పుట:Chali Jvaramu.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


85

ఏడవ ప్రకరణము

3. ఒక్కచుక్క నెత్తురును తగిన గాజుపలకపైరాచి పరీక్షము పంపవలెను.

4. జ్వరము అధికముగా నున్నయెడల క్వయినా ఇయ్యక జ్వరము తగ్గించు ఇతరమందును దేని నైనను ఇయ్యవచ్చును.

5. సాఫీగావిరేచనమును చేయుమందును, చెమట పుట్టించుమందును దేనినైన ఇచ్చుట మంచిది.


6. చలిజ్వరము అవునో కాదో నిశ్చయించు కొనక పూర్వము క్వయినా మాత్రము ఇయ్యకూడదు.

 ఇట్లు చికిత్సచేయుచు రోగిని కనిపట్టి చూచుచుండు నెడల బహుశ: ఒకటిరెండు దినములలో చలిజ్వరము సంబంధమైన లక్షణము లన్నియు వైద్యుడు కనిపట్ట వచ్చును. లేదా నెత్తురులో చలిజ్వరపు పురుగులు కనబడవచ్చును. చలితో ప్రారంభించుట, విడిచివిడిచి జ్వరమువచ్చుట, కొంత నియమితకాలమున కొకసారి జ్వరమువచ్చుట, జ్వరపుగడ్డ పెరుగుట. మొదలగు చలిజ్వర చిహ్నములుగాని, రక్తములో చలిజ్వరపు పురుగులుగాని యితరమైన నిదర్శనములు గాని, కనబడని యెడల నావ్యాధి చలి జ్వరము కాదని యూహించి యితా జ్వరములకు వైద్యము చేయుచు రోగిని క్రమమైన శోధనలో