పుట:Chali Jvaramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

చ లి జ్వ ర ము


నుంచవలెను. నెత్తురును కఫమును అప్పటప్పట, సూక్ష్మదర్శినిలో పరీక్షించు చుండవలెను.

సన్నిపాత జ్వరము క్షయజ్వరము మొదలగునవి.

జ్వరము దినదినమునకు హెచ్చుచు 6వ పటములో చూపబడినట్లు ఒక క్షణమైనను విడువక రెండు వారములవరకు నున్నయెడల నది బహుశ: సన్నిపాత జ్వరము. ఇదిరక్తమును పరీక్షించుటచే తెలియగలదు. లేదా క్షయ జ్వరమో, రణజ్వరమో, కాలజ్వరమో (Kala Azar) మరియెద్దియో వైద్యుడు బుద్దికుశలతచే కనుకొనవలెను.