెట్టును. ఒకతరము